Monday, December 7, 2009

భారత రాజ్యాంగ శిల్పి, "డా. భీం రావ్ రాంజీ అంబేద్కర్" జయంతి

భారత రాజ్యాంగ శిల్పి, 'భారతరత్నా సన్మాన గ్రహీత, "డా. భీం రావ్ రాంజీ అంబేద్కర్" జయంతి
(1891 - 1956)



బహుముఖ ప్రజ్ణాశాలి - భీం రావ్ అంబేద్కర్



మహామేధావి, సంఘసంస్కర్త, న్యాయశాస్త్రవేత్త, భారతరాజ్యాంగ శిల్పి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, అని ప్రఖ్యాత వహించిన వ్యక్తి - డా. భీమ్క్ రావ్ రాం జీ అంబేద్కర్ విశ్వవిదితమైన మహామనీషి. సుప్రసిద్ధ రచయిత 'బెవెర్లి నికొలశ్ డా. అంబేద్కర్ ను భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసలను అందజేYఅడం మరువలేని సంఘటన.



అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ!



ఆంధ్రకవితా పితామహుడు 'అల్లసాని పెద్దనా అన్నట్లు, 'అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా అన్న భావనకు సత్యరూపాన్ని కలిగిస్తూ, లోకమాన్య బాలగంగాధర తిలక్, మహర్షి కార్వే వంటి అగ్రనాయకులు జన్మించిన పుణ్యస్థలి, మహారాష్ట్ర లోని 'రత్నగిరీ జిల్లాలో, 'మందన్ గాడ్' పట్టణానికి చేరువైన 'అంబావాడే' గ్రామంలో - రాంజీ సక్ పాల్ - భీమాబాయి పుణ్య దంపతుల్ని పున్నామ నరకం నుంచి రక్షించిన రోజది, 1891 ఏప్రిల్ 14. మెహర్ కులంలో పుట్టిన భీం రావ్ ను తండ్రి చాలా క్రమశిక్షణ తో పెంచగా, బాలభీం రావ్ ప్రతినిత్యం రామాయణం, భారతం, తుకారం, మోరోపంత్ ల భజన గీతాలను గానం చేయడం, కుటుంబం యావత్తు శాకాహారాన్ని సేవించడం, బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకౄషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్.



అవమాన, పరాభవాల్ని తెచ్చిన వర్ణ వ్యవస్థ



అస్పౄశ్యులుగా పరిగణింపబడిన 'మెహర్లా కులంలో జన్మించడం పట్ల, బండివాడు చూపిన ఆగ్రహం, అన్నగారు బండి తోలితే, బండివాడు రాజఠీవితో నడచి రావడం, ఆకలిదప్పులతో అలమటిస్తూ వీధికుళాయి నుంచి మంచినీళ్ళని కూడ తాగనివ్వని అమానుషత్వం, భరించలేని అవమానాలకు గురిచేసింది. అందుకే అంబేద్కర్ కులవ్య్వ్వస్థ పై నిష్చితమైన అభిప్రాయాలని నిర్ధారించుకున్నాడు. కులం పునాదుల మీద దేనినీ - జాతిని గానీ, నీతిని గానీ నిర్మించలేమనీ, అలా నిర్మిస్తే అది పగిలి ముక్కవలడం తప్పదని చెప్పాడు. కులంలోని వ్యక్తి ప్రతిభను కులం గుర్తించకపొవడమే కాక, రాజకీయ దాస్యంతో పోలిస్తే, సాంఘిక దాస్యం హీనమైనదీ, నీచమైనదీ అని నొక్కి వక్కాణించాడు.



బొంబాయి - బరోడా ల మధ్య వాసికెక్కిన వ్యక్తిత్వం



సంస్కౄతాన్ని ఆధ్యయనం చేయాలన్న సంకల్పానికి మాయదారి కులం అడ్డు తగిలింది. అయితే పర్షియన్ భాష చదివాడు. ఎల్ఫిష్టన్ హైస్కూలు లో మెట్రిక్యులేషన్, 16వ ఏటనే వివాహం, బరోడా మహారాజు యిచ్చిన 25 రూ. విద్యార్ధి వేతనం 1912 లో బి.ఏ పరీక్షలో నెగ్గేలా చేసిన పట్టభద్రత్వం బరోడా ఆస్థానంలో ఉద్యోగాన్ని సంపాదించినా, పై చదువులపై పట్టుదల ఉద్యోగాన్ని దూరం చేసింది. చదువు తర్వాత ఖరారుగా దశాబ్దకాలంపాటు ఆస్థానంలో ఉద్యోగం చేయాలన్న నిబంధనతో, 1913 లో రాజప్రోత్సాహంతో కొలంబియా విశ్వవిద్యాలయం లో చేరి, 1915 లో ఎం.ఏ, 1916 లో పి.హెచ్.డి ని సంపాదించాడు. పరిశోధన ఫలితంగా, 'ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రావిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా' అన్న పేరుతో సిద్ధాంత ప్రచురణ చాలా ప్రాచుర్యాన్ని అందించింది. 1917 లో డా. అంబేద్కర్ స్వదేశ ప్రవేశం చేయడమే గాక, 27 ఏళ్ళలో, అస్పౄశ్యుడొకడు అంతగొప్ప పేరు సంపాదించుకోవడం ఆనాటి అగ్రవర్భాలవారికి ఆశ్చ్యర్యానందానుభూతుల్ని కలిగించింది. ఫలితంగా మహారాజావారికి మిలిటరీ కార్యదర్షిగా గుర్తింపు కల్గినా, ఆఫీసులో నౌకర్లు కాగితాలు ఆయన బల్లపై ఎత్తివేసేవారట! కొళాపూర్ మహారాజు సహాయంతో, 'మూక నాయక్' పక్షపత్రికకు సంపాదకత్వం హహించడం.

- బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి, లండన్ నుంచి డి.ఎస్.సి పట్టాలను పొందినా, ఆఫీస్ జవానుల ఆదరాన్ని కూడ పొందలేని దుర్భరస్థితిగతులు.



బాబాసాహెబ్ జీవితంలో 1927 లో జరిగిన ప్రధాన ఘట్టాలు



- మహద్ లో దళిత జాతుల మహాసభ జరగ్గా, మహద్ చెరువులోని నీరు త్రాగుటకు అంతవరకు ప్రవేశం లేని పరిస్థితి నుంచి, అంబేద్కర్ నాయకత్వంలో మహారాష్ట్ర, గుజరాత్ ల నుంచి వచ్చిన వేలాదిమంది చెరువునీరు స్వీకరించడం మహారాష్ట్రలో సంచలనాన్ని కలిగించింది.

- 'బహిష్కౄత భారతీ మరాఠి పక్ష పత్రిక ద్వారా ఆనాడు కులతత్వవాదుల బాధను ప్రకటించాడు.

- చత్రపతి శివాజి త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా అధ్బుతంగా జరగ్గా, అంబేద్కర్ ను సాదరంగా ఆహ్వానించబడడం, ఉత్సవ సంఘాధ్యక్షుడైన పలాయ్తశాస్త్రి తన ప్రసంగం లో, 'పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పౄశ్యతను పాటించడమే' అన్న భావం అందరినీ ఆలోచింపజేసింది.

- 'మనుస్మౄతీ పై తనభావాలను నిష్కర్షగా చెప్పినా, ఆ సంపుటిలో అన్ని భాగాలు నిందనీయాలు కావు అని కూడ చెప్పగలిగిన సుస్ఫష్టభావకుడు అంబేద్కర్.



గాంధీ తో చెప్పిన నిశ్చితాభిప్రాయాలు



1931 లో రెండవ రౌండ్ టేబిల్ సమావేశం సందర్భంగా, అంబేద్కర్ గాంధీని కలుసుకోవడం, జైలులో వున్న గాంధీజీ నిరాహారదీక్ష ప్రారంభించడం, గాంధీజీ తో 'మహాత్ములు వస్తుంటారు, పోతుంటారు, అంటరానివారు మాత్రం అంటరాని వారుగానే వుంటున్నారూ అన్నారు.



'అస్పౄశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కూ



అస్పౄశ్యతా నివారణ కోసం దళిత జాతుల హక్కుల కోసం, 'అస్పౄశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కూ అన్న తిలక్ సంకల్పం మాదిరి నిరంతరం పోరాటం సాగించాడు బాబాసాహెబ్. నిరంతర కౄషి తో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు, ముఖ్యంగా సామాజిక సంస్కరణలకు, ఊపిరిపోసుకుంది.



భారత రాజ్యాంగ శిల్పకారత్వం



భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం, రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగ అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించడం ఆయన శేషజీవితంలో ప్రముఖమైన ఘట్టం. ఈ విషయంపై, ఆనాటి కేంద్రమంత్రి టి.టి.కౄష్ణమాచారి మాట్లాడుతూ, 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన అత్యధిక సభ్యుల్లో అందుబాటులో లేకపోయిన కారణంగా, భారత రాజ్యాంగ రచనా భారమంతా డా. అంబేద్కర్ మోయవలచి వచ్చిందని, రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో ఏలాంటి సందేహం లేదూ అని అమోఘమైన విశ్వాసాన్ని ప్రకటించడం, బాబాసాహెబ్ ప్రతిభాపాటవాల్ని చెప్పకనే చెప్పినాడు.



అన్నీ ప్రత్యేకతలే - అంబేద్కర్ జీవితంలో!



అంబేద్కర్ 56వ ఏటన సారస్వత బ్రాహ్మణ కుటుంబంలోని కుమారి శారదా కబీర్ ను వివాహమాడడం, నాగపూరు లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరిస్తూ, 'బౌద్ధం భారతీయ సంస్కౄతిలో భాగం' అని, ఈ దేశ చరిత్ర సంస్కౄతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. దీనివల్ల, హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు!.



బాబాసాహెబ్ బహురంగ రచనలు



అనేక రచనలను అందించిన అంబేద్కర్ - 'ది ప్రోబ్లెం ఆఫ్ రుపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా', 'ది బుద్ధా అండ్ కార్ల్ మార్క్శ్, 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మా, ప్రముఖ రచనలని చెప్పాలి.



మరువలేని జీవిత మలుపులు



భారతరాజ్యాంగం ఏ మలుపులు తిరిగినా, అది వున్నంతకాలం, బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్మరిస్తూవుండడం వినా వేరే గత్యంతరం లేదు భారతదేశ ప్రజలకు. భారతరాజ్యాంగం లో పొందుపరచబడిన 'భారతీయ షెడ్యూలు కుల జాతుల అభివౄద్ధీఅంశాలపై ప్రత్యేక ప్రేరణ, ప్రోత్సాహం, అంబేద్కర్ దే గణనీయమైంది. 1925 లో బోంబే హైకోర్టు లో న్యాయవాద వౄత్తి, 1926 - 34 మధ్య బోంబే విధాన కౌన్సిల్ కు ప్రకటించబడిన సభ్యత్వం, 1942 - 46 మధ్య వైశ్రాయి నిర్వాహకవర్గ సభ్యుడుగా, 1947 - 51 మధ్య న్యాయశాఖ మంత్రిగా, ప్రముఖ పదవులు. మహోన్నత ఆశయాలని మనసా వాచా కర్మణా ఆచరించిన అంబేద్కర్ ని కొన్ని స్వార్ధపూరిత కూటమితో, కొన్ని రాజకీయపక్షాలు అంబేద్కర్ ఆశయాలకు వక్రభాష్యం చేసి తమ పబ్బాలను గడుపుకోవడం నేటికి జరుగుతున్న దారుణసత్యం. సామాజిక న్యాయం, భారతీయ ప్రజల్లో వర్గీకరింపబడిన వర్ణవ్యవస్థ, ఆయన ఆశయాలకు దర్పణాలుగా ప్రతిబింబించకపోవడం చాలా శోచనీయం, దురదౄష్టకరం అనే చెప్పాలి. అంబేద్కర్ ప్రతిభను, నాలుగు దశాబ్దాలకాలం తర్వాతనే భారతదేశం గుర్తించి, 'భారతరత్నా (1990) సత్కారం అందించడం పట్ల, చివరికైనా న్యాయం జరిగిందనడంలో సందేహం లేదు. 1956 డిసెంబర్ 6 న కన్నుమూశారు.



కొంపెల్ల శర్మ

Monday, November 30, 2009

నార్ల వెంకటేశ్వర రావు (1908 - 1985)

నార్ల వెంకటేశ్వర రావు (1908 - 1985)


నార్ల వారి బాటమాటలు నాణ్యాల మూటలు
బాట + మాట = నాణ్యం + మూట = నార్ల


ఏదివున్నా, ఏది లేకపోయినా, ఈయన రచనల్లో వైవిధ్యం మాత్రం పుష్కలంగా వుంది. అందుకని, వీరి రచనల సంకలనాల్లో ఏదో ఒక భాగం, ఎవరికో ఒకరికి, ఎంతో కొంత నచ్చకపోవడం అంటూ వుండదు అని పలువురు నమ్ముతారు. అంతేకాక, ఏ సమయంలోనైనా ఆసక్తిగా చదువుకోగలిగే సాహిత్యం. దీనికి ప్రామిసరీనోటులా కాలదోషం అంటూ వుండదు. ఆమాటకొస్తే, ఏ ప్రతిభ, సత్త వున్న రచయిత కలంనుంచి వచ్చే రచన అయినా, నూజివీడు మామిడి రసఫలంలా రసాలూరుతూనేవుంటుంది. అదే నార్ల వారి కలం, రచనల్లో కానవస్తుంది.



నవయుగాల బాట నార్ల మాట



ఉత్తమస్థాయి పత్రికాసంపాదకుడు, సంస్కరణశీలి, హేతువాద తత్వవేత్త, భావజాలాన్ని నార్లవారి బాట అన్నమాదిరి విన్నూత్నంగా అందించిన ఆజానుభాహుడు, తెలుగు పత్రికారంగానికి అత్యాధునిక నూతనభావనారూపశిల్పి - ఎవరోకాదు, నార్ల వెంకటేశ్వరరావు గారు. అందరికీ 'నార్లా. ఆయన బాట, మాట, యుగయుగాలకూ వ్యాప్తి కాగల అర్హత, అధికారం పుష్కళంగా పుణికిపుచ్చుకున్న పుంభావ సరస్వతి. అందుకే 'నవయుగాల బాట నార్లమాటా అని ఆయనే యిచ్చుకున్న శతకరచనకు మకుటం ఆయన జీవితానికే కడు సార్ధకం అని చెప్పాలి.



నార్ల వలస జీవనబాల్యం



అది ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. అంటే, వనరులూ, ఆదాయం అంతంత మాత్రమే కదా. సమాజంలో భాగస్వామ్యం వహించేందుకు నార్ల బాల్యంలో చాలా కష్టపడ్డాడు. ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, ఆంధ్రప్రాంతంనుంచి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని కట్ని కి వలసపోవడం, సైన్యవిభాగాల్లోకి ఆహారపదార్ధాలను సరఫరా చేసే వ్యాపారంలో మునిగిన కుటుంబాల్లో, నార్ల వరి కుటుంబాలు ప్రముఖంగా చెలామణి అయ్యాయి. లక్ష్మణరావు, మహాలక్ష్మీ దంపతులకు, మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో 1 డిసెంబర్ 1908 న నార్ల వంశీకుడు జన్మించాడు - వెంకటేశ్వరరావు. బాల్యం, చదువు తర్వాత 'నార్లా కాలేజీ చదువు నిమిత్తం ఆంధ్రప్రాంతానికి తిరిగివచ్చాడు. పట్టభద్రుడవాలన్న చదువుతోపాటు, జాతీయ స్వాతంత్ర్యోద్యమ ప్రభావప్రేరణలతో పాల్గొన్నాడు.



ఆవహించిన పత్రికారంగం



నార్ల వారి ప్రతిభాజీవితన్ని రెండు దశలుగా భావించవచ్చు.



తొలి దశ - ఆంధ్రప్రభ



తలరాత మాట ఏమో కాని, కలంవ్రాత మాత్రం మన నార్లను నరనరాల వ్యాపించింది. బాల్యంనుంచే రాయడంపై మక్కువని పెంచుకున్న పత్రికామాధ్యమరంగంలోకి చొచ్చుకుపోయాడు. అదీ తెలుగుపత్రికారంగంలో. యిండియన్ ఎక్ష్క్స్ ప్రెస్ సంస్థలోని 'ఆంధ్రప్రభా కు ఆరాధ్యదైవంగా పేరుపొందిన సంపాదక వౄత్తిలో రాణించాడు మన నార్ల. రమారమి, రెండు దశాబ్దాలకాలంపాటు - రెండవ ప్రపంచయుద్ధం నుంచి స్వాతంత్ర్యానంతరం వరకూ - నార్ల వారి సంపాదకీయాలు, వ్యక్తిగత శీర్షికలు చదవడం అయాకే, మిగతా పేజీల జోలికి పోయేవారట. ఆనాటి మద్రాసు నుంచి ప్రారంభించిన ఆంధ్రప్రభ ప్రచురణ తెలుగు జర్నలిజంలో ఒక తలమానికమని చెప్పాలి.



మలిదశ - ఆంధ్రజ్యోతి



పత్రికాసంపాదకునిగా అపారమైన అనుభవాన్ని జోడించుకుని, నార్ల వారి విదేశీపర్యటనలను కేవలం తిరగడానికే కాకుండా, ప్రతీ యాత్ర, సాహిత్యం, కళ, వర్తమాన స్థితిగతులను అవలోకనం చేసుకుంటూ, తన ప్రతిభను విశ్వవ్యాప్తం చేయగలిగాడు. ప్రముఖ వ్యక్తులతోపాటు, గ్రంధాలయాలు, స్మారకచిహ్నాలు, కళాప్రదర్శనాలయాల్లోని స్మౄతివైభవాల్ని మరింత విస్తౄతం చేశాడు. ఈ భాగంలోనే, ఆంధ్రప్రభను విడిచి, స్నేహితులతో, ఆంధ్రప్రభలో అపారమైన అనుభవంతో, దీటైన మరొక పత్రిక - ఆంధ్రజ్యోతి - ని ప్రారంభించాడు. ఈ ప్రోత్సాహకుల్లో, ప్రముఖ వ్యాపారులు, జమీందారులు, రాజకీయనాయకులు జట్టుగట్టి, ఆంధ్రజ్యోతిని విడుదల చేశారు. వెంటనే, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య ప్రచురణగా విజయవాడలోను, ఆ తర్వాత హైదరాబాదులోను (1960) ప్రారంభించారు. మద్రాసు విభాగం మూసివేశారు. అలా ప్రారంభించిన ఆంధ్రజ్యోతి చాలాకాలం ప్రముఖ పత్రికగా పేరుతెచ్చుకుని, మూసివేయడం, ఈ మధ్యనే పున:ప్రారంభం అవడం, చెన్నైలో కూడ ప్రచురణ ప్రారంభించడం కూడ జరిగింది.



ఈ రెండు పత్రికలూ, ఎన్ని యాజమాన్యాలు మారినా, మరెన్ని రూపురేఖలు మారినా, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పేర్లు స్మరిస్తే, నార్ల వెంకటేశ్వరరావు పేరు గుర్తురాక మానదు. స్మరణకు రాలేదంటే, ఆ వ్యక్తికి, సంస్థకి, పత్రికారంగంలో పరిచయం వుందంటే, అది కుహనాభావన, పరిజ్ౙానం అని చెప్పి తీరాలి.



మరొక పరిణామం - హేతువాదం



మానసిక పరిపక్వతను పరిపుష్టంగా అందుకున్న నార్ల, గుండెజబ్బు వచ్చేకే తన పొగ తాగే అలవాటును పెంచుకుంటూనే అనారోగ్యాన్ని కూడా పెంచుకున్నాడు. ఫలితంగా, పొగని వదిలాడు. వదులుకోలేని మక్కువని తన గ్రంధాలయ నిర్వహణ విషయంలో శ్రద్ధ వహించాడు. అదే గ్రంధాలయాన్ని, తర్వాత, డా.అంబేద్కర్ విశ్వవిద్యాలYఆనికి విరాళంగా యివ్వడం కూడ జరిగింది. ఆయనలో లోతుగా పాతుకుపోయిన మానవతావాది, ఆయనలో అప్పటివరకూ అదౄశ్యంగా సంచరిస్తున్న హేతువాది ఒక్కసారి బయటకు వచ్చాడు. ఉపనిషత్తులు, భగవద్గీత, ఆధ్యాత్మిక గ్రంధాలతోపాటు, ప్రముఖుని యం.యన్.రాయ్ రచనలను చదివి ప్రభావితమయ్యాడు. ఈ దశలోనే, ప్రముఖులతోపాటు పరిచయాలు, స్నేహాలు పెరిగాయి. వారిలో ప్రముఖులు - ప్రేం నాధ్ బజాజ్ (షేక్ అబ్దుల్లా కాశ్మీర్ ప్రభుత్వం కావించిన బహిష్కరణ) కూడ రాయ్ అనుచరుల్లో ఒకరు. సుశీల్ ముఖర్జీ, నిరంజన్ ధర్, న్యాయవాది వి.యం.తర్కుండే (మానవ హక్కుల పరిరక్షకుడు), ఎ.బి.షా, ఆవుల గోపాలకౄష్ణమూర్తి (మానవత ఉద్యమంలో నాయకుడు)లను స్మరించలేకుండా జరగని పని. రాయ్ రచనలని, రాయ్ భావాలతోపాటు నార్ల చదివేవాడు. గాంధీ విధానాల్ని విమర్శించిన వారిలో రాయ్ ప్రముఖులు. రాజకీయాలకు గాంధీ అవలంబిస్తున్న మతధోరణిని కూడ రాయ్ విమర్శించేవారు.



హేతువాదితోనే పట్టింపులు



రాయ్ 1938 జూలై లో మద్రాసులో పత్రికాసమావేశంలో మాట్లాడడం, ప్రముఖ పత్రికాకారుడు ఖాసా సుబ్బారావు, యిండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకునిగా, రాయ్ భార్య ఎల్లెన్ గురించి వ్యాఖ్యలను ప్రచురించడం, సుబ్బారావుని విమర్శించడం జరిగింది. ఈ సంఘటనకి, పత్రికారంగం యావత్తూ, నార్లతో సహా, పత్రికాసమావేశాన్ని బహిష్కరించడం జరగడం, ఈ ఉదంతంతో రాయ్ ప్రస్తావన, దేశవ్యాప్తంగా మరణంపై (25 జనవరి 1954) రాయ్ ప్రతిభపై స్పందించినా, ఏమాత్రం నార్ల ఆంధ్రప్రభలో చేయకపోవడం గమనార్హం. కాని, ఒక ప్రముఖుడు గుంటూరులో చేసిన విమర్శకు ప్రభావం చెంది, వెంటనే రాయ్ రచనలన్నీ తెచ్చుకుని చదవడం, ప్రతిభావంతమైన భావాలకు ప్రేరణపొంది, 1956 లో రాయ్ గురించి నార్ల సంపాదకీయం రాయడం జరిగింది. రాయ్ భావాలు మదిలోకి వెళ్ళేకొద్దీ, నార్లకు అవి బాగా నచ్చేవి. ఫలితంగా, మునుపు విమర్శలు చేసిన, ఎ.జి.కె.మూర్తితో స్నేహం పెరిగింది. 1942-48 లో హేతువాదోద్యమాన్ని నిర్వహించిన రాయ్ చివరికి నార్ల జీవితంలో భాగం అవడం ఆశ్చర్యం, విశేషం కలిగించాయి. ఈ స్థితిలో, వయసు పైకి ముంచుకొస్తున్న కొలదీ, మానవునిలో ఆధ్యాత్మికత, కర్మవాదం అలవడుతాయి అన్న భావనకు వ్యతిరేకమేకాగ, తన విషయంలో అనుకూలత, ఆశ, మానవత్వం, పెరుగుతున్నాయన్నారు. అంతేకాక, నార్ల తన నిత్య జీవితానుభాలు, ప్రముఖుల పరిచయాలు, స్వంత ఆలోచనలు, డైరీలో ముఖ్యాంశాలను వ్రాసుకోవడం ప్రారంభించి, జీవితాంతం కొనసాగించేవారట.



గ్రంధాలు, గ్రంధాలయాల్లో మధ్య నార్ల



నార్ల గ్రంధాలయాల్ని నిత్యం దర్శించడం, చదవని పుస్తకాలని ఏరడం దినచర్య అనే చెప్పాలి. ప్రముఖంగా పాత పుస్తకాలని వెదకి పట్టుకోవడం ప్రక్రియ తనదైన శైలిలో కళాత్మకంగా జరిపేవారు. ఈ కార్యక్రమంలో ఆయన ఎన్నుకున్న విషయంలో పరిపూర్ణ పరిశోధన చేయడం జరిగాకే వ్రాయడం జరిగేది. ఈ పద్ధతిని గుర్తించి, భారతప్రభుత్వం, సాహిత్య అకాడమీవారి ఆధ్వర్యంలో, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, వేమన ల పై, భారతీయ సాహితీనిర్మాతలు అన్న ధారావాహికంలో, జీవితచిత్రణలను అందరూ మెచ్చుకునేలా రాయగలిగేరు.



పుస్తకాలతో పెంచుకున్న నేస్తం గురించి మన నార్లను చెప్పాలంటే, ఆయన తరచు చెప్పే భావం ఒకటి గుర్తు రాక మానదు.



'పుస్తకాలు కొనడమంటే నాకు చెడ్డ సరదా. జేబులో డబ్బున్నా లేకపోయినా, మంచి పుస్తకాన్ని చూడగానే బేరం చేస్తాను. ఆ పుస్తకంతో నాకు అవసరం వుండవచ్చు, లేకపోవచ్చు. ఒకసారి చదివిన తర్వాత మరి దానితో పనిలేకపోవచ్చు. అయినా దాన్ని కొనేదాక మనస్సు రెపరెపలాడుతూంటుంది. అప్పుచేసి కూడ పుస్తకాన్ని కొనడం అనేకసార్లు సంభవిస్తూంటుంది. పుస్తకాన్ని ఎరువివ్వక తప్పదు. అది పోవడం తప్పదు. అలాగనీ అసలు వాటిని కొనడమే మానలేం. ఇతరుల సంగతి తెలియదు కాని, నా విషయంలో యింతే. ఇప్పటికీ, ఎప్పటికీ."



పుస్తకాలపై నార్ల మరొక అభిప్రాయం యిలా సాగింది.



"విద్యావంతునికి పుస్తకం హస్తభూషణమని పెద్దలన్నారు. అయినా, మన విద్యావంతుల్లో పెక్కుమందికి పుస్తకం కాక, స్విచ్ వాచ్, సిగరెట్ టిన్, ట్రాన్ సిస్టర్ రేడియో మొదలైనవి హస్తభూషణాలు. నాగరీకుని గౄహానికి పుస్తకాలు అలంకారాలని వాత్స్యాయనుడు వ్రాశాడు. అయినా, మన నాగరికుల్లో అత్యధిక సంఖ్యాకుల గౄహాలకు పుస్తకాలుకాక, సోఫాసెట్లు, స్టీల్ బీరువాలు, చౌకబారు క్యాలెండర్లు మొదలైనవి అలంకారాలు. మనదేశంలో చదువులు పెరుగుతున్నా, సంస్కారం పెరగడం లేదనడానికి ఇది నిదర్శనం' నగరాలు పెరుగుతున్నా నాగరికత పెరగడం లేదనడానికి ఇది తార్కాణం."





వైవిధ్యం, విద్వత్తు, వెరసి నార్ల రచనలు



చరిత్ర, వేదాంతం, తత్వం, సంస్కౄతి, ఏదైనా సరే, నార్ల రచనాధోరణి ప్రత్యేకమే. భగవద్గీతకు వ్యాఖ్యానం రచించే ప్రయత్నంలో, ఎన్నో గీతాభాష్యాలను ఆధ్యయనం చేసి, వివిధ దౄక్కోణాల్లోంచి పరిశీలించి, వివరించడం జరిగింది. అలాగే, ఉపనిషత్తులు - ముల్లర్, షెఫ్ణోర్, నీట్జే లాంటి వ్యాఖ్యానాలను చదవడం, అనుకూల ప్రతికూలతలను విశ్లేషించడం, ఫలితంగా అనేక అభిప్రాయాలను, భావాలను, ప్రచురించారు. గీతపై సత్యశోధన, ఉపనిషత్తులపై సుదీర్ఘవ్యాసం, భారతదేశంలోని తెలివైన బీదతనం, ప్రాక్పశ్చిమరాజ్య సంస్కౄతి, యిలా ఎన్నో రచనలు వెలువడ్డాయి.



నార్ల భావలహరి



మతం కేవలం వ్యక్తిగత విశ్వాసంగా భావించి, రాజ్యం, పరిపాలనలోకి రానీయకూడదనేవారు. ప్రాచీనముని యాజ్ఞవల్క్య భావాలు పురోభివౄద్ధికి, మనుగడకు అవరోధాలేకాక నిరంకుశవాది, నియంత మూలాన, భారతదేశపు బీదతనానికి బాధ్యత అన్నారు. మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం, వెదకి నిర్ధారించ్లేని మహాత్మాగాంధి అంతరాత్మ ప్రభోధం లాంటి పద్ధతులు దేశపు స్వాతంత్ర్యం తెచ్చినా, బానిసత్వం పూర్తిగా పోలేదు అన్నారు. గాంధీకి శాస్త్రీయ విధానం లేదని, నిత్యం గీతపై ఆధారపడడం, ఆయన అహింస, సత్యాగ్రహ విధానాలే హింసకు.నిరాహార ధోరణి అనారోగ్యానికి చివరకు దారితీసాయన్నారు. యువకులకు కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలకు యువకులకు అవే మార్గాలని చెప్పి, ఆత్మసమర్ధత, ఆత్మసంయమనం అలవాటు చేసుకోనివ్వలేదన్నారు. హిందూతత్వం, మానవతాతత్వం మేళవించిన, సుగమం అయ్యేది అన్నారు. మానవతావిలువలపై దౄష్టిపెట్టి అలవరించినట్లయితే, మానవులు వారిపైనే స్వయంగా ఆధారపడి, వారి సమస్యలకు పరిష్కారాలు వారే కనుగొనేందుకు దోహదం అయేది.



యిందిరాగాంధి తెచ్చిన అవాంతరం, పోగొట్టుకున్న సంపాదకత్వం



పుష్కలమైన స్మౄతి, స్ఫూర్తి కలిగిన పత్రికాకారుడిగా, 1975లో యిందిరాగాంధి సిద్దాంతాలకు నార్ల అన్యధా ఆమోదితుడయినా, నిర్ణయం, అమలుపరచటం, నిరాశనే కలిగించింది. సంపాదకీయం తెల్లకాగితంలా వుంచుదామనుకున్నా, ఆంధ్రజ్యోతి యాజమాన్యం ససేమిరా అన్న మేరకు, నార్ల కుటుంబం యావత్తూ, అమెరికా ప్రయాణం చేయడం, జీవితంలో ప్రముఖ సంఘటన. నార్ల వారి సుగుణసంతానం, ఏడుగురూ, డాక్టర్లవ్వడం, ఉద్యోగులవ్వడం మూలాన, అత్యవసర పరిస్థితి అంతం అయ్యేకే, భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆంధ్రజ్యోతి సంఫాదకునిగా రాజీనామా చేశారు. యాజమాన్యం అనివార్య జోక్యం చేసుకున్నప్పుడల్లా, నార్ల రాజీనామా చేయడం కొత్తకాదు. యిదివరకు ఆంధ్రప్రభలో కూడ జరిగింది. కాంగ్రేసు పార్టీ రాజకీయాల్లో పాల్గొని, రాజ్యసభ సభ్యునిగా ప్రత్యక్షంగా వీక్షించిన రాజకీయాలు, నాయకుల అవినీతిధోరణి, ప్రజాజీవనం నుంచి తప్పుకోవలసివచ్చింది.



ప్రతిభావంతులకూ అండదండలు



ఏ ప్రతిభావంతునికి అన్యాయం జరిగినా నార్ల సహించలేదు. కేవలం పట్టభద్రుడైనా, జి.వి.కౄష్ణారావు చేసిన, కళాపూర్ణోదయం పై ఆంగ్లంపై పరిశోధనావ్యాసం పై రేకిత్తిన వివాదం విషయంలో, నార్ల స్వయంగా చదివి, ఉపాధ్యాయుని భాష, విశ్లేషణలోనే తప్పులున్నాయని. ఘాటుపదాలతోకూడిన లేఖను విశ్వవిద్యాలయం ఉపకులపతికి వ్రాయడంలో కనపరచిన ధైర్యసాహసాలు, కులగజ్జిధోరణితో విద్యావిధానాలను నిర్ణయిస్తున్న ఉపాధ్యాయుల వక్రతను, డా. గోవిందరాజులు నాయుడు గారు గ్రహించి న్యాయం చేయకపోతే, ప్రజలముందు ప్రస్తుతిస్తానని నిర్ద్వందంగా చెప్పడం, పట్టభద్రుని ప్రతిభ పరిశోధనలో ఉత్తీర్ణతను ప్రకటించవలసివచ్చింది. దీనితర్వాత, ఆంధ్రప్రభ లో కౄష్ణారావు వ్యాసాలు ఎన్నో ప్రచురించబడ్దాయి.



ముఖ్యమంత్రులు ఎవరైనా నార్లకు ముఖ్యులు కానేకారు!



కళాజీవన స్మౄతుల్ని, కళాకారుడిగా, అభిమానులకు జీవితముఖ్యాంశాలను పత్రికలో ప్రచురించేందుకు, గుంటూరు జిల్లా, తుమ్మపూడిలోని సూర్యదేవర సంజీవ్ దేవ్ ని నార్ల పరిచయం చేశారు. సమాజం, రాజకీయం లో అన్యాయాన్ని ఎన్నడూ సహించని నార్ల, రాష్ట్రపు ముఖ్యమంత్రులను సైతం ఖాతరు చేయని సన్నివేశాలు కోకొల్లలు. ఆంధ్రదేశపు ముఖ్య ముఖ్యమంత్రులైన - టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి.నరసింహారావులతో ఢీకొట్టాడు నార్ల. కాసు రెడ్డిగారు అయితే, ఆంధ్రజ్యోతి పనివిధానాన్ని రోజువారీగా (1969), పత్రికాస్వేఛ్ఛని అంతరించేందుకు అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టగా, పత్రికారంగం యావత్తూ విరోధించి, బిల్లును వెనక్కితీసుకునేలా ముఖ్యమంత్రిని చేయగలిగిన ఖ్యాతి, నాయకత్వం మన నార్లదే. ప్రముఖ పత్రికాసంపాదకుడు, మానికొండ చలపతిరావుగారు (నేషనల్ హెరాల్డ్ దినపత్రిక, సంపాదకులు), నార్ల నివాసాన్ని తరచుగా దర్శించి, నార్లతో ఎన్నో చర్చలు, సంభాషణలు జరిపేవారు. బౌద్ధ సంస్కౄతికి ప్రతిబింబంగా నార్ల అనేక వస్తువులు, జ్ౙాపిలకు సంగ్రహం చేసుకునేవారు.



నార్ల రచనలు రసరమ్యాలు, రమణీయాలు



ప్రముఖ సంపాదకులేకాక, రచయితగా, కధలు, కవితలు, నాటికలు, దేశచరిత్రలు, వ్యాసాలు, ప్రసంగాలు, పుస్తకాలపై విశ్లేషణలు కోకొల్లలుగా వెలిసినా, నార్లను గర్వించే ఆలోచనావాది, రచయిత, తన అసమర్ధతను పదేపదే చెప్పుకున్నా, ఎదురులేని వక్తగా తన ప్రతిభను నిరూపించుకున్నారు.



సౌరభ సంకలనాలు



నార్ల వారి సాహిత్యం యావత్తునీ, వివిధ తరగతుల్లో విభజించి, ఏడు భాగాలుగా ప్రచురణకు నోచుకొని, సాహితీప్రేమికులకు కానుకగా మిగిలింది. వాటిని, దేశచరిత్రలు, సాంఘిక నాటికలు, వ్యాసాలు, పౌరాణిక నాటికలు, సాహిత్య రచనలు, సంస్కౄతి, సాహిత్యం, మతం, వర్తమాన సంఘటనలు, జీవిత చిత్రణలు అని రసరమ్యంగా, రమణీయంగా దర్శనం చేయించారు. నార్ల వారి రచనలు, వాటి పేర్లు, హేతువాదాన్ని చెప్పకనే చెప్తాయి. ఉదాహరణకు, నార్ల, సీతజోస్యం, నరకంలో సత్యహరిశ్చంద్ర, పురాణ వైరాగ్యం (అసంపూర్తి వ్యాసం),నవయుగాల బాట నార్లమాట అన్న శతకం, యిలా ఎన్నో చెప్పవచ్చు.



వలదన్న సాహిత్య అకాడమీ పురస్కారం



సంపాదకుని తర్వాత, నాటక రచయితగా అవతారం ఎత్తారు నార్ల. 1981 లో నార్ల వారి నాటకం - సీతజోస్యం - సాహిత్య, ఆధ్యాత్మిక రంగాల్లోని ప్రజల్లో మంచి ఆసక్తి రేకెత్తింది. అయితే, ఏ అకాడమీనుంచి పురస్కారం అందుకున్నారో, ఆ సంస్థనుంచి ప్రచురించే పత్రికలోనే రచనపై విమర్శనాత్మకమైన రచనను ప్రోత్సాహించడం, పద్ధతికాదని, బిరుదుని తిరస్కరించిన శైలి నార్ల వారిది. నార్ల జీవితంలోని అనుభవాలు, వాదోపవాదాలు, అభిప్రాయాలు, ప్రసంగాలు, ప్రబోధాలు, చెణుకులు, చురకలు, పరిచయాలు, పరిచయాలను అన్ని కలిపిన స్మౄతిలిఖితాలను కొన్ని ఏరికూర్చి, 'కదంబం'గా చాలా పేరుతెచ్చింది. చాలా రచనలు ఆంధ్రప్రభలో ముద్రితమయినా, పలుకుబడివర్గం నుంచి వచ్చిన యిబ్బందులవల్ల అవి మధ్యంతరంలోనే ఆగిపోయాయి.



'తెలుగువాడీ ఆత్మగౌరవ ఉద్యమానికి చేదోడు, ప్రోత్సాహం



విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శ్రీకారం చుట్టిన తెలుగువాడి ఆత్మగౌరవానికి ఎదురైన అవమానాన్ని ఎదుర్కొనడంలో ఆచరించిన ఉద్యమానికి, నార్లవారు కూడ తనదైన శైలిలో చేయూత, ప్రోత్సాహం,తెలుగుదేశం స్థాపనలో భాగస్వామ్యం వహించారు. సాంస్కౄతిక వ్యవహారాలపై, రామారావుగారి ప్రభుత్వానికి సలహాదారుగా నార్లవారు తన సలహాలను, సంప్రదింపులను అందించారు.



కుటుంబమంతా వైద్యుల మయం



ధర్మపత్ని సులోచనాదేవి సహకారం ఎప్పుడూ చెప్పుకునేవారు నార్ల. అనేక విశ్వవిద్యాలయాలు నార్లకు డాక్టర్ ప్రదానం చేసినా, ఆయన ఎప్పుడూ పేరుతో దాన్ని జోడించుకోలేదు అన్నది విశేషం. అష్టదిగ్గజాలవంటి సంతానం నార్లకు. పరిమితంపై అచంచలమైన అవిశ్వాసం. నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. అందరూ వైద్యులూ, వైద్యులనే వివాహమాడారు. శ్రీమతి నార్ల తప్పితే, అందరూ డాక్టర్లే అంటారు. రెండు సంస్కౄతులు, భాషలమధ్య వివాహాలు తనకు సంతౄప్తినిచ్చాయని చెప్పారు. సంతానం ఎంత పట్టుపట్టినా, నార్ల మాత్రం విదేశాలకు వలస మార్చలేదు. వచ్చిపోతూండడమే తప్ప.



జీవితాంతం వెంటాడిన గ్రంధాలయం, హేతువాది నిజ దేవాలయం



నార్ల వారి పుస్తకాలు, నిజనేస్తాలు. మనసుల్ని, మనుషుల్ని నిజస్వరూపులుగా తీర్చిదిద్దేవి పుస్తకాలే. మెదడుకి మేత పుస్తకాలే అంటారు. ఎవ్వరినీ, వాటిని చదవనిచ్చేవారు కాని, తీసుకోనిచ్చేవారు కారు. ఎన్నో సంగ్రహాలయాలు, విశ్వవిద్యాలయాలు, ఆయన గ్రంధాలయంపై కన్ను వేశాయి. ఆయన చివరి శ్వాస వరకూ వాటిని చెక్కుచెదరనీయలేదు. వాటి సమక్షంలోనే ఆయన ప్రాణం వదిలాదు. నార్ల వారికి నిజ నేస్తాలు - పుస్తకాలు, నేస్తాలు. నార్ల మరణం తర్వాత, భార్య సులోచన చాలాకాలం నిర్వహించి, చివరకు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి భూరి విరాళంగా అందజేయడం తెలుగుకళ్ళు చేసుకున్న పుణ్యం. తెలుగు మేధ అందుకున్న మరింత తేజోకాంతిమయం. హైదరాబాదులో ప్రతీ ఏట, నార్ల పేరట స్మారక ఉపన్యాసాలు, సభాసమావేశాలు జరగడం పరిపాటి.



నార్ల వెంకటేశ్వరరావు గారికి నిజమైన స్మౄతినివాళి, తనకు ప్రేమాభిమానపాత్రమైన పత్రికారంగంలోని సంపాదకునిగా, రచయితగా, వెలిబుచ్చిన కొన్ని మచ్చుకైన అభిప్రాయాలను పున:శ్చరణ చేసుకోవడం కన్నా, ఆయన ఆత్మకు శాంతి లేదు, రాదు.



నార్ల వారి జయంతి సందర్భంగా తెలుగురథం షతసహస్ర ప్రణామాలని సమర్పిస్తోంది.



కొంపెల్ల శర్మ

'నార్లావారి సునాదాలు



అనంత కోటి ముక్కలుగా చీలుతున్న ఈ భూగోళం మీద మనుషులందర్నీ కలిపే మార్గం ఒకటుంది. అదే వార్తావాహిని.



ప్రజల సరసన నిలచి ప్రధనమ్ము నడుపుట పరమ ధర్మమోయి పత్రికలకు.



ప్రభుత వక్రమౌను పత్రికలేకున్న



వేగం జర్నలిష్టుల వేదం.



పత్రికయె నియంత పక్కలో బల్లెమ్ము పత్రికయె ప్రజాళి పట్టుగొమ్మ.



వేయి ప్రశ్నలుండు విజ్ౙానవేత్తకు ప్రశ్నలుండబోవు పామరునకు విజ్ౙుడౌను నరుడు జిజ్ౙాస.



వార్త పక్షాన వదంతిపై యుద్ధం, స్వాతంత్ర్యం పక్షాన నిరంకుశంపై యుద్దం. న్యాయం పక్షాన అన్యాయం పై యుద్ధం.



వార్తనేక మౌను ప్రాక్పశ్చమమ్ములు వార్తవలన స్వేఛ్ఛ పరిధి పెరుగు వార్త లేక వసుధ వర్ధిల్లనేరదు.



పదవినున్నవారు మదమ్మత్తులైనచో పట్టి పీకనట్టి పత్రికేల? తోకముడుచు పులని లోకమ్ము నమ్మదా?



పత్రికా రచయిత ప్రతిహారిగా నిల్వ అవని నిద్రపోవు నాదమరచి అతడు నిద్రపోవగతియించు భద్రత.



వర్తమాన జగతి పరివర్తనాలపై స్వేచ్ఛతోడ వ్యాఖ్య సేయనట్టి ఎడిటరెందుకోయి ఏటిలో గలుపనా.



పత్రికొక్కటున్న పదివేల సైన్యము.



పత్రికా రచనను పడుపు వౄత్తిగా మార్చు వెధవకంటే పచ్చి వేశ్య మేలు తనువు నమ్ము వేశ్య, మనసును కాదురా!



నార్లవారి శతజయంతి ఉత్సవాలు త్వరలో ... 1808 - 1908



ప్రతిభామూర్తి జయంతి, వర్ధంతి సాధారణమే. కాని, శతజయంతి నిజంగా, శతధా, సహస్రధా, జరుపుకోవడం, సర్వదా హర్షనీయం. నార్ల వారి ఆశయాలు, ఆశలు, ఈ ఏడాదిపాటు సింహావలోకనం చేసుకుని, అమలుపాటి కార్యక్రమాల్ని ప్రణాలికాబద్ధంగా విజయవంతంగా ఆచరణకు నోచుకుంటే, అంతకన్న అర్ధం, పరమార్ధం, లేవు, రావు.



'నార్లా జయంతి సందర్భంగా, తెలుగు జర్నల్ నుంచి ఘననివాళిని సమర్పించుకుంటూ ...

Thursday, November 26, 2009

న్యాయం లాంటి అన్యాయం - అన్యాయం లాంటి న్యాయం

న్యాయం లాంటి అన్యాయం - అన్యాయం లాంటి న్యాయం 



న్యాయాన్ని నమ్ముకోవడం న్యాయమే కదా! ప్రపంచవ్యాప్తంగా న్యాయానికి ఒక పండగ. అది జరిగితే సంబరాలు జరుపుకోవడం. ఏకారణలవల్లనైనా న్యాయం జరక్కపోయినా, దర్శనం కాకపోయినా, వాదోపవాదాలు, నినాదాలు, ఉద్యమాలు, అన్యాయంపై భావప్రకటనలు, నిరసలు, వేనకువేలవిధాలు. అందుకే, ప్రపంచం నాశనమైనా న్యాయం జరగవలసిందే అని అంటాడు చక్రవరి ఫెర్టినాండ్. ఏది న్యాయం ? ఏది అన్యాయం ? అని ప్రశ్నను, వివిధ కోణాలనుంచి బేరీజు వేసుకొంటేగాని, సమాధానం దొరకదు. న్యాయవవస్థ పనితీరుని విశ్లేషించే అర్హత, అధికారం ఎవరికున్నాయి అని ప్రశ్నించుకుంటే కూడ జవాబు అగమ్యగోచరంగా కనిపిస్తుంది. సమసమాజంలో పరిస్థితి అనువుగానే వుంటుంది కాని అది ఈ కలికాలంలో అది సాధ్యమా! యిప్పుడేకాదు, ఎల్లవేళలా ఈ న్యాయాన్యాయాల సమస్యలు, చర్చలు నిరంతరం కొనసాగుతూనే వున్నాయన్నది సత్యం. కొన్నివేళల్లో తప్పిపోయినా, న్యాయమే అక్కరకు వస్తుంది అని కందుకూరి ఒక సందర్భంలో భరోసా యిచ్చారు. న్యాయమనేది అదౄశ్యమవకూడదని న్యాయం పోతే అన్నీ తంటాలే వస్తవి, అందరితోనూ విరోధాలు వస్తాయి అన్నారు వారే ప్రముఖ రచన హాస్యసంజీవనిలో. న్యాయం పై చాలా మందికి అపారమైన నమ్మకాలుంటాయి. ఈ భావాన్నే, న్యాయమైన సొమ్ము నట్టేటిలో పారవేసినా పోదు అంటారు చెళ్ళపిళ్ళవారు తన కధలు-గాధలు లో. న్యాయాన్యాయాలు నిర్ణయించే చట్టాల తీరుతెన్నులు మనకున్న మొదటి చట్టాన్ని మన రాజ్యాంగం అనే చెప్పుకోవాలి. యిటీవలే భారతావని స్వాతంత్ర్హ్య జీవనకాలానికి షష్టిపూర్తి జరుపుకుంది. గడచిన అరవైయేళ్ళ ప్రాయంలో మన రాజ్యాంగపు సవరణలు అంతకన్న అధికం కదా. దీన్నిబట్టే సులభంగా చెప్పుకోవచ్చు - జనసామాన్యానికి అందించే పరిపాలనాయంత్రాంగపు విధానాల్లో, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది న్యాయం, ఏది ధర్మం, ఏది అన్యాయం, ఏది అధర్మం అని తేల్చుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. అందుకే, చట్టం పేదవాళ్ళను కాల్చుకుతింటుంది; ధనికులు మాత్రం చట్టాన్ని పాలిస్తారు అని నిర్ద్వందంగా చెప్పాడు గోల్డ్ స్మిత్. ఈ అసంమజసపు ధోరణితోపాటు, మన న్యాయవ్యవస్థ, చట్టపరిధి, పరిణామం మన జీవితాల్లాగ క్షణికాలు. చట్టం పొద్దున ఉన్నట్లు రాత్రి వుండదు అంటారు. అంతేకాదు, చట్టాల్నిఫ్ తయారు చేయడం కన్నా అమలుపరచటం ముఖ్యమని తరచు జనావని గొల్లు పెడుతున్నా, పట్టించుకున్న నాధుడు కానరాడు. అనవసరమైన చట్టాలు అవసరమైన చట్టాలను బలహీనపరుస్తున్నాయి. ఉదాహరణకు, తీవ్రవాదానికి, ఈ విపరీతధోరణిని నిర్మూలించేందుకు అందుబాటులోనున్నవి, వాటిని అమలుపరచటంలోని చట్టాల సత్తాని విశ్లేషించలేని దుస్థితిలో వున్నాం. సగటు మానవుడు, తన ప్రాణాన్ని గుప్పెట్లో ముడుచుకొని జీవనం చేస్తున్నాడు.

చట్టాలను తయారుచేసేది అతిక్రమించడానికే అన్న క్రిస్టఫర్ నార్త్ భావానికి సరైన ప్రస్తుత ఉదాహరణ - సమాచార హక్కు చట్టం అమలుచేస్తున్న కుహనా పద్ధతిని బట్టి చూస్తే, యించుమించు సమాచార హక్కుల చట్టం రాని పూర్వం స్థితే అని చెప్పాలి. ఏదో అవసరం అనుకుని, పదవి, బలం వున్నాయి కదా అని చట్టాలను యుద్ధప్రాతిపదిక పై రూపొందించి, అంతకన్న వాయువేగంతో మూలనపడవేయడాలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. 33 శాతం పార్లమెంటులో మహిళలకు కేటాయింపు విషయంలో యిదమిద్ధంగా మార్చుకోలేని చట్టం ఎక్కడ కునుకు తీస్తోందో మరి, వెదకండి. అసలు మన మహిళానేతలకైనా ఈ చట్టంపై శ్రద్ధ వుందా అని అనుమానాలు రేకెత్తిన సంఘటనలు లేకపోలేవు. యిలాంటి మనోబలం, సంకల్పం లేని చట్టాలు - బాలకార్మిక నిర్మూలన చట్టం, నిరక్షరాస్యతను నిర్మూలించే చట్టం, ప్రతీయేట మననం చేసుకుంటున్న గ్రామీణాభివౄద్ధి పధకాలు, మహిళా సాధికారత, లింగ వివక్షత, ఎన్నో, మరెన్నో. మరో విషయం, చట్టాలను తయారుచేసేది వాటిని అతిక్రమించడానికే అని తరచు అనిపిస్తుంది. విద్రోహచర్యలకై యిచ్చే శిక్షల విషయంలో, ఒక న్యాయస్థానం శిక్షిస్తే, మరొక న్యాయస్థానం వెనువెంటనే పూర్తిగా వ్యతిరేకంగా నిర్ధారిస్తుంది. ఈ ధోరణికి ఏకంగా న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతూండడమేకాక, నమ్మకం నశిస్తూంటుంది. చట్టంలేనిచోట నియంతౄత్వం మొదలవుతుంది అన్న విలియం పిట్ ధోరణి నిజం కాదేమో అనిపిస్తుందీ మన దేశంలో చట్టం లేని అవాంతర పరిస్థితుల కన్నా, చట్టం వున్న యిబ్బందులే ఎక్కువ అని అనికోవలసివస్తోంది. ప్రపంచ న్యాయ దినోత్సవం న్యాయం యింకా వుంది అని చెప్పుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా రోజు కేటాయింపులు, ఆ సందర్భాన పలవరింతలు, పలకరింతలు, ఆషామాషీగా నడుస్తున్నాయి. సెప్టెంబర్ 16 న ప్రపంచ న్యాయ దినోత్సవం జరుపుకోవడం అనేక అలవాట్లలో ఒక సంప్రదాయం. న్యాయంపై న్యాయమూర్తులు న్యాయమూర్తులుగారూ! మీరు బహుమంచివారే! అధర్మ నిధనంలో యమరాజంతటివారు, అని కుట్ర అన్న రచనలో రచయిత శివసాగర్ తన భావాన్ని వ్యక్తపరచారు. మన న్యాయమూర్తులు, అధిష్ఠాన సింహాసనాసీతులు అయినా, న్యాయం విషయంలో నటనాపర్వంలో పునీతులు. మన న్యాయస్థానాలు, న్యాయమూర్తులు కలసి ఉమ్మడిగా సమాజానికి చట్టం, న్యాయం, రాజ్యాంగ మాధ్యమాల ద్వారా, హెచ్చుతగ్గుల్ని తొలగిపోయేలా చేయడం, తద్వారా సమభావం, సామ్యవాదం అందించేలా అవిరళకౄషిని చేయవలసిన తరుణం నిత్య, సత్య, సత్వరంగా జరగాలి అన్నదాంట్లో సందేహం, సంశయం లేనే లేవు, రానేరాకూడదు. అందుకే హెచ్చుతగ్గులున్నచోట చచ్చిపోవు సమభావం, సమభావం లేనిచోట సామ్యవాదముత్తమాట అంటాడు. ఈ కవివాక్కు ఈనాడు సంపూర్ణంగా వర్తిస్తుంది అని చెప్పాలి. యిటీవలే షష్టిపూర్తి సంబరాలను జరుపుకుని, యింకా జరుపుకుంటున్న తరుణంలో మన భారతావనిలో సగటు మానవునికి రావలసిన న్యాయం ఎంత నిజంగా, ఎంత త్వరితగతిని లభిస్తోందో మనకున్న న్యాయస్థానాల అధిపతులు, న్యాయ యంత్రాంగ మంత్రాంగ శాఖలు, వీటి అధిపతులు, న్యాయపతులు, యిరుపక్షాల తమతమ వౄత్తులద్వారా ఎంతెంత న్యాయం చేస్తున్నారో వారి ఆత్మసాక్షే వారిని సమాధానపరచాలి. అందుకే, న్యాయం జరగడం ఆలస్యమైతే, అన్యాయం జరిగినట్లే నిర్ధారించాలి అని చెప్పిన నానుడిలో సత్యం కాక వేరే ఏమీలేదు. న్యాయస్థానాలు తమ ఎట్టకేలకు నిర్ణయాలను జారీచేసినా, వాటిని ఆచరించడంలో జరుగుతున్న జాప్యం కూడ దారుణంగానే వుంది. మన న్యాయవ్యవస్థలో లోపిస్తున్న సమన్వయ దౄక్పధం సమన్వయ దౄక్పధం అంటే - ముందుచూపు కోల్పోయిన గతదౄష్టి గానీ, వెనుకచూపును నిరసించిన భవిష్యదౄష్టిని గానీ మానవపురోభివౄద్ధికి దోహదకారులు కాలేవు అన్న అభిప్రాయం బలపడ్డమే అన్నది మన న్యాయవ్యవస్థకు ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకే తిక్కన, మహాభారతం లో - చెడబారినదైన అవస్థ అంటాడు. యిలా సాగింది. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ, దక్షులె వ్వారలుపేక్ష సేతురది వారల చేటగుగాని ధర్మని స్థారకమయ్యు సత్యశుభదాయకమయ్యును, దైవముండెడెన్. సమాజంలో అధర్మం-అసత్యాలచేత, ధర్మము-సత్యం దారుణంగా చ్రచబడుతున్నా, దానిని నిరోధించేశక్తి వుండీ ఉపేక్షించినవారికి తమ ఉపేక్షే చేటుగా పరిణమిస్తుంది. సరిగ్గా యిదే పరిస్థితి ఆనాటి భారతకాలంలో వున్న స్థితిగతులే, నేటి ఆధునిక, కలియుగ భారతావనిలోనూ ప్రత్యక్షదర్శనం అవుతున్నాయి. మార్పు ఎటొచ్చీ, యుగం, యుగధర్మపరంపర మారుతున్నాయి. అవే సమాజాలు, మనుషులు వారే. కొంచెంగా సాంకేతికత, శాస్త్రాలు, ప్రపంచవ్యాప్తంగా తంత్రాలు, కుతంత్రాలు, మనకున్న అంతశ్శతౄవులతో తోడయి సమాజాన్ని నిజమైన చెడబారినదైన అవస్థగా మారుస్తున్నారు, మన నేటి రాజకీయదక్షులు. నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చే వానిని ఈనాటి సంఘంలో 'కాంజెనిటల్ ఈడియట్'గా పరిగణిస్తున్నారు అన్నాడు ఒక విశ్లేషకుడు. అది అసాంతం మన న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, న్యాయస్థానాలకు, ఉమ్మడిగా వర్తిస్తుంది. నైతిక విలువలు మాత్రం మన చట్టాల్లోను, న్యాయశాస్త్రపుపుటల్లోనూ భద్రంగానే వుంచారు. తరచుగా వాటిని సంప్రదించవలసివస్తుందని, మన తీర్పులు సంవత్సరాలకొద్దీ ఓ కొలిక్కి రావు, వచ్చినా, అనూహ్యమైన కొసమెరుపులతో, ఆశ్చర్యానుభూతుల్ని కలిగిస్తాయి. న్యాయంపై, న్యాయం చుట్టూరా ఆవరింపులు ప్రజాస్వామ్యదేశమైన మనభారతావనిలో సగటుజీవికి న్యాయం గురించి ఆలోచించే జ్ణానం, తీరిక కూడ లేదు. కడుపుకాలుతూ, డొక్క లోపలికిపోతూ, రోజును గడుపుతున్న నీరసహౄదయ నలుసు ప్రాణానికి న్యాయమా, అన్యాయమా, ఏదీ వద్దు, తనను యధాతధంగా బతకనివ్వమంటాడు. మన న్యాయవ్యవస్థపై ప్రముఖ రచయిత రావిశాస్త్రిగారు విసరిన బాణాలు యిలా వున్నాయి. పని కూలీ వెధవల్ది, లాభం బుగతది, ఏమైనా అంటే, ఎదురు తిరిగితే మన సాయానికి కోఋర్టులున్నాయి, జైళ్ళున్నాయి (మాయ). మడిసి మాంసం అమ్ముకొని మడుసులు బతకడం నాయం కాదుకదా? (రత్తాలు రాంబాబు). పక్కింట్లో దొంగలు పడ్డప్పుడు లక్షలక్షలు పోవాలి, అది న్యాయం. (కష్టార్జితం) కేసుల్లోనే న్యాయం వుంటే ఈ పోలీసులం మేమెందుకు? ఇంతమంది ఈ ప్లీడర్లు అంతా ఎందుకూ? ఈ కోర్టులన్నీ ఎందుకూ? (న్యాయం). అన్యేయం చేయించీ నాలుగురోజు లూరుకుంటే అదే నాయెం ఊరుకుంటుంది. (విషాదం). భమిడిపాటి వారి న్యాయం పై నిర్వచనం యిలా వుంది. తను ఇతరుల్ని అంటే, తమాషాలు; తన్ని అంటే ఇతరులు, ఈర్ష్యట; ఇదిట న్యాయం. న్యాయమన్న బోనులో చిక్కుకున్న ప్రాణి బయటపడ్డానికి వీలులేదు, అంటారు న్యాయంపై యజ్ణన్నశాస్త్రి. మన మహాకవి శ్రీశ్రీ న్యాయం పై పంచరత్నాలు చెప్పారు. అందులో ఒక రత్నం యిలావుంది. నడిబజారులో నలుగురి ముందు హత్య జరిగినా సాక్ష్యం బందు, న్యాయం గుడ్డిది మాత్రమే కాదు, కుంటి, మూగని ఘోషిస్తాన్, అని ఉధ్ఘోషించారు. న్యాయం ఉరిపోసుకున్న పరిస్థితి కూడ మన రచయితలు చెప్పారు. నాకు విలువలేనప్పుడు నేనెందుకు? మీ ఏడుపేదో మీరే ఏడవండంటూ అక్కడే - కోర్టు గుమ్మానికే - ఉరేసుకుంది - న్యాయం ఉరేసుంది, అని అల్లంరాజు, న్యాయం ఉరేసుకుంది అని ప్రకటించారు. ఏది ఏమైనా నిరూపించలేని నిజాలను చట్టం ఒప్పుకోదు. మన న్యాయశాస్త్రం చెడ్డవాడిని మరింత చెడ్డవాడిగా చెయ్యడానికే ఉపయోగపడుతుందమ్మాయ్ అని సూర్యారావు ఒక పాత్రద్వారా, శ్రీమతులు-శ్రీయుతులు అన్న రచనలో చురకను అంటించారు. పైన వివరించిందంతా, జరిగినది, జరుగుతున్నది. మరి జరగాల్సిన తంతు సంగతి మాట ఏమిటి? దాని కధ, కమామీషూ ఎలా వుండాలి? సమాధానంగా - అధికారదుర్వినియోగంలాంటి అంటురోగాలకు దూరంగా, కేవలం పుస్తకాల్లోని వెర్రిమొర్రి న్యాయం కాక మంచులా స్వచ్ఛమైన న్యాయం జరగాలి ప్రతి మనిషికీ - అని అంటారు, కోర్టు అన్న రచనలో విశ్వం. యిటువంటి న్యాయం మన భారతావనిలోని సగటుమనిషికి, గ్రామీణ నిరుపేదకు, ఎవ్వరూ ప్రశ్నించకూడని, సమాధానపరచుకునే అవసరం రాని నిత్యజీవనం చేయడానికి కావలసిన సదుపాయాలను ఎలాగూ అందించలేకపోతున్నాం. కనీసం, న్యాయాన్నైనా అందించడానికి మనసావాచాకర్మాణా సంకల్పం చేద్దాం. దీక్షపూనుదాం. మన మేధలకు కంకణాల్ని కట్టుకుందాం. అన్యాయం పై న్యాయం వచ్చేవరకూ పోరాటం సాగిద్దాం. న్యాయం పేరిట అందిస్తున్న అన్యాయాన్ని తోసిపారేద్దాం. అప్పుడే, మన సర్వస్వతంత్ర స్వేచ్ఛాపూరిత భారతావని జరుపుకునే సంబరాలు, సష్టిపూర్తి పండుగలకూ అర్ధం, పరమార్ధం. అది లేనినాడు, పండుగలన్నీ దండుగలే. న్యాయ దినోత్సవం సదర్భంగా తెలుగురథం సత్వర న్యాయం కొసం ఆశిస్తొంది. కొంపెల్ల శర్మ

Monday, November 23, 2009

'ఫిడేళ్' వాదనకళకు సార్ధక నిర్దేశకుడు - 'ద్వారం' నాయుడూ (1893 - 1964)

'ఫిడేళ్ వాదనకళకు సార్ధక నిర్దేశకుడు - 'ద్వారం నాయుడూ (1893 - 1964)

వాయులీనం లో విలీనమైన 'ద్వారం' ఫిడేల్, వైలెన్, వాయులీనం. ఈ పదాలు సాధారణంగా అర్ధంకానివి. పదాలు వేరైనా, వాటి అర్ధం, పరమార్ధం, ఒక్కటే. లలితకళల్లో, అజరామరమైన భాగంగా విరాజిల్లే సంగీతం. అందులోనూ వాద్యసంగీత విభాగం. వాయులీనం. దానినే, ఫిడేల్, వైలెన్ అని పిలవడం పరిపాటి. సంగీత కళకు, కళాకారులకు మధ్య వారధిలా చెలామణి అవుతున్న పరికరం. ఎందరో కళాకారుల చేతుల్లో ఒదిగిపోయి, వినయంగా తన్నుతానే సమర్పించుకున్న సంగీత పరికరం. అటువంటి కళాకారుల్లో, ప్రముఖులు, ప్రప్రధములు - 'ఫిడేళ్ నాయుడుగారు. ఆయనే 'ద్వారం' నాయుడుగారు. ఆయన, ఎవరో, వేరెవరో కాదు - ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. 'ద్వారం' ప్రపంచానికే ముద్దుపేరు సంగీత కళాజగతి కి ముద్దు పేరు 'ద్వారం'. సంగీత కచేరీ వేదిక పైన ప్రక్కనే స్థానం, సహవాద్యకారులుగా చెలామణి అవుతున్న దశనుంచి దిశానిర్దేశం కావించి, పరిపూర్ణ వాయులీన (వైలన్ లేక ఫిడేల్) సంగీత వాద్య పరికరానికి, మూగవోయిన పనిముట్టుని 'మెలోడీ ఫీస్ట్' గా మార్చడానికి కంకణం కట్టుకుని, కౄషిని సాధించిన ఘనత కేవలం ద్వారం నాయుడి గారి కళాజీవన ప్రస్థానం లో మరువలేని, మరింక మార్చలేని మైలురాళ్ళు. 20వ శ. చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ప్రధమగణంలో వినుతికెక్కిన ద్వారం వెంకటస్వామి నాయుడు గారు 8 నవంబర్ 1893 న బెంగుళూరులో దీపావళి రోజున కళ్ళు తెరవడంతో సంగీతజగతిలో మరింతగా కాంతి, వెలుగు చోటుచేసుకున్నాయి. తండ్రి వెంకటరాయుడు, ఆర్మీ లో కమీషన్ అధికారిగా ఉద్యోగం చేయడం, ఆయన ఉద్యోగ విరమణ తర్వాత విశాఖపట్నంకు వలసవెళ్ళారు. అనకాపల్లి దగ్గరలోని కాసింకోట వద్ద స్థిరపడ్డారు. అన్న వద్ద వైలన్ విద్యను అభ్యసించిన ద్వారం తండ్రికి కూడ ఈ వైలన్ విద్యలో అభినివేశం వుండడం విశేషం. తాత పేరును సార్ధక నామధేయం చేసుకున్న వెంకటస్వామి నాయుడు గారు, తన అన్నగారు వెంకటకౄష్ణయ్య, తాత దగ్గర వైలన్ నేర్చుకుంటున్న సమయంలో, మన నాయుడుగారు కూడ అన్నగారి వైలన్ ను కోరిక మేరకు రహస్యంగా కదిలించేవారట. ఫలితంగా, ఆరేళ్ళకే తమ్ముడిని వైలన్ విద్యలో పెట్టవలసివచ్చింది. దీనికి కారణాలు - తన వైలన్ ను ఏం చేస్తాడో అని అన్నకు భయం, నాయుడుగారికి కలుగుతున్న అమితమైన శ్రద్ధాసక్తులు. అంతేకాక, ముఖ్యంగా, నాయుడుగారికి చిన్నప్పుడు చూపులో కొంచెం సమస్య వున్న కారణంగా చదవడం, వ్రాయడం సమస్యగా మారుతున్న వైనంలో, సంగీతం పై దౄష్టి మరల్చవలసి వచ్చింది. ప్రాధమిక శిక్షణ తర్వాత, ప్రముఖులు పండిత సంగమేశ్వరశాస్త్రిగారి వద్ద నాయుడుగారు వైలన్ వాదనంలో నిష్ణాతులు అవ్వడం జరిగింది. అందుకే నాయుడుగారు తరచుగా నల్లరంగు కళ్ళజోడు ధరించేవారు. ఫిడేల్, వైలన్ నాయుడుగారు 14వ ఏటనుంచే వైలన్ తో తాదాత్మ్యం పొందడం, ప్రముఖ సంగీత విశ్లేషకుడు మారేపల్లి రామచంద్రరావు ద్వారం వైలన్ ప్రతిభను గమనించి, డైమండ్ ఉంగరాన్ని కానుకగా యివ్వడమే కాక, ద్వారం వారిని 'ఫిడేల్ నాయుడూ అని బిరుదుని యిచ్చేరట. వైలన్ నే ఫిడేల్ అని పిలుస్తారని చాలా మందికి తెలియని విషయం. ఫిడేల్ అంటే 'ఫిడులా' అని జర్మనీ దేశపు పదంనుంచి ఫిడేల్ అని రూపాంతరం చెంది నాయుడుగారి దగ్గరకు చేరుకుంది. అప్పటినుంచి, ఫిడేల్, ఆంధ్రదేశపు సంగీతజగతితో మమైకం అయింది. వైలన్ పుట్టు పూర్వోత్తరాలు సంగీత వాద్య పరికరమే కొత్తగా అనిపించే, వైలన్, 17శ. మధ్యకాలంలో వాయులీన పరికరాలకు ప్రాణంపోసే పాశ్చాత్యుల పుణ్యమా అని, కర్నాటక సంగీత సంప్రదాయంలో అన్యాపదేశంగా ప్రవేశించి, తిష్ఠ వేసుకుంది. మొదటిసారిగా, 'వడివేలూ అన్న విద్వాంసుడు, ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలని వైలన్ పై అందించగా, దీక్షితులవారి సోదరుడు బాలు (1786-1859) దక్షిణభారత సంగీత వినువీధుల్లోకి వైలన్ ను తీసుకొచ్చిన ఘనత మనకు అలవడిన సంప్రదాయం. తర్వాత, 19శ. ఆఖరి పాదంలో, కర్నాటక సంగీతధోరణుల్లో, వైలన్ తో సంపూర్ణ ఏకైక వ్యక్తితో కచేరీ చేయడం ప్రారంభం అవడం, దీనికి తిరుకొడికవల్ కౄష్ణ అయ్యర్, గోవిందస్వామి పిళ్ళైలు రంగ్రప్రవేశం చేశారని సంగీత చరిత్ర చెబుతున్న కధనాలు. వీణ, వేణువు, నాదస్వరం తో వైలన్ ను చేర్చిన ఘనత వాద్యసంగీతజగతిలో అంతవరకూ నిత్యనూతనంగా అలరించిన, వీణ, వేణువు, నాదస్వరం ల ఘనమైన వరసలో వైలన్ ను నిలబెట్టిన ఘనత మాత్రం మన 'ఫిడేళ్ ద్వారం నాయుడుగారే అన్నది మాత్రం సత్యం. వీటికి వైలన్, వాయులీన ప్రక్రియ ఏమాత్రం తీసిపోదని కూడ నిరూపించిన నిష్ణాతవిద్వాంసుడు - ద్వారం నాయుడు. ద్వారం గురించి ప్రముఖుల కౄషి, ప్రశంసలు నాయుడుగారి ప్రతిభను చిత్రించిన రవివర్మ పాశ్ఛాత్య, భారతీయ సంగీత మెలకువలను ఆకళింపుచేసుకున్న నాయుడుగారి వైలన్ పరికరాన్ని కచేరీలో నియంత్రించే విధివిధానాలు, నాయుడుగారి భంగిమ, చేతివేళ్ళతో తంత్రిణీస్వరలక్షణాలన్నింటినీ, ప్రముఖ చిత్రకారుడు రవివర్మ తనదైన ప్రత్యేకమైన శైలిలో నాయుడుగారి కచేరీ చేసున్నట్లు చిత్రం విశ్వవ్యాప్తంగా ఆశ్చర్యానందభూతుల్ని చేసింది. రవివర్మ చిత్రంలో నాయుడుగారి మనోధర్మ సంగీత లక్ష్యలక్షణాల్ని ప్రతిభావంతంగా ప్రదర్శించారు అన్నది మహామహుల అభిప్రాయంగా నేటికీ వినవస్తుంది. ప్రముఖ సంగీతవిద్వాంసుల మెచ్చుకోళ్ళు ద్వారం నాయుడుగారి కళాప్రతిభను కొనియాడుతూ, వివిధరంగాల్లోని ప్రముఖులు ప్రశంసలను చెప్పడం కూడ జరిగింది. అందులో, ప్రముఖ సంగీతవిద్వాంసులు - టి.యల్. వెంకట్రామ అయ్యర్, టి.వి.సుబ్బారావు, పి.సాంబమూర్తి, అరియకూడి రామానుజ అయ్యర్ (సంగీత కచేరీ సంప్రదాయానికి విధులు నిర్ణయించినవారు), తిరుకొడికవల్, ఆఖరున చెప్పుతున్నా, మొదటగా ప్రస్తావించదగిన ప్రముఖ సంగీత కళాకారుడు - శ్రీ సెమ్మనగుడి శ్రీనివాస అయ్యర్ గారు లాంటి ప్రభౄతులు ద్వారంవారి ప్రతిభను వేనోళ్ళ కొనియాడడం ఆ రోజుల్లో సర్వసామాన్యం. ప్రముఖ కవులనుంచి అనుభూతులు సంగీత విద్వాంసులతోపాటు, ప్రముఖ ఆంధ్రులు, కవులు కూడ తమ కవిత్వంలో ద్వారం వారిని మరవలేదు. వారిలో, చెళ్ళపిళ్ళ, విశ్వనాధ, బాలాంత్రపు రజనీకాంతరావు, గుర్రం ఝాషువా, గుంటూరు శేషేంద్రశర్మలను మరువలేం. సమాజంలోని అన్నివర్గాల ప్రతినిధులనుంచి ద్వారం నాయుడు గారు పొగడ్తలను అందుకున్నారు. ప్రపంచ వైలన్ విద్వాంసుడు 'యెహుది మెనుహిణ్కి శౄంగభంగం ప్రతిభ వున్న చోట అధికారంతోపాటు అహంకారం కూడ అధికమైన కళాకారులను ఆవరిస్తాయి అంటారు. ప్రపంచ ప్రఖ్యాత వైలన్ విద్వాంసుడు, 'యెహుది మెనుహిణ్ ఒక సన్నివేశంలో తన వైలన్ పరికరాన్ని, ద్వారం వారికి చూపించడానికి కూడ అంగీకరించలేదట. కాని, నాయుడుగారి వైలన్ వాదన ప్రభంజనం గమనించాక, ఈ మహానుభావుడు ఆశ్చర్యపోవడమే కాక, చివరికి ఆయన ఘనపరికరాన్ని నాయుడుగారికిచ్చి, వాయించమని వినయప్రకటన చేశాడట. అంతాకాక, ద్వారంవారిని ఆహ్వానించాడట. అదండీ, మన తెలుగు వెలుగు, తెలుగు తేజం తెలుగుదనం! గురుదేవ్ రవీంద్రుడు కలిపిన స్వరగళం ద్వారం నాయుడుగారి వైలన్ వాద్య కచేరీని కొద్ది నిముషాలే చూడగలగను అన్న గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్, అన్ని ముఖ్యకార్యక్రమాలను అనుకున్నవి మరచిపోయి, పూర్తి కచేరి వినడమే కాక, నాయుడుగారి కీర్తనలకు రవీంద్రుడు స్వరం, గళం కలిపి గానం చేయడం సంగీతచరిత్రలో ప్రముఖ సంఘటనగా నిలచిపోయింది. నిలయవిద్వాంసుల కార్యక్రమాల్లో నాయుడుగారి వైలన్ వాద్యమే ఎప్పుడూ! ఆ రోజుల్లో ఆకాశవాణి కార్యక్రమాల్లో, ద్వారం నాయుడుగారి వైలన్ కచేరీలు కోకొల్లలుగా వచ్చేవి; అంతేకాక, ప్రకటించిన కార్యక్రమాలకు అంతరాయం వచ్చిన సందర్భాల్లో, నాయుడుగారి కచేరీయే తరచుగా ప్రసారం చేసేవారట. అలాగే, కాకినాడ సరస్వతీసంగీతసభ కార్యక్రమానికి, అనుకున్నట్లుగా, గురువౄద్ధుడు, గోవిందస్వామి పిళ్ళై రాలేని పరిస్థితిలో, యువకుడు ద్వారం వారి వైలన్ కచేరీ పెట్టాలని సలహా యిచ్చారట. వయోభేదం అడ్డురాదన్న మాటకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సంగీత కళాశాలకు వన్నెలు ప్రముఖ హరిదాస పితామహులు ఆదిభట్ల నారాయణదాసుగారు విజయనగరం సంగీత కళాశాల మహామహోపాధ్యాయులుగా వున్నప్పుడు, ద్వారం వారిని కేవలం 25 ఏళ్ళకే (1919 లో), విద్యార్ధిగా పరీక్షకు వచ్చినప్పుడు చూపించిన ప్రతిభ నేరుగా వైలన్ శిక్షణ విభాగానికి అధిపతిగా నియామకానికి దారితీసింది. అంతేకాక, ఆదిభట్ల వారి తర్వాత, ద్వారం వారే విజయనగరం కళాశాల స్థానాన్ని 1936 లో ఆక్రమించారు అన్నది ద్వారం వారి ఘనప్రతిభ వెల్లడయింది. ప్రతిభాపురస్కారాలతో ద్వారం విశిష్ట ప్రక్రియలు ద్వారం వారిని వరించిన బిరుదులు, పురస్కారాలు, సన్మానాలు, అగణితాలు. 1938 లో వైలన్ సోలో ప్రదర్శన, తమిళనాడులోని వెల్లూరు లో యిచ్చారు. 1952 లో అంధుల సహాయసంస్థకు నిధులను చేకూర్చేందుకు, డిల్లీలోని జాతీయ శాస్త్రీయ సంస్థ లో ప్రదర్శన యిచ్చారు. న్యాయవాది పి.వి.రాజమన్నార్ యింట్లో ప్రముఖ అంతర్జాతీయ వైలన్ విద్వాంసుడు యేహుది మెనుహిన్ ఆశ్చర్యం మేరకు ద్వారం వారి కచేరీ జరిగింది. కర్నాటక సంగీత కచేరీ కార్యక్రమాల్లో వైలన్ ను వాడవచ్చు అన్న భావకుల్లో ద్వారం ప్రధములు అని చెప్పుకోగలిగిన ఘనత. సంగీతకళ పై ద్వారం ఎన్నో వ్యాసాలు - 'తంబూర వింతలు, విశేషాలూ అన్నది మచ్చుతునక. సంగీత కళానిధి (1941 - మద్రాసు మ్యూజిక్ అకాడమీ); కళాప్రపూర్ణ (1950 - ఆంధ్రవిశ్వవిద్యాలయం); సంగీత నాటక అకాడమీ, లలితకళలు (1953); పద్మశ్రీ (1957 - భారతప్రభుత్వం); ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన సంగీత కళాకారుడుగా నియామకం (ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ, ఉపాధ్యక్షులు). రాజలక్ష్మీ పురస్కారం (1992 - నాయుడు స్మారక సంస్థ, చెన్నై); శతజయంతి 1993 - భారతప్రభుత్వంవారి స్మారకచిహ్నంగా నాయుడుగారి తపాలాబిళ్ళ. ద్వారం సలహాలు విద్యార్ధులకు, వర్ధమాన కళాకారులకు, కనీసం ఒక్కరోజైనా సరే సాధన తప్పకూడదు అని సలహా చెప్పారు. ఒక్కరోజు తప్పితే - ఎవరి తప్పులు వారికే తెలుస్తాయి, రెండురోజులు అయితే - ప్రేక్షకులు, రసికులు కూడ తెలుసుకునే తప్పులు అని విభజించారు. నాయుడుగారు సంగీతం ఒక 'శ్రవణ తపస్సూ అని వర్ణించారు. ద్వారం నాయుడు గారి స్మారక సంస్థలు చెన్నైలో స్మారకసంస్థ, విశాఖపట్నంలో స్మారక కళాక్షేత్రం తో పాటు, విశాఖపట్నం, చెన్నైలో నాయుడుగారి విగ్రహాలు ఆయన ప్రతిభకు తార్కాణాలు, నిదర్శనాలు. 'ద్వారం' వారిపై ప్రముఖుల అభిప్రాయాలు దేశాన్ని వైలన్ వాద్యంలో ముంచెత్తి, సంగీత నాదాన్ని అందంతో, ఆనందంతో అందజేసిన మహావిద్వాంసుడు; సంస్కౄతీ పునరుద్ధరణ సమయంలో 'ద్వారం' లేని సంగీత ప్రపంచాన్ని ఆలోచించడం కష్టతరం. (కళాక్షేత్ర, వ్యవస్థాపకురాలు, ప్రముఖ నాట్యకళాకారిణి - రుక్మిణీదేవి అరండలే) ఆకాశవాణి లో ద్వారం కచేరి విని ప్రభావితమైన సంఘటన - నా జీవితంలో ఒక అమోఘమైన మైలురాయి. (నూకల సత్యనారాయణ, ప్రముఖ సంగీత విద్వాంసులు) వైలన్ విద్వాంసుడిగానే 'నూకలా ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రముఖ గాత్ర సంగీత ప్రతిభావిద్వాంసులుగా నిలిచారన్నది జగద్వితిమే. కర్ణాటక సంగీత సంప్రదాయ ధోరణి లో ఆచరించే ఒక 'ప్రోటకాళ్(సదాచారం) ప్రకారం, సహవాద్య సంగీత కళాకారుడే, గాత్ర సంగీత కళాకారుడి వద్దకు వెళ్ళడం ఆనవాయితీ. అయితే, ద్వారం వారి వద్దకు సుప్రసిద్ధ గాత్ర సంగీత విద్వాంసులు తమంత తామే స్వయంగా వచ్చి పలకరించే విధానాన్ని బట్టి, ద్వారం వారి ప్రతిభ, గౌరవం, మర్యాద, వర్ణనాతీతమైనే చెప్పాలి; కళాకారుడికి సాధనాభ్యాసాలు నిత్యావసరం అన్న సూత్రాన్ని, మనసావాచాకర్మణా, నమ్మి, మనోధర్మ ప్రవౄత్తిని ఆచరించిన కళాకారుల్లో ప్రముఖులు ద్వారం నాయుడుగారు. ఒకసారి విజయవాడ కచేరీకి వచ్చి, 'మహిమ తెలియ తరమా' అన్న కౄతి పల్లవి సరిగ్గా కుదురుట లేదని, అభిప్రాయాలను అల్పస్థాయి కళాకారులను కూడ సంప్రదించడం జరిగేది. (ప్రముఖ సంగీత విశ్లేషకులు - టి.ఆర్.సుబ్రహ్మణ్యం). నాయుడు గారి నిరాడంబరత యింత పేరు ఎలా తెచ్చుకున్నారు అని ద్వారం వారిని అడిగితే, 'ఎట్లా వాయించాలో నాకు తెలియదు; ఏదో వాయించాను; బాగుందో, లేదో, నాకు తెలియదు" అని తరచు ద్వారంవారు సమాధానం చెప్పడం వారి నిరాడంబరతా వ్యక్తిత్వానికి, హౄదయవైశాల్యతకి, మానవతకి నిదర్శనం అని పలువురి భావన. ద్వారం ప్రియరాగాలు ద్వారం నాయుడు గారిని, వారి ప్రియసంగీత రాగాలు ఏమిటని అడిగితే, తరచుగా వచ్చే రాగాలు - కాపీ, బేహాగ్, నళినకాంతి రాగాల్లో సుదీర్ఘమైన 'కరవై'లతో ప్రదర్శించే రాగాలు అని చెప్పడం, భక్తులు దైవప్రార్ధనలో మునిగిపోయి పరిసరాలను మరపించి రాగదేవతను ప్రత్యక్ష దౄశ్యం కలిగించే అనుభవం తరచుగా అయేదిట. 'ఖమాశ్, 'నీలాంబరీ లాంటి రక్తి రాగాలను అందించడంలో అధ్బుత కౌశలత్వం, విశిష్ట సౌందర్య నాదాలుద్భవించేవట. ద్వారం వారు, విజయనగర సంగీత కళాశాల నిర్వాహకత్వంలో అధిక విద్యార్ధులు వైలన్ విభాగంలోనే, గాత్ర సంగీతభాగంలో కన్న, అభ్యసించేందుకు సంసిద్ధత ప్రదర్శించేవారని, అందరూ, ఎప్పూడూ, ఈనాటికీ, అనుకునే మాట. ఆంధ్ర సంగీత జగతి చేసుకున్న పుణ్యం సంగీతకళానిధి గా విశ్వవిఖ్యాతమైన ప్రతిభను తెచ్చుకున్న ద్వారం వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ సంగీతప్రియులు చాలా అదౄష్టవంతులని, దక్షిణ, అఖిల భారత సంగీత కార్యక్రమాల్లో ప్రాతినిథ్యం వహించిన వారిలో ద్వారం వారు ప్రధముల్లో ప్రధములు అని చెప్పాలి. కళాకారుడికి వుత్పన్నమయ్యే ప్రతిభాపాటవాలు విశిష్టమై, విశ్వవ్యాప్తమైతే, తోటి వర్ధమాన కళాకారుల ప్రశంసలు కూడ తప్పక లభిస్తాయి అన్నది ద్వారం వారి విషయంలో నిజం అయి కూర్చుంది. అదే వారికీ, వారి సహకళాకారులకీ సౌభాగ్యం. విశ్వసంగీతజగతి ద్వారాలు తెరుచుకున్నప్పుడల్లా, ద్వారం వెంకటస్వామి నాయుడుగారు, వారితోపాటు, వారి మాంత్రిక వైలన్ వాదనవైభవం లేనిదే ద్వారాలు తెరచుకోవు అన్నదాంట్లో ఆశ్చర్యం, అతిశయోక్తి లేదు. ద్వారం వారి జయంతి, వర్ధంతి నవంబర్ నెలలోనే సాధారణంగా జరగడం యాదౄఛ్ఛికం. నవంబర్ 8 వారి జయంతి అయితే, నవంబర్ 25 న వారు మహాభినిష్క్రమణం చెందారు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి: అన్న నానుడి, బహుశ ద్వారం వారి వాయులీనవాదన సౌరభం విన్న తర్వాత వచ్చినది కావచ్చు. గురజాడ పదానికి ద్వారం స్వరం 'దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా' అన్న దేశభక్తి గీతానికి ప్రముఖ కవి గురజాడ సాహిత్యరచన కావిస్తే, ఆ గీతానికి స్వరరచన చేసింది మన ద్వారం నాయుడు గారే. గురజాడ శత వార్షిక సంఘం, హైదరాబాద్ సంచిక వారు ప్రచురించారు. సింధుభైరవి రాగం - మిశ్రచాపు తాళం (హనుమత్తోడి రాగ జన్యం) లో నడచిన వైనం ఆ నాడు యావద్భారతాన్ని పులకాంకితుల్ని చేసింది. ద్వారం వారికి, వర్ధంతి సందర్భంగా తెలుగురథం కళానివాళిని వినమ్రంగా సమర్పించుకుంటోంది. కొంపెల్ల శర్మ - తెలుగు రథం.

ఆంధ్రుల మేథాషక్తికి నిదర్షనం - భోగరాజు పట్టాభి సీతారామయ్య

భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880 - 1959)


ఆంధ్రుల మేథాషక్తికి నిదర్షనం - భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒక్కొక్క జీవితానికి హౄదయమే పునాది; అయితే, మరొక్కొక్క జీవితానికి మేధస్సే ప్రధానంగా అయి వుంటుంది - అన్నారు ప్రముఖ కవి ష్రీపాద సుబ్రహ్మణ్య షాస్త్రి గారు. తీరని కోరిక, తపన ఉన్న మనిషి గొప్ప మేధావి అవుతాడు. అయితే, హౄదయం, మేధస్సుల సమన్వయంతో తన ప్రతిభను అందించి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని భావి తరాల వారికి మార్గదర్షకమయిన మహానుభావులు మన తెలుగునేల పై ఎందరో మనకు స్ఫురిస్తారు. అటువంటి మహనీయుల్లో నేడు స్మరించదగ్గ ప్రతిభావంతుడు కీ.షే. భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులు గారు


భోగరాజు వారి జీవితంలో - స్వాతంత్ర్యోద్యమంలో గాంధీకి బాసటగా అనుసరించడం, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు నేపథ్యకథనంలో ప్రముఖ పాత్ర, జాతీయ కాంగ్రేసుకి అందించిన సేవలతోపాటు కాంగ్రేసు చరిత్రని గ్రంథస్థం చేయడం, తెలుగువారి గర్వకారణమైన ఏకైక ఆర్థిక సంస్థగా ఆంధ్రాభ్యాంకు వ్యవస్థాపకుడుగా పట్టాభి పాత్రకి సరిసమత్వం ఆలోచనలోకాని, ఆచరణలోకాని కానరాని పరిస్థితి. ప్రముఖ తెలుగుతేజం, పట్టాభి గారి జయంతి సందర్భంగా సమర్పిస్తున్న ఈ వ్యాసం ద్వారా నివాళిని అందజేస్తున్నాం. ఇద్దరే ఇద్దరు పంతుళ్ళు మన తెలుగునేలకు ఈ రోజు ప్రత్యేకంగా రాష్ట్రం లభించిందంటే - ప్రముఖంగా ఇద్దరు తెలుగుతేజాలని స్ఫురణకు తెచ్చుకుతీరాలి. ఆంధ్రకేసరి ష్రీ టంగుటూరి ప్రకాషం పంతులు గారు మరియు ష్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులు గారు. మూర్తీభవించిన అభినివేషానికి, అధ్బుత మేథాషక్తికి నిదర్షనం ఈ యిద్దరు మహానాయకులు అని ఖచ్చితంగా చెప్పాలి. భాషా రాష్ట్రాలన్న భావన వచ్చినప్పుడు, భోగరాజు వారే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలాని 1917 లో అనిబిసెంటు హోం రూలు లీగ్ ఉద్యమం స్థాపన జరిగిన నాటినుంచీ తెలుగునేల నలుదిషల పర్యటించి తన షంఖారావాన్ని మ్రోగించిన మహనీయుడు. గాంధీజి ఉద్యమ ప్రచారాల భాష్యకారుడు గాంధీజీ భావసిద్ధాంతాలు, ప్రవచనాల పట్ల అవగాహనతో వాటికి చక్కని భాష్యకారునిగా గాంధీజీ విష్వాసాలను పొందడమే కాక, చాలా మంచిపేరు తెచ్చుకున్నారని, ఆనాటి పట్టాభి సమకాలీనులు చెప్పుకునేవారు. విదేషీ వస్తు బహిష్కరణోద్యమంలో చురుగ్గా పాల్గొనడం, గాంధీతో కలసి సన్నిహితంగా పనిచేయడం, పట్టాభిగారి కార్యదీక్షాసంకల్పకంకణబద్దుడిగా గాంధీజీ మెప్పుదలని పొందడమే కాక, గాంధీజిని ముగ్ధుడిని చేషాయి. సలహాసంప్రదింపులు చేయాలనుకున్నప్పుడు గాంధీజి తప్పనిసరిగా సంప్రదించిన వ్యక్తుల్లో ప్రముఖుడిగా పట్టాభి స్థానాన్ని పొందడం ఆనాటి విషేషం. గాంధీ నిర్వహణలో ఉద్యమాలన్నింటిలో పాల్గొనడం, ఫలితంగా ఆంధ్ర కాంగ్రేసు అధ్యక్షపదవి పట్టాభికి లభించింది. అంతేకాదు, 1939 లో త్రిపురలో జరిగిన అఖిలభారత కాంగ్రేసు సభల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో పట్టాభి పోటీపడడం జరగడం, గాంధీజీ మదత్తు లభించినా అపజయాన్ని చవిచూసిన ధైర్యషాలి. ఆనాడు తమిళప్రాంత ప్రభావం ఉన్న కొన్ని ప్రాంతాల్ని భావికాలంలో ఏర్పాటయ్యే ఆంధ్రలో కలుపుకునేందుకు పట్టాభి కృౠషిచేస్తున్నట్లుగా భావించి, రాజకీయ దురంధరుడు, నల్లకళ్ళజోడులోంచి అదౄశ్యపు రాజకీయాన్ని నడిపించిన రాజగోపాలాచారి వల్ల పట్టాభి పరాజయం పొందడం చరిత్రలో భాగమైన సత్యం. ఈ సందర్భంలో, గాంధీ - 'పట్టాభి ఓటమి నా ఓటమీ అని చెప్పుకోవడం గాంధీజికి పట్టాభిపట్ల ఉన్న విష్వాసాన్ని తెలియపరచింది. తదుపరి, 1948-49 లో జైపూరు లో జరిగిన కాంగ్రేసు సభలో - పట్టాభిని అఖిల భారత కాంగ్రేసు మహాసభలో పురుషోత్తమదాస్ తాండన్క్ ని ఓడించి పట్టాభిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ అధ్యక్షహోదాలోనే ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం తీవ్రమైన సంచలానాత్మక ఉద్యమపోరాటం పట్టాభి హయాంలోనే ఊపు, రూపు, అందుకున్నాయి. బందరులో తెలుగు జిల్లాల ప్రముఖుల సమావేషం (1908), బాపట్లలో తొలి ఆంధ్రమహాసభ (1913) సమావేషాల్లో జరిగిన ప్రత్యేకాంధ్రరాష్ట్రం ఆవష్యకతపై అంకురార్పణ పట్టాభిగారి ద్వారానే జరగడం, ఆ సభల వివరాలను ప్రత్యేకంగా ఆంగ్లగ్రంథాన్నే రచించడం జరగడం మంచి పరిణామం. ఫలితంగా 1920 లో కాంగ్రేసు పార్టీ ప్రధమంగా ప్రత్యేకాంధ్రపై సూచనప్రాయంగా ఆమోదించడం జరిగింది. త్రిసభ్యసంఘం ద్వారా ప్రత్యేకాంధ్రరాష్ట్రం ప్రత్యేకాంధ్రరాష్ట్రం పై పరిషీలనకు త్రిసభ్య సంఘాన్ని నియమించడం, అందులో, నెహ్రూ, పటేల్, పట్టాభి సభ్యులుగా కూలంకష చర్చలు జరిగాయి. ఈ త్రిసభ్యసంఘాన్ని ఆరోజుల్లో - 'జెవిపీ కమిటీగా పిలిచేవారు. విభిన్న ధ్రువ షిఖరాలైన నెహ్రూ, పటేల్ లను మెప్పించిన పట్టాభి, కమిటీద్వారా ప్రత్యేకాంధ్ర రాష్ట్రానికి సిఫార్స్ చేయించిన ఘనత మాత్రం ఈ మేధావికే చెందుతుంది. పట్టాభి మేధావితనానికి, రాజనీతిజ్ౙతకి, నిదర్షనం. ప్రత్యేక తెలుగురాష్ట్రమే కాక, తెలుగు జిల్లాల్లో తెలుగు వాడకాన్ని అధికాధికంగా ప్రోత్సహించడం, తాను స్థాపించిన సంస్థల్లో ఖచ్చితంగా కార్యకలాపాలను తెలుగులోనే జరపాలని నియమ నిబంధనలతో ఆదేషించడం, ఆచరించేలా చూడడం జరిగింది. వేషభాషల్లో అసలైన సిసలైన తెలుగువాడిగా కనిపించడం పట్టాభి ప్రత్యేకత అని చెప్పాలి. పట్టాభి జీవన వ్యక్తిత్వం పష్చిమ గోదావరి జిల్లాలోని గుండుగొలను గ్రామం (ఆనాడు కౄష్ణాజిల్లాలోనిది)లో నియోగి బ్రాహ్మణ కుటుంబంలో 24 నవంబర్ 1880 న జన్మించిన పట్టాభికి - కుటుంబంలో ప్రతీ ఏట జరుపుకునే ష్రీరామ పట్టాభిషేకం ఉత్సవానికి ప్రేరణగా 'పట్టాభి సీతారామయ్యా అని తల్లిదండ్రులు నామకరణం చేయడం జరిగింది. జన్మస్థలంలో ప్రాధమిక విద్యను పూర్తిచేసి, ఏలూరులో ఉన్నతవిద్య, బందరు నోబుల్ కళాషాలలో చేరిన ఈయన ఏకసంతగ్రాహి అని పేరు తెచ్చుకున్నారు. ఒక్కసారి చదివినది, ఏదైనాసరే, ఎంతకాలానికైనా మరచిపోవడం అనే సమస్య వుండేది కాదట. యఫ్.ఎ. లో ప్రథమష్రేణి మూలాన లభించిన ఆర్థికసహాయంతో మద్రాసులో క్రిష్టియన్ కాలేజీలో చేరడం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషలలో ప్రావీణ్యత, అనర్గళంగా ఉపన్యసించడం తన ప్రతిభను వెల్లడించింది. మద్రాసులోనే బి.ఎ. చదివి, తర్వాత డాక్టరు చదువుని పూర్తిచేషారు. బందరులో వైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆర్థిక సంపాదన బాగున్నా, రోగుల స్థితిగతుల్ని బట్టి రుసుమును వసూలు చేయడంతో పేరు ప్రతిష్ఠలు ఒకేసారి లభించాయి. బెంగాలు విభజన, అనిబిసెంట్ హోంరూలు లీగ్ ఉద్యమంలో, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, భాషారాష్ట్రాల ప్రాతిపదికపై తెలుగువారికి ప్రత్యేకాంధ్రరాష్ట్రానికి ప్రథమంగా ప్రచారం చేసిన ప్రప్రథముడు. భారత స్వాతంత్ర్యోద్యమాల్లో పాల్గొన్నందుకు, ఏడు సంవత్సరాలకు పైగా - రాజమండ్రి, నెల్లూరు, తిరుచినాపల్లి, మద్రాసు, అహ్మద్ నగర్ జైళ్ళలో కఠినకారాగార షిక్షని అనుభవించారు. చెన్నపట్నం విద్యార్థి తెలుగు జిల్లాలకు రాజకీయంగానే కాక సాంస్కౄతికంగా కూడా చెన్నపట్నం రాజధానిగా చెలామణి అవుతున్న కాలం అది. ఎందరో తెలుగు యువతేజాలు మద్రాసులో చదువుకొంటున్న కాలం కూడ అదే. 1897 లో కందుకూరి వీరేషలింగం గారు తమ పుస్తక ప్రచురణల నిమిత్తం వౄత్తిలో విరామమిచ్చి చెన్నపట్నానికి వచ్చిన కాలం కూడ అదే. అయ్యదేవర కాళేష్వర రావు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, గొల్లపూడి సీతారామషాస్త్రి, ఆచంట లక్ష్మీపతి లాంటి విద్యార్థులతోపాటు, భోగరాజు పట్టాభిరామయ్య గారు ఒకరు. బహు భాషావేత్త, రచయిత పట్టాభిగారు విషిష్ట రాజనీతిజ్ౙుడు, మేధావి, బహుభాషావేత్త, ప్రజ్ౙాషాలి లాంటి ప్రతిభాపర్వాలతోపాటు గొప్ప రచయిత అన్నది చాలామందికి తెలియని విషయం. 'కాంగ్రేసు చరిత్రా పట్టాభి కౄషికి, ప్రతిభకి దర్పణం. 1600 పైగా పుటలున్న ఈ రచనని కేవలం రెండు మాసాల్లో పూర్తిచేయడమేకాక, అధికంగా యితర గ్రంథాల సంప్రదింపులు లేకుండా, కేవలం జ్ౙాపకానుభూతులాధారంగా చేసిన రచన కావడం చాలా ప్రఖ్యాతమైన రచనగా మారింది. 1942 క్విట్ ఇండియా సమయాన కాంగ్రేసు కార్యకర్తలందరితోపాటు పట్టాభిని కూడ అహమ్మద్ నగర్ కోటలో యితరులతో ప్రమేయం లేకుండా మూడేళ్ళు నిర్భంధించడం, చిత్రహింసలతో వేధించడం జరుగుతున్నా, పట్టాభి తన దినచర్యలను ప్రతిబింబిస్తూ, ఆంగ్లంలో రచించుకోవడం, వీటి సహాయంతో తర్వాత 'ఫెదర్స్ అండ్ స్టోన్శ్ (ఈకలు మరియు రాళ్ళు) గా రూపొందించడం ఫలితంగా అద్భుతమైన ప్రతిభావంతమైన రచనగా రూపుదిద్దుకుంది. భోగరాజు వారి యితర రచనలు - 'ఐ టూ హేవ్ స్పన్, గాంధీ మరియు గాంధీయిజమ్క్, తదితర పుస్తకాలను రచించారు. 'జన్మభూమీపేరుతో వారపత్రిక, 'ఇండియన్ రిపబ్లిక్' దినపత్రిక, 'తెలుగు సహకార పత్రికాలను కూడ నిర్వహణలో తనదైన ప్రతిభాషైలిని ప్రదర్షించారు. అస్పృరష్యత, మద్యపాన నిషేధం, ఖాదీపరిష్రమ రంగాల్లో నిష్ణాతమైన సేవలనందించారు. బహుముఖీన పదవులు, గౌరవాలు ఆంధ్ర, జాతీయ కాంగ్రేసు అధ్యక్షులు, రాజ్యసభ సభ్యత్వం, మధ్యప్రదేష్ రాష్ట్ర గవర్నర్ గా యితర ప్రాంతాల్లో తన సేవలనందించినా, తెలుగువాడిగా, తెలుగుభాషాభిమానిగా, వేష భాషల్లో మార్పుని తీసుకురాలేదు. మన తెలుగువారి ఆంధ్రబ్యాంకు వ్యవస్థాపకుడు
మన తెలుగునేలపై ప్రప్రథమంగా వెలసిన ఒకే ఒక ఆర్థిక సంస్థ, బ్యాంకు రూపంలో అవతరించి తెలుగువారి గర్వసంకేతంగా విరాజిల్లుతున్నది - ఆంధ్రబ్యాంకు. ఆంధ్ర బ్యాంకు స్థాపన నిమిత్తం 23 నవంబర్ 1923 లో నమోదు చేయబడి కార్యకలాపాలని అదే నెల 28 నుంచి ప్రారంభమైంది. ఈ ఆంధ్రబ్యాంకుని స్వాతంత్ర్యోద్యమ నాయకులు, బహుముఖ ప్రజ్ౙావంతుడు అయిన ష్రీ భోగరాజు పట్టాభిరామయ్య గారి మేధ నుంచి ప్రభవించిన తెలుగుసిరి, సంపద, సౌభాగ్యసుమం, దేషపు ఆర్థికవ్యవస్థకే తలమానికమైంది. మన జాతీయోద్యమ చరిత్రలో నిజానికి మన రాజకీయ నాయకుల్లో, దేష ఆర్ధికాభివౄద్ధిపట్ల దౄష్టిని పెట్టి మేలు చేసినవారు చాలా అరుదని చెప్పాలి. ఆ అరుదులో, దేషం స్వతంత్ర్యం పొందినా, ఆర్థిక స్వాతంత్ర్యం వినా రాజకీయంగా పొందిన స్వాతంత్ర్యం నిరుపయోగం, నిష్ప్రయోజనం అని ప్రధమంగా భావించిన వ్యక్తి భోగరాజు వారే. ఆ భావ పరంపరే, పట్టాభిని ఆంధ్రాబ్యాంకు, దానితోపాటు భారత లక్ష్మీ బ్యాంకులను స్థాపించడం జరిగింది. అంతేకాక, బీమారంగంలో కూడ హిందూస్తాన్ మరియు ఆంధ్ర బీమా సంస్థలను కూడ స్థాపించారు. పట్టాభి కౄషిలో భాగంగా, కౄష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకు, బందరు ఆంధ్రా జాతీయ కళాషాల స్థాపనకు పట్టాభియే మూలవిరాట్టు. తెలుగు నేలకు, ప్రజలకు ఎంతగానో సేవలను అందించి, తోడుగా నిలచి, ఆంధ్రుల అభిమాన వ్యక్తిగా విరాజిల్లిన ష్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు 17 డిసంబర్ 1957 న మనకు భౌతికంగా దూరమయి, స్వర్గస్థులయ్యారు. భారతీయ రాజకీయ పక్షం కాంగ్రేసు ఉన్నంతకాలం భోగరాజుగారిని, తెలుగునేలపై బ్యాంకుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా, ఆంధ్రాబ్యాంకు, ఆ షిఖరాగ్ర సంస్థను అందించిన పట్టాభి సీతారామయ్యగారిని స్మరించకుండా ఉండలేమన్నది, సత్యం, షివం, సుందరం అని భావించక తప్పదు. తెలుగుభాష, సంస్కౄతి, సంప్రదాయ పరంపర కొనసాగుతున్నంతకాలం, పట్టాభివారు మనజీవితాల్లో భాగంగానే కొనసాగుతారన్నది తథ్యం, సత్యం. ష్రీ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారి జయంతి సందర్భంగా తెలుగువారందరి తరఫున ఘననివాళిని సమర్పిస్తున్నాం. కొంపెల్ల శర్మ

'నన్నొక మిత్రునివలె స్వీకరించండీ - సత్యసాయిబాబా

'నన్నొక మిత్రునివలె స్వీకరించండీ - సత్యసాయిబాబా
సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న, విద్యలన్నియు నేర్చి విలువ సున్న సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న, దాన ధర్మాల సార్ధకత సున్న సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న, బహుళ సత్కార్యలాభంబు సున్న సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న, పదవుల నేలిన ఫలము సున్న. - శ్రీ సత్యసాయిబాబా మానవతాగుణాలైన - సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలను నాలిగింటినీ సమతులనం చేసి, అమౄతవాక్కులను అందించారంటే, అది సామాన్య మానవునికి దుర్లభమైన విషయం. జీవితం ఒక సవాలు - దానిని ఎదుర్కో, జీవితం ఒక అనురాగం - దానిని అనుభవించు, జీవితం ఒక కల - సాధించి ఫలింపజేసుకో, జీవితం ఒక ఆట - తెలుసుకొని క్రీడించు. జీవితం - దౄశ్యానికి, అదౄశ్యానికి మధ్య వారధిలాంటృఇది అని జీవితానికి యిచ్చిన నిర్వచనాలు. మానవుడి రూపాన మహనీయుడు, మాధవుడు - నిత్య 'సత్యా రత్నాకరుడు. మనిషి - మనీషి మధ్య 'సత్యసాయీ. ఆస్తికత - నాస్తికత మధ్య మన వేదవాదాలు తనను తాను తెలుసుకోగలిగిన ప్రతీ మనిషీ దేవుడే! నాలో ఈస్వేరు డున్నాడు; ఆ ఈశ్వేరుడే అన్ని సేయిస్తాడు; సేయించే పన్లన్నీ నాలో ఈస్వెరుడే సేస్తాడు అని రావిశాస్త్రిగారు 'పాపీ అన్న రచనలో చెప్పడం జరిగింది. దేవుడెక్కడో లేడు, మనందరి నివేదనలకోసం మనలోనే దాక్కున్నాడు. ఆశ, అసూయా అనేవి లేకపోతే మనిషి భగవంతుడు అవుతాడు. ఇందుగల డందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపహతుం డెందందు వెదకి చూచిన నందందే గలడు అని పోతనగారు సెలవిచ్చారు. కాని, ఓ సందర్భంలో ఆయనకు కూడ, కించిత్తు సందేహం వచ్చింది - కల డందురు దీనులయెడ, కలడందురు పరమయోగిగుణముల పాలం గలడందురన్ని దిశలను, గలడు గలండనెడువాడు గలడో లేడో' అని ఆ భాగవతంలోనే సుసందేహాన్ని అంకురించాడు. ఏమైనా, మనుషులు నిమిత్తమాత్రులు, మానవాతతీత శక్తి ఆడించే నాటకంలో పాత్రలు. ఏదైనా, ప్రపంచంలో ఎంతమంది ఆస్తికులున్నారో అంతమంది భగవంతుళ్ళున్నారు; ఒకరి భగవంతుడిలో ఒకరు తప్పు పట్టడానికి లేదు. మామూలు మనుషులు మనుష్యులను నమ్ముకుంటారు; భక్తుడు దేవుణ్ణి తప్ప నమ్మలేడు - అని అన్నారు ప్రముఖ రచయిత కొడవటిగంటివారు. ఈ రోజు భారతదేశంలో ప్రజలు - దేవుళ్ళు, దైవబలం, దైవభీతి, ఆస్థికత, నాస్తికత చుట్టూ -తమ దైనిక జీవితాన్ని గడుపుతున్నారు. ఎవరి స్థాయిలో వారి జీవితానికి అర్ధాన్ని, పరమార్ధాన్ని పొందడానికి తాపత్రయపడుతున్నారన్నది వాస్తవం. వీరి స్థాయిని, స్థానాన్ని కొలవడానికి, తూచడానికి త్రాసులు, తరాజులు కూడ వారే తయారు చేసుకుంటున్నారు. వారి ప్రమాణాలను వారే నిర్ధారించుకుంటున్నారు. విశ్వస్థాయిలో ఒక ప్రమాణత, ప్రమాణత రెంటినీ కోల్పోతున్న చిత్రాతిచిత్రమైన పరిస్థితుల్లో కూరుకుపోతున్నాం. దేవుడు - మనిషి మధ్య అనాదిగా సాగుతున్న ప్రయాణం రైలులో అనుకుంటే, ఆ రైలుబండి ఏ పట్టాలపైన నడుస్తుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితిలో వున్నాం. అంటే - మనకు రైల్వేవారు తరచుగా చెప్పే - బ్రాడ్, మీటర్, నేరో గేజ్ లాగా రకరకాలుగా నడుస్తున్న చరిత్రగా మారిపోతున్న వైనం. మతాలు గతులు తప్పుతున్నాయి. మేధలకు మతులు పోతున్నాయి. మతకారులు కేవలం వేషభాషల్లోనే నీతిచంద్రికలను వల్లెవేస్తున్నారు. ఆచరణల్లో అదౄశ్యగోచరమవుతున్నారు. నిత్య సత్య సందర్శనమూర్తి పతనం చెందిన మానసిక స్థితినుంచి, మానవత్వాన్ని ఉద్ధరించి, మానవునికి సౄష్టిలో సంక్రమించిన మహోన్నతిని మరల ప్రాప్తింపజేయుటకొరకే అన్నట్లు, శాంతి ఆనందాలనూ, సుఖసంతోషాలనూ మరల మానవలోకానికి అందించటం కొరకే అన్నట్లు ఒక అవతారమూర్తి అవతరించాడు. మానవాకారంలో దర్శనం యిచ్చే మహనీయుడు. దేవునికి మరోపేరు భగవాన్. నిత్యశ్రీమంతుడు. సత్యసంపన్నుడు. అత్యంత ఆధునికమైన యోచన, ఆలోచనావిధానం. ప్రపంచాన్ని ప్రభావపరుస్తున్న ప్రణవమూర్తి. ఒక మానవతామూర్తి. మహాపురుషుడు. అవతారచక్రవర్తి. పరంపరాగతమైన సంప్రదాయపు పుట్టుక. విశిష్టమైన ఆలోచనావిధానం. నేటి మానవుని దు:ఖానికీ, అశాంతికీ, అసమానతలకూ మూలకారణాలను మహామేధావులంతా తమతమ అణ్వేషణలో విఫలమవుతుండగా, మనిషిలోని మానవతా సుగుణాలు అధ:పతనంలోనే వున్న కారణం అని చెప్పిన సమన్వయమూర్తి. మానవతా విలువలన్నీ అంతరించి పోతున్న తరుణంలో ఆ విలువల్ని మానవునిలో పున:ప్రతిష్ఠ కావించిన కారుణ్యమూర్తి. నిజమైన ఆధునికతకు నిదర్శనం. ఆయన సందేశాల్ని, విశ్లేషణల్నీ ప్రపంచ భాషలన్నింటిలో ప్రచురించబడిన ఘనత ఈయనది. ఏమిటి ఈ ఆలోచనావిధానం? ఎందుకీ ఆలోచనావిధానం? అన్న ప్రశ్నలకు ఎంతమాత్రం సమాధానం దొరకని పరిస్థితిని కల్పించిన మహావ్యక్తి, మహాపురుషుడు, సంపూర్ణమానవమాత్రుడు - ఎవరో కాదు, ఆయనే, భగవాన్ గా కోట్లాది భక్తిలచే నిత్యం, క్షణం క్షణం కొనియాడబడే మార్గదర్శి, శ్రీ సత్యసాయిబాబాగారు. 'రత్నాకరా వంశ ప్రాభవం దుర్భర క్షామానికి మారుపేరు ఆ ప్రాంతం. అలనాటి రాయలసామ్రాజ్యభాగపు అనంతరపురం జిల్లాలోని పుట్టపర్తి అనబడే కుగ్రామంలో పెద్ద వెంకప్ప రాజు - ఈశ్వరమ్మ పుణ్యదంపతులకు పున్నామ నరకం నుంచి మోక్షం కలిగిందని సంతోషంతో కదలాడుతున్న క్షణాలు. ఆ రోజు 1926, నవంబర్ 23. విష్ణ్వాంశసంభూతుడైన శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం చేసుకుంటున్న తరుణంలో జన్మనిచ్చినందులకు ఆ దంపతులు ఆ బిడ్డకు 'సత్యనారాయణరాజూ అని సార్ధకనామం చేశారు. సాధారణత అనుకోకుండా జరిగే స్థితి. అదే అసాధారణత అయితే, నమ్మశక్యంకానివి జరుగుతాయి. అదే జరిగింది. మన రాజు భూమ్మీద పడగానే, సప్తస్వరసహిత సంగీతవాద్యవిశేషనాదఝరి అవతరించిందట. వారిది రత్నాకర వంశంలోని కుటుంబం. ఫలితంగా, రత్నాకర సత్యనారాయణరాజు. అంతేకాదు, తల్లికి కలలో దేవుడు కనిపించడం, గర్భవతి కావడం, ఒక నీలకాంతిస్వరూపం ఆమెలో ప్రవేశించగా ఆమె మూర్ఛిల్లడంతోపాటు, బాలుడు జన్మించిన వెంటనే, పక్కబట్టల్లో, యింటి ఆవరణలో, సర్పదర్శనం లాంటి ప్రత్యేక కధనాలను కూడ మనం సాయి జీవితచరిత్రలో దర్షనం అవుతాయి. ఈ కధనాలకు పూర్వాపరాలు కూడ కనిపిస్తాయి. అటుయిటు సవరణలూ కనిపిస్తాయి. రత్నాకరుడి జన్మ విషయంలో బహుకధనాలు మనకు గోచరిస్తాయి. ఏదిఏమైనా, సాధారణం మాత్రం కాదని చెప్పగలిగే స్థితి. బుక్కపట్నం చారిత్రాత్మక కధనం బుక్కపట్నం గ్రామంలో చదువుని ప్రారంభించిన రాజు, తన ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే - నాటకం, సంగీతం, కవిత్వం, నటనాది కళల్లో ప్రావీణ్యం సంపాదించి గ్రామంలో తనదైన ప్రతిభను ప్రదర్శించి గుర్తింపు పొందాడని ఆయన జీవితవిశేషాల్లో కనిపిస్తాయి. తర్వాత, ఉరవకొండకు చదువు నిమిత్తం మారడం జరగింది. ఆ రోజు రాజుకు 14 ఏళ్ళ ప్రాయం. 1940 మార్చ్ 8 రోజు. పాములకు, తేళ్ళకు, ప్రసిద్ధమైనది ఉరవకొండ ప్రాంతం. నల్లతేలు కుట్టిందన్నారు. అపస్మారకంలో పడడం కూడ జరిగిందట. తిరిగి మెలకువ వచ్చాక ఆరోజు సాయంత్రం రాజు ప్రవర్తన వింతగా వుందని అందరు గమనించడం జరిగింది. తిండి తినకపోవడం, సుదీర్ఘకాలంపాటు మౌనాన్ని పాటించడం, ఆధ్యాత్మిక శ్లోకాల్ని చదవడం, హిందూ ధర్మశాస్త్రోల్లోని విషయాల్ని చెప్పడం జరగ్గా, తల్లిదండ్రులు కంగారు పడడం జరిగిందన్నది కూడ చారిత్రాత్మక కధనాలే. కుటుబం వత్తిడితో రాజు ఉరవకొండకు వెనుతిరగడం అదే నెల జూన్ లో జరిగిందట. రాజు తనంతట తానే శిరిడి లోని సాయిబాబా ఫకీర్ కు తర్వాత అవతారమని చెప్పుకొనడం జరిగింది. సత్యసాయిబాబా చరిత్ర గ్రంధకర్త కస్తూరి నారాయణ అందించిన వివరాల ప్రకారం, 20 అక్టోబర్ 1940 నాడు, తన 14వ ఏట పుస్తకాలకి, చదువుకి స్వస్తి చెప్పడం, కుటుంబంనుంచి తన నిష్క్రమణ చేయడం జరిగింది. సత్యసాయిబాబా ప్రారంభ సందేశం తనదైన తొలిమాటలు - 'నా భక్తులు నన్ను పిలుస్తున్నారు - నా విధి నాకుందీ అని ప్రకటించి, మూడు రోజులపాటు, ఒక తోటలోని చెట్టుకింద గడపడం, గుమిగూడిన ప్రజలకు భక్తిగీతాలు, భజనలు అందించాడట. ఈ సంఘటన నుంచే భగవాన్ సత్యసాయిబాబా గా అవతారం తీసుకున్నట్లు కస్తూరి కధనంగా గోచరిస్తుంది. ఆప్పటినుంచి, సత్యసాయిబాబా ఆధ్వర్యంలో ఆధ్యాత్మక, మానవీయత, సేవాతత్పరత, త్రివేణీ సంగమమై, సమీకరణం జరిగిందన్నది మాత్రం సత్యం, శివం, సుందరం. ఆనాటినుంచీ నేటివరకూ తిరుగులేని, తిరిగిరాని జీవితాన్ని సాగిస్తూ, కోట్లాదిప్రజలకు విశ్వవ్యాప్తంగా భగవాన్ గా, మహాపురుషుడుగా, అవతారమూర్తిగా, అపరభగవంతుడుగా విరాజిల్లుతున్నాడు. 1942 సంవత్సరం బుక్కపట్నం పాఠశాల వివరాల్లో సత్యసాయి వివరాలు కనిపిస్తాయి. 1944 లో తన గ్రామంలో జరిగిన మందిరనిర్మాణం, యిప్పుడు పాతమందిరంగా పిలుస్తారు. ప్రశాంతినిలయంగా పుట్టపర్తిలో 1948 నుంచి ఒక అంతర్జాతీయ విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక ప్రాంగణంగా అలరిస్తూనే వుంది. కుగ్రామం అయిన పుట్టపర్తి, భూనభోంతరాళంలో ఏకైక గుర్తింపు ప్రాంతం, పుణ్యస్థలి - ప్రశాంతినిలయం - నిలయవిలసిత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అన్నది నిజం, వాస్తవం, సత్యం. సత్యసాయి జీవనగమనంలో మలుపులు, మెరుపులు శాఖాహారి, జంతుహింసకు వ్యతిరేకి, బీదలపై అపార సానుభూతి, పెద్దలు, వికలాంగులపై కరుణాదౄష్టితో మెలగే సత్యసాయి ఆశువుగా భజనలను రచించి, స్వరపరచి, గానం చేయడం ఎనిమిదవ ఏటనుంచే ప్రారంభమైందని చరిత్ర వివరిస్తోంది. 1958 లో సత్యసాయి భక్తులకోసం 'సనాతన సారధీ ప్రచార పత్రిక విడుదల జరిగింది. 1960 నుంచి పాశాత్యదేశ భక్తులను కూడ అమితంగా ఆకర్షించింది. యింతవరకూ, విశ్వవ్యాప్తంగా భక్తులు ప్రశాంతి నిలయాన్ని సందర్శించడమే కాని, సత్యసాయి ఒకేసారి ఉత్తర-తూర్పు ఆఫ్రికాని 1968లో యాత్ర చేశారు. రత్నాకర సత్యనారాయణ రాజు అనే పేరుగల సత్యసాయిబాబాకు యిద్దరు సోదరులు - శేషమరాజు(పెద్ద), జానకిరామయ్య(చనిపోయిన తమ్ముడు). 2003 లో శరీరానికి తుంటిపై ప్రమాదం. 2005 నుంచి చక్రాల సైకిలును వాడడం జరుగుతుంది. 'సత్యసాయి సంభాషణలూ (1:31:198) (29.9.1960) ప్రకటన ప్రకారం, సత్యసాయి యింకా 59 సంవత్సరాలు జీవించడం జరుగుతుందని చెప్పడంకూడ జరిగింది. ఆడ ఏనుగు - సాయిగీత - చిన్నప్పటినుంచి తన జీవితాన్ని సత్యసాయి సన్నిధిలోనే గడిపి, ఈ మధ్యనే చనిపోయింది. ప్రస్తుతం, సత్యగీత అనే ఏనుగు ఆ స్థానాన్ని ఆక్రమించింది. విశ్వాస వాస్తవాలమధ్య సత్యసాయి ప్రచారోద్యమం సర్వసంప్రదాయసేవాస్థలిగా పుట్టపర్తిలోని ప్రశాంతినిలయం విరాజిల్లింది. చైతన్యజ్యోతి (విశ్వవిద్యాలయం), ఆధ్యాత్మిక సంగ్రహాలయం, ప్లానిటోరియం, రైల్వేకూడలి, సుందర ప్రకౄత సమగ్ర క్రీడాస్థలి, పరిపాలనాప్రాంగణం, ఎయిర్ పోర్ట్, సమాజావసర సేవల రూపాన మౌలిక సదుపాయాలు, వెరసి పుట్టపర్తి-ప్రశాంతనిలయం ప్రముఖ అంతర్జాతీయ కేంద్రంగా భాసిల్లుతోంది. అగ్రజులు, అగ్రశ్రేణుల భక్తశిఖామణి బౄందాలతో నిత్యం విరాజిల్లే ప్రశాంతి నిలయం. ఈ సమూహం మధ్య సత్యసాయి ఆశీర్వచనాలు, అభినందనలు, దర్శనాదర్శనాలు, కానుకలు, బహుమతులు, ప్రాప్తాప్రాప్తాల మధ్య ఆశ-నిరాశల మధ్య భక్తజనసమూహం. ప్రముఖులైన నాయకులు, అధినాయకులు, అతిరధుల మధ్య, ఒక మిలియన్ జనాభాతో 180 దేశాలనుంచి ప్రతినిధులమధ్య తన 83 వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సహస్రచంద్రదినోత్సవం - వేయి పున్నమిల దర్శనభాగ్య సందర్భంగా ఈ ఏడు జన్మదినోత్సవానికి చాలా ప్రధాన్యతతో సన్నాహాలు జరుతున్నాయి. ప్రశాంతి నిలయం, బౄందావనం (కడుగొడి - బెంగుళూరు దగ్గరగా), సాయి శౄతి కుటీరం (కొడైకెనాల్, తమిళనాడు) సత్యసాయి నివాస ప్రాంతాలు. ధర్మక్షేత్ర-సత్యం (ముంబాయి), శివం (హైదరాబాద్), సుందరం (చెన్నై), మూడు ముఖ్య సందర్శక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. సత్యసాయి ఆత్మకధ కూడ సత్యం-శివం-సుందరం' అవడం యదౄచ్ఛికం. నిత్య దర్శనం, పూజలు, వ్రతాలు, ప్రత్యేక పండుగలు, ఉత్సవాలు, సత్యసాయి జన్మదినం, భక్తుల రాకకు ప్రోద్బలాలు, ప్రేరణలు, ప్రోత్సాహకాలు. మహత్యాలు ఉన్నచోట విమర్శలు, ఎదురాటలు, ఎదురీతలు తప్పనివి, అవే సత్యసాయిని కూడ వరించాయి. రెండు ధోరణులూ, సవ్యసాచిగా, సమాంతరంగా సత్యసాయితోపాటు, సహజీవనం చేస్తున్నాయి. మతబోధకులుగా, ప్రచారకర్తగా, గురువుగా, భగవాన్ గా, సేవాతత్పరుడుగా, సమాజసేవాపరాయణుడిగా, రత్నాకర సత్యనారాయణ రాజు అనే వ్యక్తి - భగవాన్ సత్యసాయిబాబా గా - ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక చరిత్రలో సువర్ణాక్షరాలతో తనదైన అధ్యాయాలను సంపుటీకరించుకున్నారన్నది మాత్రం నిస్సందేహం. సంశయంలేని సత్యం. ప్రశాంతి నిలయం నుంచి వినబడే వేదఘోషతోపాటు, అన్యతరహా ఘోషలు కూడ ప్రతిధ్వనిస్తున్నాయి; కాని, అవి నిరంతరం ప్రశాంతనిలయంలోకి చొచ్చుకుపోతున్నాయో లేదో, చెప్పలేని స్థితిగతులు. 1963 లో శివ,శక్తి అవతారంగా, శిరిడీలోని సాయిబాబా తర్వాతి అవతారంగా, భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా వస్తానని 1976 లో ప్రకటన, మైసూరులో ఉద్భవించడం జరుగుతుందని శిరిడీసాయిబాబా ఒక భక్తురాలు, శారదాదేవి, కలలో చెప్పి, ఆంధ్రప్రదేశ్ లో 'సత్యాగా అవతరిస్తున్నానని చెప్పినట్లు, సత్యసాయి జీవిత చరిత్ర - సత్యం, శివం, సుందరం, లో ప్రస్తావన. ప్రచారం, బోధలు, రచనలు, ప్రచురణలు సత్యసాయి చెప్పిన ప్రతి మాట, బాట సాక్షీకరింపబడుతోంది. చరిత్రలో భాగంగా నిర్మితమవుతోంది. స్థలపురాణం రోజురోజుకూ మరో యితిహాసంగా మారుతోంది. భారతావనిలో భావితనానికి ఒక మలుపుని, మెరుపుని ప్రసాదిస్తున్నాయి. రామకధరసవాహిని ప్రవహిస్తోంది. భజనలు అభంగధోరణిలో సాగుతున్నాయి. విద్య, వైద్య, సమాజావసర రంగాల్లో సకలోచితసదుపాయాలు కలిగిస్తున్నారు. మానవతా విలువలను ప్రదర్శించే వలువలను నిర్మాణంచేసి, ప్రజకు అందిస్తున్నారు. సత్యం, ధర్మం, అహింస, ప్రేమ, శాంతి పంచ వేదాలుగా వేదఘోషతో ప్రవచనలు కావింపబడుతున్నాయి. దేహశుద్దిలేని తెల్లని బట్టలు, భావశుద్ధిలేని దైవపూజ, పాకశుద్ధిలేని బంగారుపీటలు, వాక్కుశుద్ధిలేని శ్లోకపఠనం, నేటి నాగరికులు పాటించు పద్ధతి - అని సత్యసాయి నిత్యం బోధిస్తూంటారు. మానవతే కులం, ప్రేమయే మతం, హౄదయవాదమే భాష, నిత్యసత్యసందర్శనమూర్తే భగవంతుడు అన్నది సత్యసాయి మంత్రం, సూత్రం. సత్యసాయి పథంలో ముందుకు నడుస్తూ, తమ నడకల్ని, నడతల్ని, సరిదిద్దుకుంటూ మార్గదర్శకంలో ఎన్నో భక్తులు, సంస్థలు, తమతమ కార్యాలను నిర్వహించుకునే క్రమంలో నిమగ్నమయ్యారు. ప్రశంసలతోపాటు, విమర్శనలను సరిసమంగా సత్యసాయి ఎదుర్కుంటున్నారు. సమాధానాలు చెప్పవలసిన చోట చెప్పుతున్నారు. అవసరం లేదనుకున్న సందర్భాల్లో వాటిని యధాతధంగా వదిలేస్తున్నారు. ఉపశౄతి పుట్టపర్తి సత్యసాయిబాబాను సర్వధర్మ సమభావనకు, అధ్యాత్మికపరమైన విశ్వజనీనస్ఫూర్తికి మారుపేరుగా విరాజిల్లుతున్నారు. నవంబర్ 23 న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జన్మదినోత్సవం సందర్భంగా, తెలుగు రథం నుంచి అభినందనల్ని తెలుపుకుంటూ, ఆశీర్వచనాల్ని కూడ తెలుగురథం ఆశిస్తోంది. శుభం భూయాత్. ఓం. శాంతి: కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Saturday, November 21, 2009

భారతరత్న - సి.వి.రామన్ - సాటిలేని శాస్త్రవేత్త


భారతరత్న - సి.వి.రామన్ - సాటిలేని శాస్త్రవేత్త ( 1888 - 1970 ) ధైర్యశాలి భావాలు రాజకీయవాదులు విజ్ౙానరంగంలోకి ప్రవేశింపకూడదు. ప్రతీ ఏట జరిగే యిండియన్ సైన్స్ కాంగ్రేసు మహాసభలను భారతీయ ప్రధానులు, నెహ్రూ, యిందిరాగాంధీలు ప్రారంభించడం నచ్చని వ్యవహారం, సముచితం కాదు. రాజీపడని రామన్ విజ్ౙాన పరిశోధనారంగానికి నిరంతర 'రామన్ ఎఫెక్ట్' ఘనచరితస్థలం - జన్మస్థలం సారవంతమైన కావేరీ డెల్టాప్రాంతానికి ప్రసిద్ధి చెందిన ఆ జిల్లాకు మూడు తలల రాక్షసుడి పేరు (త్రిశిర) నుంచి వచ్చింది. జిల్లా చరిత్ర రాజకీయ పరమైన పల్లవులు, చోళులు, నాయకరాజులు మరియు చివరగా రవి అస్తమించని తెల్లదొరల పరిపాలనాధోరణుల ప్రభావాలకు గురై బయట పడిన ప్రాంతం - తిరుచిరాపల్లి, క్రమేనా, తిరుచ్చి, త్రిచి గా కుచించుకుపోయింది. ప్రసిద్ధ శ్రీరంగనాధుడు (10 శ.), మ్యూజియం, జంబుకేశ్వరాలయం, రాక్ ఫోర్ట్, ప్రసిద్ధమైన చర్చిలు, సైంట్ జోసెఫ్ కాలేజీతోపాటు కల్లనై డాం (గ్రాండ్ ఆనకట్ట), 7వ శ. నాటి శివాలయం, శిత్తనవసల్ వద్ద జైన్ గుహాలయాలతో ప్రసిద్ధిపొందిన తిరుచిరాపల్లికి చారిత్రాత్మక, వైజ్ౙానిక పరంగా మరొక మైలురాయి - సర్.సి.వి.రామన్ ఈ గడ్డపై పుట్టడం భారతావని చేసుకున్న సుకౄతం. ఆ ధరణి చేసుకున్న పునీతవైనం వర్ణనాతీతం. రామన్ కుటుంబ నేపథ్యం చంద్రశేఖర్ అయ్యర్, పర్వతీ అమ్మాళ్ మధ్యతరగతి కుటుంబ దంపతులకు తమిళనాడు, తిరుచిరాపల్లి జిల్లా, అయ్యన్ పెటాయ్ గ్రామంలో 7 నవంబర్ 1888 న జన్మించారు. వ్యవసాయంతో ముఖ్యజీవనం చేసుకునే ఈ కుటుంబం, తండ్రి తిరుచిరాపల్లి హైస్కూల్ లో ఉపాధ్యాయకత్వం, విశాఖపట్నం లో భౌతికశాస్త్రంలో ఆచార్యపదవి, వీటితోపాటు, కళలైన, జ్యోతిషం, వీణ, వాయులీనవాదనంలో నైపుణ్యాలను కూడ సంపాదించడం బహుముఖప్రతిభకు ఉదాహరణం. తల్లి పార్వతీ అమ్మాళ్ తండ్రి కూడ గొప్ప సంస్కౄతపండితుడు. రామన్ వ్యక్తిత్వ దర్పణం వాల్టేర్ కాలేజీ లో యింటర్మీడియట్ చదివి, మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఎ. కై చేరిన రామన్, మొదటిరోజునే ఆంగ్లభాష ఆచార్య, యిలియట్, ప్రియశిష్యులలో ఒకడు అయ్యాడు. అనిబిసెంట్ ఉపన్యాసాలతో ఆకర్షితుడయ్యాడు. హిందూపురాణాలు - వ్యాసానికి ప్రధమపురస్కారం, బి.ఎ. లో ఎలిఫిన్ స్టన్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఎం.ఎ. పదార్ధవిజ్ణానశాస్త్రం, ధ్వనిశాస్త్రంలో ప్రయోగాలు, ఎవ్వరూ కనుగొనని లక్షణాలు అవ్వడంవల్ల, ఆచార్య జోన్స్, రేలేల ప్రశంసలను అందుకున్న ఏకైక వ్యక్తి. వేదాంతపత్రిక,లండన్ లో వ్యాసం ప్రచురణ, మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. భౌతికశాస్త్రశాఖ చరిత్రలోనే ప్రధమశ్రేణి విద్యార్ధిగా సువర్ణాక్షరాలతో నిలచిపోయాడు. శారీరక దుర్బలత్వం, పరిశోధనకు అనుకూలించని శరీరం, వాతావరణం అని వైద్యులు అభిప్రాయాన్ని చెప్పినా, త్రోసిరాజని, రాజీపడని, నిరంతర పరిశోధనాపరుడు. 18 ఏళ్ళకే ఉద్యోగం సంపాదించిన రామన్, లోకసుందరి తో శాఖాంతర వివాహాన్ని చేసుకున్నాడు. వివాహమయినా, మనసంతా పరిశోధనలతోనే మునిగిపోయింది. కలకత్తా ట్రాం బండి రామన్ దశ, దిశలను నిర్దేశించింది. 'ది యిండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్శ్కు కార్యదర్శి మహేంద్రలాల్ సర్కార్ తో పరిచయం అయింది. రామన్ ప్రతిభకు గుర్తింపు, స్వతంత్ర ప్రయోగాలకి, ప్రత్యేక సౌకర్యం లభ్యం, రామన్ రాకతో సంస్థ ప్రతిష్ఠ పెరిగింది. కలకత్తా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు అశుతోష్ ముఖర్జీ ఆదరణకు గురయ్యాడు. 1915 లో భౌతికశాస్త్రంలో ఆచార్యపీఠం స్థాపనకు సర్ తారకనాధ్ పాలిట్ భూరివిరాళం యివ్వడం, ఆయన దౄష్టి రామన్ పై పడడం కూడ జరిగింది. అంతేకాక, పదవికి నిర్ధారిత నిబంధనలను సడలించి, రామన్ ని ఎన్నుకోవడం, ఆచార్యపదవిని చేపట్టడం జరిగింది. రామన్ ప్రతిభకు కలికితురాయిలు రామన్ ప్రతిభ వరించిన పదవులు, అధికారాలు ఎన్నో, మరెన్నో. భారతీయ శాస్త్రజ్ౙుల సంఘం, కార్యదర్శి(1919), బ్రిటిష్ విశ్వవిద్యాలయకాంగ్రెసు సభకు భారతీయప్రతినిధి (1922), కెనడా శాస్త్రీయ కాంగ్రెసు కు విశేషభారతీయప్రాతినిధ్యంలో, అనేకదేశాల్లో ప్రసంగాలు, రాయల్ సొసైటీ ఫెలోషిప్ సత్కారం, భారతీయ సైన్స్ కాంగ్రేసు స్థాపన (1924), నిరంతర పరిశోధన ఫలితంగా రష్యన్ సైన్స్ అకాడమీ ఆహ్వానం (1925), 'రామన్ ఎఫెక్ట్' పై ఆసియాఖండం నుంచి సత్కారం అందుకున్న మొట్టమొదటి శాస్త్రవేత్తగా నోబెల్ బహుమానం (1928), 15 సం. కలకత్తా విశ్వవిద్యాలయంలో అపూర్వ కౄషి, యిండియన్ యినిస్ట్యూట్ ఆఫ్ సైన్స్, డైరక్టర్ గా చేరడం, యిండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అవతరణ (1934), రామన్ స్వంత సంస్థ, రామన్ పరిశోధనాసంస్థ ప్రారంభం (1948), ప్రముఖ ఘట్టాలుగా చెప్పక తప్పదు. రామన్ పరిశోధనాసంస్థ నుంచి ప్రముఖ శిష్యగణం రామన్ పరిశోధనాసంస్థ నుంచి ఉద్భవించిన రామన్ ప్రముఖ శిష్యగణంలో, ముఖ్యంగా చెప్పవలసిన వారు - డా. హోమీ జె. బాబా, డా. సూరి భగవంతం, డా. విక్రం సారాభాయ్, డా.రామశేషన్ లను ప్రస్తావించకుండ రామన్ వ్యక్తిత్వం అసంపూర్ణమే. సర్, భారతరత్న రామన్ స్వతంత్ర భారతావనిలో శాస్త్రీయ పరిశోధనారంగంలో కొత్త అధ్యాయం - విశ్వవ్యాప్త రామన్ కీర్తి - బ్రిటిష్ ప్రభుత్వం సత్కరించిన 'సఋ బిరుదుతోపాటు, ఎన్నో విశ్వవిద్యాలయాలు అందించిన గౌరవ డాక్టరేట్. 1954 లో భారతప్రభుత్వం అందించిన అత్యుత్తమ పురస్కారం 'భారతరత్నా సాటిలేనిది. రామన్ నిర్మొహమాటం లేని ధైర్యశాలి - ఎవ్వరికీ జంకని ధైర్యశాలి, స్వతంత్ర భావప్రకటనకు ఎన్నడూ వెనుకాడలేదు. రాజకీయవాదులు వైజ్ౙానికరంగంలో ప్రవేశించరాదు అన్న అభిప్రాయాన్ని నిష్కర్షగా ప్రకటించాడు. - ప్రతీ ఏట జరిగే, భారతీయ సైన్స్ కాంగ్రేసు మహాసభలకు భారత ప్రధానులు, నెహ్రూ, యిందిరాగాంధి ప్రారంభించడం సముచితం కాదని రామన్ నిశ్చితాభిప్రాయాన్ని ప్రకటించాడు. శాస్త్రీయ పరిశోధనాభరిత జీవితంలో - మరువరాని 'రామణ్ మెరుపులు రామన్ శాస్త్రం-కళలపై పరిశోధనలో సన్మిశ్రమాలు సంగీతశాస్త్రములో విశిష్టప్రవేశం - మౄదంగ వాదనంపై, శబ్దతరంగాలపై సాగిన ప్రయోగాలు - ఫొటోగ్రఫీ, రబ్బర్, ప్లాష్టిక్ పరిశ్రమలకు మంచి తోడ్పాటు అయిన రామన్ పరిశోధనల గురించి మరువరాని, మరువలేని మెరుపులు. రామన్ - కొసమెరుపులు 1. బెంగుళూర్ లోని ఒక బ్యాంకర్ వద్ద రామన్ 75 వేలు వుంచడం, తర్వాత దివాలా అవడం తెలుసుకొని, 'నోబెల్ బహుమతి గ్రహీతకీ టోపీ పెట్టిన బ్యాంకర్ కు నోబెల్ పారితోషికం యివ్వడం సబబూ అన్న హాస్య చతురుడు. 2. కార్యసాధకులకు హంగులు, హార్భాటాలు అనవసరం. నోబెల్ బహుమతి కొరకు సాగించిన ప్రయోగానికి పెట్టుబడి కేవలం 200 రూపాయలే అన్న రికామీ వ్యక్తిత్వం, రామన్ ది. 3. జాతీయ పరిశోధనాలయాలపై - అనవసర/విపరీత ధనవ్యయం చేయడం సరిపడని పనిగా భావించాడు. ప్రయోగశాలల్లో శాస్త్రీయ పరిశోధనా పరికరాలను నిక్షేపం చేసెందుకుకే నిర్మీచారని - రామన్ వాదన. 4. ఎంత గొప్ప శాస్త్రజ్ౙుడో, అంత గొప్ప వక్త. క్లిష్ట శాస్త్రీయ విషయాల్ని జనరంజకంగా ఉపన్యాసం చేయగలిగిన మహామేధావి, మానవతావాది, శాస్త్రజ్ౙుల పరిశోధనలు ప్రపంచ ప్రజల సంక్షేమానికి వినియోగపడాలని చాటిచెప్పిన మహనీయుడు, మన రామన్. 5. జీవితమంతా శాస్త్రీయ పరిశోధనలోనే గడపడం - భారత దేశ కీర్తి పతాకాన్ని దిగ్దింతాలకు రెపరెపలాడించిన వైజ్ణానిక విశ్వభరిత విద్వన్మూర్తి - సర్, భారతరత్న, రామన్. ఈ విశ్వాంతరాళంలో శాస్త్రం ఉన్నంతకాలం పరిశోధనలు, ప్రయోగాలు. యివి వున్నంతకాలం రామన్ కీర్తిని గణించడం, గుణించడం జరుగుతూనే వుంటుంది. రామన్ జనన మరణాలు ఒకే నెలలో జరగడం యాదౄఛ్ఛికం. 1888 నవంబర్ 7 న జన్మిస్తే, 1970 నవంబర్ 21 నే కీర్తిశేషులయ్యారు రామన్. ఆ మహనీయుని వ్యక్తిత్వానికి, ప్రతిభకు, ఈ సందర్భంగా తెలుగురథం నీరాజాలని అర్పిస్తోంది. కొంపెల్ల శర్మ - తెలుగురథం.

ఎన్నికల్లో - ఎన్ని కలలో! ఎన్ని వలలో!



ఎన్నికల్లో - ఎన్ని కలలో! ఎన్ని వలలో!




ఎన్నికల్లో - ఎన్ని కలలో! ఎన్ని వలలో! ప్రజాస్వామ్య యజ్ౙానికి ఫలితం కనబడుతున్నది గాజు బుగ్గ పగిలినట్లు రాజరికం విడుతున్నది అని మహాకవి దాషరధి - మధ్యప్రాచ్య మహాయజ్ౙం అన్న రచనలో అంటాడు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నుకోవడం, ఎన్నుకోబడడం అనివార్యం. మన యిష్టాయిష్టాలతో పనిలేదు. పౌరునిగా మన కనీస ధర్మం, మనకు ప్రసాదించబడిన ఒకే ఒక సదవకాషాన్ని వినియోగించుకోకపోతే, పౌరధర్మాన్ని అగౌరవపరచినట్లే. అవకాషాలు అందరికీ వస్తాయి అని చెప్పలేము కాని, అవకాషాలు వచ్చినప్పుడు సద్వినియోగపరచుకుంటే అదౄష్టవంతులం, లేకపోతే దౌర్భాగ్యులం అని మాత్రం ఖచ్చితంగానే చెప్పితీరాలి. సాధారణంగా అయిదేళ్ళకొకసారి చెప్పీచెప్పనట్లు వచ్చి తీరతాయి. ఎన్నికలు అంటే ఎన్నో కలలు, కలవరాలు, గాలాలు, చేపలు, వలలు, జయాపజయాలు, మోసం చేసి గెలుపులు యిలా ఎన్నో సంగతులు, సందర్భాలు మనకు దాపురిస్తాయి. యిది సహజ సర్వ సాధారణ పరిస్థితి అయి కూర్చుంది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో. ప్రముఖ ఆధునిక కవి బాపురెడ్డిగారు - 'ఎన్నికలలో ఎన్నివలలో' అన్న ఖండికలో - ఎన్నికలలో, ఎన్ని కలలో? - ఒక్క చేపకై ఎన్ని వలలో, అని వాపోయారు. యిటువంటి ఎన్నికల సమయాల్లో, ప్రతీ పౌరుడు 'ఆత్మస్తుతీ చేసుకుంటే - జాషువా చెప్పినట్లు - కులమతంబు లెన్నికల కాలములలోనె, నడపదడప మాకు నవసరములు - అని ఆయన 'ఆత్మస్తుతీగా చెప్పడం జరిగింది. పురపాలక ఎన్నికలు ప్రస్తుతం పురపాలకులను ఎన్నుకునే ప్రక్రియలో మునిగిపోయాం. పర్యవసానం మాట ఎలావున్నా, ప్రముఖ హాస్య వ్యంగ్య రచయిత - భమిడిపాటి రాధాకౄష్ణ గారు మాత్రం - 'పాలకసంఘాల్లో ఎన్నికల మజా' అన్న రచన బహుష పురపాలక సంఘాల్లో అని మనం అన్వయం చేసుకోవడంలో ఏమాత్రమూ తప్పులేదు, తప్పటంలేదు అని అనుకోవాలి. ఈ రచనలో, ఆయన విసిరిన వ్యంగాస్త్రం తీరు తెన్నులు ఈ క్రింది విధంగా వుంది. 'ఇప్పుడు పరిపాలనతో సంబంధించిన ఎన్నికల పోటీల్లో నెగ్గడానికి ఎవరికేనా, సంగోరుధనం, సంగోరు నక్కజిత్తులూ ఉండాలి. సంగోరు - అంటే, పంటయందు సగము కోరు, అని అర్థం నిర్ద్వందంగా చెప్పాడు నిఘంటుకారుడు. అంటే, అనాదిగా, సగం సగం అన్నది చెలామణీ అవుతూనే వుందన్నమాట. ఎన్నికల్లో విజయం పొందిన వాళ్ళకి సాధారణంగా స్థితి పాడైపోతుంది; అపజయం పొందిన వాళ్ళకి స్థితితోపాటు మతికూడా పాడై పోతుంది అని భమిడిపాటి వారు వాపోతున్నారు. మతి ఎంత తీవ్రస్థాయిగా చెడిపోతున్నారంటే, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను మరచిపోవడం మాత్రమే కాదు, తిరిగి ఎన్నికల సమయం, సమరం వచ్చేవరకూ, తమ ప్రతినిథుల్ని, పురప్రజల్ని, నియోజకవర్గాన్ని దర్షించడం మాత్రం దేవుడెరుగు, సమస్యల్ని ఎలాగూ త్రోసిరాజన్నా, స్మరణం కూడ చేసుకోలేకపోతున్న దౌర్భాగ్య దుస్థితిలో ఈదులాడుతున్నారు, మన నాయకులు, వినాయకులు. ఎన్నికలలో నక్కజిత్తులూ, అన్యాయాలు, మోసాలు, రాక్షసనీతితోపాటు రాక్షస షౄంగారం కూడ చెలామణి అవుతుందని, - ఒక పార్టీ పురుషుణ్ణి రెండోపార్టీవారు లేవదీసుకుపోవడం - ఎలెక్షన్ నాటకంలో రాక్షస శౄంగారం అని రాధాకౄష్ణగారు ఎన్నికల రాద్ధాంతాన్ని వివరించారు. చిత్రాద్భుతాలు మన ఎన్నికలు మన చిలకమర్తి వారు, 'వోట్లకై తిరుగుటా అన్న రచనలో - ఎలక్షను చిత్రములు మిక్కిలి యద్భుతము. ఆనాడే ఆయన ఈ మాట అన్నారంటే, ఈ కలియుగంలో, దారుణాతిదారుణ పరిస్థితుల్లో, నేటి ఎన్నికల స్థితిగతుల్ని, దురవస్థల్ని, దుస్థితిల్ని వర్ణించడానికి ఏ షబ్దకోషంలోనూ సరిసమమైన పదం, అర్థం కూడ మనకు గోచరించే పరిస్థితే లేదు. ఎలెక్షన్ రోజున మనకు వోటువేసే వాడిని, వెయ్యనివాడిని కూడ కౌగలించుకొని లోపలికి తీసుకువెళ్ళవలెను అని చెబుతూ, ఆయన చమత్కారాలన్నీ జరిగితేనే కాని ఎలక్షను కాదులెండి అని తీర్మానించారు కూడా. యిలా ఎంతమందో మన తెలుగు సాహితీకారులు ఎన్నికల వివరాలను తమ వ్యంగ్యాస్త్రాలను విసిరారు. కేవలము, పరోపకార హౄదయములకే ఎలెక్షన్లు లో నిలుచుటకు నీడలేదు అని కాళ్ళకూరి వారు - లేడీ డాక్టరు అన్న రచనలో వివరిస్తారు. ఎన్నొ ఓట్లు ఒచ్చేయన్నదే లెక్కకాని ఎంత సారా ఖర్చయిందన్నది లెక్కకాదే! - అని ప్రముఖ రచయిత రావిషాస్త్రి - కుక్కపిల్ల అన్న రచనలో సారాకథనాన్ని సోదాహరణంగా చెప్పారు. ఏది ఏమైనా, ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా - ఎన్ని కలలో కరగిపోవు ఎన్నికలలో - అన్న ముకురాల రామిరెడ్డిగారి మాట - నవ్వేకత్తులు అన్న రచనలో ప్రస్తావించినట్లు యదార్థం అని చెప్పాలి. నవ్వుతూ నవ్వుతూ, కుత్తుకల్ని తెలియకుండా కోయడం జరుగుతూనేవుంది. ఈ రాబోయే పురపాలక ఎన్నికలు కలల్ని కరగిస్తాయో, సమస్యల్ని మరిగిస్తాయో, కలల్ని కలలుగానే ఈ సారి కూడా మిగులుస్తాయో, వేచిచూద్దాం మరి! అన్యథా షరణం నాస్తి, త్వమేవ షరణం మమ! అని మననం చేసుకుంటూ ఎన్నికలరోజుకోసం నిరీక్షణ చేద్దాం. హెచ్చరిక : సీటు సంతసరుకైతే, ఓటుకు బూతు మరుగెందుకు? అని కాళోజీ అంటే, 'బ్రూటుకేసిన ఓటు బురదలో గిరవాటు, కడకు తెచ్చును చేటు; అన్న మహాకవి ఆరుద్ర భావాన్ని మదిలో స్మరించుకుంటూ - భాగ్యనగర మహాపాలకసంఘ ఎన్నికలలో తెలివిగా ఓటుహక్కుని వినియోగించుకుంటేనే మన ప్రజకు మనుగడ, ఉనికికి సార్థకత అన్నది మరువరాని, మరువలేని సత్యం. ఎన్నిక - ఎంపిక మనిషి ఒక్కడే తన ఇష్టానికి అనుకూలంగా జీవిస్తాడు. ఎన్నుకోవడం జీవితంలో భాగం. మన నేతలనైనా, జీవితాన్నైనా, మనకు నచ్చిన, అర్థవంతమైనట్లుగానే ఎంపిక/ఎన్నిక చేసుకోవాలి. భారతీయ ఆచారంలో, మొత్తం సౄష్టిలో మానవునికి మాత్రమే ఎంపిక చేసుకునే అధికారం వుంది. ఏదైనా నాణ్యమైన ఎంపిక చేసుకోవాలి. మహాకవి షేక్స్పియర్ అన్నట్లు కుళ్ళిన పండ్లలో ఎంపికకు అవకాషమేలేదు. సరిగ్గా, మన ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిథుల ఎన్నికల తీరు తెన్నులు అలా ఘోరంగా పరాజయం పాలవడం జరుగుతోంది. అల్లులో మల్లు కూడ దొరకని పరిస్థితి మన రాజకీయ విధానం అందరికీ తెలుసున్న విషయమే కదా!


కొంపెల్ల షర్మ - తెలుగురథం.

Thursday, November 19, 2009

ఏకైక మహిళా ప్రధాని - ఇందిరాగాంధి జయంతి

ఏకైక మహిళా ప్రధాని - ఇందిరాగాంధి జయంతి

సాహసం అనేది లేకుండా మనిషి యింక ఏ యితర సద్గుణాలనీ ఆచరణలోకి తెచ్చుకోలేడు - ఇందిరాగాంధి కుటుంబరాజకీయాలకి పరాకాష్ఠ "రెండురకాల వ్యక్తులు రాజకీయాలలో గొప్పగా రాణిస్తారు; ప్రవర్తన లేకపోయినా ప్రతిభ వున్నవారు, ప్రతిభలేకపోయినా పైవారి క్రింద అణగిమణగి వుండేవారు" అని 'వె డెల్ ఫిలిప్శ్ అని ఓ ప్రబుద్ధుడు నిర్వచించాడు. ఈయనికి భారతదేశ రాజకీయాల గురించి అవగాహన వుందే లేదో తెలియదు కాని, యించుమించు మన రాజకీయాలని చూచాయగా చెప్పకనే చెప్పాడు. అటువంటి మనదేశపు రాజకీయవ్యవస్థలో మొట్టమొదట ప్రస్తావించవలసినది, తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే అని చెప్పాలి. ఆయన సుపుత్రిక, భారతదేశపు మూడవ ప్రధాని - ఇందిరాగాంధి. ఆ తర్వాత ఆమె ప్రియ తనయుడు రాజీవగాంధి. కొంచెం విరామం వచ్చినా, ఈయన భార్య సోనియాగాంధి పాత్రపై వాదోపవాదాలు వచ్చినా, ప్రస్తుతం మాత్రం ఈ విదేశీవనిత హయాంలోనే దేశం నడుస్తోంది అన్నదాంట్లో ఏమాత్రం సంశయం, సందేశం రానేరాదు. యిది సరిపోక, నెహ్రూ కుటుంబ నేటితరం నాయకుడు రాహుల్ గాంధీ కూడ రాజకీయ రంగప్రవేశం చేసి, తనదైన శైలిలో చురుగ్గా అడుగులు వడివడిగా ముందుకు వేసి, వచ్చీరానట్లు రాజకీయ వైకుంఠపాళీలో నిచ్చెనల్ని ఎక్కేసేందుకు సామగ్రిని తయారుచేసుకుంటున్నాడు. సంక్షిప్తంగా మన భారతీయ రాజకీయ ఆధునిక చరిత్రని అధికకాలం ఒకేఒక కుటుంబం నిర్ధారించినదనే చెప్పాలి. యిందులో సగభాగం, భారం మహిళానిర్దేశకత, దర్శకత్వం వహించడం అన్నది కూడ సత్యంగానే చెప్పాలి. నేటివరకూ, మన భరతదేశాన్ని పరిపాలించిన ఏకైక మహిళాప్రధాని మాత్రం 'ఇందిరాగాంధి జగమెరిగిన జాణ కొందరు ప్రపంచంలోంచి పుట్టుకొస్తారు. మరికొందరు ప్రపంచం కోసం పుడ్తారు. యింకొందరు ప్రపంచపు చివరిటంచులవరకు పయనిస్తారు. అయితే ఈ మూడు విధానాలని ముప్పేటగా రంగరించుకుని కొందరు దర్శనమవుతారు. ఈ కోవలో గణనీయమైన అగ్రగణ్యులు కోటికొక్కరు, యుగానిక్కొరు మనకు దర్శనీయమవుతారు. సంభవామి యుగేయుగే అని శ్రీకౄష్ణుడన్నట్లు మనకు వరప్రసాదాలు లభ్యమవుతాయి. మన దేశచరిత్రలో అటువంటి అరుదైన ఆణిముత్యం, జగమెరిగిన జాణ - యిందిరా ప్రియదర్శని; అందరికీ చిరపరిచితురాలైన - యిందిరాగాంధి. మన భారతదేశానికి మొదటి మహిళా ప్రధాని. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి ప్రియతనయ. ఈమె తనదైన చురుకు, ఉరుకులతో దేశాన్ని ఒక చిన్నతరహా పాఠశాలలా, తాను ఒక ముఖ్య ఉపాధ్యాయురాలుగా ప్రజలకూ, తోటి ఉపాధ్యాయులకూ కూడ నవరసాలతో పాఠాలను నేర్పించిన నెలత - యిందిరా ప్రియదర్శిని. గడచిన తొమ్మిది దశాబ్దాలు దేశాన్ని ముందుకు నడిపించిన మహామనీషి. అభివౄద్ధికి ఆనవాలు. ధైర్యానికి కితాబు. సాహసానికి మారుపేరు. ఎక్కడ అడిగిడినా విజయేందిరగానే చెలామణీ అయింది. ఆమె పుట్టినప్పుడు పెట్టిన పేరు - యిందిరా ప్రియదర్శని. విశ్వరాజకీయ చిత్రపటంలో భారతావనికి పరమపదసోపాన స్థానాన్ని కలగజేసిన ప్రతిభామూర్తి. అభివౄద్ధి చెందుతున్న, వెనుకబడిన, బలహీన రాజ్యాలకి ప్రత్యేక పరిగణనలుండాలని పట్టుపట్టిన ఆదర్శమూర్తి. ప్రపంచశాంతికై కౄషి సలిపిన ప్రమధగణ ప్రతినిధి. భారతదేశపు అతిపెద్ద రాష్ట్రం, ఉత్తరపదేశ్ లోని త్రివేణీ సంగమస్థలి అయిన అలహాబాదు నగరంలో, సుసంపన్నకుటుంబంలో జన్మించిన యిందిరా ప్రియదర్శని 19 నవంబరు 1917 న జన్మించింది - యిందిరా ప్రియదర్శని జవహర్ లాల్, కమలాభాయి లకు ఏకైక సంతానం. అందుకే గారాలపట్టి. యిందిరా విద్యాభ్యాసం - పూనా, శాంతినికేతన్, స్విడ్జర్లాండ్, యింగ్లండు లో జరిగింది. పదమూడేళ్ళకు 'వానరసేనా ను స్థాపించడం, ఈ సేన ద్వారా దేశంలోని ప్రముఖ యువతను సంఘటితం చేసి, దేశ స్వాతంత్ర్య సమరానికి సన్నిధ్ధులయ్యే వేదికకు శ్రీకారం చుట్టింది. తిరుగులేని, తిరిగిరాని ప్రస్థానం 1942 దేశ స్వాతంత్ర్యచరిత్రలో చిరస్థాయి సంఘటన 'క్వీట్ యిండియా అయితే, అదే సంవత్సరం యిందిర ఫిరోజ్ గాంధిని వివాహమాడింది. రాజీవ్, సంజయలు కొడుకుల తల్లి, మాతౄత్వానికి చిహ్నాలు. పదవిలో ఉండగానే చిన్నకొడుకు సంజయగాంధి ని జోరు రాజకీయజోక్యధోరణిని ఆపలేకపోయి, 'అత్యవసర పరిస్థితీ పేరున దేశాన్ని కొరడాతో ఝళిపించి, భయభ్రాంతులతో పరిపాలించడానికి ముఖ్య హేతువు ఈ ప్రబుద్ధుడు. అయితే విధి నిర్ణయానికి, 1980 లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించి పుత్రశోకానికి గురయింది. ఈ అనూహ్య పరిణామం యిందిరకు వ్యక్తిగతంగా, రాజకీయంగా క్రుంగదీసిందనే చెప్పాలి. ఏదో తెలియని ఆవేశం, అనాలోచిత నిర్ణయాలను తనదైన మంకుపట్టు పద్ధతులతో రాజకీయాన్ని, దేశాన్ని తన కొంగుచాటుగా, కొంగుముడితోనూ నడుపవచ్చు అనుకుని తిరుగులేని వడివడి అడుగులు కాకుండా అంగలు వేసుకుంటూ ప్రస్థానం చేసిన వైనాలు, రాజకీయం నుంచి ఉగ్రరాజకీయం వరకూ తనకు తాను తెలియకుండ సాగిపోవడం జరిగింది. ప్రోత్సహించిన ఉగ్రవాదం, పాముకు పాలు పోసి విషపు కోరలను నిశితం చేసినట్లుగా మారి, మనం పెంచిన విషనాగుకోరలే మనల్ని కాటువేసేలే చేసుకున్న రీతుల్లో రాజకీయాన్ని రక్కసిలా నడిపించింది. బలిదానం కావించుకుంది. రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తిలేకుండ, విదేశాల్లో చదువుకుంటూ, ప్రేమవివాహం ద్వారా విదేశీవనితను వివాహమాడి, 'పైలట్' వౄత్తిని నైపుణ్యంతో నిర్వహించుకుంటూ ప్రశాంత జీవితాన్ని గడుపుకుందాం అనుకుంటున్న పరిస్థితుల్లో, దేశరజకీయ రధసారధ్యానికి నాయకత్వం వహించవలసి వచ్చింది. అయిష్టంగా స్వీకరించినా, రాజకీయంలో యువతని, యుక్తుల్ని, నూతనభావాలతో సమసమాజాన్ని మరింత సుఖవంతంగా నడిపించాలన్న నిష్కళంకంగా కొత్తకొత్త ప్రణాళికలు, పధకాలను, సమాచార, సాంకేతిక రంగాలను విశ్వవ్యాప్తం చేసుకుంటూ, దేశాన్ని ప్రపంచచిత్రపటానికి సునాయాసంగా అతికించి, భారతదేశం అంటే ఏమిటో బయస్కోపు ద్వారా చూపించిన ఘనత మాత్రం రాజీవ్ గాంధీదే అని ముక్తకంఠంగా చెప్పవచ్చు. అయితే, తల్లిని పొట్టపెట్టుకున్న కుటిల ఉగ్రవాద రాజకీయం తెలియని రంగులు పులుముకుని, తిరిగి భారతదేశ ప్రధానిని కోల్పోయిన దురదౄష్టకరమైన రాజకీయ ప్రస్థానం మనది. యిందిర జయాపజయ సంకేతాలు తండ్రి జవహర్ లాల్ నెహ్రూ తరవాత, లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో పదవిని నిర్వహిస్తూ, వెంటనే దేశపు రాజకీయరధసారధ్యాన్ని చేపట్టిన యిందిర తన యాత్రలో తిరిగి వెనుకకు చూడలేదు. చూడవలసివచ్చినా, వెనుకకు తిరుగలేదు. యీ పద్ధతిలో, అంతేకాక, అత్యంత ప్రతిభావంతంగా, ప్రకాశవంతంగా ప్రధాని పదవిని నిర్వహించారు. ముదుసలి రాజకీయాలను విశ్రాంతిమందిరాల్లోకి నెట్టివేసి, రధాన్ని తనదైన వేగంతో నడిపించారు. భారతదేశపు మూడవ ప్రధాని, తొలి మహిళాప్రధానిగా, 24 జనవరి 1966 న పదవీబాధ్యతలను స్వీకరించి, చివరి మజిలీని 1984 వరకూ నిరాఘాటంగా నడిపించిన ఘనత మాత్రం యిందిరదే అని చెప్పాలి. 1975 లో ఆమె లోక్ సభ ఎన్నికలు చెల్లవని కోర్టు తీర్పు యివ్వడం, అహం, అధికారం, ఆభిజాత్యం రంగరించిన రసరాట్టు ఆనాటి రాజకీయరణానికి మందు అనుకుని రంగరించి, అరగదీసి అదిమిన లేహ్యం కొత్త రోగాలని తెచ్చి రాజకీయాన్ని మరింత అనారోగ్యంగా తయారు కావడానికి పూర్తి బాధ్యత ఆమెదే అని అనిపించేలా అధికారాన్ని తనకు తెలియకుండా, తన హితులు, సన్నిహితులుగా చిన్న చితక నాయకుల్ని చేరదీసి, వారివల్లే రాజకీయ అస్త్రాల్ని సంధింపచేసుకుని, వాటినే తిరిగి ఎదుర్కొంటూ, ఘోర అపజయాన్ని స్వీకరించక తప్పలేదు. బలీయమైన విధిరాతకు రాజకీయం మినహాయింపు కాదు అని రుజువుచేసుకుంది. ఫలితంగా, 1977 ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. రాజకీయ పులిజూదంలో రంకెలు, గంతులు తప్పవని నిరూపిస్తూ, 1980 లో జయపతాకాన్ని విజయేందిర దేశపు రాజకీయ వినువీధుల్లో రెపరెపలాడించింది. తిరుగులేని రాజకీయాన్ని మరింత తిరుగుబాటుతనాన్ని తెలియకుండ ప్రోత్సహించుకుంటూ కదపిన రాజకీయ చదరంగపు పావులు - నలుపు, తెలుపు రంగుల మిశ్రమై రాజకీయం కలగాపులగంగా మారి, వివర్ణమై, పాలిపోయి, పేడిలా మారి, ఆ మాయలమారి సూదంటురాయి తన గుండెలోకే దూసుకుపోయింది. ఫలితంగా, తన వ్యక్తిగత రక్షకభటుడి తుపాకీయే ఈ దేశపు ప్రధానమంత్రిణి ని నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా హతమయ్యేలా చేసింది కుటిల కుతంత్ర రాజకీయం. బలిదానం చేసుకుంది. యిందిర పరిపాలనలో ధ్రువ నక్షత్రాలు నాటినుంచి, నేటివరకూ, యిందిర తీసుకున్న ఆర్ధిక, సామాజిక, రాజకీయ, పరిపాలనా విధానాలు, నిర్ణయాలు, రవంత సవ్వడిని, అలజడిని లేవదీసినా, మార్పును మాత్రం తీసుకువచ్చాయి అన్నదాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. మచ్చుకు - బాంకుల జాతీయకరణ, బంగ్లాదేశ్ కు విముక్తి, ప్రాముఖ్యతను సంతరించుకున్న 20-సూత్రాల పధకం, 'గరీబీ హటావో' అన్న నినాదం బీదరికాన్ని ఎంత తగ్గించింది అన్న ప్రశ్న వేయకుంటే, రష్యారాజ్య పరిపాలనా విధానాన్ని అనుకరించిన తీరుమాత్రం అనూహ్యం. రాజభరణాలను రద్దుచేయడం లాంటివి ఎన్నో నిర్ణయాలు యిందిరను వైకుంఠపాళీలో నిచ్చెనలను ఎక్కేందుకు పరికరాలుగా వినియోగించుకుంది. అమౄతసరోవరం తెచ్చెన ముప్పు పవిత్ర దేవాలయం అమౄతసర్ ప్రాంగణంలోనుంచి ఉగ్రవాద వలస కేంద్రాని తరిమివేయాలన్న తీవ్రతలంపుతో 'ఆపరేషన్ బ్లూస్టాఋ చర్య ద్వారా, ఉగ్రవాదాన్ని అణచాలన్న ప్రయత్నం సబబైనా, జరిగిన తీరుమాత్రం రాజకీయ శత్రుత్వాన్ని రగులుకొలిపింది. ఆ తీక్షణచర్యపై పగపూని, చివరి కపటచర్యగా, యిందిరగాంధిని తన అధికారిక నివాసంలోనే, తన స్వంత రక్షకభటుడి చేతులమీదుగానే, హతమార్చడం జరిగింది. ఈ దుర:కార, దుర్వినీతి, దుష్ట రాజకీయం తన పగను నెరవేర్చుకుంది. జాతికి మచ్చమాత్రం చిరస్థాయిగా నిలచిపోయింది. సరిగ్గా, ఈ రోజే, 31, అక్టోబర్ 1984 న దేశపు ఏకైక మహిళా ప్రధానమంత్రి - యిందిరాగాంధి తన తుదిశ్వాసను విడిచింది. జాతిరత్నం, మహామనీషి, మణిమకుటసమానం, సరిసములులేని వ్యక్తిత్వం, వెరసి యిందిరా ప్రియదర్శిని గాంధి, మహాభినిష్క్రమణం కావించింది. భారతదేశం మరో మహిళా ప్రధానమంత్రి కోసం ఎదురుతెన్నులు చూస్తూంది. కలలు ఫలిస్తాయో, లేదో, కాలధర్మం, కాలనిర్ణయం చేసే విధిలిఖితం పై ఆధారపడింది అన్నది సత్యం. యిందిరాగాంధి భావ లహరి కలసి మెలసి జీవించే మానవాళి మనుగడ వికాసంలోనిసహజ పరిణామమే - అంతర్జాతీయ స్థాయిలో సైతం దశదిశల నుంచి లభించే సంపూర్ణ సహకారం. ప్రజా ప్రభుత్వ పద్ధతిలో నడిచే సమాజంలో మనలని మనం క్రమశిక్షణతో నడిపించుకోవడం, అన్నిటినీ మించిన యుక్తి అవుతుంది. జీవితం ఓ అధ్బుతమైన లక్ష్యానికి అంకితం అయినప్పుడే దాని సార్ధక్యం పెరుగుతుంది; అలా అంకితం అవటంలో చక్కటి జ్ౙానంతోపాటు సరైన న్యాయమూ ఉండాలి.ఇందిరాగాంధి జయంతి (19 నవంబర్) సందర్భంగా - తెలుగు రథం ఘననివాళులను సమర్పించుకుంటోంది. కొంపెల్ల శర్మ - తెలుగు రథం.

Monday, November 16, 2009

గోరా జయంతి

గోరా ( 1902 - 1975 ) జయంతి

భారతీయ నాస్తికవాద నేత, గోరా అని ప్రసిద్ధి చెందిన, గోపరాజు రామచంద్రరావు, 15 నవంబర్ 1902 న ఉన్నతకుల హిందూ కుటుంబంలో జన్మించారు. నాస్తికవాది అన్నవెంటనే, ఈ వ్యాసం చదవడం మానేసినవాళ్ళు కూడ వుంటారేమో!. గోరా తన ఆత్మకధ లో పేర్కొన్నట్లు, పరంపరగా వస్తున్న సంప్రదాయ, మూఢాచారాలు ప్రబలుతున్న కుటుంబం అని తానే చెప్పుకున్నారు. నాస్తికుడిగా,నాస్తికవాద ప్రచారానికి విశేష కౄషి చేసిన మహనీయుడిగా తెలుగు వారందరికీ సుపరిచితులు. ఆస్తికత, హేతువాద విరుద్ధమంటారు. నేటి సమాజంలో అగ్ర - నిమ్న జాతులనే వర్గ భేదాలు, అంధ విశ్వాసాలు పెచ్చు పెరిగిపోవడానికి, ఆస్తికతే ప్రధాన కారణమని గోరా విశ్వసించారు. వౄక్షశాస్త్రంలో డిగ్రీ చదివి, మద్రాసు ప్రేసిడెన్సీ కాలేజీలో అదే శాస్త్రంలో మాష్టర్ డిగ్రీలో ఉత్తీర్ణతను పొందారు. గోరా ఆంధ్రరాష్ట్రంలో, పలు కళాశాలల్లో, శ్రీలంకలో కొంతకాలం అధ్యాపకులుగా వౄత్తిని నిర్వహించారు. 1922 లో సరస్వతిని, ఆమె 10 ఏళ్ళ ప్రాయంలోనే వివాహం చేసుకున్నాడు. వారిద్దరి కుటుంబాలు, హిందూ సనాతన పద్ధతిలోని కుటుంబాలే. వీరిరువిరి కుటుంబాలు, బాల్యవివాహ నిరోధ చట్టం 1975 లో జరిగింది. నాస్తికవాద ప్రచారం తనకు నచ్చిన వాదాన్ని, అంటే నాస్తిక వాదాన్ని. ప్రచారం చేయడానికిజీవితాంతం శ్రమపడిన వ్యక్తి. 1940 లో గోరా ఆయన భార్య తో కలసి, నాస్తికకేంద్రం ను, కౄష్ణాజిల్లాలోని ఒక గ్రామంలో ప్రారంభించడం జగిరింది. 1040 ప్రాంతంలో విజయవాడ కేంద్రంగా తాను నమ్మిన సిద్ధాంతాల ప్రచారాన్ని చేపట్టాౠ. ఆ కాలంలోని భారత స్వాతంత్ర్య సంగ్రామంగ్లో క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో పాల్గొని ఆలీపురంతదితర జైళ్ళలో కఠిన శిక్షల్ని అనుభవించారు. దేశస్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లో, కేంద్రాన్ని విజయవాడకు తరలించడం జరిగింది. సోషలిస్టు భావాలకు అనుగుణంగా మానవులందరూ సమానమనే భావం సమాజంలో నెలకొనాలంటే నాస్తికవాదం వల్ల మాత్రమే సుసాధ్యమని ఆయన భావించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నాస్తికవాద ప్రచారంలో తన జీవితాంతం అకుంఠిత దీక్షతో కౄషి సలిపిన, గోరా, 'ఎథీస్టూ అనే ఆంగ్ల మాసపత్రికను నడిపారు. గోరా రచించిన 'పాజిటివ్ ఎథీస్టూ అనే గ్రంథంలో నాస్తిక భావాలను, హేతువాదాన్ని వివరంగా పొందుపరచారు. గోరా చేపట్టిన పలు సంఘ సంస్కరణ కార్యక్రమాలని గాంధీజీ కూడ హర్షించాడని, అభినందించారని ఎప్పుడూ ఆయన అభిమానులు చెప్పుతూంటారు. గాంధీజీ సర్వోదయ కార్యక్రమం కూడ గోరా కునచ్చిందని, సర్వోదయ కార్యకర్తగా తన జీవితాంతం గడిపారననడంలో ఏ సందేహం లేదు, రాదు. గోరా రచనలు గోరా వ్రాసిన రచనల్లో ప్రథానంగా, నాస్తికవాదం పై ప్రశ్నలు-జవాబులు, నాస్తికుని విశ్వయానం, గాంధీతో నాస్తికుడు, నాస్తికత ఆవశ్యకత, అనుకూల నాస్తికవాదం అన్నవి వ్రాశారు. 1949 నుంచే ప్రారంభించిన పత్రికావ్యాసం, నాస్తికత ఆంశంపై, వాటిని 1969 లో నాస్తికవాది అన్న మాసపత్రికలో ప్రచురించారు. వర్ణవ్యవస్థ, అంటరానితనంపై తన యుద్ధాన్ని ప్రకటించారు. కర్మసిద్ధాంతంపైనా, ఆధ్యాత్మకపరంగా తరచు అనుకునే కర్మ, ప్రాప్తం అనే విషయాలపై తనకున్న నిశ్చితాభిప్రాయాల్ని వెల్లడించడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. గోరా గొప్ప సంఘసంస్కర్త కావడమే కాక, కుల, మత రహిత సమసమాజ నిర్మాణానికై తాను చేపట్టిన ఉద్యమానికి తానే ఆదర్శంగా నిలవాలని, తన కుమారులకు, కుమార్తెలకు కులాంతర వివాహాలు, నిరాడంబరంగా నిర్వహించిన ఘనాపాటి. అంటరానితనం నిర్మూలనపై కూడ విశేష కౄషి చేశారు. 1970 లో బోస్టన్ లో,1974 లో హాలండ్ లోని ఆంసటర్ డంలో జరిగిన అంతర్జాతీయ హ్యూమనిస్ట్ సమావేశంలో గోరా పాల్గొన్నారు. తెలుగు వారపత్రిక 'సంఘం'ను స్థాపించి తద్వారా తన ఆశయాలను, లక్ష్యాలను విశేషంగా ప్రజల్లో ప్రచారం నిర్వహించారు. ఒక సిద్ధాంతపరమైన భావాలతో జీవితాంతం కౄషిసల్పిన 'గోరా' 1975, 26, జూలైన మరణించారు. ఏ వాదమైనా, మానవసేవయే మాధవసేవయ పరమ పరమార్ధం అని నమ్మి ఆచరించిన మహానుభావుడు, గోరా. గోరా మరణాంతరం, నాస్తికకేంద్రాన్ని, ఆయన భార్య సరస్వతి పర్యవేక్షణలో, సలహాసంప్రదింపులు, కులాంతర వివాహాలు, వర్ణరహిత వివాహాల కోసం నిరంతర కౄషిని సలిపాడు. బాల్య వివాహాలని నిషేధించడానికి, వేశ్యావౄత్తిలో యిరుక్కుపోయినవారికి సహాయ సహకారాలు, పెళ్ళికాని తల్లులకు సహాయాలు, బీదవర్గపు మహిళలు, మూఢాచార నమ్మకాలపై కౄషిని సలిపారు. వీటికి నిదర్శనగా, మంటలపై నడకలు, యితర మూఢాచారాల్ని తొలగించే ప్రయత్నం జరిగింది. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబనియంత్రణ, వీటితో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే. 2002 లో భారతప్రభుత్వం, తపాలాశాఖవారు, ప్రత్యేక తపాళబిళ్ళను 5 రూపాయల స్ఠాంపుని విడుదల చేశారు. గోరా 100 వ శతాబ్దపు జయంతి సందర్భంగా విడుదల చేశారు. నాస్తికవాద ప్రచారకుడు, సంఘసంస్కర్త అయిన గోపరాజు రామచంద్రరావు (గోరా) జయంతి సందర్భంగా తెలుగురథం ఘననివాళిని సమర్పించుకుంటోంది. కొంపెల్ల శర్మ - తెలుగురథం.