Sunday, February 8, 2015


నాడు - ఈనాడు

చరిత్రలో - ఫిబ్రవరి 9

ఫిబ్రవరి 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 40వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 325 రోజులు (లీపు సంవత్సరము లో 326 రోజులు) మిగిలినవి.
సంఘటనలు
ప్రసిద్ద గాంధేయవాది, కుష్టువ్యాది పీడుతులపాలిట ఆపద్భాందవుడుగా పిలువబడే మురళిదాస్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే ,మెగసెసె అవార్డు గ్రహీత) దివంగతులయ్యారు.
1969 - జంబో జెట్ బోయింగ్ 747 మొట్ట మొదటి ప్రయాణము పూర్తి చేసింది
జననాలు
1773: అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్.
1809: చార్లెస్ డార్విన్ జననం
1910: ప్రముఖ నిజాం విమోచన ఉద్యమకారుడు ఉమ్మెత్తుల కేశవరావు
1919: ముదిగొండ సిద్ద రాజలింగం,స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
1922: రావిపూడి వెంకటాద్రి ప్రకాశం జిల్లా నాగండ్ల లో జననం. హేతువాది మాసపత్రిక సంపాదకుడు
1925: ప్రజాకవి ఆకుల సుబ్రహ్మణ్యం జననం
1936: అడబాల,రాజీవం, రాతిమనిషి మొదలైన నాటికలు నటుడిగా అడబాలకు పేరు తెచ్చాయి
1936: ప్రముఖ నాటక రచయిత, దర్శకుడు చింతపెంట సత్యనారాయణ రావు (సి యస్ రావు) జననం
1939: బండి రాజన్ బాబు, ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు,ఎందరో విద్యార్ధులను నిపుణులైన ఛాయాగ్రాహకులుగా తీర్చిదిద్దాడు
1975: యార్లగడ్డ సుమంత్ కుమార్ , తెలుగు సినిమా నటుడు. ఇతడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు
మరణాలు
1932: దొంతులమ్మ,ఆంధ్ర యోగిని మరియు అవధూత. ఆమె అరవైయేళ్ళ వయసులో కూడా నెత్తిమీద నీళ్ళ కుండల్ని దొంతరులుగా పెట్టుకొని మోస్తూ ఉండేది.
1996: చిట్టిబాబు (వైణికుడు),ప్రసిద్ధ సంగీతజ్ఞుడు,వీణాపాణిగా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా గుర్తింపబడ్డాడు.
2008: సంఘసేవకుడు మరళీధర్ దేవదాస్ ఆమ్టే. మరణం
2012: సుప్రసిద్ధ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి మరణం
2014: షేక్ అబ్దుల్లా రవూఫ్, నక్సల్‌బరి కేంద్ర కమిటీ నాయకుడు.ఆజన్మ బ్రహ్మచారి
పండుగలు మరియు జాతీయ దినాలు
CONDOM AWARENESS WEEK - FEBRUARY 9-14

(మూల వనరులు: తెలుగు వికీపీడియా & తెలుగురధం సేకరణ)

 

Saturday, February 7, 2015

నాడు - నేడు - చరిత్రలో - ఫిబ్రవరి 8



నాడు - నేడు

చరిత్రలో  - ఫిబ్రవరి 8

ఫిబ్రవరి 8

ఫిబ్రవరి 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 39వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 326 రోజులు (లీపు సంవత్సరము లో 327 రోజులు) మిగిలినవి.

జననాలు

1880 : ప్రసిద్ధ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ జననం (మరణం 1946)
1834 : మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త మెండలీఫ్ జననం.
1897 : పూర్వ భారత రాష్ట్రపతి డా.జాకీర్ హుస్సేన్ జననం. (మరణం 1969)
1902 - ఆండ్ర శేషగిరిరావు (1902 - 1965) సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు జననం
1931 : అమెరికాకు చెందిన ఒక నటుడు జేమ్స్ డీన్ జననం.
1934:పొత్తూరి వెంకటేశ్వర రావు,తెలుగు పత్రికారంగ ప్రముఖుడు. ఐదు దశాబ్దాలుగా పత్రికారంగంలో పత్రికారంగంలో పనిచేసిన వ్యక్తి జననం
1941 : ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం.
1963 : భారతీయ క్రికెట్ మాజీ కేప్టన్ ముహమ్మద్ అజహరుద్దీన్ జననం.

మరణాలు

1971: "నిరంకుశమైన అధికార పిపాస - ఓ స్వప్నమే!" అని నినాదం చెప్పిన నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసిన కె.ఎం.మున్షీ మరణం
1989: సూరి భగవంతం, ప్రముఖ శాస్త్రవేత్త మరణం - దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు.ఇవి కాక గ్రూపు థియరీ, రామన్ ఎఫెక్ట్ మరియు క్రిస్టల్ సిమెట్రీ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనే మూడు గ్రంథాలు రచించారు.
2010: ప్రముఖ తెలుగు పండితులు, జానపద గేయ కళా పరిశోధకుడు  డా.బిరుదురాజు రామరాజు మరణం  

పండుగలు మరియు జాతీయ దినాలు

ప్రపంచ వివాహ దినోత్సవం

(మూల వనరులు : తెలుగు వికీపీడియా & తెలుగురధం సేకరణ)

.
 

విద్వత్కవిలోకానికి 'విజయ వైజయంతిక '. - వేటూరి ప్రభాకర శాస్త్రి గారు

మన తెలుగు సాహితీ ప్రముఖులు

విద్వత్కవిలోకానికి 'విజయ వైజయంతిక '.



వేటూరి ప్రభాకర శాస్త్రి గారు  (7-2-1888 - 20-8-1950)

తెలుగు సాహితీబాలకు 'శ్రీమంత ' సౌభాగ్య ప్రదాత  - వేటూరి ప్రభాకర శాస్త్రి గారే
ఎండలు మెండు, నీళ్ళు లభింపవు, కూరలు లేవు, పూవులుం
బండలు కానరావు, బలవంతమెయైనను వానలేమి చే
బండదు భూమి, లేమిబడుపాటులు మిక్కిలి, దారి దోపుడుల్
మెండిటు వంటి దేశమున మేము చరించుచునుంటి మిత్రమా! 

దేశంలో యిలా సంచారం చేయడం కొంతగా ఉద్యోగ ధర్మమైనా, అంతా పుస్తకాలపై ఎంతెంతో చెప్పలేని అభిమానం పరమ సంపదగా భావించుకొన్నవారు మహానుభావులు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు. ప్రాచీన గ్రంథాల వెదకులాట, పరిశోధనా పర్వాలలో  కాలికి బలపం కట్టుకొని తిరిగిన పరమసంచారి వేటూరి వారు పడ్డ కష్టాలు ఎన్నో చెప్పలేనివి.  కానీ, సాధించిన విజయాలు పరమ ఘనతరాలు. స్వతహాగా కవి, పండితుడు, కనుక గ్రంథ సంచాలనంకోసం సహజంగానే శ్రమ అనుకోలేదు.  దేశ సంచారం పైగా కొంత ఉద్యోగ ధర్మంగా మారడం కూడా బాగా ఉపయోగమైంది.  మద్రాసు, తంజావూరు, నెల్లూరు, గుంటూరు, విశాఖ మొదలైన ఎన్నో స్థలాలు దర్శించడం, గ్రంథాలయాల్లోని గ్రంథ సంచలనం, పరిశోధనలు, ప్రకటనలు, ప్రచురణలు తర్వాత చరిత్రలో భాగమైపోయాయి. 
 
మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంథాలయాన్ని  తన పరిశోధనకు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు వినియోగించుకున్నారు. శాస్త్రి గారు 1906 లో మద్రాసు చేరుకొని కెల్లెట్ హైస్కూలు లో పండితులుగా చేరారు. విశ్రాంతి సమయాల్లో మద్రాస్ ఓరియంటల్ లైబ్రరీ లో గ్రంథాలు చదివేవారు. 1910 ఆగష్ట్ లో ఆ గ్రంథాలయంలోనే లేఖకోద్యోగంలో చేరారు.  గురజాడ అప్పారావు గారి మేనల్లుడు పోతరాజు నరసింహం గారి సలహా మేరకు శాస్త్రిగారు యోగమార్గంలో పడ్డారు. 1910 కి ముందే గురజాడ వారికి  యువ పరిశోధకుడైన వేటూరి వారితో పరిచయం ఏర్పడింది. అంతేకాదు,  గురజాడ అప్పారావు గారు కూడా వేటూరి వారిని తర్వాత కాలంలో కలుసుకొని తమ చరిత్ర పరిశోధనలు కొనసాగించుకొన్నారు. వీరిరువురికీ మైత్రి ఏర్పడింది. 

గ్రామ్యమీమాంసం
 
1917 లో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వాడుక భాషను రాసే విధానంలో కొత్తదారులు తొక్కారు. కృష్ణాపత్రిక లో  రాసిన  'గ్రామ్యమీమాంసం' అనే వ్యాసంలో -
 
"మండలాల్లో మాటలు మారాయని భాష చెడ్డ భాషవుతుందా? అలా అయితే ఈ పై మాటలన్నీ పాడైపోయేవే. ఇవన్నీ గ్రాంథిక భాష కావలసిన వానికి కావాలా? అఖ్ఖరలేదా? ఇలాగే ఇంకో మండలంలో మాట్లాడే కొత్త మాటలు రాకపోతే, భాషాపారగుడు  ఎట్లా అవుతాడు? అన్య మండలాల్లో కొత్త మాటలన్నీ రావలసిందే, కొత్త గ్రంథాలు చదువుకొని, కొత్త మాటలు నేర్చుకొన్నట్లు అనయ మాండలిక గ్రంథాలు చదువుకొని ఆ పదాలు నేర్చుకోవాలి? ఆ మాటలు తెలియవని, ఆ భాష చెడ్డదని, అనటం మంచిది కాదు. మనకు అరవం రాదనీ, ఆ భాష చెడ్డది అంటే  అపహాస్యమవుతుంది. మనకు తెలియని భాషల్లా చెడ్డదని అనాల్సివస్తుంది. ఇంతకంటే నవ్వుబాటేమీ లేదు. మారడం భాషకు సహజం."
ఈ వ్యాసంలోనే వావికొలను సుబ్బారావు, తాపీ ధర్మారావుల - "గ్రామ్యం - గ్రాంథికం కలిస్తే పేడా బెల్లం పిసికినట్లుంటుంది" అన్న వాదాలను వేటూరి ప్రభాకర శాస్త్రి గారు యిలా ఖండించారు:
 
"సంస్కృతం - ప్రాకృతం - శూరసేని - మాగధి - చూళిక - పైశాచి - అరేబియా - ఆఫ్గానిస్థానం - పర్షియా - మలయ - ఇంగ్లీష్ - ఓడ్రం - దక్కని - బంగాళం - బటేవియా - చీనా - తుర్కీ - తురేనియా - తార్తారం - మహారాష్ట్రం - పరాసు - లాటిన్ - పోర్చుగల్ - ఇటలీ - గ్రీసు - స్పెయిన్ - ద్రావిడం - కర్ణాటకం - తుళు - ఈ భాషలన్నీ కలిస్తే - పేడా -బెల్లం కలిసినట్లున్తుందా?
 
అని తనదైన శైలిలో ఆ నాటి పెద్దమనుషులకు కూడా బుద్ధి చెప్పారు.  
 
తిట్ల ప్రహసనాలు
 
ఏకడం, తిట్టడం మొదలైన లక్షణాలకే  పరిమితమైన ప్రహసనాలకు తెలుగునాటక రంగంలో స్థానం విరివిగా ఉండేది. అసలు మన మార్గ రూపకాల్లో  ప్రహసనాలు పరిమిత దూషణకు నిలయాలుగా ఉండాలి. క్రీ.శ. 600 నాటి పల్లవ మహేంద్ర విక్రమ వర్మ శాసనంలో 'భగవదజ్జుకం', 'మత్తవిలాసం' అంటే రెండు ప్రహసనాల ప్రసక్తిలో - మొదటి రచనలో బౌద్ధమత ఖండనం చాలా వెటకారంగాను, రెండవ రచనలో  బౌద్ధ, కాపాలిక, పాశుపత మతాల వారిని నీచంగానూ తిట్టడం జరిగిన వైనం నేపథ్యంలో - వేటూరి వారు అనువదించడం జరిగింది. మార్గ ప్రహసనాలు ఎలా ఉన్నా, తెలుగులో ప్రహసనాలకు మార్గం చూపిన వీరేశలింగం గారు 'ఆక్షేపణ గర్భ నాటకం' అనే నిర్వచనంతో కొన్ని ప్రహసనాలు రాసిన సంగతి యిక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం కాబోదు. వేటూరి వారు, కర్ణభారం (అనువాదం-1913), మధ్యమ వ్యాయోగం (అనువాదం-1913), భగవదజ్జుకం (అనువాదం-1924), ప్రతిమ (అనువాదం-1927) రచనలు రాశారు. 
 
వేటూరి ప్రచురణలు:
 
ప్రకటనలు:'
 
చాటుపద్య మణిమంజరి(మొదటి భాగం)(1914)
ప్రబంధ రత్నావళి (1918)
చాటుపద్య మణిమంజలి (రెండవ భాగం((1922)
బసవపురాణం (1928)
 
ప్రచురణలు:
 
తంజావూరు ఆంద్ర రాజుల చరిత్ర (1914)
అప్పన చారుచర్య (1922)
శృంగార శ్రీనాథం (శ్రీనాథ కాలం, కృతులు)(1923)
ఉద్భటారాధ్య చరిత్ర (1925)
మనుచరిత్ర (1926)
క్రీడాభిరామం (1928)
కనకాభిషేకం (శ్రీనాథ సంబంధితం) 
 
నీతినిధి (వచనం)
కడుపుతీపు, కపోతకథ, విశ్వాసం, మూన్నాళ్ళ ముచ్చట (ఖండ కావ్యాలు)
ప్రతిమానాటకం, కర్ణభారం, మధ్యమవ్యాయోగం (భాస కృత అనువాదాలు)
భగవదజ్జుకం (బోధాయన కృతి ప్రవాసనం' కు అనువాదం)
తెలుగు మెరుగులు
 
ప్రభాకర శాస్త్రి గారు అనేక ఆధునిక గ్రంథ సంపాదనలు అందించారు. గురజాడ, గిడుగు, మానవల్లి - ఎందరికో శాస్త్రిగారు ఎన్నో రకాలుగా తోడ్పడ్డారు.
 
వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వల్లనే  తెలుగు సాహిత్యం శ్రీమంతం అయింది.
 
ఎడతెరపి లేని భాషా పరిశ్రమ, గడితేరిన ఉభయ సారస్వత పాండిత్యాలు, వడిగల కార్యదీక్షా  దక్షత, చెడని తలపులు, ఒడిదుడుకులు లేని తేటతెనుగు కవితా రచన, కడతాకిన తాత్త్వికదృష్టి, - ఈ విశిష్ట లక్షణములతో పుట్టిన మహారచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్న మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారన్న వాక్యాలు వేటూరి పట్ల  సత్యశివ సుందరాలు.
 
భోగ త్యాగములు సరిగా అలవరచుకొన్నవారిలో  వేటూరి శాస్త్రి గారిది ఉత్తమస్థానం. సమాజ సంస్కారమును వాచించుటయేకాక, ఆచరించి చూపుట వీరి విశిష్ట విశేషణం. భాషా సాహిత్య పరిశోధనల్లో  ప్రసిద్ధులైన వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవనం విద్వత్కవిలోకానికి 'విజయ వైజయంతిక '. 
 
మహానుభావులు, మహా పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జయంతి సందర్భంగా - తెలుగురధం శాత సహస్ర అక్షర నీరాజన సహిత ప్రణామాల్ని తెలుగురధం సమర్పిస్తోంది. (కొంపెల్ల శర్మ, తెలుగురధం) 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
  
 

Friday, February 6, 2015

నాడు - ఈనాడు

చరిత్రలో - ఫిబ్రవరి 7

ఫిబ్రవరి 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 38వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 327 రోజులు (లీపు సంవత్సరము లో 328 రోజులు) మిగిలినవి.

సంఘటనలు

జననాలు

మరణాలు

(మూల వనరులు : తెలుగు వికీపీడియా & తెలుగురధం సేకరణ)


 


Thursday, February 5, 2015

నాడు - ఈనాడు - చరిత్రలో - ఫిబ్రవరి 6


నాడు - ఈనాడు

చరిత్రలో  -  ఫిబ్రవరి 6:

ఫిబ్రవరి 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 37వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 328 రోజులు (లీపు సంవత్సరము లో 329 రోజులు) మిగిలినవి.

1804 : ఆక్సిజన్ ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ మరణం.
1911 : అమెరికా దేశ 40 వ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జననం.
1923 : వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు జే.రామేశ్వర్ రావు జననం.
1931 : భారతీయ స్వాతంత్ర సమర యోధుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ నెహ్రూ మరణం.
1932 : భరాగో గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం జననం.
1956 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభు మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు కావలి ప్రతిభా భారతి జననం.
1976 : బెంగాలీ భారతీయ చిత్రనిర్మాత మరియు స్క్రిప్టు రచయిత రిత్విక్ ఘటక్ మరణం.
2006: తెలుగు సినీ హాస్యనటి కల్పనా రాయ్ మరణం. (జ. 1950)
సంఘటనలు
1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.
1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.
2000: ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది.
జననాలు
1804: జోసెఫ్ ఫ్రీస్ట్ లీ జననం - ఈయన ఆక్సిజన్, హైడ్రో క్లోరిక్ ఆసిడ్ మరియు సర్ఫ్యూరిక్ ఆసిడ్ లను కనుగొన్నాడు. (1733 మరణం)
1892: అతి ప్రమాదకరమైన రక్తహీనత పెర్నీషియస్ ఎనీమీయా కు చికిత్సకు కనుగొన్న విలియం పి. మర్ఫీ జన్మించాడు.
1900: ప్రముఖ కవి, రచయిత నోరి నరసింహ శాస్త్రి జననం
1923: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు.
1932: భమిడిపాటి రామగోపాలం, భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత, కాఫీ అన్నా, ఆంధ్రపత్రికన్నా, రేడియో అన్నా ప్రాణం.[మ. 2010]
1947: కె.వి.కృష్ణకుమారి,వృత్తి మెడికల్ ప్రాక్టీసే అయినా, ప్రధాన వ్యాపకం రచనా వ్యాసాంగమే
1956: కావలి ప్రతిభా భారతి,రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు
మరణాలు
1804: ఆక్సిజన్ ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ
1889: సూరి భగవంతం. ప్రముఖ శాస్త్రవేత్త. దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు.
1925 : ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు మరణించాడు (జ.1897).
195: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాన్
1973: ప్రముఖ కవి, భావ కవుల కవితా సంకలనం  'వైతాళికులు' సంపాదకులు
1993: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు ఆర్థర్ ఆష్.
2008: కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. ఓ సీత కథ చిత్రంతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. దాదాపు 430 తెలుగు చిత్రాలలో నటించింది
పండుగలు మరియు జాతీయ దినాలు
NEW ZEALAND NATIONAL DAY
INTERNAITONAL DAY OF ZERO TOLERANCE TO /  AGAINST FEMALE GENITAL MUTILATION/CUTTING
(మూల వనరులు : తెలుగు వికీపెడియా & తెలుగురథం సేకరణ)

 https://www.facebook.com/kompella.sarma.9