కవితా సుమాలతో మహాత్మునికి స్మౄతినివాళి (1869 - 1948 )
- కొంపెల్ల శర్మ
గాంధీ వర్ధంతి - జనవరి 30 - 'హే రాం!' కు షష్టిపూర్తి
ఆరు దశాబ్దాల ఆరని భావాగ్ని యింకా రగులుతూనేవుంది।
పుట్టినరోజు భారతీయులకు పుణ్యతిధి
గుజరాత్, పోరుబందర్ లో 2 అక్టోబర్ 1869 జన్మించిన కరంచంద్ గాంధీ, తన చదువును స్వదేశంలో పూర్తిచేసుకుని, న్యాయవాదం లో చదువుకోసం యింగ్లండు ప్రయాణమయ్యాడు। చదువు పూర్తిచేసుకుని, బారిష్టర్ హోదాలో 1891 లో తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. గాంధీ తన 'ఆత్మకధాను 'మై ఎక్స్పెరిమింట్స్ విత్ ట్రూఠ్ అన్న రచన నిత్య సత్య స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. సమాజోద్ధరణ కోసం పాటుపటిన నిష్కళ్మష కరుణామూర్తి. సమాజంలో మతసామరస్యతను, ప్రశాంతతను కోరిన ఈ మహాత్ముడు, తానే ఒక మతదురహంకారి, నాధూరాం గాడ్సే ఘాతుకానిని గురయి, తుపాకీ గుండి తన గుండెలో దూసుకుపోగా, హేరాం' అని నేలకొరిగిపోయాడు, మన జాతిపిత, మహాత్ముడు. మోహనదాసు కరంచంద్ గాంధీ.
ఆయన మహానుభావుకతకు, త్యాగనిరతకు నివాళులను సమర్పించాల్సిన ఘనతరుణం నేడు। మహాత్మునికి మహనీయమైన నివాళి.
ఆ రోజు 1948, జనవరి 30. భారతదేశ ప్రజావాహిని స్వాతంత్ర్య సంబరాలు ఏడాది పూర్తి కాకుండానే, బానిస పరిపాలన నుంచి విముక్తి పొందడానికి తనదైన కౄషిని నభూతో నభవిష్యత్ అన్నట్లు సేవలను అందించిన తీరుతెన్నులు కొంతమంది మతోన్మాద వ్యక్తులకు కన్నుకుట్టినట్లు అయింది. ఫలితంగా జాతిపిత, మహాత్మాగాంధి, మోహన్ దార్ కరంచంద్ గాంధీ, వినాయక్ రాం గాడ్సే తుపాకీ గుళ్ళకు బలి అవడం, తుపాకీ గురిపెట్టే ముందు గాంధీకి ప్రణమిల్లడం, వెనువెంటనే మహాత్ముని పేల్చడం, ఒకే ఒక తుపాకీ గుండు దూసుకుపోతకు, జాతిపిత, 'హేరాం' అని నేలకి వొరిగిపోయాడు. విశ్వవ్యాప్తంగా, జనవరి 30 న ప్రతీ సంవత్సరం ఉదయం 11 గంటలకు జాతిపిత నివాళి నిమిత్తం రెండు నిమిషాలు మౌనం పాటించడం, భారతదేశం ప్రజలు యావత్తూ, జాతిపితకు ప్రకటించుకునే కనీస ౠణం. యిలా, కొన్ని వేల ఏండ్లు చేసినా, గాంధీజీ మనకు అందించిన అప్పు తీరనే తీరదు. నిత్యం ౠణగ్రస్తులమే అన్నదాంట్లో విడ్డూరం లేదు. ఏది ఏమైనా, గాంధీజీ మరణం సమయంలో, వెలువడిన ఆఖరి పదం - 'హే రాం!' అన్నపదం నేటితో ఆరుపదుల వసంతాలను పూర్తిచేసుకొంటున్నది. హే రాం కు షష్టిపూర్తి అన్న భావం మాత్రం సత్యం.
మహాత్ముని జీవనసారాంశం
దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన గాంధీ రాజకీయ జీవితం, గత శతాబ్దపు ప్రారంభంలో, నిరాకరణోద్యమంతో శ్రీకారం చుట్టబడింది. 1916 లో భారతదేశం తిరిగి వచ్చి, జాతీయ స్వతంత్రోద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. గాంధీ నాయకత్వంలో, నేతౄత్వంలో అనేక ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. ముఖ్యమైనవి - నిరాకరణోద్యమం (1920), పౌరహక్కుల ఉల్లంఘనోద్యమం (1930), క్విట్ యిండియా ఉద్యమం (1942) గాంధీ జీవితాన్ని, నడతను వెన్నంటుతూ వున్నాయి అని చెప్పాలి. 1930 లో గాంధీజి, ఉప్పు సత్యాగ్రహం (దండి ప్రస్థానం). హరిజనులోద్ధరణ కోసం పాటుపడ్దాడు. అప్పటివరకూ అంటరానివారు గా పరిగణింపబడుతున్న వారికి 'హరిజనా నామధేయం కొత్త తరహా అనుభూతిని చెందుతారు. 'అంటరానితనం' భగవంతునిపై, సమాజంలో సాటి మనుషులపై ప్రకటించే పాపం అనే చెప్పాలి అని భావించాడు. 'భారతదేశ జాతిపితా అన్నది ఒకే ఒక మనిషికి దొరకిన వరప్రసాదం. అహింసా ధోరణిని అవలంబిస్తూ, సత్యవ్రతానికి జీవితాంతం ధారపోసి, ఆచరించిన సత్యవ్రతామూర్తి, మోహన్ దాస్. హిందు-ముస్లిముల సమైక్యత, సహకారం కోసం అహర్నిశలు శ్రమించిన శక్తిమానుడు.
మనవాడే కాని అందరివాడు
భారతీయుడైనా, ఆయనను మనవాడని చెప్పుకోవడం సంకుచితసమానం. ప్రపంచం తనవాడిగా ఏనాడో చేసుకుంది. ఆయన కరుణకు పర్యాయపదం. సత్యం, అహింసలతో ముక్తి సాధించిన మహాతపస్వి. మానవజాతి చరిత్రలో అత్యున్నత స్థానమలంకరించిన మహనీయుడు. నిరుపేద, బలహీన ప్రజలకు కొండంత ధైర్యమిచ్చిన దీనజనబాంధవుడు. తనకోసం కాక మనకోసం బ్రతికిన మహామనీషి. ఆయన గురించి ఎవరు, ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ ప్రజల హౄదయాల్లో ఆయన ప్రసాదించిన ఆశాజ్యోతి. మానవజాతి వున్నంతవరకూ వెలుగుతూనే వుంటుంది. ఆయన అసలు మానవ మాత్రుడేనా అని గొప్ప అనుమానం రాకమానదు. ఆ మహానుభావుడి గురించి కవిత రాయని కవులు భారతదేశంలో వుండరు. ఆయన జయంతి దినోత్సవం సందర్భంగా, కొందరు ప్రముఖుల కవితాసుమాల ద్వారా ప్రకటించిన స్మౄతి నివాళి సారాంశాన్ని చెప్పే చిరు ప్రయత్నం.
ఆయన, ఆ మహామనీషి ఎవరో కాదు। ఆయనను - జాతిపిత, మహాత్ముడు, బాపూజీ, గాంధి అని పిలుస్తుంటారు. అసలు పేరు - 'మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.
ఒక జయంతిని చేయుటకంటే ఒక్క మాట నిజం పలుకుట మేలు। గుండె పవిత్రమగును. గాంధి, బుద్ధుడు, హరిజనులు సంతోషిస్తారు(1).
అతడు సామాన్య వ్యక్తి। అతడసామాన్య వ్యక్తి. తౄణంకన్నా తేలిక. మేరువుకంటే ధీరుడు. ఆగర్భ శ్రీమంతుడు. నిత్యదరిద్రనారాయణుడు. వయస్సు మీరిన బడుగు. వయస్సులేని విసువు. అన్యాయం సమక్షంలో అగ్రమహోదగ్రమూర్తి. చరాచర ప్రపంచానికి క్షమా మార్గదర్శి. అతడిప్పుడు లేడు. అతడెప్పుడూ వున్నాడు. అమరత్వం అందుకున్న అతనికి మా నుతులు(2).
ఇతడు బాపూజీ। బోసినవ్వుల తపస్వి. భారత మహా స్వతంత్ర రణాంగణ్మున సర్వ సేనాని. సత్యాగ్రహ ప్రణేత. సర్వ సర్వంసహా పరిత్రాణ కీర్తి(3).
మన గాంధీ గుణకంధి। మరికానబడడా! తానిచ్చినది భారత స్వరాజ్యము కాని, పుచ్చుకొన్నది మొక్కవోని స్వారాజ్యము!(4)
కట్టుకున్నాడు మోకాలు తాకెడి రీతి అంగవస్త్రము। నేసినట్టిదానిని నాడు సన్యాసిపోల్కి తత్సమయంబునం దోచె. భరతఖండమునకు భయము లేదనిపించె. పరిశుద్ధమనిపించె బాపూజీ గాత్రంబు (5).
ఆయన పేరు సత్యం। భారతీయ సముద్రగర్భంలో దొరకిన మానవముత్యం. ఆయన వూరు పోరుబందరు. ఊరిలోనే పోరున్నదని ఉలిక్కిపడ్డారు కొందరు. దారితప్పి చెట్టుకింద చేరిన బాటసారులకు ఎటు గమ్యమో అప్పుడు తెలిసింది. దాహంతో నాలుక పీక్కుపోతున్న పాంధులకు ఏ దిక్కు సరోవరమో అప్పుడు తెలిసింది(6).
సత్యాహింసలు రాజకీయ రధానికి పూంచిన తొలిసారధి। ఊతకర్రతో ఊర్వారనే ఉర్రూతలూపిన సేవాచార్యుడు. చిరునవ్వుతో శాత్రవ హౄదయ మాలిన్యాన్ని ప్రక్షాలించిన ఘనుడు. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచిన ఘనుడు. విశ్వమానవ మహితాత్ముడు. గాంధీమహాత్ముడు(7).
సేదగొన్న శ్రమజీవికి శరణం। పల్లెవాకిటికి పచ్చతోరణం. అంధ జగతికాశారుణ కిరణం. మరివేరెవ్వరు! మా బాపూజీ(8)
కొల్లాయి గట్టితేనేమీ, మా గాంధీ కోమటై పుట్టితేనేమీ? వెన్నపూసా మనసు, కన్నతల్లీ ప్రేమ, పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు, బోసి నోర్విప్పితే ముత్యాల తొలకలే, చిరునవ్వునవ్వితే వరహాలు వర్షమే, చకచక నడిస్తేనూ జగతి కంపించేనూ,పలుకు పలికితేనూ బ్రహ్మ వాక్కేనూ(9)
అదెగో రాట్నము చేత దేశజులకు ఆహారంబు కల్పించి అభ్యుదయాపాదక సామరస్యమునకు ఆయుర్దాయమున్ పోసి, గాంధితాత ౠణమున్ విశ్వంబెటుల్ తీర్చునో(10)!
రామమంత్రమ్ములో ఐక్యమై, మహర్షి యతడు, వాల్మీకి రామైక్యమందినాడు, తాత మంత్రంబులో ఐక్యమై తపంబు పండి, తేజస్సు నేనుగా పరిణమింతు(11)
కత్తి కదల్చలేదు! విశిఖాలు విదల్చనులేదు గాండీవంబెత్తనులేదు! ఏ క్రియ జయించితివో నరమాంస పారణోన్మత్తుల? నీ ప్రభావములమానుషముల్ భవదీయ శంతిసంపత్తికి దోసిలొగ్గెను ప్రపంచము భారత భాగ్య దేవతా!(12)
శిలువమీది ఏసు వీవె చిరంజీవి బాపూ! వషకషకపు సోక్రటీసు వీవు కావా బాపూ! కాళరాత్ర గర్భ దీప్తి కలి కౄతముగ సంధీకరున కంధి శాంతిపంధి కర్మవీర గాంధీ! జాతిపితా! కైమోడ్పులు చేతుమోయి నేడు, శ్రద్ధాంజలి ఘటించి నీ జయంతినాడు ప్రజా హృదయ ఫలకమ్మున ప్రత్యక్షమ్ముకమ్ముజ్, సత్య మార్గమనుసరించు శక్తిని మాకిమ్ము।(13)
అల్ల ధర్మరాజును ఎరింగినట్టివాడు, తిక్కనార్యుని పుణ్యాన తెలుగువాడు, నీ అహింసను నీ నీతి నియమములను బట్టి అతడు నిను గుర్తుపట్టగలడు(14)।
సరసచేరిన సిద్దార్ధ శాక్యయోగి, తాను చెప్పని భక్తి తత్వమ్ము చెప్పి జాతి నడిపించి వావని సంతసించు, స్వర్గరాజ్యం నీ వేగు సమయమందు(15)
భయంకర స్వార్ధాస్ఫాలితమై, సర్వదేశప్రజ సంక్షోభిస్తే, సత్యహింసల బోధన చేసీ, నిరంతరం మా హౄదంతరంలో ... (16)
పాలసముద్రంలో నడచివచ్చిన రీతి, హిమాచలాగ్ర శౄంగాలు కరాలుసాచి మనకై అరుదెంచిన భాతి, శాంతి సత్యాలు మనుష్యరూపమును దాలిచి నేలకుడిగినట్లు గాంధీ లలితాత్ముడుజ్జ్వలమతిన్ భరతావనిపైన కాలిడెన్(17)
అడవి స్మౄతి తప్పిపోయినట్టి బుద్ధదేవునకు పాలుపోసెనే దివ్యమాత, ఆ సుజాత నీ గొంతులో అమౄతరసము పోయెదేల నేడు అదౄష్టముగ మహాత్మా(18)
మా భావములన్ సువాసనలు పైకొన విచ్చిన యీ కౄతజ్ణతా ప్రావౄత పుష్పముల్ నీకిడుచుంటిమో అహింసావశ కర్మయోగి! మము పాకతమొప్ప నను గ్రహింపవే(19)
దెక్కెరుంగక లేబవల్ దేవురించు, ప్రజకునేర్పితివి ఆత్మగౌరవ సమీక్ష, బాపూజీ స్రష్టనీవు నీ చూపుసోకి, ద్రష్టలైనారు కొందరీతరమువారు(20)
హరి సౄజించె నరుని అచ్చమ్ము తనపోల్కి, నరుడు తన్నుబోలి హరి సౄజించె, ఇనుమి పైడిజేయు నీశ్వరుండే నేర్చు, కడలివోలె నెల్ల కడల నీశ్వరుండుండ, బిందువై వసించునందు నరుడు, కడలి బాసి బిందువడగారు నిక్కము, గాంధి పలుకు ధర్మగంధమొలుకు(21)
శిల్పసూత్రార్ధాలు తెల్పు సౌందర్యాలు, స్వల్పమై మూర్తిలో దేశదేశాల ఆశాంతాల వెలిగిస్తూ, నీ బోసినవ్వులో నీ సౄష్టివాక్కులో నీ కన్నుజంటలో రేకలు తిరుగుతూ మహాత్మా!లోకమోహనమయ్యె హిమాలయోత్తుంగశౄంగం నీ బ్రతుక్(22)
పాడితప్పి జనము పాడగుచున్నారు। నడపుదారి విడిచినారు. రకరకాల హింస రగులుచున్నది నేల, ఎవరితోడ విన్నవింపవలయు? నీవు లేవు సరియె నీ నీడయునులేదు, నీదు బోధలెల్ల నేల గలిసె, నిన్ను బొమ్మజేసి నిలుచుండబెట్టిరి, ఒక్క దిక్కు లేదు, మొక్కు లేదు, నీకివె జోతలు గాంధీ! నీకిదె కైమోడ్పు నిఖిల హౄత్ సంవర్తా, నీకు నమస్కారమిదె చేకొనుటకు నీవులేక చేవ్డ్వడితినయా(23)
ఏడులు గడిచెను అయినా ఈ నాటికీ నీ పేరు తలచుకుంటే చాలు, మాభయాల చిమ్మచీకట్లలో నీ అభయహస్తపు మెరుపులు తళుక్కుమంటాయి, బాపు! తళుక్కుమంటాయి(24)
జగతి మౌనమె సర్వార్ధ సాధకమగు నిడివి నీ మౌనమదినీకె యిడె ఫలంబు, కాని పరమౌషధంబు లంఘన మనుట వ్త్వదుపవాసాల నొరులకు కుదులు రుజలు(25)
నీవుదయించినట్టిమహనీయ ముహూర్తము భారతీయ సుశ్రీవియదధ్వమందు బొలిచెన్నవ భాను మహోదయాభమై పావన తద్రుచివిశ్ఫురణ బ్రాకిన దాస్య తమస్సు విచ్చి మోదావహరాగరేఖలు దిగంతములన్ విలసిల్లె బెల్గుగా(26)
కమ్మగా బతికితే గాంధియుగంమనిషి కడుపునిండా తింటే గాంధీజగంపరమార్ధమొక్కటే గాంధీమతంమనిషి భయము వదిలేయుటే గాంధీహితంభోగలోలత విడుటే గాంధీవిధంత్యాగరధమెక్కితే గాంధీపధంమనిషి మర్యాదయే గాంధీధనంమనిషి మారితే కోవెలగ గాంధీతనంతన కంఠమున దాచి హాలాహలంతలనుండి కురిపించి గంగాజలంమనిషి శివుడవుటయే గాంధీవరంబాపుననుసరిస్తే చాలుమనమందరం(27)
నీవు పుట్టిన గిట్టిన తావులెపుడు, ధరణి శాశ్వత పుణ్యతీర్థంపులగు(28)
ఓ మహాత్మా! ఓ! మహర్షీ! అని కవులచేత అనేకవిధాల కొనియాడబడిన మన జాతిపితని, బాపూని, జ్ణానపీఠపురస్కార గ్రహీత, ప్రముఖ కవిశేఖరుడు డా. సి.నారాయణరెడ్డిగారి భావనతో భరతవాక్యం పలకడం కడు సమంజసం.
హిమాద్రి ఎంత ఎత్తు? హేమాద్రి ఎవరి సొత్తు?మహాత్మా నీ స్వరూపం తుహినాద్రికి సంక్షిప్తరూపంబాపూ నీ చిత్తం ప్రపంచానికి దొరికిన విత్తంబాపూ నీ పుట్టిన రోజు భగవానుడు పుట్టినరోజుఒక రాముడు పుట్టినరోజు, ఒక రహీము పుట్టినరోజుచావులేని పుట్టకలేని సత్యమూర్తి పుట్టినరోజుదాస్యంలో విలవిలలాడే ధర్మం తొడగొట్టినరోజు.
జాతిపిత మహాత్మాగాంధి, మోహన్ దాస్ కరంచంద్ పై కవితాసుమాలను పలవరించిన మహాకవుల వివరాలు :
1। విశ్వనాధ సత్యనారాయణ 2. శ్రీశ్రీ3. పురిపండా అప్పలస్వామి4. మధునాపంతుల5. శివశంకరస్వామి6. కుందుర్తి ఆంజనేయులు7. బోయి బీమన్న8. వేదుల సత్యనారాయణ శాస్త్రి9. బసవరాజు అప్పారావు10.గుర్రం ఝాషువా 11.పుట్టపర్తి నారాయణచార్యులు12.జంధ్యాల పాపయ్యశాస్త్రి13.మల్లవరపు విశ్వేశ్వరరావు14.ఉత్పల సత్యనారాయణచార్యులు15.పైడిపాటి సుబ్బరామశాస్త్రి16.ఆరుద్ర17.దాశరధి18.రాయప్రోలు సుబ్బారావు19.నాయని సుబ్బారావు20.తుమ్మల21.కాటూరి వెంకటేశ్వరరావు 22.అడవి బాపిరాజు23.విద్వాన్ విశ్వం24.కాళోజి25.వానమామలై వరదాచార్యులు26.దివాకర్ల వెంకటావధాని27.దేవులపల్లి కౄష్ణశాస్త్రి28.వెంకటపార్వతీశకవులు.
కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం. 'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?' కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో? (బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Tuesday, January 29, 2008
Saturday, January 26, 2008
నాదబ్రహ్మయోగి - 'కాకర్ల త్యాగరాజూ ( 1767 - 1847 ) - నేడే సంప్రదాయ ఆరాధనోత్సవాలు

శ్రీరామచంద్ర చరణార్చక భక్తశ్రేష్ట! బహురమ్య భావరస సంయుత గీతకర్త! వేదాంత తత్త్వ బహుళార్ధ వివేకమూర్తి! శ్రీ త్యాగరాజ గురుదేవ, నమో, నమస్తే!
తెనుగుజగతిలో భక్తి, ధ్యాన, ముక్తి, భవబంధురభావ సామ్రాజ్యాలని పరిపాలించిన ప్రసిద్ధులలో సరిసములు లేని మున్మూర్తుల రాజులు - త్యాగరాజు, పోతరాజు, గోపరాజు - కౄతులు, భాగవధకధామౄతం, కీర్తనల ద్వారా రసానంద, అమౄతోపమాన, భావచైతన్యస్ఫూర్తికరంగా అందించిన మహావరప్రసాదాలు.
త్రివేణీ సంగమం గా సాహిత్యం, సంగీతం, గానం తో వాగ్గేయకారకత్వం
మానవుని కళాత్మక చైతన్యానికి భాషతో పాటు సంగీత నౄత్యాలు అందమైన ప్రతీకలు. సంగీతం లేని భాష లేదు. నౄత్యం లేని నాగరికత లేదు. లయాన్వితంగా వెలువడిన భాషకు శ్రవణతర్పణ గుణం వుంటుంది. చెవులకు ఇంపులేని భావానికి, భాషకూ ఆకర్షణ లేదు. కనుకనే సంగీతాత్మకమైన భావమే కవిత్వమన్న భావనకు ప్రాచుర్యం లభించింది. తెలుగుకవిని రాగమధురిమలతో సుసంపన్నం చేసిన మహనీయుల జీవితం ధన్యతనుపొందింది. కవితలల్లి, వాటిని రాగబద్ధం చేసి పాడగలిగే ప్రతిభామూర్తులే వాగ్గేయకారులు. మన తెలుగుజగతిలో పలువులు వాగ్గేయకారులు అవతరించి - సంగీత, సాహిత్య, భక్తితత్వాలను మూర్తీభవించిన త్రివేణీసంగమాలై ప్రభవిల్లారు. సంగీత, సాహిత్యాల సమ్మేళన రూపాలైన పదకర్తల్నే వాగ్గేయకారులని, వాక్కు (సాహిత్యము_, గేయం (సంగీతము), రెంటినీ చేయగల సమర్ధుడు వాగ్గేయకారుడు. ఈ వాగ్గేయాల్నే మాతువు, ధాతువు అనడం సంగీత పరిభాష. ప్రాచీనకాలంలో, అన్నమయ్య, క్షేత్రయ్య, నారాయణ తీర్ధులు, రామదాసు, సారంగపాణి, పోతులూరి వీరబ్రహ్మం, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, త్యాగరాజు, మంగళంపల్లి బాలమురళీకౄష్ణ వంటివారిని ప్రధమగణనంలో తప్పక ప్రస్తావించాలి. ప్రస్తుతతరపు ప్రతినిధులుగా శ్రీ మంగళంపల్లి బాలమురళికౄష్ణ ను కూడ ప్రస్తావించాలి.
నాదోపాసన పరంపర లో 'మూర్తిత్రయం'
వేదపరమార్ధాల్ని లోకమునకు అనుగ్రహించిన తేజోమూర్తి నారదుడి దివ్యానుగ్రహముతో వ్యాసుని గాంధర్వవేదము (సంగీతం)నకు, 'వ్యాసకటకమూ అను నిబంధన గ్రంధమును స్మరించెనని ప్రమాణము. 'నారద కటకమూనకు స్వరార్ణవమను సంకేతం కలదు. 'హనుమత్కటకమూ ఔత్తరాహ సంగీతమునకు మార్గదర్శకమని సంగీత శాస్త్రమర్యాదను పెద్దలు నిర్ణయించారని చెబుతారు. పండిత వర్గములు, సంప్రదాయ సౄష్టలు తర్వాత, క్రమంగా, సన్నిహితులు సదాశివబ్రహ్మేంద్ర, నారాయణతీర్థ, రామదాసాదులు అర్వాచీనంగా ప్రసిద్దులైన వాగ్గేయకారులు. ఆ తర్వాత దక్షిణభారతమున తంజాపుర మండలము, శ్రీ త్యాగరాజేశ్వర క్షేత్రము తిరువారూర్ అను పుణ్యక్షేత్రమున, రెండు సంవత్సరాలలోపు తారతమ్యంతో అవతరించిన సంగీత త్రిమూర్తులుగా ప్రసిద్ధులు, వాగ్గేయకారులు - శ్రీ శ్యామశాస్త్రి (1763), శ్రీ ముత్తుసామి దీక్షితులు (1775), శ్రీ త్యాగరాజబ్రహ్మము (1767) లకు వేరే సపరిచయం అనవసరం.
మన 'త్యాగరాజూ
త్యాగయ్య నాదోపాసనలో ముక్తిపొంది భక్తుల కందరికి దారి చూపిన మహా వాగ్గేయకారసత్తముడు। అన్నమాచార్యుని ఆధ్యాత్మిక సంపద, పురందరదాసు సంగీత స్ఫూర్తి, రామదాసు భజనరీతి పుంజీభూతం గావించుకొని, సంగీత సామ్రాజ్యానికి అధినేతౄత్వం వహించిన మహానుభావుడు, త్యాగయ్య. త్యాగయ్య శహభూపాలుని ఆస్థాన వాగ్గేయకారుడై ప్రసిద్ధి కెక్కిన గిరిరాజ కవికి స్వయాన పౌత్రుడు. గిరిరాజ పుత్రులలో కనిష్టుదు రామబ్రహ్మం. రామబ్రహ్మం పుత్రుల్లో కనిష్టుడు త్యాగయ్య. 1600 ప్రాంతంలో కాకర్ల ( కంభం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్) నుంచి తంజావూర్ జిల్లా తమిళనాడు కి వెళ్ళి స్థిరపడ్డ ములికినాటి ఆంధ్ర బ్రాహ్మణ వంశం. సీతమ్మ - రామబ్రహం దంపతులకు 4 మే 1767 న త్యాగయ్య జన్మించాడు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆదరంలో ఉండేవాడు. తాత గిరిరాజకవి మహావాగ్గేయకారుడు. మాతామహుడు వీణ కాళహస్తయ్య ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు. తల్లి పురందరదాసాదుల కీర్తనలను పాడుకొంటూ ఉండేది. సంగీతం త్యాగయ్యకు ఉగ్గుబాలతోనే అబ్బింది. సంస్కౄతాంధ్రాలలో పాండిత్యం గడించాడు. శొంఠి వెంకటరమణయ్య వద్ద ఏడాదిలోపునే సంగీతంలో ప్రావ్విణ్యాన్ని సంపాదించాడు.
శ్రీరామదర్శనభాగ్యం - ఆశువుగా 'అఠాణారాగ కౄతీ గానం
రామకౄష్ణానందస్వామి, సన్యాసి, నారదోపాస్తి మంత్రాన్ని త్యాగయ్య కుపదేశించాడు। నారదుడు యతివేషంలో వచ్చి స్వరార్ణవమనే సంగీత గ్రంధాన్నిచ్చి, సమస్త సందేహాలు తీరిపోతాయని ఆశీర్వదించి వెళ్ళాడు అని విశ్వాసం. తన గురువైన నారదుని అనేక విధాల ఎన్నో కీర్తనల్లోస్తుతించాడు. గురువు ఆదేశానుసారం 96 కోట్లు రామతారకమంత్ర పఠనంతో శ్రీరాముడు సలక్ష్మణసమేతుడై దర్శనమివ్వడం, ఆ అనుభూతిలో, 'ఏల నీ దయరాదు పరాకు చేసేవేలా (ఆఠాణా రాగం) అని ఆశువుగా కీర్తనను రచించి గానం చేశాడుట. రామదర్శనసాక్ష్యంగా, రచించిన అనేక కౄతులు సాక్షీభూతంగా దర్శనమిస్తాయి. 'అలకలల్లాడగగని ఆ రామణ్ముని యెటు పొంగెనో' అన్నది ఉదాహరణం. రాజాశ్రయాన్ని తిరస్కరించి, నిత్య రామసంకీర్తన ఆచరణ, ఉత్తమవాగ్గేయకారుడిగా దేశవ్యాప్తంగా వచ్చిన కీర్తి, సంగీతసభలు, సన్మానాలు విరివిగా చేసేవారట. తంజావూరు ప్రభువు కానుకలను కూడ తిరస్కరించాడు. ఆవేశంలో 'నిధి చాల సుఖమో - రాముని సన్నిధి సేవా సుఖమా' అని గానం చేశారు. తిరువాంకూర్ ప్రభువు స్వాతి తిరునాళ్ళు ఆహ్వానాన్ని తిరస్కరించడం, 'పదవినీ సద్భక్తియుగల్గుటే' అని, త్యగయ్య పూజించే రామ పంచాయతన విగ్రహాన్ని కావేరీలో పడవేసి, 'ఎందు దాగినాడో?' అన్న కౄతిద్వారా తన ఎదలోని రొదను తెలిపాడు. రాముడు స్వప్నంలోకి రావడం, కావేరి నుంచి విగ్రహాన్ని తెచ్చుకొని పూజచేయడం ప్రారంభమైంది. తిరువొత్తియూరు, కోవూరు, నాగలాపురం, తిరుపతి, పుత్తూరు, కంచి, వాలాజపేట, శ్రీరంగం, నాగపట్టణం, ఘటికాచలాది పుణ్యక్షేత్రాల్ని సందర్శించి ఆయా దేవతల ఉపముద్రతోటి అనేక కౄతులను సమకూర్చాడు.
సంకీర్తన నుంచి కౄతి వరకు భక్తి, ధ్యాన కవిత ప్రస్థానం
అన్నమాచార్యుల సంకీర్తనగాను, ఆధ్యాత్మికపరంగాను అవతరించిన కీర్తన, రామదాసు, నారాయణతీర్థులు, సుబ్రహ్మణ్యకవి వంటి వాగ్గేయకారులచే భజన, ఆధ్యాత్మన కీర్తనగాను, ధాతుకల్పనతో నూతనమార్గాన్ని అనుసరించి, మరొక నూతనరూపంలో, త్యాగరాజు నాటికి 'కౄతీ అనే పేరు వహించి పరిపక్వం పొందింది. కౄతులు దశలో రాగాలస్వరూపంలో కూడ చాల మార్పులు సంభవించి, రాగస్వరూపదర్శనానికి త్యాగరాజ కౄతులు దర్పణాలై విరాజిల్లాయి. ఏది ఏమైనా, పదం, కీర్తన, కౄతి రూపాలు త్రివేణీసంగమమై, ముప్పేటన అల్లుకుపోయాయి. ఈఆధునిక సాహిత్య-సంగీతకళా సంస్కౄతిలో విభజించడం జరగని పని. పేరులోనే పెన్నిధి అన్నది వర్తించకపోయినా, ఏప్రక్రియ అయినా, సంగీతనిధి అని చెప్పక తప్పదు. 'సాహిత్యంలో అంతరార్ధాన్ని మరింత ప్రస్ఫుటం చేయడానికి రాగసంచారంలోని ప్రత్యేకప్రయోగాల ద్వారా రాగభావాన్ని సాహిత్య భావంతో రంగరించి విస్తరించడానికి సంగతుల ప్రయోగం విరివిగా జరిగి త్యాగరాజకౄతులకు ప్రత్యేక స్వరూపాన్నిచ్చింది. ఈ సంగతుల విస్తరణనే ధాతుకల్పన దక్షతగా విజ్ణులు భావించారూ అని తెలుగు వాగ్గేయకారులపై విశ్లేషణ చేస్తూ డా. యస్.గంగప్ప గారు వివరించారు.
త్యాగరాజకౄతుల ముత్యాలసమాహారమాలిక - 'త్యాగబ్రహ్మోపనిషత్తూ
'త్యాగరాజ స్వామి వ్యక్తిత్వంలో మూడు గుణాలు ప్రధానంగా - నాదబ్రహ్మోపాసన శక్తి, భక్తిజ్ణాన పరీపాకం, కవితాలాలిత్యం అయితే, వారికి సంగీతం మీద ఉన్న అధికరక్తి, సాహిత్యంమీద గౌణభక్తి పుష్కలమైతే, సాహిత్యాపాసకులు త్యాగరాజ కౄతులలోని సాహిత్య రసికత్వాన్ని, సంగీత సంయోజన సౌలభ్యాన్నీ సమీక్షించి భక్తిరససిద్ధిని సాధించుకుంటారూ అని ప్రముఖ సాహితీవిమర్శనచక్రవర్తి డా.జి.వి.సుబ్రహ్మణ్యంగారు 'త్యాగరాజస్వామి భక్తికవితావైభవం' అన్న సుదీర్ఘవ్యాసానికి ఆముఖం - కృౠతి-సుకౄతీ ద్వారా తెలియపరుస్తూ, 'కౄతులలోని రాగాన్ని ఆలపిస్తే కలిగేది గానరసం; కౄతులలోని సాహిత్యాన్ని సమాలోచిస్తే కలిగేది సాహిత్యరసం' రసద్వయాన్ని మరింత రసభరితంగా ప్రవచించారు. త్యాగరాజు కౄతులకు 'త్యాగబ్రహ్మోపనిషత్తూ అనే ప్రసిద్ధికలగడం, 2400 కీర్తనలను రచించినట్లు సమాచారం. అయితే, నేటికి కేవలం 500 పై చిలుకుగానే లభించడం, సంగీతస్వరాలతో ప్రచారంలో ఉండడం గమనిస్తాం. త్యాగయ్య 72 మేళకర్తరాగాలలోనూ కౄతులు రచించాడు. బహువిధ కౄతులతోపాటు, ప్రహ్లాదభక్తివిజయం, నౌకాచరిత్రము, సీతారామ విజయము అన్న సంగీతరూపకాలైనా, వీటిని, ప్రబంధాలని, నౄత్యనాటికలుగాను ప్రఖ్యాతమైనాయి. త్యాగరాజకౄతుల్ని బహుక్లుప్తంగా క్రోడీకరించాలంటే, పామరభాషలో, చక్కని కౄతిరచనలు, వర్ణనలు, భక్తిరచనలు, నీతివైరాగ్యరచనలు అని చెప్పవచ్చునేమో.
ఘనరాగ పంచరత్న కీర్తనలు - ప్రత్యేక శైలీసంప్రదాయాలు
త్యాగరాజు రచించిన కౄతులు,కీర్తనలలో దేని ప్రత్యేకత దానిదే। త్యాగయ్య కీర్తనలన్నీ భక్తి ప్రపూరితాలు. రస, స్వర, మధుభరితగుళికలు. అయితే, ప్రత్యేకశోభతో రాణించే మణిప్రకాశంలా, ఘనంగా ప్రస్తావించతగ్గ, ఉత్తమోత్తమస్థానార్హాలుగా, 'త్యాగరాజు ఘనరాగ పంచరత్నా కీర్తనలను విశేషంగా వివరించాలి. ఈ పంచరత్న కీర్తనలుగా నిరంతరం చెప్పబడే వాటిలో, స్వరాలబిగి, కూర్పు, సంగీతంలో ఉదాత్తతల్లో వాటి మహత్త్వత బహుధా ఉగ్గడింపబడ్డాయి. కర్ణాటకసంగీతజగతిలో జ్ణానులు, విజ్ణానులు, ప్రజ్ణానులు, స్వామివారి ఆరాధనాక్రమంలో పునీతంగా, పులకరింతలతో, అనుభవిస్తూ,పలవరించే భక్తిపరంపర వర్ణనాతీతం. ముక్తకంఠాలతో, భక్తిభావం వెల్లివిరిసేలా గానం చేయడం విధిగా విధిని పాటిస్తూ, సద్విధిగా భావిస్తూ ఆచరిస్తారు. సంగీతపు విలువలు, కీర్తనలనాణ్యత, సంగీతసాహితీవిద్వత్తులోకానికి, తద్వారా రసికులకు సుపరిచితాలు. చరణాలు అధికం, సుదీర్ఘమైన కూర్పు, శబ్దాలసంతరిఫులో విశిష్టత, భావప్రసారంలో నైపుణ్యం, మొదలైన ప్రత్యేక నైజాలు, శైలీసంపదల్ని కలిగివుండడం కారణాన, సార్ధకనామధేయంగా 'ఘనరాగకీర్తనాలని భావించడం సర్వోచితం. కీర్తనయావత్తు అవగతమే కాకుండ, త్యాగరాజులవారు భక్తిబోధనామౄతధారను వీటిలో ప్రవేశపెట్టడం జరిగింది. పంచరత్నకీర్తనలను ఏకైక ప్రయోజనసూత్రంతో బంధించి, ఘనరత్నకీర్తనామాలగా సంతరించి, సంఘటించిన తీరుతెన్నుల్లో, ఒక పద్ధతి, క్రమం, సంపుటీకరణం సుస్పష్టత కనిపిస్తుంది.
ఘనరాగ పంచరత్న కీర్తనలు
'యిరువదిరెండు శ్రుతుల కలయికకు ఆస్కారములు కావడంచేతనూ, వీణలో యీ రాగాలని గానంచేసేటప్పుడు తానవిస్తరణకి ఎంతో అవకాశం ఉండడంచేతనూ, వీటిని ఘనరాగాలని, మంగళప్రదములై సుస్వనశోభితములైన రాగశ్రీలుగా సంప్రదాయంగా భావించడం జరుగుతుందీ అని ఘనరాగాల గురించి నిర్వచనాన్ని 'త్యాగరాజస్వామి భక్తికవితావైభవం' అన్న వ్యాసంలో ఆకెళ్ళ అచ్యుతరామం గారు విశదీకరించారు. కేవలం 'ఆదీతాళంలో స్వరపరచిన ఈ పంచరత్న కీర్తనలు - పల్లవి, అనుపల్లవి, వాటి తాత్పర్యం, యిలా వున్నాయి.
1। 'జగదానంద కారక; (నాట రాగం)
'జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక, గగనాధిపసత్కులజ రాజరాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకలా।
ఓ శ్రీరామా! నీవు జగములకు ఆనంద కారకుడవు, జానకీ ప్రాణనాధుడవు నీకు జయము. ఓ శ్రీరామా! నీవు ఆకాశాధిపతియైన మంచి సూర్య వంశమున జన్మించితివి. రాజులకు రాజులైన వారికి రాజువు పుణ్యములను శుభములను ప్రసాదించువాడవు, ఎల్లలోకములనూ ఎల్లప్పుడునూ ఆనందమును కలుగ చేయువాడవు.
2॥ 'దుడుకుగల నన్ను ...' (గౌళ రాగం)
'దుడుకుగల నన్నేదొరకొడుకు బ్రోచురా ఎంతో, కడు దుర్విషయాకౄష్ణుడై గడియ గడియకు నిండారూ
త్యాగరాజు స్వామి తను చెడ్డవాడనని, అందుచేతనే శ్రీరాముడు తనను రక్షించుట లేదని, దర్శనమీయుట లేదని తనలో తాను ఆత్మవిమర్శన చేసుస్కొనుచున్నారు। నిజమునకు, వారు ఈ కీర్తనలో తాను చేయుచున్న చెడ్డపనులు, చెడ్డ ఆలోచనలు తాను ఎప్పుడూ చేయలేదు. తన కాలమున (ఇప్పటి కాలమున కూడా) తక్కిన సంగీతజ़్జులు చేయు దుడుకు పనులు తన మీద ఆపాదించుకుని శ్రీరాముని వారి కొరకు ప్రార్ధించు చున్నారు. అనుక్షణము, ఎడతెగక, చెడ్డ పనులతో, చెడు ఆలోచనలతో నా మనస్సు నిండి యున్నది. చెడ్డ బుద్ధి నన్ను చుట్టుకొని యున్నది. అటువంటి నన్నుఏ భగవంతుడు రక్షించును?
3। 'సాధించెనే, మనసా' (ఆరభి రాగం)
'సాధించెనే ఓ మనసా! బోధించిన సన్నార్గవచనముల బొంకుజేసి తా బట్టిన పట్టు - సమయానికి తగుమాటలాడెనే'
ఈ కీర్తనయందు శ్రీ త్యాగరాజు స్వామివారు (శ్రీరాముని బదులు) శ్రీకౄష్ణుని సాధించుచున్నారు। నిందాస్తుతిని చేయుచున్నారు. శ్రీకౄష్ణుడు భగవద్గీత యందు సన్మార్గములను బోధించెను. కాని తాను బోధించిన సన్మార్గము వచనములను కల్ల చేసి, నాటికి భిన్నముగా తా పట్టిన మొండిపట్టును సాధించుకొనెను. శ్రీకౄష్ణుడు అవసరమునకు తగినట్లు, సందార్భానుసారముగా, సమయానుకూలముగా మాట్లాడుచూ, రాజకీయమును, తన మాయను ప్రకటించుచున్నట్లు పైకి కనిపించును. (కాని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లో శ్రీ కౄష్ణ పరమాత్మ తమ తలచిన పనిని నిర్విఘ్నముగా కొనసాగించుకొను సామర్ధ్యము కల మాయా మానుష విగ్రహుడు).
4॥ 'కనకన రుచిరా' (వరాళి రాగం)
'కనకనరుచిరా - కనకవసన నిన్ను, దిన దినమును మనసున చనువున నిన్ను, పాలుగారు మోమున శ్రీయ-పార మహిమదనరు నిన్నూ
బంగారు చేలములు ధరించిన ఓ రామా నీ సౌందర్యమును ఎంత చూచినను తనివి తీరదు। ప్రతి దినము నీ అంత: సౌందర్యమును నీ యందు గల చనువుతో భక్తితో ఎంత చూచినను తనివి తీరదు। త్యాగరాజస్వామి శ్రీరాముని బాలునిగా తన మనస్సు నందు చూడగలిగెను. పాలుగారు ముద్దుమోము గల రాముని అపారమైన మహిమ గల రాముని చూడ కలిగెను. అట్లు చూచి, తన్మయము చెంది వర్ణించుచున్నాడు.
5 ఎందరో మహానుభావులు (శ్రీ రాగం)
'ఎందరో మహానుభావులందరికి వందనములు। చందురు వర్ణుని యందచందమును హౄదయారవిందమునజూచి బ్రహ్మానంద మనుభవించువారెందరో'
మహాభక్తులు, మహాత్ములు మనకి తెలిసినవారు ఉన్నారు. మనకి తెలియని అజ़్జాతంగా ఉండిన మహానుభావులకు అందరికీ నా నమస్కారములు. పూర్ణ చంద్రునివలె ఆహ్లాదము కలిగించు, అందము, చందము, కలిగిన శ్రీరాముని హృౠదయ కమలమున నిల్పి ఎల్లప్పుడూ ఆ బ్రహ్మానందమున మునిగియుండు మహాభక్తులెందరో గలరు. వారికి అందరికీ నా ప్రణామములు.
వీటిని సవివరణాత్మకతకు ప్రత్యేక వ్యాసమే గత్యంతరం. అన్యధాశరణం నాస్తి.
యింతటి పరమోత్కౄష్టతను నింపుకొన్న వీటిని, పంచారామాలుగా, ఈ పంచరత్నకీర్తనలను భావించడంలో ఆశ్చర్యం లేదు। ప్రముఖ త్యాగరాజ సంగీతజ్ణులైన టి.వి.సుబ్బారావుగారు, పంచరత్నకీర్తనావైశిష్టతను, క్లుప్తంగా వివరించారు. "భగవంతుడు మానవునకు ప్రసాదించిన మహాభాగ్యాలలో అత్యంత అమూల్యమైనదీ, అతణ్ణి 'ఉద్ధరించేదే' యేదీ అంటే సంస్కౄతీ, సంస్కారమూ అన్న జవాబు తట్టుతుంది. ఆ సంస్కౄతీ మహానుభూతులకు కారకమైన వాటిలో మణిపూసలాగా సర్వోత్కౄష్టమైనది - సంగీతజ్ణానము, భక్తి. ఈ సంప్రదాయంలో అత్యుత్తమమైనది - కర్ణాటక కృౠతి, సంప్రదాయ సంగీతం. వీటిలో, ఉత్తమోత్తమ వాగ్గేయకారులెవరంటే, సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారన్నది రూఢి అవుతుంది. ఆ త్యాగరాజ స్వామివారి రచనల్లో అత్యంత ప్రభాసమానములై, ఉత్తమోత్తమంగా శోభించే కౄతులేవీ అంటే, అవి ఈ ఘనరాగపంచరత్నకీర్తనలే అనడం నిర్వివాదాంశం' అని సత్యప్రకటన చేశారు. ఈ కధనం, 'కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతలం - చతుర్ధాంకం, శ్లోకచతుష్టయం' అన్న పంథాలో వుంది. సంస్కౄతీ మహద్భాగ్యాలు వెతుక్కూంటూ పయనం చేస్తే, సందేహం లేని జవాబు ఈ పంచరత్నాలు, ఘనరాగసహితకీర్తనలు, సర్వసౌభాగ్యనిధులు.
త్యాగరాజు నిర్యాణ సన్నివేశం
1847 - 'ప్లవంగీ సంవత్సరము, పుష్యశుద్ధ ఏకాదశినాడు భద్రాచల రాముడు దర్శనమిచ్చి, 'పదిపూటలలో కరుణింతూనని చెప్పెనట। అనగా తనలో లీనమొనర్చుకొందురని భావించి 'శహనారాగములో 'గిరిపై నెలకొన్న రాముని గురితప్పక గంటీ అని కీర్తించినారట. పుష్య శుద్ధ పూర్ణిమనాడే త్యాగరాజు బ్రహ్మము ఆపత్సన్యాసమును స్వీకరించిరి. నాటినుండి త్యాగరాజస్వామియను సంకేతము రూఢియయ్యెను. పుష్య బహుళ పంచమి నాడు శ్రీ త్యాగరాజుగారు ఉష:కాలమందే స్నానానుష్ఠానములను నిర్వహించుకొనియుండగా, శ్రీవారి భక్తులు శిష్యులు చేరి రామభజన చేయుచుండగా, మరికొందరిని స్రీరమమంత్రజపము చేయుడని ఆదేశించి, మనోహరి రాములో 'పరితాపముగని యాడిన పలుకులు మరచితివో' అను కీర్తనను పాడి 'ధన్యాసీరాగంలో శ్యామసుందరాంగ సకలశక్తియు నీవేరా, ఇలను త్యాగరాజువేరా' అని కీర్తించుట తర్వాత చిన్ముద్ర ధరించి సమాధి నిష్ఠలో కపాలమోక్షమైనట్లు ప్రసిద్ధి కలదు.
మంగళవచనాలు
త్యాగరాజకౄతిలోనే ఈ నాదబ్రహ్మ గురించి మంగళం 'నీ నామరూపములకు మంగళం, నిత్య శుభమంగళం' 'రాజీవనయన త్యాగరాజ వినుతమైనా అని సమాప్తం చేయడం, భారతీయకళాసంస్కౄతీవైభవానికి నీరాజనం.
వాగ్గేయకార శిరోరత్నం అనదగిన రామతారక బ్రహ్మవేత్త, నాదమూర్తి శ్రీ త్యాగరాజస్వామి వారిని స్మరించువారికి ముక్తి, మోక్షం హస్తసిద్ధములు। మంగళంమహత్. జయతు రామనామ.
తమిళనాడు - తిరువాయూర్ లో పుష్య బహుళ పంచమి - ఈ సంవత్సరం - జనవరి 27 - రోజున సంప్రదాయబద్ధంగా, సంస్కౄతీపరంగా, నిర్వహించడం జరుగుతోంది. ఆ సందర్భంగా సమర్పిస్తున్న ఈ వ్యాస నివాళి.

Friday, January 25, 2008
దేశభక్తి పై తులనాత్మక పరిశీలనం
అనుకులంగా తరచు చెప్పుకొనే నినాదాలు,కధనాలు
భిన్నత్వంలో ఏకత్వం। అనేకమయినా ఏకం। సమైక్యత. మనదేశంలో దేశభక్తులు చాలా ఎక్కువ - దేశమునకు కొరత లేదు, దురవస్థ లేదు.తనకు, తన దేశీయులకు తలపులో, మాటలో, చర్యలో భేదం లేని దేశభక్తులం అని నిర్వచించుకున్నాం.మన కళలను నేర్చుకుని, దేశీయ సరకులను నింపుకుంటున్నాం.మాతృభక్తి, పితృభక్తి కొద్దో గొప్పో ఉన్నాయి, కనుక దేశభక్తి ఉందనే భావన, ధీమా.వొట్టిమాటలు కట్టిపెట్టడం, గట్టిమేలు తలపెట్టడం నిత్యం ప్రవచనాలుగా స్మరిస్తాం.యిటువంటు భూదేవి లేదు, మనవంటి పౌరులింకెవరు లేరు అనే ధీమా.గోలకొండ నీ రత్నకోశం, కోహినూరు నీ జడలో పువ్వు. తాజమహల్ నీ దివ్య భవనం.భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలు. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, తల్లిభూమిభారతిని పొగడుతాం. జాతినిండుగౌరవం నిలిపుతాం.దేశమంటే దిబ్బకాదని - పంటపొలములు, పంట్లతోటలు, గో నదీనిక్షేపనగములను కాంఛే మంగళదేవత నాదేశం.కలదు కలదు నిను కన్న దేశమిది. నిత్యం. సత్యం. నిశ్చయం.
ప్రతికూలంగా తరచు చెప్పుకోలేని సత్యభావాలు।
ఊహపోహలు లేనట్టి అధికార మదోన్మత్తులు దాసోహం అంటూ భజించుట ఒక్కటే, దేశారాధనం।వ్యర్ధాహంకారం, దురహంకారం, గ్రధిత నిత్యావ్యగ్ర సంభాషణలే దేశభక్తి సాహిత్యం।కుసంస్కారం, కుహనాసంస్కారమే కదం తొక్కుతున్న స్థితిగతుల్లో మననం చేయడం దేశీయం।ఆచరణలేని సంస్కరణ,కపటత్వం, ప్రతిఫలావాంఛలతోనే మనసులు, ప్రేమలు।కచ్చగట్టలేనివాళ్ళు, నోరుగట్టలేనివాళ్ళు, మనసు కట్టలేనివాళ్ళు. వొట్టిమాటలు, ఉత్తుత్తి మేళ్ళు. దేశభక్తుడను బిరుదు నెత్తికి కట్టుకుని తిరుగాడేవాళ్ళు.బుద్ధునకున్న హృదయప్రేమానుభూతులు దివిటీకి కూడ దొరకని ప్రబుద్ధులు రాజ్యమేలడాలు.దేశభక్తిని గుత్తకు కొన్నవారు చీకటిబజారులో తప్ప అమ్మరు.దేశభక్తీ! నీ పేరున గాదా, దేశద్రోహం జరిగేదంతా!దేశసేవంటే, సీనియారిటీతో పనిలేని ప్రమోషను.మస్కెట్లనుండి రైఫిళ్ళదాకా నడచిన దేశం, కొడవలి నుంచి కోతయంత్రందాకా సరిసమంగా సాగలేదు.ఖండఖండాంతరాల్లో ప్రఖ్యాతి కెక్కే దేశద్రోహుల్ని తయారుచేస్తున్న దేశపు రాజకీయ కర్మాగారమే ముఖ్యాంగం.డబ్బు దండిగా వుండీ, దరిద్రం దండిగా ఉండే దేశం మన భారతం.ఇంటి రట్టు బయట పెట్టు. దేశం గతి నానాటికీ తీసికట్టు.చివరిగా -గజానికొక్క గాంధారికొడుడు గాంధీపుట్టినదేశంలో!
భారతదేశం గణతంత్ర దినోత్సవం సందర్భంగా - ప్రముఖ కవి - సి.నారాయణరెడ్డిగారి సందేశగీతావాక్యాలతో ముగించడం సమచచితం.
నాదేశం భగవద్గీత! నాదేశం అగ్నిపునీత సీత! నాదేశం కరుణాంతరంగ!నాదేశం సంస్కారగంగ!
ఎక్కడికెళుతూందీ? దేశం ఏమైపోతూంది? హిమశైలశిఖరం పైకా? పాతాళకుహరంలోకా?
యదాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత! అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.వందేమాతరం.

Thursday, January 24, 2008
కవిత శారద - స్వరసుగాత్రి - కవితా కృష్ణమూర్తి
కవిత శారద - స్వరసుగాత్రి
సౌందర్య సంభూతం - భారతీయ సంగీతం
విషయం లేకుండా అందాల్ని కల్పించ గలదు కనకనే గానం కళల్లోకన్నీటికీ వుత్కృష్టమైనదయింది - చలం (మ్యూజింగ్స్)
సంగీతానికి, సాహిత్యానికి అద్భుతమైన ఒక శక్తి ఉంది। రెంటికీ పులిగోళ్ళున్నాయి. ఆ గోళ్ళతో గుండెను గీకి వేదనల నెత్తురును తోడుతాయి। నెత్తురుతోపాటు అలౌకికమైన అమృతాన్ని కూడా వెలికితీస్తాయి. అందుకే ఆనాటి ప్రముఖ కవిపండితులు చెళ్ళపిళ్ళవారు తన కధలు - గాధలు లో, " సంగీతంగాని, కవిత్వంగాని జీవితానికి స్వాతంత్ర్యాన్ని కలిగించడంలో అందెవేసినవే" అంటారు. కొడవటిగంటివారు అన్నట్లు, దివ్య్తత్వంతో కూడినది ఒకటే వుంది, అది సంగీతం. కల్లబొల్లి న్యాయాలకూ, ధర్మాలకూ, నీతులకూ, ప్రేమలకూ, బోధలకూ, అతీతమైంది.
యింతటి పవిత్రమైన, మహత్వపూరకమైన కళకు సేవ చేస్తున్న కళాకారులు, ఎంతమందో. అందరూ మహానుభావులే,
అందరికీ వందనాలు - అని నాదబ్రహ్మ త్యాగరాజు విరచిత కీర్తనను స్వరపరచవలసిందే. అటువంటి కళారంగం, ఆ రంగానికి సేవలను జోడిస్తే, చిత్రరంగం, చిత్రసంగీతం వస్తే, దానికి సార్ధకతను, అర్ధపరమార్ధాలను అనూహ్యంగా అందించే కళాకారుల్లో చిత్రసీమలోని నేపథ్యసంగీత కళాకారులు, కళాకారిణిలు. గాయనీమణుల్లో, ప్రతిభామూర్తి, కవితా కృష్ణమూర్తి కొద్దిమందిలో ఒకరు.
శారద - కవిత
తల్లిదండ్రులకు శారద, తండ్రిపేరు కృష్ణమూర్తిని జోడించిన వైనం। కాని, కళాప్రపంచానికి కవితా కృష్ణమూర్తి గా బహుళప్రచారంలోకి రావడంజరిగింది. మరోప్రముఖ సంగీతకళారుడైన డా. యల్. సుబ్రమణ్యం కు అర్ధాంగి అయి, కవితా సుబ్రహ్మణ్యంగా పేరుపొందిన సంగీతకళాకారిణి. తమిళకుటుంబంలో డిల్లీనుండి పుట్టిన ఈ శారద, సంగీతకళను అభ్యసించే సంకల్పంతో వ్యాపార రాజధాని, ముంబయి లోకి అడుగుపెట్టింది. సంగీతాభ్యాసం కొనసాగుతూనే, 'మాంగ్ భరో సజన' అన్న హిందీసినీమా (1980) లో తన గానలహరిని అందించి చిత్రసంగీతలోకాన్ని ఉర్రూతలూగించింది. అంతేకాక, శారద, కవిత గా మారిపోయింది. ప్రముఖ హిందీ చిత్రనాయకుడు అనిల్ కపూర్ కు జోడీగా నటించిన అందాలరాశి శ్రీదేవి నాయికగా, 'హవా హవాయ్' అన్న పాట దశదిశలా వ్యాపించి, చెవులను, మనససులను కూడ రంజింపచేసింది।
కవిత ప్రతిభకు 'హాట్రిక్'
హిందీచిత్రసీమకు తిరుగులేని సంగీత దర్శకుడు, ప్రముఖ సంగీతదర్శ్కుడు యస్.డి.బర్మన్ కొడుకు ఆర్.డి.బర్మన్
సంగీతదర్శకత్వంలో వచ్చిన చిత్రం ' 1942 - ఎ లవ్ స్టోరీ ' లోని యిద్దరు గాయనీమణుల్లో - కవిత ఒకరు.
అయితే, ఆ మరొకరు ఎవరనుకున్నారు? గానకోకిల, భారతరత్న లతామంగేష్కర్. ఈ నూతన తరహాలో నడచిన
ప్రేమకధాచిత్రంలో యిద్దరూ పోటీపడుతూ పాడేసికూచున్నారు. కవిత చిత్రగాన మాధుర్యానికి తార్కాణంగా, 1994,
1995, 1996 ల్లో ఫిలింఫేర్ - అత్యధ్బుత గానకళాకారిణి కి వరుసగా 'హాట్రిక్ ' ను పొందారు. 2003 లో యిదే
పురస్కారం 2003 లో మళ్ళీ వరించడం జరిగితే, 2005 లో భారత ప్రభుత్వంవారు 'padmaSrI' పురస్కారంతో
కవితను గౌరవించారు।
జీవితం - భాగస్వామ్యం - సంగీతకళాసేవ
జీవీతభాగస్వామ్యం లోనూ సంగీతసేవ మరువలేని పర్వంగా నడుస్తోంది।జీవితభాగస్వామి, ప్రముఖ వైలన్ విద్వాంసుడు 'డా। యల్। సుబ్రహ్మణ్యన్' తో కలసి సంగీత కార్యక్రమాల్లో భాగస్వామ్యం మరొక ప్రముఖ అంశం, కవితకు.
గానకోకిల ప్రశంసలు, పొగడ్తలు
భారతరత్న, గానకోకిల లతామంగేష్కర్ తనదైన భావాన్ని జోడించి, కవిత గాన ప్రతిభ గురించి చెప్పిన తీరు యిలా వుంది:
" సంగీతానికి చరమదశ వచ్చిందని భావించాను। కాని, నేను తప్పుగా భావించాను " అని చెప్పడం తోటి కళాకారినికి
సమస్థాయి పురస్కారం అనన్యం। కవిత గానం చేసిన చిత్రం - ' హం దిల్ దే చుకే సనం 'లో యిస్మైల్ దర్బార్ చిత్రగీతాలు రసరమ్యగీతాలు. కవిత గానం ఒక విశిష్టమైన, సుస్వరసహితమైన, రాగబద్ధ, సుగాత్రీ ' అని పలవరించిన తీరు సరిసములులేని విశ్లేషణ అనే చెప్పాలి. పాకీస్తాను ప్రభృతుడు, మహమ్మద్ యిమ్రాం ఖాం కూడ కవితాగానాన్ని చాలా మెచ్చుకోవడం మరువలేని మరువం.
మచ్చుతునకలు - ఎన్నో, మరెన్నో
కవితాగళంలో అద్భుతమైన చిత్రగీతాలని కొన్ని మాత్రమే ప్రస్తావించి, ఆమె ప్రతిభను అంచనాలకు అందనిది అని నిరూపిస్తాను.మొహ్రా చిత్రంలో, 'తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ - అన్న పాట ఉదిత్ నారాయణ తో పాడినది, ఓ యారా దిల్ లగానా (అగ్నిసాక్షి), యిల్లు యిల్లు అన్న పాట సౌదా కర్ సినీమాలోను, మేరా పియా ఘర్ ఆయా - అన్న పాట, యారనా సినీమాలోను, తాళ్ లో - యిష్క్ బినా అన్న పాట, అఛ్ఛీ లగతీ హో - కుఛ్ న కహో చిత్రంలోను, ఐ లవ్ మై యిండియా - పరదేశ్ లోను, ఛలో ఛలే మిత్వా - నాయక్ చిత్రం లోనూ కవిత పాడిన పాటల ప్రతిభాపాటవాలు, కవిత ప్రతిభ కుతూహల రాగానికి స్వరప్రతీక।
మన చిత్రాలకూ కవితాగానం
ప్రతిభ వున్న కళాకారులు, ఆంధ్రప్రదేశ్ ను దర్శించకుండా, తెలుగుప్రజలకు తమతమ ప్రతిభలను ప్రదర్శించకుండా తమ వృత్తులను కొనసాగించడం సుసాధ్యం కాదు, కానేరదు. మన తెలగు మూర్తులకు కవిత చిత్ర కవితలను కలిపిన గొంతుల్లో ఒక నూతనత్వం, నవ్యత్వం నిత్యం గోచరిస్తాయి। మచ్చుతునకలు, తెలుగు్ చిత్రగీతికలు కొన్ని యిలా సాగాయి. కలలో నువ్వే (చిరుజల్లు), ఆడపిల్లలు (హోలీ), పెళ్ళికి బాజా (జయం మనదేరా), నిన్న కుట్టేసినాది
(నరసింహనాయుడు), కొక్కొరోకోరో (సోగ్గాడు), నెల్లూరి నెరజాణ (విష్ణు), ఒకసారి (విష్ణు) సినీమాల పాటలు ఆనాటి
కవితా కృష్ణమూర్తి, ఈనాటి కవితా సుబ్రహ్మణ్యన్, మన తెలుగు ప్రజకు అందించిన అద్భుతచిత్రగీతరాజాలు.
కవిత కమనీయ జన్మదిన శుభదినోత్సవం సందర్భంగా, ఆమె సుస్వరగళం, సరసస్వరసురఝరీనాదం వేదఘోషలా వినిపించాలని,
ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలను అందజేసుకుంటూ, భగవంతుడు మరింత సుసంపన్నమైన వృత్తిని, ప్రవృత్తిని అందిస్తాడని భావిస్తూ, సర్వేజనా:సుఖినోభవతు:
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Wednesday, January 23, 2008
నేతాజీ సుభాష్ చంద్రబోస్ - విప్లవానికే నాయకుడు

చూపుకు చూపు విసరిన చతురుడు
ఆయన ఒక జాతీయనాయకుడు।చాలాకాలం కాంగ్రేసులో భాగస్యామ్యం, గాంధీజీ అహింసా విధానాలపైనా ప్రభావం చెందినవాడు. అయినా, తెల్లదొరల పరిపాలనా విధానాలను చూశాక, ప్రజలు పడిన యిబ్బందులను చూడలేక, ఊరందరిది ఒక దారి, ఉలిపికట్టెది మరోదారి అన్నట్లు, కొత్తపుంత తొక్కాడు. గాంధీజీ భావాలకు దూరంగా జరిగాడు. చూపుకు చూపు, పళ్ళునూరుతూ పటపటకు పటపట అని చెప్పేవాడు. తెల్లవారిని పారద్రోలడానికి, నూతన పథకాన్ని, భారతీయ జాతీయ సైన్యం, అజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించాడు. ఆయన ఎవరో కాదు, అందరికీ నేతాజీ గా సుపరిచితుడు - సుభాష్ చంద్రబోస్. గొప్ప జాతీయవాది, దేశపు స్వాతంత్ర్యం కోసం అకుంఠిత దీక్ష తో పోరాటం సలిపిన వ్యక్తి. గాంధి, నెహ్రూ లాంటి భారతప్రభుత్వానికి నాందీ బోస్
నాయకులకున్న భావాలకు భిన్నంగా, అవసరమైతే, దేశపు సైన్యం తిరగబడితేనే తప్ప, భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడం సాధ్యపడదు అని విశ్వసించిన విజ్ణాని। బి।ఎ. ఆనర్స్ పాసయి, ఐ.సి.యస్. లో కూడ ఉత్తీర్ణతను సాధించాడు. కాని, ఉద్యోగంలో చేరితే, బ్రిటి్ష్ పాలనలో ఉద్యోగం చేయడం మనసొప్పక, రాజీనామా చేశాడు. వెంటనే, జాతీయోద్యమంలోను, కాంగ్రేసులో కూడ చేరాడు. విప్లవభావాలకు, తత్సంబంధిత కార్యకలాపాల నిమిత్తం బోసు అనేకసార్లు అరెష్ట్ అయ్యాడు. కలకత్తాలోని తన యింటిలో నిర్భంధం నుంచి పారిపోవడం, కారాగారం లోకి రావడం కూడ బోసుకి పరిపాటే. అలా ఓ సారి పారిపోయి జపానుకు చేరుకున్నాడు. అక్కడ సహాయంతో, 'భారతీయ జాతీయ సైన్యం', 'తాత్కాలిక భారతప్రభుత్వం'ను ధైర్యంగా స్థాపించడం జరిగింది.
విశ్వవ్యాప్తంగా 'నేతాజీ'గానే గుర్తింపు
సుభాష్ చంద్రబోస్ గా తల్లిదండ్రులు పెట్టిన పేరు కాక, విశ్వవ్యాప్తంగా 'నేతాజీ'గానే సుపరిచితులు। ఒరిస్సా లోని కటక్ లో గౌరవ సంప్రదాయ కుటుంబంలో జన్మించిన బోస్, యుక్తయవసులోనే జాతీయస్థాయిలోనే ఉద్యోగం లభించింది. 1943 లో ఆర్మీ ని స్థాపించి నిర్వహించడం జరిగింది. తెల్లదొరల పాలకులను నేతాజీ ఆర్మీ ఉత్తర-తూర్పు ప్రాంతాల్లోని వారి సైన్యాన్ని, బోస్ సైన్యం తరిమివేసే ప్రయత్నం సంపూర్ణంగా సఫలం కాకపోయినా, ఆ ప్రయత్నం చాలా ప్రభావం చూపించింది. భారతీయులకు అనుకున్న దానికన్న, త్వరితంగా స్వాతంత్ర్యం సంపాదించడానికి చాలా దోహదమయ్యింది.
నేతాజీ సైన్యవిభాగం రూపురేఖలు
సామాజిక సమానతకు మారుపేరు। అన్నిమతాలనుంచి ప్రాతినిధ్యం కనిపించాయి. దేశానికి స్వాతంత్ర్యం పొందడమే అందరి లక్ష్యం. బానిసత్వానికి భరతవాక్యం పలకడం మరొక సంకల్పం. సుభాష్ చదువుకొనేటప్పుడు, తెల్లదొరల పిల్లలు, తోటి భారతీయుల పిల్లల కన్నా తెలివైనవారుగా ప్రకటించుకోవడం నేతాజీ సహించుకోలేకపోయాడు. ఈ వివాదాన్ని, వివక్షతని భరించలేని బోస్ ఒకసారి అంగ్లబాలుడి పై చేయి చేసుకోవడం కూడ జరిగింది. ఆ రోజుల బానిసత్వన్ని విభజించు - పాలించు అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారు తెల్లవారు. పదిహేనేళ్ళ వయసులో తన తల్లితో, భారతదేశం అత్యంత ప్రీతిపాత్రమైన దేశమన్నది నిజంగా నిజం. నేతాజీ ఆలోచనలని, ఎప్పుడూ తనలోనే గుంభనగా దాచుకొని, ఆచరణకు వాడుకొనేవాడు. గెడ్డం పెంచుకొని, గుర్తుపట్టలేకుండ, పఠాం గా వే్షం వేసుకొని పెషావర్ కు పారిపోయాడు. జర్మనీలో హిట్లర్ దూసుకుపోతూంటే, నేతాజీ మేధ చురుగ్గా, శతృవు శతృవు - మిత్రుడు అన్న ఆలోచనన మెరిసి, చక్రం తిప్పాడు. కాని, సాధ్యపడక, ఓడలో జపాన్ చేరుకున్నాడు. సింగపూర్, బర్మా లో స్థిరపడిన భారతీయల సహకారం దొరికింది. ఫి్బ్రవరి 1944 లో తొలివిజయాన్ని చవిచూశాడు. ప్రజలు త్యాగభావంతో ముందుకు దూసకుంటూ రాసాగారు . కాని, అటవీ ప్రాంతాల్లో సైన్యానికి మలేరియా సోకి కొన్ని యిబ్బందులు మాత్రం వచ్చాయి . అమెరికాకు జపాను లొంగడం, యూరోపు లో జర్మనీకి ఓటమి, ఫలితంగా, నేతాజీ సైన్యం యింఫాల్ కు చేరుకోగలిగారు. కాని, హిట్లర్ తో మిత్రత్వం వల్ల, స్వాతంత్ర్యం తన చేతుల్తో భారతదేశానికి తీసుకురావాలన్న ఆశయం నెరవేరలేదు.
1945 లో తైవాం లో ఒక విమానప్రమాదంలో నేతాజీ మరణించాడని ప్రగాఢవిశ్వాసాన్ని అధికంగా భావిస్తారు.
జై నేతాజీ - జైహింద్। సుభా్ష్ చంద్రబోస్ అమర్ రహే. ఘన నివాళిని సమర్పించుకుంటూ ...

Monday, January 21, 2008
తెలుగు వ్యవహార భాషోద్యమ ప్రవక్త - తొలి అడుగు మన గిడుగు (వర్ధంతి - 22 జనవరి)
వ్యవహార భాష లో తొలి అడుగు మన గిడుగు
లోకమున ఒక్కొక్క పనికై ఒక్కొక్కరు జనింతురు; ఒక్కొక్క పనిలో ఒక్కొక్కరు రాణింతురు। ఏ దేశ చరిత్రలోనైనా ఒక కాలంలో ఒక ఘట్టంలో ఒక చారిత్రకావసరాన్ని తీర్చడానికి ఒక మహాపురుషుడు ప్రభవించడం కద్దు అని డా.అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ) గారన్నారు.
బహుముఖ ప్రజ్ణావంతుడు విభిన్న రంగాలలో విశిష్ట విజయాలను సాధిస్తాడు; ఇతరులకు అసాధ్యాలుగా తోచేవాటిని తన దీక్షతో, దక్షతతో, ప్రజలకోసం పాటుపడి సఫలం చేసినవారు, ఆ కార్యసాధన కోసమే పుట్టారని లోకులు భావించడం మన పూర్వాచారం; అలాంటి ప్రసిద్దులను కారణజన్ములని లోకం కొనియాడుతుంది అని సమగ్ర ఆంధ్ర సాహిత్య సౄష్టికర్త - ఆరుద్ర అభిప్రాయపడ్డారు।
పై యిద్దరు ప్రతిభావంతులు చెప్పినది ఒకే భావన. భాషాసాహిత్యచరిత్రలోనూ ఇది సంభవిస్తూనే ఉంటుంది. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో అలాంటి ఘట్టం వ్యవహారిక భాషోద్యమం. ఈ ఉద్యమానికి ఒక ప్రవక్త అవతరించాడు. ఆయన పధ ప్రవర్తకుడు, సత్యవాది, స్థితప్రజ్ణుడు, స్థిరసంకల్పుడు, మేధానిధి, మండితమౌళి, సంప్రదాయ పరిరక్షకుడు. ఆయన వ్యవహారిక భాషోద్యమానికే పుట్టాడని కొందరు, సవరభాషకూ, సవరలకూ అభ్యున్నతి ప్రసాదించడానికే అని కొందరూ భావించడం జరిగింది. ఆయన ఎవరోకాదు, ఆయనే గిడుగు వేంకట రామమూర్తిగారు.
వ్యవహారిక భాషకు మార్గదర్శి
గిడుగు వారిది భాషోద్యమం. కాలానుగుణ్యమైన భావ ప్రకటనా సౌలభ్యాన్ని కోల్పోయి ఎన్నడో వ్రాసిన వ్యాకరణానికి కట్టుపడిపోయిన తెలుగుభాషను సముద్ధరించి వ్యావహరిక భాషోద్యమాన్ని నిర్వహించి తెలుగుభాషకు విస్తౄతి కలిగించిన మహనీయులు, సద్విమర్శకులు - శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులుగారు. తన పాండిత్యంతో, మహాప్రతిభతో సంఘాన్నీ, సాహిత్యాన్నీ, ఉన్నతాశయాలవైపుకి పయనింపజేశాడు గిడుగు రామమూర్తిగారు. గిడుగువారు ప్రసిద్ధములైన కావ్యములన్నియూ పఠించి ప్రతిక్షణమూ పరివర్తనమవుచున్న జీవద్భాషలో గ్రాంధికమే వ్రాయవలయునని కంకణము కట్టుకొని కూర్చుండుట వ్యర్ధప్రయత్నమని ఈయన భావం. నిత్య వ్యవహారముననుండు ప్రయోగములు జ్ణాతముగానో, అజ్ణాతముగానో కవుల రచనలయందు దూరక మావవు అన్నది కూడ ఆయన భావనే. అందుకని శిష్టవ్యవహారసిద్ధమైన భాషనే వాడుట యుక్తమని వాదించిన సంకల్పదీక్షాతత్పరుడు. ఆ ఉద్యమమునకు ఫలితంగా పలువులు యువకులు వ్యవహరభాషలో రచనలు సాగించడం మొదలయింది.
గిడుగు వారి జీవనపథం
తెలుగు భాషాసాహిత్యాలు చేసుకున్న పూర్వపుణ్యం। తెలుగువారు చేసుకున్న అదౄష్టం. విజయనగరం ఉత్తరాన వంశధారానదీతీరాన ముఖలింగ క్షేత్రానికి సమీపాన ఉన్న పర్వతాలపేట నివాసం. గిడుగు వీర్రాజు , వెంకమ్మ పుణ్యదంపతులు తల్లిదండ్రులయ్యారు. ఫలితంగా, గిడుగు రామమూర్తిగారి జననం. ఆ రోజు 29 ఆగష్టు 1863. వీరి శైశవంతోపాటు, పన్నేండేళ్ళు వయసు వచ్చేవరకు విద్యాభ్యాసం యిక్కడే జరిగింది. విక్రమదేవవర్మ సహాధ్యాయి. రామ్మూర్తిగారికి యిద్దరు చెల్లెళ్ళు - యిద్దరు చాగంటి, కాళీపట్నం కుటుంబాలకు కోడళ్ళు అయ్యారు. ఈ రెండు కుటుంబాలు కూడ సాహితీప్రతిభను పుణికిపుచ్చుకున్నవి కావడం విశేషమే. ఎనిమిదోఏట విజయనగరంలో ఉపనయనం, తండ్రిద్వారా భారతభాగవతాలపట్ల అభిమానం కలగడం, పన్నేండేళ్ళకే తెలుగు భారతమంతా సుపరిచయం అయిందట. ఈ వయసులోనే రామ్మూర్తిగారికి పితౄవియోగం (1875) తో విజయనగరం లో బాధ్యతాయుతమైన కుటుంబాన్ని నడిపే భారం రామ్మూర్తిగారి వంతు అయింది. కొబ్బరితోటనుంచి వచ్చే పరిమితాదాయంతో కుటుంబాన్ని పెంచి పెద్దచేసిన తల్లి ఆ దొడ్డ యిల్లాలు. హైస్కూలు చదువు, గురజాడ అప్పారావు సహపాఠి అవ్వడం కూడ గర్వకారణంగా మారింది. వీరిద్దరిని ప్రధానోపాధ్యాయుల ప్రేమాభిమానాలకు గురికావడం కేవలం ప్రతిభ వల్లనే. 1878 లో భీమునిపట్నంలో ఓడవ్యాపారం చేసే కందికొండ రామదాసు కూతురు అన్నపూర్ణతో వివాహం జరిగింది. 1880లో పూర్తయిన మెట్రిక్యులేషన్ చదువు, సంసారం భారం పై చేయూతనివ్వాలన్న తల్లి ప్రేమాదేశాలు కురిపించారు. ఫలితంగా విశాఖపట్నం లో కలక్టరు ఆఫీసులో ఉమ్మేదువారిగాను, పర్లాకిమిడిలో జమీందారు ఉన్నతపాఠశాలలో నెలకు ముప్ఫై రూపాయల జీతంతో ఉపాధ్యాయపదవిని, ఆర్ధికపరమైన సమస్యలు రామ్మూర్తిగారికి ఊరటనిచ్చాయి. పర్లాకిమిడి లో నివాసం 1936 వరకూ గడిచింది. ఆఏడు కొత్తగా ఏర్పడిన ఒరిస్సా రాష్ట్రంలోకి పర్లాకిమిడిని చేర్చడం పట్ల తెలుగువాళ్ళు అభ్యంతరం, ఆందోళన చేయడంలో భాగంగా, అధర్మంగా, అన్యాయంగా తెలుగువాళ్ళ హక్కులకు భంగకరంగా, నిరసన తెలియజేస్తూ, రామ్మూర్తిగారు రాజమండ్రికి మనసు కలతచెంది మకాం మార్చారు. ఏభై ఆరు సంవత్సరాల నివాసం, ప్రఖ్యాతులతోపాటు యింటిని, సంస్థానాధిపతుల ప్రాపకగౌరవాల్ని కూడ సమకూర్చుకున్నారు. ఆత్మగౌరవానికి సహించని వీసమెత్తు వ్యతిరేకత, పట్టుదల, సంకల్పిత సిద్ధాంతంలో రాజీపడని ధోరణితో పర్లాకిమిడి హైస్కూలులోను, కళాశాలలోను, మొత్తం మూడు దశాబ్దాలుగా అధ్యాపకునిగా సేవలను అందించారు. గిడుగు వారిని సంప్రదించకుండ వ్యవహారం కొనసాగలేని అధికారం, మకుటంలేని మహారాజుగా గుర్తింపును పొందారు. 1896 లో బి.ఎ. చదువులో ఆనాటి చెన్నరాష్ట్రానికి ప్రధమశ్రేణిలో ద్వితీయులు. కళాశాలలో ప్రత్యక్షంగా చదవని మూలాన, స్వయంగా చదువుకుని పరీక్షరాసినందుకు ప్రధమంగా ప్రకటించలేదని తెలిసి వ్యధచెందారు.
సవరభాషకు అధిష్ఠాత
గిడుగువారి దౄష్టి సవరభషను నేర్చుకోవడం పట్ల పెంచుకోవడం, కౄషి జగద్విదితం. నాగరకతకు దూరమై కొండల్లోకోనల్లో జీవిస్తున్న ఆదిమజాతి ప్రజల విద్యావిజ్ణాన వికాసాలకోసం తన జీవితాన్నంతా వినియోగించారు. సవరభాషాసముద్రాన్ని చుళుకించిన అగస్త్య మహర్షి - గిడుగువారు అని మంజుశ్రీ అంటారు. జీవితాన్ని, శక్తియుక్తులతో కాలాన్ని, ధనాన్ని వినియోగించిన గిడుగువారికి ప్రప్రంచస్థాయిలో గౌరవ ప్రతిష్ఠలు లభించడం, మన తెలుగుజాతి చేసుకున్న పుణ్యం. అమెరికాలో విస్కాన్సిన్ విస్వవిద్యాలంనుంచి సవర భాషావాక్య నిర్మాణంపై పరిశోధన చేసిన స్ఠాన్ లేస్టరోష్టా అనే పండితుడు తమ పరిశోధనగ్రంధంలో రామ్మూర్తి పంతులుగారి స్మౄత్యర్ధం అంకితం చేయడం కన్న నిదర్శనం వేరే ఎందుకు? పారిస్, లండన్ విశ్వవిద్యాలయాల్లో గిడుగువారి భాషాచారిత్రక పురాతత్త్వ కౄషి వల్ల లబ్ధి పొందినవాళ్ళే, ప్రశంసించినవారే. సవరభాషలోని పదజాలానికిప్రకౄతి ప్రత్యయ విభాగం చేసి శోధించిన ప్రతిభామూర్తి. నిఘంటువుల నిర్మాణం, పదాలకు ప్రత్యాయాలను తయారుచేశారు. ఈ పనిని మరెవ్వరూ చేయలేని శబ్దశాస్త్ర పారంగతులు హిందూదేశంలో మరెవ్వరు లేరు అని ఆనాట ఎదురులేని భావప్రకటన. అయినా గిడుగువారు తన ప్రసంగాల్లో 'నాకు సంస్కౄతము రాదు; నేను పండితుడను కాను; నేను వైయాకరణిని కాను అని వినయసౌరభాన్ని వెదజల్లేవారట. 1935 లో సర్వేపల్లి రాధాకౄష్ణన్ గారి అధ్యక్షతలో యింగ్లీషు-సవర నిఘంటువును తమ బాల్యసఖుడు విక్రమదేవవర్మకు కౄతిని యివ్వడం జరిగింది. గిడుగువారు తెలుగుపత్రికను కూడ నిర్వహించారు.
సప్తతి సంబరాలు శోభాయమానాలు
1933లో రాజమండ్రిలో జరిగిన గిడుగువారి సప్తతి ఉత్సవాలు మూడురోజుల పెద్దపండుగలా జరుపుకోవడం ఆయన ప్రతిభకు తార్కాణాలు। వ్యాససంగ్రహం అన్న పేరుతో అభినందన సంపుటం - 46 వ్యాసాలు విశేషతునకలు. గిడుగువారి వ్యాసావళి, బాలకవిశరణ్యం, ఆంధ్రపండిత భిషక్కుల భాషాభేషజం, గద్యచింతామణి (సంకలనగ్రంధం), ప్రచురించి, అభిమానులు పంతులుగారికి బహూకరించారు. అదికూడ మామూలుగా యివ్వడం కాదు - అభినందన సాహితీసంపుటాలను వెండిపెట్టెలో వుంచి ఆయనకు అందించినట్లుగా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తమ ప్రబుద్ధాంధ్రలో ఆ సభావివరాలను వర్ణించారని, అక్కిరాజు వారు తెలిపారు. యిది గండపెండేరం కన్న చాలాఅ ఎక్కువ అనే చెప్పాలి. తెలుగుగడ్డమీద ఒక భాషాసాహిత్య వేత్తకు జరిగిన సత్కారాలలో ఇది అపూర్వ మైనది, అత్యంత ఘనమైనది అని పలువురు అభిప్రాయపడ్డారు.
వ్యహహార భాష ఉద్యమం - అర్ధం, పరమార్ధం
మంజుశ్రీ గారు ఉద్యమానికి ప్రాణభూతమైన అంశాలను వివరించిన తీరు యిలావుంది.
1. లక్షణ, వ్యాకరణగ్రంధాంశాలతో కావ్యభాషను శాసించకూడదు, పరిష్కరించకూడదు.
2। ఏకాభిప్రాయంగాలేని స్థితిలో ఏ ఒక్కరి విధానాన్నే ఆధునికులు ప్రయోగించాలని, ప్రయోగించకూడదు అని కవులను, రచయితలను తప్పుపట్టకూడదు.
3। లోకంలో శిష్టవ్యవహారంలోని పదాన్ని నిరసించకూడదు. ఏ ప్రయోగానికైనా లోకవ్యవహారం వల్లనే సాధుత్వం కలుగుతుంది. లోకవ్యవహార పదప్రయోగాలన్నీ సాధుత్వాలే. కవి ప్రయోగంవల్ల ఏ శబ్దానికైనా ఔచిత్యం, అనౌచిత్యం సంక్రమిస్తాయి. ప్రయోగం శిష్ట వ్యవహారంలో లోకంలో వుండి, అదే కవిప్రయోగం జరిగినప్పుడు, సాధుత్వంతోపాటు శిరోధార్యం అవుతుంది.
4. వ్యవహారభాషావాదులు యదేఛ్ఛావిహారవాదులు మాత్రం కారు. తప్పులన్నీ ఒప్పులుగా వాదించరు. ఒప్పులను తప్పులుగా అంగీకరించరు. భాషకు మార్పు అనేది వుండదు అనుకోవటం శాస్త్రీయ దౄక్పధం కాదు. ఉఛ్ఛారణ, సామాజిక పరిణామ చారిత్రక కారణాల వల్ల ప్రభావాలు, భాషలో పద, వాక్య సంయోజనంలో మార్పులు అనివార్యం; మార్పుకి కారణమైన తీరుతెన్నులు వెల్లడవుతాయి, కొన్ని నియమాలు కూడ ఏర్పడవచ్చు.
5. వ్యవహారిక భాషావాదానికి మాండలిక పదప్రయోగాలు ప్రతిబంధకాలు అన్న వాదం సరికాదు. కావ్యభాషలో కూడ మాండలిక ప్రయోగాలు, లోకవ్యవహారాల్ని కవులు, పండితులు ఆధునికకాలంలో అంగీకరించారు. యితివౄత్తానికి ఔచిత్యమైన భాషను స్వీకరించి, లక్షణ నిర్దేశాన్ని విస్తౄతపరచాలి.
పై అయిదు అంశాలు, వ్యావహారిక భాషోద్యమానికి పంచప్రాణాలు, పంచాక్షరీమంత్రాలు రామ్మూర్తి పంతులుగారి వాదనాసారం, సారాంశం అంతే, యింతే అని చెప్పాలి. గిడుగు వారి అడుగుజాడని గ్రామ్యాచార్యులనిం అధిక్షేపించడం అవివేకవిలాసితాలు అని తీర్మానించినవారు వేలకువేలు.
గిడుగా! పిడుగా!
గిడుగు రామ్మూర్తి పంతులుగారు సుమారు మూడుపదుల వసంతాలకాలంపాటు వ్యవహారిక భాషోద్యమానికి నేతౄత్వం వహించారు। కందుకూరివారిని సుముఖులను చేసుకోవడం, ఉద్యమంలో ప్రధానభాగం అనే చెప్పాలి. 1911 లో ప్రారంభమైన ఉద్యమం, 1940లో గిడుగువారి మౄతితో ఒక రూపును, ఊపును సంతరించుకున్నాయి. 1938లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారు కళాప్రపూర్ణతో గౌరవించుకున్నారు. అంతకు పూర్వం పాతికేళ్ళ క్రితమే ప్రభుత్వం వారికి రావుసాహబ్ సత్కారం, కైజర్ ఇ హింద్ అన్న పతకంతో గౌరవించారు. పంతులుగారు వినయ సంపన్నులు. సవరభాష తెలిసినంతగా తెలుగుభాష గురించి తెలియదని, కందుకూరివారికి విధేయుడు, సేవకుడు అని చెప్పుకున్నారు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు 'గిడుగాపిడుగా' అని రామ్మూర్తిగారి పాండిత్యాన్ని కొనియాడారు. అది ఒక మహోదధి అని వివరించారు. ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులుగారికి దోసిలొగ్గి సమర్పించుకొని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందేనని శాస్త్రిగారు ప్రశంసించారు. తెలుగు సరస్వతి నోములపంట అయిన గిడుగువారి పాండిత్యాన్ని విశ్వనాధవారు కూడ ప్రస్తుతించారు. అంతేకాక - గిడుగువారి వాదాన్ని అర్ధంచేసుకోక దురర్ధం కలిగించిన దుస్థితిలో తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారని విశ్వనాధవారు బాధపడ్దారు.
గిడుగువారు మానవతావాది, కరుణార్దౄహౄదయుడు, తెలుగు సవర, సవర తెలుగు నిఘంటువుల్ని, సంప్రదాయ విజ్ణానాన్ని, గాధాసంకలితాలు, సవరభషకు లిపిని ప్రసాదించినవాడు, ఆయన నిజంగా వాగనుశాసనుడే అని అక్కిరాజు వారి అభిప్రాయం కడు సమంజసం। తెలుగు, సవర భాషాసాహిత్యాలు ఈ ధరణిమీద సంచారం చేస్తున్నంతకాలం , గిడుగు రామ్మూర్తి పంతులుగారి కౄషిపర్వాలు నిత్యస్మరణీయాలుగా విరాజిల్లుతాయన్నదాంట్లో సందేహసంశయాలు లేవు, రావు, రాకూడదు.
1940 సంక్రాంతి రోజుల్లో రామ్మూర్తిగారు తమ తుది విన్నపాన్ని దేశానికి తెలియజేయాలనుకొన్న తరుణంలో, జనవరి 15 కనుమనాడు - "స్వరాజ్యం, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం, ప్రజాస్వామిక పరిపాలనకోరుచున్నాము। ఇటువంటి పరిస్థితుల్లో, మన ప్రజలకు సామాన్య జనులకు ఏ భాషద్వారా జ్ణానం కలుగజేయవలసి వుంటుందో, ఏ భాషలో గ్రంధరచన సాగించవలసి వుంటుందో ఆలోచించండి. మీ చేతులలో పత్రికలున్నవి. పత్రికలద్వారా మీరు ఎంతైనా చేయగలరు" అని వివరించారు. రామమూర్తిగారు ఎవరు ఎంతైనా చేయగలరని ఆశలు పెట్టుకున్నారో ఆ పత్రికలవారు అంతా చేయడానికి ప్రయత్నించారని, ఆధునికయుగంలో రామమూర్తిగారి ఆశలు, ఆశయాలు నెరవేరాయని, నేడు విశ్వవిద్యాలయంలో ఏ ఒకరిద్దరు ఛాందసులు తప్ప నూటికి తొంభైమంది వాడుక భాషనే అమోదించారు అన్న నగ్నసత్యాన్ని, ప్రముఖ కవి, ఆరుద్ర తన సమగ్రాంధ్రసాహిత్యంలో గిడుగు వారిపై సుదీర్ఘవ్యాసంలో చెప్పడం జరిగింది. ఈ అంతిమ సందేశం అందించిన మరో పన్నేండు రోజుల్లో, 1940 జనవరి 22 న గిడుగువారు తమ అంతిమశ్వాసను, భౌతికకాయాన్ని విడిచిపెట్టారు.
ఆరుద్రగారు వ్యాసంలో ముగించినట్లు, యశ:కాయాన్ని ధరించి గిడుగువారు నిజంగా కీర్తిశేషులయ్యారు; వారి కీర్తి జీవద్భాషకు స్ఫూర్తి అన్న భావంతో ఈ గిడుగు-పిడుగు భరిత వ్యాసానుభూతిని ముగించకుండా, ఆ మహానుభావుని ఆశయపధంలో ఒక చిన్న ఆలోచనతో ముందుకు అడుగు వేయమని, తెలుగుభాషను సర్వవిధాల సత్యం, నిత్యం, సత్వరంగా పరిరక్షించుకోమని, తెలుగుదేశపు విశ్వప్రజకు వినమ్రాలు సమర్పించుకుంటాను.
నేటి నా తెలుగుభాషకు నాటి ఊపిరి, గుండె, మనసుల సంగమత్రయం - గిడుగు, కందుకూరి, గురజాడ, తెలుగుభాషకు పాండితీత్రివేణీసంగమం। ఆ పవిత్ర తెలుగుభాషాధార నిత్యం జీవధారగా ప్రవహిస్తూనేవుండాలి. అస్తు. తధాస్తు.

ఈయన మరోగాంధీ .. శాంతిదూత - 'మార్టిన్ లూథర్ కింగ్'
ఈయన మరోగాంధీ .. శాంతిదూత - 'మార్టిన్ లూథర్ కింగ్' ( 1929 - 1968)
మహాత్మాగాంధి ప్రభావం ఈయనలో సుస్పష్టంగా విశదమవుతుంది. భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన పుష్కరకాలం లోపునే, ఈయన మనదేశాన్ని సందర్శించారు. గాంధీ అహింసావిధానం, నెహ్రూ పంచశీలపధం మనసుని దోచుకుంది. ఈ మార్గాల్ని దౄష్టిలో పెట్టుకుని, తనజాతి మానవ, పౌరహక్కులకోసం హింసరహిత ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి, 35 ఏళ్ళ వయసులేనే 'నోబెల్ శాంతీ పురస్కారాన్ని పొందిన వ్యక్తి ఎవరో కాదు. ఆయనే 'మార్టిన్ లూథర్ కింగ్', నీగ్రో పౌరహక్కుల సంరక్షణోద్యమానికి ఏకైక నాయకుడు. అట్లాంటా లోని జార్జియా లో 1929 జనవరి 15 న జన్మించిన మార్టిన్, బోష్టన్ విశ్వవిద్యాలయంలో 'మతాలశాస్త్రాధ్యయనం' కావించాడు. చర్చి సేవలు అందజేస్తూ, బాప్టిస్ట్ మినిష్టర్ గా విధులను నిర్వహించాడు. క్రమేపీ, మనసు పౌరహక్కుల ప్రచారంలో నిమగ్నమై, ప్రముఖంగా పరోక్ష, అహింసాపద్ధతుల్లో భాగస్వామ్యం వహించాడు. అయినా, విప్లవపంధాలోనున్న నల్లజాతినాయకులు ఈయనతో విభేదాలకు దిగడమే కాక, 1965 నుంచి అనేక సవాళ్ళను విసిరారు. దీనికి ముఖ్యకారణం - అన్ని వర్గాలవారిని మాఋర్టిన్ తన ఉద్యమంలో చేర్చుకోవడం, జాతి వివక్షత విధానాన్ని ప్రోత్సహించేవారికి కొరుకుడు పడలేదు. వారి ఆగ్రహానికి గురి అయి, మార్టిన్ తన ప్రాణాలే కోల్పోవలసివసుందని, ఈ సమయంలో మార్టిన్ ఊహించలేదు.
అమెరికా లోని నీగ్రోల సమాన పౌరహక్కులకోసం నిరంతరం పోరాడి, ఈ కారణం మూలంగానే, ఆయన అసువులు కోల్పాయాడు। అందరికీ, ప్రముఖంగా భారతీయులకు ఆనందాశ్చర్యానుభూతులను కలిగించిన విషయం ఏమిటంటే, ఉద్యమం పూర్తిస్థాయిలో, అహింస, గాంధి రాజకీయ సూత్రాలపైనే నడిపాడు. మార్టిన్ నిర్వహించిన ఈ ఉద్యమం, ఎవరూ ఊహించని విధంగా, తెల్లజాతివర్గంనుంచి కూడ మన్ననలను పొందాడు. అమెరికాలోని నీగ్రోల పౌరహక్కుల సంరక్షణకోసం, దక్షిణ క్రిష్టియన్ నాయకుల సమావేశాన్ని నిర్వహించి, తన శాంతిపూర్వక ఉద్యమాఅన్ని శుభారంభం కావించాడు. మేధావి, వాక్భూషణుడు, సంత్సంకల్పదీక్షాపరుడు, న్యాయంకోసం నిరంతరం పోరాడిన వ్యక్తి, రెండు దశాబ్దాలు పైగా పోరాడి, చివరగా 1963 లో వాషింగ్టన్ లో సమావేశమైన మహాసమ్మేళనం ఒక కొత్త రూపుని, ఊపుని యిచ్చాయి.
1959 లో భారతదేశాన్ని సందర్శించి గాంధి-నెహ్రూ రాజకీయ సిద్ధాంతాలను మనసా కీర్తించడం కూడ జరిగింది। దక్షిణాఫ్రికా లో ప్రోత్సహిస్తున్న "అపార్ధీడ్" లేక జాతి వివక్షతావిధానానికి పరమ వ్యతిరేకి. ఫలితంగా, మెంఫిస్ నివాసి, తెల్లజాతి మదభక్తుడు, 'టెన్నీసీ' 4 ఆప్రిల్ 1968 నాడు మార్టిన్ లూధర్ ని హత్యచేయడం దారుణంగా జరిగిన విషాదాంతం. యావత్తు ప్రపంచం, మార్టిన్ హత్యను వ్యతిరేకించి, నివాళులు అర్పించారు. ఆయనకు తన నిస్స్వార్ధ సేవలకు గుర్తింపుగా, భారతప్రభుత్వం, 'జవహర్ లాల్ అంతర్జాతీయ శాంతీ పురస్కారాన్ని 1966 లో కీరిశేషుడైన మార్టిన్ లూథర్ కింగ్ కు బహూకరించారు. మానవహక్కుల సంరక్షణ కోసం మాఋర్టిన్ కావించిన సేవలను గుర్తింపుగా, 1964 లోనే 'నోబెల్ శాంతీ పురస్కారాన్ని అందజేయడం కూడ జరిగింది.
జనవరి మూడవ సోమవారం, ప్రతీ సంవత్సరం, ఈ ఏడాది జనవరి 21 న, మాఋర్టిన్ లూథర్ కింగ్ జన్మోత్సవాల్ని, సెలవుదినంగానూ, అమెరికా లో జరుపుకోవడం లోనే, ఆయన ప్రతిభాపాటవాలకు గుర్తింపు అని వేరే ప్రస్తావించక్కరలేదు.

Sunday, January 20, 2008
మహాసామ్రాజ్య నిర్మాత - 'లెనిణ్
తిరుగులేని యోధుడు
20వ శతాబ్దపు గణనీయమైన విప్లవవాది। ఆ నాటి ప్రపంచంలో తిరుగులేని అధికారాలను పొందిన ఘనరాజ్యాల్లో ఒక దానిని తయారుచేసిన ఘనత కూడ ఆయనదే. దేశంలోని రైతులను కార్మికవర్గాన్ని సంఘటితం చేసి ఒక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి కూడ ఈయనే. 1917 లో కమ్యూనిష్టు విప్లవాన్ని తీసుకొచ్చి 'త్సరిస్ట్'ల అధికారాన్ని అణచివేశాడు. మహానాయకులైన మార్క్స్, ఏంగిల్స్ భావాలకు ఒక రూపకల్పనను అందించినవాడు. ఆయన పేరు 'లెనిణ్. కొన్ని రక్షణ, భద్రతా కారణాల వల్ల కల్పించుకున్న మారుపేరు అదే అన్నది చాలా మందికి తెలియదు. ఏది ఏమైనా, తిరుగులేని కమ్యూనిష్టు నాయకుడి అసరు పేరు మాత్రం - 'వ్లడిమిర్ హైఛ్ ఉల్యనోవ్'. మార్క్స్, ఏంగిల్స్ రాజకీయ భావాలపై తీవ్రంగా ప్రభావ ప్రేరణకు గురై, వారి రచనలను క్షుణ్ణంగా ఆధ్యయనం చేసుకుని ఆకళింపు చేసుకున్న ఘననాయకమన్యుడు. త్సరిస్ట్ రాజకీయ యుగం లెనిన్ ను యిబ్బంది పెడుతూ అనేకసార్లు దేశబహిష్కరణకు గురయ్యాడు. కాని ఈ శిక్షలు ఏమాత్రం లెనిన్ సంకల్పాన్ని చెక్కుచెదరనీయలేదు. 'త్సఋ పరిపాలనను ధిక్కరణ చేస్తూ, ప్రజలను చైతన్యపరుస్తూనే వున్నాడు. రష్యా ప్రజలను విప్లవంలో భావస్వామ్యం, భాగస్వామ్యం చేశాడు. విప్లవాన్ని ఉధౄతం చేశాడు. 1898 లో లెనిన్ కొత్త రాజకీయ రంగాన్ని 'బోల్షెవిక్' పార్టీని స్థాపించాడు. కమ్యూనిష్టు విప్లవాన్ని రష్యాలో మరింత వేగంగా తీసుకొచ్చాడు. "చేయాల్సినది ఏమిటి?" అన్న సుదీర్ఘ రచనలో (1902) విప్లవసాధనకు కావలసినవి, చేయవలసినవి నిర్వచించాడు. 1905 లో శ్రీకారం చుట్టిన తొలి ప్రయత్నం ఎందుకో ఫలించలేదు. పుష్కరకాలంపాటు కౄషిని చేస్తూ, పట్టువిడవని విక్రమార్కుడు, 1917లో ప్రభుత్వంనుంచి అధికారం కైవసం చేసుకోగలిగాడు. 7 నవంబర్ 1917 లెనిన్ నాయకత్వంలో రష్యాలో సోవియట్ పరిపాలన ప్రవేశించింది. వ్యక్తిగత తరహా ఆస్థులను రద్దుచేయడం, కార్మికులకు పనివేళలు 8 గంటలు నిర్ధారించడం, పనివారి మాట చెల్లుబాటుతనం కర్మాగారాల్లో ప్రవేశపెట్టబడినది. యాజమాన్యానికి, కార్మికుల, కార్మికనాయకుల మాటలకు విలువనివ్వవలసి వచ్చింది.
సాహిత్యాభిమాని
సింబిరిస్క్ ప్రాంతంలోని వోల్గా లో 22 ఏప్రిల్ 1870 లో జన్మించిన లెనిన్ (వ్లడిమిర్), పుట్టుకతోనే పువ్వు పరిమళించిన మాదిరి, సాహిత్యం, చరిత్ర, భాషల్లో శ్రద్ధాభక్తులని ప్రదర్శించాడు। లెనిన్ 21 జనవరి 1924 లో మరణించాడు. రష్యా రాజకీయాలు, పరిపాలనావిధానాలు ఆమూలాగ్రం 1991 లో మారిపోయాక, నూతన నాయకులకు లెనిన్ భావాలను కాదన్నారు. కొత్త పరిపాలన, రాజకీయం ప్రవేశించాయి. కాని, చాలామంది ప్రజలు లెనిన్ భావాలను, ఆశయాలను నేటికీ విశ్వసిస్తూ, గౌరవించేవారు గణనీయం అనే చెప్పాలి. నేటికీ, ప్రపంచవ్యాప్తంగా సోషలిజం పథంలో కొనసాగుతున్న విప్లవధోరణికి కేవలం లెనినే కారకుడు అంటారు. ఆయన భౌతికకాయం యిప్పటికీ యాత్రికులకు, మాస్కో రెడ్ స్కేర్ ప్రదర్శనశాలలో చూడడం మరువలేని, మరువకూడని అంశం అవడం విశేషమే. ప్రపంచాన్ని సజీవంగా నిలుపుతున్నవి రాజకీయాలే అన్న నానుడి లెనిన్ లాంటి భావాచరణను చూసి అనుకున్నదే. రాజకీయ పరిభాషలో 'ముగింపూ అనేది వుండదు. అలాగే, లెనిన్ ఆర్ధిక, రాజకీయ సూత్రాలు ప్రపంచ సోషలిజం వ్యవస్థ వున్నంతవరకూ మరువలేనివి. రాజకీయవేత్త అనేవాడు చదివి ఆలోచించడం కన్నా ముందు మాట్లాడి, పనిచేయాలి - అని థామస్ బీబింగ్టన్ మెకాలే, అన్న వ్యక్తి చెప్పాడు. కాని లెనిన్ మాత్రం నిరాఘాటంగా చదివి, ఆకళింపు చేసుకుని, పెంచుకున్న ఆలోచనలతో పనిచేస్తూ మాట్లాడడం, అనుకున్నవి సాధించడం చేయగలగడం అతనికున్న శక్తిసామర్ధ్యాలు అగణితాలు. కేవలం అనుభవించదగిన స్ఫూర్తి మాత్రమే. ముందుగా ఆలోచించకుండా చేసే పని బహుశ రాజకీయాలే కావచ్చు అన్న రాబర్ట్ లూయీస్ స్టీవెన్సన్ అభిప్రాయం కూడ లెనిన్ తప్పు అని ౠజువు చేశాడు అని చాలామంది మేధావులు చెప్పడం కూడ విశేషమే.
కొసమెరుపు
లెనిన్ గురించి చెప్పడం మాటలతో చెప్పే భావాలు కావు. కాని, విన్ స్టన్ చర్చిన్ మాటలు మాత్రం - ప్రజలు నిన్ను పొగుడుతున్నారా, తిడుతున్నారా అన్నది ముఖ్యంకాదు; నీగురించి చర్చిస్తున్నారా, లేదా అన్నదే ముఖ్యం, అన్నాడు. అదే లెనిన్ విషయంలో, దేశబహిష్కరణలకు గురి చేసినా, రాజకీయనాయకులు, ప్రభుత్వాధినేతలు, లెనిన్ గురించి చర్చించుకోవడం మాత్రం మానలేదు. లెనిన్ వారి దినచర్యలో భాగంగా అయిందట.
అందుకే, సాహసవంతులు వున్నంతవరకే దేశం స్వతంత్రంగా వుంటుంది, అని అంటారు రాజకీయ విశ్లేషకులు। లెనిన్ నిజంగా సాహసవంతుడు. రాజకీయ చైతన్యస్ఫూర్తిదాత.
మహామనీషి 'లెనిణ్ వర్ధంతి రోజు (జనవరి 21) సందర్భంగా సమాజవాదపు నిర్మాతకు ఘననివాళిని సమర్పించాల్సిన తరుణం. ఆ ఘనుడికి జోహారులు. జేజేలు. ప్రపంచ కార్మికులారా ఏకం కండు! అన్న నినాదానికి లెనిన్ లాంటి వ్యక్తులు ఎప్పుడూ మనకళ్ళముందు, మన మనసుల్లోను, మసలుతూనేవుంటారు. నిత్యదర్శనీయం. లెనిన్ అమర్ రహే, జిందాబాద్.

Thursday, January 17, 2008
విశ్వవిఖ్యాత సార్వభౌమ - నందమూరి తారకరామ
(మే 28, 1923 - 18 జనవరి, 1996)
'ఆంధ్రజాతికెవడు - ఆత్మగౌరవముద్ర, ఆనవాలు తెచ్చినట్టి ఘనుడు! మేటి నాయకుండు - మేధావి - తేజస్వి రామారావు తెలుగు సీమలోన, యావదాంధ్రమునకు - జీవత్ పతాకమై, తెలుగు వెలుగు సర్వదిశల నింపి, నట వరుండు బ్రదికె నవ్యాంధ్ర భోజుండు రామారావు సార్వభౌముడగుచూ అని ప్రముఖ కవి నండూరి రామకౄష్ణమాచార్య, నందమూరి తారకరామారావుగారి గురించి, 'దేశభాషలందు తెలుగు లెస్సా అన్న తెలుగు సంస్కౄతీ, సాహిత్య, సమగ్ర, సంక్షిప్త సంకలనం, అన్నగ్రంధంలో వివరించారు।
అందరికీ మార్గదర్శి
రాజీ పడని సైనికుడు, నట, రాజకీయ సార్వభౌముడు। ఆయన మార్గం అనితరసాధ్యం. ప్రపంచంలోనే ఒక అపురూపమైన వ్యక్తిత్వాన్ని, గుర్తింపును పొందిన మొదటి తెలుగువాడు అని చెప్పక తప్పదు. తెలుగువాడికి మదరాసి, లేక దక్షిణాదివాడు అనే ముద్ర వుండేది. దానిని పోగొట్టి ఆంధ్రావనిలో ప్రతి తెలుగువ్యక్తికి తెలుగువాడికి గౌరవాన్ని, ప్రత్యేకతను, వాడిని, వేడిని, తీసుకువచ్చిన ఘనత నిస్సందేహంగా ఆయనదే. క్రమశిక్షణకు, కౄషికి, దీక్షకు,మారుపేరుగా పేర్కొనక తప్పదు. నిరంతరం ఆయన కౄషీవలుడే. ప్రజలు ఎప్పుడు ఆపదలో వున్నా, విపత్కర పరిస్థితులలో వున్నా ముందుకొచ్చి ఆపన్నులను ఆదుకున్న మానవతామూర్తి. ఎప్పుడు ఏ సందర్భంలోనైనా తన సహాయం అవసరమనుకుంటే ముందుండి నాయకత్వం వహించేవారు. నాలుగు దశాబ్దాల కళాసేవ తర్వాత, ఆయన మనసు ప్రజాసేవవైపు మొగ్గింది. తిరుగులేని కళాకారుడిగా తనను యింత స్థితికి తీసుకువచ్చిన తెలుగు ప్రజానీకానికి సేవ చెయ్యాలనే నిర్ణయం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మెరుపులా వచ్చిందని చెప్పవచ్చు. తెలుగు మహానుభావుల చరిత్రకు చిత్రరూపం లో వారి పాత్రలోనటిస్తూ, లీనమవుతూ జీవిస్తున్నప్పుడు, ఈ నిర్ణయం నిఖార్సుగా తీసుకోవడానికి అనువైన బీజాలు పడ్డాయని చెప్పవచ్చు. నటనలో నటసార్వభౌముడు, రాజకీయరంగంలో విశ్వవిఖ్యాతుడు గా విరాజిల్లిన కొదమసింహం, బొబ్బిలిపులి. ఆయన ఒక సుడిగాలి. వెరసి ఆయన అతిస్వల్ప కాలంలో ప్రపంచం దౄష్టిలోకి వచ్చారు. అందరూ చెప్పుకునే అహం, వారికి ఆత్మగౌరవం. ఆయన కోపం, ప్రక్షాళనగా మారుతుంది. ఆయన ఆవేశం, దానిపేరు చైతన్యంగా రూపుదిద్దుకుంటుంది. ఆయన పట్టుదలకు అసంఖ్యాక తార్కాణాలతో, ఒక బౄహద్గ్రంధం అవుతుంది. ఆయన మాట ఒక శ్లోకం. ఆయన పర్యటన ఒక దుమారం. ఆయన నిర్ణయాలు, రేపిన పలు సంచలనాలు. ఆయన ఆలోచనలు, విప్లవాలుగా పల్లవిస్తాయి. ఆయన ప్రతిచర్య ఒక ప్రయోగంగా రసాయనప్రక్రియగా మారుతుంది. అందుకే ఆయన విశ్వవిఖ్యాతుడు. నటనాసార్వభౌముడు. రాజకీయరారాజు. వెరసి, ఆయన విశ్వవిఖ్యాత నట రాజకీయ సార్వభౌముడు. ఆయనపేరు - నందమూరి తారక రామారావు. ఆంగ్లంలో యన్.టి.రామారావు. క్లుప్తంగా, యన్.టి.ఆర్. ఆంధ్రగ్రామీణప్రజలకు, చిత్రప్రేమికులకు నందమూరి అభిమానులకు యంటీవోడు. యిది ఈయన పరిచయం.
నిమ్మకూరు నిప్పు
1942-44 మధ్యన ఆంధ్ర నాటక పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో నాటకాలు జరుగుతున్నాయి. ప్రజా నాట్యమండలి, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ తరఫున పోటీలు జరుగుతున్నాయి. వాటిల్లో ప్రదర్శించిన 'చేసినపాపం' అన్న పౌరాణిక నాటకంలో ఒక అందమైన యువకుడు అభినయిస్తున్నాడు? ఎవరీతను అనుకున్నారు అందరు. అతనే నందమూరి తారక రామారావు. కౄష్ణాజిల్లా, నిమ్మకూరు గ్రామంలో 28 మే 1923 న జన్మించారు. ఆంధ్ర క్రీష్టియన్ కాలేజీ, గుంటూరు నుంచి పట్టభద్రుడు. సబ్-రిజిస్టారుగా కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన, రామారావు, కవిసామ్రాట్, జ్ణానపీఠం సన్మానం పొందిన విశ్వనాధ సత్యనారాయణగారికి ప్రియశిష్యుడు. బసవరామతారకం ను వివాహమాడిన ఈయనకు 12 మంది సంతానం. ఈ నేపథ్యంలో ఈయన కుటుంబనియంత్రణ విధానం పై వ్యతిరేకంగా 'తాతమ్మకలా చిత్రం తీయడం, దానికి ఉత్తమకధాచిత్రంగా ప్రభుత్వంనుంచి ప్రశంసాబహుమతులను అందుకోవడం విశేషం, వింత అని చెప్పాలి. పెద్దకొడుకు రామకౄష్ణ మరణించిన తర్వాత, అతని పేరున, స్వంత చలనచిత్రసంస్థను ప్రారంభించాడు. 1949లో మనదేశం చిత్రంతో చలనచిత్ర రంగప్రవేశం చేశాడు.
నందమూరి నటనాపర్వం
నందమూరి చిత్రాభిమానులకు నటసార్వభౌమ అనే పిలుచుకుంటారు। పౌరాణికపాత్రలకు ఆయన పేరునే మొదటి గుణికం చేయాలి. దక్షిణభారతచిత్రాల్లో తెలుగు చిత్రాలకు వచ్చిన ప్రాధాన్యతకు కారకులను చెప్పాలంటే, ఈయనను ప్రప్రధమంగా పేర్కొనాలి. ప్రముఖ నిర్మాత, విజయసంస్థనేత బి.నాగిరెడ్డి సౄష్టించిన కౄష్ణుడు పాత్ర (మాయాబజార్), ఆయన చలనచిత్రజీవితంలో మొదటిదశలోనే ఒక మైలురాయి అని చెప్పాలి. విష్ణువు దశావతారాల్లోని, రామ, రావణ, కౄష్ణ, అర్జున, కర్ణ, భీమ, దుర్యోధనాది పౌరాణిక పాత్రలు ఆయన ముఖవర్చస్సుని పూర్తిగా మార్చివేశాయి. ఆ అవతారామూర్తుల రూపం, నందమూరిలాగానే వుంటాయన్న విశ్వాసం, సిద్ధాంతం నిర్మించుకున్న జాతి, తరం, కేవలం ఆంధ్రసీమలోనే కాదు, యితరరాష్ట్రాల్లోకూడ, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో, చాలా ఎక్కువగా చూస్తూంటాము. తెలుగు చలన చిత్రపరిశ్రమలో ఆయన అందించిన వరప్రసాదంగా భావించే స్థానాన్ని వర్ణించాలంటే, 1950-65 మధ్య కాలం స్వర్ణయుగం అని చెప్పాలి. విశ్లేషకుల భావన ప్రకారం, తెలుగుదేశంలో ప్రాముఖ్యమైన పౌరాణికచిత్రాలను నిర్మిస్తే, తమిళ, హిందీ చలనచిత్ర పరిశ్రమలు ప్రభావితమైన సాంఘికయితివౄత్తచిత్రాలను అందించింది. రామారావు దక్షిణభారతచిత్రాల్లో ప్రముఖస్థానం పొందాడు అన్నది నిర్వివాదాంశం. తెలుగుసీమ కూడ ఒకప్పుడు అంతర్భాగంగా వున్న తమిళనాడు చిత్రపరిశ్రమలో అధ్బుతనటనాకౌశలం ప్రదర్శించడంలో శివాజీగణేశన్, సామాన్య ప్రజానీకానికి ప్రేరణగా, వ్యాపారాత్మకంగా, నటనలోనూ పేరుతెచ్చుకున్న మెగాస్టార్ యం.జి.రామచంద్రన్,లు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి పంధాలో సమతులనం చేసుకున్న పద్ధతిలో తనదైన నటనాపధాన్ని, స్వీయపంథాన్ని నిర్మించుకున్నాడు రామారావు. శివాజీయే చెయ్యగలడన్న పౌరాణికాలు, యం.జి.ఆర్. మాత్రమే నప్పగలడన్న వ్యాపారధోరణిలోని జానపదచిత్రాలు, రెంటినీ సవ్యసాచిలా ప్రతిభావంతంగా రాణించగల నటనాసామర్ధ్యంగల నటుడు ఒకే ఒక్కడు, అతడే, తారకరాముడు.
ఒకే ఒక కౄష్ణుడు, ఆయనే రాముడు
నందమూరి నటనలో ప్రత్యేకంగా 'నభూతో నభవిష్యతీ అంటే నందమూరే అన్నట్లు రాణించిన పాత్ర, కౄష్ణుడు। తెలుగు చిత్రాల్లోనే కాకుండా, తమిళ, కన్నడ చిత్రాల్లో కూడ, కౄష్ణుడిపాత్ర మాత్రం రామారావునే వరించేది. మిగతా, కర్ణ, అర్జున, భీమాది పాత్రలు, యం.జి.ఆర్., శివాజీ, రాజ్ కుమార్ లు నటించేవారు. ఈ కౄష్ణపాత్ర మాత్రం నందమూరి నటనాజీవితానికి ఒక అర్ధం, పరమార్ధం, ప్రసాదించాయి అన్నదాంట్లో ఆశ్చర్యం లేనేలేదు. కౄష్ణుడిపాత్రతో పాటు, రామ, భీమ, దుర్యోధన, కర్ణ, రావణాసుర, యమ, అర్జున, శివ, విశ్వామిత్ర, వేంకటేశ్వర, లాంటి పౌరాణిక పాత్రలను పాత్రలే ఆయన, ఆయనే పాత్రలు అన్న పంథాలో నటననుప్రదర్శించారు. అలాగే, చారిత్రకాలైన, శ్రీనాధుడు, ఆశోక, వివేకానంద, పోతులూరి వీరబ్రహ్మం, పాపారాయడు, సలీం, చాణక్య, తిమ్మరుసు, శ్రీకౄష్ణదేవరాయలు, పాత్రలు బహుళ ప్రజాదారణకు నోచుకున్నాయి. యివికాక, ఎన్నో జానపదాలు, సాంఘికాలు, కుటుంబయితివౄత్తాలు, అన్నీ కలిపి, 280 కి పైగా చిత్రాల్లో తన ప్రతిభను ప్రదర్శించారు.
వైవిధ్యాలు, నందమూరి నటనాపాత్రలు
రామారావు నటించిన, కాదు, జీవించిన ముఖ్యమైన పాత్రలను క్రోడీకరించాలంటే, ప్రప్రధమంగా, శ్రీకౄష్ణ పాత్రలో - మాయాబజార్, శ్రీకౄష్ణార్జునయుద్ధం, శ్రీకౄష్ణరాయబారం, శ్రీకౄష్ణసత్య, కర్ణ చిత్రాల్లో నటనావైదుష్యాన్ని ప్రస్తావించాలి. లవకుశ (శ్రీరామ), భీష్మ (భీష్మ), భూకైలాస్ (రావణ), నర్తనశాల (అర్జున, బౄహన్నల), పాండవవనవాసం (భీమ), శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం (శ్రీ వేంకటేశ్వర), మహామంత్రి తిమ్మరుసు (శ్రీకౄష్ణదేవరాయలు), దానవీరశూరకర్ణ (దుర్యోధన, శ్రీకౄష్ణ, కర్ణ), అయిదు పాత్రలతో విరాటపర్వం, ముఖ్యంగా చెప్పాలి. మరింత ప్రత్యేకతలున్న జానపదచిత్రాలు - జగదేవవీరునికథ, పాతాళభైరవి, భట్టివిక్రమార్క చెప్పుకోతగ్గవి. సాంఘికయితివౄత్తాలైన - మల్లీశ్వరి, కన్యాశుల్కం, గుండమ్మకథ, మిస్సమ్మ, రక్తసంబంధం, రాముడు-భీముడు, అడవిరాముడు, వేటగాడు, గజదొంగ, డ్రైవర్ రాముడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటిసింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, ప్రస్తావించకతప్పదు. ప్రత్యేకశైలిలో అవతరించిన పాత్రలు - బడిపంతులు, రాజు-పేద, ఆత్మబంధువు, చిరంజీవులు, లాంటివి ఎన్నో ప్రస్తావించాలి. గుడిగంటలు చిత్రంలో ప్రతినాయకుని పాత్రలో తాదాత్మ్యం చెంది నటించడం, (జన్మమెత్తితిరా, అనుభవించితిరా), అన్నాచెల్లెళ్ళ అనురాగ పాత్రలకు అప్పటికీ, యిప్పటికీ, అద్దం పట్టినచిత్రం, రక్తసంబంధం, కన్యాశుల్కం లో గిరీశం పాత్రలో నటన కాకుండా జీవించడం, కేవలం ఉదాహరణలు మాత్రమే.
నందమూరి నటుడే కాదు - దర్శకుడు, నిర్మాత।
స్వంతచిత్రం మొదటిసారి సీతారామకళ్యాణం(1961) నుంచి, వరసగా, గుళేబకావళికధ, శ్రీకౄష్ణపాండవీయం, వరకట్నం, తల్లా పెళ్ళామా, తాతమ్మకల, దానవీరశూరకర్ణ, చణక్యచంద్రగుప్త, శ్రీరామపట్టాభిషేకం, అక్బర్ సలీం అనార్కలి, శ్రీతిరుపతి వేంకటేశ్వరకళ్యాణం, శ్రీమద్విరాటపర్వం, చండశాసనుడు, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్ చిత్రాల్లో, తన అద్భుతదర్శకప్రతిభను ప్రదర్శించి ఎప్పటికీ మదిలో నిలచిపోయేలా వాటిని మలిచారు। గుళేబకావళికధ చిత్రానికి, ప్రముఖకవి సి.నారాయణరెడ్డిగారిని, చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత రామారావుకే దక్కుతుంది. నన్నుదోచుకుందువటే, వన్నెలదొరసాని, అని తనమధురకలంతో చిత్రసీమలో కాలిడిన సినారె వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. అలాగే, ప్రముఖ హిందీచిత్రగాయకుడు, మహమ్మదురఫి ని తెలుగుచిత్రసీమకు (భలేతమ్ముడు, అక్బర్ సలీం అనార్కలి) పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. అంతేకాక, చిత్రసీమలోని అందరికీ ఆయన స్ఫూర్తి, ప్రభావితం, ప్రేరణాత్మకం, మార్గదర్శి, ఆయన బాటలో నడచిన వారు ఎందరో, మరెందరో, మహానుభావులుగా, తదుపరి గుర్తింపు తెచ్చుకుని, వారు కౄతజ़్జతని ప్రతినిత్యం చెప్పుకుంటుంటారు. కొండవీటివెంకటకవి లాంటి ప్రతిభాకవిని చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత కూడ నందమూరిదే. రామారావు నిర్మించిన, దర్శకుణ్ణి ప్రకటించకపోయినా, ఆయన చిత్రం సీతారామకాళ్యాణం కు ఆయనే దర్శకత్వం వహించినా, ఎక్కడా ఆయన పేరు మనకు కనిపించదు. కేవలం, నిర్మాత, త్రివిక్రమరావు (సోదరుడు) అనిమాత్రం ప్రకటించడం విశేషం. సినీమాకు ఆయనే దర్శకుడన్నది అందరికీ తెలిసినదే. ఈ చిత్రంలో రావణాసురుని, కాదు, రావణబ్రహ్మ, పాత్ర గురించి, గొప్ప పరిశోధనచేశారు నందమూరి. విదేశాల్లో గొప్ప పేరు పొందింది. యింక ఈ చిత్రంలో సీత పాత్రని 'గీతాంజలీ చేత అభినయించిన తీరు సీత అంటే యిలాగే అని పలువురుకి అనిపించింది. ఈయన నిర్మించిన ఉమ్మడికుటుంబం, సర్వకాలానికి ప్రాతినిధ్యం వహించే కుటుంబస్థితిగతుల్ని, కుహనా బాబాల లీలల్ని (ఓం సచ్చిదానంద, శ్రీసర్వం గోవిందా), పరోక్షంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రారంభంగా 'కర్టెన్ రైజఋ గా, అసలు కధను అందరూ గమనించాలన్న ఉద్దీశ్యంతో, యమధర్మరాజు, సతీసావిత్రిల సంగీతరూపకం, బహుళప్రజాదరణకు నోచుకోవడంలో రామారావు ప్రతిభ తేటతెల్లమవుతుంది. నందమూరి చిత్రంగా, తాతమ్మకల, చిన్నకుటుంబం - చింతలు లేని కుటుంబం అన్న ప్రభుత్వ నినాదానికి వ్యతిరేకంగా, దేవుడిచ్చిన సంతానాన్ని నిరోధించకూడదన్న ఆలోచనతో, మహానుభావులందరూ అధికసంతానంలో భాగమని, సోదాహరణంగా, వివరించిన చిత్రానికి ప్రభుత్వ బహుమతి లభించడం కూడ మరచిపోలేని కధనం. దానవీరశూరకర్ణ, ఒక ప్రత్యేక వరవడితో తీసిన చిత్రం. ఆయన చిత్రాల్లో, కధకు, పాటలకు, సంగీతానికి, మాటలకు, అర్ధాలే కాకుండా, అంతరార్ధాలు, ప్రాసలు, అనుప్రాసలు, భాయయుక్తంగా, కవిహౄదయం కొండవీటి వెంకటకవి సంభాషణల్లోనే కాక, రామారావు మాటల్ని, భావాల్ని పలికినతీరు నిత్య స్మరణీయం అని వెల్లడవుతూంటుంది. సినారె లాంటి కవులు రామారావు చిత్రాలకు ప్రాణాలు పోశారన్నది సత్యం.
చిత్రపరిశ్రమ లో విశిష్టవ్యక్తిత్వం
వైవిధ్యమున్న పాత్రలను నటించిన ఘనత నందమూరిదైతే, జానపద, సాంఘిక చిత్రాల్లో ఆయన నటన మోతాదు కొంచెం ఎక్కువనే అభిపాయాన్ని విశ్లేషకులు చెప్పడం కూడ జరిగింది। ఈ చిన్న విమర్శ చిన్న తుంపరలాంటిది. తుంపర,మహాసముద్రం ముందు ఏపాటిది? ఆయన ఏ పాత్ర ధరించినా, ఆ పాత్రను క్షుణ్ణంగా అర్ధం చేసుకుని నటించడం, పాత్ర స్వరూప స్వభావాలను బట్టి మానసికంగానే కాక శారీరకంగా కూడా ఆ పాత్రలో ఇమడటానికి ప్రయత్నించడం (భీమ పాత్రలో బాగా తిని కండలు పెంచడం), పేదవాడిపాత్ర కు తిండి మానేసి బక్కగా మారే ప్రయత్నం, ఏకాగ్రతతో పాత్రలో లీనమై నటించడం, క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా ప్రవర్తించడం, కొన్ని పాత్రల్లో ఆవహించి, పరకాయప్రవేశం చేసి నటిస్తున్నారా అన్న భావనలు, నిర్మాత, దర్శకుడు అయినాకూడ, సాటి దర్శక నిర్మాతలకు యిచ్చిన గౌరవ మర్యాదలను చెప్పలేమని చిత్రసీమ మొత్తం పలవరిస్తూనే వుంటుంది. దర్శకునికి యిచ్చిన విలువలు, నిర్మాత క్షేమాన్ని సదా కాంక్షించడం, పచ్చగా వుంటేనే చిత్రరంగం కళకళలాడుతుంది అన్న ఖచ్చితమైన అభిప్రాయం, ఇలా ఎన్నో విశిష్ట విధానాలని, శైలిని పాటించిన ప్రజ़్జానాభినయ వైభవమూర్తి.
కళాసేవ నుంచి రాజకీయానికి
ప్రేరణకు కారణం ఏమిటి? కారణాలు అనేకం కావచ్చు. కొన్ని కారణాలకు మాటలు వుండచ్చు, లేకపోవచ్చు, వున్నా నోటినుంచి మాటలు రాకపోవచ్చు, కేవలం అనుభూతులే ప్రేరణకు దారితీస్తాయి. ఈ పంధాలోనే కలిగిన ప్రేరణ, నందమూరిని కళాసేవ నుంచి రాజకీయరంగానికి మరలిరావడం జరిగింది. ఒక సమావేశంలో, ప్రజల్లోని ఒక సామాన్యుడు, అభిమాని అడిగిన ప్రశ్న, అయ్యా, మేము మిమ్మల్ని దేవుడిలాగ ఆదరించాము; కాని మీరు మాకు ఏమి చేశారు? అన్న ప్రశ్న నందమూరి హౄదయంలోకి సూటిగా గుచ్చుకుంది. నరనరాల్లోకి ప్రవేశించింది. రక్తప్రసరణలో భాగంగా మారింది. ఆలోచనగానూ మారింది. ఆలోచనకు ఆచరణయోగం కలిగింది. ఫలితంగా, 29 మార్చి 1982 న 'తెలుగుదేశం' ఆవిర్భావం అంధ్రసీమ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. తెలుగుదేశం ప్రారంభం వెనుక, కేవలం రాజకీయప్రవేశ లక్ష్యమే కాదు. తరతరాలుగా తెలుగువాడికి దక్కుతున్న గౌరవం, మర్యాదలను బేరీజు వేసుకుని, తెలుగువాడి ఆత్మగౌరవం ఒక అంతస్సూత్రంగా ఆవిష్కరించబడింది. జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, వారి మర్యాదను పెంచిన నాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగుదేశాన్ని స్థాపించిన కేవలం 9 నెలలుగా రాష్ట్రం నాలుగు చెరగులా పర్యటించి ప్రజాభిమానంతో ఎన్నికల పోరాటంలో అఖండ విజయాన్ని సాధించి, ఒక చరిత్రను సౄష్టించారు. ఆయన ప్రచారవాహనానికి చైతన్యరధం అని నామకరణం చేసి, 9 నెలల్లో, 18 వేల కి.మీ. సుడిగాలిలా పర్యటించాడు. దినచర్యలు, కాలకౄత్యాలు, అన్ని రహదారిలోనే, చైతన్యరధం ప్రక్కనే. ఆయన పర్యటన పూర్తిచేసుకునే, యింటిముఖం పట్టాడు. మరొక ముఖ్య విషయం, రాజకీయంగా ఎన్నో ఏళ్ళుగా ప్రబలుతున్న విధానం - ఢిల్లీ నుండి నిర్ణయాలు హైదరాబాదు అందటం మానిపించి, హైదరాబాదు నుండి ఢిల్లీలో ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించిన వ్యక్తి నందమూరి. కొన్ని దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీని, కేవలం తాను పార్టీ ఏర్పరచిన ఏడాది లోపునే మట్టికరిపించిన కళావంతుడైన రాజకీయవేత్త ఆయన. ఆయనలోని కళాకారుడు కేవలం నటనకేకాదు. రాజకీయాన్ని కూడ కళాత్మకంగా నడిపించగలడు అని నిరూపించిన మహానుభావుడు. ఫలితంగా, 202 సీట్లు సాధించి, జనవరి 9, 1983 న తారకరాముడు రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయన చిత్రాలు మాదిరి, రాజకీయల్లోకి ఆయన ప్రవేశం, ప్రచార పర్యటన, ఎన్నికల్లో గెలవడం, శాసనసభలో ప్రవేశించడం, అన్ని చిత్రంలానే విచిత్రంగా జరిగిపోయాయి. ఆయనతోపాటు గెలిచిన వాళ్ళు ఎక్కువగా, అనుభవం లేనివారే. ఒక్క నందమూరే వారిని సముదాయించ వలసివచ్చింది. ముఖ్య కారణాలైన, ఎక్కువకాలంగా కాంగ్రెసు కి ప్రత్యామ్నాయం లేకపోవడం, అభివౄద్ధి అనుకున్నంతగా రాకపోతూండడం, నిరుద్యోగం, ఒకే రాజకీయ పక్షం, కులం సుదీర్ఘకాలం అధికారంలో వుండడం, యీవన్ని, తెలుగుదేశానికి దారితీసాయి. ప్రముఖ దిన పత్రిక ఈనాడు అధిపతి చేకూరి రామోజీరావు అండదండలు, తానే స్వయంగా గుడివాడనుంచి పోటీచేయడం, ఆనాటి ప్రముఖఘట్టాలు. ఎన్నికలు మొదటిసారి గెలిచాక, ఆయన స్వామి వివేకానంద రూపంలో ప్రత్యక్షమయి, ప్రభుత్వాన్ని ఆదర్శభావాలతో నడపడం ప్రారంభించినా, అవి అనుకున్నంత ప్రభావాన్ని, ఫలితాల్ని యివ్వలేకపోయాయి. తెలుగుదేశంలో కూడ, క్రమేపీ రాజకీయాలు ప్రవేశించడం, నాదెండ్ల భాస్కరరావు రాజకీయ కుతంత్రానికి ఆయన అనుభవించిన శౄంగభంగం, ఎన్నికలను కొత్తగా 1985 లో జరిపించారు. రామారావు తీసుకున్న ముఖ్య పొదుపు చర్యల్లో భాగంగా, కౌన్సిల్ ను రద్దు చేయడం, 1989లో పొందిన అపార అనుభవం, యిద్దరు అల్లుళ్ళు, చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులను ఆయన చేరదీయడం జరిగింది. విద్యారంగంలో రామారావు తెచ్చిన మార్పులు ఎన్నో, మొత్తం సిలబస్ లను మార్చడం, యింజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, లా, యం.బి.ఎ. తరగతులకు ప్రవేశపరీక్షను ప్రవేశపెట్టినది ఆయనే. హిందీలో అంత ప్రావీణ్యం లేకపోయినా, హర్యానాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఏకధాటిని 45 ని. పాటు ప్రసంగం చేసి, ప్రసంగాన్ని బట్టీయం చేశానని ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరచారు. ఆయన జ़్జాపకశక్తికి ఆయన పౌరాణిక చిత్రాల్లోని సుదీర్ఘసంభాషణలే తార్కాణం. సుస్పష్ట ఉచ్చారణ, స్వచ్చమైన భావప్రకటన, హావభావాలు, ఆయనకు వెన్నతోపెట్టినవిద్యయే కదా. 1989లో ఎన్నికల్లో పరాజయం పొందినా, ఆయన ప్రతిభను జాతీయస్థాయికి తీసుకువెళ్ళి, ప్రాంతీయపక్షాలని ఏకత్రాటిపై తేగలిగారు. జనతాదళ్ లాగున, కేంద్రస్థాయిలో నేషనల్ ఫ్రంట్ ని స్థాపించారు. కాంగ్రేసుకు ప్రాంతీయస్థాయిలో వేరే ఏమిటి అన్న ఆలోచనకు రామారావే సమాధానం చెప్పగలిగారు. 1994 లో తిరిగి పదవిలోకి వచ్చినప్పుడు, రెండురూపాయలకు కిలో బియ్యం, తాగుడువ్యవస్థనుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలన్న సంకల్పంతో చర్యలు, ప్రభుత్వానికి పెనుభారం అయినా తన అలోచనలో మార్పు రానీయలేదు.
1989 నుండి 94 వరకూ ప్రతిపక్షంలో వున్న నందమూరి 1994 డిసంబర్, 12 న తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు। 1983, 84, 85, 94 లలో మొత్తం అయిదు సార్లు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే. 1995లో శాసనసభ్యుల తిరుగుబాటు వలన రామారావు పదవి కోల్పోయారు. ఆయన రాష్ట్ర రాజకీయాలే కాక కేంద్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేశారు. కాంగ్రేసు వ్యతిరేక పార్టీలన్నిటినీ నేషనల్ ఫ్రంట్ క్రింద ఏకం చేశారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. తెలుగు భాషాభివౄద్ధికి అవిరళకౄషి చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆయన కలలకు ప్రతిరూపమే.
బాధల పర్వం - ఆఖరిదశలో కష్ట పరంపరలు
క్రమేపీ తెలుగుదేశంలో కష్టాల కడలి కదలింది। పార్టీలో సమస్యలు అంకురించాయి. అల్లుడు, చంద్రబాబు, జామాత, ఒక్కసారి దశమగ్రహంలా విజౄభించాడు. రామారావుకు అన్ని సమస్యలను ఒక్కసారి బాణంలా విసిరాడు. తిరుగుబాటు బావుటాని ఎగరవేశాడు. తెలుగుదేశం రెండు ముక్కలైంది. రామారావు ప్రజల్లోకి న్యాయానికి పోయినా, ఆఖరుకు చంద్రబాబు వైపుకే కడలి కదలింది. టాంకుబండ్ వద్ద రామారావు నిరహారదీక్ష జరపడం కూడ నాటకీయంగానే జరిగిందని అందరూ అభిప్రాయపడ్డారు. యిదే రామారావు రాజకీయనాయకునిగా చరమఘట్టం అని భావించవచ్చు.
కధకు, కధనానికి ముగింపు
నందమూరి తారక రామారావు జీవితంలోని ముఖ్యపర్వాలైన, నటన రాజకీయంగా ముగియలేదు. కాని రాజకీయం మాత్రం నాటకీయంగానే ముగిసింది. అధికారం చేజారడం, తర్వాత ఘటనలు, సినీమాలో అంతిమఘట్టాలుగానే జరిగాయి. నటనలో అమితాభిమానాన్ని పెంపొందించుకొని, తన పరిశోధనాంశం కూడ, నందమూరినే ఎన్నుకుని, ఆయన సాన్నిహిత్యంలోనే తన జీవితాన్ని గడపడానికి వచ్చి, రామారావునే వివాహమాడిన లక్ష్మీపార్వతి, నందమూరి జీవనచిత్రంలో ఆఖరిపాత్ర అనే చెప్పాలి. జరిగిన సంఘటనలకు ఆమె కూడ చాలవరకు బాధ్యురాలని పలువురి భావన. ఆమె రామారావు జీవితంలోకి ప్రవేశించాక, ఆయనలో చాలా మార్పులు, కుటుంబంలో కూడ కుతకుతలు, దూసుకువచ్చిన అనారోగ్యం, వెరసి, ఆయన తుది ఘడియలు ప్రవేశించాయి. రామారావు తన తుది శ్వాసని, జనవరి 18, 1996 న విడిచారు. లక్షలాది మంది ప్రజాసమూహం ఆ సార్వభౌమునికి నివాళి అర్పించేందుకు వరసలు కట్టి ఆయనను రాజలాంఛనాలతో సాగనంపారు. ఘననివాళ్ళను సమర్పించారు.
ఏ చిక్కులూ, యే యిబ్బందులూ లేకుండా యీ ప్రప్రంచంలో సుఖంగా బతకాలంటే కొంత నటన అవసరం అంటారు. రంగస్థలంపై, చిత్రాల్లో నటించగలవాళ్ళూ జీవితంలో నటించలేరు; జీవితంలో నటించగలవాళ్ళు చిత్రరంగస్థలాల్లో రాణించలేరు; జీవితంలో నటించగలవాళ్ళు లౌక్యులు; తమ వౄత్తుల్లో రాణించగలవాళ్ళు నటులు. నటన జీవనోపాధి అయితే పరవాలేదు; కాని ప్రాణాలతో చెలగాటం కాకూడదు. ఏది ఏమైనా జీవితంలో బతక నేర్చినవాడు ఉత్తమనటుడు.
రాజకీయమనేది మన బ్రతుకులకు ఊపిరిలాంటిది అంటాడు శ్రీశ్రీ. అయినా, రాజకీయాల్లో పెద్దపాము చిన్న పాముల్ని నిర్దాక్షిణ్యంగా మింగటంద్వారానే పైకి ఎగబాకుతుంది. జనాలకు వాగ్దానాలు చేయడం, రాజకీయనాయకుని ప్రధాన కర్తవ్యం; అది తిరిగి తీర్చకపోవడమన్నది వారి సహజ లక్షణం. ఒకసారి గొడవొచ్చి విడిపోయాక అప్పటివరకూ కలిసి పనిచేసినవారిమీద బురదజల్లటాన్నే 'రాజకీయం' అంటాడు యండమూరి వీరేంద్రనాధ్. రాజకీయాల్లో ప్రత్యర్ధుల్ని మిగల్చకూడదు. పై వాళ్ళని నమ్మకపోవడం, కిందివాళ్ళను నమ్మకపోవడం, అదే రాజనీతి. అసలైన అబద్ధాలకంతులెరిగి అరచేతిలో స్వర్గం చూపువాడే ఆరితేరిన అసలు రాజకీయవేత్త. రాజకీయవేత్తలు కొలంబసులా తయారవుతున్నారు. ఎక్కడ బయలుదేరతారో తెలియదు; ఎక్కడికి వెళ్ళాలో తెలియదు; ఎటు చేరతారో తెలియదు. పైగా కొలంబసులాగే డబ్బు కూడా వీళ్ళది కాదు, అని అంటారు శ్రీరమణ.
అల్లుడ్ని నమ్ముకున్న రాజకీయనాయకుడుగాని, కొడుకుని నమ్ముకున్న రాజకీయనాయకుడుగాని లోకంలో ఎప్పుడైనా బాగుపడ్డాడా? అని పతంజలి అన్యాపదేశంగా, యదార్ధాన్ని చెప్పకనే చెప్పారు. అల్లుడికి అల్లుడు వచ్చి, రాజకీయంలో జోక్యం చేసుకుంటేనేగాని, తెలియదు. అల్లుడులేనివాడికి, రాజకీయం వేరేలా దెబ్బతీస్తుంది.
నందమూరి తారకరామారావు తన నటనద్వారా, రాజకీయాలద్వారా, అందించిన సందేశాలు, ఆలోచనలు, భావాలు, ఆయన స్థాపించిన తెలుగుదేశంద్వారా నెరవేరుతాయని ఆశిద్దాం। మహానాడుల్లో తీసుకుంటున్న మహానిర్ణయాలు, వాటి మహత్వపూర్ణత, ఎంతవరకూ ఆచరిస్తున్నారో ప్రజలకు, వారు నమ్ముకున్న తెలుగుదేశం, నాయకత్వం వారి నిర్వాకం ఏమిటో వారివారి విచక్షణకు వదిలివేయడమే. నచ్చితే ప్రజలు మెచ్చుకుని అధికారం అందించడం, నొచ్చితే గద్దెనుంచి దింపివేయడం, రాజకీయంలో అంతర్భాగమే కదా.
జనవరి 18 న నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా ఘననివాళిని సమర్పించాల్సిన ఘనతరుణం ఈనాడే. తెలుగువాడికి, తెలుగువేడికి సాక్ష్యంగా, నిదర్శనంగా మనకు నిత్యదర్శనం కావించే నందమూరి భావాభిరామానికి ధన్యవాదాలను సమర్పించుకోవాల్సిన తరుణం.
మరో నందమూరి కొరకు నిరీక్షణ చేద్దాం. శుభం భూయాత్. సర్వేజనా: సుఖినో భవంత్.

Tuesday, January 15, 2008
తెలుగురధం.
భాషను వాహనాన్ని జోడించిన వైనం. తెలుగు కి వివరణ అనవసరం. రధం అంటే మనకు స్మరణకు వచ్చేది మన పవిత్రమైన పండుగ - రధ సప్తమి, రధాంక సప్తమి. సూర్యుడు ఆరాధనామూర్తి.
'జననీ త్వం హిలోకానం సప్తమీ సప్తసప్తికీ, సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే".
సప్తాశ్వములు గల ఓ సప్తమీ! నీవు సకలభూతములకును, లోకములకును, జననివి, సూర్యునికి తల్లివైన నీకు నమస్కారము। సూర్యారాధనం మనకు వేదకాలంనుండియే కలదు। "అసత్యేన రజసా వర్తమానో నివేశయ న్నమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితా రధేనా దేవో యాతి భువనాని పశ్యణ్ - హిరణ్యరధమునెక్కి సూర్యుడు వెళ్ళుచున్నాడని ప్రాచీనులు ఎంతో సుందరముగ ఊహించి ఆరాధించారు। ఈ సూర్యుని రధానికి చక్రమొకటే। ఆ చక్రమునకు ఆకులారు; గుర్రములు ఏడు. సూర్యుడు సంవత్సరమునూ ఒకే చక్రముగల విశ్వమను రధమున ఛందస్సులను ఏడు గుర్రములను పూంచి వచ్చుచున్నాడు. సంవత్సరం ఆవృత్తమగు ఆరు ఋతువులు సముదాయం కనుక చక్రముగాను, సూర్యక్రణాన ఏడురంగులు భాసిస్తాయి కనుక వాని అశ్వములుగను పూర్వులు వర్ణించిరని పండితపరిశోధకుల భావన. రధం సంగతి అయింది.
యిక తెలుగు సంగతి।
'జనని సంస్కృతంబు సకల భాషలకును, దేశభాషందు తెలుసు లెస్స, జగతి తల్లికంటె సౌభాగ్యసంపదా అన్నాడు సాహిత్య చక్రవర్తి శ్రీనాధ మహాకవి।
'తెలుగదేల యన్న దేశంబు తెలు; గేను తెలుగువల్లభుండ తెలుగొ కండ, యెల్ల నృపులు గొలువ నెఋగవే బాసాడి, దేశభాషలందు తెలుగు లెస్స!' అని సామ్రాజ్య చక్రవర్తి అన్నాడు.
ఈ యిద్దరు మహానుభావులు అందించిన నుడి, నానుడిలను ఊపిరిగా, శ్వాశగా గ్రహించుకుని మన మాతృభాష తెలుగుని జనని, జన్మభూములతో సరిసమానంగా స్వీకరిస్తున్నాం అన్న భావన అత్యుక్తిగా భావించినా లేకపోయినా, అతిశయోక్తి ఎంతమాత్రం మాదు కాదు. తెలుగుదనానికి, తెలుగుదనానికి వారసులు రసరమ్య హృదయులైన నా తోటి తెలుగుతల్లి అనుంగు బిడ్డలకు సవినయంగా సమర్పించుకుంటున్న శతకోటి వందనాలు. మన జన్మభూమి, పుణ్యభూమి, ధన్యభూమి అయిన అమరభారతం - ఆంధ్రప్రదేశం - సుజల సుమధుర సుందరతరం. సత్యం, శివం, సుందరం. తెలుగుభాష అన్నా, తెలుగువారన్నా, తెలుగు సాహిత్యం అన్నా, సంస్కృతి అన్నా వల్లమాలిన అభిమానఏ ఈ - 'తెలుగు సంస్కృతి, సాహిత్య, సమగ్ర, సంక్షిప్త సంకలన విశ్వ వీక్షణ విహార దర్శినీ అయిన 'తెలుగురధం' ను ప్రతిశ్ఠాత్మకంగా మహాప్రస్థానం కావించాలని, ఈ ప్రస్థానంలో అందరి తెలుగువారి అండదండలతో చేయూతల్ని అందిస్తారని మనసా వాచా కర్మణా భావిస్తూ, విశ్వవిస్తూ, ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలని కోరుకుంటూ -
మకర సంక్రమణ - సంక్రాంతి శుభకాంక్షలతో -
మీ కొంపెల్ల శర్మ

దక్షిణవేదం - 'తిరుక్కురళ్' సౄష్టికర్త, మహాకవి, 'తిరువళ్ళువఋ
కొంపెల్ల శర్మ

త్రివేణీ మహత్తు
మన తెలుగుదేశం త్రిలింగదేశం। మన తెలుగు సాహిత్యానికి ప్రప్రధమంగా స్మరించతగ్గగణం - కవిత్రయం అనబడే నన్నయ్య, తిక్కన్న, ఎర్రన. అలాగే దక్షిణాంధ్రసంస్కౄతికి ప్రాణంపోసిన రాజధానికి సుక్షేత్రమైన తమిళనాడులో కూడ త్రివేణీసంగమానికి ప్రాధాన్యం వహించింది. ప్రధమంగా త్రిమూర్తులైన సంగీత వాగ్గేయకారులు - శ్రీ శ్యామశాస్త్రిగారు, శ్రీ ముత్తుసామి దీక్షితులుగారు మరియు శ్రీ కాకర్ల త్యాగరాజుగార్లను మన ధరణిపై కళల ప్రస్తావన వున్నంతకాలం మరువరాని, మరువలేని, మహానుభావులు, మహామనీషిమూర్తులు. అలాగే దక్షిణభారతానికి, ద్రవిడభాషాకుటుంబానికి తలమానికమైన భాష - తమిళం - భాషలో కూడ మనకు త్రివేణీసంభూతమైన కవిత్రయం కానవస్తుంది. తమిళభాషా కవిత్రయం అని నిర్ద్వందంగా నిత్యం, నిరంతరం ప్రస్తావించుకునేవారు - ఎవరు అని మనం చెప్పడం కాదు, మరొక తమిళభాషా మహాకవి, పండితుడు - భారతీయార్ అని పిలువబడే, సుబ్రహ్మణ్య భారతి పలవరించిన తీరు యిలా వుంది.
" మేమెరిగిన మహాకవులలో కంబన్, వళ్ళువన్, ఇళంగో అంతటివారు ఈ భూలోకములో పుట్టలేదు"
అంత గొప్పగా భారతీయార్ వంటి మహాకవియొక్క హౄదయమును చూరగొన్నారు। ప్రపంచమహాకవులందరిలోను వళ్ళువర్ మహాకవి. ప్రజలకు ఆవశ్యకమైన యొక దివ్యప్రబంధమును రచించిన వళ్ళువర్ ను -
" వళ్ళువర్ వంటివాడు తన్ను లోకమునకు అర్పించుకొన్నందున, మిన్నందిన కీర్తి పొందినది ఈ తమిళనాడు" అని తమిళనాడును స్తుతించునంతటి విధాన తిరువళ్ళువర్ ను ప్రపంచరంగం ముందు నిలిపి సాటిలేని కవిగా నిలిపాడు. కేవలం ఒక్క భారతీయార్ మాత్రమేకాదు, ప్రపంచపందలి పెద్దలందరును తిరువళువర్ మహాకవిని, వారి తిరుక్కురళ్ ను ప్రశింసించుచున్నారు. దానికి తమతమ భాషలలో వ్యాఖ్యలు వ్రాసి, అనుభవించి, ఆనందించుచున్నారు.
అంతేగాక, మనకు తెలుగులో మాదిరి, కవిత్రయం లో మధ్యన నడయాడే 'తిక్కనా లాగ, తమిళ కవిత్రయంలో కూడ 'వళ్ళువాఋ మధ్యస్థానాన్ని ఆక్రమించి, భీమునివాటాలాగున మనకు విశ్వరూపంలో గోచరిస్తారు.
తిరువళ్ళువర్ వ్యక్తిత్వం - తిరుక్కురళ్ మహత్తు
తమిళవేదం అని పొగడబడు 'తిరుక్కుర్కళ్'ను తమిళులకు ప్రసాదించి వారికి శాశ్వతముగ నిలువదగిన పేరు ప్రతిష్ఠలను తెచ్చినవారు - తిరువళ్ళువర్. ఆయనొక దైవిక పండితుడు. రెండువేల సంవత్సరాలకు మునుపే ఈ తమిళనేలపై అవతరించిన తపస్సంపన్నుడు. అతని గురించి పలువురు పలు విధాలుగా తన జీవితకధను చెప్పుకున్నారు. తన ఏకైక రచన - తిరుక్కురళ్ - ద్వారా పలువుర ప్రశంసలనందుకుంటూనే వున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రచనపై నిత్యం, నిరంతరం, ఆలోచించుకుంటూ, విశ్లేషించుకుంటూనే వున్నారు. ప్రపంచ తిరుక్కురళ్ సమాఖ్య దీనికి నిదర్శనం. దైవంపై, కర్మ సిద్ధాంతంపైనా నమ్మకం కలవాడు. ప్రజలు భూలోకంలో భాగా గౄహస్థ ధర్మాన్ని నిలిపి స్వర్గలోక సుఖాన్ని అనుభవించాలని ఆకాంక్షించాడు. బీదసాదలయెడ అపరిమిత కారుణ్యతను కలిగాడు. యాచకుల స్థితిని చూసి మనోవేదన భరించలేకపోయాడు. మానవుడు పొందదగిన సుస్థిర విషయాన్ని తమ రచనలో పొందుపరచాడు. ఈయన వలె నేటివరకూ ఎవ్వరూ ధర్మానికి విశిష్ట విమర్శను చెప్పలేదనే చెప్తారు. అర్ధశాస్త్రం విప్పిచెప్పే విషయాల్ని నేటికీ ఉపయోగపడేలా స్థిరమైన, రాజకీయం, ఆర్ధికం, సాంఘికం, మనస్తత్వం లాంటి సత్యమైన విషయాల్ని ఈ తిరుక్కురళ్ వివరిస్తోంది. చతుర్విధ పురుషార్ధాల్లో, తౄతీయ పురుషార్ధం - కామం - ను ప్రేమికుల మనసు అనురాగపూరితమై మానవుల పరిపూర్ణతను పొందడానికి సూచికగా ఉపయోగపడుతోంది. 'తిరుక్కుర్కళ్' జీవిత సౌధం నిర్మించే గ్రంధం' అని సమస్తభావన.
'తిరువళ్ళువఋ జీవనప్రస్థానం
తమిళభాషకు గౌరవాన్ని తెచ్చిన గొప్ప తమిళ రచయిత - తిరువళ్ళువర్, ఆయన రచన, 'తిరుక్కురళ్' అవిభాజ్యాలు। తిరువళ్ళువర్ జీవితం గురించి చెప్పిన అభిప్రాయాల్లో, ఆయన 1వ శ. (100-300 క్రీ.శ.)(600 అని కూడ) వాడని తమిళసంస్కౄతి చాటిచెప్పుతున్న సత్యం. చేనేత వౄత్తికార కుటుంబం. వాసుకి ధర్మపత్ని. తిరు - తమిళంలో గౌరవ సంబోధన - శ్రీ). వళ్ళువన్, వళ్ళువార్ (గౌరవవాచకం), కుల/వౄత్తిని కూడ సూచించే పదం. జన్మనామం కాకపోవచ్చని పలువురి వాదన. ఈనాటి వరకు అదేపేరుగల 'కులం' (నేతవారు), 'తిరువాళ్వాఋ తన వంశస్థుడు/పూర్వీకుడని వారి అభిప్రాయం.
మరచిపోలేని జీవన కధనాలు
ప్రస్తుతం చెన్నై మహానగరంలో ప్రముఖ ఆవాసంగా చెలామణి అవుతున్న మైలాపూర్ లో తిరువళ్ళువర్ జన్మించాడని పలువురి భావన. కొందరు మధురై (పాండ్యరాజుల రాజధాని) అన్నదానికి బలం కనిపిస్తోందంటారు. మధురై తమిళ సంఘం లో పాల్గొన్న ప్రముఖుడు. తమిళభాషని, కవులని ప్రోత్సహించిన వైనంలో ఈయనను ప్రస్తావించకపోవడం, జరగని పని, అసంభవాన్ని సంభవంగా చూపించడం. జానపద సంస్కౄతి ఆధారాల ప్రకారం తిరుక్కురళ్ ని పరిచయం చేయడం జరిగిందంటారు. పాండ్యరాజులు చాలాకాలం నిర్వహించి, ప్రోత్సహించిన కధనం - నేటికీ, విద్వాంసులు, పరిశోధకులు, వేదికను నడుపుతున్న సాక్ష్యకధనం. కన్యాకుమారి చారిత్రక, సంస్కౄతీ పరిశోధనాకేంద్రం అభిప్రాయం ప్రకారం - కన్యాకుమారి జిల్లా, కొండప్రాంతం 'వల్లువనాడూని పరిపాలించిన రాజప్రభువులని చెప్తారు. యిది ఆధునికంగా వచ్చిన వాదన. కాని, అనేక ప్రశ్నలకు సమాధానాలు కూడ అలభ్యం. వల్లువనాడు - కేరళలోని, 9వ శ. నాటి ప్రాంతం. తిరువళ్ళువర్ విశ్వాసాల్ని, అభిప్రాయాలకు కూడ అనేక వాదోపవాదాలు - హిందువని, జైన్ వంశస్థుడని కూడ ప్రచారాలు కానవస్తాయి. వీటన్నింటికీ త్రోసిరాజన్నది - తమిళనాడు. వారి నిశ్చితాభిప్రాయం ప్రకారం - మునిసాధు పుంగవుడు, కవి, అని, తిరుక్కురళ్ ని - 'పొయ్యమొళీ (అసంబద్ధతను) దరిచేరని, సత్యరచన, 'అనంతసత్యం'. వేదాలు, తక్కువజాతి హిందువులు, జైనులు, బౌద్ధులు, కిరస్తానీలు, ఉన్నతవర్గపు హిందువులు, బ్రాహ్మణులు, అరబ్రాహ్మణులు, యిటువంటివి ఏమైనా కూడ పట్టించుకోకుండా, మతాల అంతరాల్ని వదలి, సమ్మతవాదాన్ని స్వీకరించిన సత్పురుషుడు, మహామనీషి.
తల్లిదండ్రులు
తిరువళ్ళువార్ జన్మస్థలం గురించి వాదోపవాదాలు ఎలా వున్నాయో, ఆయన పుట్టుక గురించి కూడ కొన్ని చర్చలున్నాయి. ప్రముఖాధారం ప్రకారం - తండ్రి భగవాన్, బ్రాహ్మణుడు, అస్పృఅశ్యురాలుగా భావించబడిన తల్లి. ఫలితంగా, సమాజంనుంచి బహిష్కరించబడి, బ్రాహ్మణేతరురాలు, వెల్లల - భూస్వామి కులం, యితణ్ణి 'తిరు-వళ్ళువఋ అని నామకరణం చేసిందట. అయితే, చుట్టుప్రక్కలవారి పోరుతో, ఆమె కూడ అతణ్ణి వదిలేసిందిట. ఈసారి, మరొక అస్పౄశ్యవర్గం - పెరియార్లు, కుటుంబం ఆదరించిందట. తర్వాత, మైలాపూర్ చేరుకోవడం, అక్కడ చేనేతకారుడుగా పని చేశాడుట. తిరువళ్ళువర్ జీవితం మాత్రం సరిగ్గా, సాదాగా మాత్రం జరగలేదని చెప్పవచ్చు. అయితే, ఆయన మహాకవి. మహాకవి నుంచి ఉద్భవించిన మహాగ్రంధం మాత్రం - మానవసౄష్టి వున్నంతకాలం సజీవంగా వుంటుంది అన్నదాంట్లో ఏమాత్రం సంశయం, సందేహం లేవు, రానేరావు.
తిరుక్కురళ్ - దక్షిణ, ద్రవిడ వేదం
తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురళ్ - ద్రావిడవేదంగా చాలా ప్రసిద్ధి. మహాకవి ఆరుద్ర, తిరుక్కురళ్ ని 'దక్షిణవేదం'గా అంధ్రీకరించాడు. తమిళంలో ప్రావీణ్యం ఉన్న ఆరుద్ర, తమిళ సాహిత్యాన్ని ఆధ్యయనం చేశాడు. తమిళంలోని తిరుక్కురళ్ అపార ప్రాచుర్యం పొందింది. జీవిత సూత్రాలను చిన్న అనుష్టుప్ శ్లోకాల్లాగ, చెప్పబడ్డాయి. పిట్టకొంచెం, కూతఘనం అన్నట్లు గోచరిస్తుంది. మన ఆధ్యాత్మక భక్తి స్తోత్రావళి మాదిరిగా కనిపిస్తుంది. హేమాహేమీలు సహితం 'కురళ్ చర్చలు జరిపి ఇంకా ఇంకా కొత్త అర్ధ నిర్ణయాలు చేయాలని చూస్తూనే వున్నారు. మాట విరుపులో అర్ధం మారిపోయే కురళ్ లని అనువదించడం కత్తిమీద సాము విద్యలో సమగ్రాంధ్రసాహితీకర్త - ఆరుద్ర విజయవంతం అయ్యాడు. చక్కని భాషాశైలిలో వ్రాసి, తమిళ, తెలుగు ప్రజలనుంచి ప్రశంసలు అందుకున్నాడు.
ఆరుద్ర తిరుక్కురళ్ నుంచి - మచ్చుతునకలు
శాశ్వతమ్ముగాని సకలమ్ము తిరమని, ఎంచువాని బుద్ధి కొంచమనుము.
ఉన్ననాడు తాను సన్యాసి కావలె, వీడ సుఖములెన్నో కూడగలవు.
కాకి తిండి దొరుక మూక నెల్లను పిలుచు, అట్టి గుణము వలన అబ్బు సిరులు.
భాష సూటిగా, సంస్కౄతిని ప్రతిబింబించేలా దర్శనం యిస్తే, అది అనువాదం కానేకాదు కదా. అందుకే, కొంతమంది కవులు, అనుసౄజనం అని పేరు పెట్టారు.
తిరుక్కురళ్ స్వరూపం
దక్షిణ ద్రవిడ వేదం అయిన తిరుక్కురళ్ ని సంపూర్ణ కావ్యం గా భావించాలి.
తమిళ మూల రచన లో 1330 ద్విపాద పద్యాలుగా వున్నాయి. ధర్మశాస్త్రం, అర్ధశాస్త్రం, కామశాస్త్రం అని మూడు ఖండాలుగా విభజించబడ్డాయి. ఉపఖండికలు యిలా వున్నాయి.
ధర్మశాస్త్రం - దైవీకం, గార్హస్థం, సన్యాసం, విధి బలీయత।అర్ధశాస్త్రం - రాజకీయం, రాజ్యాంగం, యితరాలు (వీటికి అతీతాలు).కామశాస్త్రం - సంయోగం, పతివ్రతా వియోగం.
పై విభజనలతో, మొత్తం 133 అధ్యాయాలున్నాయి। ప్రతీ అధ్యాయానికి, 10 చొప్పున ద్విపాద పద్యాలుగా రచింపబడ్డాయి.
తిరుక్కురళ్ లో, ప్రతీ పద్యం - మొదటి పాదం నాలుగు గణాలు, రెండవ పాదం మూడు గణాలతో తనదైన ప్రత్యేకశైలితో చదువుటకు తేలికగా, విపులమైన భావాల్ని నిముడ్చుకొని, తమిళంలో వేదమని పేరుపొందింది. శ్రీ దివ్యసూక్తులు - ధర్మార్ధకామశాస్త్రములను - 'అరత్తుప్పాళ్ అనే ధర్మశాస్త్రనీతులు, 'పొరుట్పాళ్ అనే అర్ధశాస్త్రనీతులు, 'కామత్తుప్పాళ్ అనే కామశాస్త్రనీతులు అని వ్రాయబడ్డాయి. వ్యక్తిగతమైనవి ధర్మశాస్త్రంలోను, సంఘపరమైనవి అర్ధశాస్త్రంలోను కనిపిస్తాయి. సమాజానికి అవసరమైన పాళ్ళలో మోక్షసిద్ధిని సాధించేలా కామశాస్త్రపు రాగధోరణుల్ని కూడ వివరించాడు. దైవప్రార్ధన తో ప్రారంభమైన కురళ్ రచన, పొలయలుక ప్రేమ తో పరిసమాప్తమయింది. ఈ వేదంలో లేని అంశాలు, వివరణలు, కర్మ సిద్ధాంత జన్మ మర్మాదులు, మన ప్రజాకవి వేమనకవి మాదిరిలా తేటతెల్లంగా రచించడం జరిగింది. తీపిరుచులూరే షడ్రసోపేతమైన విందుభోజనం. ముక్తి, భుక్తి, రక్తి కలుగుతాయి.
ఆచంద్రతారార్కం నిలిచిపోయే రచన తిరుక్కురళ్, రచయిత తిరువళ్ళువర్ చిరస్థాయిగా ఈ భూమి పై సుస్థిరస్థానం సంపందించారు అన్నది మాత్రం అక్షరాలా నిజం।
మన మహానుభావుల్లో, తప్పక తిరువళ్ళువర్ ని, మహానుభావుకత కి తిరుక్కురళ్ ని ఉదాహరించక తప్పదు. ఈ వేదసారాన్ని చదివి, ఆలోచనలతో ఆనందించండి. పరిపూర్ణ మానవతని అలవడి చేసుకుని, నూటృఇకి నూరుశాతం మానవతామూర్తిగా ప్రతీ పౌరుడు మారవలసిన అవసరాన్ని, మహాకవి దినోత్సవం రోజు 16 జనవరి రోజున తీర్మానించుకుని, ఆచరణకు పూనుకోవాలి. శుభం భూయాత్.

Monday, January 14, 2008
కదలివచ్చెను 'మకర సంక్రాంతి లక్ష్మీ హేమంతవీధి!
కొంపెల్ల శర్మ
కదలివచ్చెను 'మకర సంక్రాంతి లక్ష్మీ హేమంతవీధి!
మానవజీవితంలో పండుగల ప్రాశస్త్యం
అన్ని రోజులెట్టివో, పండుగరోజు లట్టివే। ఒకరోజు పండుగరోజు కావడానికి దానికి మనం ఆపాదించుకునే ప్రత్యేకతే కారణం, దానికి మనం సమకూర్చుకునే వైశిష్ట్యమే కారణం. పండుగలన్నీ సంవత్సరాని కొకసారి చొప్పున తిరిగి, తిరిగి వచ్చేవే. అంతమాత్రం చేత వాటి అర్ధం తగ్గదు; అందం తగ్గదు; ఆనందం తగ్గదు. ప్రతి సంవత్సరం వచ్చేది కనుక, వసంతం విలాసం, పూర్ణిమ శోభ తగ్గదు సరికదా, ప్రకౄతి విలాసాలలోని నిత్యనూతనత్వం జాతీయ పర్వదినాల్లో కూడ వుంటుంది. భారతదేశపు సంస్కౄతీసంపదలను ప్రతిబింబించే పండుగల్లో ప్రధానంగా - ఉగాది, శ్రీరామనవమి, కౄష్ణాష్టమి, వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రిలతోపాటు ఎన్నో, మరెన్నో చెప్పుకోవాలి. మన ప్రధాన పర్వదినాలకు ప్రకౄతివిలాసాలతో సన్నిహిత సంబంధం ఉన్నది కూడా. తన కడుపు పంటతో మన గరిసెలను, గాదెలను బంగారు రాజనాలతో నింపివేసే ధాన్యలక్ష్మికి మన మెత్తే నివ్వ్వాళి - సంక్రాంతి. ఆంగ్లసంవత్సరపు కాలండర్ లో మనకు జనవరి 1 నాడు జరుపుకొనే నూతనసంవత్సరం తర్వాత, వెనువెంటనే వచ్చేది 'సంక్రాంతీ పండుగనే విశేషంగా చెప్పుకోవాలి.
సంక్రాంతి వైభవం
మన తెలుగువాళ్ళకు పెద్దపండుగగా స్థిరపడిపోయిన పండుగ - సంక్రాంతి। నవ్యాంధ్రకవి శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారి పలుకులలో తిరిగి మనకు - "వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి - వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతీ అని ఎంత సహజంగా చెప్పారో! ఊకబంతి, పోకబంతి, రేకబంతి, ముద్దబంతి - ఇలాగే మరెన్నో రకాల బంతిపూల పసిడి కాంతులను విరజిమ్ముకుంటూ "పచ్చ సంక్రాంతి" వచ్చింది; సీమసీమ, ఊరూరు, వాడవాడ కొత్త పంటలతో తొలుకాడుతుండగా "లచ్చి సంక్రాంతి" వచ్చింది. ఇంత ఫ్వైభవంతో వచ్చిన ఈ సంక్రాంతిలక్ష్మికి స్వాగతంగానే మన వాకిళ్ళలో ముగ్గులు, ఆ ముగ్గులమధ్య గొబ్బెమ్మలు, ఆమెకు ఆహ్వానంగానే మన మండిగాలకు పసుపుకుంకాలు, వాటికి మరింత శోభకోసం బంతుపూదండలు, ఆమె పేరుతో బొమ్మల కొలువులు,ఆ కొలువులకు చుట్టపక్కాలకు పిలుపులు.
'సంక్రాంతీ సాహిత్యంలో తొలి ప్రస్తావన
'తత్ర మేషాదిషు ద్వాదశరాశిషు క్రమేణ సంచరత: సూర్యస్య పూర్వస్మా ద్రాశే ఉత్తరాశౌ సంక్రమణ ప్రవేశ: సంక్రాంతి:" అని జయసింహ కల్పద్రుపమున సంక్రాంతి పదం కనిపిస్తుందని 'హిందువుల పండుగలు - పర్వములూ అన్న వ్యాసపరంపరలో 'మకరసంక్రాంతీ లో వివరించారు. శ్రీనాధుడు 'పెనుబందువూ అన్నాడు. చలికాలం వస్తుంది కనక, శివరాత్రిమాహాత్మ్యం లో సంక్రాంతి ని చక్కగా వివరించాడు.
"ఇండ్ల మొదలను నీ రెండు నీదికలను, అనుగుతమ్ముడు, అన్నయు ఆటలాడు, అత్తయును కోడలును కుమ్ములాడు, కుమ్ముగాచు చోటికి మకరసంక్రాంతివేళా అన్నాడు।
యింత పెద్దపండుగను, ప్రాచీనకవులు ఎక్కువగా ప్రస్తావించకపోవడానికి మాత్రం కారణాలు గోచరించవు, ఎందుకనో.
మార్గశిర పుష్యమాసాల్లో వచ్చేది సంక్రాంతి పండుగ। సంక్రాంతి లేక సంక్రమణం అంటే చేరుట, మారుట అని అర్ధం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. నిజంగా, సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులుంటాయి. అయినా, పుష్యమాసంలో హేమంతౠతువులో శీతగాలులు వీస్తూ మంచుకురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే 'మకరసంక్రాంతీకి ఎంతో ప్రాముఖ్యం, ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకరసంక్రాంతి రోజున, అంటే జనవరి 14 న సూర్యుడు ఉత్తరాయణ పథంలో ప్రవేశిస్తాడు. దక్షిణాయన పర్వం నుంచి నిష్క్రమిస్తాడు. ఈ రోజునుంచి స్వర్గద్వారాలు తెఋరచివుంటాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.
విశ్వావ్యాప్తంగా 'సంక్రాంతీ విధానాలు
సంక్రాంతి - అనే పేరుతో పిలవక పోయినా, ప్రతి దేశం, ప్రతి జాతి చేసుకొంటున్నట్టిదే ఈ పండుగ। దున్ని, విత్తి, పైరు చేయడాన్ని మానవుడు ఏనాడు నేర్చుకొన్నాడో, తన కష్టాన్ని మెచ్చి భూదేవి పంటరూపంలో తనకు బంగరు వరాలిస్తుందని ఏనాడు తెలుసుకొన్నాడో ఆనాడే దేశదేశాలలోఈ పండుగ ఏ పేరుతోనో ఒక పేరుతో పుట్టింది. కోతకోసి,కుప్ప వేసి, కళ్ళం చేసి, పంట నూర్చి, గింజలను ఇంటికి తెచ్చుకొనడం జరిగినంత కాలం ఈ పండుగ జరుగుతూనే వుంటుంది.
విదేశాల్లో సంక్రాంతి పండుగలు
మకరరాశి జలచర స్థలచరముల ద్వందరూపంగా భావించబడింది. ఈ జంతువు శరీరం పైభాగం బంగారు కొమ్ములతో మేక ఆకారంగాను, కిందభాగం మొసలి ఆకారంగాను దర్శనం యిస్తుంది. యిదే వరసలే, గ్రీకులు పై శరీరభాగాన్ని మేకగాను, వెనుకసగభాగం చేప ఆకారంగాను భావించడం, ఈ భావనకు కొన్ని గ్రీకుగాధలు కూడ చెప్పుకుంటారు. గ్రీకు గాధలను బేకన్ దేవత, టైఫన్ మహాభూతముల కధనం ప్రకారం వింతమేక ఆకాశాన మకరరాశిలో నిలిచిపోయినట్లు గోచరిస్తుంది. పాన్ దేవత నైలునదిలో పడిపోవడం, ఒక మునకపాటుకి లేవడంతో మేకరూపం వచ్చింది అన్న కధనాల్ని బట్టి, గ్రీకు, లాటిన్ గాధలలో మకరరాశిని జాలాధిదేవతగా పేర్కొన్నారు. వర్షప్రసాదితమైనది, తుఫాన్ రాకను తెలిపేది - మకరం. ఈజిప్టు సంస్కౄతీ పరంపరలో మకరరాశిని 'నం' అనే జలాధిదేవతకు, సూర్యుని మకరరాశి ప్రవేశానికి, నైలునది పొంగటానికి, సమన్వయాన్ని చేసుకుంటారు. నైలునదీ ప్రాంతాల్లో తుఫానులు మకరరాశిలో సూర్యుడు ప్రవేశించడంతో ప్రారంభమవుతాయని శాస్త్రీయం.
మన మకరసంక్రాంతి ప్రాశస్త్యం
ద్వాదశరాశుల దివ్యయాత్రను కావించే దివాకరునికి ప్రధాన ఘట్టాలుగా, మేష, కటక, తుల, మకర సంక్రమణాల్ని పేర్కొంటారు। సూర్యుడు ఈ దశలను చేరుకోగానే, ప్రకౄతి పులకించి పలువిధాల విలాసవంతమవుతుంది. ఆ విశిష్టవిలాససమన్వయమే మకరసంక్రాంతి. తొలకరి, దానివల్ల మెట్టపైర్లు, మాగాణిపంటలు కార్తీక మార్గశిరాల్లో కాపుకురావడం, కలకలలు, కనులపండువలు గోచరిస్తాయి. పొలాల్లో వరివేలు, చేమంతి, బంతిపూలతో చెందే బంగారుకాంతులు, పశుగణాభివౄద్ధి, కర్షకులు మురిసిపోవడంతో ఈ సస్యసమౄద్ధిని చూసి, గీతలో కౄష్ణుడు 'మాసానాం మార్గశీర్షోహం' అని ప్రాధాన్యతను విన్నవించాడు. ఈ మార్గశిర సమాప్తంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు ముఖ్యంతో ఉత్తమకాలంగా విశ్వసించబడుతోంది. దక్షిణాయనకాలం వానలు, వల్లప్పలు, బురదలు, చీకట్లు,మబ్బులతో తబ్బిబ్బవితే, ఉత్తరాయణంలో గాదెలునిండిన పంటలు, గరిసెలు, ధాన్యాలు, ఆరోగ్యైశ్వర్యాల సహితమైన ఉత్తమకాలంగా, సుఖమయంగా భావిస్తూంటారు. ఉత్తరాయణకాలంలో గతించిన ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని, భీష్ముని నిర్యాణం, శౄతి, స్మౄతి, ఇతిహాస పురాణాల్లో ఉత్తరాయణ పుణ్యకాల ప్రాశస్త్యాన్ని వివరించడం జరిగింది.
మన సంవత్సరాది సంక్రాంతియే అనుకోవచ్చు
మనం చాంద్రాయనశైలిలో జరుపుకునే సంవత్సరాదిని చైత్ర శుద్ధ పాడ్యమిని పరిగణిస్తున్నా, ఒక విధంగా మకరసంక్రాంతి రోజు సంవత్సరాదిగా పరిగణించడానికి అనువైన విషయాలు అధికంగా గోచరిస్తాయి అని కూడ పండితులు భావించారు. ప్రకౄతియందు గోచరించే ప్రధానమైన మార్పులు మకరసంక్రమణం నుంచే సత్యంగా ప్రారంభమవుతాయని, చైత్రశుద్ధపాడ్యమి రోజుకి పరిపక్వతను పొందుతాయి. శీతవాతాల తగ్గుదల, పాడిపంటలతో నవనవోన్మేషిత జీవనశైలికి శ్రీకారం చుట్టడం, సంక్రాంతి పురుషుణ్ణి 'సంకురుమయ్యా వీక్షణం సంవత్సరం మొత్తం కలుగుతుందని, దేశం సస్యశ్యామలంగా ఏడాది ప్రభావంగా వుంటుందని, భావిస్తారు.
మూడురోజుల ముచ్చట్లు మన సంక్రాంతులు
ప్రాచీనాచారాలకు ప్రతీకగా జరుపుకునే సంక్రాంతి మూడురోజులుగా - భోగి, సంక్రాంతి, కనుము, అంతేకాక, నాల్గవరోజు ముక్కనుము అనికూడ జరుపుకుంటారు।
మొదటిరోజు - భోగి
పంటసంపదను తస్కరించకుండ పహారా చేసే చీకటి చలి సమయాన కల్పించుకునే కాంతులవింతలు, మంటలమధ్య, ప్రదక్షణాలు, భజనలమధ్య కాలయాపనలు ప్రాధాన్యం వహించాయి. పాతబడిన వస్తువులు కూడ అగ్నిహోత్రంపాలవుతాయి. భోగి - 'భుజ్' అన్న పదం యింద్రుని ప్రీతికి జరుపుకునే పండుగగాను, పోగు, పొంగులనుంది పుట్టిన 'భోగీగాను, ఉత్తరదేశాన 'లోడీగాను, మంటలు పీడవదలినట్లుగాను, నూతనజీవితారంభంగాను విశ్వసించడం కూడ కద్దు. పంటల తండులాలు, కూరగాయలతో పాలుపోసి, పొంగళ్ళు - పులగం వండుకుంటారు. యిది అనాది దినుసు అనే చెప్పాలి. పిల్లలకు భోగిపండ్లు పోయడం ద్వారా దౄష్టిని పోగట్టడం కూడ విశేషంగా చెప్పాలి.
రెండవరోజు - సంక్రాంతి
సూర్యుడు మకరరాశిలో ప్రవేశంచేసే రోజు. మకరరాశ్యాధిపతి 'శనీ వాతప్రధానగ్రహమని, వాత నివారణ కోసం తైలస్నానం, నువ్వులు, బెల్లం, గుమ్మడిదానం యిస్తారు. ఉన్నవారు, లేనివారు సమంగా దానం యివ్వడం కూడ జరుగుతుంది. 'నాస్తీ అన్న మాటలేకుండా దానం చేయాలని ధర్మ పరంపర వివరిస్తోంది. స్త్రీలు మాంగళ్యాభివౄద్ధికై కుంకుమ, సుగంధద్రవ్యాలు, బెల్లం, పువ్వులు, వస్తాలు దానం యివ్వాలని కూడ అంటారు. తిల వస్త్రదానాదులవల్ల రోగవిముక్తి, నల్లనూవులతో స్నానం చేసి నువ్వులదానం, శివాలయంలో నువ్వులనూనెతో దీపం పెట్టడం కూడ ఆచారమే. పిల్లలు పెద్దలకు నమస్కరించడం ముఖ్యభాగంగా చెలామణి అవడం, 'మొక్కుల పండుగా గా సంక్రాంతిని భావిస్తారు. కుటుంబపరంగా కూడ, సుఖ సంతోష సరస సల్లాప సహిత సమావేశాలు, కొత్తదంపతుల సంక్రాంతి సత్కారాలు ఈ పండుగలో అనివార్యాలు. కొత్తసంవత్సరం జనవరిలో జరుపుకున్న వెంటనే మనసంస్కౄతిని ప్రతిబింబించే సంక్రాంతి పండుగ సరిసములులేని పర్వోత్సవసమాహారం.
మూడవరోజు - కనుమ
కనుమ పూర్తిగా కర్షకుల పర్వదినోత్సవాల మయమే। పశువులను గౌరవించడం గోధనం దేశధనంగా వస్తున్న భావన, పశువులను సొమ్ములుగా పిలుచుకోవడం సదాచారసంపన్నతకు మారుపేరు అయింది. గ్రామాల్లో పశుబలి, పశువుల కొట్టాల్లో పాలపొంగలి తయారీలో 'పాలపొంగలి పసుల పొంగలీ అని కేరింతలు, దేవతానైవేద్యం తర్వాత దాన్ని పొలాల్లో జల్లడం - పొంగలి మెతుకులు - 'పొలిచల్లడం' వల్లన పంట పొల్లుపోక, గింజ రాలుబడి పెరుగుతుందనే విశ్వాసం అధికం. దిష్టితో గుమ్మడికాయను పగలకొట్టడం కూడ ఆచరిస్తారు. ముందున్నది ముసర్ల పండగ (పొలాలలో పొలి అన్నపు మెతుకులు) నాడు మిడిసిపాటుతనం వెల్లడవుతుందనే గుర్తుచేయడం కనిపిస్తుంది. పశువుల సంబరాల్లో భాగంగా, అలంకరణలు, రంగుపూతలు, గంటలుకట్టడం చాలా హడావుడిగా జరుగుతాయి. భూమాతను అభ్యర్ధించడం, కౄషిచేయడం, కోడెలను, ఆవులను ఆదరించడంలాంటి చర్యలు కౄతజ़్జతాసంకేతాలు అనే చెప్పాలి. గంగిరెద్దాటలు, డూడూ డూడూ బసవన్నా అంటూ సన్నాయిమేళాల మధ్య మాటలు, ఎద్దుతల ఊపులాటలు, భావిధోరణి చెప్పించడం గౌరవచర్యలు. ఎడ్లపోటీలు, కోడిపందాలు, గొర్రెపొట్టేళ్ళ కుమ్ములాట ఊరేగింపులు, సరదాల మధ్య ప్రాణభయం కూడ కలుగుతాయి. విజేతలకు కన్యాస్వయంవరాలు కూడ జరిగేవట. తమిళనాడులోని మధుర, తిరునల్వేలి ప్రాంతాల్లో, ఎడ్లకొమ్ములకు నగనాణ్యాలు, వస్తాలు కట్టి పరుగులెట్టించడం, చప్పట్ల తప్పెట్ల మధ్య వేగం పుంజుకోవడం, ప్రమాదాలు జరుగుతున్నా, కట్టినవాటిని విప్పే ప్రయత్నంలో తీవ్రతరపోటీలు మరింత వెర్రితనం ముదరడం వలన, న్యాయస్థానం కూడ జోక్యం చేసుకున్న వెర్రిధోరణులు కూడ గమనిస్తాం. ప్రజల తీవ్ర అభ్యంతరధోరణులు కూడ గమనిస్తున్నాం. ఆచారాలు అవాంతరాలకు దారితీయరాదు అన్న స్పౄహలోపిస్తున్న కలికాలంలో సంక్రాంతి జరుపుకుంటున్నాం.
మూన్నాళ్ళ తర్వాత ముక్కనుమ
మూడవరోజైన కనుమ తర్వాత జరుపుకునే పండుగ ముక్కనుమ కూడ చాలాచోట్ల ఆచారంగా వస్తోంది. స్త్రీలు ఆచరించే శ్రావణ మంగళ గౌరీవ్రతం, సంక్రాంతి బొమ్మలకొలువులు, పుట్టింటిని క్షేమాభివౄద్ధిని కోరి 'కాకి పిడచ పెట్టడం' కూడ ఆచారమే.
బలి కధనం
బలిచక్రవర్తి రాజ్యపు ఆబాలగోపాలం స్మరణలతో ఉత్సవాలు, దక్షిణాయనంలో పాతాళానికెళ్ళి తిరిగి రావడంపై ప్రార్ధించడంలో నరకచతుర్దశి రోజున బలికి రాజ్యం కోరగా, సూర్యుడు బలిని వదలి మరల అగుపడు గాక అని కోరిన పిదప సంక్రాంతినాడు బలిస్మరణం జరుగుతుంది। దీన్ని బట్టి మకరసంక్రమణం సూర్యారాధ్యోత్సవం గా తెలుస్తుంది.
ప్రముఖ తెలుగుకవి - తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి కవిత - 'సంక్రాంతీ అందచందాలని వివరించిన తీరుకి మచ్చుతునక।
కదలి వచ్చెను భాగ్యాల కడలిపోలి, మకర సంక్రాంతిలక్ష్మి హేమంతవీధి.
మధుర మధురానురాగసామ్రాజ్యపీఠి, జగము కొలువుండె మకరధ్వజంబు నెత్తి.
యింక పండుగనాడు ఎదురయ్యే భోజన భక్ష్యాదుల గురించి -
లేగటిపాలలో క్రాగి మాగిన తీయ తీయ కప్పురభోగి పాయసంబుచవులూరు కరివేపచివురాకుతో గమగమలాడు పైరవంకాయకూరతరుణకుస్తుంబరీదళమైత్రిమై నాల్క త్రుప్పుడుల్చెడు నక్కదోసబజ్జిక్రొత్తబెల్లపుదోడికోడలై మరిగిన ముదురుగుమ్మడిపండు ముదురుపులుసుజిడ్డు దేరిన వెన్నెల గడ్డపెరుగు, గరగరికజాటు ముంగారు చెరకురసముసంతరించితి విందుభోజనము సేయ, రండురండని పిలిచె సంక్రమణలక్ష్మి.
పైవిధంగా వడ్డించిన విస్తరి మనందరిముందు తయారు చేశారు, మన ప్రాచీనులు, పురాణీకులు, ఐతిహాసికులు, కవిఘనులు. ఆహారాన్ని ఆరగిద్దాం, ఆచారాల్ని ఆచరిద్దాం. జాతీయతని జారవిడవకుండ, సదాచారాన్ని సగౌరవంగా పాటిద్దాం. మకరసంక్రమణలక్ష్మికి మదిలో అర్చనలు చేద్దాం.
రావమ్మా మహలక్ష్మీ రావమ్మా, కౄష్ణార్పణం అంటూ పలవరిద్దాం. పండుగను పర్వదినంలా జరుపుకుందాం.
మకరసంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు, శతసహస్రాలు. శతధావిన్నపాలు. ఓం తత్సత్.

Sunday, January 13, 2008
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
మకర సంక్రాంతి శుభాకాంక్షలు - కొంపెల్ల శర్మ.
సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం, చేరడం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం. సంక్రాంతి అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు వుంటాయి. అయినా పుష్యమాసంలో హేమంతఋతువులో శితగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే 'మకర సంక్రాంతీకి ఎంతో ప్రాముఖ్యం వుంది. సంక్రాంతి పండుగ మూడురోజులుగా - భోగి, సంక్రాంతి, కనుము - జరుపుకోవడం సంప్రదాయం. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి వస్తుంది కనుక రైతుల పండుగ అయింది. రంగాలంకరణలు, స్త్రీల పూజలు, గొబ్బెమ్మలు, బొమ్మలకొలువులు, బుడబుక్కలవాళ్ళు, గంగిరెద్దుల సందడి, సాతాని జియ్యరు చిందులు, జంగమదేవర సంబరాలు, కోడిపుంజు పందాలు, పొగరెక్కిన పొట్టేళ్ళ పందాలు, సంక్రాంతిలో ముఖ్యభాగాలు. కోనసీమలో, సంక్రాంతి సందర్భంగా, దేవతామూర్తులను, ప్రత్యేకంగా నిర్మించుకున్న ప్రభల ద్వారా ఉత్సవ ఊరేగింపులద్వారా తీర్థాలను జరుపుకోవడం కూడ సదాచారం.
కుంకుమంబులు చల్లి గొబ్బిముద్దలు పెట్ట - పగడాల సొగసును పరిహసింప
పక్షివ్రాలిన భంగి పసుపు మ్రుగ్గులు దీర్ప - పుష్యరాగంబులు పొలుపు మీరు
రంగార దీర్చిన రంగవల్లిక గుంపు - కన్నెతీగల వోలె వన్నె కుల్క
జడలోని మల్లెలు జారి వుండిన చోటు - ముత్యాల సొగసుతో ముచ్చటాడ
చీర కుచ్చిళ్ళు పదముల చిందులాడ - తెనుగు వాకిండ్ల తిరిగెడు తీగబోండ్లు
సరస సల్లాపములు సేయు సమయమందు - పుట్టినింటికి వచ్చెను పుష్యలక్ష్మి.
కాళ్ళ కడియాలు కరముల కంకణాలు - మధుర మధుర స్వరంబుల మాటలాడ
ఆంధ్ర గృహము గారాబుటాడుబిడ్డ - వనిత సంక్రాంతి యల్లన వచ్చునపుడు.
(దేవులపల్లి రామానుజరావు - పచ్చతోరణం)
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికిని గొబ్బిళ్ళో (గొబ్బిపాటలు)
రావమ్మా మహలక్ష్మీ రావమ్మా! కృష్ణార్పణం (హరిదాసు కీర్తనలు)
డుబుడుబు డుక్కుడుక్కు (బుడబుక్కలవాళ్ళు)
అంబ బళిబళి జగజ్జననీ పలుమటుంచు (పంబలవాళ్ళు)
అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు (గంగిరెద్దులవాళ్ళు)
హరీ హరీ రంగ హరిలో రంగ (సాతాని జియ్యర్ కీర్తనలు)
హరహరా పాహి! మాంపాహి! శరణు శరణు శంకరా! (జంగమదేవర ఓంకార శంఖారావాలు)
కోడిపుంజుల పందాలు, పొగరెక్కిన బలప్రదర్శనలు - ఇంకా ఎన్నో, మరెన్నో।

Saturday, January 12, 2008
స్వామి వివేకానంద - వివేకవాణి విశ్వజనీనం - స్వామి వివేకానంద - వివేకవాణి విశ్వజనీనం
స్వామి వివేకానంద - వివేకవాణి విశ్వజనీనం
"కొందరు చిరంజీవులు. గొప్పవారి జీవితాలు అందరికీ దర్పణాలు. నిజజీవితానికి నిదర్శనాలు. ఇహలోకం వీడినా కాలమనే యిసుకతిన్నెలపై తమ చిహ్నాలను ముద్రిస్తారు" అన్నాడు ప్రముఖ రచయిత, హెచ్. డబ్ల్యు.లాంగ్ ఫెలో. నాదబ్రహ్మ త్యాగరాజు కూడ అన్నాడు - ఎందరో మహానుభావులు, అని. కొంచెం విశాలదృౠక్పధం, హౄదయవైశాల్యం ఉన్న మానవతావాదులకు అందరూ మహానుభావులే అని భావించడం తరచు జరుగుతూంది. కొద్దిమంది మాత్రమే, అందరికీ మహానుభావులుగాను, మహామనీషులుగాను, యుగకర్తగాను భావించడం, అలాగే అవతరించడం, సమాజానికి తమదైన విలువైన సేవలను అందించి తమ సార్ధకజీవితాన్ని మనముందు చిత్రఫలకంలా ప్రతిష్ఠించి మనముందు భౌతికంగా అదౄశ్యమైనా, మన హౄదయాల్లో, మనసుల్లో, నిత్యం సంచరిస్తూనే వుంటారు. అటువంటి శ్రేణి వ్యక్తుల్లో, తిరుగులేని, ఎదురులేని, వ్యక్తి - స్వామి వివేకానంద. వివేకానందుని జీవితం, అనుభవం, సందేశం, భారతదేశపు సామాజిక సాంస్కౄతిక పునరుజ్జీవనానికి నిత్యం దోహదం అవుతుంది అన్న భావన - సత్యం, శివం, సుందరం. భారతావనికి ఆధ్యాత్మిక జ़్జానప్రదాత, వివేకానందుడు. ప్రణామాస్త్రాన్ని అందించి అందరినీ వశపరచుకొనే పరమయోగులు శ్రీ రామకౄష్ణ పరమహంసకు ఏకలవ్య అంతేవాసి - వివేకానంద. ప్రముఖ కవి నారాయణరెడ్డిగారు అన్నట్లు - వివేకానందుల వారిది విశ్వజనీనవాణి. ఆత్మజ़్జాన గోవిందులు, వివేకానందులు.
వివేకానంద - పేరు వెనుక ద్ఫాగిన రహస్యం
జన్మత: నరేంద్రనాధ్ దత్త అన్న పేరుగల వివేకానందుడికి పేరు వచ్చిన సమయ సందర్భం అపూర్వం. ఆ కధనం యిలా సాగింది.
హైదరాబాదునుండి మద్రాసుకి తిరిగి వెళ్ళిన నరేంద్రుడు చికాగో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను చేసుకొనే సందర్భం. ఇంతలో క్షేత్రమహారాజు అజిత్ సింగ్ నుండి ఒక వర్తమానం వచ్చింది. తనకు కొడుకు పుట్టాడని, నామకరణ మహోత్సవానికి వచ్చి వెళ్ళాలని దాని సారాంశం. స్వామి కాదనలేక, ఎట్లో తీరిక చేసుకుని వెళ్ళాడు. మహారాజు ఎంతో ఆప్యాయంగా స్వాగతంతో ఆదరించాడు. అతడు వివేకానందులకు చాలా త్వరగా ఏర్పడిన మిత్రుడేకాక, మిక్కిలి ఆప్తుడైన శిష్యులలో కూడ ఒకరు. చికాగో వెళ్ళడానికి కావలసిన వనరులను సమకూర్చి పెట్టుదునని స్వామికి మాటయిచ్చిన మహారాజతడు. బొంబాయిలో స్వామికి వీడ్కోలు చెప్పడానికి తన అంతరంగిక కార్యదర్శిని కూడ అచటికిపంపెను. ఈ క్షేత్రపట్టణమున మహారాజు యింటనే అతనికోరికపై స్వామి వివాకానంద నామాన్ని స్వీకరించడంజరిగింది. ఇది 1893 మే నెలలో జరిగిన విశేషం. శ్రీ శంకర భగవత్పాదుల వారి 'వివేక చుడామణీ గ్రంధనామమందలి 'వివేకా శబ్దమే స్వామియొక్క వివేకానంద నామధేయానికి మూలం అని చెప్పాలి. అప్పటివరకు వివిధ పేర్లతో వ్యవహరింపబడుచూ ప్రఛ్ఛన్నముగ భారతదేశ పరిక్రమణము చేసిన స్వామి ఆది మొదలుకొని వివేకానంద నామంతో జగత్ప్రసిద్ధుడైనాడు. చికాగో మత మహాసభలో గుప్పుమని గుబాళించిన యీ యీ పేరు లోగడ పూనాలో తన యింట తనతో పాటు కొన్ని రోజులు గడపిన వ్యక్తిగల యీ పేరును పోల్చుకొని తిలక్ వంటి మహనీయుడు సైతం 'ఈతడా వివేకానందుడూ! అని ఆశ్చర్యచకితుడయ్యాడు.
వివేకానందుని గురించి ప్రముఖుల మాటల్లో -
వివేకానంద వాణి విశ్వజనీనం. అది వేదాంత హౄదయ నిలయం నిత్య నవీనం. - డా.సి.నారాయణ రెడ్డి.
కళ్ళు మూసుకున్నా కనిపిస్తున్నాడు, చెవులు మూసుకున్నా వినిపిస్తున్నాడు. - డా. జె.బాపురెడ్డి.
వివేకానందస్వామి నేడు జీవించివున్నట్లైతేనే నాయనపాద సన్నిధిలొ ఉండేవాణ్ణి. నేను అతిశయమేమి చెప్పనట్లైతే, ఆధునిక భారతం ఆయన సౄష్టి. - నేతాజీ, సుభాష్ చంద్రబోస్.
భారత దేశాన్ని గూర్చి తెలుసుకోవాలంటే వివేకానందుని ఆధ్యయనం చేయండి. ఆయన విధానంలో అంతానిర్మాణాత్మకమే గాని,వ్యతిరేక భావాలకు తావులేదు. - విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్.
వివేకానందస్వామి రచనలు నేను క్షుణ్ణంగా ఆధ్యయనం చేశాను. నా దేశమంటే నాకు గల ప్రేమ, ఆయన రచనలు మననం చేసుకున్న ఫలితంగా సహస్రాధికంగా వౄద్ధి చెందింది. నాకు దేశంపట్ల ప్రేమను ప్రసాదించింది వివేకానందుడు. - గాంధీ.
ఈనాడు వివేకానందుని సందేశం అక్షర రూపంలో చదువుతున్నంత మాతముననే ఒడలు జలదరిస్తుంది. విద్యుదాఘాతమువలె ఆయన వచనాలు నన్ను కుదిపివేస్తాయి. అట్లాంటి దివ్యవాణిని, ఆయన ముఖత: వినియున్న శ్రోతలు ఎంతటి అనుభూతి పొందియుండిరో! - నోబెల్ బహుమతి గ్రహీత, సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత, రోమారోలా.
ఇందరిని ప్రభావితం చేసిన స్వామి వివేకానందుల అసామాన్య వ్యక్తిత్వం భారతీయ యువతను కూడా జాగౄతం చేసింది. నేతాజీ, గాంధీజీ తదితరులు కూడా తమ యౌవనంలోనే వివేకానందుల నిర్మాణాత్మక సాహిత్య ప్రభావానికి వశమైపోయారు. మరి అలాంటి వివేకానందులు యువత కిచ్చిన సందేశసారాన్నిబట్టి చూస్తే, కారుచీకటిలో కాంతిరేఖలా గోచరిస్తాడు వివేకానందుడు. హిందూత్వం భారతీయాత్మ అని, జీవసేవే దేవసేవ అని, ప్రత్యేకంగా యువతని ఉద్దేశించి, వికారాలు విడనాడండి, చైతన్యమూర్తులు కావాలి, మాతౄదేవత పూజారులు కావాలి, భారతీయ హౄదయ వైశాల్యాన్ని గమనించాలి, ధర్మరక్షకులు కావాలి, అజ़్జానం తొలగాలి, దురాచారాలు దూరం కావాలి అని బోధిస్తూ, భారతీయాదర్శాలని, వ్యవస్థీకౄత యువశక్తి నిర్మాణావశ్యకతని వక్కాణిస్తూ, నవభారత నిర్మాణావశ్యకతని ఆకళింపు చేసుకోవాలని ప్రవక్త ప్రభోధం చేశారు.
వివేకానంద జన్మదినం - జాతీయ యువజనోత్సవాల సందర్భంగా (జనవరి 12), నవభారత యుగకర్త పై ఈ చిరుభావనాధారని, మహా వక్త, సురేంద్రనాధ్ బెనర్జీ మాటల్లో ముగించడం సమంజసం.
ఎక్కడి పాశ్చాత్య దేశాలు! ఎక్కడ సనాతన ధర్మం! సనాతన ధర్మ సందేశాన్ని పాశ్చాత్యులకు అనర్గళంగా చాటి చెప్పిన వివేకానంద యతివరేణ్యునికి వినయంతో కౄతజ़్జతాంజలి సమర్పించకుండా ఉండలేము. - మహావక్త, సురేంద్రనాధ్ బెనర్జీ.
భారతదేశపు భూమియే నా అత్యున్నత స్వర్గము. భారతదేశపు శ్రేయమే నా శ్రేయము. - స్వామి వివేకానంద.

Friday, January 11, 2008
కొంపెల్ల శర్మ
జాతికి భాష జీవం
"వాచామాంధ్రమయీనాం య: ప్రవక్తా ప్రధమో భవత్ఆచార్యాం తం కవీంద్రాణాంవందే వాగనుశాసనం!"
తెలుగుభాషా పదసంచయానికి సువ్యవస్థిత సుస్వరూపాన్ని కల్పించి గ్రంధస్థం కాదగిన దశ నిరూపించిన శబ్దశాసనుడు పరమపూజ్య నన్నయభాట్టారకులాదివారికి తెలుగు జగతి శాశ్వత ప్రాతిపాదికపై నివాళులర్పించడం వినా తెలుగుజాతికి ముక్తి, మోక్షం లేవు.
అసలు భాష అంటే ఏమిటి?
భాషలు సముదాయంలో భావాభివ్యంజన సాధనంగా ఉపయోగపడేది భాష. భాష దౄశ్యశ్రవణ సంకేత రూపకమై ఉంటుంది. సారం జనవ్యవహారంలో రూడియై, అనుకరణ శిక్షణద్వారా, భాషా నైపుణ్యాలు అర్జింపబడుతున్నాయి. భావం భాషలో వ్యక్తరూపం సంతరించుకుంటుంది; అటు భాషద్వారా భావోదయమూ ప్రేరితమవుతుంది. ఈ విధంగా భాషాభావనలు పరస్పరాశ్రయాలు. వీటిల్లో భవన అధమమైంది; భాష ద్వితీయం, ఇతర ప్రాణికోటితో మానవుడు ఏయే అంశాల్లో భేదిస్తాడు - అనే చర్చ వచ్చినపుడు, భాష చాల ప్రముఖమైనదిగా స్ఫురిస్తుంది.
భేదాలు, వాదాలు
భాషలలో భేదాలా వేషములో భేదాలా, దేశములో భేదాలా దేహములో భేదాలా, పరస్పర విభేదాలా మరణాంతోన్మాదాలా, మతకలహ నినాదాలా మహామతుల వాదాలు - అని ప్రముఖకవి, వానమామలై వరదాచార్యులు భాషల్లోని భేదాలని, వాదాలని చెప్పకయే చెప్పారు.
తెలుగుభాష ప్రస్థానం
తీయని, వినసొంపైన పలుకు గల భాష తెలుగుభాష. 'ఆంధ్రత్వ మాంధ్ర భాషా చా ప్యాంధ్రదేశ: స్వజన్మభూ: తత్రాపి యాజుషీ శాఖా నాల్పస్య తపస: ఫలం' అని ప్రముఖ తమిళపండితుడు అప్పయ్య దీక్షితులచే కొనియాడబడిన భాష మనది. యూరపు దేశాల్లో ఇటలీ భాష ఎంత ప్రసిద్ధమైందో, ఆసియా ఖండంలో తెలుగు అంత ప్రశస్తమైంది. 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' గాఅ తెలుగుకు పెరు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అజంతమైన భాష, సంగీతానికి ఎంతగానో అమరుతున్న భాష, ద్రావ్విడభాషల్లో అన్నింటికన్న అధికంగా మాట్లాడే భాష, ఏ విషయాన్నైనా వ్యక్తీకరించగలిగిన భాష, ఆZంధ్రభోజుడు తనకాలంలో రాజభాషగా సంగీత సాహిత్య రాజ్యపాలనా వ్యవహారాలకు అనువైనదిగా ప్రకటించిన భాష, యావత్తు దక్షిణదేశానికీ రాజభాషగా అధికకాలం అమలుపరచిన భాష, ముత్యాల కోవలాంటి అక్షరాలను అందించిన లిపిగల భాష, మిక్కిలి స్వతంత్రంగా పరిణమించిన భాష, కాలక్రమేణ, రూపుదిద్దుకుని, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, బౄహత్పలాయనులు, విష్ణుకుండినులు, చోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజసార్వభౌములద్వారా కవిత్రియం కరకమలాలనుంచి, పరవస్తు చిన్నయసూరి, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి, కందుకూరి వీరేశలింగం సంకల్ప దీక్షాకంకణబద్ధతవల్ల వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడచుకుంటూ నడతలు నేర్చుకుని విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతవంతమైన భాషగా పేరుపొందినది. ప్రముఖ దేశభక్తుడు కొండా వెంకటప్పయ్య పంతులు, బాపట్లలో జరిగిన ప్రధమ ఆంధ్ర మహాసభలో 1913) మాతౄభాషగా తెలుగు వైశిష్ట్యాన్ని చర్చించారు. తిరుపతి విశ్వవిద్యాలయంలో ప్రసిద్ధ కవిపింగళి లక్ష్మీకాంతంగారి ఆధ్వర్యాన జరిగిన గోష్టి(1964)లో అనేక విషయాలను చర్చించి నిర్ణయాలను తీసుకున్నారు. ఆధునిక భాష వినియోగం, తెలుగు మాధ్యమికం ప్రవేశం, తర్వాత తెలుగు అకాడమీ స్థాపనకు దారితీసాయి. ప్రముఖ మలుపు, 1966లో తెలుగును అధికారభాషగా అమలు చేయాలని చట్టం చేయడం జరిగింది. అమలుపాటుతనం మాట ఎలావున్నా, అధికారికంగా తెలుగుభాషను అధికారభాషగా ప్రకటన, చట్టం వచ్చాయి మన రాష్ట్రానికి, తెలుగునేలకు.
భాష మన శ్వాస
భాషలొక పది తెలిసిన ప్రభువు తరచు చూసి, మేల్బంతిగా కితాబిచ్చిన భాష, తెలుగు మన శ్వాస అన్నాడో ఒక యువకవి. వేల్వేల వత్సరాల ఘన తెలుగు చరితను స్వంతం చేసుకున్న తరతరాల భవ్య సంస్కౄతికి వారసులం మన తెలుగులం. భూనభోంతరాళ దిగంతాల పర్యంతం పరివ్యాప్తమైన తెలుగుజాతి యశ:పరిమళాన్ని ఆసాంతం ఆస్వాదించాలేకాని, వర్ణించనలవికానిది. ఏదేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, తల్లి భూమిభారతిని పొగడడమే, జాతి నిండు గౌరవాన్ని నిలుపడమే. ఏ సీమచేరినా, ఏగడ్డ మెట్టినా, 'తెలుగువాడూ అన్నది మనం తెల్లకాగితంపై నిత్యం వ్రాసుకునే చిరునామా. మూలాలను మరచిపోకూడని మూలధనం.
మహానుభావులను శిలాప్రతిమలుగా ...
ప్రతిభ మనిషి మననం చేసినన్నాళ్ళూ గుర్తింపుకు పూర్తిగా రాకపోవడం సహజంగా వస్తున్న రీతిరివాజు అయిపోయింది. ఒకవేళ ప్రతిభను గుర్తించినా, అది ఒక సన్మానం, దుశ్శాలువా, జ़్జాపికతో తిరిగిరాని మలుపు తిరుగుతోంది. అప్పుడప్పుడు శ్రీలు, భూషణలు, రత్నలు పేరునుపెంచుకొనేందుకు సహకరిస్తున్నాయి. ఎవరి ప్రతిభను వారే ప్రచురించుకునే స్వీయవిశ్లేషకులుగా మారుతున్న వైనం కూడ గమనిస్తున్నాం. మరీ కాదుకూడదు అనుకునే పరిస్థితి వస్తే, ఏ భాగ్యనగరంలోనో ఈ జంటనగరాలూ - సంస్కౄతీకళాచిహ్నప్రతిమలుగా ఘనప్రతిష్ఠను గావిస్తున్నారు. ఆ శిలావిగ్రహాలు వెలిసిపోతున్నా, వివర్ణమవుతున్నా, ప్రతిభకు పునరుద్ధరణ అనవసరం అనుకునే అమాత్యవర్గమే అధికతరం అవుతున్న అమానుషకాలంలో పబ్బం గడుపుతున్న అనివార్యపౌరులుగా అల్పజీవనంలో అలుక్కుపోతున్నాం. విద్వత్తుకు విగ్రహాలను కల్పించి, నిగ్రహాలను కోల్పోతూ, ఆగ్రహాన్ని పెంచుకుంటున్నాం. రాజకీయాలు ఎంత కళాత్మకంగా రాజిలుతున్నాయో చెప్పలేకపోతున్నాం కాని, కళారంగం మాత్రం రాజకీయరాచపుండు కుళ్ళి, ఘనరణంగా మారిపోతోంది. కాకాలు, బాకాలు పట్టినవారికే కవికోకిలలు, కళానిధి గౌరవాలు. జ़్జానపీఠపురస్కారాలకు లక్ష్యాలు, లక్షణాలు అన్యరూపం దాలుస్తున్నాయి. బిరుదలకోసం బిక్షాటన కార్యక్రమం అదౄశ్యపర్వంగా చెల్లుబడి అవుతున్న కలిఘోరను చవిచూస్తున్న వైనంలో పెనవేసుకున్నాం.
అమౄతశిఖరం నుంచి మౄతకుహరం లోతుల్లోకి!
ఒక్కొక్క భాషకు ఒక్కొక్క మర్యాదలుంటాయి. మాతౄభాష అంటే ఎవ్వరికైనా వ్యావహారికం అవుతుంది కాని, గ్రాంధికం కాదు. కాలమునుబట్టి, దేశమునుగాంచి, ప్రభుత్వమునెంచి, దేశభాషాలలితాంగి మారు అని ప్రముఖ పండితుడు చెళ్ళపిళ్ళవారు తమ అనుభూతిని అందించారు. సంఘంలో రంకెలేసుకుంటూ వస్తున్న విప్లవపంధాధోరణులు తెలుగు భాష విషయంలో అదేగమనం కనిపించుటలేదు. భాషను మార్చడానికి భావాలను మార్చాలి. జీవితపు పోకడలనే మార్చాలి. మన:ప్రపంచానికి బాహ్యరూపం భాష అన్నది సత్యమైనా, భాషవిప్లవమే భావవిప్లవంగా పరిగణించాలి. విప్లవాత్మకమైన మార్పులు - వసుధైవకుటుంబం, సమాచార సాంకేతిక విప్లవం విశ్వవ్యాప్తంగా హెచ్చువేతలు వేసుకుంటుంటే, మనభూమిలో భాష, వ్యవహారికం, క్రమేపీ సన్నగిల్లుతున్నాయి. భాషను భాషించడంలో సిగ్గుపడడంలా భావిస్తున్న తరుణంలో - ఒకే మాతౄభాష అయిన యిద్దరు అన్యభాషలో మాట్లాడుకునే సన్నివేశం, సంభాషణ ఎలా అవుతుంది? అందుకే, పరువుతూలిన ఈ అనాదరణ విధాన, మేటి నీ భాష పొలిమేర దాటలేదు అన్నాడు ప్రముఖ కవి గుర్రం ఝాషువా. అంతేకాదు, ఆగ్రహించిరేని ఆంగ్లమునతప్ప తెలుగుభాషలోన తిట్టరెవరు. మకరకుండలాల మహిత విద్వద్వర్యుడేని నాగరికత లేని పశువు, అని అంటాడు ఝాషువా, నాకధ రచనలో. నాభాష అమౄతసమానం అని బేషజాలు పలుకుతున్నా, వేష భావాలకు తగ్గట్టుగా భాషను ధరించటంలేదు. సమాజంలో ఒకరి భావాలు మరొకరికి తెలియటానికి వీలుగా ఏర్పడిన ధ్వని సంకేతాల నియతనిర్మాణం భాష అన్నారు. సమాజం దీన్ని సమిష్టిగా సౄష్టించుకుంది. సమిష్టి సాధనంగా వాడుకుంటూంది. సమాజంలో వివిధస్థాయిలున్నట్లుగానే, భాషలో కూడ వివిధ స్థాయిలుంటాయి. వివిధ రంగాల్లో పరిణామాలు వచ్చినట్లుగానే భాషలో కూడా పరిణామాలు వస్తూంటాయి. అంటే, పాతవి తొలగి పోతూండడం కొత్తవి చేరుతూండడం జరుగుతూ ఉంటుంది. ఈ పరిణామాల నన్నిటినీ స్వీకరిస్తూ సమకాలీన వాగ్వ్యవహారానికి అద్దంపట్టేదే జీవద్భాష. అట్లాలేనిది మౄతభాష. మన మాతౄభాష అయిన తెలుగు విషయంలో, దేశంలో అత్యధికంగా మాట్లాడే స్థాయి రెండవస్థానంలో వున్నాసరే, పాతని కాదనుకోవడంలో తుఫాన్ మెయిల్ గమనాన్ని పాటిస్తూ, కొత్తని ఆహ్వానించి, ఆదరించడం వొంటెద్దుబండి నడక, పల్లేరు నడక మాదిరి కుంటుతూ నడకను సాగిస్తోంది. యిలా అయితే, యునెస్కోవారు తస్మాత్!జాగ్రత్త! అని హెచ్చరికలు చేయక ఏం చేస్తారు?
భావం - భాష
భావాన్ని, భాషని సంథానిస్తూ, మహాకవి విశ్వనాధవారు - భావములు మానవ నిష్ఠములు; భాష జాతినిష్ఠం. ఈ జాతినిష్ఠమైన భాష భావములయందు కూడ విలక్షణత్వం సంపాదిస్తుంది. కనుక, భాషానిష్ఠమైన సంప్రదాయంతో కూడిన భావసంపత్తు వేఋరు. కలగూరగంపయైన భావాలపద్ధతి వేరు. అందుకనే, తనదేశభాషయందు సందిగ్ధమైన కవితాశక్తి కలవాడు వానినింగ్లీషుభాష లోనికి తర్జుమాచేసి గొప్పకవిగా అవుతున్నాడు. అవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని భావాలకు జాతీయతాముద్ర తక్కువ. వానికి దేశభాషాపాండిత్యం కంటే ఇంగ్లీషుభాషాపాండిత్యం ఎక్కువ - అని అంటారు. పరమ ఛాందసులు, పండితోత్తములు, సంప్రదాయవాది కనుక, భాషకు, భావాలకు జాతీయతాముద్ర గురించి అభిళషించారు. మనకు, మనమాతౄభాష అయిన 'తెలుగూ ప్రాంతీయ, రాష్ట్రీయవాదానికే నోచుకోకపోతే, జాతీయతాముద్ర అన్నది పరమ హాస్యాస్పదమే కదా.
కాలధర్మం
కాలాలు ఎన్ని అంటే, మన భాష విషయంలో చెప్పడం బహుశ కష్టమే అనుకోవాలి. యింక భాషారక్షకులు, భాషాప్రచారోద్యమ (వ్)నాయకుల విషయం చెప్పాలంటే, ప్రజాకవి కాళోజీ కవిత స్మరణకు వస్తుంది. - వెనుకకు చూస్తే భూతం, కనిపించును చూడకు అటు. లభ్యంకాని భవిష్యం లక్షిస్తూ రభసపడకు. వర్తమానం వ్యర్ధం చేయని కర్తవ్యం నీదని మరువకు. పశ్చాత్తప్తులు పూర్వతప్తులు, ప్రస్తుత మెరుగని వ్యక్తులు, వ్యర్ధులు - అని నిష్కర్షగా చెప్పాడు. అలాగే, భాష విషయంలో, దు:ఖాలు, బాధలు, యుద్ధాలగాధలను మరచిపోవాలి. కర్తవ్యాన్ని భావిస్తూ, ముందుకు దూసుకుపోవాలి.
తెలుగు భాషోద్యమ ప్రచార కౄషి
ఉద్యమాలు అధికంగా నినాదాలతో, వివాదాలతో, వాదవేదాలతో, వాడిగా వేడిగా, వడివడిగానే నడుస్తూంది. ఎటొచ్చీ, ముందుకో, వెనుకకో తెలియని పరిస్థితి ఉంటుంది. ఎక్కడో నూటికొక్కటి విషయంలోనే త్వరితగతిని ముందుకు పోతూ, సాగిపోతూ, సాధనసిద్ధికోసం పయనిస్తుంది. కాని మన తెలుగుభాష విషయానికొస్తే, అందరూ, ఎప్పుడూ చెప్పుకునే, తెగులుతనమే స్ఫురిస్తుంది. తెలుగుభాషలో యింతవరకూ కేవలం యిద్దరినే వరించిన భారతీయ జ़్జానపీఠపురస్కృఆన్ని, రెండవసారె వరించిన సి.నారాయణరెడ్డెగారి కవితలో చెప్పాలంటే - ఎవరో నాటిన మొక్కలు ఇంకా వౄక్షాలు కాలేదు. ఎవరో చూపిన చుక్కలు ఇంకా ఇందుబింబాలు కాలేదు. ఎక్కడున్నావు గొంగడీ అంటే, అక్కడే ఉన్నానంటే సరిపోదు - అన్నారు. కాని సరిపోదు అంటే ఏం చేసేది. వేరే గత్యంతరం కనుచూపుమేరకు అంతగా కనిపించనప్పుడు.
ఈ దుస్థితికర అయోమయంలో, మనతెలుగుగడ్డపై, తెలుగుభాషాబ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆఖరిదశకు చేరుకుంటున్నాయి. నిర్వాహకుల నిర్వాకమెంతో, అంచనాలు ఏదిశలో, దశలో ఉన్నాయోమరి, వేచిచూద్దాం. భాషాప్రచారోద్యమ అధినాయకుల ఉత్సవాలు, సంబరాలు, సన్మానాలు, దుశ్శాలువల రెపరెపలు, అనుభూతులు, అనుభవాలు, కోకొల్లలుగా మాటల్లో కోటలు దాటుతున్నాయి. చేతలరూపం ఎలా దాలుస్తాయో. ఆంధ్రులకు దుర్యోధనుడిలా ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. కాని, నేటి సగటు తెలుగువాడిగా రెండూ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎటొచ్చీ, ఆచరణే కరువవుతోంది.
మన తెలుగుభాషను ముందుకు తీసుకుపోదాం. మాతౄమూర్తితో సరిసమానంగా గౌరవిద్దాం. తెలుగుభాషను ప్రాచీనభాష హోదాను పొందడానికి నేను సైతం అంటూ, ముందుకు దూసుకుపోదాం. ఆశయాన్ని, నిండు హౄదయంతో సఫలీకౄతం అయ్యేట్లు ఆచరణకు పూనుకుందాం. విజయకేతనాన్ని త్వరలోనే ఎగరేద్దం. మన తెలుగురధాన్ని వినువీధుల్లో సగర్వంగా, సునానాదాలతో, నడిపిద్దాం.
ఆశయసిద్ధికై, ప్రతీ తెలుగుపౌరుడిని తెలుగుజర్నల్ మనసావాచాకర్మణా అభినందనల్ని తెలుపుతోంది. అభివాదం చేస్తోంది. శుభ: భూయాత్.

Subscribe to:
Posts (Atom)