శ్రీ 'దుర్ముఖి' ఉగాది శుభాకాంక్షలు
'నీ' 'నా' భేదము లేక తెల్గుదనపున్నీరాజనాలిచ్చుచున్
రానే వచ్చె మరో 'ఉగాది' యదిగో! రాగిల్లు నెమ్మోముతో
తేనెల్ జిప్పులు నవ్వు దొంతరలతో, తీరైన వాల్చూపుతో
మీనట్టింటిని భోగ, భాగ్య, శుభసంమేళంబుగావింపగన్.
పండుగలన్నీ సంవత్సరాని కొకసారి చొప్పున తిరిగీ, తిరిగీ వచ్చేవే. అంతమాత్రం చేత వాటి అర్ధం తగ్గదు; ఆనందం తగ్గదు; ప్రతి సంవత్సరం వచ్చేది కనుక వసంతం విలాసం తగ్గుతుందా? ప్రతి నెల వచ్చేది కనుక పూర్ణిమ శోభ తగ్గుతుందా? ప్రకృతి విలాసాలలోని నిత్యనూతనత్వం జాతీయ పర్వదినాలలో కూడా వుంటుంది. పైగా, మన ప్రధాన పర్వదినాలకు ప్రకృతి విలాసాలతో సన్నిహిత సంబంధం వున్నది కూడా. ఉదాహరణకు లేత చిగుళ్ళను, కొత్త పూవులను సింగారించుకుని వోయ్యారంగా వచ్చే వసంతునికి మనం పట్టే ముత్యాలగోడుడు - సంవత్సరాది. అదే, యుగాది, ఉగాది అని పిలవడం పరిపాటి అయింది.
'విజయ' కు వీడ్కోలు, 'దుర్ముఖి'ఉగాదికి స్వాగతం చెబుతూ, షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదించి, కొత్త బట్టలను కట్టుకుని, ప్రత్యేకమైన పండుగ భోజనాన్ని ఆరగించి, బంధుమిత్రులకు ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఆనందంగా పండుగను జరుపుకోవాలని అభిలషిస్తూ, ఆ పరాత్పరుడు మరింత సుసంపన్నమైన, ఆరోగ్యవంతమైన జీవనాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ -
(కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ)
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
No comments:
Post a Comment