Monday, September 28, 2009

జానుతెనుగు కవితురంగం - గుర్రం జాషువా

జానుతెనుగు కవితురంగం - గుర్రం జాషువా జయంతి - 28 సెప్టెంబర్



( 1895 - 1971 ) మధుర శ్రీనాధుడు బ్రతుకు బాధల చేదును ఆస్వా
దింత ద్వారా సంకుచిత మతాతీతమైన కవితలను వెలువరించినవాడు. ప్రజల నాలుకలయందు జీవించిన సుకవి. సంస్కార ప్రియుల హౄదయాల్లో జీవిస్తున్న వ్యక్తిత్వం. కవిత్వాన్ని అతని వ్యక్తిత్వంనుంచి విడదీసి చూడలేని అవిభాజ్యస్థితి. ఉభయత్రా కారకాలు. ఎన్నో బిరుదుల్లోకి, సుస్థిరత్వంగా నిలచిపోయినది, కవికోకిల. కవితాదౄక్పధం, భావకవితానిరసనం, నిసర్గశైలి, సంఘసంస్కరణం, అభ్యుదయభావన, ప్రత్యర్ధులధిక్కారం, మచ్చుకు కొన్నిమాత్రమే, అయినా, వెరసి, మధుర శ్రీనాధుడు. ఎవరనుకుంటున్నారా - నవయుగ కవిచక్రవర్తి, జానుతెనుగు కవితురంగం, గుర్రం జాషువా. వినుకొండ నివాసి విలక్షణత విష్ణుకుండినుల అకుంఠిత ధర్మనిష్ఠానిర్మాణ నిపుణతకు, చండప్రచండ పవనాలకు ప్రఖ్యాతమైన వినుకొండ ప్రాంతమది. వికసితబాల్యప్రాయంలో వడిగా అడుగులేస్తున్న బుడత. మండువేసవిగాడ్పులను శీతలపవనవీచికలుగా భావించి నడుస్తున్నా, అతని చక్షువులను వీక్షిస్తేమాత్రం కలవరిస్తున్న హౄదయవేదన వెల్లడవుతున్నది. 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ పుణ్యదంపతులకు జన్మించిన పుత్రరత్నం. కులప్రస్తావన కుతకుతలా ఉడుకుతున్న ఉన్మాదపు రోజులవి. పైగా, తల్లిదండ్రులు, వేర్వేరు కులాల ప్రతినిధులు. తండ్రి యాదవుడైన క్రైస్తవమతస్వీకర్త, తల్లి ఆది ఆంధ్రజాతి. ఈ రెండు విషయాలు కలసి రగిలిన నిప్పురవ్వల తూటాలుగా మారాయి. బాల్యంలోనే హౄదయాన్ని దహించెవేశాయి. పచ్చపచ్చని పైరుపొలాల మధ్య పరుగులెడుతూ గడపిన బాల్యం, చదువుకోసం వెళ్ళే బడి విషయానికొస్తే, కష్టాలకడలి రివ్వున తరంగాలై తాకింది. విద్వత్తులో మునిగిన వినుకొండ, విలక్షణమైన వికటంగా మారింది. అగ్రవర్ణతత్వం, అస్పౄశ్యతామనస్తత్వం రాజ్యమేలుతున్న కాలానికి ఎదురీది, పుత్రాశ్రువులను తుడిచి తనను తాను తమాయించుకున్న జనని సంకల్ప దీక్షాకంకణబద్ధురాలై, బాలుని పాదయాత్రతో మేధాయానం కావించింది. యిన్ని యిబ్బందులు, అవమానాలు ఎదురైనా, అన్నింటినీ దిగమింగుకుని, ఉన్నత పాఠశాల చదువు ముగించుకుని, ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేశారు. రాజమండ్రిలో మూకీ చిత్రాల వ్యాఖ్యాతగా, చింతామణి నాటకమండలిలో నాటకకర్తగా పనిచేసిన జాషువా, 1919-1928 కాలంలో గుంటూరులోని లూధరన్ చరి ఉపాధ్యాయ శిక్షణాసంస్థలో అధ్యాపక వౄత్తిని చేపట్టారు. 1928-42 లో గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలల్లో తెలుగుపండితపదవిని నిర్వహించిన ఉభయభాషాప్రావీణ్యుడు. ఆ తర్వాత, జాతీయ యుద్ధ ప్రచారక సంఘంలో ప్రచారకులుగా, మద్రాసు ఆకాశవాణిలో నిర్మాతగాను ఉద్యోగం నిర్వహించారు. 1964లో ఆంధ్రప్రభుత్వం శాసనమండలి సభ్యత్వం కేటాయించింది. నిర్వహించే ఉద్యోగం ఏదైనా, జీవనసాధనంగానే భావించారు. జన్మత: కవి అయిన జాషువా, కవిగా కష్టతరమనుకున్న, జాషువా బడిపంతులు పదవిని ఎన్నుకున్నారు. అవధానం కలిగించిన ప్రేరణ వినుకొండలో జరిగిన సాహిత్యావధానంను గమనించి, అవధానిని ప్రశంసించాలని, బాలకవి పద్యాలతో వేదికనెక్కబోతే, అంటరానితనమని ఆడ్డుకొట్టడం, జాషువాని కౄంగదీసింది. అలా అవమానింపబడడం, జాషువాలో సంకల్పం సంతరించుకుంది. ఫలితంగా, 'నవ్యయుగోచితంబులై ఆకటి చిచ్చు లార్చు హౄదయ విదారక దయా కధాంశాలూ అని ప్రస్తావిస్తూ, విశ్వమానవ సౌభ్రాత్రత్వం, నిర్మలత్వం, నిర్జాతి సంఘస్థాపన కోసం కంకణబద్ధతని పాటించాడు. ఇంతై, బాలుడింతింతై, కవికోకిలై, నవయుగచక్రవర్తిగా, విశ్వనరుడైనాడు. అసమసమాజం బాకులు రువ్వినప్పుడు, అంటరానితనం విషాగ్నులు విసిరినప్పుడు, కటికదారిద్ర్యాన్ని అనుభవించవలసినప్పుడు, ఆవేదన గుండేల్లో కుతకుతలాడినప్పుడు, గుర్రంజాషువా గభాలున గుర్తుకు వస్తారు. జాషువా కవిత్వంలో జానుతెనుగు మానవత్వం, హేతువాదమూలాధార కవనేతివౄత్తాలు, మధురోహలతో నిండినవి జాషువా ఖండకావ్యాలు. ఫిరదౌసి, గబ్బిలం, శ్మశానవాటికలాంటృఇ ఖండకౄతులు ఓంకౄతీ ప్రతిధ్వనిత ప్రతిఘటనలు. అవ్యక్తమధురిమ కుహూగీతాలాపనలు విశ్వాంతరాళాన మారుమ్రొతలా అన్నట్లు వుంటాయి ఆయన కౄతులు. సూటిగా, ధాటిగా, వాడిగా, రసావేశజీవనాడిగా, ప్రాణసదౄశంగా చేసిన కవనప్రయోగాలు. దైన్య, ప్రబోధ, నిర్వేద, క్రోధ, జదఘ, ఉగ్రత, చింత, అమర్షాదులను ప్రత్యక్షీకరించిన విధానాలు, కరుణ, వీరరసభరితాలు. మతవైషమ్య, అసస్పౄశ్యత, అంధ విశ్వాసం, దారిద్ర్యం, నిరసనలాంటి అంశాలను పునాదిగా సంఘసంస్కరణలను కూడ ప్రతిబింబించేలా కవిత్వం గోచరిస్తుంది. మహాత్మపధం, మహాబోధి దౄక్పధం, యుగోచిత ప్రగతి దౄష్టిలను దౄష్టిలో పెట్టుకుని నిజాభ్యుదభావకవితలను అల్లాడు జాషువా. ముంతాజ్ మహల్, కాందిశీకుడు, స్వప్నకధ, బాపూజీ, నేతాజీ, స్వయంవరం, ముషాఫర్లు, క్రీస్తుచరిత్రము, కొత్తలోకం, అవయము, అనసూయ, శివాజీ చరిత్రాది కావ్యఖండికలు దేశచరితావగాహనకు మచ్చుతునకలు. వీరాబాయి, తెరచాటు నాటకాలు, నా కఢ వెరసి రాశితోకూడిన వాసితనపు జానుతెనుగు కవితారసవంతాలు, జాషువా కలంనుంచి అందిన నజరాణాలు. రాజు మరణించె నొక తార రాలిపోయె, కవియు మరణించె నొక తార గగనమెక్కె, రాజు జీవించె రాతి విగ్రహములను, సుకవి జీవించి ప్రజల నాలుకలయందు, యని సుకవికి మరణమే లేదు అని చెప్పినతీరు అధ్బుతం. అపర రవీంద్రశైలి రవీంద్రుని కవిత్వం గురించి చెప్పిన పద్యంలో, సహజరాజసం, కులుకుల పసందు, బిగువు, మెరుపులతోపాటు, మధురసమును కడుపును మాటుకున్నట్లు, ద్రాక్షఫలకుచ్చములయందములుకూడ గోచరిస్తున్నట్లుగాను, వరకవీంద్రుని కావ్యప్రపంచమందు ప్రతిపదంబున మదికి దర్శనమిస్తాయి అని సుందరంగా వర్ణించాడు. ఈ భావనే జాషువా కవితాదౄక్పధం కూడ గోచరిస్తుంది. కవితాస్వరూపానికి వర్ణాక్షరమాలగా భావించవచ్చు. పద్యనిర్మాణపటిమ, పదాల అల్లిక లో ప్రత్యేకతలు జాషువాకు పద్యాన్ని చిత్రక పట్టడం తెలుసు. భావాన్ని చిత్ర చిత్రాలుగా కూర్చడమూ తెలుసు. సూటిగా, సెలయేటి ధాటిగా, వాడిగా, రసావేశజీవనాడిగా, కవితలు చెప్పడం రుచితో, అభిరుచితో ప్రత్యేకగుణాన్ని అలవరచుకున్నాడు. అతని కవిత్వానికి ఆవేశం జీవం. అసలు ఏకళకైనా రసావేశమే ప్రాణసదౄశ్యం అంటారు, ప్రముఖ కవి నారాయణరెడ్డెగారు. ఈ రసావేశం లేనివారు, బుర్రతో చూస్తారు, బుద్ధితో వ్రాస్తారు. కాని జాషువా అనుభూతితో చూస్తాడు. ఆవేశంతో వ్రాస్తాడు. ఆ ఆవేశాన్ని వెల్లువలా కాకుండా, పిల్లకాలువలా ప్రవహింపచేస్తాడు. ప్రణాళికాబద్ధంగా ప్రవహింపచేసే ఉత్తమకవిత్వాన్ని సౄష్టించబడగలుగుతుంది. జాషువా రసావేశానికి, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, గబ్బిలం,శ్మశానవాటి ని ఉదాహరించవచ్చు. రసావేశంతో పాటు తమాషా, చమత్కార ప్రయోగాలను చేయడం, జాషువా ప్రత్యేకత. పగలు - అంటే దినమని, విరోధాలని, ఏకాయేకా - కా ఆంటే ఏకా ఒక్కడేకదా అని, లాంటివి అక్షరలక్షలు బహువర్ణితాలు. జాషువా నవ్వులు నవ్యాలు నవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవౄత్తికిన్ దెవ్వెలు, కొన్ని నవ్వులెటుతేలవు, కొన్ని విషప్రయుక్తముల్, మువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లేనవ్వులు సర్వదు:ఖదమనంబులు వ్యాధులకున్ మహౌధుల్, అంటాడు. అందుకే జంధ్యాల నవ్వలేకపోవడం ఒక రోగం అంటాడు. శ్మశాన వాటిక - అనుభూతికి రసానుభూతికి ప్రతీక ఇచ్చోట; నేసత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోకఋరగిపోయే అంటూ, రాజన్యుని అధికారముద్రిక, ఇల్లాలి నల్లపూసల సౌరు, చిత్రలేఖకుని కుంచి, ని చేరుస్తూ, చివరకు, ఇది మరణదూత తీష్ణము, అవని పాలించు భస్మ సింహాసనంబు అన్నాడు. ఈ భావనాపటిమ వేలకవులల్లో ఒకరిని చూడగలుగుతాము. చివరికి ఎవ్వరేమన్ననండ్రు నాకేమి కొరత, అని ప్రత్యర్ధులను ధిక్కరించాడు అపర మధుర శ్రీనాధుడు. కవులు వర్ణాతీతులు; వారి కవిత్వాలు వర్ణనాతీతాలు; ఈ జాబితాలో జాషువాని, ఆయన ఈ లోకంలోకి అందించిన భావవరప్రసాదగుళికలు జానుతెనుగుభరిత కవనఖండికలు, నిత్యస్మరణాలు, నిత్యపారాయణాలు. సరిసములు లేని సన్మానాలు, సత్కారాలు కవిలో ప్రతిభాపాటవాలని బట్టి సన్మానాలు, సత్కారాలు వరకన్యకల్లా వస్తాయి. ఎన్ని కుల, జాత్యంహకారాలు, నిరసనలవెల్లువలు జాషువాపై ఆనాటి అసభ్యసమాజవర్గం ప్రయేగించినా, కనకాభిషేకాలు, గజారోహణాది సత్కారాలు, గండపెండేరాలు, అగణిత సన్మానగౌరవాలు దొరికాయి మన జాషువాకి. పద్మభూషణ, కళాప్రపూర్ణ, కవికోకిల, కవితా విశారద, నయయుగ కవిచక్రవర్తి బిరుదుల ప్రదానాలు చేయడం జరిగింది. అంటరానితనం, వెలివేయడం అన్నది జరిగినా, చివరకు ఆనాటి ప్రముఖాస్థానకవివర్యులు చెళ్ళపిళ్ళశాస్త్రీయ కరకమలాలతో గండపెండేరపు కీర్తి దిగ్దింగంతాలకు వ్యాప్తి చెందడం జరిగిందని మరువలేము; మరువరాదు. మహాకవులచే ప్రశంసించబడిన కవి మనకవి జాషువా. జాషువా, కవిత్వం ద్వారా తన పదునైన కలాన్ని ఉపయోగించాడని, తద్వారా జనితమైన వేదనావేశములను అనుభవించిన ఆయన శైలిలో వాటిని ప్రకటించడం జరిగిందన్న వాదన కూడ ఆనాడే బహుళ ప్రచారంలోనున్నట్లు పలు కవివర్యులు చెప్పడం జరిగింది. బహిష్కరణలు ఆనాడు సర్వసామాన్యం అనుకోవడం సబబు కాదని, ఆవేదనలకు,మనస్తాపాలకు కారణాలు అనేకం వుండవచ్చును అని, ఆ రోజుల్లోనే హరిజనులకు చాల గౌరవమర్యాదలు, సహవాస, సహపంక్తి వరుసలు కూడా పాటించారని, జాషువాతోటి సమకాలీన హితులు,కవులు అనేకులు తమ స్మౄతులను పలవరించిన సందర్భాలు అనేకం. జాషువా తాను కిరస్తాని మతాన్ని స్వీకరించినా, హిందూమతం, మతదేవతలను ఎన్నడూ విమర్శించలేదన్నది కూడ సత్యం. విశ్వమానవ సౌభ్రాత్రత్వం, విశ్వశాంతి, మతవర్గరహిత సమ సమాజాన్ని కోరినవారిలో జాషువాను ప్రధమ పంక్తిలో గణించవలసిన ప్రతిభను తన కవిత్వం ద్వారా చూడగలగడమే సాక్ష్యం, సంకేతం. మరణం లేని నిత్యనివాసి - గుర్రం జాషువా గిజిగాడి గూడు అల్లిక, సాలీడు వెలవేత, నెలబాలుడి వెన్నెలల విరజిమ్ములాటలు, ముక్తక ముత్కాఫలాల నీటి నిగనిగలు ఉన్నంతకాలం, గుర్రంవారి ప్రతి పద్యానికీ వెలుగే; ప్రతి పదానికీ మిగులే; గుర్రంవారు వ్రాసింది ఎంత? బాలికుల ప్రశ్న. అమరుకకవే: ఏక: శ్లోక: ప్రబంధ శతాయతే అన్నది సహౄదయ సూక్తితోను, 'ఏకపద్యం ప్రబంధ శతాయతే అన్న దేవులపల్లి కౄష్ణశాస్త్రివారి ఉవాచతో, జాషువాను భావిస్తూ, ఈ స్మౄతివ్యాసాన్ని ముగించడం ఔచిత్యమే కదా! నవయుగ కవిచక్రవర్తి, దళితవర్గజ్వలస్ఫూర్తి, జానుతెనుగు కవితురంగం - మన గుర్రం జాషువా కలంనుంచి జాలువారిన 'క్రీస్తుచరితం' అన్న కవితారచనకు కేంద్రసాహిత్య పురస్కారం లభించడం మన సాహితీప్రేమికులకు మరువరాని, మరువలేని అనుభూతి. గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా తెలుగురథం సాహితీ నివాళ్ళను ఘనాతిఘనంగా సమర్పించుకుంటోంది. కొంపెల్ల శర్మ - తెలుగురథం.


Saturday, September 26, 2009

చిలకమర్తి లక్శ్మీ నరసింహం జయంతి - నేడే


చిలకమర్తి లక్ష్మీనరసింహం ( 1867 - 1946 ) జయంతి - 26 సెప్టెంబర్



చిలకమర్తివారి ప్రతిభాపర్వం
పండిత పామరులకు అందుబాటులో ఉండే శైలిలో రచనలు సాగించి తెలుగు పఠితలోకానికి వినోదాన్నీ ప్రసాదించిన మహనీయుడు. ఆయన చారిత్రక, సాంఘిక పౌరాణిక నవలలు, జీవిత చరిత్రలు, స్వతంత్ర, అనువాద నాటకాలు, స్వీయచరిత్ర, ఆశుపద్యాలు, తెలుగువాళ్ళకు ఆవశ్యపఠనీయాలయ్యాయి. సంఘసంస్కరణోద్యమంలో కందుకూరివారికి బాసటగా నిలిచిన ప్రజాసేవాపరాయణుడు. వీరి పేరు వినగానే, వెంటనే స్ఫురించేవి - నీవు చెప్పిన విద్యయే నీరజాక్ష, ముదితల్ నేర్వగరాని విదకలదే ముద్దార నేర్పించినన్, భరతఖండంబు చక్కని పాడియావు, వంటి పద్యోక్తులు, సామెతలు సంపాదించుకున్న ప్రాచుర్యాన్ని అందుకో జాలినవి. ఆయన భాషలోని సారళ్యం గురించి అనుభూతి చెందవలసినదే కాని వర్ణించలేము. ఆ మహానుభావుని రచనలు చదువనివాడు, అధునిక ఆంధ్ర సాహిత్యాద్యానవనంలో ఒక విరబూచిన అరుదైన ప్రసూనవల్లరిని చూడలేనివాడై, ఆఘ్రాణించని వాడుగా చరిత్రలో చిరస్థాయిగా స్థాపితమవుతాడు. ఆయన పేరు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు. జీవన్విద్యోద్యోగపర్వాలు పశ్చ
తన ప్రజ్ణాచక్షువులతో లోకాన్ని
సంమగోదావరిజిల్లా, పెరవలి మండలంలోని ఖండవిల్లి గ్రామంలో వెంకన్న, రత్నమ్మ పుణ్యదంపతులకు 1867 సెప్టెంబర్ 26 న జన్మించిన చిలకమర్తివారు ఒక బ్రాహ్మణకుటుంబంలో జన్మిచారు. వీరవాసరం, నరసాపురంలో ప్రాధమికవిద్య, రాజమండ్రి హైస్కూలులో పట్టంచేబూనడం, 1889లో ఆర్యపాఠశాలలో ఉపాధ్యాయపదవి, యిన్నీసుపేట, మున్సిపల్ స్కూళ్ళలో విద్యాబోధన సాగించారు. తర్వాత సరస్వతి పత్రికాసంపాదకునిగా చేసి, ఉద్యోగానికి స్వస్తిచెప్పి, ఆపైన హిందూ సెకండరీ పాఠశాలను స్థాపించి, తొమ్మిదేళ్ళు నడిపిన తదుపరి, ఈ సంస్థని వీరేశలింగం హైస్కూలుగా మార్చబడింది. దురదౄష్టవశాత్తు 30 ఏళ్ళకే రేచీకటి వ్యాధికి గురైనాకూడా, ఆ అవరోధాన్ని త్రోసిరాజని, తన రచనలను కొనసాగించడంలో చిలకమర్తిగారికున్న పట్టుదలను, ప్రతిభను కొనియాడక తప్పదు.
వైవిధ్యభరిత ప్రతిభారంగాలు
హేమలత, అహల్యాభాయి, సుధాశరశ్చంద్రం లాంటి ముఖ్య నవలలను రచించారు. సరస్వతి పత్రిక సంపాదకులుగా ఉన్నప్పుడు, సౌందర్యతిలకం, పార్వతీపరిణయం రచించారు. యివికాక ఎన్నో రచనలను వ్రాశారు. చిలకమర్తివారి రచనలను మొత్తంగా ప్రచురణకావడం, 1943లో ఆంధ్రవిశ్వవిద్యాలయంవారు కళాప్రపూర్ణ సత్కారంతో సన్మానించడం జరిగింది. సాహిత్యంతోపాటు, సంస్కరణాభిలాష ఉపాధ్యాయకత్వం, పత్రికాసంపాదకత్వం, రచనావ్యాసాంగాలతోపాటు, చిలకమర్తివారిలో నిస్కళ్మష మనోప్రవౄత్తితో నడిపించిన పధంగా సంఘసంస్కరణ కార్యక్రమం చెప్పుకోదగ్గ అంకం. మొదటితరం సంస్కరణవేత్తగా 1909లో సంఘంలో వెనుకబడిన వర్గప్రజలకోసం పాఠశాలను స్థాపించడమే కాక, పుష్కరపైకాలం నడపడంతోపాటు, బ్రహ్మసమాజం, హితకారిణీసమాజం వంటి సంస్కరణాధ్యేయంగల సంస్థలతో పాలుపంచుకున్న కార్యక్రమాలు, దేశమాత అనే వారపత్రికద్వారా తెల్లవారి పరిపాలనకు వ్యతిరేకంగా వ్యాసాంగం కావించడం కూడ జరిపారు. యితర ప్రత్యేక వ్యవహారాలు మొదటినాటకం కీచకవధను 1889 జూన్ 15న ప్రదర్శించి మెప్పుపొందడం జరిగింది. కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిట్ శివానందశాస్త్రి, చిలకమర్తివారిని స్థానిక షేక్స్ పియర్ అని ప్రశంసించేవారు. అనేకమ
నరసింహంగారు ప్రముఖ కవి, రచయిత, నాటకకర్త, పాత్రికేయుడు, సంఘసంస్కరణవాది, విద్యావేత్త. తెలుగుసాహిత్యాభివౄద్ధికీ, తెలుగుసీమలో ఆధునికభావవికాసానికీ, సేవలనందించిన ప్రముఖుల్లో చిలకమర్తివారు ప్రధమగణంలోకి వస్తారు. కేవలం యిరవైరెండేళ్ళ ప్రాయంలోనే రచించిన గయోపాఖ్యానం నాటకం తెలుగుసాహిత్యంలో కనీ వినీ ఎరుగని విషయం. అంతేకాక, ఈ నాటకంలో, టంగుటూరి ప్రకాశం పంతులుగారు, అర్జునుడి వేషం వేయడం అంతకన్న ప్రాధాన్యత సంతరించుకుంది. 1908లో ముద్రణాలయాన్ని స్థాపించడం, 1916లో గణపతి, రాజరత్నం వంటివి ప్రచురించారు. పాఠశాలలోనున్నప్పుడే పద్యరచనలను ప్రారంభించడం, వరుసగా అనేక రచనలను వ్రాయడం జరిగింది. మొదటి నాటకంగా వ్రాసిన కీచకవధ, ద్రౌపదీపరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామజననం, సీతాకళ్యాణం, పారిజాతాపహరణం లాంటి నాటికలను, రామచంద్రవిజయం
,ర్లు ప్రదర్శించబడిన గయోపాఖ్యానం నాటకం వసూళ్ళుగా లక్షకుపైగా టిక్కట్లు అమ్ముడుపోవడం, యిప్పటివరకూ కూడ రికార్డు అనే చెబుతారు. 1894లో ఆయన వ్రాసిన రామచంద్రవిజయం సామాజిక నవలకు న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతిని గెలవడం కూడ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. చిలకమర్తివారు స్వల్పకాలం అవధానప్రక్రియలో కూడ తన ప్రతిభను ప్రదర్శించారు. చిలకమర్తివారు సంకల్పించిన హరిజనోద్ధరణ కార్యక్రమం, మహాత్మాగాంధి దక్షిణాఫ్రికానుంచి భారతదేశం చేరుకోకముందే, ప్రత్యేకంగా పాఠశాలను స్థాపించడం చాలా గొప్పవిషయం అనే చెప్పాలి. నరశింహంగారి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం, అద్భుతం అని పలువులు విశ్లేషించారు. మంచి వక్తగా శ్రోతలను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం బాగా పరిపాటి. యివి చాలక, చిలకమర్తివారు భారత జాతీయ కాంగ్రేసు కార్యకలాపాల్లో చురుగ్గా పోల్గొనేవారు. చిలకమర్తివారి సాహిత్య ప్రతిభోదాహరణాలు భరతఖండం చక్కని పాడియావు
చరిత్రలో స్థానం సంపాదించుకున్నట్టి ఘనత ఆయనదే. చిలకమర్తివారి పకోడీ పద్యాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కోడికి బదులు పకోడీ తినమని బ్రాహ్మణులకు బ్రహ్మ వరమిచ్చాడని, లక్ష్మణుడు మూర్చకు మారుతికి పకోడీ వుందని తెలియక సంజీవని కోసం పరిగెత్తాడని, చమత్కారంగా హాస్యంగా రచన చేశారు. కందం చెప్పినవాడే కవి అన్న వాడుకను సార్ధకం చేశారు. సాధారణంగా వాడుకలో చెప్పే, ఆసేతు హిమాచలం అన్న ప్రయోగాన్ని, తుహినాద్రి మొదలు సేతువుదాల అని పైనుంచి క్రిందికి వరస చెప్పటం చిలకమర్తిశైలి చమత్కారం అనే చెప్పాలి. దీపంకింద నీడ, గులాబికిముళ్ళు, చందమామకిమచ్చ, చల్లని వానకిపిడుగు లాంటి ఉపమానాలు మాత్రం దొరతనానికి తగునా అని ప్రశ్నించారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం మార్గాన - అధికార భూతాలు అడెగే లంచం, మునసబు కరణాల ముడుపులు, యజమానులకు పంటలో అర్ధభాగం, పైకమిచ్చినవానికి వడ్డీలు, యిచ్చుకునే కాపుకి మిగిలిందేమిటి అని కూడ ప్రశ్నించారు. 1897 లో విక్టోరియారాణి వజ్రోత్సవం, అరవయ్యేళ్ళ పరిపాలన సందర్భంలో, రాజమండ్రిలో జరిగిన సభలో, చిలకమర్తివారు అనేక సీసపద్యాలు సిద్దహస్తత్వంతో చదవడం, పైగా పాదాల చివర, జోలపాట, చిత్తజల్లు, కందపెరడు, విల్లిపిడుగు పదప్రయోగాలు అంతరార్ధాలు చక్కగా గోచరిస్తాయి. తనదేహము, తనగేహము, తన కాలము తన భవమ్ము తన విద్యజగజ్జనులకు వినియేగించిన ఘనుడిగా వీరేశలింగం మరణించినప్పుడు చెప్పిన పద్యం కడు సార్ధకమైంది. పోతనగారు చెప్పిన పద్యం, మన సారధి మన సరిచుఘు మన నెయ్యము అన్నరీతిలో, చిలకమర్తివారిస్నేహం కందుకూరివారిపట్ల వున్న భవం వ్యక్తమవుతోంది. చిలకమర్తివారి గీతమంజరి పద్యాలు వేమనవిలా, పంచతంత్రకధల్లాగ, దీనకల్పద్రుమ అనే మకుటంతో 200 పై చిలుకు పద్యాలను మనోరమ పత్రికలో ప్రచురించడం, భక్తిరసప్రధానమైన రచనగా ఎదపలికినపుడు మ్రోగే భక్తిపరంపరగా పేర్కొనబడ్డాయి. రాతిబొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురాలు కుంభములను, కూడు గుడ్డ తానుకోరునా దేవుడు అని వేమనకు సరిపోలిక అయింది. పద్యరచనా చమత్కారంతోనే నాటకరంగాన్ని వశపరచుకోవడం, ఆశుకవితలు, శతకపద్యాలు, నాటకపద్యాలు ఏవైనా, చిలకమర్తివారి చేతపడి, నోటపడి, ధన్యమైనాయన్నదాంట్లో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. చిలకమర్తివారిని కవిగా పరిచయం చేసింది, వారు వివిధ సభల్లో చదివిన పద్యాలనే చెబుతారు. వేదం వెంకటరాయ శాస్త్రిగారి సన్మానసభలో చిలకమర్తివారు పద్యాలు చదవడం, మెచ్చుకోవడం, తర్వాత ఆశుపద్యాలు, నాటకకర్తగా, నవలారచయితగా, ప్రహసనకర్తగా, ప్రసిద్ధికెక్కిన చిలకమర్తివరి కవితావైభవం తెలుగు సాహిత్యంలో సముచితస్థానాన్ని సగౌరవంగా సంపాదించడం ఆయన ప్రతిభకు సహజతార్కాణాలు. చిలకమర్తివారి స్వీయచరిత్ర చిలకమర్తివారి స్వీయచరిత్ర వీరేశలింగంవారి చరిత్రకు అనుబంధం వుందనిపిస్తుందంటారు. తిలక్ నిర్యాణం నుంచి స్వాతంత్రోదయం వరకు సామాజిక పరివర్తనను చిలకమర్తి వారి స్వీయచరిత్ర ప్రతిబింబించింది. ఆనాటి సాహిత్యం, సంస్కౄతి, నాటకసమాజాలు, పాఠశాలలు, పత్రికలు, సంఘసంస్కరణ కార్యక్రమాలు, విస్తారంగా వివరించబడ్డాయి. దళితజాతులవారికి రాత్రి పాఠశాలలు, నిమ్యజాత్యుద్ధరణకోసం రామమోహనరాయల పేరున పాఠశాల నిర్వహణ, గయోపాఖ్యానం, చింతామణి నవలల పోటీలో వరసగా బహుమతులు గెల్చుకోవడం, 1893లో గోదావరిజిల్లాలో ప్రవేశించిన మొదటి రైలుబండి, 1895 లో గోదావరి మహాసభల్లో చదివిన పద్యాలు, ఆబాలగోపాలానికి రసనాగ్రాలపై నర్తించేవి. భరతవాక్యం చిలకమర్తివారి పద్యంలోనే !!! రాజభక్తి, దేశాభిమానం, జాలి, విధి, అంటూ పద్యాలను చెప్పి పాఠకుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం, ఆనాటి సభాసదుల్ని మంత్రముగ్ధుల్ని చేసినట్లు కదలకుండా చేయడ
చిలకమర్తివారి పేరు వెంటనే, అనేక నోళ్ళళ్ళో నానిన పద్యం - భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడవై ఏడుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి - అన్న పద్యం చరివినదే చదవడం, ఎందరో కంఠోపాఠం చేయడం, కౄష్ణానదీ వంతెన గోడలమీద పెన్సిళ్ళతో చెక్కబడడం, ఆనాటి గోదావరి సాహితీసభాపర్వాల్లోని పద్యాలతోబాటు హరికధల్లోకికూడ చేరిపోయింది. 1905లో బెంగాలు విభజన సందర్భంగా, బ్రహ్మమత ప్రచారకుడైన బిపిన్ చంద్రపాల్ రాజమండ్రిలో చేసిన ఆంగ్లోపన్యాసాలకు చిలకమర్తివారి ఆంధ్రానువాదాలకు ముగింపు పద్యంగా - ఈగ వ్రాలినగాని వేగ జారెడునట్లు - అన్న పద్యం, ప్రత్యేకంగా, చెవుల సందున గిరజాలు చిందులాడ, మొగము మీదను జిరునవ్వు మొలకలెత్తి, టంగుటూరి ప్రకాశము రంగు మెరియు, ధవళగిరితీర్ధమునకు తరలివచ్చె - అన్న వాక్యాలు, చిలకమర్తి, టంగుటూరి ప్రకాశం, తిరునాళ్ళకు ధవళేశ్వరం వెళ్ళినప్పుడు చెప్పిన పద్యం శాశ్వతంగా సాహి
త్య చిలకమర్తివారి పద్యరచనా రహస్యాలలో ముఖ్యమైనవి. అయితే, చివర్లో, నాటక లక్షణశాస్త్ర ఫక్కీలో, 'చిలకమర్తివారు, గౌతమా మండల సభకు ఖ్యాతి మెరయ, పూర్ణ భక్తి సమర్పించె పుష్పమాల, వసుధ వీరవాసరపుర వాసియైన, చిలకమర్తి లక్ష్మీనరసింహమూర్తీ అనే నాటకభరతవాక్యం లాంటి పద్యపుష్పమాలను సమర్పించి గోదావరీమండంలంలో ప్రముఖస్థానాన్ని, ప్రఖ్యాతతను పొందారు. ఈ భరతవాక్యంతోనే ఈ వ్యాసం పరిసమాప్తిచేయడం ఔచిత్యం, సమంజసం. ప్రముఖ సాహితీవంతుడు, తెలుగుసీమను వీడి జూన్ 17, 1946 రోజున మనకు భౌతికంగా ఎడబాటు తెచ్చినా, చిలకమర్తివారు మాత్రం తెలుగుహౄదయాల్లో మాత్రం ఆత్మగౌరవాన్ని నిరంతరం నింపుతూ చిరస్థాయిగా సుప్రతిష్ఠులయ్యారు అన్నది మాత్రం సత్య, శివ, సుందర భావసమగ్రం
.

Wednesday, September 23, 2009

'మహామహోపాధ్యాయా ఈమని శంకరశాస్త్రి - 'ఈమనీ అంటే ఏమని !


'మహామహోపాధ్యాయా ఈమని శంకరశాస్త్రి (1922 - 1987) - జయంతి 'ఈమనీ అంటే ఏమని ! వీణ ప్రాశస్త్యం, ప్రస్తావన వీణ - తంత్రీవాద్యవిశేషం. వీణ అంటే మనకు వెంటనే స్ఫురణకు వచ్చే వ్యక్తులు, సరస్వతి, నారదుడు. సరస్వతి వీణ - కఛ్ఛపి. వారదుడి వీణ - మహతి. వీణ అంటె మెరపు. వీణియ - వీణావాద్యం. కస్తూరిమౄగముయెక్క కస్తూరియుండెడి బొడ్డుకాయ. భల్లాణచరిత్రం - అన్న రచనలో - వాలేశ్వరుడు అన్న కవి - కస్తూరి వీణియలును పిల్లిగడ్డలను - అని ప్రస్తావించాడు. ఆంధ్రకవితాపితామహుడు, అల్లసాని పెద్దన, మనుచరిత్రలో నాయిక వరూధునితో వీణను వాయించాడు. "తరుణాంగుళీ ధూతతంత్రీస్వనంబుతో జిలిబిలిపాట ముద్దులు నటింప ... కరపంకరుహ రత్న కటక ఝణఝణధ్వనిస్ఫూర్తి తాళమానములు గొలుప నింపు దళుకొత్త వీణ వాఅయింపుచుండీ అని అద్భుత వర్ణన చేశాడు. యింటి ఆవరణలోని మామిడిచెట్టు కింద అరుగుమీగ కూర్చుని వీణ వాయిస్తూంటే, వేరే మద్దెల లేదట; అమె చేతి కంకణముల ధ్వనియే మద్దెలవలె వుందిట. అది వీణ ప్రాశస్త్యమో, లేక వరూధుని ప్రత్యేకతో మరి. వీణ ప్రాశస్త్యాన్ని ప్రముఖ కవి అడవి బాపిరాజుగారు - నారాయణరావు - నవలలో - వీణమీది తానం ఫిడేలు మీద కాదు. ఫిడేలు మీది సంగతి వీణకు రాదు. వీణ ఒదుగు ఫిడేలులో లేదు. వీణలో ధవి ఫిడేలులే లేదు. దీన్ని బట్టి ఫిడేలు రాగాలు వేరు, వీణ స్వరతంత్రీవాదవ విధానం ప్రత్యేకత కలిగినదని ఈ భావాన్ని బట్టి చెప్పవచ్చు. శంకరశాస్త్రిగారి జీవన సంగీత రేఖలు ఈమని శంకరశాస్త్రిగారు తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో 23 సెప్టెంబర్ 1922న జన్మించారు. కేవలం మూడు వసంతాల ప్రాయంలో శాస్త్రిగారు వీణ పై దౄష్టిని పెట్టడం ఆశ్చర్యం. కేవలం సంగీత పరికరం పై దౄష్టికాదు, సంగీతంలోని లయ, గమకాల క్రమం పై అవగాహనను ఆకళింపు చేసుకోవడంలోనే ఆ శైశవకళాప్రతిభ వెల్లడైంది. సంగీతంలో వీణపై తొలి శిక్షణను తండ్రి అచ్యుతరామశాస్త్రివద్దనేకాక, తాతగారు ఆనాటి గొప్ప వైణికవిద్వాంసులు ఈమని సుబ్బరాయ శాస్త్రిగారి వద్ద కీలకాంశాలను అభ్యసించారు. ఈ అభ్యాసకాలంలో కేవలం వీణసంబంధిత శిక్షణే కాక, అంతవరకూ సంగీతకచేరీల్లో వీణకు పరిమితంగానే వుండడం గమనించి, వీణమాధ్యమంతో సంగీత కార్యక్రమాల్ని ఎలా విస్తౄతం చేయాలో తీవ్రతరంగా ఆలోచించారు. ఆయనకు ఒక విదేశీసంగీతాభిమాని బహుమతినిచ్చిన మైకు ద్వారా వీణానాదతంత్రీస్వరస్థాయిల్ని పెంచడంలో సాధ్యులయ్యారు. శంకరశాస్త్రిగారు వీణను మందర, అనుమందరస్థాయిల్లో తంత్రుల్ని మీటడంలో విశారదస్థాయిని అతిస్వల్పకాలంలోనే చేరుకున్నారు. అంతేకాక, వీణద్వారా నాదాల్ని దీర్ఘం, అనల్పకాలంపాటు ప్రదర్శించడం, ఆనాదాలు వాయుసంగీతపరికరాల ద్వారా వచ్చే నాదాలనుపోలడం కూడ ఈమని వారికి అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. వీణాసంగీతంలో ప్రతిభను సాధించినా, చదువును మాత్రం వెనక్కు నెట్టవలసి వచ్చింది. తండ్రి అచ్యుతరామశాస్త్రిగారికి మాత్రం తన శంకరతనయుడు సంగీతాన్ని వౄత్తిగా స్వీకరించడం ఎంతమాత్రం యిష్టంలేదు. కాకినాడ పిఠాపురం మహారాజా కాలేజీలో పట్టభద్రులయ్యాక, వైణికుడిగానే జీవితప్రారంభం చేశారు. కానీ, తనయుడి సంగీతకౄషిలో ప్రదర్శిస్తున్న తన్మయత్వాన్ని గమనించి, పట్టుదలను వీక్షించి, శ్రమకు ఫలితం తప్పక వుంటుందనే నమ్మకానికి రావడం ఒక శుభ పరిణామం. వీణతో జీవితాంతం తాదాత్మ్యం చెంది అవిభాజ్య సంబంధాన్ని పెనవేసుకున్న సంప్రదాయ సంగీత విద్వాంసులు, కళాకారుల్లో ఈమని శంకర శాస్త్రిగారిని ప్రప్రధమంగా ప్రస్తావించాలి. 1940 లో తిరుచ్చి ఆకాశవాణిలో శాస్త్రిగారు వీణాకచేరీ చేసిన తర్వాత, ఆయనకు వచ్చిన పేరు గగనవీధుల్ని తాకింది. 1942-50 మధ్యకాలంలో, మద్రాసు జెమినే స్టూడియోల్లో సాలూరు రాజేశ్వరరావుకు సంగీతంలో సహాయసహకారాల్ని అందజేయడంలో చూపిన ప్రతిభ అజరామరం. అందుకే పాతచిత్రాల్లో, ప్రముఖంగా, రాజేశ్వరరావుగారి చిత్రాల్లో, ముఖ్యంగా తప్పక ఒక వీణపాట వుండేది. శంకరశాస్త్రిగారి శాస్త్రీయత సంప్రదాయ సంగీతకుటుంబానికి వారసులేకాక, వీణావాదన సంగీతకళలో ఆలోచనాత్మకమైన సంగీతశైలిని నిర్మాణం కావించి, ఆ ప్రత్యేకశైలికి ప్రచారం చేయడమే కాక, శాస్త్రిగారిని శాస్త్రీయసంగీత ప్రపంచంలో సశాస్త్రీయమైన విశిష్ఠ కళాకారునిగా తీర్చిదిద్దబడ్డారు. కర్ణాటక శైలితోపాటు, హిందుస్తానీ, పాశ్చాత్య సంగీత శైలీవిధానాల్ని ఆకళింపు చేసుకున్న పుంభావసంగీతసరస్వతీపుత్రుడు - ఈమని శంకరశాస్త్రిగారు. శాస్త్రిగారు ముఖ్యంగా ఆకాశవాణిలో నిర్మాణం చేసిన సంగీత కార్యక్రమాలు, ఆయన నాయకత్వంలో ప్రదర్శించిన వాద్యబౄంద, స్వరరాగతాళ విన్యాస కార్యక్రమాలు నభూతో నభవిష్యతి అన్నట్లు ప్రఖ్యాతమయ్యాయి. శాస్త్రీయ ప్రియ వీణారాగాలు సంప్రదాయబద్ధమైన, శంకరాభరణం, వరాళి, కాంభోజి రాగాలతో అధికంగా తాదాత్మ్యం చెందినా, సంగీతరసికులకు ఎప్పుడూ ఎదో నూతన ప్రయోగం చేసి 'ఈమని అంటే ఏమనీ అని అందరూ ముక్కుమూద వేలు వేసుకునే సందర్భాలు తరచుగా ఎదురయ్యేవిట. గళగాత్రంతో పాటు వీణావాదనం


సంప్రదాయ గాత్ర-వీణాసంగీత కళాకారుల మార్గంలోని వారైనా, శాస్త్రిగారు, సంగీతకచేరీలో వీణావాదనంతోపాటు ఆయనే గాత్రసంగీతాన్ని కూడ జోడించి బహుముఖ ప్రతిభను ఏకముఖంగా ప్రదర్శించేవారు. హిందూస్థానీ కౄతుల్ని మధ్యాంతరంలోను, హిందూస్థానీరాగాలజోడీని ప్రదర్శించడంతోపాటు సంగీత కార్యక్రమంలో, శాస్త్రిగారి వేదప్రవచనం - స్వరసహితంగా గానం చేస్తూనే, వీణాతంత్రీనాదస్వరాల్తో శ్రవణసుభగం చేసేవారట. ఆకాశవాణి ఆదరించిన శాస్త్రీయత 1959 లో డిసంబర్ 1 న, ఆనాటి కేంద్ర సమాచార, ప్రసారశాఖామంత్రి, డా.కేస్కర్, కేంద్రకార్యదర్శి, ఆర్.కె. రాం దయానీ ల ఆహ్వానం మేరకు ఈమని శంకరశాస్త్రిగారు మద్రాసు - ఆకాశవాణిలో కళాకారునిగా చేరడం, రెండేళ్ళలోపునే కేంద్రప్రసారవిభాగానికి, జాతీయసంగీతవిభాగపు సంగీతవిభావరిశాఖకు నాయకత్వం కూడ వహించారు అంటే ఆయన ప్రతిభ వర్ణనాతీతం. ఆయన ప్రదర్శించిన అసమాన ప్రతిభ శాస్త్రిగారిని ముఖ్య నిర్మాతగానే కాక, జాతీయసంగీతవిభావరికి దర్శకునిగా నియమించబడ్డారు. అనూహ్యమైన ఈ సదవకాశం ద్వారా నూతన శైలిలో సంగీతరాగాల్ని, తన వాద్యబౄందాల ద్వారా అధ్బుతమైన ప్రతిభను వెన్నంటుకున్నారు. సంప్రదాయ, ఆధునికతల సంగీతస్వరమేళవింపులు శంకరశాస్త్రిగారు ఒక ఆసక్తికరమైన 'కొత్తపాతలమేలుకలయికా అన్న ప్రయోగం అన్నది నిర్వివాదం. కార్యక్రమాన్ని బట్టి, అవసరాన్ని దౄష్టిలో పెట్టుకుని శాస్త్రిగారు కౄతుల్ని ఎన్నుకుని, స్వరపరచుకునేవారు. ఆయన ప్రతిభాసిగలో నిత్యం తారసిల్లేవి, గమకాలు, స్వరప్రస్తారాలు, తానం అన్నవి ఆయన స్వాధీనంలోనే నివాసం చేసేవి. ఈమని వారికి సంగీతం అంటే ... శంకరశాస్త్రిగారికి, సంగీతం అంటే ఒక మహాసముద్రం - దాగిన ఎన్నో మణులు, మాణిక్యాలు. సంగీతంలోని శాస్త్రీయతను, పరమౌషధగుణాన్ని, ప్రజలదగ్గరకు తన రాగా, స్వరమాధుర్యాలద్వారా తీసుకుని వెళ్ళడంలో ఆయన ఎప్పుడూ కౄతతుల్యులయ్యారు. స్వరరాగ సౄష్టికర్త - ఈమని ఈమనివారు గొప్ప వైణిక విద్వాంసులేకాక, శాస్త్రిగారు ఎన్నో కౄతులు, పదాలు, జావళీలను రూపొందించడమే కాక, తోడిరాగంలో రాగం-తానం-పల్లవి అంశాలను కూడ నిర్మాణం చేశారు. ఈమని వారి అంతేవాసులు గొప్పవిద్వాంసుడు, కళాకారుడుగా రాణించి విశ్రాంతి తీసుకుంటే నడవదు. గురువుస్థానంలో ఉన్న కళాకారుడు అంతే సరిసమప్రతిభను కలిగిన అంతేవాసుల్ని తయారుచేయడంలోనే ప్రతిభావంతమైన కళకు, కళాకారుడికి సార్ధకత, సాఫల్యత చేకూర్చినప్పుడే కళలో ఆవౄత్తం పూర్తవుతుంది. శంకరశాస్త్రిగారు అంతే ప్రతిభ గల విద్వాంసులు - 'వీణా చిట్టిబాబు, యం.వై.కామశాస్త్రి గారు అవతరించారు. సాలూరివారిదగ్గర ఉన్నప్పుడు, ప్రముఖ నేపధ్యసంగీతకారుడు పి.బి.శ్రీనివాస్ ని చిత్రరంగానికి పరిచయం చేసిన ఘనత మన ఈమని శంకరశాస్త్రిగారిదే. శాస్త్రిగారు తెరవెనుక వున్న అధినాయకులు, తెరపై దర్శనం యిచ్చిన చిత్రసంగీతంలో ఆయన ప్రతిభతోపాటు పాళ్ళు కూడ అధికమే అని చెప్పే కళాకారులు ఎంతోమంది శాస్త్రిగారి సంగీత ప్రతిభను గురించి తరచు ప్రస్తావిస్తారు. ఈ సౄష్టి వున్నంతకాలం కళ, కళలున్నంతకాలం సంగీతం, సంగీతం విరాజిల్లుతున్నంతకాలం వీణ, వీణ కనిపిస్తున్నంతకాలం మనకు ఈమని శంకరశాస్త్రిగారు మనకు జీవితంలో నిత్యభాగంగా, మన మనసుల్లో, హౄదయాల్లో, ఉల్లాస, వినోద, విజ్ణానంతోపాటు, మనకు దివ్యౌషధంగా పనికొచ్చే పరికరాలుగాను, ప్రముఖవ్యక్తుల్లో ఒకరుగాను, ప్రతిభాదర్శనం కావిస్తూనేవుండడం జరుగుతుంది. యిది తధ్యం. సత్యం. ఈమనిశంకరశాస్త్రిగారి అమూల్య కరగ్రనఖాగ్రాలతో అధ్బుతవిన్యాసాల్ని విశ్వవ్యాప్తంగా వినుతికెక్కిన ఈ సంగీతవిదురుడు, ప్రతిభాకోవిదుడు, నిత్యస్మరణీయుడు. 'వీణా శంకరశాస్త్రిగారికి శతసహస్ర సంగీత కళాభివందనాలతో, వినమ్రతతో, నమస్సుల్తో ... కొంపెల్ల శర్మ-

Sunday, September 13, 2009

ఆచార్య వినోబా భావే జయంతి

'జై జగత్! నా కార్యకలాపాలన్నీ విశ్వమానవుల హౄదయసంగమం కొరకు తపనే'
'చిత్ పవణ్ బ్రాహ్మణ వంశీయుడు
ందరికీ 'ఆచార్యాగా సుపరిచితుడు. ఆయన పేరు వినాయక్ నరహరి భావే. వినోబా భావే గా సుప్రసిద్దుడు. మహారాష్ట్రలో గగోడే లో 11 సెప్టెంబర్ 1895 న సంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. మహారాష్ట్రలో 'చిత్ పవణ్ బ్రాహ్మణ వంశీయుడైన వినోబా చిరుప్రాయంనుంచే భగవద్గీత పై అపార ప్రభావం పొందినవాడు.

అం
స్వాతంత్ర్య సమరంలోకి ...
హాత్మాగాంధీతోటి స్వాతంత్ర్య సమరంలోకి దూకిన వ్యక్తి. తెల్లదొరలతోటి సమరం మూలాన, 1932 లో వినోబాను జైల్లో పెట్టారు. కాని మన వినోబా జైలులో ఉబుసుపోక, భగవద్గీతపై తనదైన భాష్యాన్ని తోటి ఖైదీలకు, మాతౄభాషైన మరాఠీలో వివరించేవాడట. ఆ ఉపన్యాస భావలహరి తర్వాత 'ఉపన్యాసగీతా గా ప్రచురించడం, అన్ని దేశీయభాషల్లోకి, కొన్ని విదీశీభాషల్లోకి, తర్జుమా కావడం జరిగినదాన్ని బట్టి వినోబా విద్వత్తు వెల్లడవుతుంది. మిగతా కార్యక్రమాల్ని, దినచర్యని పక్కకి నెట్టినా, గీతోపన్యాసాలద్వారా, మంచి అనిర్వచీయనీయమైన అనుభూతి ఆవహించింది అని వినోబా చాలాసార్లు చెప్పారు. ఆయన సత్యనిష్ఠా తత్పరతకు సంతోషించి, గాంధీ, సత్యాగ్రహానికి ఎన్నుకున్న మొదటి వ్యక్తి వినోబా అన్నది ఆనాడు ఆశ్చర్యం కలిగించింది. ఆనాడు క్విట్ యిండియా ఉద్యమంలో కూడ పాల్గొన్న ప్రముఖుడు.

సర్వోదయ, భూదానం, గోరక్షణ - జీవన నేస్తాలు
ినోబా అన్ని మతాల సత్యసారాన్ని ఆధ్యయనం చేసి అర్ధంచేసుకున్న మేధావి. 'ఓం తట్ అన్న పారాయణ అన్నిమతాలకు అన్వయించేలా ధ్యానం చేశేవారు. పైగా బహుభాషాప్రావీణ్యుడు. కన్నడ భాషాలిపిని విశ్వభాషాలిపులకు మహారాణి అని పొగడేవారు. భారతదేశంలోని పల్లెలలో జీవించే సగటుజీవి అనుభవించే కష్ఠాలకు సమస్యలను అన్వేషించడంలో చాలా కౄషిని సలిపారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసం అని కూడ భావించారు. ఈ ధోరణి క్రమేణా 'సర్వోదయా ఉద్యమానికి దారితీసింది. వినోబా భావేతో మమైకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం - భూదానోద్యమం. ఈ నూతన తరహాలో నడచిన ఈ భూదానోద్యమ ప్రచారంలో భాగంగా, దేశం నలుమూలలు పాదయాత్ర చేశాడు. ప్రతీ భూకామందుని వ్యక్తిగతంగా, తనను కొడుకుగా భావించి, కొంతైనా భూమిని యివ్వాలని ప్రార్ధించాడు. అలా సేకరించిన భూమిని పేదలకు దానం ద్వారా పంచి పెట్టాడు. అహింస, ప్రేమలను మేళవించిన విధానం ఆయన తత్వం. వినోబా అంటే వెంటనే స్ఫురించే అంశం - గోహత్య విధాన నిర్మూలనం.

వి
ఆయనొక ఆశ్రమవాసి!
ినోబా తన జీవిత చరమాంకం, మహారాష్ట్రలోని 'పౌనాఋ లో నిర్మించుకున్న ఆశ్రమ వాతావరణంలో గడిపాడు. యిందిరాగాంధి విధించిన అత్యవసర పరిస్థితిని సమర్ధించిన వారిలో వినోబా ఒకరు కావడం, ఆ కాలాన్ని 'అనుశాసన పర్వం'గా అభివర్ణించి, క్రమశిక్షణకు సరియైన సమయం అని వ్యాఖ్యానించారు.

వి
విమర్శల మధ్య వినోబా
ిద్వత్తు ఉన్నచోట వివాదం, అసూయలు జనిస్తాయి. 'అర్కంలేని అతి గాంధీవాదం'వినోబాది

విఅని ప్రముఖ సాహితీవేత్త వి.యస్.నాయిపాల్ విమర్శించాడు. కాని, భారతీయ ఆర్ధిక, రాజకీయవిధానంతో భాగస్వామ్యం పొందని నాయిపాల్ నుంచి యిటువంటి విమర్శలు రావడం చాలా విడ్డూరం అని ప్రతి విమర్శలు రావడం కూడ జరిగాయి.
ప్రతిభకు పురస్కారాలు
958 లో వినోబాకు 'సామాజిక నాయకత్వం'పై భారతీయ రామన్ మెగ్సయ్సాయ్ పురస్కారం మొట్టమొదటి స్వీకర్త వినోబా కావడం మనదేశానికి గర్వనీయం. 1983 లో భారతరత్న బిరుదుని వినోబా మరణాంతరం వెంటనే బహూకరించారు.

1
వినోబా భావాలు
ిప్లవాలకు ఆధ్యాత్మికభావాలే మూలం; మానవుల హౄదయాలని, మనస్సులని ఏకీకౄతం చేయడానికే నా కార్యక్రమాలపై దౄష్టి పెట్టడం జరిగింది.

వి
శాంతత అనేది మానసికం, ఆధ్యాత్మకం. ఈ ధోరణులనుంచే మానవుల వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశిస్తాయి. ప్రపంచగమనం వీటిపైనే ఆధారపడింది.

ప్రజై జగత్! విశ్వానికి విజయం!
ీదప్రజల హౄదయాలను సుసంపన్నంగాను, సంపన్నప్రజల హౄదయాలను బీదతనంతోను భగవంతుడు సౄష్టించడం విడ్డూరం, ఆశ్చర్యకరం.

బీ ప్రజాశక్తి, ప్రజాబలం సంకల్పంగా సాధించాలి. హింసాయుత, బలవంతపు అధికారిక రాజ్యపాలనం ఆహ్వానించదగ్గది కాదు.
ాలు చేయగలగడం అసాధ్యం. ప్రభుత్వాల తప్పిదాలపై విమర్శించ వలసిన పని నాకు
ఏ దేశమైనా, సైన్యం, యుద్ధసామగ్రి బలంతో కాక, నైతినబలంతో సమర్ధించుకోవాలి. పాతపడిన యుద్ధసామగ్రితో కొత్త యు
ద్ధాలేదు. మంచి పనులని అనుకున్నవాటిపై నా విమర్శ ఉంటుంది. విప్లవవాదాన్ని ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది అన్న భావం, భావన ఎన్నటికీ రానీయకూడదు.
్టు ఎంతమాత్రం సడలకూడదు. మెతకదనం, పసలేని, ప్రభావంలేని అహింసావిధానాలను అవలంబించినందువల్ల ప్రస్తుత స్తబ్ధత కొనసాగే ప్రమాదంతోపాటు, పెరుగుదల, అభివౄద్ధి చతికిలబడతాయి. చివరకు పరాజయం, నిరాశ తప్పవు. సమాజసేవ, అహింసామార్గం, గోరక్షణ, ఆధ్యాత్మకధోరణి, కుష్టివ్యాధిగ్రస్థులకు సహాయసహకారాలు, భూదానోద్యమం, యిలా ఎన్నో సేవలను అందించిన వినోబా భావే
అహింసా విధానాలపై నిదానధోరణిని అవలబించకూడదు. అహింసామార్గం ద్వారా, అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే, కాలయాపన, జాప్యం శతౄవులు అనే అనుకోవాలి. ప
ట్టువివాదం లేని పరమాచార్యులు. భారతదేశానికి ప్రధానాచార్యులలో ఒకరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆచార్య వినోబా భావే 1982 నవంబర్ 15 న, చివరి రోజుల్లో ఆహారం, నీరు తీసుకోడానికి నిరాకరించి, 'సల్లేఖనం' గా భావించగా, కీర్తిశేషులైనారు. వినోబా భావే మహానుభావ భావపరంపరకు, నేటివరకు చెరగని ముద్రవేసిన ఈ మహనీయునికి తెలుగురథం నీరాజనాల్ని సమర్పించుకుంటోంది.
తెలుగురథం - కొంపెల్ల శర్మ

Saturday, September 5, 2009

డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్ జన్మదినం - ఉపాధ్యాయ దినోత్సవం - 5 సెప్టెంబరు

ఉపాధ్యాయ దినోత్సవం - 5 సెప్టెంబరు
డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్ జన్మదినం ( 1888 - 1975 ) ఉపాధ్యాయుడు అంటే ... ఈ శతాబ్దం యొక్క దురదౄష్టం ఏమిటంటే నేర్చుకోవడం మానివేసినవాళ్ళు బోధించడం ప్రారంభిస్తున్నారు అని ఆనాడే అన్నాడు బెర్నార్డ్ షా. నేర్వడం తెలియని వాళ్ళే నేర్పుతున్నారు అని ఆస్కార్ వైల్డ్ అన్నాడు. ఉపాధ్యాయుడు నేర్చుకుంటూనే వుంటేతప్ప యదార్ధంగా చదువు చెప్పలేడు అన్నాడు ప్రముఖ కవి, గురువు రవీంద్రనాధ్ ఠాగూర్. ఆచార్యదేవోభవ! వౄత్తి, వ్యాపారం ఏదైనా మనిషి ప్రవౄత్తిని బట్టి దాని సార్ధకత నిరూపణ అవుతుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మన సంస్కౄతి - ఆచార్యదేవోభవ - అని చాటిచెప్పింది. యింకా వివరంగా చెప్పాలంటే, 'గురువులో త్రిమూర్తులు త్రికాలాల్లో దర్శనీయమవడమే కాకుండా, గురువుని సాక్షాత్తుగా 'పరబ్రహ్మాగా వర్ణించడం, గురువుగా కీర్తింపబడుతున్న ఉపాధ్యాయునికి సమాజంలో అత్యంత ప్రాధాన్యం సంతారించుకుంది అన్న భావనలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఆ విలువ తెలియనివారు, 'బతకలేక బడిపంతులూ, 'ఏవో పాఠాలు చెబుతూంటాడుటా అని వర్ణించడంలో వారివారి సంకుచిత మనస్తత్వం బయటపెట్టుకోవడమే. ఉపాధ్యాయునికి ప్రత్యేకంగా - సెప్టెంబర్ 5 న దినోత్సవాలు ఉపాధ్యాయవౄత్తిలో వున్నవారు - వారికి ఒక మహనీయ ఆదర్శమూర్తి లభిస్తాడని, ఆయన జన్మదినం - ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి, వౄత్తికి సార్ధకత చేకూర్చుతారని, ఎంతమంది ఊహించారో చెప్పలేని పరిస్థితి. సెప్టెంబర్ 5 మాత్రం ప్రతీసంవత్సరం - ఉపాధ్యాయులకు గర్వదినం. శుభదినం. ఆరోజే, డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్, విశ్వవ్యాప్తంగా మానవజాతి గర్వించదగ్గ మహామేధావి జన్మదినం - మరువలేని మహనీయుల చరిత్రలో ఒక స్థానం, ప్రస్థానం లభించింది. భారతదేశం ఆయన ప్రముఖ ఆచార్యునిగా గుర్తించడం కూడ మన ఆచార్యసంస్కౄతికి నిదర్శనం, తార్కాణం. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ప్రతీ సంవత్సరం, గణనీయమైన సేవలను అందించి, ప్రఖ్యాతవహించిన ఉపాధ్యాయులను కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింది సన్మాన, సత్కారాలతో గౌరవించడం, ఒక సత్సంప్రదాయంగా, సదాచారంగా వస్తున్నది. ఈ ఉపాధ్యాయుడు - అధిష్ఠాత తత్వవేత్త, సౌమ్యుడు, మహామేధావి, గొప్ప గ్రంధకర్త, మనస్తత్వశాస్త్రంపై మక్కువ, సాధికారత, అసమాన వాగనుశాసనుడు, పాశ్చాత్య తత్వశాస్త్రాలపై అవగాహనాపరుడు, ఛలోక్తులను, హాస్యోక్తులను దొర్లించటంలో బహునేర్పరి, ప్రపంచదేశాల మన్ననలను పొందిన ప్రముఖవ్యక్తి, అవసాన దశలో కూడ వదలని తాత్వికబోధకుడు, చింతనాపరుడు, ఎవరోకాదు, ఆయనే, డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్. అంతేకాదు, సర్వేపల్లివారు - విదేశీరాయబారి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా, నిర్వహించిన పదవులు ప్రతిభాసోపానాలు. డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్ జీవనయానం ఆనాటి మద్రాసు నగరానికి 40 మైళ్ళ దూరాన వున్న తిరుత్తణి లో జన్మించాడు మన సర్వేపల్లి వంశాకురం. తండ్రి వీరాస్వామయ్య ఒక జమిందారిలో తహసీల్దార్. ప్రాధమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిష్టియన్ కాలేజీలలో ముఖ్యంగా సాగిన చదువు యం.ఎ. వరకు చదివాడు. బాల్యంనుంచి అసాధారణమైన తెలివితేటలతో, విద్యార్ధిదశలోనే, మనస్తత్వశాస్త్రంపై ఉపన్యాసాలతో అనేకమందిని అలరించేవారట. కేవలం 21 ఏళ్ళకే మద్రాసు క్రిష్టియన్ కాలేజీలో తత్వశాస్త్రంలో సహాయ ప్రొఫెసర్ పదవిని ప్రతిభావంతంగా నిర్వహించారు. వేదాంత, తత్వశాస్త్రాల్లో పరిశోధనలను చేశారు. సర్వేపల్లి ప్రతిభను గమనించి, మైసూరు విశ్వవిద్యాలయంవారు ప్రొఫెసర్ పదవినిచ్చారు. 1921లో కలకత్తా విశ్వవిద్యాలయంలో, ఐదవ కింగ్ జార్జ్, మానసిక, నైతిక తత్వశాస్త్రంలో పరమాచార్య పదవిని, 1931లో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఉపకులపతిగాను, విరాజిల్లారు. పుష్కరకాలంపాటు (1925-37) భారతీయ తత్వశాస్త్ర సమావేశానికి అధ్యక్షపదవిని సరిసములులేని ప్రతిభాపాటవాలతో నిర్వహించారు. 1939లో బ్రిటిష్ అకాడమీవారు ఫెలో గౌరవం, ఆ ఏటనే పండిట్ మదనమోహన్ మాలవ్య బెనారస్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించడం అమితగౌరవానికి తార్కాణమేకాక, ఆ పదవిని 1948 వరకూ నిర్వహించడం ఆయన ప్రతిభకు కలికితురాయి. నాలుగేళ్ళు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, మత, నీతి శాస్త్రాల్లో ఆచార్యపదవినిచ్చారు. 1946-52 మధ్య భారతీయ ప్రతినిధి బౄందం యునెస్కో యాత్రకు నాయకత్వం వహించారు. ఉన్నతవిద్యాసంస్కరణల సంఘానికి అధ్యక్షునిగా (1949), రష్యాకు భారత రాయబారిగా (1949-52) తనపదవిని అత్యంత కౌశలత్వంతో నిర్వహించిన సర్వేపల్లివారు, దశాబ్దికాలం భారతదేశం ఉపరాష్ట్రపతిగా కొనసాగారు. యునెస్కోలో జరిగే సాధారణ సమావేశానికి అధ్యక్షపదవిని (1952-54) నిర్వహించారు. మరొక ప్రతిభాపదవిని చెప్పాలంటే, పుష్కరకాలంపాటు (1953-62) ఢిల్లీ విశ్వవిద్యాలయం కులపతిగా కొనసాగడం, మరొక మలుపు, మైలురాయి. 1962-67 కాలంలో భారతదేశానికి ప్రధమ పౌరసత్వపు ప్రతినిధిగా, రాష్ట్రపతి పదవిని నిర్వహించారు. 1969లో అత్యున్నత గౌరవం, భారతరత్న వరించింది. ప్రముఖులైన మహాత్మాగాంధి, రవీంద్రనాధ్ ఠాగూర్, జవహర్ లాల్ నెహ్రూ లతో పరిచయం కల్గిన రాధాకౄష్ణన్ కు బ్రిటిష్ మహారాణి నుంచి గౌరవ ప్రతిభా సభ్యత్వాన్ని అందచేశారు. 1964లో ఆరవ పోప్ జాన్ పాల్, దేశాధినేతనుంచి వాటికన్ అత్యంత ఉన్నతగౌరవాన్ని పొందడం జరిగింది. 1975లో టెంప్లెటన్ పురస్కారం - పొందిన క్రైస్తవేతరుల్లో మొదటివాడు మన సర్వేపల్లి ప్రతిభారత్నం. ఈ పురస్కారం ద్వారా లభించిన 96000 డాలర్ల నగదును ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయసంస్కౄతి ప్రసంగాలకై విరాళంగా అందజేయడం, ప్రముఖులు కె.యం.మున్షీ తో కలసి భారతీయ విద్యాభవన్ ను స్థాపించడం సర్వేపల్లి జీవితంలో మరో మలుపులు, మెరుపులు. ప్రతిభావంతమైన రచయిత కేవలం ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, ఉప-కులపతి, రాయబారి కాదు. భారతదేశపు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను నిర్వహించిన సర్వేపల్లి రాధాకౄష్ణన్ ప్రతిభావంతమైన రచయిత. 150కి పైగా తన రచనలతో భారతీయతను, సంస్కౄతీవైభవాల్ని చాటిచెప్పిన తత్త్వవేత్త, తత్వమసి. భారతీయ తత్వశాస్త్రం, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ధమ్మపాదకు విశ్లేషనాత్మక వ్యాఖ్యానాలు మరపురాని మధురగుళికలు. హిందుజీవనశైలి, మతతత్వధోరణి, మతం-సమాజం, ఠాగూర్ తత్వవిధానం, భావినాగరికత, యిత్యాది అంశాలపై ఉద్గ్రంధరచనలు సర్వేపల్లిని ఉన్నతశిఖరాలకు తీసుకెళ్ళాయి. రాధాకౄష్ణన్ వ్యక్తిత్వాన్ని తపోమునిగాను, మానవత తన మతంగాను ఏకాభిప్రాయంగా వర్ణించబడ్డాడు. రాష్ట్రపతిగా పదవీవిరమణ చేసి, 1967 నుంచి చివరిరోజు వరకు (17.4.1975) మద్రాసులోని తమ నివాసంలో, తాత్వికచింతనతో కాలం గడిపారు. పరమాచార్యునిగా గుర్తించిన భారతదేశం, రాధాకౄష్ణన్ జన్మదినాన్ని, ఉపాధ్యాయదినంగా దేశం యావత్తూ ప్రతీ ఏట జరుపుకోవడం మనకు పెద్దపండుగగా భావించవచ్చు. సర్వేపల్లివారి వ్యక్తిత్వం - ప్రముఖుల ప్రశంసలు నన్ను రాక్షసునిగా కాక, మనిషిగా గుర్తించిన వారు మీరొక్కరే; మీరు త్వరలో స్వదేశానికి తిరిగి వెళ్తున్నట్లు విన్నాను; అందుకు విచారిస్తున్నాను. - స్టాలిన్ - రష్యాధినేత. మీ రచనలు చాలా గొప్పవి; కాని నా అభిప్రాయం వినండి; నేను మీ అర్జునిణ్ణి. మీరు నా కౄష్ణభగవాన్. - మహాత్మాగాంధి. గురుశిష్యుల హౄదయ, ప్రేమానుబంధాలు కలకత్తా విశ్వవిద్యాలయపు ఆచార్యపదవిని చేపట్టమని రవీంద్రనాధ్ ఠాగూర్, డా.అశుతోష్ ముఖర్జీ లు కోరగా - మైసూర్ విశ్వవిద్యాలYఅం నుంచి కలకత్తా వెళ్ళేముందు - మైసూర్ లోని యింటిముందు గుర్రపుబండి సిద్ధం అయింది. తమ అధ్యాపకునికి వీడ్కోలు చెప్పేందుకు విద్యార్ధులు ఆయన యింటికి వచ్చారు. బండికి కట్టిన గుర్రాలను వదలించి, రైల్వేస్టేషన్ వరకూ గుర్రంలేని గుర్రంబండిని ఆ విద్యార్ధులే స్వయంగా లాక్కొని వెళ్ళారు. అది విద్యార్ధులకు ఆయన పట్ల వున్న ప్రేమ, గౌరవ, భక్తి, శ్రద్ధల మీద అపూర్వసంకేతాలు. అది గమనించిన రాధాకౄష్ణన్ హౄదయం ద్రవించడామే కాదు - కళ్ళుకూడ చెమ్మరించాయి. గురుశిష్యుల, హౄదయానుబంధం, ప్రేమానుబంధం ఒక్కసారి పెల్లుబికాయి. ఈనాటి గురువులు, శిష్యులు యిద్దరిలో కనపడని వస్తువులు, దౄశ్యాలు. గురుదేవోభవ అన్న ఆర్యోక్తి ఆయనపట్ల నిజమయింది. సహవిద్యార్ధికి జ్ణానోదయం సర్వేపల్లివారు స్కూలులో చిన్నవిద్యార్ధిగా వున్నప్పుడు, క్లాసులో ఒక విద్యార్ధి, అధ్యాపకుడి కుర్చీకి తారుపూసి, గురువునే ఏడిపించే ప్రయత్నం చేయగా, ఆ తప్పుచేసిన విద్యార్ధి తనపేరును అడిగినాకూడ క్లాసు మొత్తం చెప్పలేదు. అప్పుడు రాధాకౄష్ణన్ ఆ తప్పుచేసిన పిల్లవాడి పేరును చెప్పి, కుర్చీని తాను స్వయంగా శుభ్రం చేసి, ఆ విద్యార్ధిని శిక్షించవద్దని ప్రార్ధించాడట. నేరం చేసిన ఆ విద్యార్ధిని క్లాసు బయట తన్నబోతే - నేను చెప్పకబోతే ఇదే తప్పును నువ్వు మళ్ళీ చేస్తావు - అంటూ ఆ విద్యార్ధికి జ్ణానోదయం చేశాడు. అభిళషనీయాలు భారతీయౌన్నత్యంపై తనకున్న ఆత్మవిశ్వాసాన్ని - నేను ఆక్స్ఫర్డ్ వెళ్తే, అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తాను; కాని, విద్యార్ధిగామాత్రం వెళ్ళను అన్నది సంకల్ప దీక్షాకంకణ బద్ధతకి నిదర్శనం. సర్వేపల్లి వారి అభిలాషను చెప్పాలంటే - మానవజీవితంలో మంచిని పెంపొందించడం, ఉత్తమ సమాజాన్ని రూపొందించడం, మతాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలని బోధించడం, మానవుల్లోని మమతానురాగాలను పెంచుటకు ప్రపంచవ్యాప్తంగా కౄషి, అహింసావిధానం ద్వారా ప్రపంచ దేశాలన్నింటిలో శాంతిని పెంచడం లాంటి మహనీయ, బౄహత్తర ప్రణాలికలను, ఆశయాలను ఆశాపూరితంగా ప్రచారం చేసి ప్రతిభావంతంగా సత్ఫలితాలను పొందగలిగిన ౠషితుల్యుడు. పంచసూత్రాలు ప్రజ్ణానం, కుశలత, సమగ్రావగాహన, సుస్ఫష్ట సమన్వయం, సహౄదయత, సంపూర్ణమానవునికి వుండవలసిన సల్లక్షణాలు. మొదటి జత మేధస్సు పరమైతే, మిగతావి హౄదయసంబంధితాలు. ఈ లక్షణసారం శ్రీ రాధాకౄష్ణన్ గారిలో పుష్కళంగా నిబిడీకౄతమైవున్నాయి. సర్వేపల్లి వారి భావపరంపర సైన్స్, టెక్నాలజీ, కేవలం ఉద్యోగదౄష్టితో అందిస్తున్న కౌశలత్వపు విద్యావిధానం - విలువలులేని విద్య, విద్యాలయాలమయంగా మారిపోయింది. ఈనాటి విద్యకు విలువలు విషయంలో దౄష్టిపెట్టలేని ఉపద్రవ పరిస్థితిలో సాగుతోంది అన్నది నగ్నసత్యం. విద్యావిధానం ముఖ్య సూత్రాలను బోధించే దిశలో అమలు జరగాలి. దేశభక్తిపూరితమైన గతచారిత్రాత్మక విషయావగాహన, గతకాలపు విధానాలకు బానిసలు కాకుండా కలిగించాలి. సంకుచిత మనస్తత్వధోరణి ప్రేరేపించక, దీర్ఘప్రణాళిక దౄష్టిని పెంపొందించాలి. మతవాదం, అతివాద ధోరణికి దారితీయనీయక, నూతనస్ఫూర్తిని కలిగించాలి. మహమ్మారి లక్షణాలైన, అసూయాద్వేషాలు, అసహనం, హింసాత్మకచర్యలు అరికట్టే నిష్కళాత్మకమైన సంస్కరణాత్మక చర్యలు, సంస్కౄతీభావాన్ని అలవరచుకోవడం, సర్వమతసహన, సమానదౄష్టిని పెంపొందించుకునే కార్యక్రమాలు ఆచరణకు రావాలి. మనస్తత్వ శాస్త్రవేత్తలు మానవమేధస్సుని విశదంగా విశ్లేషించి, కుడి ఎడమైతే పొరబాటు బాబోయ్ అని నిర్ధారించారు. నూతనత్వం, శ్రద్ధాసక్తులు, ఊహాగానం, విశ్వాసం, అభిమానం, దానగుణం, సహాయం, సహనాది లక్షణాలు, ఒకవైపున, తర్కం, న్యాయనిర్ణయశక్తి, సద్విమర్శనాధీమంతుడు, ప్రశ్నించే హక్కు, జవాబు చెప్పగల కలేజా, మరోప్రక్కన మేధస్సు నిర్వహణాప్రక్రియలో పరికరాలు అని చెప్పడం జరుగుతోంది. ఈ రెండు వర్గాల సమన్వయ సమీకౄత సంహారమే, విద్యయొక్క విలువలను నిర్ణయించేది; మానవ వ్యక్తిత్వానికి పరిపూర్ణత, సార్ధకత, అప్పుడే సంతరించేది అని చెప్పవచ్చు. పై లక్షణాల్ని, ప్రత్యక్ష, పరోక్షాలుగా డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్ గారి లో సంతరించుకున్నాయి అన్నది విశ్వవ్యాప్తంగా అంగీకరించిన సత్యం. అందుకే ఆయన మహామహోపాధ్యాయుడు. ఆయన జన్మదినాన్ని, ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాధాకౄష్ణన్ ఛలోక్తులు రాజ్యసభలో సభ్యుల గురించి అధ్యక్షపీఠంలో వున్న సర్వేపల్లి - ఈ వేళ మనతో సీత, సావిత్రి, పార్వతి వున్నారు అని సభ్యులపేర్లు క్లుప్తంగా పేర్కొనగా, మహావీర్ త్యాగి సమాధానంగా - సార్, వీరితోపాటు, మాతో రాధాకౄష్ణులూ స్వయంగా వున్నారు అని చెప్పారుట. భూపేష్ గుప్తా గురించి రాజ్యసభలో నెహ్రూ యిచ్చే సమాధానంలో కల్పించుకుని, భూపేష్గుప్తా, సమయోచితమైన ప్రశ్న అడగడానికి రాష్ట్రపతి రాధాకౄష్ణన్ అనుమతిని కోరాడట. దానికి సమాధానంగా - ఈయన మొదటిసారిగా రాజ్యసభలో సమయోచితమైన ప్రశ్న వేస్తున్నారు! అందరూ సావధానంగా వినండి - అని ఛలోక్తిని విసిరారు. విదేశంలో జరిగిన కంటి శస్త్రచికిత్సపై పత్రికావిలేఖరుల ప్రశ్న ఏం సార్! భారతదేశంలో, ఈపాటి కంటి శుక్లం తీసే నేత్రవైద్య ప్రముఖులు లేరా? అన్న విమర్శాత్మక ప్రశ్నకు సమాధానంగా సర్వేపల్లివారు - లేకేం వున్నారు! ఒకసారి ఒక కంటికి శుక్లం తీసారు, వాళ్ళ పుణ్యాన నేను శుక్రాచారినయ్యాను! యిక రెండోకంటికి ఆపరేషను చేయించుకుంటే ఈసారి ధౄతరాష్ట్రుడినయ్యాననుకోండి! ఇబ్బందిలో పడిపోతాను కదా! అన్నారట. డా. సర్వేపల్లివారు ఎంత పండితుడో, అంతకు మించిన వేదాంతి. గంభీరతను పుణికిపుచ్చుకున్న ఘనాపాటి. ఆయన పైకి ఎంత గంభీరంగా వుంటారో, సమయం వస్తే, చెణుకులు విసరటంలో, ఆయనకు ఆయనేసాటి. ఆయన అంటించే చురకలో ఎంత వ్యంగ్యం వుంటుందంటే - ఆ వ్యంగ్య వైభవానికి అందరూ నవ్వవలసిందే. ఆచార్య దేవో భవ: గురవే నమ:


ప్రముఖ తాత్త్వికుడు, పండితుడు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవంకూడా జరుపుకునే సత్సంప్రదాయాన్ని పాటించే నేటిరోజున విశ్వవ్యాప్తంగా ఉపాధ్యాయులను, ఆచార్యులను, అయ్యవారలను నిత్యం విద్యాబిక్షని ప్రసాదించే గురుపరంపరకు నాంది పలికిన సందర్భంగా తెలుగు రథం శతథా, సహస్రధా ప్రణామాల్ని సపర్పిస్తున్నాము. ఉపాధ్యాయులందరికీ ప్రణామాలు, అబినందనలు తెలుపుకుంటూ -


కొంపెల్ల శర్మ - తెలుగురథం.

ఉపాధ్యాయ దినోత్సవం - డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి - సెప్టెంబర్ 5

Friday, September 4, 2009

తెలుగు రథం సంస్థ కార్యక్రమాలు - సెప్టెంబర్ 2009 - సాహిత్యం, సంగీతం

తెలుగు రథం - సాహిత్య,సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల సాహిత్య, సంగీత కార్యక్రమాలు తలపెట్టింది. వారి వివరాలు యిలా ఉన్నాయి.

September 10 - Thursday - 5.30 pm
కవిసామ్రాట్, తొలి తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా, విద్యార్థులకు పద్య, వ్యాసరచన పోటీలు నిర్వహించబడుతున్నాయి. జయంతి నాడు, సాహిత్య సమాలోచనం, సాహిత్య సభ కూడా జరుగుతాయి.


September 16 - Wednesday 6.00 pm
భారతరత్న, సంగీత కళానిథి, యమ్ యస్ సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా శాస్త్రీయ సంగీత కార్యక్రమం జరుగుతుంది.

పై రెండు కార్యక్రమాలు కళా సుబ్బారావు కళా వేదిక, శ్రీ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో తెలుగు రథం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి.

సాహిత్య, సంగీతాభిమానులందరినీ పై కార్యక్రమాలను చూసి ఆనందించవలసినదిగా కోరుచునామ్య్.

కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగు రథం
Celphone : 97017 31333/90007 31333

భావాభిరామం - ధర్మం


భావాభిరామం

ధర్మం

ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే సకలపురుషార్థాలె రాజ్యానికి ఫలం, రాజులకు, ప్రజలకూ వర్తిస్తాయి. ఐహికమైన అభ్యుదయాన్నీ, పారలౌకిక శ్రేయస్సునూ కలిగించేదే ధర్మం. దీనికి విపరీతమైన ఫలం ఇచ్చేది అధర్మం. తమకు వలెనే ఎదుటివానికి కూడా క్షేమం కలగాలని ఆలోచించడం, యథాశక్తి దానమూ చేయడము - ఇవే ధర్మప్రాప్తికి ఉపాయాలు. సకల ప్రాణులనూ సమంగా చూడడం అనేది అన్ని ఆచారాలలోకి ఉత్తమమైన ఆచారం. ప్రాణులకు ద్రోహం చేసేవాడు తలపెట్టిన ఏ పనీ కూడా శ్రేయస్సును ఇవ్వజాలదు. ఇతరులకు హింస తలపెట్టనివారి చిత్తం, వారు ఏ వ్రతాదులూ ఆచరించకపోయినా స్వర్గాన్ని ఇస్తుంది. తనకు దుస్థితిని కల్పించే త్యాగం చేస్తే చివరికి దేశాన్ని త్యజించ వలసివస్తుంది. అలాంటి త్యాగం మంచిది కాదు. ఎదుటివాడు కష్టపరిస్థితులలో ఉన్నాడని తెలిసి కూడా అతనినుంచి ఏదో పొందాలని కోరేవాడు నిజంగా శత్రువె. శరీరానికి గాని మనస్సుకు గాని ఏమి అనర్థం కలుగుతుందో అనే సంశయానికి తావులేని వ్రతమే ఆచరించాలి. 

ఇహలోకంలోను పరలోకంలోనూ లభించే ఫలం కొరకై ధనం వ్యయం చేయడం త్యాగం. అపాత్రుల/అయోగ్యుల కోసం ధనం వ్యయం చేయడం బూడిదలో హోమం చేయడం వంటిది. 

ధర్మపాత్రమూ, కార్యపాత్రమూ, కామపాత్రమూ అని పాత్రం మూడు విధాలు. ఆశ్రితుల్ని పోషించని, అధర్మాన్ని ఎదిరించని కీర్తి ఉండి ఏమీ ప్రయోజనం లేదు. గంగకు, లక్ష్మికి, పార్వతికి, శ్రీపర్వతమునకు వలె పదార్థాల ప్రసిద్ధికి కారణం వేరే ఏదో ఉంటుంది. త్యాగం మాత్రం కాదు. ఎందుచేతననగా, గ్రహించే వాళ్ళు అంతటా ఉండరు; ఎప్పుడూ ఉండరు. త్యాగం వల్ల ప్రసిద్ధి లభిస్తే, లభించవచ్చును గాని ప్రసిద్ధికి అదొక్కటే హేతువు కాదు. ఎందుచేతననగా, ఇద్దామని అనుకున్నా తీసికొనేవాళ్ళు ఉండాలి; ఎప్పుడో లభించినా, ఎల్లప్పుడూ లభించాలి అని మరొక భావం. శరణాగతులకు పంచి ఇవ్వని ధనం ఎవ్వరికీ లేకుండు గాక. యాచకులకు ఇవ్వడం, తాను అనుభవించడమూ అనేవి రెండూ ధనం ఉన్నందులకు ప్రయోజనాలు. పరమలోభికి ఔచిత్యమనేది ఉండదు. ఏదైనా ఇచ్చి, మంచి మాటలాడి ఇతరులకు సంతోషం కలిగించడమే ఔచిత్యం. తన ధనాన్ని సత్పురుషులకోసం వినియోగించి, దాన్ని జన్మంతరాలకు కూడా తనతో తీసికొనిపోయేవాడు నిజమైన లుభ్ధుడు. దానం చేయనివాడు పలికే తియ్యని మాటలు మరి ఎవరినుండైనా సంపాదించుకోవడానికి అంతరాయం. ఎల్లప్పుడూకష్టాలలో ఉండేవారిని ఎవరు ఆదుకోగలరు? ఎప్పుడూ ఏదో ఒకటి అడుగుతుండేవానిని చూసి ఎవరు విసుగుచెందరు?

ఇంద్రియాలనీ, మనస్సునీ అదుపులో ఉంచుకోవడమే తపస్సు. లేదా ఇంద్రియాలు మనస్సు నియమాన్ని అనుష్ఠించడమే తపస్సు. విధించబడిన కర్తవ్యాలు చేయడం, నిషేధించబడినవాటిని చేయకుండా ఉండడమే నియమం. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనేది సంప్రదాయసిద్ధంగా వచ్చే వినికిడిమీద ఆధారపడి ఉంటుంది.

ప్రమాణాలకి, శాస్త్రాలకి బాధ కాని, పూర్వాపరవిరోధంగాని లేని ఐతిహ్యాన్ని, వినికిడిమీద వచ్చే విషయాన్ని, మాత్రమే సత్పురుషులు విశ్వసించాలి. ఇంద్రియాల ప్రవృత్తినీ, మన:ప్రవృత్తినీ అదుపులో ఉంచుకోలేని వారు చేసే అనుష్ఠానం అంతా గజస్నానం వంటిది. ఏనుగు గంటల కొలది నీటిలో స్నానం చేసి, బైటకు వచ్చి బూడిద తొండముతొ తీసి ఒళ్ళంతా చల్లుకుంటుంది కదా! తాను ఆచరణలో పెట్టనివాని జ్ఞానం భర్తృవిహీనురాలి ఆభరణాల వలె, కెవలం శరీరానికి బరువుచేటు. పౌరాణికుల వలె, ఇతరులకు మాత్రమే ధర్మోపదేశం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతిరోజూ ఏ కొంచెమో దానం చేసేవానికీ, ఏ కొంచెమో తపస్సు చేసేవానికీ ఉత్తమలోకాలు తప్పకుండా లభిస్తాయి. పోగు చేయగా చేయగా పరమాణువులు కూడా కొంత కాలానికి మేరుపర్వతం అంత అవుతాయి కదా? ధర్మ, విద్యా ధనాలను ప్రతిరోజూ కొంచెం సంగ్రహించుకున్నా అవి సముద్రంకంటే కూడా పెద్దవి అవుతాయి.

సర్వదా ధర్మం విషయంలో జాగర్త వహించనివాళ్ళు చివరికి ఆత్మవంచన చేసుకున్న వాళ్ళవుతారు. ఒక్కమారుగా పెద్ద పుణ్యరాశిని ఎవరు సంపాదించుకొనగలరు? స్వప్రయత్నం లేనివాళ్ళ కోరికలు స్వప్నరాజ్యాల వంటివి. ఎప్పుడో చెఇన ధర్మ ఫలాన్ని ఈనాడు అనుభవిస్తున్నా తెలివి తక్కువవాడు అధర్మం అంటూ ఆచరిస్తూ ఉంటాడు. ఔషధం వలె తనకు హితకరమైన ధర్మాన్ని,  బుద్ధిమంతు డెవడైనా, ఇతరుల నిర్బంధంమీద ఆచరిస్తాడా?  ధర్మం చేస్తూన్నప్పుడు, వద్దనుకున్నా ఇతరులు ఏవో అడ్డంకులు కల్పిస్తూ ఉంటారు. అధర్మం విషయంలో ముందునడిచి దారి చూపేవాళ్ళూ, ఉపదేశాలు చేసేవాళ్ళూ కోకొల్లలు. ప్రాణాలు పోతున్నా, మంచి బుద్ధి కలవారు చెడ్డపనులు చెయ్యరు. తమ దుర్వ్యసనాలు తీర్చుకోవడం కోసం మోసగాళ్ళు ధనవంతుల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. దుష్టుల సహవాసం ఎంతటి అనర్థమైనా చేస్తుంది. అగ్నివలె దుర్జనులు తను ఆశ్రయాన్నే కాల్చివేస్తారు. అడవియేనుగ వలె తాత్కాలిక సుఖంమీద మాత్రమే దృష్టికలవాడు ఆపదలలో చిక్కుకొనకుండా ఉండడు. అడవియేనుగులను పట్టుకొనేవారు ఒక పెద్ద గొయ్యి తవ్వి, దానిని ఆకులతో కప్పి, దాని అవతల ప్రక్క ఒక ఆడ ఏనుగును నిలబెడతారు. వనగజం ఆ ఆడ ఏనుగును చూసి, తాత్కాలికసుఖం కోసం పరుగెత్తి ఆ గోతిలో పడిపోతుంది. అధర్మం వల్ల లభించిన ధనాదులను ఇతరులు, భార్యా పుత్ర మిత్రాదులు, అనుభవిస్తారు. పాపం మాత్రం తనకు చుట్టుకుంటుంది. ఏనుగును చంపిన పాపం సింహానికి; దాని మాంసం తినేవి మాత్రం ఇతర జంతువులే.

అధార్మికునికి శుభమైన భవిష్యత్తు ఉండదు. వాడు విత్తనాల ధాన్యం తినేసిన గృహస్థు వంటివాడు. కామార్థాలు విడిచిపెట్టి ధర్మాన్ని మాత్రమే సేవించేవాడు పక్వమైన క్షేత్రాన్ని విడచి చవట భూమిని దున్నుతున్నాడు. పరలోక సుఖానికి భంగం కలగకుండా బహికసుఖాలు అనుభవించేవాడే సుఖవంతుడు. చాలా ఆశ్చర్యకరమైనది ఏమంటే - అన్యాయంగా కలిగే సుఖలేశం కోసం ఆశ పడితే ఇహపరలోకాలలో నిరంతరంగా దు:ఖం అనుభవించవలసివస్తుంది. సుఖదు:ఖాదులను పట్టి ప్రాణులలొ కనబడే ఉత్కార్షావకర్షలే ధర్మాధర్మాలకు లింగం. ప్రాణులలో కొంతమంది సుఖవంతులు, కొంతమంది దు:ఖవంతులు. ఈ సుఖ-దు:ఖ-ధనదారిద్ర్యాదులను పట్టి, వారిలో గొప్పవారు తక్కువవారు అనే భేదాలు ఏర్పడుతున్నాయి. ధర్మధర్మాలనేవి ఉన్నాయి అని చెప్పడానికి ఈ భేదాలు గుర్తు.

ప్రపంచాన్నంతటినీ వశంలొ ఉంచుకొని పాలించేది అదృష్టం. దాని అధికారం చెల్లని వస్తువు ఏదీ లేదు.

బాలానందిని అను సోమదేవనీతిసూత్రాల ద్వారా ధర్మ సుముద్దేశం అందించినందుకు ఆ మహాకవిని అభినందించాల్సిందే.

కొంపెల్ల శర్మ - తెలుగురథం