Tuesday, December 31, 2013

2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు

మా తెలుగుతల్లికి మల్లెపూదండ - మా కన్నతల్లికి మంగళారతులు 
తెలుగురధం
సాహిత్య,సాంస్కృతిక,సామాజిక వికాస సంస్థ 
భాష * సాహిత్యం * సంస్కృతి * కళలు * జనపదం * వికాసం * ఆధ్యాత్మికం 
2016
నూతన సంవత్సర శుభాకాంక్షలు

Monday, July 8, 2013

తెలుగు రథం సంస్థ


తెలుగు రథం సంస్థ



 తెలుగు రథం – సాహిత్య,సాంస్కృతిక,సామాజిక వికాస సంస్థ

2008 నుంచి తెలుగు రథం కార్యక్రమాలు – విశ్లేషణ

భాష /
సాహిత్యం
సంగీతం
ఆధ్యాత్మికం / వేదాంతం / ధార్మికం
ఈ మాసపు చిరస్మరణీయం / మన తెలుగు ఋతువులు
ఇతరములు
2008 కార్యక్రమాలు – 24 అక్టోబర్ 2008 – తెలుగు రథం సంస్థ వ్యవస్థాపకం – ప్రారంభ సభ
2009 కార్యక్రమాలు
1.మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి జయంతి
2. ఆరుద్ర జయంతి
3. విశ్వనాథ సత్యనారాయణ జయంతి
4. గిడుగు వేంకట రామమూర్తి జయంతి – వ్యవహార భాషకు నిండు నూరేళ్ళు
1. ముత్తుస్వామి దీక్షితులు జయంతి
2. తాళ్ళపాకం అన్నమాచార్య జయంతి
3. సద్గురు నారాయణ తీర్థ జయంతి
మన సంగీత శిఖరాలు – తెలుగు తేజాలు -
4. మంగళంపల్లి బాలమురళీకృష్ణ
5. శ్రీపాద పినాకపాణి
6. నూకల చిన సత్యనారాయణ
(జన్మదినోత్సవాలు)
7. యం యస్ సుబ్బులక్ష్మి జయంతి
8. స్వాతి తిరుణాళ్ జయంతి
1. శంకరాచార్య జయంతి – సౌందర్యలహరి
1. మాతృభాషా దినోత్సవం
2. తెలుగు రథం ప్రతిభా పురస్కారం – డా.పుల్లెల శ్రీరామచంద్రుడు
2010 కార్యక్రమాలు
1. శ్రీకృష్ణదేవరాయలు – పట్టాభిషేక పంచశత వర్షోత్సవం – భువనవిజయం కవులపై సాహితీ విశ్లేషణం
2. దాశరథి కృష్ణమాచార్యులు జయంతి
3, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి శతజయతి
1. బాలాంత్రపు రజనీకాంతరావు – లలిత సంగీతానికి నూరేళ్ళు
1. శ్రీరామనవమి
2. శంకరాద్వైతం – విశిష్టాద్వైత రామానుజం
3. మహా వైశాఖి / వైశాఖ పూర్ణిమ
4. హనుమజ్జయంతి
5. శ్రీకృష్ణాష్టమి / జయంతి
6. భక్త జయదేవ
1. పి సి సర్కార్ సీనియర్ జయంతి/
అంతర్జాతీయ ఇంద్రజాల దినోత్సవం
2. అంతర్జాతీయ మహిళా దినోత్సవం
3. ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం/ శివలెంక శంభూప్రసాద్ శతజయంతి
4. తెలుగు రథం – వ్యవస్థాపక దినోత్సవం
5. తెలుగు రథం ప్రతిభా పురస్కారం – శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ, గూడూరు.
6. పశ్చిమ ప్రతిభా సంస్మరణం – పశ్చిమ గోదావరి ప్రతిభా ప్రాభవం
2011 కార్యక్రమాలు
1, పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి
2. మహాకవి శ్రీశ్రీ జయంతి
3. బుచ్చిబాబు జయంతి
తిరుపతి వేంకట కవులు -
4. దివాకర్ల వేంకటావధాని శతజయంతి
5. చెళ్ళ్లపిళ్ళ వేంకట శాస్త్రి – పాండవోద్యోగ విజయం – నాటకానికి నిండు నూరేళ్ళు
6. వానమామలై వరదాచార్యులు శతజయంతి
7. స్థానం నరసింహారావు జయంతి
8. గుర్రం ఝాషువా జయంతి
1. శాస్త్రీయ సంగీతం – కీర్తన గానగోష్ఠి
2. ఈమని శంకర శాస్త్రి జయంతి
1. జిడ్డు కృష్ణమూర్తి జయంతి
2. శ్రీనృసింహ జయంతి
3. కూర్మ జయంతి
4. శ్రీకృష్ణ జయంతి
1 - 12
ఈ మాసపు చిరస్మరణీయం – నెలవారీగా జనవరి-డిసంబరు మధ్య నిర్వహించిన 12 కార్యక్రమాలు
1. శతవసంతాల విశ్వ మహిళా సాధికారత
2. ప్రపంచ అంధుల ఆసరా దినోత్సవం (శాస్త్రీయ సంగీతం)
3. తెలుగురథం – వ్యవస్థాపక దినోత్సవం
4. తెలుగు రథం – వార్షికోత్సవం

2012 కార్యక్రమాల విశ్లేషణ

1. పింగళి లక్ష్మీకాంతం
2. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
3. గిడుగు రామమూర్తి పంతులు (150 జయంతి)
4. గుర్రం ఝాషువా
5. విశ్వనాథ సతనారాయణ
6. మొక్కపాటి నరసింహశాస్త్రి
7. పానుగంటి లక్ష్మీ నరసింహశాస్త్రి
8. బలిజేపల్లి లక్ష్మీకాంతం
1. మైసూరు వాసుదేవాచార్య ఆరాధనోత్సవం
2. ఓలేటి వెంకటేశ్వర్లు  జయంతి
3. తూము లక్ష్మీనరసింహదాసు ఆరాధనోత్సవం
4. ద్వారం వెంకట స్వామి నాయుడు
1. స్వామి వివేకానంద (150 జయంతి/ప్రారంభం)
2. శ్రీరామనవమి
3. గురుపౌర్ణమి
4. అరవింద యోగి
5. వేదసంస్కృతి
1. వసంతం
2. గ్రీష్మం
3. వర్షం
4. శరత్
1. పి సి సర్కార్ – సీనియర్ (శతజయంతి)

2013 కార్యక్రమాల విశ్లేషణ (from 1 January 2013 upto 3 July 2013)
1.చాగంటి సోమయాజులు
2.పుట్టపర్తి నారాయణాచార్యులు శతజయంతి
1.స్వాతి తిరుణాళ్–200వ
జయంతి
2. మన వాగ్గేయకారులకు ‘స్వరాభిషేకం’
3. యం యల్ వసంతకుమారి జయంతి
1. స్వామి వివేకానంద 150వ జయతి (సమాపన సభ)
2. శ్రీ ఆదిశంకరాచార్య జయంతి
3. శ్రీ లక్ష్మీనరసింహ జయంతి
1.హేమంత ఋతువు
2.శిశిర ఋతువు

అందమైన ఆలోచనకు ఆకారం

  అందమైన ఆలోచన ఆకారం ధరించడానికి కావలసిన తొలిమెట్టుకాగితం, కలం తీసుకొని దాని గురించి వ్రాయగలగడమే! అని లీ లాకొక అభిప్రాయం; “మనం పనిని చేపట్టామంటే, అందులో మనం కృతకృత్యులం కాగలిగేది. అలా కాక, మనం చేస్తున్న, చేయబోయే పనిపై మనకే సరైన నమ్మకం లేకుండాపోతే, అదో ఊపిరి లేని జీవనాడి అవుతుందిఅన్న విక్టర్ కియాం భావం సత్యం. ఎటువంటి పనికైనా ఆరంభం ముఖ్యమైన ఘట్టం అవుతుంది అన్న హోరేస్ భావం కూడ నిజం. మూడు భావాలను ముప్పేటలా పెనవేసుకునిపోయి, మా మనసులో, హృదయాల్లో, చాలా కాలంగాతెలుగు రథం సంస్థ ప్రారంభం అయినప్పటినుండితెలుగురథంఅంతర్జాల పత్రికని కూడ నిర్వహించాలన్న సంకల్పం. సంకల్పం సుమారు ఐదేళ్ళ వయసుని పెంచుకుంది.
ఆలోచనకి ఆచరణ రూపం త్వరితమే తీరుసురావాలన్న ధృఢసంకల్పంతోతెలుగు రథంబ్లాగులోనేసాహిత్య, సాంస్కృతిక (అంతర్జాల) పత్రిక రూపాన్ని కొన్నాళ్ళు నిర్వహించి, త్వరలో ఒక సమగ్ర పత్రికగా తీసుకురావాలని మా ఆశ, ఆశయం.
ఈ సందర్భంలో, పత్రిక నిర్వహణలో మీ సలహాలు, సూచనలు అందించవలసిందిగా వినతి.
మీ అందరి ప్రోత్సాహ, ప్రోద్బాలలతో, అందించిన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని, త్వరలో ‘తెలుగు రథం’ పత్రిక అతి త్వరలో మీ ముందుంటుంది.
కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగు రథం సంస్థ ద్వారా తెలుగు రథం – సాహిత్య, సాంస్కృతిక పత్రిక త్వరలో విడుదల
kbssarma@gmail.com



తెలుగు రథం సంస్థ,



తెలుగురథం 
 

సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ
 
 'తెలుగు రథం సంస్థ' ద్వారా
'తెలుగు రథం' – సాహిత్య, సాంస్కృతిక- (అంతర్జాల)
పత్రిక త్వరలో విడుదల
  
 
 
మంచి ఆలోచనకు శ్రీకారం

హైదరాబాద్ లో 24 అక్టోబర్ 2008 (ఆశ్వయుజ బహుళ ఏకాదశి) జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డా. సి నారాయణరెడ్డి గారి చేతులమీదుగాతెలుగు రథం” – సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ - ప్రారంభమైనది. భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, జనపదం, వికాసం, ఆధ్యాత్మికం అనే ఏడు రంగాలను ఎన్నుకుని, సప్తాశ్వ రథ ప్రేరణతో 'తెలుగురథం' సంస్థను ప్రారంభించాము. ఈ సేవారంగాలను ప్రాథమికంగా అనుసరిస్తూ, తదితర రంగాలను కూడ స్పృశిస్తూ, - వీటిని – ప్రస్తావన, ప్రవేశం, ప్రతిభ, ప్రయోగం, పరిశీలనం, ప్రస్తారం, ప్రభావం – అన్న ప్రస్థాన శైలిలో ఆయా రంగాలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించాం.

 
ఆశయాలకు ఆచరణ ప్రక్రియలు

ఆరోజు నుంచి, నేటి వరకూ, ప్రతీ నెలా క్రమం తప్పకుండా కార్యక్రమాలను సత్ప్రమాణాలను పాటిస్తూ, భాషా సాహిత్య కళాభిమానులను ఉల్లాసపరిచే విధంగా రూపొందించుకుంటూ తదనుగుణంగా నిర్వహించడంలో గణనీయమైన విజయాన్ని 5 సంవత్సరాల కాల పరిధిలో సాధించుకున్నాము

‘తెలుగు రథం’ 2008-12 మధ్య నిర్వహించిన కార్యక్రమాల వివరాలను విశ్లేషణాత్మకంగా పొందుపరుస్తున్నాం.

 
ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు

కాలాన్ని మా తెలుగురథం పై విజ్ణాన, విహార, వికాసయాత్ర చేయించాలన్నది మా ఆశ, ఆశయం, ఆకాంక్ష. మన మాతృభాష ‘తెలుగు’ లో విశ్లేషణకు మేము సైతం ముందడుగు వేసే సంకల్పం, ప్రయత్నం కూడ చాలవరకూ సఫలీకృతమైనదనే పలువురు – పలు రంగాల్లోని ప్రముఖులు విశ్లేషించడం మాకు కించిత్తు గర్వకారణంగానే వున్నా, మేము ఆ బాధ్యతని మరింత సవాలుగా తీసుకుని, భావి ప్రణాళికలను నిర్మాణం కావించుకుంటున్నాం.    మా ప్రణాళికలు, సూచనలు, సలహాల మేరకు, ఈ విధంగా రూపొందించుకున్నాం.

తెలుగురథం – ఆకాంక్షలు, ఆశయాలు, ఆలోచనలు, ఆచరణలు

·        భాషా, సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాలను, ప్రతిభావంతుల జీవన వ్యక్తిత్వాలను ప్రస్తుతించడం

·        సాహితీమూర్తులు, బహుముఖరంగాల్లోని ప్రతిభావంతుల జయంతి/వర్థంతి, శతజయంత్యుత్సవాల సభల నిర్వహణ

·        శాస్త్రీయ, లలిత, జానపద సంగీత శాఖలపై ప్రత్యేక దృష్టి – వాగ్గేయకారుల జయంతి/వర్థంతి/ఆరాధనోత్సవాలు

·        అంతర్జాతీయ/జాతీయ/రాష్ట్ర స్థాయిలో ప్రముఖ సంఘటలపై ప్రత్యేక కార్యక్రమాలు

·        విద్యార్థులతో మమైకమై – స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా – వ్యక్తిత్వ వికాస సభలకి శ్రీకారం

·        జనపద, వికాస రంగాల్లోకి ప్రస్థానం

·        జిల్లాల్లోకి సైతం కొనసాగిస్తున్న ప్రస్థానం, స్థానిక సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాలు

·        సాహిత్య ప్రక్రియలు, ప్రముఖ సాహిత్య రచనలు, పురస్కారం పొందిన రచనలు, కవులపై ప్రత్యేక విశ్లేషణలు; జంట కవులు/కవిత్వంపై ప్రత్యేక విశ్లేషణం/సందేశ, దౌత్య కావ్యాలపై ప్రత్యేక దృష్టి

·        సంగీత ప్రక్రియలు/వాద్య పరికరాలపై విశ్లేషణలు

·        ఈ మాసపు చిరస్మరణీయం – ప్రతీ మాసంలో ప్రత్యేకతలు, పండుగలు, జయంతి/వర్థంతుల పై నెలవారీ కార్యక్రమాలు

·        మన తెలుగు ఋతువులు – ఆయా ఋతుచక్రంలోనే ఋతు ప్రత్యేకతలు, విశ్లేషణలు

·        చాంద్రమాన కాలం – తెలుగు మాసాల ప్రత్యేకతలు, పర్వదినాలపై కార్యక్రమాలు

·        సహ సంస్థలతో భాగస్వామ్యం వహిస్తూ ఉమ్మడి ఆశయాల మేరకు కార్యక్రమాలు

·        ‘తెలుగు రథం’ ప్రతిభా పురస్కారాలు

 

అందమైన ఆలోచన ఆకారం ధరించడానికి కావలసిన తొలిమెట్టుకాగితం, కలం తీసుకొని దాని గురించి వ్రాయగలగడమే! అని లీ లాకొక అభిప్రాయం; “మనం పనిని చేపట్టామంటే, అందులో మనం కృతకృత్యులం కాగలిగేది. అలా కాక, మనం చేస్తున్న, చేయబోయే పనిపై మనకే సరైన నమ్మకం లేకుండాపోతే, అదో ఊపిరి లేని జీవనాడి అవుతుందిఅన్న విక్టర్ కియాం భావం సత్యం. ఎటువంటి పనికైనా ఆరంభం ముఖ్యమైన ఘట్టం అవుతుంది అన్న హోరేస్ భావం కూడ నిజం. మూడు భావాలను ముప్పేటలా పెనవేసుకునిపోయి, మా మనసులో, హృదయాల్లో, చాలా కాలంగాతెలుగు రథం సంస్థ ప్రారంభం అయినప్పటినుండితెలుగురథంఅంతర్జాల పత్రికని కూడ నిర్వహించాలన్న సంకల్పం. సంకల్పం సుమారు ఐదేళ్ళ వయసుని పెంచుకుంది.

ఆలోచనకి ఆచరణ రూపం త్వరితమే తీరుసురావాలన్న ధృఢసంకల్పంతోతెలుగు రథంబ్లాగులోనేసాహిత్య, సాంస్కృతిక (అంతర్జాల) పత్రిక రూపాన్ని కొన్నాళ్ళు నిర్వహించి, త్వరలో ఒక సమగ్ర పత్రికగా తీసుకురావాలని మా ఆశ, ఆశయం.

ఈ సందర్భంలో, పత్రిక నిర్వహణలో మీ సలహాలు, సూచనలు అందించవలసిందిగా వినతి.
 
మీ అందరి ప్రోత్సాహ, ప్రోద్బాలలతో, అందించిన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని, త్వరలో ‘తెలుగు రథం’ పత్రిక అతి త్వరలో మీ ముందుంటుంది.
 
కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగు రథం

kbssarma@gmail.com