Monday, July 8, 2013

తెలుగు రథం సంస్థ,



తెలుగురథం 
 

సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ
 
 'తెలుగు రథం సంస్థ' ద్వారా
'తెలుగు రథం' – సాహిత్య, సాంస్కృతిక- (అంతర్జాల)
పత్రిక త్వరలో విడుదల
  
 
 
మంచి ఆలోచనకు శ్రీకారం

హైదరాబాద్ లో 24 అక్టోబర్ 2008 (ఆశ్వయుజ బహుళ ఏకాదశి) జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డా. సి నారాయణరెడ్డి గారి చేతులమీదుగాతెలుగు రథం” – సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ - ప్రారంభమైనది. భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, జనపదం, వికాసం, ఆధ్యాత్మికం అనే ఏడు రంగాలను ఎన్నుకుని, సప్తాశ్వ రథ ప్రేరణతో 'తెలుగురథం' సంస్థను ప్రారంభించాము. ఈ సేవారంగాలను ప్రాథమికంగా అనుసరిస్తూ, తదితర రంగాలను కూడ స్పృశిస్తూ, - వీటిని – ప్రస్తావన, ప్రవేశం, ప్రతిభ, ప్రయోగం, పరిశీలనం, ప్రస్తారం, ప్రభావం – అన్న ప్రస్థాన శైలిలో ఆయా రంగాలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించాం.

 
ఆశయాలకు ఆచరణ ప్రక్రియలు

ఆరోజు నుంచి, నేటి వరకూ, ప్రతీ నెలా క్రమం తప్పకుండా కార్యక్రమాలను సత్ప్రమాణాలను పాటిస్తూ, భాషా సాహిత్య కళాభిమానులను ఉల్లాసపరిచే విధంగా రూపొందించుకుంటూ తదనుగుణంగా నిర్వహించడంలో గణనీయమైన విజయాన్ని 5 సంవత్సరాల కాల పరిధిలో సాధించుకున్నాము

‘తెలుగు రథం’ 2008-12 మధ్య నిర్వహించిన కార్యక్రమాల వివరాలను విశ్లేషణాత్మకంగా పొందుపరుస్తున్నాం.

 
ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు

కాలాన్ని మా తెలుగురథం పై విజ్ణాన, విహార, వికాసయాత్ర చేయించాలన్నది మా ఆశ, ఆశయం, ఆకాంక్ష. మన మాతృభాష ‘తెలుగు’ లో విశ్లేషణకు మేము సైతం ముందడుగు వేసే సంకల్పం, ప్రయత్నం కూడ చాలవరకూ సఫలీకృతమైనదనే పలువురు – పలు రంగాల్లోని ప్రముఖులు విశ్లేషించడం మాకు కించిత్తు గర్వకారణంగానే వున్నా, మేము ఆ బాధ్యతని మరింత సవాలుగా తీసుకుని, భావి ప్రణాళికలను నిర్మాణం కావించుకుంటున్నాం.    మా ప్రణాళికలు, సూచనలు, సలహాల మేరకు, ఈ విధంగా రూపొందించుకున్నాం.

తెలుగురథం – ఆకాంక్షలు, ఆశయాలు, ఆలోచనలు, ఆచరణలు

·        భాషా, సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాలను, ప్రతిభావంతుల జీవన వ్యక్తిత్వాలను ప్రస్తుతించడం

·        సాహితీమూర్తులు, బహుముఖరంగాల్లోని ప్రతిభావంతుల జయంతి/వర్థంతి, శతజయంత్యుత్సవాల సభల నిర్వహణ

·        శాస్త్రీయ, లలిత, జానపద సంగీత శాఖలపై ప్రత్యేక దృష్టి – వాగ్గేయకారుల జయంతి/వర్థంతి/ఆరాధనోత్సవాలు

·        అంతర్జాతీయ/జాతీయ/రాష్ట్ర స్థాయిలో ప్రముఖ సంఘటలపై ప్రత్యేక కార్యక్రమాలు

·        విద్యార్థులతో మమైకమై – స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా – వ్యక్తిత్వ వికాస సభలకి శ్రీకారం

·        జనపద, వికాస రంగాల్లోకి ప్రస్థానం

·        జిల్లాల్లోకి సైతం కొనసాగిస్తున్న ప్రస్థానం, స్థానిక సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాలు

·        సాహిత్య ప్రక్రియలు, ప్రముఖ సాహిత్య రచనలు, పురస్కారం పొందిన రచనలు, కవులపై ప్రత్యేక విశ్లేషణలు; జంట కవులు/కవిత్వంపై ప్రత్యేక విశ్లేషణం/సందేశ, దౌత్య కావ్యాలపై ప్రత్యేక దృష్టి

·        సంగీత ప్రక్రియలు/వాద్య పరికరాలపై విశ్లేషణలు

·        ఈ మాసపు చిరస్మరణీయం – ప్రతీ మాసంలో ప్రత్యేకతలు, పండుగలు, జయంతి/వర్థంతుల పై నెలవారీ కార్యక్రమాలు

·        మన తెలుగు ఋతువులు – ఆయా ఋతుచక్రంలోనే ఋతు ప్రత్యేకతలు, విశ్లేషణలు

·        చాంద్రమాన కాలం – తెలుగు మాసాల ప్రత్యేకతలు, పర్వదినాలపై కార్యక్రమాలు

·        సహ సంస్థలతో భాగస్వామ్యం వహిస్తూ ఉమ్మడి ఆశయాల మేరకు కార్యక్రమాలు

·        ‘తెలుగు రథం’ ప్రతిభా పురస్కారాలు

 

అందమైన ఆలోచన ఆకారం ధరించడానికి కావలసిన తొలిమెట్టుకాగితం, కలం తీసుకొని దాని గురించి వ్రాయగలగడమే! అని లీ లాకొక అభిప్రాయం; “మనం పనిని చేపట్టామంటే, అందులో మనం కృతకృత్యులం కాగలిగేది. అలా కాక, మనం చేస్తున్న, చేయబోయే పనిపై మనకే సరైన నమ్మకం లేకుండాపోతే, అదో ఊపిరి లేని జీవనాడి అవుతుందిఅన్న విక్టర్ కియాం భావం సత్యం. ఎటువంటి పనికైనా ఆరంభం ముఖ్యమైన ఘట్టం అవుతుంది అన్న హోరేస్ భావం కూడ నిజం. మూడు భావాలను ముప్పేటలా పెనవేసుకునిపోయి, మా మనసులో, హృదయాల్లో, చాలా కాలంగాతెలుగు రథం సంస్థ ప్రారంభం అయినప్పటినుండితెలుగురథంఅంతర్జాల పత్రికని కూడ నిర్వహించాలన్న సంకల్పం. సంకల్పం సుమారు ఐదేళ్ళ వయసుని పెంచుకుంది.

ఆలోచనకి ఆచరణ రూపం త్వరితమే తీరుసురావాలన్న ధృఢసంకల్పంతోతెలుగు రథంబ్లాగులోనేసాహిత్య, సాంస్కృతిక (అంతర్జాల) పత్రిక రూపాన్ని కొన్నాళ్ళు నిర్వహించి, త్వరలో ఒక సమగ్ర పత్రికగా తీసుకురావాలని మా ఆశ, ఆశయం.

ఈ సందర్భంలో, పత్రిక నిర్వహణలో మీ సలహాలు, సూచనలు అందించవలసిందిగా వినతి.
 
మీ అందరి ప్రోత్సాహ, ప్రోద్బాలలతో, అందించిన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని, త్వరలో ‘తెలుగు రథం’ పత్రిక అతి త్వరలో మీ ముందుంటుంది.
 
కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగు రథం

kbssarma@gmail.com

No comments: