అంతర్జాతీయ వృద్ధుల
దినోత్సవం – 1 అక్టోబర్
వయోధికులదే అగ్రభాగం
వయసు రీత్యా
విశ్వమానవాళిని గమనిస్తే, ఈ ప్రపంచానికే ముసలితనం ఆవహించిందని ప్రపంచ శాస్త్రవేత్తలు
అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా, ఐదేళ్ళప్రాయం కూడా పూర్తవని చిన్నారుల
కంటే, 2000 లో 60 ఏళ్ళు పైబడిన వృద్ధులే అత్యధికంగా
ఉన్నారని, ఒక దశాబ్దకాలంలోపు ఒక బిలియన్ల సంఖ్యని అధిగమిస్తారని, నిర్థారిత అంచనాలు
చెబుతున్నాయట. అయితే, వీరిలో ప్రజ్ణావంతులు, అనుభవజ్ణులు, మార్గదర్శకులు, ఉపాధ్యాయులు,
ఓటర్లు, వ్యాపారవేత్తలు, స్వచ్చంద సేవాతత్పరులు, వెరసి సమాజానికి అత్యంత ప్రతిభావంతంగా
ఉపయోగపరులుగా ప్రపంచానికి ఒక వరప్రసాదంగా లభిస్తారని కూడ విశ్వసించడం జరుగుతోంది. ఏది
ఏమైనా, 21 శతాబ్దంలో సమాజంలోని వార్థక్యపు పెద్దమనుషుల పట్ల మనందరం సంతోషమే కాక పెద్ద
సవాలుగా గోచరిస్తోంది. వారికి అందించవలసిన సహాయ సహకారాలను అందివ్వడంతోపాటు పదవీ విరమణ,
ఆరోగ్య విధానాలు, జీవనశైలి, తరాల అంతరాలులాంటి విషయాలపట్ల తీసుకోవలసిన ఆలోచనలు, ఆచరణలు
ప్రధానపాత్ర వహిస్తాయి. వివిధ దేశాలు వృద్ధుల సమస్యలను పరిష్కరించడం, వారి హక్కులను
వారు సాధించుకోవడంలో మంచి పరిణామాలను సాధించుకోవాలి. ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏట 1 అక్టోబర్
న విశ్వవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ వృద్ధుల సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరం – ‘సురీర్ఘ
జీవనానికి వృద్ధులపట్ల భావి ప్రణాళికలు’ అమలుపరచటంలో సత్ఫలితాలను సాధించే దిశలో సాగే
ఆలోచనలకు ఆచరణ ప్రణాళిక విషయమై చర్చలు జరుగుతాయి.
అంతర్జాతీయ వృద్ధుల
దినోత్సవం అన్నది గమనించి, ఈ ముఖ్యాంశం పై కనీసం చిన్న వ్యాసమైనా వ్రాయాలనిపించి, శోధన
ప్రారంభిస్తే, మొట్టమొదటగా లభించింది ‘ముసలితనం ఎందుకొస్తుది?’ అని యిటీవలే కీర్తిశేషులైన
ప్రముఖ శాస్త్రవేత్త, రచయిత డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి వ్యాసం కనిపించింది.
వృద్ధత్వం, ముదుసలితనం గురించి చేసిన శాస్త్రేతర ప్రస్తావన యిలా సాగింది:
ముసలితనం అనేది ప్రాణి శరీరానికి పటుత్వం తప్పి, అంత్యదశకు చేరబోయే ముందు దశ. మనుషుల విషయంలో పెరిగే వయస్సును గురించిన అనేక భావావేశాలూ, ఉద్వేగాలూ కలగడం మామూలే కాని తక్కిన ప్రాణుల విషయంలో అటువంటి 'భేషజా'లేవీ కనబడవు.
|
మన వయస్సు పెరుగుతున్నకొద్దీ మతిమరుపూ, ఆలోచనావేగం మందగించడం వగైరాలు మొదలౌతాయి. వీటిలో కొన్నిటికి కారణం థైరాయిడ్ లోపాలూ, కుటుంబసభ్యుల మరణం, నిద్రలేమి, అంటువ్యాధులూ, ఇతర మందుల దుష్ప్రభావాలూ మొదలైనవి ఏవైనా కావచ్చు. మామూలుగా వచ్చే రోగాలూ, ఒత్తిడులూ, పరిసరాల్లో కలిగే మార్పులూ ఇలా మొత్తంమీద అనేకరకాల కారణాలు ముసలితనానికి దారితీస్తాయి.
|
ఈ రోజుల్లో మనిషి సగటు ఆయుర్దాయం పెరిగిపోతోంది. దేవతల్లాగా ఎల్లకాలం యవ్వనులుగా బతకలేకపోయినా బతికిన్నన్నాళ్ళూ ఆరోగ్యంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ముసలితనం మనని ఎలా శిథిలం చేస్తుందో తెలుసుకుంటే ఆరోగ్యానికి కీలకం తెలుసుకోవచ్చు. చాలామందికి ముసలితనంలో సమస్య శారీరక పటుత్వం తగ్గి, రోగాలూ రొష్టుల పాలవడమే కాదు. మెదడుకు సంబంధించిన రుగ్మతలుకూడా కొన్ని కలగవచ్చు. వీటిలో ముఖ్యమైనవి జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోవడం అల్జ్‌హైమర్స్ వ్యాధి సంక్రమణం, న్యూరాన్ జబ్బులు, పార్కిన్సన్ వ్యాధి వగైరాలు. వయసు పైబడినప్పటికీ పూటగడవడానికో, ఇతర కారణాలవల్లనో వీరిలో కొందరైనా తమకూ సమాజానికీ పనికొచ్చే కొన్ని వృత్తులనూ, పనులనూ కొనసాగించక తప్పదు. అలాంటప్పుడు వీరిలో అనివార్యంగా కలిగే రుగ్మతలూ, అవసరమయే ప్రత్యేక సౌకర్యాలూ సమాజంపై ఎటువంటి ప్రభావం కలిగిస్తాయి? వణుకుతున్న అవయవాలతో, మందగిస్తున్న చూపుతో ఎంతమంది అప్లికేషన్లో, మరో దరఖాస్తో చదివి, నింపి, చేత పట్టుకుని క్యూలలో నిలబడాలి? వీరిని సమాజం ఎంతవరకూ భరించి, ఆదరించి, పోషించగలుగుతుంది? వయసుమళ్ళినవారికి ఆశ్రమాలూ, ఇతర సదుపాయాలూ ఏర్పాటు చేసి నిర్వహించడం ఇప్పటికే ఒక పెద్ద పరిశ్రమగా రూపొందుతోంది. వీరి హక్కులనూ, అధికారాలనూ పరిరక్షించి, న్యాయ, సామాజికపరంగా కాపాడటానికి ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి, ఏర్పడుతున్నాయి. కృషి చేస్తున్నాయి. వీటిని గురించి ప్రతివారూ పట్టించుకోక తప్పదు. ఎందుకంటే నేటి యువతీ యువకులే రేపటి వృద్ధులు!
|
గౌతమ
బుద్ధుడుగా పేరుపొందని పిన్నవయసులో సిద్ధార్థుడు మొదటిసారిగా రోగగ్రస్తులనూ, ముసలివారినీ, శవాన్నీ చూసి చలించిపోయాడని అంటారు.
ప్రతి ప్రాణికీ తప్పనిసరిగా వచ్చే ముసలితనం ఎవరికీ
నచ్చని ఒక సహజ పరిణామం.
మనకు పూర్తిగా అర్థం కానటువంటి తక్కిన
విషయాలలాగే ముసలితనం అనేది కూడా ఎన్నో
అపోహలకు గురి అవుతూ ఉంటుంది.
మనుషులకి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం తమ ఉనికి.
వీలున్నన్నాళ్ళు మంచి ఆరోగ్యంతో బతకడమే
మనకు ప్రధానమైన విషయం. అందుకనే ఈనాటికీ ఎవరినైనా కలుసుకోగానే మొదట అప్రయత్నంగా "బాగున్నారా?"
అని ఆడుగుతాం. కాని ఆరోగ్యాన్ని ఎంతగా
కాపాడుకున్నా ముసలితనం మాత్రం రాకమానదు. ప్రకృతిలోని ప్రాణులన్నిటికీ వర్తించే ముసలితనం వగైరాల గురించి మనిషికి అనాదిగా తెలుసు. ఈ పరిణామదశలను అర్థం
చేసుకోవడం మనిషికి సమాజ జీవితంలో సాధ్యమైంది.
మనిషి సగటు ఆయుష్షు కాలంతో
బాటుగా పెరుగుతోంది. 19వ శతాబ్దం అంతానికి
37కు మించని సగటు వయసు చికిత్సా
పద్ధతుల్లోని అభివృద్ధి కారణంగా ఈ రోజుల్లో దాదాపుగా
70కి పెరిగింది. దీనివల్ల సమాజంలోనూ, జీవితం పట్ల మనుషుల దృక్పథంలోనూ
కూడా ఎన్నో మార్పులు కలిగాయి.
సగటు వయసునూ, జీవన ప్రమాణాలనూ కూడా
మెరుగుపరిచే ప్రయత్నాలు మొదలయాయి. మరొకవంక ముసలితనానికి శాస్త్రీయ కారణా లెటువంటివో కూడా
అవగాహనకు వస్తున్నాయి.
వయసు రావచ్చు. కాని, ముసలితనం రాకూడదు. చైనా, అమెరికా, జపాన్ వంటి దేశాలలో ఎనభైలు దాటాకనే వాళ్లను వృద్ధులుగా గుర్తిస్తారు. మన దగ్గర తొందరగా ముసలితనాన్ని కొనితెచ్చుకుంటారు.
మానసికంగా, శారీరకంగా శరీరాన్ని పటుత్వంలో ఉంచుకుంటే వృద్ధాప్యాన్ని నిలువరించవచ్చు.. అనాది నుంచి మానవుడు తన జీవితకాలాన్ని పొడిగించుకోవాలని ఆశిస్తూనే ఉన్నాడు. ఆ జీవితాన్ని ఆరోగ్యంగా గడపాలన్నది అతడి ఆకాంక్ష. అయితే అతడి ఆకాంక్షకు వార్ధక్యం ఒక అవరోధం. నిజానికి వార్ధక్యం అనేది ప్రకృతిసహజంగా కలిగే మార్పు మాత్రమే. ఇది వ్యాధి కాదు. అయితే ఈ మార్పు వల్ల శరీరంలో జరిగే అనేక జీవక్రియలు... హృదయ కృత్యం నుంచి అనేక కార్యకలాపాలు క్రమంగా మందగిస్తుంటాయి. వార్ధక్యంతో వచ్చే ఈ మార్పులకు వయసుతో సంబంధం లేదు. అయితే దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ మార్పు మొదలవుతుంటుంది. కానీ విచిత్రంగా కొందరు... 70 ఏళ్ల తర్వాత కూడా శారీరక, మానసిక బలం తగ్గకుండా ఉంటారు. కొందరిలో 50 ఏళ్లకే వృద్ధాప్యం మీద పడినట్లు కనిపించడం కూడా సహజం. కాబట్టి వయసు పైబడ్డవారిలో వార్ధక్య లక్షణాలు కనిపిస్తున్నా... వార్ధక్య మార్పులకు వయసును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం కాదు. వార్ధక్య లక్షణాలకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది జన్యు సంబంధమైన కారణం. ఇది తప్పించలేని కారణం. ఇక ఆహారం వంటి తప్పించదగిన కారణాలు కూడా ఉంటాయి. సాంక్రమిక రోగాలు, ఆహార లోపాలు, హార్మోన్ల లోపాలు పై అంశాలన్నీ వార్ధక్యాన్ని వేగవంతం చేసేవే. తాను నివసించే బాహ్యవాతావరణం, అతడి నడత, సాంఘిక పరిస్థితి, పారిశుద్ధ్యత... ఇవన్నీ వార్ధక్యంపై ప్రభావితం చూపుతుంటాయి. పర్యావరణంలోని కాలుష్యాలు, ఆరోగ్య విషయాలపట్ల వ్యక్తిగత క్రమశిక్షణ రాహిత్యం, నాడీమండలంపై పడే ఒత్తిడి... ఇవన్నీ శరీరంలోని జీవక్రియల్లో మార్పులు కలగజేస్తాయి. అవి శరీరంలోని జీవరసాయనిక క్రియలను ప్రభావితం చేసి, ధాతు పరిణామంలో మార్పులు కలగజేసి ఆరోగ్యాన్ని కోల్పోయేలా చేస్తాయి. వయసు తక్కువగా (అరవై ఏళ్ల వయసులోనూ 45 ఏళ్ల వ్యక్తిలా) కనిపించేలా చేస్తుంది. దీర్ఘాయుష్షు, బలం, బుద్ధి, స్మృతిని ప్రసాదిస్తుంది. వ్యాధులు రాకుండా కాపాడి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మంచి శరీరవర్ణం, మంచి స్వరం, వాగ్బలం కలగజేస్తుంది. శ్రమ, బడలిక, బలహీనతలను హరిస్తుంది. శిథిల మాంస కండరాల శైథిల్యాన్ని పోగొట్టి దృఢపరుస్తుంది. మంచి ఆకలిని కలగజేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. వార్ధక్య లక్షణాలు శరీరం బలహీనంగా ఉండటం, సోమరితనం ఎక్కువ కావడం, ఉత్సాహం లోపించడం, శారీరక, మానసిక చేష్టలలో సామర్థ్యం లోపించడం నిద్రలేకపోవడం జ్ఞాపకశక్తి, బుద్ధి, శరీరకాంతి తగ్గిపోవడం జ్వరం వంటి వ్యాధులకు త్వరగా లోనుకావడం. |
||||
కవిసామ్రాట్టు,
మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు ‘పురాణవైర గ్రంథమాల’ నవల్లోని మొదటి నవల
‘భగవంతుని మీద పగ’ అన్న దాంట్లో అనుకుంటా, ఒకనాడు మానవ జీవనం రెండు వందలేళ్ళు
ఉండేదని, ముప్ఫైరెండు వరకూ బాల్యంగా పరిగణించేవారన్నారు. మన పురాణాల్లో,
ప్రముఖంగా మహాభారతంలో యయాతి కథ అందరికీ సుపరిచితమే. అంత సుదీర్ఘ జీవనయానంలో
అధికకాలపు యవ్వనకాలం గడిపినా, మనుషులకు జీవితంపై ఆశ, మమకారం, ముసలితనాన్ని
స్వీకరించలేకపోవడం పరిపాటిగా గడించింది.
ముసలితనమే
సర్వదా మేలు – యయాతి కథనం
యయాతి మహారాజు పాండవుల పూర్వీకుల్లో ఒకడు. పరాజయం ఎరుగని పరాక్రమశాలి. శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని పెళ్ళి చేసుకున్నాడు. తరువాత వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ పట్ల కూడా మోహం కలిగి దేవయానికి చెప్పకుండా రహస్యంగా పెళ్ళి చేసుకున్నాడు. దేవయానికి ఇది తెలిసింది. తన తండ్రితో మొరపెట్టుకుంది. శుక్రాచార్యుడికి పట్టరాని కోపం వచ్చింది. " నీకు తక్షణమే ముసలితనం వాటిల్లుగాక" అని యయాతికి శాపం ఇచ్చాడు. నడివయస్సులో అకస్మాత్తుగా ముసలితనం రావడంతో యయాతి మహారాజు గత్యంతరం లేక మామగారి పాదాలపై పడ్డాడు. శుక్రాచార్యుడు జాలిపడ్డాడు. " రాజా! నా శాపాన్ని మళ్ళించలేను. అయితే ఎవరైనా సమ్మతించేవారుంటే వారికి నీ మసలితనం ఇచ్చి వారి పడుచుతనం నీవు తీసుకో" అని ఉపాయం చెప్పాడు శుక్రాచార్యుడు. యయాతి ఐదుగురు కొడుకుల్ని
పిలిచి శాపం
వల్ల దాపురించిన అకాల వార్థక్య
ప్రస్తావన చేసి, తన ముసలితనం తీసుకుని పుత్రుల్లో ఎవరిదైన యవ్వనం బదులిస్తే మరికొంత కాలం నేను పడుచుదనం అనుభవించి, జీవిత భోగాలు తృప్తితీరా అనుభవిచినందుకు ఎవరైతే తన ముసలితనం స్వీకరిస్తారో వారికి రాజ్యం ఇస్తాను అనడం, దానికి పెద్ద కుమారుదు ససేమిరా అన్నాడు.
రెండవ
కమారిణ్ణి అడిగితే, బలాన్నీ, రూపాన్నే కాకుండా తెలివిని కూడా నాశనంచేసే వృద్ధాప్యాన్ని పుచ్చుకునేంత నిబ్బరం లేదు. క్షమించమన్నాడు.
మూడవవాడు నిష్కర్షగా ముందే చేతులు అడ్డుగా తిప్పగా,
నాలుగవ వాడు "నాన్నగారూ! నన్ను మన్నించండి. ముసలితనమంటే అసహ్యం, వార్ధక్యంలో శరీరం ముడతలు పడి , చూపు ఆనక, మాట వినపడక స్వతంత్రం కోల్పోయి దుఃఖ పడాలి, మీ కోసం నేనంత కష్టాన్ని భరించలేను" అని స్పష్టంగా చెప్పాడు. ఇలా నలుగురు కొడుకులు తన కోరిక కాదనేటప్పటికి యయాతి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయి, విచారించి, చివరకు తన మాటకు ఎన్నడూ ఎదురుచెప్పని కడగొట్టు కుమారుణ్ణి "నాయనా! ఇక నీవే నన్ను కాపాడాలి. ఈ ముసలితనం , ఈ ముడతలు, ఈ తడబాటు, ఈ నెరసిన వెంట్రుకలు - ఇవన్నీ శుక్రాచార్యులవారి శాపం వల్ల నాకు అకాలంగా వచ్చి పడ్డాయి. ఈ దుస్థితిని నేను భరించలేకుండా వున్నాను. కొంతకాలం నా ముదుమిని నీవు పుచ్చుకుని నీ యవ్వనం నాకిచ్చావంటే సర్వసుఖాలూ అనుభవిస్తాను" అని దీపంగా అర్ధించాడు. యయాతి కడగొట్టు పిల్లవాడి పేరే పూరుడు. అతనికి తండ్రి యెడల జాలి కలిగింది. " నాన్నగారూ! మీ కోరిక ప్రకారం మీ వార్ధక్యాన్నీ, రాజ్యభారాన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తాను. మీరేమీ దిగులు పెట్టుకోకండి" అన్నాడు. యయాతికి పట్టరాని ఆనందం కలిగింది. కుమారుణ్ణి కౌగిలించుకుని అభినందించాడు.
అలా పూరుడి యవ్వనాన్ని యయాతి తీసుకున్నాడు. తండ్రి మసలితనం పూరుడు స్వీకరించి , రాజ్యభారం వహించి చాలాకాలం జనరంజకంగా పాలనచేశాడు. గొప్ప కీర్తి పొందాడు. యయాతి కుమారుడిచ్చి న యవ్వనంలో సర్వసుఖాలు అనుభవించాడు కానీ తృప్తి కలుగలేదు. అప్పుడు పూరుడి దగ్గరకు వెళ్ళి "నాయనా! కుమారా! కోరికలు ఎన్నటికీ తీరవు. విషయానభవం వల్ల కాంక్షలు ఇంకా వృద్ధి పొందుతాయేగాని అణగవు. కామినీ కాంచనాలూ, పాడిపంటలూ మనిషి కోరికలను ఎన్నటికీ తృప్తి పరచలేదు. ఈ సంగతి క్రమేపీ తెలిసొచ్చింది నాకు. ఇష్టాయుష్టాలకు అతీతమైన ప్రశాంతస్థితిని పొందాలని వుంది. ఇక నీ యవ్వనం నీవు తీసుకుని చల్లగా రాజ్యం పాలిస్తూ వర్థిల్లు నాయనా" అని అశీర్వదించాడు. యయాతి తన ముసలితనం తాను తీసుకుని అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేసి , చివరకు స్వర్గం చేరుకున్నాడు.
|
|
ముసలితనం తెచ్చే
ఉద్వేగం
హాలీవుడ్ సింగర్ జస్టిన్ టింబర్‌లేక్ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ – తనను నిత్యం వెంటాడే భావాల్ని
వివరించారు.
“ముసలితనం వస్తుండడంతో
జీవితాన్ని సరిగా ఎంజాయ్ చేయలేకుండా పోతున్నానని అన్నారు. నేను యవ్వనంలో ఉన్న
రోజులు నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి. చూడడానికి చాలా సీరియస్గా, గర్వంగా
ఉంటాను. కానీ ఇప్పడు అవన్నీ తలచుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అందుకు కారణం
యవ్వనంలో ఉన్నప్పుడు అంత రాష్‌గా ఉన్న నేను ఇప్పడు ఇంత శాంతకాముడిగా మారడానికి
కారణం మాత్రం వయసు మీద పడడమేనని అనుకుంటున్నాను. అంతేకాదండి ఆ వయసులో చేసిన కొన్ని
పనులు నాకు చాలా సంతోషిస్తున్నాయి. ఆ రోజులు నుండి సడన్‌గా వయసు మీద పడి శాంతంగా
ఉండడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎప్పుడైతే మీలో కొపం, ఆవేశం సన్నిగిల్లుతుందో
అప్పుడు మీలో ఆలోచన ధోరణి పెరగడమే కాకుండా, పెద్ద తరహా భావాలు వస్తాయని అన్నారు.
దీనిని బట్టి మనకు ఏమీ అర్దం అవుతుందంటే మనకు వయసు వస్తుందని అన్నారు. కానీ
సాధరణంగా మనం వయసులో పెద్ద వారమవుతున్నామనే విషయాన్ని ఒప్పుకోం. ఎవరైతే ఒప్పుకుంటారో వారిలో పెద్ద తరహా భావాలు వచ్చినట్లన్నమాట.
కానీ నాకు మరలా యవ్వన దశలోకి వెళ్లాలని ఎటువంటి కోరికలు లేవు. నాకు
మాత్రం నేను యవ్వనంగానే ఉన్నానని అనుకుంటున్నాను. కానీ నాలో వస్తున్న ఈ మార్పులకు
మాత్రం కొంచెం ఉద్వేగంగా ఉంది. మనస్పర్దల వల్ల జస్టిన్ టింబర్‌లేక్, జెస్సికా
బెయిల్ విడిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల కెనాడాలోని టోరెంటోలో ఉన్న ఎల్లాస్ కాఫీ
షాప్‌లో ఇద్దరూ కలసి కాఫీ త్రాగుతూ రొమాంటిక్‌గా ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు.
వీరిద్దరి అక్కడ చూసిన అభిమానులు తెలిపిన దానిప్రకారం ఇద్దరూ కూడా మొదట్లో ఎలా ఐతే
కలసి మెలసి ఉండే వారో అదే విధంగా వారియొక్క ఐడియాస్‌ని షేర్ చేసుకుంటూ సరదాగా
జోకులు వేసుకుంటూ కనిపించారని సమాచారం.
చాలా రోజులు తర్వాత కలుసుకున్న వీరిద్దరిలో జస్టిన్ టింబర్‌లేక్, జెస్సికా బెయిల్‌ను చూస్తూ అలానే ఉండిపోవడం జరిగిందంట. అంతేకాకుండా జస్టిన్ జెస్సికాతో
మాట్లాడుతూ జీవితాంతం నీ ముఖంలో ఇలాంటి ఆనందాన్ని చూడాలని అనుకుంటున్నానని
వెల్లడించాడని సమాచారం. ఇది చూసిన వాళ్శంతా త్వరలోనే వీరిద్దరూ మరలా కలసి పోతారని
గుసగుసలాడుకుంటున్నారు.
యిటీవలే, ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురించిన
వ్యాసంలో ముసలితనానికి కారణం చదివితే, హతాశుల్ని చేసింది.
30 యేళ్లకే ముసలితనం.!
అందరూ సహజంగా ఏ యాభై, అరవై ఏళ్లకో ముసలివాళ్లవుతారు. కానీ ఆ గిరిజనులు మాత్రం 30 ఏళ్లకే ముసలివాళ్లుగా మారుతుంటారు. ఆ మాటకొస్తే పుట్టుకతోటే వారి పిల్లల్లో ముసలితనం తొంగిచూస్తుంది. ఇంతకి వారేమీ ప్రత్యేక జాతివారు కాదు. వారికా దుస్థితి కలగడానికి విషం చిమ్ముతున్న ఆ ఊరి ఫ్లోరైడ్ నీరే ప్రధాన కారణం. గ్రామస్తులను ఫ్లోరైడ్ భూతంబారి నుంచి కాపాడ్డానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం మరో కారణంగా ఉంది.
రంగారెడ్డి జిల్లాలోనే యాచారం మండల భూగర్భజలాల్లో ఫ్లోరైడు శాతం అధికంగా ఉంది. మండలంలోని మంతన్గౌరెల్లి గ్రామంలో సుమారు 5 వేల జనాభా ఉంది. అధిక జనాభా గిరిజనులదే. యాచారానికి ఈ గ్రామం బహుదూరం. నల్గొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఉంది. ఈ గ్రామానికి కేశ్యాతండా, భానుతండా అనుబంధ గ్రామాలుగా ఉన్నాయి. ఆయా గ్రామస్తులనూ ఫ్లోరైడ్ పీడిస్తోంది. మంతన్గౌరెల్లిలో సుమారు వంద మందికి ఆరోగ్యం పూర్తిగా పాడైంది. వారిలో 30 మంది శాశ్వత వికలాంగులుగా మారిపోయారు. రెండు వందల మందికి పళ్లు పూర్తిగా పుచ్చిపోయాయి. ముత్యాల్లా మెరవాల్సిన చిన్నపిల్లల పళ్ళు సైతం పసుపురంగులోకి మారిపోయాయి. 40 ఏళ్లలోపువారు 58 మంది ఫ్లోరైడ్ కారణంగా మృత్యువాత పడినట్లు సమాచారం. తప్పని పరిస్థితుల్లో ఫ్లోరైడ్ నీటినే తాగుతుండడం మూలంగా సమస్య పరిష్కారం కావడం లేదని గిరిజనులు వాపోయారు.
మంతన్గౌరెల్లిలో 30శాతం మంది ఫ్లోరైడ్ మూలంగా విలవిల్లాడుతున్నారు. కాంట్రో చందు(40), కొర్ర డోల్లి(35)ల కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. దీంతో గత పదేళ్లుగా వారిది నడవలేని పరిస్థితి. నేన్నవంతు ఠావ్రు 40) కర్రసహాయంతో నడుస్తూ జీవితం వెల్లదీస్తున్నాడు. రెండేళ్ల క్రితం గార సోమయ్య ఫ్లోరైడ్ విషం మూలంగా కుంగి కృశించి చనిపోయాడు. ప్రస్తుతం 20 మంది చిన్నారుల బంగారు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మంతన్గౌరెల్లి లోతట్టు ప్రాంతంలో కొండలు గుట్టలు నడుమ మండల కేంద్రానికి 20కి.మీ దూరంలో ఉండటంతో వైద్యసేవలు సైతం సకాలంలో అందడంలేదు.
“తెల్లని గడ్డం వంగిన వొళ్ళు
ఊడిన పళ్ళు జారిన చుబుకం
ఎన్నో ఏళ్ల నా జీవితం ఒక స్వప్నంలా గడిచింది
దేని కోసమో కాదు కూర్చున్నట్లుగా తొందర తొందరగా
తెల్లని గడ్డం జారిన చుబకం
ఊడిన పళ్ళు వంగిన వొళ్ళు
ఎన్నో ఏళ్ల నా జీవితం ఒక స్వప్నంలా గడిచింది
దేని కోసమో కాదు కూర్చున్నట్లుగా తొందర తొందరగా
తెల్లని గడ్డం జారిన చుబకం
ఊడిన పళ్ళు వంగిన వొళ్ళు
ఇదే నా జీవితపు శిధిలాలు
ఈ శిధిలాల మాటున దాగెను ఎన్నో గాధలు
అవికూడా నాతో సమాధిలా మిగిలాయి”
ఈ శిధిలాల మాటున దాగెను ఎన్నో గాధలు
అవికూడా నాతో సమాధిలా మిగిలాయి”
మానవ జీవన ప్రస్థానంలోని
వాస్తవికతపట్ల నిరాశ చెందడం, తద్వారా ఉన్న ఆరోగ్యాన్ని, చివరి జీవితాన్ని
నిరాశమయంగా గడుపుకుంటూ కొనసాగించడంలో అందరూ పునరాలోచన చేసుకొని, జీవితాన్ని
సార్థకమయం కావించుకోవాలి.
ఉమ్మడి కుటుంబం నుంచి
వృద్ధాశ్రమాలు
ముసలితనం శాపమా!
చాలామంది అలాగే అనుకుంటున్నారు. కారణాలు అనేకం – ఎక్కువగా కన్న సంతానం అనే అనుకునే
దారుణ పరిస్థితిలో గడుపుతూ జీవితాన్ని దుర్భరంగా గెంటుకొస్తున్న దుస్థితి చాలామంది అనుభవిస్తున్నారు. ఇదిగో మరో
ప్రత్యక్ష కథనం ...
అంతా ఎందుకిలా డబ్బు మనుషులవుతున్నారు. డబ్బు కోసమే బతుకుతున్నారు. డబ్బు కోసం కన్న తల్లిని బయటికి గెంటేస్తారా... పిల్లల కోసం ఎన్నో కలలు కని... తొమ్మిదేళ్లు మోసి... ప్రసవ వేదనను అనుభవించి, పొత్తిళ్లలోని బిడ్డను చూసి... ఆ బాధనంతా మరిచిపోయేది తల్లి. ఇక అన్నీ వారికోసమే. తను తినీ తినకుండా... ఏ లోటు రానీయకుండా పెంచి పెద్ద చేస్తే... డబ్బు... కేవలం డబ్బు కోసమే... 80 ఏళ్ల తల్లిని రోడ్డు మీదకు గెంటేశారు.
వాళ్లు గెంటేశారో... లేక తనే తన బిడ్డలకు భారం కావద్దని బయటకు వచ్చేసిందో తెలియదు... ఒక వేళ తనే కావాలని బయటికి వచ్చేస్తే 80 ఏళ్ల ముసలి తల్లి ఎక్కడికి పోయిందన్న ఆవేదన ఆ బిడ్డలకు ఎందుకు కలగలేదు...? అదే కన్నబిడ్డ పోతే... విలవిల్లాడే తల్లిదండ్రులు తమ కన్నవారిపట్ల ఎందుకింత కఠినంగా ఉంటున్నారు.
తన బిడ్డలకు కాదన్నారని.... మహబూబ్‌నగర్ నుంచి... హైదరాబాద్ వరకూ వచ్చేసింది ఆ తల్లి. తన నలుగురు బిడ్డల్లో ఎవరూ చూసుకోక... అందరూ ఉండీ.. ఎవరూ లేనిదై రోడ్డున పడింది. తెలిసిన వాళ్లు రెండు రోజుల కోసమని చేరదీశారు. వారి దగ్గరా ఆమెకు అపనమ్మకం... తనను మళ్లీ బిడ్డల దగ్గరకు పంపుతారేమోనని. అందుకే గదిలోపలి నుంచి గడియ పెట్టుకుంది. ఎంత బాధ అనుభవించి ఉంటుంది. ఆ పిల్లలను పురిటి నొప్పులప్పుడు కూడా ఇంత వేదన అనుభవించి ఉండదు.
ముసలితనంలో తల్లిదండ్రులకు ఇంత యాతన పెట్టడం ఎందుకు. ఈ వయసులో వారు కోరుకునేది కేవలం ఒక ఆసరా. ఆత్మీయమైన పిలుపు. నీకు మేమున్నామని చెప్పే ఒక భరోసా. అమ్మమ్మా, నానమ్మా... తాతయ్యా అంటూ పిల్లలు దగ్గరికి చేరితే... వారితో ఆడుకుంటుంటే... అంతకంటే ఎక్కువ కోరుకునే వృద్ధులెవరూ ఉండరు. అలాంటి కనీసమైన ప్రేమను పంచలేని జీతాలెందుకు.
మీ పిల్లలను చూస్తున్నంత ప్రేమగా...మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు చూశారు. అదెప్పుడూ గుర్తుకు రాదా...? పేదరికమో.... కఠిన హృదయమో ఒక వేళ తల్లిదండ్రులు పిల్లలను చూడకపోయినా... తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లల మీద లేదా...? ముసలితనం అంటే భయపడాల్సిన రోజులొస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు.
భావి భారత పౌరులు. మరి గత చరిత్రను నిర్మించిన వృద్ధుల పరిస్థితి ఏంటి...? వారు ఈ సమాజానికి ఏమీ కారా...?
వాళ్లు గెంటేశారో... లేక తనే తన బిడ్డలకు భారం కావద్దని బయటకు వచ్చేసిందో తెలియదు... ఒక వేళ తనే కావాలని బయటికి వచ్చేస్తే 80 ఏళ్ల ముసలి తల్లి ఎక్కడికి పోయిందన్న ఆవేదన ఆ బిడ్డలకు ఎందుకు కలగలేదు...? అదే కన్నబిడ్డ పోతే... విలవిల్లాడే తల్లిదండ్రులు తమ కన్నవారిపట్ల ఎందుకింత కఠినంగా ఉంటున్నారు.
తన బిడ్డలకు కాదన్నారని.... మహబూబ్‌నగర్ నుంచి... హైదరాబాద్ వరకూ వచ్చేసింది ఆ తల్లి. తన నలుగురు బిడ్డల్లో ఎవరూ చూసుకోక... అందరూ ఉండీ.. ఎవరూ లేనిదై రోడ్డున పడింది. తెలిసిన వాళ్లు రెండు రోజుల కోసమని చేరదీశారు. వారి దగ్గరా ఆమెకు అపనమ్మకం... తనను మళ్లీ బిడ్డల దగ్గరకు పంపుతారేమోనని. అందుకే గదిలోపలి నుంచి గడియ పెట్టుకుంది. ఎంత బాధ అనుభవించి ఉంటుంది. ఆ పిల్లలను పురిటి నొప్పులప్పుడు కూడా ఇంత వేదన అనుభవించి ఉండదు.
ముసలితనంలో తల్లిదండ్రులకు ఇంత యాతన పెట్టడం ఎందుకు. ఈ వయసులో వారు కోరుకునేది కేవలం ఒక ఆసరా. ఆత్మీయమైన పిలుపు. నీకు మేమున్నామని చెప్పే ఒక భరోసా. అమ్మమ్మా, నానమ్మా... తాతయ్యా అంటూ పిల్లలు దగ్గరికి చేరితే... వారితో ఆడుకుంటుంటే... అంతకంటే ఎక్కువ కోరుకునే వృద్ధులెవరూ ఉండరు. అలాంటి కనీసమైన ప్రేమను పంచలేని జీతాలెందుకు.
మీ పిల్లలను చూస్తున్నంత ప్రేమగా...మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు చూశారు. అదెప్పుడూ గుర్తుకు రాదా...? పేదరికమో.... కఠిన హృదయమో ఒక వేళ తల్లిదండ్రులు పిల్లలను చూడకపోయినా... తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లల మీద లేదా...? ముసలితనం అంటే భయపడాల్సిన రోజులొస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు.
భావి భారత పౌరులు. మరి గత చరిత్రను నిర్మించిన వృద్ధుల పరిస్థితి ఏంటి...? వారు ఈ సమాజానికి ఏమీ కారా...?
ముసలితనం! దేవుడిచ్చిన
వరం!
‘ఆడదే ఆధారం’ అన్న చిత్రంలో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు
‘ముసలితనం గొప్పవరం’ అని వ్రాసిన పాట వాస్తవానికి మనోల్లాసాన్ని కలిగించి, ముందు
జీవితంపట్ల ఒక ఆనందాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుందిః
|
ఆదివారమే మనకు ప్రతివారం, నిజమే ఆదివారమే మనకు ప్రతివారం, ఇది ముసలితనం మనకిచ్చిన కొత్త వరం, ఆరునెల్ల పాపలల్లె నవ్వేద్దాం, పకపకలాడేందుకు పళ్ళెందుకు అనుకుందాం, బాదరబంది రిటైరైపోయింది, బాధలబండి షెడ్డుకెళిపోయింది” అన్నారు. ఈ భావన నిజంగానే నగసత్యం. వేళకింత తిని వాలుకుర్చీలో పడుకుని కోడికునుకు తీసేందుకు బోలెడంత తీరికుంది.
ముదిమి అంటే ముసలితనం. ఇది పుట్టిన ప్రతి మనిషికీ జీవిత చరమాంకంలో తప్పదు. ముసలితనం గుణమా?దోషమా? అంటే రెండు విధాలుగా సమాధానం చెప్పవచ్చు. సుఖాలను అనుభవించి, బాధ్యతలు తీరిన వారికి ముదిమి విశ్రాంతి మందిరమే. కష్టాలు కడతేరక, వ్యాధులు పీడిస్తున్నవారికి ముదివి దోషమే కానీ గుణం కాదు. పూర్వం ఒక కవి ఈ ముసలితనాన్ని గూర్చి ఎంత చమత్కారంగా చెప్పాడో చూడండి.
’ఈ ముసలితనం ఏ పుణ్యమూ చేయని మానవుణ్ణి కూడా యమునివలె దండధరుణ్ణిగా, చ్రేతిలో కర్రపట్టుకునే వానిగా, విష్ణువువలె గదాసహితునిగా (గద అంటే రోగం అని మరో అర్ధం), చంద్రునివలె శశాంకునిగా (మచ్చలుగల వానిగా), శివుని వలె విరూపాక్షునిగా (అందాన్ని కోల్పోయిన కన్నులు గలవానిగా) చేస్తుంది.’
ఈ భావనామాధుర్యాన్ని అందించిన శ్లోకం ఇది-
’యమమివ కరధృతదండం హరిమివసగదం శశాంకమివ వక్త్రమ్ శివమివ చ విరూపాక్షం జరా కరోత్యకృత పుణ్యమపి’
యిలా
ఎన్నో, మరెన్నో విషయాలు, ముసలితనం గురించి చెప్పుకుంటే, మనకు బాల్యం నుంచి
వార్థక్వ్యం వరకూ అన్ని ఆశ్రమ విషయాలు చెప్పుకోవచ్చు. మనిషి జన్మనొందినప్పుడే,
బాల్య, యౌవన, కౌమార, వార్థక్య దశలు అంతర్గతంగా సంభావ్యం చేసుకుంటాడు. జంతూనాం
నరజన్మ దుర్లభం అన్నది మానవజన్మ సకల పుణ్యాల ఫలితం వల్లే కదా! పైగా ప్రతీ
జీవరాశి ఈ దశలను అనుభవించడం సృష్టిలో సహజం. అందుకని, మానవజన్మ ప్రాశస్త్యంలో
భాగంగా ముసలితనాన్ని ముగ్ధమోహనంగా భావించుకుంటూ, మన జీవితపు అర్థం,
పరమార్థంతోపాటు కడు సార్థకతని కూడ ఆపాదించుకుని, ముక్తి సోపానాలను
అధిరోహించుకుంటూ మోక్షపర్వాలని కూడ అనుభవిద్దాం.
‘అంతర్జాతీయ
వయోవృద్ధుల దినోత్సవం’ సందర్భంగా ఈ ధరణిలోని వయోవృద్ధుల్ని, జ్ణానవృద్ధుల్ని, తమ
జీవితాలని సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, మరింత సుసంపన్నమైన జీవితాల్ని
అనుభవించడానికి ఆ పరాత్పరుడు ఆశీర్వదిస్తాడని ‘తెలుగురథం’ ప్రార్థిస్తోంది.
కొంపెల్ల
శర్మ – తెలుగు రథం
|
