కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం. 'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?' కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో? (బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Friday, August 29, 2008
నాడు - ఈనాడు
ఆగష్ట్ 27 - 30 ప్రత్యెకతలు
ఆగష్ట్ 27
1910 - మానవ హక్కుల కోసం పోరాడిన శాంతిదూత - మదర్ థెరెస్సా జననం. 1997 లో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత.
1534 - కోయలకొండ దగ్గర కులి కుతూబ్ షా తో యుద్ధంలో అస్వస్థుడై, జ్వరంతో మరణించిన యిస్మైల్ అదిల్ షా జననం.
1988 - ప్రముఖ రాజకీయ నాయకుడు చీకటి పరశురామ నాయుడు మరణం.
ఆగష్ట్ 29
1984 - శంకర్ దయాల్ షర్మ ఆంధ్రప్రదేష్ గవర్నర్ గా నియామకం.
1863 - ప్రముఖ వ్యావహారిక భాషవేత్త గిడుగు రామమూర్తి పంతులు గారి జననం. ఈ రొజే తెలుగు భాషా దినొత్సవం గా జరుపబడుతొంది.
1905 - ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జననం. జాతీయ క్రీడా దినోత్సవం జరుపబడుతొంది.
1958 - ప్రముఖ అమెరికన్ సంగీత కళాకారుడు మైఖేల్ జాన్సన్ పుట్టినరోజు.
1959 - అక్కినెని కుటుంబ నట వారసుడు - నాగార్జున పుట్టినరోజు.
30 ఆగష్ట్
1913 - ప్రముఖ ఆర్ధికవీత్త, నోబెల్ పురస్కార గ్రహీత రిచర్డ్ స్టోన్ పుట్టినరోజు.
కొంపెల్లశర్మ - తెలుగురధం.
మన తెలుగు మనకు నిత్య వెలుగు
అంధకారాన్ని పోగొట్టి వెలుగు నిచ్చే భాష - తెలుగు
తెలుగుదనం వంటి తీయందనం లేదు - తెలుగు కవుల వంటి ఘనులు లేరు -తెలుగు తల్లి సాదు జన కల్పవలిరా - లలితా సుగుణ జాల తెలుగు బాల. (కరుణ శ్రీ - జంధ్యాల పాపయ్య శాస్త్రి )
ఏ జాతి కైనా మాతృ భాష తల్లివేరు లాంటిది. ఏ వ్యక్తికైనా తల్లిపాల వంటిది. తన భాషనే సరిగ్గా నేర్వలేని వాళ్లు యితర భాషల్లో ప్రావీణ్యం గడించలేరు -జార్జి బెర్నార్డ్ షా.
అన్యభాషా పైన అధికార మబ్బదు, అంతుపట్టదేని సొంత భాష, మొదలు నేర్వకున్నా, తుదకెట్లు నేర్చురా - నార్ల.
తెలుగు భాషా దినోత్సవం మరియు వ్యవహారిక భాషా పవక్త గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు జగతికి - తెలుగురధం శుభాభినందనల్ని అందజేస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
Wednesday, August 27, 2008
విశ్వానికే అమ్మ - మదర్ తెరిస్సా
విశ్వానికే అమ్మ - మదర్ తెరెస్సా
( 1910 - 1997 )
మానవసేవయే ఈ అమ్మ లక్ష్యంనిస్సార్ధ్వ సేవలో జీవితాంతం నిమగ్నం, బీద, అనాధ, అనారోగ్య ప్రజానీకానికి ఒక అనిర్వచనీయమైన హౄదయ స్పందన, భారతావని మనస్సులను గెలుచుకోవడం, అంతేకాదు విశ్వంభర పర్యంతం ఆ మహావ్యక్తిని స్మరించని గళం లేదు అనే చెప్పాలి. ఆమె తొలిసారిగా 1929లో భారతదేశంలో అడుగిడారు. మనసు ద్రవించింది, హౄదయం స్పందించింది. వివిధ భారతీయ ప్రాంతాల్లో రహదారుల్లో తరచు కనిపించే ప్రజలను చూసి ధౄఢనిశ్చయం కలిగింది. జన్మభూమికి తిరుగు ప్రయాణం సంగతి మరచిపోవడం జరిగింది. భారతదేశం అదరణకు నోచుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆమె మదర్ థెరెస్సా. మానవతకు సమాంతరం. సేవకు పరమార్ధం. ఆమె స్థాపించి, అర్ధవంతంగా నిర్వహింపబడుతున్న అనేక సేవాసంస్థల్లో వేలాది కార్యకర్తలు తమ సేవలను అందించడానికి అవకాశం అందించిన అపూర్వ వనిత - మదర్ థెరెస్సా.
పదేళ్ళకే సేవారంగంలో ప్రవేశంమదర్ థెరెస్సా 27 ఆగష్టు 1910 లో యుగోస్లావియ, స్పోజ్ లో జన్మించిన ఈమె తల్లిదండ్రులు పెట్టిన పేరు - ఏగ్నెస్ గోంగ్జ బోజక్సియు. అల్బేనియా కు చెందిన ఈ కుటుంబం మతపరమైమ సేవలకు ప్రసిద్ధి. కేవలం పన్నెండేళ్ళకే, దైవపరంగా మానవజాతికి సేవలను అందించాలనే ఆలోచన, కోరిక, ఒక్కసారి అంకురించాయి. ఆచరణలో పెట్టింది. వ్యక్తిగా యిది పూర్తిగా సాధ్యం కాకపోతోంది అన్న తలంపుతో, తన పద్ధెనిమిదవ ఏట, తల్లిదండ్రుల్ని వదలి, ఐరిష్ సేవాసంస్థలో చేరి, భారతదేశానికి ప్రయాణం చేసింది. రోమన్ కాథలిక్ చర్చి నియమాల ప్రకారం 'నణ్ బాధ్యతలను స్వీకరించింది. ఫలితంగా, ఆమె క్రైస్తవ సన్యాసిని, మతవాసిని, భిక్షుకి గా, మదర్ థెరెస్సా గా అవతరించింది. 1921 లో యుగోస్లావియా నుంచి మతపర సేవాబౄందం భారతదేశం మానవసేవ నిమిత్తం పర్యటనకు రావడం జరిగింది. ఎందరో విదేశీ సేవాసంస్థల ప్రతినిధుల బౄందాలు రావడం, సేవలను అందించడం, తిరిగి స్వదేశానికి వెళ్ళడం తరచుగా జరిగే పని. అయితే, ఈ సేవాసంస్థల ప్రతినిధుల బౄందం మాత్రం, భారతదేశంలో అసంఖ్యాక బీదరికంలో మగ్గిపోతున్న ప్రజానీకానికి సేవచేసేనిమిత్తం తమ సంకల్పాన్ని తెలియజేస్తూ, వారి స్వదేశం నుంచి కావలసిన ఆర్ధికసహాయాన్ని కోరడం కూడ జరిగింది. ఆ అభ్యర్ధన పత్రం చదివి, మదర్ థెరెస్సా అనే ఆగ్నెస్, తనవంతుగా భారతదేశపు ప్రజలకు సేవలను స్థిరస్థాయిగా అందించే దిశలో, 6 జనవరి 1929 లో, కేవలం యిరవై కూడ నిండకుండ అరవై వయసులో కూడ సామాన్యంగా ఆలోచనకి రాని సేవలను ఆచరణకు పూనుకుంది. అలా భారతదేశపు గడ్డపై అడుగు పెట్టిన థెరెస్సా తిరిగి తన స్వదేశం వెళ్ళడం గురించి ఆలోచనే చేయలందంటే, అమె సంకల్పదీక్షాకంకణ బద్దత ను మనసారా అనుభవించాల్సిందే తప్ప, మాటలకు అందదు. మదర్ థెరెస్సా జీవితాంతం పేదమానవుల సేవకే అంకితం చెయ్యడం, ఆ అమూల్యమైన సేవలను ప్రపంచం అన్ని రంగాలనుంచి కొనియాడడం జరిగింది.
సేవాకేంద్రంగా కలకత్తాప్రాధమిక శిక్షణ తర్వాత, థెరెస్సా, 24 మే 1931 న మతవాసిని, సేవకురాలుగా ప్రమాణస్వీకారం చేసింది. 1931 నుంచి 1948 వరకు, కలకత్తాలోని సైంట్ మేరీ హైస్కూలో విద్యను అభ్యసించేది. ఆమె ఉపాధ్యాయురాలుగా గడపుతున్నపుడు, కాన్వెంటు పాఠశాల ప్రహారీగోడకు బయటున్న బీదప్రజానీకపు జీవితాన్ని చూసి ఆమె హౄదయం కరిగిపోయింది. ఫలితంగా, 1948 లో పిల్లలకు చదువుచెప్పే ఉద్యోగం వదిలి, సేవలకు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యేందుకు పై అధికారులనుంచి అనుమతి తెచ్చుకుంది. కలకత్తా బురద ప్రాంతాల్లోని గుడిసె నివాసుల పూర్వజన్మ సుకౄతం కాబోలు, మదర్ థెరెస్సాగా ప్రత్యక్షమయింది. చేతిలో చిల్లిగవ్వ కూడ లేని పరిస్థితిలో, దేవునిపై భారంవేసి కలకత్తాలో బహిరంగ పాఠశాలను స్థాపించింది. వెంటనే, ఆమెతో అనేక సేవాతత్పరులు, సంస్థలు చేయూతనివ్వడం, ముందుకు సేవా కార్యక్రమాలు జరిగాయి.
యింతలు, మరింతలుగా సేవాకార్యక్రమాలుఆరోజు 7 అక్టోబరు 1950. పరిణతి చెందిన మరోసంకల్పం. స్వంతంగా సేవాసంస్థను స్థాపించాలని మదర్ థెరెస్సా సంకల్పించింది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ, ఘోర అనాదరణకు గురయిన బీద ప్రజానీకానికి ప్రేమను అందిస్తూ, చేరదేయడమే లక్ష్యంగా పెట్టుకుని సేవలను అందించడం ప్రారంభించింది. ఈ సంస్థ అందించిన సేవలను గుర్తింపుగా, ఆరవ పోప్ పాల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మతసేవాకేంద్రంగా అవతరించింది. ఈ సంస్థ తమ సేవలను శోఖోపశాఖలుగా విస్తరించింది. సేవలను అందించే సోదరులు, సోదరీమణులు, మతగురువుల శాఖలను విస్తరించారు. అనేక దేశాలకే కాక, సోవియట్, యూరోపు దేశాలకు వ్యాప్తి అయింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనే కాక, ప్రకౄతి విలయతాండవం సందర్భంగా సంభవించే అవాంతరాలకు సేవలను అందించడం, పునరావాస సేవల్లో కేంద్రీకరించడం ప్రధాన సేవలుగా జరిగింది. ఉత్తర అమెరికా, యూరోపు, ఆష్ట్రేలియా దేశాల్లో మద్యపానసేవితులు, నిరాశ్రయులు, ఎయిడ్స్ రోగగ్రస్థులు యిత్యాది బాధిత ప్రజానీకానికి, వైద్యం, సహాయ సహకారాలను అందించడంలో విశేష కౄషిని సాధించింది. 29 మార్చి 1969 నాటికి ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా, వనరులతో, విరాజిల్లింది. 1990 దశకానికి, 40కి పైగా దేశాల్లో పది లక్షల సేవకబౄందాలు తయారయ్యాయి. ఈ సేవాకుటుంబాలు మొత్తం మదర్ థెరెస్సా ఆశయాలు,లక్ష్యాలు సాధించేందుకు అహర్నిశలు నిరంతర కౄషి చేస్తూ సత్ఫలితాలు సాధించడం అన్నది జగద్విదితం.
సేవలకు తార్కాణాలు, సాక్షాత్కారాలుభారతదేశంలో సేవల్లో అంతర్లీనమై, మదర్ తన సేవలకు కలకత్తాను కేంద్రంగా చేసుకుంది. సమాజంగా అనేక విధాలుగా బాధపడుతున్న అనేకమందికి సేవకై, పలు సంస్థలను స్థాపించింది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (సిస్టర్స్), నిర్మల్ హౄదయ్ నివాసాలు, శిశుభవనాలు, పేదలకు, వికలాంగులకు, మానసికంగా ఎదగలేని అభాగ్యులకు ఒక సదవకాశంగా స్థాపించబడ్డాయి. అందించిన నిస్స్వార్ధ సేవలకు అనేక గుర్తింపులు, సత్కారాలు, అనేకం, బహుముఖం. అందిన ప్రశంసనీయమైనవి - రామన్ మెగస్స్యే (1962), 23వ పోప్ జాన్ శాంతి పురస్కారం (1971), అంతర్జాతీయ శాంతి, సహౄధ్భావనకు నెహ్రూ పురస్కారం(1972), నోబెల్ శాంతి, బల్జన్ పురస్కారం (1979), భారతరత్న (1980), టెంప్లిటన్, ప్రతిభా పురస్కారాలు, మదర్ థెరెస్సా ప్రతిభాసేవలకు తార్కాణాలు.
సేవలతో ఆగని మనసు, అలసిపోయిన గుండెమానవసేవే మాధవసేవ అనే భావపరంపరతో ముందుకు సాగిపోయిన మదర్ థెరెస్సా మనసు లోలోతులకు సంతౄప్తితో పోయినా, గుండె మాత్రం అలసిపోయింది. వేలాది వెన్నెలరాత్రులు సేవల్లో గడపిన మదర్ థెరెస్సా, కోట్లమంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయింది. ఈ సంతౄప్తితోనే ఆనందంతో స్పందించిన ఆమె గుండె కూడ స్పందించడం మానివేసింది. గుండెలోకి రోగం ప్రవేశించింది. ఫలితంగా, 9 సెప్టెంబర్ 1997, ఉదయం 9.30 ని. లకు చివరిశ్వాసను వదలింది. మదర్ థెరెస్సా భౌతికంగా ఈ లోకం వీడింది. కాని, భారతదేశపు ఎల్లలు, ప్రతీప్రాంతపు ప్రజ మాత్రం వదిలే ప్రతీ ఉచ్ఛ్వాశ, నిశ్వాసల్లో, అగ్నే అన్న మదర్ థెరెస్సా, మనందరికీ అమ్మగా కొనియాడబడే ఆ మహావ్యక్తిని మాత్రం ప్రతీమనసు తలచుకుంటూనేవుంది.
ఆ సేవామతల్లికి హౄదయార్పిత ప్రణామాలు. తనదైన శైలిలో సేవలద్వారా అపారమైన తల్లిప్రేమ మాధుర్యాన్ని, ఆప్యాయతని సకల మానవాళికి అందించిన మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా తెలుగురథం శత సహస్ర నివాళ్ళను సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
ప్రజ - ప్రజాస్వామ్యం మధ్య "ప్రజారాజ్యం"
ప్రజ - ప్రజాస్వామ్యం, మధ్య "ప్రజారాజ్యం"
కాసు చేయని వెధవలంతా ప్రజ. ప్రజాస్వామ్యం కాగితాలమీద పేదవాళ్ళకీ, ఆచరణలో పెద్దవాళ్ళకు ఉపయోగపడుతుంది. విషం కలిపిన పాయసం ఈ ప్రజాస్వామ్యం. డబ్బున్న భడవా వుంచుకున్న పాయసం ఈ ప్రజాస్వామ్యం. గొర్రెదాటు ప్రజాస్వామ్యం జేబుదొంగల సోషలిజం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకి కావలసినది ప్రజాక్షేమం కాదు బాబోయ్! సభ్యుల బలం. ప్రజాస్వామ్యం ఒకరు యిస్తే పుచ్చుకునేది కాదు. బలం లేని జాతికది వరం కాదు. ప్రజాస్వామ్యం ఒక ఖద్దరు తిరుగుడు పువ్వు. ధనస్వామ్య జ్యగతి నుండి జనస్వామ్యముదయించును.
పై పరిస్థితుల్లో, మరొక రాజకీయ పార్టీ - "ప్రజారాజ్యం" ఆవిర్భావం జరిగింది. మూడు దశాబ్దాలపాటు వైవిధ్యమైన నటనా పరంగా జీవించిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో జీవిస్తూ నటిస్తారో, నటనలో జీవిస్తారో - వేచి చూడడమే మనం అందరూ వేచి వుండడం తప్ప అన్యధా శరణ్యం నాస్తి.
కొంపెల్ల శర్మ - తెలుగురధం
Saturday, August 23, 2008
శ్రీకృష్ణం వందే జగద్గురుం - అష్టమి జయంతి
మనసంస్కౄతీసంపదలకు నాయకమణులుఅనాదిసిద్ధమై, అఖిలదేశాలకు ఆదర్శవంతమై, అయుత్తమ సంస్కౄతికి ఆధారభూతములై, మానవులను మాధవులుగా మార్చగలిగే మహత్తర సక్తి సంపన్నములై మహోత్తమ, మహాగంభీర, మహాభక్తి భరితములైన కావ్యాలు మన రామాయణ, భారత, భాగవత గ్రంధరాజాలు. ప్రపంచ సభ్య దేశాలలో జన్మించిన సహౄదయులు, పక్షపాతరహితులు, లోతుగా విమర్శించి యింతటి మహోత్తమ సంస్కౄతీవైభవం జగత్తులో కానరాదని పలువిధాల ప్రశంసించారు. ఈ పరంపరకు నాయకమణులై తమ వ్యక్తిత్వంలో దైవత్వాన్ని ప్రదర్శించి ధర్మాచరణమూర్తిగా ఒకరు, ధర్మప్రచారక చక్రవర్తిగా ఒకరు, ప్రసిద్ధిపొందిన భగవదవతారములు శ్రీరామ - శ్రీకౄష్ణులు.
ఏకశాస్త్రం దేవకీ పుత్రగీతం, ఏకోదేవ: దేవకీపుత్రఏవ ఏకోమంత్ర: తస్యనానామాని యాని, కర్మాష్యేకం తస్య దేవస్య సేవా
తానిచ్చిన వాగ్దానం ప్రకారం దేవకీ పుత్రుడుగా అవతరించిన "శ్రీకౄష్ణపరమాత్మా ఒక్కడే సౄష్టికి మూలకారకుడైన దేవుడు అతని నోటి నుండి దివ్యవాణిగా వెలువడిన గీతాశాస్త్రమొక్కటే పరిశుద్ధగ్రంధం. అతని అనంత నామాలే జపించ వలసిన దివ్యమంత్రం. ఆదేవుని సేవించుటే కర్తవ్యకర్మ. చెయ్యండి! కౄష్ణ భజన చెయ్యండి. కౄష్ణం వందే జగద్గురుం అని చాటండి.
సంపూర్ణావతారమూర్తి - శ్రీకౄష్ణుడురామకౄష్ణావతరములు మహావిష్ణువు సంపూర్ణావతారములుగా భావింపబడుచున్నవి. శ్రీకౄష్ణావతారం దశావతారాల్లో ఎనిమిదవది. కౄష్ణచరితం హరివంశ భాగవత విష్ణుపురాణాల్లో విపులంగా ప్రస్తావించబడ్డాయి. ఆబాలగోపాలానికి తెలిసిన విషయమే కదా. ఈ శ్రీకౄష్ణమూర్తిని లోకోత్తరసుందరమూర్తిగఆ, మహాబలపరాక్రమశాలిగా, రాజనీతినిపుణునిగా, తత్త్వవేత్తగానూ అధికంగా వర్ణించబడ్డాడు.
'శ్రీకౄష్ణా నామధేయ ప్రాశస్త్యంశ్రీమద్భాగవతంలో శ్రీకౄష్ణుడిని - 'వాసుదేవ, కౄష్ణ, వరద, స్వతంత్ర, విజ్ణానమయ, మహాత్మ, సర్వపుణ్యపురుష, నిఖిల బీజభూతాత్మక బ్రహ్మ, నీకు వదనంబు నిష్కళంకా అంటాడు. శ్రీకౄష్ణుడిని ఎక్కువగా, వాసు(వసుదేవుడు), గోపాలుడు గా సుప్రసిద్ధం.
1. వాసుదేవుడు :- వసతీతి వసు: అని, వసురేవ వాసు: అని, దీవ్యతీతి దేవ: అని, వాసుశ్చ అసౌ దేవశ్చ వాసుదేవ - ఈ దేవుడు వాసు అనగా ప్రపంచమంతటా నిండియుండువాడు మరియు దేవ - అంటే ప్రకాశించువాడు - కావున 'వాసుదేవుడయ్యాడు. అందుకే వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం - సర్వభూత నివాసోసి శ్రీవాసుదేవ నమోస్తుతే, అని సర్వలోకాలలోను, సర్వప్రాణులలోను, నివసించు ఆత్మ భగవంతుడు.
2. గోపాలుడు :- గోపాలుడు ప్రదర్శించిన అద్భుత కౄత్యాల్లో అఘాసురుని చంపడం ఒకటి. ఆ విషయానికి బ్రహ్మదేవుడు పరమాశ్చర్యభరితుడయ్యాడుట. చూడగా ఈతడు బాలుడే! దారుణ కర్ముడైన ఆఘాసురుని చంపి గోవుల్ని, గోపకుల్ని రక్షించాడే! ఆహా! ఇది ఎంత ఆశ్చర్యం! అని ఆలోచింది ఆ బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చాడు. ఆ మాయాబాలుని గొప్పదైన బలాన్ని పరీక్షించాలనుకొని గోపకుల్ని - గోవుల్ని తీసికొనిపోయి రహస్యంగా దాచివాశాడు. ఈ బాలుడు సామాన్య బాలుడు కాడు. మాయాబాలుడు. అనగా, మాయతో బాలునివలె ఉన్నాడేకాని, మానవబాలుడు కాడు - సంభవామి ఆత్మమాయయా - అని గీత లో నామాయ ఆధారంగా చేసికొని అవతరిస్తూ ఉంటానని భగవానుడు చెప్పనే చెప్పాడుకదా. యిక మనందరి - కౄష్ణుడు - అంటే
కౄష్ణ - కర్షతీతి కౄష్ణ: భక్తులను తనవైపుకు ఆకర్షించుకొనువాడు - కావున కౄష్ణుడన్నారు. సర్వం కరోతీతి కౄష్ణ: - సర్వాన్ని చేయువాడు కనుక కౄష్ణుడయ్యాడు. దైత్యాన్ కఋర్షయతీతి కౄష్ణ: - రాక్షసుల్ని నశింపచేయువాడు కనుక కౄష్ణుడన్నారు. కర్షతి చిత్తమితి కౄష్ణ: - భక్తుల మనస్సును ఆకర్షించువాడు కనుక కౄష్ణుడయ్యాడు. కర్షతి యోగినాం మానాంసీతి కౄష్ణ: - యోగీశ్వరుల మనస్సులను ఆకర్షించువాడు కనుక కౄష్ణుడు. మనం భగవంతుడైన శ్రీకౄష్ణభగవానుడుని సర్వసాధారణంగా పిలుచుకునే కౄష్ణుడు, కన్నడు, కన్నయ్య అని ఆప్యాయంగా పిలుచుకునే పేర్ల వెనుక ఉన్న కధ, కమామీషు యింత వుంది.
'కౄష్ణా పద వివరణకౄష్ణ అనే పదంలో క-ౠ-ష-ణ అని నాలుగు అక్షరాలున్నాయి. ఒక్కొక్క అక్షరంలోని రహస్యార్ధాలు - 'అక్షరమాలికా ఉపనిషత్తూ లో వివరించిన తీరు యిలా వుంది.
క - ఓం కంకార సర్వవిషహర కళ్యాణద సప్తదశే అక్షే ప్రతితిష్ఠ - క అనే అక్షరం సర్వవిషాలను; అనగా దోషాలను హరిస్తుంది, శుభాలు కలిగిస్తుంది.ౠ - ఓం ౠకార సంక్షోభకర చంచల సప్తమే అక్షే ప్రతి తిష్ఠ - ౠ కారం అంతశ్శతృరువులను క్షోభింప చేస్తుంది. అంతశ్శత్రువులంటే - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు - చంచలమైనవి.ష - ఓం షంకార ధర్మార్ధ కామచ ధవళ సప్త చత్వా రింశే అక్షే ప్రతి తిష్ఠ - ష కారం - ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు - అనే నాలుగు పురుషార్ధాలను (ఫలితాలను) కలిగిస్తుంది. తెలుగురంగును; అనగా సత్వగుణాన్ని పెంపొందిస్తుంది.ణ - ఓం ణంకార సర్వసిద్ధిప్రద మోహకర ఏకత్రింశే అక్షే ప్రతి తిష్ఠ - ణ కారం సర్వసిద్ధులను కలిగిస్తుంది - మోహనకరమై వుంటుంది.
ఇదీ కౄష్ణనామం యొక్క ప్రభావం.
జగద్ధితాయ కౄష్ణాయ గోవిందాయ నమోనమ: అంటే లోకానికంతకు హితవును కూర్చే శ్రీకౄష్ణునకు పదేపదే నమస్కారం చెప్పవలసిన పుణ్యతిధి.
శ్రీకౄష్ణ జన్మ రహస్యంమన హైందవేతిహాస సాహిత్యం శ్రీకౄష్ణ జన్మ సార్ధక, రహస్య, ప్రభావాల్ని ఎన్నోవిధాలుగా వివరించారు. దశావతారాల్లో ప్రముఖావతారంగా శ్రీకౄష్ణావతారాన్ని విశ్లేషీకరించారు. కొన్ని ప్రముఖోదంతాలు యివి:
కౄష్ణచరితం కలి కల్మషఘ్నం - కౄష్ణుని చరిత్ర విన్నవారికి కలిలోని సమస్త పాపాలు పోతాయని, దేహం మానుష మాశ్రిత్య - పరమాత్మ మనుష్య దేహం ధరించాడని భాగవతంలో వివరించబడింది. వసుదేవ గౄహే సాక్షాత్ భగవాన్ పురుష: పర: జనిష్యతే - భగవంతుడైన పరమపురుషుడు వసుదేవుని యింట పుడతాడు అని, తన్ను చంపుటకై దేవకీ గర్భంలో విష్ణువే జన్మించాడని కంసుడు విన్నాడుట. సమస్త జగత్తులకు ఆశ్రయభూతుడైన ఆ భగవంతునకు దేవకి ఆశ్రయమయ్యింది. కౄష్ణుడు అవతరించుటము ముందు - బ్రహ్మ, నారదాది ౠషులు, ఇంద్రాది దేవతలు, సదాశివుని వెంట బెట్టుకొని దేవకీదేవి ఉన్న కారాగారంలో ప్రవేశించి శ్రీహరిని - నీవి సత్య సంకల్పుడవు; సత్యమే నీ ప్రాప్తికి ప్రధానసాధనం; నీవు త్రికాలలోను సత్యంగా ఉండువాడవు; సత్యానికే నీవు సత్యం; ౠత-సత్యాలు నీకు నేత్రాలు; ఓ సత్యస్వరూపా! మేము నిన్ను శరణు వేడుకొంటున్నాము అని ప్రార్ధించారట.
శ్రీకౄష్ణుని జన్మసమయంలో విశేషాలుయింక జన్మించునప్పుడు - ఆకాశంలో దేవదుందుభులు మ్రోగాయి; కిన్నరులు, గంధర్వులు, గానం చేశారు. సిద్ధులు - చారణులు స్తోత్రం చేశారు. అప్సరసలు - విద్యాధరులు నౄత్యం చేశారు. ౠషులు - దేవతలు పుష్పవౄష్టి కురిపించారు. అట్టి స్థితిలో - తూర్పు దిక్కున పూర్ణచంద్రుడుదయించినట్లు - జనన రహితుడైన భగవంతుడు అనుటచేత చంద్రునకు ఆకాశమునకు సంబంధములేనట్లు కౄష్ణునకు దేవకికి సంబంధము లేకయే , దేవతా స్వరూపిణియైన దేవకీగర్భం నుండి సర్వాంతర్యామియైన శ్రీహరి ఉదయించాడుట. అంటే యోని నుండి నిర్గతుడు కాలేదు - 'అవిరాసీట్ అనగా ఎదురుగా ఆవిర్భవించాడన్నమాట. అంతవరకు దేవకీగర్భంలో వున్నది తేజోరూపమైన శిశువే! - అచ్చంగా శ్రీరాముడావిర్భవించినట్లే యోని సంభూతుడైన శిశువు కానేకాదుట. దానికి కారణాలు యిలా చెప్పారు.
తమద్భుతం బాలక మంబు జేక్షణం, చతుర్భుజం శంఖగదాది ఉదాయుధం, శ్రీవత్సలక్ష్మం పరిశోభికౌస్తుభం, పీతాంబరం సాంద్రపయోద సౌభగం - అని, కమలాలవంటి నేత్రాలు, శంఖ చక్ర గదా పద్మాలతో ప్రకాశించు నాలుగు భుజాలు - శ్రీవత్సమనెడి పుట్టుమచ్చలు గల విశాలవక్షం - కౌస్తుభ మాణిక్యం గల కంఠం - తొలకరి మేఘకాంతితో సమానమైన దేహకాంతి - పీతాంబరం ధరించిన శ్యామసుందరమూర్తియైన అధ్బుతమైన బాలుని చూచాడు వసుదేవుడు. చక్కని ముంగురులు - అమూల్య రత్న కిరీటం - రత్న ఖచిత మీఖల - మకర కుండలాలు - అంగద నూపుర కేయూరాది భూషణ భూషితుడైన శ్రీహరి ఆ సమయంలో పురుష రూపంలో అవతరించడం వాసుదేవునికి కన్నులపండుగ అయింది. ఆ ఆనందంలో - వాసుదేవుడు, శ్రీహరీ! పరమపురుషా! నీవు ప్రకౄతి కంటే పరుడవు - అనె నేను గ్రహించాను. నీవు విశుద్ధజ్ణానానంద స్వరూపుడవు,సమస్త బుద్ధులకు సాక్షివి అని స్తోత్రం చేశాడుట. అంతేకాక, స్వరోచిషా భారత సూతికాగౄహం అని తనతేజంతో పురిటిల్లంతా జాజ్వల్యమానంగా వెలిగించేస్తున్నాడు ఆ మూర్తి అనుకుంటూ దేవకి చూసి, ఓ విశ్వాత్ముడా! చతుర్భుజాలయందు శంఖచక్రగదాపద్మాలను ధరించి శోభించు నీ అలౌకిక రూపాన్ని తగ్గించు; మరుగు పరచు; అనగా సామాన్య బాలునివలె దర్శనమియ్యి - అని దేవకీదేవి స్తోత్రం చేసి పలికిన మాటలకు పరమాత్మ ప్రసన్నుడై - పూర్వజన్మ విషయాలెన్నో అద్భుతంగా చెప్పినాడుట. ఆ తర్వాత, భగవానాత్మ మాయయా - ఆ భగవంతుడు తన మాయా (మహిమా) ప్రభావంతో - సద్యో బ భూవ ప్రాతౄతశ్శిశు: అని తక్షణమే సామాన్య బాలుడై పోయాడట.
శ్రీకౄష్ణజయంతి - శ్రీకౄష్ణాష్టమిశ్రీకౄష్ణుడు శ్రావణ బహుళ అష్టమినాడు జన్మదినోత్సవం జరుపుకోవడం సంప్రదాయం. అష్టమినాడు, రోహిణి నక్షత్రమున రాత్రి ఉద్భవించాడు. కల్యబ్దములు యిరువది ఎనిమిదవ సంవత్సరాన భాద్రపద బహుళ అష్టమిన కౄష్ణుడు జన్మించాడని కూడ కధనాలు వున్నాయి. భాద్రపదమాసమనగా, ఇప్పటి శ్రావణ బహుళ పక్షాన వచ్చే అష్టమి, రోహిణీనక్షత్రపు రోజున జయంతి యని వాడుక వచ్చినట్లు చెపుతారు. జయంతి - ప్రతి మహాపురుషుని జన్మదినానికి వ్యవహారంగా వచ్చింది. జయంతి రాత్రివాచకంకాగా, కొందరు తిధికి,మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యమిచ్చుటవలన, కొంత ముందు వెనుకలున్నాయని, ప్రముఖ సాహితీవేత్త తిరుమల రామచంద్రగారి అభిప్రాయం. రోహిణీయుత అష్టమి శ్రావణ భాద్రపద మాసాల్లో వస్తుందని, భాద్రపదమాసంలో తప్పక వస్తుందని కూడ అభిప్రాయాలున్నాయి. మొట్టమొదటగా కౄష్ణాష్టమి కేవలం జ్యోతిశ్శాస్త్రజ్ణులు నిర్ణయించగా, సకలాభీష్టమైన జయంతి రాత్రిగానే పరిగణించడం జరిగింది, తర్వాత క్రమేపీ, కౄష్ణజన్మకధనానికి ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పడం జరిగింది.
కౄష్ణ జయంతి-అష్టమి పండుగ విశేషాలుపవిత్రోత్సవంగా, పండుగగా, సంబరాలను జరుపుకోవడం మాత్రం సదాచారంగా వస్తుంది. సాయంకాలాన కౄష్ణుణ్ణి ఊరేగించడం, ఊయలకట్టి ఆడించుట, దేవకి మంచముపై వొరిగి కౄష్ణునికి పాలిచ్చుచున్నట్లు విగ్రహాల్ని అలంకరించి పూజించడం, శ్రీకౄష్ణబాల్యాల వ్రేపల్లెలో పెరగడం, దుందుడుకు చేష్టలను ప్రతిబింబిస్తూ, వీధుల్లో ఉట్లు పెట్టడం, మరునాడు వాటిని కొట్టడంలాంటి వినోదాలు అనేకాలు. ఈ రోజున ఉపవాసం చేసిన సకలపాపాలు తొలగుతాయని, ధర్మార్ధకామమోక్ష ప్రాప్తి, మహాజయం కలుగుతాయని, స్కాందపురాణంలో చెప్పినట్లు తెలుస్తూంది. ఈ రోజున పూజలను సలుపనివారు మహాపాపాన్ని పొందడం, యమపాశాల్లో చిక్కుకుంటారని, మరుజన్మలో పాములై పుడతారని, కౄరరాక్షసులుగాకూడ అవతరిస్తారని ఘోషిస్తోందని పండితులు అభిప్రాయపడ్డారు. ఈ అష్టమినాడు, చంద్రునికి అర్ఘమివ్వాలని, బంగారం లేక వెండితో పన్నెండంగుళాల చంద్రబింబాన్ని తయారుచేసుకుని, వెండి, బంగారు పాత్రలలో వుంచి, పూజించి, అర్ఘ్యమివ్వాలని, తత్ఫలితంగా సర్వకామాల్ని పొందడం జరుగుతుందని కూడ పురాణప్రసక్తులున్నాయి. ముందుగా అర్ఘమివ్వాలని, ఆ తర్వాతే కౄష్ణునికి పూజచేయాలన్నది కూడ ఒక సంప్రదాయం. ఈ చంద్రునికిచ్చే అర్ఘ్య సంప్రదాయాన్ని బట్టి, మొదటగా జయంతిగానే పరిగణించారని అనిపిస్తోందని పెద్దల అభిప్రాయం.
శ్రీకౄష్ణ జీవనప్రస్థానంశ్రీకౄష్ణుడు యుద్ధ తంత్రజ్ణతకు, రాజనీతిజ్ణతకు, స్పష్టవాక్కుకు ఉదాహరణ. కౄష్ణుడు పూర్ణాయుస్సుతో, అంటే 116 - 125 ఏండ్లు జీవించాడని హరివంశ, విష్ణుపురాణ, భాగవతాదులు తెలిపాయని కూడ చెపుతారు. మౄత్యువు ఎదిరించి పెక్కేండ్లు జీవించుటకు పురుషయజ్ణం చేయాలని, అట్లు చేసినవ్యక్తి మరొక జిజ్ణాసకు పోడని, మౄత్యువును అదలించగలడని, పురుషయజ్ణంగా - నే ననునది అనశ్వరము, అమరము అని గ్రహించుటయే అని వివరించడం జరిగింది. ఈ యజ్ణానికి తపస్సు, దానం, ఆర్జవం, అహింస, సత్యం, దక్షిణలుగాను, ఈ గుణాలన్నీ యున్నవాడే దీర్ఘజీవి అవుతాడని కూడ ఒక అభిప్రాయంగా చెపుతారు. అంగీరస వంశస్థుడు ౠషి ఘోరుడు కౄష్ణునికి ఉపదేశించినట్లుగా చెప్పబడుతోంది. కౄష్ణచరిత్ర పరమపవిత్రమని, వేదాల్లో కౄష్ణ, అర్జున, రాధ, లాంటి మాటలకు అర్ధాలను వేరుగా చెప్పడం జరిగిందని, కేవలం శబ్దసామ్యంతో వాటిని పౌరాణికులు తర్వాత అన్యవిషయాలతో జోడించి కధారూపాన రచించడం జరిగిందని, తత్ఫలితంగా వాదోపవాదాలు, చిక్కులు, యిబ్బందులు కలిగించారని చాలామంది పండితులు వివరిచడం కూడ జరిగింది.
శ్రీకౄష్ణచరితంలో ముఖ్యాంశాలుశ్రీకౄష్ణజననంతో పాటు, పూతనాసంహారం, శకటభంజనం, తౄణావర్తవధ, శ్రీకౄష్ణలీలలు, మౄద్భక్షణ - విశ్వరూపం, ఉలూఖల బంధనం, గోపాల-గో-వత్సములు తానే యగుట, కాళీయమర్దనం, దావదహనం, గోవర్ధనపర్వతమెత్తుట, నందుని వరుణ నగరం నుండి తేవడం, రాస, జల క్రీడలు, సుదర్శన శాపవిమోచనం, అకౄరునికి శ్రీకౄష్ణ దివ్యదర్శనం, కుబ్జ కూరూపం తొలగించడం, కంసవధ, గురుపుత్రుని బ్రతికించుట, ఉద్ధవుని వౄత్తాంతం, ముచికుందుని కధనం, భూదేవి స్తుతి, సంసారకధనాలు, ఈశ్వరవాక్యాలు, నౄగమహారాజు వౄత్తాంతం, శిశుపాలవధ కధనం, కుచేలోపాఖ్యానం, మౄతులైన సహోదరులను తేవడం, మౄతులైన విప్రసుతులను తేవడం, శ్రీకౄష్ణమహిమలు, శ్రీకౄష్ణనిర్యాణం, శ్రీకౄష్ణావతారాన్ని చాలించడం, ముఖ్య సంఘటనలుగా సంక్షిప్తీకరీకరణం చేయవచ్చును.
శ్రీకౄష్ణుని గీతోపదేశందైవీసంపదగా గీతాసారాన్ని ఉదాహరించడం పరిపాటి. మనుష్యునికి దివ్యశక్తిని ప్రసాదించేవి దైవ సంపదలే. ఇవి మన ఆత్మయొక్క విశిష్టగుణాలు. మనకు స్థిరమైన శక్తిని,మంచిమనస్సును ప్రసాదిస్తాయి. దు:ఖాలనుంచి విముక్తుల్ని చేసి శాశ్వతమైన సుఖాలనందిస్తాయి. దైవీసంపదలు పూర్ణవికాసాన్ని పొందినప్పుడే భగవంతుడు కల్పన చేసిన మనుష్య స్వరూపం లభిస్తుంది. ఈ గుణాలు వికసించిన రూపమే మానవత్వం అనిపించుకుంటుంది. మానవ చరిత్రలో ఈ గుణాలు పూర్తి వికాసం పొందిననాడే యదార్ధ మానవధర్మం వెలుగొందుతుంది. శ్రీకౄష్ణుడు, భగవద్గీతలో, 16వ అధ్యాయంలో మనుష్యుల్లో వికసించి, వెలుగొందే దైవీ సంపదలను, దైవసంబంధ గుణాలను ప్రకటించడం జరిగింది. దైవీసంపద కలవారియొక్క లక్షణాలను స్పష్టంగా వివరించడంకూడ జరిగింది. అర్జునినితో దైవీసంపద ప్రాప్తించిన పురుషులకు కళ్యాణం జరుగుతుందని, వాటితోనే మానవత్వం ధన్యమవుతుందని అని వివరించాడు. వాటి సారాంశం యిలావుంది.
దైవీ సంపదకల వ్యక్తిలో - తేజస్సు, ఓర్పు, ధైర్యం, బాహ్య-అంతశ్శౌచం,ఎవరియందు శత్రుభావం లేకుండడం, తనయందు పూజ్యతాభిమానం లేకపోవడం, అర్జునినికి కౄష్ణుడు వివరించాడు.
ఎట్టి స్థితిలోను భయము లేకుండుట, అంత:కరణ స్వఛ్చత - మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, జ్ణానయోగమైన వ్యవస్థితి, సాత్విక దానశక్తిని ధరించడం, ఇంద్రియదమనం - జ్ణాన, కర్మేంద్రియాలు, పూజ - అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణం, కీర్తన - స్వాధ్యాయం, స్వధర్మపాలనలో కష్టసహిష్ణుత్వం, అంత:కరణ సరళత - ఆర్జవం, అహింస, సత్యము, హిత - మధుర భాషణం, అక్రోధం, కర్మలలో కర్తౄత్వ - అమాన త్యాగం, శాంతి - అంత:కరణం యొక్క ఉపరామత, నిందాత్యాగం, నిర్హేతుక దయ, లోలుపత లేక ఆసక్తి ఉండకపోవడం, స్వభాషలో కోమలత్వం, లోక-శాస్త్ర విరుద్ధమైన ఆచరణకు సిగ్గుపడడం, వ్యర్ధకార్యములొనర్పకుండుట, ఆత్మ తేజ:ప్రాప్తి, క్షమ, ధౄతి అంటే ధైర్యం, శౌచము లేక పవిత్రత, ఏ ప్రాణియందు ద్రోహం కాని,వైరంకాని లేకుండుట, జాతి-వర్ణ-కుల-విద్యా-ధనాదులందు గర్వం విడిచిపెట్టడం, అనే 26 దైవగుణాలను వివరించడం జరిగింది. మానవుడు ప్రతినిత్యం శ్రేష్ఠత్వంవైపుకు సాగుతాడు. శ్రేష్టమైన వస్తువులను చూస్తాడు. శ్రేష్ఠములైన విషయాలనే చింతిస్తాడు. ఆలోచిస్తాడు. శ్రేష్ఠకార్యములనే ఆచరిస్తాడు. ఈ విధంగా ఈ దైవసంపద వికసిస్తే మానవుడు మహోన్నత దేవత్వాన్ని పొంది, తానే భగవంతుడై తీరుతాడు. ముమ్మాటికీ సత్యం. భారతజాతికి పథ్యం.
శ్రీకౄష్ణభగవానుడు వివరించిన దైవీసంపదసారాన్ని, మానవుడు ధరించి వికాసమందించాలని, అలాచేసినవాడు యధార్ధమైన మనుష్యుడౌతాడని, అంతేకాదు, దేవుడే తానవుతాడని ఉపదేశించాడు. అందుకే మానవసేవే మాధవసేవ అన్న ఆర్యోక్తి వచ్చింది. ప్రాత:కాల ప్రకాశాన్ని స్వీకరించినందుకు పువ్వులు రేకులు విప్పినట్లు దైవగుణసంపదను ప్రతీమానవుని చరిత్రలో మలుచుకోవాలి. పరమేశ్వరుని దేవీప్యమానమైన ప్రకాశాన్ని లోన ప్రవేశింప చేసికొనేందుకు ప్రతీ మానవుని మనస్సుని తెరిచిచూడాలి. దేవత్వాన్ని పొందినప్పుడే మానవత్వం పూర్తిగా పండినట్లు భావించవచ్చు.
వందే బౄందావనచరం, వల్లవీజనవల్లభం, జయంతీసంభవం ధామ వైజయంతీవిభూషణం అని కౄష్ణుడు ఒక మహాపురుషుడు అని శ్రీకౄష్ణావతారతత్త్వం విశదపరుస్తూంది.
శ్రీకౄష్ణస్తవంచతుర్వేదసారం భవాంభోధి పారం, నిరస్తాంధకారం వహద్ భూమిభారం, అఘౌఘాతిదూరం పరం నిర్వికారం, సదా భక్తపాలం భజే నంద బాలం.
ౠక్, యజుర్, సామ, అధర్వణవేదాలు అను నాలుగు వేదాలసారం తానైనట్టియు, సంసారమనెడి, లేదా జనన మనరంఉ లనెడి సముద్రనుదాటించునట్టియు, భూభారమునంతను మోయునట్టియు, పాపరాశికి మిక్కిలి దూరుడైనట్టియు, అన్నిటికన్న మిన్నయైనట్టియు, ఏవికారము (మార్పు) లేనట్టియు, సర్వదా నమ్మిన భక్తులను సంరక్షించునట్టియు, నందుని ఇంట బాలకుడై సంచరించిన శ్రీకౄష్ణపరమాత్మను నేనెల్లపుడు భజింతును.
పరమేశ్వర! కౄష్ణ! జీవితాబహవో యే చ మౄతా: పునస్త్వయా భువి కేచన మూఢ మానవా: య మజం ప్రాహు రనీశ శంకయా.
ఓ పరమేశ్వరుడా! శ్రీకౄష్ణదేవా! మున్నెందరో మౄతులు, నీచేత పునర్జీవుతులయ్యారు. అట్టి దివ్య మహాత్మ్యమును గమనించక పుట్టువే యెరుంగక నిన్ను - కలియుగములోని కొందరు మూఢులు భగవంతుడు కాడని శంకతో పల్కుచున్నారు? ప్రభూ! నీవు ముమ్మాటికీ భగవంతుడవే. నిత్యజీవము కోరువారు నిన్నే ఆశ్రయించి, నీ పాదాలే పట్టుకోవలెను ప్రభూ.
శ్రీకౄష్ణ మంగళవాక్యం
కౄష్ణేతి మంగళంనామ యన్యవాచి ప్రవర్తతే!భస్మీ భవంతి రాజేంద్ర మహాపాత: కోటయ:
కౄష్ణా! అను నామం సర్వ మంగళకరమైంది. ఆ నామం ఎవరి నాలుకమీద నాట్యం చేయునో, వాని పాపాలు కోట్లాది జన్మలపై అనుసరియై భస్మమైపోవును. కనుక, నిరంతరం శ్రీకౄష్ణ నామమునే జపించి,శ్రీకౄష్ణస్తోత్రములనే పఠించి, 'ఏకోదేవ: దేవకీ పుత్రఏవా - దేవకీదేవి కుమారుడుగా అవతరించిన శ్రీకౄష్ణపరమాత్మ, ఒక్కడే దేవుడని, దేవదేవుడని, దేశమునలుమూలలు మారు మ్రోగించుటకై ప్రయత్నించాలి.
అని విష్ణుధర్మోత్తరం లో ప్రస్తావించబడింది.
శ్రీకౄష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవ్వాలి. సర్వం శ్రీకౄష్ణార్పణమస్తు. సర్వేజనా: సుఖినోభవంతు!
ఓం శాంతి:
శ్రీ కౄష్ణజయంతి, శ్రీ కౄష్ణాష్టమి సందర్భంగా తెలుగురథం ఆ లీలామానుష వేషధారికి భక్తి ప్రపత్తులతో ఆరాధన కావించుకుంటూ -
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
నాడు - ఈనాడు
ఆగష్ట్ 23 ప్రత్యేకతలు
1. టంగుటూరి ప్రకాశంపంతులు గారి జయంతి
ఆగష్ట్ 24 ప్రత్యేకతలు
ఘటనలు - సంఘటనలు
1. 1456 గూటెన్ బర్గ్ బైబిల్ ముద్రణ పూర్తి చేయడం.
2 1608 అధికారిక అంగ్ల ప్రతినిథి మొట్టమొదటిసారిగా, భారతదేశం లో - సూరత్ - లో అడుగిడడం జరిగింది.
3. 1690 భారతదేశంలోని 'కలకత్తా' ప్రాంతం కనుగొనబడింది.
ఈ రోజు - భాషలకు రారాజు - సంస్కౄతం - ప్రపంచ సంస్కౄత భాషా దినోత్సవం
ఆంధ్ర కే సరి - ఆంధ్ర కేసరి - టంగుటూరి ప్రకాశం
ఆంధ్రకే సరి - 'అంధ్రకేసరీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు ( 1872 - 1957 )అతి సాధారణ కుటుంబంలో పుట్టి, ఆధునికాంధ్ర ప్రజానాయకుల్లో అసాధారణంగా ఎదిగి, ప్రజలే ప్రకాశం, ప్రకాశమే ప్రజలు అనిపించుకున్న నిస్వార్ధజీవి. అంధ్రమాత ముద్దుల బిడ్డ - టంగుటూరి ప్రకాశం పంతులు. స్వాతంత్య సమరంలో ఒక సేనావిలాగా అగ్రభాగాన నిలచి ప్రజలను ఆకర్షించి, ఉత్తేజపరిచి కార్యోన్ముఖులను చేశాడు. సైమన్ కమీషనుకు వ్యతిరేకంగా రొమ్ము విరిచి పోరాడాడు. 'ఆంధ్రకేసరీగా గణుతికెక్కాడు. న్యాయవాదిగా ఆర్జించిన లక్షలాది రూపాయలు, ఆస్తిపాస్తులు దేశంకోసం హారతికర్పూరంలా వెచ్చించిన త్యాగశీలి, సాహసి, ప్రజాహిత తత్పరుడు ప్రకాశం పంతులు. సహాయ నిరాకరణ ఉద్యమానికి ఊతగా 'స్వరాజ్యా పత్రిక స్థాపించాడు. అంధ్ర కాంగ్రేసు అధ్యక్షుడుగా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన సేవలు మరపురానివి. ప్రకాశంపంతులు జీవిత చరిత్ర 'నా జీవితయాత్రా ఆయన నిజాయితీకి, నిష్కళంక జీవితానికి అద్దం పట్టి జాతికి స్ఫూర్తి కలిగిస్తుంది.
బాల్యంలోనే హుషారుతనం, కుటుంబంలో అష్టకష్టాలుగోపాలకౄష్ణయ్య, సుబ్బమ్మ లకు 23 ఆగష్టు 1872 న ప్రకాశంగారు జన్మించారు. వల్లూరులో చదువులు ప్రారంభమవ్వగా, అక్షరాలదిద్దుబాటుతో అల్లరితనం, గుండ్లకమ్మ ఈత, సాముగరిడీలు, రౌడీల సహవాసం, వ్యాయామాదుల్లో దిట్టతనాన్ని ప్రదర్శించారు ప్రకాశం వారు. తండ్రి మరణం, తల్లి బ్రతుకుతెరువు కోసం పూటకూళ్ళమ్మ పనితో పిల్లలను చదివించింది. తలవంపులు, ఆత్మగౌరవానికి కించిత్తు భంగం అయినా, పిల్లల బాగోగులను దౄష్టిలో పెట్టుకుని, ధైర్యంతో ముందడుగు వేసింది. చాలని సంపాదన వల్ల, వారాలు చేసుకోవడం, పరీక్ష రుసుము కోసం పాతికమైళ్ళు నడచినా లాభించని ఫలితం, తల్లి పట్టుచీర తాకట్టు పెట్టడం, ఫలితాలని యివ్వకుండా పోలేవు కదా. అందరికంటే అధికమార్కులతో ఉత్తీర్ణత నిదర్శనమే.
నాటకకళాసేవాభిరుచి నుంచి న్యాయవాది వరకుధార్వాడ నాటకకంపెనీ నాటకాలను ఒంగోలులో వీక్షించడం, ఉర్దూనాటకరచయిత వుండవల్లి సాహెబ్ ప్రేమాభిమానాలు, స్త్రీపాత్ర ధారణలో తెచ్చుకున్న మంచిపేరు, మిషన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు నాయుడుగారి చలవవల్ల చదువు అబ్బింది. న్యాయవాది కావాలన్న పట్టుదల, మంజూరీ అయిన చాలీచాలనివేతనం మూలాన, ఒంగోలునుంఛి రాజమండ్రి మకాము మార్చడం జరిగింది. మద్రాసు లా కాలేజీలో న్యాయశాస్త్రం చదువు, ఒంగోలులో కొంతకాలం వౄత్తి చేయడం, నాయుడుగారిపై ప్రేమవల్ల తిరిగి రాజమండ్రి చేరి స్థిరపడడం జరిగిపోయింది. అలతికాలంలోనే రాజమహేంద్రవరం లో సహన్యాయవాదులకు కంటిపై కునుకు లేకుండ ప్రకాశంగారు వెలిగిపోయారు. ప్రతిభ తప్పక దారులను కల్పిస్తూనే వుంటుంది. ఆంధ్రలో తొలి పురపాలకసంఘస్థాపన రాజమండ్రి అవ్వడం, పోటీదారులను చిత్తుచిత్తుచేసి అధ్యక్షులై నగరపరిపాలనా వ్యవస్థలో కడుమన్ననలను పొందారు.
'మాకారత్రయం పై తల్లితో ప్రతిన'మాకారత్రయంగా పిలువబడే - మద్యం, మాంసం, మగువ లను ముట్టనని మాతృౠమూర్తి సమక్షంలో ప్రతినబూని, మిత్రప్రోత్సాహంతో, బారిష్టరు పదవికోసం లండనుకు దీక్షాయానం చేశాడు. స్వయంపాకం, శాకాహారంతో చదువు పూర్తిచేయడం, భారతసంఘంలో సభ్యత్వం, దాదాభాయినౌరోజి ని బ్రిటిష్ పార్లమెంటు కు విజయానికి సహాయ సహకారాలనివ్వడం, చదువులో ప్రతిభావంతుడిగా గుర్తింపు కూడ మరొక అధ్యాయంగా ప్రకాశం వారి జీవితంలో జరిగిన సంఘటనలు.
న్యాయమూర్తి బౌద్ధికంగా అవినీతిపరుడుబారిష్టర్ హోదాతో మద్రాసు హైకోర్టులో వౄత్తిని సాగించిన రోజుల్లో, ప్రకాశంగారితోబాటు, యోధులైన భాష్యం అయ్యంగార్, కౄష్ణస్వామి అయ్యర్, నార్టన్, గ్రాంట్ లాంటి న్యాయవాదదిగ్గజాల మధ్య పేరుపొందడమేకాదు, ఆ వౄత్తిపై నిస్వార్ధంగా చెణుకులు, విసుర్లు చెప్పుకున్న చతురుడు. అందుకే ఆత్మవిశ్వాసం, నిరంతర పరిశ్రమ, నిర్భయత పుష్కళంగా పుణికిపుచ్చుకున్న, ప్రకాశం కనువిప్పుగా 'లాటైంశ్ పత్రికలో వ్యాసం వ్రాస్తూ, 'న్యాయమూర్తి బౌద్ధికంగా అవినీతిపరుడూ అని సద్విమర్శ చేశారు. చదువుకోసం అప్పుచేసిన ప్రకాశం, స్వంత గ్రంధాలయం, మంచిపేరు, సంపాదనలను సాధించారు.
గతచరిత్రను మరవని మహనీయులు
తన గతచరిత్రను మరవని ప్రకాశం, సంపాదన తర్వాత విర్రవీగక, బంధుమిత్రకుటుంబాల్ని, పలువిధాలుగా సహాయాలు చేసిన ఘనాఘనులు. పొందిన సహాయానికి కౄతజ్ౙతాపూర్వకంగా నాయుడుగారి కుటుంబానికి కూడ సహాయం చేయడం మరువలేదు. తమ్ముళ్ళు శ్రీరాములు, జానకీరామయ్యను కూడ చదువులు చెప్పించారు. శ్రీరాములుగారి కూతురే, ప్రఖ్యాత నటీమణి టంగుటూరి సూర్యకుమారి ఆ కుటుంబంలోని ప్రతిభాముత్యమే.
గాంధి కన్ను మున్ముందుగానే రాజకీయరంగ ప్రవేశంజాతీయోద్యమం పై ఆకర్షణతో, భారత రాజకీయరంగంలో గాంధీజీ కన్న ముందుగానే, ప్రకాశంగారు ప్రవేశించారు. 1908 లో ప్రముఖ జాతీయనాయకుడు బిపిన్ చంద్రపాల్ మద్రాసు సభలోని ఉపన్యాసాన్ని విని కడు ప్రతిభాప్రేరణలను పొందారు ప్రకాశంగారు. నూతనాధ్యాయం ప్రారంభమైన ఆ సుదినం, ప్రకాశాన్ని, ఆయన జీవితాన్ని, దేశసేవకు పుణ్యాంకితం అయేలా చేసింది. అది భారతావని, ప్రత్యేకంగా ఆంధ్రసీమ, చేసుకున్న పుణ్యంగానే భావించాలి.
స్వరాజ్య పత్రిక ద్వారా సేవలుజాతీయభావప్రచారవాహినిగా మద్రాసులో 'స్వరాజ్యా పత్రిక 1921 లో దినపత్రికగా వెలిసింది. ప్రముఖవర్గం, ఖాసా సుబ్బారావు, కోటంరాజు పున్నయ్య, కౄపానిధి లాంటి పాత్రికేయ ఘనాపాటీలు స్వరాజ్యాన్ని ఆకాశానికి ఎత్తివేశారు. ఎవరైనా పైకివస్తూ పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటే, వీటితో అసూయాద్వేషాలు, కంటికి నిదురరాని శతౄవులు దాపురిస్తారు. ఆనాటి నుండి ఈనాటి వరకు తనదైన ప్రత్యేకతను నిలుపుకున్న తమిళపరంగా చెలామణి అవుతున్న 'ది హిందూ' అంగ్ల పత్రిక తన ఆధిపత్యానికై స్వరాజ్య పత్రికను అణచివేతకు కంకణం కట్టుకుని ఎన్నో ప్రయత్నాలు చేసినా, స్వరాజ్య పుష్కరకాలంపాటు దిగ్విజయ యాత్ర చేసింది. సునిశిత విమర్శలకు, విశ్లేషణలకు స్వరాజ్య ఆనాడు సరిసములులేని దశదిశల్లో నడిచేది. చివరికి నీతిగా, ఒకరిని కిందకి తొక్కితేగాని మరొకరు పైకెక్కడం భారతరాజకీయాల్లో సుసాధ్యం కానేకాదు అనే భావించవలసివస్తోంది. రాజకీయాల్లోకి పత్రికలు ప్రవేశించడం మాట ఎలావున్నా, పత్రికల్లో రాజకీయాలు ప్రవేశించడం ఆనాటినుంచి వున్నాయన్నది మాత్రం తధ్యం.
గాంధి, రాజాజీలు కూడ ప్రకాశం తర్వాతే1929లో మద్రాసుకు సైమన్ కమీషన్ పర్యటన. నిరసనగా బహిష్కరించవద్దని ప్రకాశానికి గాంధి సలహానిచ్చినా లెక్కచేయని ప్రకాశం, గోడమీదపిల్లిలా నల్లకళ్ళజోడులోంచి రాజకీయాలను నడిపించిన రాజాజీ అటు, యిటు కాని తెలివైన రాజకీయం, అందరికీ తెలిసినదే. 'సైమన్ కమీషన్ ని బహిష్కరిస్తూ, 'సైమన్ గో బేక్' అని గర్జించిన వేలాది ప్రజాప్రదర్శనకు, ప్రకాశం, దుర్గాబాయి, రంగయ్యనాయుడు లు నాయకత్వం వహించారు. తుపాకీలగురికి ఎదురొడ్డిన ప్రకాశం, తన నగ్నచాతిని చూపి, 'రండిరా యిదె కాల్చుకొండిరా' అని గుండెలిడిన గండశూరుడు మన టంగుటూరికి తుపాకులు తలవంచక తప్పలేదు, వేరేదారి లేదు కనక. ఈ సంఘటన ప్రకాశం రాజకీయజీవితం మరింత సుప్రకాశవంతమై రాణించింది. ప్రకాశం గారు సత్యాగ్రహోద్యమాల్లో ముమ్మరంగా పాల్గొనడం, జైలుశిక్షను అనుభవించడంతోబాటు, గాంధీజీని సైతం లెక్కచేయకపోవడంలో, అంధ్రనాయకుల్లో ప్రకాశం ప్రధములుగానే చెప్పాలి.
ప్రకాశం నుంచి సేవాపర్వాలుసర్దారుపటేలు సలహామేరకు ప్రకాశం మద్రాసునుంచి కాంగ్రేసు అభ్యర్ధిగా విజయం, రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూమంత్రిగా నియామకం, ఆంధ్రకు చేసిన ఘనసేవలు, నభూతోనభవిష్యతి అని చెప్పాలి. మచ్చుకు కొన్ని - రాయలసీమకరువుని ప్రత్యక్షంగా ఎదుర్కోవడం, శిస్తు రెమిషను, ముజరా సౌకర్యాలు, నేటికీ మరువలేని సత్యాలు. క్విట్ యిండియా మూలాన జైలుశిక్ష తర్వాత, ప్రజల ప్రేమాభిమానాలను పుష్కళంగా అందుకున్న ప్రకాశం మద్రాసు ముఖ్యమంత్రిగా, ఫిర్కా అభివౄద్ధి ప్రవేశం, ఉత్పత్తి, వినియోగదారుల సహకార సంఘాలస్థాపన లాంటి ప్రత్యక్ష ప్రయోజనాత్మకమైన పనులను చేయడంలో ప్రకాశం తన ప్రతిభను పట్టుదలను ప్రదర్శించారు. రాణింపు రాజకీయాన్ని అధికకాలం నిలవనియ్యరు. అదేపని గాంధిజీ, రాజాజీ లు పన్నిన కుట్ర, కుతంత్ర, కుహనా రాజకీయాలకు ప్రకాశం ప్రభుత్వం పతనానికి దారితీసింది. గాంధిజీ విశ్వభారతానికి మహాత్ముడు కావచ్చు. కాని కొందరికే దర్శనమయ్యే పాక్షిక రాజకీయం ఆయనది. ఈ దక్షిణ భారతీయ రాజకీయానికి రారాజు రాజాజీ. ఆయన రాజకీయప్రస్థానంలో అంకాలు, అధ్యాయాలు ఆయన శైలిలో తమిళదేశపు స్వార్ధరాజకీయాలే తప్ప వేరు కావన్నది సత్యం. గాంధిజీకి ఈ రాజకీయమే సన్నిహితుడ్ని చేసింది కూడాను. ప్రకాశం గారికి కాంగ్రేసుకి విడాకులు యిచ్చి, ప్రజాపార్టీని ప్రారంభించక తప్పలేదు. ప్రత్యేకాంధ్ర కొరకు పొట్టిశ్రీరాములు ఆత్మార్పణతో వెలసిన ఆంధ్రరాష్ట్రం 1953 అక్టోబరు 1 న అవతరణ, ప్రకాశం పంతులుగారిని కర్నూలు రాజధానిగా, ముఖ్యమంత్రితో సఫలీకౄతం అయ్యాయి. టంగుటూరి ప్రకాశం అందించిన ఆంధ్రుల గర్వసంకేతాలుగా, శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయం, కృౠష్ణాబ్యారేజి స్వతంత్రంగా నిర్మాణం, మచ్చుతునకలు.
సర్వసల్లక్షణసారసంగ్రహం - టంగుటూరి ప్రకాశం పంతులు గారుసాహసమే ఊపిరి, మొనగాళ్ళకు మొనగాడు, కలిమిలేముల్ని, మంచిచెడ్డల్ని సమదర్శనం గావించిన స్థితప్రజ్ౙత్వం, కౄషియే దైవంగా భావన, రాజకీయ రణరంగపు మహాభారతంలో అపర వీర భీష్మాచార్యగా ప్రకాశంగారిని ప్రవచించకుండ మనలేము.
1957 మే 20 వ తేదేన టంగుటూరి ప్రకాశం దివంగతులైనారు. 'ఆంధ్ర కే సరి, ఆంధ్రకేసరీ అయినాడని మాత్రం చింతించని ఆంధ్రుడు లేడు అని మన ప్రకాశం పంతులుగారి విషయం లో అందరూ ఏకీభవిస్తారు అన్నది తధ్యం.
ప్రకాశంగారిపై పెద్దల అభిప్రాయాలు:- దేశనాయక శిఖామణియై, తెలుగుజాతి ప్రకాశమ్మై, అవతరించిన ఆంధ్రకేసరి అమరుడైన పురారి అతడు.- గాలితోనైనా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం. - అయ్యదేవర కాళేశ్వరరావు.- ప్రమాదములున్న చోటనే ప్రకాశంగారుంటారు. - పట్టాభి.- భవ్యగుణముల దివ్యఖనియై భారతాంబకు ముద్దుబిడ్డయి గాఢమైన స్వరాజ్య కాంక్షల గండుమీరిన శూరుడాతడు, సరిసములులేనట్టి యాతడు ప్రజలకున్ దేశాభిమానము పంచిపెట్టిన నేతయాతడు.
ఎందరో పుడుతుంటారు, గిట్టుతుంటారు. ప్రకాశం అంతటి వాడు పుట్టడం సామాన్యమా! పుట్టినా వానికి గిట్టుటలేదు. ఆచంద్రతారార్కము జీవించియే యుంటాడు ప్రజల హౄదయాల్లో.
మహనీయుల జీవితాలు బోధించును అనవరతం, మనమూ మనజీవితాలను చేయగలం మహోన్నతం, వీడేదము కాలపుతడియిసుకలతీరముపై, మనదు అడుగుజాడలను - పోవుచుధీరులమై' అన్న అమెరికన్ కవి హెచ్.లాంగ్ ఫెలో భావంతో ఈ వ్యాసానికి భరతవాక్యం పలకటం సముచితం.
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగురథం సహస్ర వందనాలను సమర్పిస్తూ, ప్రకాశం ప్రతిభకు వేనోళ్ళ కొనియాడుతూ, నివాళిని సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
Friday, August 22, 2008
నాడు - ఈనాడు
ఆగష్ట్ 22 ప్రత్యేకతలు.
సంఘటనలు
1. 1639 నేడు చెన్నై గా పేరొందిన ఆనాటి మద్రాసు ప్రాంతం వెలసిన రోజు.
వ్యాపార నిమిత్తం భారతదేశంలో ప్రవేశించిన బ్రిటిష్ ప్రభుత్వం - బ్రిటిష్ ఈష్ట్ యిండియా కంపెనీ వారు మద్రాసపట్నం కు సంబంధించిన భూమిని ఆనాడు పరిపాలిస్తున్న విజయనగరం - నాయక రాజుల నుంచి కొనుగోలు చేయగా కనుగొనడం జరిగింది. దామెర్ల వెంకటపతి, వందవాసి నాయకరాజ పాలనలో భూమి కొనుగోలుకు అనుమతి యివ్వడం జరిగింది. 22 ఆగష్ట్ 1639 న కొనుగోలు చేయబడిన ఆ రోజు కంపెనీ నిర్వహించే 'ఫ్రాన్సిస్ దినం'గా పరిగణించబడిన రోజు కూడ. ఏడాది తర్వాత, తెల్లదొరలు పీట వేసుకుని కూర్చోగలిగిన 'ఫోర్ట్ సైంట్ జార్జీ ను నిర్మాణం చేయడంతో పూర్తిస్థాయిలో బ్రిటిష్ దొరలు పూర్తిగా ఆక్రమించుకోగలిగారు. విజయనగరం రాజు = పెద వెంకటరాయ, చంద్రగిరి నుంచి భూమిని కొనుగోలు చేయడం జరిగింది. నేడు ప్రపంచంలోకెల్లా, ప్రఖ్యాతమైన 36 వ మెట్రో మహానగరంగా చెలామణి అవుతున్న 'చెన్నై' (ఆనాటి మద్రాసపట్నం, తర్వాత క్రమేపీ మద్రాసు గా పేరొందగా) వెలసిన రూపురేఖలు అలా ప్రారంభమైనాయి.
ఆ నాటి నుంచి, 22 ఆగష్ట్ ప్రతీ రోజు చెన్నై మహానగరం తన పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటోంది. చెన్నై కు అభినందనలు.
2. 1864 - ప్రపంచ ప్రఖ్యాతమైన 'రెడ్ క్రాశ్ సంస్థ ప్రారంభం
ప్రపంచ ప్రఖ్యాతమైన సామాజిక సేవలనందిస్తున్న 'రెడ్ క్రాశ్ ఉద్యమం, హెన్రీ డ్యూరంట్ నాకత్వంలో, 12 ఐరోపా దేశాల భాగస్వామ్యంతో, మొదటి అంతర్జాతీయ జెనీవా సమావేశం ద్వారా ప్రవేశపెట్టబడిన సంస్థ - రెడ్ క్రాస్. మరిన్ని సేవలు నిరంతరం విశ్వమానవాళి కి అందించాలని ఆశిద్దాం.
3. 1911 - దొంగిలించబడ్డ 'మొనాలిసా' కళాఖండ చిత్రపటం కనుగొనబడింది.
4. 1932 - బి.బి.సి. (బ్రిటిష్ బ్రాడ్ కాష్టింగ్ కార్పొరేషన్) ప్రయోగాత్మకంగా, తొలిసారిగా, టెలివిజన్ కార్యక్రమాలను ప్రసారాలను ప్రారంభించింది.
5. అంతర్జాతీయ జానపద దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా అలరారుతున్న వివిధ జానపద సాహిత్యం, కళలు, యితర జానపద సంపదను విశ్లేషించుకునే అంతర్జాతీయ సమారోహ కార్యక్రమాలు జరుపుకునే రోజు.
కొణిదెల శివ శంకర వరప్రసాదు - అనే పేరుగల, చిరంజీవి, యింతకాలం నటుడు, ప్రజాసేవకుడు పాత్రల్లో ఆంధ్రుల అభిమానాన్ని పొందడం, ప్రపంచ వ్యాప్తంగా పేరుప్రఖ్యాతులను పొందడం జగద్విదితమే. చలనచిత్ర రంగానికి వీడ్కోలు జరిపి, ప్రజాసేవలో మరింత ముమ్మరంగా పాల్గొనేందుకు వీలుగా, రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సర్వసన్నిద్ధులవుతున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఆయన రాజకీయ ప్రవేశం అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చే శక్తిని, సంకల్పసిద్ధిని ఆ పరాత్పరుడు ప్రసాదించాలని ప్రార్ధన కావించడం సముచితం.
Thursday, August 21, 2008
అంతర్జాతీయ జానపద దినోత్సవం
జనపదం - జానపదంజనపదం అంటే ఒకప్పుడు కేవలం 'పల్లెటూరూ అనే అర్ధం వుండేది అని చెప్పవచ్చు. నేడు ఆంగ్లంలో 'ఫోక్' అనే పదానికి, జనం-జనపదం-లోకులు అని వివరణ యివ్వడం జరిగింది. ఈ మూసలోనే, జానపదం అన్న పదం తోనే మిగతా సంబంధిత పదాల్ని నిర్మించుకోవడం జరిగింది. ఫలితంగా, జానపద - సాహిత్యం, సంఘాచారం, సభలు, సం(గీతం), సాహిత్యం, నౄత్యం, మనోవిజ్ణానశాస్త్రం, వెలసి జానపద విజ్ణానశాస్త్రం అవతరించాయి. అయితే, 'ఫోక్లోఋ అనేపదాన్ని మొదటిసారిగా, డబ్లియు.జే.థాంస్ అనే మహానుభావుడు రూపొందించాడు. 'ది అథనీయం' అనే పత్రికకు వ్రాసిన ఒక ఉత్తరంలో, ఫోక్లోర్ అనే పదాన్ని సూచిస్తూ, జానపదులకు చెందిన ఆచారాలు, నమ్మకాలు, కధాగేయాలు, సామెతలు, మొదలైన విజ్ణానమే, 'ఫోక్లోఋ అని వివరించాడు. ఏది ఏమైనా, జనపదం, జానపదుల జీవనవిధానంపై ఒక సదాచారం, సంప్రదాయం వెంటాడుతూనేవున్నాయి అని చెప్పాలి. ఈ భావననే - సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా, మూఢాచారాలు మారుతూ ఉంటాయి నిజం, కాని, సంప్రదాయం తాత ముత్తలనాటి ధనం. జాతికి జీవననాళిక - జానపదగీతి, అని అంటాడు ఆరుద్ర తన సాహిత్యోపనిషత్ రచనలో. జానపద పద సార్ధకతను వివరించిన వారు ఎందరో వున్నారు. మానవుని ముగ్ధ ప్రకౄతి, సౄష్టి వలెనె, అనాది దానికి జానపదులు, నగరవాసులన్న భేదం లేదు, సంస్కారం పేరుతో కౄత్రిమతా వివశులైన నగరవాసులకంటే జానపదులెక్కువగా ముగ్ధత మెరుస్తారు కనుకనే ముగ్ధతా ప్రధానమైన భాషాసంబంధి రచనలకు 'జనపదా దళ విశిష్టత యేర్పడింది అని జానపద సాహిత్య స్వరూపం అన్న గ్రంధంలో ఆర్వీయస్ సుందరం గారు అన్నారు. అలాగే, ఈ రచనలు దోషహాన, గుణోపాదాన, అలంకారయుక్తతా రసావియోగత్వములనే సంస్కార సహితాలు సాహిత్య మనరాక, లేఖన దూరములగుటచేత వాంగ్మయ మనరాక, సారస్వత మనబడటమే లెస్స తలపు అని ఆచార్య సాళ్వ కౄష్ణమూర్తిగారు అన్నారు. హితమైనదే సాహిత్యమని ఒప్పుకునేట్లయితే,జానపద సాహిత్యం కంటే ఉత్తమ సాహిత్యం లేదు. జనజీవనంలో ఈ సాహిత్యం అనివార్యమైన అంగం. జానపదుల జీవితానికీ, ఈ సాహిత్యానికీ విడదీయరాని బంధం అనే చెప్పాలి.
జానపదులు - జ్ౙాననిధులుభారతీయ జానపదులు ఎన్నటికీ వన్నె తరగని అపురూప కళానిధులు. మన దేశ సంస్కౄతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ అనాదిగా ప్రజలలోని అజ్ౙాన తిమిరాన్ని పారద్రోలి విజ్ౙానవంతుల్ని చేస్తున్న అపూర్వ కళాజ్యోతులు. జానపదులకు సంబంధించినదే 'ఫోక్ లోఋ అని చెప్పుకోవచ్చు. 19వ శ. లో 'ఫోక్' గురించి విద్వాంసులు, జానపదులంటే విద్యావిహీనులైన కర్షక జనులు, గ్రామీణులు అని భావించారు. జానపదుల దశల్ని, అరణ్యజీవనం, అనాగరికం, నాగరికం అని, అటు ఆటవికులూ కాక, యిటు నాగరికులూ కాక, పళ్ళెటూళ్ళలో జీవనం చేసేవారన్న భావం కూడ వుండేది. ప్రసిద్ధ జానపద విద్వాంసుడు, అలన్ డండెన్ - జానపదులంటే ఏదైనా ఒక్క విషయంలోనైనా భావసామ్యం కలిగిన జనసముదాయం, భాష, ప్రదేశం, జాతి, మతం, వౄత్తి కి సంబంధించిన వారు అవడమే కాక, తమదే అని చెప్పుకోదగిన కొన్ని సంప్రదాయాలను కలిగి వుండాలీ అని ఆంధ్రుల జానపద విజ్ౙానం అన్న పరిశోధనాగ్రంధంలో ప్రముఖ ఆచార్యులు ఆర్.వి.యస్. సుందరంగారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఫలితంగా, యిద్దరికన్న ఎక్కువ, కుటుంబం, దేశం, ప్రపంచం, ఏదైనా చెప్పుకోవచ్చు. ఈ సముదాయంతో పాటు, వర్గ సమూహంలోని పద్ధతులు, నమ్మకాలు విజ్ౙానరూపం దాలిస్తే, సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు, పండుగలు, ఉత్సవాలు, విజ్ణానసంస్కౄతుల సమ్మేళణంగా భావించవచ్చు. వీటిని ఆచరణల ప్రక్రియల్లోంచి ఉధ్బవించేది సంస్కౄతి, సాహిత్యం, కళల రూపాల్ని దాలుస్తాయి. జానపదులను ఆధునిక దౄక్పధంతో నిర్వచిస్తే, సమాన సంప్రదాయాలు కలిగిన ఆటవికులు, గిరిజనులు, గ్రామీణులు, నగరవాసులు, ఎవరైనా జానపదులు అని ఘంటాపధంగా చెప్పవచ్చు. అందుకే, భారతీయతని తరచు మనం చెప్పుకొనే నిర్వచనం, భిన్నత్వంలో ఏకత్వం, అనేకంలో ఏకం గా మమైకం అవడం అన్నది జనపదం, జానపదం, జనం, జనపదులు, జానపదులు అని పర్యాయపదాలుగా చెప్పుకోవడంలో సమంజసం ఎంతైనా వుంది. అందుకే, మనం జనం, జనం మనం - జనం లేంది మనం లేము అంటాడు దాశరధి, దీపావళి అన్న కవితలో. పదమైనా, పధమైనా, జనంతో ఐక్యం అయితే, ప్రభావం, ప్రతిభ వెల్లడవుతాయి.
జానపద విజ్ౙాన స్వరూపంజనజీవనం నాడి, జనసంస్కౄతి, నిజరూపంలో కనిపించేది తమ విజ్ౙాన సాహిత్యరంగాల్లోనే. ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, ఆనవాయితీలు, పండుగలు, కట్టుబొట్టు, మాటమంతీ, పెళ్ళిపేరంటాలు, యిత్యాదులు ప్రతిబింబించే సాహిత్యం, కళలు, ప్రజ్ణాన, విజ్ణానవంతపు మహావిద్వాంసుల పాండితీప్రతిభలకు సరితూగవేమో. మన నిత్యజీవనంలో కనిపించే సహజాలంకారాలు, సామెతలు, పలుకుబళ్ళు, నుడులు-నానుడులు, మాండలీకాలు, యాసమాటల ద్వారా ప్రకటించే జానపదుల అమాయకత్వం, ఆకౄతి, సహౄదయత, అర్ధాన్నేకాక, అర్ధవంతంగా గోచరిస్తాయి. పరమార్ధాన్ని ప్రసాదిస్తాయి. స్థాయిని, సహౄదయతతో జోడించిన ఎదుగుదల, అభివౄద్ధి, వికాసం చిరస్థాయిగా మైలురాయిగా, మలుపురాయిగా, జాతి జనజీవనంలో చరిత్రను సౄష్టించక తప్పదు. మన ప్రాచీనతను చాటిచెప్పే, గాధాసప్తశతి కాలంలోనే, పెళ్ళిళ్ళు, పొలంగట్లలో పాడుకునే ఆటపాటలను పరిరక్షించుకుని కనక వుంటే, వందల ఏళ్ళ తెలుగు జనపద జీవన సంస్కౄతి విశ్వవ్యాప్తంగా ఘనతకెక్కేది.
జానపద విజ్ౙాన సర్వస్వం
జానపద విజ్ౙాన పరంపరను - సాహిత్యం, సాంఘికాచారాలు, వస్తుసంస్కౄతి, కళలుగా విభజించడం జరిగింది. అధికంగా, జానపదవిజ్ణానం, మౌఖికంగా విస్తారం చెంది, ప్రసారం అయింది అని చెప్పాలి. ఈ ప్రక్రియ క్రింద, కవిత్వం, గద్యకధనాలు, సామెతలు, పొడుపు కధలు, భాషను ప్రముఖంగా చెప్పుకోవాలి. మరింత ప్రముఖంగా చెప్పాల్సిన, సాంఘికాచారాలు - జననం నుంచి మరణం వరకు - నమ్మకాలు, దేవతల మంత్రతంత్రపూజలు, పండుగలు, నోములు, ఉత్సవాలు, వ్రతాలు, జాతరలు వస్తాయి. జానపదజీవనంలో విస్మరించలేని అంశం - వైద్యవిధానాలు, పెరటిమందులు, నాటు మోటు తరహా వైద్యాలు, జనజీవన అస్థిత్వానికి దోహదమయ్యాయి. అటలూ, పాటలూ, వినోదాలు, విహారాలు, యింతలు, మరింతలుగా జనపదసంస్కౄతిలో అంతర్గతమయ్యాయి. జనపద వస్తుసంస్కౄతి విషయానికొస్తే, ఆహారపానీయాలు, దుస్తులూ, ఆభరణాలు, చిత్రకళ, శిల్పం, చేతిపనులు, గౄహనిర్మాణం, యిళ్ళు, వాకిళ్ళు, లోగిళ్ళు, వస్తుప్రదర్శనావిధానాలు, ప్రముఖపాత్ర వహిస్తాయి. ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గవి - జానపద కళలుగా, సంగీతం, నౄత్యం, రూపకాది అంశాల ప్రదర్శనలు, పరిశోధనలు, జానపద విజ్ౙాన సంపదకు మూలవిరాట్టులు. కళల్లో ప్రముఖంగా - వీధిభాగోతం, తోలుబొమ్మలు, యక్షగానం, బహురూపులు, పగటివేషాలు, గారడివిద్యలు, ఎన్నో చెప్పుకోవాలి.
జానపద విజ్ౙాన శాస్త్రీయ పరిశోధనజానపద విజ్ౙాన సర్వస్వాన్ని, సూక్ష్మదౄష్టితో, విభజించి, క్రోడీకరించి, భాగోపభాగాలుగా ఆధ్యయనం, పరిశోధనం గావించిన ప్రముఖులు ఎందరో. ఆ ప్రముఖుల్లో ప్రముఖినిగా ఆర్.ఎస్.బాగ్స్ ని ప్రస్తావించక తప్పదు. ఆయన, జానపదాన్ని, ఒక వాదంగా, వేదంగా భావించాడు. సామాన్య జానపద విజ్ౙానం, గద్యకధనం, కధాగేయం, గేయం, నౄత్యం, ఆట, సంగీతం, గద్యం, నాటకం, ఆచారం, ఉత్సవం, భూగోళం, భాష, కళ, చేతిపనులు, వాస్తువు, ఆహారం, పానీయం, నమ్మకం, వాక్కు, సామెత, పొడుపుకధలను 13 ప్రముఖ వర్గాలుగా విభజించాడు.
ఆంధ్ర జానపద ప్రతిభావంతులుప్రాచీన జానపద సాహిత్య సందర్భాలతోపాటు, ఎందరో రచయితలు, కళాకారులు ఈ జానపద విజ్ౙాన సర్వస్వానికి దోహదపడిన వారు ఎంతోమంది. హరి ఆదిశేషువు, నాయని కౄష్ణకుమారి, భద్రిరాజు కౄష్ణమూర్తి, కౄష్ణశ్రీ, నేదునూరి గంగాధరం, యస్వీ జోగారావు, తూమాటి దోణప్ప, డా.ఆర్వీయస్.సుందరం, జి.యస్. మోహన్, వెన్నెలకంటి రాఘవయ్య, కోరాడ రామకౄష్ణయ్య, బిరుదు రామరాజు, గంగిశెట్టి లక్ష్మీనారాయణ, వెలగా వెంకటప్పయ్య, తంగిరాల వెంకట సుబ్బారావు, కళాకారులు నాజర్, గద్దర్, వందేమాతరం శ్రీనివాస్, యిలా ఎంతోమందిని ఉదాహరించవచ్చు.
జానపదులకు ప్రత్యేక రామాయణాలుజానపదుల జీవితాల్లో అల్లుకొనిపోయిన పురాణేతిహాసాలను ప్రస్తుతించాలంటే, ప్రధమంగా రామాయణగాధలనే చెప్పాలి. ఈ అంశాలని మధుర హావభావాలతో, ప్రత్యేకంగా ఈ రంగంలో తాము జరిపిన విశిష్టమైన పరిశోధనానుభవాన్ని నిరంతరం అందించే మహానుభావుల్లో బిరుదు రామరాజు గారిని ప్రత్యేకంగా చెప్పితీరాలి. ఆయన జానపదుల రామాయణ విశేషాలను, ప్రముఖ సాహితీ సంస్కౄతిక సంస్థ - యువభారతి - ఒకకాలంలో సాహితీయాగం చేసినవారి, రామాయణ సుధాలహరి కార్యక్రమంలో భాగంగా, జానపద రామాయణాలపై వివరణాత్మకంగా ప్రచురించిన జానపదుల వివరాలను చదివి ఆనందించవలసిందే. ఊర్మిళదేవి నిద్ర, లక్ష్మరదేవర నవ్వు, పెండ్లి పాటలు, గుహుని కధనం, స్త్రీల వ్రతాలు, నోములు, చెక్కపాటలు, మచ్చుకు మాత్రమే.
చిత్రసీమను అలరించిన జానపద సంపదజానపద కధల యితివౄత్తాలతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. కాటమరాజు కధ, మదనకామరాజుకధ, యిలా ఎన్నో చిత్రాలు జానపద గుభాళింపులను తెచ్చిపెట్టాయి. అలాగే, చిత్రాల్లోని గీతాలను కూడ జానపదశైలి, సరళి సుస్పష్టంగానే గోచరించాయి. భారతీయ జ్ౙానపీఠపురస్కార గ్రహీత, ప్రముఖ డా.సి. నారాయణరెడ్డి గారి ప్రతిభాకలం నుంచి వెలువడిన జానపదమంజరి తెరిస్తే, ఎన్నో పాటలు - మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు (అమ్మమాట), సంతకెల్లి వచ్చేతలికి ఇంతమారిపోతవి మల్లా ఏం పిల్లా కత యేందే పిల్లా (బంగారక్క), బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో (జీవితచక్రం), మామిడితోపుల్లోనా మాపటేల మాటేసి చిక్కుడు పాదూకాడా చీకటేల పట్టేసి చెప్పలేని రుచులెన్నో చిటికెలోన చూపించి, మాయచేసి పోతివిరో నాగులూ, నామాట మరచిపోతివిరో నాగులూ, ఓలమ్మో ఓరినాయనో (జీవితం), గంపానెత్తిన పెట్టి గట్టుమీద పోతుంటే గుండెఝల్లుమన్నాదే రంగమ్మా, హోయ్ గుబులు గుబులుగున్నాదే రంగమ్మా (దత్తపుత్రుడు), ఆకుపచ్చని చేలు అల్లోనేరెళ్ళో, ఆపైన పైరగాలి అల్లోనేరెళ్ళో, అందాలమాపల్లె అల్లోనేరెళ్ళో, ఆనాటి రేపల్లె అల్లోనేరెళ్ళో (యిల్లూ యిల్లాలూ), వచ్చింది వచ్చింది లచ్చిమి, వనలచ్చిమి, మహలచ్చిమి, ధలలచ్చిమి, మాలచ్చిమి, వచ్చాని చిలకల్లే పసినిమ్మ పండల్లే, ముచ్చటైన వయ్యారం మూటగట్టితెచ్చింది (మరపురాని మనిషి), వాడేవడంటే వాడే, వన్నెల చెలికాడే, హాయ్ హాయ్ అన్నిట సరిజోడే (భలేకోడళ్ళు), కంచెకాడ మంచెకాడ కంది చేను గుబురుకాడ, ఏటికాడ గున్నమావితోటకాడ సందెకాడ, మాటువేశాను పొంచిచూశాను దారికాశాను, నీకోసం, నీషోకైన మగసిరికోసం (మానవుడు దానవుడు), అన్నవి కేవలం ఉదాహరణల్లో కొన్ని మాత్రమే.
గుర్తుకొస్తున్నాయి మన జానపద సంపదలు
గేయాలుజానపద కవిత్వంలో గేయం, కధాగేయంగా ప్రాముఖ్యత వహించాయి. గేయాల్లో, పని, పారమార్ధికం, బాంధవ్యం, పిల్లలు, వేడుక, వలపు, హాస్య, కన్నీటి పాటలని ప్రముఖమైనవి.
పదములు, తుమ్మెద పదములు, ప్రభాత పదములు, అంటూ పాల్కురికి సోమనాధుని దేశీశైలిగీతాలు నేటికీ ప్రాచుర్యంలో వున్నాయి. దంపు దంపని యేరు అది యెంత దంపు, ధాన్యరాశుల మీద చెయ్యేసినట్లు, వంట వంటని యేరు అది యెంత వంట, వదినెతో మరదళ్ళు వాదాడినట్లు, అని రోకటి పాటలు నన్నెచోడుని కాలంనుంచే వున్నాయని చరిత్ర ఘోషిస్తోంది. ఘల్లు ఘల్లున పాడ గజ్జెలందెలు మ్రోయ, కలహంస నడకల కలికి ఎక్కడికే, అన్న ప్రసిద్ధ భక్తిగేయం ద్వారా పార్వతీపరమేశ్వరులను స్మరించడంలో సొగసు వర్ణనాతీతం. కాశికెడదామంటే కదలవే కాళ్ళు, డిల్లీ కెడదామంటే తిరగదే మనసు, నారాచ పుట్టింటి కెడదాము అంటే, నా కాళ్ళు పన్నిన్న రధములై నడచు, నా చేతులుయ్యాల చేరులై యూగు, అని ఆడవారి సహజ ప్రవౄత్తిని తెలిపేవి, జీర్ణం జీర్ణం వాతాపిజీర్ణం అంటూ ఉగ్గుపాటల ద్వారా బాంధవ్యగేయాలు, జానపదులకు, కేవలం మచ్చుకే చెప్పుకున్నవి. అలాగే, దేశభక్తి పరంపరగా - కొల్లాయి గట్టితే నేమీ మాగాంధి కోమటై పుట్టితేనేమి, నమో హిందుమాతా మాతా నమో భరతమాతా, మాకొద్దీతెల్లదనమురా, కల్లు మానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్ (బసవరాజు అప్పారావు), గుత్తివంకాయ కూరోయి బావా కోరి వండీనానోయి బావా కూరలోపలా నావలపంతా కూర్చి పెట్టినావోయ్ బావా, లాంటి గేయాలు ఎన్నో వేలకు వేలు గుర్తుకు రాక మానవు. ప్రముఖ కవి నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటలు - జామురేతిరియేళ జడుపుగిడుపూ మాని చల్లంగ వత్తాది నాయెంకి మెల్లంగ వత్తాది నాయెంకి అని నిత్యస్మరణకు రాకమానదు.
జానపద విజ్ౙానంలో అంతర్జాతీయ కౄషిప్రపంచస్థాయిలో జరుగుతున్న కౄషి చెప్పాలంటే, 19 స. చివరగా ఐరోపా, అమెరికా, జానపద విజ్ౙాన కేంద్రాల స్థాపనలు, ఫీన్లాండ్, ఇంగ్లాండ్, స్కాట్లెండ్ లాంటి దేశాల్లో కధాగేయాలు, సామెతలు, ఐతిహ్యాది ప్రక్రియలకు శోధనాసక్తి, కౄషి వెల్లడయ్యాయి. 20వ శ. లో విదేశీయులు జానపద విజ్ణానాన్ని ఒక శాస్త్రీయాధ్యన విషయంగా తీర్చిదిద్దారు. మేరియా లీడ్ సంపాదకత్వంలో అవతరించిన విపుల పదకోశం అధ్బుతం అనేచెప్పాలి. స్టిత్ ధాంసన్ (కధావిశ్లేషణ) ని కూడ స్మరించాలి. ప్రాప్, గమరి, ఎడ్వర్డ్ లీడ్, డార్సన్, అలన్ డండెన్, మరండా, టైలర్, క్రాప్సు మొదలైన ప్రతిభావంతుల సాధన, కౄషి వెరసి జానపదవిజ్ౙానం మరిన్ని విధాల ప్రతిభను జోడించింది - అని జానపద సాహిత్యం పై ఆచార్య ఆర్వీయస్. సుందరంగారు ప్రత్యేక విశ్లేషణలో చెప్పడం జరిగింది.
ప్రపంచ జానపద దినోత్సవంకేవలం ఒక ప్రాంతం, దేశం, సంస్కౄతికో జానపదం, జానపదులు పరిమితాలు అనుకుంటే, అంతకన్న అమాయకత్వం, మూర్ఖత్వం వేరేవుండదు. ఏదేశం సంస్కారం, సంస్కౄతి, సంప్రదాయాలు వారిది. వీటిని ప్రతిబింబించే విధంగా ప్రప్రంచవ్యాప్తంగా యీ రంగంలో బహుళకౄషి జరుగుతూనే వుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే, అంతర్జాతీయ జానపద దినోత్సవాన్ని, ఆగష్టు 22 న జరుపుకోవడం రివాజు, సంప్రదాయం. 1965 లో ప్రారంభించిన ఈ అంతర్జాతీయ ఉత్సవ వేడుకలు చాలా అందాన్ని, ఆనందాన్ని అందజేస్తూనే వున్నాయి. బౌర్గస్, బల్గేరియా లో ఈ ఏడాది జానపద ఉత్సవాలను జరుపుకుంటున్నారు.
అంతం కాదు యిది ఆరంభంజాతి నిజసంస్కౄతికి ప్రతిబింబం, దర్పణం గా భావించబడే జానపదవిజ్ౙానమే, శిష్టసాహిత్యం కన్న దోహదం చేస్తుంది అన్నదాంట్లో ఆశ్చర్యం, అసత్యం కావు. జనసామాన్యం నోటినుంచి వెలువడే నుడులు నానుడులు, తాత్వికత, మార్మికత, మానవ స్వభావత, ధ్వనిసహిత గుణదోషాదుల ప్రకటనలు, సంప్రదాయ, ఆచార, సదాచారాలు, అలవాట్లు, ఆనవాయితీలు, మన భవిష్యత్తు నిర్మాణానికి బీజాలుగా చేసుకోవాల్సిన తరుణం అని ఈ అతి ఆధునికత, నేటి నాగరికత, వెర్రితలల సంస్కౄతి, నేర్పిన గుణపాఠంగా భావించాలి. ఆంధ్రత్వం, తెలుగుదనం అన్నవి మన జానపదుల్లో, జనపదాల్లో, అడుగడుగునా వెదకినవారికి కష్టం లేకుండానే గోచరమవుతాయి. ప్రయత్నలోపమే కాని, వేరేమీకాదు. యిప్పటివరకూ భద్రపరచిన భాండాగారాన్ని పదిలపరచుకోవడమే కాక, వాటిని నిత్యానుసరణం, ఆచరణం చేసుకుంటూ, జానపద విజ్ౙాన సంపద సేకరణ, విభజన, విశ్లేషణ, పరిశోధనలను మరింతలుగా చేసుకుంటూ, విస్తారంగావించుకుంటూ, మరింత సశాస్త్రీయంగా విరాజిల్లాలని, ఈ విశ్వవ్యాప్తంగా జరిగే పండగల సందర్భంగా కోరడం, ఆశించడం, సమంజసం, న్యాయ, ధర్మం.
చుట్టూరా ఆవరించుకున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్నదీపాన్నయినా వెలిగించడం మంచిది - యువభారతి.
అంత కడివెడు పాలపై ఒక్కింత మీగడ పేరినట్లుగా, మనకు మిగులు గతము లోపలి మంచి, అదియే సంప్రదాయం. - సి. నారాయణరెడ్డి.
ఎంత సముద్రము మీద ఎగిరినను, పక్షి రాత్రి గూటికి చేరును. ఇది జాతీయత. ఇది సంప్రదాయం. - విశ్వనాధ సత్యనారాయణ గారు.
జాతీయతకు, సంప్రదాయానికి, వెలుగునిచ్చే దీపానికి, ప్రతీక - మన జానపదులు, జ్ౙానపదులు, జ్ణానవిధులు.
ఎన్నో జనపదాలు, ఎందరో జానపదులు, సమస్త సంపదకు, సంపన్నతకు సవినయప్రణామాలు. సహస్రనామార్చనలు.
ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా - ఈ అజరామమైన కళారాజాన్ని, విశిష్టమైన కళాకారుల్ని తెలుగురథం శతసహస్ర అభినందనలని తెలియజేస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
నాడు - ఈనాడు
నాడు - ఈనాడు
ఆగష్ట్ 21 ప్రత్యేకతలు
ప్రముఖ సంఘటనలు
1. 1888 - అమెరికాలో మొట్టమొదటి సారిగా, అంకెలను కూడిక చేసే యంత్రం (ఏడింగ్ కాలికులేటర్) విలియాం సెవార్డ్ బర్రోస్ అన్న వ్యక్తికి నమూనా హక్కులను కేటాయించడం జరిగింది.
2. 1911`- విశ్వవిఖ్యాత కళాఖండం - మొనాలిసా చిత్రం ను ప్రదర్శనశాలలోని ఉద్యోగి 'లవ్రే' దొంగిలించాడు.
మరణం
1. 1995 - ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, నోబెల్ బహుమాన గ్రహీత.
2. 2006 - విశ్వవిఖ్యాత 'షెహనాయీ సంగీత కళాకారుడు - పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ (అసలు పేరు, కమారుద్దీన్) తన సంగీత కళాకారుడు తనువు చాలించాడు.
Wednesday, August 20, 2008
నాడు - ఈనాడు
అమృత రాజీవుడు - భారతీయ యువతకు గుండె చప్పుడు
రాజీవగాంధి జయంతి - 20 ఆగష్ట్ (1944)
ప్రజాస్వామ్యానికి ప్రజ్ౙాన ప్రతిభాప్రతినిధిప్రజాక్షేమం కోసం ప్రజానీకం ఎన్నుకున్న ప్రజాధికారానికి కార్యవిధానరూపం ప్రజాస్వామ్యం. ఈ విధానం విభిన్న అభిప్రాయాలకు ఆహ్వానం పలుకుతుంది. వాటిని ఆదరిస్తుంది. ముందు వెనుకలు పరిశీలించి నిర్మాణాత్మక దౄక్పథం ఈ ప్రజాస్వామ్య విధానంలో ఉన్నందువల్లనే ఆధునిక ప్రపంచం దీనిని అంతగా సమాదరిస్తూ వస్తున్నది. ఈ విధానంలో పాశవికతకు చోటుండదు. దానవతకు తావుండదు. హింసకూ రక్తపాతానికి దౌర్జన్యానికీ ఏ రూపంలోనూ అవకాశం ఉండదు. ఉండకూడదు. ప్రపంచ కళ్యాణాన్ని కాంక్షించే ప్రతి మనిషిది; ప్రతి మహర్షిది. ప్రతి మేధావిది. ప్రతి ప్రవక్తది. ప్రపంచ మేధావుల,మనీషుల ఆకాంక్ష, ఆశయము వుంటాయి. వుండాలి. యిది ప్రజాస్వామ్యత రూపొందించుకున్న శాస్త్రం, వేదధోరణి. ఈ మహత్తర ప్రజాస్వామ్యానికి ప్రతినిధి, నేత, పరమాదరణీయమూర్తి, భారతప్రధానుల్లో ప్రముఖుడు, రాజీవగాంధి.
మూగవోయిన ప్రజాస్వామ్యమూర్తిప్రజాస్వామ్యం సౄష్టించుకున్న శాస్త్రం, నిబద్ధత సవ్యంగా సాధారణంగా నడిచేశక్తి. కాని, సవ్యం వుంటే అపసవ్యం, సమంజసత్వం వుంటే అసమంజసత్వం, రహదారుల పక్కనే పక్కదారులు, మళ్ళింపులు తొక్కడం జరుగుతుంది. అవే, ఈనాడు అక్కడక్కడ ప్రపంచంలో హింసా నినాదాలు, తీవ్రవాదాలు, అతిధోరణులకు ఆలవాలమై, అపూర్వమైన విద్రోహానికి, తీవ్రవాదానికి, ప్రజాసంక్షోభానికి దారితేస్తూ, ప్రజాస్వామ్య కల్పవౄక్షాన్నే సమూలంగా పెరికి వేయడానికి ప్రయత్నాలు పలువిధాలుగా సాగే ప్రయత్నాలు జరగడమే కాదు. విద్రోహుల చర్యలు వినాశానికి దారితీస్తున్నాయి. ఈ తీవ్రవాదం క్రౌర్యానికి ఎందరో బలైపోతున్నారు. తీవ్రవాదానికి పరాకాష్టగా, యిందిరాగాంధే కాదు, ఆమె ప్రియతనయుడు రాజీవ్ గాంధి కూడ ఘోరఘాతుకానికి తనువు చాలించాడు. మహిళ, మాతౄమూర్తికి మారుపేరైన జనని గర్భపొత్తిళ్ళపైన చుట్టుకున్న ఆ మారణాయుధం దారుణానికి దారితీసిన వ్యక్తి కూడ మహిళే. అనుకున్నవారిని అంతంచేసే ప్రయత్నంలో తాను కన్నుమూసినా సరే అన్న అభావంతో ఏర్పాటైన ఆత్మహత్యదళాల్లోభాగంగా 'తానూ అన్న మహిళ ద్వారా చేయించిన ఘాతుకం. ఫలితంగా భారతయువశక్తి, ప్రజాస్వామ్యప్రతినిధి అయిన రాజీవగాంధి హత్యచేయబడ్దాడు.
విమానంతోపాటు దేశాన్నీ నడిపాడు - ప్రతిభారధసారధియానంఫిరోజుగాంధి - యిందిరాగాంధి లకు ముంబాయిలో 1944 ఆగష్టు 20 న జన్మించిన రాజీవ్, కేంబ్రిడ్జ్ లో చదువుకునే రోజుల్లో ఇటాలియన్ మహిళ సోనియా మైనో తో పరిచయం, ప్రణయం, పరిణయానికి దారితీసాయి. చిన్నతనంనుంచి యాంత్రికవిషయాలపై శ్రద్ధాసక్తులను చుంపించిన అతని మేధస్సు వినీలాకాశంలో విహంగంలా విహరించే విమానాలపై పోయింది. ఫలితంగా విమానాలను నడిపించే వౄత్తిచేపట్తాడు. కించిత్తుకూడ రాజకీయాలపై ఆసక్తిలేని రాజీవ్ కు తన సోదరుడు సంజయ్ అకాలమరణం, కుటుంబంలోనేకాక, తనజీవితంలో కూడ ఊహించని పరిణామం, మార్పు తెచ్చింది. ఫలితంగా రాజకీయరధసారధి అవ్వక తప్పలేదు. ఫలితంగా ఉత్తరప్రదేశ్ లోని అమెథికి పార్లమెంటుప్రతినిధిగా ప్రవేశించాడు. తల్లి యిందిరాగాంధి మరణాంతరం, కాంగ్రేసు సాధారణకార్యదర్శి(1983)గాను, 1984 అక్టోబర్ 31న తల్లి, ప్రధానమంత్రి యిందిరాగాంధి, తన రక్షకభటునిచేతిలోనే హత్యగావించబడ్డడం వల్ల, రాజీవ్ గాంధి దేశప్రధానిగా బాధ్యతలను స్వీకరించి, అత్యధికబలంతో విజయలక్ష్మిని వరించడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్దప్రజాస్వామ్యదేశమైన భారతదేశానికి పిన్నప్రాయపు ప్రధానమంత్రిగా, స్వచ్చతమమైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు. ఆధునికభావాలు, నవనవోన్మేషశైలిలో పరిపాలనావిధానాలు, హౄదయవాది, మనసున్నమనిషి, మహామనీషిగా, ప్రఖ్యాతుడైనాడు. పండుముసలిరూపంలో పాతుకుపోయిన అధికారరాజకీయశక్తులకు తిలోదకాలిచ్చి, యువశక్తికి ప్రాతినిధ్యం యిచ్చిన వర్ధమాన నాయకుడు. విద్యావిధానం, పారిశ్రామికీకరణం, శాస్త్ర-సాంకేతికరంగాలకు యిచ్చిన ప్రాధాన్యత, సమాచారవిప్లవపంధాధోరణులు, వయోజనవిద్య, గ్రామీణత్రాగునీటిపధకాలు, శిశుసంరక్షణారోగ్యపధకాలు, వ్యవసాయ-పశుసంరక్షణపధకాలు, దేశీయసాంకేతికపరిశోధనావిధానాలు, భారతీయతకు అనువైన ప్రణాలికలను నిర్మాణం చేసుకుని, సఫలీకరణంతో అమలుచేయడం జరిగింది, రాజీవ్ నాయకత్వంలోనే అని వేరే చెప్పనక్కరలేదు. రాజకీయంగా, పంజాబు, అస్సాం, మిజోరాం, గూర్ఖాలాండ్, పశ్చిమబెంగాలు ప్రాంతాల్లోనెలకొన్న అశాంతి, భద్రతారాహిత్యం, రక్షణలేని పరిస్థితుల్నించి, శాంతిదాయక వాతావరణాన్ని తెచ్చిన ఘనత రాజీవుడిదే. అనేక విదేశాలతో, భారతీయ రాజకీయ, ఆర్ధిక, సాంస్కౄతిక సంబంధాల్ని నెలకొల్పి, మెరుగుపరచిన నైపుణ్యపుపాలనకు నాయకత్వం వహించాడు. అలీనవుద్యమానికి 1986 లో భారతదేశం నాయకత్వం వహించడానికి రాజీవే బాధ్యుడు. పాలస్తీనా, దక్షిణాఫ్రికా విషయాలు, ఆర్ధికధౄఢత్వనికి ప్రత్యేకనిధిని ఏర్పాటుచేయడం, మేల్-మాల్దీవులకు సైన్యసహాయం, శ్రీలంకలో వికౄతరూపం దాల్చిన సమస్యకు తనదైన శైలిలో పరిష్కారాన్ని చూపడం, అమెరికా, పాకిస్తాను దేశాల చోద్యానికి, హిందూమహాసముద్రప్రాంతంలోని దేశాలపై అమెరికా, పాకిస్తాను దేశాలు కల్పించుకోవడంలో అంతంచేయడం, లాంటి చర్యలు రాజకీయరంగంలో చకితుల్ని చేసింది.
ఎన్నికల తంతు , ప్రచారం తెచ్చిన విషాదంతర్వాత దశలో కొన్ని సమస్యలను తేవడం, రాజీవుని పరిపాలనలో వచ్చిన అసమ్మతివాదం, కొంచెం ఆయనకు యిబ్బందులు రావడం, 1989 ఎన్నికల్లో కోల్పోయిన ఆధిక్యత, ప్రతిపక్షపుపాత్ర వహించాడు. విపిసింగ్, చంద్రశేఖర్ ల పరిపాలన, తర్వాత వచ్చిన 1991 ఎన్నికల్లో, రాజీవ్ యిచ్చిన 'సుస్థిరత్వం' నినాదం , రోజురోజుకి ప్రబలుతున్న విశ్వాసంతో చేరుకున్న చిట్టచివరిదశలో కొనసాగుతున్న ప్రచారరధం తమిళనాడులో, రధసారధి రాజీవ్ తోపాటు క్రుంగిపోవడం, జీవితాన్ని కోల్పోవడం, ఒకేరోజు, క్షణికం లో జరిగిపోయాయి. జీవితం క్షణభంగురం, బుద్బుదప్రాయం అన్నది రాజీవ్ గాంధి విషయంలో నిజమని నిరూపణ అయింది. శ్రీలంకప్రభుత్వపు దారుణవిధానాలతో తీవ్ర అశ్రద్ధలకు గురవుతున్నందుకు తమిళపులులు నిశ్శబ్దపుసవ్వడితో గాండ్రించారు. అదౄశ్యకోరలుసాచారు. ఆ విషపుకోరలను రాజీవుని చాతిలో దించారు. అంతటితో ఆగుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆమనసు మూగపోయింది. తనయుడి రాహుల్ చేతులమీదుగా హస్తినాపురి వీరభూమిలో అంత్యక్రియలు జరిగాయి. రాజీవగాంధి సేవలకు గుర్తింపుగా, అత్యున్నతసత్కారం, 'భారతరత్నా మరణాంతరం ప్రదానం చేయబడింది. రాజీవుని సేవలకు స్మౄత్యర్ధం, నివాళిగా, అనేక స్మారకసంస్థలు, సమాజాభివౄద్ధికి, శాస్త్ర, సాంకేతిక, కళ, సంస్కౄతి, ఆరోగ్యం, వైద్య రంగాల్లో సేవలనందించడానికి అనేక ప్రయత్నాలు నేటికీ సత్ఫలితాలను అందజేYఅడం సంతోషదాయకం.
అది ఒక కాళరాత్రి !!!నేడు పదిహేడేళ్ళ ప్రాయం నింపుకున్న దుర్ఘటన అది. ఆ రోజు 21 మే 1991. దక్షిణభారతదేశపు ప్రధాన నగరం చెన్నైకి దగ్గరగా వున్న ప్రాంతం, శ్రీపెరంబదూర్. ప్రజాస్వామ్యవ్యవస్థకు పున:ప్రతిష్ట చేయబోయే కార్యకలాపానికి తనవంతు బాధ్యతను నిర్వర్తించే ప్రయత్నంలో, ఎన్నికలప్రచారంలో భాగంగా, దేశపు అతిపెద్ద, దీర్ఘకాలంపాటు ఈదేశాన్నిపరిపాలించిన రాజకీయ సంస్థకు, కుటుంబానికి ప్రతినిధి, వారసుడు. భారతీయయువశక్తికి ప్రజ్ౙానసంకేతం, ప్రతిభాదర్పణం. ఆయనే భారతీయ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కి మనుమడు. ప్రతిభాప్రధాని యిందిరాగాంధికి ప్రియతనయుడు. ఆయనే రాజీవగాంధి. ఆ రోజు ఎన్నికలప్రచారవేదికకు తరలి వెళ్ళాలన్న ఆయన సంకల్పం నెరవేరనే లేదు. ఆ ప్రయత్నంలోనే జరగకూడనిది జరిగిపోయింది. అంతా మాయ, భ్రమ. క్షణికం. ఆనాటి సంధ్యాసమయం అసమంజసం. అమానుషం. ఆ నిశీధకాలం నీతి బాహ్యమైన, నీచమైన రాతియుగపుచర్యకు దారితీసింది.
మౄతరాజీవునికి నివాళి
రాజీవగాంధి హత్యను గర్హిస్తూ, ఖండిస్తూ .. సహజకవి శ్రీ మల్లెమాలగారు - అమౄతరాజీవం అన్న కవితాఖండికలో - అది ... ఒక కాళరాత్రి, అఖిలావని గుండెల నొక్కసారిగా కుదిపినరాత్రి, తారకలు కుప్పగ కూలిన రాత్రి, భారతాభ్యుదయము నష్టకష్టముల ముంచి హసించిన రాత్రి, కుట్రతో చెదలు మహాగ్నిఖండమును చేకొని మ్రింగినరాత్రి అక్కటా! అని అవాక్కయ్యారు. ఈ మచ్చ మనకు ఎట్లు మనకు మాసిపోవును అని ప్రతి భారతీయుడు క్రుంగినరాత్రి. కేవలం ఒక శరీరం కాదు, ఊపిరికాదు, ఆ ఘాతుకానికి గురయ్యింది Yఆవత్తు భారతదేశపు ప్రజాస్వామ్యవ్యవస్థ క్రుంగిపోయిన రాత్రి. జాతిజీవనరాగాలలో పంచమస్వరాలను వినిపించచేసిన విలక్షణమూర్తి గొంతుక ఆరోజున పలుకలేకపోయింది. జాతి మొత్తం మూగపోయింది.
రాజీతనం లేని రాజీవుడు భారత రాజకీయ చరిత్ర, వ్యవస్థ వున్నంతకాలం సుస్మరణీయుడు, అమరజీవుడు. ఈ వ్యాసం, తిరిగి మల్లెమాల ఖండికతో - ఇట్టి ఘోరకలిని ఇంకొక్క క్షణమైన సాగనీయమంచు శపథమూని, ఎల్ల ప్రజలు హింసకెదురొడ్డి పోరాడి దేశమాత బాధ తీర్పవలయు. లేడు రాజీవుడికమీద రాడటన్న చింత యేటికి? లోకమున్నంత వరకు అమౄతరాజీవమై లక్షలాది ప్రజల మానస సరోవరమ్ముల మనుచునుండూ అని భరతవాక్యంతో స్వస్తిపలకడం సముచితం, సమంజసం. ఓం శాంతి:
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
Tuesday, August 19, 2008
నాడు - ఈనాడు
ఆగష్ట్ 19 ప్రత్యేకతలు
ప్రముఖ నటీమణి - యిల్లియానా డిక్రజ్ పుట్టినరోజు (1987)
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం - ఛాయాచిత్రకళ విశ్వంభర విన్యాసం
కళలన్నీ సౄజనాత్మకాలు
మహాసౌందర్యపు మహావ్యక్తీకరణం కళలోనే సాధ్యం అన్నాడు ఒక మహానుభావుడు. అనుభూతిని ఆలోచనలకి ఘనీభవింపజేసి ఒకరూపంలో పొదగడమే కళ లక్ష్యం అని కూడ చాలామంది భావిస్తారు. అందుకే మన శాస్త్రాలు కళలను విస్తారంగా విభజించారు. అన్ని కళలూ ప్రకౄతికి అనుకరణలే. అటువంటి ప్రకౄతి తత్వాన్ని, నైజాన్ని కూడ బంధించగలిగి, మనం అనుకున్నప్పుడు దర్శనం చేసు చేసుకునేలా భద్రపరచుకునే కళ - ఫొటోగ్రఫీ. మానవుని సౄజనాత్మక ప్రతిభ సుందరరూపంలో వ్యక్తమయ్యేది కళల్లోనే. అటువంటి సౄజన, ఫొటోగ్రఫీ కళ లో మెండు గా కాంతివంతంగా, రంగులహంగులతో విరాజిల్లుతోంది.
ఫొటోగ్రఫీ అవతరణం
ఫొటోగ్రఫీ - పదం స్వతహగా, గ్రీక్ భాష నుంచి, ఫొటొ (కాంతి), గ్రాఫిస్ (చిత్రం) పదాలనుంచి వచ్చింది. అంటే వెలుగు, కాంతితో కూడిన చిత్రం అని అర్ధం చెప్పాలి. తెలుగులో ఛాయాచిత్రకళగా దినదిన ప్రవర్ధమానం అయి, కళల్లో చిత్రం, ఛాయాచిత్రకళగా రూపుదిద్దుకుని, సమాజంలో అనివార్యకళగా తిష్ఠ వేసుకుని కూర్చుంది. ఈ కళ ప్రారంభం యూరోపు లో అంకురించిందని చెప్పాలి. 19వ శ. చివరిపాదంలో అంకురించిన ఈ కళ తొలిదశల్లో గ్లాస్ ప్లేట్లు, తర్వాత ఫిల్మ్ ప్లేట్ల ఉపయోగంనుంచి క్రమేపీ ఫిల్మ్ రోల్స్ చుట్టలుగా దర్శనం యిచ్చాయి. వాటికి కూడ కాలం చెల్లి, డిజిటల్, చిప్ ల సాంకేతిక విప్లవయుగంలో అల్పంలో అనల్పంగా ప్రతీరంగం వ్యాపిస్తోంది. ఫొటోగ్రఫి కూడ ఏం తక్కువ కాదు. యిక వెలుగు, మెరుపు, కాంతి విషయానికొస్తే, పూర్వం మీథేన్ రసాయనద్రవంతో పెద్దగా మంటలవెలుగు సహాయంతో చిత్రాలను తీసేవారట. మంటలు, బల్బులుగాను, ఫ్లాషులుగాను మారి, ఆధునికత, సాంకేతికతల సమన్వయ సహకారాలతో, అధ్బుతాలను సౄష్టించడమే కాక, తీసిన చిత్రాలను యింటర్నెట్, వెబ్ ల మాధ్యమంతో చిరస్థాయిగా భద్రపరచుకోగలగడం, విశ్వవ్యాప్తంగా జరుగుతున్న అన్Yఊహ్య పరిణామం. చిన్నపాటి డిజిటల్ కెమేరాలనుంచి, చిప్ ల ద్వారా విరాజిల్లుతున్న ఈ ఛాయాచిత్రకళ కళలకే కళగా వ్యాప్తిచెందుతూండడం శుభపరిణామం గా చెప్పుకోవచ్చు. కాలాన్ని, చరిత్రని, భూగోళాంతరాళాల్లోని వింతల్ని, విడ్డూరాల్ని, ఈ కళామాధ్యమం ద్వారా దర్శనీయం చేస్తున్న వైనం అభినందనీయం.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
1800 ప్రాంతంలో ఫ్రాన్స్ నివాసి, లూయిస్ జాక్వెస్ మాండె దాగురే అన్న చిత్రకళాకారుడి ద్వారా ఆనాటి సుసంపన్న కుటుంబాల్లోని వ్యక్తుల చిత్రాలను తీయించుకునేవారట. 1827 లో శాస్త్రవేత్త, జోసెఫ్ నేప్సే, జెల్ బాల్స్ ద్వారా యింటిలోని పావురాలగూడుని చిత్రించడం, ఎనిమిది గంటలు కాలాన్ని వినియేగించినా, ఈ అనుభూతికి, అనుభవానికి, నీప్సే హీలియోగ్రఫీ అని పేరులోకి వచ్చింది. వీటిని ప్రేరణకు తీసుకుని, దాగురే - నీప్సేల భాగస్వామ్యంలో అనేక ప్రయోగాలు జరగడం, ఛాయాచిత్రకళను ఆద్యంగా ఒక రూపునివ్వడం జరిగింది. ఫ్రెంచి ప్రభుత్వం నుంచి అనుమతి హక్కుల్ని పొందడం, ప్రతీ ఏడాది 19 ఆగష్టు, 1839 నుంచి సంప్రదాయబద్ధంగా ఉత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూనేవుంది. దీనితోపాటు, ప్రపంచవ్యాప్తంగా, పిన్ హోల్ ఫొటోగ్రఫీ విషయంలో కూడ ఏప్రిల్ నెల, చివరి ఆదివారంనాడు జరుపుకోవడం కూడ సదాచారంగా వస్తూంది.
చిత్రాల సౄష్టి - ప్రపంచ పున:సౄష్టి
చిత్రాలను సౄష్టించడం, సేకరించడం, యావత్తు ప్రపంచాన్నే సేకరించడం, పున:సౄష్టి చేయడం అని, ప్రముఖుడు సుసన్ సోంటగ్, ఫొటోగ్రఫీ కళ పై తన పుస్తకం లో అంటాడు. కవిత్వం, చిత్రకళ, నాటకాలు, శిల్పకళలు కధనాన్ని వ్యక్తంచేస్తాయి. యివి ప్రాధమికంగా లలితకళల కోవలోకి చెప్పారు. ఛాయాచిత్రకళని కూడ కళ క్రింద చాలా ఆలస్యంగానే భావించారని చెప్పాలి. సకల జీవరాసులు, ప్రత్యేకంగా మానవుని జీవితంలోని వివిధదశల్ని, జన్మనివ్వడం నుంచి, మరణం వరకు, చిత్రీకరణం, భద్రపరచుకోవడం, కళను భద్రంగా పరిరకించుకోవడం లో భాగమనే చెప్పాలి. ఛాయచిత్రకళతో, సమాజాభ్యుదయానికి మరింత మేలు జరుగుతోందని నిర్ధారణ చేయవచ్చు.
ఎందరో కళాకారులు, అందరికీ వందనాలు
మనకున్న ప్రముఖ కళాకారుల్లో, రఘురాయ్, శరద్ హక్సర్ లాంటి వారు అనేకమంది ఈ కళారంగంలో నిష్ణాతులయి, ప్రపంచానికి ఒక సుందరమైన సవర్ణానుభూతిని అందించడంలో చరిత్రను సౄష్టిస్తునేవున్నారు. మన ప్రసార మాధ్యమంలోను, చిత్రసీమారంగంలోను కూడ అనేకమంది తన వౄత్తుల్ని, ప్రవౄత్తుల్ని రంగరించి, నభూతో న భవిష్యతి అన్న సూక్తిని సత్యం చేస్తున్నారు. నితిన్ బోస్, శైలెన్ బోసు, కమల్ ఘోష్, పి.యల్.రాయ్, మార్కస్ బారెట్లే, పి.శ్రీధర్, వి.యన్.రెడ్డి, రహమాన్, సి.నాగేశ్వరరావు, రవికాంత్ నగాయిచ్, వి.యస్.ఆర్.స్వామి, విన్సెంట్, నందమూరి మోహనకౄష్ణ, ఎందరో, ఛాయాచిత్రకళలో సేవ చేస్తున్నారు. చిత్రసీమలో కూడ అనేకమైన పాటలు, మాటలు, పాత్రలు, కెమేరాల చుట్టూ, ఫొటోగ్రఫీ వౄత్తి, ప్రవౄత్తిలను చిత్రీకరిస్తూ, ప్రశంసలను పొందడం కూడ జరిగింది.
చిత్రాలమయం - మన జైహింద్ సత్యం
కదలని బొమ్మలపై తనదైన శైలిలో కధాకమామిషుల్ని సౄష్టించిన, మన సత్యంగా, జైహింద్ సత్యం గారిని ఈ సందర్భంగా ప్రస్తావించి తీరాలి. స్టిల్ ఫొటోగ్రఫీ పై అపార పరిశోధనలను చేసి, 60 రూపాయల చౌకబారు కెమేరాతో అధ్బుతమైన ఫొటోలు తీయడం, ఆయన మంత్రపుపెట్టెలో బంధించని నటీనటులు లేరనేచెప్పడం, అందరకూ నచ్చేట్లు, మెచ్చేట్లు, చిత్రాలను తీయగలగడం వల్లనే, జైహింద్ సత్యం, మన సత్యంగా మారారు. అందుకే ఆయన చిత్రాలను తీయడం, ఒక యాగమని, తపస్సు అనే భావించాలంటారు. స్టిల్ సత్యం గా చిత్రసీమలో చిరస్థాయిగా పేరు తెచ్చుకున్నారు.
ఫొటో యితివౄత్తంగా నాటిక
ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకౄష్ణ, మనస్తత్వాలు అనే నాటికలో, నౌకరు ఫొటో స్టూడియో నుంచి పరాయి స్త్రీ ఫొటోని తస్కరించి, తనుపనిచేస్తున్న కుటుంబం లోని వివిధ వ్యక్తుల జీవితాల్లో ఎన్నెన్నె రకాల అనుమానాలను, కుటుంబంలో తాత్కాలికమైనా, కలహ వాతావరణాన్ని సౄష్టించిందో రసరమ్యంగా సౄష్టించారు. చక్కని హాస్య, చమత్కౄతులతో సంభాషణల్ని గుప్పడం కూడ, మనోభావాల్ని ఆవిష్కరించడం కూడ జరిగింది.
ఎవరి ఫొటోలైనా, చచ్చిపోయిన తర్వాతే, పేపర్లో పడతాయట, అన్న చురకల్ని కూడ మనకు రచయితలు వివరించిన సందర్భాలు అనేకం.
మధుర జ్ౙాపకాల్ని, దౄశ్యకావ్యాల్ని సౄష్టించగలిగే, 'ఫొటోగ్రఫీ' కళ చెందిన అభివౄద్ధి పరంపర సాగిన తీరు యిలా వుంది:
- హెన్రీ షూల్జీ, 1725లో సొల్యూషన్ ప్లేట్ పై శాశ్వతంగా ఫొటోలను బంధించే పద్ధతిని ప్రారంభించాడు. యిదే జార్జ్ ఈష్ట్ మన్ రీల్ గా పేరుపొందింది.- జోసెఫ్ నైసిఫోరా నీప్స్ (ఫ్రాన్స్) 1826 లోనే తొలిసారిగా ఫొటోని తీసినా, ఎక్కువకాలం నిలవలేదు.- యల్.యం.జె.డాగ్రే (ఫ్రాన్స్) 1939, ఆగష్ట్ 19 న ఫొటోగ్రఫీ విధానాన్ని కనుగొన్నాడు.- అదే రోజు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం సంప్రదాయంగా మారింది.- జార్జి ఈస్ట్మన్ కొడక్ (న్యూయార్క్) 1888 లో నలుపు-తెలుపు రీలును కనుగొన్నాడు.- దేశంలో కలర్ రీల్ 1950 ల్లో పరిచయం.- డిజిటల్ కెమెరాలు 1990 లో కనుగొనబడ్డాయి; కానీ, కేవలం సంపన్న దేశాలే వాటిని వినియోగించుకున్నాయి.- 1998 నుంచి భారతదేశంలోకి డిజిటల్ కెమేరా విప్లవం ప్రారంభమైంది.
ప్రపంచ ఛాయాచిత్రకళోత్సవం సందర్భంగా, కళాకారులందరికీ, అభినందనలని, ప్రోత్సాహాలను అందజేయడం, ఈ రోజు ప్రత్యేకంగా అంకితమవ్వడం పట్ల ఆనందానుభూతుల్ని ప్రకటించడం, కూడ ఔచిత్యం, సమంజసం.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం - ఆగష్టు 19
కళలన్నీ సౄజనాత్మకాలు
మహాసౌందర్యపు మహావ్యక్తీకరణం కళలోనే సాధ్యం అన్నాడు ఒక మహానుభావుడు. అనుభూతిని ఆలోచనలకి ఘనీభవింపజేసి ఒకరూపంలో పొదగడమే కళ లక్ష్యం అని కూడ చాలామంది భావిస్తారు. అందుకే మన శాస్త్రాలు కళలను విస్తారంగా విభజించారు. అన్ని కళలూ ప్రకౄతికి అనుకరణలే. అటువంటి ప్రకౄతి తత్వాన్ని, నైజాన్ని కూడ బంధించగలిగి, మనం అనుకున్నప్పుడు దర్శనం చేసు చేసుకునేలా భద్రపరచుకునే కళ - ఫొటోగ్రఫీ. మానవుని సౄజనాత్మక ప్రతిభ సుందరరూపంలో వ్యక్తమయ్యేది కళల్లోనే. అటువంటి సౄజన, ఫొటోగ్రఫీ కళ లో మెండు గా కాంతివంతంగా, రంగులహంగులతో విరాజిల్లుతోంది.
ఫొటోగ్రఫీ అవతరణం
ఫొటోగ్రఫీ - పదం స్వతహగా, గ్రీక్ భాష నుంచి, ఫొటొ (కాంతి), గ్రాఫిస్ (చిత్రం) పదాలనుంచి వచ్చింది. అంటే వెలుగు, కాంతితో కూడిన చిత్రం అని అర్ధం చెప్పాలి. తెలుగులో ఛాయాచిత్రకళగా దినదిన ప్రవర్ధమానం అయి, కళల్లో చిత్రం, ఛాయాచిత్రకళగా రూపుదిద్దుకుని, సమాజంలో అనివార్యకళగా తిష్ఠ వేసుకుని కూర్చుంది. ఈ కళ ప్రారంభం యూరోపు లో అంకురించిందని చెప్పాలి. 19వ శ. చివరిపాదంలో అంకురించిన ఈ కళ తొలిదశల్లో గ్లాస్ ప్లేట్లు, తర్వాత ఫిల్మ్ ప్లేట్ల ఉపయోగంనుంచి క్రమేపీ ఫిల్మ్ రోల్స్ చుట్టలుగా దర్శనం యిచ్చాయి. వాటికి కూడ కాలం చెల్లి, డిజిటల్, చిప్ ల సాంకేతిక విప్లవయుగంలో అల్పంలో అనల్పంగా ప్రతీరంగం వ్యాపిస్తోంది. ఫొటోగ్రఫి కూడ ఏం తక్కువ కాదు. యిక వెలుగు, మెరుపు, కాంతి విషయానికొస్తే, పూర్వం మీథేన్ రసాయనద్రవంతో పెద్దగా మంటలవెలుగు సహాయంతో చిత్రాలను తీసేవారట. మంటలు, బల్బులుగాను, ఫ్లాషులుగాను మారి, ఆధునికత, సాంకేతికతల సమన్వయ సహకారాలతో, అధ్బుతాలను సౄష్టించడమే కాక, తీసిన చిత్రాలను యింటర్నెట్, వెబ్ ల మాధ్యమంతో చిరస్థాయిగా భద్రపరచుకోగలగడం, విశ్వవ్యాప్తంగా జరుగుతున్న అన్Yఊహ్య పరిణామం. చిన్నపాటి డిజిటల్ కెమేరాలనుంచి, చిప్ ల ద్వారా విరాజిల్లుతున్న ఈ ఛాయాచిత్రకళ కళలకే కళగా వ్యాప్తిచెందుతూండడం శుభపరిణామం గా చెప్పుకోవచ్చు. కాలాన్ని, చరిత్రని, భూగోళాంతరాళాల్లోని వింతల్ని, విడ్డూరాల్ని, ఈ కళామాధ్యమం ద్వారా దర్శనీయం చేస్తున్న వైనం అభినందనీయం.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
1800 ప్రాంతంలో ఫ్రాన్స్ నివాసి, లూయిస్ జాక్వెస్ మాండె దాగురే అన్న చిత్రకళాకారుడి ద్వారా ఆనాటి సుసంపన్న కుటుంబాల్లోని వ్యక్తుల చిత్రాలను తీయించుకునేవారట. 1827 లో శాస్త్రవేత్త, జోసెఫ్ నేప్సే, జెల్ బాల్స్ ద్వారా యింటిలోని పావురాలగూడుని చిత్రించడం, ఎనిమిది గంటలు కాలాన్ని వినియేగించినా, ఈ అనుభూతికి, అనుభవానికి, నీప్సే హీలియోగ్రఫీ అని పేరులోకి వచ్చింది. వీటిని ప్రేరణకు తీసుకుని, దాగురే - నీప్సేల భాగస్వామ్యంలో అనేక ప్రయోగాలు జరగడం, ఛాయాచిత్రకళను ఆద్యంగా ఒక రూపునివ్వడం జరిగింది. ఫ్రెంచి ప్రభుత్వం నుంచి అనుమతి హక్కుల్ని పొందడం, ప్రతీ ఏడాది 19 ఆగష్టు, 1839 నుంచి సంప్రదాయబద్ధంగా ఉత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూనేవుంది. దీనితోపాటు, ప్రపంచవ్యాప్తంగా, పిన్ హోల్ ఫొటోగ్రఫీ విషయంలో కూడ ఏప్రిల్ నెల, చివరి ఆదివారంనాడు జరుపుకోవడం కూడ సదాచారంగా వస్తూంది.
చిత్రాల సౄష్టి - ప్రపంచ పున:సౄష్టి
చిత్రాలను సౄష్టించడం, సేకరించడం, యావత్తు ప్రపంచాన్నే సేకరించడం, పున:సౄష్టి చేయడం అని, ప్రముఖుడు సుసన్ సోంటగ్, ఫొటోగ్రఫీ కళ పై తన పుస్తకం లో అంటాడు. కవిత్వం, చిత్రకళ, నాటకాలు, శిల్పకళలు కధనాన్ని వ్యక్తంచేస్తాయి. యివి ప్రాధమికంగా లలితకళల కోవలోకి చెప్పారు. ఛాయాచిత్రకళని కూడ కళ క్రింద చాలా ఆలస్యంగానే భావించారని చెప్పాలి. సకల జీవరాసులు, ప్రత్యేకంగా మానవుని జీవితంలోని వివిధదశల్ని, జన్మనివ్వడం నుంచి, మరణం వరకు, చిత్రీకరణం, భద్రపరచుకోవడం, కళను భద్రంగా పరిరకించుకోవడం లో భాగమనే చెప్పాలి. ఛాయచిత్రకళతో, సమాజాభ్యుదయానికి మరింత మేలు జరుగుతోందని నిర్ధారణ చేయవచ్చు.
ఎందరో కళాకారులు, అందరికీ వందనాలు
మనకున్న ప్రముఖ కళాకారుల్లో, రఘురాయ్, శరద్ హక్సర్ లాంటి వారు అనేకమంది ఈ కళారంగంలో నిష్ణాతులయి, ప్రపంచానికి ఒక సుందరమైన సవర్ణానుభూతిని అందించడంలో చరిత్రను సౄష్టిస్తునేవున్నారు. మన ప్రసార మాధ్యమంలోను, చిత్రసీమారంగంలోను కూడ అనేకమంది తన వౄత్తుల్ని, ప్రవౄత్తుల్ని రంగరించి, నభూతో న భవిష్యతి అన్న సూక్తిని సత్యం చేస్తున్నారు. నితిన్ బోస్, శైలెన్ బోసు, కమల్ ఘోష్, పి.యల్.రాయ్, మార్కస్ బారెట్లే, పి.శ్రీధర్, వి.యన్.రెడ్డి, రహమాన్, సి.నాగేశ్వరరావు, రవికాంత్ నగాయిచ్, వి.యస్.ఆర్.స్వామి, విన్సెంట్, నందమూరి మోహనకౄష్ణ, ఎందరో, ఛాయాచిత్రకళలో సేవ చేస్తున్నారు. చిత్రసీమలో కూడ అనేకమైన పాటలు, మాటలు, పాత్రలు, కెమేరాల చుట్టూ, ఫొటోగ్రఫీ వౄత్తి, ప్రవౄత్తిలను చిత్రీకరిస్తూ, ప్రశంసలను పొందడం కూడ జరిగింది.
చిత్రాలమయం - మన జైహింద్ సత్యం
కదలని బొమ్మలపై తనదైన శైలిలో కధాకమామిషుల్ని సౄష్టించిన, మన సత్యంగా, జైహింద్ సత్యం గారిని ఈ సందర్భంగా ప్రస్తావించి తీరాలి. స్టిల్ ఫొటోగ్రఫీ పై అపార పరిశోధనలను చేసి, 60 రూపాయల చౌకబారు కెమేరాతో అధ్బుతమైన ఫొటోలు తీయడం, ఆయన మంత్రపుపెట్టెలో బంధించని నటీనటులు లేరనేచెప్పడం, అందరకూ నచ్చేట్లు, మెచ్చేట్లు, చిత్రాలను తీయగలగడం వల్లనే, జైహింద్ సత్యం, మన సత్యంగా మారారు. అందుకే ఆయన చిత్రాలను తీయడం, ఒక యాగమని, తపస్సు అనే భావించాలంటారు. స్టిల్ సత్యం గా చిత్రసీమలో చిరస్థాయిగా పేరు తెచ్చుకున్నారు.
ఫొటో యితివౄత్తంగా నాటిక
ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకౄష్ణ, మనస్తత్వాలు అనే నాటికలో, నౌకరు ఫొటో స్టూడియో నుంచి పరాయి స్త్రీ ఫొటోని తస్కరించి, తనుపనిచేస్తున్న కుటుంబం లోని వివిధ వ్యక్తుల జీవితాల్లో ఎన్నెన్నె రకాల అనుమానాలను, కుటుంబంలో తాత్కాలికమైనా, కలహ వాతావరణాన్ని సౄష్టించిందో రసరమ్యంగా సౄష్టించారు. చక్కని హాస్య, చమత్కౄతులతో సంభాషణల్ని గుప్పడం కూడ, మనోభావాల్ని ఆవిష్కరించడం కూడ జరిగింది.
ఎవరి ఫొటోలైనా, చచ్చిపోయిన తర్వాతే, పేపర్లో పడతాయట, అన్న చురకల్ని కూడ మనకు రచయితలు వివరించిన సందర్భాలు అనేకం.
మధుర జ్ౙాపకాల్ని, దౄశ్యకావ్యాల్ని సౄష్టించగలిగే, 'ఫొటోగ్రఫీ' కళ చెందిన అభివౄద్ధి పరంపర సాగిన తీరు యిలా వుంది:
- హెన్రీ షూల్జీ, 1725లో సొల్యూషన్ ప్లేట్ పై శాశ్వతంగా ఫొటోలను బంధించే పద్ధతిని ప్రారంభించాడు. యిదే జార్జ్ ఈష్ట్ మన్ రీల్ గా పేరుపొందింది.- జోసెఫ్ నైసిఫోరా నీప్స్ (ఫ్రాన్స్) 1826 లోనే తొలిసారిగా ఫొటోని తీసినా, ఎక్కువకాలం నిలవలేదు.- యల్.యం.జె.డాగ్రే (ఫ్రాన్స్) 1939, ఆగష్ట్ 19 న ఫొటోగ్రఫీ విధానాన్ని కనుగొన్నాడు.- అదే రోజు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం సంప్రదాయంగా మారింది.- జార్జి ఈస్ట్మన్ కొడక్ (న్యూయార్క్) 1888 లో నలుపు-తెలుపు రీలును కనుగొన్నాడు.- దేశంలో కలర్ రీల్ 1950 ల్లో పరిచయం.- డిజిటల్ కెమెరాలు 1990 లో కనుగొనబడ్డాయి; కానీ, కేవలం సంపన్న దేశాలే వాటిని వినియోగించుకున్నాయి.- 1998 నుంచి భారతదేశంలోకి డిజిటల్ కెమేరా విప్లవం ప్రారంభమైంది.
ప్రపంచ ఛాయాచిత్రకళోత్సవం సందర్భంగా, కళాకారులందరికీ, అభినందనలని, ప్రోత్సాహాలను అందజేయడం, ఈ రోజు ప్రత్యేకంగా అంకితమవ్వడం పట్ల ఆనందానుభూతుల్ని ప్రకటించడం, కూడ ఔచిత్యం, సమంజసం.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
Monday, August 18, 2008
నాడు - ఈనాడు
ఆగష్ట్ 18 ప్రత్యేకతలు
జననం
1. ప్రఖ్యాత నటీమణి, ప్రీతి జింఖ్యానీ (1980)
మరణం
1. మంగోలీ సామ్రాజ్యా ఖగన్ - ఝెంగీజ్ ఖాన్ (1227)
2. ప్రముఖ స్వాతంత్ర్యయోధుడు, సుభాష్ చంద్ర బోస్ (1945)
3. ప్రముఖ పాత్రికేయుడు - జి.కె.రెడ్డి (1987)
4. నటీమణి పెర్సిస్ ఖంభట్టా (1998)
Sunday, August 17, 2008
నాడు - ఈనాడు
నాడు - ఈనాడు
ఆగష్టు ౧౭ ప్రత్యేకతలు
పుట్టినరొజు
1. సాహిత్యమ్లో నోబెల్ పురస్కారాన్ని పొందిన వి.యస్. నైపాల్, పశ్చిమ భారతీయుడు. (౧౯౩౨)
౨.ప్రముఖ చలనచిత్ర దర్శకుడు - శంకర్ (౧౯౬౩).
మరణం
ప్రముఖ సాహితీవేత్త - కొడవటిగంటి కుటుంబరావు. (౧౯౮౦)
తెలుగు సాహితీ జగతికి నిరంతర పెద్ద - కొడవటికంటి
మధురోహలు
సాహిత్యం నుంచి ప్రజలను, రాజకీయాలనుంచి సాహిత్యాన్ని, ప్రజలనుంచి రాజకీయాలను రక్షించేందుకు జరిగే ప్రయత్నాలు నాకు ఎల్లప్పుడూ ఉత్తేజం కలిగిస్తాయి.నియంతలధోరణి, నిరుద్యోగం, ఉపాధిని కోల్పోవడం, యుద్ధవాతావరణాది సమస్యలను కళాకారులు కాకుండా కేవలం రాజకీయనాయకులే చర్చించేందుకు అర్హులు అన్న వాదం మూర్ఖులదే అవుతుంది, వారి తెలివితక్కువతనం బయటపడుతుంది. సాహిత్యం ద్వారా లభించే సరియగు మార్గములో జరిగే సామాజికమార్పు అభ్యుదయసాహిత్యమనే చెప్పాలి. ముందుచూపుతోనే మార్పు జరుగుతోందని చెప్పవచ్చు. ప్రకౄతి రహస్యాలని వెల్లడించనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టసుఖాల్ని, ఈతిబాధల్ని కనుగొనలేనిది పరిశోధన కాదు; జీవితంలో వెలుగుకాంతుల్ని ప్రసరించలేనిది సాహిత్యం కాదు. మనం సౄష్టించుకున్న సాహిత్యం సమకాలీన తరానికే పనికిరావాలి - గతతరపు ప్రతినిధులకు సాహితీవిలువలను ప్రస్తుతకాలంలో నిర్ణయించే ప్రయత్నం మనలని మనం మోసం చేసుకోవడమే.
పై అభిప్రాయాలు, ఒక సాహితీయుగానికి ఏకైక ప్రతినిధిగా భావించదగిన సాహితీకొదమసింహం - కొడవటిగంటి కుటుంబరావు గారివి. సాహితీప్రపంచం, ఈ మహానుభావుణ్ణి, ముద్దుగా 'కొకూ అని, కొడవటిగంటి అని, కుటుంబరావు అని మార్చి మార్చి సందర్భంగా స్తుతించడం జరుగుతుంది.
వైశిష్ట్యం, వైవిధ్యం - సాహితీవైతరణి
కొడవటిగంటి వారిని పరిచయం చేయడం దుస్సాహసమే అవుతుంది. అందుకనే, ఆయన స్వంతభావాలతోనే వ్యాసానికి నాందీప్రస్తావనలు చేయడం జరిగింది. దివాకరుని దివిటీతో చూపడం లాంటిది. ఆధునికతకే ఆధునికత ఆయన తెలుగు సాహితీశైలి. ఆయన ఒక పదకోశం; ఒక సాహితీపరిశోధనాలయం; బహుముఖ సాహితీప్రక్రియలను ఆపోశన చేసినవాడు. శాస్త్రం, సమాజం, పరివర్తన, కళ, ఏదైనా సరే, ఆ ప్రక్రియను క్షుణ్ణంగా ప్రదర్శించిన ప్రముఖ సాహితీమూర్తి. మహాకవి గురజాడ తో ప్రారంభమైన ఆధునికసాహిత్యం, కొడవటిగంటి వారితో ఒక మలుపు, మెరుపు ఆవహించాయి. సాహిత్యానికి శాస్త్రీయతను జోడించి, ప్రతిభావంతమైన ప్రజ్ణానాన్ని, ప్రకౄతి, సమాజం, కళలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటూ తన సాహితీపరంపరను దీర్ఘగతిని కొనసాగించాడు. సాహిత్యం, కళ, ఆర్ధికశాస్త్రం, సామాజికశాస్త్రం, భౌతిక జీవ శాస్త్రాలు, వేదాంతం, మనస్తత్వం, సమకాలీన రాజకీయాది విషయాలపై సమస్యలను అన్వయించుకొని సాహిత్యాన్ని సౄష్టించడం జరిగేది. తనకున్న అపారమైన శాస్త్రీయ పరిజ్ణానాన్ని మానవ, సామాజిక సమస్యలకు అన్వయం చేసుకుంటూ రచనలను చేసిన సాహితీప్రతిభాసంపన్నుడు, కొడవటిగంటి కుటుంబరావు గారు. మధ్యతరగతి, సగటు మానవుడే నిత్యం యితివౄత్తం. ఈ వర్గపు ప్రాతిపదిక, మధ్యతరగతి ప్రజలకు నిత్య సంఘర్షణ అనివార్యం అని నమ్మిన సాహితీకుటుంబ ప్రతినిధి. కేవలం విప్లవ భావాల్ని తన సాహిత్యంలో జొప్పించడం కాదు, తెలుగు విప్లవ సాహితీవిధానాలకి నీరుపోసి, పాదును పెంచిన ప్రతిభాకౄషీవలుడు. కొకు నవల 'తారా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందడం దీనికి సోదాహరణం.
బాల్యంనుంచే సామాజిక స్పౄహ
చిన్నతనంనుంచే అలవోకగా అలవడిన సామాజిక స్పౄహ, కొకు లోని రచయితను తయారుచేసింది. అందుకే సాహిత్యం సమాజం నుంచి వేరు చేయలేకపోయాడు. తన అభిప్రాయాలకు అక్షరరూపం యివ్వని ఒక రాత్రి-పగటి కాలం ఆయన గడపలేదంటే, ఆయన సన్నిహితులకే ఆశ్చర్యం కలిగించేది. అంతేకాక, కొకు స్పౄశించని సాహితీప్రక్రియ లేనేలేదు అని చెప్పాలి. ఈయన కల్పించిన 'గల్పికా బహుళప్రచారం చెందింది. సాహితీలోకం, కధానిక, కధ మాత్రమే పరిచయమున్న, ఒకటి-రెండు మూడు పేజీల్లో కుదించిన సంపూర్ణభావసంచిక గా అవతరింపచేశాడు. పైగా కొకు సాహితీసంకలనం ప్రచురణలో, వర్గీకరణం, సాహిత్యాంశాల రాశి, ప్రక్రియలు కూడ సమస్యలు అయి తిష్ఠవేసుకున్నాయి. ముదిమి వయసులో కూడ, కొకు సామాజికం, చరిత్ర, కళ, యిత్యాది ఆంశాలపై సుదీర్ఘ విశ్లేషణాత్మక వ్యాసాలు విరివిగా వచ్చేవి. ఈ కోవలో, 'వేదాల్లో ఆర్యుల స్థానం', 'చలనచిత్రాలూ, యిలా వుండేవి ఆయన శీర్షికలు, యితివౄత్తాలు. బహు సరళంగ్ఫా, వాడుకభాషలో, అన్ని వర్గాలనీ బహుశ్రద్ధాభక్తులతో చదివింపచేసేవి. పరమ ఛాందసుల మూస నుంచి సాహితీవ్యాసం రూపురేఖల్లో ఒక విప్లవం తెచ్చాడనే చెప్పాలి. ప్రజాసాహిత్యం, సమకాలీనపు వాడుకభాష, ప్రాచీన ప్రబంధ సాహితీ ధోరణులకు భరతవాక్యం పలికి, ప్రేరణాత్మక సామెతలు, జాతీయాలు, ప్రయోగాలను తన సాహితీప్రక్రియల్లో రంగరించిన రససాహితీమూర్తి.
అభ్యుదయం, ప్రగతి, కొకు నేస్తాలు
అభ్యుదయ సాహితీ ప్రస్థానోద్యమాల్లో, కొకు ఎప్పుడూ ముందు వరసలోనే కనిపించేవారు. వీటితోపాటు ఆయన సాహితీప్రభ కూడ వెలిగింది. ఆనాటి నవ్య సాహిత్య పరిషత్తు సభ్యుడు. మార్క్సిజ భావాల ప్రేరణతో అభ్యుదయ రచయితల సంఘం లో 40 దశకాల్లో సేవలు, విప్లవ రచయితల సంఘం స్థాపన 1970 నుంచి ఉపాద్యక్షుడిగా చరమదశ వరకూ కొనసాగిన ప్రతిభామూర్తి. సాహిత్యంలో అభ్యుదయ భావాలకు విధివిధానాల్ని రూపకల్పన చేసిన చైతన్యస్ఫూర్తివంతుడు. పురోగమనం, ముందుచూపు, ముందటి ఆలోచనే తప్ప, గతం గురించి పాకులాటకు పోని ఆలోచనాపరుడు. అభ్యుదయ భావం, సంస్కరణాలోచనం, కొకు నరనాడుల్లో పాకిపోయింది. సమగ్రత, మానవత, నవత మార్గాలను కేవలం ఆలోచనల్లోనేకాక, ఆచరణకు దారితీసిన కొకు సాహిత్యం ఒక బాధ్యతను, హక్కును కూడ సరిసమంగా ప్రదర్శించగలిగాయి. సమాజాన్ని, మానవుణ్ణి, సంథానించుకుంటూ మానవజీవితాన్ని సరళంగా, సమగ్రంగా, తన సాహిత్యం ద్వారా ప్రతిభావంతంగా, బహుప్రక్రియలతో, సుదీర్ఘకాలం సాహితీజగతికి అందించగలిగిన స్ఫూర్తి, దీక్ష, సంకల్పం, త్రివేణీసంగమమై కొకు కలంనుంచి ప్రవహించాయి. ఆలోచనాత్మకంగా, అన్యాయాన్ని పోరాడడంలో, ఛాందసభావాల్ని వదలివేయడంలో కొకు ధరించిన పాత్ర శ్లాఘనీయం. కొడవటిగంటి కుటుంబరావు గారు నిత్య, సత్య, సత్వరపు సాహితీప్రభంజనంగా, కళావాదిగా, సాంకేతికతను, శాస్త్రాల్ని జోడించి, ఆధునిక తెలుగు సాహిత్యజగతికి ఒక మూలవిరాట్టుగా సాహిత్యచరిత్రలో ఒక సుస్థిరస్థానాన్ని తనకు తాను సంపాదించుకోగలిగిన బహుళప్రతిభామూర్తి.
కుటుంబరావు జీవనప్రస్థానం
ఆంధ్ర పారిస్ గా పిలవబడే, తెనాలి లో 1908, అక్టోబరు 28న కొడవటిగంటి వారు మధ్యతరగతి కుటుంబం లో జన్మించారు. దశాబ్దకాలానికే తల్లిదండ్రుల్ని కోల్పోయిన కొకు గుంటూరు ఆంధ్ర క్రిష్టియన్ కాలేజీలో యింటర్మీడియట్, విజయనగరం మహారాజా కాలేజి లో భౌతికశాస్త్రంలో డ్రిగ్రీ చదువులోనే రచనావ్యాసాంగం అలవడింది. ఈ సమయంలోనే ఆయనలో నాస్తికభావాలు కూడ అంకురించాయి. కాశీలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో యం.యస్సి. భౌతికశాస్త్రంలో చేరినా, ఆర్ధికసంక్షోభంలో పూర్తికాలేకపోయింది. గుమాస్తా, ఉపాధ్యాయుడు, కర్మాగారంలో పర్యవేక్షకుడు, చలనచిత్రరచయిత (సంగీత దర్శకత్వం తో సహా) వౄత్తులలో రాణించినా, చివరకు పత్రికారంగంలో స్థిరపడడం జరిగింది. అనుకోకుండా, చందమామ, ప్రతిభావంతమైన పిల్లల పత్రిక కు మకుటంలేని మహారాజ సంపాదకునిగా తిరుగులేని ప్రతిభను, 1952 నుంచి 1980లో మరణం వరకు ప్రదర్శించిన వైనం అందరికీ తెలిసినదే. సహరచయితలతో సుదీర్ఘచర్చలు, లేఖలతో సత్సంబంధాలు పెంచుకునేవారు. మానవజీవితానికి పరమ యింధనమైన ధనం గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించనేలేదు. కొకు గారి భార్య వరూధిని. అమ్మాయి, యిద్దరు అబ్బాయిలు. ఆంధ్రపత్రిక దినపత్రికలో, జరుక్కుశాస్త్రితో సహోద్యోగం, జాతీయ ప్రచారక సమితిలో కాపీరైటర్ గా, ఎయిర్ యిండియలో ఎక్కౌంట్స్ విభాగంలో కూడ ఈయన ప్రతిభను అందించారు.
సమగ్ర సాహితీసంకలనాల ప్రచురణలు
ప్రముఖ సాహితీ ప్రచురణ సంస్థ, విశాలాంధ్ర, ఆచార్య కేతు విశ్వనాధరెడ్డెగారి సంపాదకత్వంలో వెలువడిన సాహిత్యసర్వస్వాన్ని చదివి, ఆనందించి, అనుభూతి చెందాలి తప్పితే, వేరే దారి లేదు. వారసత్వం, ఐశ్వర్యం, ఎండమావులు, అరుణోదయం, జీవితం, గడ్డురోజులు, అనుభవం, సవతితల్లి, పంచకళ్యాణి, అనామిక, ఆడజన్మ, నీకేంకావాలి, ప్రేమించిన మనిషి, కురూపి, బెదిరిన మనుషులు, బ్రతుకుభయం, బకసుర, గ్రహశకలం, కులంలేని మనిషి, సరితాదేవి డైరీ, సరోజ డైరీ, మారుపేర్లు, తార, తిమింగలం, మారిన జీవితం నవలతో పాటు అసంఖ్యాకమైన కధానికలు, కధలు, గల్పికలు, నాటకాలు, దిబ్బకధలు, సైన్స్ కధలు, అపరాధ పరిశోధక కధలు, ఎన్నో వ్యాఖ్యానాలు, చురకల చెణుకుల సంపుటాలు, విప్లవ రచయితల సంఘం ద్వారా శాస్త్రం, చరిత్ర, సంస్కౄతీరంగాల్లో వ్యాసాల పరంపర, కేవలం సోదాహరణలే కాని, మొత్తం రచనల పట్టికలు రాయలేని అపారరచనాసంసారం మన కొడవటిగంటి కుటుంబరావు గారిది. కొకు గారిది సాహితీబ్రహ్మాండం; ఆధునిక సాహితీసార్వభౌముడు; తలమానికమైన, అత్యధికమైన, సాహితీ పరిమాణం, ప్రమాణం, వెరసి - కొడవటిగంటి కుటుంబరావు అనే వ్యక్తి, సంస్థ, ప్రపంచం, జగతి, విశ్వభరిత విద్వత్సాగరం.
నేడు - ఆగష్టు 17 (1980) కొడవటిగంటి కుటుంబరావు గారి వర్ధంతి. ఈ సందర్భంగా, ఆంధ్రసాహితీప్రపంచం, వినయవిధేయతలతో, ప్రణామాలు సమర్పించడం, ఆయన సందేశాలని, భావాలని, కలకాలం స్మరణలో వుండేట్లు, ఆచరణయోగ్యాలుగా కావాలని, సాహితీసరస్వతిని ప్రార్ధిస్తూ, ఆయన ఆత్మకు ఘననివాళ్ళను తెలుగురధం సమర్పించుకుంటోంది. ఓం శాంతి:
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
Saturday, August 16, 2008
ఆగష్ట్ 16 ప్రత్యేకతలు
పుట్టినరోజు
1. రణధీర్ సింగ్ - భారతీయ క్రికెట్ క్రీడాకారుడు (1957)
2. ప్రముఖ అమెరికా గాయని, నటీమణి - మడొన్నా (1958)
3. ప్రముఖ నటీమణి - మనీషా కోయిరాలా (1970)
4. సయీఫ్ అలీ ఖాన్ - ప్రముఖ నటుడు - అపురూప జంట పటోడీ (టైగర్) - షర్మిలాటాగోర్ కు వంశాంకురం. (1970)
5. షివ్ నారాయణ్ చంద్రపాల్ - గయనీస్ క్రికెట్ క్రీడాకారుడు (1974)
వర్ధంతి
1. ప్రముఖ వేదాంతవేత్త, రామకౄష్ణ పరమహంస (వివేకానంద కు గురువు) (1886)
2. మార్గరెట్ మైకేల్ - ప్రముఖ అమెరికా నవలాకారులు (1949)
3. మాల్వి అబ్దుల్ హాక్, ఆధునిక ఉర్దూ భాషా పితామహుడు.
4. నస్రత్ ఫతే ఆలిఖాన్ - ప్రముఖ పాకీస్తాను గాయకుడు (1977).
పర్వదినం
1. నేడు శ్రావణ పూర్ణిమ (జంధ్యాల పూర్ణిమ). ఈ రోజే అనేకమంది ప్రజలు జరుపుకునే రాఖీపౌర్ణమి పండుగలు యావత్తూ భారతదేశ ప్రజలు జరుపుకొనే అన్నా చెళ్ళెళ్ళ మమతానురాగాలకి నిత్య నిదర్శనం.
యిన్ని ప్రత్యేకతలున్న రోజు నిజంగా మరచిపోలేని రోజు.
తెలుగురధం.
Friday, August 15, 2008
ఆంద్ర ప్రభ కు 'సప్తతి' శుభాకాంక్షలు
'ఆంధ్ర ప్రభ' కు జన్మదిన శుభాకాంక్షలు
'సప్తతి' మహోత్సవాల్ని జరుపుకుంటున్న శుభసందర్భాన.
౧౯౩౮ సంవత్సరంలో ఆగష్టు ౧౫ న ప్రారంభించిన ప్రముఖ తెలుగు దిన పత్రిక, నేడు దేశపు స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటూ, తన జన్మదినాన్ని కూడా జరుపుకోవడం ఆనందదాయకం. ఎందఱో మహానుభావులు - సంపాదకత్వం వహించి, ఇంతన్తై, వటుడు మరింతలుగా ఎదిగిపోతూ, ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగి, ఆకాసహర్మ్యాలని తాకుతూ, తెలుగుప్రజలకి మరింత అపురూపమైన అక్షరానందలహరిని ప్రసాదిస్తున్న వైనం అందరికీ విదితమే. స్వాతంత్ర్య సంసిద్ధికి, సంఘానికి, సంస్కృతి విస్తరణకు చేసిన సేవలు అపారం. ఆరు దశాబ్దాలుగా ఈ 'ఆంద్ర సాహితీ ప్రభ' నిత్యాక్షర యాగాన్ని అనునిత్యం అందిస్తోనే ఉంది. ఆంధ్రప్రభ మాటల్లోనే చెప్పాలంటే - "పత్రిక ప్రభ చేసిన సేవలను వివరించడమంటే, తెలుగువాడు స్వంత్ర్యోద్యమ మహాభారతాన్ని రచించడమే."
పత్రికా సేవయే ప్రధమ లక్ష్యం - అనే సంకల్ప లక్ష్యంతో, "సత్యమ బ్రూయాత్, ప్రియమ బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియమ్చ నానృతం బ్రూయాత్' అనే పవిత్ర భావనతో అక్షర లక్షల సేవలను అందిస్తున్న - 'ఆంధ్రప్రభ' కు హార్దిక శుభాభినందనలు, శుభాకాంక్షలు అందిస్తోంది - తెలుగురధం.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
స్వాతంత్ర్య శుభాకాంక్షలు
ఏది ఏమైనా, యిది సంబరాల సమయం. స్వతంత్ర భావాభిరామాలకు నిలయం. అంబరం వైపు పయనం కావించే సమయం. అర్థవంతపు నేతలకీ, పాలనకీ నిరీక్షణం.
ఉవ్వెత్తున ఎగసిపోతున్న రాజకీయ రక్కసి గాలులు, 'చిరూగాలి శౄతిమించి 'అల్లూకుపోతున్న 'నాగాబంధ 'పవనావీచికలు. దుమ్ము, దుమారం, దురహంకారం, దురాశ, దుర్నీతి సంగమం. ప్రవచనంలా చెప్పుకునే అడుగుజాడ గాంధీజీదే. కాని, ప్రతీ వాడలో, అడుకుకొక్క గాంధారీ సుతుడే మరి!
ఓ భగవాన్! ప్రభూ! ప్రజ్ౙానమూర్తీ! ప్రవక్తా!
నాదేశపు ప్రజని, భారతావనిని, కరుణించు, కటాక్షించు.
స్వాతంత్ర్యం ఒక పక్షివంటిది. ఎగరగలిగితేనే స్వేఛ్ఛ. లేకపోతే బానిసత్వం. - మహాత్మాగాంధి.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
నాడు - ఈనాడు
ఆగష్ట్ 15 ప్రత్యేకతలు
1. ప్రముఖ రాజకీయవేత్త, పరిపాలనాదక్షుడు - నెపోలియన్ జన్మదినం (1769).
2. ప్రముఖ తత్వవేత్త, దార్శనికుడు - అరవింద (ఘోష్) మహర్షి జన్మదినం. (1872).
3. భారతదేశం పరాయి పాలన నుంచి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా 62 వ సంవత్సరం ఉత్సవాలను జరుపుకొంటున్న రోజు. (1947).
4. భారతదేశపు తొలి అంతరిక్ష పరిశోధన కేణ్ద్రం (యిస్రో) స్థాపించారు. (1969)
5. భారతదేశపు తంతి తపాలా శాఖ వారు, తపాలా సూచికా సంఖ్య (పోష్టల్ యిండెక్స్ నంబర్ - పిన్) ను ప్రారంభించిన రోజు. (1972).
6. ప్రముఖ నాట్య కళాకారిణి (కూచిపూడి, భరతనాట్యం), నటి - రాజసులోచన పుట్టినరోజు. ఈమె ప్రముఖ దర్శకుడు సి.యస్. రావు భార్య. చెన్నై లో పుష్పాంజలి నౄత్య కేంద్రాన్ని స్థాపించి ఎంతమందో నాట్య కళాకారుల్ని తయారుచేస్తోంది. (1935).
7. ప్రముఖ నటి, దర్శకురాలు, సుహాసిని పుట్టినరోజు. ఈమె, ప్రముఖ నటుడు కమల్ హస్సన్ అన్న చారుహస్సన్ కూథురు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత మణిరత్నం ను వివాహమాడి, నిర్మాణ సంస్థ నిర్వహణలో సహాయ పడుతోంది. (1961).
తెలుగురధం.
Wednesday, August 13, 2008
నాడు - ఈనాడు
ఆగష్ట్ 13 ప్రత్యేకతలు
పుట్టినరోజు
1. ప్రముఖ నటీమణి శ్రీదేవి (1963)
2. ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు సునీల్ శెట్టి (1961)
3. ప్రముఖ క్రికెట్ ఆటగాడు - పాకీస్తానీ దేశపు ప్రతినిథి - షోయబ్ అక్తర్ (1975)
4. క్యూబా విప్లవవాది, ప్రముఖ రాజకీయవేత్త ఫిడెల్ కాస్ట్రో (1926)
మరణం
1. ప్రముఖ సామాజిక సేవకురాలు, నర్స్ - ఫ్లారెన్స్ నైటింగేల్ (1910)
ప్రముఖ సంఘటనలు
1. మనం విరివిగా ప్రతీ యింట్లో వాడే 'స్టైన్ లెస్ స్టీళ్ ని హారీ 'బ్రేర్ లీ' కనిపెట్టిన రోజు (1913)
2. పాకీస్తాన్ దేశం, మొదటిసారిగా, తమ జాతీయగీతాన్ని, రేడియోలో ప్రసారం చేసిన రోజు (1954)
మరో ప్రముఖమైన రోజు
ఎడమచేతివాటపు ప్రజల దినం (1976)
మనం సాధారణంగా నిత్య దైనందిక జీవనంలో ఎక్కువగా ఉపయోగించేది కుడిచేయి. అంటే, ఎడమవైపు మేధస్సు సంకేతాలపై సాధారణంగా జరిగే నిత్య ప్రక్రియ. దీనికి భిన్నంగా, విశేషంగా, ప్రపంచంలో రమారమి 10 శాతం ప్రజలు కేవలం ఎడమచేతివాటాన్ని ఉపయోగిస్తారట. అంటే, కుడివైపు మేధస్సునుంచి సంకేతాలు రావడం జరుగుతుంది అని చెప్తారు. వీరికి ప్రత్యేకంగా అనుభూతివాదులని, అంతరిక్షపు వివరాలపై శ్రద్ధ, అవగాహన, సంగీతం, నూతనత్వం, అద్భుతమైన భావన, కొలతల్లో పట్టింపులు - యిత్యాది అనేకమైన ప్రత్యేకతలను కలిగి ఉంటారట.
ప్రముఖ ఎడమచేతివాటం వ్యక్తులు
చరిత్ర
అల్బెర్ట్ ఇన్స్టీన్, నెపోలియన్ బోనపార్టే, జూలియస్ సీజర్, అరిస్టోటిల్, మేరీ క్యూరీ, హెన్రీఫోర్డ్, హెలెన్ కెల్లర్, జోన్ ఆఫ్ ఆర్క్.
కళాకారులు
లియొనార్డో డా విన్సి, మైఖేల్ ఆంజెలో.
రచయితలు
లెవిస్ కారల్, జెర్మైన్ గ్రీర్.
నటీనటులు
చార్లీచాప్లిన్, డ్ర్యు బారిమోర్, టాం క్రూయిస్, పీయిర్స్ బ్రాస్నన్, బ్రాడ్ పిట్ట్, జులియా రాబర్ట్స్, నిల్కోల్ కిడ్మాన్.
క్రీడా కళాకారులు
డీగో మరడోనా, పేలే, జాన్ మెక్ ఎన్రో, మార్టినా నవ్రటిలోవా, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగులీ.
అమెరికా అధ్యక్షులు
రోనాల్డ్ రేగన్, జార్జ్ బుష్, బిల్ క్లింటన్.
ప్రపంచంలో విశిష్టమైన ప్రతిభావంతులు ఎందరో, ఈ ఎడమచేతివాటమే, వీరి ప్రతిభాపాటవాలకి దారితీసింది.
మనవాళ్ళు 'ఆ ఎడమచెయ్యిని తీసి, ఆ పుర్రచేతిని పెట్టాడూ అని, పుర్రచేతివాటం అని వెక్కిరింతలు చేయడం కుహనా సంస్కారమే కాక వేరే ఏమిటి? భిన్నత్వం లోనే గొప్పదనాన్ని ప్రపంచానికి దర్శనం చేయించిన ఘనత వీరిదీ, వీరి హస్తవాసి కాకపోతే ఏమిటి మరి?
వారిని ఈ సందర్భంగా అభినందనలని అందజేద్దాం.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
Tuesday, August 12, 2008
నాడు - ఈనాడు
ఆగష్ట్ 12 ప్రత్యేకతలు
1. అంతర్జాతీయ యువజన మహోత్సవం.
అంతర్జాతీయ యువజన మహోత్సవం విశ్వవ్యాప్తంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మన దేశపు యువత హుందాగా వ్యవహరిస్తూ, గర్వంతో తమ జీవితాన్ని గడపాలని తెలుగురధం ఆశిస్తోంది.
2. అంతరిక్ష పితామహుడు - విక్రం సారాభాయి జన్మదినం.
Saturday, August 9, 2008
నాడు - ఈనాడు ప్రత్యేకతలు ఆగష్టు 10
ఆనాడు 'ఈనాడు' తెలుగు దినపత్రిక వెలసిన రోజు - ఆగష్టు 10
ఈనాడు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. తెలుగు పత్రికా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. వార్తలను సమర్పించడంలో కొత్తపుంతలు తొక్కి అశేష ప్రజల ఆదరాభిమానాలు పొందింది. తెలుగు పత్రికలలోనే కాక యావద్దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన పత్రికలలో ఒకటిగా నిలిచింది. ప్రజల జీవితాలతో మమేకమై, సమకాలీన చరిత్రలో విడదీయరాని భాగమైపోయింది. ఈనాడు తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రిక. NRS 2006 సర్వే ప్రకారం 1,38,05,000 మంది పాఠకులను కలిగి, దేశంలోనే తృతీయ స్థానంలో నిలచినది.
1974 ఆగష్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు. చాలా సాధారణంగా, ఏ ఆర్భాటాలు లేకుండా 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి.
అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది.
ఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సాంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త అనుభవాన్ని ప్రజలు ఆనందంతో స్వీకరించారు.
అలాగే తెలుగు పత్రికల పేర్లు - ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, మొదలైనవి - తెలుగు భాషకు సహజమైన చక్కటి గుండ్రటి అక్షరాలతో అచ్చయ్యేవి. అయితే ఈనాడు ఈ సాంప్రదాయాన్ని పక్కనపెట్టి, తన పేరును పలకల అక్షరాలతో ముద్రించింది. ఇది కూడా పాఠకులకు కొత్తగా అనిపించింది.
విశాఖపట్నంలో ప్రముఖ దినపత్రికలేవీ అచ్చవని ఆ రోజుల్లో ఈనాడు స్థానిక వార్తలకు ప్రాధాన్యతనిస్తూ రావడంతో ప్రజలకు మరింత చేరువయింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలకు అది ఇస్తూ వస్తున్న ప్రాధాన్యత ఒక కారణం.
తెలుగు భాష లో వార్తా దినపత్రిక కు ఒక కొత్త తరహాలో రూపుని, ఊపుని అందజేసిన ఘనత, గర్వం ఖచ్చితంగా చెరుకూరి రామోజీరావు గారిదే అన్నదాంట్లో ఏమాత్రం సందేహం, సంశయం రావు, రాకూడదు.
డెబ్బై రెండు సంవత్సరాల క్రితం తీసుకున్న ధైర్య సాహసోపేత నిర్ణయం, 'ఈనాడు' విషయంలో తెలుగు చరిత్రలో చిరస్థాయిగా నిలచియే ఉంటుంది.
నాడు - ఈనాడు
వరాహగిరి వెంకటగిరి జయంతి
ప్రముఖ కార్మిక నాయకుడు, తెలుగుతేజం. భారత దేశానికి రాష్ట్రపతి గా తనదైన ప్రతిభను ప్రదర్శించిన వరాహగిరి వెంకటగిరి జన్మదినోత్సవం ఈరోజే.
ప్రముఖ ఉర్దూ కవి - మగ్దూం మొహియుద్దీన్
ప్రాథమిక విద్య హైదరాబాదు లోని ధర్మవంత హైస్కూల్లోను, మెట్రిక్యులేషను సంగారెడ్డిలోను చదివాడు.
ప్రముఖ ఉర్దూ కవి. 'షాయరే ఇంక్విలాయ్' (ఉద్యమ కవి) బిరుదాంకితుడు. ఇతని గజల్ లు, పాఠ్యకాంశాలలోను, సినిమాలలోనూ ఉపయోగించారు.
'ఫిర్ ఛిడీ బాత్, బాత్ ఫూలోం కి' అను గజల్(గేయం) సుప్రసిధ్ధి.
తెలుగుతల్లిగీత రచయిత - శంకరంబాడి సుందరాచార్య జయంతి
సుందరాచార్య సుందరగీతం - మా తెలుగుతల్లికి మల్లెపూదండ
మా తెలుగు తల్లికీ మల్లెపూదండమా కన్నతల్లికీ మంగళారతులుకడుపులో బంగారు, కనుచూపులో కరుణచిరునవ్వులోసిరులు దొలరించు మా తల్లి.గలగలా గోదారి కదలిపోతుంటేనుబిరాబిరా కౄష్ణమ్మ పరుగులిడుతుంటేనుబంగారు పంటలే పండుతాయిమురిపాల ముత్యాలు దొరలుతాయి.అమరావతీ నగరి అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నాదాలుతిక్కయ్య కలములో తియ్యందనాలునిత్యమై, నిఖిలమై నిలిచియుండేదాక.రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తితిమ్మరుసు ధేయుక్తి,కౄష్ణరాయల కీర్తిమా చెవుల రింగుమని మారుమ్రోగేదాకనీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుద్దంనీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాంజై తెలుగుతల్లీ, జై తెలుగుతల్లీ.- శంకరంబాడి సుందరాచార్య రచించిన ఈ 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గీతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రగీతం గా ఆమోదించడం తెలుగువారికి గర్వకారణం. తెలుగు సంస్కృతికి ప్రతిబింబం ఈ గీతం.
శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్భంగా తెలుగురధం శతసహస్ర నివాళి కుసుమాలని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
నాడు - ఈనాడు ప్రత్యేకతలు
ఆగష్ట ౯ ప్రత్యేకతలు
క్విట్ యిండియా దినోత్సవం
భారత స్వాతంత్ర్య సమరానికి మూల స్థంభం లాంటి సంఘటన - క్విట్ యిండియా ఉద్యమం అనే చెప్పాలి. మహాత్మా గాంధి ఈ రోజే ప్రారంభం చేయడం, దరిమిలా స్వాతంత్ర్యం సాధించడం చరిత్రలోని పుటలుగా మనకు గోచరిస్తోంది.
నాగసాకి పై మారణకాండ
అణుబాంబు ప్రయోగాన్ని వినియోగించాలని, హీరోషిమా , నాగసాకి నగరాలపై ఈ దారునాస్త్రాన్ని ప్రయోగించి, ప్రపంచ శాంతి కి ఒక మాయని మచ్చని తెచ్చి పెట్టిన ఘనత మాత్రం చరిత్రలో మిగిలిపోయింది. నాగసాకి పై రెండవ దఫా గా, ఉద్ధృతంగా ప్రయోగించిన వైనం నేడే.
ప్రముఖ చలనచిత్ర నాయకుడు - ప్రిన్స్ - మహేష్ బాబు పుట్టినరోజు
చలన చిత్ర పరిశ్రమ లోనే ఒక నూతన తరహాగా తన పాత్రని బహుముఖాలుగా పోషించి, తలమానికమైన స్థానాని పొందిన అగ్రశ్రేణి కథానాయకుడు - ఘట్టమనేని మహేష్ బాబు - అందరు అభిమాన పాత్రంగా పిలుచుకునే 'ప్రిన్స్' దే.
ప్రముఖ హాస్యనటుడు - సుత్తివేలు
మహానుభావకుడు జంధ్యాల అన్వేషణలో ఒకటి - సుత్తివేలు ని కనుగొనడం. నటించిన ప్రతీ పాత్రకీ నూటికి నూతి కన్నా ఎక్కువ శాతమే తన హాస్యభిశేక పూర్వకమైన నటనని అందించి, హాస్య రసానికి ఒక సార్థకతని అందించిన ఘనత - మన సుత్తివేలు దే అని చెప్పాలి.
తెలుగురతం - కొంపెల్ల శర్మ.
నాడు - ఈనాడు - ప్రత్యేకతలు
పద్మశ్రీ డా. భానుమతి
Thursday, August 7, 2008
రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి - ఆగష్టు 7
రచనలనుండి ఉదాహరణలు
గీతాంజలి రవీంద్రునికి కవిగా ప్రపంచఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ కావ్యంలోని ఈ కింది గీతం మహాత్మాగాంధీకి మిక్కిలి అభిమాన పాత్రమైంది.
ఈ మంత్రములు జపమాలలు విడిచిపెట్టుతలుపులన్నింటినీ బంధించి,ఈ చీకటిగదిలో ఎవరిని పూజిస్తున్నావు?కళ్ళు తెరచి చూడు.నీవు ఆరాధించే దేవుడునీ ఎదుట లేడు!ఎచ్చట రైతు నేలను దున్నుతున్నాడో,ఎచ్చట శ్రామికుడు రాళ్ళు పగులగొట్టుతున్నాడో,అక్కడ ఆ పరమాత్ముడున్నాడు.వారితో ఎండలో, వానలో ధూళి ధూపరితములైన వస్త్రములలో ఉన్నాడు.నీవు కూడా నీ పట్టు పీతాంబరములు ఆవల పెట్టిఆనేల మీదికి పదా.....
విస్తృతంగా జనప్రియమైన మరొక రచన. ఇది చాలా పాఠ్యపుస్తకాలలో ఒక పాఠంగా చేర్చబడుతుంది.
Where the mind is without fear
Where the mind is without fear and the head is held high;
Where knowledge is free;
Where the world has not been broken up into fragments by narrow domestic walls;
Where words come out from the depth of truth;
Where tireless striving stretches its arms towards perfection;
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;
Where the mind is led forward by thee into ever-widening thought and action--
Into that heaven of freedom, my Father, let my country awake.
దీనికి తెలుగు అనువాదంఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడమానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
ఎక్కడవిజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడా విరామమైన అన్వేషణ,పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,
తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు
చివరి రోజులు
తన జీవితంపై రవీంద్రుని ప్రభావమెంతో ఉన్నదని నెహ్రూ స్వయంగా చెప్పుకొన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు రవీంద్రుడు మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురి అయ్యాడు. తీవ్రంగా వ్యాధితో బాధపడుతూ, చికిత్సకై కలకత్తా నగరానికి వెళ్లాడు. కానీ, ప్రయోజనం లేకపోయింది. రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవతావేత్తగా టాగూర్ చరిత్రలో నిలిచిపోయాడు. మాతృభూమి, మానవసంబంధాలపట్ల అచంచలమయిన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి' రవీంద్రనాథ్ టాగూర్, 1941 ఆగష్టు 7న మరణించాడు.
[మార్చు] క్లుప్తంగా సమాచారం