నిదురించిన పాట - వాడని సిరా - శేషేంద్ర శేషజ్యోత్స్న "ఏ రస్తా ప్రజాకోట్ల అడుగులతో పునీతం అయిందో అదే నా రస్తా" అని సంచలనం సౄష్టించాడు. కవిత్వం రాయడం, కవిత్వం కవిత్వంగా రాయడం తగ్గిపోయిన నేటికాలంలో రసపిపాసితుల రసనలకు పథ్యంగ్తా కవిత్వం రాయగన్న, కవిత్వం కవిత్వంగా రాసిన కవిరాయడు. ఈయన్ని అచ్చమైన కవి అని వర్ణించాడు, ప్రముఖ రచయిత, విమర్శకుడు, ఆర్.యస్. సుదర్శనం. ఒక్క పువ్వు రంగును చూస్తూ నేను శతాబ్దాలు బ్రతగ్గలను అన్నాడు - పువ్వులో ఈయన ఏం చూసి, ఏఏ భావనలను పొందగలడో చెప్పడం ఎవ్వరి తరమూ కాదు. కవిత్వతత్వానికే కవిగా ప్రాధాన్యత యిస్తాడు. కేవలం ఒకానొక ప్రయోజనాన్ని దౄష్టిలో పెట్టుకొని కవిత్వ తత్త్వాన్నే విస్మరిస్తున్న నేటి ధోరణుల్ని తీవ్రంగా విమర్శించాడు ఈ సుకవి. ఈ సుకవి ఎవరో కాదు, ఆయనే శ్రీ గుంటురు శేషేంద్రశర్మగారు. శ్రీశర్మగారు 1927 అక్టోబర్ 20 న నెల్లూరు జిల్లా నాగరాజుపాడు గ్రామంలో జన్మించారు. సుబ్రహ్మణ్యశర్మ, అమ్మాయమ్మ దంపతులకు వరప్రసాదం అయిన శర్మగారు గుంటూరు ఆంధ్ర క్రిష్టియన్ కాలేజి నుంచి భౌతిక రసాయన శాస్త్రాలతో బి.ఎ. పట్టం పుచ్చుకొని, మదరాసు లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. యింటివద్ద తండ్రి జాగ్రత్త పెట్టిన సంప్రదాయ విజ్ణానం ఆపోశనం పట్టారు. ప్రతిభా వ్యుత్పత్తులకు ప్రపంచ పర్యటనానుభవం తోడయింది. ప్రియపత్ని, ప్రసిద్ధ ఇండో-యాంగ్లియన్ కవయిత్రి, రాజకుమారి ఇందిరాదేవి ధన్ రాజ్ గిర్ సహచరిగా, సహధర్మిణిగా సమకూడినది. ఇటు తెలుగున కైకలల్లుతూ, అటు ఇంగ్లీషు చేస్తూండడం వ్రతసమానంగా కవిత్వాన్ని రచించారు. హైదరాబాద్ పురపాలకశాఖలో కమీషనర్ గా ఉద్యోగం చేశారు. కవి, విమర్శకులు, పండితులు అయిన శేషేంద్ర యూరోప్, పశ్చిమ జర్మనీ పర్యటనలు చేశారు. మేఘదూతానికి, రామాయణానికి సంబంధం అనే అంశం పైన గోటింజెన్ విశ్వవిద్యాలయం ఇండాలజీ శాఖలో పేపరు చదివినారు. కవిసేన సాహిత్యోద్యమ స్థాపకులుగా కవిత్వంలో 'స్లోగనిజం' పోయి సిసలైన కవిత్వం ఉండాలంటారు. శేషకవనశైలీవిన్యాసం మా నీతికి శేషించినది నీది; నీ చేతికి శేషించినది మాది, అని ప్రతాపరుద్రీయంలో వెంకటరాయశాస్త్రిగారు అన్నారు. అలాగే, శేషేంద్రశర్మగారు గురించి చెప్పాలంటే, అశేషం ఎప్పుడూ వుండదు, నిత్యం సశేషం. సామ్రాజ్య శిధిలావశేషాలలా కవిరాజులు, కవిసామ్రాట్టులూ యింకా నిలిచివున్నారు అని ఒక రచయిత చెప్పినట్లు, అలా ప్రతిభావంతంగా నిలచిపోయిన కవివర్యులలో, గుంటూరు శేషేంద్రశర్మగారు ప్రమధగణప్రతినిధులు. 'సౌరాబ్' అనే స్వతంత్రానువాదకావ్యంతో ఆరంభమయిన కవితా వ్యాసంగం, 'నాదేశము, నాప్రజలూ అనే ఆధునిక ఇతిహాస పరికల్పనగా శిఖరస్థాయి నందుకుంది. శేషేంద్రశర్మ 'పారిపోయినా కవిత్వాన్ని చేరబిలిచిన రసవాది. శ్రీశ్రీ, తిలక్ ల స్థాయిని ఎన్నవలసిన కవి. చందోబద్ధకవితాధారగా పేరుపొందినవి - ౠతుఘోష, పక్షులు కవితాఖండికలు. ముక్తచ్చందమై వెల్లివిరిసినవి, శేషజ్యోత్స్న, మండేసూర్యుడు కౄతులు. సంస్కౄతాంధ్ర సాహిత్య మధనం ఫలితంగా, రామాయణ రహస్యాలని 'షోడశీ రూపంలో సాహితీవినువీధుల్లో ప్రఖ్యాతమైంది. నైషధీయ చరితకు సరసవ్యాఖ్యానాన్ని 'స్వర్ణహంసాని పున:సౄష్టి చేశారు. ప్రబంధకవుల పరామర్శప్రబంధంగా 'సాహిత్య కౌముదీ ని రచించారు. అపూర్వ విమర్శ సాహిత్యాన్ని ప్రసాదించిన శర్మగారి యితర కౄతుల్లో, హాస్య వ్యంగ్య రచన, చంపూ వినోదిని, బోదిలేర్ ఫ్రెంచి కవితకు అనువాదంగా 'పడవలు కెరటాలూ సాహితీసంద్రంలో తేలియాడింది. శేషన్ కవితాప్రతిభకు నీరాజనాలు నేడు అభ్యుదయ కవిత్వం కింద చెలామణీ అవుతున్న సిద్ధాంతప్రాయమైన వాదాలేవీ వల్లించకుండా, వాస్తవమైన అభినివేశంతో ఉర్రూతలూగే కవితాఖండాలు శేషేంద్ర గారి కవితాపుటల్లో కనిపించాయని అమరేంద్ర పలవరించారు. ఈయన కవిత్వంలో రసాన్నికట్టి బంగారం చెయ్యడంకోసం తడవులాట కనిపిస్తుందని శ్రీశ్రీ శ్రీవాచకాన్ని చెప్పారు. ప్రాచీన సాహిత్యంపై గౌరవం, నవకవులపై సానుభూతి, పుష్కలమైన ఆస్తికత, సంశయము, బీదలపై సానుభూతి, వారు బాగుపడవలననే ఆతురత, ఇంకా బాగుపడలేదేమనే అక్కసూ, కర్మవాదంపై విశ్వాసమూ, ఇన్ని భావాలమధ్యనలిగిన, నలుగుతూ ఉన్న ఆత్మపెట్టే ఘోష - ౠతుఘోషా అని సమగ్రరూపంలో శర్మగారి కవనవ్యక్తిత్వాన్ని, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులుగారు వివరించారు. విజ్ణానంతో ముడివేసిన సాహిత్యం కవిత్వమనే ఆనంద స్వరూపిణి ఏ ఒక్క రూపంలో మాత్రమే ఎందుకుంటుంది? పద్యంలో ఉంటుందా అని వెదకడం అజ్ణానం - అన్నిప్రక్రియలూ ఉండవలసిందే; దేనికి కాలం తీరితే అదే చస్తుంది. కాని దేని అకాలమరణానికీ ఎవరూ కంకణం కట్టుకోవద్దని మాత్రమే దీని తాత్పర్యం.సాహిత్యాన్ని వైజ్ణానిక సౌరభంగా ఉండనిద్దాం, అంతే, అని సాహితీస్వరూపాన్ని, వైజ్ణానికసౌరభంతో ముడివేశారు, నరుడు నక్షత్రాలు అన్న వ్యాససంపుటిలో శర్మగారు విపులవ్యాఖ్యానం చేశారు. కవితల్లో స్వగతాలు శర్మగారు చెప్పదలచిన భావాల్ని సూటిగా, వాడిగా, వేడిగా, అలతి అలతి పదాలతో పేర్చడంలో నేర్పరి. మచ్చుకు కొన్ని తునకలు, మండేసూర్యుడు ఖండకావ్యంనుంచి కవితాముత్యపుతునకల్ని ఉదాహరించాలంటే - నేను చెమటబిందువుని, నా వాక్యం ఒక పిల్లనగ్రోవి, గాయం కార్చే కాంతిలో జీవితం తిరగేస్తున్నాను, బాధల తుఫానుని ఒక్క నవ్వుతో తుడిచివేశాను, నేను లోకాన్ని చూడలేని బాధని, రాత్రి నేనుకనే కలలు - దినాలమీద కట్టే వంతెనలు, నేను అధరాలమీద మౌనం విధించుకున్న పర్వతశ్రేణిని, ఇది మానవతా లహరి - దారి కోల్పోయిన ఎడారి, నాగరికత విప్పివేసి నర్తిస్తోంది నా దేశం, మన అధరాలకు అడ్డువచ్చే నీ ముత్యాలదండలా - ఎందుకీ స్నేహితులు మన మధ్య - ఈ రోజుల్లో వాళ్ళొక మిధ్య, నా దేశం వెన్నెముక, ప్రవహించే కాలంలో పరుగెత్తే రంగుల చేప జీవితం - కన్నీళ్ళ వలల్లో పడదు - కలల గాలానికి తగలదు, బాధల్లో మునుగుతాను - సంతోషాల్లో ఉదయిస్తాను - నేను మానవ సూర్యుడ్ని, జైళ్ళు కటకటాలకే ఖర్చవుతోంది దేశంలో ఇనుమంతా - రైళ్ళ పట్టాలకు మిగలడం లేదు రవంత, రైతు నాగలి మోస్తున్నాడు క్రీస్తు శిలువ మోసినట్లు, ఈ దేశపు గర్భగుడిలో దేవుడు జీర్ణమైపోయాడు - ఆకలివేస్తోంది మరో దేవుడి కోసం, యిలా ఎన్నో ప్రయోజనాత్మక కవితా ప్రయోగాలు. శర్మగారి కావ్యం శేషజ్యోత్స్న లో - జనతను బంధించేదెవరు - సముద్రాలకూ ఝంఝఆమరుత్తులకూ సంకెళ్ళు వేసే దెవరు ?, భాషలు ఆరవేసిన వలువల్లా ఎగిరిపోతున్నాయి - దేశాల సరిహద్దులు ఈ ఝంఝామారుతాల ధాటికి గజగజ వణికిపోతున్నాయి, విధి ముళ్ళదండ మెడలో వేసినా ఎదనీండా మధువు నింపుకుని ఎదురొస్తావు చిరునవ్వుతో, రాళ్ళని రొట్టెలుగా మార్చాలంటావు - ఈ లోకం కల విలువ - నీవు మోసే శిలువ, అంగూరు చితకందే ఆసవం రాదనీ - చితికిన బ్రతుకులోతు ఆవిష్కరించావు, కొందరికే తెలుగు జీవిత శక్రచాపం వెనకున్న నగ్నత - కాని తప్పదెవరికీ ఆ రంగుల వలలో నిమగ్నత, ఏది ఎందుకు తారసిల్లుతుందో ఎవరూ చెప్పలేనిది బ్రతుకు - కారణాలకు అదౄశ్య దూరతీరాల్లో వెతుకు, గుండె గాయాలు చిరునవ్వులతో కప్పుకో - పాత స్వప్నాల హరాన్ని దులిపి మెడలో ధరించుకో - కార్చే కన్నీళ్ళు కనురెప్పల్లోనే దాచుకో, ఇది రంగుల నెల పరిమళాల నెల పువ్వులనెల నవ్వుల నెల - చూడు, జీవితం ఎక్కుపెట్టిన దనుస్సులా వుంది, చుక్కల గుంపుల్లో ఉన్నా జాబిల్లి - గగనంలో ఒంటరి బాటసారి నీవు రాకుంటే, లాంటి శ్రుతఖండికలు ఎన్నో వున్నాయి. ఆపాతమధురం - ఆలోచనామౄతం చాలామంది రచన ఆపాతమధురమే కాని ఆలోచనామౄతం కాలేకపోతున్నది. శేషేంద్రశర్వ కవిత్వానికి ఆ ఇబ్బందులు ఏమీ లేవు. ఒక వైపు ప్రకౄతి సౌందర్యం, రసలోలుపత, మరొకవైపు అజ్ణాతమైన అతీతమైన తత్త్వసంస్పర్శ కోసం తహతహల సమ్మేళణం శర్మగారి కవిత్వాన్ని ఆస్వాదయోగ్యం చెయ్యడమే కాదు, పదేపదే ఆకర్షించేలా చేస్తుంది. శబ్దాలూ అర్ధాలూ వట్టి మాటలూ కవిత్వం కావు, కవిత్వానికి కవిసౄష్టి కావాలి అంటారు శర్మగారే. బ్రతుకే ఒక దరహాసం, మనసే ఒక మధుమాసం. ఒకక్షణం మధుర క్షణము, ఒక క్షణం చేదు క్షణము, బ్రతుకొక అతుకుల బొంత, శేషేంద్రకు నీవే అంతా - అన్న శర్మగారి కవితాభాషణమే, ఆయన కవితకు సహజత్వం, సార్ధకత్వం, ప్రతిభతో కూడిన ప్రమాణత సంతరించుకున్నాయి అని చెప్పడంలో అత్యుక్తి అని భావించాలి. 'నా కవిత్వం నాటి నుంచీ నేటివరకూ గమనించిన వాళ్ళకు ఒక అంతర్లహరి అన్నిటిలో అనుస్యూతంగా ప్రవహిస్తూ ఉండడం ద్యోతకమవుతుంది. అదే శర్మగారి కవిత్వంలో స్పష్టమైన రూపం ధరించింది. అదే ఈ కవి జీవనాడీ అని గుంటూరి శేషేంద్ర శర్మగారి మాటల్లోనే చెప్పుకోవడం ఔచిత్యమే. చివరిదశ వరకు కేంద్రసాహిత్య అకాడమీ విశిష్ట సభ్యుడిగా కొనసాగిన శర్మగారికి 1994లో తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రదానం చేయడం ఆయన ప్రతిభకు సంకేతం. శర్మగారి రచనలకు విశ్వప్రఖ్యాతత్వం కలగడానికి ఆయన సతీమణి యిందిరాదేవి శర్మగారి రచనలను ఆంగ్లంలోకి అనువదించడంవల్ల వచ్చినా, తన రచనలకు వచ్చిన పేరు తెలుగుజాతికి వచ్చినట్లుగానే భావించడం ఆయన హౄదయవైశాల్యానికి ప్రతిబింబం. శేషేంద్ర శర్మ గారు రచించిన ఘనకావ్యం 'నా దేశం - నా ప్రజలూ 2004 లో నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అవ్వడం, రవీంద్రునికి వచ్చిన పురస్కారం, శర్మగారికి వచ్చినంత ఆనందం వేయడం కూడ సహజం. శేషేంద్రశర్మగారి ఆత్మ సాహితీవనంలోనే విహరిస్తూ, సాహితీపిపాసుల్ని తనవంతు మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే వుంటారని, ఆయన ఆత్మకు ఆ పరాత్పరుడు శాంతిని ప్రసాదిస్తారని ఆయణ్ణి అందరం సామూహికంగా ప్రార్ధిద్దాం. ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి: మహాకవి ష్రీ గుంటూరు షేషేంద్ర షర్మగారి జయంతి సందర్భంగా (అక్టోబర్ 20) తెలుగు కవితా ప్రేమికులు నిరంతరం సాహితీప్రతిభను సర్వదిషలా వ్యాప్తి చేస్తారని ఆషిస్తూ ఈ వ్యాసాన్ని తెలుగురథం సమర్పిస్తోంది. కొంపెల్ల - తెలుగురథం.
కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం. 'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?' కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో? (బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Tuesday, October 20, 2009
నిదురించిన పాట - వాడని సిరా - శేషేంద్ర

Monday, October 19, 2009
విశ్వనాధ - నిత్య సాహిత్యమహర్షికి వినమ్ర నీరాజనాలు
విశ్వనాధ రసాకౄతీ! విశ్వమే నీ ఆకౄతీ!
కవిసామ్రాట్, జ్ణానపీఠ పురస్కార గ్రహీత, విశ్వనాధ సత్యనారాయణ (1895 - 1976)
నిత్య సాహిత్యమహర్షికి వినమ్రనీరాజనాలు రీగంట కదులుతుంది. ఆయన ఊహింపని భావం లేదు. కల్పింపని శిల్పచిత్రం లేదు. రసోచితంగా వాడని పదం లేదు. పుష్కళ భావకవి. రాశిపోసిన ఆంధ్రాభిమానం. తెలుగింట దొరసానిని సౄష్టించిన అపరబ్రహ్మ. ఈయన రూపుదిద్దిన సాహితీకన్యకు జాతీయతాదృౠష్టి, ధర్మదౄష్టి అన్న రెండు కళ్ళను అతికాడు. మానవత, భారతీయ దర్శనం, గాంధీయవాదం, భావకవి, వాక్యలయ, సామాజిక దౄక్పధం, కధకుడు, పరరాష్ట్రంలో సాటి తెనుగువానికి, తెనుగువాణికి జరిగిన మహాగౌరవం నభూతో నభవిష్యత్. ఆబాలవౄద్ధం ఎరుగును. వారిని ఫలానా అని చెప్పడం సూర్యుణ్ణి దివిటీతో చూపడమే. వారు పాటించిన నిదానం, స్వయంకౄషి, పట్టుదల మూలహేతువులు. నా మార్గం నాదే,నేను ఎందుకు ఒకరి వెంట పరుగు పెట్టాలి ? అన్న ధౄఢమనస్కుడు. ఆయన దేశపు అత్యున్నత సాహితీపురస్కారాన్న
ఆయన కవిసామ్రాట్టు. కవితాశిల్పమంతా ఆయన క్రీ మన మాతౄభాషలో మొట్టమొదట అందుకున్న ఘనాపాటి. విశ్వవ్యాప్తమైన 'నోబెళ్ సాహిత్యపురస్కారానికి ఎప్పుడో అర్హుడు. ఆయన సాహిత్యాన్ని అర్ధం చేసుకుని, జీర్ణించుకుని, వంటబట్టించుకుని, పదిమందికి సాహితీరసగుళికలను, సుమధుర, మధురస కవనఖండికలను సాదరంగా అందించడానికి అర్హత, అధికారం వున్న కవనమూర్తులు కరువవుతున్న కాలంలో ఆయన సాహితీవైభవానికి సరిసమన్యాయం జరగడం కూడ కనుమరుగవుతోందేమో అన్న భయభ్రాంతులు ఆవహిస్తున్నకాలం. తెలుగుసాహితీమాగాణీసుక్షేత్రాల్ని దున్నిన మహాకవి. ఆయన ఎవరోకాదు. వేయిపడగలను పురివిప్పిన సత్యమూర్తి. రామాయణ కల్పవౄక్షాన్ని సౄష్టించిన నారాయణుడు. విశ్వానికి నిత్య సత్య పరిచితుడు - వెరసి, విశ్వనాధ సత్యనారాయణ గారు. మహాకవి. మహాకవి శ్రీశ్రీ మాటల్లో -
నిలబెట్టిన సాహితీలోకానికి కూడ సాహితీవిశ్వనాధుడే. ఆంధ్రప్రదేశ్, కౄష్ణాజిల్లాలోని నందమూరు గ్రామంలో జన్మించిన వీరు నందమూరు, యిందుపల్లి, పెదపాడు, బందరులో చదువులు సాగాయి. బందరులో చెళ్ళపెళ్ళ వెంకటశాస్త్రిగారి సుశిష్యరికంలో వర్ధిల్లన విద్యార్ధి. బి.ఎ. తో బందరు హైస్కూలులో ఉపాధ్యాయునిగా చేరడం, మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. పట్టాని ఒకేసారి సాధించారు. అనుకోని మలుపుతో, మహాత్మాగాంధి నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొనడం, ఉద్య
'మటలాడే వెన్నెముక, పాటపాడే సుషమ్న, నిన్నటి నన్నయభట్టు, ఈనాటి కవిసామ్రాట్టు, గోదావరి పులకరింత, కౄష్ణానది పులకరింత, కొండవీటి పొగమబ్బు, తెలుగువాళ్ళ గోల్డునిబ్బు, ఆకారాది క్షకారాంతం, ఆసేతు మహితావంతం, అతగాడు తెలుగువాడి ఆస్తి, అవనరతం తెలుగువాడి ప్రశాస్తి, ఛందస్సులేని ఈ ద్వివద, సత్యానికి నా ఉపదా అని వర్ణించిన తీరు వర్ణనాతీతం. నడిచేది చుక్కెదురైన మార్గాలైనా, యుభయతారకమైన ప్రతిభాన్యోన్యతను ప్రకటించుకున్న మన మహాకవిద్వయం మనకు రెండు కళ్ళు. విశ్వనాధ జీవన సరస్తీరం సుసంపన్న ఆంధ్ర వైదిక కుటుంబంలో శోభనాద్రి, పార్వతమ్మ పుణ్యదంపతులకు 1895 సెప్టెంబర్ 10 న పున్నామనరకం నుంచి ప్రాప్తి కలిగించిన బాలుడు. సార్ధకనామధేయం - సత్యనారాయణ. యింటి పేరు విశ్వనాధ. పేరునిగానికి తిలోదకాలు కూడ ఒకేసారి జరిగాయి. విద్యార్ధిగా 'శౄంగారవీధీ చదువుతోపాటు, గానుగచెట్టెక్కి కూర్చుని ముచ్చటగా ముడి సర్దుకుంటూ 'శౄంగారవీధీ లో రసభరితంగా రచనలను అందించారు. ఆనాటి సహాధ్యాయి పింగళి లక్ష్మీకాంతంగారితో కలిసి పద్యాలను చెప్పాలన్న ఉబలాటాన్ని, నీతో కలసి పద్యాలను చెప్పాలని ఉందోయ్? అన్న ప్రశ్నకు, ఛస్! నీకేమి వచ్చు, సంస్కౄతమా, తెలుగా, యింగ్లీషా! అన్న ధోరణిలో రెచ్చగొట్టబడిన పౌరుషం, ఆభిజాత్యం, విశ్వరూపం దాల్చాయి. పొంగే రక్తం పట్టుదలను పెంచింది. సంస్కౄతాన్ని సాధించాలన్న సంకల్పం అధికమయింది. 'సత్కవి చెళ్ళపిళ్ళ వేంకన గురువంచు చెప్పికొనగా అది గొప్పా అన్నా, నిజగురువు శ్రీ విమలానందభారతి తో కలసి సంస్కౄత రామాయణ భారతాలను పిండికొట్టారు. ఈ నిరంతర పరిశ్రమలో తమ బి.ఎ. ను కూడ తప్పారు. ఈ ఆవేదనలో, 'డిగ్రీలు లేని పాండిత్యం, ఈ పాడుకాలాన పుట్టీ అని తన 'ఆంధ్రప్రశస్తీ ని మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి అంకితం యిస్తూ మనసులోన మాటను చెప్పారు. బందరు కవులు ముందు మెచ్చుకుంటూ వెనుక వెక్కిరించే విమర్శలకు మనసు కొంత కలత చెందిందిట. విశ్వనాధ విశిష్టత - వింత వ్యక్తిత్వం
ుమతి గ్రహీత, భారతీయ మహారచయిత రవీంద్రనాధ్ ఠాగూర్ అనేక సాహిత్య ప్రక్రియల్లో రసవద్రచనలు చేశాడు, ఒక మహాకావ్యం తప్ప. ఈ దౄష్టిలో పరిశీలిస్తే, విశ్వనాధవారి సాహితీవ్యక్తిత్వం సర్వంకషం. నవల, కధ, నాటకం, మహాకావ్యం, విమఋర్శలాంటి వివిధ ప్రక్రియల్లో ఆయన అగ్రస్థాయి కౄతులు రచించాడూ. పై విశ్లేషణను బట్టి, ఆంధ్రసాహిత్యరంగంలో ప్రముఖులు అన్న గణనం, గుణికం వస్తే, సంస్కౄతంలో మహాకవి కాళిదాసు తర్వాత అనామిక లాగ
విశ్వనాధవారి అలవాట్లు మరీ వింతలు. మంచి వక్త. మరింత మంచి భోక్త. ఆవకాయలో పచ్చిమిరపకాయ కొరుక్కుని తిన్న తిండిని జీర్ణించుకున్న జిహ్వపై అర్ధవంతమైనవైనా, అందరూ అర్ధం చేసుకోలేకపోయారు. అసలు ఆయన పద్యాల్ని అర్ధం చేసుకునెందుకు ప్రయత్నించిన వారు అరుదు అనే చెప్పాలి. హాస్యప్రియులు. జిలేబీజాతి అని పేరు. స్టంటు సినీమాలన్నా, యింగ్లీషుచిత్రాలన్నా ఎక్కువ ప్రీతి. విరబూసిన మానవతను ప్రదర్శించిన విరాణ్మూర్తి. 'ప్రతిభా అంచులను తాకిన విరాణ్మూర్తి, యుగకర్త విశ్వనాధవారి తర్వాత, భారతీయ సాహితీపీఠంవారు, తెలుగులో అందించిన పురస్కారాన్ని దక్కించుకున్న ఏకైక సాహితీప్రతిభాప్రభ నారాయణరెడ్డిగారు అన్నది అందరికీ తెలిసున్న విషయమే. ఆయన మాటల్లో విశ్వనాధవారిని విశ్లేషించాలంటే - 'విశ్వనాధవారి ప్రతిభావైవిధ్యం అనన్యసాధ్యం. ఆంధ్ర సాహిత్య రంగంలో ఎన్నెన్నో ప్రక్రియలను చేపట్టి అత్యంత సమర్ధంగా అంచులు ముట్టిన విరాణ్మూర్తి. ప్రపంచ ప్రఖ్యాత నాటకకర్త షేక్స్పియర్ గొప్ప నాటకాలూ, మంచి కవితలూ రాశాడు. మహాకావ్య రచన చేయలేదు. ప్రముఖాంగ్ల మహాకవి మిల్టన్ మహాకావ్యం రచించినా, నవలా రచన చేయలేదు. నోబుల్ బహు, విశ్వనాధ తర్వాత ఎవరు అన్న ప్రశ్న వస్తే, క్షణికంపాటు ఊపిరితీసుకుని, జవాబు దొరకని ప్రశ్నలాగ గోచరించక మానదు. సాహితీయుగకర్తకు నివాళి 'శతజయంతీ కి సార్ధకతను చేకూర్చే విధానంగా, ప్రతి నూరేళ్ళకు నవనవంగా తమ సాహిత్యాన్ని ప్రజల ఆలోచనల్లో, అనుభూతుల్లో, ఆవిష్కరిస్తూ అనంతంగా సాగేవారు అన్న భావనకు సరిసములు కేవలం విశ్వనాధ సత్యనారాయణగారు. విశ్వనాధవారు ఈ సంవత్సరం శతవర్షాధిక పుష్కర జయంతిని జరుపుకున్నారు. పదకొండవ వర్ధంతి సందర్భంగా నీరాజనాల్ని అందించే కౄతజ్ణతాపూర్వక తరుణం. విశ్వనాధ సాహితీప్రక్రియలు, తరంగాలు అధ్యాపక పదవులు, ప్రిన్సిపాలు ఉద్యోగం తర్వాత, పూర్తిస్థాయిగా తన సమాయాన్ని సాహితీవ్యాసాంగంలో నిమగ్నమయ్యారు. 1916లో విశ్వేశ్వర శతకంతో రచనాప్రస్థానాన్ని మొదలిడారని చెప్పబడుతున్న ధారకు మరి యోగం, వేగం తగ్గలేదు. వాడి, వేడితనాలు అవేశైలిలో నడిచాయి. జాతీయోద్యమ ప్రభావంలో 'ఆంధ్రపౌరుషం' మొదలుకొని, రచనాపరంపరావాహిని పుంఖానుపుంఖాలుగా విస్తరించబడ్డాయి.
ాని, ఏకవీర, వేయిపడగలు, రామాయణకల్పవౄక్షం పండితునికి, పామరునికి సరిసమదౄష్టి కలుగుతాయి. అదే గొప్పదనం. వీటితోపాటు, ఆంధ్రప్రశస్తి, పురాణవైర గ్రంధమాల, విశ్వనాధ మధ్యాక్కరలు, రురుచరిత్రం, చెలియలికట్ట, తెరచిరాజు,స్వర్గానికి నిచ్చెనలు, ఆరునదులు, పునర్జన్మ, దమయంతీస్వయంవరం, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, ఒకడు నాచనసోమన్న, శాకుంతలం యొక్క అభిజ్ణానత, ఝాన్సీరాణి, కుమారాభ్యుదయం, విశ్వనాధపంచశతి, మౄతశర్మిష్ఠం, దేవీత్రిశతి, గోపికాగీతాలు, భ్రమరగీతాలు, శ్రీకౄష్ణసంగీతం, గుప్తపాశుపతం, ప్రద్యుమ్నోదయం, నేపాలరాజచరిత్రనవలలు, కాశ్మీరరాజచరిత్రనవలలు, సాహితీమీమాంస సంకలనాలు, ఎన్నో, మరెన్నో. వేయిపడగలు, భారతీయ ధర్మదౄష్టికి నిదర్శనంగా విరాజిల్లిన ఈ రచన, అన్ని భారతీయ భాషల్లోకి అనువదింపబడడమే కాక, ప్రముఖులు పి.వి.నరసింహారావుగారి ప్రతిభాకలంతో 'సహస్రఫణ్' అని హిందీలోకి అనువదింపబడింది. యిక 'రామాయణకల్పవౄక్షం' రచన
విశ్వనాధసాహితీపీఠం సమాచారం మేరకు, పద్యకౄతులు(31), నాటకాలు(18), నవలలు(57), కధలు/కధానికలు(30), విమర్శలు(9), సంస్కౄత రచనలు(32), అనువాదాలు(3), సంపాదకీయాలు(3), పద్యాఖండికలు(186), వ్యాసాలు(60), అంగ్లవ్యాసాలు(7), ఉపన్యాసాలు(6), ముఖాముఖీలు(12), ఆకాశవాణి - ప్రసంగాలు(16),నాటకరూపకాలు(56), ప్రసంగాలు(37), గ్రంధాలకు ఆముఖాలు/పరిచయాలు(102) వెరసి, విశ్వనాధను తలమానికమైన సాహితీమూర్తిగా పరిగణించారు. వివిధభాషల్లో, 34 మంది రచయితలు విశ్వనాధవారి సాహిత్యాన్ని కొనియాడారంటేనే వారి ప్రతిభకు ప్రత్యక్షతార్కాణమని చెప్పాలి. విశ్వనాధ సాహితీపీఠం వారు చేపట్టిన సాహిత్యసంకలనంతోపాటు, ముద్దువడ్డనలు, అసంకలిత సాహిత్యం, మురిపాల ముచ్చట్లు, విశ్వనాధ సాహిత్యాన్ని, ప్రతిభావ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా వెలుగులోకి తెచ్చేప్రయత్నం అభినందనీయం. పీఠంవారు 'జయంతీ సాహిత్య ప్రచురణ కూడ ప్రశంసనీయమైన ప్రస్తావన చేయదగ్గది. రచనాపరంపరలు విశ్వనాధవారు అంటే మనకు గుర్తుకు వచ్చేవి - కిన్నెరసా మూడు దశాబ్దాలు పట్టిన ఉద్గ్రంధం, భారతీయ సంప్రదాయసంస్కౄతీవైభవాలకు ప్రతీక. ప్రత్యేకంగా ఆంధ్రసంస్కౄతీపరంపరను రామాయణకధనానికి అన్వయించిన శైలి, వైనం అనుభవించి, పలవరించగలంగాని, మాటలతో చెప్పలేని అవాక్కయిన పరిస్థితులు ఎన్నో, మరెన్నో. విశ్వనాధ సాహిత్యపరిమళాలు గోదావరీ పావనోదార వా:పూర మఖిల భారతము మాదన్ననాడు - అన్న మేఖ గంభీర నిర్ఘోషం వినబడగానే కలకలం చప్పున చల్లారేది. అందరూ చెవులు దోరపెట్టుకుని వినసాగేవారు. తెలుగు తెలియని యితరులు కూడ వారిని ఏదో రసధుని ముంచెత్తేది. ఈ గమకం, ఈ శయ్య, దేశంలోనే అపూర్వమని, సంస్కౄతాంధ్రాలు యింతగా సహజీవనం చేస్తాయని విశ్వనాధ గళం వివరించేవరకూ తెలియని పండితగణమది. ఇలాంటి కవి దేశంలో ఉన్నారనే సంగతి కూడ తెలియకపోవటం గురించి, వారి ప్రతిభకు సిగ్గుచేటు అని పలువురు తమ శాలువాలతో సైతం ధరణికి తలదించుకున్న వైనం. హిందీలో 'రీతీ సంప్రదాయానికి ప్రవర్తకులు మన తెలుగువారు. ఈ కవి రచనారీతి భారతదేశంలోనే విశిష్ఠమయింది. దీనిని, ఆంధ్రరీతి, కాదు, 'విశ్వనాధరీతీ అని ముక్తఖంఠంతో ప్రస్తావించారు. మన రాష్ట్రంలో సాటి తెనువువానికి, తెనుగువాణికి జరిగిన ఆ మహాగౌరవం తలంచుకుంటే ఒళ్ళు కడిమిచెట్టవుతుంది అన్న తిరుమల రామచంద్రగారి మాటల్లో వాస్తవికత తప్ప మరేమీ గోచరించదు. విశ్వనాధవారిని ఫలానా అని చెప్పడం సూర్యుణ్ణి దివిటీతో చూపడమే. లక్షన్నర పుటల సాహిత్యసౄష్టికర్త
ని, ఆయణ్ణి స్తుతించినందుకు, నా రాముడు నాకు జీతం యిచ్చాడు. ఆ ధనాన్ని, ఆయన తండ్రి నిర్మించి, శిధిలావస్థలోనున్న శివాలయం పునరుద్ధరణకు వినియోగిస్తానని చెబుతూ, మిగతాధనం నా జేబులో వేసుకుంటానని, కానీ, నా జేబుకు చాలా చిల్లులు ఉన్నాయనే భయంవేస్తోందని చెప్పారు. పత్రికలతో ఉగ్రవాదం పత్రికలంటే వారు ఉగ్రులైపొయేవారు. పత్రికా సంపదకులకు శిక్షణ అవసరమని వారు నిత్యం సూచనలు చేసేవారు. ప్రతీ అడ్డమైనవాడూ వ్రాసినది ప్రచురించి సాహిత్య ప్రమాణాలు పాడుచేస్తున్నారు. పత్రికలవారు, తమ బాధ్యత గుర్తెరుగడం లేదని వారి విమర్శ తరచు జరిగేది. వారి సాహిత్యానికి విశ్లేషణ, పరిచయం, విమర్శ చేసేవాడికి కనీసం తనసాటి పరిజ్ణానం ఉండితీరాలి అని వాదించేవారు. ప్రపంచశాంతికి వేదమే శరణ్యం సనాతనధర్మాన్ని కాపాడుకోవాలని, వేదమతానుసరణ తప్పదు, అదివినా, ప్రపంచశాంతి ఉండదు. ఈ ఇజమూ గట్టెంకించదు. 'వేదిజం' ఒక్కటే శరణ్యం అన్న భావనను విశ్వసించి, మనసావాచాకర్మణా ఆచరించిన ఆ సిద్ధాంతీకరుణ్ణి వర్ణించడం ఎవరితరమూ కాదు. మీరు సాధించింనది ఏమీలేదు అన్న సాహితీసమితి వారి ఆక్షేపణను సవాలుగా తీసుకుని, క్రోధావశులై, పాశ్చాత్య సాహిత్యాన్నే మధిచివేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, 'ఇంగ్లీషులో ఏ రవీంద్రుడిలాగో, ఇలియట్స్ లాగో కవితాభాష వ్రాసే అలవాటు పోయింది; సంస్కౄతంలో ఇప్పుడు వ్రాస్తే ప్రాచీన కవుల పరంపరలో ఏ వెయ్యిన్నొక్కటో వాణ్ణో అవుతాను. తెలుగులోనంటారా, పన్నెండుగురు ప్రాచీన మహాకవుల తర్వాత పదమూడవ వాణ్ణి నేనూ అన్నారు. భారతదేశంలో మరేకవి రచనలకు లేని ప్రాభవం, ప్రాశస్త్యం అందుకున్నాయి. వారితో పోల్చదగినవారు - అలనాటి క్షేమేంద్రుడు, పడమటి సీమ బాల్జాక్, నేటి రాహుల్ సాంకౄత్యాయనుల
సాహిత్యంద్వారా తనదైన లక్షణాల్ని, లక్ష్యాల్ని సాధించిన మహామంకుపట్టుకవి. మహాకవి మధ్యలో దూరిన ఆ 'మంకుపట్టూ లక్షణం వెనుక సమర్ధత, ప్రతిభ, అధికారం, కొందమందికే గోచరనీయమవుతాయి. అందుకే, నా మార్గం నాదే. నేను ఎందుకు ఒకరివెంట పరుగు పెట్టాలి? అన్న ఆవేదనాత్మక నిశ్చయంతో ముందుకు ఉరికినవారు. కొన్ని ఆవేదనలను కలిగించిన సన్నివేశాలూ ఉన్నాయి. 'తన కావ్యం ప్రతివాడూ గొప్పదంటాడు. ప్రతివాడూ తన అభిప్రాయమే గొప్పదంటాడు. ఎవరో నా ఏకవీర ఉత్తమమన్నారు. నేను ఉత్తమమని ఎందుకనాలి? ఒక తరం పోయి మరొకతరం వచ్చినట్లు చెప్పిన వేయిపడగలు గొప్పదికాదా? దాని గుణగణాలు ఎవరైనా పరిశీలించారా? ఎంతో 'సైకాలజీ' గుప్పించిన చెలియలికట్ట ఏమైనట్లు? పురాణవైరగ్రంధమాలలో ఒక్కొక్క నవనలో ఒక్కొక్క శ్సిల్పం చూపానే? ఎవరైనా చూచారా? మన ప్రమాణాలు నిలుస్తాయా? ఎంతో పోయె! దేవాలయాలే కూలిపోయె! అని ఆవేదన చెందిన తీరుతెన్నులు, దిగజారుతున్న సంస్కౄతిని వివరించిన విధానంలో కూడ తనప్రతిభను ప్రదర్శించారు. రామాయణ కల్పవౄక్షాన్ని మించిన కవిత్వం ఉండదు. సర్వశక్తులూ పెట్టి వ్రాశాను. పరమేశ్వరుడు అనుగ్రహించాడు. నారాయణుడే పరమేశ్వరుడూ అన్నారు. 'రామాయణ కల్పవౄక్షం' కు జ్ణానపీఠపురస్కారం సందర్భంలో, ఆనాడు, లక్షరూపాయలను స్వీకరిస్తూ, "నా జీవితంలో ముఖ్యభాగం రామాయణ రచనకు వినియోగించినట్లు, ఆ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కిందని చెబుతూ, ఆయణ్ణి నమ్ముకునూ అని తిరుమల రామచంద్రగారు, మరపురాని మనీషి అని మనీషివతంసుల లీఖినీచిత్రాలను చిత్రిస్తూ, విశ్వనాధవారి వ్యాసంలో వివరించారు. రచనలను స్వంత దస్తూరీతో వ్రాయటం కన్నా, ఆయనకు భావావేశం వచ్చినప్పుడు, భాషించేవారుట. వారి ప్రశిష్యులు ఆయన చెబుతుంటే, వారు వ్రాసుకునేవారుట. ఈ పరంపరలో ఎంతమందో. అనేకం లో మమైకమైన ఏకం - విశ్వనాధ బహుముఖ సాహితీప్రక్రియలతో, మానవత, భారతీయదర్శనం, జాతీయతాదౄష్టి, గాంధీయవాదం, ప్రభావితమైన యింగ్లీషురచనలు, భావకవి, 'నేనూ అన్న ధ్యాసధోరణి, ఆంధ్రాభిమానం, సౄష్టించిన తెలుగు ౠతువులు, తెలుగింటి దొరసాని, వాక్యలయ, సామాజిక దౄక్పధం, ధర్మదౄష్టి, కధకుడు, జీవుని వేదనాప్రకటన, భావుకత, అలంకార ప్రయోగం, సమకాలీనత, భాష, సంగీతపరిజ్ణానం, హాస్యం, జానపదధోరణి, అక్షరప్రణామాలు, అక్షరప్రమాణాలు, అన్నీ కలసి, వెరసి, మన సాహితీతరంగం, కొన్ని శతాబ్దాలకి నిరాఘాటంగా, తెలుగు జీనియస్, తెలుగు గోల్డ్ నిబ్బు అని చెప్పక తప్పదు. ఎందరో మహానుభావులు, సాహితీప్రభావ, ప్రేరణలతో, ఈ సాహితీవిశ్వనాధుడికి నిత్యం కైమోడ్పులు, దోయిలిలు, కవితానీరాజనాలు, అక్షరప్రణామాలు, నవకాలు, నీరాజనాలు, సుమాంజలులు, కుసుమాంజలులు, ప్రకటిస్తూ, విశ్వనాధుని సాహితీ సమాలోచనాలు ప్రతినిత్యం, సాయంసంధ్యల్లో నిర్వహించే, సాహిత్యసభల్లో, ప్రత్యక్షపరోక్షాలుగా, విశ్వనాధుని సత్యంగా నారాయణీయంలా స్మరించాల్సిందే. నుతించాల్సిందే. సత్కవిత్వ త్రివిక్రమా, సత్కవీంద్ర నమోస్తుతే, అని నుతించక తప్పదు. ఏ ప్రక్రియ చేపట్టిన, ఆ ప్రక్రియలోన సిద్ధహస్తుడు; ప్రాభవం, ప్రభావం ప్రజ్ణోపజ్ణ తెలుగు తేజం. (డా. జె.బాపురెడ్డి.) తెలుగు పలుకులమ్మ కలికి కంఠమునందు వెలయు కబ్బములను విరులదండనోలి మైరపింప గీలించినాడవు విశ్వనాధ వంశ విబుధవరుడ. (జ్ణానానందకవి). బాణుని కలసినట్లు, హర్షునికనినట్లు,మురారిని కొల్చినట్లుగన్. (ఉత్పల సత్యనారాయణాచార్యులు). తెలుగు సాహిత్యమును, తొట్టతొలుత, మేటి 'జ్ణానపీఠా మెక్కించిన ఘనుడతండు, ఆంధ్రులకు చిరస్మరణీయులైనయట్టి పూర్వకవులకు చెందు అపూర్వుడతడు. (డా. ఉండేల మాలకొండారెడ్డి.) భువిని రామాయణ మహద్విభూతి యెంత వెలుగు వెలుగు నంత వెలుగు విశ్వనాధ సత్యనారాయణ వెలుగు - శారదా కటాక్ష వీక్షణ చాంధ్రీ మయాగ్ని సాక్షి. (ఆచార్య తిరుమల). ఒక్క వైఖరి యననేల? ఒరవులన్ని పిండుగట్టి నీ కైతలో నిండెనయ్య, జ్ణానపీఠమ్ము నెక్కిన సత్కవీంద్ర సత్కవిత్వ త్రివిక్రమ స్వామి నీవు. (డా. కనుమలూరి వెంకట శివయ్య). కల్పవౄక్షపు కలికి వెన్నెల కలుపు జగతిని నాటినావు, వేయి పడగల వేదసంస్కౄతి విశ్వమెల్లెడ చాటినావు, కోటి భాషా హౄదయ తంత్రుల గోటి కొనలను మీటినావు, మాటలకు, మనసులకు, ఆత్మకు, ఆవలితీరం దాటినావు, విశ్వనాధ రసాకౄతీ, విశ్వమే నీ ఆకౄతీ! (శతావధాని. మాడగుల నాగఫణి శర్మ). భాష నీకు గోవు భావమ్ము దుగ్ధమ్ము, గీత సంతతి నవనీత మగును, కావ్య నవ్య సౄష్టి కమనీయ ఘౄతమాయె, తెలుగు నీ కతమున వెలిగెనయ్య!. (ఊట్ల కొండయ్య). తెలుగు సాహితీవేత్తల పలుకు విలువ గలుగు, పలుకు పూబోటి రాచిలుక ఇతడు, డంబుమీఋర, ఘనాఘనడంబరంబు బలుచ చేయు వాగ్ధాటి సంభ్రముడితండు. (ఆయాచితుల హనుమఛ్ఛాస్త్రి).
Saturday, October 17, 2009
విజయ దీపావళి
విజయ దీపావళి
బలి చక్రవర్తిని బంధించి పాతాళమునకు వామనుడు పంపినది నేడె! రావణుంబరిమార్చి రాముడర్ధాంగితో ననుజన్ము భరతు గాంచినది నేడె! క్రూరుడౌ నరకాసురుని సత్యభామ కౄష్ణుని వెంట జని వధించినది నేడె! విక్రమార్కుడు శత్రు విజయంబు గావించి తన పేర శకము నిల్పినది నేడె! శ్రీమహావీర జిను డహింసా మహస్సు దెసల బ్రసరింప సిద్ధి పొందినది నేడె! వచ్చె నిదిగొ సౌవర్ణ శోభాప్రపూర్ణ సర్వజనము దీపావళి పర్వదినము. (కరుణశ్రీ - విజయ దీపావళి) ఆంధ్రుల ఆరాధ్య పండుగ దీపావళి గురించి, సూక్ష్మంలో మోక్షంగా ప్రముఖ కవి, కరుణశ్రీ, జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వర్ణించిన తీరు అనూహ్యం. అలతి పదాలతో అనల్పార్ధరచనను కావించడంలో కరుణశ్రీ సిద్ధహస్తులు. దీపావళి అంటే సూక్షంగా సత్యభామా సమేతుడై శ్రీకౄష్ణుడు చేసిన నరకాసుర సంహారానికి పరమానంద భరితులై జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వయుజమాసంలో అమావాస్యముందు వచ్చే చతుర్దశిని నరక చరుర్దశిగా వ్యవహరిస్తారు. టపాకాయలు కాల్చి ఆచరించుకునే పండుగ కాబట్టి పిల్లలు ఈ పండుగలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచా కారణంగా వర్షాకాలంలో పుట్టుకు వచ్చిన క్రిమి కీటకాలు నశిస్తాయనే విశ్వాసం వల్ల ఇది ఆరోగ్యకరమైన ఆచారం అనే వాదన వుంది. 'దిబ్బుదిబ్బు దీపావళీ అంటూ సాయంత్రం కాగానే ప్రమిదలలో వత్తులు వేసి, నేను పోసి ఇంటిముందు, వరండాలలో దీపాలు వెలిగిస్తారు. దీపావళి అందరికీ దసరాకంటె ఎక్కువగా దేశమంతటా ఆనందంతో ఆచరించే పండుగ దీపావళి. దీపాలపండుగగా ప్రసిద్ధిచెందిన ఈ ఉత్సవం రెండు మూడు రోజులు వైభవంగా జరుపుకునే ఆచారం కూడ ఉంది. దీపావళిని జానపదులు, శిష్టులు అనే భేదం లేకుండా అందరూ ఆచరిస్తారు. దీపావళి గురించి రెండు మూడు కధలున్నాయి. మొత్తంమీద సత్యభామ సహకారంతో శ్రీకౄష్ణుడు నరకాసురుణ్ణి సంహరించాడనేది మాత్రం అందరికీ తెలిసిన కధ. నరక చతుర్దశినాడు తెల్లవారుఝామున లేచి తలంటుస్నానం చెయ్యాలని, ఈ స్నానంతో నరకాసురుని పీడవదలిపోతుందని చాలామంది విశ్వాసం. దీపావళి అమావాస్యరోజు వస్తుంది కాబట్టి, ఆ రోజు చాలామంది కొత్తగుడ్డలు కట్టుకోరు. వాళ్ళు నరకచతుర్దశి రోజునే కట్టేసుకుంటారు. కొత్త అల్లుళ్ళు ఇంటికివచ్చి ఉంటేమాత్రం, తప్పక అత్తవారింట్లో దీపావళికి తిష్ఠవేసేస్తారు. దీపావళికి ఎంతలేని వాళ్ళయినా సరే, కొత్తగా పెళ్ళయిన కూతురికి, అల్లుడికి బట్టలు పెడ్తారు. పండుగ, బట్టల సంబరమంతా చతుర్దశినాడే ముగిస్తారు కూడ. దీపావళినాడు టపాకాయలతో ఊరూవాడ అంతా మార్మోగుతుంది. ఈ చప్పుళ్ళు దీపావళి తర్వాత కూడ కొన్ని రోజులవరకూ వినిపిస్తాయి. దీపావళినాడు దీపాలను పెట్టి అమావాస్యనాడు వెలుగును కొని తెచ్చుకుంటారు. దీపావళి అంటే దీపముల బారు. ఊరికి దీపం బడి - మనిషికి దీపం నడవడి అంటారు. దీపావళి రోజుకు ముందు-వెనుకలు దీపావళికి ముందు రోజు నరకచతుర్దశి, అంతకు ముందు కొందరు ధనత్రయోదశి అని ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాత రోజును కొన్నిచోట్ల బలిపాడ్యమిగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమే ఈ బలిపాడ్యమి. బలి చక్రవర్తిని మించిన దానశూరులుండరు అంటారు. వస్తువులను దానమివ్వడం కాక, తన్ను తానే శత్రువుకు దానం ఇచ్చుకున్న వితరణ శీలి బలిచక్రవర్తి. బలిని, ఆయన భార్య విద్యావతిని పూజించే సంప్రదాయం కూడ వుంది. కేరళలో బలిచక్రవర్తి తమను పరిపాలించాడని నమ్మి, వారు తమ జాతీయ పర్వమైన ఓనంను బలి ప్రీత్యర్ధం జరుపుకుంటారు. దక్షిణభారతదేశంలో దీపావళి మూడునాళ్ళ పండుగగా జరుపుకుంటే, ఉత్తరభారతదేశంలో, మొత్తం ఐదు రోజులపాటు దీపావళిని జరుపుకోవడం పరిపాటి. ధనత్రయోదశి లేక ధన్ తేరస్ లేక యమత్రయోదశి (మొదటిరోజు), నరకచతుర్దశి (రెండవరోజు), దీపావళి (మూడవరోజు), బలిపాడ్యమి (నాల్గవరోజు), భ్రాతౄద్వితీయ లేక యమద్వితీయ (ఆఖరుగా ఐదవరోజు) జరుపుకుంటారు. మరో ఆచారం దీపావళి జరుపుకోవడం, మూడు, ఐదు రోజులపాటు జరుపుకోవడం ఒక పద్ధతి అయితే, పండుగను ఆచరించుటలో మరియొక పద్ధతి కూడ దర్శనం అవుతుంది. ప్రధానంగా, నరకాసుర వధ, బలిచక్రవర్తి రాజ్య దానం, శ్రీరాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమేవేశమగుట (భరత్ మిలాప్ అని పిలుస్తారు), విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం, ప్రధానేతివౄత్తాలుగా గోచరిస్తాయి. దీపం దైవస్వరూపం యమదీపం - త్రయోదశి నాటి సాయంకాలం, యింటి వెలువల యమునికొరకు దీపం వెలిగించడంవల్ల అపమౄత్యువు నశిస్తుంది అని అంటారు. అలాగే, అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోషసమయాన దీపదానాన్ని చేస్తే, మానవుడు యమమార్గాధికారంనుండి విముక్తుడవుతాడని అచంచల విశ్వాసంగా వస్తూంది. దీపోత్సవ చతుర్దశి రోజున యమతర్పణం చేయాలని, ధర్మశాస్త్రాల్లో వివరించినట్లు కూడ తరచు చెప్తారు. హేమాద్రి అనే పండితుడు ఈ దీపోత్సవాన్ని 'కౌముదీమహోత్సవం' అని నిర్వచించినట్లుగాను, నరకచతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి, దీపదానం చేయాలని చెప్పాడని వివరించారు. అలాగే, దీపావళినాడు కౌముదీ మహోత్సవాన్ని జరిపేవారని, ముద్రారాక్షసం గ్రంధంలో వివరించినట్లు కూడ తెలుస్తూంది. బౌద్ధజాతక కధల్లో లక్షదీపోత్సవం, దీపదానం కూడ జరిపినట్లు అనేక కధలు వివరించాయి. బుద్ధుని చుట్టూరా దీపాలను పెట్టి పూజించినట్లు చెప్పబడింది. నాగానందం లో సదాచారం - కూతురు-అల్లుడికి రాజయోగాలు దీపావళినాటికి కూతురిని, అల్లుడిని పిలిపించే సంప్రదాయం నాగానందం లో వర్ణించినట్లు తెలుస్తోంది. విశ్వవసు అనే రాజు తన కూతురు మలయవతికిని, అల్లునకును, దీపప్రతిపది ఉత్సవానికి (కార్తీక శుక్ల పాడ్యమి) బహుమతి యిచ్చేందుకు తన పుత్రునిద్వారా ఏర్పాట్లు చేస్తాడు. మహావీరునికి నివాళి తో దీపావళి ప్రారంభం మహావీరుడు ఈ అమావాస్యనాడే మరణం చెందినట్లు, ఆనాడు దేవతలు ఆయన్ని పూజించి, 'పావా' నగరమంతా దీపాల్ని వెలిగించారని, అప్పటినుండి దీపావళి పండుగ ఏర్పాటయిందని జైన హరివంశంలో వివరించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. విజయనగరకాలం నాట దీపావళి సకల కళాసంస్కౄతులతో విరాజిల్లిన విజయనగరసామ్రాజ్యపు కాలంనాడు, దీపావళిని వైభవేపోతంగా జరుపుకునే పద్ధతి వుందని తెలుస్తూంది. దీపావళిని తెలుగువారు దివ్వెల పండుగగా జరుపుకోవడం, నేటికీ తెలంగాణాలో కనిపిస్తుంది. చరిత్ర-భూగోళం మధ్యలో దీపావళి ప్రపంచం వసుధైవకుటుంబంగా మారడం ఆనాడే గమనిస్తాం. కళ, సంస్కౄతి రంగాల్లో ప్రముఖంగా ఈ విధానాన్ని గమనిస్తాం. సుప్రసిద్ధ అరబ్ యాత్రికుడు అల్ బెరూనీ 11 శ. లో దీపావళి మనదేశంలో ఎలా జరుపుకుంటామో వివరించాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో దీపదానం ఆచారం వున్నట్లు ఎక్కువ దేశాల్లోని చారిత్రక ఆధారాలు కనిపిస్తాయి. ఈజిప్ట్, యమన్ లో జరుపుకునే సూర్యదేవత జన్మదినోత్సవం క్రైస్తవుల్లో నడుస్తూంది. ఈజిప్టులో దక్షిణాయనం ప్రారంభ సూచకంగా, మరణించినవారిపై గౌరవసూచకంగా, దీపోత్సవాన్ని జరుపుకునే ఆచారం, మరణించిన వారి ఆత్మ తమ యిళ్ళకు తిరిగివస్తుందనే విశ్వాసంతో, సమాధులనుండి యిళ్ళ వరకు దీపాలని వరసగా వెలిగించి, బారులు కడ్తారు. చైనాలో, ఏటికి రెండుసార్లు దీపోత్సవాలు జరుపుకుంటారు. అమెరికాలో మన దీపావళి లాంటిది, 'హోలోవీణ్ ను నవంబర్ 1 న జరుపుకుంటారు. ఈ పండుగను క్రీ.పూ. కు కొన్ని శతాబ్దాల క్రితమే యిప్పటి ఆంగ్లేయుల పూర్వీకులు కెల్ట్ (డ్రూయిడ్) జాతివారే ప్రారంభించారట. రోమనులు 'పామోనా' పండుగ కూడ అలాగే వుంటుంది. ఫలితంగా క్రైస్తవులు, యితర పండగల్ని, 'ఆల్ హోలోణ్, 'ఆల్ సెయింట్స్ డే' గా జరుపుకుంటారు. నేటికీ క్రైస్తవులు జరుపుకునే 'కాండిల్ ఫెస్టివళ్ దీపావళితో పోల్చదగ్గదే. ముస్లింల్లోనూ దీపావళి లాగ, మహమ్మద్ పైగంబర్, కొత్త సంప్రదాయంగా, మక్కాకు తిరిగివెళ్ళిన రోజు రాత్రికి సూచకంగా దీపోత్సవాన్ని జరుపుకునే ఆచారానికి శ్రీకారం చుట్టి, ఈ పద్ధతికి 'షబే బరాట్ (రాత్రి ఊరేగింపు) అని పిలుస్తారు. ఈరోజున, బాణసంచా కాల్చి, మతాబాలు వెలిగిస్తారు. దీపావళి రోజున మతాబాలని కాల్చడం మనకు ముస్లింలతో సంబంధాలను ఏర్పరచుకున్న తర్వాతే మొదలయ్యింది అని తిరుమల రామచంద్రగారు అభిప్రాయపడ్డారు. చారిత్రాత్మకంగా దేశవిదేశాల్లో వివిధ మతస్తులు దీపావళిని ఎలా జరుపుకుంటున్నా, మన భారతదేశంలో మాత్రం, దీపావళిని దివ్వెల పండగ, దివిలి పండగ, పితాళ్ళ పండగగా జరుపుకోవడం సదాచారంగా, అనుశౄతంగా వస్తోంది. జీవితపర్వంలో దీపావళి భారతీయతలో భాగంగా, దీపావళి పండగ ఒక పర్వదినంగా, జీవితంతోపాటు, జీవితంలో భాగంగా వస్తోంది. అందుకే, ఒక సినీమాకవి, దీపావళిని, చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళి అని బహు సమంజసంగా వివరించాడు. వెలుగుతోపాటు, చీకటినీ తెస్తుంది అని చాటి చెప్పాడు. దీపం ఎంతో వెలుగును విరజిమ్మినా, తన చుట్టూ మాత్రం చీకటిని తొలగించుకో లేదు అన్నదిసత్యమే కదా. చెంత దీపం లేకుండా చీకటి పోదుకదా. దీపం పేరు చెబితే చీకటి పోతుందా అనే సామెత ఎలాగూ వుందికదా. అందుకే చీకట్లో చేసిన పనులను దుష్కార్యాలుగా జమకడ్తారు. ఈ భావాన్నే, చీకటి మనసులతో చేసిన పాపాలను గురించి అర్పేసిన దీపం వాంగ్మూలం యిస్తుందని చెప్తారు. చీకటి బజారు అన్న పదం కూడ చాలా ప్రతికూలంగా చెప్పుకోవడం కూడ పరిపాటేగదా. అజ్ణాన తిమిరాన్ని పారద్రోలేది 'దీపం' కామ క్రోధ లోభాలు నరకానికి కారణాలు అయి గీతాచార్యుడు వివరించాడు. ఈ మూడింటినీ జయించాలంటే, అజ్ణానాంధకారాన్ని జయించాలి. ఈ అంధకారాన్ని జయించేందుకు జ్ణానదీపాన్ని వెలిగించాలి. జీవితాలను నరకప్రాయం నుంచి రక్షించేందుకు మనందరకు కావలసినది జ్ణానదీపం ఒక్కటే. ఆ దీపం యిలా ఉండాలి అని పురాణాలు చెప్తున్నాయి. 'వైరాగ్య తైల సంపూర్ణే, భక్తివర్తి సమన్వితే, ప్రబోధపూర్ణ పాత్రేతు, క్షిప్తిదీపం విలోకయేట్. నిండైన ప్రమిద ప్రచోధమైతే, ఆ ప్రమిదను వైరాగ్యమనే నూనెతో నింపి, భక్తి అనే వత్తిని జ్ణానమనే దీపాన్ని వెలిగించాలి. ఇలా భక్తి వైరాగ్యాలతో అజ్ణానాంధకారాన్ని ఎదుర్కొని జ్ణానజ్యోతిని వెలిగించాలనే విశిష్టమైన సందేశాన్ని ఈ దీపావళి మనకు నిత్యం అందిస్తూనేవుంది. దీపం వెలిగించిన పిదప - 'దీపం జ్యోతి పరబ్రహ్మ:, దీపం సర్వ తమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీప నమోస్తుతే' 'దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన:, దీపేన హరతే పాపం, సంధ్యాదీప నమోస్తుతే' దీపాన్ని వెలిగించిన తర్వాత దీపాన్ని స్తుతించడం సంధ్యాసమయంలో దీపాన్ని దర్శించడం, దీపాన్ని నమస్కరించడం మనకు సదాచారం, సత్సంప్రదాయం. " చుట్టూరా ఆవరించుకుని వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటె, ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది " అన్న సూక్తిని ఊపిరిగా భావిస్తూ, దీపావళి పండుగ శుభసందర్భంగా తెలుగురథం శుభాకాంక్షలను తెలియజేస్తోంది. కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Saturday, October 10, 2009
నేదునూరి కౄష్ణమూర్తి
సాహిత్యానికి సంగీతం ద్వారా న్యాయం జరిగితీరాలి - నేదునూరి కౄష్ణమూర్తి
సంగీత సాహిత్యాలు అవిభాజ్యాలు 'శాస్త్రం-కళ సన్మిశ్రమం చెందాలి. శాస్త్రాన్ని భాగా ఆధ్యయనం చేయాలి. కళని ప్రస్తుతించాలి. సంగీతకళకి కూడ ఈ విధి, విధానం వర్తిస్తుంది. నిజాయితీ పరుడైన సంగీత కళాకారుడు, వాగ్గేయకారుడి సందేశాన్ని అందజేస్తూ, సంగీతకళాకారుడు, వాగ్గేయకారుడి సందేశాన్ని అందజేస్తూ, సంగీతంతో బాటు సాహిత్యానికి కూడ న్యాయం చేకూర్చేందుకు నిష్కళంక, నిస్స్వార్ధకౄషి, ప్రయత్నం, ప్రభావితమైనట్లు చేయాలి. సంగీతం ఒక రకమైన భారాన్ని అందజేస్తూ,లోతుకి తీసుకుని వెళ్ళి, హౄదయాంతరాళాల్ని స్పౄజించాలి. కేవలం 'గమకం' ద్వారానే కర్ణాటక సంప్రదాయ సంగీతం యొక్క ఈ రెండు లక్ష్యాల్ని సాధించగలం'. సరిగ్గా, పుష్కరకాలం క్రితం, ప్రముఖ సంగీతం విద్వాంసులు - శ్రీ నేదునూరి కౄష్ణమూర్తిగారు వెలిబుచ్చిన అభిప్రాయ, సందేశసారం. గురుకుల సంప్రదాయంలో సంగీతశిక్షణ భారతీయ విద్యావ్యవస్థలో గురుకుల సంప్రాదాయం, గురుశిష్యుల అవినాభావసంబంధం - ఎక్కువ మేరకు సంప్రదాయ సంగీత కళలో కూడ ప్రవేశించింది. యిది, గురువుకి, శిష్యుడికి కూడ అధ్బుత ప్రభావ, ప్రేరణలను కలుగజేసింది అనే చెప్పాలి. సంప్రదాయ సంగీతకళాజగతికి వయోవౄద్ధులు, గురువౄద్ధులు అయిన శ్రీ నేదునూరి కౄష్ణమూర్తిగారికి ప్రత్యేకస్థానం ఉంది అని వేరే పరచయం చేయవలసిన అవసరం లేదు, రాదు. నేదునూరి వారి జీవనతరంగం బాల్యంలోనే సంగీతకళాభ్యాసం ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రామమూర్తి పంతులు,విజయలక్ష్మిలకు 10 అక్టోబర్ 1927 న నేదునూరి కౄష్ణమూర్తి జన్మించారు. బాల్యంలో మాతౄమూర్తి మధుర సంగీత నాదఝరి, వీనులవిందు కలుగజేసేది అని చెప్పుతూ, మధురగాత్ర సంగీత విద్వన్మణి కనుకనే, ఆమె అభ్యాసం, శిక్షణలను అందించిన, స్వీకరించిన తీరు, మంచి పునాది అయిందని తరచు చెప్పడం జరుగుతూంది. తల్లితోపాటు, మేనమామ నుంచి సంగీత వారసత్వం పుణికిపుచ్చుకున్న ప్రతిభామూర్తి. ఒక పద్ధతి ప్రకారం సంగీతాభ్యాసం నోచుకోని నేదునూరికి ఆధ్యాత్మ రామాయణంతోపాటు ప్రముఖ సాహిత్యమంతా, యింటి వద్దనే అందుకుని మెలకువలను పొందారు. 'ద్వారం' వారి శిష్యరికంలో - వాయులీనం నుంచి గాత్రసంగీతం పదమూడేళ్ళ ప్రాయంలో, కుటుంబ స్నేహితుడి ప్రమేయంతో విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో, ప్రముఖ వాయులీనసంగీతంలో ప్రతిభను పొందాలన్న కోరిక తీరకుండా, గుర్తింపు పొందిన గాత్రధోరణి మూలాన, గాత్రసంగీతంలోనే శిక్షణ పొందడం మేలన్న ఆచార్యుల సలహాలనే ఆనాడు పాటించారు. ద్వారం నరసింహారావు, వైలన్ ఆచార్య విద్వాంసులు వాదనం చేస్తూంటే, నేదునూరివారు గాత్ర సంగీతం ఆలపించేవారట. నాలుగేళ్ళ శిక్షణ పిదప కూడ, ఆచార్యుల సలహా అదేనని, గాత్ర సంగీత రంగాన్ని మాత్రం వదలవద్దని సలహా చెప్పడం జరిగిందన్నారు. 1942 లో ప్రారంభమైన సంగీత - వాయులీనం, గాత్రం లో - శిక్షణ ప్రారంభం కాగా, 1945 లో గాత్రసంగీత కచేరేని యివ్వడం జరిగింది. యాదౄఛ్ఛికంగా శ్రీకారం పలికిన సంగీత కార్యక్రమం అనుకున్నామని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అన్న కవివాక్కులా, కాకినాడ లో సరస్వతీ గానసభ నిర్వాహకులు, ప్రకటించిన మహాలింగంగారి వాయులీనసంగీత కార్యక్రమం జరగడంలో జరుగున్న తీవ్ర జాప్యం వల్ల, చాల ఆందోళనతో పచార్లు చేస్తున్న తరుణంలో. సంగీతససికసభలో కనిపించిన నేదునూరివారిని నిలయవిద్వాంసునిగా ఉపయోగించుకోవలన్న భావన తట్టడం, వెంటనే, నేదునూరిని నేరుగా వేదికపైకి నెట్టడం తౄటికాలంలో జరిగిపోయాయి. ఫలితంగా, నేదునూరివారి ఆనాడు సరస్వతీసభని, సంగీతసరస్వతిని ఆనందంలో ముంచెత్తారు. ఆయన ప్రతిభావంతమైన గళసంపదతో, అధ్బుతప్రతిభను ప్రదర్శించి, అందరి ప్రశంసల్ని, మన్ననల్ని, తొలికచేరీలోనే సంపాదించడం అసామాన్యం. సంగీతజగతిలో మరొక విశిష్ట కళాకారుడు ఉదయించాడు. ఆయనే - నేదునూరి కౄష్ణమూర్తిగారని ముక్తకంఠంతో వరస కలిపారు. పినాకపాణి - గురుబాణి 1949-62 మధ్యకాలంలో డా. శ్రీపాద పినాకపాణి గారి గురుత్వంలో, సంగీతాధ్యయనం, జీవితంలో అధ్బుతమైన, మరపురాని పర్వం అని నిత్యం భావిస్తారు. నేదునూరివారి పట్టుదలను చూసి, విశిష్ట సంగీత విద్వాంసుడుగా గుర్తింపు వచ్చినా కూడ, సంగీతాన్ని మరింతగా అభ్యసించాలన్న కోరికకు పులకించి, పినాకపాణి ఆనందభరితులయ్యారు. అరియకూడి, ముదిగొండ వెంకట్రామయ్యర్ ల విశిష్ట శైలిని అవలోకనం చేసుకుంటూ, సెమ్మనగుడి, జి.యన్.బాలసుబ్రమణ్యన్, అలతూర్ సోదరులు, మధురైమణి అయ్యర్ లాంటి ప్రముఖుల ప్రత్యేక పరంపరను అవగతం చేసుకుంటూ, తన ప్రస్థానాన్ని నిర్మించుకోవడం జరిగింది అన్నది సంగీత కళాప్రపంచం వెల్లడించిన వాస్తవం. పినాకపాణి అభ్యాసశైలిని వివరిస్తూ, రాగాన్ని ఆలాపించి, సంచార సంగతులను ప్రారంభిస్తూ, మనోధర్మరీతిని ముందుకు సాగమని సర్వదా సలహాలను అందుకునే విధానం ప్రభావితం చేసిందంటారు. ఈ పద్ధతిని పదేపదే పునరావౄతం చేయడం పట్ల, సంగీతజ్ణానం సుస్థిరమై నిలచిందని అభిప్రాయపడ్డారు. తొలిదశలో, క్రమం తప్పకుండ రోజుకు కనీసం ఆరు గంటలు అభ్యాసం చేసినది, క్రమేపీ, రెండుకి తగ్గిపోయిందని చెబుతూ, సంగీతాన్ని నేర్పడం కూడ శిక్షణ కిందే వస్తుందంటూ, ఒక విద్యార్ధిగా తన అనుభూతిని సవినయంగా ప్రకటించిన సందర్భాలు అనేకం. డా. పినాకపాణి 'గమ, రవై'ల మిశ్రమ సమన్వయంతో, 'అరియకుడీ శైలిలో గానం చేసేవారని, నేదునూరి వారు ప్రభావితమైన అంశంగా చెబుతూంటారు. నేదునూరివారికి ప్రముఖ వైలన్ విద్వాంసులు, లాల్గుడి జయరామన్ తో ఉభయతారకమైన జూగల్బండి కచేరీలు అనేక సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగి, ఎవరికివారు తమతమ ప్రతిభకు సానపెట్టుకున్నారు. 1951 లో శ్రీకారం చుట్టబడిన ద్వివిన్యాసం బలవర్ధకమైంది. జయరామన్ నేదునూరి దగ్గరకు వచ్చి, మీకే భగస్వామ్యం వహిస్తాను అని చెప్పడం మరువలేని భావన. ఒకసారి లాల్గుడివారు తన అనుభవాన్ని చెబుతూ, చెన్నైలో శ్రీకౄష్ణ గానసభలో జరుగుతున్న కచేరీలో, అతివిస్తారంగా ప్రదర్శించిన 'కాపీరాగం' పూర్తయ్యాక, సంప్రదాయబద్ధంగా వైలన్ విద్వాంసుడు రాగాన్ని కొనసాగించవలసిన దానికి బదులుగా, పొడిగించడానికి నిరాకరించడమే కాక, సభానంతరం, లాల్గుడివారు, నేదునూరివారు రాగ సంపూర్ణత్వాన్ని అందించాక, కొనసాగించడానికి ఏమీ మిగలలేదు అని చెప్పడం సాటి కళాకారుని ప్రతిభను అసూయరహితంగా ప్రకటించడం ఉద్దండులకే సాధ్యం. అన్నమాచార్య సంకీర్తనలకు అష్టోత్తర స్వరరచనలు నేదునూరి కౄష్ణమూర్తిగారు శ్రీ వెంకటేశ్వర కళాశాలలో వున్నప్పుడు, అనేక అన్నమాచార్య కీర్తనలకు స్వరరచనను చేసిన సంగతి సంగీతరసికులకు విదితమే. ఆయన స్వరపరచిన ఎన్నో కీర్తనలు చాలా ప్రఖ్యాతమయ్యాయి. ఒకసారి, సంగీతవిదుషీమణి ఎమ.ఎస్.సుబ్బలక్ష్మిగారు నేదునూరివారు రేవతీరాగంలో 'నానాటి బతుకు నాటకమూ అన్న కీర్తనను విని, ఈ ఒక్క కీర్తన చాలు, మీకు సంగీతకళానిధి సత్కారానికి అర్హతకు చాలు అన్న మాటలు వర్ణనాతీతాలు. ఈ భావనకు ప్రతిస్పందనలో, నేను స్వరపరచిన అన్నమాచార్య కీర్తనలు మీ గాత్రంతోనే ప్రఖ్యాతమయ్యాయి అని చెప్పడం కూడ సంతోషదాయకం. ఈ విద్వత్తుని గమనించి, గుర్తింపుగా తిరుమల-తిరుపతి దేవస్థానంవారు నేదునూరి వారిని ఆస్థానవిద్వాంసులుగా నియమించడమే కాక, ఆయన స్వరపరచిన కీర్తనలను ప్రచురించడం కూడ జరిగింది. మొత్తానికి, 900 కి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు నేదునూరివారు, వారి పరంపర స్వరపరచడం జరగడం హర్షనీయమైన సంగతి. తంబుర, వేదిక తన్మయపరుస్తాయి సంప్రదాయానికి నిదర్శనం, రాజీలేని రాగధోరణుల్ని నిత్యం పాటించే నేదునూరివారు ఎన్నుకున్న శైలికి ఎన్నడూ మరోలా ప్రదర్శించకపోగా, సంగీతంపట్ల నిశ్చితమైన అభిప్రాయాలను ప్రకటించేవారు. అవకాశాలను ఎందరో పొందుతున్నా, సుశిక్షితులైనా, స్వరాలాపనలో రాగసౌరభాల్ని ప్రకటించలేకపోతున్నందుకు కారణం ఏమిటన్న ప్రశ్నకు, నేదునూరివారు సమాధానంగా - ఆయన అనుసరించే విధానాన్ని వివరిస్తూ - వేదికనాక్రమించిన క్షణం తంబూరాస్వరసహితమైన సమ్మోహనం ఆవరిస్తుందని, తన్మయుడిగా మారిపోతాన్నారు. తాను రసికులముందు మాత్రమే కచేరీని ప్రస్తుతిస్తానని, కేవలం వారికొరకే పాడడం జరగదని చెప్పారు. వౄత్తిలో భాగంగా భౄతిని స్వీకరించినా, సంగీతకళను స్వప్రయోజనాలకై ఎన్నడూ వినియోగించలేదన్నారు. అష్టపదింతల వసంతాల జీవనం - షష్టిపూర్తి చేసుకున్న సంగీతకళాజీవనం క్రితం సంవత్సరం, చెన్నై సంగీత మహాసభల్లో, 80 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా, నేదునూరివారికి జరిగిన సన్మాన, సత్కార కార్యక్రమం. ఏ ఆంధ్రసంగీతకళాకారుడికి జరగలేదన్నది నగ్నసత్యం. సంగీతప్రస్థానానికి షష్టిపూర్తి జరుపుకోవడం కూడ ప్రత్యేకతే. ప్రముఖులు, నేదునూరివారికి అత్యంత సన్నిహితులు, సంగీతరసికులు, సద్గురు కందుకూరి శివానందమూర్తిగారి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకి మరింత శోభను, నిండుతనాన్ని చేకూర్చాయి. ఆ సందర్భంగా, నేదునూరివారి గురువుగారు శ్రీపాద పినాకపాణిగారు 94 ఏళ్ళ ప్రాయంలోకూడ సంగీతమే ఊపిరిగా గడపుతున్నవారు పంపించిన సందేశం కూడ ఉత్సవాలకి నిండుతనం చేకూర్చాయి. డా.మంగళంపల్లి బాలమురళీకౄష్ణగారు గతానుభవాన్ని వివరిస్తూ, నేదునూరివారి కచేరీకి తాను వైలన్ వాద్య సహకారాన్నందించడం మరువరాని అనుభూతిని వివరిస్తూ, నేదునూరివారు శతాయుష్కులవుతారని ప్రకటించారు. అగణిత సత్కారాలు, పురస్కారాలు సంగీత చూడామణి, సంగీత కళాసాగర, స్వరవిలాస్, నాదసుధ, గానకళానిధి, భారత ప్రభుత్వపు సంగీత నాటక అకాడమీ పురస్కారం, సప్తగిరి సంగీత విద్వన్మణి, సంగీత కళాసాగర, శ్రీ కళాప్రపూర్ణ, సంగీతకళానిధి, అన్నమాచార్య విద్వన్మణి, నాదనిధి, సంగీత రత్నాకర, స్వరనిధి, సంగీతసామ్రాట్, రాజలక్ష్మీ పురస్కారం, సంగీత విద్యానిధి, యివికాక, మాటల్లో చెప్పలేని సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు, ఎన్నో, మరెన్నో. ఈ పైన సమర్పించే సత్కారాలకు పేర్లను వెదుక్కునే పరిస్థితి, మన నేదునూరివారి విషయంలో, రాక తప్పదు. శ్రీ నేదునూరి కౄష్ణమూర్తిగారి పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు భగవంతుడు చిరాయువుని, సుసంపన్నతని, పుష్కళమైన అరోగ్యాన్ని అందించాలని, మరింతగా కళాప్రతిభతోపాటు, సరిసములైన ప్రశిష్యులను వౄద్ధిపరుస్తారని ప్రార్ధిస్తూ, ఆ కళామతల్లి సాన్నిధ్యంలో, ఆశీర్వదించాలని, ప్రణామాలు సమర్పించుకుంటూ, ఈ సందర్భంగా తెలుగురథం మనసారా ఆశీర్వదించమని కోరుకుంటూ, పుట్టినరోజు శుభాకాంక్షలను స్వీకరించమని కోరుకుంటూ ... సెలవు. కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Friday, October 9, 2009
ప్రపంచ తపాలా దినోత్సవం - 9 అక్టోబర్
ప్రపంచ తపాలా దినోత్సవం - 9 అక్టోబర్
కాళిదాసు మేఘసందేశం మొదటి ప్రయోగం
కాళిదాసు మేఘసందేశం మొదటి ప్రయోగం
మహాకవి తన ప్రముఖ రచన 'మేఘ సందేశం (దూతం) కావ్యంలో ప్రియా విరహంతోబాధపడుతూన్న ఒక యక్షుడు మేఘం ద్వారా ప్రియురాలికి సందేశం పంపడం ఆనాటి తపాలాశాఖవారి పని మేఘం చేత చేయించాడు. దక్షిణాన్ని ఉన్న రామగిరినుండి ఉత్తరాన్ని ఉన్న అలకా పట్టణానికి మేఘుడు ప్రయాణం చేయవలసిన మార్గం యిప్పుడు మనం ఉత్తరాలకు వ్రాసే విలాసంలో 'వయా' లాగ అనుకోవచ్చు. అలకాపురివర్ణనం, మేఘుడు యక్షుని ప్రియురాలికి అందజేయవలసిన సందేశం ఉన్నాయి. యిది ఆనాట బహుళ ప్రచారమైన ప్రయోగరచన.
మన పురాణాల్లో ఆకాశవాణి, దివ్యవాణి సందేశ సమాచారాలు
మన పురాణ ప్రబంధాల ద్వారా, ముందస్తు సమాచారాన్ని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించడం సర్వ సామాన్యంగా కనిపించే విషయాలు. కంసుడి కి అష్టమగర్భసంజాత చేతులద్వారా మరణం సంభవిస్తుందన్న వార్త కూడ ఆకాశవాణి ద్వారా చెప్పించబడింది.
అందరికీ కుశల సమాచారం
"కుశలమా ? నీకు కుశలమేనా ? ఇన్నినాళ్ళు వదలలేక, మనసు నిలుపుకోలేక, ఎదో ఎదో వ్రాశాను, ఎన్ని కబురులంపేనో, ఎన్నొ కమ్మలంపేనో, అంతే .. అంతే" అని బలిపీఠం చిత్రంలో ప్రముఖకవి దేవులపల్లి కౄష్ణశాస్త్రిగారి కలంనుంచి, విరహాన్ని ప్రేమలేఖద్వారా దంపతులకు విరహాన్ని సన్నగిల్లేలా చేశారు. ఈ విరహవేదనను తగ్గించి పుణ్యం కట్టుకున్నది మాత్రం తంతి, తపాలా శాఖవారు.
సుఖదు:ఖాల మిశ్రమం వార్తాప్రవాహం
ఉభయకుశలోపరిని అందిపుచ్చుకునే దశదిశల్లో ముఖ్య సాధనంగా తపాలాశాఖ వారి కౄషికి సమాంతరం, పర్యాయపద్ధతి యించుమించు లేనేలేదని చెప్పాలి. అభినందనలు, అభివందనాలు, విజయాలపట్ల సంతోషాన్ని ప్రకటించే సమాచారం, ప్రతినిత్యం, సత్వరంగా రాకపోకలని సాగించడం తపాలాశాఖ వారి ముఖ్య కార్యక్రమాలు అని చెప్పాలి.
ప్రపంచ వ్యాప్తంగా తపాలా కార్యకలాపాలు
రెండువేల సంవత్సరాలకు పైగా విరాజిల్లుతున్న సమాచార సేవలు, 6.6 లక్షల పోష్టాఫీసులు, 5 మిలియన్ల ఉద్యోగులద్వారా, 436 బిలియన్ల తపాలా సమాచారపు సరుకుని బట్వాడా చేస్తున్నట్లు సమాచారం. 6 మిలియన్ల పార్శిళ్ళను పంపించడం, అందుకోవడం, కావలసిన ధనం కూడ వీటితోపాటు కదలడం ప్రత్యేకతలనే చెప్పాలి. ఆధునికయుగంలో సమాచార రంగం ద్వారా అనేక వింతలూ, విడ్డూరాలూ జరగడం కూడ మనం అందరం గమనిస్తున్న విషయం. యువతకు నేటి మన్మోహనంగా భావించే 'హరీశ్ పాఠఋ పుస్తకాన్ని 2.5 మిలియన్ల కాపీలు తపాలాశాఖ ద్వారా యింటర్నెట్ సహాయం ద్వారా ఒకేరోజున జూలై 2007 నెలలో జరగడం వింతలో వింతగా భావించవచ్చు. యిది మచ్చుతునక మాత్రమే. ప్రతీ సంవత్సరం నూతనసంవత్సరం, సంక్రాంతి, దీపావళి, రంజాన్, క్రిష్టమస్ లాంటి పండుగలకు బంధుమిత్రులకు శుభాభినందనల్ని పంపడంలో తపాలాశాఖ వారి సేవలు వర్ణనాతీతాలు. ఈ సేవలకు విలువలను కట్టడం ఎవరికైనా సాధ్యమా!
ప్రపంచ తపాలా దినోత్సవం
కాళిదాసు మేఘసందేశం పద్ధతి నుంచి, ప్రస్తుతపు తపాలా వ్యవస్థ వచ్చింది. 1874 వరకూ కొనసాగిన ఈ వ్యవస్థలో సమూలమైన మార్పులకు విశ్వవ్యాప్తంగా కౄషి జరపాలని కంకణం కట్టుకున్నారు. ఈ నాటి వరకూ తపాల సేవల నిమిత్తం దేశ విదేశాల మధ్య కుదుర్చుకున్న ప్రత్యేకమైన ఒప్పందాలద్వారా తపాలాసేవలను జరుపుకునేవారు. ఈ పద్ధతిలో తలేత్తిన సమస్యలను మెరుగుపరచుకోవాలన్న తలంపుతో, అంతర్జాతీయ తపాల సంస్థను స్థాపించాలని, అమెరికా పిలుపునిచ్చింది. ఆచరణలో భాగంగా 1874 అక్టోబర్ 9 న సాధారణ పోష్టల్ యూనియన్ ను స్విట్జర్లాండ్ లోని బెర్న్ నగరంలో స్థాపించడం జరిగింది. 1878 లో ప్రపంచ తపాల కేంద్రంగా మార్చారు. జపాన్, టోక్యో లో 1969 నుంచి మాత్రం అక్టోబర్ 9 న ప్రపంచ తపాలా దినోత్సవంగా నిర్వహించాలని నిశ్చయించారు. భారతదేశంతో సహా సుమరు 200 దేశాలు సభ్యత్వంతో తపాలా కార్యక్రమాలను మరింత మెరుగ్గా నిర్వహిస్తున్న వైనం సర్వవిదితమే.
మెరుగైన సేవలు, ప్రదర్శనలు
ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా తపాలాశాఖవారు అనేక ప్రత్యేక సదుపాయాలను ప్రకటించడం, ఉన్నవాటిని మరింత మెరుగ్గా సేవలను అందించడం, పోష్టల్ స్టాంపుల ప్రదర్శనలు, సమావేశాలు, ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమాల్ని నిర్వహించడం పరిపాటిగా మారింది.
మూడు దశాబ్దాల విశ్వవ్యాప్తంగా ఉత్సవాలు
ప్రపంచ తపాలా కేంద్రం, యునెస్కో భాగస్వామ్యంతో 38 ఏళ్ళగా అంతర్జాతీయ స్థాయిలో యువతకు ఉత్తరాల్ని రాయడంలో పోటీలు నిర్వహించడం కూడ ముఖ్యాంశం అయింది.
సన్నగిల్లుతున్న పత్ర సమాచారాది తపాలా కార్యకలాపాలు
మారిపోవురా కాలం మారిపోవురా, మారుట దానికి సహజమురా అన్నట్లు మారుతున్న సమాజంపట్ల, సమాచారాన్ని వినియోగించుకునే సాధనామాధ్యమాలు కూడ మారుతున్న వైనాలు తపాలాశాఖ తన ప్రణాళికలను కొత్తపుంతలను తొక్కించడం తప్పడంలేదు. ప్రభుత్వేతర సమాచార వ్యవస్థ తీవ్రతరం దాలుస్తున్న మార్పులో, జాతీయం చేసే పరిస్థితిని దాటి బయటపడడం కష్టతరంగా భావిస్తోంది. ఈ పైనుంచి ఉమ్మడి భాగస్వామ్యం అనివార్యస్థితికి రాజీపడకతప్పక పోవచ్చు. విజాతీయకరణం, సరళీకరణం, ప్రపంచీకరణం, త్రిసూత్రపధకాలతో ప్రపంచాన్ని ఢీకొడుతున్న తరుణంలో తపాలా వ్యవస్థలో కూడ సమూలమైన మార్పులను ఆహ్వానించి, సేవలను మరింత నాణ్యతరంగా, మెరుగ్గా, నిత్య, సత్య, సత్వరంగా అందించడం తప్పితే అన్యధా శరణం నాస్తి అన్నది సత్యం, శివం, సుందరం.
కొసమెరుపు
సంప్రదాయం తాతముత్తాలనాటి మూలధనం. జాతిజీవనగతికి జీవనాళిక. ఎంత పక్షి ఆకాశం మీద ఎగిరినా, సాయంకాలానికి తన గూటికి చేరుకోక తప్పదు. అది జాతీయత, సంప్రదాయం, అన్న భావాల్ని మన కవిశ్రీనాధులు పలవరించారు. తపాలాశాఖవారు పురాణసంస్కౄతిలో మేఘసందేశం ద్వారా సమాచారాన్ని అందించి, క్రమేపీ పోష్టుకార్డులు, యిన్లాండ్ కవర్లు, కవర్లు, మనీఆర్డర్లు, టెలీగ్రాం, టెలీఫోన్లు, ఫోనోగ్రాం, పార్శిళ్ళు, శుభసందేశాలు, జనన మరణ వార్తలు, ఎన్నో, మరెన్నో జరిపారు. మార్పులో భాగంగా, పోటీరంగాన్ని తట్టుకునే దిశలో, తపాలాశాఖవారు 'మేఘదూట్ పోష్టుకార్డ్ లను 25 పైసలకు ప్రవేశాపెట్టారు తాజాగా. తపాలాశాఖవారు ఆధునికసేవల్లో భాగంగా, బ్యాంకు సేవలను కూడ అందించారు. మహిళలకు, బీదప్రజలకు, గ్రామీణులకు మరిన్ని సేవలను, మరింత ప్రతిభావంతంగా అందించేందుకు దిక్షాకంకాణాల్ని ధరించి, ముందుకు సాగుతున్నారు. వారిని మనం అందరం సాదరంగా ఆహ్వానిద్దాం. అభినందిద్దాం. సేవల్ని అందుకుందాం.
ప్రపంచ తపాలా వారోత్సవాలు, దినోత్సవం సందర్భంగా మన దేషంలోని తపాలా షాఖ, సిబ్బంది, తదితర సంబంధిత రంగం యావత్తూ, సమగ్ర సమాచార వ్యవస్థకు ప్రతీ వ్యక్తీ, సంస్థ తనవంతుగా విధుల్ని నిర్వర్తిస్తారనీ, మరింత మెరుగైన సేవలను అందిస్తారని ఆషిస్తూ అభినందనల్ని అందజేస్తూ, తెలుగురథం కూడ సమాచారాన్ని తనదైన షైలిలో అందించడానికి తన వంతు కౄషి సలుపుతుందని వాగ్దానం చేస్తూ -.
కొంపెల్ల - అధ్యక్షులు - తెలుగురథం
అడవి బాపిరాజు (1895 - 1952) - 8 అక్టోబర్ - జయంతి
అడవి బాపిరాజు (1895 - 1952) - 8 అక్టోబర్ - జయంతి సందర్భంగా సాహితీనీరా
త్రివేణీకళాసంగమం - బాపిరాజు
శ్రీ బాపిరాజుగారు కవి, గాయకుడు, చిత్రకారుడు. మూడు కళలను ముద్దచేసి ఆయన అద్భుతాలైన గేయాలను రచించారు. గానంలో స్థాయిని ప్రేరేపించి, కవితలో భావాన్ని పోషించి, చిత్రంలో రూపాన్ని నిరూపించిన సంపూర్ణమైన కళాస్వరూపాన్ని తయారుచేశారు. వాక్కునకందని రూపాన్ని చిత్రంలో, చిత్రానికందని భావాన్ని వాక్కులో పట్టి యివ్వగల నేర్పాయనకు సహజసిద్ధం. ఆయన వరద-గోదావరి అద్భుత ఖండకావ్యం. ఆస్వాల్డు కూల్డ్రే దొర అంతేవాసిగా సాహిత్యం, చిత్రకళల్లో ప్రావీణ్యమే కాక ప్రభావాన్ని కూడ అధికంగా పొందారు.
మన బాపిబావ
ప్రముఖగీతం 'బావా బావా పన్నీరూ అన్నపాట స్మరించని తెలుగుగుండె లేనేలేదని చెప్పవచ్చు. ఆ పాట రాసిన తీరు యిలా వుంటుంది.
బావా! బావా! పన్నీరు
"బావా! బావా! పన్నీరు
బావను పట్టుక తన్నేరు
మూడు గుద్దులు గుద్దేరు
మూలన మంచం వేసేరు
ముంతెడు గంజి యిచ్చేరు. బావా
వీధి వీధి తిప్పేరు
వీశెడు గంధం పూసేరు
చావిడి గుంజకు కట్టేరు
చప్పిడి గుద్దులు గుద్దేరు బావా
పల్లేరు తెప్పించి పక్క వేయండీ
నల్లేరు తెప్పించి నలిచి విడువండీ
నల్లేరు చేతాను నయము కాకుండీ
దూలగొండి తెచ్చి దులిపి పంపండీ బావా
సన్నిహితులు, తోటి కళాకారులు బాపిరాజుగారిని, బాపిబావ అని ముద్దుగా పిలుచుకోవడంలో వెనుక దాగివున్న రహస్యం - బావా బావా పన్నీరు అని బావలను పట్టించే హాస్య రసగుళిక.
బాపిరాజు జీవనప్రస్థానం
పాత్రికేయుడు, రచయిత, చిత్రకళాకారుడు, గాయకుడు, నాటకకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, వెరసి అడవి బాపిరాజుగారిని బహుముఖప్రతిభాసంపన్నుడు అని ఖచ్చితంగా చెప్పితీరాలి.
కౄష్ణయ్య-సుబ్బమ్మ దంపతులకు 8 అక్టోబర్ 1895 న జన్మించారు. పశ్చిమగోదావరిజిల్లా, భీమవరం లో జన్మించగా, హైస్కూలులో చదివుతోపాటు బి.ఎ. తర్వాత బి.యల్. చదివారు. 1920లో సత్యాగ్రహంలో జైలుకు వెళ్ళారు. కొంతకాలం న్యాయవాది వౄత్తిని నిర్వహించారు. యితర రంగాలలో కౄషి చేయాలన్న ఉద్దేశ్యంతో న్యాయవాది వౄత్తిని విరమించారట. బందరు నేషనల్ కాలేజీలో అధ్యాపకత్వం (1934-39), హైదరాబాదు ప్రచురణ - మీజన్ తెలుగు దినపత్రిక కు సంపాదకునిగా, విజయవాడ-ఆకాశవాణి లో కేంద్ర సలహాదారుగా, నవ్యసాహిత్య పరిషత్తుని స్థాపించిన వారిలో ప్రముఖులు, చిత్రకళను అభ్యసించడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ను స్థాపించారు.
బహుముఖ కళాధారణం
1922 లో సహకార నిరాకరణోద్యమంలో ఏడాదిపాటు జైలులో వున్నారు. ఈ కాలపు జైలు అనుభవాలను తమ రచన 'తొలకరీ నవలలో ప్రతిబింబనం చేశారు. జైలులోనే శాతవాహనుల కాలంనాటి కధలను తీసుకుని తమ సుప్రసిద్ధ ఆంధ్ర చారిత్రక నవలను 'హిమబిందూ రచనను ప్రారంభించారు. ఈ ధారావాహికకధనం 1924-25 లో 'శారదా పత్రికలో వెలువడింది అని ఆరుద్రగారు తన సమగ్రాంధ్ర సాహిత్యంలో చెప్పడం కూడ జరిగింది. నూరు అధ్యాయాల నవల అవడం విశేషమే. నవలాకారునిగా బాపిరాజుగారు ఆధునికయుగంలో అజరామరమైన ప్రతిభను ప్రదర్శించారు. కవిగా, చిత్రకారునిగా, కధారచయితగా అందించిన రచనలు జమీందారీయుగంలో లబ్ధప్రతిష్ఠులవడం జరిగింది. ఈ వ్యవధిలో వ్రాసి, ప్రచురణ జరిగిన కధలు - పేరులేని పాప, యుగములనుండి నీకొరకు కనిపెట్టుకొని యుంటిని, నాగరాజు, నరపతి, గుడ్డిపిల్ల కధలు ఆనాటి ప్రముఖప్రచురణలైన, భారతి, ఆంధ్రపత్రిక లో దర్శనం యిచ్చాయి. అంతే కాక, 'అంజలీ, 'రాగమాలికా, 'తరంగిణీ పేర్లతో బాపిరాజుగారి కధాసంపుటాలు వచ్చాయి.
ఎంకి, కిన్నెరసాని చిత్రణారూపాలు
బాపిరాజుగారిలోని చిత్రకళాకారుడు, ప్రముఖులు నండూరి సుబ్బారావు గారి 'ఎంకిపాటలూ, విశ్వనాధ సత్యనారాయణ గారి 'కిన్నెరసాని పాటలూ అంశాలకు విలువను పెంచేరీతిలో చిత్రాలను ఆనాటి బాపుశైలిలో వేశారు అన్నదాంట్లో సంశయం లేదు. బాపిరాజుగారికి చిన్నవయసునుంచే కవితలు వ్రాసే అభిరుచి వుండేదిట.
బాపిరాజు గారి రచనలు
అడవి బాపిరాజుగారు అన్నవెంటనే, మనకు తెలుగుసాహిత్యంలో, సాహితీరసికులకు వెనువెంటనే స్ఫురించే రచనలు ఉన్నాయి. ప్రత్యేకంగా నవలలు స్మరణకు రాకమానవు.
నవలలు - నారాయణరావు, తుఫాన్, గోనగన్నారెడ్డి, కోనంగి, హిమబిందు.
నారాయణరావు నవలకు ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారు పురస్కారం లభించింది.
రేడియో నాటికలు - దుక్కిటెద్దులు, ఉషాసుందరి, భోగిరలోయ.
కధలు - తూలికానౄత్యం, హంపీశిధిలాలు, శిల్పబాల, వీణ.
చిత్రదర్శకత్వం వహించినవి - మీరాబాయి, అనసూయ, ధ్రువవిజయం. అన్నీ పౌరణీకాలు అన్నది గమనించదగ్గది.
బాపిరాజుగారి ఎన్నో కధలు, గేయాలు రచించారు. కనడభాషలోకి కూడ అనువాదం చెంది పేరుపొందాయి. తొలకరి, గోధూళి అను పేర పదకవితలను, శశికళ అను పేర పద్యకౄతులను రచించారు.
అడవి బాపిరాజు గారి సాహితీప్రతిభను ఆధునిక యుగపు సాహిత్యంతో అనుసంధానించి, సరియైన విశ్లేషణ చేయవలసిన అవసరం ఎంతైనా వుంది అని ఆరుద్ర ప్రగాఢంగా చెప్పారు.
ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయాలు, ప్రయోగాలు లో బాపిరాజు సాహితీ విష్లేషణ
ప్రముఖ కవి డా. సి. నారాయణ రెడ్డిగారు బాపిరాజు గారి సాహిత్యం గురించి కావించిన ప్రస్తావన, విష్లేషణ పరిషీలంచదగ్గది.
భావకవిత్వంలో కవులు రూపొందించుకున్న ఉహాప్రేయసీసౄష్టి 'షషికళాగా బాపిరాజు గారిని కూడ వరించింది అన్నారు. షషికళ పై రెడ్డిగారు సుదీర్ఘ విష్లేషణ కావించారు.
బాపిరాజుగారి స్వప్నమూర్తి సౌందర్యావధియైన షషికళ ఒకవిధముగా ఈ కవికీమె ఇష్టదేవత. భావకవులలో వారి హితులందరికి ఇష్టదేవతలున్నారని, తనబ్రతుకు ష్రుతికలిపి వలపించు చతుర 'షషికళా యని వారే వ్రాసుకొన్నారు. 'ఎండిమియాన్క్'
అను షీర్షిక క్రింద వారు వ్రాసిన గేయములో 'షషికళా' సాక్షాత్కార వౄత్తాంతమున్నది. తమ గురువగు కూల్డ్రే గారితో బాపిరాజుగారు తీర్థయాత్రలు చేయుచుండగా ఒక సంఘటన జరిగిందట. నదిలోయలో, వెన్నెలలో బండమీద మేనువాల్చి నిదురపోవు బాపిరాజుగారి పై ఒకానొక వెన్నెల వెలుగో, అప్సరసయో వ్రాలినది. దానినే కూల్డ్రేగారు చిత్రముగా రచించి 'ఎండిమియాన్క్' అని పేరుపెట్టారట. ఎండిమియాన్ గ్రీకుదేషపు గోపబాలుడు, అతి సుందరుడు, ఒంటరిగా నిద్రించుచున్నప్పుడు ఒక అప్సరస అతనిని ఫ్వలచివచ్చి అతనిపై వ్రాలినదట. ఈ కథను కీట్స్ మున్నగు కాల్పనికకవులు కావ్యరూపమున చిత్రించినారు. బాపిరాజుకు జరిగిన వౄత్తాంతము దీని పోలియుంది. కలలో తనమీద వ్రాలిన ఆ దివ్యసుందరికే, ఆ అపూర్వ సౌందర్యరేఖకే బాపిరాజు గారు 'షషికళా అని పేరు పెట్టుకున్నారు. ఆమె కొరకొక చిన్నలోకాన్ని సౄష్టించుకున్నారు.
చంద్రలోకం తూర్పుదెసలో, సూర్యలోకం పష్చిమంలో, చిన్నిలోకం ఒకటీ ఉన్నదే, ఓనా వెన్నేల చిన్నారి పడుచా పడుచా, ఆ లోకమేలే కన్నెరాణివి నువ్వే నువ్వేనే.
లోకాన పూజాపీఠం అపర్చి, ఆసీనురాలినిజేసి, పట్టంగట్టి, 'నా అమౄతమూర్తిని, ఆత్మమధ్యవు నీవే' అని కీర్తించడం కూడ జరిగింది.
ఆమె ప్రియురాలే కాదు, గురువు, షిష్యురాలు, సూర్యసుత, చంద్రబాల, గానషిల్పచిత్రాదికళామూర్తి. నగలలంకరించని కల, బాణి, వాణి, రాణి.
కొండలుకోనల్లో గాలింపులు, దేవాలయం నిర్మించుకోని ఆమెకొరకు ఎదురుచూపులు, కాని సాక్షాత్కరించలేదు, బ్రతుకు అన్వేషణగా మారింది, భౌతిక రూపబంధాల్ని తెరగా భావించుకున్నాడు, బాపిరాజు.
ధవళమైనదీ, తలపుదాటినది, దానికి మొదలూ చివరాలేనిది, నీకు ఇవతల, నాకు అవతల, తెర ఉన్నాది బాలా - అని బాధపడినాడు.
కాలాన్ని కట్టేసి కాలికిందనురాతు నాలోన నీవు నిత్య యౌవనపు అంటూ ఆమె దివ్యలీలనే సందర్షించినాడు.
బాపిరాజుగారి షషికళ లొ, స్వప్నదర్షనం, దివ్య సౌందర్యం, సంయోగవియోగానుభవాలు, సమస్త కళాప్రసూనమలతో ఆరాధనతో తాదాత్మ్యంఅ చెందిన వైనం మనకు కనిపిస్తుంది.
అడవి బాపిరాజు గారి కావ్యమాల నుండి మచ్చుతునకలు :
గోధూళి నుండి :
1.చెరువుమెట్లు
చకన్ని చిన్నది చుక్కలరాణై
పాటపాడుతూ పడతి నిలిచినది
తెల్లనిచీరా మెల్లని నడకా
మెళ్ళోహారం తెల్లనిపూవులు
చక్కని చిన్నది
బిందె బుజాన సందెనీటికై
చెర్లో కలువలు నల్లనికన్నులు
కంఠమెత్తినదికలచుపాటలవి
పాటలుపాడుతూ పడతి నిలచినది
చెరువు మెట్లపై చెలియ నిలిచినది
బంగరునీటిలో ప్రతిఫలించినది
సందెచీకటిలో చక్షులుకలిసెను
ఎర్రని పడమట ఇంతివెనుకనే
పాటేభామై భామైపాటై
పాటా భామా పడమటిరంగై
బంగరునీరై పొంగెడి ప్రేమై
చెరువుమెట్లపై చిత్రాలైరీ
చక్కని చిన్నది
2. వరద గోదావరి
ఉప్పొంగిపోయింది గోదావరి తాను
తెప్పన్న యెగసింది గోదావరీ
కొండల్లొ ఉరికింది కోనల్లు నిండింది
ఆకాశగంగతో హస్తాలు కలిపింది
ఉప్పొంగి
అడవిచెట్లన్నీని జడలలో తురిమింది
ఊళ్ళు దండలుగుచ్చి మెళ్ళోన తాల్చింది
వడులతో సుడులతో గరువాల నడలతో
పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తువచ్చింది
శంఖాలుపూరించి కిన్నెర్లు మీటించి
శంకరాభరణరాగాలాపకంఠియై
నరమానవుడి పనులు శిరమొగ్గి వణికాయి
కరమెత్తిదీవించి కదలికే నడిచింది
ఉప్పొంగిపోయింది గోదావరి తాను
తెప్పున్న ఎగసింది గోదావరి
ఉప్పొంగి
కాటూరి వారు అన్నట్లు, అడవి బాపిరాజు గారి ఆత్మ యందలి సౌందర్యబోధయే షశికళ. ఆమె నారాధిస్తూ తన బ్రతుకును, లోకాన్ని సౌందర్యంతో నింపాలనేదే అతని జీవితాషయం.
ఇతర వౄత్తులు
పల్లెవాసుల బ్రతుకులను చిత్రించిన వారిలో బాపిరాజు ముఖ్యులు. గోధూళి అను పాటల సంపుటిలో ఆకుమళ్ళలో పనిచేయు భార్యాభర్తలు (ప్రేయసీప్రియులు) జీవితరేఖలను రమ్యంగా చిత్రించారు.
యెయ్యవేగూడ నా పిల్లా, యెయ్యరోయి గూడ యెయ్యరా ఓ సిన్నిబావా (గూడ వేయడం ఘట్టం).
పాలమ్మపాఆలు తియ్యనిపాలు (గొల్లభామలు), తోటమాలి కూతురు, గౌళ్ళసెల్లాయి కూతురు, గంగిరెద్దులవాడు, ఒంటెద్దుబండివాడు, యిలా ఎన్నో ఉన్నాయి. యెంకి పాటలతో సరిసమంగా ఉంటాయి అనేవి సత్యాలు.
వేయి సంవత్సరాల్క్ వెనకాల కవినోయ్ - అని అనుకున్నా, నిత్య నూతనకవి అడవి బాపిరాజు.
తెలుగుసాహితీకళారంగాన్ని తనదైన ప్రతిభాపాటవాలతో అలరించిన బహుముఖప్రతిభాశాలి - అడవి బాపిరాజుగారు - మన బాపిబావ - 22 సెప్టెంబర్ 1952 న భౌతికలోకాన్ని వీడినా, తెలుగుసాహితీజగతి ఎల్లప్పుడూ ప్రముఖ స్థానాన్నివ్వడమేకాక, దాన్ని భద్రంగా పరిరక్షిస్తోంది అని చెప్పాలి. బాపిరాజుగారి జయంతి సందర్భంగా 'తెలుగురథం' సాహితీ నీరాజనాలను సమర్పిస్తూ ...
కొంపెల్ల షర్మ - అధ్యక్షులు - తెలుగురథం.

Tuesday, October 6, 2009
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం - 5 అక్టోబర్
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం - 5 అక్టోబర్
ఆచార్య దేవోభవ!
జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత ఆచార్యుడు, అతిధిలకు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది మన భారతీయ హైందవ సంస్కౄతి. ఆచార్యుడు, గురువు, ఉపాధ్యాయుడు ఏ పేరుతో పిలిచినా ఒక్కటే. 'ఆచార్య దేవోభవా అన్న వేద హితోపదేశాన్ని అనుసరించి ప్రతి విద్యార్ధి గురువును దైవంగా భావించాలి. సేవించాలి.
గురువు అంటే ఎవరు ?
"గుశబ్దస్తు అంధకారస్యాత్ రుశబ్దస్తన్నిరోధక:
అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే"
అంటే - 'గూ అను శబ్దానికి అజ్ణానమనియు, 'రూ అను శబ్దానికి విజ్ణానమనియు అర్ధం. విజ్ణానంతో, అజ్ణానాన్ని తొలగించడం చేతనే 'గురూ వనేది సిద్ధించిందని శాస్త్రప్రమాణం. మనం అందరూ చిన్నప్పుటినుంచి ప్రతినిత్యం చదువుకునే శ్లోకం - గురుర్బ్రహ్మ: గురుర్విశ్ణు: గురుర్దేవో మహేశ్వర:, గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై: శ్రీ గురవేనమ:" అన్నది కుడ మన సంస్కౄతీపరంపరకు తార్కాణం. గురువు అంటే - ఉపాధ్యాయుడు, బౄహస్పతి, తండ్రి, కులము పెద్ద, కాపాడువాడు అని శబ్దరత్నాకరం విపులీకరించింది. గురువుల్లో - బాధగురువు, బోధగురువు అనికూడ వర్గీకరించారు. గురువు వ్ద్దకూ, తండ్రి ఇంటికీ, సుహౄజ్జనుల ఇండ్లకూ పిలవకుండానే వెళ్ళవచ్చు అని భాగవతం ఘోషెస్తోంది. అంతేకాదు, గురువుకు పూర్తిగా విధేయుడైవుంటే శిష్యుడు తప్పక విజయం సాధిస్తాడు అని స్వామి వివేకానంద చెప్పారు.
ఉపాధ్యాయుడు
ఉపాధ్యాయుడు అంటే - చదువు చెప్పువాడు అనే సామాన్యార్ధముతో పాటు, వేదమును చదివించువాడు అన్ని నిఘంటుకారుడు వివరణ యివ్వడం జరిగింది. ఉపాధ్యాయి, ఉపాధ్యాయ అని కూడ స్త్రీలింగ భావనలో తెలియజేశారు. ఉపాధ్యాయుడు తానింకా నేర్చుకుంటూ ఉంటే తప్ప యధార్ధంగా చ్దువు చెప్పలేడు, దీపం తాను వెలుగుతూ ఉజ్జ్వలంగా ఉంటేతప్ప మరొక దేపాన్ని వెలింగలేదు.
గురుభక్తి ప్రదర్షన
ఉపాధ్యాయుడు లౌకిక జీవనంలో విద్యార్థి దషలో గురుభక్తికి గురవడం సర్వసహజం. నేటి యాంత్రిక జీవన స్థితిగతులలో పరిపూర్ణతనిచ్చే భక్తితత్వాలు ఐదు విధాలుగా చెప్పబడుతున్నాయి. అవి, మాతౄదేవోభవ, పితౄదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న వేదమంత్రత్రయం, నిత్య ఆరాధనీయులై విశిష్టతని చాటుతున్నాయి. అజ్ౙాన తిమిరాంధస్య జ్ౙానాంజన షలాకయాఅ, చక్షురున్మీలితం యేన, తస్మైష్రీ గురవేనమ: అన్నది ప్రాచీన సూక్తి సర్వులకూ విదితమే. అలాగే, గురవే సర్వలోకానం అన్నది కూడ, సర్వలోకాలకు గురువు, భవరోగములకు వైద్యుడు, సర్వవిద్యులకు నిధి అయిన దక్షిణామూర్తికి వందనం అంటూ గురుస్తుతి ప్రాధాన్యతను వివరిస్తోంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అన్న ష్లోకం ద్వారా జ్ౙాన సౄష్టికర్త, ఆర్తత్రాణుడైన విష్ణువు, అజ్ౙాన తిమిరాన్ని తొలగించే పరమేష్వరుని తనయందు నిలుపుకున్నవాడే గురువు అని తెలుస్తోంది.
మన సంస్కౄతి నేర్పిన గురు-షిష్య సత్సమిత్రుడు - ష్రీరాముడు, ద్రోణాచార్యుడు - అర్జునుడు, సమర్థ రామదాసు - ఛత్రపతి షివాజీ, ష్రీ రామకౄష్ణ పరమహంస - స్వామి వివేకానంద, యిలా ఎన్నో మనకు గోచరిస్తాయి.
గురువును విజ్ౙాన కల్పతరువుగా భావించి, వినయంతో, విధేయతతో సేవించి, మన జీవితాలను సాటివారి జీవితాలను చక్కదిద్దితే ఆ దివ్యగురువులనుండి నేర్చుకున్న విద్యకు సార్థకత లభిస్తుంది. అందుకే మనం ష్రీ గురవే నమ: అని మనం జీవితంలోని తొలిగురువు అయిన ఉపాధ్యాయుని నిత్యం భక్తి విష్వాసాలతో గౌరవించడం, వారి బాటలో ఆచరించుకోవడం, జీవితానికి అర్థం, పరమార్థం సంతరించుకోవడం లో ఉపాధ్యాయుని పాత్రం అమోఘం అని మాత్రం చెప్పవలసివస్తుంది.
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (అక్టోబర్ 6) సందర్భంగా గురుమూర్తులైన ఉపాధ్యాయులకీ, షిష్యగణం అయిన విద్యార్థులకీ అభినందనలని తెలుగురథం సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగురథం.

Saturday, October 3, 2009
మహర్షి వాల్మీకి
మహర్షి వాల్మీకి - జయంతి
వాల్మీకి మహర్షి కథనం మనకు స్కాంద పురాణంలో వివరించబడింది. వాల్మీకిముని వౄత్తాంతాన్ని సనత్సుజాతుడిని వేదవ్యాస ఆడుగుతాడుట. సంస్కౄతంలో ఆదికవిగా వాసిగాంచిన వాల్మీకి రామాయణాన్ని వ్రాషాడు. వాల్మీకి నిజ నామధేయం అగ్నిషర్మగా చెప్పబడింది. తల్లిదండ్రులు కౌషికి, సుమతి. అగ్నిషర్మ బాల్యంలో వేదాభ్యాసం సరిగ్గా చేయకపోవడం, తల్లిదండ్రులు వార్థక్యంలో ఆ గ్రామంలో క్షామం దాపురించడం, ఫలితంగా తిండికోసం, దైనందిక జీవితంకోసం దారిదొంగగా మారాడని ప్రస్తావించబడింది. అలా దొంగతనం చేస్తూండగా ఆ మార్గంలో వస్తున్న సప్తౠషుల్లో ప్రముఖుడైన అత్రి మహర్షిచేత అగ్ని ప్రశ్నింపబడగా, తన కుటుంబం తాను చేస్తున్న పాపాన్ని భరిస్తారో లేదో కనుగొనమన్నాడు. అగ్నిషర్మ కుటుంబ సభ్యులను వాకబు చేయగా, ఆయాకర్మలను వారు పంచుకోమని చెప్పినారట. ఈ విషయాన్ని తిరిగి సప్తౠషులకు విన్నవించి, అత్రి మహర్షి మోక్షప్రాప్తికి ధ్యానం చెయ్యమని, రామ నామాన్ని తిరగేసి, 'మరా' అని బోధించి, నామజపం చెయ్యమన్నాడు. చాలా కాలం తదుపరి, అత్రి మహర్షి వెళ్ళుతున్న దారిలో ఒక చీమలపుట్ట కనిపించడం, అక్కడ అగ్నిషర్మని గ్రహించడం, వల్మీకంనుంచి వచ్చినందున, 'వాల్మీకీ అయ్యాడని చెప్పడం జరిగిందిట.
ప్రచేతనుడి పదవ పుత్రుడు ఆదికవి అని పిలువబడే వాల్మీకి మహర్షి సంస్కౄత సారస్వతానికి మూలపురుషుడే కాక, పంచమవేదంగా భావించబడుతున్న ష్రీమద్రామాయణ మహాకావ్యకర్త. ఈయన జీవనకాలాన్ని ఖచ్చితంగా నిర్థారించలేకకపోతున్నా, పాష్చాత్య పరిషోధకులు క్రీస్తుపూర్వం నాలుగువేలు మొదలు రెండువేల సంవత్సరాల మధ్యకాలం నాటివాడని, భారతభూమిలో రామరావణయుద్ధం జరిగిందని ఒక అపూర్వ విష్వాసం. ఒక భావన ప్రకారం త్రేతాయుగంలో యుద్ధం జరిగిందనీ, ఆ యుగానంతరం ఆరు లక్షల సంవత్సరాల ద్వాపర యుగం కూడ పూర్తవడం, ప్రస్తుత కలియుగం ప్రారంభమై ఐదువేల సంవత్సరాలు పైగా నడుస్తున్న ప్రస్తుత కాల నేపథ్యంలో, వాల్మీకి ఆకాలం నాటివాడు కాదని చెప్పడం కూడ జరిగిన వైనాలు చరిత్రలో భాగమయ్యాయి. సంస్కౄత యితిహాస పర్వాల్లో వాల్మీకి
ోళా షబ్దం చోర సంస్కౄత షబ్దంగా మారి వుండవచ్చనీ, చోళులు దారులు కొట్టి నివసించేవారనీ, అర్థ పరిణామం ద్వారా భావన కలిగింది. చోళ జాతికి చెందడం వల్ల చోరుడిగా, దోపిడీకాడని కథ ప్రచారంలోకి వచ్చియుండవచ్చు అని మరియొక భావన. రామాయణమును బట్టి వాల్మీకి కవి ఆష్రమం గంగానది సమీపంలో తమసానదీతీరంలో వున్నదని ఒక కథనం. కాని అతని ఆష్రమం గంగానది కాక ఇప్పటి బుందేల్ఖండ్క్ లోని బందాజిల్లాలో అలహాబాదు సమీపంలో యమునానది తీరంలో ఒక పర్వతంమీద వుండేదని ఒక వాదన. ఇదే చిత్రకూట పర్వతమనీ కొన్ని రామాయణ ప్రతుల్లో దర్షనీయమవుతుంది. ఈ భావం నిజమనిపిస్తే, వాల్మీకి ఆష్రమం అయోధ్య సమీపంలో వుండేది. అందువలన, వాల్మీకిని రామునికి సమకాలికునిగా కల్పనచేసి వుంటారు. వాల్మీకి రామాయణంలో ప్రస్తావన చేసిన స్థల జాతులను బట్టి దేషంలోని ఒరిస్సా, గోదావరి ప్రాంత ప్రదేషాలతోనే పరిచయమున్నట్లు తెలుస్తున్నది. కాబట్టి వాల్మీకి తూర్పు, దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాలకు చెందినవాడనే అని చెప్పవచ్చును అని బహు పరిషోధకుల భావం. బోయ కుటుంబంలో జీవనం గడుపుతుండగా, ఒకరోజు నారదముని ఆ త్రోవలో వెళ్ళుచుండగా ఆయనను ఆ బోయవాడు ఆపాడు. నారదుడు మాత్రం తనదగ్గర కేవలం తంబూర తప్పితే వేరే ఏమీ లేదు అని చెప్పినా, తంబూరనే లాక్కున్నాడు మన బోయవాడు. యిలా చేసిన పని పాపం కాదా అని నారదుడు అడగడం, చేస్తున్న పనిలో భార్యకు భాగస్వామ్యం ఉందా అని అడగడం, భార్యని సంప్రదించిన పిమ్మట తనకు ఏమీ సంబంధం లేదు అని చెప్పడం ద్వారా జ్ౙానోదయం కలిగి, ముక్తిని అందుకునే ప్రయత్నంలో నారదుడే రామనామజపం చేయమని చెప్పడం కలిగింది. ఫలితంగా ఓ బోయవాడు వౄక్షం కింద తపస్సుని ఆచరించడం అనంతమైన నిష్చల తపస్సులో నుండగా చుట్టూ వున్న చీమలు ఈయన మీదనే పుట్టలు పెట్టడం, అందుకుగాను వల్మీకము అంటే పుట్టనుండి వచ్చినవాడు కనుక వాల్మీకుడు అన్న పేరు సార్థకం జరిగింద
వాల్మీకి రామాయణకర్త అనటంలో సందేహం లేదు. వాల్మీకి మొదట కిరాతకుడు, దారులు కొట్టి దొంగగా జీవించేవాడయినా, హఠాత్తుగా జరిగిన సంఘటన మూలాన అతనిలో హౄదయంలో మార్పు సంభవించిందన్న భావం ఐతిహ్యం. ఆధ్యాత్మ రామాయణంలో వాల్మీకి మొదట బ్రాహ్మణుడే కాని, పైన వివరించినట్లు అగ్నిషర్మ, ప్రచేతనుడి పుత్రుడుగాను చెప్పబడడంతో సరిపోతున్నా, కిరాతకుల్లో కలిసిపోయి షూద్రస్త్రీని వివాహమాడి సంతానాన్ని పొందాడనీ, దొంగగా జీవిస్తూండగా, సప్తర్షులవల్ల అతనిలో మార్పు వచ్చిందని చెప్పబడింది. తైత్తిరీయ ప్రాతిషాఖ్యంలో వాల్మీకిని ఓ పదకారునిగా పేర్కొనబడింది. ప్రాచీన భారతదేషపు తూర్పు సముద్రతీరభాగమంతా చోళమండలంగా పేర్కొనబడడం, బ్రిటిష్ కాలంలో అది కోరమండలంగాను మారింది. ఈ సముద్ర తీరప్రాంతవాసులను చోళులని, క్రమేపీ 'చో. వాల్మీకి రామాయణము రచించుటకు కేవలం నారదుడే ముఖ్య కారణం అని కూడ భావిస్తారు. నారదుని ద్వారానే క్లుప్తంగానే రామాయణగాథ యిరవైనాలుగు వేల ష్లోకాలతో రచించడం జరిగింది. రామాయణ కావ్యంలో ప్రతి వెయ్యి ష్లోకాలకు ముందక్షరంగా గాయత్రీ మహామంత్రంలోని ఒక్కో అక్షరం పెట్టి గాయత్రీమంత్రంలోని యిరవైనాలుగు అక్షరాలు రామాయణ కావ్యంలో పొందుపరచాడు. 'రా' అంటే యింతవరకూ చేసిన పాపాలు, 'మా అంటే యిక ముందు చేసే పాపాలు పోతాయని 'రామా షబ్దం అంత అర్థం ఈ రామనామ మహత్తరమైనదంటారు. ష్రీరామచంద్రుడు వాల్మీకి సమకాలికుడు అవ్వడం మూలానే, ష్రీరామ జననం నుండి లవకుషల పట్టాభిషేకం వరకూ ప్రత్యక్ష రాముని జీవితాన్ని చూసినందువల్ల, రామాయణ కావ్యాన్ని రచించాడని ఒక ప్రబలమైన విష్వాసం. ష్రీరామ పట్టాభిషేకం తర్వాత, చాకలివాడి పరుషవాక్యాల ఫలితంగా రాముడు సీతను అడవులకు పంపించడం, ఈయన ఆష్రమంలోనే సీతకు ఆష్రయం కల్పించడం, లవకుశల జన్మకథనం, యుక్తవయసు వచ్చే వరకు జాతకకర్మలు, షస్త్రాస్తర మహావిద్యలు నేర్పిన గురువు వాల్మీకే అని ప్రబల విష్వాసం. యిలా వాల్మీకి - రామాయణం ఉభయతారకంలా వెలిసిపోయాయి, భారతీయ సంస్కౄతిలో భాగంగా చరిత్రాత్మక కథనంగా మారిపోయింది. వాల్మీకి ప్రత్యక్ష సంబంధం మాత్రం ఉత్తరకాండ, ఉత్తరరామాయణం ద్వారా తెలుస్తుంది. ఉత్తరకాండని వాల్మీకి రాయలేదని మరియొక సిద్ధాంతం. రామాయణ పఠనం, రామభజన, రామకోటి వ్రాయడం భారతీయ ఐతిహాసక సంస్కౄతీరూపంలో ప్రముఖ భాగంగా చిరస్థాయిగా సుప్రతిష్ఠగావించబడింది. వాల్మీకి సంస్కౄత సాహిత్య సేవ వాల్మీకి వర్ణించిన ప్రకౄతియే ఈనాటి కవులకు వర్ణ్య వస్తువైనది భారతీయ సాహిత్యములలో ప్రయోగములు ఛందస్సు భారతీయ సాహిత్యములలో సంస్కౄత సాహిత్యమే అతి ప్రాచీనమైనది; అన్నిటికన్న సంపన్నమైనది. భారతదేషములోని సమస్త భాషాసాహిత్యములపైన దీని ప్రభావమున్నది. వైదిక ౠక్కులు మాత్రాఛ్ఛందస్సులో వెలువడినవి. వైదిక ౠక్కులపై ఛందోవిషయికముగా చేసిన సరిక్రొత్త ప్రయోగము వాల్మీకి రామాయణము. ఈ కావ్యమునకు ముందు అనుష్టుప్క్ ఛందస్సు కథా కథనమునకు, కావ్యరచనకు ఉపయోగపడలేదు. వాల్మీకి తన కావ్యమును 'తాళబద్దాక్షరసమం, తంత్రీలయ సమన్వితం, కావ్య మేతన్మయాకౄతమ్క్' అని చెప్పుకొన్నాడు. లౌకిక వాంగ్మయమున ఛందస్సులో నిర్మితమైన ప్రప్రథమ కావ్యము వాల్మీకి రామాయణమే. 'ఆమ్నాయా న్నూతనోయం ఛందసామవతార:' అని భవభూతి ఉత్తర రామాచరిత్రమున వాల్మీకి రామాయణము యోక్క నూతనత్వమును ప్రస్తుతించెను. అనుష్టుప్క్ ఛందస్సునకు మంచి పుష్టిని ప్రసాదించినవాడు వాల్మీకి. వాల్మీకి తర్వాత ఛందస్సులో గొప్ప నవ్యత చూపినవాడు కాళిదాసు. వస్తువు
యన్నది రామాయణముతోనే ప్రారంభమైనది. సీతాపహరణాంతరము రామచంద్రుడు బిల్వార్జున తిలక తాళ చూతాషోకాది వౄక్షములను, గజవ్యాఘ్రమౄగాదిజంతువులను పేరుపేరున పిలిచి త
ఇతివౄత్తముతో కూడుకొనిన మొదటి కావ్యము వాల్మీకి రామాయణము. అందులోని వస్తువు ఐతిహాసికము. వాల్మీకి తరువాత కాళిదాసే వస్తువరణములో చక్కని ప్రయోగములు చేసెను. ఆదికవులు సంస్కౄత కవిత్వమునకు వాల్మీకి వలె, తెలుగు కవిత్వమునకు నన్నయ్య, ఇంగ్లీషు కవిత్వమునకు చాసర్ ఇంచుమించుగా ఆదికవి. కవిత్వ స్వరూపము - సంస్కౄత లాక్షణికుల సిద్ధాంతము సంస్కౄతాలంకారికుల్లో ముఖ్యులైనవారి సిద్ధాంతములను అలంకారవాదులు, రసవాదులు కనిపిస్తారు. మహాకవి వాల్మీకి సైతము ఓకటిరేండు చోట్ల అలంకార ప్రీతితో కావ్యాత్మను ఆవిష్కరించినాడని కొందరు విమర్షకులు అభిప్రాయపడిరి. కవిత్వము - ఆవేషము కవిత్వమంతయు ఆవేష హఠాదుద్గమనమువలన రచింపబడినది కాదు. 'మనిషాదా అను షోకమొక్కటి వాల్మీకి ముఖమునుండి ఆవేశ ప్రోద్బలమువలన ఉద్గతము కావచ్చును. రామాయణమంతయు అట్లే రాలేదు. అది నెమ్మదిగా కూర్చుండి ఆలోచనా పూర్వకముగా రచించినది. ప్రపంచములోని మహాకావ్యములైన 'ఒడిస్సీ' మొదలైనవన్నియు ఈ పద్ధతిలోనే రచింపబడినవి. కావున కవిత్వ రచనకు హౄదయమే కాక మేధ కూడ అత్యవసరం. ఆవేషమును నిగ్రహించికొని దానిని రసస్నాతమొనర్చి సుందరమైన పదజాలములో ప్రకటించినప్పుడే ఉత్తమకవిత్వ మవతరించును. ప్రాచీనకావ్యములు - రామాయణంలో 'ప్రకౄతీ ఆదికావ్యమైన రామాయణములో ప్రకౄతి వర్ణన సర్వతోముఖముగా భాసించినది. ప్రకౄతిని అంగిగా చేసికొని రచింపబడిన ప్రాచీనకావ్యములలో కాళిదాసు - ౠతుసంహారం గణనీయమైనది. కాళిదాసాదులు చేసిన ప్రకౄతి చిత్రణపై వాల్మీకి ప్రభావమేయున్నది. వాల్మీకి రామాయణము లోని ప్రకౄతి వర్ణనల స్వభావము కడు రమణీయం. రాముడరణ్యములకు వెడలిపోవుచుండగా అయోధ్యా పట్టణ బాహ్యోద్యానములు విలపించినట్లు వాల్మీకి వర్ణించాడు. మొదట ప్రమత్తములుగా ప్రముదితముగానుండిన ఉద్యానములు రామునిస్థితినిగని దారిపొడుగునా ఆకులురాల్చుచు తమ దు:ఖమును వెల్లడించినవట. పాత్రతో ప్రకౄతి సానుభూతి చూపిన సందర్భం. సానుభూతి చూపుటయేకాక ప్రకౄతి కథాగతికి తోడ్పడినట్లు వర్ణించిన సందర్భములు కూడ రామాయణములో నున్నవి. సీతను రావణుడపహరించినపిమ్మట, రాముడు పర్ణషాల సమీపమున ఆమె కొరకు దీనముగా దిక్కులు చూచుచుండగా అచ్చటి లేళ్ళు ఆయనకు మార్గము చూపించినట్లు వర్ణింపబడినది. ఉత్తమ పాత్రలకన్యాయము జరిగినప్పుడు ప్రకౄతిరసనమును ప్రకటించినట్లు వర్ణింపబడిన సందర్భములుగూడ రామాయణములోనున్నవి. రావణుడు సీతాదేవి యెడల చేయుచున్న ముష్కరత్వమునకు వాయువు వీవలేదని, సూర్యుడు కాంతివిహీను డైనాడని వర్ణించి వాల్మీకి ఈ అభిప్రాయమునే ప్రకటించెను. ప్రకౄతిని సంబోధించి స్వవిషయము చెప్పుకొనుట - ప్రకౄతి ఆత్మ విషయములను చెప్పుకొనుటనసీత యెక్కడున్నది ప్రష్నించెను. రావణుడపహరించి తీసికొనిపోవునప్పుడు గోదావరిని, వనదేవతలను సంబోధించి సీతాదేవి తన దు:ఖమును వెల్లడించుకొనెను. నవ్యకవులు కొంతవరకు వాల్మీకికి సన్నిహితులు. వాల్మీకి - రామాయణం రామాయణాన్ని రచించిన కవి వాల్మీకి. వాల్మీకి గంగాతీరంలో నివసిస్తూ రామాయణాన్ని లవకుషులకు చెప్పాడని, వారు దాన్ని రాముని అష్వమేధయాగషాలల్లో గానం చేషారని రామాయణంలోనే చెప్పబడింది. రామాయణంలో యిరవైనాలుగు వేల ష్లోకాలు, ఏడు కాండలుగా విభజించబడ్దాయి అని, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తర కాండలు అన్నది సుపరిచితం. రామాయణమును ఐదువందల సర్గలుగా రచించినట్లు బాలకాండలోని ష్లోకం వివరిస్తోంది. 'ఆదిప్రభౄతివై రాజన్క్ పంచసర్గ షతాని చ, కాండాని షట్ కౄతాని సోత్తరాణి మహాత్మనా' అన్నది ఒక విధానం. భారతీయ సంప్రదాయానుసారంగా రామాయణాన్నంతా వాల్మీకి రచించినట్లు, రామాయణ వౄత్తాంతం జరగకముందే భవిష్యత్తులో జరుగబోయే కథనంతా నారదుడు వాల్మీకి చెప్పినట్లు, బ్రహ్మ ఆదేషానుసారంగా నారదుడు చెప్పినదాన్ని వాల్మీకి కావ్యంగా వ్రాసినట్లు తెలియవస్తోంది. ఆనంద వర్ధనుని వంటి అలంకారికులు వాల్మీకియే ఉత్తరకాండతో సహా ఏడు కాండలు గల రామాయణాన్ని రచించాడని కూడా అంగీకరించారు. వాల్మీకి అనుష్టుపు ఛందస్సులోనే రచించాడని, మిగతా ఛందస్సులు ప్రక్షిప్తాలని అంగీకరించినట్లయితే, అనేక అందమైన ష్లోకాలు వాల్మీకి విరచితం కాదని కూడ చెప్పవలసివస్తుంది అని మరో తరహా పండితుల భావం. వాల్మీకి బౌద్ధ దషరధ జాతక కథను గ్రహించి గ్రీకు మహాకావ్యం ఇలియడ్క్ ఆధారంగా విస్తరింపచెసి కావ్యంగా రచించాడని వేబర్ అభిప్రాయం. దీనికీ వేర్వేరు అభిప్రాయాలున్నాయి. రామాయణం రచన, రచనాకాలం, కథలో రూపాంతరాలు, షైలి, సమకాలీన సమాజ చిత్రణాది అంషాల్లో విభిన్నాభిప్రాయాలున్నా, జానపదులు సౄష్టించుకున్న ఆధ్యాత్మ రామాయణంతో పాటు, రామాయణము లోక ప్రియత్వం, మహాకావ్యత్వం నిరంతరం సంపాదించుకుంది, భారతీయ ఐతిహాస ధర్మ పరంపరకు సాక్షం, సంకేతం, దర్షనీయమైన దర్పణం అని ఘంటాపథంగా చెప్పాలి. ఏది ఏమైనా, రామాయణంలో అనేక కావ్య ప్రయోగాలున్నా, మానవ జీవితానికి ఎంతో ప్రయోజనమున్న కావ్యమన్నది నిర్వివాదాంషం. అలనాటి ఆర్య సంస్కౄతి వింధ్య పర్వతాలను దాటి దక్షిణాపథానికి వ్యాపించని స్థితిగతుల్లో, ఆనాటి ఉత్తర దక్షిణ భారతదేష స్వరూప స్వభావాలను చరిత్ర వ్రాసినా, మహాకావ్యంగా రూపొందించినా, వాల్మీకి మహర్షి గావించినది అఖండ అపూర్వ అపురూప కౄషి సాధనల సమన్వయం. వాల్మీకి చిత్రం కూడ రసమయం
తెలుగురథం షత సహస్ర సాహితీ సంస్కౄతీ నివాళులను, నీరాజానలను సమర్పించుకుంటోంది.
జుపిటర్ సంస్థ నందమూరి తారక రామారావు నాయకత్వంలో, సముద్రాల రాఘవాచార్యగారి రచనలో 1963 లో ప్రముఖ దర్షకుడు సి యస్ రావు దర్షకత్వంలో వచ్చిన చిత్రం కూడ సాహితీవిలువలను కూడుకుంది. ఓం నమోనారాయణాయ, కాంతుడు ప్రాణముగ నెంచు కన్నెవలపు, జయజయజయ నటరాజా భుజగషయన, తలచినంతనే సకలతాపసములణచి పాపలకైన, రాతిగుండెయెనీది మారాడవేల మూగనోములు, ష్రీ రామాయణ కావ్యకధ జీవనతారక మంత్రసుధా, హరేనారాయణా పావనా సౄష్టిస్థితినిలయ మూలకారణా, హరియే వెలయునుగా భువిని హరయే వెలయునుగా, ముదము కనేదెపుడే మదిలోని ఆషతీరే అన్నపద్యాలు, గీతాలు అందరినీ అలరించాయి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం, మా విషాదం ప్రతిస్ఠాం త్వమగమస్యా అన్న ష్లోకాలు మధురగళం ఘంటసాల ద్వారా వినడం కూడ ఒక ప్రత్యేకతే అని చెప్పాలి. వాల్మీకి సుముహూర్తం ప్రాచీన సాహిత్యాన్ని చెక్కుచెదరకుండా వుంచుకున్న మహోత్కౄష్ట జాతి మనది. భారతీయుడిది గౄహాష్రమజీవనం. రామాయణ భారత భాగవతాలు భారతీయ విజ్ౙాన భాండారాలు; భుక్తి ముక్తి ప్రదాలైన ఇతిహాసాలు. త్యాగభావనాయుక్తుడవై ప్రపంచపదార్థాలను అనుభవించమనడమే ఈ గ్రంథాలలోని సంస్కౄతి. భారత రామాయణాలు కర్మ ప్రవౄత్తి కలగజేస్తాయి. భాగవతం భక్తిజ్ౙానవైరాగ్యాలు లభింపజేస్తుంది. భాగవతాన్ని తెలుసుకోవడానికి భక్తి వుండాలి. భారతాన్ని తెలుసుకోవడానికి భక్తి యుక్తి అవసరం. రామాయణాన్ని గ్రహించడానికి భక్తియుక్తులు రెండే కాక, షక్తి కూడా కావాలి అంటారు. ష్రీమద్రామాయణం ఆదికవి వాల్మీకి అందించిన సుముహూర్తం ఎటువంటిదంటే - నాటినుంచి నేటివరకూ భాస, కాళిదాస, భవభూతి, మురారులవంటివారు సైతం ఆ మునిచంద్రునికి తలవంచి తమ పలుకులలో కావ్యాలుగా, నాటకాలుగా వ్రాసుకుని జన్మధన్యమయిందనుకున్నారు. తేలుగువారు హరికథలుగా, నాటకాలుగా వినిపించి, ప్రదర్షించి తౄప్తిపడుతున్నారు. పాటలుగా జానపదులు ష్రీలు పాడుకుంటూనే వున్నారు. షతకాలతో అర్చించుకుంటున్నారు. ష్రీరాముడు - రామరాజ్యం సంగతి నిత్యస్మరణీయాలైనాయి. చివరకు భారతీయ జ్ౙానపీఠంమీద తెలుగు సరస్వతిని ఆరాధింపజేషారు, కవిసామ్రాట్క్, తొలి తెలుగు జ్ౙానపీఠ పురస్కార గ్రహీత, ష్రీ విష్వనాథ సత్యనారాయణగారు తమ 'రామాయణ కల్పవౄక్షం' కావ్యం ద్వారా. నాగరక చిహ్నమైన చలనచిత్రాలుగా రామాయణం, దూరదర్షన్ ద్వారా అత్యంత ప్రతిభావంతమైన దౄష్వ కావ్యంగా అందించిన కౄషి సాధనల నేపథ్యం ఖచ్చితంగా ప్రముఖ ప్రభావ ప్రేరణలను అందించి, అందిపుచ్చుకున్న వైనాలు మహర్షి వాల్మీకి వల్లనే అని చెప్పడం అత్యుక్తి, సహజోక్తి. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా తెలుగురథం షత సహస్ర సాహితీ సంస్కౄతీ నివాళులను, నీరాజానలను సమర్పించుకుంటోంది.Thursday, October 1, 2009
లాల్ బహదూర్ శాస్త్రి 104 వ జయంతి - 2 అక్టోబర్
లాల్ బహదూర్ శాస్త్రి 104 వ జయంతి - 2 అక్టోబర్
'జైజవాన్ జై కిసా - ఈ మరో మహాత్ముని తారకమంత్రం మనం మరువలేని మూడు రోజులు మన దేశం, ప్రజలు మాత్రం ముచ్చటగా మూడు రోజులు, తేదీలు మర్చిపోరు సరిగదా, ప్రతీ ఏట వీలైనంతగా స్మరిస్తూనే వుంటారు. ఎవరు ఎక్కువసార్లు స్మరిస్తే వాళ్ళకు దేశభక్తి అపారం అని జమకట్టారు మన నిర్ణయకారులు. మన బలం, బలహీనత అదే. ఆ రోజులు - ఆగష్టు 15 (స్వాతంత్ర్యదినోత్సవం), అక్టోబర్ 2 (మహాత్మాగాంధీ జాతిపిత జయంతి), జనవరి 26 (భారతీయ గణతంత్ర దినోత్సవం). అక్టోబర్ 2 - మరో మహాత్ముని జయంతి కూడా !!! అక్టోబర్ 2 వచ్చిందంటే మనకు వెంటనే స్ఫురించే వ్యక్తి, ప్రత్యేకత దేశమంతా ఒక్కటే మూస ఆలోచన. అదే గాంధీజయంతి. మహాత్మాగాంధీ, మోహన్ దాస్ కరం చంద్ గాంధీ జయంతి. ప్రతీ ఏట దేశప్రజావళి సామూహికంగా స్మరించుకునే రోజు. అదే గాంధీ పుట్టినరోజు. అదేరోజు యాదౄఛ్ఛికంగా మన దేశపు మూడో ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రిగారి జన్మదినోత్సవం. యించుమించు దేశం యావత్తు మరచిపోయినరోజు. కొందరి విషయంలో పునరుక్తి విధానం దోషంకాదు. కాని స్మరించ వలసిన వ్యక్తిని స్మరించకపోవడం నేరం కాదు, దురదౄష్టవశాత్తూ మన భారతదేశంలో. ఏది ఏమైనా, మనం మరపురాని రోజుగా గాంధీజయంతిని పండుగగా జరుపుకునే అక్టోబర్ 2 రోజు మనం అదేరోజున మన దేశం మూడవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారి జన్మదినం కూడ అదేరోజు అన్నది మరచిపోయిన రోజు కూడ అదే అన్నది వింత, విడ్డూరం కలిగిస్తాయి. బహదూర్ జీవనప్రస్థానం సామాన్య కుటుంబంలో ఉత్తరప్రదేశ్ లోని ముగల్ సరాయ్ లో 1904 అక్టోబర్ 2 న జన్మించిన లాల్ బహదూర్ శాస్త్రి, బాల్యం అంతా కటిక దరిద్రంలో గడిపారు. కాని, నిజాయితీ ఆయనకు సంపన్నత. మానవీయతతోపాటు యదార్ధవాది. కాశీవిద్యాపీఠంలో విద్యను అభ్యసించి, సాంఘికసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన అభ్యుదయవాది. లాలా లజపతి రాయ్ స్థాపించిన 'సర్వెంట్స్ ఆఫ్ పీపిల్ సొసైటీ' కి పరిపూర్ణమైన సేవలతో అంకితం అయ్యారు. స్వరోజ్యోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. శాస్త్రి కూడ ఆ ఉద్యమంలో ప్రవేశించడం జరిగింది. ఫలితంగా అనేకసార్లు జైలుశిక్షను అనుభవించాడు. ప్రజాసేవ మరింతగా చేయాలన్న తలంపుతో, మొదటిసారిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆనాటి ప్రధాని నెహ్రూ కేంద్రానికి తరలించాడు. ఫలితంగా కాంగ్రేసుకి సాధారణ కార్యదర్శి పదవిని చేపట్టారు. తర్వాత, కేంద్ర రైల్వే మంత్రిగా ప్రతిభావంతమైన సేవలను అందించారు. నిజాయితీపరుడికి నిత్యం పరీక్షలే. దురదౄష్టమైన రైలు ప్రమాదం జరిగిన సందర్భంగా, పూర్తి నైతిక బాధ్యతను తాను స్వీకరిస్తూ, భారతరాజకీయాల్లో ఒక మార్గదర్శకతతో, మంత్రిగా రాజీనామా చేశారు. రాజకీయనాయకునికి కూడ రాజీపడడం, నిజాయితీతో నడచుకోవడం అత్యవసరం అని నిరూపించారు. 1964 లో జవహర్ లాల్ నెహ్రూ మరణాంతరం, భారతదేశపు మూడవ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రిగారు ఎన్నికయ్యారు. అల్పకాలంగా ప్రధానిగా సేవలనందించినా, అనల్పమైన నాయకునిగా పేరుప్రఖ్యాతులను పొందారు. విజయం తెచ్చిన విషాదం భారత్-పాకిస్తాన్ మధ్య 1965 లో జరుగుతున్న యుద్ధం సందర్భంగా శాస్త్రి ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, ఆ సంకల్పం, దీక్ష, సరిసములు లేని ధీరలక్షణాలు ఆ నాయకునివి. దేశానికి మూలమూలలకు వ్యాపించిన నినాదం 'జై జవాన్ జై కిసాణ్ అన్నది లాల్ బహదూర్ శాస్త్రిగారి భావనే. ఆ అవాంతర పరిస్థితుల్లో ప్రజలను త్యాగవంతులుగా ముందుకు రావాలని కోరిన మహానుభావుడు. పాకిస్తాన్ తో అమోఘమైన విజయాన్ని సాధించాడు. ఈ ఆనందం పంచుకునే లోపున, 1966 లో పాకిస్తాన్ తో తాష్కెంట్ లో జరుపుకున్న అంగీకార సమావేశం ఫలితంగా అంగీకారపత్రంపై తన ముద్రని యిచ్చిన వెంటనే, మరణించడం దురదౄష్టకరం. ఓ శాస్త్రీ సరిలేరు నీ కెవ్వరూ ! శాస్త్రిగారు భారత రాజకీయాల్లో తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారు. అందరి మనసును దోచిన విషయాలు - శాస్త్రిగారు ప్రదర్శించిన నీతిపూర్వక నడత, నిరాడంబరత, రికామీ వ్యక్తిత్వం, త్యాగశీలత, శాంతమూర్తి, ధౄఢనిర్ణయకారుడు. ఆయన భౌతికంగా వామనమూర్తి అయినా ఆయన తరానికి మాత్రం నడతలో ఆజానుభాహుడు. స్వాతంత్ర్యం కోసం సమరం జరిపిన ప్రతిభామూర్తుల్లో ప్రముఖుడు. ఆటువంటి వ్యక్తి మాత్రం భారతీయ రాజకీయ వ్యవస్థలో కనివిని ఎరుకలేదు. మళ్ళీ తిరిగి దర్శనం అవుతాడు అన్న విశ్వాసం, నమ్మకం, సన్నగిల్లిపోతున్నాయి. క్రమేపీ, నిరాశకు దారితీస్తోందే కాని, మరో గత్యంతరం కనిపించుటలేదు. స్మారకం లాల్ బహదూర్ శాస్త్రిగారి మరణం తర్వాత, తాష్కెంట్ నుంచి ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చి ఆయన స్మౄతి చిహ్నంగా డిల్లీలోని విజయఘాట్ లో స్మారకకేంద్రాన్ని నిర్మించడం ఆయనకు మనం అందజేసిన నివాళి, ప్రణామాలు. శాస్త్రిగారు దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా, కీర్తిశేషులుగా దేశపు అత్యున్నత పురస్కారం 'భారతరత్నా తో గౌరవించడం ఎంతో సమంజసం, ఔచిత్యం అన్నది సత్యం. భారతమాత గర్విత ముద్దులబిడ్డగా లాల్ బహదూర్ శాస్త్రిగారి పేరు మాత్రం చరిత్ర సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా లిఖించబడింది. లాల్ బహదూర్ శాస్త్రిగారు మాత్రం - న భూతో న భవిష్యతి. రాజకీయాల్లోను, పరిపాలనలోను, అంతటి నిబద్ధత, శాస్త్రీయత, మానవీయత మరింక కానరావేమో ?! ప్రజావళి ఎదురుచూడ్డం కన్నా వేరే దారి ఏముంది ? మహాత్మాగాంధి, జాతిపిత, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జన్మదినంతో పాటు ఈ మరోమహాత్ముని జన్మదినం కూడ అదేస్థాయిలో స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది అని మరోసారి వక్కాణిస్తూ, నివాళి సమర్పించమని కోరుతూ ... లాల్ బహదూర్ శాస్త్రి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం నీరసంగా, చడీచప్పుడు లేకుండా నిర్వహించడానికి కారణమేమిటో మాత్రం నాకు బోధపడటం లేదు; ఈ ఉత్సవాలకోసం ప్రభుత్వం వందకోట్ల రూపాయలను కేటాయించినా, చాలావరకూ ఖర్చు చేయకపోవడం గమనార్హం. ఏది ఏమైనా, నెహ్రూ, ఇందిర, రాజీవ్ ప్రభుత్వాల్లో లాల్ బహదూర్ శాస్త్రికి మాత్రం కాంగ్రేసు నుంచి గౌరవం అందవలసినంత లభించనేలేదు - అని ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయులు, బ్రిటన్ లో భారత మాజీ హైకమిషనర్ - కులదీప్ నయ్యర్ ఒక ప్రత్యేక వ్యాసంలో సుస్పష్టంగా ప్రస్తావించడంలో గల సూక్ష్మాన్ని అందరూ గ్రహించాలి. నిత్య సత్య స్ఫూర్తి ప్రదాత - లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా, మహాత్మాగాంధి, జాతిపిత జయంతి సంబరాలు, ఉత్సవాల్లో కొద్దిపాటైనా శ్రద్ధ, చోటు చూపెడితే, మనం మన జాతినేతల పట్ల నిష్పక్షత, వివక్షత చూపెట్టడంలో కొంచెం ఆలోచిస్తున్నట్లే అని అనుకోవాలి. జై కిసాన్ భావ నిర్మాత - లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తెలుగురథం ఘన నివాళిని సమర్పిస్తోంది. కొంపెల్ల శర్మ - తెలుగురథం.
ప్రపంచ సంగీత ఉత్సవం - 1 అక్టోబర్
ప్రపంచ సంగీత ఉత్సవం - 1 అక్టోబర్
విజ్ణాన వేదాంతాలకన్న సంగీతం ఒక మెట్టు ఎక్కువే అన్నాడు ప్రముఖ సంగీతకారుడు 'బేథోవెణ్. విశ్వవ్యాప్తంగా మానవాళి ఉపయోగించే అద్భుతమైన భాష - సంగీతం. అని అంటాడు - లాంగ్ ఫెలో. సంగీతనౄత్యకళలు నాగరికతకు ప్రతీకలు భాషతోనే పుట్టాయి ఆటపాటలు. వాక్యం లయతాళబద్ధమైనప్పుడు పాటగా రూపొందుతుంది. భావం లయతాళాలకు అనుగుణమైన కదలికలను కరచరణాద్యవయవాల్లో కలిగించినప్పుడున్న నౄత్యం రూపొందుతుంది. మానవుని కళాత్మక చైతన్యానికి సంగీతనౄత్యాలు అందమైన ప్రతీకలు. సంగీతంలేని భాషలేదు. నౄత్యంలేని నాగరికత లేదు. లయాన్వితంగా వెలువడిన భాషకు శ్రవణతర్పణగుణం ఉంటుంది. చెవులకి ఇంపులేని భావానికీ, భాషకూ ఆకర్షణ లేదు. కనుకనే సంగీతాత్మకమైన భావమే కవిత్వమన్న భావానకు ప్రాచుర్యం లభించింది. కవిత్వాన్ని రాగమాధురిమలతో సుసంపన్నం చేసిన మహనీయుల జీవితాలు ధన్యమైనాయి. సంగీతసాహిత్యాలు అవిభాజ్యాలు - సాక్ష్యం సరస్వతీదేవి. సంగీతం ఓ అధ్బుతం - సౄష్టిలో దాని స్థానం అద్వితీయం. కనుకనే మనుషులేం ఖర్మ? దేవతలు సైతం సంగీతాన్ని వదలలేకపోతూంటారు. ఒక్కోసారి వేణువు, ఒక్కోసారి డమరుకం సాయంతో సంగీత సాధనం జరుగుతుంటుంది. బహుశ ఆ కారణంగానేమో - చదువలతల్లి సరస్వతీదేవికి కూడా ఓ చేతిలో పుస్తకం వుంటే,మరోచేతిని వీణ అలంకరించింది. జడత్వం నిండిన దీపం సయితం ప్రకాశపుంజంగా మారిపోగలగడమే సంగీతానికి అసలైన గీటురాయి. పై మాటలు అన్నవి ఏ వాగ్గేయకారుడి భాష్యమో అవగతం అవటంలేదు. కాని, ఈ భావాన్ని వ్యక్తం చేసినది - భారత తొలి రాష్ట్రపతి - డా.బాబూ రాజేంద్రప్రసాద్, ప్రముఖ కళాభిమాని. సంగీతం - మానవజీవితం. జీవితంలాగే సంగీతానికి గుర్తింపు వుంది కాని, ఆ కళను అర్ధంచేసుకుని, ఆకళింపుచేసుకుని, అనుభవిస్తూ, ఆచరించేవాళ్ళు చాలా తక్కువ అనే చెప్పాలి. అందుకే, సంగీతం లేకుండా జీవితం పెద్దఘోరం అంటాడు ప్రసిద్ధ జర్మన్ తత్వవేత్త ఫ్రెడ్రరిక్ నీట్జిషె. ఈ మధ్యకాలంలో పెరుగుతున్న అవగాహనను బట్టి, భౌతికంగా, మానసికంగా, సంగీతంవల్ల ప్రయోజనాలు మానవాళి ప్రయోజనాల్ని పొందడం తధ్యం అనే భావనకు రావడం జరుగుతున్న పరిణామం శుభదాయకం. రాగభావనతో చెప్పాలంటే, మానవజీవితంలో ఆద్యంతాలైన జననమరణాల్లో ఏడవడం, ఏడిపించడం రెండూకుడా సంగీతఛాయల్లో కనిపిస్తాయి. సంగీతం - మానవీయత 'ఓ నాదమా, నీ ధ్వనిలోతుల్లో మా గుండెను పేరుస్తాం, ప్రాణాల్ని అర్పిస్తాం, చెవులతో చూడగలుగుతున్నాం. గుండెలతో వినగలుగుతున్నాం' అన్నాడు ఓ కవి. లలితకళల్లో ఘనమైన కళగా విరాజిల్లుతున్న సంగీతం - అణగారిన ప్రేమకర్చే కన్నీళ్ళకు మాతౄమూర్తిలా, కవులకు, వాగ్గేయకారులకు, శిల్పకళాకారులకు ప్రేరణామూర్తిలా, సౌందర్య భావనలో ప్రేమామౄతమూర్తిలా, ప్రాణాలను కోల్పోతున్న జీవిలకు శక్తిలా, సున్నిత దయాసాగరస్ఫూర్తిలా గోచరిస్తూంది. సంగీతం - సరాగశైలి భారతీయ హైందవ ధర్మ సంస్కౄతీకళాపరంపరలో ఒక అంతర్భాగంగా, భారతీయ మేధోన్మయమూర్తులకు ప్రత్యేకశైలిలో అవతరించినదన్నది సత్యం. ప్రత్యేక లక్షణ, లక్ష్యములవల్ల ప్రపంచ సంగీతకళకి సరిసములులేనిదిగా తలమానికంగా అలరిస్తోంది. దీనికి నిర్వచనోదాహరణంగా, 'రాగా పద్ధతిగా, స్వరరాగాలాపనలో విశిష్టప్రక్రియగా ప్రఖ్యాతమవుతూంది. సప్తస్వర సమన్వయం శిశుర్వేత్తి పశుర్వీత్తి వేత్తి గానరస: ఫణి: అన్నది ప్రాచీనసూక్తి. శిశువులు, పశువులు, పాములు సంగీతానికి ఆనందం పొందుతాయి అని అర్ధం. సోమదేవుని 'కధాసరిత్సాగరం'లో సంగీత ప్రస్తావన వుంది. భరతముని రచించిన - భావ-రాగ-తాళ సమన్వితమైన నాట్యశాస్త్రంలో కూడ అనేక సంగీతపరమైన ప్రస్తావనలు కానవస్తాయి. వాస్తవానికి బాష పుట్టుకకు ముందే సంగీతం జంతువుల అరుపుల అనుకఋరణం ద్వారా ఉద్భవించిందని కూడ మన ప్రాచీనులు వివరిస్తారు. భాషకు అతీతమైంది సంగీతం అయితే, శ్రావ్యత దాని పరమధర్మం. ఏ ప్రాణికైనా అది ఇంపుగా, వినసొంపుగా వుంటుంది. యింతటి నేపథ్యకధనంగల భారతీయ సంగీతం సప్తస్వరసహితమైంది. స్వప్తస్వరాలను - 'స, రి, గ, మ, ప, ద, ని,' అన్నవి. వీటికి సంకేతాలను కూడ నిర్ధారించారు. అవి - షడ్జ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాదాలకు సంకేతాలు. స - నెమలి అరుపు నుంచి; రి - ఎద్దురంకె నుంచి, గ - మేక అరుపు నుంచి, మ - నక్క ఊళ నుంచి, ప - కోయిల కూజితం నుంచి, ద - గుర్రం సకిలింపు నుంచి, ని - ఏనుగు ఘీంకారం నుంచి - రూపొందించినట్లు మన శాస్త్రజ్ణులు, పండితులు భావన వ్యక్తపరచారు. ఫలితంగా - మన సమజం లో ప్రముఖ జీవులైన - నెమలి, ఎద్దు, మేక, నక్క, కోయిల, గుర్రం, ఏనుగు వాటి సవ్వడులుంచి మనకు సంగీతం రాగా, అది సమాజానికి నేడు అజరామరమైన కళగా, దివ్యౌషధంగా అక్కరకు వస్తూంది. ఆ జీవరాసులు నేను సైతం అంటూ అగణిత సేవలను మానవాళికి అందిస్తున్నాయి. కాని వాటికి మనం చేస్తున్న సహాయం ఏమిటి ? సహాయం మాట ఎలా వున్నా, మనం హింసామార్గాలు అవలంబించి, వాటిని హతమార్చి, మన వినోదానికి, ఆహారానికి, లౌకికావసరాలకి వాడుకుంటున్న వైనం, తీరుతెన్నులు, మనం వేరే పాపం చేయడం ఎందుకు? ఎంతెంత పుణ్యం చేసుకున్నా, మనకు నరకం మాత్రం అనివార్యం. అంటే మనం సమాజంలో భాగంగా పశు, పక్ష్య, జంతు, వానర, క్రిమి, కీటక, స్థావర, జల, చరాది జీవరాశులపై కరుణాకటాక్షాలను రవంతైనా ప్రదర్శించవలసిన కనీస విధికర్తవ్యాలను మరవరాదు అన్నది గ్రహించాల్సిన తరుణం ఈ రోజు - ప్రపంచ సంగీత ఉత్సవం నాడు ప్రతిజ్ణ చేయాలి అని వేరే వక్కాణించవలసిన అవసరం లేదు. అందుకే సమజం - అంటే ఈ జీవరాశులుండే స్థలం. అది కానిది, అంటే మనుషులుండేది - సమాజం - సమజం కానిది. ఈ సప్తస్వరాలకు 22 శౄతులు ఆధారం కాగా, వాటిని రకరకాలుగా కలిపితే రాగాలు ఉద్భవించాయి. వాటిలో ప్రముఖమైనవి 72 అని, వాటిని మేళకర్తరాగాలని నిర్ణయించారు మన పెద్దలు. వీటిని 'జనకారాగాలని, స్వల్పాతిస్వల్ప మార్పులతో మరెన్నో ఉపరాగాలను సౄష్టించారు. వాటిని 'జన్యారాగాలని నిర్ధారించారు. వేదసంస్కౄతికన్నా ప్రాచీనం - సంగీతం. భాష పుట్టుక కన్న ముందునుంచే సంగీతం వుందన్నాం కదా. యిలా నియమాలు ఏర్పాటు చేసినప్పటికీ, సంగీతం వేదసారస్వతం ముందు కాలానికే సంగీతం వికాసం చెందించి అని చెప్పాలి. వేదాలలో, సంగీతం గురించి, సంగీత వాద్యవిషేషాలను వర్ణిస్తూ ఎన్నో సూక్తులు, ప్రస్తావనలు దర్శనం అవుతాయి. సామవేదం - రాగాధారభూతమైన స్వరసంపన్నసమన్వయం అని చెప్పవచ్చు. రాగాలు - పౄకౄతి ప్రసాదమైన ౠతువులు సాంప్రదాయంగా వస్తున్న అభిప్రాయాన్ని చెప్పాలంటే - సంప్రదాయ సంగీతపు - ఆరు రాగాలు, ఆరు రుతువులకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి అని చెప్పవచ్చంటారు మన ప్రాచీన విశ్లేషకులు. ఈ విషయాన్ని ప్రస్తావించిన విద్వాంసుల్లో - సోమేశ్వర చక్రవర్తి - చాళుక్య సామ్రాజ్యాధిపతి (1127-1137 క్రీ.శ.) - గాత్ర, వాద్య సంగీత విధానాలు తన 'మానసోల్లాసం' అనే గ్రంధంలో వివరించాడు. ఆయన, 'పండిత దామోదరం' రచించిన 'సంగీతదర్పణం' (16-17 శ.) లో వివరించాడని ప్రస్తావిస్తూ - రాగాల్ని, ౠతువుల్ని సమన్వయం చేయడం జరిగింది. వాటి తీరు యిలా వుంది. భైరవి, మేఘ, పంచమ, నటనారాయణం, శ్రీ, వసంత రగాలను ఆరు ౠతువులకు అనుబంధంగా చెప్పబడ్డాయి. అయితే, ఈ ౠతువికి, యిదేరాగం అని బద్ధతతో చెప్పడం మాత్రం జరుగకపోవచ్చు. ౠతువులతో పాటు, ప్రత్యేక సమయాల్లో (రాత్రి, పగలు) కూడ రాగాల్ని అన్వయించుకోవడం భారతీయ సంప్రదాయ సంగీతం విశిష్టత అనె చెప్పాలి. భావం - రస, రాగ, లయ సమన్వితం 'భావం' అనే పదం - భూ - భవ్ అనే ధాతువులకి మూలం. భావం ప్రకటన చేస్తేనే స్పష్టత గోచరమవుతుంది. సంగీత కౄతిలో - భావం, రస-రాగ-లయ సమనివమై, భాష స్వతంత్ర పరమైన కౄతికర్తశైలి, స్వరకర్త విధివిధానం కలసి వివిధ పాత్రలు వహించడం జరుగుతుంది. సంగీతకౄతిలో సాహిత్యం లేక మాటల సముదాయం చాలా ప్రధానపాత్ర పోషిస్తాయి. భావ ప్రకటనకి సంగీత స్వర సహిత నిర్మాణం చేదోడుగా నిలుస్తుంది. సంగీతకౄతిని అర్ధవంతంగా, సత్య, శివ, సుందర శైలిలో విడుదల చేయాలంటే - భావగర్భితంగా, సంగీత సభను అలరించేవిధంగాసంగీత విద్వాంసుడు తన కౄతిద్వారా భావ ప్రకటనని ప్రస్తుతించాలి. కళాకారుడు - తన అనుభవం, ఆలోచన, మానసిక పరిపక్వత దశలను కౄతికర్తనుంచి స్వరకర్త వరకూ, కళాకారుడినుంచి సంగీత శ్రోత, ప్రేక్షక, రసికులవరకూ - ప్రసరింపచేయగలిగితే, భావపరంగా న్యాయం జరిగినట్లే అని భావించాలి. వ్యక్తిగతంగా, ప్రతి వ్యక్తి అనుభావానుభూతి పొందగలిగితేనే, భావ ప్రకటన సమంజసంగా జరిగినట్లే అనుకోవాలి. గమకం - సంగీతంలో కళ, శాస్త్రం గమకం - 'గం - గఛ్ఛా నుంచి వచ్చింది. 'గమ-గమనా పదాలతో సంబంధమైంది. సంగీతపరంగా అన్వయించుకోవాలంటే, 'స్వరం' యొక్క ప్రస్థాన ప్రక్రియ - స్వస్థానం నుంచి అన్యక్షేత్రంలోకి గమనం. అభ్యాసంలో - స్వరప్రస్థాన ప్రకటనతో 'గమకం' పని పూర్తి కాదు. కొన్ని గమకాలని నిర్వహించడంలో,ప్రత్యేక శైలీవిధానంలో, ఖండికను ప్రస్తుతించే విధానాన్ని అమలు చేయడంద్వారా స్వరం ప్రాధాన్యత సంతరించుకుంటూంది. సంగీతంలో తాళ ప్రధానం ప్రత్యేక నాదశైలి, గణాంక స్వభావత, కలిపిన తాళ ప్రిక్రియ అంతర సమన్వయం, లక్షణలక్ష్యాలు, గణాంక నిబద్ధతతో కూడిన ఈ ప్రత్యేక 'తాళా విధానం - కర్ణాటక సంగీతానికి ప్రాణప్రదమైన ప్రక్రియగా అలరారుతోంది. సంప్రదాయ కర్ణాటక సంగీతంలో 'తాళా ప్రాధాన్య ప్రభావాలు ఖచ్చితమే కాకుండా, సుందరమైన అతివ్యాప్తి, అవ్యాప్తి దశలను సమంజసంగా అందజేస్తుంది. భారతీయ సంప్రదాయ సంగీతానికి ప్రతిభాపాటవాలను కలిగించిన సంగీత ప్రక్రియల్లో - తాళ ప్రాధాన్యత వేరేవాటితో పోల్చతగ్గదికాదు. శౄతి, లయ, తాళ దశ ప్రాణులు. సంగీతపర సాహిత్యంలో తాళ ప్రస్తావనలు, మార్గి, దేశి తాళ పద్ధతులు, లఘుదౄతం, అనుదౄతం, యిత్యాది విధాలుగా తాళం సంగీతంలో మిళితమై, సంగీత ప్రాభవానికి కౄషి సల్పుతోంది. ఆది, రూపక, మిశ్రచాపు, ఖండచాపు తాళాలు, కర్ణాటక సంగీతంలో ఎక్కువగా వినియోగింపబడిన తెగలు. అదే హిందూస్తానీ సంగీతంలో - చతురస్ర, లఘు, దౄతంతో, సామాన్యతాళం (తీన్ తాళ్) వినియోగింపబడినా, అధ్బుతమైన శైలికి దారితీస్తూంది. త్యాగరాజు, ఆయన కీర్తనలను అత్యధికంగా 'ఆదీతాళశైలిలోనే రచించడం జరిగిందని పండితులు చెబుతారు. పాశ్చాత్య సంగీత పద్ధతిలో 'సాధారణ సమయతాళం' వాడుకలో వుంటుంది అని చెబుతారు. సంగీత పరిజ్ణానం కన్నా రసికత, కళాహౄదయం ప్రధానం విశ్వసౌభ్రాతత్వం, వసుధైక కుటుంబం, మానవాళి మాధ్యమభాషగా అలరిస్తున్న సంగీతకళను ఆనందించి, ఆస్వాదించడానికి 'రసికతా, కళాహౄదయం' ప్రధానంగాని, విశిష్టజ్ణానం, అంతగా అవసరం లేదని అనుకోవచ్చు. నాదప్రధానమైన సరసస్వరసురఝరీగమనశైలిలో విరాజిల్లుతున్న సంగీతానికి ఎల్లలు, భాషా పరిధులు లేవు, రావు, రాకూడదు. రాగాలకు లింగ నిర్ధారణ సంగీతపరంగా సౄష్టించబడిన రాగాలకు ప్రాచీనకాలంనుంచే, లింగ నిర్ధారణ కూడ జరిగింది. మాతంగునిచే విభజింపబడిన ఈ పద్ధతి (500 క్రీ.పూ.)కి ముందే, శార్దూల, యస్తిక, దుర్గాశక్తి, కాశ్యపులచే స్త్రీ పురుష రాగాలుగా విభజన జరిగినా, సుస్ఫష్టంగా, పాల్కురికి సోమనాధుని (1300) బసవపురాణం ద్వారా సాహిత్యంలో ప్రస్తావన జరిగింది. అతనే, తిరిగి 'పండితారాధ్యచరితం' లో పునరుద్ఘాటించాడు. కాని, మూడవ లింగం (నపుంసక) లింగం ప్రస్తావించాడు. హిందూస్థానీ సంగీతంలో - 'రాగమాలా(1576), 'నర్తన నిర్ణయా (1605) రచ్కనల్లో, పుండరీక విఠ్ఠల ప్రస్తావించాడు. యిలా ప్రారంభమైన రాగ నిర్ధారణ ఎన్నో మలుపులు తిరిగాయని పండితుల అభిప్రాయం. 'రాగ-రాగిణీల జననసంయోగం రాజస్థాన్ సామ్రాజ్యాధిపతి - ప్రతాపసింహుడు (1779-1804), సంగీత-నాట్యశాస్త్రాలపై 'రాధాగోవిందసారం' ఉద్గ్రంధ రచనను చేయగా, దానిలో రాగ-రాగిణి ల జననం, హనుమన్మత శివతాండవాన్ని దేవతలు-రాక్షసులు వీక్షించేందుకు సమావేశమవగా, రాక్షసులు యిబ్బందులు కలిగించగా, దేవతలను రక్షించే ప్రయత్నంలో, రాక్షసశిక్షకు ప్రతీకగా, శివుడు తన అఘోరవదనం నుంచి 'భైరవరాగం, మిగతా నాలుగు వదనాలనుంచి - మాలకౌన్స్, హిందోళ, దీపక, శ్రీ, మేఘ రాగాలను జననం చేయించాడు. ఈ రాగాల్లాపన విని, రాక్షసులు భయకంపితులై వెళ్ళిపోగా, దేవతలు సంతౄప్తిచెందారు. అయితే, ఈ ఆరురాగాలు, శివుని ప్రార్ధించగా, పార్వతి సలహే మేరకు వరాలు ప్రసాదించిన భాగంగా, ఒక్కొక్క రాగానికి అయిదుగురు సహరచులని (రాగిణిలను) సౄష్టించి, ఈ రాగాలను గానంచేసినవారి ప్రతీకోరిక నెరవేరుతుందని అభయం వెలిబుచ్చాడని కధనం. వీరికి సంతానం పుట్టి ఆరు కుటుంబాలయ్యాయట. ఆరుగురు పురుష రాగాలకు, ఒక్కొక్క రాగానికి 5 స్త్రీరాగాలు, వీరికి 47 మంది సంతానం కలిగిందని కూడ కధనాలు దర్శనం యిస్తాయి. వెంకటమఖి విభజన యిలా సౄష్టింపబడిన రాగాలు, ఎన్నో సవరింపులతో, ఎందరో విద్వాంసులు చేసిన వేర్వేరు విభజనలు, చారిత్రాత్మకంగా పరిణామం చెంది, సంగీతశాస్త్రాన్వయంచెంది, అభ్యాస, శిక్షణాప్రక్రియల్లోకి, 17 శ. నాటి వెంకటమఖి ప్రతిభాప్రేరణలతో, 20 శ. నుంచి, ఒకకొత్త పధాన్ని తొక్కింది. ఫలితంగా, 72 మేళకర్తరాగ సంప్రదాయానికి నాందీ పలికింది. రాగవిభజన ప్రక్రియ కర్ణాటకలో ఉద్భవించి, పెరిగి, హిందూస్థానీ సంగీత పద్ధతిలో కూడ విస్తరించింది. కర్ణాటక సంగీతం, కన్నడిగల నుంచి రాగ విభజన, హిందూస్థానీ సంగీత విద్వాంసులు ప్రేరణ పొందారు. 20 శ. 'మేళా సంప్రదాయం పాటించి జనక-జన్యరాగాలపై దౄష్టిసారించడం జరిగింది. అహోబలాది సంగీతవిద్వాంసులు విరివిగా హిందూస్థానీపర రాగవిభజనను ఆచరించి, ఆదరించడం జరిగింది. చివరగా 1660 లో 'చతుర్దండిప్రకాశికా - తంజావూర్ లో ఉద్భవించింది. ఈ రచన, కర్ణాటక సంగీతం - ఆధునిక పోకడలను పోహళించుకుని - సంగీత పితామహుడు, మార్గదర్శకుడు - వెంకటమఖి రచనని చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ నుంచి, పండితుడు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అన్నవారు 1934 లో ప్రచురించిన వైనం సంగీతజగతి చేసుకున్న పుణ్యపరంపరలో భాగం. ఈ గ్రంధంలో, స్వరాలు (శుద్ధ, వికౄత), వాటికి లక్ష్యలక్షణాలని వివరిస్తూ, నిర్వచనోదాహరణాలను ప్రస్తుతించారు. సంగీతం - నాదవివరణం సంగీతం ద్వారా వచ్చే 'నాదా ధోరణులకు కూడ విభజన చేయడం జరిగింది. శరీరజ (శరీరం ద్వారా వచ్చే ధ్వని - గాత్రం), నఖజ (గోళ్ళద్వారా - వీణ, గొట్టువాద్యం, బిన్, సుర్ బహార్), ధ్వనిజ (వంగిన పరికరాలు - సారంగి, దిల్ రుబ, వైలన్), వాయుజ (గాలిమాధ్యమాలు - వేణువు, నాగస్వరం), చర్మజ (తోలుతొడిగినవి - మౄదంగం, తవిల్, తబల, డోలక్, తంబట్ట), లోహజం - లోహాలతో చేసినవి - సింబల్, తాళం). ధ్వని స్వఛ్ఛత, ప్రధానంగా విభజింపబడిన తరగతులు అని భావించాలి. దీనినే, తట, బితట, సుశిర, అనబధ్వ,ఘన సంగీత వాద్య పరికరాలుగా కూడ విభజించారు. కాలసమయ సందర్భస్ఫూర్తి - రాగనిర్ణయం రాగాల్లోని అంతర్లీన లక్షణాలనిబట్టి - ప్రకౄతి వాతావరణ, సమయాలకు అనువైన రాగాలను ప్రతిపాదించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర సమయాల్లో ప్రదర్శీచతగిన రాగాలను వివరించడం, వాటిని శాస్త్రీయంగా ఆచరించడం కూడ జరుగుతోంది. (ఉదాహరణకి : ఉదయం (భైరవి), మధ్యాహ్నం (సారంగి), సాయంత్రం (కళ్యాణి). శౄతిలయలు - సంగీతం ఆధ్యాత్మక, ధ్యానసంగీతానికి సంగీతం సన్నిహితం అన్నది సత్యం. సంగీతంలో శౄతి, ముఖ్యమైన అంశం. సంస్కౄతంలో సూక్తి ప్రకారం - 'శౄతిర్మాత: లయ: పిత:" - శౄతి తల్లి, లయ తండ్రి. సంగీతం - గాత్రంలేక వాద్యం - శౄతిసహిత ప్రదర్శన అయితేనే - మాతౄ సాదౄశకమవుతుంది. అదిలేనిదే, కేవలం గీతం కాని, సంగీతం అనిపించుకోదు. దక్షిణ, ఉత్తర భారత సంగీత ప్రాంతాల వారధి - వింధ్య కొండలు రాగ-రాగిణిల పున: సమన్వయం చేసి, గత ఐదు శతాబ్దాలుగా అనుసరింపబడుతున్న విధానానికి కొత్తరూపు, ఊపు నిచ్చిన సంగీత మహావిద్వాంసుడు - తాన్సేన్. ఫలితంగా, ఉత్తరభారత సంగీతం - వింధ్యాగిరుల ఆవలి సంగీతధోరణి అన్నది అవతరణకు వచ్చింది. వింధ్య పర్వతాలు భౌగౌళికంగా లేకపోతే - 'భారతీయ సంగీత సంప్రదాయ శైలీ అన్నది వేరే పద్ధతిలో ఉండేది అన్నది మరువరాని మాట. సంగీతం - తాన్ సేన్ అవిభాజ్యాలు 'తాన్ సేణ్ అంటే సంగీత స్వరాలు ప్రవహించే సైన్యం' అనే అర్ధం వస్తుంది. హిందు-ముస్లిం సంస్కౄతుల ఐక్యతాభావాన్ని ప్రతిబింబించేశైలి. 'రాం తాణ్ - హిందూ బ్రాహ్మణుడు ముకుంద్ పాండే కుమారుడు. ముస్లిం ముని - ముహమ్మద్ గౌస్, 'రాం తాణ్ లో బాలకళాకారుణ్ణి కనుగొన్నాడు. తాన్ సేన్ ముస్లింపేరు - మహామ్మద్ ఖాన్. ఆన్ సేన్ 1506-1589 మధ్యకాలంలో జీవించిన అసమాన ప్రతిభాశాలి. క్రమంగా ఆయన ప్రతిభకు గుర్తింపుగా - నవరత్న ఆస్థాన సంగీత విద్వాంసుల్లో - ఒకరిగా అక్బర్ పాదుషా ఆగ్రా రాజాస్థానంలో కొలువు సంపాదించడం జరిగింది. హరిదాసముని - తాన్ సేన్ లోని రహస్యాఅలను కనుగొని, బౄందావనంలో పదేళ్ళుగా అభ్యాసం పొంది, గ్వాలియర్ మహారాణి ఆస్థానంలో చేరాడు. హిందూకన్య - ముస్లింపేరు 'హుస్సేనీ'ని వివాహమాడగా, నలుగురు కుమారులు సంగీతకళాకారులుగా, కూతురు సరస్వతి, విణావిద్వాంసురాలుగా పేరుపొందడం వెనుక దాగిన కౄషి, సంకల్పం, దీక్ష, పట్టుదల, వర్ణనాతీతం. వింధ్యకు ఆవలి సంగీతధోరణులు వింధ్యపర్వతాలకు ఆవలిపక్కన, అనేక రూపాల సంగీత ప్రక్రియలు అలరించబడ్డాయి. అందులో 'ద్రుపడ్ గాత్ర సంగీతం దీర్ఘస్వరసహితం, బౄందావన - బ్రజ్ భాష (వ్రజ - గోపగోపికల భాష) సంబంధితం. బ్రిటిష్ దొరల పరిపాలనలో - కొత్త తరహా సంగీత ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. వాటిల్లో - ఖయాల్ ప్రక్రియ్ను శ్రీ పన్నాలాల్ ఘోష్ అన్వేషణలో ప్రఖ్యాతమయ్యింది. తుమ్రి - ప్రక్రియ కరుణ, శౄంగార రస ప్రాధాన్యతతో, 18-19 శ. లో భాగా ప్రచారమయ్యింది. యింక రవీంద్రసంగీతం సంగతి వేరే చెప్పనక్కరలేదు. నాటికీ, నేటికీ, బహుఋళ ప్రచారమార్గంలో పయనిస్తూనేవుంది. రవీంద్రసంగీతానికి మన మహానుభావుడు - మంగళంపల్లి బాలమురళికౄష్ణ - తనదైన ప్రతిభతో - ఒక కుదుపు కుదిపాడు అన్నది చరిత్ర చెప్పిన సాక్ష్యం. అమీర్ ఖుస్రో - ప్రముఖ సంగీత కళాకారుడి నూతన సౄష్టి - ఖవాలి - హిందువులు, ముస్లిములు సంయుక్తంగా గానం చేయబడుతున్న ప్రక్రియగా మారింది. అలాగే, ఘజల్ (ఆలాపనలేని, పర్షియన్ సంప్రదాయ కౄతి), ధున్ (స్వఛ్ఛంద రాగనిర్ణయంతో జానపద గుబాళింపు), గత్ (ఆలాపనకు ముందుగా) - పేరువహించాయి. భాష, సరిహద్దులు లేనిదే సంగీతకళ నిజమైన సంగీతకళాకారుడు - ప్రపంచం - చిన్న గ్రామమైపోతున్న సమయాన, గ్రామం కాదు - నిజంగా వసుధైవకుటుంబంగా మారిపోతున్నకాలంలో ఏ సంగీత ప్రక్రియనైనా, విశ్వవ్యాప్తం చేస్తూ అనుబంధం పెంచుకోవాల్సిన తరుణంలో, విభజనధోరణి పాటించరానిది అన్నది ఆలోచనాత్మకం. సంగీతం ద్వారా దక్షిణం, ఉత్తరం - ఏదైనాసరే, అందుకునే మధురానుభూతివల్ల రక్తాన్ని తాకుతూ, హౄదయాంతరాళ్ళోకి సూటిగా ప్రవేశింపచేయగలగాలి. మేధస్సుని ప్రశాంతంగా మలచుకోగలిగిన దివ్యౌషధంగా సంగీతం అన్నది మాత్రం సత్యం. ఆవేదన, ఆందోళనలను సుదూరం చేసి, మనసావాచాకర్మణా సిద్ధత్వం, శుద్ధతని ప్రసాదించాలి. జీవితాన్ని అందంగాను, ఆనందంగాను మార్చాలి. సంగీత స్వర కుటుంబీకరణం సారంగదేవుని 'సంగీతరత్నాకరం' (13 శ.), నారదశిక్షలో సప్తస్వరాలకు వేరుగా కుటుంబం, రంగు, కులం, స్వరసంకేతం, ప్రేరణాశక్తులు, ప్రకౄతిసిద్ధరూపాలకింద విభజన జరిగింది. భారతీయ సంగీతశాస్త్ర పద్ధతుల్ని - శౄతి, స్వర, తాళ, గమకాది విషయాల్లో వివరించడం జరిగింది. మారుతున్న విలువలు, ధోరణుల మధ్య సంగీతం 'భాషా విభజనకు దారితీస్తే, 'సంగీతం' కలుపుతోంది అన్నది సత్యం. నాగరికతకు ఏకైన శక్తి, సంగీతమే భాషగా మారింది. దైవత్వాన్ని పొందింది. విశ్వవ్యాప్తమైంది. అన్నిరకాల అవరోధాల్ని, పరిధుల్ని త్రోసిరాజంది. లలితకళల్లో - ఘనమైనది, అజరామరమైనది, సంగీతకళ ప్రధమస్థానం అందుకుంది. భారతీయతలో సంగీతం విలీనమైంది. ఉత్సవాలు, ఆరాధనోత్సవాలు జరుపుకుంటున్న పర్వకాలంలో ఉన్నాం ప్రస్తుతం. నాట్యాది కళలకు సంగీతం ప్రాణప్రదమైంది. ఉత్సవాల్లో భాగంగా - తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ దక్షిణప్రాంతాలతోపాటు, ఢిల్లీలోని ఖాజీనయీముద్దీన్-అర్స్, మరియు శ్రద్ధాంజలిలో భాగంగా, తులసీదాస్, కబీర్, తూకారాం, భక్తరామదాస్, పురందరదాసు, సూరదాస్, మీరా, అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న - తాన్ సేన్, త్యాగరాజ ఆరాధనోత్సవాలు కళాత్మకంగా జరుగుతూనేవున్నాయి. బహుళప్రజాదరణ పొందుతూనేవున్నాయి. ఆంధ్రదేశానికి వరప్రసాదం - సంగీత త్రిమూర్తులు - త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి మహానుభావులు స్వతహగా ఆంధ్రులు కావడం, యాదౄఛ్ఛికంగా ఆనాడు పరిస్థితులవల్ల దక్షిణాంధ్రప్రాంతానికి వలసవెళ్ళడం జరగడం కేవలం ఒక సంఘటనగానే పేర్కొనాలి. ప్రముఖాంధ్రులు, సంగీతకళాకారులు - ఈనాటి మంగళంపల్లి బాలమురళీకౄష్ణ,నేదునూరి కౄష్ణమూర్తి, ఈ పరంపరలోనే తమదైన ప్రతిభను అందిస్తూనే వున్నారు. అలరిస్తూనే వున్నారు. ప్రముఖ సంగీత వాగ్గేయకారులు రచనలను స్వయంగా నిర్మాణం చేసుకుని, వాటిని తనదైన ప్రతిభతో స్వరరాగబద్ధం చేసుకుని, గానం చేయగలిగిన త్రివేణీసంగమైన ప్రతిభను పుణికిపుచ్చుకున్న పుంభావసరస్వతీమూర్తులను వాగ్గేయకారులు అని భావించుకోవాలి. అట్టికోవలో, మనకు ఉన్న సంపన్నమూర్తులు - జయదేవుడు, పురందరదాసు, సూరదాసు, తులసీదాసు, అన్నమయ్య, పెదతిరుమలాచార్యులు, నారాయణతీర్ధులు, క్షేత్రయ్య, రామదాసు, సారంగపాణి, పోతులూరి వీరబ్రహ్మం, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, సుబ్బరాయశాస్త్రి, స్వాతితిరుణాల్, మైసూర్ వాసుదేవాచార్య పరంపరను ముందుకు కొనసాగిస్తున్న మంగళంపల్లి బాలమురళీకౄష్ణని ప్రముఖ వాగ్గేయకారుల్లో చెప్పుకోవాలి. ప్రపంచ సాహిత్యాలన్నిటా పద, పద్యకవితల్లో పదమే ప్రారంభం అన్న విషయం పండితలోకానికి విదితం. సంకీర్తన పద్ధతిని కౄష్ణమాచార్యుని 'సింహగిరీ వచనాలతో ప్రారంభమైనా, అన్నమాచార్య సంకీర్తనలతోనే పదరచన సమున్నతస్థాయికి వచ్చింది. నేటి భారతీయ సంగీతం లో వివిధ ప్రక్రియలు కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలు స్థూల విభజన అయితే, భక్తి, కాలక్షేపం, నాట్యం, జానపదం, జాతీయత, దేశభక్తి సంగీతపద్ధతులు ప్రస్తుతకాలంలో అలరింపులుగా ఉన్నాయి. కర్ణాటకసంగీతంలో - కచేరీ సంప్రదాయాన్ని అనుసరించే పద్ధతితోపాటు, గీతం, స్వరజతి, జతిస్వరం, వర్ణం, కీర్తన, కౄతి, రాగమాలిక, తాళమాలిక, పదం, జావళీ, తిల్లానా లను ప్రముఖంగా ప్రస్తావించాలి. ఆఖరుగా ప్రస్తావిస్తున్నా, ప్రముఖ శాఖలుగా విరాజిల్లుతున్న - లలితసంగీతం, జానపదసంగీతం, చిత్రసీమకు ఆయువుపట్టైన చిత్రసంగీతం శాఖల్ని కూడ మరువరాని మెరుపులు, సంగీతకళకు ముఖ్య ప్రస్థానాలు. సంగీతం గురించి .. ఎందరోమహానుభావుల పలవరింతలు. సంగీతం గురించి ఎందరో మహానుభావులు నిర్వచించారు, నిర్ధారించారు. వర్ణించారు. అనుభూతిని ప్రకటించారు. సూక్తులను వల్లెవేశారు. దాని సారాంశం యిలా చెప్పుకోవచ్చు. నానాటికి ఆత్మకి పట్టే మలినాలని దూరం చేయగలిగేది - ఈ సౄష్టిలో ఒక్క సంగీతమే - ఎవర్టెక్. ఎంతటి కోలాహలంలోనైనా సంగీతాన్ని వినగలిగే మనుషులు జీవితంలో గొప్పగొప్ప ఫలితాలని సాధించినట్లే. - డా. విక్రం సారాభాయి. తన సంగీత మధురిమలులేని మనిషి, మధురమంజుల సంగీత సుస్వరాలకి స్పందించని మనిషి, సౄష్టిలోని సున్నితమైన అధ్బుతాలని అందుకోలేడు. - షేక్స్ పియర్. పగిలిముక్కలై చెదరిపోయే హౄదయానికి దివ్యమైన ఔషధం - సంగీతం. - యం. హంట్. సంగీతాన్ని దేవతల భాషగా అభివర్ణించడం సబబే. - కార్లైల్. మనం పాడకపోతే హృౠదయం బీటలు వారుతుంది. - ఠాగూర్.
ప్రపంచవ్యాప్తంగా సంగీతోత్సవం - 1 అక్టోబర్.
ప్రపంచంలోని వివిధవర్గ, జాతులమధ్య సఖ్యతకోసం, సంస్కౄతులమధ్య సమన్వయం, ఆదాన ప్రదానాలకోసం అంతర్జాతీయ సంగీతోత్సవాల్ని జరుపుకునే సత్సంప్రదాయంలో భాగంగా, 1971 అక్టోబర్ 1975 నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రముఖ సంగీతకళాకారుడు యెహందిమెనుహిన్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ శుభదినోత్సవాలు ప్రతీఏట జరుగుతూనే ఉన్నాయి. విశ్వమానవాళికి సంగీతనాదాలు వినిపిస్తూనేవున్నాయి. తారకమంత్రంలా దివ్యశక్తిని అందిస్తూనే వున్నాయి. కొసమెరుపు హౄదయసంగీతాన్ని ఎప్పుడూ కాగితం మేద పెట్టలేం. - పాబ్లో కాసల్క్స్. సంగీతం పలకలేని ప్రేమభావన ఏమున్నది ? - జాన్ డ్రైడన్.
Subscribe to:
Posts (Atom)