Showing posts with label ప్రాచీన భాష మన తెలుగు భాష. Show all posts
Showing posts with label ప్రాచీన భాష మన తెలుగు భాష. Show all posts

Friday, October 31, 2008

మన తెలుగు భాష - ప్రాచీన భాష

చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు నా ప్రాచీన భాష తెలుగు
ఒక్క సంగీతమేదో పాడునట్లు భాశ్షించునప్పుడు వినిపించు భాష నా తెలుగు.
దేశభాషలందు తెలుగు లెస్స.
తరువోజ - ఛందస్సు తో సుభారంభామైన మన తెలుగు పద్యం, సరిసములు లేని హృద్యం.
మీరు ఎన్ని భాషలయినా నేరవండి. మాతృభాషని మాత్రం మరువకండి.
తెలుగు భాషా తీయదనం, తెలుగు వారి నోటి కండచక్కెర మాట్లల్లో, మాటల మాధుర్యంలో చెరుకు కన్నా తీపిగా కనిపిస్తుంది. పలుకు పలుకూ లొలుకు - అన్నాడో పెద్దాయన.
లిపి గల తెలుగు భాష శబ్ద అర్థ మాధుర్యంతో, స్వఛ్చమైన సుందరమైన ఉఛ్చారణతో తరతరాలుగా బాసిల్లు తుండడానికి కారణం భాషలోని సొంపే, సొగసే! ఏ భాషలోనూ లేని 'పద్యా రచన, 'పఠనా సొగసూ తెలుగులోనే వున్నది. 'ఆ అనే అమృతాక్షరంతో మన భాషలోని అక్షరక్రమం ప్రారంభమవుతుంది. అ, అం, అ: అక్షరాలు కమ్మని ' అమ్మ ' పదానికి సంకేతాలు. ఇంతటి సుసంపన్నమైన భాషను మహర్షులు మనకు కూర్చి ఇచ్చారు. భారత భాషలన్నీ ఈ దేవనాగర లిపి పరిపూర్ణతను కలిగి ఉన్నప్పటికినీ, హ్రస్వ, దీర్ఘ, ఏక ద్విత్వ, త్రిత్వ అక్షరాలు, ' ఆ ' అక్షర కూర్పులోని శబ్ద శుద్ధ సౌందర్యాలు ఇతర భాషల్లో కనబడడంలేదని ఘాల్జ్, బ్రౌన్ లు గ్రహించారు.
కీర్తన, సంకీర్తన, పదం, కృతి, యక్షగానం, కావ్యం, ప్రబంధం, శతకం అనేవెన్నో తెలుగు భాషలో వెన్నెలలు వర్శ్షింప చేసాయి. భారత భాషల్లో తెలుగు భాషకు అత్యంత విలువను కొని తెచ్చాయి.
అమ్మ భాషను ఆదరిద్దాం.
ప్రముఖ కవి మల్లెమాల అన్నట్లు -
వందనము తెలుగు తల్లికి, వందనమొనలేని తెలుగు వైభవమునకున్, వందనము తెలుగు సంస్కృతి, నందల మెక్కించినట్టి అనుఘులకెల్లన్. పైరగాలి తరగలా, పచ్చిపాల నురగలా, మలినమింతలేనిది, మన తెలుగు సంస్కృతి, అదే వరం, నిరంతరం తెలుగు జాతికి, తేట తెలుగు సొబహు మనకు గర్వకారణం, అది, ఏ నాటికైనా వాడిపోని లలిత కళాతోరణం.
తేనియలకే తీపి పెంచే తెలుగులో మాటాడుకోతెలుగు జాతి సమైక్య గీతి పదే పదే నువు పాడుకో.
ఏ ప్రదేశంలోన వున్నా ఏ విదేశంలోన వున్నాజీవనిధిగా నీకు మిగిలిన స్వీయ సంస్కృతి నిలుపుకో.
స్వాభిమానం కేతనంగా సామరస్యం స్యందనంగాతరలిపోతూ నిత్యనవ చైతన్య దీప్తిని పెంచుకో.
అన్న పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సి.నారాయణ రెడ్డి గారి సుమధుర భావాభిరామంతో ముగించడం పరమ ఔచిత్యం.
తెలుగు భాష - ప్రాచీన భాషగా గుర్తింపు లభించిన సందర్భంగా, ప్రతీ తెలుగువాడు, స్వరాష్ట్రాంధ్రులు, రాష్ట్రేతరాంధ్రులు, విదేశాంధ్రులు, మన భాష పట్ల, సంస్కృతి పట్ల, కళలపట్ల, దురభిమానా, నిరభిమానాల్ని ప్రకటించడం మానుకుని స్వాభిమానం సభ్యలక్షణం అనుకుని, తెలుగుతనాన్ని, తెలుగుదనాన్ని మరింత వైభవోపేతం కావిస్తారని, మనసా, వచా, కర్మణా ఆచరిస్తారని భావిస్తున్నాము.
ఎంత చక్కనిదీ తెలుగు భాష, ఎందరిని అలరించినదీ తెలుగు భాష, ఎప్పటికీ అగ్రస్థానం వహించేది, వహించవలసినదీ తెలుగు భాష!
తెలుగుభాషకు ప్రాచీన హోదా లభించిన శుభసందర్భంగా, తెలుగురథం అభినందనలని ప్రకటించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగు రథం.