Monday, December 3, 2007

తెలివితేటలున్నా తెల్లవార నిస్తున్నాము
మన మేధశ్సుల్ని మనమే ఎగుమతి చేసుకుంటున్నాము
మన పంట సిరులకి మనమే తెగుల్లాను పోస్తున్నాము
తెలుగు రైతు లాగా తెలుగు వైభవానికి కూడా
కరువులు, కాటకాలు, వరదలు భీభాత్సాలు
మన సంస్కృతి మాట ఎలాగున్న, మన కాస్త ములను కూడా
నిషిద్ధ చందొ కవితల్లో ప్రచురించుకుంటున్నాము
కుంటి సాకుల్ని, కుంటి నడక నడతల్ని మనమే నేర్పుతున్నాము
హావ భావాల్ని హాహాకారాల్తో నిశ్శబ్ద తరంగాల్ని వీక్షిస్తున్నాము
విచక్షణ లేని వివాదాల్లో విహారం గావిస్తున్నాము
జీవితమా నీకు వందనం
ఓ జీవితమా అభినందనం

క్షణికమైనా రమణీయ కవితవి
ముద్దులొలికించే ముక్తపదగ్రస్తానివి
బుద్బుదమైనా సవర్ణానుభూతివి
జనన మరణాల మధ్య విరామచిహ్నానివి ఓ

జన్మత్: మరణాన్ని అంకాన దాస్తుంటివి
జన్మాంతం జీవులకు భయభ్రాంతుల్నిస్తుంటివి
హాస దరహాసాలను రవంతైనా వలదంటుటివి
నిత్యం బతుక్కి భయాన్ని వినా అభయాన్నివకుంటివి ఓ

ఆలోచనాపరులకు తమాషాల నిషావి
అనుభూతువాదులకు విధిగా విషాదానివి
నీవాడించే క్రీడలకు నీతినియమాలు నిర్మించకపోతివి
పత్రాంత హిమబిందువులా కాలపుటంచుల్లో నౄత్తమాడిస్తుంటివి ఓ

అగ్రహీత గ్రీష్మంలా అనంతానంత వర్షిణిలా
అనాలంకౄతీ వసంతంలా శిశిర హేమంత మితశీతకంలా
అగంతుకమై, అనాకారమై, అధ్వాన్నమై
అద్వితీయంగా అవతరిస్తుంటివి అమాంతంగా అదృశ్యమవుతుంటివి ఓ

చాటుమాటుగా వెంటాడే నీడవి, విదేశీ గూఢచారివి
సన్నిహితం కోరి వెంబడిస్తే సుదూరపు సితారవి
అలకతో దూరమైతే, దరిజేరే మధుర మధుచంద్రికవి
అధవంతపు అన్వేషెతవి, అర్ధంకాని అనామికవి ఓ

కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ

Sunday, December 2, 2007

అక్షర సాహితీ నీరాజనం

అక్షర సాహితీ నీరాజనం

అనాదిగా వస్తోంది కవిత్వం
క్షరము లేని అక్షర సత్యం
రవిరుక్కులా, కవివాక్కులా నిత్యం
సాహితీక్షేత్రంలో పరమధర్మం
హితవాదం, సత్యధర్మాల తత్వం
తీరని కోరికలు పెరుగుతున్న తరుణం
కవితలోనైనా తీర్చుకునే ప్రయత్నం
మనదేశంలో కవి, కవిత మధ్య కలం
కలం హింసకు గురవుతున్న కాగితం
కధనం అహింసావాదమైనా, యిది అనివార్యం
రసమయంగా, రంజకంగా ఉండాలి కవిత
తిమిరాన్ని పారద్రోలే వెలుగు తత్వం

Sunday, November 11, 2007

ప్రార్ధన

ఓహో భగవంతుడా!
నన్ను కరుణించు, కటాక్షించు
స్థితిగతుల్ని మార్చలేని స్తబ్ధతలో
కనీసపు నిబ్బరాన్ని ప్రసాదించు.
మార్పు తేగలిగే స్థితుల్లో
మార్పిడికి అవసరమైన ధైర్యాన్నివ్వు.
పై రెంటి నడుమ వుత్పన్నమైన
అంతరాన్వేషణ కొరకు జ్ణానాన్ని అందించు.