Saturday, March 13, 2010

అమోఘం, శాస్త్రీయం, ఖనిజం - అల్ బెర్ట్ ఐన్ స్టీన్

అమోఘం, శాస్త్రీయం, ఖనిజం - అల్ బెర్ట్ ఐన్ స్టీన్




(1879 - 1955)

ప్రముఖ శాస్త్రవేత్త, అల్బెర్ట్ ఐన్ స్టీన్, 20 వ శతాబ్దాపు తలమానికమైన శాస్త్రవేత్త. ప్రముఖమైన సాపేక్ష సిద్ధాంతాన్ని నిర్వచించి, ప్రవచించాడు. ఈ అన్వేషణ ఐరోపాలో తనకు సుస్థిరమైన స్థానంతోపాటు గౌరవాన్ని, మన్ననల్ని అందచేశాయి. సాపేక్ష సిద్ధాంతం ను సంక్షిప్తంగా చెప్పాలంటే - ఒక వస్తువు కదలుతున్నప్పుడు, కాంతివేగం, వస్తువును కలవడం, వస్తువును విడిపోవడంలో, సమానంగా వుంటుందీ అని తీర్మానించాడు. అంతరిక్షం, సమయం, ఆకర్షణలాంటి విషయాలపై చేసిన పరిశోధనలు, కొత్తదారికి మళ్ళించాయి.



ఐన్ స్టీన్ 14 మార్చి 1879 జర్మనీలోని అల్మాకు చెందిన జ్యూష్ కుటుంబంలో జన్మించాడు. కాని, సహజంగా స్విడ్జర్లాండ్ పౌరసత్వం లభించడం (1894), అక్కడే చదువును పూర్తిచేసుకుని, జురిచ్ పోలిటెక్నిక్ అకాడమీలో నాలుగేళ్ళు పై చదువు కొనసాగాడు. 1900 లో పట్టభద్రుడవడం, హక్కుచట్టాల పర్యవేక్షకుడుగాను, జురిచ్ విశ్వవిద్యాలయం నుంచి తన పరిశోధనా పట్టాని పొందాడు. స్విడ్జిర్లాండ్ లోని జురిచ్ పోలిటెక్నిక్ లో ప్రొఫెసర్ గా(1912) నియమితుడయ్యాడు. బెర్లిన్ లోని ప్రష్యన్ శాస్త్ర అకాడమీ కి ప్రొఫెసర్ గా అహ్వానించబడ్డాడు. పరమ నియంత హిట్లర్, జ్యూష్ లపై పరమ కసి వున్న హిట్లర్ జర్మనీ లో అధికార నిమిత్తం 1933 లో రావడం, ఐన్ స్టీన్ జర్మనీ ని నిష్క్రమించడం ఒకేసారి జరిగాయి. అమెరికాలో స్థిరపడ్డాడు. రెండవ ప్రపంచయుద్ధంలో అమెరికా నావికాదళంలో తన సేవలను అందించాడు.



అంతర్జాతీయంగా ప్రఖ్యాతమవ్వడం 1919 లో, తన శాస్త్రీయ పరిశోధనలకు అద్భుతమైన గుర్తింపు, రాణింపుని రాయల్ సొసైటీ, లండన్ వారివ్వడంతో. తర్వాత, ఐరోపా యాత్రను చేస్తూ, తన పరిశోధనలను విశదపరచాడు. 1921 లో ఐన్ స్టీన్ 'భౌతికశాస్త్రం' లో విశ్వవిఖ్యాత 'నోబెళ్ పురస్కారం వచ్చింది. తిరిగి, ప్రపంచం మొత్తం ప్రయాణం చేసి, తన పరిశోధనలను మరింత వివరంగా తెలిపాడు. యిదే సమయంలో, ప్రపంచ శాంతి కోసం కౄషి సలిపాడు.



అమెరికా లోని, ప్ర్న్సిటన్ లో 18 ఏప్రిల్ 1955 న, 76 ఏళ్ళ ప్రాయంలో, ఐన్ స్టీన్ తన అంతిమశ్వాసని విదిలాడు. యావత్తు ప్రపంచానికే ఎదురులేని, తిరుగులేని శాస్త్రజ్ౙుడుగా శాశ్వతంగా విశ్వ మానవాళి హౄదయాల్లో, మస్తిష్కాల్లో నిలచిపోయాడు.



ఐన్ స్టీన్ ని అంచనా వేయగలవాడు



ఒకసారి ఐన్ స్టీన్ ప్రాణమిత్రుడి పెళ్ళికి వెళ్ళాడు. దంపతులు ఆనందంగా వున్నందుకు సంతోషించాడు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు పద్దినిమిది నెలల వయసున్న పిల్లవాడితో మళ్ళీ ఐన్ స్టీన్ ని కలిశారు. తల పిచ్చుకగూడులా, కళ్ళు లోతుగా, ముఖం అంతా ముడతలతో వున్న ఐన్ స్టీన్ ని చూడగానే ఆ పసివాడు 'బూచీని చూసినట్లు భయపడి కెవ్వుమని కేకవేసి, గుక్కపట్టి ఏడవసాగాడు. ఐన్ స్టీన్ ని చూసి పసిపిల్లవాడు అలా భయపడి ఏడవడం తల్లిదండ్రులకు అవమానం అనినిపించింది. అయితే, ఐన్ స్టీన్ ముఖం ఆ పిల్లవాడి ప్రవర్తనకు విప్పారింది. కళ్ళు కాంతివంతమై అతను ఆ పిల్లవాడి తల నిమురుతూ, 'ఇంతవరకూ నా జీవితంలో నన్ను గురించి నువ్వు అనుకుంటున్నదేమిటో నిర్భయంగా చెప్పింది నువ్వు ఒక్కడివే బాబూ' అన్నాడు. వెంటనే, 'చిన్నపిల్లవాడు - వాడికేం తెలుసు మీ ఔన్నత్యం' అని ఆ పిల్లవాడి తండ్రి అంటుంటే - ఐన్ స్టీన్, 'అందుకే మనిషిని మనిషిగా అంచనా వేయడం తెలిసినవాడు పసివాడే'. అందుకే తన అంచనా ఏమిటో నన్ను గురించి అంత నిర్భయంగా చెప్పాడూ, అని సెలవిచ్చాడు.



ఐన్ స్టీన్ కు స్ఫూర్తినిచ్చిన భగవద్గీత



ఐన్ స్టీన్ అనగానే మనకు 'సాపేక్ష సిద్ధాంతా కర్తగా, ప్రపంచ ప్రసిద్ధి శాస్త్రవేత్త గుర్తుకు వస్తాడు. అయితే, 1948 లో ఆయన చెప్పిన మాటలు నమ్మదగినవిగా లేకపోయినా, అవి నమ్మదగిన నిజాలే! 1948 లో డా. బి.యం.గుప్తా అనే ఒక యువ పరిశోధకుడు, అమెరికాలోని ప్రిన్సిటన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యడ్వాన్స్డ్ స్టడీస్ లో, ఇన్ స్టీన్ ని కలుసుకున్నాడు. ఐన్ స్టీన్ డా. గుప్తాని సంస్కౄతంలో ఆహ్వానించాడు. ఆయనతో సంస్కౄతంలో సంభాషించడం మొదలు పెట్టాడు. ఐన్ స్టీన్ ఎంతసేపు సంస్కౄతంలో ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పలేని గుప్తా - 'నాకు సంస్కౄతం బొత్తిగా రాదు! క్షమించండీ!' అన్నాడు. వెంటనే, ఐన్ స్టీన్ 'నువ్వు భారతదేశం నుంచి వస్తూ, భారతీయుడవయ్యుండీ - అన్ని భాషలకు తల్లిభాషైన సంస్కౄతమే చదువుకోలేదా? భారతదేశం తత్త్వశాస్త్రానికీ, వేదాంతానికీ పుట్టినిల్లు. అలాంటి శాస్త్రాధ్యాయనానికైనా నువ్వు సంస్కౄతం నేర్చుకుని వుండవలసినది. నా ఇంట్లోని, నా గ్రంధాలయంలో ఎన్ని సంస్కౄత ఉద్గ్రంధాలున్నాయో చూడు! నేను ప్రసిద్ధ శాస్త్రవేత్తనని 'నోబెళ్ బహుమతి వచ్చింది. అయితే నా వైజ్ౙానిక శాస్త్ర పరిశోధకులకు, సూత్రీకరణలకు స్ఫూర్తి మీ భగవద్గీత! అదే నాకు మార్గదర్శి! అంటూ తన శాస్త్ర సాంకేతిక మాలాన్ని చెప్పాడు.



ఐన్ స్టీన్ కు పసివాడి సూచన



ఐన్ స్టీన్ ఒకరోజు వ్యాహ్యాళికి వెళుతుంటే, ఒక చిన్న పిల్లవాడు అపరిశుభ్రమైన ముఖంతో కనిపించాడు. ఆ పిల్లవాడు చాలా పేదవాడై వుంటాడని అర్ధం చేసుకున్న ఐన్ స్టీన్ - 'నువ్వు వెంటనే ఆ నీళ్ళటాంకు దగ్గరికెళ్ళి ముఖం కడుక్కొని వస్తే, నీకు అయిదు సెంట్లిస్తాను, బహుమతిగా' అన్నాడు. ఆ పిల్లవాడు, ఐన్ స్టీన్ మాటలకు వింతగా అతని ముఖంవైపు చూశాడు. ఐన్ స్టీన్ అదేమాట మళ్ళీ చెప్పేప్పటికి పరుగున వెళ్ళి ముఖం నీళ్ళతో రుద్ది రుద్ది, శుభ్రంగా కడిగి తిరిగివచ్చాడు. 'ఇప్పుడు చూశావా, ఎలా వున్నావో' ఇక ఎప్పుడూ ఇలాగే వుండాలి. అపరిశుభ్రంగా వుండకూడదు! ఇదిగో నీకిస్తానన్న బహుమతీ అంటూ, అయిదు సెంట్లు చేతిలో పెట్టాడు, ఐన్ స్టీన్. కాసేపు ఆ డబ్బు వైపే చూస్తున్న ఆ పిల్లవాడితో, 'ఆ డబ్బుతో ఏం చేస్తావ్?' అన్నాడు, ఐన్ స్టీన్ కుతూహలంగా. ఆ పిల్లవాడు వెంటనే - 'మీరిచ్చిన డబ్బు తిరిగి మీకే ఇద్దామనుకుంటున్నాను. దీని అవసరం ఇప్పుడు నాకంటే మీకే వుందీ అన్నాడు. ఐన్ స్టీన్ ఆశ్చర్యపోతూ, 'నాకు ఆ డబ్బు అవసరం వుందా? ఆ డబ్బు నాకే ఇస్తావా?' అన్నాడు. 'ఔను! మీ తలమీద జుట్టు చూడండి! పొదరిల్లు మోస్తున్నట్లు ఎంత ఘోరంగా వుందో!' మీరు ఈ డబ్బుతో వెంటనే క్రాఫు చేయించుకోవడం అత్యవసరం', అంటూ ఆ డబ్బు ఐన్ స్టీన్ చేతిలో పెట్టాడా బాలుడు.



మహానుభావుల మహానుభావుకత కు నిదర్శనం, తార్కాణం, ఐన్ స్టీన్ శాస్త్రవేత్త జీవనప్రస్థానం.

No comments: