నాడు - నేడు
చరిత్రలో - ఫిబ్రవరి 8
ఫిబ్రవరి 8
ఫిబ్రవరి 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 39వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 326 రోజులు (లీపు సంవత్సరము లో 327 రోజులు) మిగిలినవి.
జననాలు
1880 : ప్రసిద్ధ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ జననం (మరణం 1946)
1834 : మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త మెండలీఫ్ జననం.
1897 : పూర్వ భారత రాష్ట్రపతి డా.జాకీర్ హుస్సేన్ జననం. (మరణం 1969)
1902 - ఆండ్ర శేషగిరిరావు (1902 - 1965) సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు జననం
1931 : అమెరికాకు చెందిన ఒక నటుడు జేమ్స్ డీన్ జననం.
1934:పొత్తూరి వెంకటేశ్వర రావు,తెలుగు పత్రికారంగ ప్రముఖుడు. ఐదు దశాబ్దాలుగా పత్రికారంగంలో పత్రికారంగంలో పనిచేసిన వ్యక్తి జననం
1941 : ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం.
1963 : భారతీయ క్రికెట్ మాజీ కేప్టన్ ముహమ్మద్ అజహరుద్దీన్ జననం.
మరణాలు
1971: "నిరంకుశమైన అధికార పిపాస - ఓ స్వప్నమే!" అని నినాదం చెప్పిన నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసిన కె.ఎం.మున్షీ మరణం
1989: సూరి భగవంతం, ప్రముఖ శాస్త్రవేత్త మరణం - దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు.ఇవి కాక గ్రూపు థియరీ, రామన్ ఎఫెక్ట్ మరియు క్రిస్టల్ సిమెట్రీ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనే మూడు గ్రంథాలు రచించారు.
2010: ప్రముఖ తెలుగు పండితులు, జానపద గేయ కళా పరిశోధకుడు డా.బిరుదురాజు రామరాజు మరణం
పండుగలు మరియు జాతీయ దినాలు
ప్రపంచ వివాహ దినోత్సవం
(మూల వనరులు : తెలుగు వికీపీడియా & తెలుగురధం సేకరణ)
.
No comments:
Post a Comment