ఈయన మరోగాంధీ .. శాంతిదూత - 'మార్టిన్ లూథర్ కింగ్' ( 1929 - 1968)
మహాత్మాగాంధి ప్రభావం ఈయనలో సుస్పష్టంగా విశదమవుతుంది. భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన పుష్కరకాలం లోపునే, ఈయన మనదేశాన్ని సందర్శించారు. గాంధీ అహింసావిధానం, నెహ్రూ పంచశీలపధం మనసుని దోచుకుంది. ఈ మార్గాల్ని దౄష్టిలో పెట్టుకుని, తనజాతి మానవ, పౌరహక్కులకోసం హింసరహిత ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి, 35 ఏళ్ళ వయసులేనే 'నోబెల్ శాంతీ పురస్కారాన్ని పొందిన వ్యక్తి ఎవరో కాదు. ఆయనే 'మార్టిన్ లూథర్ కింగ్', నీగ్రో పౌరహక్కుల సంరక్షణోద్యమానికి ఏకైక నాయకుడు. అట్లాంటా లోని జార్జియా లో 1929 జనవరి 15 న జన్మించిన మార్టిన్, బోష్టన్ విశ్వవిద్యాలయంలో 'మతాలశాస్త్రాధ్యయనం' కావించాడు. చర్చి సేవలు అందజేస్తూ, బాప్టిస్ట్ మినిష్టర్ గా విధులను నిర్వహించాడు. క్రమేపీ, మనసు పౌరహక్కుల ప్రచారంలో నిమగ్నమై, ప్రముఖంగా పరోక్ష, అహింసాపద్ధతుల్లో భాగస్వామ్యం వహించాడు. అయినా, విప్లవపంధాలోనున్న నల్లజాతినాయకులు ఈయనతో విభేదాలకు దిగడమే కాక, 1965 నుంచి అనేక సవాళ్ళను విసిరారు. దీనికి ముఖ్యకారణం - అన్ని వర్గాలవారిని మాఋర్టిన్ తన ఉద్యమంలో చేర్చుకోవడం, జాతి వివక్షత విధానాన్ని ప్రోత్సహించేవారికి కొరుకుడు పడలేదు. వారి ఆగ్రహానికి గురి అయి, మార్టిన్ తన ప్రాణాలే కోల్పోవలసివసుందని, ఈ సమయంలో మార్టిన్ ఊహించలేదు.
అమెరికా లోని నీగ్రోల సమాన పౌరహక్కులకోసం నిరంతరం పోరాడి, ఈ కారణం మూలంగానే, ఆయన అసువులు కోల్పాయాడు। అందరికీ, ప్రముఖంగా భారతీయులకు ఆనందాశ్చర్యానుభూతులను కలిగించిన విషయం ఏమిటంటే, ఉద్యమం పూర్తిస్థాయిలో, అహింస, గాంధి రాజకీయ సూత్రాలపైనే నడిపాడు. మార్టిన్ నిర్వహించిన ఈ ఉద్యమం, ఎవరూ ఊహించని విధంగా, తెల్లజాతివర్గంనుంచి కూడ మన్ననలను పొందాడు. అమెరికాలోని నీగ్రోల పౌరహక్కుల సంరక్షణకోసం, దక్షిణ క్రిష్టియన్ నాయకుల సమావేశాన్ని నిర్వహించి, తన శాంతిపూర్వక ఉద్యమాఅన్ని శుభారంభం కావించాడు. మేధావి, వాక్భూషణుడు, సంత్సంకల్పదీక్షాపరుడు, న్యాయంకోసం నిరంతరం పోరాడిన వ్యక్తి, రెండు దశాబ్దాలు పైగా పోరాడి, చివరగా 1963 లో వాషింగ్టన్ లో సమావేశమైన మహాసమ్మేళనం ఒక కొత్త రూపుని, ఊపుని యిచ్చాయి.
1959 లో భారతదేశాన్ని సందర్శించి గాంధి-నెహ్రూ రాజకీయ సిద్ధాంతాలను మనసా కీర్తించడం కూడ జరిగింది। దక్షిణాఫ్రికా లో ప్రోత్సహిస్తున్న "అపార్ధీడ్" లేక జాతి వివక్షతావిధానానికి పరమ వ్యతిరేకి. ఫలితంగా, మెంఫిస్ నివాసి, తెల్లజాతి మదభక్తుడు, 'టెన్నీసీ' 4 ఆప్రిల్ 1968 నాడు మార్టిన్ లూధర్ ని హత్యచేయడం దారుణంగా జరిగిన విషాదాంతం. యావత్తు ప్రపంచం, మార్టిన్ హత్యను వ్యతిరేకించి, నివాళులు అర్పించారు. ఆయనకు తన నిస్స్వార్ధ సేవలకు గుర్తింపుగా, భారతప్రభుత్వం, 'జవహర్ లాల్ అంతర్జాతీయ శాంతీ పురస్కారాన్ని 1966 లో కీరిశేషుడైన మార్టిన్ లూథర్ కింగ్ కు బహూకరించారు. మానవహక్కుల సంరక్షణ కోసం మాఋర్టిన్ కావించిన సేవలను గుర్తింపుగా, 1964 లోనే 'నోబెల్ శాంతీ పురస్కారాన్ని అందజేయడం కూడ జరిగింది.
జనవరి మూడవ సోమవారం, ప్రతీ సంవత్సరం, ఈ ఏడాది జనవరి 21 న, మాఋర్టిన్ లూథర్ కింగ్ జన్మోత్సవాల్ని, సెలవుదినంగానూ, అమెరికా లో జరుపుకోవడం లోనే, ఆయన ప్రతిభాపాటవాలకు గుర్తింపు అని వేరే ప్రస్తావించక్కరలేదు.
No comments:
Post a Comment