విశ్వవిఖ్యాత 'గణాంక ఘనుడూ - శ్రీనివాస రామానుజన్(1887 - 1920)
మనిషి నేర్చుకునే విద్యలో గణాంకశాస్త్రసంబంధిత విద్యకు రాణింపు, గుర్తింపు తప్పక వస్తుంది అన్నది నిత్యసత్యం. మానవ, కళా శాస్త్రాలు ఒక తీరులో ఆధ్యయనం జరిగితే, గణాంకాధ్యయనం లో వున్న ప్రత్యేకతలు అందులో ప్రవేశించి, ప్రవీణులు కావలసినదే కాని దాని వివరించలేము. విద్యార్ధి దశ నుంచి, భాషాసంబంధిత అంశాలకన్న, తికమకపెట్టే లెక్కలు, ఓపట్తాన కొరుకుపడని భౌతిక, రసాయనశాస్త్రాలు వేటి ప్రత్యేకత వాటిదే.
గణాంకశాస్త్రం గురించి బహుకొద్దిమంది నిర్వచనం చెప్పినా, ఈ విషయాధ్యయనాన్ని, ఒక ఎత్తైన పర్వతారోహణం గా వర్ణిస్తూ, గమ్యం చేరుకున్నాక పొందిన అలసట కన్న, కలిగిన ఆశ్చర్యాధ్బుతాలనే అనుభవించడం జరుగుతుంది. లెక్కల విషయానికొస్తే, కారణం, మేధస్సుకి గ్రహణశక్తి, సాధికారతలు లభిస్తాయి. ఒకవిధమైన సంభావ్యదశకి, దిశకి దారితీస్తాయి. ప్రతి విద్యార్ధికి తనదైన క్రమశిక్షణను కలిగించడమే కాక, విశ్వవ్యాప్తంగా మేధస్సుకి, హౄదయానికి కూడ విశిష్టమైన శిక్షణలను ప్రేరేపిస్తాయి. అనిర్వచనీయమైన ప్రోత్సాహ, ప్రోద్బలాలను కలిగిస్తాయి. సంచరించే స్వభావం వున్నవాడికి, లెక్కల విషయంలో, ప్రతిభను ప్రదర్షించేదుకు సంపూర్ణావకాశాలు లభిస్తాయి. అవరోధాలు, అవాంతరాలు వచ్చినా, మెట్టు, ఒక్కొక్కొటి ఎక్కుతూ, అరోహణం చేసుకుంటూ, ఎవరెష్టు, హిమశిఖరాగ్రభాగాల్ని, తమ ప్రతిభాగర్వంతో చుంబించాలి.
పైన వివరించిన దశల్ని, దిశల్ని అసమాన ప్రతిభాపాండిత్యాలతో, అగణిత శిఖరాగ్రాల్ని అతిసులభంగా తాకగలిగిన వ్యక్తి, ఎవరో కాదు, విశ్వవిఖ్యాత గణాంక ఘనుడు - 'శ్రీనివాస రామానుజణ్. చిరుప్రాయం నుంచి బాలశాస్త్రవేత్తగా భావించబడ్డ, రామానుజన్ ప్రపంచంలోనే తిరుగులేని 'లెక్కల్లోని మనిషీ అని చెప్పాలి. అందరూ, అంకెల్ని సంకెలలు గా భావిస్తే, వాటిని స్వీకరించి, ఘనంగా రాణింపు పొందినవాడు రామానుజన్.
22 డిసంబర్ 1887 లో తమిళనాడు లోని ఇరోడ్ లో అతిబీదకుటుంబంలో పుట్టడమే కాక, కటిక దారిద్ర్యాన్ని అనుభవించినవాడు. 17 సంవత్సరాలకి మెట్రిక్యులేషన్ లో ఉత్తీర్ణుడైన, 'శ్రీనివాసా, ఎప్పుడూ, తరగతి లో ప్రప్రధముడే. చాలా సంవత్సరాలు, మదరాసు విశ్వవిద్యాలయంలో ఆధ్యయనం చేసి, 1914 లో ప్రత్యేక ఆధ్యయనం కోసం కేంబ్రిడ్జ్ వెళ్ళాడు. ఈ దశలోనే, రామానుజన్ తన గణాంకవిద్యలో చాలా ప్రఖ్యాతుడైనాడు. అమోఘమైన మేధస్సున్నకారణంగా, వేలకొలది సమస్యలకు సులభ పరిష్కారం తెచ్చిన వ్యక్తి. 1917 లో యూరోపు ఖండం ఆయన ప్రతిభకు పట్టం కట్టింది. 1919లో, భారతదేశానికి తిరిగొచ్చి, తన పరిశోధనను ప్రారంభించాడు. అదే సంవత్సరం (1919) లో విశ్వవిఖ్యాత 'రాయళ్ సంస్థ అందించిన ప్రప్రధమ భారతీయునికిచ్చిన 'ఫెల్లో' గౌరవం, శ్రీనివాస రామానుజన్ కి దక్కడం, గణాంకశాస్త్రానికే గౌరవంగా మారింది. కేవలం 32 ఏళ్ళకే ఈ గౌరవం పొందడం చరిత్రగానే నేటికీ భావించబడుతోంది. గణాంక సమస్యలకు ఎన్నో కొత్త పరిష్కారాల్ని కనుగొన్నవాడు. రాయల్ గౌరవం పొందిన వెంటనే, ఏడాది కూడ దాటకముందే, రామానుజన్, చోల్పూర్ లో, 26 ఏప్రిల్, 1920 లో కీర్తిశేషుడైనాడు. ఆయన పరిశోధన ఫలితాలు, ఆయన మరణించాకనే, బయటపడ్దాయి. వాటిపై, మరింత పరిశోధనలు, నిరంతరంగా జరుగుతూనే వున్నాయి. ఆయన జీవితాంతం, ప్రతిభామేధస్సును గమనించి బ్రిటిషులోని ప్రముఖ గణాంక శాస్త్రవేత్తలు సైతం అవాక్కయేవారట.
కేవలం మూడు దశాబ్దాల, మూడు సంవత్సరాల్లోనే, భారతదేశానికి ఎనలేని ఘనతను తెచ్చిన గణాంక ఘనుడు. భారతదేశం వారు, ప్రత్యేక తపాళాబిళ్ళను విడుదల చేయడం కూడ జరిగింది. శ్రీనివాస రామానుజన్ పేరున, ప్రతిభాపురస్కారలని, భారత జాతీయ శాస్త్రసంస్థ, ఆయన స్మరణార్ధం, నెలకొల్పి, అనేక గణాంక శాస్త్రవేత్తలకు సత్కారాల్ని అందించి, తమ ప్రతిభకు పట్టం కడుతూండడం, శ్రీనివాస రామానుజన్ కారణభూతుడే అని చెప్పక తప్పదు. భావి భారతదేశంలో, మరింత గరించగల, శ్రీనివాస రామానజున్ లు వుద్భవించి, గణాంకరంగానికి మరింత ఘనాఘన సుందర సుసంపన్నతను అందించాలి. ఆ శుభతరుణం కోసం మన విద్యార్ధిలోకానికి ఆశీస్సుల్ని, అవకాశాల్ని అందించడంలో నేను సైతం అంటూ, సహాయ సహకారాల్ని అందిచాలి.
'పరుగెత్తి రానీ పవిత్ర భావనల్ పలుదెసలనుండీ పునీతులుగ చేయంగ మనలణ్ అన్న స్ఫూర్తితో, 'నేనెవరైన, నేనెంతటివాడనైన, నాౠణమామాతౄమూర్తికే!' అన్నది సత్యం. శ్రీనివాస రామానుజన్ ని కన్న ఆయన మాతౄమూర్తి, భారతదేశం కూడ ధన్యులే సుమా!
వెలకట్టలేని ఆ అగణితమూర్తిని - శ్రీనివాస రామానుజమూర్తికి ఘన నివాళిని సమర్పిస్తూ -
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
2 comments:
ఆ మేదోమూరిని మన బ్లాగరులందరిముందుకు తెచ్చినందుకు నెనర్లు...
శీర్షికలో తప్పు దొర్లింది గమనించారా...? గణాంక బదులు ఘనాంక అని పడింది... కుదిరిన యెడల సడలించగలరు...
మీ స్పందనకు ధన్యవాదాలు. కాని మీ అభిప్రాయం సరియైనది కాదు. ఎందుకంటే, ఘనాంకం - ఘనమైన అంకం. అంకం అంటే, సంఖ్య్హ అని అర్ధం. యింక, గణాంకం - అంటే, సమూహం, గణించదగినది. గణనకు సంబంధించినది.
గణాంక ఘనమూర్తి. ఘనాంక ఘనుడు. ఎలాగైనా, చెప్పవచ్చు.
పై వివరణకు అమోదిస్తారని తలుస్తూ. లేకపోతే, మీ భావం మీది. నా అభిప్రాయం నాది. ధన్యవాదాలు. సెలవు. కొంపెల్ల శర్మ. తెలుగురధం.
Post a Comment