Saturday, October 31, 2015

చాచా నెహ్రూ జయంతి - బాలల దినోత్సవం - 14 నవంబర్ విశ్వవ్యాప్తంగా పిల్లల సంబరాలు పలు దేశాలు, అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం సంప్రదాయంగా వస్తున్నది. జెనీవా - స్విట్జిర్లాండ్ లో 1925 లో బాలల సంక్షేమాన్ని దౄష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి సమావేశం జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో లోని చైనా రాయబారి కార్యాలయం చైనా దేశపు అనాధ పిల్లలకోసం 1925 లోనే డ్రాగన్ పడవల ఉత్సవాన్ని జరపడం, అదేరోజు జూన్ 1 న బాలలకోసం సమావేశం జరపడం యాదౄచ్చకంగా జరిగిపోయాయి. యిదేరోజు అంతర్జాతీయ బాలల సంవత్సరం అనేక దేశాలు జరుపుతుండగా, పశ్చిమప్రాంతపు కమ్యునిష్టు దేశాలు వేర్వేరు తేదీన జరుపుకోవడం, కమ్యూనిష్టు దేశాల సంప్రదాయంగా కూడ ప్రారంభం అయింది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో అమెరికాలోని అధికరాజ్యాలు కూడ జరుపుకోవడం సంతోషించతగ్గది. యునెస్కో పిల్లలకి అంకితభావాలు యునెస్కో సంస్థ పిల్లలకు ప్రత్యేకంగా 1954 లో 20 నవంబర్ రోజుని ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి, యునెస్కో సంయుక్తంగా పిల్లలకోసం సౌహార్ద్రతకై ప్రత్యేకతని వివరించారు. బాలల సంక్షేమాన్ని దౄష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించేందుకు తొలిప్రయత్నాలను చేశారు. భారతదేశంలో నవంబర్ 14 నే జరుపుకోవడం, ఆనాడు భారత తొలి ప్రధాని నెహ్రూ జన్మదినం కావడం విశేషంగా భావించబడుతోంది. మనదేశంలో ముందడుగు - 14 నవంబరు పిల్లల పండగ భారతదేశపు తొలిప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన - 14 నవంబరు న జరుపుకోవడం సదాచారంగా వస్తున్నది. పిల్లలంటే ఆయనకు పంచప్రాణాలు, ఎప్పుడూ పిల్లలతో సరదాగా గడపడం, పిల్లలకు కూడ అంతకన్న అధిక సంతోషంగా గడిపేవారు. 1963 లో ఆయన మరణాంతరం, చాచా నెహ్రూ పుట్టినరోజు సంబరాలతో పిల్లలకు కూడ పండగ జరుపుకోవడం భారతీయసంప్రదాయం. బాలలు దేవుని ప్రతిరూపాలు హైందవ ధర్మసంస్కౄతీపరంపరలో మానవజన్మకు సార్ధకమైనవి చతురావస్థలు - బాల్య, యౌవన, కౌమార, వార్ధక్య దశలు. మానవుడి జీవితంలో మధురాతిమధురమైనది బాల్యదశ. బాలల గురించి అల్పంలో అనల్ప భావనను వర్ణించాలంటే, మహాకవి శ్రీశ్రీ, ఒక బాలలసంవత్సరం రోజున ఆయన వర్ణించిన కవితను - బాలలే విజ్ణాన కేతువులు, నేడు రేపుల మధ్య సేతువులు, చంద్రబంధుర సుధాశీతువులు, మానవత్వ వికాస హేతువులు, అన్న భావన అపూర్వమనే చెప్పాలి. కవిత్రయంలో మధ్యకవి, తిక్కన, మహాభారతం, ఉద్యోగపర్వంలో, తొలి తొలి గోరికొనన్ బాలునికి దగుం బాడిమెయిన్ అంటాడు. నేటి బాలలే రేపటి పౌరులు. దేశభవిష్యత్తు వారిమీద ఆధారపడింది. పిన్నలను తీర్చిదిద్దడం పెద్దల కర్తవ్యం. చిన్నప్పుడే బాలలు తమ వ్యక్తిత్వాలను రూపొందించుకునే వాతావరణాన్ని, ప్రోత్సాహాన్ని సమాజం కల్పించాలి. బాలల్లో ఉన్న కళలూ తెలివితేటలూ నిర్మాణాత్మకంగా దేశానికి ఉపయోగపడేటట్లు అవకాశాలు రూపొందించాలి. అన్ని రంగాల్లోవలనే, బాలలలోని సౄజనాత్మకశక్తినీ, కళాతౄష్ణనూ, ప్రతిభావికాసాలనూ పరిపోషించటానికి విశ్వవ్యాప్తంగా ముందంజ వేయాలి. చదువుతోపాటు బాలల సాహిత్య సాంస్కౄతిక కళావికాసాలకు కౄషిచేసే సంస్థలూ, పత్రికలూ ఎన్నో ఉన్నాయి. ఆ రంగాలలో వ్యష్టిగా జరుగుతున్న కౄషిని సమీకరించి సమిష్టిగా సమాజానికుపయోగపడే విధంగా, మరింత విస్తౄత ప్రాతిపదికతో కార్యక్రమాల్ని చేపట్టి బాలల సర్వతోముఖ వికాసానికి తోడ్పడే వ్యవస్థ నొకదానిని సుస్థిరంగా ఏర్పాటు చేయడానికి మరింత సంకల్పం, దీక్ష వహించాలి. బాలల అకాడమీలు, బాలసదనాలు, మరింత అర్ధవంతంగా, సార్ధకతను పెంపొందించేలా, కార్యకలాపాలు నిర్వహించి, బాలల విజ్ణాన, వినోద, వికాసాలకు మరింత సహాయపడాలి. బాలల అకాడమీలు కూడ విశ్వవిద్యాలయాలే! అఖిలభారతదేశంలో బాలల అకాడమీ ని స్థాపించిన గౌరవం మొదటి సారి మన రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్ కే దక్కింది. అందుకు మనల్ని మనమే అభినందించుకోవచ్చు. మనం ఈ మధ్య కాలంలోనే తరచు కనీసం చర్చించుకుంటున్న ఆత్మగౌరవం పదాన్ని కనీసం యిటువంటి ప్రయత్నాలకు అన్వయించుకోవచ్చు. కాని మన పూర్వీకులు అన్నట్లు, అంధ్రులకు ఆలోచన కన్న ఆవేశం ఎక్కువ. ఆరంభశూరులు, వెంటనే చతికిలబడతారు, లేదా నత్తనడక నడుస్తారు. బాలలలో నిత్యనూతన వికాసాన్ని కలిగించే కార్యక్రమాలను చేపట్టాలి. వాటిల్లో బాలల ప్రత్యక్ష ప్రమేయాన్ని కలిగించాలి. జాతి నిర్మాణ కార్యక్రమాల్లో తాము చిన్నప్పటినుంచీ పాల్గొంటున్నామన్న ఆత్మవిశ్వాసాన్ని బాలలలో కలిగించాలి. నడుస్తున్న చరిత్రలో వారుకూడా భాగస్వాములు కావాలి. చదువుతున్న పుస్తకాలెంత విజ్ణానాన్ని యిస్తాయో చూస్తున్న సమకాలీన సమాజం కూడా అంత విజ్ణానాన్నిస్తుంది, యిస్తోంది అన్న భావనను అందరూ గ్రహించి, దోహదపడాలి. బాలలు గతంలోనుంచి గొప్పతనాన్ని గ్రహించాలి. వర్తమానంలోనుంచి సత్తువను పెంచుకోవాలి. భవిష్యత్తుకు కావలసిన ముందుచూపును అలవరచుకోవాలి. అన్ని రంగాల్లో నాయకత్వాన్ని వహించే సమగ్ర వ్యక్తిత్వాలను పిన్న వయసులోనే సాధించాలి. అటువంటి అవకాశాలను కల్పించే సంకల్పంలో ప్రభుత్వాలు బాలల అకాడమీలను, సదనాల్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్ళాలి. బాలల సమస్యల్ని చర్చించుకోవటానికీ, నిర్మాణాత్మకమైన కార్యక్రమాల్ని బాలల సలహాసంప్రదింపులతో, రూపొందించుకోవడానికి, బాలల కళాసాహిత్య ప్రతిభలను ప్రదర్శింపచేయడానికీ, సభలను, సమావేశాలను తరచుగా, సక్రమంగా నిర్వహించుకోవాలి. పాఠశాలల్లో బాలబాలికలను సంఘాలుగా ఏర్పాటు చేయించి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దల సహాయసహకారాలతో, లలితకళలపైన, క్రీడలపైన, వినోదోల్లాసభరిత కార్యక్రమాలను నిర్వహించి, ప్రతిభావంతులకు బహుమతులు, ప్రోత్సాహాలు అందజేయాలి. బాలల అకాడమీలను కూడ విశ్వవిద్యాలయాలుగా భావించి తగు ప్రణాళికలను నిర్మాణం చేసి, ఆచరణలద్వారా సత్ఫలితాలను పొందాలన్నది నేటి తీర్మానంగా పరిగణించాలి. బాలభారతీయం ఫలించిన స్వప్నాలకి ఆకౄతులు కలకలలాడే పిల్లలు. వాళ్ళ ఉజ్జ్వల భవిష్యత్తు జాతి భవిష్యత్తు బాల్యంలోనే వాళ్ళ ఆలోచనలకు పదును, హౄదయాలకు వికాసోల్లాసాలు అవసరం. వయోమర్యాదలకు అనుగుణంగా సాహితీకళారంగాల్లో కౄషి విదేశాల్లో విజయవంతంగా శతాబ్దాలుగా సాగుతున్నది. పండితులు, నాగరికులు వయస్తారతమ్యంతో నిమిత్తం లేకుండా బరువైన ప్రౌఢసాహిత్యాన్ని తమ పిల్లలకు కధలతోనూ, పొడుపుకధలతోనూ, పాటలతోనూ, ఆటలతోనూ అలరిస్తూ బాలసాహిత్యంలో మెదళ్ళకు పదునుపెట్టే విజ్ణానంతో పాలు తక్కువ. ఈ కాలంలో వినోదంతో పాటు వైజ్ణానిక, సాంకేతిక దౄష్టి, పరిసరాలను గురించిన పరిజ్ణానం అత్యావశ్యకం. బాల్యముననున్న గుణములు వయస్సు ముదిరినను పోవు; బాల్యయవ్వనాలని బేఖాతరుగా తిరిగిన వాళ్ళూ ఎంతటి ఇంటబుట్టినా కౌమార వార్ధక్యాలలో కష్టపడక తప్పదు అన్న నగ్నసత్యాన్ని బాలలబాషలో తెలియజేయాలి. చిన్నపిల్లల స్థాయినుంచీ బాల్యస్నేహం గురించి వారి హౄదయాల్లో నాటుకునేట్లు వివరించాలి. చిన్నపిల్లల స్నేహం బీరకాయ పీచులాంటివి; అవి అతి విచిత్రంగా ఒక వీధినుండి ఇంకోవీధికి, ఒక పేటనుండి ఇంకో పేటకూ విస్తరిస్తాయి అని అంటారు, కొడవటిగంటివారి ప్రముఖ నవల చదువు లో. బాలలు, పిల్లలు ... వీరి దృౠష్టిలో ? ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారు బాలలకధల్ని సౄష్టించిన అతివౄద్ధుల్లో ప్రముఖులు. సత్యం, శివం, సుందరం అని గర్వంతో చెప్పగల, అన్నివయసులవారు ఎల్లపుడూ చదివే పెద్దలపాఠకులుకూడ ఆదరించే చందమామ పత్రికలో, ప్రముఖ బాలలకధలను అందించిన వీరు, బాలల గురించి చాలా మంచి అభిప్రాయాలు చెప్పారు. తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళయినా వాళ్ళకెటువంటి సదుద్దేశాలున్నా, కొన్ని కొన్ని విషయాల్లో పిల్లల జీవితం గురించి వాళ్ళ నిర్ణయాలు చెయ్యలేరు. చిన్నపిల్ల విశ్వాసాలు పెద్దవాళ్ళ విశ్వాసాలంత జ్ణానయుతంగా ఉండవుగాని, అంత మూఢంగా కూడా వుండవు. కొందరు పిల్లలకు బొమ్మలు ఎట్లా కావాలో, కొందరు పెద్దలకు కూడా పిల్లలు అట్లాగే కావాలి ఆడుకోవడానికి. పెద్దవాళ్ళను అంచనాకట్టే శక్తి పిల్లలకు అపారంగా వుంటుంది. పిల్లల ఉద్రేకాలను కూడా పాటించడంవల్ల జీవితం బాగుపడుతుందేకాని చెడిపోదు. చిన్నపిల్లలకు రుచిలోగాని, అభిరుచిలోగాని వ్యత్యాసాలు తెలియవు, పట్టవు కూడా. చేరదేసిన వారిని పాకులాడతారు పిల్లలు. అందువల్లనే, ప్రధమ శైశవదశలో, పిల్లలు కొందమంది పెద్దవాళ్ళదగ్గరికే వెళ్ళడం, మిగతావారిదగ్గరకు, వారిలో ఏ భూతాన్ని చూస్తారో తెలియదు కాని, ఎంతమాత్రమూ వారిదరికి చేరరు. మనకు తెలియని తేడా, పిల్లలకు వారి భాషలో, భావనలో తెలిసితీరుతుంది. బాల్యం అమూల్యం - పిల్లదనాలే గొప్పదనాలు నేటి బాలలే రేపటి పౌరులు. శిశువుల చిరునవ్వు ముందు పశువు కొమ్ము వంచునులే అంటారు సినారె. కేవలం చిరునవ్వేమిటి, అసలు బ్రతుక్కి ఆనందపు పొలిమేర పసితనంకాక మరేముంది చెప్పండి అని దాశరధి సూటిగా, గ్రుచ్చిమరీ ప్రశ్నించారు. బిడ్డలకు వర్ణమాల నేర్పుటకు ముందు ముఖత: ఎన్నియో విషయములను నేర్పవలసియుండును. వ్రాత నేర్పకపూర్వమే వారికి చదువుట నేర్పవలెను అన్ని బాలనీతిచంద్రికను వివరించారు, జాతిపిత, మహాత్ముడు, ముసిముసి బోసిబోసి నవ్వుల నాణ్యమైన నజరానా. ప్రపంచంలో పుట్టిన ప్రతి శిశువూ అంతకు ముందు పుట్టిన దానికన్నా గొప్పగా వుంటుంది. బాల్యంలో వున్నంతటి స్వచ్చమైన సంతోషమూ, తాత్కాలికమైన విచారమూ మరెక్కడైనా వుంటాయా! బాల్యంలో ఒకానొక ప్రత్యేక క్షణం వుంటుంది. ఆ క్షణం తలుపులు తెరుచుకుని భవిష్యత్తు లోపలికి అడుగుపెడుతుంది. బాలుడు కేవలం బాలుడేకాదు, వ్యక్తికి తండ్రి అని అన్నాడు వర్డ్స్క్ వర్త్. పుట్టుకతోనే పిల్లల విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. పిల్లల్ని బాగుచేయాలంటే వాళ్ళను సంతోషపెట్టడమే ఉత్తమ పద్ధతి. పిల్లలు పెరిగి పెద్దవారై మనల్ని కించపరచినా వారిని మనలో భాగంగానే చూస్తాం. ఉదయం రోజును ప్రతిబింబించినట్టు బాల్యం మనిషిని ప్రతిబింబిస్తుంది. అన్నింటినీ ఆమోదించే వయసు బాల్యం అంటాడు, ప్రముఖ కవి ముల్క్ రాజ్ ఆనంద్. మనకు విశ్వంలోని వింతల మాదిరి పిల్లల కన్నులో ఏడు వింతలు కాదు ఏడు లక్షల వింతలున్నాయన్న అద్భుతభావనని చక్కగా వెలిబుచ్చాడు, వాల్ట్ స్ట్రెయిటిఫ్ అన్న కవి. దేవ్వుడికి మనిషిమీద ఇంకా ఆశ పోలేదనే సందేశంతో ప్రతి పిల్లవాడూ ఈ భూమ్మీదకొస్తాడు, అంటాడు ఠాగూర్. మనం తరచు గమనిస్తూంటాము, పెద్దవాళ్ళ మాటలతో పిల్లలూ, వయసు మీదపడుతున్నా పిన్నచేష్టల్లా కనిపించే వౄద్ధచేతలు. అందుకే, పిల్లలు పెరిగి పెద్దవారై మనల్ని కించపరచినా వారిని మనలో భాగంగానే చూస్తాం. పిల్లలే రేపటి ఆశలు; వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించు; వాళ్ళకన్నా గొప్పవాడినని అనుకోకు; నిజానికి నువ్వు కావుకూడా అని అంటాడు రాబర్ట్ హెన్రీ. అందుకే, కరుణామయుడు క్రీస్తు, తన సందేశంలో, "నేను చిన్నపిల్లాడిగా వున్నప్పుడు చిన్నపిల్లాడిలానే ఆలోచించాను; చిన్నపిల్లాడిలానే అర్ధం చేసుకున్నాను; చిన్నపిల్లాడిలానే ప్రవర్తించాను; పెద్దయ్యాక చిన్న తరహా పనులు మానేశాను. ఈ భావనాపరంపరను అందరూ అర్ధంచేసుకుని, ముఖ్యంగా తల్లిదండ్రులు, ప్రవర్తిస్తే, పిల్లలకు, పెద్దలకు మధ్య అవగాహనారాహిత్యధోరణి, అయోమయదుస్థితి, వార్ధక్య ఛాందసప్రవౄత్తి, పుట్టినప్పటి బుద్ధి పుడకలతోనే కాని పోదు అన్న ప్రవర్తన, తరం మారుతున్నా మనమే గత్యంతరం అన్న భావన మాసిపోనంతకాలం పెద్దరికాలు యిలా చెలామణీ అవుతునేవుంటాయి. చిచ్చరపిడుగుల్లాంటి పిల్లలు చేయలేని పనులు లేనేలేవు. వారు పెద్దవాళ్ళమాట విననన్నా ఈ వౄద్ధతరం చేసేదె ఏమీలేదు. చరమదశలో మరింత ఆవేదనలు, ఆందోళనలు కూడపెట్టుకుని, అంతంతమాత్రంగా వున్న ఆరోగ్యాన్ని మరింత తగ్గించుకోవడమే కాదు. పెద్దతనానికి ఒక ప్రవేశపరీక్ష పెట్టి అర్హతను నిర్ణయించాలి. ఆ సమయం రాకమానదు. అందుకే బాల్యం, వయ్యనానికుండే లక్ష్యాలే మానవజాతి లక్ష్యాలు అన్నాడు ఓ కవి. బాల్యం అన్న సామ్రాజ్యంలో మరణాలు వుండవు అంటాడు లాంగ్ ఫెలో. తెల్లకాగితం లాంటి పిల్లల మనసుని అర్ధం చేసుకోవాలి. అల్లరి, కోతిచేష్టలు చేసినా పిల్లలు, మనిషి కోతిలోంచి పుట్టిన సంగతి ప్రతి చేష్టలో ప్రత్యక్షం చేస్తారు మన పిల్లలు. పిల్లలు తమకి అన్నం పెట్టేవారికన్న మిఠాయి కొనిపెట్టి తమతో ఆడుకునేవారిమీద యెక్కువ ప్రేమ చూపుతారని, బిడ్డలశిక్షణ అని అనూహ్యమైన కరదీపికను రచించిన చలం తన మ్యూజింగ్స్ లో అంటాడు. పిల్లలకు నా, నీ సొమ్మని భేదాలుండవు, అంతా తమ స్వంతంగా వాడుకుంటారు. అందుకే, పిల్లలు ఎవరింటికెళ్ళినా, వాళ్ళకు నచ్చినవి ఏమైనా కనిపిస్తే, అమాంతం వాటిని స్వంతం చేసేసుకుంటారు. పిల్లలు ఒక్కోసారి ప్రదర్శించే ఉద్రేకాలు కూడ వారి జీవితం బాగుపడుతుందే కాని నిరర్ధకం కావు. పిల్లలలో కొంతమంది భిన్నులు కూడా వుంటారు. పిల్లలంత మోసగాండ్రు పెద్దవారు కారు సుమా అని అంటారు, సాక్షి రచయిత పానుగంటి వారు. తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళయినా, వాళ్ళకెటువంటి సదుద్దేశాలున్నా కొన్నికొన్ని విషయాల్లో పిల్లల జీవితం గురించి వాళ్ళ నిర్ణయాలు చెయ్యలేరు అని కూడా కొడవటిగంటి వారు అన్నారు. పిల్లలను భరించలేకపోతున్నామనే తల్లిదండ్రులు అసంఖ్యాకం. పుట్టేంతవరకూ ఆరాటం. పుట్టాకా మొదటి దశలో పరిష్వంగసుఖసారం. కాస్త తెలివి, చురుకుతనం వస్తే, అల్లరి పిడుగుని భరించలేనితనం. అదే పిల్లలు అతిగా ప్రవర్తిస్తే, తప్పుదారులు పట్టితే, పెద్దయ్యాక తల్లిదండ్రులమాటని ఖాతరు చేయనంతగా ప్రవర్తిస్తే, ఆవేదన, తిరిగి ఆరాటం. కనుక, ఆరాటం నుంచి ఆరాటం వరకు తల్లిదండ్రుల పాత్ర అని చెప్పాలి. ఓషధులే తండ్రులుగా, రసవిషాలు తల్లులుగా, తయారవుతున్నారు శిశువులు అంటాడు బైరాగి. అవస్థాబాల్యం ఎదగడానికెందుకురా తొందర, ఎదర వయసంతా చిందర వందర అన్నాడో చిత్రకవి. బాల్యం నుంచే అవస్థలు, భరించలేని చదువులు, పుస్తకాల బరువులు, యింట్లో తల్లిదండ్రుల దరువులు, వెరసి ప్రేమాభిమానకరువులు. బ్రతకలేని, పూట గడవని కుటుంబాల్లో, పిల్లలే పనులకు వలసలు. సంపాదన మాట ఎలా వున్నా, పసితనంలోనే పనులభారం అమానుషం. ఎన్ని బాలకార్మికచట్టాలు వచ్చినా కంటితుడుపే. చట్టాలు కట్టలు కట్టలే తప్ప, పిల్లలకు పనికిమాలిన శాసనాలు. పిల్లల మనసులను భావాలాను రెచ్చగొట్టే విధానాలు యింతలు, మరింతలు అయితే, బాలలు హత్యలు చేయక మానతారా, జైళ్ళకు వెళ్ళి గడుపుతూ చదవక మానతారా. బాల్య వివాహాల నుంచి బయటపడినా, అవస్థాబాల్యం నుంచి బయటకు రాలేని దుస్థితి, అయోమయం లో కూరుకుపోయాము. ఆధునికత, నవీనభావుకత, మన నడకను, నడతను వక్రీకరించబడుతూ, నాణ్యత, నీతి పర్వాలకు భరతవాక్యాలను పలికిస్తున్నాయి. ప్రస్తుతకాలం, కేవలం పది వసంతాలకే బాల్యం పూర్తవుతోంది. ప్రాచీనకాలం, పుర్ణాయువు ద్విశతవసంతాలుగా చెలామణి అయినప్పుడు, బాల్యం మూడు పదులప్రాయం వరకూ గుర్తింపబడేది. నేటి బాల్యం బాల్యంగా ఎప్పుడూ రాణించడంలేదు. బాల్యావస్థని గ్రహించి అనుభూతి చెందేలోపున, దురవస్థగా మారి దుస్థితిపాలవుతోంది. కన్నలకు కష్టాలకడలి రివ్వురివ్వున వస్తోంది. బాలారిష్టాలకు బాలలే గురవుతున్నారు అప్రమేయంగా. నవమాసాల అంతర్జీవనం మాతౄగర్భంలో ఒజ్జగిలి గడిపి, పున్నామ నరక విముక్తికోసం పోరాటమే కనిపిస్తోంది. అయినా, తల్లి గర్భంలో అసౌకర్యంతో ఒదిగున్నా, నునువెచ్చని రక్తస్పర్శ నవలోకంలోకి నరింపచేస్తోంది, ప్రేమాభిమానబంధమై కలకాలం నిలుస్తోంది. ఆ బంధమే మాతౄ, పితౄ దేవోభవ రూపాన జననీజనకులకు గురుభారయోగమౌతోంది. ఓం నమశ్శివాయ అంటూ విద్యాభ్యాసం ప్రారంభించిన వెంటనే విద్యార్జన యజ్ణంలో సమిధలై విన్నూత్న ఘర్షణలకు లోనై, నిరాశానిస్పౄహలతో నిర్జీవులవుతున్నారు, మన శిశువులు, బాలమహేశ్వరులు, కుర్రలు, సుందరీబాలలు, రమణీమణులు, బాలగణపతులు, మన కుమారస్వాములు. నమ్మక వాస్తవాలమధ్య నలిగిపోతున్న మన శిశూదయావస్థలు. జన్మనిచ్చినంతమాత్రాన వారిని శాశించి, హింసించే అధికారం, హక్కులు లేనేలేవు, రావు, రాకూడదు. పిల్లలను నిత్య నరకప్రాయం చేయకండి. వారి మానాన వారిని వదలాడి, మెదలండి. వారి ఆశల అభిరుచుల చాయలనే కదలాడి కేవలం ఆర్ధికసాయం చేసే సువిధలవ్వండి. కడు హార్దికంగా మెలగవలసిన తల్లిదండ్రులైన వ్యక్తులని మరువకండి. పాపం, భూమిమీద పడినంతనే అఖండభారాలు, వెంట వెంటనే వీడిని పెద్దను చేసే రెండవప్రసవాలు. లేదా బారెడు ఎడాలు. చిన్నవాడినే పెద్దవాడిని చేసే హోదాలు, లేదా పంచవర్షప్రణాలికలు. చంటాడికి తోడులేని కడువంటరితనాలు. బాలజీవితాలకు మరింత జీవన్ టోను నివ్వండి. పెద్దరికపు గద్దెలెక్కి, అర్ధంలేని ఆజ్ణలనివ్వకండి. వారి మానాన వారిని వదలక అవమానాలపాలు కాకండి. తల్లిదండ్రులారా, గురువులారా, యిరుగుపొరుగు పెద్దలారా, అవసానదశలో అపహాస్యాన్ని ఆహ్వానించకండి. ఆబాల గోపాలాన్ని ఆనందడోలికల్లో ముంచండి. సుఖానుభూతుల్లో తిరిగి తిరిగి తేలియాడెంచండి. ఆనందోబ్రహ్మ అన్న సూత్రంతో బాలచిదానందమూర్తులను భావిభారతపౌరులని మరువక, భాగ్యవంతుల్ని, ప్రేమాభిమానభరితసుసంపన్నులని కావించండి. శతమానం భవతి అని మనసా వాచా కర్మణా ఆశీర్వచనాక్షతల్ని వారి శిశుశిరస్సులపై పేర్చండి. భావితరపు ప్రతినిధులని, భావిభారతీయతకు కర్త, కర్మ, క్రియ, నేటి శిశువులు, బాలలు అని మరవకండి. నిత్యం ఈ భావనే సదా స్మరించంది. సుఖపడండి. మీ పిల్లల్ని సుఖపెట్టండి. సత్యం, శివం, సుందరం అన్న తత్వాన్ని ఆచరించండి. బాలలకు ప్రత్యేకంగా వేదోపనిషత్తులను సౄష్టించండి. బాలరామాయణాలు, బాలభారతాల్ని నిజంగా రచించండి. బాలప్రబంధ రత్నావళి కి పుటల్ని పేర్చండి. ఆ దిశలో దశలో తరలండి, తరలిరండి, దండిగా, దండిగా. నాణ్యమైన నాలుగు సూత్రాలు ప్రముఖ శిక్షకులు, వ్యక్తిత్వ వికాస నిష్ణాతులు, బి.వి.పట్టాభిరాం గారు పిల్లల అభివౄద్ధికి, వికాసానికి, నాలుగే నాలుగు సూత్రాలను వివరించారు. 1, అంతరంగంలోని స్వఛ్ఛమైన కోరికను గ్రహించి నిర్ణయం చేసుకోవాలి. 2. ఆ కోరికను తీర్చుకునే ప్రయత్నంలో అంకితభావాన్ని ప్రదర్శించాలి. 3. పిల్లలకున్న చిన్నదైనా, చింతలులేని జీవనంలో క్రమశిక్షని - ముఖ్యంగా వ్యక్తిగతపరంగా, పాటించాలి. 4. సంకల్పం, దీక్ష వహించి వారి ఆశయాన్ని, ఆకాంక్షని సాధించాలి. బాల్యంలోనే, ఎదురైన అవకాశాలపై మురిసిపోయి అన్నీ తెలుసునన్న ధోరణిలోకి పోరాదు. ఏమీ తెలియదే అని గ్రహించి, అన్ని విషయాలు, క్రమక్రమంగా, తెలుసుకొని బాలప్రజ్ణానిగా మారేందుకు మీశైలిలో కౄషి చేయాలి. బాలసాహిత్యం లో మచ్చుతునకలు మన సాహితీపరంపరలో బాలలకు కూడ గణనీయమైన సారస్వతాన్ని ప్రసాదించారు మన సాహితీమూర్తులు. ఆ సాహితీమాధుర్యాన్ని - మహాకవి శ్రీశ్రీ, తన రచన 'శైశవగీతీలో 'ఐదారాడులా పసిపాపలను వర్ణించాడు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్ధాలు, ఏవీ ఎరుగని పూవుల్లారా, ఐదారేడుల పాపల్లారా. మెరుపు మెరిస్తే వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే, 'అవి మాకే' అని ఆనందించే కూనల్లారా. పిల్లలకే అల్లరి తెలుసు, పిల్లలదే మల్లెల మనసు, అల్లరి మల్లెలు కొల్లగ జల్లీ ఎల్లరినీ రంజించుట తెలుసు. (అజ్ణాత శైశవం - ఒక బాల సాహితీవేత్త). బాల ప్రపంచం - పాల ప్రపంచం, పాలవలె తెల్లనిది, పాలవలె తియ్యనిది, పాలవలె చిక్కనిది. (ఏడిద కామేశ్వరరావు). తెలుగు దేశపు తెలుగు పిల్లలు, తెలుగు వెలుగులండీ, తెలుగు బాలురు తెలుగు బాలికలు, తెలుగు సొమ్ములండీ. (రేడెయో అన్నయ్య - న్యాయపతి రాఘవరావు) బాల సాహిత్యంలో తొలి వెలుగులుగా - ఉగ్గుపాటలు, జోలపాటలు, లాలిపాటలు, పండుగ పాటలు, ఆటల పాటలు, ఎగతాళి పాటలు, పిల్లల రచనలు, బాలల కావ్యాలు, గేయాలు, కధలు, నవలలు, నాటికలు, నాటకాలు ఎన్నో అవతరించాయి. సాహిత్యంతో పాటు, సంగీతం, సంస్కౄతి వెలుగులోకి వచ్చాయి. బాలల దినోత్సవం నాడు పెద్దలకు సలహా నీకు క్షణం తీరిక చిక్కితే, నీ బిడ్డ కేదైనా బోధించు. నీ చేతిలో ఒక్క కాసుంటే అది నీ బిడ్డకై వెచ్చించు. నేటి బాలలే రేపటి పౌరులు. అంతేకాదు, ఫలించిన స్వప్నాలకు ఆకౄతులు, కలకలలాడే పిల్లలు. ఈ బిడ్డలకు వున్న బుద్ధే పెద్దలకు వుంటే ఈ యుద్ధాలు, ఈ కల్లోలాలూ లేని ... అంటూ ఒక పిల్లల బహుమతి ప్రదాన కార్యక్రమంలో, మహనీయుడు, పిలలలో పిల్లవాడు, నిన్నటిదాకా గౌరవంగా, గర్వంగా రాష్ట్రపతి పదవిని - నభూతో న భవిష్యతి - అని, డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్ గారి తర్వాత, అత్యంత ప్రతిభావంతంగా, ప్రేరణాత్మకంగా, నిర్వహించిన వ్యక్తి - డా. అబ్దుల్ కలాం మాటలను గుర్తు చేసుకోవాలసిన శుభతరుణం ఈ రోజు కాక వేరే ఏముంటుంది? కల్లకపటం, అసూయ, ద్వేషం, రెండర్ధాల మాటలూ ఇవేవి తెలియని దేవుని ప్రతిరూపాలు బాలలు. అందుకే, 'పెద్దలు దేవుని వెదుక్కొంటూ గుడికి వెళితే ఆయన బయట పిల్లలతో ఆడుకుంటూ వుంటారూ అంటూ గుడిలోని ప్రభువును నడివీధిలోకి తెచ్చి పిల్లలతో బిళ్ళంగోడో, దాగుడుమూత దండాకోరో ఆడించారు - గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్. బాల్యం ఓ మరపురాని మధురానుభూతి. బాల్యం ఓ అందమైన కల. బాల్యం ఓ వరం. ఈ దశలో 'మనం మన బిడ్డలకు ఇవ్వగలిగినవి రెండేరెండు బహుమతులు. ఒకటి వేళ్ళు, రెండు రెక్కలు. (కార్టర్ రూట్స్). ఈ లోకాన్ని చూసి, అర్ధమయ్యీ, అర్ధం కాక తనతో దోబూచులాడే ఈ మహాఛ్ఛాయల్లోని ఇంద్రజాలానికి అధ్బుతపడి, దాన్నంతా తనలోకి తీసుకోవాలని చూసే పసిబిడ్డ ఆతౄతని ఏ కవి జీవించగలడు? (చలం). విషాదం ఏమిటంటే, మనిషి పెరుగుతూ వుంటే తన బాల్యాన్ని చేజారిపోకుండా పొదివి పట్టుకోలేకపోతున్నాడు. (పాబ్లో పికాసో). పైవి నిగ్గు తేలిన నగ్న సత్యాలు. భారత తొలి ప్రధాని నెహ్రూజీ జయంతి సందర్భంగాను, ఆయన జన్మదినోత్సవాల మధ్య జరిగే బాలలదినోత్సవాల సందర్భంగా, భారతీయ బాలపౌరులను చాచాజీలాంటి మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుముందుకు దూసుకుపోవాలనీ, రివ్వురివ్వున రెపరెపలాడుతూ, ఎగిరిపోతూండాలనీ, ఆశీస్సులనీ, అభినందనలనీ తెలుగు రథం తెలియపరుస్తూ ... విష్వ బాలల విద్వత్తుకు మోకరిల్లుతూ - షలవు. కొంపెల్ల శర్మ - తెలుగురథం

Tuesday, July 28, 2015

హితోపదేశం - ప్రస్తావిక

ప్రాచీన భారతీయ సంస్కృత సాహిత్యంలో అనర్ఘమైనది - హితోపదేశం. దానిలోని ముఖ్య నీతి సారాన్ని, నిత్య కాలానికి ఉపయోగ దర్శిని అన్నా భావంతో - తెలుగురధం సవినయంగా సమర్పిస్తోంది.


సిద్ధి: సాధ్యే సతా మస్తు ప్రసాదాత్తస్య ధూర్జటే:,

జహ్నవే ఫేనలేఖేవ యన్మూర్ధ్ని శశిన: కళా:


గంగానది నురుగురేఖయా అనునట్లు ఎవని శిరస్సున చంద్రకళ కలదో అట్టి ఈశ్వరుని అనుగ్రహం వలన సత్పురుషులకు సాధింపవలచిన పనులు సిద్దించుగాక!


శ్రుతో హితోపదేశోయం పాటవం సంస్క్రుతోక్తిషు

వాచాం సర్వస్త్ర వై చిత్ర్యం నీతివిద్యాం దదాది .


హితోపదేసమును వినినచో సంస్కృత భాషయందు నేర్పును,sarvavishayamulamulandunu

Monday, June 15, 2015

శ్రీ శ్రీ - అభ్యుదయ కవన యుగకర్త

శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983) - 2 జనవరి జయంతి
శ్రీశ్రీ జీవనప్రస్థానం ... యిదిగో ... యిలా ...
అది 1910 వ సంవత్సరం. ఈ ఏట మువ్వింతలు జరిగాయట. ఒకటి తోకచుక్క పొడవడం; రెండు గురజాడ అప్పారావు గారు ముత్యాలసరాలు రచనచేయడం; యిక మూడవది మహాకవి శ్రీశ్రీగా ముందు ప్రపంచానికి సుపరిచితులైన శ్రీరంగం శ్రీనివాసరావుగారు జన్మించడం. శ్రమైక జీవన సౌందర్యానికి, సమానమైనది లేనేలేదోయ్ అన్న ప్రజాకవి, విప్లవకవి, మహాకవి, మహాప్రస్థానం నుంచి మరోప్రస్థానం వరకు తనదైన శైలిలో ప్రపంచంలో మరోప్రపంచాన్ని సౄష్టించిన, ఈయన జీవనప్రస్థానం యిలా సాగిపోయింది.
1910 జనవరి 2 న విశాఖపట్టణంలో శ్రీ వెంకట రమణయ్య, శ్రీమతి అప్పన్నకొండ లకు జన్మించిన శ్రీశ్రీ, పుట్టిన ఏడాదికే తల్లిని పోగొట్టుకున్నాడు. ఎవియన్ కాలేజీలో లెక్కలమాష్టారుగా తండ్రి పనిచేయడం, అక్కడే శ్రీశ్రీ చదువుకున్నాడు. 1925లో చదువుతోబాటు వెంకటరమణమ్మతో వివాహం, యింటర్మీడియట్ చదువు 1928 లోను, 1928లో మద్రాసు కాలేజీలో, బి.ఎ. జంతుశాస్త్రం లో చేరినా, 63 రోజుల టైఫాయిడ్ జ్వరం వలన, 1931 లోనే పూర్తిచేయడం జరిగింది. చదువుకున్న కాలేజీలోనే డిమాన్సేట్రర్ గా పనిచేస్తూ కప్పలమాస్టారు గా పేరు తెచ్చుకున్నారు. 1938లో మద్రాసులోని ఆంధ్రప్రభలో ఉపసంపాదకునిగాను, 1942లో డిల్లీ ఆకాశవాణిలోనూ, 1943లో లక్నోలో మిలటరీలో లేబరేటర్ అసిస్టెంట్ గానూ ఉద్యోగపర్వాన్ని నిర్వహించారు. 1945లో తండ్రి మరణం జరగ్గా, 1946లో నిజాం నవాబుగారి రిఫార్మ్ సెక్రటేరియట్ లోను, 1946-49లో ఆనందవాణిలో ఉద్యోగాన్ని కొనసాగించారు. 1947లో మద్రాసులో రాయపేటలో మకాం వున్న శ్రీశ్రీకి గుర్రపుపందాల సరదా జోరుగా వుండేది. 1949లో చుట్తాలమ్మాయిని 'లెనినా అన్న పేరుపెట్టుకుని అభిమానపుత్రికగా పెంచుకోవడం జరిగింది. 1950లో నళినికుమార్ తో స్నేహం, 1954లో హెల్సెంకీలో జరిగిన ప్రపంచశాంతి మహాసభకు ప్రతినిధిగాను, రష్యా, పారిస్, లండన్ పర్యటన చేశాడు. 1856లో ఉపద్రష్ట సరోజినితో వివాహం అవగా, కూతురు (1959), కొడుకు (1962) గలగడం, 1967లో రెండవసారి రష్యా ప్రయాణం, 1970లో విశాఖపట్టణంలో షష్టిపూర్తి ఉత్సవాలు జరిగాయి. ఈ దశలో శ్రీశ్రీ చలంగారిని కలుసుకోవడం ప్రముఖ ఘట్టంగా భావించారు. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా శ్రీశ్రీని అరెష్ట్ చేసి, విడుదల చేయడం జరిగింది. 1976లో చైనాయాత్ర జరిపారు. 1979లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డుని, పదివేల నగదు బహుమతిని పొందడం జరగ్గా, 1980లో కాకినాడలో స్పతి పూర్తిసభ నిర్వహించారు. ఈ సమయాన్నే, పురిపండావరితో లండన్ ప్రయాణం జరిగింది. 1981లో శ్రీమతితో అమెరికా ప్రయాణం చేశారు. 1982లో అభిమానుల ఆర్ధికసహాయంతో కోర్టుకేసుని పోరాడారు. సుదీర్ఘ సాహితీజీవనం, నిజజీవనం జరుపుకున్న శ్రీశ్రీ 1983 జూన్ 15 న ఈ భౌతికజగత్తుని వదలి మరోప్రపంచంలోకి వెళ్ళిపోయారు.
శ్రీశ్రీ సాహితీపర్వం ... యుగంగా మారిన వైనం
మానవజాతిని ఉద్ధరించడానికి కొత్తమతాన్ని కనిపెట్టిన ప్రవక్త. ప్రపంచపు సరిహద్దుల్ని వూగించాలని ప్రయత్నించిన అతని హౄదయోద్రేకాన్ని వర్ణించడం అసాధ్యమైన పని. నెత్తురూ, కన్నీళ్ళు కలిపి కొత్త మందును తయారుచేశాడు. హౄదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్నివ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చడం అతనెకే చేతనవును. పద్యాలు చదువుతూంటే, యివి మాటలుకావు, అక్షరాలు కావు - ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు - అతని హౄదయంలోంచి మన హౄదయంలోకి నేరుగా పంపిన ఉత్సాహాలు, నెత్తులుకాలవ అనిపిస్తుంది. ఏ లోకంలో అన్యాయాలు, అధికారాలు, ఏడుపులు, క్షామాలు, యాచకాలు, క్షుద్రకవిత్వాలు, శిక్షణలు, అవినీతిపర్వాల్లాంటివి స్వప్నలోకంలో వీక్షణం చేస్తూనేవున్నాడు. దేవుడు, అధికారాలు, పాతర్లు, సౌఖ్యాలు, నీతులు, స్వర్గం, మర్యాదలు, మూటకట్టుకుని కులికే ఎంతోమందికి అర్ధంకాని బాధ, మరణం, దరిద్రం, అవిశ్వాసం, అశాంతి, యివన్నీ అర్ధంకాక గట్టిగా సౄష్టినే ప్రశ్నించిన యువకుల లక్ష కంఠాల్ని ఏకం చేసి పలికిన ప్రజాపక్షపాతి. ఈ మాటలు, వర్ణనలు, ఈ వ్యాసరచయితవి అనుకునే ప్రమాదం వుంది. ఆ యిబ్బందేమీలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం కు యోగ్యతాపత్రంను అందించిన చలం శ్రీశ్రీ గురించి, ఆయన కవిత్వం గురించి అనుభవించి పలవరించిన అచంచలభావాలు. బాధతో అన్నా బోధవాచకాలు - తెలుగువాడి జాతీయధనం ఓర్వలేనితనం; అసలు సిసలైన తెలుగు వాడికి పొరిగింటి పుల్లకూరే నచ్చుతుంది అన్న నిర్మొహమాటం పడని నిజవాది.
శ్రీశ్రీ రచనాపరంపర
మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంతో మహాయోగం పొందినా, అంతకు ముందుగా ప్రభవ, వారం వారం, సంపంగితోట అన్న రచనలు వ్రాశాడు. ఆయన కలం ఆగని వాడితనంతో, వేడితనంతో, అమ్మ, మీమీ, మరోప్రపంచం, త్రీచీర్స్ ఫర్ మేన్, చరమరాత్రి, మానవుడిపాట్లు, సౌదామిని, గురజాడ, మూడు ఏభైలు, మహాప్రస్థానం తర్వాత అంతటి పేరును తెచ్చిన ఖడ్గసౄష్టి, వ్యూస్ అండ్ రివ్యూస్, అయిదు సంపుటాల శ్రీశ్రీసాహిత్యం, మిన్నేలని, రెక్క విప్పిన రెవల్యూషన్, వ్యాసక్రీడలు, మరోమూడు ఏభైలు, చినయానం, మహాప్రస్థానం తర్వాత మరోమలుపుని తెచ్చిన మరోప్రస్థానం, పాడవోయి భారతీయుడా (శ్రీశ్రీ చిత్రగీతాలు), న్యూ ఫ్రంటీర్స్, అనంతం, ప్ర-జ, రచనలను అందించిన అమరకవి. అనంతం (ఆత్మకధ), ప్ర-జ రచనలను ఆయన మరణం తర్వాత ప్రచురించడం జరిగింది. శ్రీశ్రీ నిజంగానే భారతీయసాహితీకారుల్లో అగ్రగణ్యుడు. అందుకనే, భారతీయ సాహితీనిర్మాతలు అన్న శీర్షికన శ్రీశ్రీ వ్యక్తిత్వంపై సుదీర్ఘవ్యాసాన్ని ప్రముఖ సాహితీవేత్త బూదరాజు రాధకౄష్ణ, కేంద్రసాహిత్య అకాడమీ వారు ఈ రచనకు 2006 లోనే మూడవ ముద్రణనిచ్చారు.
శ్రీశ్రీ గురించి కధనకుతూహలం
శ్రీవాణి తో నూతన వరవడితో ప్రారంభించిన తెలుగు సాహిత్యం శ్రీశ్రీవాణితో మరోమలుపు తిరిగి అక్కడ ఒక యుగంపాటు నిలిచిపోయింది. అదే శ్రీశ్రీ యుగం. అంతకుముందు, విశ్వనాధ సత్యనారాయణ గారు నిర్మాణం చేసుకున్న పధంలో ఒక యుగం నిలచిపోయింది. శ్రీశ్రీ, విశ్వనాధలు జంటకవులు కాకపోయినా, యిద్దరూ చెరొక యుగానికి ప్రాతినిధ్యం వహించడం తెలుగు సాహితీవాణికే గర్వకారణమయినది.
శ్రీశ్రీని నూత్న కవితా భగీరధుడుగా డా. దివాకర్ల వెంకటావధానిగారు కితాబునిచ్చారు. సాహితీమార్క్స్ గా రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు సెలవిచ్చారు. మానవత్వంలోప్రవహించే నది అని డా.నాయని కౄష్ణకుమారి అని అన్నారు. ఆరని విప్లవ జ్Yఓతి, పధ నిర్దేశకుడు, శ్రీశ్రీది మనిషితనం అని, ఆధునిక సాహితీ చరిత్రకు 'గురుజాడలుగా, గురజాడ-చలం-శ్రీశ్రీ ని వర్ణించడం, కవి-మనిషి-వ్యక్తిగా శ్రీశ్రీకి త్రివేణీసంగమసత్కారాలతో వేనోళ్ళ కొనియాడారు. ఒకప్పుడు సాహిత్యం భోగవస్తువు; ఈ నాడది ఉపయోగ వస్తువు కావాలి అని తన నినాదాన్ని ప్రకటించాడు శ్రీశ్రీ. ప్రజలభాషల్ సన్నగా సంగీతం సాహిత్యంలో వినిపించిన కాలాన్ని తానే స్వయంగా నిర్మించుకున్నాడు శ్రీశ్రీ. సాహిత్య జగత్తులో మనిషి మేల్కొన్న తరుణమది. నేను సైతం ప్రపంచాగ్నికి, విశ్వసౄష్టికి, భవనఘోషకు ... అంటూ సొంతగొంతుకతో జయభేరి మ్రోగించిన మొదటిగేయాన్ని విరచించిన విద్వాంసుడు. శ్రీశ్రీ కవితా జీవితం ఒక మహాస్రవంతి; మహాకవిని చేసింది. అభ్యుదాయాంధ్ర కవిత్వయుగకర్త శ్రీశ్రీ, ప్రజాకవి, సమాజ చైతన్యాన్ని మేల్కొల్పి, దానిలోని వేడిరక్తాన్ని ఉడికించి,కవితను ప్రజావాణిగా పలికించి, ప్రపంచ పీడితజన బాధామయగీతాన్ని హృద్గీతగా పొంగించి, జీవితానికీ, సాహిత్యానికీ మంగళ సంవిధానాన్ని సాధించి,పండిత పామరజనరంజకమైన కవితాస్రవంతిని తెలుగునాట క్రొత్తతియందనాలతోపారించి, అభ్యుదయపధాన్ని చూపించిన శ్రీశ్రీ ఆధునికాంధ్ర సాహిత్య రధసారధి. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారన్నట్లు, తిక్కన్న, వేమన్న, గురుజాడలు శ్రీశ్రీలో కొత్తరూపం తాల్చారు. తెలుగువారికి - తెలుగువాణికి ఒక అంతర్జాతీయకవిని సమర్పించారు. అందుకే, నిజంగా నేను, ప్రజల కవిన్నేను, ఎంచేతంటేను, వాళ్ళను చదివేను, చదివించే రాసేను అని తానే చెప్పాడు. ప్రజలను చదివినవాడూ, చదివింది వ్రాసినవాడూ ప్రజాకవి, దానికి మారుపేరు శ్రీశ్రీ అనికూడ అచార్యులు వివరించారు. నా రచనలలో లోకం ప్రతిఫలించి, నా తపస్సు ఫలించి, నా గీతం గుండెలలో మూర్ణిల్లగ, నా జాతి జనులు పాడుకొనే మంత్రంగా మ్రోగించాలి అని తన ప్రణాళికను సుస్పష్టంగా విశదపరచారు. వ్యదారజీవిత యదార్ధదౄశ్యం పునాదిగా ఇక జనించబోయే భావివేదముల జీవనాదముల జగత్తుకంతా చవులిస్తానోయ్ అని ప్రతిజ్ణ చేసిన శ్రీశ్రీ తనవాదాన్ని వేదంగా పేర్కొన్నాడు. విప్లవ కవిత పాడేడప్పుడు కూడ, నా వినుతించే, నా విరుతించే, నా వినిపించే నవీనగీతికి, భావం, భాగ్యం, ప్రాణం,ప్రణవం అని, చివరకు మిగిలేది సర్వనాద మూలబిందువైన ౠతం, అదే ప్రణవం అని ప్రవచనం చెప్పాడు. శ్రీశ్రీ ని సారాంశంగా ఒకే ఒక వాక్యం చెప్పాలంటే, ఆలోచన నా ఉనికికి సూచన అనే చెప్పాలి. ఆలోచన ఉన్నస్థితిలో అసంతౄప్తిని కలిగించి, ప్రశ్నించడం నేర్పుతుంది. ప్రశ్నించడం అన్వేషణకు కారణమౌతుంది. అభ్యుదయానికిప్రేరణ అవుతుంది. ప్రగతికి పునాది అవుతుంది. సరిగ్గా, సమంగా, శ్రీశ్రీ విషయంలే యిదే జరిగింది. శ్రీశ్రీ కి మరణం లేదు. మహాకవి ప్రతినిత్యం మన మనసుల్లో, నిత్యకౄత్యాల్లో, ఆలోచనల్లో, ఎదో రూపాన, మసలుతూనే వుంటాడు. జననమరణాల మధ్య జీవితం ఒక విరామసంకేతం. శ్రీశ్రీ మనకు స్వల్ప విరామం ప్రసాదించాడు. త్వరలో శ్రీశ్రీ మరల అవతారమెత్తుతాడు. లేదా కనీసం మరోశ్రీశ్రీని అవతరింపచేస్తాడు. మరో మహాప్రస్థానాన్ని తప్పక అందిస్తాడు. మనం మాత్రం మరో చలాన్ని సిద్ధం చేసుకోవాలి, యోగ్యతాపత్రం అందించడానికి. యిరువురూ కలసి వస్తారేమో ఎవరికెరుక!?!? నిరీక్షణ కావిద్దాం.
అభ్యుదయ కవితా ప్రయోక్త, సమసమాజ సంస్థాపన ప్రవక్త, మహాప్రస్థానం సౄష్టికర్త, మహాకవి, శ్రీశ్రీ జయంతి సందర్భంగా తెలుగురథం ఘననివాళిని సమర్పించుకుంటూ, శ్రీశ్రీ మహానుభావుకతని పున:స్మరణం చేసుకునే భాగ్యం కలిగినందులకు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Monday, April 13, 2015

భారత రాజ్యాంగ శిల్పి, 'భారతరత్నా సన్మాన గ్రహీత, "డా. భీం రావ్ రాంజీ అంబేద్కర్" జయంతి


(1891 - 1956)













బహుముఖ ప్రజ్ణాశాలి - భీం రావ్ అంబేద్కర్







మహామేధావి, సంఘసంస్కర్త, న్యాయశాస్త్రవేత్త, భారతరాజ్యాంగ శిల్పి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, అని ప్రఖ్యాత వహించిన వ్యక్తి - డా. భీమ్క్ రావ్ రాం జీ అంబేద్కర్ విశ్వవిదితమైన మహామనీషి. సుప్రసిద్ధ రచయిత 'బెవెర్లి నికొలశ్ డా. అంబేద్కర్ ను భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసలను అందజేYఅడం మరువలేని సంఘటన.







అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ!







ఆంధ్రకవితా పితామహుడు 'అల్లసాని పెద్దనా అన్నట్లు, 'అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా అన్న భావనకు సత్యరూపాన్ని కలిగిస్తూ, లోకమాన్య బాలగంగాధర తిలక్, మహర్షి కార్వే వంటి అగ్రనాయకులు జన్మించిన పుణ్యస్థలి, మహారాష్ట్ర లోని 'రత్నగిరీ జిల్లాలో, 'మందన్ గాడ్' పట్టణానికి చేరువైన 'అంబావాడే' గ్రామంలో - రాంజీ సక్ పాల్ - భీమాబాయి పుణ్య దంపతుల్ని పున్నామ నరకం నుంచి రక్షించిన రోజది, 1891 ఏప్రిల్ 14. మెహర్ కులంలో పుట్టిన భీం రావ్ ను తండ్రి చాలా క్రమశిక్షణ తో పెంచగా, బాలభీం రావ్ ప్రతినిత్యం రామాయణం, భారతం, తుకారం, మోరోపంత్ ల భజన గీతాలను గానం చేయడం, కుటుంబం యావత్తు శాకాహారాన్ని సేవించడం, బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకౄషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్.







అవమాన, పరాభవాల్ని తెచ్చిన వర్ణ వ్యవస్థ







అస్పౄశ్యులుగా పరిగణింపబడిన 'మెహర్లా కులంలో జన్మించడం పట్ల, బండివాడు చూపిన ఆగ్రహం, అన్నగారు బండి తోలితే, బండివాడు రాజఠీవితో నడచి రావడం, ఆకలిదప్పులతో అలమటిస్తూ వీధికుళాయి నుంచి మంచినీళ్ళని కూడ తాగనివ్వని అమానుషత్వం, భరించలేని అవమానాలకు గురిచేసింది. అందుకే అంబేద్కర్ కులవ్య్వ్వస్థ పై నిష్చితమైన అభిప్రాయాలని నిర్ధారించుకున్నాడు. కులం పునాదుల మీద దేనినీ - జాతిని గానీ, నీతిని గానీ నిర్మించలేమనీ, అలా నిర్మిస్తే అది పగిలి ముక్కవలడం తప్పదని చెప్పాడు. కులంలోని వ్యక్తి ప్రతిభను కులం గుర్తించకపొవడమే కాక, రాజకీయ దాస్యంతో పోలిస్తే, సాంఘిక దాస్యం హీనమైనదీ, నీచమైనదీ అని నొక్కి వక్కాణించాడు.







బొంబాయి - బరోడా ల మధ్య వాసికెక్కిన వ్యక్తిత్వం







సంస్కౄతాన్ని ఆధ్యయనం చేయాలన్న సంకల్పానికి మాయదారి కులం అడ్డు తగిలింది. అయితే పర్షియన్ భాష చదివాడు. ఎల్ఫిష్టన్ హైస్కూలు లో మెట్రిక్యులేషన్, 16వ ఏటనే వివాహం, బరోడా మహారాజు యిచ్చిన 25 రూ. విద్యార్ధి వేతనం 1912 లో బి.ఏ పరీక్షలో నెగ్గేలా చేసిన పట్టభద్రత్వం బరోడా ఆస్థానంలో ఉద్యోగాన్ని సంపాదించినా, పై చదువులపై పట్టుదల ఉద్యోగాన్ని దూరం చేసింది. చదువు తర్వాత ఖరారుగా దశాబ్దకాలంపాటు ఆస్థానంలో ఉద్యోగం చేయాలన్న నిబంధనతో, 1913 లో రాజప్రోత్సాహంతో కొలంబియా విశ్వవిద్యాలయం లో చేరి, 1915 లో ఎం.ఏ, 1916 లో పి.హెచ్.డి ని సంపాదించాడు. పరిశోధన ఫలితంగా, 'ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రావిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా' అన్న పేరుతో సిద్ధాంత ప్రచురణ చాలా ప్రాచుర్యాన్ని అందించింది. 1917 లో డా. అంబేద్కర్ స్వదేశ ప్రవేశం చేయడమే గాక, 27 ఏళ్ళలో, అస్పౄశ్యుడొకడు అంతగొప్ప పేరు సంపాదించుకోవడం ఆనాటి అగ్రవర్భాలవారికి ఆశ్చ్యర్యానందానుభూతుల్ని కలిగించింది. ఫలితంగా మహారాజావారికి మిలిటరీ కార్యదర్షిగా గుర్తింపు కల్గినా, ఆఫీసులో నౌకర్లు కాగితాలు ఆయన బల్లపై ఎత్తివేసేవారట! కొళాపూర్ మహారాజు సహాయంతో, 'మూక నాయక్' పక్షపత్రికకు సంపాదకత్వం హహించడం.



- బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి, లండన్ నుంచి డి.ఎస్.సి పట్టాలను పొందినా, ఆఫీస్ జవానుల ఆదరాన్ని కూడ పొందలేని దుర్భరస్థితిగతులు.







బాబాసాహెబ్ జీవితంలో 1927 లో జరిగిన ప్రధాన ఘట్టాలు







- మహద్ లో దళిత జాతుల మహాసభ జరగ్గా, మహద్ చెరువులోని నీరు త్రాగుటకు అంతవరకు ప్రవేశం లేని పరిస్థితి నుంచి, అంబేద్కర్ నాయకత్వంలో మహారాష్ట్ర, గుజరాత్ ల నుంచి వచ్చిన వేలాదిమంది చెరువునీరు స్వీకరించడం మహారాష్ట్రలో సంచలనాన్ని కలిగించింది.



- 'బహిష్కౄత భారతీ మరాఠి పక్ష పత్రిక ద్వారా ఆనాడు కులతత్వవాదుల బాధను ప్రకటించాడు.



- చత్రపతి శివాజి త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా అధ్బుతంగా జరగ్గా, అంబేద్కర్ ను సాదరంగా ఆహ్వానించబడడం, ఉత్సవ సంఘాధ్యక్షుడైన పలాయ్తశాస్త్రి తన ప్రసంగం లో, 'పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పౄశ్యతను పాటించడమే' అన్న భావం అందరినీ ఆలోచింపజేసింది.



- 'మనుస్మౄతీ పై తనభావాలను నిష్కర్షగా చెప్పినా, ఆ సంపుటిలో అన్ని భాగాలు నిందనీయాలు కావు అని కూడ చెప్పగలిగిన సుస్ఫష్టభావకుడు అంబేద్కర్.







గాంధీ తో చెప్పిన నిశ్చితాభిప్రాయాలు







1931 లో రెండవ రౌండ్ టేబిల్ సమావేశం సందర్భంగా, అంబేద్కర్ గాంధీని కలుసుకోవడం, జైలులో వున్న గాంధీజీ నిరాహారదీక్ష ప్రారంభించడం, గాంధీజీ తో 'మహాత్ములు వస్తుంటారు, పోతుంటారు, అంటరానివారు మాత్రం అంటరాని వారుగానే వుంటున్నారూ అన్నారు.







'అస్పౄశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కూ







అస్పౄశ్యతా నివారణ కోసం దళిత జాతుల హక్కుల కోసం, 'అస్పౄశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కూ అన్న తిలక్ సంకల్పం మాదిరి నిరంతరం పోరాటం సాగించాడు బాబాసాహెబ్. నిరంతర కౄషి తో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు, ముఖ్యంగా సామాజిక సంస్కరణలకు, ఊపిరిపోసుకుంది.







భారత రాజ్యాంగ శిల్పకారత్వం







భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం, రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగ అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించడం ఆయన శేషజీవితంలో ప్రముఖమైన ఘట్టం. ఈ విషయంపై, ఆనాటి కేంద్రమంత్రి టి.టి.కౄష్ణమాచారి మాట్లాడుతూ, 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన అత్యధిక సభ్యుల్లో అందుబాటులో లేకపోయిన కారణంగా, భారత రాజ్యాంగ రచనా భారమంతా డా. అంబేద్కర్ మోయవలచి వచ్చిందని, రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో ఏలాంటి సందేహం లేదూ అని అమోఘమైన విశ్వాసాన్ని ప్రకటించడం, బాబాసాహెబ్ ప్రతిభాపాటవాల్ని చెప్పకనే చెప్పినాడు.







అన్నీ ప్రత్యేకతలే - అంబేద్కర్ జీవితంలో!







అంబేద్కర్ 56వ ఏటన సారస్వత బ్రాహ్మణ కుటుంబంలోని కుమారి శారదా కబీర్ ను వివాహమాడడం, నాగపూరు లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరిస్తూ, 'బౌద్ధం భారతీయ సంస్కౄతిలో భాగం' అని, ఈ దేశ చరిత్ర సంస్కౄతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. దీనివల్ల, హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు!.







బాబాసాహెబ్ బహురంగ రచనలు







అనేక రచనలను అందించిన అంబేద్కర్ - 'ది ప్రోబ్లెం ఆఫ్ రుపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా', 'ది బుద్ధా అండ్ కార్ల్ మార్క్శ్, 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మా, ప్రముఖ రచనలని చెప్పాలి.







మరువలేని జీవిత మలుపులు







భారతరాజ్యాంగం ఏ మలుపులు తిరిగినా, అది వున్నంతకాలం, బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్మరిస్తూవుండడం వినా వేరే గత్యంతరం లేదు భారతదేశ ప్రజలకు. భారతరాజ్యాంగం లో పొందుపరచబడిన 'భారతీయ షెడ్యూలు కుల జాతుల అభివౄద్ధీఅంశాలపై ప్రత్యేక ప్రేరణ, ప్రోత్సాహం, అంబేద్కర్ దే గణనీయమైంది. 1925 లో బోంబే హైకోర్టు లో న్యాయవాద వౄత్తి, 1926 - 34 మధ్య బోంబే విధాన కౌన్సిల్ కు ప్రకటించబడిన సభ్యత్వం, 1942 - 46 మధ్య వైశ్రాయి నిర్వాహకవర్గ సభ్యుడుగా, 1947 - 51 మధ్య న్యాయశాఖ మంత్రిగా, ప్రముఖ పదవులు. మహోన్నత ఆశయాలని మనసా వాచా కర్మణా ఆచరించిన అంబేద్కర్ ని కొన్ని స్వార్ధపూరిత కూటమితో, కొన్ని రాజకీయపక్షాలు అంబేద్కర్ ఆశయాలకు వక్రభాష్యం చేసి తమ పబ్బాలను గడుపుకోవడం నేటికి జరుగుతున్న దారుణసత్యం. సామాజిక న్యాయం, భారతీయ ప్రజల్లో వర్గీకరింపబడిన వర్ణవ్యవస్థ, ఆయన ఆశయాలకు దర్పణాలుగా ప్రతిబింబించకపోవడం చాలా శోచనీయం, దురదౄష్టకరం అనే చెప్పాలి. అంబేద్కర్ ప్రతిభను, నాలుగు దశాబ్దాలకాలం తర్వాతనే భారతదేశం గుర్తించి, 'భారతరత్నా (1990) సత్కారం అందించడం పట్ల, చివరికైనా న్యాయం జరిగిందనడంలో సందేహం లేదు. 1956 డిసెంబర్ 6 న కన్నుమూశారు.

Tuesday, March 31, 2015

నాడు - ఈనాడు - చరిత్రలో - ఏప్రిల్ l


నాడు - ఈనాడు

చరిత్రలో - ఏప్రిల్ 1:

ఏప్రిల్ 1

మిగిలిన సంవత్సరమంతా మనం ఎలా ప్రవర్తిస్తామో తెలియజేసే రోజు - మార్క్ ట్వైన్

ఏప్రిల్ 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 91వ రోజు (లీపు సంవత్సరము లో 92వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 274 రోజులు మిగిలినవి.

సంఘటనలు

1894: మొదటి భారతీయ బ్యాంక్ 'పంజాబ్ నేషనల్ బ్యాంక్' ప్రారంభం
1914: ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసు లో (చెన్నై). తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ( 9 సెప్టెంబర్ 1908) ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
1935: భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.
1936 : కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒడిషా భారత దేశం లో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది.
1957 - డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్దతిని ప్రవేశ పెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ 1958 న ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్)) లోని ద్రవ్యరాశి (బరువు)ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని , ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.[1]
1960 : TIROS-1 ఉపగ్రహం టెలివిజన్ మొదటి చిత్రాన్ని అంతరాళం నుండి ప్రసారం చేసింది.
1970: బహిరంగంగా ధూమపానం చేయడం అమెరికాలో నిషేధం.
1971 : పులుల సంరక్షన పథకం - కోర్బెట్ట్ నేషనల్ పార్కు నందు పులుల సంరక్షణా పథకాన్ని ప్రారంబించారు.
1976: దూరదర్శన్ ప్రారంభం
2001 : స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెదర్‌లాండ్స్.

జననాలు

1578 : విలియం హార్వే, ఆంగ్ల వైద్యుడు (రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించినవాడు)(d. 1657)
1856 : భారత దేశ ప్రముఖవైద్యుడు అకాసియో గాఅబ్రియెల్ వేగాస్ జననం.(ఈయన బొంబాయి నందు ప్లేగు వ్యాధి వ్యాప్తిని గుర్తించారు).(d. 1933)
1869: ఆదాయపు పన్ను విధానం ప్రవేశం.
1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు డా.హెడ్గెవార్ (డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్)
1911 : భారత అథ్లెట్, ఫాజా సింగ్.
1911 - ఏటుకూరి వెంకట నరసయ్య అధ్యాపకుడు , రచయిత. [మ. 1949]
1911: ఏటుకూరి వెంకట నరసయ్య, క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, మానవతావాదీమ.1949
1933 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు బాపూ నాదకర్ణి జననం.
1936 : తరున్ గొగోయ్, భారత రాజకీయ వేత్త, అసోం ముఖ్యమంత్రి.
1941 : అజిత్ వాడేకర్, భారత క్రికెటర్.
1972: వెంకట్ గోవాడ,రంగస్థలంపై నవ రసాలు కురిపిస్తున్నారు. థియేటర్‌ ఆర్ట్స్‌లో పిజి డిప్లొమో చేశారు.

మరణాలు

1922 : స్విట్జర్లాండ్ కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మానసిక విశ్లేషకుడు హెర్మన్ రోషాక్ మరణం (జ.1884).
1977: ప్రముఖ కవి తల్లావజ్హ్ఝుల శివశంకర శాస్త్రి మరణం
1999: మధురాంతకం రాజారాం, సుమారు 300కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు
2006: ప్రముఖ నాయకుడు గౌతు లచ్చన్న మరణం
2012 : ఎన్.కె.పి.సాల్వే, భారత రాజకీయవేత్త.(b. 1921)

ఇతర విశేషాలు

ఏప్రిల్‌ 1ని ఏప్రిల్ ఫూల్ రోజు అంటుంటారు.

ఇందుకు ఒక వివరణ: పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్‌ లో కూడ సంవత్సరాది మార్చి మధ్యలోనే వచ్చేది. యూరప్‌ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు, వసంత కాలపు ఉత్సవాలు ఓ పది రోజుల పాటు జరిగేవి. ఏప్రిల్‌ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకునేవారు. ఇలా సజావుగా జరిగిపోతూన్న జీవితాలలో ఒక పెనుమార్పు వచ్చి పడింది. అప్పటి ఫ్రాన్సు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక తాఖీదు జారీ చేసేడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టెలివిజన్ లు లేవు. (దండోరా వేయించి ఉంటాడు.) కాని రాజు గారి తాఖీదు అందరికీ అందలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని గభీ మని మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా, దేశపు మూలల్లో ఏప్రిల్‌ 1 న లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకోవటం మానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళికి ఏప్రిల్‌ ఫూల్స్‌ అనేవారు. పాత అలవాట్లు చావవు కదా. అందుకని ఇప్పటికీ కొంటె బహుమానాలు ఇచ్చుకోవటం, ఎగతాళి చేసుకోవటం మిగిలేయి.

పండుగలు మరియు జాతీయ దినాలు

ALL FOOLS DAY - April 1
ACTIVISTS DAY
1-7 PREVENTION OF BLINDNESS WEEK
1936: ఒడిషా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.

(మూల వనరులు : తెలుగు వికీపీడియా & తెలుగురధం సేకరణ)
కొంపెల్ల శర్మ.
 

Monday, March 30, 2015

నాడు - ఈనాడు - మార్చి 31

నాడు - ఈనాడు

మార్చి 31

మార్చి 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 90వ రోజు (లీపు సంవత్సరము లో 91వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 275 రోజులు మిగిలినవి.

వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 31

 సంఘటనలు
  • 1919: 15-9-1915 న ప్రారంభించిన  హైదరాబాదు లో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
  • 1959 : 14 వ దలైలామా,టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.
  • 2011: 31 మార్చి 2011 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 18 మే2012 నాడు చెప్పారు

జననాలు

  • 1865 - ఆనందీబాయి జోషి
  • 1928: కపిలవాయి లింగమూర్తి,పలుగ్రంథాలు, పరిశోధనలు రచించి సాహితీవేత్తగా పేరుపొందాడు [మ.(1928 ]
  • 1933 - నటరాజ రామకృష్ణ, ప్రముఖ నాట్యాచార్యుడు, ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జననం. (మ 7 జూన్ 2011).
  • 1963: ప్రముఖ శాస్త్రవేత్త జాన్ హారిసన్ జననం. సముద్రంలో రేఖాంశాలను కనుగొనడానికి వీలయ్యే 'క్రోనోమీటర్' ను రూపొందించాడు. బ్రిటిష్ బోర్డ్ వారి 'లాంగిట్యూడు' వారి అవార్డ్ ను అందుకున్నాడు.
  • 1987 - కోనేరు హంపి, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.

మరణాలు

  • 1727 : భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ మరణం (జ.1643).
  • 1972 : భారత చలనచిత్ర నటీమణి మీనా కుమారి మరణం  (జననం.1932)
  • 1995 : మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నర్తకి సెలీనా మరణం (జ.1971)
  • 2003: మేకా రంగయ్య అప్పారావు (యం ఆర్ అప్పారావు) మరణం
(మూల వనరులు : తెలుగు వికీపీడియా & తెలుగురధం సేకరణ)

కొంపెల్ల శర్మ