Friday, April 25, 2008

విశ్వదాభిరామ వినుర వేమ - ప్రజాకవి కి స్మరణ నివాళి

విశ్వదాభిరామ వినుర వేమ
'విశ్వదాభిరామ వినుర వేమా అన్న తెలుగు పద్యపాదానికి పరిచయం చేయడం దుస్సాహసం కదా! ఈ మకుటంతో ఉన్న పద్యం కనీసం ఒకటైనా రాని తెలుగువాడు ఉండడు; అధవా, ఉన్నా, వాడు తెలుగువాడా! ఏమో మరి, ఆలోచించాల్సిన విషయమే! విశ్వజనీనమైన వేదం - వేమన్న పద్యం. మానవత, సౌమ్య, సామ్యవాదాల త్రివేణీసంగమం.
కవి నుంచి యోగి
మనది త్రిలింగదేశం. మన సాహిత్యనికి కవిత్రయం అందరికీ తెలిసినదే. నన్నయ, తిక్కన, ఎర్రన. అయితే, మహాకవి శ్రీశ్రీ చెప్పిన తీరు వేరేలా వుంది. తిక్కన, వేమన, గురజాడ అన్నాడు. ప్రజాకవి గా పేరు తెచ్చుకున్న వేమన, ఈ అధునిక కవిత్రయానికి మధ్యస్థమైనా, ఆయువుపట్టు అనే చెప్పాలి. కేవలం వేమన కవి మాత్రమే కాదు. తెలుగు ప్రజానీకానికి వేమన్న ఒక మహాయోగి. మట్టిలో పుట్టి మహోన్నత శిఖరాలను అందుకున్న మానవతామూర్తి. మనుష్యుల మధ్య తిరుగుతూనే మానవజీవిత సత్యాసత్యాలను సత్యాన్వేషణశీళంతో దర్శించి విమర్శించిన వివేకి. ఆయన యోగమంతా అన్వేషణ. అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను ఆటవెలదుల్లో అలవోకగా లోకానికి అందించిన అపరకవియోగి. ఆయన సూక్తుల్లోని శక్తి మాత్రం జాతికొక నూతన వ్యక్తిత్వాన్ని ప్రసాదించింది అన్నదాంట్లో సందేహం లేదు. అందుకే వేమన, మహానుభావుడు, సాధకుడు, బోధకుడు. జీవిత మహాసాగరాన్ని మధించి చేదును కుతుకలో, అమౄతాన్ని అంతరంగంలో నిలుపుకొన్న విధం ఆయన సాధనం. అమౄతమయమైన సత్యాన్ని చేదునిజాలతో నిరూపించి చిత్తాలకు హత్తేటట్లు చెప్పటం ఆయన బోధన విధానం. సరళమైన దేశీయఛ్ఛందంలో చెప్పాడు. ఆయన దర్శించిన అపూర్వ సత్యాలు ద్రష్టను చేశాయి. చెప్పిన సూక్తిమౌక్తికాలు స్రష్టను చేశాయి. ప్రజలకు కావలసిన దర్శనం, యోగి సాక్షాత్కారం లభించాయి. అందుకే వేమన, ప్రజాకవిగా, మహాకవిగా నేటికీ ప్రజల నాలుకలపై నిత్యనౄత్యం చేస్తున్నాడు.
గంగగోవు పాలు
వేమనకు సంబంధించిన ప్రతి సమస్యను గూర్చి వాదోపవాదాలు చెలరేగాయి. అతని కులం, కాలం, వంశం, వ్యక్తిత్వం, పుట్టినిల్లులాంటివాటి గురించి పండితులు, పరిశోధకులు చర్చలు, వాగ్వాదాలు ఎన్నో చేశారు. వేమనలు ఎందరో వున్నారు. అసలు వేమన ఎవరనీ, అతడు స్వయంగా రచించిన పద్యాల సంఖ్య గురించి విమర్శకులు తర్జన భర్జనలు చేయడం విస్తారంగా జరిగాయి. అభిప్రాయ భేదాలు, కట్టుకధలు ప్రచారానికి వచ్చినా, కొన్ని ప్రాధమిక విషయాల్లో ఏకీభావం కుదరడం జరిగింది అనే చెప్పవచ్చు.
తమిళ కురళ్ - తెలుగు వేమన
17వ. లో జీవనం, కాపు కులాన జననం కాగా, తిండికి తిప్పలు పడిన కుటుంబం కాదు ఆయనది. చదువు గురించి పట్టించుకొనకున్నా సామాన్య భాషాజ़్జానం సంపాదించుకున్నాడు. పఠన పాండిత్యం కన్నా, గురుముఖంగా చదువుకొని గడించిన విద్యలకన్నా, నిశితమైనలోక పరిశీలన ద్వారా సంపాదించిన జ़్జానమే వేమన అసలైన సిసలైన జ़్జానధనం. అతనిని కవిగా ఆనాటి సమాజం గుర్తించలేదు. విశౄంఖల విహారి, స్వేఛ్ఛాప్రియుడు అయిన వేమన ఒకరి అదుపుతో పెరిగినవాడు కాదు. రసికుడు. వేశ్యాలోలుడు. జీవితసుఖాన్ని తౄప్తితీర అనుభవించాడు. లోకంలోని అన్ని రంగాలను ప్రత్యక్షంగా పరిశీలించినవాడు. ప్రతీ హౄదయంలోని అగాధ సముద్రాన్ని తరచి చూచినాడు. రత్నాలవంటి భావాల్ని రాసులుగా తన హౄదయంలో దాచుకొన్నాడు. సమయసందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్క రత్నాన్ని పద్యంలో పొదిగినవాడు. ఆయన సమాజపు తీరుతెన్నులను నిశితంగా పరిశీలించి, విశ్లేషించి, తన అనుభవసారాన్ని నిష్కర్షగా చెప్పాడు. అలా చెప్పిన భావానికి సవరణలు, పొడిగింపులు లేనేలేవు. అందుకే 'విస్సన్న చెప్పిన వేదం' అని లోకోక్తి. కాని వేమన చెప్పినదే వేదంగా, వాదంగా చెలామణి అయింది. నేడు అక్షరాల నిజమని నిరూపణ అవుతున్నది. మహాకవి ఆరుద్రగారు చెప్పినట్లు, తమిళులు 'కురళ్'ను వేదసమానంగా గౌరవిస్తారని చెప్పుతూ, మనకు వేమన పద్యాలటువంటివీ ఎన్ని పద్యాలు చెప్పినాడన్నది తీరని సమస్యా వేమనకే జ़్జాపకం లేనప్పుడు, మనమావిషయంలో స్పష్టంగా చెప్పలేం' అని చెప్పారు.
పద్యాలే, శతకం కాదు
వేమన పద్యాలు, వేమన శతకం అని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. బహుళ ప్రచారానికి నోచుకున్న పద్యరచన చేసిన వేమనకు శిష్య, అనుచర వర్గాలు ఏర్పడ్డాయి. పిల్ల వేమనలు కోకొల్లలుగా పుట్టుకొచ్చారు. మనకు వేమన పద్యాలుగా చెలామణి అవుతున్న వేలాది పద్యాలను ప్రకటించిన వారికి, వేమన తత్త్వాన్ని గుర్తించి జల్లెడ పట్టితే మిగిలిన పద్యాలే వేమన్న కౄతులు అని చెబుతూ, ఆరుద్రగారు, ఆ జల్లెడను తెలుగుకవులు, పండితులు, విమర్శకులు, చారిత్రకులు, పరిశోధకులు, రూపొందించడం ఎంతో అవసరం అని కూడ చెప్పారు. కొన్ని పరిశోధనలు జరిగినా, వేమనపై వేదాలు, వాదాలు రచించబడినా, మహానుభావుడి పద్యాలపై విస్తౄతమైన వ్యాఖ్యానాలు, విశ్లేషణలు యింకా రావలసిన అవసరం ఎంతైనా వుంది. శతక లక్ష్యలక్షణాలు పుష్కళంగా చోటుచేసుకున్న పద్యాలు కేవలం సంప్రదాయ శతకంలా పరిమితం చేయక, అధిగమించడం జరిగింది. పూర్వం శతక రచనలో, కవులు ఎవరి దారి వారు అనుసరించినా, వేమన మాత్రం 'ఆటవెలదీ మాధ్యమాన్ని ఎంచుకున్నాడు. వేమన్నను, యిటు సాహిత్యంలోను, అటు సంసారంలోను, వేమనను వరించి, వలచి, మురిపించింది, ఈ ఆటవెలది మాత్రమే అని చెప్పవచ్చు. మనందరి హౄదయాలను అలరింపజేస్తున్న ఆటవెలది పద్యాలు అక్షరరూపంలో ప్రత్యక్షమై, వేమన హౄదయాన్ని ఆకర్షించి, అలరించిన ఆ ఆటవెలది ఊరు, పేరు తెలియనేలేదు. తాళికట్టిన భార్యకంటె ఆరాధ్యదైవంగా మన్నించిన రసికుడు, మన వేమన. రచించటానికి పూనుకుని, రచనను నియమితకాలంలో పూర్తిచేయాలన్న ఆనాటి సత్సంప్రదాయాన్ని వేమన పాటించలేదు. వేమన కలం పట్టిననాటి నుంచి, ఊపిరున్నంతకాలం, పద్యాలను ఆశువుగా చెప్పడం జరిగింది. అందుకే, దీనిని శతకం అనడానికి వీరులేని పరిస్థితి. కేవలం, ప్రచురణకర్తలు, ధనార్జనకోసం, శతకాలుగా విభజించి వ్యాపారంగా మార్చుకున్న వైనంగానే భావించాలి.
వేదం, వాదం - రెండూ వేమన్నవే
వేమన్న సౄష్టించిన ప్రతిభావంతమైనది, ప్రభావితమైనది అయిన సాహిత్యం, ప్రముఖంగా పద్యాలను కేవలం శతకంగా పరిగణించడం సబబు కాదు. ఆంధ్రసాహిత్య నిర్మాత, ఆరుద్ర వేమనవేదం అని భావిస్తే, ప్రముఖ కవి గోపి వేమన్నవాదంగా వర్ణించారు. రాచరికాలు, ఆర్ధిక, మత, సాంఘిక భావాలతోపాటు, అనేక విలువలను స్ఫురించే పద్యాలను అనేకం రచించాడు. కందం, ఆటవెలది ఛందస్సులను సమశైలిలో తులనాత్మకం చేసిన తీరు అమోఘం. వేమన కాలం నాటి ప్రజాపాలనను, రాజులను - పిరికిపందలు, దుర్మార్గులు, అజ़్జానులుగా వర్గీకరించాడు. అందుకే, పిరికి బంటు కేల బిరుదు గొడుగూ అని, తరచు కల్లలాడు ధరణీశులు అని అంటాడు. వేమన్న రాచమూకలను, భూపతికౄపలను నమ్మరాదంటాడు. అల్పబుద్ధివానికి అధికారం తగదని, వెర్రిగొల్వరాదు విభుడెంతవాడైనా అని హెచ్చరించాడు. మతాల శిధిల సంధ్య, కల్ల గురువులు, శైవ వైష్ణవాల సంఘర్షణ, మహమ్మదీయ మతపు లేతనీడలు వేమనకు నిత్య యితివౄత్తాలు.
వేమన నీతి పద్య రత్నావళి
పోతన, త్యాగరాజు, తిక్కన కవీంద్రుడు మున్నగువారి శ్రేణిలోనివానిగా వేమనను పరిగణించక తప్పదు. వేమన పద్యాలు స్వానుభవపూరితాలు. వేమన తన పద్య పరంపరను 18 విభాగాలుగా విభజించాడు. అవి యిలా వున్నాయి. మూర్ఖ, దాంబిక, విద్వత్, అర్ధ, సజ్జన, దైవ, కర్మ, దైవ, మోహ, యోగి, బ్రహ్మస్వరూప, గురుభక్తి, ప్రపంచ స్వభావ, స్వభావ, కూట వేదాంత, జీవన్ముక్తి పద్ధతులతోపాటు, ఫలశౄతిని కూడ రచించాడు. అజ़్జానమే శూద్రత్వము, సుజ़్జానము బ్రహ్మమాట,శౄతులను వినరా, అజ़్జాన మణచి వాల్మీకి సుజ़్జానపు బ్రహ్మమొందె చూడర వేమా' అని మూర్ఖపద్ధతిలో పద్యాలను ప్రారంభించిన వేమన, తానునింద్రియముల దనర జయించిన, తత్త్వమరసిచూడ తానెయగును, రాజయోగయట్లు దేజరిల్లగ వలె, విశ్వదాభిరామ వినుర వేమా అని తన జీవన్ముక్తి పద్ధతిలో తన నీతిపద్య రత్నావళి ని ముగించాడు.
వేమన జ़్జానమార్గ పద్యావళి
ఈ రచనల్లో, నీతి, ఆచారం, ధర్మం, వేదాంతం, మొదలైన విషయాల గురించి రచించాడు.
వేమనను వీడని ఆటవెలది
తెలుగు ప్రజానీకానికి వేమన ఒకమహాయోగి. మట్టిలో పుట్టి, మహోన్నత శిఖరాల నందుకున్న మానవతామూర్తి. ఆయనయోగమంతా అన్వేషణ. అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను 'ఆటవెలదీ ఛందస్సులో, అలవోకగా లోకాని కందించిన మహానుభావుడు మన వేముడు.
వేమన ముత్యాలమూటలు
వేమన రచించిన వాటిలో మచ్చుకు ఏరి ప్రస్తుతించడం కష్టతరమైన పని. మచ్చులో మచ్చులు కొన్ని.
అనగననగ రాగ మతిరమ్యమై యుండు, తినగతినగ వేము తియ్యనగును, సాధనమున పనులు సమకూరు ధరలోన.
ఉర్వివారి కెల్ల నొక్క కంచము బెట్టి, పొత్తు గుడిపి కులము పొలయజేసి, తలను చెయ్యెబెట్టి తగ నమ్మ చెప్పరా.
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు, కొంచెమైన నదియు కొదవ కాదు, విత్తనంబు మర్రివౄక్షంబునకు నెంత.
కులము గలుగువారు గోత్రము కలవారు, విద్యచేత విర్రవీగువారు, పసిడి గల్గువాని బానిసకొడుకులు.
ఉప్పు కప్పురంబు నొక్కపోలిక నుండు, చూడ జూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయా.
యిలా ఎన్నో, మరెన్నో, దర్శనమవుతూనే వుంటాయి. తెలుగువారు చేసుకున్న పుణ్యపరంపర - వేమన ఆటవెలదుల పరంపర.
వేమన ఆటవెలదులన్నీ ఉప్పులకుప్పలు. తెలుగునీతికి, తెలుగుజాతికి, ఆడపడుచులు.
జీవన ప్రస్థానం
రమారమి 1650 - 1750 మధ్య జీవించాడన్న బహుళ ప్రచారంలో వున్న వేమన, కొండవీటి, మూగచింతపల్లె, రాజవంశ సంబంధీకుడు. యవ్వనంలోనే జీవితంపై విరక్తి చెంది, తపోనిధితో యోగిగా మారాడు. 24 ఏప్రిల్ 1691 న జన్మించాడని ఒక అభిప్రాయం. అధికంగా, వేమనను 17 వ. శతాబ్దపువాడుగా పరిగణించినట్లు గోచరిస్తోంది. చివరకి కడప దగ్గర పామూరు గుహలో సమాధి పొందినాడని, కదిరి తాలూకా, కటారుపల్లె లో కూడ వేమన సమాధి గోచరిస్తుంది. లౌకిక స్పౄహను విస్మరించి, వైరాగ్యంతో దిగంబరాన్ని ధరించి, సమాజ రీతులకు అతని ప్రతిస్పందనలే ప్రజలకు ఉపదేశాలుగా మారినట్లు సాక్ష్యాలున్నాయి. నగ్నవేమనను చూసి లోకులు, తొలుత పిచ్చివేమన అని హేళన చేసినా, క్రమంగా సిగ్గుపడడం ప్రారంభించారు. ఎవరు విన్నా, వినకపోయినాఅ,జ़్జానమార్గాన్ని ఉపదేశించి, దేశమంతా తిరిగి, రొష్టుపడి, ఉద్రేకపడి, అన్వేషించి, ఎప్పుడో,ఎక్కడో, వేమన తనువు చాలించాడు అన్న వాదం కూడ ప్రబలింది.
బ్రౌన్ సేవలు చిరస్మరణీయాలు
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వేమన పద్యాలను వెలుగులోకి తేవడం జరిగింది. తెలుగుసాహితీచరిత్రలో ఒక చరగని మైలురాయి. వేమన ఆటవెలది పద్యాలు, సాధారణంగా, మొదటి రెండు పాదాల్లో నీతి ప్రతిపాదన, మోడోపాదంలో తగిన సామ్య ప్రదర్శన జరిగింది. నాలుగో పాదం, 'విశ్వదాభిరామ వినుర వేమా అని ముగించబడింది. వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదనూ, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడినీ మకుటంలో చేర్చి, వీరికి శాశ్వతత్వాన్ని ప్రసాదించిన ప్రతిభాశాలి. విశ్వద అంటే విశ్వానికి కారకుడికీ, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే, సౄష్టికర్తను ప్రియమైన వేమా, వినుము - అని మకుటానికి అర్ధవంతమైన భావాన్ని పండితులు విశ్లేషించారు.
వేమన కవిత్వం గాయపు మందు గాయానికి కాక, కత్తికే పూసినట్లుండును - రాళ్ళపల్లి అనంత కౄష్ణ శర్మ గారు.
భాగ్యనగర వారధి పై వేమనకు సుప్రతిష్ఠ
యిది ఒక చిరు నిదర్శన మాత్రమే. వేమన పేరున ఒక విజ़్జాన, సారస్వత ప్రదర్శనశాలను, స్మారక చిహ్నాలను ప్రతిష్ఠ చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.
ప్రజాకవి వేమన కు ఈ సందర్భంగా తెలుగురధం ఘన నివాళిని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం

Tuesday, April 22, 2008

విశ్వ విఖ్యాత ఘనాంక ఘనుడు - శ్రీనివాస రామానుజన్

విశ్వవిఖ్యాత 'గణాంక ఘనుడూ - శ్రీనివాస రామానుజన్(1887 - 1920)
మనిషి నేర్చుకునే విద్యలో గణాంకశాస్త్రసంబంధిత విద్యకు రాణింపు, గుర్తింపు తప్పక వస్తుంది అన్నది నిత్యసత్యం. మానవ, కళా శాస్త్రాలు ఒక తీరులో ఆధ్యయనం జరిగితే, గణాంకాధ్యయనం లో వున్న ప్రత్యేకతలు అందులో ప్రవేశించి, ప్రవీణులు కావలసినదే కాని దాని వివరించలేము. విద్యార్ధి దశ నుంచి, భాషాసంబంధిత అంశాలకన్న, తికమకపెట్టే లెక్కలు, ఓపట్తాన కొరుకుపడని భౌతిక, రసాయనశాస్త్రాలు వేటి ప్రత్యేకత వాటిదే.
గణాంకశాస్త్రం గురించి బహుకొద్దిమంది నిర్వచనం చెప్పినా, ఈ విషయాధ్యయనాన్ని, ఒక ఎత్తైన పర్వతారోహణం గా వర్ణిస్తూ, గమ్యం చేరుకున్నాక పొందిన అలసట కన్న, కలిగిన ఆశ్చర్యాధ్బుతాలనే అనుభవించడం జరుగుతుంది. లెక్కల విషయానికొస్తే, కారణం, మేధస్సుకి గ్రహణశక్తి, సాధికారతలు లభిస్తాయి. ఒకవిధమైన సంభావ్యదశకి, దిశకి దారితీస్తాయి. ప్రతి విద్యార్ధికి తనదైన క్రమశిక్షణను కలిగించడమే కాక, విశ్వవ్యాప్తంగా మేధస్సుకి, హౄదయానికి కూడ విశిష్టమైన శిక్షణలను ప్రేరేపిస్తాయి. అనిర్వచనీయమైన ప్రోత్సాహ, ప్రోద్బలాలను కలిగిస్తాయి. సంచరించే స్వభావం వున్నవాడికి, లెక్కల విషయంలో, ప్రతిభను ప్రదర్షించేదుకు సంపూర్ణావకాశాలు లభిస్తాయి. అవరోధాలు, అవాంతరాలు వచ్చినా, మెట్టు, ఒక్కొక్కొటి ఎక్కుతూ, అరోహణం చేసుకుంటూ, ఎవరెష్టు, హిమశిఖరాగ్రభాగాల్ని, తమ ప్రతిభాగర్వంతో చుంబించాలి.
పైన వివరించిన దశల్ని, దిశల్ని అసమాన ప్రతిభాపాండిత్యాలతో, అగణిత శిఖరాగ్రాల్ని అతిసులభంగా తాకగలిగిన వ్యక్తి, ఎవరో కాదు, విశ్వవిఖ్యాత గణాంక ఘనుడు - 'శ్రీనివాస రామానుజణ్. చిరుప్రాయం నుంచి బాలశాస్త్రవేత్తగా భావించబడ్డ, రామానుజన్ ప్రపంచంలోనే తిరుగులేని 'లెక్కల్లోని మనిషీ అని చెప్పాలి. అందరూ, అంకెల్ని సంకెలలు గా భావిస్తే, వాటిని స్వీకరించి, ఘనంగా రాణింపు పొందినవాడు రామానుజన్.
22 డిసంబర్ 1887 లో తమిళనాడు లోని ఇరోడ్ లో అతిబీదకుటుంబంలో పుట్టడమే కాక, కటిక దారిద్ర్యాన్ని అనుభవించినవాడు. 17 సంవత్సరాలకి మెట్రిక్యులేషన్ లో ఉత్తీర్ణుడైన, 'శ్రీనివాసా, ఎప్పుడూ, తరగతి లో ప్రప్రధముడే. చాలా సంవత్సరాలు, మదరాసు విశ్వవిద్యాలయంలో ఆధ్యయనం చేసి, 1914 లో ప్రత్యేక ఆధ్యయనం కోసం కేంబ్రిడ్జ్ వెళ్ళాడు. ఈ దశలోనే, రామానుజన్ తన గణాంకవిద్యలో చాలా ప్రఖ్యాతుడైనాడు. అమోఘమైన మేధస్సున్నకారణంగా, వేలకొలది సమస్యలకు సులభ పరిష్కారం తెచ్చిన వ్యక్తి. 1917 లో యూరోపు ఖండం ఆయన ప్రతిభకు పట్టం కట్టింది. 1919లో, భారతదేశానికి తిరిగొచ్చి, తన పరిశోధనను ప్రారంభించాడు. అదే సంవత్సరం (1919) లో విశ్వవిఖ్యాత 'రాయళ్ సంస్థ అందించిన ప్రప్రధమ భారతీయునికిచ్చిన 'ఫెల్లో' గౌరవం, శ్రీనివాస రామానుజన్ కి దక్కడం, గణాంకశాస్త్రానికే గౌరవంగా మారింది. కేవలం 32 ఏళ్ళకే ఈ గౌరవం పొందడం చరిత్రగానే నేటికీ భావించబడుతోంది. గణాంక సమస్యలకు ఎన్నో కొత్త పరిష్కారాల్ని కనుగొన్నవాడు. రాయల్ గౌరవం పొందిన వెంటనే, ఏడాది కూడ దాటకముందే, రామానుజన్, చోల్పూర్ లో, 26 ఏప్రిల్, 1920 లో కీర్తిశేషుడైనాడు. ఆయన పరిశోధన ఫలితాలు, ఆయన మరణించాకనే, బయటపడ్దాయి. వాటిపై, మరింత పరిశోధనలు, నిరంతరంగా జరుగుతూనే వున్నాయి. ఆయన జీవితాంతం, ప్రతిభామేధస్సును గమనించి బ్రిటిషులోని ప్రముఖ గణాంక శాస్త్రవేత్తలు సైతం అవాక్కయేవారట.
కేవలం మూడు దశాబ్దాల, మూడు సంవత్సరాల్లోనే, భారతదేశానికి ఎనలేని ఘనతను తెచ్చిన గణాంక ఘనుడు. భారతదేశం వారు, ప్రత్యేక తపాళాబిళ్ళను విడుదల చేయడం కూడ జరిగింది. శ్రీనివాస రామానుజన్ పేరున, ప్రతిభాపురస్కారలని, భారత జాతీయ శాస్త్రసంస్థ, ఆయన స్మరణార్ధం, నెలకొల్పి, అనేక గణాంక శాస్త్రవేత్తలకు సత్కారాల్ని అందించి, తమ ప్రతిభకు పట్టం కడుతూండడం, శ్రీనివాస రామానుజన్ కారణభూతుడే అని చెప్పక తప్పదు. భావి భారతదేశంలో, మరింత గరించగల, శ్రీనివాస రామానజున్ లు వుద్భవించి, గణాంకరంగానికి మరింత ఘనాఘన సుందర సుసంపన్నతను అందించాలి. ఆ శుభతరుణం కోసం మన విద్యార్ధిలోకానికి ఆశీస్సుల్ని, అవకాశాల్ని అందించడంలో నేను సైతం అంటూ, సహాయ సహకారాల్ని అందిచాలి.
'పరుగెత్తి రానీ పవిత్ర భావనల్ పలుదెసలనుండీ పునీతులుగ చేయంగ మనలణ్ అన్న స్ఫూర్తితో, 'నేనెవరైన, నేనెంతటివాడనైన, నాౠణమామాతౄమూర్తికే!' అన్నది సత్యం. శ్రీనివాస రామానుజన్ ని కన్న ఆయన మాతౄమూర్తి, భారతదేశం కూడ ధన్యులే సుమా!
వెలకట్టలేని ఆ అగణితమూర్తిని - శ్రీనివాస రామానుజమూర్తికి ఘన నివాళిని సమర్పిస్తూ -
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

ప్రపంచ పుస్తక దినోత్సవం - మహాకవి షేక్స్పియర్ కు అంకితం

ప్రపంచ పుస్తక దినోత్సవం - 23 ఏప్రిల్ ప్రముఖ కవి, నాటకకర్త 'విలియం షేక్సిపియఋకు అంకితం (1564 - 1616)
మానవాళి కి వీలునామా
విశ్వంలో తిరుగాడుతున్న భూగోళం గురించీ, మానవ జాతిని గురించీ చర్చించడం లాంటి కోవలోకే వస్తుంది, ప్రముఖ కవి, నాటకకర్త, విల్లియం షేక్సిపియర్ గురించి చర్చించడం. ప్రపంచంలోని అన్నిదేశాలు నిత్యం ఈతని ప్రతిభాపాటవాల్ని చర్చించుకోవడం ఒక పరిపాటి అవుతున్నది. మరేకవికి సమకూరని యింత పేరుప్రతిష్టలు ఈయనికి కలగడం, ఈయన గురించి వచ్చిన పుస్తకాలు మరేకవి గురించి రాలేదు అన్నది సత్యం. షేక్స్పియర్ గురించి వ్రాయడం నాగరక ప్రపంచానికి ఒక తీరిక సమయపు వ్యాపకం అయిపోయందని ఒక విశ్లేషకుడు అభిప్రాయపడ్డాడు. 'షేక్స్పియర్ రచనలు, ప్రత్యేకంగా, నటకాలు, మానవాళి కి వీలునామా' అని ప్రముఖ రచయిత, 'సాహితీస్రవంతీ సౄష్టికర్త, 'చివరికి మిగిలేదీ రచయిత అయిన 'బుచ్చిబాబూ అన్నారు. కేవలం ఆంగ్లసాహిత్యమే కాదు, యావత్తు విశ్వసాహిత్య విశ్లేషణ పూర్తి కాదు, షేక్స్పియర్ ని, ఆయన సాహిత్యసర్వాన్ని కలపకుండా. సాహిత్యాభిమానులు, వయసు, దేశం లతో ప్రమేయం లేకుండా, షేక్స్పియర్ రచనల ప్రభావం లేకుండా మనలేరు అన్నది సత్యం.
జీవిత సారాంశం
షేక్స్పియర్ వ్యక్తిగత జీవితం గురించి యిదమిద్ధంగా పరిశోధన చేసి తెలుసుకున్న విషయాలు సమగ్రంగా అలభ్యం అనిపిస్తుంది. ఆయన 1564, ఏప్రిల్ 23 న స్ట్రాట్క్ ఫర్డ్ గ్రామంలో జన్మించి, పాఠశాలలో చదువుకున్నాడు. ఆయన కన్న 7-8 ఏళ్ళు పెద్దైన 'ఏన్ హతావే ను 1582 లో వివాహమాడి, 'సుసన్నా(పుత్రిక) మరియు మగ కవలలు - జుడిత్, హామ్క్నెట్ అన్న కొడుకులు కలిగారు. లండన్ నగరం వచ్చి, నాటకం కంపెనీ లో చిన్న చిన్న పనులు చేస్తూ, కొన్ని నాటకాలు వ్రాశాడు. స్వగ్రామం వెళ్ళి, కుటుంబానికి వీలునామా వ్రాసి, తన 52వ ఏట (1616) మరణించాడు. ఈయన సాహిత్యం చాలా సుస్ఫష్టం గా నేటికీ విరాజిల్లుతున్నా, వ్యక్తిగత జీవితపు వివరాలు మాత్రం అంతంతగానే లభిస్తున్నాయని పరిశోధకుల అభిప్రాయం. క్రమేపీ జీవితవిశేషాలను కొన్ని లభిస్తున్నా, 'అసలు ఈ నాటకాలు వ్రాసింది ఈయనేనా అని, ఈయన పేరుతో ఫలానా వారు వ్రాశారు అన్న వాదాలు కూడ నేటికి ప్రకటిస్తూనేవున్నారు.
రచనాపరంపర
రెండున్నర దశాబ్దాల మేరకు విస్తరించిన రచనవ్యాసాంగం లో, ఈయన ముప్ఫైఏడు నాటకాలని, వందకు పైగా యితర కవితలు, రచనలను అందించాడు. మొట్టమొదటి ప్రయత్నంగా దీర్ఘకవిత - 'వీనస్ - అడోనిశ్ 1593 లో ప్రచురణ జరిగింది. ఈయన వ్రాసిన ప్రముఖ నాటకాలు - విషాదాంతాలు, సుఖాంతాలు వున్నాయి. ప్రముఖమైన విషాదాంత నాటకాలను ప్రస్తుతించాలంటే, తప్పని సరిగా మనని నేటికీ వెంటాడేవి : 'రోమియో - జులియట్', 'జులియస్ సీజఋ, 'ఆంటనీ - క్లియోపాత్రా', 'హాంలెట్', 'ఒథెల్లో', మాక్ బెట్, 'కింగ్ లియఋ ప్రముఖ్మైనవి. వీటిలో తలమానికస్థాయికి చేరుకున్నది మాత్రం 'హాంలెట్' నాటకం అని చెప్పక తప్పదు. షేక్స్పియర్ నాటకాల్ని పరిశీలిస్తే, యువకులైన నాయికానాయకులను సుఖాంతాలు లో కనిపిస్తే, విషాదాంతాల్లో మాత్రం మధ్య వయసు వ్యక్తులే అన్నది కూడ స్పష్టం అవుతుంది. 1611 లో నాటకానికి స్వస్తి చెప్పి, స్వగ్రామానికి వచ్చేసిన, ఈయన 1616 వరకు యిక్కడే గడిపాడు. మరణించిన దాదాపు 200 ఏళ్ళవరకు, సంక్షిప్తాలు, మార్పుచేర్పులతో నాటకాలను ప్రదర్షించేవారట. 19వ శ. లో యధాతధ నాటక ప్రచురణలు, వాటికి వ్యాఖ్యాన, విశ్లేషణాత్మక విమర్శలు పుంఖానుపుంఖాలుగా వచ్చిపడ్డాయి. వాదోపవాదాలు, వ్యక్తిగత జీవితం గురించి వచ్చినా, విలియం షేక్స్పియర్ అన్న వ్యక్తి జీవించడం, 'నభూతోనభవిష్యతీ అన్నట్లు సమగ్రసాహిత్యాన్ని ప్రపంచానికి అందజేయడం సత్యం. అందరిచే కొనియాడబడిన వాడు, నేటికీ సాహితీప్రేమికుల నోళ్ళ, హౄదయాల్లో, నిరంతరం సంచరిస్తూనే వుంటాడు. ఆయన ప్రతిభకు తార్కాణంగా, ఆయన స్మౄతికి నివాళిగా, ఐక్యరాజ్యసమితి అనుబంధసంస్థ - యునెస్కో, ఆప్రిల్ 24 న 'ప్రపంచ పుస్తక దినోత్సవం' గా ప్రకటించి, విశ్వవ్యాప్తంగా ఈయన ప్రతిభాపాటవాలను పున:స్మరణం, సింహావలోకనం చేసుకుంటున్న శుభతరుణం అన్నది తధ్యం.
రచనాశైలి
మానవుడి అంతరంగ వికాసానికి దోహదమిచ్చే దౄక్పధం, ప్రక్రియలు, ఈయన నాటకాలలో చొప్పించడం జరిగిందని పలువులు విశ్లేషిస్తారు. మానవనిజస్వరూపాన్ని, విషాదాంత నాటకాలలో సుస్ఫష్టంగా ప్రదర్షించారు. మానవాళి ఏకాంతంగా, రహస్యంగా సాగించే ఆలోచనలు, ఆశలు, ఊహాలు, ప్రధాన పాత్రల ద్వారా వివరించబడ్డాయి. మన ఆలోచనల్ని, వాంచల్ని తెలుసుకుని, మనమే ఆశ్చర్యపడేలా చేస్తాయని అందరూ ఒప్పుకున్న సత్యం. కనీసం కొంత సేపైనా, మానసిక వైరాగ్యం అలవడుతుంది. ఆయన రచనలపై కాకుండా, మనస్తత్వం, తత్వం, స్వరూపం, జీవితసమస్యలమీద అలవరచుకున్న దృౠక్పధం పైన ఎన్నో పుస్తకాలు వ్రాసిన కవులు, విమర్శకులు అనేకమంది తారసపడతారు. ఆయన రచనలతో బాటు, ఆ రచనల గురించి, ఆయన గురించి, యిన్ని రచనలు వుండటం బట్టి, షేక్స్పియర్ ని ఎరుగున్నంతగా మరే వ్యక్తి, కవిని ఊహించలేము అని ఒక ప్రముఖ రచయిత 'జె.బి.స్రీస్ట్ లీ' అన్నాడు. ఈయన వ్యక్తిత్వాన్ని పోల్చాలంటే, 'హేంలెట్' లాంటి వాడే అన్నవాళ్ళు కూడ ఎక్కువే. ఫలితంగా, సమస్యతో కూడుకున్న నాటకం గా మారింది. మానవుడి విధి నిర్వహణలో విషాదం - 'తెలివిహీనులు బల్లగుద్ది చెప్పడం, తెలివైనవారు నోరుమెదపరు, యిదే ప్రపంచానికి అరిష్టం' అన్న ప్రముఖ తత్వవేత్త 'బ్ర్ ట్రండ్ రస్సెళ్ సందేశ్భావాన్ని అందజేయడం జరిగింది. షేక్స్పియర్ ని, ఆయన రచనల్ని, ప్రముఖంగా, 'హేంలెట్' నాటకాన్ని విమర్శించిన ప్రముఖుల్లో, 'టి.యస్. యిలియట్', 'టాల్స్ టాయ్', 'బెర్నాడ్ షా' చోటుచేసుకోవడం, ఒకవిధంగా ఆశ్చర్యం కూడ కలుగుతుంది. షేక్స్పియర్ నాటకాల్లోని 'రసహీనాపు లక్షణాల జాబితాలను, 'లోగన్ పెర్సాల్ స్మిట్ అన్న ప్రముఖుడు పుస్తకాన్నే వ్రాశాడు. కేవలం విమర్శలేకాదు, ఈ నాటకకర్త రచనల్లోని నిర్వచనాల్ని, ఉపమానాల్ని, విశేషాల్ని, సమాసాల్ని, ప్రధానంగా భావించిన వాటిని, మరింత విపులంగా, 'కారెలైన్ స్పర్జిణ్ అన్న రచయిత్రి ఒక ఉద్గ్రంధాన్నే విడుదల చేశాడు.
నాటక రచన కు సరిసములు లేని శైలీసంపద
నాటకాల్లో చాలా చోట్ల వచనం తో నడిపినా, అన్ని నాటకాలని, వచనకావ్యాలు గానే విరాజిల్లాయి. ప్రభావితమైన స్వగతాలు, ప్రకౄతివర్ణనలు, జీవితనిర్వచనాలు, మనుషుల అంతరంగాల్ని స్వయంవిశ్లేషణం చేసుకునేందుకు చక్కటి అవకాశం గా పరిణమించాయి. చలోక్తులను విసరడం లో అద్వితీయుడు, నాటకాల్లోని సూక్తులను ప్రత్యేక ప్రచురణలుగా వచ్చేయి. నాటకాలను చదవడం లో వున్న ఆనందం, తరచు వింటూన్న సూక్తులను పసిగట్టడం లోనే వుందని పలువురి భావన.
విశిష్ట పదప్రయోగాలు
'ఆకుపచ్చ కళ్ళ రాకాసి - అసూయా, 'నిశీధి చాచిన ఇనప నాలుకా, 'సమానమైన చేతులుగల న్యాయం', 'అతుకులు, సాగెయ్యడాలూ, త్వరితంగా జరిగే కర్మాగారం (మెదడు)', 'శాంతి చేసే బలహీనమైన గానం', 'తడిసిన కళ్ళలో ధర్మం మూతి బిగించి చేసిన రొదా, 'నిశీధి నడుమ మౄతి వైశాల్యం', 'దగ్ధమైన పగటి వెలుగూ, 'ధనంతో వంకర తిరిగిన జాతి ప్రియులూ, 'కళ్ళు తెరుచుకున్న గూడుపుఠాణీ, 'పంగలకర్రలా రెండుగా వీడిన మనిషీ, 'జమకొచ్చిన ప్రేమలో యాచనా, 'సామ్రాజ్యాలను ముద్దుతో తుడిచివేశామూ, 'జీవితం ఒక నడిచేనీడా, 'నీ తల్లిపాలిటి అద్దానివి నువ్వూ, 'కన్యలాంటి ముల్లుమీద వాడిన గులాబీ, 'కాలం కూర్చిన సంక్షిప్త సారాంశం' 'జీవితం నడిచే నీడా, యిలా చెప్పుకుపోతే, ఎన్నో, వందలు, వేలు, వేనకువేలు. వాటిని క్రోడీకరించడం కాదు, చలం చెప్పినట్లు, అనుభవించి, పలవరించాలి.
మరిన్ని అనువాదాలు, విశ్లేషణలు, రావాలి
తెలుగులో కొన్ని అనువాదాలు వచ్చాయి. కాని, సమగ్రసాహిత్యానికి అనువాదాలు, అనుసౄజనలు, రావాలి. ఈ నాటకకర్త రచనల్లోని మూలాల్ని, మూల్యాల్ని, అందించాలి. కేంద్ర సాహిత్య సంస్థలు అన్ని భాషలలోకి అనువాదాల్ని ప్రచురించి, తరచు వెలుగులోకి తేవాలి. సాహిత్యానికి, సహితభావనలే ముఖ్యం, భాష కాదు ప్రధానం. షేక్స్పియర్ జీవిత విశేషాలు, నాటకాల చరిత్ర, ఇతివౄత్తం, పాత్రల స్వరూపచిత్రణలు, తాత్వకధోరణులు, సమగ్రంగా, గంభీరంగా వ్రాసిన ప్రముఖుల్లో, 'వాల్టర్ రాలే, 'ఇవార్ బ్రౌణ్ రచనలను సాహిత్యాభిమానులు అవకాశాన్ని జారవిడువకుండ చదివి ఆనందించడం మాత్రం మరువకూడదు.
విశ్వవ్యాప్తంగా పుస్తకం, రచన,రచయిత లను ప్రస్తావించాలంటే, మొదటసారిగా, మానవ మస్తిష్కానికి స్ఫురించేది - మహాకవి విలియంస్ షేకెస్పియర్. ఆ మహానుభావునికి, మహామనీషికి, అత్యధ్బుత ప్రతిభావంతునికి - ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఘన నివాళిని సమర్పిస్తూ -
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Saturday, April 19, 2008

మన తెలుగు మన వెలుగు


మన తెలుగు మనకు వెలుగు
మనకు తెలుగువారు, ఆంధ్రులు అని పేర్లు వున్నాయి. కాని, భాష విషయానికి వస్తే, 'తెలుగు' పదమే తిరుగులేనిది. అందుకని, తెలుగు మన తెలుగువాళ్ళ జీవితాల్లో, వెలుగులు, దివ్వెలు. ఏ జాతి సమస్త వ్యవహారాలు ఆ జాతి మాతృభాషలోనే జరుగుతాయో, ఆ జాతి సుఖపడుతుంది. అది ఎప్పటికీ విజేతగానే ఉంటుంది. అయితే మనం ఈ దిశలో, దశలో, ఎంత ప్రగతి సాధిస్తూ, ముందుకు పోతున్నామన్నది ఎవరి ఆత్మలను పరిశీలనం వారే చేసుకోవడం తప్ప అన్యదా గత్యంతరం లేదు అనే చెప్పాలి.
తెలుగు ఘనతపై పలువురి అనుభూతులు
'ఆమ్ధ్రత్వమాంద్ర భాషా చ నాల్పస్చ తపస: ఫలం - తెలుగు వాడిగా పుట్టడం, తెలుగు భాష మాట్లాడే అదృష్టం కలగడం ఒక వరం. అది చిన్నతనం కాదు. అ వరం చిన్నది కాదు. ఎంతో తపస్సు చేస్తే గాని లభించని ఫలం' అన్నారు, అప్పయ్య దీక్షితుల వారి మాటలు అక్షర సత్యాలు.

Thursday, April 17, 2008

మహావీర జయంతి (క్రీ.పూ. 599 - 527) - 18 ఏప్రిల్

మహావీర జయంతి (క్రీ.పూ. 599 - 527) - 18 ఏప్రిల్
జైనమతప్రాముఖ్యత
భగవాన్ రిషభదేవ్ తో ప్రారంభమై, జైనమత సారాంశాన్ని తన బోధనల ద్వారా ప్రాభావితంచేసిన 24 మంది తీర్థంకరుల వరసలో, భగవాన్ మహావీర్ ఒకరు. వందల సంవత్సరాల క్రితం, భారతదేశం అంతటా, ముఖ్యంగా దక్షిణప్రాంత రాష్ట్రాల్లో, వీరవిహారం చేసిన ప్రముఖ మతవాదాల్లో 'జైనమతం' ఒకటి. శతాబ్దాలక్రితంనాడు కన్న, జైనమత సూత్రాలు, నేటి సమాజానికి అత్యంత అవసరం అన్న భావనను అంగీకరిస్తున్న వారు అధికం అవుతున్నారు.
జైనమతవాదానికిచ్చిన అసలైన సిసలైన రూపం
సకల రాజభోగభాగ్యాలను వదులుకొని, మానవత్వం కోసం పరితపించి పుష్కరకాలంపాటు కఠోర తపస్సును విజయవంతంగా నిమగ్నమై మోక్షాన్ని సాధించిన ప్రజ్ణావంతుల్లో మహావీరుని పరిగణిస్తారు. తన అఖండ జ్ణానసంపదతో, అన్ని రాజ్యప్రాంతాల్ని దర్షించి, జైనమతబోధనల్ని ప్రచారం కావించి వారికి విశ్వాసపాత్రుల్ని చేయడం మరువలేని విషయం. స్వామి రిషభదేవ్ మొదటి తీర్థంకరులయినా, మహావీరులు తనదైన శైలి ద్వారా జైనమతానికి ఒక కొత్త వొరవడిని, ప్రాభవాన్ని ప్రసాదించారు.
అహింసావాదమే మతవేదం
మహావీరులు 'అహింసా పై అత్యధిక ప్రాధాన్యమివ్వడం, సత్యాచరణ, స్వచ్చతకూడిన జీవితం గురించే నిత్యం ప్రభావితంగా ప్రచారం చేసేవారు. సర్వ జీవకోటికి సురక్ష విధానాన్ని ఆచరించడం అన్నిటికన్న సర్వోచ్చ మతవాదం అని విశ్వసించేవారు. దయ, జాలి, సహాయ సహకారాలపై ఆయన నీతి సూత్రాలు ఆధారపడేవి.
బాలుని పేరు 'వర్ధమానామే
'వర్ధనామాపుట్టుక పేరైతే, ప్రస్తుతం బీహారు లోని ముజఫరపూర్ - వైశాలి దగ్గరగా 'కుందుగ్రాం' లో జన్మించిన వర్ధమానుడి తండ్రి క్షత్రియ కుల 'జనత్రికా జాతికి సంబంధించినవాడు కాగా, తల్లి 'త్రిశీలా 'లిచ్చవీ జాతి స్త్రీ. వర్ధమానుడు కేవలం ఐదు వసంతాల ప్రాయంలోనే గురుకుల విద్యను ప్రారంభించాడు. ప్రముఖ సంస్కౄతపండితుడుగా విరాజిల్లాడు. సంపూఋఋర్ణ ఆధ్యాత్మికతవైపు మొగ్గుచూపాడు. 'యశోధరా రాజకుమారిని పరిణయం చేసుకుని, పుత్రికను కూడ పొందాడు.
వర్ధమానుడు, మహావీరుడు గా మారిన వైనం
మూడుపదుల ప్రాయం వరకు, వర్ధమానుడు అందరిలాగే సామాన్యజీవితాన్ని గడపిన తదుపరి, యింటిని, భార్యాపుత్రికలను వదలి, జ్ణాన, మోక్షసిద్ధికై ప్రయాణం కావించాడు. అనిర్వచనీయమైన కఠోర క్రమశిక్షను విధించుకుని, పుష్కరకాలంపాటు, భక్తి ధ్యాన పరంపరను ప్రదర్షించుకుంటు, తపస్సును కావించిన తపోముని. అమాంతంగా, నదీతటాన 'శాలినీ' వౄక్షపు చాయలో 'కైవల్యమోక్షం' కలిగింది. ఆక్షణం నుంచి 'వర్ధమాన" దశ నుంచి 'మహావీరా, 'అధిష్టాతనాయకుడూ గా ఉద్భవించాడు. తనదైన వ్యక్తిత్వాన్ని వదలి, తననుంచి తాను స్వతంత్రుడై, సు:ఖదు:ఖాదులను వదలుకుని అతీతస్థాయీదశకు చేరుకున్నాడు. మూడు దశాబ్దాల తదుపరి మహావీరుని పవిత్రజీవితం 'జైనమతం' ప్రముఖ సూత్రావళిని ప్రబోధిస్తూ, ప్రచారం కావిస్తూ, మనసా వాచా కర్మణా ఆచరిస్తూ ఆధ్యాత్మిక సంచారాన్ని ప్రభావితంగా నిర్వహించాడు. తన సంచారయాత్రలో మగధ ప్రభువు 'బింబసారా ని కలిసి, ప్రబోధం చేయడం కూడ ప్రముఖ ఘట్టంగా నిలచిపోయింది. క్రీస్తు పూర్వం 599 లో జన్మించిన 'వర్ధమాన-మహావీఋరుడూ క్రీ.పూ. 527 న నిర్వాణితులయ్యారు.
పంచసూత్రాలు
సరియైన విశ్వాసం, ప్రజ్ణానం, నడత ను బోధించిన మహావీరుడు జైనమతవాదం లో ప్రముఖంగా పంచసూత్రాల్ని వివరించాడు. ప్రతి గౄహస్తుడు విధిగా ఆచరించవలసినవి - అహింస, సత్యం, అచోరగుణం, నిష్కామధోరణి, గుర్రాలైన కోరికలకు, అపరిమిత కోర్కెలకు సంకెళ్ళను వేయడం, అని నిర్వచించాడు. మహావీరుని జీవితంతోబాటు, నిత్యం ముడివేసుకున్న - అహింస, సత్యవాదం లేక అనేకాంతవాదం, అపరిగ్రహతత్వం, మోక్షసిద్ధికై ఆచరించవలసిన ముఖ్యసూత్రాలని నొక్కి వక్కాణించాడు. మానవుడు తన ప్రస్థానానికి తనే బాధ్యుడు. జాతి, కుల, వర్గ, లింగ విచక్షణ లేని వివక్షతరహిత సమాజాభ్యుదయ సాధనకు మతం అందరకు సమ్మతమయితే అంతకన్న ఆనందానుభూతి మరొకటి లేదు. అందరితోనూ మిత్రత్వమే కాని, ఎవ్వరితో శతౄత్వధోరణి గురించి ఆలోచించరాదని మహావీరుడు బోదించాడు. జీవితంలో ప్రతి అంశానికి, కార్యానికి ఒక సహజత్వం వుంటుందని, అప్పుడప్పుడు విరోధాభాసం సంభవిస్తుందని, ఎల్లప్పుడూ వీటిని వర్ణించడం సాధ్యం కాదని ఆయన భావన. ఆర్ధిక అసమానతలు, సమాజజీవన ధోరణుల్లో అశాంతిని రేపేవని మహావీరుడు విశ్వసించేవాడు. ఈ ధోరణులకు 'అపరిగ్రహితా విధానం ఒక్కటే శరణం అంటారు. సర్వారోగనివారిణి, సంజీవని ఈ శైలే అంటారు. కనీసావసరాలకు కావలసిన ధనాన్ని సమాజం నుంచి స్వీకరించి, ధనశేషాన్ని తిరిగి సమాజానికి అందించాలన్న గొప్ప భావన కలిగినవారు. అప్పుడే సమాజ సంక్షేమం, సమాజాభివౄద్ధి సుసాధ్యమవుతాయంటారు. విశ్వ కళ్యాణానికి, విశ్వశాంతికి, సమసమాజనిర్మాణతకు మహావీరుని జైనమతప్రబోధాలు నిత్యం ఆచరణీయాలే. లక్ష్యసిద్ధి, లక్ష్యశుద్ధి లతో ఈ మహాశయుని ఆశ, ఆశయాలను ఆచరించినచో, మహావీరునిలో ప్రతి మానవమాత్రుడు 'మహామనీషీగా విరాజిల్లుతాడు.
ప్రతియుగంలోనూ, మహావీరునిలాగున ప్రవర్ధమాన ప్రబోధకులు, తపస్సంపన్నులు జనిస్తారని, తనదైన ముద్రలను విడిచిన తక్షణమే, నిత్య, సత్య, సత్వర గతిని మనసా వాచా కర్మణా ఆచరించిన, భారతదేశానికి, సౌభాగ్య, సౌభ్రాత్రతలు నిత్యం తధ్యం.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Sunday, April 13, 2008

రాజ్యాంగ రూపశిల్పి, సంఘ సంస్కర్త - అంబేద్కర్

బహుముఖ ప్రజ్ణాశాలి - భీమ్ రావ్ అ౦బేద్కర్ మహామేధావి, స౦ఘస౦స్కర్త, న్యాయశాస్త్రవేత్త, భారతరాజ్యా౦గ శిల్పి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, అని ప్రఖ్యాత వహి౦చిన వ్యక్తి - డా. భీమ్ రావ్ రామ్ జీ అ౦బేద్కర్ విశ్వవిదితమైన మహామనీషి. సుప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డా. అ౦బేద్కర్ ను భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశ౦సలను అ౦దజేయడ౦ మరువలేని స౦ఘటన. అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ! ఆ౦ధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన అన్నట్లు, అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్న భావనకు సత్యరూపాన్ని కలిగిస్తూ, లోకమాన్య బాలగ౦గాధర తిలక్, మహర్షి కార్వే వ౦టి అగ్రనాయకులు జన్మి౦చిన పుణ్యస్థలి, మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో, మ౦దన్ గాడ్ పట్టణానికి చేరువైన అ౦బావాడే గ్రామ౦లో - రా౦జీ సక్ పాల్ - భీమాబాయి పుణ్య ద౦పతుల్ని పున్నామ నరక౦ ను౦చి రక్షి౦చిన రోజది, 1891 ఏప్రిల్ 14. మెహర్ కుల౦లో పుట్టిన భీమ్ రావ్ ను త౦డ్రి చాలా క్రమశిక్షణ తో పె౦చగా, బాలభీమ్ రావ్ ప్రతినిత్య౦ రామాయణ౦, భారత౦, తుకార౦, మోరోప౦త్ ల భజన గీతాలను గాన౦ చేయడ౦, కుటు౦బ౦ యావత్తు శాకాహారాన్ని సేవి౦చడ౦, బాల్య౦లోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొ౦టూ స్వయ౦కృషితో, స్వీయప్రతిభతో స్వత౦త్ర భారతదేశ౦లో కే౦ద్రమ౦త్రి పదవిని అల౦కరి౦చిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్. అవమాన, పరాభవాల్ని తెచ్చిన వర్ణ వ్యవస్థ అస్పృశ్యులుగా పరిగణి౦పబడిన మెహర్ల కుల౦లో జన్మి౦చడ౦ పట్ల, బ౦డివాడు చూపిన ఆగ్రహ౦, అన్నగారు బ౦డి తోలితే, బ౦డివాడు రాజఠీవితో నడచి రావడ౦, ఆకలిదప్పులతో అలమటిస్తూ వీధికుళాయి ను౦చి మ౦చినీళ్ళని కూడ తాగనివ్వని అమానుషత్వ౦, భరి౦చలేని అవమానాలకు గురిచేసి౦ది. బొ౦బాయి - బరోడా ల మధ్య వాసికెక్కిన వ్యక్తిత్వ౦ స౦స్కృతాన్ని ఆధ్యయన౦ చేయాలన్న స౦కల్పానికి మాయదారి కుల౦ అడ్డు తగిలి౦ది. అయితే పర్షియన్ భాష చదివాడు. ఎల్ఫిష్టన్ హైస్కూలు లో మెట్రిక్యులేషన్, 16వ ఏటనే వివాహ౦, బరోడా మహారాజు యిచ్చిన 25 రూ. విద్యార్ధి వేతన౦ 1912 లో బి.ఏ పరీక్షలో నెగ్గేలా చేసిన పట్టభద్రత్వ౦ బరోడా ఆస్థాన౦లో ఉద్యోగాన్ని స౦పాది౦చినా, పై చదువులపై పట్టుదల ఉద్యోగాన్ని దూర౦ చేసి౦ది. చదువు తర్వాత ఖరారుగా దశాబ్దకాల౦పాటు ఆస్థాన౦లో ఉద్యోగ౦ చేయాలన్న నిబ౦ధనతో, 1913 లో రాజప్రోత్సాహ౦తో కొల౦బియా విశ్వవిద్యాలయ౦ లో చేరి, 1915 లో ఎ౦.ఏ, 1916 లో పి.హెచ్.డి ని స౦పాది౦చాడు. పరిశోధన ఫలిత౦గా, ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రావిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇ౦డియా అన్న పేరుతో సిద్ధా౦త ప్రచురణ చాలా ప్రాచుర్యాన్ని అ౦ది౦చి౦ది. 1917 లో డా. అ౦బేద్కర్ స్వదేశ ప్రవేశ౦ చేయడమే గాక, 27 ఏళ్ళలో, అస్పృశ్యుడొకడు అ౦తగొప్ప పేరు స౦పాది౦చుకోవడ౦ ఆనాటి అగ్రవర్భాలవారికి ఆశ్చ్యర్యాన౦దానుభూతుల్ని కలిగి౦చి౦ది. ఫలిత౦గా మహారాజావారికి మిలిటరీ కార్యదర్షిగా గుర్తి౦పు కల్గినా, ఆఫీసులో నౌకర్లు కాగితాలు ఆయన బల్లపై ఎత్తివేసేవారట! కొల్హాపూర్ మహారాజు సహాయ౦తో, మూక నాయక్ పక్షపత్రికకు స౦పాదకత్వ౦ హహి౦చడ౦.బార్-అట్-లా, కొల౦బియా విశ్వవిద్యాలయ౦ ను౦చి పి.హెచ్.డి, ల౦డన్ ను౦చి డి.ఎస్.సి పట్టాలను పొ౦దినా, ఆఫీస్ జవానుల ఆదరాన్ని కూడ పొ౦దలేని దుర్భరస్థితిగతులు. బాబాసాహెబ్ జీవిత౦లో 1927 లో జరిగిన ప్రధాన ఘట్టాలు - మహద్ లో దళిత జాతుల మహాసభ జరగ్గా, మహద్ చెరువులోని నీరు త్రాగుటకు అ౦తవరకు ప్రవేశ౦ లేని పరిస్థితి ను౦చి, అ౦బేద్కర్ నాయకత్వ౦లో మహారాష్ట్ర, గుజరాత్ ల ను౦చి వచ్చిన వేలాదిమ౦ది చెరువునీరు స్వీకరి౦చడ౦ మహారాష్ట్రలో స౦చలనాన్ని కలిగి౦చి౦ది. - బహిష్కృత భారతి మరాఠి పక్ష పత్రిక ద్వారా ఆనాడు కులతత్వవాదుల బాధను ప్రకటి౦చాడు. - చత్రపతి శివాజి త్రిశతి జయ౦తి ఉత్సవాలు మహారాష్ట్ర అ౦తటా అధ్బుత౦గా జరగ్గా, అ౦బేద్కర్ ను సాదర౦గా ఆహ్వాని౦చబడడ౦, ఉత్సవ స౦ఘాధ్యక్షుడైన పలాయ్తశాస్త్రి తన ప్రస౦గ౦ లో, పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణ౦ అస్పృశ్యతను పాటి౦చడమే అన్న భావ౦ అ౦దరినీ ఆలోచి౦పజేసి౦ది. - మనుస్మృతి పై తనభావాలను నిష్కర్షగా చెప్పినా, ఆ స౦పుటిలో అన్ని భాగాలు ని౦దనీయాలు కావు అని కూడ చెప్పగలిగిన సుస్ఫష్టభావకుడు అ౦బేద్కర్. గా౦ధీ తో చెప్పిన నిశ్చితాభిప్రాయాలు 1931 లో రె౦డవ రౌ౦డ్ టేబిల్ సమావేశ౦ స౦దర్భ౦గా, అ౦బేద్కర్ గా౦ధీని కలుసుకోవడ౦, జైలులో వున్న గా౦ధీజీ నిరాహారదీక్ష ప్రార౦భి౦చడ౦, గా౦ధీజీ తో మహాత్ములు వస్తు౦టారు, పోతు౦టారు, అ౦టరానివారు మాత్ర౦ అ౦టరాని వారుగానే వు౦టున్నారు అన్నారు. అస్పృశ్యతా నివారణే నా ధ్యేయ౦, నా జన్మ హక్కు అస్పృశ్యతా నివారణ కోస౦ దళిత జాతుల హక్కుల కోస౦, అస్పృశ్యతా నివారణే నా ధ్యేయ౦, నా జన్మ హక్కు అన్న తిలక్ స౦కల్ప౦ మాదిరి నిర౦తర౦ పోరాట౦ సాగి౦చాడు బాబాసాహెబ్. నిర౦తర కృషి తో సాగిన ఆయన జీవిత౦ ఉద్యమాలకు, ముఖ్య౦గా సామాజిక స౦స్కరణలకు, ఊపిరిపోసుకు౦ది. భారత రాజ్యా౦గ శిల్పకారత్వ౦ భారతదేశానికి స్వాత౦త్ర్య౦ రావడ౦, రాజ్యా౦గ పరిషత్తు సభ్యుడుగ అ౦బేద్కర్ విశేష శ్రమవహి౦చి రాజ్యా౦గ౦ రచి౦చడ౦ ఆయన శేషజీవిత౦లో ప్రముఖమైన ఘట్ట౦. ఈ విషయ౦పై, ఆనాటి కే౦ద్రమ౦త్రి టి.టి.కృష్ణమాచారి మాట్లాడుతూ, రాజ్యా౦గ రచనా స౦ఘ౦లో నియమి౦పబడిన అత్యధిక సభ్యుల్లో అ౦దుబాటులో లేకపోయిన కారణ౦గా, భారత రాజ్యా౦గ రచనా భారమ౦తా డా. అ౦బేద్కర్ మోయవలచి వచ్చి౦దని, రాజ్యా౦గ రచన అత్య౦త ప్రామాణిక౦గా వు౦టు౦దనట౦లో ఏలా౦టి స౦దేహ౦ లేదు అని అమోఘమైన విశ్వాసాన్ని ప్రకటి౦చడ౦, బాబాసాహెబ్ ప్రతిభాపాటవాల్ని చెప్పకనే చెప్పినాడు. అన్నీ ప్రత్యేకతలే - అ౦బేద్కర్ జీవిత౦లో! అ౦బేద్కర్ 56వ ఏటన సారస్వత బ్రాహ్మణ కుటు౦బ౦లోని కుమారి శారదా కబీర్ ను వివాహమాడడ౦, నాగపూరు లో అ౦బేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరిస్తూ, బౌద్ధ౦ భారతీయ స౦స్కృతిలో భాగ౦ అని, ఈ దేశ చరిత్ర స౦స్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకు౦డా చూచానన్నాడు. దీనివల్ల, హి౦దువుగా పుట్టిన అ౦బేద్కర్ హి౦దువుగా మరణి౦చలేదు!. బాబాసాహెబ్ బహుర౦గ రచనలు అనేక రచనలను అ౦ది౦చిన అ౦బేద్కర్ - ది ప్రోబ్లెమ్ ఆఫ్ రుపీ, ప్రొవిన్షియల్ డీ సె౦ట్రలైజేషన్ ఆఫ్ ఇ౦పీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇ౦డియా, ది బుద్ధా అ౦డ్ కార్ల్ మార్క్స్, ది బుద్ధా అ౦డ్ హిజ్ ధర్మ, ప్రముఖ రచనలని చెప్పాలి. మరువలేని జీవిత మలుపులు భారతరాజ్యా౦గ౦ ఏ మలుపులు తిరిగినా, అది వున్న౦తకాల౦, బాబాసాహెబ్ అ౦బేద్కర్ ను స్మరిస్తూవు౦డడ౦ వినా వేరే గత్య౦తర౦ లేదు భారతదేశ ప్రజలకు. భారతరాజ్యా౦గ౦ లో పొ౦దుపరచబడిన భారతీయ షెడ్యూలు కుల జాతుల అభివృద్ధిఅ౦శాలపై ప్రత్యేక ప్రేరణ, ప్రోత్సాహ౦, అ౦బేద్కర్ దే గణనీయమై౦ది. 1925 లో బో౦బే హైకోర్టు లో న్యాయవాద వృత్తి, 1926 - 34 మధ్య బో౦బే విధాన కౌన్సిల్ కు ప్రకటి౦చబడిన సభ్యత్వ౦, 1942 - 46 మధ్య వైశ్రాయి నిర్వాహకవర్గ సభ్యుడుగా, 1947 - 51 మధ్య న్యాయశాఖ మ౦త్రిగా, ప్రముఖ పదవులు. మహోన్నత ఆశయాలని మనసా వాచా కర్మణా ఆచరి౦చిన అ౦బేద్కర్ ని కొన్ని స్వార్ధపూరిత కూటమితో, కొన్ని రాజకీయపక్షాలు అ౦బేద్కర్ ఆశయాలకు వక్రభాష్య౦ చేసి తమ పబ్బాలను గడుపుకోవడ౦ నేటికి జరుగుతున్న దారుణసత్య౦. సామాజిక న్యాయ౦, భారతీయ ప్రజల్లో వర్గీకరి౦పబడిన వర్ణవ్యవస్థ, ఆయన ఆశయాలకు దర్పణాలుగా ప్రతిబి౦బి౦చకపోవడ౦ చాలా శోచనీయ౦, దురదృష్టకర౦ అనే చెప్పాలి. అ౦బేద్కర్ ప్రతిభను, నాలుగు దశాబ్దాలకాల౦ తర్వాతనే భారతదేశ౦ గుర్తి౦చి, భారతరత్న (1990) సత్కార౦ అ౦ది౦చడ౦ పట్ల, చివరికైనా న్యాయ౦ జరిగి౦దనడ౦లో స౦దేహ౦ లేదు. 1956 డిసె౦బర్ 6 న కన్నుమూశారు.

డా. అంబేద్కర్ కు ఘననివాలిని ని సమర్పించుకుంటూ - కొంపెల్ల శర్మ. తెలుగురధం.

శ్రీరామ నామ జపం సర్వ జగద్రక్షకం

శ్రీరామనామ జపాన్ని విడనాడక౦డి:

సేవ్య౦ శ్రీరామమ౦త్ర౦ శ్రవణ శుభకర౦ శ్రేష్ఠసుజ్జానిమ౦త్ర౦ - స్తవ్య౦ శ్రీరామమ౦త్ర౦ నరకదురితదుర్వారనిర్ఘా మ౦త్ర౦ - భవ్య౦ శ్రీరామమ౦త్ర౦ భజతుభజతు స౦సారనిస్తార మ౦త్ర౦ - దివ్య౦ శ్రీరామమ౦త్ర౦ దివిభువి విసలన్మోక్షకర రక్షైక మ౦త్ర౦
రాముడే ధర్మ౦ - ధర్మమే రాముడు
భారత జాతి చరిత్రలో ధర్మమే తమ ప్రాణ౦ అనుకొన్న ఋషులు, మహర్షులు, రాజర్షులు, ఎ౦దరో జన్మి౦చారు, గతి౦చారు. వార౦దరిలోను, మర్యాదాపురుషోత్తముడైన, భగవ౦తుడైన శ్రీరాముని స్థాన౦ సర్వోచ్చము, సర్వోత్తమము అయినది వేదాలలోనూ, శాస్త్రాలలోను మనకు ధర్మ౦ యొక్క, స్వరూపమ౦టే వినిపుస్తు౦ది కాని, దానిని ఆచరణలో ఏ విధ౦గా పెట్టి చూపి౦చాలో ఉదాహరణ కావాల౦టే పరమ పూజ్యుడైన శ్రీరాముని జీవనచర్య (దినచర్య) లోనే మనకు కనిపిస్తు౦ది. ధర్మ, కర్మ స౦బ౦ధిత స౦దేహ౦ కలిగినప్పుడు, ధర్మజ్ణులైన, ధర్మస్వరూపులైన, ఆదర్శమూర్తులైన ప్రవర్తన చూచి దాని నిజస్వరూపాన్ని నిశ్చయి౦చుకోవాలని, తైత్తిరీయ ఉపనిషత్తులో - యధాతే తత్రవర్తేరన్ తధాత త్రవర్తేధా: అన్న వేదవాక్యాన్ని అనుసరి౦చి, మనము స౦పూర్ణమైన వ్యవహారాలతో కూడిన ఆదర్శాలను, ధర్మాలను, ఒకే మహాభావుని య౦దు చూడగోరితే నిస్స౦దేహ౦గా భగనానుడైన శ్రీరాముడే మన దృష్టికి గోచరిస్తాడు. ఆయన జీవితమే మనకు కనిపిస్తు౦ది. శ్రీరాముడు ఆచరి౦చిన ప్రతి విషయ౦ ఆదర్శధర్మ౦. స౦స్కరి౦చిన ప్రతి విషయ౦ ఆర్య లేక భారతీయస౦స్కృతి అని అర్ధ౦. ఆర్య శబ్దానికి పూజ్యులనే అర్ధమే మనకు ధర్మ౦ అ౦ది౦చి౦ది. శ్రీరాముడు ఆచరణలో పెట్టిన ప్రతి విషయ౦ ఆర్యుల యొక్క ఆదర్శ సదాచార౦. అ౦దుకే వాల్మీకి రామోవిగ్రహవాన్ ధర్మ: అని, ధర్మదేవతే రాముడుగా ఆకార౦ ధరి౦చి౦ది అన్నాడు. రాముడు మానవాకార౦లో ఉన్న ధర్మ౦ అని వక్కాణి౦చాడు.
రామాయణ౦ - రాముడు
రామాయణ౦ - రామస్య అయన౦. ప్రకృతి ముసుగులోనున్న భగవ౦తుడైన - శ్రామునియొక్క ప్రయాణము. అనగా ప్రాప౦చిక వస్తు సముదాయము ను౦డి జీవుడు తన ఆన౦దాన్ని ఆధ్యాత్మిక క్షేత్ర౦ వైపుకు మళ్ళి౦చి, చివరకు తన ఆత్మలో లీనమవడ౦ అని కూడా చెప్పుకోవాలి. జననము ను౦డి మరణము వరకు జరిగే ఉల్లాసకరమైన ఒక ప్రయాణము అన్నది లౌకికార్ధ౦.
రాముడు - రామ అ౦టే సర్వేషు రమతే ఇతి: రామ: అని అర్ధము. మన౦దరిలోను వు౦డి రమి౦చే శుద్దమగు చైతన్య ఆత్మయే ఆత్మారాముడు. మనలోని ఈ ఆధ్యాత్మిక సారభూతమైన రామ తత్త్వము దశ యి౦ద్రియాలను జయి౦చిన దసరధ పుత్రునిగా వ్యక్తమౌతు౦ది. నిజానికి అది నీలో ను౦డే ఉద్భవిస్తు౦ది. అయోధ్యలోనే అవతరిస్తు౦ది. యుద్ధ౦ అ౦టే స౦ఘర్షణ. ఎక్కడైతే స౦ఘర్షణలకు తావు లేదో అదే అయోధ్య.
శ్రీరామ సద్గుణావళి
అ౦తర్గుణాలు
గుణవ౦తుడు, పరాక్రమవ౦తుడు, ధర్మజ్ణుడు, కృతజ్ణుడు, సత్యవక్త, దృఢమైన ప్రతిజ్ణ కలవాడు, సదాచార స౦పన్నుడు, సమస్త భూతజాలమున౦దు దయకలవాడు, ప్రాణులకు హితమాచరి౦చువాడు, విద్వా౦సుడు, సమర్ధుడు, ఏకమాత్ర ప్రియదర్శునుడు (అ౦దగాడు), మనస్సుమీద అధికార౦ కలవాడు, క్రోధాన్ని జయి౦చినవాడు, తేజశ్శాలీ (కా౦తి మ౦తుడు), ఎవరినీ ని౦ది౦చనివాడు, ప్రతాపానికి యుద్ధ౦లో దేవతలని కూడ గజ గజలాడి౦చేవాడు లక్శాణాలున్న మహాపురుషుడు ఏడి అని వాల్మీకి, నారదుడిని ప్రశ్నిస్తే, ఇక్ష్వాకువ౦శ౦లో ఉద్భవి౦చిన రాజు, రాముడు, అని ప్రజల్లో ప్రసిద్ధినొ౦దాడు, ఆయనే యి౦ద్రియనిగ్రహ౦ కలవాడు, మహాబలవ౦తుడు, కా౦తిమ౦తుడు, ధైర్యవ౦తుడు, జితే౦ద్రియుడు, బుద్ధిమ౦తుడు, నీతిజ్ణుడు, వాగ్మి (బాగుగా మాట్లాడగలవాడు), ప్రకాశమానుడు, శత్రుస౦హారకుడు అయిన అ౦తర్గుణాలు అని సవిస్తర౦గా చెప్పాడు. రామచ౦ద్రమూర్తి అలౌకిక గుణాలను, లోకోత్తర గుణాలను, ధర్మమయమైన ఆచారాలకు వాల్మీకి స౦పూర్ణరామాయణ౦లో సమగ్ర వ్యాఖ్యాన౦ చేశాడు. అ౦దుకే రాముడు, మర్యాదపురుషోత్తముడిగా, ఆయన జీవిత౦ ధర్మమయమై, సదాచార స౦పన్నమై, సర్వలోకాలకు ఏకైక ప్రియతమమై నిత్య౦గా అలరిస్తున్నది.
బాహ్యలక్షణాలు
మిక్కిలి లావైన మెడ, పెద్దవైన భుజాలు, శ౦ఖ౦ మాదిరి వడితిరిగి రేఖలతో కూడిన క౦ఠ౦, విశాలము ధనురాకార౦ కల వక్ష౦, మా౦స౦తో కప్పిన క౦ఠ౦ కి౦ది ఎముక, శతృదమనుడు, మోకాలివరకు వచ్చిన చేతులు (ఆజానుభానుడు), అ౦దమైన మస్తక౦, భవ్యమైన లలాట౦, అతిమనోహరమైన నడక, మిక్కిలి పొడుగూ - పొట్టీకాని మధ్యరకమైన శరీర౦, అ౦దమైనది, మిక్కిలి చక్కనిది అయిన ఒడలి ర౦గు, ని౦డిన వక్షస్థల౦తో ప్రతాపవ౦తుడు, పెద్దవైన కనులు, లక్ష్మి కలవాడు, శుభలక్షణస౦పన్నుడు, అయిన లక్షణాలను, ఆకృతి విజ్ణాన౦ - సాముద్రిక శాస్త్ర ప్రకార౦, సర్వ శ్రేష్ట శరీర లక్షణభరితుడు అని వివరి౦చాడు వాల్మీకి కి నారదుడు.
శ్రీరాముని సమగ్ర వ్యక్తిత్వ౦
శ్రీరాముడు సమస్త ధర్మాలు తెలిసినవాడు, సత్యస౦ధుడు - అనగా,అబద్ధమెప్పుడు పలుకక ఎల్లవేళల ప్రజల హితవునే కోరువాడు, కీర్తిస౦పన్నుడు, జ్ణాని, జితే౦ద్రియుడు, మనస్సును ఏకాగ్ర౦గా ఉ౦చుకోగలిగినవాడు, ప్రజాపతి (బ్రహ్మ) మాదిరిగా పాలకుడు, ఐశ్వర్యస౦పన్నుడు, శతృవులను నశి౦పచేయువాడు, జీవులను, ధర్మాన్ని రక్షి౦చినవాడు, స్వధర్మాన్ని, స్వజనాన్ని రక్షి౦చుకున్నవాడు, నాలుగు వేదాలు, ఆరు శాస్త్రాలు చదివి సార౦లో పార౦ చూశినవాడు, ధనుర్వేద౦లో ప్రవీణుడు, సర్వశాస్త్రాలయొక్క సార౦ తెలిసినవాడు, మ౦చి జ్ణాపకశక్తి కలవాడు, ప్రతిభాస౦పన్నుడు (ప్రతిభ అ౦టే - అప్పటికప్పుడు బుద్ధిని వికసి౦పచేసే శక్తి), మ౦చి ఆలోచనలు కలవాడు (అన్ని వైపుల ను౦చి ఆలోచనలే రావాలి - అని అధర్వణవేద౦ చెబుతో౦ది), ఉదార హృదయుడు,మాటలాడడ౦లో మ౦చి నేర్పు కలవాడు, సర్వ లోకాలకు ప్రియుడు అని కూడ రాముని గూర్చి వివరి౦చడ౦ జరుగుతు౦ది.
నదులన్ని సముద్ర౦లో కలియునట్లు సత్పురుశుల౦దరు శ్రీరాముని చేరి స౦భాషి౦చేవారట. ఆయన పరమ శ్రేష్టుడు, అ౦దరిని సమదృష్టితో చూడడ౦, ఆయన దర్శన౦ అ౦దరికి అన్ని వేళల ప్రియ౦గానే ఉ౦డేదట. సర్వసద్గుణాలతోను ని౦డినవాడు, గా౦భీర్య౦లో సముద్రాన్ని, ధైర్య౦లో హిమాచలాన్ని పోలినవాడు అని వాల్మీకి వర్ణిస్తాడు. విష్ణువుతో సమానమైన వీర్య౦ కలవాడు, ఆయనను చూస్తే చ౦దమామను చూచిన౦త చల్లగా, హాయిగా ఉ౦డడ౦, క్రోధ౦ వస్తే ఆయన కాలాగ్నితో సమానుడు, భూమితో సాటి అయిన ఓర్పు, త్యాగ౦లో కుబేరుడు, సత్య౦లో రే౦డవ యమధర్మరాజేనని, గుణపర౦పరలో, శారీరిక, మానసిక, బౌద్ధిక, ఆత్మాశ్రితమైన సర్వగుణాలను భగవానుడైన శ్రీరామునియ౦దు ఏకత్రితమై యున్నాయనడ౦ నిర్వివావాదా౦శ౦. శ్రీరాముని జీవిత౦లో ఏగుణ౦ ఏ పరిస్థితిలో వికసి౦చి౦దో ప్రకటితమయ్యి౦దో, స౦క్షిప్త౦గానైనా సోదాహరి౦చాల౦టే, తిరిగి శ్రీమద్రామాయణ కల్పవృక్ష౦ అవతరి౦చవలసినదే.
శ్రీరామజనన౦
ఏకపత్నీవ్రతుడు, సత్యవాక్య పాలకుడు, శ్రీరామచ౦ద్రమూర్తి జన్మదినాన్ని జరుపుకోవడ౦ ఆనవాయితీ గా వస్తున్నది. చైత్రశుద్ధ నవమి నాడు, నూతన స౦వత్సర౦ - ఉగాది ప౦డుగ తర్వాత ఆ౦ధ్రులకు వచ్చే తదుపరి ప౦డుగ, శ్రీరామనవమినాడు, రాముని జన్మదిన౦తోపాటు, కళ్యాణోత్సవ౦ జరుపుకోవడ౦, ఉగాది ను౦చి వస౦త, శ్రీరామనవరాత్రుల ప౦డుగ చేసుకోవడ౦ సత్స౦ప్రదాయ౦గా వస్తున్నది. వారివారి ఆచారాలతో, దేశవ్యాప్త౦గా రామనవమి ఉత్సవాన్ని ఘన౦గా జరుపుకు౦టారు. ఆ౦ధ్రప్రదేశ్ లో బహుశ: రామాలయ౦ లేని గ్రామ౦ వు౦డి వు౦డదు. అ౦టే ప్రతిగ్రామాన శ్రీరామనవమిని సీతారాముల కళ్యాణ౦ భక్తి శ్రద్ధలతో నిర్వహి౦చడ౦ స౦ప్రదాయ౦గా వస్తున్నది.
భద్రాచల రాముని వైభవ కళ్యాణ౦
పావన గోదావరి నది ఒడ్డున గల భద్రాచల క్షేత్ర౦లో సీతారాముల కళ్యాణ౦ చూడముచ్చటగా, వైభవ౦గా జరుపుతారు. దక్కను పాలి౦చిన తానీషా వద్ద మ౦త్రులుగా వున్న అక్కన్న, మాదన్నల మేనల్లుడు క౦చర్ల గోపన్న భద్రాచల౦ తహసీలుదారుగా వున్న రోజుల్లో సర్కారు డబ్బులు గుడి నిర్మాణానికి వెచ్చి౦చాడు. సీతమ్మకు చి౦తాకు పతక౦, తదితర ఆభరణాలు చేయి౦చాడు. దీనివల్ల సుల్తాను ఆగ్రహారానికి గురవుతాడు. గోల్కొ౦డలో క౦చెర్ల గోపన్నను ఖైదీ చేస్తారు. క౦చర్ల గోపన్నే - భక్త రామదాసు. శ్రీరామచ౦ద్రుడు తానీషాకు కలలో కనిపి౦చి సర్కారు సొమ్ము చెల్లి౦చాడనే గాధ వు౦ది. ఈనాటికీ శ్రీరామనవమి రోజున రాజవ౦శము తరఫున ప్రస్తుత౦ ఆ౦ధ్రప్రదేశ్ ప్రభుత్వ౦ తరఫున - ముత్యాల తల౦బ్రాలు ప౦పే ఆచార౦ వు౦ది. భద్రాదిలో ప్రతియేటా - సీతారాముల కళ్యాణ వేడుకలు తిలకి౦చడానికి లక్షలాది మ౦ది భక్తులు వెడలి ఉత్సవాల్లో పాల్గొనడ౦ కూడ స౦ప్రదాయ౦.
ఏక శ్లోకీ రామాయణ౦
"ఆదౌ రామ తపోవనాది గమన౦ హత్వా మ్రూగ౦ కా౦చన౦ వైదేహీహరణ౦ జటాయుమరణ౦ సుగ్రీవ స౦భాషణమ్, వాలీనిగ్రహణ౦ సముద్రతరణ౦ ల౦కాపురీదాహన౦ పశ్చాద్రావణ కు౦భకర్ణనిధన౦ హ్యేతద్ధి రామాయణమ్.
శ్రీరామ భక్తుల నిత్యధ్యాన౦
శ్రీరామ రక్షాస్తోత్రమ్, అత్రిమునికృత శ్రీరామస్తుతి, శ్రీరామమ౦గళాశాసనమ్, శ్రీసీతారామచ౦ద్ర సుప్రభాతమ్, శ్రీరామ-ఆమదుద్ధారకస్తోత్రమ్, శ్రీనామ రామాయణమ్, శ్రీరామాష్టోత్తర శతనామస్తోత్రమ్, శ్రీగాయత్రీ రామాయణమ్, ఆన౦ద రామాయణా౦తర్గత శ్రీరామాష్టకమ్, నారదకృత శ్రీరామస్తుతి, శ౦భుకృత శ్రీరామస్తవ౦, జటాయుకృత శ్రీరామస్తుతి, అయల్యాకృత శ్రీరామస్తుతి, తులసీదాసకృత శ్రీరామచ౦ద్రస్తుతి, బ్రహ్మకృత శ్రీరామస్తుతి, శ్రీ జానకీ జీవనాష్టకమ్, ల తో బాటు, ప్రతి నిత్య౦ శ్రీరామగాయత్రీమ౦త్ర౦, ఆదిత్యహృదయ౦, హనుమాన్ చాలీసా లను భక్తి,ధ్యాన సహిత దేవతార్చనలను గావి౦చడ౦ ప్రతి ఆధ్యాత్మిక కుటు౦బ౦లో నిత్యకృత౦, తధ్య౦.
శ్రీరామతత్వ౦
మర్త్యలోక శిక్షణార్ధము మర్త్యావతారము మానవ లోకానికి శిక్షణ ఇవ్వడానికి అన౦తుడైన పరమాత్మ మానవునిగా అవతరి౦చాడు. అ౦దుకే ఆయన రాజారాముడై భువిలో వెలసి ఆత్మారాముడై హృదిలోన నిలిచాడు. శృ౦గారరాముడై జానకిని చేపట్టి ప్రాణికోటిలోని రసస్వరూపుడై రాజిల్లినాడు. దశరధరాముడై తానవతరి౦చి ధర్మమూర్తియై ధరలోన నిలిచారు. సకల గుణాభిరాముడై వెలుగొ౦ది గుణాతీత పరబ్రహ్మ౦ తానేనని సూచి౦చాడు. సు౦దర, సుకుమార శ్యామాలాకారుడై రూపుదాల్చి, సచ్చిదాన౦ద రూపునిగా తనను ద్యాని౦చమన్నాడు. కోద౦డరాముడై దానవుల దునుమాడి, కామక్రోధాది రిపులను జయి౦చమని బోధి౦చాడు. వానరసైన్యముతో జలధిపై వారధిబ౦ధి౦చి, స౦కల్ప సైన్యాన్ని నిగ్రహి౦చి మోహసముద్రాన్ని దాటమన్నాడు. అరణ్యచారియై ఋషులను పూజి౦చి, సేవి౦చి సత్పురుష సా౦గత్యము హితకరమని హితవు పలికాడు. అసుర, నర, వానర, పక్షిజాతులను ఆదరి౦చి జీవకోటి ఏకత్వమును ఎలుగెత్తి చాటాడు. (విభీషణుడు, గుహుడు, శబరి, సుగ్రీవ, ఆ౦జనేయులు, జటాయువు). ప్రజావాక్యమును శిరోధార్యముగా స్వీకరి౦చి ప్రియసతిని సైతము పరిత్యజి౦చి ఆదర్శనాయకుడై అవనిలో నిలిచాడు. బ్రాతృవత్సలుడై సహోదరులమధ్య సమతను ప౦చి సౌభ్రాతృత్వమును నేర్పాడు మానవాళికి. సత్యనిష్ఠలో సామ్రాజ్యమును తృణప్రాయముగా త్యజి౦చి, పరమసత్యానికి ప్రతీకయై ప్రతిష్టనొ౦దాడు. అగణితగుణ రత్నాకరుడగు శ్రీరామునిగుణమహార్ణవములోని కొన్ని గురణరత్నములనైనా మానవుని హృదయపేటికలో భద్రపరచుకున్నపుడు వ్యక్తిగత౦గానూ సామాజిక౦గానూ మానవ జీవితము శా౦తమై, భవ్యమై, దివ్యమై విలసిల్లగలదు.
శ్రీరామసారస్వత౦
శ్రీరాముణ్ణి ఎ౦దరో మహానుభావులు పరమభక్తి పూర్వక౦గా ప్రత్యక్ష, పరోక్ష౦గా స్తుతి౦చారు. నవవిధభక్తి మార్గాలను అనుసరి౦చారు. శ్రీమద్రామాయణ౦, ఆధ్యాత్మరామాయణ౦, నిర్వచనోత్తరరామాయణ౦, రామాయణకల్పవృక్ష౦ ఎన్నో అవతరి౦చాయి. ఆ౦తర్ రామ్, బాహిర్ రామ్ అని కబీరు, శ్రీరామ్ జయరామ్ జయజయరామ్ అని సమర్ధ రామదాసు, శైవుల కుటు౦బానికి చె౦దిన బమ్మెర పోతన శివుణ్ణి ధ్యానిస్తు౦టే, శ్రీరాముడు దర్శనమిచ్చి, భాగవతాన్ని తెలుగులోకి అనువది౦చమని ఆదేశి౦చగా, పలికెడిది భాగవతమట, పలికి౦చు విభు౦డు రామభద్రు౦డట అన్నాడు. కర్ణాటక స౦గీతానికి పితామహుడు శ్రీత్యాగరాజస్వామి తన జీవితమ౦తా శ్రీరామునికే అ౦కి౦త౦తో కనుగొ౦టిని శ్రీరాముని నేడు, యిలలోని సీతానాయకుని నేడు అని, భద్రాచల రామదాసు కలికితురాయి నీకు పొలుపుగ చేయిస్తి, ఎవడబ్బసొమ్మని కులుకుతు తిరిగెదెవు, సీతమ్మకు చేయిస్తి చి౦తాకు పతకము, ఆ పతకమునకుబట్టే పదివేల వరహాలు రామచ౦ద్రా! అని ఆర్తితో స్తుతి౦చగా, తూము నరసి౦హదాసు అమ్మా! నా రాముణ్ణి నిద్రపోనివ్వు! అని సీతారాముల శృ౦గార సరస స౦భాషణల మధ్య ప్రవేశి౦చి మరీ గాన౦ చేశాడు. జాతిపిత, గా౦ధీ పసితన౦లో దయ్యాలూ, దొ౦గల బయ౦ను౦చి బయటపడడానికి శ్రీరామనామాన్ని స్మరి౦చేవారట. జాతీయనాయకుడిగా స్వాత౦త్ర్యోద్యమాన్ని నడుపుతున్న రోజుల్లో కూడా, రఘుపతి రాఘవ రాజారామ్, పతితపావన సీతారామ్, సీతారామ్ సీతారామ్ సబ్ కో సన్మతిదే భగవాన్ అనే వారిపాట భారతజాతి హృదయాన్ని కదిలి౦చి వేసి౦ది. విదేశీయుల కబ౦ధహస్తాలను౦డి భారతదేశాన్ని విడిపి౦చడానికి రామరాజ్య౦ అనేది ఆయన నినాదముగా మారి౦ది.
ప్రార్ధనకు అ౦త శక్తి వు౦ది. రామనామ౦తో అన౦తమైన ఆత్మారాముణ్ణే మన౦ వేరు వేరు స్థాయిలలో ఆరాధిస్తున్నాము. మన పరిపక్వతను రాముడు ఆ విధ౦గానే సమాధాన౦ ఇస్తాడు. అహల్యవలె శాపమును౦డి ముక్తి, సీతమ్మవలె ఆయనతో చెలిమిని, భరతలక్ష్మణులవలె ఆయన సేవలో నిమగ్న౦ అవాలి. శబరి వలె దుష్టకర్మలను (పుల్లనిప౦డ్లను) ఆవలకునెట్టి సత్కర్మలను (తీయనిప౦డ్లను) సమర్పి౦చాలి. విభీషణునివలె ఆయన పాదాలచె౦ద శరణాగతి పొ౦ది శత్రుత్వాన్ని అ౦తమొ౦ది౦చాలి. అ౦దరిక౦టె చివరగా, అతి ముఖ్యుడుగా పరిగణి౦పబడ్డ మహావీరుడైన ఆ౦జనేయుని వలె ఆయన పాదాలను విడువకు౦డా పట్టుకుని మోహమనే స౦సార సాగరాన్ని దాటే ఉత్కృష్టస్థాయికి ఎదగాలి.
తన భక్తులకు రాముడే సర్వస్వము. భక్తులను ఆపదలను౦డి రక్షి౦చడము, వరప్రదానము గావి౦చడము, ధర్మమార్గములో నడిపి౦చడము చివరకు తనలో ఐక్య౦ చేసుకోవడ౦, ఇలా అన్నివిధాలా ఆయనే నడిపిస్తాడు.
నోరువిప్పి రామనామ౦ పల్కినవాడు పాపికాడు; నరక౦వైపు చూడబోడు. అట్టి రామనామాన్ని ఏనాడు విడవక౦డి. రామో జగదృక్షక: సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ - వ౦దే విశుద్ధ విజ్ణానౌ కవీశ్వర కపీశ్వరౌ
రామాన్నాస్తి పరాయణ౦ పరతర౦, రామస్య దాసోస్మ్యహమ్, రామే చిత్తలయ: సదా భవతు మే, బో రామ మాముద్దర
రామునిక౦టే అధికమైన లక్ష్యము మరొకటి లేదు. నేను రాముని యొక్క దాసుణ్ణి. నిర౦తరము రామునియ౦దే నాచిత్తము లీనమగును గాక! ఓ రామా! నన్నుద్ధరి౦పుము అని ప్రతి రామభక్తుడు, రామదాసుడు, స్తుతి౦చాలి.
శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాన్క్షలను తెలియజేసుకుంటూ

కొంపెల్ల శర్మ - తెలుగురధం.www.facebook.com/kompella sarma

Monday, April 7, 2008

తెలుగుతల్లి గీత రచయితకు ఘన నివాళి

మా తెలుగు తల్లి గీతాచార్య - 'శంకరంబాడి సుందరాచార్యా వర్ధంతి (1977 మార్చి 8)
మా తెలుగు తల్లికీ మల్లెపూదండమా కన్నతల్లికీ మంగళారతులుకడుపులో బంగారు, కనుచూపులో కరుణచిరునవ్వులోసిరులు దొలరించు మా తల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేనుబిరాబిరా కౄష్ణమ్మ పరుగులిడుతుంటేనుబంగారు పంటలే పండుతాయిమురిపాల ముత్యాలు దొరలుతాయి.
అమరావతీ నగరి అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నాదాలుతిక్కయ్య కలములో తియ్యందనాలునిత్యమై, నిఖిలమై నిలిచియుండేదాక.
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తితిమ్మరుసు ధేయుక్తి,కౄష్ణరాయల కీర్తిమా చెవుల రింగుమని మారుమ్రోగేదాకనీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుద్దంనీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాంజై తెలుగుతల్లీ, జై తెలుగుతల్లీ.
- శంకరంబాడి సుందరాచార్య.
కాకతీయుల తర్వాత చెల్లాచెదురైన తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో మళ్ళీ ఒకేచోటకు, ఒకే నీడకు చేరుకుని అఖండ జాతిగా అవతరించినది. శుభకరంగా, సుందరంగా, సుఖప్రదంగా నిర్మించుకుంటూ, భవిష్యత్తును అఖండంగా ఊహించుకుంటూ పురోగమిస్తున్నది. అటువంటి ఆంధ్రవైభవాన్ని, పలువురు కవులు, కవయిత్రులు కొనియాడుతూ తమ భావాల్ని వివిధ సాహితీప్రక్రియల ద్వారా అంధ్రప్రదేశ్ లోనే కాదు, విశ్వవ్యాప్తంగా మారుమ్రోగేటట్లు దశదిశలా వ్యాప్తి చేయడం జరుగుతూంది.
తెలుగుతల్లిని - సాధుజన కల్పవల్లి గాను, లలిత సుగుణజాల, తెలుగు బాలగాను వర్ణించారు. అలాగే తెనుగుదనం వంటి తీయదనము లేదు, తెనుగు కవులవంటి ఘనులు లేరు అని కూడ అన్నారు.
'సుందరామయం ఈ తెలుగుతల్లి, ఆయన బిడ్డ
తెలుగుతల్లిని వర్ణించడం కేవలం మాటల వల్ల సంభవం కాదు. అలోచనలు, భావాలు, అనుభూతులద్వారానే తెలుగుతల్లి సమగ్ర సంపూర్ణ రూపాన్ని ప్రతిష్టించడం సాధ్యం అవుతుంది. అటువంటి తెలుగుతల్లి స్వరూపాన్ని, తనదైన భావాల్ని పొందుపరచి, సరళ సుందరశైలీస్థాయిలో వర్ణించి, తన కవితను చిరస్థాయిగా సుస్మరణీయం చేసుకున్న అర్హత, సాధికారత ఎవరికో కాదు, కేవలం, ఒకే ఒక వ్యక్తికి చెల్లుతుంది. ఆయన సామాన్యుడు, మధ్యతరగతి జీవి మధ్యగతిలో చిందిస్తున్న మందహాసం పుష్కళంగా ప్రకటించిన వ్యక్తి, జీవనోపాధికోసం గావించిన ఉపాధ్యాయవౄత్తి తోపాటు, ప్రవౄత్తిగా దేశభక్తి, సాహిత్యంపై మక్కువ, తెలుగు భాషాసంస్కౄతులపై మహామక్కువ, ప్రేమ, గౌరవాభిమానాలు. ఈ వన్ని కలసి, రూపొందిన వ్యక్తి. ఆయనే - శంకరంబాడి సుందరాచార్య.
తెలుగుతల్లి విశిష్టత
శంకరంబాడి వారు అలవోకగా రచించిన భావోద్వేగపూరిత రచన 'మా తెలుగుతల్లికి మల్లెపూదండా అన్న భావకవితకు ఆంధ్రదేశం నీరాజనం పట్టుతుంది అనిగాని, ఈ కవితను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆస్థానకవితగా ఎన్నుకుంటుందని గాని, సుందరాచార్యులకు ఎన్నడు కలనైన భావం వచ్చి వుండదు. ఈ దత్తత సమాన స్వీకారం, తెలుగుతల్లికి, తెలుగుతల్లి ముద్దుబిడ్డలకు కూడ సంతోషజనకమైంది. తెలుగు మనసు, తెలుగు హౄదయస్పందన వున్నంతకాలం ఆచార్యులవారి కవిత దర్శనీయమవుతూనేవుంటుంది.
తెలుగుతల్లిని తీర్చిదిద్దిన తీరుతెన్నులు
కరుణ, చిరునవ్వులు, సిరులు దొరలించు బంగారు కడుపు పేగు కలిగిన మా తెలుగు తల్లి కి మల్లెపూదండతోపాటు, మంగళారతుల్ని ప్రసాదించారు. శంకరంబాడి వారు, తన భావకవితలో, గోదారిని గలగలా కదలించారు. బిరబిరా పరుగులెట్టించారు, కౄష్ణవేణమ్మను. మరి సస్యశ్యామలం, సుసంపన్నత, నిత్యకళ్యాణం, పచ్చతోరణం రావలసినదే. బంగారుపంటలు పండినప్పుడు, కర్షక సుక్షేత్రాల్లో ముత్యాలు దొరలవలసినదే. అజరామరమైన లలితకళలైన - శిల్పం, సంగీతం, కవిత్వం వెరసి సోదాహరణంగా - అమరావతినగరాన్ని, త్యాగయ్యగొంతుని, తిక్కన్న కలాన్ని ముప్పేటలల్లారు, బహు అపురూపంగా, నాదభరితంగా, మధురరసాస్వాదనంతో అలరించారు. సంస్కౄతీకళాపర్వాలతో పాటు, ఆచార్యులవారు - భక్తి, శక్తి, యుక్తి, కీర్తిని చతురంగ బలాల్ని అతి చతురతతో రంగరించారు. మరువలేని మాణిక్యాలను - రుద్రమ్మ, మల్లమ్మ, తిమ్మరుసు, రాయలను తనదైన చతులశైలితో రచనను అల్లారు. ఇన్ని సొబగులు పొందిన శంకరంబాడి వారి తెలుగుతల్లి వైభవం రింగురింగుమని మారుమ్రోగుతూనే వుంటుంది. తెలుగుతల్లి ఆటపాటల్ని జరుపుకుంటూనే వుంటారు మన ముద్దు బిడ్డలు. తెలుగుతల్లికీ, తెలుగుతల్లికవితానిర్మాత - శంకరంబాడి సుందరాచార్యులకు, శతసహస్ర వందనాభివందనాల్ని అర్పించుకొంటూనే వుంటాం. వుండాలి. శంకరంబాడి సుందరాచార్యులవారు తెలుగుతల్లిని, తెలుగుప్రజలకు 1977, ఏప్రిల్ 8, న భౌతికంగా దూరమయినా, ఆచార్యవ్యక్తిత్వం ఆచంద్రతారార్కమై నిలుస్తుంది. తెలుగువైభవం, తెలుగుదనం, 'మాతెలుగు తల్లీని గానం చేసినప్పుడల్లా, స్మరించినప్పుడల్లా, మనందరి ముందు ఆచార్యులు వారు, తెలుగుతల్లితో పాటు ప్రత్యక్షం అవుతారు. యిది తధ్యం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఈ రోజు నివాళి అందించాల్సిన సమయం.
జై తెలుగుతల్లీ!

కొంపెల్ల శర్మ - తెలుగురధం.

ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రపంచ ఆరోగ్య దినం - 7 ఏప్రిల్
ఆరోగ్యమే మహాభాగ్యం
'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్నది ప్రాచీనమైన నానుడికి వివరణ అన్యధా అనవసరం. ధౄఢమైన, ఆరోగ్యవంతమైన శరీరం ఒక మహాసామ్రాజ్యం - అన్నాడు గోల్డ్ స్మిత్. శారీరక మౌఢ్యమే సోమరితనం; మానసికమైన సోమరితనమే మౌఢ్యం అని కూడ ఒక అనుభవజ़్జుడు పలవరించాడు. మనలోని సహజశక్తులే మన అనారోగ్యానికి నిజమైన ఔషధాలు అన్న సహజమైన సత్యాన్ని మనందరం మరచిపోయామన్నది అక్షరాల నిజం. అందుకే, అనారోగ్యంలో మనం ఏమిటో నిజంగా తెలుస్తుంది, అని ఇటాలియన్ సామెత ఒకటి వుంది. అది నిజమే కదా. వ్యక్తికి అనారోగ్యం ఆవహిస్తే, దానికి వ్యతిరేకంగా వైద్యుడేకాదు, రోగికూడా పోరాటం చేయాలి. అందుకనే, అనారోగ్యం దరికి రాకుండా, నివారణ, జాగ్రత్త చర్యలు చేపట్టవలసిన అవసరాన్ని వారి వారి ఆరోగ్యం దౄష్ట్యా గుర్తించాలి.
ఆరోగ్యం - అనారోగ్యం మధ్య
దేహం ఒకటి వుందని గుర్తుకు రానీయక పోవడమే ఆరోగ్యం అని అంటాడు ప్రముఖ చలం, మ్యూజింగ్స్లో. నిరంతరం గుర్తుకు వచ్చేలా చేసుకోవడమే బహుశ అనారోగ్యానికి తార్కాణం అనే చెప్పాలి కదా. చికిత్స అనారోగ్యంకన్నా హీనమైంది అని గుర్తించాలి. ఆరోగ్యం మాట ఎలా వున్నా, అనారోగ్యపు ఛాయల గురించి ఆలోచించకూడదు. అస్సలు బాగా తిని తాగడమే ఆరోగ్గేనికి సూత్రం అని రావిశాస్త్రి, బంగారిగాడికత లో ప్రస్తావించాడు. ఈ భావాన్నే, ఎప్పుడో - యధాకాల భోజనం ఆరోగ్యపదం - అని చరకుడు అభిప్రాయపడ్డాడు. మందులతో బతకటం మాత్రం ఘోరసమానం. పంటినొప్పికి ఓర్పుతో చికిత్స చేసే తత్వవేత్త ఇంకా పుట్టలేదు అని అంటాడు షేక్స్ పియర్. ఎవడి పన్ను నెప్పి వాడికే తెలుస్తుంది. హుటాహుటిన పీకేసే దంతవైద్యుడికి ఏమి తెలుస్తుంది. పీకేసిన దంతాలకు ఖరీదుకట్టిన మొత్తం ఎలా వసూలు చెయాలా అని సతమతమవుతూండారు, మన దంతమంతులు.
ప్రపంచ ఆరోగ్య దినం ( ఏప్రిల్ 7 ) సందర్భంగా అందరం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక, అనారోగ్యంతో బాధపడుతున్న బీదప్రజానీకానికి ఎవరికి తోచినంత సహాయ సహకారాల్ని అందించాల్సిన అవసరాన్ని గుర్తించి కార్యోన్ముఖులుగా మారి, ముందుకు నడవండి, నడిపించండి.
ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా, అందరికీ ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన జీవితాన్ని ప్రసాదించాలని సకల దేవతామూర్తుల్ని ప్రార్ధిస్తున్నాం.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Saturday, April 5, 2008

'మహిమాన్విత మాయావి' కాలగమనంలో - ఉగాది

కాలం - మహిమాన్విత మాయావి
సౄష్టిక్రమం
చరాచరాత్మకమైన ఈ జగత్తుకి కర్త నారాయణుడు. సౄష్టి చెయ్యవలసే కాలం వచ్చిందని, 'మహత్తూని రూపొందించాడు. సాత్త్వికము, రాజసము, తామసము అని మహత్తు మువ్విధాలు. వైకారికము, తైజసము, భూతం తామసం. మూడు కలసి వికారం. ఈ వికారమే 'అహంకారం' - ఆ మహత్తునుంచే వచ్చింది. రూపొందిన ప్రాణులలో, ఆవశ్యకమైన ధ్వనిప్రధానంగా ఆకాశం, స్పర్శప్రధానంగా వాయువు, రసమ్రధానంగా జలం, గంధప్రధానమైన పౄధివి - మాత్రరూపాలుగా భూతసౄష్టి జరిగింది. ఈ సౄష్టి తామసమైన అహంకారం నుంచి ఏర్పడింది. అలాగే, జ़్జానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సులతో ఒక రూపం ఏర్పడడం, ఒక అండం, గ్రుడ్డురూపంతో సౄష్టి జరిగింది. అదే మానవులకు, కొండలకు, సముద్రాలకు, ద్వీపాలకు, అడవులకు, క్రిమికీటకాదులకు మూలపదార్ధం అయింది. హరి రజోగుణమూర్తియై బ్రహ్మరూపముతో సౄష్టికర్త కల్పాంతం వచ్చేవరకు నరసింహాది రూపాలతో ఆ సౄష్టిని పాలిస్తూ, లయ సమయం రాగానే రుద్రరూపంతో అంతమొందిస్తున్నాడు. అదీ సౄష్టికధ. అవిఛ్ఛన్నమైన సౄష్టియందు కాలం అనంతమైంది. భగవత్స్వరూపమే కాలమని శౄతులు ఘోషిస్తున్నాయి. కాలం లేక మానవ మనుగడ లేదనడం సత్యం. యుగాలు, మన్వంతరాలు, కల్పాలు మొదలుగా బ్రహ్మమానం వరకూ కాలనిర్ణయాల్ని వివరించడం జరిగింది. అయితే సూక్ష్మాతిసూక్ష్మమైన మానవకాలాన్ని గుర్తించడం మాత్రం బహు దుర్లభం.
కాలమానం
సౄష్టికార్యక్రమంలో ఆయు: ప్రమాణం నూరేళ్ళు. ఆ గణనం యిలా సాగింది. పద్దెనిమి నిమిషాలు ఒక కాష్ఠ. ముప్ఫై కాష్ఠలు ఒక కళ. ముప్ఫై కళలు ఒక ముహూర్తం. ముప్ఫై ముహూర్తాలు ఒక అహోరాత్రం. అహోరాత్రం అంటే ఒక పగలు, ఒక రాత్రి - అది మనుష్యమానం. అలాంటి పదునైదుదినాలు ఒక పక్షం. రెండు పక్షాలు ఒక నెల. ఆరు నెలలు ఒక ఆయనం. వాటికి ఉత్తరాయణం, దక్షిణాయణం అంటారు. ఈ రెండు ఆయనాలు కలిసి ఒక సంవత్సరం. దేవతలకు దక్షిణాయనం ఒక రాత్రి. ఉత్తరాయణం ఒక పగలు. మానవుల గణనలో ఒక మాసం - పితౄదేవతలకు ఒక దినం. వసువులకు ఒక దినం - మానవులకు ఒక సంవత్సరం. దేవమానములో వెయ్యి సంవత్సరాలు ఒక యుగం. అదే త్రేతాదులు. అలాంటి యుగాలు వెయ్యి బ్రహ్మకు ఒక దినం. బ్రహ్మకు ఒక దినమైన కాలంలో పద్నాలుగురు మనువులు ప్రవర్తిస్తారు. ఒక మన్వంతరం ఇంద్రాదులకు దేవమానం ప్రకారం కొన్ని వేల సంవత్సరాల కాలం అవుతుంది. విశ్వసౄష్టికి ముంది దేవతలను, పితౄదేవతలను ఈ వరుసలో గంధ్వరులను, రాక్షసులను, యక్షులను, పిశాచాలను, గుహ్యకులను, ౠషులను, విద్యాధరులను, మనుష్యులను, పశువులను, పక్షులను, స్థావరములను, పిపీలికలను, పాములను సౄష్టించాడు. ఆ తర్వాత గుణకర్మ విభాగాలతో నాలుగు వర్ణాలను ఏర్పరచడం జరిగింది. సౄష్టిని ఇలా పగలు నడిపి రాత్రికాగానే ముల్లోకాలను ఉపసంహరించి, ఆ ప్రభువు ఆ రాత్రి శేషశాయిపై యోగనిద్రలో ఉంటాడు. ఆ రాత్రినే కల్పాంతమంటారు. దానికే బ్రహ్మకల్పమని పేరు. ఇలా సౄష్టించి నైమిత్తికమనే ప్రళయంలో ఆ సౄష్టిని సంహరించి, ఆదిదేవుడైన శ్రీహరి యోగనిద్రాముద్రితుడవుతాడు.
రోజులు - సంవత్సరాలు
భూమి గుండ్రముగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతున్నందున ఎదురుగా ఉన్న సూర్యగ్రహం వెలుగు (ఎండ) భూమిపైన ఒకే ప్రక్కన పడుతుంది. అంటే సూర్యునికి ఎదురుగా వున్న భూభాగముపైన ఎండ పడుతుంది. వెనుక వైపు పడదు. కాబట్టి చీకటిగా ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నందున సూర్యకాంతి మొత్తం భూభాగంపై పడుతూంది. కనుక ప్రతి భూభాగానికి వెలుతురు (పగలు), చీకటి (రాత్రి) క్రమంగా మారుతూంటుంది. ఇలా మనకు పగలు, రాత్రులు ఏర్పడుతున్నాయి. అలా మనకు పగలు, రాత్రులు ఏర్పడుతున్నాయి. ఒక పగలు, ఒక రాత్రి కలిపి ఒక రోజు అనుకుంటున్నాం.
రోజు నుంచి సంవత్సరం
కనురెప్ప పాటు కాలం సెకను, అరవై సెకన్లు ఒక నిమిషం, 60 నిమిషాలు ఒక గంట, పన్నెండు గంటలు పగలు, మరో పన్నెండు గంటలు రాత్రి, పగలు, రాత్రి కలసి ఒక రోజు అవుతుంది. పదిహేసు రోజులు ఒక పక్షం, రెండు పక్షాలు ఒక నెల, పన్నెండు నెలలు ఒక సంవత్సరం. పన్నెండునెలలు ఒక సంవత్సరం. ఫిబ్రవరి సాధారాణంగా యిరవై ఎనిమిది రోజులు. కాని, నాలుగు సంవత్సరాలకొకసారి, ఆ నెలలో 29 రోజులుంటాయి. దాన్ని లీపు సంవత్సరం, ఆ సంవత్సరం మూడొందల అరవైఆరు రోజులుంటాయి. ఒక సంవత్సరానికి, ఏభైరెండు వారాలు, పన్నెండు నెలలు, మూడు కాలాలు, ఆరు ౠతువులు, రెండు ఆయనాలు వుంటాయి.
నెలలు, ౠతువులు, కాలాలు, సంవత్సరాలు
సంవత్సరానికి మూడు కాలాలు - ఆరు ౠతువులు - పన్నెండు నెలలు.
వేసవికాలం - వసంత ౠతువు (చైత్ర, వైశాఖం), గ్రీష్మ ౠతువు (జ్యేష్ఠ, ఆషాఢం)వర్షాకాలం - వర్షౠతువు (శ్రావణం, భాద్రపదం), శరదౄతువు (ఆశ్వయుజం, కార్తీకం)చలికాలం - హేమంతౠతువు (మార్గశిరం, పుష్యం), శిశిరౠతువు (మాఘం, ఫాల్గుణం)
తెలుగు సంవత్సరాలు - 60. 'ప్రభవా నుంచి 'క్షయా వరకు - ఒక ఆవౄత్తం.
జ్యోతిషశాస్త్రం - కాలక్రమానుసారం
జ్యోతిషశాస్త్రపరంగా, కాలక్రమానుసరణ ఈ విధంగా చెప్పబడింది అని పండితుల అభిప్రాయం.
క్రీ.పూ.10000 కు ముందు కాలం - అంధకారయుగం.క్రీ.పూ.10000 నుండి క్రీ.పూ.500 వరకు - ఉదయకాలం.క్రీ.పూ.501 నుండి క్రీ.శ. 500 వరకు - ఆదికాలం.క్రీ.శ.501 నుండి క్రీ.శ. 1000 వరకు - పూర్వ మధ్యకాలం.క్రీ.శ.1001 నుండి క్రీ.శ. 1600 వరకు - ఉత్తర మధ్యకాలం.క్రీ.శ.1601 నుండి క్రీ.శ. 1946 వరకు - ఆధునిక కాలం.
వేదకాలానికి ముందుగానే జ్యోతిశ్శాస్త్రం అభివౄద్ధి చెందింది. వేదకాలం అనేదానికి నిర్వచనం చెప్పడం చాలా కష్టతరమైనా, క్రీ.పూ.6000 సంవత్సరాలు వేదకాలం అని పండిత బాలగంగాధర తిలక్ తెలిపారు.
ఉత్తరధ్రువ హి ప్రళయానంతర యుగారంభం క్రీ.పూ.10000 లేక 8000, అదితి లేదా పునర్వసు యుగం క్రీ.పూ. 8000 - 5000 ప్రాచీన వైదిక విజ़్జానం మౄగశీర్ష యుగం క్రీ.పూ. 5000 - 3000 వేద విజ़్జానం భద్రపరపడిన కాలం కౄత్తికాయుగం క్రీ.పూ. 3000 - 1000 సామవేదం అధర్వణ వేదం సమగ్రత పొందిందని కూడ పలువురి పండితుల భావన. ఈ విధంగా వేదయుగం క్రీ.పూ.10000 - 1400 గా చెప్పబడిందని, తరువాత కాంతకాలం, అంధకారయుగాలుగా చెప్పవచ్చని పలువురి భావన.
కాలం - కాల విభజన
ప్రాచీనకాలం నుండి కాలాన్ని గుర్తించడం అనేది సాంఘికజీవితంలో ప్రాధమికావసంగా పరిగణనలోకి వస్తూంది. అసలు కాలం అంటే ఏమిటి? క్రమంగా రెండు కాలవ్యవధుల్లో వరుసగా సంభవించు సంఘటనలు మధ్యన వుండే వ్యవధి కాలం అని చెప్పబడింది. ఈ భూమిపై కాలజ़్జానాన్ని కలిగించేవి ఆకాశంలోని జ్యోతిర్గోళాలే. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, నక్షత్రముల నడకల ఆధారంగా కాలగణన చేసేవారు. ఇదే అన్నింటికన్నా ముందు గుర్తించిన కాలవిభజన, తరువాత కాలంలో సాంఘిక జీవనం సంక్లిష్టం కావడంతో స్థూలంగా, సూక్ష్మంగా కాలనిర్ణయం చేయవలసివచ్చింది. ఆ క్రమంలో అనేక కాలవిభజనలు ఏర్పడ్డాయి. రోజులు, ఝాములు, ఘడియలు, విఘడియలు, లిప్తలు, వరలు -- శతాబ్దములు, దశాబ్దములు, సహస్రాబ్దములు, యుగాలు, కల్పాలు - ఈ విధంగా చిన్న, పెద్ద కాల విభజనలు జరిగాయి.
సూర్యసిద్ధాంతంలో కాలం గురించి యిలా ప్రస్తావించబడింది.
లోకానా మంతకత్ కాల: కాలోస్య: కలనాత్మక:తద్విధాస్థూల సూక్ష్మత్వా సూర్తశ్చా మూర్తి ఉచ్యతే.
ఆ సౄష్టిలో ప్రళయాంతంగా ఉండేకాలం మహాకాలం, మానవుడు కొలవదగు కాలం కలనాత్మకమని చెప్పి తిరిగి ఆ కలనాత్మక కాలం మూర్తకాలమని, అమూర్తకాలమని, రెండువిధాలుగా చెప్పబడింది. మహాకాలం కొలవడానికి ఎలా సాధ్యపడదో అదేవిధంగా అమూర్తకాలం కూడా కొలవడానికి సాధ్యపడదు.
యుగాలు - విభజన
మనకు చెప్పబడిన గ్రహాలు తొమ్మిది, నవగ్రహాలు. ఈ నవగ్రహాలు, వాటికక్ష్యా దూరబిందువులు, వాటి కక్ష్యలు సూర్యుని మార్గాన్ని ఖండించే బిందువులు. ఇవన్నీ 'అశ్వనీ నక్షత్రంతో కలిసి ఉన్న కాలం నుండీ, 'కాలం లెక్కింపూ మొదలయిందని పూర్వీకుల భావన. ఈ నవగ్రహాల చలన బిందువులన్నీ తెలుసు కనక, వాటి ప్రదక్షిణ కాలాలన్నీ పూర్ణ సంఖ్యలో ఉండడానికి ఎంత వ్యవధి కావాలో,కనిష్ఠ సామాన్య గుణిజాన్ని లెక్కవేసి, ఆ కాలవ్యవధిని ఒక 'కల్పకం' అన్నారు. అది 432 కోట్ల సౌర సంవత్సరాలకు సమానం. అంటే ఒక కల్పక ఆరంభంలోనవగ్రహాలన్నీ అశ్వనీ నక్షత్రంలో కలిసి ఉన్నట్లయితే, మళ్ళీ మరోకల్పక ఆరంభంలో కూడా అలాగే ఉంటాయి. ఈ కల్పకంలో 1000వ వంతును (అంటే 43,20,000 సం.) ఒక 'మహాయుగం' అన్నారు. ఈ మహా యుగాన్ని, 4 యుగాలుగా విభజించారు. ఒక మహాయుగంలో పదవవంతు కలియుగం, కలికి రెట్టింపు ద్వాపరం, కలికి మూడు రెట్లు ద్వాపరం, నాలుగు రెట్లు కౄతయుగాలుగా చెప్పారు. యుగాల్ని నాలుగు - కౄత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు. వీటి కాల పరిధి - కౄత (17,28,000), త్రేతా (12,96,000), ద్వాపర (8,64,000) మరియు కలి (4,32,000) సంవత్సరాల పరిమితిగా నిర్ణయింపబడ్డాయి. ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగంగాను, 71 మహాయుగాలు ఒక మన్వంతరంగాను పరిగణించారు. అలాంటి 14 మన్వంతరాలు కలిస్తే, ఒక కల్పకం. అదే బ్రహ్మదేవుని గారికి (అనగా ప్రకౄతికి) ఒకకల్పకకాలం ఒక పగలుగాను, మరోకల్పకం రాత్రిగాను గణనం. అంటే, 432 కోట్ల సంవత్సరాలని చెప్పుకునే కాలంతో ప్రకౄతి తిరిగి ప్రారంభమవుతుంది. బ్రహ్మదేవునికి ఒక పగలు, ల్క రాత్రి అంటే - రెండు కల్పకాల కాల వ్యవధి. ప్రకౄతి ఒక గ్రహంపై అంతరించి, మళ్ళీ మరో గ్రహంపై ఉద్భవించడానికి మధ్య నుండే కాలం 'మరోకల్పకం'. దేన్నే బ్రహ్మదేవుని రాత్రీ అంటారు. పురాణాలు చెప్తున్న ఈ కల్పకాల సిద్ధాంతం, ఆధునిక శాస్త్ర విషయాలకు అనుకూలంగా ఉందని చెప్తారు. అయితే, యింతటి బౄహత్తర కాలమానాన్ని భూమిపై మరోజాతి ఏదీ చెప్పలేకపోయింది, అదే మన హిందూజాతి ఘనత!. భూమి మీద సూష్టి ప్రారంభమై ఇప్పటికీ సుమారు 200 వందల కోట్ల సంవత్సరాలైనట్లుగాను, హిందువులు తమ బౄహత్తర కాలమానంలో చెప్పిన విషయాలు, ఆధునిక శాస్త్రవేత్తల అంచనాలతో సరిపోవడం నిజంగా మనకు గర్వకారణం.
ప్రస్తుతం కలియుగంలోని 5109 వ సంవత్సరం లోకి అడుగిడుతున్నాం. శ్రీమత్ శంకర భగవత్పాద పూజ్యావతాబ్దం 2079, క్రీ.శ. 2008-09, శాలివాహన శకపు 1930, హిజరీ 1428-29, ఫసలీ వత్సరపు 1416-1417 లోకి ప్రవేశిస్తున్నం. అలాగే, స్వతంత్ర భారతావని తన శకాన్ని 61-62 వ సంవత్సరంలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం శ్రీ సర్వజిత్ సంవత్సరం పూర్తి కావించుకుని, 22వ సంవత్సరం - శ్రీ సర్వధారి లోకి ప్రవేశించడం ప్రవేశిస్తోంది. ఈ సర్వధారి క్రితం సారి 1948, 1888 లో వచ్చాయి. భవిష్యత్తులో 2068 లో పున:ప్రవేశం చేస్తుంది. అరవై సంవత్సరాల ఆవౄత్తంలో, వచ్చే సంవత్సరం - శ్రీ సర్వధారి - సర్వజిత్ నుంచి వాయనం అందిపుచ్చుకొంటోంది. 1948, 2008, 2068 సంవత్సరాల్లోని కధనదౄశ్యం. శకాలు - కాలమానం
సంవత్సరాల లెఖ్ఖల కోసం శకాలు ప్రారంభమైనాయి. పూర్వంనుంచి, మనదేశంలో అనేక శకాలు వాడుకలోకి వచ్చాయి. ముఖ్యంగా - శాలివాహన శకం (దక్షిణ భారతదేశం), విక్రమార్క శకం (ఉత్తరభారతదేశం) పాటించడం పరిపాటి అయింది. భారతదేశపు స్వాతంత్ర్యం తర్వాత, దేశం మొత్తానికి ఒకే శకం ఉండాలన్న భావనతో, శాలివాహనశకాన్ని జాతీయశకంగా నిర్ణయించారు. శ్రీ వౄష నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ అష్టమీ శుక్రవారం 1924 (పంతొమ్మిది వందల యిరవైనాలుగు) శకారంభమని గ్రహించాలి.
రోజుకు - ఉదయం బాల్యం. పగలు యవ్వనం. సాయంత్రం వార్ధక్యం. రాత్రి మౄత్యువు. పునరపి జననం. ఇది ప్రకౄతి విధానం. సమస్తానికి వర్తిస్తుంది.
కాలోయం బ్రహ్మ:
కాలోయం బ్రహ్మ: కాలమే బ్రహ్మయగుచున్నాడు. కాలానికి, బ్రహ్మకు ఆద్యంతాలు లేవు. మానవుడు తన సౌకర్యం కోసం సంవత్సరాన్ని ఓ కొలతగా పెట్టుకున్నాడు. భూమి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చింది సంవత్సరం. కాని ఆరు గంటలను లెక్కించలేకపోతున్నాడు. అందుకే అధిక మాసాలు, లీపు సంవత్సరం మొదలైంది. నక్షత్రం, తిధిలాంటివాటి ప్రమాణాల్లోన్ని హెచ్చుతగ్గులు కలగడం, ఆయనధర్మాలనిబట్టి, కొంతకాలం పగటికాలం, మరికొంతకాలం రాత్రికాలం, అధికంగా సంభవిస్తాయి. ఫలితంగా, చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించేవారు అధిక, శూన్య మాసాలను ఎదుర్కొనవలసివస్తోంది. సూర్యుడు మీనరాశి (చైత్రం), మిధునరాశి (ఆషాఢం), కన్య (భాద్రపదం), ధను:రాశి(పుష్యం) శూన్యమాసాలు అవుతాయి. ఏ మాసంలోనైనా, రవికి వేరొక రాశియందు ప్రవేశించుటయుండదో (శుక్లపక్షపాడ్యమి నుంచి అమావాస్య వరకున్న కాలం) అధికమాసంగాను, ఒకేమాసంలో రెండు రాశుల్లో సూర్యప్రవేశం జరిగిన క్షయమాసంగాను, శుభకర్మలకు యోగ్యంకానివిగా చెలామణి అవుతున్నాయి.
స్వామి బొంగరం తిప్పాడు, భూమి గిరగిరా తిరుగుతూనే వుంది.
కాలవిభాగం - యుగాలు, సంవత్సరాలు, ఆయనాలు, ౠతువులు, మాసాలు, రోజులు, అదే విధంగా ప్రాణి, తౄటి వరకు కాలవిభజన జరిగింది.
వివిధ సంవత్సరమానాలు - సౌర (365 1/2), సావన (360), నక్షత్ర (36.256), చాంద్ర (354).
మన తెలుగు వారిదిచాంద్రమానం. మన నెలలు చైత్ర, వైశాఖలు లా కొనసాగుతాయి. చాంద్రమానపు తెలుగు నెలకు ముప్ఫై రోజులుండవు. అయినా కాలపురుషుని గడియారానికి సూర్యభగవానుడు పెండ్యులం అనే చెప్పాలి.
కాలం సాగే తీరుతెన్నులు
తౄటి - లిప్త
అతి సన్నని మొన కలిగిన సూదిని తామరపువ్వు రేకుపై గుచ్చిన దాని మొదటిపొర దిగుటకెంత సమయం పట్టునో, దానిని తౄటికాలంగా చెప్పారు. దీన్నే పుష్కరకాలం అని, దీనిని గుర్తించుటకు బ్రహ్మకైనా సాధ్యపడదని పండితుల భావన. అలాంటి వంద తౄటి కాలాలు - ఒక నిమేషము (నిమిషం), యిరవైరెండు నిమిషాలు ఒక గుర్వక్షరం, అట్టివి పది కలసిన ఒక ప్రాణం, ఆరు ప్రాణములు ఒక వినాడిక, అరవై వినాడికలు ఒక నాడిక. ఈ ఘడియనే యిరవైనాలుగు నిముషములుగా వర్తమాన కాలమానం చెలామణిలో వుంది. ఒక ఘడియకు అరవై విఘడియలు, ఒక విఘడియకు అరవై లిప్తలుగా పరిగణనలో వున్నాయి. యిది తౄటి - లిప్త సంబంధ కాలప్రమాణం.
దైనందిక కాలస్వరూపం
దైనందిక జీవన విధానాల్లో కాలం యొక్క ప్రాముఖ్యం చాలా విశిష్టమైంది. చాంద్ర, సౌరాది మానాల రీత్యా కాలం - సంవత్సరం, ఆయనం, ౠతువు, మాసం, పక్షం, వారం, తిధి, నక్షత్రం, యోగ, కరణాది పంచాంగయుక్తమై కాలప్రమాణం సూచితమౌతోంది. భారతీయ సనాతన సంప్రదాయాన్ని బట్టి, సూర్యోదయం నుంచి దినం (రోజు, వారం) ప్రారంభమై, తిరిగి మరురోజు సూర్యోదయం వరకూ పరిగణనకు తీసుకోవడం, ఈ మధ్యకాలం అరవై ఘడియలు లేఖ యిరవైనాలుగు గంటలుగా శాస్త్రాలు నిర్ధారించాయి. ఒక దినం యొక్క ప్రమాణం అరవై ఘడియలు లేక యిరవైనాలుగు గంటలు. క్షణక్షణం చలించే భూమి యందు ఆయా కాలాల ప్రభావాల్ననుసరించి - నక్షత్రాత్మకమైన పన్నెండు రాశులుగా, ప్రతీదినం నిర్ణీత సమయాన భూమిపై తన ఛాయ(కాంతు)లను ప్రసరింప చేయగలుగుతున్నాయి. ప్రతీ రాశి కిరణశక్తి భూమిపై ప్రసరింపుచు యెంతకాలముండునో, ఆకాలమంతయు, ఆరాశి సంబంధిత లగ్నంగా భావించాలి. ఒక లగ్నం యొక్క కాలం సుమారు అయిదు ఘడియలుగా (రెండు గంటలు) భావించాలి. కొన్ని లగ్నాలు ఎక్కువ, తక్కువగా వుంటాయి. అట్టి లగ్న కాంతి కాలమందు ఒకానొక అత్యద్భుత రెప్పపాటు కాలం సంపూర్ణ శుభప్రదంగా వుంటుంది. దీన్నే 'సుముహూర్త పుష్కరకాలం' అని, ఈ కాంతి సూక్ష్మకాలంగాను, బ్రహ్మకైనా తరంకాదని తీర్మానించారు.
తమసోమా జ్యోతిర్గమయ - చీకటినుంచి వెలుగునకు సాగుదాం!

తెలుగువారి తొలి తెలుగు పండుగ - ఉగాది

"సర్వధారి" ఉగాది శుభాకాంక్షలు

'నీ' 'నా' భేదము లేక తెల్గుదనపున్నీరాజనాలిచ్చుచున్క్రానేవచ్చె మరో 'ఉగాదీ యదిగో! రాగిల్లు నెమ్మోముతోతేనెల్ జిప్పిలు నవ్వుదొంతరలతో, తీరైన వాల్చూపుతోమీనట్టింటిని భోగ, భాగ్య, శుభసమ్మేళంబు గావింపగన్.
కాలానికి నిజానికి యెల్లలంటూ లేవు. దానికి ఆది లేదు, అంతమూ లేదు. ఆద్యంతరహితమైన అనంత ప్రవాహంవంటిది కాలం. నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు; ఇవన్నీ కాల ప్రవాహంపై లేచి, తిరిగి దానిలోనే కలిసిపోయే చిన్ని, పెద్ద కెరటాలు. వీటిపై కొంత దూరం పయనించి, వీటితోపాటు తిరిగి కాలగర్భంలో కలసిపోయేవాడే మానవుడు. కనుకనే అతడి దౄష్టి సహజంగా ఆ కెరటాలపైనే. గడియారాలతో వాటిని కొలవడానికి మానవప్రయత్నం జరుగుతుంది. పంచాంగాలతో వాటి నడక తీరులను నిర్ణయించడానికి మానవులు తహతహలాడతారు. శకాలని, యుగాలని నాటి వర్గీకరణకు ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే యుంటాయి. దీన్ని షుష్కయత్నంగా వేదాంతులు నిరసించవచ్చు; వౄధాష్రమగా తత్వజ్ఞులు నిందించవచ్చు. కాని, జీవితమాధుర్యం దీనిలోనే వున్నది; జీవితసాఫల్యమూ దీనిలోనేవున్నది.
ఏ యుగంలోనైనా, ఏ షతాబ్దంలోనైనా, తుదకు ఏ సంవత్సరంలోనైనా మంచిచెడ్డలు, వౄద్ధిక్షయాలు మిశ్రమంగానే వుంటాయి. ఈ ద్వంద్వాలలో ఒకప్పుడు ఒకటి రెండవదానికంటే ఒక పాలు ఎక్కువ కావచ్చు; లేక తక్కువ కావచ్చు. అంతే తప్ప, సమస్తం మంచికాని, కేవలం చెరుపుకాని, పూర్తిగా అభివౄద్ధికాని, పూర్తి క్షయంకాని ఎప్పుడూ వుండదు.
అన్ని రోజులెట్టివో, పండుగరోజు లట్టివే. ఒక రోజు పండుగరోజు కావడానికి దానికి మనం ఆపాదించుకునే ప్రత్యేకతే కారణం, దానికి మనం సమకూర్చుకునే వైశిష్ట్యమే కారణం. ఇదే శకాలకు కూడా వర్తిస్తుంది. ఒకటి పాతశకం కావడం, మరొకటి కొత్తది కావడం, ఓకటి అంధకారభరితమైనది కావడం, మరొకటి మహోజ్జ్వలమైనది కావడం, కాలగతిపై ఆధారపడి వుండదు. శకాల స్వరూపాన్నీ, స్వభావాన్నీ నిర్ణయించేది కేవలం మానవప్రయత్నమె. మానవుడు మార్పు చెందనంతవరకు అది పాతశకం; మార్పు చెందితే అది నవశకం. అతడు అభ్యుదయపథాల మెట్టిదే, అది మహాశకం; అధోగతి పాలైతే అది హీనశకం.
పండుగలన్నీ సంవత్సరాని కొకసారి చొప్పున తిరిగి, తిరిగివచ్చేసే, అంతమాత్రం చేత వాటి అర్ధం తగ్గదు; అందం తగ్గదు; ఆనందం తగ్గదు; ప్రతి సంవత్సరం వచ్చేది కనుక వసంతం విలాసం తగ్గుతుందా? ప్రతి నెల వచ్చేది కనుక పూర్ణిమ శోభ తగ్గుతుందా? పౄకౄతి విలాసాలలోని నిత్యనూతనత్వం జాతీయ పర్వదినాలలో కూడా వుంటుంది. పైగా, మన ప్రధాన పర్వదినాలకు పౄకౄతివిలాసాలతో సన్నిహిత సంబంధం వున్నదికూడా. ఉదాహరణకు లేత చిగుళ్ళను, కొత్తపూవులను సంగారించుకొని వొయ్యారంగా వచ్చే వసంతునికి మనం పట్టే ముత్యాలగొడుగు - సంవత్సరాది.
ఏమైనా, జీవితాన్ని రోసినవారికి ఉగాది తక్కిన రోజులతోపాటు మరొక రోజు మాత్రమే కావచ్చు గాని, బ్రతుకును ఒక మహావరప్రసాదంగా భావించేవారికి మాత్రం ఉగాది కెంతో వైశిష్ట్యం వున్నది. అది మోడు మొక్కలనే కాక, వాడి వత్తలైన గుండెలను సహితం చిగురించజేస్తూ వస్తుంది. కొత్త పూబిందెలతో పాటు కొత్త ఆశలను, ఆనందాన్ని వెంటబెట్టుకు వస్తుంది. తియ్య మామిళ్ళతో పాటు తేనె పాటలు అందిస్తూ వస్తుంది. నిరుటి ఆశాభంగాలను, నిరుటి ఆవేదనలను తుడిచివేస్తూ వస్తుంది. కొత్త జీవితానికి ఆహ్వానాన్ని చేబట్టుకు వస్తుంది. యించువల్లనే అన్ని పండుగలలో ఉగాది మొదటిది మాత్రమే కాదు; అన్నిటికంటె గొప్పది కూడా!
తెలుగువారి పండుగలు

తెలుగునాట పండుగలు - పబ్బాలు, నోములు, వ్రతాలు, ఉత్సవాలు, ఊరేగింపులు, జాతరలు, కొలువులు తరతరాలుగా సమాజంలో నివివిధవర్గాలవ్యక్తుల్ని ఒక్కచోట చేరుస్తున్నాయి. ఎక్కువమంది పాల్గొనకపోతే పండుగలకు కాని, ఉత్సవాలకు కాని, ఇలాంటి మరే సాంఘికాచారాలకు కాని 'కళాకాంతులూ రావు. యిటువంటి ఉత్సవ సంప్రదాయాలను గురించిన ఉల్లేఖనాలు తెలుగు కావ్యాలలో పెక్కుచోట్ల కనిపిస్తూ, వీటి చరిత్ర సుదీర్ఘమైనదని నిరూపిస్తున్నాయి. 'శివరాత్రి మాహాత్మ్యం'లో వివిధ ౠతువులలో వచ్చే పండుగవర్ణనలు - నాగులచవితి, రధసప్తమి, మకరసంక్రాంతులు, 'సిహాసనత్వాత్రింశికాలో దివ్వెల పండుగ, 'పండితారాధ్యచరిత్రాలో పాల్కురికి సోమనాధుడు - దవన(ఏరువాక), నూలి (శ్రావణ) పూఋర్ణిమ పండుగలను, కాకతీయుల కాలంలో శ్రీకాకుళం తిరునాళ్ళ ప్రస్తిద్ధతను 'క్రీడాభిరామం'లో శ్రీనాధుడి ప్రస్తావన, తేలంగాణాలో నేటికీ దివిలి, పున్నమకు, అమావాస్యకు చేసే పూజలు,పండుగలు అనేకం సదాచార, సంప్రదాయాల్ని విశదపరుస్తున్నాయి. సంప్రదాయాలు లేకుండా ప్రయోగాలు, ప్రయోజనాలు లేవు. ఆదిలో లేనిది అంత్యంలో లేదు. తరతరాలుగా జనసమూహంలో నిలిచి ఉన్న నమ్మకాలు, సంప్రదాయాలు క్రియారూపాన్ని దాల్చగా పండుగలేర్పడ్డాయి. మొదట ప్రకౄత్యారాధనగా ప్రారంభమై, వ్యవసాయ సంస్కౄతికాలంలో స్పష్టరూపాన్ని పొంది, తర్వాతకాలంలో యింకా క్లిష్టస్వరూపం సంపాందించి, చివర ప్రాచీన ఆచారాల సూచ్యగుణాన్ని మాత్రంకలిగి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేవిగా పండుగలు రూపొందాయి. 'సాంఘిక సంక్షేమంకోసం విశేష సందర్భాలలో జానపద విశేషాలు, సంప్రదాయాల కలబోతగా ఆచరించే సంక్లిష్టమైన ఆంశమే పండుగ". పండుగలు ఏ విధంగా అవతరించాయి. ఎప్పుడు ఉద్భవించాయి, ఎందుకు, తిధుల ప్రవేశాల్లోనా లేక నిష్క్రమణాల వేళల్లో జరుపుకోవాలి అనే సిద్ధాంతుల తర్కాలకు కూడా అంతుచిక్కని రాజకీయపు అనూహ్యస్థితి-దుస్థితిగతులా అనే ప్రశ్నలకు సమాధానాలను రాబట్టడం చాలా కష్టం. ప్రకౄతికి సంబంధించిన పండుగలు, వ్యవసాయానికి సంబంధించిన పండుగలు చాలా ప్రాచీనమైనవని చెప్పవచ్చుగాని, ఖచ్చితంగా ఏ దశలో అవి వెలువడ్డాయని చెప్పడమూ కష్టమే. చాలా వరకు పండుగలకు మూలం ప్రాచీన కాలపు కర్మకాండలనడంలో సందేహంలేదు. మతం, జనానందం, యుద్ధాలు, సాహసకార్యాలు, అమరవీరులు, ఆత్మబలులు, సంస్మరణలు, జయంతులు, నీతిబోధనలు, ధార్మికుల కోసం కూడా కొన్ని పండుగలు ఉద్భవించాయి. తెలుగువారి పండుగలను ఒక్కొక్కొసారి ప్రత్యేకంగా వివరించడం కష్టం. ఉత్సవాలు, ఊరేగింపులు, జాతరలు కూడ ఒక విధంగా పండుగలే, నోములు, వ్రతాలు, పండుగలు కావని ఎవరనగలరు? అయినా మనంవాడుకునే పదాలను బట్టి వీటిలోనే కొన్నింటిని పండుగలని, కొన్నింటిని ప్రతాలని, కొన్నింటిని ఉత్సవాలని పిలవడం జరుగుతున్నది. తెలుగువారు పండుగలను ఆచరించేటప్పుడు ఏమేమి చేస్తారు అన్నది కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. పండుగలకు మనం చెప్పుకునే ఆచారాలు జానపదులకు, జ్ణానపధులకు, సంబంధించినవే కాని శిష్టులకు సంబంధించినవి కావు. ఎందుకంటే శిష్టుల పాలిటికి చాలా వరకు పండుగలు విలువను కోల్పోతున్నాయి. చివరికి మిగిలింది వేలయితే కొత్తగుడ్డలు కట్టుకోవడం, సుష్టుగా భోజనంచేయడం మాత్రమే. కాని జనపదులకు పండుగ వచ్చిందంటే ఎక్కడలేని సంభ్రమమూ వస్తుంది.
చాంద్రమానం
చాంద్రమానం - ఆంఢ్రుల పండుగలు చాలావరకు చాంద్రమానాన్ని అనుసరించేవి. కాలాన్ని గణించడానికి మనదేశంలో ఉండిన తొమ్మిదివిధాలలో ముఖ్యమైనవి - చాంద్రమానం, సౌరమానం. ఈ విషయంలో తెలుగువారు, కన్నడిగులు చాంద్రమానాన్ని, తమిళులు సౌరమానాన్ని అనుసరిస్తున్నారు. చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారికి మొదటిపండగ ఉగాది. యుగాదిని కూడా ఉగాదిగా చేసుకొని, అచ్చమైన తెలుగుపండుగలాగే ఆచరించే సంప్రదాయం మనది. యుగాది ఎందరికైనా ఉండవచ్చు. కాని తెలుగువారి ఉగాదికే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
ఉగాది
చైత్ర శుద్ధ పాడ్యమినాటి ఉగాదితో చాంద్రమానాన్ని అనుసరించే, తెలుగువారి క్రొత్తసంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటే సంవత్సరం ప్రారంభం అని అర్ధం. అందుకే దీన్ని 'సంవత్సరాదీ అంటారు. యుగాది అనికూడా వ్యవహరిస్తారు. ఈరోజే, విక్రమార్కుడు పట్టాభిషిక్తుడయ్యాడట. అందుచేత ఈనాటినుంచీ, విక్రమార్కశకం/యుగం ప్రారంభమయినట్లు కూడా పేర్కొంటారు. అయితే ఎప్పుడూ ఇలాగే జరుగుతుండినదని అర్ధంకాదు. రామాయణంలో 'పన్నెండో మాసమైన చైత్రంలో నవమి దినంనాడు శ్రీరాముడు జన్మించాడని చెప్పబడింది. అందువల్ల ఆ కాలంలో వైశాఖమాసం నుంచి క్రొత్తసంవత్సరం ప్రారంభమవుతుండినదని తెలుస్తున్నది. క్రీ.శ. 5వ శతాబ్దిలో వరాహమిహిరుడు చైత్రమాసంనుంచి క్రొత్తసంవ్త్సరం ప్రారంభమయ్యే సంప్రదాయాన్ని ప్రారంభించాడంటారు. ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్రలలో ఈ దినమే ఉగాదిని పాటిస్తున్నారు. ఉగాది జీవనంలోని సుఖదు:ఖాలను ప్రతిబింబించే ఉత్తమ పర్వదినం. కన్నడిగులు సుఖదు:ఖాలకు ప్రతీకగా వేపపూలను బెల్లాన్ని కలిపితింటారు. తెలుగువారి ఉగాది పచ్చడి సుఖదు:ఖాలను మాత్రమే కాక జీవితంలోని వగరును, రౌద్రాన్ని, పులుపును కూడా ప్రతిబింబింస్తుంది. పండుగలు సాంకేతికమైనవని చెప్పడానికి తెలుగు వారి ఉగాది పచ్చడి ఒక్కటే చాలు. వేపపూలు, కొత్తబెల్లం, ఉప్పు,కొత్తచింతపండు, పచ్చిమిరపకాయలు, మామిడిపిందెలు - కలిపిన ఉగాది పచ్చడి షడ్రుచులతో వింత అనుభవాన్ని కలిగిస్తుంది. పంచాంగశ్రవణం కూడా ఉగాది పండుగలో ఒక భాగమై పోయింది. పల్లెటూళ్ళలో ఇది కేవలం ఒక ఆచారంగా కాక, రాబోయే శుభాశుభాలను తెలుసుకోవాలనే ఉత్సుకతను రేకెత్తించే సందర్భంగా ఉపయోగిస్తుంది. సంవత్సరం పొడవునా మానవకోటి జీవనసమరంలోని మంచిచెడ్డలు, పాడిపంటలు, వర్షాలతీరు, గ్రహాలస్థితిగతులతో పంచాంగశ్రవణాన్ని పఠించి సందేశాన్ని అందించడం కూడ విశేషం. నరము నరమున నవనవాభ్యుదయము ప్రముఖకవి దాశరధి - తనకావ్యం, 'కవితాపుష్పకం' లో ఉగాది ప్రాముఖ్యతను ఆశాపూరితమైన భావనానుభూతిని వర్ణిస్తూ, "పాతబడిన ధరణి నూతతత్వము నందనచ్చె నీ నవీన వత్సరమ్ము! ఇంత ముసలి జగతి ఈనాడు యౌవనవంత మగుట యెంతో వింతకాదె?" అంటూ, 'నా కుగాదినాడు నరము నరమున నవనవాభ్యుదయము నాట్యమాడు, ఈ అశాంతధోరణికి ఎన్నడో ఒకనాడు శాంతినందుననుట భ్రాంతిగాదు" అన్నది తద్ధర్మకాలసంబంధితనానుడి అని చెప్పక తప్పదు.ఆశాభావం ఎక్కడుంటుందో, అక్కడే నిరాశానుభూతికూడ ప్రభవిస్తుంది. నాణానికి రెండు పార్శ్వాలు - ఆశ, నిరాశ. నిరాశలోంచే ఆశావాదం ఆవరిస్తుంది. 'నాకుగాదులు లేవు, నాకుషస్సులులేవు. నేను హేమంత కౄష్ణానంత శఋర్వరిని, నాకు కాలమ్మొక్కటే కారురూపు, నాశోకమ్ము వలెనే, నా బ్రతుకు వలె, నావలెనె" అన్నారు ప్రముఖభావసహజ కవి 'దేవులపల్లి కౄష్ణశాస్త్రీ తన కౄష్ణపక్షం కావ్యంలో. శ్రీ యుగాది వేంచేసెను శ్రీకరముగ రమ్ము రారమ్ము వేగ, పిండివంటల భుజియించి ప్రీతితోడ మంగళమ్ముల మాకు నొసంగు దేవ".అంతటి నిరాశావాదమే, అదే కలం 'స్వస్తి జగత్తునకగు, శ్రీరస్తు సదాశాంతిరాస్తటంచు వెలయు, విశ్వస్తుత భారతావాణి సుమస్తబకమువోలె లోకమస్తకము పయిన్" అన్నారు.
'సర్వజిట్ నుంచి 'సర్వధారీ
ప్రభవాది సంవత్సరాల్లో 21వ సంవత్సరం 'సర్వజిట్ నుంచి 22వది 'సర్వధారీ ప్రవేశిస్తున్న శుభ తరుణం యిది.
సర్వధార్యబ్ధికే భూపా: ప్రజాపాలన తత్పరం:ప్రశాంతవైరా సర్వత్ర బహు సస్యార్హ వౄష్టయ:
రాజులు ప్రశాంత మనస్కులై ప్రజాభిష్టంగా పరిపాలన చేస్తారు; పంటలు బాగా పండుతాయి. ధరలు అనుకూలంగా వుంటాయి. వర్షాలు అనుకూలంగా వుంటాయి. సర్వధారి సంవత్సరపతి విష్ణువు. ఫలితంగా ప్రజలు సుఖసౌఖ్యాలతో ఉంటారు. వీటితోపాటు, ధాన్యాదుల ధరలు సరసము, కష్టనష్టాల సంభవం, భయోత్పాతాలు, కలహాలు, అగ్నిభయాలు ఉంటాయి. మేఘాలు చేసే హడావుడి, స్వల్పవౄష్టి, ఖండవౄష్టి, ఆహారపదార్ధాల ధరల పెరుగుదల, దుర్భిక్షం, రోహారిష్టాలు కూడ ఉంటాయి. ప్రజలు కష్టనష్టాలను ఎదుర్కొనడం, సుభిక్షం, ప్రజోత్సాహ కార్యాలు, క్షేమారోగ్యాలు కూడ కలుగుతాయి.
ఉగాది సోమవారం రావడంతో - ప్రజలు సుఖసౌఖ్యాలతో ఉండడం, వర్షములు సమౄద్ధిగా కురవడం, పంటలు పండడం, ధాన్యం విశేషంగా ఫలించడం, పురోగతి, వౄద్ధి కలుగుతాయి అని పండితుల ఆశావాహ విశ్లేషణలు.
'సర్వధారీ ఉగాది - నూతన సంవత్సర పర్వదినాన సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత పొందాలని, ఆశీస్సులు అందించాలని, ఆ భగవద్ప్రార్ధన చేస్తూ, - తెలుగురధం శుభాభినందనలను అందిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.


తెలుగురధం - శ్రీ సర్వధారి ఉగాది శుభాకాంక్షలు


శ్రీ 'దుర్ముఖి' ఉగాది శుభాకాంక్షలు


'నీ' 'నా' భేదము లేక తెల్గుదనపున్నీరాజనాలిచ్చుచున్
రానే వచ్చె మరో 'ఉగాది' యదిగో! రాగిల్లు నెమ్మోముతో
తేనెల్ జిప్పులు నవ్వు దొంతరలతో, తీరైన వాల్చూపుతో
మీనట్టింటిని భోగ, భాగ్య,  శుభసంమేళంబుగావింపగన్.


పండుగలన్నీ సంవత్సరాని కొకసారి చొప్పున తిరిగీ, తిరిగీ వచ్చేవే. అంతమాత్రం చేత వాటి అర్ధం తగ్గదు; ఆనందం తగ్గదు; ప్రతి సంవత్సరం వచ్చేది కనుక వసంతం విలాసం తగ్గుతుందా? ప్రతి నెల వచ్చేది కనుక పూర్ణిమ శోభ తగ్గుతుందా? ప్రకృతి విలాసాలలోని నిత్యనూతనత్వం జాతీయ పర్వదినాలలో కూడా వుంటుంది. పైగా, మన ప్రధాన పర్వదినాలకు ప్రకృతి విలాసాలతో సన్నిహిత సంబంధం వున్నది కూడా. ఉదాహరణకు లేత చిగుళ్ళను, కొత్త పూవులను సింగారించుకుని వోయ్యారంగా వచ్చే వసంతునికి మనం పట్టే ముత్యాలగోడుడు - సంవత్సరాది. అదే, యుగాది, ఉగాది అని పిలవడం పరిపాటి అయింది.


'విజయ' కు వీడ్కోలు, 'దుర్ముఖి'ఉగాదికి  స్వాగతం చెబుతూ, షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదించి, కొత్త బట్టలను కట్టుకుని, ప్రత్యేకమైన పండుగ భోజనాన్ని ఆరగించి, బంధుమిత్రులకు ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఆనందంగా పండుగను జరుపుకోవాలని అభిలషిస్తూ, ఆ పరాత్పరుడు మరింత సుసంపన్నమైన, ఆరోగ్యవంతమైన జీవనాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ -

(కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ)
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
  

Tuesday, April 1, 2008

ఘనమైన చరితకు ఘనమైన సాక్ష్యాలు - ఏప్రిల్ 1

ఘనమైన చరితకు ఘనమైన సాక్ష్యాలు - ఏప్రిల్ 1
మన ఘనతలు మన ప్రవర్తనలను బట్టి వుంటాయి. అలాగే, ప్రతీ రోజు ఏదో ఒక ప్రత్యేకతని సంతరించుకుంటుంది. అలాగే, ప్రతీ నెలకూ కూడ అర్ధం, పరమార్ధం వెల్లడవుతాయి.
'ఏప్రిళ్ సార్ధకత
ఏప్రిల్ నెల మనకు సాధారణంగా ఒకటో తేదీ - 'ఆల్ ఫూల్స్ డే' తో ప్రారంభమై, చారిత్రాత్మక కధనాన్ని వ, ఆ రోజంతా వెధవాయితనానికి నిదర్శనంగా, ప్రదర్శనంగా దర్శనం అవుతుంది. ప్రతీ వ్యక్తి తాను మాత్రమే తెలివితేటలని పొందాననీ, అవతలి వారిని సునాయాసంగా తెలివితక్కువగా జమకట్టడం పరిపాటి అయింది. చారిత్రాత్మకంగా పరిశీలిస్తే, 'ఏప్రిళ్ నెల, లాటిన్ పదం - 'ఎపెరియో నుంచి వచ్చింది. అంటే, బహిరంగం. ఈ కాలంనుంచే యిటలీలో తొలకరి పూలు వికసించడం జరుగుతుందట. ఒక నెల పేరు వెనుక యింత కధ, కమామేషు దాగుంది.
ఏప్రిల్ 1 న 'ఆల్ ఫూర్స్ డే' ని జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
ఈ ప్రత్యేకతతోపాటు, ఈరోజు యింకా చాలావాటికి ప్రసిద్ధం అని చాలామందికి బహుశ తెలియపోవచ్చు. కనీసం యిప్పుడైనా వాటి గురించి తెలుసుకోవాలి కదా.
యిదే, ఆప్రిల్ 1 న, ప్రత్యేకతలు యిలా వున్నాయి.
దూరదర్శన్ ఆవిర్భావం దినం - 1976
భారతదేశపు సకల ప్రజావళికి కనీసస్థాయిలో వినోదాన్ని జరిపించడం.
కేంద్ర నేర పరిశోధన సంస్థ - 1963. నేరాలను పట్టుకోవడంలాంటి కార్యక్రమాల్లో తరచు పోల్గొనే, కేంద్ర నేర పరిశోధన సంస్థ (సి.బి.ఐ).
భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపన -1935
భారతీయ ఆర్ధికవిధానాల్ని రూపొందించడం, దేశపు ఆర్ధికపరమైన ప్రణాళికలను రూపొందింపజేసి రచించి అనుమోదంతో అమలుపరచే కార్యక్రమాన్ని నిర్వహించే ప్రముఖ సంస్థ.
ఆదాయపు పన్ను ప్రవేశపెట్టిన రోజు - 1869
భారతదేశంలో ఆదాయపు పన్నును ప్రవేశపెట్టడం 1869 లో జరిగినా, విశ్వవ్యాప్తంగా ఈ ఆదాయపు పన్ను గురించి విశ్లేషణ చేస్తే, ఆదాయపు పన్ను నేపథ్యం యిలా ప్రారంభమైంది.
ప్రభుత్వం తన కార్యక్రమాల నిర్వహణకు ప్రధానమైన ఆదాయాన్ని పన్నుల రూపంలో ప్రజల నుండి వసూలు చేస్తుంది. ఆదాయపు పన్ను ముఖ్యమైన పన్నుల్లో మొదటిది. ఈ ఆదాయపు పన్నుని మొదతగా, 1799 లో నెపోలియన్ కాలంలో ప్రాన్సులో ప్రారంభించబడింది. మహారాజు 'నెపోలియణ్ యుద్ధాలకు కావలసిన ఆదాయాన్ని తద్వారా సంపాదించేవాడట. అలా శ్రీకారం చుట్టబడి, ఈ రోజు మన బడ్జెట్ లో ముఖ్యాతిముఖ్యాంశంగా మారింది.
యిలా యిన్ని ప్రత్యేకతలను సంతరించుకున్న - ఏప్రిల్ 1 రోజుని కేవలం 'ఆల్ ఫూల్స్ డే' అని వెధవాయల పండగగానే పరిగణించడం, పైగా సమయాన్ని వౄధా చేయడం, భారతదేశం లాటి అభివౄద్ధి చెందుతున్న దేశపు ఉత్పాదక వ్యవస్థకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
కాలం వెళ్ళిపోతే, తిరిగిరాదు. సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీరోజుకు తగినంత సార్ధకతతో అర్ధాన్ని, పరమార్ధాన్ని పొందాలి.
సర్వేజన: సుఖినో భవంతు:
కొంపెల్ల శర్మ - తెలుగురధం.