ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూకవి అయిన మగ్దూం మొహియుద్దీన్ హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడు. బాల్యం, విద్యాభ్యాసం ఆంధ్ర ప్రదేశ్ లోని మెదక్ జిల్లా ఆందోల్ లో 1908 ఫిబ్రవరి 4 న జన్మించాడు. ఆయన పూర్తిపేరు మహ్మద్ మగ్దూం మొహియుద్దీన్ ఖుద్రీ. వీరి పూర్వీకులది ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్. ఆయన తండ్రి నిజాము ప్రభుత్వంలో సూపరింటెండెంటు గా పనిచేసేవాడు. మగ్దూం చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో మగ్దూం తన బాబాయి వద్ద పెరిగాడు.
ప్రాథమిక విద్య హైదరాబాదు లోని ధర్మవంత హైస్కూల్లోను, మెట్రిక్యులేషను సంగారెడ్డిలోను చదివాడు.
ప్రముఖ ఉర్దూ కవి. 'షాయరే ఇంక్విలాయ్' (ఉద్యమ కవి) బిరుదాంకితుడు. ఇతని గజల్ లు, పాఠ్యకాంశాలలోను, సినిమాలలోనూ ఉపయోగించారు.
'ఫిర్ ఛిడీ బాత్, బాత్ ఫూలోం కి' అను గజల్(గేయం) సుప్రసిధ్ధి.

No comments:
Post a Comment