Saturday, August 9, 2008

నాడు - ఈనాడు - ప్రత్యేకతలు

అగష్టు 8 ప్రత్యీక్యతలు
పద్మశ్రీ డా. భానుమతి

బహుముఖ ప్రతిభాశాలిని, సంగీత దర్శకురాలు, గాయని, నటి, చిత్ర దర్శకత్వం, నిర్మాత, ప్రముఖ రచయిత్రి - యిన్ని ప్రతిభా గుణాలు ఒక మేధ లో యిమిడాయి అంటే నమ్మ శక్యం గాని విషయం. కాని, అదే ఖచ్చితంగా జరిగింది ఒక వ్యక్తీ విషయంలో. అ వ్యక్తి మహిళ కావడం మరింత విషయం. ఆ మహిళా ప్రతిభాశాలిని ఎవరనుకున్నారు. ఆమె, ఎవరో కాదు - పద్మశ్రీ డా. పద్మశ్రీ భానుమతి. ఆమె ప్రతిభను స్మరించుకోవలసిన తరుణం ఈ రోజు.
పండిత మాన్యులు - చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి
సంస్కృతాంధ్ర సాహితాల్లో, తిరుపతి వెంకట కవుల ప్రస్తానం చేయకుండా, ఈ భాషా సాహిత్యాలకు ఆదిమధ్యాన్తరాలు దొరకవు. వీరు ఇరువురు జతగా కావించిన అవధాన ప్రక్రియలు నిత్యనూతనంగా భాసిలుతున్నాయి. మన తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర పుటాలకి వీరి ప్రతిభాపుతలు ఎప్పటికీ ఆముఖాలుగానే పరిగణించాలి. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి కలసి సశాస్త్రీయంగా నిర్వహించిన సాహితీ అవధానాలు, నాటకాలు మొదలైన సాహితీ ప్రక్రియలు నభూతో న భవిష్యత్ అనే చెప్పాలి. ఎవరైనా, తెలుగు సాహిత్యం పై పరిశోధన ప్రారంభిస్తే, విఘ్నేశ స్తుతి మాదిరి, తిరుపతి వెంకట కవుల వ్యక్తిత్వానికి, వారి సాహిత్యానికీ ప్రణామాలు సమర్పించుకుంటూ శుభారంభం చేయాల్సిందే. అందులో భాగమైన, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారికి సత సహస్ర పాదాభివందాలని సమర్పించుకుంటోంది - తెలుగురధం.

No comments: