మా సంస్థ తెలుగురథం (సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ) తరువాతి కార్యక్రమాన్ని 27 డిసబర్ సోమవారం సాయంత్రం 6 గం. కు చిక్కడపల్లి/అశోకనగర్ శ్రీ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలోని కళా సుబ్బారావు కళావేదిక లో నిర్వహిస్తున్నాము. భారతీయ తొలి వాగ్గేయకారుడు, శ్రీ గీత గోవిందం సృష్టికర్త భక్త జయదేవ ఆరాధనోత్సవాన్ని జరుప తలపెట్టాం. స్వరరాగ గీత నీరాజనం కార్యక్రమంలో భాగంగా జయదేవుని అష్టపదుల కృతులను వర్థమాన సంగీత కళాకారిణి శ్రీమతి రమాప్రభ గానం చేస్తారు. సభలో భారతీయ ఆధ్యాత్మిక మధుర భక్తి శృంగార తత్త్వంలో జయదేవుని ప్రతిభా ప్రభావం అన్న అంశంపై సమాలోచనం ఉంటుంది. సాహిత్య, సంగీత ఆధ్యాత్మిక ప్రేమికులందరినీ ఆహ్వానిస్తున్నాము.
కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగురథం. 97017 31333
కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం. 'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?' కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో? (బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Sunday, December 26, 2010
Sunday, August 22, 2010
మా సంస్థ 'తెలుగురధం' - సాహిత్య సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ, నిర్వహణలో వ్యావహారిక భాషా ప్రవక్త శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ప్రతీ సంవత్సరం ఆగష్ట్ 29 న తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం మన సంస్కృతీ, సంప్రదాయ పరంపరలో భాగంగా కార్యక్రమం తలపెట్టాం. ఈ సందర్భంగా ప్రముఖ కవి, కథకులు, విమర్శకులు, శ్రీ ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి శతజయంతి ఉత్సవాన్ని కూడా అదే రోజు నిర్వహిస్తున్నాము. చిక్కడపల్లి-అశోక్నగర్ లోని నగర కేంద్ర గ్రంథాలయం లోని విశ్వనాథ సమవేశ మందిరం లో 29 ఆగష్ట్ ఆదివారం సా. 6 గం. కు జరుగును. అంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పుర్వాధ్యక్షులు డా. ఎ బి కే ప్రసాద్ ముఖ్యాధ్యక్షులుగా విచ్చేసే సభకు ప్రముఖ కవులు, రచయితలు డా. అద్దంకి శ్రీనివాస్ మరియు శ్రీ విహారి ప్రత్యెక అతిథులుగా, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు మరియు శ్రీమతి ఇంద్రగంటి జానకి బాల గారు ఆత్మీయ అతిథులుగా పల్గోమ్తల్రు. ఈ సందర్భంగా హనుమచ్చాస్త్రి గారి కలం నుండి వచ్చిన ప్రసిద్ధ లలితగీతాలను వర్తమాన గాయనీమణులు సుష్మ, సౌమ్య గానం చేస్తారు. తెలుగు భాషా సాహితీ అభిమానులు అందరిని సభలో పాల్గొనమని స్వాగతం పలుకుతున్నాం.
కొంపెల్ల శర్మ, అధ్యక్ష్సులు, తెలుగురధం. 9701731333

Tuesday, March 16, 2010
అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి
అమరజీవి 'పొట్టి శ్రీరాములు

'పొట్టి శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చూ - గాంధీజీ.
నెల్లూరు జిల్లాలోని 'పడమటపల్లే పురవాసుల పూర్వజన్మసుకౄతం కాబోలు! అమరజీవి పొట్టిశ్రీరాములు గారి పూర్వీకులు ఈ ప్రాంతానికి చెందినవారు. బంధుజనకూటమి స్థిరవాసమూలాన మద్రాసులో స్థిరనివాసకులయ్యారు. గురవయ్య - మహాలక్ష్మమ్మ దంపతులు పున్నామనరకంనుండి రక్షించబడ్డ పవిత్రక్షణం. ఆరోజు 1901 మార్చి 16. మద్రాసు జార్జిటౌన్, అణ్ణాపిళ్ళైవీధిలోని 165 భవనం మాత్రం సర్వతేజోమయంగా విరాజిల్లుతోంది. పొట్టి శ్రీరాములు జన్మించారు. రెండు దశాబ్దాల పర్యంతం జరిగిన మద్రాసు చదువు, బొంబాయిలో లోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో శానిటరీ యింజనీరింగ్ పూర్తయిన వెంటనే గ్రేట్ యిండియన్ పెనిన్సులా రైల్వేలో మద్రాస్, బొంబే లో ఉద్యోగపర్వం నిర్వహించారు. కాని, పాతికేళ్ళ వయసులోనే కష్టాల కడలి ఆవహించింది. ఫలితంగా 1928లో భార్య వియోగం, పురిటిబిడ్డ కూడ దక్కకపోవడం, తర్వాత తల్లిని కోల్పోవడం కారణంగా ఐహికసుఖాలపై విరక్తి, దేశసేవపై ఆసక్తి ఒకేసారి కలిగాయి. గాంధిజీ జాతీయోద్యమపిలుపు పొట్టివారు 1927లో తమ ఉద్యోగానికి భరతవాక్యం పలికారు. వ్యక్తిగతనష్టం, ఆంధ్రావనికి మాత్రం అమూల్య వరప్రసాదంగా మారింది. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు అందజేసి, సబర్మతి ఆశ్రమం చేరుకున్నారు. గాంధిజీ అంతేవాసితనంతో నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనడం, రాజకీయ నిర్బంధితులుగా కారాగారవాసం, సత్యాగ్రహం, శాసనోల్లంఘనం, ఉద్యమాల్లో అగ్రగామిగా గాంధిజీచే గుర్తింపులు - ప్రశంసలు, గుజరాత్ లోను, కొమరవోలులోను, పలుసేవలు చేయడం, క్విట్ యిండియోద్యమంలో భాగస్వామ్య ఫలితంగా జైలు శిక్షలతో బాటు, నెల్లూరులో ఖద్దరు సంబంధిత కార్యక్రమాల్లోను తీవ్ర కౄషి, సేవల్లో పాల్గొన్నారు. ఏ దీక్ష, సత్యాగ్రహం, ఆంధ్రావతరణకు దారి తీసిందో, ఆ సత్యాగ్రహాలకు నాంది, ప్రస్తావనలు 1946 లో నెల్లూరు, మూలపేటలోని వేణుగోపాలస్వామి దేవాలయం లో హరిజనుల ప్రవేశం కోసం ప్రారంభించిన 'హిందూ సంస్కార సమితీ, కారణాలు అలా ఏవో ఆయనను వెంటాడూతూనే వచ్చాయి. ఫలితంగా ఆలయాల్లో హరిజనులకు ప్రవేశం, హరిజనోద్ధరణకు శాసనాలు, 23 రోజుల నిరసన తర్వాతే లభించాయి. వజ్రసంకల్పం ఫలించింది. 1948లో వార్ధాలో 29రోజుల నిరహార దీక్ష సాగించారు.
పొట్టి శ్రీరాములు ఎన్నడూ, పదవులు, కీర్తి, ప్రతిష్టలకోసం ఏనాడు ఆలోచించి దీక్షలను చేయలేదు. గాంధీజీ ద్వారా అందుకున్న బోధనలు - సత్యాహింసలు, హరిజనోద్ధరణ జీవితాశయాలుగా మలచుకొని, సంకల్పసిద్దులయ్యారు. మిత్రుల వత్తిడితో ఆంధ్రరాష్ట్ర గాంధీ స్మారకసంఘం కార్యదర్శి బాధ్యతలను నిర్వహించారు. నెల్లూరులో హరిజనోద్ధరణకు మద్దతుగా ప్రచారసామగ్రిని గళమూపురబంధనం గావించి, త్యాగధనులుగా ముతక ఖద్దరు బట్టలతో వీధుల సంచారం చేస్తూ, పురజనుల దయాహారంతో జీవితపు చివరి దశ గడిపారు. చెప్పులు లేని కాళ్ళు, మండుటెండలకు గురయిన తలాభారంతో జాతీయోద్యమ ప్రచారకులుగా తిరిగిన దేశభక్తుణ్ణి - "పొట్టిశ్రీరాములు - పిచ్చిశ్రీరాములూ అని పిలిచేవారట, దేశాభ్యుదయమనే మోహం ఆవరించుకున్నవారు. మహాత్మాగాంధి హత్య తర్వాత, ఆంధ్ర లోని గాంధీ స్మారక నిధి సేకరణకు, నిర్వహణకు బాధ్యతని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజల నుంచి వచ్చిన నిరాసక్తి పై అసంతౄప్తి వహించారు. భూదానోద్యమానికి, కస్తూరిబా సమితి, గాంధి సమితి పట్ల కూడ నిరాదరణను గమనించారు. ఈ నిరాదరణకి కారణాల్ని విశ్లేషించి, విచారించగా, అంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం లేని లోటు, తీర్వ అసంతౄప్తి వల్లనే అని గ్రహించారు. వెంటనే కార్యదీక్ష వహించాడు. ప్రణాళికలని స్వయనిర్మాణం చేసుకున్నాడు. సత్సంకల్పంతో, నిస్స్వార్ధపూర్తితమైన కార్యాచరణ కావించాడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్రానికి ప్రధమంగా 1910 లో ప్రత్యేకంగా తెలుగు ప్రజలు, వందేమాతరం ఉద్యమంలో భాగంగా జైలుపాలయ్యారు. అదే ఉద్యమప్రచారభాగంగా, ప్రత్యేకాంధ్ర ప్రసక్తి ముమ్మరంగా వచ్చింది. కాని ఈ భావనకు ఒక రూపు, ఊపు, 1912 లో కౄష్ణాజిల్లాలోని నిడదవోలు లో జరిగిన సమ్మేళణం ప్రముఖ పాత్ర వహించింది. యిదే మూసలో, బాపట్ల, విజయవాడ, విశాఖపట్నంలో జరిగి, తీర్మానల వెల్లువలు కురిసాయి. ప్రధమంగా, అనిబిసెంట్ నాయకత్వంలో జరిగిన కాంగ్రేసు నిర్వహణ సమితి సమావేశంలో, భాషావిధానాలపై ప్రాంతాలను ఏర్పాటు చేసే ధోరణిపై ఆలోచన, తీర్మానం జరిగాయి. బ్రిటిష్ ప్రభుత్వం ససేమిరా అన్నది. స్వాతంత్ర్యం తర్వాత, ప్రభుత్వం నియమించిన ధర్ సంఘం కూడ భాషాపరంగా విభజనకు అంగీకరించకపోయినా, ప్రజలు మాత్రం ఈ సంఘం నివేదికను తిరస్కరించారు. ప్రజల సంకల్పం, ఆందోళనలను గమనించిన ప్రభుత్వం - 1948 లో జైపూరు లో జరిగిన అఖిలభారత కాంగ్రేసు సమావేశం ఒక త్రిసభ్యసంఘాన్ని - నెహ్రూ, పటేల్, పట్టాభి సీతారామయ్య లను నియమించింది. ఆనాటి మద్రాసుని తప్పించి, మిగతా అంధ్రప్రాంతాలన్నీ కలిపి ప్రత్యేకాంధ్రరాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న తీర్మానం తెలుగు ప్రజలకు నచ్చలేదు. ఈ నిర్ణయానికే, 'మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం' అని శ్రీరాములుగారు వ్యాఖ్యానించడం గమనార్హం. స్వామి సీతారాం, ఆగష్టు 15, 1951 న ఆమరణ నిరహార దీక్షని, ప్రత్యేకాంధ్ర కోసం ప్రారంభించాడు. ఈ ఉద్యమాన్ని కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు. 35 రోజులుగా దీక్ష కొనసాగింది. పరిస్థితి చేయి దాటిపోతోందని భావించి, ఆచార్య వినోభాభావే, స్వయంగా నెహ్రూతో సంప్రదింపులు జరిపాడు. యిద్దరూ, సీతారాం ని కలవడం, ఆంధ్రులకు ప్రత్యేకరాష్ట్రాన్ని యిస్తామని వాగ్దానం చేయడంతో దీక్ష విరమించడం జరిగింది. అయితే, రాజకీయ చతురుడు నెహ్రూ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. ఫలితంగా, మన పొట్టి శ్రీరాములు రంగంలోకి దూకడం జరగడం, చరిత్రలో ప్రముఖఘట్టంగా మారడం, సర్వవిదితమే.
అప్పటి మద్రాసు రాష్ట్రం, 'ఆంధ్రా పట్ల ప్రదర్శించిన సవతితల్లి ప్రేమదృౠష్టి తీవ్రతను గమనించి, ఆంధ్రులహక్కుని తెలుపుతూ, ప్రత్యేకాంధ్రరాష్ట్రం మాత్రమే ఆంధ్రులకు న్యాయం యిస్తుందనే భావాన్ని ప్రకటించారు. ఈ భావప్రకటన, 1952 అక్టోబరు 19న మద్రాసు - మైలాపూర్లోని బులుసు సాంబమూర్తిగారి నివాసంలో చేపట్టిన నాల్గన నిరహారదీక్ష అవిఛ్ఛన్నంగా సాగింది. నిరహారదీక్ష శిబిరానికి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు నిత్యం సందర్శించి, శ్రీరాములుగారి ఆరోగ్యం గమనించేవారు. దిగజారుతున్న ఆరోగ్యాన్ని గమనిస్తూ, గాంధేయవాది యెర్నేని సుబ్రహ్మణ్యం చాటుగా కళ్ళని తుడుచుకుంటూ వుండేవారట. దేహం, ఆరోగ్యం, సన్నగిల్లి కుచించుకుపోతున్నా, శ్రీరాములుగారి హౄదయం, మనస్సు, మేధస్సు, ధౄఢంగానే కొనసాగాయి. నిమ్మకునీరెత్తని ప్రభుత్వపు తీరు ప్రజల్లో భయాందోళనలను రేకిత్తించింది. స్ఫృఅహతప్పినా దీక్షావ్రతానికి భంగం కలిగించరాదని తన అనుచరులకు, నాయకులకు, ఆదేశాలిచ్చారు పొట్టివారు. కేంద్రప్రభుత్వం కూడ పట్టించుకోలేదు. సరిగ్గా, 56 వ రోజు నిస్మౄహలోకి వెళ్ళడం, రెండురోజుల్లోనే శ్వాసలో యిబ్బందులు ఎదురయ్యాయి. అసామాన్య దేశభక్తి శిఖామణిరూపశరీరం చిక్కుతూ, క్షీణిస్తూ, 58 రోజుల నిరహార దీక్ష కొనసాగించారు.
డిసెంబర్ 15 శ్రీరాములుగారి ఆత్మార్పణ దినం. ఉదయం నుంచే ఆయన స్మౄహలో లేరు. కళ్ళు తెరిచారు. అంతలోనే మూతలు పడిపోయేవి. చేతులు కదిపేందుకు కూడ శక్తి లేని స్థితి. 54 పౌనులు తగ్గిన శరీరం. నాడి, శ్వాస పనితీరు క్షీణించడం, మూత్రస్థంభనం జరిగాయి. నోటిమాట కష్టతరమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్ళేవారు. సందర్శకులను ఆపివేశేవారు. ఆరోజు వచ్చిన ప్రకౄతి వైద్యులు వేగిరాజు కౄష్ణమరాజు దంపతులను, మౌనంగా, చిరునవ్వుతోనే పలకరించారు. అదే ఆఖరి సన్నివేశం. తర్వాత, క్రమంగా శరీరం చల్లబడిపోవడం ప్రారంభమైంది. రాత్రి 11.23 ని. లకు పొట్టిశ్రీరాములుగారు అంధ్రరాష్ట్రంకోసం అసువులు విదిచారు. చివరకు 1952, డిసెంబర్ 15న ప్రాణత్యాగం చేశారు. మరణవార్తని, యెర్నేని సుబ్రహ్మణ్యం గారు చెప్పగా, ప్రముఖ గాయకులు ఘంటసాల, ప్రముఖ స్వాతత్ర్యయోధులు మోపర్రు దాసులు హుటాహుటిని శిబిరానికి విచ్చేశారు. శ్రీరాములుగారి ఆత్మశాంతి కోసం ఆసువుగా ఒక గీతాన్ని రచించి, గానం చేయడం జరిగింది. భౌతికకాయాన్ని తరలించే ప్రయత్నంలో, మద్రాసు మౌంట్ రోడ్ లో వేలమంది చేరారు. శ్రీరాముల త్యాగనిరతికి నినాదాలు చేశారు. హింసలకు కూడ దారితీశాయి. దూరప్రాంతాలైన, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, ఏలూరు, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు లో నివాళి ప్రదర్శనలు చేశారు. ఆంధ్రప్రజలు తమ కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించారు. ఫలితంగా, అనకాపల్లి, విజయవాడ లో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. సామాన్య ప్రజాజనజీవితం ఆంధ్ర, మద్రాసు ప్రాంతాల్లో స్థభించిపోయింది. మెరుపుతీగలా వ్యాప్తిచెందిన శ్రీరాములుగారి మరణవార్త, ఆంధ్రుల అసహనానికి దారితీయడం, హద్దులుదాటి విశృౠంఖల దౌర్జన్యానికి నిలువలేని కేంద్రప్రభుత్వం తట్టుకోలేని ప్రజాప్రభంజనశక్తి, ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర స్థాపనకు అంగీకరించవలసి వచ్చింది. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని 19 డిసంబర్ 1952 న ప్రకటన జారీ అయింది. ఎర్రగులాబి కదిలింది. నెహ్రూ దిగిరాక తప్పలేదు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోవడానికి వీల్లేదని, మరునాడే వెళ్ళిపోవాలని, అపర రాజకీయ చతురులు, చక్రవర్తి రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే, కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించడం, రాజమండ్రి కూడ బాగుంటుందని కూడ ఆలోచించడం, కమ్యూనిష్టుల కోట కారణంగా విజయవాడకు కాంగ్రేసు నిరాకరణలు, నెల్లూరు, చిత్తూరు నాయకులు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలగడం, కోస్తా కమ్మదేశాన్ని నమ్మమని, రాజధాని రాయలసీమలోనే పెట్టాలని లేకపోతే ఆంధ్రరాష్ట్రమే వలదని చెప్పిన నీలం సంజీవఋరెడ్డి, ఎవరి పాత్రలు వారు పోషించారు. చివరకు ఆంధ్రులు మద్రాసుని వదలుకోవచ్చింది. బళ్ళారి, బరంపురం, హోస్ఫేట,తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడ వదలుకోవలసివచ్చి, గత్యంతరం లేక 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. 1 నవంబర్ 1956 న అంధ్రప్రదేశం, హైదరాబాదు రాజధానిగా ఆవిర్భవించింది. ఆంధ్రుల అంతిమలక్ష్యం 1956 నవంబరు 1 న, సంపూఋర్ణ ఆంధ్రరాష్ట్రం, హైదరాబాదు రాజధానిగా లభించింది.
మద్రాసు, మైలాపూర్ - రాయపేట హైరోడ్ లోని 126 నవంబరు 1 న పొట్టిశ్రీరాములుగారు కన్నుమూసిన భవనాన్ని, 'అమరజీవి స్మారకం'గా ఆ త్యాగమూర్తి స్మౄతిమందిరాన్ని పవిత్ర సాంస్కౄతిక కేంద్రంగా పరిణమించినా, నేటివరకు ఆ భవనాన్ని, తమిళనాడు, ఆంధ్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమనే భావించాలి. శ్రీరాములుగారి ప్రధమశిష్యులు వై.యస్.శాస్త్రిగారు జీవనకాలంలోను, తర్వాత ఆయన కుమారుడు శ్రీ రామకౄష్ణ, ప్రముఖులైన యన్.ఆర్.చందూర్ - రచయిత్రి మాలతి చందూర్ దంపతులు, తదితర ఆనాటి పొట్టిశ్రీరాములుగారి సమకాలికుల సహాయ సహకారాల్తో, ఆ సుక్షేత్రంలో పలు సేవాకార్యక్రమాల్ని నిరంతరం అందిస్తూ, చెన్నైలోని ఆంధ్రులకు సద్గోష్టి సంగమాలకి నేటికీ అలరిస్తోంది.
శ్రీరాములుగారు ఆకౄతిలో పొట్టివారైనా, ఆలోచనలో, ఆచరణలో, సంకల్పసిద్ధిలో మహాగట్టివారు. ఆంధ్రులు ఎన్నటికీ మరువలేని, మరువరాని, మరువకూడని వ్యక్తి, మహామనీషి. ఆంధ్రప్రదేశ్ అవతరణకు మూలపురుషుడు. ఆంధ్రుల నిత్య స్మరణకు పాత్రుడు.
పొట్టి శ్రీరాములు గారి త్యాగం పై - సామవేదం జానకిరామ శర్మ గారి కవిత:
అది గొప్ప యౌకొకో! యిపుడు వెన్నెముకను దానమిచ్చె దధీచి మౌని యతడు
యది యేమి ఘనత! కాయము కోసి ఇచ్చెను శిబి చక్రవర్తి ప్రసిద్ధుడతను
అది యొక లెక్కయా? యడుగురు మూడుగా ధరనిచ్చె బలియు వదాన్యుడతడు!
యది లెస్సయా? మేన ననఘళించిన సొమ్ములడుగ నిచ్చెను కర్ణుడగునె దాత
యనుచు స్వర్గపురీ రధ్యలందు సురలు
పొట్టిశ్రీరాముల యుదంతమును దలంచి
యక్కజంపడి తలయూచి యాడుభాష
లందగించెను మేఘగర్జాంతముల.
పొట్టి శ్రీరాములు గారి జీవిత వ్యక్తిత్వ చిత్రణం లోని ముఖ్యాంశాలు:
1901 మార్చి 16 న - జార్జిటౌన్, 165, అణ్ణాపిళ్ళై వీధి లో జననం.
గురవయ్య - మహాలక్ష్మమ్మ, తల్లిదండ్రులు.
పటమటపల్లె, నెల్లూరు జిల్లా - పూర్వీకులది.
యిరవై ఏళ్ళ వరకూ మద్రాసులో విద్యాభ్యాసం.
బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదువు.
గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే లో నాలుగేళ్ళు ఉద్యోగ పర్వం.
25 వ ఏట భార్య మరణం.
1927 లో ఉద్యోగానికి రాజీనామా.
ఆస్తిపాస్తులను కుటుంబానికి పంచిపెట్టడం.
గాంధీజీ అనుయాయిగా సమర్మతీ ఆశ్రమం ప్రవేశం.
స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా - ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్తో సహా, పాల్గొని, మూడుసార్లు జైలుశిక్ష.
రాజ్ కోట్ (గుజరాత్), కొమరవోలు (కౄష్ణాజిల్లా) లో గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనడం.
కొమరవోలు గాంధీ ఆశ్రమంలో చేరుట.
నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికై కౄషి.
కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి యింట్లోనైనా భోజనం చేయడం.
నెల్లూరు జిల్లా లోని మూలపేట వేణుగోపాలస్వామి ఆలయంలోకి హరిజనుల ప్రవేశం కోసం నిరహార దీక్ష.
హరిజనోద్ధరణకు కౄషిలో భాగంగా - నినాదాలను అట్టాలకు రాసె, మెడకు వేలాడేసుకుని ప్రచారం.
కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేక, మండుటెండల్లో ప్రచారం తో పిచ్చివాడని పిలువబడ్డారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం, 1952, అక్టోబర్ 19న, మద్రాసు బులుసు సాంబమూర్తిగారి యింట్లో నిరహార దీక్ష
1952, డిసంబర్ 15 అర్ధరాత్రి, పొట్టి శ్రీరాములు ప్రాణార్పణం.
పలు విశ్లేషణల తర్వాత, 1953 అక్టోబర్ 1 న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఆవిర్భావం.
'మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం' - పొట్టి శ్రీరాములు.
"ఆంధ్ర రాష్ట్రము వచ్చె - మహోంధ్ర రాష్ట్రమేరుపడు వేళ - పొలిమేర చేర పిలిచె" అన్న మహాకవి దాశరధి కవితాత్మక స్మరణంతో ఆనాటి ప్రజలను సముచితంగా ఉత్తేజపరచారు.
మద్రాసు, నేటి చెన్నై లోని బీచ్ రోడ్ లో శ్రీరాములుగారి స్మారక విగ్రహం, రాయపేట హైరోడ్, మైలాపూర్ లో స్మారకభవనం, హైదరాబాద్, సచివాలయం ఎదురుగా విగ్రహం, తెలుగు విశ్వవిద్యాలయానికి స్మారక నామం, నెల్లూరు జిల్లాను కూడ స్మారకంగా పేరు మార్చాలన్న ప్రయత్నం కొనసాగడం, అమరజీవి పొట్టిశ్రీరాములు గారి ఆత్మశాంతికి, ఘననివాళికి కొన్ని చిరు ప్రయత్నాలు మాత్రమే.
అమరజీవి పొట్టిశ్రీరాములుగారి జయంతి సందర్భంగా సమర్పిస్తున్న వ్యాసనివాళి.
తెలుగురధం సమర్పిస్తున్న చిరుభావలహరి.
తెలుగుభాష, సంస్కౄతి, తెలుగుప్రాంతాలకు సత్య శివ సుందర ప్రతిసాక్షి - అమరజీవి - అని చెప్పడం సమంజసం.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

"విరోధి నిష్క్రమణం - వికృతి దర్శనం"
"విరోధి నిష్క్రమణం - వికృతి దర్శనం"
'నీ' 'నా' భేదము లేక తెల్గుదనపున్నీరాజనాలిచ్చుచున్క్
రానేవచ్చె మరో 'ఉగాదీ యదిగో! రాగిల్లు నెమ్మోముతో
తేనెల్ జిప్పిలు నవ్వుదొంతరలతో, తీరైన వాల్చూపుతో
మీనట్టింటిని భోగ, భాగ్య, శుభసమ్మేళంబు గావింపగన్.
కాలం నియంతలా తనదైన షైలిలో, ఉగాది రూపాన ప్రవేష నిష్క్రమణలు కావిస్తూంటుంది. ఈ కాలధర్మంలో, దేవకాలమానంలో, మన మానవుల జీవన పరిణామం ఎంత? క్షణికమైనా, బుద్బుదప్రాయమైనా, నూరు ఉగాది పండుగలను వీక్షించుకునేందుకు మన షతమానం భవతి అని మనకు పెద్దలనుంచి శుభాషీస్సులు అందుకోవడం సర్వసాధారణం. ప్రస్తుతం మాత్రం విరోధి మాత్రం కనుమరుగవుతోంది. ఏడాదిపాటు మనందరితో సమాగమం చేస్తున్న 'విరోధీ యుగాది యికపైనుంచి వికౄతిగా దర్షనం యిస్తోంది. వికౄతి అయినా, వికారమైనా ఉగాదికి స్వాగతం పలుకకుండా మనలేం అన్నది సత్యం. వికౄతిలో కూడ ప్రకౄతిని, ప్రాభవాన్ని దర్షించుకుంటూ మనందరికీ సుఖానందభూతుల్ని, ఆరోగ్యాన్ని అందిస్తుందని ఆషిస్తూ కొత్త ఉగాదికి స్వాగతాన్ని పలుకుదాం.
కాలానికి నిజానికి యెల్లలంటూ లేవు. దానికి ఆది లేదు, అంతమూ లేదు. ఆద్యంతరహితమైన అనంత ప్రవాహంవంటిది కాలం. నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు; ఇవన్నీ కాల ప్రవాహంపై లేచి, తిరిగి దానిలోనే కలిసిపోయే చిన్ని, పెద్ద కెరటాలు. వీటిపై కొంత దూరం పయనించి, వీటితోపాటు తిరిగి కాలగర్భంలో కలసిపోయేవాడే మానవుడు. కనుకనే అతడి దౄష్టి సహజంగా ఆ కెరటాలపైనే. గడియారాలతో వాటిని కొలవడానికి మానవప్రయత్నం జరుగుతుంది. పంచాంగాలతో వాటి నడక తీరులను నిర్ణయించడానికి మానవులు తహతహలాడతారు. శకాలని, యుగాలని నాటి వర్గీకరణకు ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే యుంటాయి. దీన్ని షుష్కయత్నంగా వేదాంతులు నిరసించవచ్చు; వౄధాష్రమగా తత్వజ్ఞులు నిందించవచ్చు. కాని, జీవితమాధుర్యం దీనిలోనే వున్నది; జీవితసాఫల్యమూ దీనిలోనేవున్నది.
ఏ యుగంలోనైనా, ఏ షతాబ్దంలోనైనా, తుదకు ఏ సంవత్సరంలోనైనా మంచిచెడ్డలు, వౄద్ధిక్షయాలు మిశ్రమంగానే వుంటాయి. ఈ ద్వంద్వాలలో ఒకప్పుడు ఒకటి రెండవదానికంటే ఒక పాలు ఎక్కువ కావచ్చు; లేక తక్కువ కావచ్చు. అంతే తప్ప, సమస్తం మంచికాని, కేవలం చెరుపుకాని, పూర్తిగా అభివౄద్ధికాని, పూర్తి క్షయంకాని ఎప్పుడూ వుండదు.
అన్ని రోజులెట్టివో, పండుగరోజు లట్టివే. ఒక రోజు పండుగరోజు కావడానికి దానికి మనం ఆపాదించుకునే ప్రత్యేకతే కారణం, దానికి మనం సమకూర్చుకునే వైశిష్ట్యమే కారణం. ఇదే శకాలకు కూడా వర్తిస్తుంది. ఒకటి పాతశకం కావడం, మరొకటి కొత్తది కావడం, ఓకటి అంధకారభరితమైనది కావడం, మరొకటి మహోజ్జ్వలమైనది కావడం, కాలగతిపై ఆధారపడి వుండదు. శకాల స్వరూపాన్నీ, స్వభావాన్నీ నిర్ణయించేది కేవలం మానవప్రయత్నమె. మానవుడు మార్పు చెందనంతవరకు అది పాతశకం; మార్పు చెందితే అది నవశకం. అతడు అభ్యుదయపథాల మెట్టిదే, అది మహాశకం; అధోగతి పాలైతే అది హీనశకం.
పండుగలన్నీ సంవత్సరాని కొకసారి చొప్పున తిరిగి, తిరిగివచ్చేసే, అంతమాత్రం చేత వాటి అర్ధం తగ్గదు; అందం తగ్గదు; ఆనందం తగ్గదు; ప్రతి సంవత్సరం వచ్చేది కనుక వసంతం విలాసం తగ్గుతుందా? ప్రతి నెల వచ్చేది కనుక పూర్ణిమ శోభ తగ్గుతుందా? పౄకౄతి విలాసాలలోని నిత్యనూతనత్వం జాతీయ పర్వదినాలలో కూడా వుంటుంది. పైగా, మన ప్రధాన పర్వదినాలకు పౄకౄతివిలాసాలతో సన్నిహిత సంబంధం వున్నదికూడా. ఉదాహరణకు లేత చిగుళ్ళను, కొత్తపూవులను సంగారించుకొని వొయ్యారంగా వచ్చే వసంతునికి మనం పట్టే ముత్యాలగొడుగు - సంవత్సరాది.
ఏమైనా, జీవితాన్ని రోసినవారికి ఉగాది తక్కిన రోజులతోపాటు మరొక రోజు మాత్రమే కావచ్చు గాని, బ్రతుకును ఒక మహావరప్రసాదంగా భావించేవారికి మాత్రం ఉగాది కెంతో వైశిష్ట్యం వున్నది. అది మోడు మొక్కలనే కాక, వాడి వత్తలైన గుండెలను సహితం చిగురించజేస్తూ వస్తుంది. కొత్త పూబిందెలతో పాటు కొత్త ఆశలను, ఆనందాన్ని వెంటబెట్టుకు వస్తుంది. తియ్య మామిళ్ళతో పాటు తేనె పాటలు అందిస్తూ వస్తుంది. నిరుటి ఆశాభంగాలను, నిరుటి ఆవేదనలను తుడిచివేస్తూ వస్తుంది. కొత్త జీవితానికి ఆహ్వానాన్ని చేబట్టుకు వస్తుంది. యించువల్లనే అన్ని పండుగలలో ఉగాది మొదటిది మాత్రమే కాదు; అన్నిటికంటె గొప్పది కూడా!
తెలుగువారి పండుగలు
తెలుగునాట పండుగలు - పబ్బాలు, నోములు, వ్రతాలు, ఉత్సవాలు, ఊరేగింపులు, జాతరలు, కొలువులు తరతరాలుగా సమాజంలో నివివిధవర్గాలవ్యక్తుల్ని ఒక్కచోట చేరుస్తున్నాయి. ఎక్కువమంది పాల్గొనకపోతే పండుగలకు కాని, ఉత్సవాలకు కాని, ఇలాంటి మరే సాంఘికాచారాలకు కాని 'కళాకాంతులూ రావు. యిటువంటి ఉత్సవ సంప్రదాయాలను గురించిన ఉల్లేఖనాలు తెలుగు కావ్యాలలో పెక్కుచోట్ల కనిపిస్తూ, వీటి చరిత్ర సుదీర్ఘమైనదని నిరూపిస్తున్నాయి. 'శివరాత్రి మాహాత్మ్యం'లో వివిధ ౠతువులలో వచ్చే పండుగవర్ణనలు - నాగులచవితి, రధసప్తమి, మకరసంక్రాంతులు, 'సిహాసనత్వాత్రింశికాలో దివ్వెల పండుగ, 'పండితారాధ్యచరిత్రాలో పాల్కురికి సోమనాధుడు - దవన(ఏరువాక), నూలి (శ్రావణ) పూఋర్ణిమ పండుగలను, కాకతీయుల కాలంలో శ్రీకాకుళం తిరునాళ్ళ ప్రస్తిద్ధతను 'క్రీడాభిరామం'లో శ్రీనాధుడి ప్రస్తావన, తేలంగాణాలో నేటికీ దివిలి, పున్నమకు, అమావాస్యకు చేసే పూజలు,పండుగలు అనేకం సదాచార, సంప్రదాయాల్ని విశదపరుస్తున్నాయి. సంప్రదాయాలు లేకుండా ప్రయోగాలు, ప్రయోజనాలు లేవు. ఆదిలో లేనిది అంత్యంలో లేదు. తరతరాలుగా జనసమూహంలో నిలిచి ఉన్న నమ్మకాలు, సంప్రదాయాలు క్రియారూపాన్ని దాల్చగా పండుగలేర్పడ్డాయి. మొదట ప్రకౄత్యారాధనగా ప్రారంభమై, వ్యవసాయ సంస్కౄతికాలంలో స్పష్టరూపాన్ని పొంది, తర్వాతకాలంలో యింకా క్లిష్టస్వరూపం సంపాందించి, చివర ప్రాచీన ఆచారాల సూచ్యగుణాన్ని మాత్రంకలిగి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేవిగా పండుగలు రూపొందాయి. 'సాంఘిక సంక్షేమంకోసం విశేష సందర్భాలలో జానపద విశేషాలు, సంప్రదాయాల కలబోతగా ఆచరించే సంక్లిష్టమైన ఆంశమే పండుగ". పండుగలు ఏ విధంగా అవతరించాయి. ఎప్పుడు ఉద్భవించాయి, ఎందుకు, తిధుల ప్రవేశాల్లోనా లేక నిష్క్రమణాల వేళల్లో జరుపుకోవాలి అనే సిద్ధాంతుల తర్కాలకు కూడా అంతుచిక్కని రాజకీయపు అనూహ్యస్థితి-దుస్థితిగతులా అనే ప్రశ్నలకు సమాధానాలను రాబట్టడం చాలా కష్టం. ప్రకౄతికి సంబంధించిన పండుగలు, వ్యవసాయానికి సంబంధించిన పండుగలు చాలా ప్రాచీనమైనవని చెప్పవచ్చుగాని, ఖచ్చితంగా ఏ దశలో అవి వెలువడ్డాయని చెప్పడమూ కష్టమే. చాలా వరకు పండుగలకు మూలం ప్రాచీన కాలపు కర్మకాండలనడంలో సందేహంలేదు. మతం, జనానందం, యుద్ధాలు, సాహసకార్యాలు, అమరవీరులు, ఆత్మబలులు, సంస్మరణలు, జయంతులు, నీతిబోధనలు, ధార్మికుల కోసం కూడా కొన్ని పండుగలు ఉద్భవించాయి.
తెలుగువారి పండుగలను ఒక్కొక్కొసారి ప్రత్యేకంగా వివరించడం కష్టం. ఉత్సవాలు, ఊరేగింపులు, జాతరలు కూడ ఒక విధంగా పండుగలే, నోములు, వ్రతాలు, పండుగలు కావని ఎవరనగలరు? అయినా మనంవాడుకునే పదాలను బట్టి వీటిలోనే కొన్నింటిని పండుగలని, కొన్నింటిని ప్రతాలని, కొన్నింటిని ఉత్సవాలని పిలవడం జరుగుతున్నది. తెలుగువారు పండుగలను ఆచరించేటప్పుడు ఏమేమి చేస్తారు అన్నది కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. పండుగలకు మనం చెప్పుకునే ఆచారాలు జానపదులకు, జ్ణానపధులకు, సంబంధించినవే కాని శిష్టులకు సంబంధించినవి కావు. ఎందుకంటే శిష్టుల పాలిటికి చాలా వరకు పండుగలు విలువను కోల్పోతున్నాయి. చివరికి మిగిలింది వేలయితే కొత్తగుడ్డలు కట్టుకోవడం, సుష్టుగా భోజనంచేయడం మాత్రమే. కాని జనపదులకు పండుగ వచ్చిందంటే ఎక్కడలేని సంభ్రమమూ వస్తుంది.
చాంద్రమానం
చాంద్రమానం - ఆంధ్రుల పండుగలు చాలావరకు చాంద్రమానాన్ని అనుసరించేవి. కాలాన్ని గణించడానికి మనదేశంలో ఉండిన తొమ్మిదివిధాలలో ముఖ్యమైనవి - చాంద్రమానం, సౌరమానం. ఈ విషయంలో తెలుగువారు, కన్నడిగులు చాంద్రమానాన్ని, తమిళులు సౌరమానాన్ని అనుసరిస్తున్నారు. చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారికి మొదటిపండగ ఉగాది. యుగాదిని కూడా ఉగాదిగా చేసుకొని, అచ్చమైన తెలుగుపండుగలాగే ఆచరించే సంప్రదాయం మనది. యుగాది ఎందరికైనా ఉండవచ్చు. కాని తెలుగువారి ఉగాదికే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
ఉగాది
చైత్ర శుద్ధ పాడ్యమినాటి ఉగాదితో చాంద్రమానాన్ని అనుసరించే, తెలుగువారి క్రొత్తసంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటే సంవత్సరం ప్రారంభం అని అర్ధం. అందుకే దీన్ని 'సంవత్సరాదీ అంటారు. యుగాది అనికూడా వ్యవహరిస్తారు. ఈరోజే, విక్రమార్కుడు పట్టాభిషిక్తుడయ్యాడట. అందుచేత ఈనాటినుంచీ, విక్రమార్కశకం/యుగం ప్రారంభమయినట్లు కూడా పేర్కొంటారు. అయితే ఎప్పుడూ ఇలాగే జరుగుతుండినదని అర్ధంకాదు. రామాయణంలో 'పన్నెండో మాసమైన చైత్రంలో నవమి దినంనాడు శ్రీరాముడు జన్మించాడని చెప్పబడింది. అందువల్ల ఆ కాలంలో వైశాఖమాసం నుంచి క్రొత్తసంవత్సరం ప్రారంభమవుతుండేదని తెలుస్తున్నది. క్రీ.శ. 5వ శతాబ్దిలో వరాహమిహిరుడు చైత్రమాసంనుంచి క్రొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సంప్రదాయాన్ని ప్రారంభించాడంటారు. ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్రలలో ఈ దినమే ఉగాదిని పాటిస్తున్నారు.
ఉగాది జీవనంలోని సుఖదు:ఖాలను ప్రతిబింబించే ఉత్తమ పర్వదినం. కన్నడిగులు సుఖదు:ఖాలకు ప్రతీకగా వేపపూలను బెల్లాన్ని కలిపితింటారు. తెలుగువారి ఉగాది పచ్చడి సుఖదు:ఖాలను మాత్రమే కాక జీవితంలోని వగరును, రౌద్రాన్ని, పులుపును కూడా ప్రతిబింబింస్తుంది. పండుగలు సాంకేతికమైనవని చెప్పడానికి తెలుగు వారి ఉగాది పచ్చడి ఒక్కటే చాలు. వేపపూలు, కొత్తబెల్లం, ఉప్పు,కొత్తచింతపండు, పచ్చిమిరపకాయలు, మామిడిపిందెలు - కలిపిన ఉగాది పచ్చడి షడ్రుచులతో వింత అనుభవాన్ని కలిగిస్తుంది. పంచాంగశ్రవణం కూడా ఉగాది పండుగలో ఒక భాగమై పోయింది. పల్లెటూళ్ళలో ఇది కేవలం ఒక ఆచారంగా కాక, రాబోయే శుభాశుభాలను తెలుసుకోవాలనే ఉత్సుకతను రేకెత్తించే సందర్భంగా ఉపయోగిస్తుంది. సంవత్సరం పొడవునా మానవకోటి జీవనసమరంలోని మంచిచెడ్డలు, పాడిపంటలు, వర్షాలతీరు, గ్రహాలస్థితిగతులతో పంచాంగశ్రవణాన్ని పఠించి సందేశాన్ని అందించడం కూడ విశేషం.
నరము నరమున నవనవాభ్యుదయము
ప్రముఖకవి దాశరధి - తనకావ్యం, 'కవితాపుష్పకం' లో ఉగాది ప్రాముఖ్యతను ఆశాపూరితమైన భావనానుభూతిని వర్ణిస్తూ, "పాతబడిన ధరణి నూతతత్వము నందవచ్చె నీ నవీన వత్సరమ్ము! ఇంత ముసలి జగతి ఈనాడు యౌవనవంత మగుట యెంతో వింతకాదె?" అంటూ, 'నా కుగాదినాడు నరము నరమున నవనవాభ్యుదయము నాట్యమాడు, ఈ అశాంతధోరణికి ఎన్నడో ఒకనాడు శాంతినందుననుట భ్రాంతిగాదు" అన్నది తద్ధర్మకాలసంబంధితనానుడి అని చెప్పక తప్పదు.
ఆశాభావం ఎక్కడుంటుందో, అక్కడే నిరాశానుభూతికూడ ప్రభవిస్తుంది. నాణానికి రెండు పార్శ్వాలు - ఆశ, నిరాశ. నిరాశలోంచే ఆశావాదం ఆవరిస్తుంది. 'నాకుగాదులు లేవు, నాకుషస్సులులేవు. నేను హేమంత కౄష్ణానంత శఋర్వరిని, నాకు కాలమ్మొక్కటే కారురూపు, నాశోకమ్ము వలెనే, నా బ్రతుకు వలె, నావలెనె" అన్నారు ప్రముఖభావసహజ కవి 'దేవులపల్లి కౄష్ణశాస్త్రీ తన కౄష్ణపక్షం కావ్యంలో.
శ్రీ యుగాది వేంచేసెను శ్రీకరముగ రమ్ము రారమ్ము వేగ, పిండివంటల భుజియించి ప్రీతితోడ మంగళమ్ముల మాకు నొసంగు దేవ".
అంతటి నిరాశావాదమే, అదే కలం 'స్వస్తి జగత్తునకగు, శ్రీరస్తు సదాశాంతిరాస్తటంచు వెలయు, విశ్వస్తుత భారతావాణి సుమస్తబకమువోలె లోకమస్తకము పయిన్" అన్నారు.
విరోధి నుంచి వికౄతి
ప్రభవాది సంవత్సరాల్లో ఒక సంవత్సరం '' విరోధీ అని భయపడుతూంటే, నేను తక్కువేమిటి అన్నట్లు 'వికౄతీ ప్రవేశిస్తున్న శుభ తరుణం యిది. వికౄతికి వినయ వివేక భరితంగా వివాదరహితంగా స్వాగతం పలుకుదాం!
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
Saturday, March 13, 2010
'ఏక సంథాగ్రాహి', సంగీత కళా రత్న, మహాకవి రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు (1893 - 1979)
'ఏక సంథాగ్రాహి', సంగీత కళా రత్న, మహాకవి
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు (1893 - 1979)
కట్టమంచి - రాళ్ళపల్లి మైత్రీబంథానికి శత వసంతాలు

కట్టమంచి రామలింగారెడ్డి గారు మరియు రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగాల స్నేహబంధం అపారమైనదిగా భావించబడింది. మైసూరు మహారాజా కళాశాలలో తెలుగు పండితులుగా చేర్పించినది కట్టమంచి వారే. శర్మ - రెడ్డి గార్ల మైత్రీబంధం గురించి ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యం గ్రంథంలో 'మైలురాళ్ళూ - దారిదీపాలు' అన్న అధ్యాయంలో యిలా వివరించారు. 1910 లో మైసూరు మొదట వచ్చినప్పుడు రామలింగారెడ్డిగారికి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి పరిచయమైంది. అప్పుడు శర్మగారు 1906 నుంచి చామరాజేంద్ర సంస్కృత మహాపాఠశాలలో విద్యార్థి పరకాల యతీంద్రులు కోరిన పుస్తకాలు చదివి రామలింగారెడ్డిగారి ఇంగ్లీషు సాహిత్య మర్యాదలు శర్మగారికి నేర్పితే; శర్మగారు రెడ్డిగారికి సంస్కృత సాహిత్యశాస్త్ర విషయాలు బోధించేవారు. ఇద్దరికీ మైత్రి కుదిరింది. ఇది ఉత్తరోత్తరా ఉభయత్రా ఫలించింది. రెడ్డిగారి స్నేహం వల్ల శర్మగారు నూతన దృక్పథాన్ని అలవర్చుకొన్నారన్నందుకు - 'నా గురువులు' అనే వ్యాసంల, "ప్రాకులాడుతున్న నాకు వారితోడి సహవాసము ఆధునిక ప్రపంచపు తలుపులు తెరచి ఆహ్వానించివది' అని ప్రస్తావించుకొన్న తీరే స్పష్టపరుస్తోంది.రెడ్డిగారి సాహచర్యంలో శర్మగారు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నట్లు తెలుస్తోంది. వావిళ్ళవారు ప్రచురించిన 'వేమన పద్యాలు' గ్రంథానికి శర్మగారిచే రాయించిన పీఠికకు కూడ కట్టమంచివారి చొరవే అని తెలుస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వేమనగారిపై ఉపన్యాసాలను ఏర్పాటు చేయించి, రాళ్ళపల్లి వారితో యిప్పించిన ఘనతకూడ కట్టమంచి వారిదే. ఆంధ్రసాహిత్యంలో స్వతంత్ర ప్రతిభకల ఇద్దరు కవులు వీరిద్దరూ మౌళికమైన విశ్లే షణల ద్వారా తెలుగు విమర్శ సరిహద్దును విస్త్రతం చేసిన ఘనత ఈ కవిమిత్రద్వయానిదే అని చెప్పాలి. కట్టమంచి వారితో పరిచయం కలిగి, వారి ఆహ్వానం మీద 1912లో మొట్టమొదటిసారిగా ఏర్పరచిన తెలుగు పండివ పదవిని అలంకరించారు.
అమోఘం, శాస్త్రీయం, ఖనిజం - అల్ బెర్ట్ ఐన్ స్టీన్

(1879 - 1955)
ఐన్ స్టీన్ ని అంచనా వేయగలవాడు
ఐన్ స్టీన్ కు స్ఫూర్తినిచ్చిన భగవద్గీత
ఐన్ స్టీన్ కు పసివాడి సూచన
మహానుభావుల మహానుభావుకత కు నిదర్శనం, తార్కాణం, ఐన్ స్టీన్ శాస్త్రవేత్త జీవనప్రస్థానం.
(1879 - 1955)
ప్రముఖ శాస్త్రవేత్త, అల్బెర్ట్ ఐన్ స్టీన్, 20 వ శతాబ్దాపు తలమానికమైన శాస్త్రవేత్త. ప్రముఖమైన సాపేక్ష సిద్ధాంతాన్ని నిర్వచించి, ప్రవచించాడు. ఈ అన్వేషణ ఐరోపాలో తనకు సుస్థిరమైన స్థానంతోపాటు గౌరవాన్ని, మన్ననల్ని అందచేశాయి. సాపేక్ష సిద్ధాంతం ను సంక్షిప్తంగా చెప్పాలంటే - ఒక వస్తువు కదలుతున్నప్పుడు, కాంతివేగం, వస్తువును కలవడం, వస్తువును విడిపోవడంలో, సమానంగా వుంటుందీ అని తీర్మానించాడు. అంతరిక్షం, సమయం, ఆకర్షణలాంటి విషయాలపై చేసిన పరిశోధనలు, కొత్తదారికి మళ్ళించాయి.
ఐన్ స్టీన్ 14 మార్చి 1879 జర్మనీలోని అల్మాకు చెందిన జ్యూష్ కుటుంబంలో జన్మించాడు. కాని, సహజంగా స్విడ్జర్లాండ్ పౌరసత్వం లభించడం (1894), అక్కడే చదువును పూర్తిచేసుకుని, జురిచ్ పోలిటెక్నిక్ అకాడమీలో నాలుగేళ్ళు పై చదువు కొనసాగాడు. 1900 లో పట్టభద్రుడవడం, హక్కుచట్టాల పర్యవేక్షకుడుగాను, జురిచ్ విశ్వవిద్యాలయం నుంచి తన పరిశోధనా పట్టాని పొందాడు. స్విడ్జిర్లాండ్ లోని జురిచ్ పోలిటెక్నిక్ లో ప్రొఫెసర్ గా(1912) నియమితుడయ్యాడు. బెర్లిన్ లోని ప్రష్యన్ శాస్త్ర అకాడమీ కి ప్రొఫెసర్ గా అహ్వానించబడ్డాడు. పరమ నియంత హిట్లర్, జ్యూష్ లపై పరమ కసి వున్న హిట్లర్ జర్మనీ లో అధికార నిమిత్తం 1933 లో రావడం, ఐన్ స్టీన్ జర్మనీ ని నిష్క్రమించడం ఒకేసారి జరిగాయి. అమెరికాలో స్థిరపడ్డాడు. రెండవ ప్రపంచయుద్ధంలో అమెరికా నావికాదళంలో తన సేవలను అందించాడు.
అంతర్జాతీయంగా ప్రఖ్యాతమవ్వడం 1919 లో, తన శాస్త్రీయ పరిశోధనలకు అద్భుతమైన గుర్తింపు, రాణింపుని రాయల్ సొసైటీ, లండన్ వారివ్వడంతో. తర్వాత, ఐరోపా యాత్రను చేస్తూ, తన పరిశోధనలను విశదపరచాడు. 1921 లో ఐన్ స్టీన్ 'భౌతికశాస్త్రం' లో విశ్వవిఖ్యాత 'నోబెళ్ పురస్కారం వచ్చింది. తిరిగి, ప్రపంచం మొత్తం ప్రయాణం చేసి, తన పరిశోధనలను మరింత వివరంగా తెలిపాడు. యిదే సమయంలో, ప్రపంచ శాంతి కోసం కౄషి సలిపాడు.
అమెరికా లోని, ప్ర్న్సిటన్ లో 18 ఏప్రిల్ 1955 న, 76 ఏళ్ళ ప్రాయంలో, ఐన్ స్టీన్ తన అంతిమశ్వాసని విదిలాడు. యావత్తు ప్రపంచానికే ఎదురులేని, తిరుగులేని శాస్త్రజ్ౙుడుగా శాశ్వతంగా విశ్వ మానవాళి హౄదయాల్లో, మస్తిష్కాల్లో నిలచిపోయాడు.
ఐన్ స్టీన్ ని అంచనా వేయగలవాడు
ఒకసారి ఐన్ స్టీన్ ప్రాణమిత్రుడి పెళ్ళికి వెళ్ళాడు. దంపతులు ఆనందంగా వున్నందుకు సంతోషించాడు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు పద్దినిమిది నెలల వయసున్న పిల్లవాడితో మళ్ళీ ఐన్ స్టీన్ ని కలిశారు. తల పిచ్చుకగూడులా, కళ్ళు లోతుగా, ముఖం అంతా ముడతలతో వున్న ఐన్ స్టీన్ ని చూడగానే ఆ పసివాడు 'బూచీని చూసినట్లు భయపడి కెవ్వుమని కేకవేసి, గుక్కపట్టి ఏడవసాగాడు. ఐన్ స్టీన్ ని చూసి పసిపిల్లవాడు అలా భయపడి ఏడవడం తల్లిదండ్రులకు అవమానం అనినిపించింది. అయితే, ఐన్ స్టీన్ ముఖం ఆ పిల్లవాడి ప్రవర్తనకు విప్పారింది. కళ్ళు కాంతివంతమై అతను ఆ పిల్లవాడి తల నిమురుతూ, 'ఇంతవరకూ నా జీవితంలో నన్ను గురించి నువ్వు అనుకుంటున్నదేమిటో నిర్భయంగా చెప్పింది నువ్వు ఒక్కడివే బాబూ' అన్నాడు. వెంటనే, 'చిన్నపిల్లవాడు - వాడికేం తెలుసు మీ ఔన్నత్యం' అని ఆ పిల్లవాడి తండ్రి అంటుంటే - ఐన్ స్టీన్, 'అందుకే మనిషిని మనిషిగా అంచనా వేయడం తెలిసినవాడు పసివాడే'. అందుకే తన అంచనా ఏమిటో నన్ను గురించి అంత నిర్భయంగా చెప్పాడూ, అని సెలవిచ్చాడు.
ఐన్ స్టీన్ కు స్ఫూర్తినిచ్చిన భగవద్గీత
ఐన్ స్టీన్ అనగానే మనకు 'సాపేక్ష సిద్ధాంతా కర్తగా, ప్రపంచ ప్రసిద్ధి శాస్త్రవేత్త గుర్తుకు వస్తాడు. అయితే, 1948 లో ఆయన చెప్పిన మాటలు నమ్మదగినవిగా లేకపోయినా, అవి నమ్మదగిన నిజాలే! 1948 లో డా. బి.యం.గుప్తా అనే ఒక యువ పరిశోధకుడు, అమెరికాలోని ప్రిన్సిటన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యడ్వాన్స్డ్ స్టడీస్ లో, ఇన్ స్టీన్ ని కలుసుకున్నాడు. ఐన్ స్టీన్ డా. గుప్తాని సంస్కౄతంలో ఆహ్వానించాడు. ఆయనతో సంస్కౄతంలో సంభాషించడం మొదలు పెట్టాడు. ఐన్ స్టీన్ ఎంతసేపు సంస్కౄతంలో ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పలేని గుప్తా - 'నాకు సంస్కౄతం బొత్తిగా రాదు! క్షమించండీ!' అన్నాడు. వెంటనే, ఐన్ స్టీన్ 'నువ్వు భారతదేశం నుంచి వస్తూ, భారతీయుడవయ్యుండీ - అన్ని భాషలకు తల్లిభాషైన సంస్కౄతమే చదువుకోలేదా? భారతదేశం తత్త్వశాస్త్రానికీ, వేదాంతానికీ పుట్టినిల్లు. అలాంటి శాస్త్రాధ్యాయనానికైనా నువ్వు సంస్కౄతం నేర్చుకుని వుండవలసినది. నా ఇంట్లోని, నా గ్రంధాలయంలో ఎన్ని సంస్కౄత ఉద్గ్రంధాలున్నాయో చూడు! నేను ప్రసిద్ధ శాస్త్రవేత్తనని 'నోబెళ్ బహుమతి వచ్చింది. అయితే నా వైజ్ౙానిక శాస్త్ర పరిశోధకులకు, సూత్రీకరణలకు స్ఫూర్తి మీ భగవద్గీత! అదే నాకు మార్గదర్శి! అంటూ తన శాస్త్ర సాంకేతిక మాలాన్ని చెప్పాడు.
ఐన్ స్టీన్ కు పసివాడి సూచన
ఐన్ స్టీన్ ఒకరోజు వ్యాహ్యాళికి వెళుతుంటే, ఒక చిన్న పిల్లవాడు అపరిశుభ్రమైన ముఖంతో కనిపించాడు. ఆ పిల్లవాడు చాలా పేదవాడై వుంటాడని అర్ధం చేసుకున్న ఐన్ స్టీన్ - 'నువ్వు వెంటనే ఆ నీళ్ళటాంకు దగ్గరికెళ్ళి ముఖం కడుక్కొని వస్తే, నీకు అయిదు సెంట్లిస్తాను, బహుమతిగా' అన్నాడు. ఆ పిల్లవాడు, ఐన్ స్టీన్ మాటలకు వింతగా అతని ముఖంవైపు చూశాడు. ఐన్ స్టీన్ అదేమాట మళ్ళీ చెప్పేప్పటికి పరుగున వెళ్ళి ముఖం నీళ్ళతో రుద్ది రుద్ది, శుభ్రంగా కడిగి తిరిగివచ్చాడు. 'ఇప్పుడు చూశావా, ఎలా వున్నావో' ఇక ఎప్పుడూ ఇలాగే వుండాలి. అపరిశుభ్రంగా వుండకూడదు! ఇదిగో నీకిస్తానన్న బహుమతీ అంటూ, అయిదు సెంట్లు చేతిలో పెట్టాడు, ఐన్ స్టీన్. కాసేపు ఆ డబ్బు వైపే చూస్తున్న ఆ పిల్లవాడితో, 'ఆ డబ్బుతో ఏం చేస్తావ్?' అన్నాడు, ఐన్ స్టీన్ కుతూహలంగా. ఆ పిల్లవాడు వెంటనే - 'మీరిచ్చిన డబ్బు తిరిగి మీకే ఇద్దామనుకుంటున్నాను. దీని అవసరం ఇప్పుడు నాకంటే మీకే వుందీ అన్నాడు. ఐన్ స్టీన్ ఆశ్చర్యపోతూ, 'నాకు ఆ డబ్బు అవసరం వుందా? ఆ డబ్బు నాకే ఇస్తావా?' అన్నాడు. 'ఔను! మీ తలమీద జుట్టు చూడండి! పొదరిల్లు మోస్తున్నట్లు ఎంత ఘోరంగా వుందో!' మీరు ఈ డబ్బుతో వెంటనే క్రాఫు చేయించుకోవడం అత్యవసరం', అంటూ ఆ డబ్బు ఐన్ స్టీన్ చేతిలో పెట్టాడా బాలుడు.
మహానుభావుల మహానుభావుకత కు నిదర్శనం, తార్కాణం, ఐన్ స్టీన్ శాస్త్రవేత్త జీవనప్రస్థానం.
నిత్య నవ్యాంధ్ర భావసాహితీమూర్తి - రాయప్రోలు సుబ్బారావు
నిత్య నవ్యాంధ్ర భావసాహితీమూర్తి 'రాయప్రోలూ - 13 మార్చి 1892 జయంతి.
నవ్యాంధ్ర సాహితీమూర్తి జననం
తెలుగుసేమలోని విద్యావంతులు బెంగాలులో వన్నెలుపోతున్న భావచైతన్యం వల్ల ప్రభావితమవుతున్న కాలంలో, తమ మాతౄభాషలో తోటివారికోసం సంకల్పించిన పధం నిర్మిస్తున్న కాలమది. సాహితీభాషామూర్తులు అనుకున్నది సాథించడానికి దారులు తమరే పరచుకుంటున్న పవిత్ర సాహితీపథాలవి. యిరవయ్యవ శతాబ్దపు చివరి దశకకాలం. 1891-92 సంవత్సరం. భావిభారత నవ్యాంధ్ర సాహితీముర్తిత్వానికి సంకేతంగా గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో ఒక మాతౄమూర్తి పురుడుపోసుకుని పుత్రున్ని కన్నది. అది రాయప్రోలు వారి వంశం. పసివాడి పేరు వేంకటసుబ్బారావు. వారి కవిత్వాన్ని, ప్రక్రియని ఒక రకమైన 'సాహితీయుగం - యుగకర్తాగా చెలామణి కావడాన్ని బట్టి రాయప్రోలు వారికి సరిసములను కష్టపడి పట్టుకోవాలి.
అది 1916 సంక్రాంతిపండుగ. బెజవాడ రామమోహనగ్రంధాలయపు ఆవరణలో జరుగుతున్న మహోత్సవ సభ. నిండుసభలో ఆంధ్రాభిమానపూరితమైన పద్యలహరిని శ్రావ్యభరితంగా గానంచేసిన వ్యక్తి రాయప్రోలు సుబ్బారావు అని, 'నా జీవితకధాలో అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ఆ పద్యాల్లో, తెనుగువాణి వర్ధిల్లింది. తెనుగుకత్తి మెరసింది. తెనుగురేఖ అలరింది. తెనుగుభూమి యావత్తు వసుంధరనే సస్యశ్యామలభరితంకావించింది. 'చావలేదు, చావలేదు, ఆంధ్రుల మహోజ్జ్వల చరిత్ర" హౄదయములు చీల్చి చదువుడో సదయులారా అని సాహితీసందేశాన్నిచ్చాడు.
సాహితీయుగానికే అధినేత
సుబ్బారావుగారు మెట్రిక్ దాకా చదివి, ముందుకు కొనసాగించలేని పరిస్థితుల్లో రాజమండ్రి చిలుకూరు వీరభద్రరావు సంపాదకత్వంలోని 'ఆంధ్రకేసరీ పత్రికలో రచనలుచేయడం, అజ్ఞాతసంపాదకుడి విధులు, మేనమామతో ఆశుకవితాజంటవిన్యాసాలు స్వత:రసదౄష్టి పెరిగినా, ఆశుకవితలమీద వెగటుతనం ఆవహించి, వాటిపై సన్యాసందాకా పోయింది. న్యాయవాది గంటిలక్ష్మన్నపంతులు ప్రోద్బలంతో ఆంగ్లకవి 'గోల్డ్ స్మిత్ - హెర్మిట్' కౄతిని 'లలితా(1909)గా, టెన్నిసన్క్ రచన - 'డోరా'ను 'అనుమతీ(1910) లఘుకావ్యంగాను, 'తౄణకంకణం' (1912) నూతనరచనలను సౄష్టించాలని సంకల్పంతోనే ఆశుకవిత్వానికి వీడుకోలు పలకవలసి వచ్చింది. మదరాసు చేరుకుని, కొమర్రాజు వారి దగ్గర 'విజ్ణానచంద్రికాగ్రంధమండలీ, 'ఆంధ్రవిజ్ణానసర్వస్వం' లో లేఖకునిగా ఉద్యోగం చేశారు. విశిష్టకవిత్వానికి అనాదరణ ఆనాటి నుంచే మొదలైంది. ఆధునిక కవిత్వరచనలు చేస్తున్నా కూడ, రాయప్రోలు వారి 'కొత్తపోకడలు" లోకం గుర్తింపుకు నోచుకోలేదు. వీరి కావ్యాలు మొదటదశలో ఎవరి దౄష్టిని ఆకర్షించలేదు. కవితలు, కావ్యాలు వ్రాస్తున్నా, ఆనాడు అధికంగా వ్యాప్తి వున్న వరకట్నం దురాచారాన్ని భరించలేకపోయారు. ప్రత్యక్ష ఘటన, బ్రాహ్మణయువతి 'స్నేహలత" స్వయంకౄతంగా అగ్నిజ్వాలకు ఆహుతికావడం అనేక కవులకు ప్రేరణ కలిగించింది. ఈ యితివౄత్తంతో నవీనశైలితో పద్యకావ్యం రాయప్రోలుకు కలిగిన నూతనదౄష్టితో వంగదేశం వలసపోయారు. విశ్వకవి రవీంద్రుని అంతేవాసితనం, సాహిత్యసౌందర్యాలను స్వంతంచేసుకుని, స్వదేశం వచ్చారు. కాల్పనికకవిత్వం, జాతీయోద్యమం, ఆంధ్రోద్యమంతో ప్రభావంచెంది, 'ఆంధ్రావళీ అవతరణకు దారితీసింది. ఈ ప్రభావం, రామమోహన గ్రంధాలయంలో (1916) 'హౄదయములను చేల్చి చదవమనీ సదయులందరికి సందేశాన్నిచ్చారు.
దేశభక్త్యాభిమానాలు పుష్కలం
భారతదేశాభిమానం, ఆంధ్రాభిమానం, రాయప్రోలువారి రచనల్లో ప్రస్తావించిన తీరు విశ్లేసిస్తే, ఆంగ్రకవులైన "వాల్టర్ స్కాట్క్, టెన్నిసన్క్, వర్డ్క్సవర్త్క్, రచనల్లోని భావలహరికి సహేతుకంగా సోదాహరణంగా ప్రస్తుతీకరించారు. ఆంధ్రాభిమానాన్ని రసవన్మార్గంలో ప్రవేశపెట్టారు రాయప్రోలువారు. ఆంధ్రరాష్ట్రోద్యమంలో ఒక్కుమ్మడిగా చెలరేగిన రాష్ట్రాభిమానం కవిత్వములో కూడ అనేక సందర్భములలో, అభిమానం, దురభిమానంగా పరిణమించింది. ఈ దురభిమానాన్ని, సి.నారాయణరెడ్డిగారు 'అబిమానాఅతిరేకం' అన్నారు. యీ పరిస్థితి రాయప్రోలువారిని కూడ కొంతమేరకు ఆవరించిందని పలువురి భావనగా ప్రకటించారు.
నవ్యాంధ్ర సాహిత్యంలో అమలిన శౄంగార భావనను వ్రవేశపెట్టి భావకవిత్వానికి నాంది పలికినవారు సుబ్బారావుగారు. ఉస్మానియా, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో 1921 నుంచీ తెలుగుశాఖలో లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్ గా వౄత్తి నిర్వహించి, కొంతకాలం వరంగల్క్ కాలేజి, ప్రిన్సిపాల్క్ గా కొనసాగారు. "లలిత, తౄణకంకణం, కష్టకమల, తెనుగుతోట, మధుకలశం, రమ్యాలోకం, స్వప్నకుమారం, జడకుచ్చులు, రూపనవనీతనాటకం" మొదలైన రచనలు , కాళిదాసు మేఘదూతాన్ని, రవీంద్రుని కవితలను, భవభూతి ఉత్తరరామచరితాన్ని, ఉమర్ ఖయ్యాం రుబాయీలను, రసస్ఫోరకంగా అనుసౄజనంగావించారు. కామగంధం లేని శౄంగారాన్ని ప్రతిపాదించారు.
సమగ్ర కవితాదార్శకుడు
ఆధునిక కవిత్వానికి ముఖ్యంగా భావకవిత్వానికి ఆంగ్లసాహిత్య పరిచయం వల్లనే ప్రోద్బలం వచ్చిందని నిస్సందేహంగా ఆనాటి కవులు భావించారని, భావకవిత్వం రావడానికి కారకుల్లో రాయప్రోలువారు, వారి 'తౄణకంకణం' అని ఆరుద్ర వివరించడం.భావకవుల్లో ప్రముఖులైన వారంతా 1891-1900 మధ్య జన్మించిన వారు, 1919 నాటికి భావకవిత్వం అందరి నోళ్ళలో పడిందని, ఈ బౄందంలోని ప్రధమశ్రేణి కవుల్లో రాయప్రోలు వారు ప్రధముల్లో ప్రధములు అనికూడ ఆరుద్ర అభిప్రాయపడ్డారు. ఈ బ్రందం మీదనే, సనాతనుల తిట్లూ, సమకాలిక సహౄదయుల దీవనలూ వర్షించబడ్డాయి. వీరందరి సమగ్రకవితాదర్శనం వల్లనే భావకవిత స్వరూప ప్రభావాలు అంచనా వేయబడడం సాధ్యమైనాయి అని పలువురి భావన. ఈ అష్టాదశకవిబౄందానికి భావకవిత్వానికి ప్రాతినిథ్యం వహించి 'ముద్దుకౄష్ణా 'వైతాళికులూ ఖంఢకావ్యసంపుటం ప్రచురించాడు. యిందులో గురజాడ (1865) ప్రాచీన సరణికి భరతవాక్యం పాడితే, శ్రీశ్రీ (1910) నవీన సరణికి నాందిగీతం పాడి, అభ్యుదయ, విప్లవ మార్గాలకు వరుసగా ప్రాతినిథ్యం వహించారు.
అమలిన ప్రేమ కు నిర్వచనకారుడు
'తౄణకంకణం' అమలినప్రేమాంశం ప్రముఖం. రాయప్రోలు వారి ప్రయోగాలు అనుభవభరితాలు. మచ్చుకు కొన్ని :
'గుణలతలు పూచిన శోభలూ, 'చిరునవ్వులు వెన్నెలచెండ్ల విసరా, 'చూపులు వలపుటుచ్చులూ, 'ప్రేమ భావనల్ నూత్న కళలూ, 'నదలు ప్రాయంపు మన్ననలూ, 'కనుల నఋఅవాల్చి పాతితాక్షములతోడ గాంచియును కాంచలేని క్రీగంటకొసలూ, 'చెలిమినాటిన చిత్తమె యార్ద్రమూ.'పడుచుదనముతో చిగురించు వలపులూ. అన్ని అనుభైకవేద్యంబులే. ఈ కావ్యంనిండా దాంపత్యభక్తి, వాత్సల్యరక్తి, సఖ్యసక్తి, ముక్తి సోదాహరణంగా రసానుభూతిని కలిగిస్తూ, అందించారు.
కాపుకన్నె సొగసుల నిర్మాత
రాయప్రోలు శౄంగారభరిత రసనను వర్ణించిన తీరు ఏ ప్రభంధకవిపరమేశ్వరుడిని తీసిపోరని నిక్కచ్చిగా చెప్పవచ్చు.
కాపుకన్నె 'శరదుదయ ప్రసారముల చక్కలిగింతలూ, 'నడకల కుల్కు కల్కి చరణంబుల కింపులూ, 'చేకొడవలి త్రిప్పికొంచు తళుకుల్ వదజల్లెడు కన్నులూ, 'కాపులేబడకుత యొంటిగా వయసు వాలకముల్ మురిపింప పండులణ్, 'కన్నె చెక్కిళ్ళ జిగీ, 'పైట మడతల నందములాటలూ, 'పెదవి పగడాల చిరునవ్వు పాలు తడపా, 'తానెరుంగని సొగసామెపైని విరియూ.
ఆంధ్రభూమి - జన్మభూమి - రాయప్రోలు రాజసభూమి
అమలిన శౄంగార భరిత భావకవితాధార నుంచి దేశభక్తిభావరత్నవేచికాలహరివరకు రాయప్రోలు కవితాయానం విరాజిల్లందన్నది నిర్వివాదం, నిస్సందేహం. తల్లిభూమిభారతికి నిల్పిన జాతినిండుగౌరవం, పూర్వపుణ్యం, యోగబలం కలిగించిన స్వర్గఖంఢజన్మ, అనంతభూతలి మనభూమి, చల్లనితల్లి. తమతపస్సులు ౠషులు, సౌర్యహారము రాజచంద్రులు, భావసూత్రములల్లు కవిపుంగవులు, రాగదుగ్ధములుపిదికే భక్తరత్నములు, దిక్కులకెగతన్నే తేజములు, రాళ్ళతేనియలూరేట్లుసాగేరాగాలు, జగములనూగించే మగతనం, సౌందర్యమెగబోయుసాహిత్యాదులతో వెలుగుతున్న దివ్యవిశ్వం, దేపించే పుణ్యదేశపు పొలాల్లొ మొలిచే రత్నాలు, వార్ధిలో పండే ముత్యాలు, ప్రిధివిలో పిదికే దివ్యౌషధాలు, కానల కాచే కస్తూరి, అవమాన, అనుమానాలు లేని భారతీయులు.
ఫలశ్రుతి
'ఏ దేశమేగినా, ఎందు కాలిడిన, ఏపీఠమెక్కినా, ఎవ్వ రేమనిన
పొగడరా! నీతల్లిభూమి భారతిని, నిలుపరా! నీజాతి నిండుగౌరవము
ఏపూర్వపుణ్యమో, ఏయోగబలమొ, జనియించినాడ నీస్వర్గఖంఢమున
ఎమంచిపూవులన్ బ్రేమించినావో, నిను మోచె నీతల్లి కనకగర్భమున."
లేదురా ఇటువంటి భూదేవి యెందు, లేరురా మనవంటిపౌరు లిం కెందు
సూర్యుని వెలుగురుక్ష్ల్ సోకునందాక, ఓడలజెండాలు ఆడునందాక."
'యధాస్మై రోచతే విశ్వం తధేదం పరివర్తతే' అన్నట్లు, కవికి విశ్వమెట్లా ఇష్టమైతే అట్లా పరివర్తన పొందుతుందని సూక్తి.
భావం లేనిదే కవిత్వమే లేదు. కవిత్వమెక్కదుంటుందో భావమక్కడే వుంటుంది. ఆక్షేపకులు రెండు కళ్ళు మూసుకుని, భావకవిత్వంలోని భావాన్ని ఒకకంటితోనూ, కవిత్వాన్ని రెండో కంటితోనూ, చూడడం పరిపాటే. పూర్వసాహిత్యంలో రసధ్వని, భావధ్వని వుండడం సహజసత్యం. నిజానికి భావకవిత్వంలో అభినయార్ధతత్వం అంతర్లీనంగా వుంటుంది. హస్తం, దౄష్టి, మనస్సు, భావం, రసం కళకు సల్లక్షణాలు.
ఏ భాషలోనైనా కవిత చెప్పదలచుకొన్నారంటే మాటలతోనే చెప్పాలి. భావం కొత్తదైనప్పుడు భాషలోనున్నపదాలు భావం చెప్పడానికి చాలనప్పుడు ఉన్న మాటలతోనే కొత్త పదచిత్రాలు కట్టుకోవాలి. అయినా చెప్పలేకపోతున్నామనే బాధ కవికి కలుగుతుంది అని వివరిస్తూ, విశ్వనాధ - 'అస్మదీయ కంఠము నందాడు చుండెనొక ఎదోగీతి బయటకు నుబికి రాదు, చొచ్చుకొని లోనికిని పోదు ద్రచ్చిపోయె, నాహౄదయమమీ మహా ప్రయత్నమందు" అంటారు. వివిధ విఫలయత్నాలలోనే హౄదంతరంలో నవజపాశోణ సంధ్య తోచిందని, వాంచాసిద్ధి క్రమంగా సిద్ధిస్తుందని చెప్పాడు.
భావకవిత్వపు వ్యాసానికి ముగింపు, సహజభావకవి, దేవులపల్లి కౄష్ణశాస్త్రిగారిని స్మరించకుండ నిజమైన భరతవాక్యం పలుకలేము. యిటువంటి భావకవితాభరితపద్యాలని ఆధ్యయనం చేసేటప్పుడు, ఆయన మాటలు - "ఎదియొ అపూర్వ మధుర రక్తి స్ఫురియించుగాని అర్ధమ్ముగాని భావగీతమ్ములవి" అని సరిపెట్టుకోవాలి. భావానికి తగిన భాష ఒక్కరివల్ల తయారయ్యేది కాదు. పదిమంది పదేపదే వాడిన కొత్తమాటలమూటలవల్ల భావ వ్యక్తీకరణ సాధ్యమవుతుంది. భావకవి, కవిత్వం 'మీరు మనసారగా ఏడ్వనీరు నన్ను" అంటే, భావకవిత్వ ప్రభావంలోంచి వచ్చినా, దానికి ప్రతిగా సాగిన అభ్యుదయకవిత్వం సామూహికంగా 'ఏడవ కండేడవకండీ' అని చెప్పడం జరిగింది.
ఆద్యులైన భావకవి - రాయప్రోలు
భావకవుల్లో కూడా కొందరు ఆద్యులు, కొందరు ఆఢ్యులు. రాయప్రోలు సుబ్బారావు గారు నిస్సందేహంగా ఆద్యులే. భావకవిత్వం ప్రాచుర్యం పొందడానికి వ్యాసముద్రణలు కాదు. శ్రోతలముందు భావకవితాపఠనం ముఖ్యం.
"కవేర్భావ: కవిత్వం" - భావప్రధానం కవిత్వం భావ కవిత్వం. "కవిర్భా: కవిత్వం" - కవిత్వానికే కావ్యం. "నానౄషి: కురుతే కావ్యం" - ౠషి కానివాడు కావ్యం చేయడు". "కవయ: క్రాంత దర్శన:" అని లోకోక్తి. ౠషి ద్రష్ట. దర్శనశక్తి కలవాడు. ఏమిటి దర్శించగలడు? దేన్ని దర్షించిన తర్వాత ఏం చేస్తాడు" తనకు కావలసిన రీతిలో విశ్వాన్ని చూస్తాడు. భావిస్తాడు. భావనం చేస్తాడు. కవి కనుక కవనం చేస్తాడు. విశ్వాన్ని పరివర్తన చెందేటట్లు మాంత్రికశక్తిని వినియోగిస్తాడు. కవి కూడ మాంత్రికుడే. భావకవి భావాన్ని మంత్రీకరిస్తాడు. భావేంద్రజాలాన్ని, కవితేంద్రజాలాన్ని జోడిస్తాడు.
శబ్దమాధుర్యం, అర్ధ ప్రసన్నత, సంప్రదాయ పక్షపాతం, దేశభక్తి, ఆత్మసౌందర్యం, ఆధ్యాత్మిక ప్రేమ - సాహితీ షడ్రుచుల్ని సమన్వయం చేసుకుంటూ, రంగరించి, కలబోసి, అచ్చుబోసిన సాహితీమూర్తిత్వం ను వర్ణించాలంటే - ఎన్నో భావనలు, మాటలు అనవసరం - ముక్తాయింపుగా, రాయప్రోలు సుబ్బారావు - అంటే సరిపోతుంది.
రాయప్రోలు వారి స్మరణ, స్ఫురణ ఉన్నాళ్ళూ, చావలేదు, చావలేదు అంధ్రుల మహోజ్జ్వల చరిత్ర, ఆ సదయులారా, హౄదయములు చీల్చి చదువుకోండి బాబూ! అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. రాయప్రోలు వారి ఒక విశిష్టమైన, తెనుగువాణి, తెనుగు కత్తి, తెనుగు రేఖ.
ఆంధ్రాభిమానాన్ని సహేతుకమైన రీతిలో రసవన్మార్గంలో ప్రవేశపెట్టిన ఘనతను పొందిన నవ్యాంధ్ర సాహితీమూర్తి రాయప్రోలు సుబ్బారావు గారికి శతసహస్ర ప్రణామాలు, సాహితీనీరజనాలు.
తెలుగురధం - కొంపెల్ల శర్మ.

అన్నమయ్య రథ సంకీర్తన
మా తెలుగురథం బ్లాగుకు ఒక ప్రేరణ - అన్నమయ్య రథ సంకీర్తన
అన్నమయ్య రథ సంకీర్తన
సాళంగనాటజగన్మోహన రాగం
దేవదేవు డెక్కెనదె దివ్యరథము!
మావంటివారికెల్ల మనోరథము !!
జగతి బాలులకై జలధులు సేరజేసి!
గటున దోలెనదె పైడిరథము!!
మిగులగ గోపగించి మెరయురావణమీద!
తెగ యెక్కి తోలెనదె దేవేంద్రరథము!!
దిక్కులు సాధించి సేతాదేవితో నయోధ్యకు!
బక్కన మరలిదె బుష్పరథము!!
నిక్కి నరకాసురునిపై నింగిమోవ నెక్కి తోలె!
నెక్కసపు రెక్కలతో విష్ణురథము!!
బలిమి రుక్మిణి దెచ్చి పరులగెలిచి యెక్కె!
అలయేరుబెండ్లి కల్యాణరథము!!
యెలమి ష్రీవేంకటాద్రి నలమేలుమంగ గూడి!
కలకాలమును వేగె ఘనమైన రథము!!

Friday, February 19, 2010
తెలుగురథం కార్యక్రమం - సుప్రసిద్ధ విశ్వవిఖ్యాత ఇంద్రజాలికుడు, జాదు సామ్రాట్ పద్మశ్రీ ప్రతుల్ చంద్ర సర్కార్ (పి సి సర్కార్ - సీనియర్) జయంతి
తెలుగురథం - సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ అక్టొబర్ 24, 2008 న ప్రారంభమై తరచుగా తెలుగు సాహిత్యం, సంప్రదాయ, శాస్త్రీయ సంగీత వాగీయకారులపై, వివిధ రంగాల్లొ తెలుగు ప్రతిభామూర్తుల జీవన వ్యక్తిత్వంపై మాదైన శైలిలొ యధేచ్చగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. భాగ్య నగరములొ - ఆంధ్రుల రాజధాని నగరములొ పలువుల ప్రశంసలను కూడ అందుకో గలుగుతున్నాము. తెలుగురథం అని పేరు పెట్టుకున్నా, తెలుగు భాషా ప్రచార మాధ్యమం ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. తెలుగు వ్యవహార భాషా వికాసోద్యమనాకి నిండు నూరేళ్ళ పండుగని, లలిత సంగీత వికాసానికి నిండిన నూరేళ్ళ పండుగని యిటీవలే జరుపుకునాము. ఈ రెండు కార్యక్రమాలకి అద్భుతమైన స్పందన రావడం మా సంస్థకి గర్వకారణంగా భావిస్తున్నాము.
మా తర్వాత కార్యక్రమం - సుప్రసిద్ధ విశ్వవిఖ్యాత ఇంద్రజాలికుడు, జాదు సామ్రాట్ పద్మశ్రీ ప్రతుల్ చంద్ర సర్కార్ (పి సి సర్కార్ - సీనియర్) జయంతి ఉత్సవాన్ని 23 ఫిబ్రవరి, మంగళవారం హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాయ గాన సభ లో జరుపుకుంటున్నాము. చిన్నారి ఇంద్రజాలికులు కుమారి రమ్య, కుమరి షెర్లీ రంగ్రేజీ, మాష్టర్ ప్రభవ్ తమ ఇంద్రజాల ప్రతిభా విన్యాసాల్ని ప్రదర్శిస్తారు.
ఇంద్రజాల విద్యలో ప్రతిభావంతులు - మ్యాజిక్ చాప్లిన్ శ్రీ చొక్కాపు వెంకటరమణ గారు, ఇంద్రజాల బంధు బి యన్ యం కుమార్ గారు అతిథులుగా సభలో పాల్గొంటారు.
హాస్యబ్రహ్మ శంకరనారాయణ గారు ముఖ్యాతిథిగా విచ్చేస్తారు.
ఇంద్రజాలికుల్ని, ఇంద్రజాల కళాభిమానుల్ని సాదరంగా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము.
కొంపెల్ల శర్మ - +91 97017 31333 / +91 90007 31333
Subscribe to:
Posts (Atom)