మహర్షి వాల్మీకి - జయంతి
వాల్మీకి మహర్షి కథనం మనకు స్కాంద పురాణంలో వివరించబడింది. వాల్మీకిముని వౄత్తాంతాన్ని సనత్సుజాతుడిని వేదవ్యాస ఆడుగుతాడుట. సంస్కౄతంలో ఆదికవిగా వాసిగాంచిన వాల్మీకి రామాయణాన్ని వ్రాషాడు. వాల్మీకి నిజ నామధేయం అగ్నిషర్మగా చెప్పబడింది. తల్లిదండ్రులు కౌషికి, సుమతి. అగ్నిషర్మ బాల్యంలో వేదాభ్యాసం సరిగ్గా చేయకపోవడం, తల్లిదండ్రులు వార్థక్యంలో ఆ గ్రామంలో క్షామం దాపురించడం, ఫలితంగా తిండికోసం, దైనందిక జీవితంకోసం దారిదొంగగా మారాడని ప్రస్తావించబడింది. అలా దొంగతనం చేస్తూండగా ఆ మార్గంలో వస్తున్న సప్తౠషుల్లో ప్రముఖుడైన అత్రి మహర్షిచేత అగ్ని ప్రశ్నింపబడగా, తన కుటుంబం తాను చేస్తున్న పాపాన్ని భరిస్తారో లేదో కనుగొనమన్నాడు. అగ్నిషర్మ కుటుంబ సభ్యులను వాకబు చేయగా, ఆయాకర్మలను వారు పంచుకోమని చెప్పినారట. ఈ విషయాన్ని తిరిగి సప్తౠషులకు విన్నవించి, అత్రి మహర్షి మోక్షప్రాప్తికి ధ్యానం చెయ్యమని, రామ నామాన్ని తిరగేసి, 'మరా' అని బోధించి, నామజపం చెయ్యమన్నాడు. చాలా కాలం తదుపరి, అత్రి మహర్షి వెళ్ళుతున్న దారిలో ఒక చీమలపుట్ట కనిపించడం, అక్కడ అగ్నిషర్మని గ్రహించడం, వల్మీకంనుంచి వచ్చినందున, 'వాల్మీకీ అయ్యాడని చెప్పడం జరిగిందిట.
ప్రచేతనుడి పదవ పుత్రుడు ఆదికవి అని పిలువబడే వాల్మీకి మహర్షి సంస్కౄత సారస్వతానికి మూలపురుషుడే కాక, పంచమవేదంగా భావించబడుతున్న ష్రీమద్రామాయణ మహాకావ్యకర్త. ఈయన జీవనకాలాన్ని ఖచ్చితంగా నిర్థారించలేకకపోతున్నా, పాష్చాత్య పరిషోధకులు క్రీస్తుపూర్వం నాలుగువేలు మొదలు రెండువేల సంవత్సరాల మధ్యకాలం నాటివాడని, భారతభూమిలో రామరావణయుద్ధం జరిగిందని ఒక అపూర్వ విష్వాసం. ఒక భావన ప్రకారం త్రేతాయుగంలో యుద్ధం జరిగిందనీ, ఆ యుగానంతరం ఆరు లక్షల సంవత్సరాల ద్వాపర యుగం కూడ పూర్తవడం, ప్రస్తుత కలియుగం ప్రారంభమై ఐదువేల సంవత్సరాలు పైగా నడుస్తున్న ప్రస్తుత కాల నేపథ్యంలో, వాల్మీకి ఆకాలం నాటివాడు కాదని చెప్పడం కూడ జరిగిన వైనాలు చరిత్రలో భాగమయ్యాయి. సంస్కౄత యితిహాస పర్వాల్లో వాల్మీకి
ోళా షబ్దం చోర సంస్కౄత షబ్దంగా మారి వుండవచ్చనీ, చోళులు దారులు కొట్టి నివసించేవారనీ, అర్థ పరిణామం ద్వారా భావన కలిగింది. చోళ జాతికి చెందడం వల్ల చోరుడిగా, దోపిడీకాడని కథ ప్రచారంలోకి వచ్చియుండవచ్చు అని మరియొక భావన. రామాయణమును బట్టి వాల్మీకి కవి ఆష్రమం గంగానది సమీపంలో తమసానదీతీరంలో వున్నదని ఒక కథనం. కాని అతని ఆష్రమం గంగానది కాక ఇప్పటి బుందేల్ఖండ్క్ లోని బందాజిల్లాలో అలహాబాదు సమీపంలో యమునానది తీరంలో ఒక పర్వతంమీద వుండేదని ఒక వాదన. ఇదే చిత్రకూట పర్వతమనీ కొన్ని రామాయణ ప్రతుల్లో దర్షనీయమవుతుంది. ఈ భావం నిజమనిపిస్తే, వాల్మీకి ఆష్రమం అయోధ్య సమీపంలో వుండేది. అందువలన, వాల్మీకిని రామునికి సమకాలికునిగా కల్పనచేసి వుంటారు. వాల్మీకి రామాయణంలో ప్రస్తావన చేసిన స్థల జాతులను బట్టి దేషంలోని ఒరిస్సా, గోదావరి ప్రాంత ప్రదేషాలతోనే పరిచయమున్నట్లు తెలుస్తున్నది. కాబట్టి వాల్మీకి తూర్పు, దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాలకు చెందినవాడనే అని చెప్పవచ్చును అని బహు పరిషోధకుల భావం. బోయ కుటుంబంలో జీవనం గడుపుతుండగా, ఒకరోజు నారదముని ఆ త్రోవలో వెళ్ళుచుండగా ఆయనను ఆ బోయవాడు ఆపాడు. నారదుడు మాత్రం తనదగ్గర కేవలం తంబూర తప్పితే వేరే ఏమీ లేదు అని చెప్పినా, తంబూరనే లాక్కున్నాడు మన బోయవాడు. యిలా చేసిన పని పాపం కాదా అని నారదుడు అడగడం, చేస్తున్న పనిలో భార్యకు భాగస్వామ్యం ఉందా అని అడగడం, భార్యని సంప్రదించిన పిమ్మట తనకు ఏమీ సంబంధం లేదు అని చెప్పడం ద్వారా జ్ౙానోదయం కలిగి, ముక్తిని అందుకునే ప్రయత్నంలో నారదుడే రామనామజపం చేయమని చెప్పడం కలిగింది. ఫలితంగా ఓ బోయవాడు వౄక్షం కింద తపస్సుని ఆచరించడం అనంతమైన నిష్చల తపస్సులో నుండగా చుట్టూ వున్న చీమలు ఈయన మీదనే పుట్టలు పెట్టడం, అందుకుగాను వల్మీకము అంటే పుట్టనుండి వచ్చినవాడు కనుక వాల్మీకుడు అన్న పేరు సార్థకం జరిగింద
వాల్మీకి రామాయణకర్త అనటంలో సందేహం లేదు. వాల్మీకి మొదట కిరాతకుడు, దారులు కొట్టి దొంగగా జీవించేవాడయినా, హఠాత్తుగా జరిగిన సంఘటన మూలాన అతనిలో హౄదయంలో మార్పు సంభవించిందన్న భావం ఐతిహ్యం. ఆధ్యాత్మ రామాయణంలో వాల్మీకి మొదట బ్రాహ్మణుడే కాని, పైన వివరించినట్లు అగ్నిషర్మ, ప్రచేతనుడి పుత్రుడుగాను చెప్పబడడంతో సరిపోతున్నా, కిరాతకుల్లో కలిసిపోయి షూద్రస్త్రీని వివాహమాడి సంతానాన్ని పొందాడనీ, దొంగగా జీవిస్తూండగా, సప్తర్షులవల్ల అతనిలో మార్పు వచ్చిందని చెప్పబడింది. తైత్తిరీయ ప్రాతిషాఖ్యంలో వాల్మీకిని ఓ పదకారునిగా పేర్కొనబడింది. ప్రాచీన భారతదేషపు తూర్పు సముద్రతీరభాగమంతా చోళమండలంగా పేర్కొనబడడం, బ్రిటిష్ కాలంలో అది కోరమండలంగాను మారింది. ఈ సముద్ర తీరప్రాంతవాసులను చోళులని, క్రమేపీ 'చో. వాల్మీకి రామాయణము రచించుటకు కేవలం నారదుడే ముఖ్య కారణం అని కూడ భావిస్తారు. నారదుని ద్వారానే క్లుప్తంగానే రామాయణగాథ యిరవైనాలుగు వేల ష్లోకాలతో రచించడం జరిగింది. రామాయణ కావ్యంలో ప్రతి వెయ్యి ష్లోకాలకు ముందక్షరంగా గాయత్రీ మహామంత్రంలోని ఒక్కో అక్షరం పెట్టి గాయత్రీమంత్రంలోని యిరవైనాలుగు అక్షరాలు రామాయణ కావ్యంలో పొందుపరచాడు. 'రా' అంటే యింతవరకూ చేసిన పాపాలు, 'మా అంటే యిక ముందు చేసే పాపాలు పోతాయని 'రామా షబ్దం అంత అర్థం ఈ రామనామ మహత్తరమైనదంటారు. ష్రీరామచంద్రుడు వాల్మీకి సమకాలికుడు అవ్వడం మూలానే, ష్రీరామ జననం నుండి లవకుషల పట్టాభిషేకం వరకూ ప్రత్యక్ష రాముని జీవితాన్ని చూసినందువల్ల, రామాయణ కావ్యాన్ని రచించాడని ఒక ప్రబలమైన విష్వాసం. ష్రీరామ పట్టాభిషేకం తర్వాత, చాకలివాడి పరుషవాక్యాల ఫలితంగా రాముడు సీతను అడవులకు పంపించడం, ఈయన ఆష్రమంలోనే సీతకు ఆష్రయం కల్పించడం, లవకుశల జన్మకథనం, యుక్తవయసు వచ్చే వరకు జాతకకర్మలు, షస్త్రాస్తర మహావిద్యలు నేర్పిన గురువు వాల్మీకే అని ప్రబల విష్వాసం. యిలా వాల్మీకి - రామాయణం ఉభయతారకంలా వెలిసిపోయాయి, భారతీయ సంస్కౄతిలో భాగంగా చరిత్రాత్మక కథనంగా మారిపోయింది. వాల్మీకి ప్రత్యక్ష సంబంధం మాత్రం ఉత్తరకాండ, ఉత్తరరామాయణం ద్వారా తెలుస్తుంది. ఉత్తరకాండని వాల్మీకి రాయలేదని మరియొక సిద్ధాంతం. రామాయణ పఠనం, రామభజన, రామకోటి వ్రాయడం భారతీయ ఐతిహాసక సంస్కౄతీరూపంలో ప్రముఖ భాగంగా చిరస్థాయిగా సుప్రతిష్ఠగావించబడింది. వాల్మీకి సంస్కౄత సాహిత్య సేవ వాల్మీకి వర్ణించిన ప్రకౄతియే ఈనాటి కవులకు వర్ణ్య వస్తువైనది భారతీయ సాహిత్యములలో ప్రయోగములు ఛందస్సు భారతీయ సాహిత్యములలో సంస్కౄత సాహిత్యమే అతి ప్రాచీనమైనది; అన్నిటికన్న సంపన్నమైనది. భారతదేషములోని సమస్త భాషాసాహిత్యములపైన దీని ప్రభావమున్నది. వైదిక ౠక్కులు మాత్రాఛ్ఛందస్సులో వెలువడినవి. వైదిక ౠక్కులపై ఛందోవిషయికముగా చేసిన సరిక్రొత్త ప్రయోగము వాల్మీకి రామాయణము. ఈ కావ్యమునకు ముందు అనుష్టుప్క్ ఛందస్సు కథా కథనమునకు, కావ్యరచనకు ఉపయోగపడలేదు. వాల్మీకి తన కావ్యమును 'తాళబద్దాక్షరసమం, తంత్రీలయ సమన్వితం, కావ్య మేతన్మయాకౄతమ్క్' అని చెప్పుకొన్నాడు. లౌకిక వాంగ్మయమున ఛందస్సులో నిర్మితమైన ప్రప్రథమ కావ్యము వాల్మీకి రామాయణమే. 'ఆమ్నాయా న్నూతనోయం ఛందసామవతార:' అని భవభూతి ఉత్తర రామాచరిత్రమున వాల్మీకి రామాయణము యోక్క నూతనత్వమును ప్రస్తుతించెను. అనుష్టుప్క్ ఛందస్సునకు మంచి పుష్టిని ప్రసాదించినవాడు వాల్మీకి. వాల్మీకి తర్వాత ఛందస్సులో గొప్ప నవ్యత చూపినవాడు కాళిదాసు. వస్తువు
యన్నది రామాయణముతోనే ప్రారంభమైనది. సీతాపహరణాంతరము రామచంద్రుడు బిల్వార్జున తిలక తాళ చూతాషోకాది వౄక్షములను, గజవ్యాఘ్రమౄగాదిజంతువులను పేరుపేరున పిలిచి త
ఇతివౄత్తముతో కూడుకొనిన మొదటి కావ్యము వాల్మీకి రామాయణము. అందులోని వస్తువు ఐతిహాసికము. వాల్మీకి తరువాత కాళిదాసే వస్తువరణములో చక్కని ప్రయోగములు చేసెను. ఆదికవులు సంస్కౄత కవిత్వమునకు వాల్మీకి వలె, తెలుగు కవిత్వమునకు నన్నయ్య, ఇంగ్లీషు కవిత్వమునకు చాసర్ ఇంచుమించుగా ఆదికవి. కవిత్వ స్వరూపము - సంస్కౄత లాక్షణికుల సిద్ధాంతము సంస్కౄతాలంకారికుల్లో ముఖ్యులైనవారి సిద్ధాంతములను అలంకారవాదులు, రసవాదులు కనిపిస్తారు. మహాకవి వాల్మీకి సైతము ఓకటిరేండు చోట్ల అలంకార ప్రీతితో కావ్యాత్మను ఆవిష్కరించినాడని కొందరు విమర్షకులు అభిప్రాయపడిరి. కవిత్వము - ఆవేషము కవిత్వమంతయు ఆవేష హఠాదుద్గమనమువలన రచింపబడినది కాదు. 'మనిషాదా అను షోకమొక్కటి వాల్మీకి ముఖమునుండి ఆవేశ ప్రోద్బలమువలన ఉద్గతము కావచ్చును. రామాయణమంతయు అట్లే రాలేదు. అది నెమ్మదిగా కూర్చుండి ఆలోచనా పూర్వకముగా రచించినది. ప్రపంచములోని మహాకావ్యములైన 'ఒడిస్సీ' మొదలైనవన్నియు ఈ పద్ధతిలోనే రచింపబడినవి. కావున కవిత్వ రచనకు హౄదయమే కాక మేధ కూడ అత్యవసరం. ఆవేషమును నిగ్రహించికొని దానిని రసస్నాతమొనర్చి సుందరమైన పదజాలములో ప్రకటించినప్పుడే ఉత్తమకవిత్వ మవతరించును. ప్రాచీనకావ్యములు - రామాయణంలో 'ప్రకౄతీ ఆదికావ్యమైన రామాయణములో ప్రకౄతి వర్ణన సర్వతోముఖముగా భాసించినది. ప్రకౄతిని అంగిగా చేసికొని రచింపబడిన ప్రాచీనకావ్యములలో కాళిదాసు - ౠతుసంహారం గణనీయమైనది. కాళిదాసాదులు చేసిన ప్రకౄతి చిత్రణపై వాల్మీకి ప్రభావమేయున్నది. వాల్మీకి రామాయణము లోని ప్రకౄతి వర్ణనల స్వభావము కడు రమణీయం. రాముడరణ్యములకు వెడలిపోవుచుండగా అయోధ్యా పట్టణ బాహ్యోద్యానములు విలపించినట్లు వాల్మీకి వర్ణించాడు. మొదట ప్రమత్తములుగా ప్రముదితముగానుండిన ఉద్యానములు రామునిస్థితినిగని దారిపొడుగునా ఆకులురాల్చుచు తమ దు:ఖమును వెల్లడించినవట. పాత్రతో ప్రకౄతి సానుభూతి చూపిన సందర్భం. సానుభూతి చూపుటయేకాక ప్రకౄతి కథాగతికి తోడ్పడినట్లు వర్ణించిన సందర్భములు కూడ రామాయణములో నున్నవి. సీతను రావణుడపహరించినపిమ్మట, రాముడు పర్ణషాల సమీపమున ఆమె కొరకు దీనముగా దిక్కులు చూచుచుండగా అచ్చటి లేళ్ళు ఆయనకు మార్గము చూపించినట్లు వర్ణింపబడినది. ఉత్తమ పాత్రలకన్యాయము జరిగినప్పుడు ప్రకౄతిరసనమును ప్రకటించినట్లు వర్ణింపబడిన సందర్భములుగూడ రామాయణములోనున్నవి. రావణుడు సీతాదేవి యెడల చేయుచున్న ముష్కరత్వమునకు వాయువు వీవలేదని, సూర్యుడు కాంతివిహీను డైనాడని వర్ణించి వాల్మీకి ఈ అభిప్రాయమునే ప్రకటించెను. ప్రకౄతిని సంబోధించి స్వవిషయము చెప్పుకొనుట - ప్రకౄతి ఆత్మ విషయములను చెప్పుకొనుటనసీత యెక్కడున్నది ప్రష్నించెను. రావణుడపహరించి తీసికొనిపోవునప్పుడు గోదావరిని, వనదేవతలను సంబోధించి సీతాదేవి తన దు:ఖమును వెల్లడించుకొనెను. నవ్యకవులు కొంతవరకు వాల్మీకికి సన్నిహితులు. వాల్మీకి - రామాయణం రామాయణాన్ని రచించిన కవి వాల్మీకి. వాల్మీకి గంగాతీరంలో నివసిస్తూ రామాయణాన్ని లవకుషులకు చెప్పాడని, వారు దాన్ని రాముని అష్వమేధయాగషాలల్లో గానం చేషారని రామాయణంలోనే చెప్పబడింది. రామాయణంలో యిరవైనాలుగు వేల ష్లోకాలు, ఏడు కాండలుగా విభజించబడ్దాయి అని, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తర కాండలు అన్నది సుపరిచితం. రామాయణమును ఐదువందల సర్గలుగా రచించినట్లు బాలకాండలోని ష్లోకం వివరిస్తోంది. 'ఆదిప్రభౄతివై రాజన్క్ పంచసర్గ షతాని చ, కాండాని షట్ కౄతాని సోత్తరాణి మహాత్మనా' అన్నది ఒక విధానం. భారతీయ సంప్రదాయానుసారంగా రామాయణాన్నంతా వాల్మీకి రచించినట్లు, రామాయణ వౄత్తాంతం జరగకముందే భవిష్యత్తులో జరుగబోయే కథనంతా నారదుడు వాల్మీకి చెప్పినట్లు, బ్రహ్మ ఆదేషానుసారంగా నారదుడు చెప్పినదాన్ని వాల్మీకి కావ్యంగా వ్రాసినట్లు తెలియవస్తోంది. ఆనంద వర్ధనుని వంటి అలంకారికులు వాల్మీకియే ఉత్తరకాండతో సహా ఏడు కాండలు గల రామాయణాన్ని రచించాడని కూడా అంగీకరించారు. వాల్మీకి అనుష్టుపు ఛందస్సులోనే రచించాడని, మిగతా ఛందస్సులు ప్రక్షిప్తాలని అంగీకరించినట్లయితే, అనేక అందమైన ష్లోకాలు వాల్మీకి విరచితం కాదని కూడ చెప్పవలసివస్తుంది అని మరో తరహా పండితుల భావం. వాల్మీకి బౌద్ధ దషరధ జాతక కథను గ్రహించి గ్రీకు మహాకావ్యం ఇలియడ్క్ ఆధారంగా విస్తరింపచెసి కావ్యంగా రచించాడని వేబర్ అభిప్రాయం. దీనికీ వేర్వేరు అభిప్రాయాలున్నాయి. రామాయణం రచన, రచనాకాలం, కథలో రూపాంతరాలు, షైలి, సమకాలీన సమాజ చిత్రణాది అంషాల్లో విభిన్నాభిప్రాయాలున్నా, జానపదులు సౄష్టించుకున్న ఆధ్యాత్మ రామాయణంతో పాటు, రామాయణము లోక ప్రియత్వం, మహాకావ్యత్వం నిరంతరం సంపాదించుకుంది, భారతీయ ఐతిహాస ధర్మ పరంపరకు సాక్షం, సంకేతం, దర్షనీయమైన దర్పణం అని ఘంటాపథంగా చెప్పాలి. ఏది ఏమైనా, రామాయణంలో అనేక కావ్య ప్రయోగాలున్నా, మానవ జీవితానికి ఎంతో ప్రయోజనమున్న కావ్యమన్నది నిర్వివాదాంషం. అలనాటి ఆర్య సంస్కౄతి వింధ్య పర్వతాలను దాటి దక్షిణాపథానికి వ్యాపించని స్థితిగతుల్లో, ఆనాటి ఉత్తర దక్షిణ భారతదేష స్వరూప స్వభావాలను చరిత్ర వ్రాసినా, మహాకావ్యంగా రూపొందించినా, వాల్మీకి మహర్షి గావించినది అఖండ అపూర్వ అపురూప కౄషి సాధనల సమన్వయం. వాల్మీకి చిత్రం కూడ రసమయం
తెలుగురథం షత సహస్ర సాహితీ సంస్కౄతీ నివాళులను, నీరాజానలను సమర్పించుకుంటోంది.
జుపిటర్ సంస్థ నందమూరి తారక రామారావు నాయకత్వంలో, సముద్రాల రాఘవాచార్యగారి రచనలో 1963 లో ప్రముఖ దర్షకుడు సి యస్ రావు దర్షకత్వంలో వచ్చిన చిత్రం కూడ సాహితీవిలువలను కూడుకుంది. ఓం నమోనారాయణాయ, కాంతుడు ప్రాణముగ నెంచు కన్నెవలపు, జయజయజయ నటరాజా భుజగషయన, తలచినంతనే సకలతాపసములణచి పాపలకైన, రాతిగుండెయెనీది మారాడవేల మూగనోములు, ష్రీ రామాయణ కావ్యకధ జీవనతారక మంత్రసుధా, హరేనారాయణా పావనా సౄష్టిస్థితినిలయ మూలకారణా, హరియే వెలయునుగా భువిని హరయే వెలయునుగా, ముదము కనేదెపుడే మదిలోని ఆషతీరే అన్నపద్యాలు, గీతాలు అందరినీ అలరించాయి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం, మా విషాదం ప్రతిస్ఠాం త్వమగమస్యా అన్న ష్లోకాలు మధురగళం ఘంటసాల ద్వారా వినడం కూడ ఒక ప్రత్యేకతే అని చెప్పాలి. వాల్మీకి సుముహూర్తం ప్రాచీన సాహిత్యాన్ని చెక్కుచెదరకుండా వుంచుకున్న మహోత్కౄష్ట జాతి మనది. భారతీయుడిది గౄహాష్రమజీవనం. రామాయణ భారత భాగవతాలు భారతీయ విజ్ౙాన భాండారాలు; భుక్తి ముక్తి ప్రదాలైన ఇతిహాసాలు. త్యాగభావనాయుక్తుడవై ప్రపంచపదార్థాలను అనుభవించమనడమే ఈ గ్రంథాలలోని సంస్కౄతి. భారత రామాయణాలు కర్మ ప్రవౄత్తి కలగజేస్తాయి. భాగవతం భక్తిజ్ౙానవైరాగ్యాలు లభింపజేస్తుంది. భాగవతాన్ని తెలుసుకోవడానికి భక్తి వుండాలి. భారతాన్ని తెలుసుకోవడానికి భక్తి యుక్తి అవసరం. రామాయణాన్ని గ్రహించడానికి భక్తియుక్తులు రెండే కాక, షక్తి కూడా కావాలి అంటారు. ష్రీమద్రామాయణం ఆదికవి వాల్మీకి అందించిన సుముహూర్తం ఎటువంటిదంటే - నాటినుంచి నేటివరకూ భాస, కాళిదాస, భవభూతి, మురారులవంటివారు సైతం ఆ మునిచంద్రునికి తలవంచి తమ పలుకులలో కావ్యాలుగా, నాటకాలుగా వ్రాసుకుని జన్మధన్యమయిందనుకున్నారు. తేలుగువారు హరికథలుగా, నాటకాలుగా వినిపించి, ప్రదర్షించి తౄప్తిపడుతున్నారు. పాటలుగా జానపదులు ష్రీలు పాడుకుంటూనే వున్నారు. షతకాలతో అర్చించుకుంటున్నారు. ష్రీరాముడు - రామరాజ్యం సంగతి నిత్యస్మరణీయాలైనాయి. చివరకు భారతీయ జ్ౙానపీఠంమీద తెలుగు సరస్వతిని ఆరాధింపజేషారు, కవిసామ్రాట్క్, తొలి తెలుగు జ్ౙానపీఠ పురస్కార గ్రహీత, ష్రీ విష్వనాథ సత్యనారాయణగారు తమ 'రామాయణ కల్పవౄక్షం' కావ్యం ద్వారా. నాగరక చిహ్నమైన చలనచిత్రాలుగా రామాయణం, దూరదర్షన్ ద్వారా అత్యంత ప్రతిభావంతమైన దౄష్వ కావ్యంగా అందించిన కౄషి సాధనల నేపథ్యం ఖచ్చితంగా ప్రముఖ ప్రభావ ప్రేరణలను అందించి, అందిపుచ్చుకున్న వైనాలు మహర్షి వాల్మీకి వల్లనే అని చెప్పడం అత్యుక్తి, సహజోక్తి. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా తెలుగురథం షత సహస్ర సాహితీ సంస్కౄతీ నివాళులను, నీరాజానలను సమర్పించుకుంటోంది.
No comments:
Post a Comment