ఆచార్య వినోబా భావే - వర్ధంతి - 15 నవంబర్
'జై జగత్! నా కార్యకలాపాలన్నీ విశ్వమానవుల హౄదయసంగమం కొరకు తపనే'
'చిత్ పవణ్ బ్రాహ్మణ వంశీయుడు
అందరికీ 'ఆచార్యాగా సుపరిచితుడు. ఆయన పేరు వినాయక్ నరహరి భావే. వినోబా భావే గా సుప్రసిద్దుడు. మహారాష్ట్రలో గగోడే లో 11 సెప్టెంబర్ 1895 న సంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. మహారాష్ట్రలో 'చిత్ పవణ్ బ్రాహ్మణ వంశీయుడైన వినోబా చిరుప్రాయంనుంచే భగవద్గీత పై అపార ప్రభావం పొందినవాడు.
స్వాతంత్ర్య సమరంలోకి ...
మహాత్మాగాంధీతోటి స్వాతంత్ర్య సమరంలోకి దూకిన వ్యక్తి. తెల్లదొరలతోటి సమరం మూలాన, 1932 లో వినోబాను జైల్లో పెట్టారు. కాని మన వినోబా జైలులో ఉబుసుపోక, భగవద్గీతపై తనదైన భాష్యాన్ని తోటి ఖైదీలకు, మాతౄభాషైన మరాఠీలో వివరించేవాడట. ఆ ఉపన్యాస భావలహరి తర్వాత 'ఉపన్యాసగీతా గా ప్రచురించడం, అన్ని దేశీయభాషల్లోకి, కొన్ని విదీశీభాషల్లోకి, తర్జుమా కావడం జరిగినదాన్ని బట్టి వినోబా విద్వత్తు వెల్లడవుతుంది. మిగతా కార్యక్రమాల్ని, దినచర్యని పక్కకి నెట్టినా, గీతోపన్యాసాలద్వారా, మంచి అనిర్వచీయనీయమైన అనుభూతి ఆవహించింది అని వినోబా చాలాసార్లు చెప్పారు. ఆయన సత్యనిష్ఠా తత్పరతకు సంతోషించి, గాంధీ, సత్యాగ్రహానికి ఎన్నుకున్న మొదటి వ్యక్తి వినోబా అన్నది ఆనాడు ఆశ్చర్యం కలిగించింది. ఆనాడు క్విట్ యిండియా ఉద్యమంలో కూడ పాల్గొన్న ప్రముఖుడు.
సర్వోదయ, భూదానం, గోరక్షణ - జీవన నేస్తాలు
వినోబా అన్ని మతాల సత్యసారాన్ని ఆధ్యయనం చేసి అర్ధంచేసుకున్న మేధావి. 'ఓం తట్ అన్న పారాయణ అన్నిమతాలకు అన్వయించేలా ధ్యానం చేశేవారు. పైగా బహుభాషాప్రావీణ్యుడు. కన్నడ భాషాలిపిని విశ్వభాషాలిపులకు మహారాణి అని పొగడేవారు. భారతదేశంలోని పల్లెలలో జీవించే సగటుజీవి అనుభవించే కష్ఠాలకు సమస్యలను అన్వేషించడంలో చాలా కౄషిని సలిపారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసం అని కూడ భావించారు. ఈ ధోరణి క్రమేణా 'సర్వోదయా ఉద్యమానికి దారితీసింది. వినోబా భావేతో మమైకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం - భూదానోద్యమం. ఈ నూతన తరహాలో నడచిన ఈ భూదానోద్యమ ప్రచారంలో భాగంగా, దేశం నలుమూలలు పాదయాత్ర చేశాడు. ప్రతీ భూకామందుని వ్యక్తిగతంగా, తనను కొడుకుగా భావించి, కొంతైనా భూమిని యివ్వాలని ప్రార్ధించాడు. అలా సేకరించిన భూమిని పేదలకు దానం ద్వారా పంచి పెట్టాడు. అహింస, ప్రేమలను మేళవించిన విధానం ఆయన తత్వం. వినోబా అంటే వెంటనే స్ఫురించే అంశం - గోహత్య విధాన నిర్మూలనం.
ఆయనొక ఆశ్రమవాసి!
వినోబా తన జీవిత చరమాంకం, మహారాష్ట్రలోని 'పౌనాఋ లో నిర్మించుకున్న ఆశ్రమ వాతావరణంలో గడిపాడు. యిందిరాగాంధి విధించిన అత్యవసర పరిస్థితిని సమర్ధించిన వారిలో వినోబా ఒకరు కావడం, ఆ కాలాన్ని 'అనుశాసన పర్వం'గా అభివర్ణించి, క్రమశిక్షణకు సరియైన సమయం అని వ్యాఖ్యానించారు.
విమర్శల మధ్య వినోబా
విద్వత్తు ఉన్నచోట వివాదం, అసూయలు జనిస్తాయి. 'అర్కంలేని అతి గాంధీవాదం'వినోబాది
అని ప్రముఖ సాహితీవేత్త వి.యస్.నాయిపాల్ విమర్శించాడు. కాని, భారతీయ ఆర్ధిక, రాజకీయవిధానంతో భాగస్వామ్యం పొందని నాయిపాల్ నుంచి యిటువంటి విమర్శలు రావడం చాలా విడ్డూరం అని ప్రతి విమర్శలు రావడం కూడ జరిగాయి.
ప్రతిభకు పురస్కారాలు
1958 లో వినోబాకు 'సామాజిక నాయకత్వం'పై భారతీయ రామన్ మెగ్సయ్సాయ్ పురస్కారం మొట్టమొదటి స్వీకర్త వినోబా కావడం మనదేశానికి గర్వనీయం. 1983 లో భారతరత్న బిరుదుని వినోబా మరణాంతరం వెంటనే బహూకరించారు.
వినోబా భావాలు
విప్లవాలకు ఆధ్యాత్మికభావాలే మూలం; మానవుల హౄదయాలని, మనస్సులని ఏకీకౄతం చేయడానికే నా కార్యక్రమాలపై దౄష్టి పెట్టడం జరిగింది.
ప్రశాంతత అనేది మానసికం, ఆధ్యాత్మకం. ఈ ధోరణులనుంచే మానవుల వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశిస్తాయి. ప్రపంచగమనం వీటిపైనే ఆధారపడింది.
జై జగత్! విశ్వానికి విజయం!
బీదప్రజల హౄదయాలను సుసంపన్నంగాను, సంపన్నప్రజల హౄదయాలను బీదతనంతోను భగవంతుడు సౄష్టించడం విడ్డూరం, ఆశ్చర్యకరం.
ప్రజాశక్తి, ప్రజాబలం సంకల్పంగా సాధించాలి. హింసాయుత, బలవంతపు అధికారిక రాజ్యపాలనం ఆహ్వానించదగ్గది కాదు.
ఏ దేశమైనా, సైన్యం, యుద్ధసామగ్రి బలంతో కాక, నైతినబలంతో సమర్ధించుకోవాలి.
పాతపడిన యుద్ధసామగ్రితో కొత్త యుద్ధాలు చేయగలగడం అసాధ్యం.
ప్రభుత్వాల తప్పిదాలపై విమర్శించ వలసిన పని నాకు లేదు. మంచి పనులని అనుకున్నవాటిపై నా విమర్శ ఉంటుంది.
విప్లవవాదాన్ని ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది అన్న భావం, భావన ఎన్నటికీ రానీయకూడదు.
అహింసా విధానాలపై నిదానధోరణిని అవలబించకూడదు. అహింసామార్గం ద్వారా, అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే, కాలయాపన, జాప్యం శతౄవులు అనే అనుకోవాలి. పట్టు ఎంతమాత్రం సడలకూడదు. మెతకదనం, పసలేని, ప్రభావంలేని అహింసావిధానాలను అవలంబించినందువల్ల ప్రస్తుత స్తబ్ధత కొనసాగే ప్రమాదంతోపాటు, పెరుగుదల, అభివౄద్ధి చతికిలబడతాయి. చివరకు పరాజయం, నిరాశ తప్పవు.
సమాజసేవ, అహింసామార్గం, గోరక్షణ, ఆధ్యాత్మకధోరణి, కుష్టివ్యాధిగ్రస్థులకు సహాయసహకారాలు, భూదానోద్యమం, యిలా ఎన్నో సేవలను అందించిన వినోబా భావే వివాదం లేని పరమాచార్యులు. భారతదేశానికి ప్రధానాచార్యులలో ఒకరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఆచార్య వినోబా భావే 1982 నవంబర్ 15 న, చివరి రోజుల్లో ఆహారం, నీరు తీసుకోడానికి నిరాకరించి, 'సల్లేఖనం' గా భావించగా, కీర్తిశేషులైనారు.
వినోబా భావే మహానుభావ భావపరంపరకు, నేటివరకు చెరగని ముద్రవేసిన ఈ మహనీయునికి తెలుగురథం నీరాజనాల్ని సమర్పించుకుంటోంది.
కొంపెల్ల - తెలుగురథం.
కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం. 'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?' కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో? (బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Monday, November 16, 2009
Saturday, November 14, 2009
బాలల దినోత్సవం - సాహిత్యం, సాంస్కౄతికం
తెలుగు రథం
బాలల దినోత్సవం మన దేషంలో - నవంబర్ 14 నాడు జరుపుకోవడం, అందులోనూ మన తొలి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవం నాడే జరుపుకోవడం మరింత సంతోషించదగ్గ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ రోజు భారత బాలలు యావన్మంది ఉత్సవాల్ని జరుపుకోవడం, తమ ప్రతిభాపాటవాలని ప్రదర్షించి, సత్కారాలను, బహుమతులను, ప్రషంసలను అందుకోవడం కూడ రివాజే. బాలల విద్యావిధానాలను, కుటుంబంలో వారి పాత్ర, ప్రేమాభిమానాల్ని పొందడం, వారివారి స్థాయిల్లో పెద్దలను గౌరవించడం, వారి అభిమానాలకు పాత్రులవడం, తోడి బాలబాలికలతోటి ఉత్సవాన్ని జరుపుకోవడం కూడ పరిపాటే. బాలలకు ప్రత్యేక చలనచిత్రోత్సవాలు, ఆటపాటలు, చదువు, విజ్ౙానాంషాలు, సాహిత్య సాంస్కౄతిక పోటీలు నిర్వహించడం, వారిని ప్రోత్సాహ ప్రోద్బలాల్ని అందించడం కూడ బాలల దినోత్సవంలో ప్రముఖ భాగం గా మారింది.
మన తెలుగు బాలగీతాలు మన పిల్లలకు పసివయసు నుంచి, పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు ఎన్నోరకాలైన గీతాలని, పాటలని, చమత్కారిత పూరిత సాహిత్య సంగీతాంషాల్ని, కథల్ని చెప్పి వారికి మానసికోల్లాసభూతుల్ని చేయడం మనందరి కర్తవ్యంగా ప్రతీ పెద్దవ్యక్తి భావించడం జరుగుతోనేవుంది. మన తెలుగు భాషలో ప్రముఖమైన కొన్ని అంషాల్లో - సూచనప్రాయంగా యివ్వడం జరుగుతోంది. కిన్నెర బాలల సాంస్కౄతికోత్సవాలు - ఆహ్వానపత్రంలోని బాలగీతాలు. చేత వెన్నముద్ద - చెంగల్వపూదండ, బంగారు మొలతాడు - పట్టుదట్టి, సందిట తాయతులు - సరిమువ్వగజ్జెలు, చిన్ని కౄష్ణా నిన్ను - చేరి కొలుతు. గోరంతదీపమ్ము - కొండలకు వెలుగు, గోపాలకౄష్ణమ్మ - గోవులకు వెలుగు, మాడంతదీపమ్ము - మేడలకు వెలుగు, మారాజు అబ్బాయి - మా కళ్ళవెలుగు. జో అచ్యుతానంద -జో జో ముకుందా!, లాలిపరమానంద - లాలి గోవిందా - జో జో. హాయి హాయి హాయి - ఆపదలు గాయి, చిన్నివాండ్రను గాయి - ష్రీవేంకటేష!, ఆడితే ముద్దమ్మ - పాడితే ముద్దు, అందరికి అబ్బాయి - అల్లారు ముద్దు ... తాతగారింటనే - తూముల పెళ్ళిజ్, బూరి ముక్కడిగితే - బుగ్గ పొడిచేరు, గారి ముక్కడిగితే - కసిరికొట్టేరు, అరిసి ముక్కడిగితే - అదిమి తన్నేరు. చందమామ రావే - జాబిల్లి రావే, కొండెక్కిరావే - కోటిపూలు తేవే. ఊ ఊ ఉంగన్నా - ఉగ్గుపాలు ఇందన్న, గంటెడు ఉగ్గు కమ్మన్న - ఉమ్మక కక్కక మింగన్న. పిల్లమ్మ కన్నుల్లు - చీర పువ్వుల్లు, అబ్బాయి కన్నుల్లు - కలవరేకుల్లు, కలువరేకులవంటి - నీకన్నులకును, కాటుకలు పెట్టితే - నీకు అందమ్ము... ఏడవకు ఏడవకు - వెర్రి నాయిన్నా! ఏడిస్తె నీ కళ్ళు - నీలాలు గారూ, నీలాలు గారితే - నే చూడలేను, పాలైన గారవే - బంగా కండ్ల. ఆట మాణిక్యమే - పాటమాణిక్యం, నట్టెంట అమ్మన్న - రత్నమాణిక్యం. ఏనుగు ఏనుగు నల్లన - ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు - ఎంతో చక్కని దేవుడు. చప్పట్లోయ్క్ తాళాలోయ్క్ - దేవుడి గుళ్ళో మేళాలోయ్క్ పప్పూ బెల్లం దేవుడికోయ్క్ - పాలూ, నెయ్యీ పాపాయిలకోయ్క్. ఎండలు కాసే దెందుకురా? మబ్బులు పట్టే టందుకురా? మబ్బులు పట్టేదెందుకురా? వానలు కురిసేటందుకురా! చందమామ బొట్టు - నాసందిటి కేసికట్టు ఊళ్ళో ఉంటే ఒట్టు - నీవు వచ్చిన దారిని బట్టు. కాళ్ళాగజ్జీ - కంకాళమ్మ, వేగూచుక్క - వెలగామొగ్గా మొగ్గాకాదు - మోదుగనీరు, నీరూ గాదు - నిమ్మలవారి... చిట్టిపొట్టి మిరియాలు - చెట్టుక్రింద పోసి, పుట్టుమన్ను తెచ్చి - బొమ్మరిల్లు కట్టి... సీతమ్మ వాకిట - సిరిమల్లె చెట్టు, చిరుమల్లె చెట్టేమొ - చితక పూసింది... చెట్టు కదలాకుండ - కొమ్మ వంచండి, పచ్చి పూలూదోసి - బుట్టదింపండి. బతుకమ్మ - బతుకమ్మ భాగ్యమిచ్చింది, భాగ్యమిచ్చెన చోట నెల్లి బూసింది - నెల్లికీ మారాజు తోటగట్టించె ... ఒప్పులకుప్పా - ఒయ్యారి భామా, సన్నబియ్యం - చాయపప్పు చిన్న మువ్వ - సన్న గాజు, కొబ్బరి కుడక - బెల్లపచ్చు ... చెమ్మా చెక్క - చారెడేసి మొగ్గ, అట్లుపొయ్యంగ - ఆరగించంగ ముత్యాల చెమ్మచెక్క - ముగ్గులెయ్యంగ, రత్నాల చెమ్మచెక్క - రంగులేయంగ. గుడు గుడు గుంచం - గుండేరాగం..., పాములపట్ట - పడగరాగం చిన్నన్న పెండ్లి - చిట్టి రాగం, పెద్దన్న పెండ్లి - పెట్టె రాగం. బుర్రు పిట్ట బుర్రు పిట్ట - తుర్రుమన్నది, తూర్పువారి కాపురమ్ము - చెయ్యనన్నది అత్త తెచ్చిన కొత్తకోక - కట్టనన్నది, మామ తెచ్చిన మల్లెపూలు - ముడవనన్నది. చదువుకో నాయన్న, చదువుకో తండ్రి! చదువుకొంటే నీకు, సౌఖమబ్బేను ... విద్య లేకుంటేను విభవమ్ము రోత ... వినయమ్ము లేకుంటె విద్యతో రోత ... కాని వారీ కోసం కావించు చెలిమి కట్టె విరిచీ పోయిని పెట్టినట్లుండు ... జపతపంబుల కన్న చదువుసాములుకన్న ఉపకారమే మిన్న ఓ కూనలమ్మా! చిట్టి చిలకమ్మా - అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? - పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? - గుటుక్కు మింగావా? గడపలలోకెల్ల నీ గడప మేలు? మహాలక్ష్మి వసియించు మాగడప మేలు వీధులలో కెల్ల నీ వీధి మేలు? విద్వాంసులున్నట్టి - మా వీధి మేలు? బావా బావా పన్నీరు - బావను పట్టుక తన్నేరు వీధి వీధి తిప్పేరు - వీషెడు గంధము పూసేరు. తాతగారింటనే - తూములు పెళ్ళి బూరి ముక్కడిగితే - బుగ్గ పొడిచేరు గారి ముక్కడిగితే - కసిరికొట్టేరు అరిసి ముక్కడిగితే - అదిమి తన్నేరు. బాల భారతి (వెలగా వెంకటప్పయ్య) అనగా అనగా కోతి,కోతికి కలదూ మూతి మూతికి పైనే ముక్కు, ముక్కు ముక్కు టీక్కు ఢీ ఢీ డిడి డిక్కు. తాతయ్య తాతయ్య తాతయ్య తాతయ్య, గాంధి తాతయ్య తాతయ్య నవ్వితే, వెన్నెలలు వెలుగు తాతయ్య పలికితే, ముత్యాలు రాలు తాతయ్య మాటలే, రత్నాల మూట తాతయ్య తాతయ్య, గాంధి తాతయ్య. కోడీ కోడీ కొక్కొరకో కోడీ కోడీ - కొక్కొరకో! తెలివి వచ్చింది కాకీ కాకీ - కావ్ కావ్ అమ్మ లెమ్మంది తెల్ల వారింది, ఆడుకొమ్మంది. పందికొక్కు (న్యాయపతి బలరామదాసు) ఏదీ - ఈ కథ గబగబ చదవండీ? గాదెలోను కందిపప్పు గాదెక్రింద పందికొక్కు! నక్కినక్కి బొక్కుచుండె, కందిపప్పు పందికొక్కు! ముట్టెపెట్టి లొక్కుచుండ, చిట్టిపొట్టి అక్కవచ్చె! నక్కినక్కి యున్న కొక్కు, అక్కరాక అంతజూచె, కందిపప్పు పందికొక్కు, క్రిందవేసి పారిపోయె! నీ కాళ్ళెందాకా? (కూర్పు - అన్నయ్య) నీకాళ్ళేందాకా పోయాయీ! - గోల్కోండదాకా పోయాయి గోలకొండ ఏమిచ్చింది - గుడ్డిగవ్వనూ ఇచ్చింది గుడ్డిగవ్వనేం చేషావూ - గడ్డిమోపులో దాచాను గడ్డిపోచ ఏమిచ్చింది - ఎద్దుబండినీ ఇచ్చింది ఎద్దుబండినేం చేషావూ? - బండివానికీ ఇచ్చాను బండివాడు ఏమిచ్చాడు - పూలదండనూ ఇచ్చాడూ. పూలదండనేం చేషావూ - పాలవెల్లికీ కట్టాను పాలవెల్లి ఏ మిచ్చిందీ - బాలకౄష్ణుని ఇచ్చిందీ. బాలకౄష్ణునేం చేశావూ - గొల్లభామకూ ఇచ్చాను. గొల్లభామ ఏమిచ్చిందీ - వెన్నముద్దనూ ఇచ్చింది. వెన్నముద్దనేం చేషావూ - చిన్న అత్తకూ ఇచ్చాను. చిన్న అత్త ఏమిచ్చిందీ - చక్కని భావను నిచ్చింది. "త" గుణింతము తల్లి దండ్రులమాట - తలదాల్పవలయు తాతసేవలు నీవు - తగ జేయుమయ్య తిమ్మ చేష్టలు చేసి - తిట్లు కాయకుము తీపినెన్నడు బాగ - తినబోకుమయ్య తుంటరి పిల్లలతో - తంటాలు పడకు తూనగ నెన్నడు - తునుమాడకయ్య తెల్లవారగలేచి - కల్లలాడకుము తేమ నేలలపైని - తిరుగంగ బోము తొలుత దేవుని పూజ - సలుపుమోయున్న తోటివారికి బాగ - తోడుపడమన్న తేడు కూడని కూడు - చెడుగు కేయన్న తొందరబాటునూ - పొందబోకన్నా తౄణముగా నామాట - గణనసేయకుము. అ ఆ ఇ ఈ లు అన్నా అన్నా రోవోయీ, ఆలస్యము యింకేలోయీ ఇద్దరమును మరి జట్టుగను, ఈష్వరాలయము కేగుదము ఉత్సవములనూ చూదాము, ఊరేగింపుతో వెడదాము ౠషివలె దండము పెడదాము, ఎప్పుడు రక్షించుము అనుచు ఏకష్టము కలిగించకను, ఐష్వర్యంబుల యిమ్మనుచు ఒప్పుగ మనము ఇద్దరము, ఓ ప్రార్థన చేసుకు వద్దాము. పుట్టినరోజు పుట్టినరోజూ పండుగనాడూ చుట్టాలొచ్చారు కాజాలడ్డూ తాజా గారెలు తెచ్చీ పెట్టారు ఇరుగూపొరుగూ పిల్లా పెద్దా యింటికి వచ్చారు చిందులుతొక్కే చిట్టిబాలకి జేజే లన్నారు! అమ్మాలక్కాలంతా కలసీ హారతులిచ్చారు బాలబాలికలంతాకూడి బంతూలాడారు పాలూ పళ్ళూ పాయసమంతా పంచీ పెట్టారు ముచ్చట గొలిపే ముద్దులబాలకి జేజే లన్నారు. వారాల కథ ఆదివారము నాడు - అబ్బాయి పుట్టె సోమవారము నాడు - చొక్కాలు తొడిగె మంగళవారము నాడు - మాటలూ చెప్పే బుధవారము నాడు - పుస్తకము చదివె లక్ష్మి(గురు)వారము నాడు - లడ్డూలు తినియె షుక్రవారము నాడు - షోకులను చేసే షనివారము నాడు - సభలోకి వెళ్ళే ఇన్ని వారాలలో - ఇన్ని చేషాడు ఎవ్వరీ అబ్బాయి - ఎవ్వరీ పాప. పొట్టిబావ - పండుగ పచ్చడి చిట్టి మరదలా చిట్టి మరదలా ఎక్కడి కెళతావు? గున్న అంటు మావులున్న తోటకెళతాను చిట్టి మరదలా చిట్టి మరదలా ఏమి తెస్తావు? మంచి మంచి మామిడికాయలు ఏరి తెస్తాను చిట్టి మరదలా చిట్టి మరదలా ఏమి చేస్తావు? వస్తూ ఉన్న ఉగాదికి పచ్చడి తెస్తాను ... చిలకమ్మ పెండ్లి (గిడుగు వెంకట సీతాపతి) చిలుకమ్మ పెండ్లియని చెల్లికత్తె లందరును చీర సింగారించి చేరి కూర్చున్నారు ... పందిట పిచ్చుకలు - సందడి చేయగ, కాకులమూకలు - బాకాలూదగ కప్పలు బెక బెక - డప్పులు కొట్టగ, కుక్కురుకోయని కోడికూయగా జుమ్మని తుమ్మెద తంబుర మీటగా, కుహు కుహు కోయని కోయెల పాడగా పిల్లవాయువులు వేణు మోగగా, నెమిలి ఠీవితో నౄత్యము చేయగ! సాలీడిచ్చిన చాపు కట్టుకొని, పెండ్లికుమారుడు బింకము చూపగ సీతకోకల చీరకట్టుకొని - పెండ్లికుమారిత ప్రేమచూపగా మల్లిక మాలతి మాధవీ లతలు, పెండ్లికుమారుని పెండ్లికూతురిని దీవిస్తూ తమ పూవులు రాల్పగ, మైన గోయెంక మంత్రము చదివెను చిలుకమ్మ మొగుడపుడు, చిరునవ్వు నవ్వుతూ చిలుక మెడలో గట్టె, చింతాకు పుస్తె. అఖిల భారత బాలల దినం అదిగో అదిగో వచ్చింది - ఆనందంగా వచ్చింది అఖిల భారత బాలల దినం - అదియే మనకొక పర్వదినం నవంబరు పదునాల్గవ తేది - నెహ్రూ పుట్టిన రోజండి! భారతావనిలో బాలలందరు - బలేహుషారుగ చేస్తారు బాలసంఘాల్లో చేరిన బాలలు - పాఠషాలలకు పోయెడి పిల్లలు ఆనందంగా చేస్తారు ... - ఆడుచు పాడుచు యుంటారు నెహ్రూపటమును చేతిలోపట్టి - చాచా నెహ్రూకు జేజేలంటూ! భారతరత్నకు జేజేలంటూ - జైజై ధ్వనులతో త్రిప్పెదరు ... పెద్దలందరును పిలుచుకువచ్చి - పెద్దగ సభలు జరిపించి పుట్టినరోజు ప్రాముఖ్యతను - ప్రజలకు బాగుగ చెప్పెదరు ... ఆ రోజుననే బాలలందరు - ఆట పాటలు, నౄత్యనాటికలు అన్నియు బాగుగ చేస్తారు! - ఆనందంగా ఉంటారు దేషనాయకుడగు నెహ్రూబాబుని - దీక్షతో అందరు కొలిచెదరు పల్లెపల్లెలా పుట్టినరోజు - బాగుగ అందరు చేసెదరు. బాలల దినోత్సవం సందర్భంగా - అందరూ తెలుగు బాలబాలికలకు అభినందనలతో పాటు షుభాషీస్సులని హౄదయపూర్వకంగా తెలుగురథం తెలియజేస్తోంది. కొంపెల్ల శర్మ - అధ్యక్షులు - తెలుగురథం.

బాలల దినోత్సవం - 14 నవంబర్
విశ్వవ్యాప్తంగా పిల్లల సంబరాలు
పలు దేశాలు, అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం సంప్రదాయంగా వస్తున్నది. జెనీవా - స్విట్జిర్లాండ్ లో 1925 లో బాలల సంక్షేమాన్ని దౄష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి సమావేశం జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో లోని చైనా రాయబారి కార్యాలయం చైనా దేశపు అనాధ పిల్లలకోసం 1925 లోనే డ్రాగన్ పడవల ఉత్సవాన్ని జరపడం, అదేరోజు జూన్ 1 న బాలలకోసం సమావేశం జరపడం యాదౄచ్చకంగా జరిగిపోయాయి. యిదేరోజు అంతర్జాతీయ బాలల సంవత్సరం అనేక దేశాలు జరుపుతుండగా, పశ్చిమప్రాంతపు కమ్యునిష్టు దేశాలు వేర్వేరు తేదీన జరుపుకోవడం, కమ్యూనిష్టు దేశాల సంప్రదాయంగా కూడ ప్రారంభం అయింది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో అమెరికాలోని అధికరాజ్యాలు కూడ జరుపుకోవడం సంతోషించతగ్గది. యునెస్కో పిల్లలకి అంకితభావాలు యునెస్కో సంస్థ పిల్లలకు ప్రత్యేకంగా 1954 లో 20 నవంబర్ రోజుని ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి, యునెస్కో సంయుక్తంగా పిల్లలకోసం సౌహార్ద్రతకై ప్రత్యేకతని వివరించారు. బాలల సంక్షేమాన్ని దౄష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించేందుకు తొలిప్రయత్నాలను చేశారు. భారతదేశంలో నవంబర్ 14 నే జరుపుకోవడం, ఆనాడు భారత తొలి ప్రధాని నెహ్రూ జన్మదినం కావడం విశేషంగా భావించబడుతోంది. మనదేశంలో ముందడుగు - 14 నవంబరు పిల్లల పండగ భారతదేశపు తొలిప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన - 14 నవంబరు న జరుపుకోవడం సదాచారంగా వస్తున్నది. పిల్లలంటే ఆయనకు పంచప్రాణాలు, ఎప్పుడూ పిల్లలతో సరదాగా గడపడం, పిల్లలకు కూడ అంతకన్న అధిక సంతోషంగా గడిపేవారు. 1963 లో ఆయన మరణాంతరం, చాచా నెహ్రూ పుట్టినరోజు సంబరాలతో పిల్లలకు కూడ పండగ జరుపుకోవడం భారతీయసంప్రదాయం. బాలలు దేవుని ప్రతిరూపాలు హైందవ ధర్మసంస్కౄతీపరంపరలో మానవజన్మకు సార్ధకమైనవి చతురావస్థలు - బాల్య, యౌవన, కౌమార, వార్ధక్య దశలు. మానవుడి జీవితంలో మధురాతిమధురమైనది బాల్యదశ. బాలల గురించి అల్పంలో అనల్ప భావనను వర్ణించాలంటే, మహాకవి శ్రీశ్రీ, ఒక బాలలసంవత్సరం రోజున ఆయన వర్ణించిన కవితను - బాలలే విజ్ణాన కేతువులు, నేడు రేపుల మధ్య సేతువులు, చంద్రబంధుర సుధాశీతువులు, మానవత్వ వికాస హేతువులు, అన్న భావన అపూర్వమనే చెప్పాలి. కవిత్రయంలో మధ్యకవి, తిక్కన, మహాభారతం, ఉద్యోగపర్వంలో, తొలి తొలి గోరికొనన్ బాలునికి దగుం బాడిమెయిన్ అంటాడు. నేటి బాలలే రేపటి పౌరులు. దేశభవిష్యత్తు వారిమీద ఆధారపడింది. పిన్నలను తీర్చిదిద్దడం పెద్దల కర్తవ్యం. చిన్నప్పుడే బాలలు తమ వ్యక్తిత్వాలను రూపొందించుకునే వాతావరణాన్ని, ప్రోత్సాహాన్ని సమాజం కల్పించాలి. బాలల్లో ఉన్న కళలూ తెలివితేటలూ నిర్మాణాత్మకంగా దేశానికి ఉపయోగపడేటట్లు అవకాశాలు రూపొందించాలి. అన్ని రంగాల్లోవలనే, బాలలలోని సౄజనాత్మకశక్తినీ, కళాతౄష్ణనూ, ప్రతిభావికాసాలనూ పరిపోషించటానికి విశ్వవ్యాప్తంగా ముందంజ వేయాలి. చదువుతోపాటు బాలల సాహిత్య సాంస్కౄతిక కళావికాసాలకు కౄషిచేసే సంస్థలూ, పత్రికలూ ఎన్నో ఉన్నాయి. ఆ రంగాలలో వ్యష్టిగా జరుగుతున్న కౄషిని సమీకరించి సమిష్టిగా సమాజానికుపయోగపడే విధంగా, మరింత విస్తౄత ప్రాతిపదికతో కార్యక్రమాల్ని చేపట్టి బాలల సర్వతోముఖ వికాసానికి తోడ్పడే వ్యవస్థ నొకదానిని సుస్థిరంగా ఏర్పాటు చేయడానికి మరింత సంకల్పం, దీక్ష వహించాలి. బాలల అకాడమీలు, బాలసదనాలు, మరింత అర్ధవంతంగా, సార్ధకతను పెంపొందించేలా, కార్యకలాపాలు నిర్వహించి, బాలల విజ్ణాన, వినోద, వికాసాలకు మరింత సహాయపడాలి. బాలల అకాడమీలు కూడ విశ్వవిద్యాలయాలే! అఖిలభారతదేశంలో బాలల అకాడమీ ని స్థాపించిన గౌరవం మొదటి సారి మన రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్ కే దక్కింది. అందుకు మనల్ని మనమే అభినందించుకోవచ్చు. మనం ఈ మధ్య కాలంలోనే తరచు కనీసం చర్చించుకుంటున్న ఆత్మగౌరవం పదాన్ని కనీసం యిటువంటి ప్రయత్నాలకు అన్వయించుకోవచ్చు. కాని మన పూర్వీకులు అన్నట్లు, అంధ్రులకు ఆలోచన కన్న ఆవేశం ఎక్కువ. ఆరంభశూరులు, వెంటనే చతికిలబడతారు, లేదా నత్తనడక నడుస్తారు. బాలలలో నిత్యనూతన వికాసాన్ని కలిగించే కార్యక్రమాలను చేపట్టాలి. వాటిల్లో బాలల ప్రత్యక్ష ప్రమేయాన్ని కలిగించాలి. జాతి నిర్మాణ కార్యక్రమాల్లో తాము చిన్నప్పటినుంచీ పాల్గొంటున్నామన్న ఆత్మవిశ్వాసాన్ని బాలలలో కలిగించాలి. నడుస్తున్న చరిత్రలో వారుకూడా భాగస్వాములు కావాలి. చదువుతున్న పుస్తకాలెంత విజ్ణానాన్ని యిస్తాయో చూస్తున్న సమకాలీన సమాజం కూడా అంత విజ్ణానాన్నిస్తుంది, యిస్తోంది అన్న భావనను అందరూ గ్రహించి, దోహదపడాలి. బాలలు గతంలోనుంచి గొప్పతనాన్ని గ్రహించాలి. వర్తమానంలోనుంచి సత్తువను పెంచుకోవాలి. భవిష్యత్తుకు కావలసిన ముందుచూపును అలవరచుకోవాలి. అన్ని రంగాల్లో నాయకత్వాన్ని వహించే సమగ్ర వ్యక్తిత్వాలను పిన్న వయసులోనే సాధించాలి. అటువంటి అవకాశాలను కల్పించే సంకల్పంలో ప్రభుత్వాలు బాలల అకాడమీలను, సదనాల్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్ళాలి. బాలల సమస్యల్ని చర్చించుకోవటానికీ, నిర్మాణాత్మకమైన కార్యక్రమాల్ని బాలల సలహాసంప్రదింపులతో, రూపొందించుకోవడానికి, బాలల కళాసాహిత్య ప్రతిభలను ప్రదర్శింపచేయడానికీ, సభలను, సమావేశాలను తరచుగా, సక్రమంగా నిర్వహించుకోవాలి. పాఠశాలల్లో బాలబాలికలను సంఘాలుగా ఏర్పాటు చేయించి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దల సహాయసహకారాలతో, లలితకళలపైన, క్రీడలపైన, వినోదోల్లాసభరిత కార్యక్రమాలను నిర్వహించి, ప్రతిభావంతులకు బహుమతులు, ప్రోత్సాహాలు అందజేయాలి. బాలల అకాడమీలను కూడ విశ్వవిద్యాలయాలుగా భావించి తగు ప్రణాళికలను నిర్మాణం చేసి, ఆచరణలద్వారా సత్ఫలితాలను పొందాలన్నది నేటి తీర్మానంగా పరిగణించాలి. బాలభారతీయం ఫలించిన స్వప్నాలకి ఆకౄతులు కలకలలాడే పిల్లలు. వాళ్ళ ఉజ్జ్వల భవిష్యత్తు జాతి భవిష్యత్తు బాల్యంలోనే వాళ్ళ ఆలోచనలకు పదును, హౄదయాలకు వికాసోల్లాసాలు అవసరం. వయోమర్యాదలకు అనుగుణంగా సాహితీకళారంగాల్లో కౄషి విదేశాల్లో విజయవంతంగా శతాబ్దాలుగా సాగుతున్నది. పండితులు, నాగరికులు వయస్తారతమ్యంతో నిమిత్తం లేకుండా బరువైన ప్రౌఢసాహిత్యాన్ని తమ పిల్లలకు కధలతోనూ, పొడుపుకధలతోనూ, పాటలతోనూ, ఆటలతోనూ అలరిస్తూ బాలసాహిత్యంలో మెదళ్ళకు పదునుపెట్టే విజ్ణానంతో పాలు తక్కువ. ఈ కాలంలో వినోదంతో పాటు వైజ్ణానిక, సాంకేతిక దౄష్టి, పరిసరాలను గురించిన పరిజ్ణానం అత్యావశ్యకం. బాల్యముననున్న గుణములు వయస్సు ముదిరినను పోవు; బాల్యయవ్వనాలని బేఖాతరుగా తిరిగిన వాళ్ళూ ఎంతటి ఇంటబుట్టినా కౌమార వార్ధక్యాలలో కష్టపడక తప్పదు అన్న నగ్నసత్యాన్ని బాలలబాషలో తెలియజేయాలి. చిన్నపిల్లల స్థాయినుంచీ బాల్యస్నేహం గురించి వారి హౄదయాల్లో నాటుకునేట్లు వివరించాలి. చిన్నపిల్లల స్నేహం బీరకాయ పీచులాంటివి; అవి అతి విచిత్రంగా ఒక వీధినుండి ఇంకోవీధికి, ఒక పేటనుండి ఇంకో పేటకూ విస్తరిస్తాయి అని అంటారు, కొడవటిగంటివారి ప్రముఖ నవల చదువు లో. బాలలు, పిల్లలు ... వీరి దృౠష్టిలో ? ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారు బాలలకధల్ని సౄష్టించిన అతివౄద్ధుల్లో ప్రముఖులు. సత్యం, శివం, సుందరం అని గర్వంతో చెప్పగల, అన్నివయసులవారు ఎల్లపుడూ చదివే పెద్దలపాఠకులుకూడ ఆదరించే చందమామ పత్రికలో, ప్రముఖ బాలలకధలను అందించిన వీరు, బాలల గురించి చాలా మంచి అభిప్రాయాలు చెప్పారు. తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళయినా వాళ్ళకెటువంటి సదుద్దేశాలున్నా, కొన్ని కొన్ని విషయాల్లో పిల్లల జీవితం గురించి వాళ్ళ నిర్ణయాలు చెయ్యలేరు. చిన్నపిల్ల విశ్వాసాలు పెద్దవాళ్ళ విశ్వాసాలంత జ్ణానయుతంగా ఉండవుగాని, అంత మూఢంగా కూడా వుండవు. కొందరు పిల్లలకు బొమ్మలు ఎట్లా కావాలో, కొందరు పెద్దలకు కూడా పిల్లలు అట్లాగే కావాలి ఆడుకోవడానికి. పెద్దవాళ్ళను అంచనాకట్టే శక్తి పిల్లలకు అపారంగా వుంటుంది. పిల్లల ఉద్రేకాలను కూడా పాటించడంవల్ల జీవితం బాగుపడుతుందేకాని చెడిపోదు. చిన్నపిల్లలకు రుచిలోగాని, అభిరుచిలోగాని వ్యత్యాసాలు తెలియవు, పట్టవు కూడా. చేరదేసిన వారిని పాకులాడతారు పిల్లలు. అందువల్లనే, ప్రధమ శైశవదశలో, పిల్లలు కొందమంది పెద్దవాళ్ళదగ్గరికే వెళ్ళడం, మిగతావారిదగ్గరకు, వారిలో ఏ భూతాన్ని చూస్తారో తెలియదు కాని, ఎంతమాత్రమూ వారిదరికి చేరరు. మనకు తెలియని తేడా, పిల్లలకు వారి భాషలో, భావనలో తెలిసితీరుతుంది. బాల్యం అమూల్యం - పిల్లదనాలే గొప్పదనాలు నేటి బాలలే రేపటి పౌరులు. శిశువుల చిరునవ్వు ముందు పశువు కొమ్ము వంచునులే అంటారు సినారె. కేవలం చిరునవ్వేమిటి, అసలు బ్రతుక్కి ఆనందపు పొలిమేర పసితనంకాక మరేముంది చెప్పండి అని దాశరధి సూటిగా, గ్రుచ్చిమరీ ప్రశ్నించారు. బిడ్డలకు వర్ణమాల నేర్పుటకు ముందు ముఖత: ఎన్నియో విషయములను నేర్పవలసియుండును. వ్రాత నేర్పకపూర్వమే వారికి చదువుట నేర్పవలెను అన్ని బాలనీతిచంద్రికను వివరించారు, జాతిపిత, మహాత్ముడు, ముసిముసి బోసిబోసి నవ్వుల నాణ్యమైన నజరానా. ప్రపంచంలో పుట్టిన ప్రతి శిశువూ అంతకు ముందు పుట్టిన దానికన్నా గొప్పగా వుంటుంది. బాల్యంలో వున్నంతటి స్వచ్చమైన సంతోషమూ, తాత్కాలికమైన విచారమూ మరెక్కడైనా వుంటాయా! బాల్యంలో ఒకానొక ప్రత్యేక క్షణం వుంటుంది. ఆ క్షణం తలుపులు తెరుచుకుని భవిష్యత్తు లోపలికి అడుగుపెడుతుంది. బాలుడు కేవలం బాలుడేకాదు, వ్యక్తికి తండ్రి అని అన్నాడు వర్డ్స్క్ వర్త్. పుట్టుకతోనే పిల్లల విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. పిల్లల్ని బాగుచేయాలంటే వాళ్ళను సంతోషపెట్టడమే ఉత్తమ పద్ధతి. పిల్లలు పెరిగి పెద్దవారై మనల్ని కించపరచినా వారిని మనలో భాగంగానే చూస్తాం. ఉదయం రోజును ప్రతిబింబించినట్టు బాల్యం మనిషిని ప్రతిబింబిస్తుంది. అన్నింటినీ ఆమోదించే వయసు బాల్యం అంటాడు, ప్రముఖ కవి ముల్క్ రాజ్ ఆనంద్. మనకు విశ్వంలోని వింతల మాదిరి పిల్లల కన్నులో ఏడు వింతలు కాదు ఏడు లక్షల వింతలున్నాయన్న అద్భుతభావనని చక్కగా వెలిబుచ్చాడు, వాల్ట్ స్ట్రెయిటిఫ్ అన్న కవి. దేవ్వుడికి మనిషిమీద ఇంకా ఆశ పోలేదనే సందేశంతో ప్రతి పిల్లవాడూ ఈ భూమ్మీదకొస్తాడు, అంటాడు ఠాగూర్. మనం తరచు గమనిస్తూంటాము, పెద్దవాళ్ళ మాటలతో పిల్లలూ, వయసు మీదపడుతున్నా పిన్నచేష్టల్లా కనిపించే వౄద్ధచేతలు. అందుకే, పిల్లలు పెరిగి పెద్దవారై మనల్ని కించపరచినా వారిని మనలో భాగంగానే చూస్తాం. పిల్లలే రేపటి ఆశలు; వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించు; వాళ్ళకన్నా గొప్పవాడినని అనుకోకు; నిజానికి నువ్వు కావుకూడా అని అంటాడు రాబర్ట్ హెన్రీ. అందుకే, కరుణామయుడు క్రీస్తు, తన సందేశంలో, "నేను చిన్నపిల్లాడిగా వున్నప్పుడు చిన్నపిల్లాడిలానే ఆలోచించాను; చిన్నపిల్లాడిలానే అర్ధం చేసుకున్నాను; చిన్నపిల్లాడిలానే ప్రవర్తించాను; పెద్దయ్యాక చిన్న తరహా పనులు మానేశాను. ఈ భావనాపరంపరను అందరూ అర్ధంచేసుకుని, ముఖ్యంగా తల్లిదండ్రులు, ప్రవర్తిస్తే, పిల్లలకు, పెద్దలకు మధ్య అవగాహనారాహిత్యధోరణి, అయోమయదుస్థితి, వార్ధక్య ఛాందసప్రవౄత్తి, పుట్టినప్పటి బుద్ధి పుడకలతోనే కాని పోదు అన్న ప్రవర్తన, తరం మారుతున్నా మనమే గత్యంతరం అన్న భావన మాసిపోనంతకాలం పెద్దరికాలు యిలా చెలామణీ అవుతునేవుంటాయి. చిచ్చరపిడుగుల్లాంటి పిల్లలు చేయలేని పనులు లేనేలేవు. వారు పెద్దవాళ్ళమాట విననన్నా ఈ వౄద్ధతరం చేసేదె ఏమీలేదు. చరమదశలో మరింత ఆవేదనలు, ఆందోళనలు కూడపెట్టుకుని, అంతంతమాత్రంగా వున్న ఆరోగ్యాన్ని మరింత తగ్గించుకోవడమే కాదు. పెద్దతనానికి ఒక ప్రవేశపరీక్ష పెట్టి అర్హతను నిర్ణయించాలి. ఆ సమయం రాకమానదు. అందుకే బాల్యం, వయ్యనానికుండే లక్ష్యాలే మానవజాతి లక్ష్యాలు అన్నాడు ఓ కవి. బాల్యం అన్న సామ్రాజ్యంలో మరణాలు వుండవు అంటాడు లాంగ్ ఫెలో. తెల్లకాగితం లాంటి పిల్లల మనసుని అర్ధం చేసుకోవాలి. అల్లరి, కోతిచేష్టలు చేసినా పిల్లలు, మనిషి కోతిలోంచి పుట్టిన సంగతి ప్రతి చేష్టలో ప్రత్యక్షం చేస్తారు మన పిల్లలు. పిల్లలు తమకి అన్నం పెట్టేవారికన్న మిఠాయి కొనిపెట్టి తమతో ఆడుకునేవారిమీద యెక్కువ ప్రేమ చూపుతారని, బిడ్డలశిక్షణ అని అనూహ్యమైన కరదీపికను రచించిన చలం తన మ్యూజింగ్స్ లో అంటాడు. పిల్లలకు నా, నీ సొమ్మని భేదాలుండవు, అంతా తమ స్వంతంగా వాడుకుంటారు. అందుకే, పిల్లలు ఎవరింటికెళ్ళినా, వాళ్ళకు నచ్చినవి ఏమైనా కనిపిస్తే, అమాంతం వాటిని స్వంతం చేసేసుకుంటారు. పిల్లలు ఒక్కోసారి ప్రదర్శించే ఉద్రేకాలు కూడ వారి జీవితం బాగుపడుతుందే కాని నిరర్ధకం కావు. పిల్లలలో కొంతమంది భిన్నులు కూడా వుంటారు. పిల్లలంత మోసగాండ్రు పెద్దవారు కారు సుమా అని అంటారు, సాక్షి రచయిత పానుగంటి వారు. తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళయినా, వాళ్ళకెటువంటి సదుద్దేశాలున్నా కొన్నికొన్ని విషయాల్లో పిల్లల జీవితం గురించి వాళ్ళ నిర్ణయాలు చెయ్యలేరు అని కూడా కొడవటిగంటి వారు అన్నారు. పిల్లలను భరించలేకపోతున్నామనే తల్లిదండ్రులు అసంఖ్యాకం. పుట్టేంతవరకూ ఆరాటం. పుట్టాకా మొదటి దశలో పరిష్వంగసుఖసారం. కాస్త తెలివి, చురుకుతనం వస్తే, అల్లరి పిడుగుని భరించలేనితనం. అదే పిల్లలు అతిగా ప్రవర్తిస్తే, తప్పుదారులు పట్టితే, పెద్దయ్యాక తల్లిదండ్రులమాటని ఖాతరు చేయనంతగా ప్రవర్తిస్తే, ఆవేదన, తిరిగి ఆరాటం. కనుక, ఆరాటం నుంచి ఆరాటం వరకు తల్లిదండ్రుల పాత్ర అని చెప్పాలి. ఓషధులే తండ్రులుగా, రసవిషాలు తల్లులుగా, తయారవుతున్నారు శిశువులు అంటాడు బైరాగి. అవస్థాబాల్యం ఎదగడానికెందుకురా తొందర, ఎదర వయసంతా చిందర వందర అన్నాడో చిత్రకవి. బాల్యం నుంచే అవస్థలు, భరించలేని చదువులు, పుస్తకాల బరువులు, యింట్లో తల్లిదండ్రుల దరువులు, వెరసి ప్రేమాభిమానకరువులు. బ్రతకలేని, పూట గడవని కుటుంబాల్లో, పిల్లలే పనులకు వలసలు. సంపాదన మాట ఎలా వున్నా, పసితనంలోనే పనులభారం అమానుషం. ఎన్ని బాలకార్మికచట్టాలు వచ్చినా కంటితుడుపే. చట్టాలు కట్టలు కట్టలే తప్ప, పిల్లలకు పనికిమాలిన శాసనాలు. పిల్లల మనసులను భావాలాను రెచ్చగొట్టే విధానాలు యింతలు, మరింతలు అయితే, బాలలు హత్యలు చేయక మానతారా, జైళ్ళకు వెళ్ళి గడుపుతూ చదవక మానతారా. బాల్య వివాహాల నుంచి బయటపడినా, అవస్థాబాల్యం నుంచి బయటకు రాలేని దుస్థితి, అయోమయం లో కూరుకుపోయాము. ఆధునికత, నవీనభావుకత, మన నడకను, నడతను వక్రీకరించబడుతూ, నాణ్యత, నీతి పర్వాలకు భరతవాక్యాలను పలికిస్తున్నాయి. ప్రస్తుతకాలం, కేవలం పది వసంతాలకే బాల్యం పూర్తవుతోంది. ప్రాచీనకాలం, పుర్ణాయువు ద్విశతవసంతాలుగా చెలామణి అయినప్పుడు, బాల్యం మూడు పదులప్రాయం వరకూ గుర్తింపబడేది. నేటి బాల్యం బాల్యంగా ఎప్పుడూ రాణించడంలేదు. బాల్యావస్థని గ్రహించి అనుభూతి చెందేలోపున, దురవస్థగా మారి దుస్థితిపాలవుతోంది. కన్నలకు కష్టాలకడలి రివ్వురివ్వున వస్తోంది. బాలారిష్టాలకు బాలలే గురవుతున్నారు అప్రమేయంగా. నవమాసాల అంతర్జీవనం మాతౄగర్భంలో ఒజ్జగిలి గడిపి, పున్నామ నరక విముక్తికోసం పోరాటమే కనిపిస్తోంది. అయినా, తల్లి గర్భంలో అసౌకర్యంతో ఒదిగున్నా, నునువెచ్చని రక్తస్పర్శ నవలోకంలోకి నరింపచేస్తోంది, ప్రేమాభిమానబంధమై కలకాలం నిలుస్తోంది. ఆ బంధమే మాతౄ, పితౄ దేవోభవ రూపాన జననీజనకులకు గురుభారయోగమౌతోంది. ఓం నమశ్శివాయ అంటూ విద్యాభ్యాసం ప్రారంభించిన వెంటనే విద్యార్జన యజ్ణంలో సమిధలై విన్నూత్న ఘర్షణలకు లోనై, నిరాశానిస్పౄహలతో నిర్జీవులవుతున్నారు, మన శిశువులు, బాలమహేశ్వరులు, కుర్రలు, సుందరీబాలలు, రమణీమణులు, బాలగణపతులు, మన కుమారస్వాములు. నమ్మక వాస్తవాలమధ్య నలిగిపోతున్న మన శిశూదయావస్థలు. జన్మనిచ్చినంతమాత్రాన వారిని శాశించి, హింసించే అధికారం, హక్కులు లేనేలేవు, రావు, రాకూడదు. పిల్లలను నిత్య నరకప్రాయం చేయకండి. వారి మానాన వారిని వదలాడి, మెదలండి. వారి ఆశల అభిరుచుల చాయలనే కదలాడి కేవలం ఆర్ధికసాయం చేసే సువిధలవ్వండి. కడు హార్దికంగా మెలగవలసిన తల్లిదండ్రులైన వ్యక్తులని మరువకండి. పాపం, భూమిమీద పడినంతనే అఖండభారాలు, వెంట వెంటనే వీడిని పెద్దను చేసే రెండవప్రసవాలు. లేదా బారెడు ఎడాలు. చిన్నవాడినే పెద్దవాడిని చేసే హోదాలు, లేదా పంచవర్షప్రణాలికలు. చంటాడికి తోడులేని కడువంటరితనాలు. బాలజీవితాలకు మరింత జీవన్ టోను నివ్వండి. పెద్దరికపు గద్దెలెక్కి, అర్ధంలేని ఆజ్ణలనివ్వకండి. వారి మానాన వారిని వదలక అవమానాలపాలు కాకండి. తల్లిదండ్రులారా, గురువులారా, యిరుగుపొరుగు పెద్దలారా, అవసానదశలో అపహాస్యాన్ని ఆహ్వానించకండి. ఆబాల గోపాలాన్ని ఆనందడోలికల్లో ముంచండి. సుఖానుభూతుల్లో తిరిగి తిరిగి తేలియాడెంచండి. ఆనందోబ్రహ్మ అన్న సూత్రంతో బాలచిదానందమూర్తులను భావిభారతపౌరులని మరువక, భాగ్యవంతుల్ని, ప్రేమాభిమానభరితసుసంపన్నులని కావించండి. శతమానం భవతి అని మనసా వాచా కర్మణా ఆశీర్వచనాక్షతల్ని వారి శిశుశిరస్సులపై పేర్చండి. భావితరపు ప్రతినిధులని, భావిభారతీయతకు కర్త, కర్మ, క్రియ, నేటి శిశువులు, బాలలు అని మరవకండి. నిత్యం ఈ భావనే సదా స్మరించంది. సుఖపడండి. మీ పిల్లల్ని సుఖపెట్టండి. సత్యం, శివం, సుందరం అన్న తత్వాన్ని ఆచరించండి. బాలలకు ప్రత్యేకంగా వేదోపనిషత్తులను సౄష్టించండి. బాలరామాయణాలు, బాలభారతాల్ని నిజంగా రచించండి. బాలప్రబంధ రత్నావళి కి పుటల్ని పేర్చండి. ఆ దిశలో దశలో తరలండి, తరలిరండి, దండిగా, దండిగా. నాణ్యమైన నాలుగు సూత్రాలు ప్రముఖ శిక్షకులు, వ్యక్తిత్వ వికాస నిష్ణాతులు, బి.వి.పట్టాభిరాం గారు పిల్లల అభివౄద్ధికి, వికాసానికి, నాలుగే నాలుగు సూత్రాలను వివరించారు. 1, అంతరంగంలోని స్వఛ్ఛమైన కోరికను గ్రహించి నిర్ణయం చేసుకోవాలి. 2. ఆ కోరికను తీర్చుకునే ప్రయత్నంలో అంకితభావాన్ని ప్రదర్శించాలి. 3. పిల్లలకున్న చిన్నదైనా, చింతలులేని జీవనంలో క్రమశిక్షని - ముఖ్యంగా వ్యక్తిగతపరంగా, పాటించాలి. 4. సంకల్పం, దీక్ష వహించి వారి ఆశయాన్ని, ఆకాంక్షని సాధించాలి. బాల్యంలోనే, ఎదురైన అవకాశాలపై మురిసిపోయి అన్నీ తెలుసునన్న ధోరణిలోకి పోరాదు. ఏమీ తెలియదే అని గ్రహించి, అన్ని విషయాలు, క్రమక్రమంగా, తెలుసుకొని బాలప్రజ్ణానిగా మారేందుకు మీశైలిలో కౄషి చేయాలి. బాలసాహిత్యం లో మచ్చుతునకలు మన సాహితీపరంపరలో బాలలకు కూడ గణనీయమైన సారస్వతాన్ని ప్రసాదించారు మన సాహితీమూర్తులు. ఆ సాహితీమాధుర్యాన్ని - మహాకవి శ్రీశ్రీ, తన రచన 'శైశవగీతీలో 'ఐదారాడులా పసిపాపలను వర్ణించాడు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్ధాలు, ఏవీ ఎరుగని పూవుల్లారా, ఐదారేడుల పాపల్లారా. మెరుపు మెరిస్తే వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే, 'అవి మాకే' అని ఆనందించే కూనల్లారా. పిల్లలకే అల్లరి తెలుసు, పిల్లలదే మల్లెల మనసు, అల్లరి మల్లెలు కొల్లగ జల్లీ ఎల్లరినీ రంజించుట తెలుసు. (అజ్ణాత శైశవం - ఒక బాల సాహితీవేత్త). బాల ప్రపంచం - పాల ప్రపంచం, పాలవలె తెల్లనిది, పాలవలె తియ్యనిది, పాలవలె చిక్కనిది. (ఏడిద కామేశ్వరరావు). తెలుగు దేశపు తెలుగు పిల్లలు, తెలుగు వెలుగులండీ, తెలుగు బాలురు తెలుగు బాలికలు, తెలుగు సొమ్ములండీ. (రేడెయో అన్నయ్య - న్యాయపతి రాఘవరావు) బాల సాహిత్యంలో తొలి వెలుగులుగా - ఉగ్గుపాటలు, జోలపాటలు, లాలిపాటలు, పండుగ పాటలు, ఆటల పాటలు, ఎగతాళి పాటలు, పిల్లల రచనలు, బాలల కావ్యాలు, గేయాలు, కధలు, నవలలు, నాటికలు, నాటకాలు ఎన్నో అవతరించాయి. సాహిత్యంతో పాటు, సంగీతం, సంస్కౄతి వెలుగులోకి వచ్చాయి. బాలల దినోత్సవం నాడు పెద్దలకు సలహా నీకు క్షణం తీరిక చిక్కితే, నీ బిడ్డ కేదైనా బోధించు. నీ చేతిలో ఒక్క కాసుంటే అది నీ బిడ్డకై వెచ్చించు. నేటి బాలలే రేపటి పౌరులు. అంతేకాదు, ఫలించిన స్వప్నాలకు ఆకౄతులు, కలకలలాడే పిల్లలు. ఈ బిడ్డలకు వున్న బుద్ధే పెద్దలకు వుంటే ఈ యుద్ధాలు, ఈ కల్లోలాలూ లేని ... అంటూ ఒక పిల్లల బహుమతి ప్రదాన కార్యక్రమంలో, మహనీయుడు, పిలలలో పిల్లవాడు, నిన్నటిదాకా గౌరవంగా, గర్వంగా రాష్ట్రపతి పదవిని - నభూతో న భవిష్యతి - అని, డా. సర్వేపల్లి రాధాకౄష్ణన్ గారి తర్వాత, అత్యంత ప్రతిభావంతంగా, ప్రేరణాత్మకంగా, నిర్వహించిన వ్యక్తి - డా. అబ్దుల్ కలాం మాటలను గుర్తు చేసుకోవాలసిన శుభతరుణం ఈ రోజు కాక వేరే ఏముంటుంది? కల్లకపటం, అసూయ, ద్వేషం, రెండర్ధాల మాటలూ ఇవేవి తెలియని దేవుని ప్రతిరూపాలు బాలలు. అందుకే, 'పెద్దలు దేవుని వెదుక్కొంటూ గుడికి వెళితే ఆయన బయట పిల్లలతో ఆడుకుంటూ వుంటారూ అంటూ గుడిలోని ప్రభువును నడివీధిలోకి తెచ్చి పిల్లలతో బిళ్ళంగోడో, దాగుడుమూత దండాకోరో ఆడించారు - గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్. బాల్యం ఓ మరపురాని మధురానుభూతి. బాల్యం ఓ అందమైన కల. బాల్యం ఓ వరం. ఈ దశలో 'మనం మన బిడ్డలకు ఇవ్వగలిగినవి రెండేరెండు బహుమతులు. ఒకటి వేళ్ళు, రెండు రెక్కలు. (కార్టర్ రూట్స్). ఈ లోకాన్ని చూసి, అర్ధమయ్యీ, అర్ధం కాక తనతో దోబూచులాడే ఈ మహాఛ్ఛాయల్లోని ఇంద్రజాలానికి అధ్బుతపడి, దాన్నంతా తనలోకి తీసుకోవాలని చూసే పసిబిడ్డ ఆతౄతని ఏ కవి జీవించగలడు? (చలం). విషాదం ఏమిటంటే, మనిషి పెరుగుతూ వుంటే తన బాల్యాన్ని చేజారిపోకుండా పొదివి పట్టుకోలేకపోతున్నాడు. (పాబ్లో పికాసో). పైవి నిగ్గు తేలిన నగ్న సత్యాలు. భారత తొలి ప్రధాని నెహ్రూజీ జయంతి సందర్భంగాను, ఆయన జన్మదినోత్సవాల మధ్య జరిగే బాలలదినోత్సవాల సందర్భంగా, భారతీయ బాలపౌరులను చాచాజీలాంటి మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుముందుకు దూసుకుపోవాలనీ, రివ్వురివ్వున రెపరెపలాడుతూ, ఎగిరిపోతూండాలనీ, ఆశీస్సులనీ, అభినందనలనీ తెలుగు రథం తెలియపరుస్తూ ... బాలల విద్వత్తుకు మోకరిల్లుతూ ... కొంపెల్ల శర్మ - తెలుగురథం
విశ్వవ్యాప్తంగా పిల్లల సంబరాలు
జవహరునికి జగతి నిత్యనివాళి
జవహరునికి జగతి నిత్యనివాళి
సుదీర్ఘజీవనప్రస్థానం ( 14 నవంబర్ 1889 - మే 27, 1964 ) రాజకీయ రారాజు. భారతీయ జాతీయ కాంగ్రెస్ కి రాజీలేని రాజకీయనేత. భారతస్వాతంత్ర్యసమరంలో ప్రధానపాత్ర వహించిన ప్రజ్ణాని. స్వతంత్రభారతావనికి ప్రప్రధమ ప్రధానమంత్రి. ప్రపంచచయుద్ధం తర్వాతకాలంలో అంతర్జాతీయ రాజకీయాల్లో అందరినీ అవాక్కయేలాచేసిన అఖండుడు, అలీనవిధాన స్థాపకుల్లో ఆద్యుడు, విద్వన్మూర్తి - పండిట్ గా ప్రఖ్యాతుడు, చివరైనా, ముందువరసలో చెప్పవలసిన చారిత్రాత్మక అంశాలను విశ్వపరిణామంలో గ్రంధస్తం చేసి - భారతీయదర్శనాన్వేషణం, విశ్వచరితావలోకనాసారం, స్వీయచరిత్ర, సాహిత్యత్రయాన్ని సౄష్టించిన అధ్బుత రచయిత, నెహ్రూ-గాంధి కుటుంబానికి వారధి, భారతీయ రాజకీయప్రాస్థానంలో అపరచతురుడుగా రాణింపులు అందుకున్నవాడు, మోతీలాల్ కు ప్రియతనయుడు, యిందిరాగాంధికి తండ్రి, రాజీవగాంధికి తాత, రాహుల్ గాంధికి ముత్తాత, నెహ్రూవంశపరంపరకు మధ్యవారధి - మరెవరోకాదు - పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, పిల్లలకు చాచాజీ, ఎర్రగులాబితో ఆజన్మాంతం అవిభాజ్యనేస్తం. దేశస్వాతంత్ర్యసమరంలో ప్రధానపాత్ర వహించిన కుటుంబం మనిషి ఓ అధ్బుతమైన లక్ష్యాన్నినిర్దేశించుకుని, ఆ లక్ష్యసాధన కోసం నిరంతరం నిరాటంకంగా నిజాయితీతో కౄషి చేసుకుంటూ ముందుకు సాగితే, అది అన్నిటినీ మించిన ఆనందానికి నాంది అవుతుంది. ఆ సమయంలో సుఖశాంతులు మనిషి చరణాల వద్ద సదా సంసింద్ధంగా వుంటుంటాయి. పైగా అలాటి మనిషికి తాను అనుకున్నది సాధించడం అనే ఆత్మ సంతౄప్తి కూడా పుష్కలంగా లభిస్తుంటుంది. మనసు నిండా నిజాయితీ పెల్లుబుకుతుండాలే గాని, అటువంటి మనిషి తక్కిన ఎంతో మంది కన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు. ఈ భావపరంపరతోనే, ఒక ప్రముఖ, సుసంపన్న, సంస్కౄతీపరంపరలను పుణికిపుచ్చుకున్న త్యాగధారను అర్పించి, భారతదేశాన్ని బానిసత్వపు కోరలు, సంకెళ్ళనుంచి విముక్తి కావించడానికి చేసిన సేవలను ప్రస్తావించాలంటే, ఈ కుటుంబాన్ని ప్రప్రధమంగా పేర్కొనవలసిందే. ఆ కుటుంబం వంశానుగతంగా దేశానికి సేవలను నిత్య, సత్య, సత్వరధోరణుల్లో తనదైన శైలిలో చెరగని ముద్రలను వేయగలిగిన కుటుంబం అది. ఆ కుటుంబంలో ప్రస్తావించతగ్గ వ్యక్తి మోతీలాల్ నెహ్రూ. ఈ మహానుభావుని దేశభక్తిసేవలు వంశానుగతంగా, క్రమంగా, జవహర్ లాల్ నెహ్రూ, యిందిరాగాంధి, రాజీవగాంధి, సోనియాగాంధి, ప్రస్తుతం యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధి, ప్రియంక, లను ముఖ్యంగా ప్రస్తావించాలి. మనదేశస్వాతంత్ర్యానికి పూర్వాపరదశల్లో ప్రముఖ పాత్ర వహించిన ఈ కుటుంబం మధ్యతర ప్రతినిధిగా భారతీయదేశ తొలి ప్రధానమంత్రి, జవహర్ లాల్ నెహ్రూ ని స్మరించకుండా, జరగనిపని. యదార్ధం యీనాటి వాస్తవమయితే, ఆదర్శం రేపటి వాస్తవం అన్న సూక్తి ఈ కుటుంబానికి సంపూర్ణంగా అన్వయం అవుతుంది. పూలలో సుగంధాలు ఎంత దాచినా దాగవు. మనుషుల్లోని యోగ్యతలూ అంతే. అవి దాచినా దాగని వస్తువులు. ఈ భావన కూడా ఈ కుటుంబానికి మనసావాచాకర్మణా వర్తిస్తుంది.
ఆణిముత్యం జవహరుడు పరమపావన గంగానదీతటప్రదేశం, త్రివేణీసంగమపుణ్యస్థలి, ఉత్తరప్రదేశంలోని ప్రముఖ నగరం, అలహాబాదుకి తరలివచ్చిన కాశ్మీరుప్రాంతంలోని పరంపరగా వస్తున్న హిందూశాఖ, సరస్వతి బ్రాహ్మణకుటుంబం మోతీలాల్ నెహ్రూ - స్వరూపరాణి దంపతులకు పుత్రసంతానభాగ్యఫలంగా 14 నవంబర్ 1889 రోజు పుణ్యతిధి, దంపతుల్ని పున్నామనరకంనుంచి విముక్తి చేయబడ్దారు అన్న భావన ప్రతిబింబించిన సమయం అది. ఆ ముద్దులబిడ్డకు సార్ధకనామధేయం - ముత్యం, వజ్రం, వైఢూర్యం ముప్పేటతో కలగలిపినట్లు, 'జవహర్ లాళ్ అని పేరుపెట్టారు. ప్రతిభాశాలి, సుసంపన్నశీలి, న్యాయవాది మోతీలాల్ కు మరింత సిరిసంపదల్ని అందించిన ఆనందడోలికల్లో ముంచెత్తిన శిశువు. న్యాయవాదంతోపాటు, భారతదేశంలో అప్పటి అతిపెద్ద రాజకీయసంస్థ - భారతీయ జాతీయ కాంగ్రెశ్ లో అతిచురుగ్గా పాలుపంచుకునేవాడు. నెహ్రూకి ప్రియసోదరీమణులైన విజయలక్షి, కౄష్ణలతో ఆ కుటుంబం మహారాజప్రాకారం 'ఆనందభవనం' లో ఆంగ్లేయుల సదాచారాలు, సంస్కౄతి,వేషభాషలతో జీవనంగావించేవారు. ఆంగ్లం, హిందీలతోపాటు స్వచ్చమైన ఆంగ్లం కూడ పరిభాషలుగా చలామణి అయ్యేవి. నివాసంలోనే విద్యతోపాటు, ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేసిన నెహ్రూ 15వ ఏట ప్రకౄతిశాస్త్రం ఆధ్యయనం చేసేందుకు, యింగ్లండు, ట్రినిటి సంస్థలో, న్యాయశాస్త్రంలో మిడిల్ టెంపుల్, లండన్ లో చదువులు సాగించాడు. లండన్ లోని రంగస్థలం, ప్రదర్శనశాలలు, ఒపేరాహౌస్ పర్యటనలు, యూరోపు లో సెలవుల్లో తరచు విహారయాత్రలు చేయడం జరిగింది. ఒకవిధమైన ఆకర్షణ, స్ఫురద్రూపి, కలుపుకోరుదనం, చురుకైన తెలివైన యువకుడుగా నెహ్రూని పలుమంది పరిశీలనతో భావించేవారు. దీనికితోడుగా, భారతీయ విద్యార్ధి బౄందంలో రాజకీయ కార్యకలాపాల్లో కూడ పాల్గొనేవాడు. స్వామ్య, స్వేచ్చావాదాల్లో ఆకర్షితుడై, యూరోప్ లోని రాజకీయ, ఆర్ధికరంగాల్లో ప్రేరణకు గురయ్యాడు. స్వదేశానికి రాక - స్యయంకౄషితో వ్యక్తిత్వనిర్మాణత స్వదేశానికి రాకతో 27ఏళ్ళ యువప్రాయంతో, నెహ్రూకి ఫిబ్రవరి 8, 1916 న పదహారేళ్ళప్రాయంగల కమలా కౌల్ తో వివాహం జరగడం, తొలిదఫా దాంపత్యం విభిన్న సంస్కౄతీసంప్రదాయ ధోరణిలో కొనసాగుతున్నా, మరుసటి ఏటే, ఆడపిల్ల, ఏకైకసంతానం, 'యిందిరాప్రియదర్శనీ కలగటంతో - భావిభారతరాజకీయభాగ్యదర్శకురాలు అవతరించిదని ఆనాటి జ్యోతిష్కులకు కూడా తోచనట్లే జన్మించింది. న్యాయవాద వౄత్తిలో సుస్థిరంగా కొనసాగే ప్రయత్నాలు చేసుకున్నా, మనసుమాత్రం, ప్రపంచయుద్ధం తదుపరిదశలో తలేత్తిన వేర్పాటుధోరణి నేపథ్యంలో మార్పుచెందే భారతీయ రాజకీయజీవనం వైపే, మొగ్గుచూపింది. ఫలితంగా, సంకల్పదీక్షాకంకణబద్ధతతో లక్నో లో జరిగిన 1916 కీలక కాంగ్రెస్ సమావేశం ఆధునిక, తీవ్రభావశక్తులవిభాగాలన్ని ఏకీకౄతమయ్యాయి. భారతరాజకీయవేత్తలందరూ ముక్తకంఠంతో స్వదేశీపరిపాలన, భారతదేశానికి సర్వస్వతంత్రతను నొక్కి వక్కాణించారు. తండ్రితో సహా, తెల్లసంస్కౄతినేపథ్యంలో వున్న కాంగ్రెసు రాజకీయవేత్తలపై నెహ్రూకి అధికంగానే నిరాశ, నిరాసక్తి కలుగుతున్న తరుణంలో, మదిలో భావాలు మారుతూండడంతో పాటు, మస్తిష్కంలో అలలు, అలజడులు కదలాడాయి. భారతీయ కాంగ్రెసుకి, భారతదేశానికి కూడ భావినేత అని పలువురి భావనగా ప్రకటనలు వస్తున్నా, మహాత్మాగాంధి రాజకీయోద్యమంలో కాలిడిన తర్వాతే, నెహ్రూ రాజకీయజీవితానికి ఒక రూపు, ఊపు సంతరించుకున్నాయి. గాంధి గురుతత్వప్రేరణ - నెహ్రూ యువనాయకత్వం గాంధివాదానికి, నాయకత్వానికి ప్రభావితుడై, ఆకర్షితుడైనాడు నెహ్రూ. భారతదేశం ఉద్యోగులకు వకాల్తా తీసుకున్న దక్షిణాఫ్రికా న్యాయవాదిగా గాంధికి చాలా గుర్తింపు వచ్చింది. భారతదేశానికి తిరిగివచ్చి, గాంధి ఉద్యోగులను, రైతులను సమావేశపరచి, చంపరన్, ఖేద ప్రాంతాల్లో తెల్లదొరలు అమలుపరుస్తున్న పన్ను విధానాలపై వ్యతిరేకతను ప్రకటించడంలో వరుసగా ప్రదర్శనలను నిర్వహించడంలో ప్రముఖపాత్రను వహించాడు. వ్యతిరేకోద్యమంలో భారతీయ విశిష్టశైలిలో నిర్మాణం చేసుకున్న హింసరహితవిధానసహిత సామూహికనిరాకరణోద్యమానికి - అహింసాసత్యాగ్రహం - సంపూర్ణ అహింసాధోరణిలో నూతన ప్రక్రియను రూపొందించడంలో గాంధి ఒక కొత్త వొరవడి ప్రారంభించాడు. అంతవరకు, తెల్లదొరల పరిపాలనపై వ్యతిరేకధోరణులను ప్రకటించే పలువిధానాలు అవలంబించడానికి బదులుగా, గాంధీజీ ఒక సమైక్య వ్యతిరేకవిధానానికి రూపకల్పన కలిగించడం, భారతీయులను ఒక్క త్రాటిపై నిలబెట్టింది. ఈ తరుణంలో నెహ్రూ గాంధీని కలవడం, ఆయన వాదాలని, భావాలని ఆకళింపుచేసుకోవడం, చంపరన్ ఉద్యమంలో గాంధికి సహాయసహకారాలను అందించడంలో నెహ్రూ ముందుకురావడం అనూహ్య పరిణామంగా భావించబడింది. గాంధి అనుసరణలో భాగంగా నెహ్రూ తో తనపూర్తికుటుంబం, పాశ్చాత్యధోరణులు, వస్త్రధారణ, సుసంపన్నజీవనవిధానాలు, ఆస్థిపాస్థులపై తగ్గించుకున్న మమకారం, ఖాదీవస్త్రధారణను పూర్తిగా అమలుపరచడం లాంటి విధానాలతో, నెహ్రూకుటుంబం పూర్తిగా గాంధికి ధౄఢసహకారాన్నివ్వడం జరిగింది. అదే ప్రేరణతో, గాంధితో పాటు నిత్యం భగవద్గీత పారాయణం, యోగభ్యాసం పాటించేవారు. గాంధితో పాటు తన దినచర్య, పర్యటనల్లో వెనువెంటే వెంటాడడమే కాకుండా, నెహ్రూ తన వ్యక్తిగత జీవనవిధానంలో కూడ సలహాసంప్రదింపులను అర్ధించేవారు. 1919లో రౌలత్ చట్టాలపైనా, ఖిలాఫత్ వుద్యమానికై, గాంధితోపాటు భారతదేశంలో గ్రామగ్రామాలు తిరిగి, భారతీయకాంగ్రేస్ లో యువసభ్యులను స్వీకరించే కార్యక్రమంలో భాగంగా, అమోఘమైన రాజకీయోపన్యాసాలనివ్వడంలో ఘనాపాటిగా నెహ్రూ చాలా పేరుప్రతిష్టలను తెచ్చుకున్నాడు. ఈ వేదికలపైనే, హిందూ-మసలమాన్ ల ఐక్యత, విద్యావిధానం, స్వయంశక్తి, సాంఘికదురాచాలనిర్మూలనాంశాలు - అంటరానితనం, బీదరికం, అవగాహనారాహిత్యం, నిరుద్యోగ సమస్యలను కూలంకషతో చర్చించేవారు. ఆనాటికి సభలను ప్రతిభావంతంగా నిర్వహించే శక్తిసామర్ధ్యాలతోపాటు, అపర వుపన్యాసకేసరి అన్న పేరుతో, ఉత్తరభారతానికి తిరుగులేని, ప్రశ్నించలేని, సమాధానపరచనక్కరలేని రాజకీయప్రతిభానాయకునిగా నెహ్రూని అభివర్ణించేవారు. ప్రముఖంగా, ఉమ్మడిప్రాంతాలతోపాటు, బీహారు, మధ్యప్రాంతాల్లోని ప్రజలనాల్కలపై నిత్యస్మరణీయమంత్రంగా నెహ్రూ పేరే చెప్పుకునేవారు. సామాజికన్యాయంకోసం ఆరాటం, సమానతకై పోరాటం, నెహ్రూకున్న యువకభావాలు, చొరవ, భారతీయ ముసలమానులను, మహిళలను, యితరమతవాదులను కూడ సమానంగా ఆకర్షింపబడేవి. తనతండ్రి, గాంధిలతోపాటు, పెద్దనాయకులతోపాటు, తనని, తల్లిని బందీలనుచేయడంలాంటి విషయాల్లో, నెహ్రూ పాత్ర చాలా బాధ్యతాయుతంగా పరిణమించింది. హింసాత్మక సామూహిక ఉద్యమాల్లో చౌరిచౌరాలో 1922, ఫిబ్రవరి 4 న 22మంది పోలీసులు చంపబడ్డకారణంగా, గాంధి ఉద్యమానికి కొంత విరామం ప్రకటించడంపట్ల నెహ్రూతండ్రి మోతీలాల్ తోపాటు కొంతమంది కలసి కొత్తగా స్వరాజ్ పార్తీని స్థాపించినా కూడా, నెహ్రూమాత్రం బహిరంగంగా గాంధికి చేయూతనిచ్చాడు. ఈ పరిణామం, జాతీయోద్యమంలో కొంత ఊపు తగ్గడం, స్థానిక పరిపాలన, సాంఘికసమస్యలపై దౄష్టి మరల్చడంలో భాగంగా, నెహ్రూ 1924లో అలహాబాదు స్థానికసంస్థకు అధ్యక్షుడుగా ఎన్నికవడం, నగరముఖ్యపరిపాలకుడిగా రెండేళ్ళు వ్యవహరించాడు. యింట్లోని సమస్యలపోరున్న తరుణంలోకూడ, కమల నెహ్రూతోపాటు ప్రయాణాలు, సభల్లోపాల్గొని ఉపన్యసించడం, అమె స్వగ్రామంనుంచి కూడ జాతీయోద్యమంలో ప్రాతినిధ్యం వహించమని కోరడం జరిగేది. వివాహప్రారంభంలోని దాంపత్యముసలం, క్రమేపీ అన్యోన్యతను పెంచడం, ప్రియపుత్రిక యిందిరకు కూడ ప్రేమాభిమానాల్ని అందివ్వడం జరిగింది. 1926లో నెహ్రూ స్వయంకుటుంబం, కమల వైద్యం నిమిత్తం యూరోప్ తో పాటు, యింగ్లాండ్, స్విడ్జర్ లాండ్, ఫ్రాన్స్, జర్మని విదేశయాత్రలు చేస్తూ, అధికారదాహం, పదవీవ్యామోహం, నిరంకుశత్వం, గర్వం, దర్పం తోపాటు, అపాయాన్ని కలిగించగల సామ్రాజ్యవాదం పై వ్యతిరేకతను నిస్సంకోచంగా ప్రకటించడం జరిగింది. సోవియట్ Yఊనియన్ పర్యటనలో సైనికదళాధిపత్యపు ఆర్ధికవ్యవస్థపై నెహ్రూకి ప్రేరణ కలిగించినా, స్టాలిన్ పరిపాలన - నిరంకుశత్వ, నియంతౄత్వ, సంపూర్ణాధికారసహిత ఏకాధిపత్యవాదంపై మాత్రం తీవ్ర అసంతౄప్తి అవహించింది. యువ, స్థానికనాయకత్వం నుంచి పటేల్ ని ఢీకొన్న జాతీయనేత వరకు 1929లో అఖిలభారతీయ ట్రేడ్ యూనియన్లకాంగ్రెస్ కి అధ్యక్షుడుగా నెహ్రూ ఎన్నిక, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లిద్దరు అతిప్రాముఖ్య యువనాయకులుగా రాజకీయస్వాతంత్ర్యమే భారతావనికి శఋరణ్యమని ప్రకటించారు. 1927లో బ్రుస్సెల్స్ లో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నెహ్రూకి లీగ్ సభ్యత్వంతోపాటు, 1928లో బ్రిటిష్ పరిపాలనలో భాగంగానే, భారతదేశానికి ప్రత్యేకగుర్తింపు యివ్వాలన్న నెహ్రూతండ్రే 'నెహ్రూనివేదికా అన్నదానికే నెహ్రూ వ్యతిరేకతావిమర్శలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. నెహ్రూ, బోసుల సమూల సంస్కరణవాదం, తీవ్రధోరణుల్లో, 1928లో జరిగిన గౌహతి కాంగ్రెసు సభల్లో తలెత్తాయి. తస్మాత్ జాగ్రత్త! అన్న ధోరణిలో సామూహిక ఉద్యమంవైపు పయనిస్తామని బ్రిటిష్ ప్రభాత్వానికి సవాళ్ళను విసరాలన్న వీరి ప్రతిపాదనలకు అనేక యువకుల హౄదయాలను ఆకట్టుకున్నాయి. ఈ విషయానికి గాంధిజీ ప్రతిపాదించిన రెండేళ్ళ గడువుకై వేచిచూడాలని, సంపూర్ణస్వాతంత్ర్యం రానిదశలో, సంపూర్ణ సమగ్రస్థాయిలో జాతీయోద్యమం చేపట్టాలన్న సలహాకు, నెహ్రూ,బోసులు పట్టుపట్టి, ఏడాది గడువుకు తగ్గించడం కూడ వీరి యువప్రతిభకు తార్కాణం. గడువులు ఎప్పుడోకాని గడప దాటవు, దాటాలని ప్రయత్నాలు జరిగినా, ఎన్నో శక్తులు అడ్డుకుంటాయి. విఫలమైన చర్చలు 1929 డిసెంబరు 29 లాహోర్ కాంగ్రెసు సమావేశానికి దారితీయడం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకశక్తులసంఘటనస్థలిగా మారడం, స్వతంత్ర్యప్రతిపాదనల్లో భాగంగా గాంధీ ప్రోత్సాహంతో, నెహ్రూని అధ్యక్షుడిగా సమావేశం ఎన్నుకోవడం జరిగింది. భారతదేశపు సామాన్యప్రజానీకం, అల్పసంఖ్యాకవర్గప్రజలు, మహిళలు, యువవాహిని, గాంధిపట్ల అత్యంతాకర్షితులైనాకూడా, తీసుకున్న నిర్ణయంపట్ల, నెహ్రూతోసహా, పలువురి కాంగ్రెసువాదులు, రాజకీయపరిశీలకులు, విశ్లేషకులు ఆశ్చర్యం ప్రకటించకపోలేదు. ఈ ఆశ్చర్యంలో భాగంగా, మరింతమంది, గాంధికాని, బర్దోలి సత్యాగ్రహనాయకుడు సర్దార్ వల్లభాయిపటేల్ కాని కాంగ్రేసు అధ్యక్షపదవిని చేపట్టి, సంపూర్ణస్వరాజ్యోద్యమానికి పున:ప్రారంభాంకితంచేస్తూ శుభారంభం చేయాలని పట్టుపట్టారు. యిక్కడే భారతీయ రాజకీయ చరిత్రలో అనూహ్యమైన మలుపు తిరిగింది. అనేకమంది కాంగ్రెసువాదులు, నెహ్రూని వరించిన అధ్యక్షపీఠం, అనుభవంలేని వ్యక్తి ఆధ్వర్యంలో అతిపెద్దభారతీయరాజకీయవ్యవస్థ పగ్గాలని నడిపించడం, ఆవిద్యలో రాణించడం కష్టతరమని భావించడంతోపాటు, నెహ్రూకూడ యిదేవరసపలకడం, స్వయంప్రతిభను విశ్లేషించుకోవడమో, రాజకీయ చతురతో అంతుపట్టలేదనేది పరమసత్యం. నెహ్రూ తన ప్రకటనలో 'నిర్ణయం ఆవేశం, కోపం రప్పించాయి; కాని సమావేశం అందించిన పదవి నిస్పౄహ కలిగించకపోయినా, ఈ బరువుబాధ్యతలకు తన ప్రవేశం ముఖ్యద్వారం ద్వారా జరగలేదని, కనీసం ప్రక్కద్వారం కూడ ప్రవేశం జరగలేదని, ఒక్కసారి హుటాహుటిని రంగంలోకి దూకి బోనులో ప్రవేశించి భయభ్రాంతులమూలాన ప్రజలను అంగీకరించేలా చేసినట్లు భావిస్తున్నానూ అని తత్కాలప్రకటన చేశారు నెహ్రూ. ప్రకటన ఏదైనా, గాంధీ ప్రోద్బలంతో, నెహ్రూ కాంగ్రెసు అధ్యక్షపీఠంలో ఆసీనులయ్యారు. కాని ఈ చతురతతోకూడిన చారిత్రాత్మక ఘటన ద్వారా బయటపడిన విషయం, నెహ్రూ, పటేల్ రెండు విభిన్న ధోరణులు, శక్తులు, ఉత్తర, దక్షిణ ధృరువాలని, ధౄవాలు ఎన్నడూ కలవవు అనికూడ నిరూపణ అయ్యింది. నాటినుంచి నేటికీ కొనసాగుతున్న విమర్శధోరణి వల్లభాయి పటేల్ కాంగ్రేసునాయకత్వానికి నెహ్రూ ససేమిరా వలదన్న నెహ్రూధోరణిని ఎంతోమంది విమర్శించారు. చరిత్రలో నిష్ణాతుల కధనం ప్రకారం, సలహాలను కాదని, ద్వితీయనాయకునిగా రాజీపడని నెహ్రూ, కాంగ్రేసు విభజన పై తనవంతు అపాయాన్ని ప్రకటించాడని పెద్దల ఉవాచ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రకాంగ్రెసుసమితి వాదన ప్రకారం నెహ్రూ కన్న పటేలో ప్రతిభాశక్తులు మెండన్న భావాన్ని కేంద్రకాంగ్రేస్ సమితి అంగీకరించకపోవడం కూడ ఆశ్చర్యం. అంతేకాక, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, జె.ఆర్.డి.టాటా, మరియు ఆయన సమకాలీనప్రముఖులు, భారతదేశానికున్న సమస్యలను పరిష్కరించడంలో, నెహ్రూ కన్న పటేల్ సఫలీకౄతుడు, విజయుడు అయ్యేవాడని అభిప్రాయపడి, సలహామేరకు కూడ ఖాతరుచేయని పరిస్థితి ఆనాటిది. నెహ్రూ సోషలిజవాదం, అసమర్ధపరిపాలన, స్వచ్చందపారిశ్రామిక, ఉత్పత్తివిధానాల్లో లోపభూయిష్టవ్యవస్థ, బీదరికపుస్థితిగతుల్నించి పైకి తీసుకురాలేని దుర్గతి, అన్నింటికి సరిపడనికొద్దితనాలు, కనీసావసరాలతో జీవనానికి కూడ నోచుకోని గడ్డు పరిస్థితి నుంచి, పటేల్ బయటపడే ప్రణాళికలు, ఆచరణలు, కనీసజీవనానికి కావలసిన అవసరసదుపాయాలు, శక్తియుక్తులతో విజయం సాధించేవాడని నేటికీ అనేకమంది అంగీకరిస్తున్న వాదవేదంగా భావించబడుతోంది. చరిత్రకారులు, జాతీయహిందూవాదకులు, భారతీయముస్లిములను, లౌకికవిధానాలను తనదైన శైలిలోనే నిర్ధారించుకుని, సమర్ధించడం జరిగిందని వాదించారు. గోడమీదపిల్లివాటంలా విదేశీవిధానం, సోవియట్, యితర సోషలిజపురాజ్యాల పట్ల ఆపేక్ష వున్నందువల్లనే, కపటమిధ్యతో కూడిందని, భారతదేశభద్రతారక్షణలకొరకు కావలసిన కనీస సైన్యావసరాల్ని అంచనాకూడా వేయలేకపోవడం, యిరుగుపొరుగుశతౄదేశాలైన చైనా, పాకిస్తానులవల్ల పొంచివున్న ప్రమాదపు సూచనలనుగూడ పసిగట్టలేకపోవడం, నెహ్రూనాయకత్వం, అతని పరిపాలనావిధానం వల్ల సంతరించిన కష్టనిష్టూరాలని పలువురి ఖచ్చితాభిప్రాయం. అంతేకాకుండ, నెహ్రూ తన సుస్ఫష్టప్రతిభను కనబరిచిన విదేశాంగశాఖను నడిపిస్తూ, పటేల్ ను ప్రధానమంత్రిగా అంగీకరించిన పక్షంలో, భారతదేశంలో ఎదురవుతున్న 21వ శతాబ్దపు కష్టాలకడలితరంగాలు తాకిడి చేసేవుకావని, మరి పలువురి భావన అన్నది కూడ చరిత్ర ఘోషించింది. తనతోబాటు ఎర్రగులాబి - భార్య కమల సంకేతం జైలునుంచి విడుదలై, అనారోగ్యంతో మంచం పట్టిన భార్య కమలను చూడడానికి 1935 లో తిరిగి యూరోప్ పయనం, స్వాతంత్ర్యసమరదీక్షాకంకణం, భార్యకువైద్యసహాయం, అదేపనిగా ప్రయాణాలు చేయవలసిరావడం, చివరికి 1938 లో భార్యావియోగం అనివార్యమయింది. ఎడబాటుతనం క్షణంక్షణం వెంటాడుతున్నా, సహధర్మచారిణి అనుస్మరణసంకేతంగా, ఎర్రగులాబీపువ్వుని ప్రతినిత్యం తన చాతికి చేర్చుకోవడం ఆయన ఏరోజూ మరచిపోలేదు. అవినాభావ, జన్మజన్మలసంబంధమంటే అదే కాబోలు. జాతీయనాయకురాలుగా, కమల, నెహ్రూతోపాటు నేటివరకూ అవిభాజ్యంగానే గుర్తింపబడుతున్నారు. క్విట్ యిండియా రెండవ ప్రపంచయుద్ధం మూలాన పరిణామాలు, గాంధి, నెహ్రూ, పటేల్, బోస్, మౌలానా ఆజాద్, రాజగోపాలాచారి, మధ్య స్వాతంత్ర్యసాధనాప్రణాళికలు గుజ్జనగూళ్ళు ఆటలు ఆడాయి. పైకి ఐక్యతాచాయలు కనిపుస్తున్నాయి. చిట్టచివరికి, కాంగ్రెసునేతలందరు కలసి ముక్తకంఠంతో, తెల్లదొరలను భారతదేశనుంచి తరలిపోవాలని, 'క్విట్ యిండియా' నినాదాన్ని ప్రకటింఛారు. నెహ్రూ తన పర్యటనలో, తనతోపాటు, కాంగ్రెసుకమిటీని ఆగష్టు 9, 1942 న బంధించి, సర్వభద్రతలు కలిగిన, అహమ్మదునగర్ కోటలోని జైలులో పెట్టారు. నెహ్రూని తన సభ్యులతో, జూన్ 1945 వరకు కలవకుండ చేయడం ప్రత్యేకత. నెహ్రూ కుమార్తె యిందిరాగాంధి, ఆమె భర్త ఫిరోజ్ గాంధిని కొన్ని నెలలు జైలులో వుంచారు. ఈ సమయం లో, 1944 లో నెహ్రూకి మనవడు, రాజీవ్ గాంధి జన్మించాడు. మొదటిసారి నెహ్రూ తాతకి ఎదిగాడు. నెహ్రూ - పటేల్ మధ్య పోటీ-భేటీలతో ప్రప్రధమ ప్రధానమంత్రిత్వం - పంతం నెగ్గించుకున్న నెహ్రూ మొదటిసారి, తెల్లదొరల పరిపాలనాప్రభుత్వం, భారతదేశానికి అధికారం యివ్వాలని ఆలోచన చేయడంతో, బ్రిటిష్ కేబినెట్, నెహ్రూసైన్యాన్ని విడుదలచేయడం జరిగింది. కాంగ్రెసు అధ్యక్షపదవికై ఎన్నికలు, అధికారం ఎన్నిక కాబడిన వ్యక్తిని వరిస్తుందన్న నేపథ్యంలో రాజకీయపావులు కదలడం, 11 కాంగ్రెసు రాజ్యాల్లో పటేల్ కు పట్టం కట్టాగా, కేవలం కాంగ్రెసు పరిపాలనాసంఘం మాత్రం నెహ్రూని ఎన్నుకుంది. అప్పటికే పసికట్టిన నెహ్రూ రెండవసంఖ్యకు ససేమిరా అనడం, ప్రతిభతోసంబంధంలేకుండ, విస్తౄతస్థాయిప్రచారకుడుగా నెహ్రూకున్న స్థానాన్ని దౄష్టిలోపెట్టుకుని, గాంధి, పటేల్ ను పోటీనుంచి విరమించమని అభ్యర్ధించడం, దానికి పటేల్ వెంటనే అంగీకారం చెప్పడం, చరిత్రలో చతురకతలు, వ్యాకరణభాషలో కచటతపలు గా నిలచిపోయాయి. గాంధి నెహ్రూని సమర్ధించడం, పటేల్ ని వేరు చేయడం, గాంధి మహాత్ముడే కావచ్చు, రాజకీయానికి అతీతుడు మాత్రం కాదు అని కూడ పలువులు భావించిన ఘటన. నెహ్రూ ఎన్నికమాత్రం, కాంగ్రెసుపక్షంలోనే, అనేకమందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. నేటికాలంవరకు, యిది వివాద, వితండవాదంగా కొనసాగుతూనే వుంటుంది బహుశ. ముందుముందు కాలంలో కూడ, నెహ్రూకుటుంబం చురుకురాజకీయవౄత్తిలో వున్నంతకాలం, ఈ విషయవిశ్లేషణలు నడుస్తూనే వుంటాయి. తక్షణప్రభుత్వానికి నెహ్రూ నాయకత్వం వహించడం, మతాలమధ్య అల్లకల్లోలాలు, రాజకీయసంక్షోభం ముహమ్మద్ అలి జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ వ్యతిరేకత, ముస్లిములకు ప్రత్యేకదేశం పై మంకుపట్టు, అనివార్యస్థితిలో, పాకిస్తాను ఏర్పాటవడం జరిగిపోయాయి. చివరికి తెల్లదొరలు తమ కుతంత్రాన్ని ప్రదర్శించారు. వారి ప్రతిపాదనని, అయిష్టంగా అంగీకరించవలసివచ్చింది. జూన్ 3, 1947 న వెలువ్వడ ప్రకటన ప్రకారం, ఆగష్టు 15, 1947 న నెహ్రూ భారతప్రధానిగా పదవీస్వీకారం, తన ప్రారంభోపన్యాసాన్నివ్వడం జరిగిపోయాయి. "విశ్వం యావత్తు తన నిద్రావస్థలో మునిగిపోవగా, భారతదేశం మేలుకొలుపుకి పూనుకుంది. జాగౄతీపధంలో, జీవితాన్ని, స్వాతంత్ర్యాన్ని అనుభవించడానికి ముందుకి ప్రస్థానం సాగిన తరుణం. అది ఒకే ఒక ఆడుగు. కాని చరిత్రలో ఎప్పుడో వేయవలసిన అడుగు. ప్రాచీనత నుంచి నవీనత వైపు అడుగు. ఒక దేశం, ప్రజలు, పరాయితనుంచి అనుభవించిన బనిసత్వపు సంకెళ్ళనుంచి విముక్తిపొంది, ఊపిరి తీస్తూ అడుగు, భావాన్ని ప్రకటించలేని భావన, భావుకత. చందోబంధం నుంచి విముక్తిచెంది, సర్వస్వతంత్ర వచన కవితలా విహారం చేసిన మనసు ప్రతీ పౌరుడిది. భారతదేశానికి సేవలనందించే, మానవసేవయే మాధవసేవయే అన్న భావనతో, ప్రతిజ్ణాపూర్వకంగా, ఆత్మసాక్షీభూతంగా, ప్రమాణసహితంగా, ముందుకు వేసే అడుగు, 'పదండి ముందుకు, పదండి ముందుకు ... హరోం హరోం హర హరా అన్న మహాకవి శ్రీశ్రీ భావంతో, ముందుకు వేసే అడుగు అని నిర్ధారణతో ముందుకు వేసిన అడుగు." నెహ్రూ - పటేల్ మధ్య ఆరని అగ్నిగుండం స్వాతంత్ర్యం తెచ్చిన సంతసంతో బాటు సంక్షోభం కూడ ఎదురైంది. మతకలహాలద్వారా మడతపేచీలు పంజాబు, డిల్లీ, బెంగాల్ లో ముఖ్యంగా ఎక్కువయ్యాయి. భారత-పాకీస్తాను ప్రతినిధుల ఉమ్మడియాత్రలు, మౌలానా ఆజాద్ తోపాటు, ముస్లిం సోదరులు భారతదేశంలోనే నివాసం కొనసాగించడానికి నెహ్రూ చర్యలు చేపట్టాడు. వాతావరణం నెహ్రూని చాలా యిబ్బందిపెట్టడం, రెండు దేశాలమధ్య యుద్ధం విరమింపచేయాలని ఐక్యరాజ్యసమితిని అర్ధించడం, భయాందోళనలు మరింత అధికమవుతాయని, హైదరాబాదు రాష్ట్రం కలుపుకునేందుకు సంసిద్ధతను ప్రకటించకపోవడం, కాష్మీరు సమస్య, పాకీస్తానుతో సంబంధాలపై పటేల్ తో వివాదం, కాష్మీరు విధానంపై తనపరిధిలోనే నిర్ణయం తీసుకున్న నెహ్రూ తనశాఖపై, శాఖాధికారులని సంప్రదించకుండ నిర్లక్ష్యధోరణిపట్ల వ్యవహరించిన తీరుపై పటేల్ బాహాటంగా ప్రకటన, మరింత వివాదానికి దారి తీసింది. రాష్ట్రాల సమైక్యతపై తననుకాని, కాంగ్రెసుతోకాని సంప్రదింపులు లేకుండ తీసుకున్న పటేల్ నిర్ణయాలపై, నెహ్రూకి అహం, అధికారం ఆవహించి, పటేల్ పై తీవ్రకోపం వచ్చిందని పలువురి భావన. తాను నిర్వహిస్తున్న విధులనుంచి విముక్తి చేయమని, పటేల్ గాంధిని అర్ధించిన సన్నివేశంలో, నెహ్రూకున్న చురుకుతనం, ప్రచారం తనకు లేవని, అభిప్రాయభేదాలు, వాటిప్రకటనలు, భారతదేశాన్ని గాయపరుస్తాయని, పటేల్ సాహసోపేతంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గాంధి ఎంతో చాకచక్యంగా, వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, ఎట్టకేలకు, పటేల్ కు అయిష్టం అని తెలిసినా కూడా, జనవరి 30, 1948 న ప్రభుత్వాన్ని వదలవద్దని పటేల్ ని అర్ధించడమే కాకుండా, నెహ్రూ ప్రభుత్వంలో కొనసాగమని, ఉమ్మడి నాయకత్వంలో సాగమని చెప్పడం జరిగింది. సర్వస్వతంత్ర భారతదేశానికి పటేల్, నెహ్రూ ల ఉమ్మడి నాయకత్వం, దురదౄష్టకరమైన అవసరమన్నది తన అభిప్రాయమని గాంధి ప్రకటించారు. యాదౄచ్చికంగా, గాంధి ఈ రోజునే, హత్యచేయబడ్డారు. గాంధి పిలుపు మేరకు, ఈ దుర్ఘటనను దౄష్టిలో పెట్టుకుని, నెహ్రూ-పటేలు లు గాఢాలింగనం చేసుకుని, జాతినుద్దేశించి ప్రసంగించారు. గాంధి హత్యకు, పటేల్ గౄహమంత్రిత్వశాఖ పనితీరులో లోపం అని గుసగుసలు రావడం, పటేల్ రాజీనామాకు పట్టుపట్టడం, నెహ్రూ నిరాకరణ, ఈ సందర్భంలో, మూడుదశాబ్దాలుగా స్వాతంత్ర్యసమరానికై కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని నెహ్రూ గుర్తుచేయడం, ప్రత్యేకంగా గాంధి మరణాంతరం, మనస్పర్ధలు కూడవని నెహ్రూ చెప్పడం, దానికి పటేల్ చలించి, వ్యక్తిగతంగా, బహిరంగంగా, నెహ్రూ నాయకత్వానికి సమర్ధతను ప్రకటించాడు. భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశపు సంస్కౄతీసంప్రదాయ ధోరణులకు పునాదులు నెహ్రూ-పటేల్ ల సన్నిహిత్వంతో పాటు సంగ్రామం కూడా అందుకున్నాయి. టిబెట్, గోవా వివాదాల్లో నెహ్రూ పటేల్ తో ఏకీభవించలేదు. దేశపు తొలి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడ, రాజేంద్రప్రసాదు - రాజగోపాలాచారిల అభ్యర్ధుల వివాదం కారణంగా, జీవాత్రం కౄపలానీ కీ తన రాష్ట్రంలో ఒక్క ఓటు కూడ రాని పరిస్థితి వచ్చింది. నెహ్రూ చెప్పిందే వేదం, ఆ వాదమే కాంగ్రెసు మాట అన్న పరిస్థితి కాదని నెహ్రూ గుర్తించక తప్పలేదని పటేల్ భావించాడు. అయినా, నెహ్రూ కి కాంగ్రెసు లో బలం లేదని రాజీనామా చేయదలిస్తే, పటేలు మాత్రమే నెహ్రూని వద్దని వారించాడు. అది అందరు గ్రహించిన పటేల్ గొప్పదనం. నెహ్రూ మనస్సాక్షి అంగీకరించిన సత్యం. "సంస్కౄతికి మనం ఎటువంటి నిర్వచనాలు యిచ్చుకున్నా, అసలు సంస్కౄతిని వ్యక్తుల వరకో, సమూహాల వరకో లేదా దేశం సరిహద్దుల వరకో పరిమితం చేయడం మాత్రం - మనిషి చేస్తున్న ఎంతో పెద్ద పొరపాటూ అన్న నెహ్రూమాటనే యిక్కడ ప్రస్తావించక తప్పదు. కలసిమెలసి జీవించాడానికి బదులుగా చెయ్యగలిగింది - పరస్పర సంపూఋర్ణ నివాశమే అన్నట్లు, వీరిద్దరి మధ్యన ఒక చిన్నవినాశమే అంకురించింది. ఎన్నికలంటే, తరతమ భేదాలు లేకుండా ప్రజలందరికీ రాజకీయ పరిజ్ణానం పంచిపెట్టే విశ్వవిద్యాలయాలు అన్న నెహ్రూ సూక్తి ప్రజలకే సలహా కాని, ఆచరణకు కాదన్నది కూడ సత్యం. భారతదేశానికి నాయకుడు, నావికుడు, నెహ్రూ నే స్వాతంత్ర్యం, సంతోషాన్ని, సమరాన్ని తెచ్చినా, తరువాతి కాలంలో, నెహ్రూ తన ప్రియపుత్రిక యిందిర పై ఆధారపడడం, వ్యక్తిగతవిషయాలు ఆవిడ స్వయంగా చూసుకోవడం, నెహ్రూ తన జీవితంలో నిత్యవిషయాలువా మారాయి. 1950లో పటేల్ మరణం తర్వాత, నెహ్రూ మకుటంలేని మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్నాడన్నది వాస్తవం. 1952 ఎన్నికల్లో, నెహ్రూకి అత్యధిక బలం, అల్లుడు ఫిరోజ్ గాంధి కూడ ఎన్నికవడం, నెహ్రూ అధికారనివాసంలోకి యిందిర మారడం, నెహ్రూఅధికారాన్ని, అల్లుడు విమర్శించడం, యిందిర అతణ్ణి కాదని తండ్రిని చేరడం, అన్ని జరిగిపోయాయి. నెహ్రూతోపాటు, అధికారికంగా చేదోడుగా సహాయం చేసినది మాత్రం యిందిర అన్నదాంట్లో సందేహం లేదు. ఈ సపర్యలే, యిందిరను ఎదురులేని నాయకురాలుగానే కాకుండా, దేశపు ప్రధానమంత్రిగా మార్చాయి. తండ్రితోపాటు, తనయేందిర కూడ, విశ్వయానం చేసి విఖ్యాతగా మారింది. తండ్రి పోలికలున్న పుత్రికను పితౄముఖి ధన్య అన్న నానుడిని సార్ధకం చేసుకుండి. నెహ్రూ ఆర్ధిక విధానాలు - పంచవర్షప్రణాళికలు నెహ్రూ తనదైన 'సోషలిజపు విజణ్ సమాజవాదాన్ని, భారతదేశానికి అనువుగా భావించి మలుచుకొని, భారతీయ ప్రణాళికావ్యవస్థని స్థాపించడం, మొదటి ప్రణాళికలో భాగంగా, 1951లో వ్యవసాయ, పరిశ్రమలరంగాల్లో ప్రభుత్వపెట్టుబడులతో, మనదైన ప్రణాళికకు అంకురార్పణ చేశాడు. భారీపరిశ్రమలు, వ్యవసాయగ్రామీణాభివౄద్ధి, సమాజాభివౄద్ధిపధకం, గ్రామీణ, కుటీర పరిశ్రమలు, బహుళార్ధసాధకప్రణాళికలు, యింధనోత్పత్తి, అణూత్పత్తి, నెహ్రూ విధానాల్లో తలమానికాలు అని చెప్పకతప్పదు. కాని, నెహ్రూ ప్రధానిమంత్రిగా వున్నంతకాలం, అభివౄద్ధితోపాటు ఆహారధాన్యాలకొరత, పారిశ్రామికవిధానం, రాష్ట్రప్రణాళికలు, ఉత్పత్తిని, నాణ్యతను, లాభాసాటితనాన్ని, కొంత కుంటుపడేలా చేసినా, ఆర్ధికవ్యవస్థలో మెరుగు కనిపించినా, జనాభాసమస్య, బీదరికపుసమస్యలను వెన్నంటినా, నెహ్రూ నాయకత్వానికి వచ్చిన ప్రతిభ, ప్రచారం ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. నీరు, యింధనం, ఆరోగ్యం, రహదారులు, మౌలికసదుపాయాలు, గ్రామీణప్రజలకు, వారి అవసరాలకు అక్కరకు వచ్చాయి. రాజకీయంలో నీతి వేరు, రాజనీతి వేరు. అదే జరిగింది నెహ్రూ నాయకత్వంలో. ఫలితంగా, కొంతమంది మంత్రులపై అవినీతి ఆరోపణలు - కె.డి. మాలవ్య, ట్.టి. కౄష్ణమాచారిల రాజీనామాకు దారితీసింది. రాజకీయ, సాంఘిక విప్లవపంధా ప్రాధమికవిద్య భావిభారతదేశాభివౄద్ధికి అవశ్యమని భావించాడు. నేడు దేశమంతా నమూనాలు వెలసినవాటిల్లో - అఖిలభారతీయస్థాయిలో, వైద్యసంస్థ, సాంకేతికసంస్థ, పరిపాలానసంస్థల స్థాపనకు ఆద్యుడు, కారణభూతుడు. దేశస్థాయిలో అందరి పిల్లలకు ప్రాధమిక విద్యను ఖచ్చితంగాను, ఉచితంగాను, అందించేలా, ప్రణాళికల్లో ప్రస్తావన, పాఠశాలభవనాలనిర్మాణం, ఆహారసదుపాయాలు, వయోజనవిద్యాకేంద్రాలు, గ్రామీణప్రాంతాల్లో సదుపాయాలను కల్పించాడు. ముగింపుదశ 1957 ఎన్నికల్లో విజయం సాధించినా, నెహ్రూ ప్రభుత్వంపై సమస్యలు, విమర్శలు, అంత:కలహాలు, వెన్నుపోటులు, ముఠాకోరుతగాదాలు, విసిగివేసారి పోయాడు. ఆయన పుత్రికను కాంగ్రెసు అధ్యక్షురాలుగా 1959లో ఎన్నికవడం కూడ విమర్శరావడం, పేరురావడంతోపాటు, ప్రతిష్టకూడ దెబ్బతిన్నది. 1962 ఎన్నికల్లో నెహ్రూ విజయాన్ని, నిరాశను కూడ అనుభవించాడు. భారతీయ జనసంఘ్, స్వతంత్ర, కమ్యూనిష్టు పక్షాలకు గుర్తింపులు వచ్చాయి. విదేశాలు మనదేశభాగాల్ని ఆక్రమించడం, సైన్యపుసమస్యలవల్ల, రక్షణమంత్రిని తప్పించడం, అమెరికా సహాయాన్ని అర్ధించడం కూడ జరిగింది. యిన్ని చికాకుల మధ్య ఆరోగ్యం దెబ్బతినడం, 1963లో కాశ్మీరులో విశ్రాంతి తీసుకోవడం, 1964లో వెనక్కి రావడంతో, మే 27, 1964 ఉదయపు ఘడియల్లో, తీవ్ర అనారోగ్యంతోపాటు గుండెపోటురావడం, అంతిమశ్వాసను వదలడం జరిగింది. హిందూశాస్త్రవిధానాలతో, నెహ్రూ అంత్యక్రియలు, యమునాతీరపు శాంతివనంలో, వేలాది ప్రజల సమక్షంలో డిల్లీనగరం వీధులునిండగా, శ్మశానవాటిక నిండిపోవడం, నెహ్రూ వ్యక్తిత్వప్రతిభాపాటవానికి సంకేతం, తార్కాణం. నెహ్రూ పేరుతో ఎన్నో, మరెన్నో నెహ్రూ పేరు చెబితే, వెంటనే స్మరణకు వచ్చేవి, ఎర్రగులాబి, బాలలదినోత్సవం (నవంబరు 14 - నెహ్రూ పుట్టినరోజున), చాచా నెహ్రూ అన్న పిల్లలు పిలిచే ముద్దుపేరు, గాంధిటోపీ, జోధుపూరు కోటు, ఆయన వస్త్రధారణ, నడక, నడత, మాట తీరుతెన్నులు, ఆయన శైలి, ప్రత్యేకతలు, ఆయనవే. రిచర్డ్ అటెంబరో నిర్మించిన గాంధి చిత్రంలో నెహ్రూ పాత్ర (రోషన్ సేథ్)(1982), కేతన్ మెహతా - సర్దార్ లో నెహ్రూ (బెంజమిన్ జిలానీ), జమిల్ డెహ్లావి చిత్రం జిన్నా - నెహ్రూ పాత్ర (రాబఋర్ట్ అష్బీ), మరువలేని చిత్రవిచిత్రాలు. జవహర్ లాల్ పేరున, విశ్వవిద్యాలయం, ఓడరేవు, డిల్లీలోని నివాసం, స్మారకమందిరం, ప్రదర్శనశాల, కుటుంబనివాసాలైన ఆనందభవనం, స్వరాజ్యభవనం, నెహ్రూ మరియు ఆయన కుటుంబ సంస్మరణార్ధం కేటాయించడం, 1951లో నోబెల్ శాంతి పురస్కారం, అమెరికామిత్రసేవాసంఘం పురస్కారం, ది లాస్ట్ వైస్రాయి అన్న దూరదర్శన్ నాటకంలో, యియాన్ రిచర్డ్ సన్ ప్రతిభానటన, నెహ్రూ వ్యక్తిత్వ ప్రత్యేకతలకు నిదర్శనం. భారతీయరాజకీయప్రస్థానచరిత్ర నడుస్తున్నంతకాలం, నెహ్రూకుటుంబం దేశానికి చేసిన సేవాపరంపరలను మరచిపోవడం జరగనిపని. భారతదేశపరిపాలనావ్యవస్థలో చెరగని ముద్ర వేసిన ప్రధముల్లో, జవహరుడు ప్రప్రధముడు. జవహరుడు నిజంగా ఆణిముత్యం, వజ్రం, వైఢూర్యం. కలగలిపి జవహరుడు. జవహరునికి లాల్ సలాం. ఆయన జయంతి సందర్భంగా జవహరుడి ప్రతిభా పర్వాన్ని కించిత్తైనా సింహావలోకనం చేసుకోవడం భారతదేష పౌరునిగా ప్రతీ వ్యక్తి కనీస విధి, కర్తవ్యం. జవహరుని జయంతి సందర్భంగా తెలుగురథం ప్రణామాల్ని అర్పిస్తోంది. కొంపెల్ల - తెలుగురథం.
Tuesday, November 10, 2009
రావిశాస్త్రి వర్ధంతి - రాజీపడని రావిశాస్త్రీయ మధన కధనాలు
రాజీపడని రావిశాస్త్రీయ మధన కధనాలు
( 1922 - 1973 )
రావిశాస్త్రి వర్ధంతి - 10 నవంబర్
రచయిత ప్రతీవాడు తాను వ్రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందనీ నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను. - రావి షాస్త్రి. సశాస్త్రీయ కధనశైలి ఈ దేశపు ఈ కాలపు మేధావివర్గం చేత బ్రహ్మరధం పట్టించుకున్న రచయిత. ఆయన రచనలు చదివాక, చదవక ముందున్న స్థితిలో ఉండగలవాడు పరమజడుడై వుండాలి. ఈ రచయితలో ప్రచారగుణం పుష్కళంగా కనిపిస్తుంది. పాఠకుణ్ణి మెడబట్టుకుని నిలవేసే లక్షణకారి. శిల్పవైవిధ్యం, నూతనప్రయోగాలను సమర్ధవంతంగా చేయగలిగిన కధనశైలిని నిరంతరం అనుసరించిన రచయిత. వ్రాసిన ప్రతీ రచన, మధ్యతరగతి జీవన పునాదుల్ని కదిలించింది. ప్రతీ రచన డైనమైట్ గా భావించబచ్చు. ఈ రచయిత సౄష్టించినంతగా, మరే వర్తమాన రచయిత సాహిత్యాన్ని రాశిగా, వాసిగా, సౄష్టించలేదని మాత్రం చెప్పాలి. అని, ఈ రచయితని, ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారు విశ్లేషించారు. ఆయన ఎవరో కాదు, వౄత్తిరీత్యా న్యాయవాదీ ప్రవౄత్తిరీత్యా రచయిత. రావిశాస్త్రి గా పిలవబడే, రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు.
నిరంతరాన్వేషి - పరిపుష్టి 'రసనా ఆవిష్కర్త
ఆధునిక రచయితల్లో రావిశాస్త్రిగారిది సమున్నతస్థానం. ఈ సమున్నతస్థానాన్ని మరింతగా వివరించాలంటే, వాకాటి పాండురంగారావు గారి మాటల్లో, - మనసు ఆకాశం, ప్రశ్నలు నక్షత్రాలు, ఆ నక్షత్రాల మిణుగురు పురుగులునందుకుని, కిందకు దింపుకుని వాటి వెలుగుల సమాధానాలతో మొదట తనలోని చీకటిమూలలను వెలిగించుకుంటాడు - రచయిత అనే అన్వేషి. తనరచనావ్యాసాంగంలో, నిరంతర అన్వేషిగా, తనదైన సార్ధకత్వాన్ని నిరూపించుకున్న మహాకధకుడు - రావిశాస్త్రి. రసానుభూతానికి సాంకేతికపదాన్ని, రసన గా శ్రీశ్రీ నిర్ధారించాడు. రసనలేనిది సౄజనకాదు; సౄజనకానిది రచనకాదు. అన్వేషణతోపాటు, యువకుల తరానికి చెందిన తెలుగు కధానికా రచయితల్లో రావిశాస్త్రి రచనలే ఆశించిన 'రసనాను సమౄద్ధిగా ఆవిష్కరించగలిగాయి, అని మహాకవి శ్రీశ్రీ కితాబు యిచ్చాడంటే, రావిశాస్త్రిగారి సాహిత్యాన్ని కొలిచే తూనికరాళ్ళు లేనట్లే, ఆ కౄతులను ఆధ్యయనం చేసి, ఆ రసన ను అనుభూతి చెందుతూ, పలవరించవలసినదే. అందుకే, స్వార్ధంమీద, దౌష్ట్యంమీద పోరాటం నాటికీ, నేటికీ సాగుతూనే వుంది. తెలుగు నాట ఆ మూగవాని ప్రక్కన నిలబడి బడుగు మానిసికి అండగా రచనాశతఘ్నులను పేల్చిన మహాకవి శ్రీశ్రీ అయితే, మహాకధకుడు రావిశాస్త్రి అని తీర్మానించిన విశ్లేషకులు అనేకమంది. మహాకవి శ్రీశ్రీ సాహిత్య ప్రభావం, రావిశాస్త్రి పైన అపారం అని చెప్పాలి. శ్రీశ్రీ రచన, రుక్కులు లోని తొమ్మిదింటిని, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, రొట్టెముక్క, అరటితొక్క, బల్లచెక్క, తలుపుగొళ్ళెం, హారతిపళ్ళెం, గుర్రపుకళ్ళెం, లను వొక్కక్క కధగా రూపకల్పన చేసి, కాదేదే కవితకనర్హం అన్న కవివాక్కును రుజువు చేశారు.
రావిశాస్త్రి జీవనప్రస్థానం
శ్రీకాకుళం జిల్లా, అనకాపల్లి దగ్గరగానున్న తుమ్మపాల గ్రామంలో నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1922 జూలై 30 న జన్మించారు. తండ్రి న్యాయవాది వౄత్తినే తనయుడు స్వీకరిస్తే, తల్లి సాహితీకారిణి. ఆ తల్లి సాహితీప్రభావం తనయుడికి సంక్రమించిందన్ని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుంచి తత్వశాస్త్రంలో బి.ఎ. (ఆనర్స్) పట్టభద్రుడై, మద్రాసు విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివి, తాతగారు శ్రీరామమూర్తి వద్ద న్యాయవాదవౄత్తిలో అనేక మెలకువలను, పట్టులను అవగతం చేసుకుని, 1950 నుంచి స్వంత వ్యవహారాల్ని ప్రారంభించాడు. తొలిదశలో కాంగ్రేసువాదిగాను, 1960 దశకం నుంచి మార్కిష్టు సిద్దాంతాలకు ప్రభావితుడయ్యాడు. 1947 నుంచి న్యాయవాద వౄత్తిని ప్రారంభించిన రావిశాస్త్రి ఉద్యోగరీత్యా శ్రీకాకుళం, విశాఖపట్నంలోని పల్లెప్రజల జనజీవితాల్ని కూలంకషగా పరిశీలించడం, పట్టణజీవితాల్లో వస్తున్న మార్పులను గమనించడం అలవోకగా జరిగాయి. రావిశాస్త్రి రచనల్లో ప్రముఖంగా ప్రస్తావించదగ్గ విషయం, మాండలీక పదప్రయోగాలు. అంతేకాక, అన్యాయం, దురాచారాలు విచ్చలవిడితనంగా పెరుగుతున్న సమాజ వాతావరణ నేపథ్యంలో తన రచనలను చిత్రించడం జరిగింది.
రావిశాస్త్రి జీవనప్రస్థానం శ్రీకాకుళం జిల్లా, అనకాపల్లి దగ్గరగానున్న తుమ్మపాల గ్రామంలో నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1922 జూలై 30 న జన్మించారు. తండ్రి న్యాయవాది వౄత్తినే తనయుడు స్వీకరిస్తే, తల్లి సాహితీకారిణి
ఆధునిక రచయితల్లో రావిశాస్త్రిగారిది సమున్నతస్థానం. ఈ సమున్నతస్థానాన్ని మరింతగా వివరించాలంటే, వాకాటి పాండురంగారావు గారి మాటల్లో, - మనసు ఆకాశం, ప్రశ్నలు నక్షత్రాలు, ఆ నక్షత్రాల మిణుగురు పురుగులునందుకుని, కిందకు దింపుకు. ఆ తల్లి సాహితీప్రభావం తనయుడికి సంక్రమించిందన్ని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుంచి తత్వశాస్త్రంలో బి.ఎ. (ఆనర్స్) పట్టభద్రుడై, మద్రాసు విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివి, తాతగారు శ్రీరామమూర్తి వద్ద న్యాయవాదవౄత్తిలో అనేక మెలకువలను, పట్టులను అవగతం చేసుకుని, 1950 నుంచి స్వంత వ్యవహారాల్ని ప్రారంభించాడు. తొలిదశలో కాంగ్రేసువాదిగాను, 1960 దశకం నుంచి మార్కిష్టు సిద్దాంతాలకు ప్రభావితుడయ్యాడు. 1947 నుంచి న్యాయవాద వౄత్తిని ప్రారంభించిన రావిశాస్త్రి ఉద్యోగరీత్యా శ్రీకాకుళం, విశాఖపట్నంలోని పల్లెప్రజల జనజీవితాల్ని కూలంకషగా పరిశీలించడం, పట్టణజీవితాల్లో వస్తున్న మార్పులను గమనించడం అలవోకగా జరిగాయి. రావిశాస్త్రి రచనల్లో ప్రముఖంగా ప్రస్తావించదగ్గ విషయం, మాండలీక పదప్రయోగాలు. అంతేకాక, అన్యాయం, దురాచారాలు విచ్చలవిడితనంగా పెరుగుతున్న సమాజ వాతావరణ నేపథ్యంలో తన రచనలను చిత్రించడం జరిగింది. రచనల సమాహారం
టుకు తీసుకువెళ్ళాయి. రాజుమహిషి, రత్తాలు-రాంబాబు రచనలు ఎందుకో అసంపూర్ణంగానే వుండిపోయాయి. చివరి రచనగా, యిల్లు నవలను వ్రాశాడు. మద్యపాన నిషేధ చట్టం అందించిన బహు పరిణామాలను గమనించి, ఆరుసారాకధలు ఒక పెనుమార్పును తెచ్చిపెట్టింది. విశిష్ట పురస్కారాలకు తిరస్కౄతి సన్మానాలకు, సత్కారాలకు పరుగులుతీస్తూ, ఆ దిశలో రచనలకు ఉపక్రమించే రచయితలున్న కలికాలంలో, 1983 లో ఆంధ్రవిశ్వవిద్యాలయపు కళాప్రపూర్ణ, అంతకు పూర్వం 1966లో అందుకున్న సాహిత్య అకాడమీ పురస్కారాన్నీ తిరిగి యిచ్చివేయడం చాలామందికి అర్ధం కాలేదు. రచయిత అందించిన నటుడు రావిశాస్త్రి రచయితే కాదు, నటుడు కూడ. నిజం నాటకంలోను, గురజాడ-కన్యాశుల్కం లోను, నటనను వొలకపోశాడు. 1962 లో నిజం నాటకం శతప్రదర్శనలు జరుపుకోవడం విశేషమే. మూడు కధల బంగారం రావిశాస్త్రిగారి ధర్మేతిహాసం గా వాసికెక్కిన, మూడు కధల బంగారం నవల పై విమర్శలు మరింత వన్నెను చేకూర్చాయి. అందులో, ముదిగొండ వీరభద్రయ్యను ప్రముఖంగా ప్రస్తావించాలి. విశిష్టస్థాయిలో, రావిశాస్త్రి నిర్మాణశిల్పం, కాలం, స్థలం, ఆత్మవిమఋర్శ, స్త్రీపురుషుల నడతలు, ప్రయోజనాత్మకతలు, అలంకారసౄష్టి లాంటి విషయాల్తో, వివరించబడిన తీరుతెన్నులు, ముదిగొండ వీరభద్రయ్యను మరోరచయితగా పర
కధలు, నవలలు, నాటికలు, నాటకాలు విస్తౄతంగా రచనలు చేయడం జారిగింది. 1952 లో ప్రయోగత్మకంగా వ్రాసిన 'అల్పజీవీ నవల బహుధా ప్రశంసలను అందుకుంది. చైతన్యస్రవంతి ప్రక్రియకు నాందీప్రస్తావనలను పలికిన జేంస్జాయిస్ విధానానికి, శ్రీకారం చుట్టిన చిట్టిబాబు రచయితతో పాటు వంతు పలికిన వారిలో రావిశాస్త్రి ప్రముఖులు. ప్రముఖ ప్రక్రియను అనుసరించిన కధ ప్రక్రియలో, కధాసాగరం, ఆరుసారాకధలు, రాచకొండ కధలు, ఆరుసారోకధలతో పాటు ఆరుచిత్రాలు కూడ చాలా పేరుతెచ్చాయి. ముళ్ళపూడి వెంకటరమణ, అప్పుమీద, ౠణానందలహరి వ్రాస్తె రావిశాస్త్రి బాకీ కధలు సమాజానికి అందించాడు. నాటకాల విషయాలకొస్తే, కలకంఠి, నిజం, తిరస్కౄతి, విషాదం, బహుళప్రచారాలు. వీటితోపాటు, రావిశాస్త్రి సాహితీయాత్రలో, తనను తాను ఆలోచనావిధానాన్ని రేకెత్తించిన రచన, గోవులొస్తునా జాగ్రత్త. అంత ప్రతిభావంతంగాను అవతరించింది. ఓ మంచివాడి కధ, రావిశాస్త్రీయం, సొమ్ములు పోనాయండి అన్న రచనలు రావిశాస్త్రిని మరోమెట్టుగణింపబడ్డాడు. ప్రశంసలతో ... రావిశాస్త్రి ఈ సాహితీకారుణ్ణి ఎందరో సాహితీకారులు ప్రశంసల చిరుజల్లులతో, వర్షంతో, నింపారు. మచ్చుకు, కొన్ని --- సంకుచితమైన పరిధిలో దేంట్లేనూ ఇమడలేని వ్యక్తిత్వం కలవాడు రావిశాస్త్రి - పురాణం సుబ్రహ్మణ్య శర్మ. శాస్త్రి అనతి కాలంలో చడీచప్పుడూ కాకుండా కధక సామ్రాజ్యంలో సింహాసనం ఎక్కికూర్చున్నాడూ నలభయ్యేళ్ళకైన శ్రీశ్రీ అలాగేవున్నాడు. - అబ్బూరి వరదారాజేస్వర ఋఅఒ. బూజుని వెక్కిరించి దులిపిపారేసి కవనాన్ని మెచ్చుకునే పండితుడు. శ్రీకాళహస్తీస్వర శతకం, కమ్యూనిష్టు మేనిఫెశ్తో అని ఆంటాడు. ఎం. రామకోటి. పదహారో శతాబ్దపు షేక్స్పియర్ పాత్రల లాగున, రావిశాస్త్రి పాత్రలు కూడా కలకాలం బతుకుతాయి. అప్పారావుగారి లాగే, చలంగాలాగే, ప్రపంచ సాహిత్యంలో గొప్ప రచయితలందరిలాగే ... బ్రహ్మల్లో కూడా మహాత్ములుంటారు. ఇస్మాయిల్. రావిశాస్త్రికి సిద్ధాంతాల కన్న తనచుట్టూవున్న మనుషులు, వాళ్ళతో చనువు, వాళ్ళమీద చచ్చేటంత ఇష్టం, లేక వెటకారంతో కూడిన అయిష్టం ఎన్నో వున్నాయి. కధలలో కీలకమైన సంఘటనలు జీవితంలోంచి ఏరుకున్నవేగాని తాత్వక సూత్రాలకు అనుగుణంగా మలిచినవి కావు. - పాలగుమ్మి పద్మరాజు. శ్రామికవర్గానికి, మధ్యతరగతి సమాజపు వ్యక్తులకు. వారి సమస్యలకు తన కధనాల ద్వారా, తనదైన శైలిలో పరిష్కారాలను సఫలీకౄతంగా అందించగలిగిన, రాచకొండ విశ్వనాధశాస్త్రి, 1993 నవంబరు 10 న తన కలాన్ని, శ్వాసను కూడ విడిచాడు. రచనలో నిజమైన సాఫీదనం, నైపుణ్యం ద్వారా వస్తుంది అని అంటాడు, అలెగ్జాండర్ పోప్. గొప్ప రచయితగా వుండటమూ, గొప్పగారాయటమూ రెండూ ఒకటికాదు అని ఒక కవి చెప్పాడు. కాని దీనికి విరుద్ధం మన రావిశాస్త్రి అని చెప్పాలి. తమ ఆత్మల అంతర్గత లోకాలను ఆవిష్కరించే రచయితలే సమాజానికి అవసరం అంటాడు టాల్ స్ఠాయి. కాని వారే యిప్పుడు కరువు, కాటకం వచ్చినట్లు, నల్లపూసలు అయిపోతున్నారు. రచనా సామర్ధ్యం భగవంతుడిచ్చిన వరం. ఆ వరం రావిశాస్త్రిగారిలో పుష్కలంగా వుండేది. మరింతలుగా రావిశాస్త్రి లాంటి రచయితలు పుట్టగొడుగుల్లా అవతరించాలి, ఈనాటి కలిసమాజంపై, ప్రభావ ప్రేరణలను అందించాలి. సమసమాజోద్ధరణకు కంకణం కట్టుకోవాలి. ఆ తరుణంకోసం, నేను సైతం అంటూ ... ముందుకు పదండి !!!
Monday, November 9, 2009
'ద్వారం' - 'ఫిడేల్' వాదనకళకు సార్ధక నిర్దేశకుడు
'ఫిడేల్'వాదనకళకు సార్ధక నిర్దేశకుడు - 'ద్వారం నాయుడూ (1893 - 1964)
వాయులీనం లో విలీనమైన 'ద్వారం' ఫిడేల్, వైలెన్, వాయులీనం. ఈ పదాలు సాధారణంగా అర్ధంకానివి. పదాలు వేరైనా, వాటి అర్ధం, పరమార్ధం, ఒక్కటే. లలితకళల్లో, అజరామరమైన భాగంగా విరాజిల్లే సంగీతం. అందులోనూ వాద్యసంగీత విభాగం. వాయులీనం. దానినే, ఫిడేల్, వైలెన్ అని పిలవడం పరిపాటి. సంగీత కళకు, కళాకారులకు మధ్య వారధిలా చెలామణి అవుతున్న పరికరం. ఎందరో కళాకారుల చేతుల్లో ఒదిగిపోయి, వినయంగా తన్నుతానే సమర్పించుకున్న సంగీత పరికరం. అటువంటి కళాకారుల్లో, ప్రముఖులు, ప్రప్రధములు - 'ఫిడేళ్ నాయుడుగారు. ఆయనే 'ద్వారం' నాయుడుగారు. ఆయన, ఎవరో, వేరెవరో కాదు - ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. 'ద్వారం' ప్రపంచానికే ముద్దుపేరు సంగీత కళాజగతి కి ముద్దు పేరు 'ద్వారం'. సంగీత కచేరీ వేదిక పైన ప్రక్కనే స్థానం, సహవాద్యకారులుగా చెలామణి అవుతున్న దశనుంచి దిశానిర్దేశం కావించి, పరిపూర్ణ వాయులీన (వైలన్ లేక ఫిడేల్) సంగీత వాద్య పరికరానికి, మూగవోయిన పనిముట్టుని 'మెలోడీ ఫీస్ట్' గా మార్చడానికి కంకణం కట్టుకుని, కౄషిని సాధించిన ఘనత కేవలం ద్వారం నాయుడి గారి కళాజీవన ప్రస్థానం లో మరువలేని, మరింక మార్చలేని మైలురాళ్ళు. 20వ శ. చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ప్రధమగణంలో వినుతికెక్కిన ద్వారం వెంకటస్వామి నాయుడు గారు 8 నవంబర్ 1893 న బెంగుళూరులో దీపావళి రోజున కళ్ళు తెరవడంతో సంగీతజగతిలో మరింతగా కాంతి, వెలుగు చోటుచేసుకున్నాయి. తండ్రి వెంకటరాయుడు, ఆర్మీ లో కమీషన్ అధికారిగా ఉద్యోగం చేయడం, ఆయన ఉద్యోగ విరమణ తర్వాత విశాఖపట్నంకు వలసవెళ్ళారు. అనకాపల్లి దగ్గరలోని కాసింకోట వద్ద స్థిరపడ్డారు. అన్న వద్ద వైలన్ విద్యను అభ్యసించిన ద్వారం తండ్రికి కూడ ఈ వైలన్ విద్యలో అభినివేశం వుండడం విశేషం. తాత పేరును సార్ధక నామధేయం చేసుకున్న వెంకటస్వామి నాయుడు గారు, తన అన్నగారు వెంకటకౄష్ణయ్య, తాత దగ్గర వైలన్ నేర్చుకుంటున్న సమయంలో, మన నాయుడుగారు కూడ అన్నగారి వైలన్ ను కోరిక మేరకు రహస్యంగా కదిలించేవారట. ఫలితంగా, ఆరేళ్ళకే తమ్ముడిని వైలన్ విద్యలో పెట్టవలసివచ్చింది. దీనికి కారణాలు - తన వైలన్ ను ఏం చేస్తాడో అని అన్నకు భయం, నాయుడుగారికి కలుగుతున్న అమితమైన శ్రద్ధాసక్తులు. అంతేకాక, ముఖ్యంగా, నాయుడుగారికి చిన్నప్పుడు చూపులో కొంచెం సమస్య వున్న కారణంగా చదవడం, వ్రాయడం సమస్యగా మారుతున్న వైనంలో, సంగీతం పై దౄష్టి మరల్చవలసి వచ్చింది. ప్రాధమిక శిక్షణ తర్వాత, ప్రముఖులు పండిత సంగమేశ్వరశాస్త్రిగారి వద్ద నాయుడుగారు వైలన్ వాదనంలో నిష్ణాతులు అవ్వడం జరిగింది. అందుకే నాయుడుగారు తరచుగా నల్లరంగు కళ్ళజోడు ధరించేవారు. ఫిడేల్, వైలన్ నాయుడుగారు 14వ ఏటనుంచే వైలన్ తో తాదాత్మ్యం పొందడం, ప్రముఖ సంగీత విశ్లేషకుడు మారేపల్లి రామచంద్రరావు ద్వారం వైలన్ ప్రతిభను గమనించి, డైమండ్ ఉంగరాన్ని కానుకగా యివ్వడమే కాక, ద్వారం వారిని 'ఫిడేల్ నాయుడూ అని బిరుదుని యిచ్చేరట. వైలన్ నే ఫిడేల్ అని పిలుస్తారని చాలా మందికి తెలియని విషయం. ఫిడేల్ అంటే 'ఫిడులా' అని జర్మనీ దేశపు పదంనుంచి ఫిడేల్ అని రూపాంతరం చెంది నాయుడుగారి దగ్గరకు చేరుకుంది. అప్పటినుంచి, ఫిడేల్, ఆంధ్రదేశపు సంగీతజగతితో మమైకం అయింది. వైలన్ పుట్టు పూర్వోత్తరాలు సంగీత వాద్య పరికరమే కొత్తగా అనిపించే, వైలన్, 17శ. మధ్యకాలంలో వాయులీన పరికరాలకు ప్రాణంపోసే పాశ్చాత్యుల పుణ్యమా అని, కర్నాటక సంగీత సంప్రదాయంలో అన్యాపదేశంగా ప్రవేశించి, తిష్ఠ వేసుకుంది. మొదటిసారిగా, 'వడివేలూ అన్న విద్వాంసుడు, ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలని వైలన్ పై అందించగా, దీక్షితులవారి సోదరుడు బాలు (1786-1859) దక్షిణభారత సంగీత వినువీధుల్లోకి వైలన్ ను తీసుకొచ్చిన ఘనత మనకు అలవడిన సంప్రదాయం. తర్వాత, 19శ. ఆఖరి పాదంలో, కర్నాటక సంగీతధోరణుల్లో, వైలన్ తో సంపూర్ణ ఏకైక వ్యక్తితో కచేరీ చేయడం ప్రారంభం అవడం, దీనికి తిరుకొడికవల్ కౄష్ణ అయ్యర్, గోవిందస్వామి పిళ్ళైలు రంగ్రప్రవేశం చేశారని సంగీత చరిత్ర చెబుతున్న కధనాలు. వీణ, వేణువు, నాదస్వరం తో వైలన్ ను చేర్చిన ఘనత వాద్యసంగీతజగతిలో అంతవరకూ నిత్యనూతనంగా అలరించిన, వీణ, వేణువు, నాదస్వరం ల ఘనమైన వరసలో వైలన్ ను నిలబెట్టిన ఘనత మాత్రం మన 'ఫిడేళ్ ద్వారం నాయుడుగారే అన్నది మాత్రం సత్యం. వీటికి వైలన్, వాయులీన ప్రక్రియ ఏమాత్రం తీసిపోదని కూడ నిరూపించిన నిష్ణాతవిద్వాంసుడు - ద్వారం నాయుడు. ద్వారం గురించి ప్రముఖుల కౄషి, ప్రశంసలు నాయుడుగారి ప్రతిభను చిత్రించిన రవివర్మ పాశ్ఛాత్య, భారతీయ సంగీత మెలకువలను ఆకళింపుచేసుకున్న నాయుడుగారి వైలన్ పరికరాన్ని కచేరీలో నియంత్రించే విధివిధానాలు, నాయుడుగారి భంగిమ, చేతివేళ్ళతో తంత్రిణీస్వరలక్షణాలన్నింటినీ, ప్రముఖ చిత్రకారుడు రవివర్మ తనదైన ప్రత్యేకమైన శైలిలో నాయుడుగారి కచేరీ చేసున్నట్లు చిత్రం విశ్వవ్యాప్తంగా ఆశ్చర్యానందభూతుల్ని చేసింది. రవివర్మ చిత్రంలో నాయుడుగారి మనోధర్మ సంగీత లక్ష్యలక్షణాల్ని ప్రతిభావంతంగా ప్రదర్శించారు అన్నది మహామహుల అభిప్రాయంగా నేటికీ వినవస్తుంది. ప్రముఖ సంగీతవిద్వాంసుల మెచ్చుకోళ్ళు ద్వారం నాయుడుగారి కళాప్రతిభను కొనియాడుతూ, వివిధరంగాల్లోని ప్రముఖులు ప్రశంసలను చెప్పడం కూడ జరిగింది. అందులో, ప్రముఖ సంగీతవిద్వాంసులు - టి.యల్. వెంకట్రామ అయ్యర్, టి.వి.సుబ్బారావు, పి.సాంబమూర్తి, అరియకూడి రామానుజ అయ్యర్ (సంగీత కచేరీ సంప్రదాయానికి విధులు నిర్ణయించినవారు), తిరుకొడికవల్, ఆఖరున చెప్పుతున్నా, మొదటగా ప్రస్తావించదగిన ప్రముఖ సంగీత కళాకారుడు - శ్రీ సెమ్మనగుడి శ్రీనివాస అయ్యర్ గారు లాంటి ప్రభౄతులు ద్వారంవారి ప్రతిభను వేనోళ్ళ కొనియాడడం ఆ రోజుల్లో సర్వసామాన్యం. ప్రముఖ కవులనుంచి అనుభూతులు సంగీత విద్వాంసులతోపాటు, ప్రముఖ ఆంధ్రులు, కవులు కూడ తమ కవిత్వంలో ద్వారం వారిని మరవలేదు. వారిలో, చెళ్ళపిళ్ళ, విశ్వనాధ, బాలాంత్రపు రజనీకాంతరావు, గుర్రం ఝాషువా, గుంటూరు శేషేంద్రశర్మలను మరువలేం. సమాజంలోని అన్నివర్గాల ప్రతినిధులనుంచి ద్వారం నాయుడు గారు పొగడ్తలను అందుకున్నారు. ప్రపంచ వైలన్ విద్వాంసుడు 'యెహుది మెనుహిణ్కి శౄంగభంగం ప్రతిభ వున్న చోట అధికారంతోపాటు అహంకారం కూడ అధికమైన కళాకారులను ఆవరిస్తాయి అంటారు. ప్రపంచ ప్రఖ్యాత వైలన్ విద్వాంసుడు, 'యెహుది మెనుహిణ్ ఒక సన్నివేశంలో తన వైలన్ పరికరాన్ని, ద్వారం వారికి చూపించడానికి కూడ అంగీకరించలేదట. కాని, నాయుడుగారి వైలన్ వాదన ప్రభంజనం గమనించాక, ఈ మహానుభావుడు ఆశ్చర్యపోవడమే కాక, చివరికి ఆయన ఘనపరికరాన్ని నాయుడుగారికిచ్చి, వాయించమని వినయప్రకటన చేశాడట. అంతాకాక, ద్వారంవారిని ఆహ్వానించాడట. అదండీ, మన తెలుగు వెలుగు, తెలుగు తేజం తెలుగుదనం! గురుదేవ్ రవీంద్రుడు కలిపిన స్వరగళం ద్వారం నాయుడుగారి వైలన్ వాద్య కచేరీని కొద్ది నిముషాలే చూడగలగను అన్న గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్, అన్ని ముఖ్యకార్యక్రమాలను అనుకున్నవి మరచిపోయి, పూర్తి కచేరి వినడమే కాక, నాయుడుగారి కీర్తనలకు రవీంద్రుడు స్వరం, గళం కలిపి గానం చేయడం సంగీతచరిత్రలో ప్రముఖ సంఘటనగా నిలచిపోయింది. నిలయవిద్వాంసుల కార్యక్రమాల్లో నాయుడుగారి వైలన్ వాద్యమే ఎప్పుడూ! ఆ రోజుల్లో ఆకాశవాణి కార్యక్రమాల్లో, ద్వారం నాయుడుగారి వైలన్ కచేరీలు కోకొల్లలుగా వచ్చేవి; అంతేకాక, ప్రకటించిన కార్యక్రమాలకు అంతరాయం వచ్చిన సందర్భాల్లో, నాయుడుగారి కచేరీయే తరచుగా ప్రసారం చేసేవారట. అలాగే, కాకినాడ సరస్వతీసంగీతసభ కార్యక్రమానికి, అనుకున్నట్లుగా, గురువౄద్ధుడు, గోవిందస్వామి పిళ్ళై రాలేని పరిస్థితిలో, యువకుడు ద్వారం వారి వైలన్ కచేరీ పెట్టాలని సలహా యిచ్చారట. వయోభేదం అడ్డురాదన్న మాటకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సంగీతకళాశాలకు వన్నెలు ప్రముఖ హరిదాస పితామహులు ఆదిభట్ల నారాయణదాసుగారు విజయనగరం సంగీత కళాశాల మహామహోపాధ్యాయులుగా వున్నప్పుడు, ద్వారం వారిని కేవలం 25 ఏళ్ళకే (1919 లో), విద్యార్ధిగా పరీక్షకు వచ్చినప్పుడు చూపించిన ప్రతిభ నేరుగా వైలన్ శిక్షణ విభాగానికి అధిపతిగా నియామకానికి దారితీసింది. అంతేకాక, ఆదిభట్ల వారి తర్వాత, ద్వారం వారే విజయనగరం కళాశాల స్థానాన్ని 1936 లో ఆక్రమించారు అన్నది ద్వారం వారి ఘనప్రతిభ వెల్లడయింది. ప్రతిభాపురస్కారాలతో ద్వారం విశిష్ట ప్రక్రియలు ద్వారం వారిని వరించిన బిరుదులు, పురస్కారాలు, సన్మానాలు, అగణితాలు. 1938 లో వైలన్ సోలో ప్రదర్శన, తమిళనాడులోని వెల్లూలు లో యిచ్చారు. 1952 లో అంధుల సహాయసంస్థకు నిధులను చేకూర్చేందుకు, డిల్లీలోని జాతీయ శాస్త్రీయ సంస్థ లో ప్రదర్శన యిచ్చారు. న్యాయవాది పి.వి.రాజమన్నార్ యింట్లో ప్రముఖ అంతర్జాతీయ వైలన్ విద్వాంసుడు యేహుది మెనుహిన్ ఆశ్చర్యం మేరకు ద్వారం వారి కచేరీ జరిగింది. కర్నాటక సంగీత కచేరీ కార్యక్రమాల్లో వైలన్ ను వాడవచ్చు అన్న భావకుల్లో ద్వారం ప్రధములు అని చెప్పుకోగలిగిన ఘనత. సంగీతకళ పై ద్వారం ఎన్నో వ్యాసాలు - 'తంబూర వింతలు, విశేషాలూ అన్నది మచ్చుతునక. సంగీత కళానిధి (1941 - మద్రాసు మ్యూజిక్ అకాడమీ); కళాప్రపూర్ణ (1950 - ఆంధ్రవిశ్వవిద్యాలయం); సంగీత నాటక అకాడమీ, లలితకళలు (1953); పద్మశ్రీ (1957 - భారతప్రభుత్వం); ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన సంగీత కళాకారుడుగా నియామకం (ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ, ఉపాధ్యక్షులు). రాజలక్ష్మీ పురస్కారం (1992 - నాయుడు స్మారక సంస్థ, చెన్నై); శతజయంతి 1993 - భారతప్రభుత్వంవారి స్మారకచిహ్నంగా నాయుడుగారి తపాలాబిళ్ళ. ద్వారం సలహాలు విద్యార్ధులకు, వర్ధమాన కళాకారులకు, కనీసం ఒక్కరోజైనా సరే సాధన తప్పకూడదు అని సలహా చెప్పారు. ఒక్కరోజు తప్పితే - ఎవరి తప్పులు వారికే తెలుస్తాయి, రెండురోజులు అయితే - ప్రేక్షకులు, రసికులు కూడ తెలుసుకునే తప్పులు అని విభజించారు. నాయుడుగారు సంగీతం ఒక 'శ్రవణ తపస్సూ అని వర్ణించారు. ద్వారం నాయుడు గారి స్మారక సంస్థలు చెన్నైలో స్మారకసంస్థ, విశాఖపట్నంలో స్మారక కళాక్షేత్రం తో పాటు, విశాఖపట్నం, చెన్నైలో నాయుడుగారి విగ్రహాలు ఆయన ప్రతిభకు తార్కాణాలు, నిదర్శనాలు. 'ద్వారం' వారిపై ప్రముఖుల అభిప్రాయాలు దేశాన్ని వైలన్ వాద్యంలో ముంచెత్తి, సంగీత నాదాన్ని అందంతో, ఆనందంతో అందజేసిన మహావిద్వాంసుడు; సంస్కౄతీ పునరుద్ధరణ సమయంలో 'ద్వారం' లేని సంగీత ప్రపంచాన్ని ఆలోచించడం కష్టతరం. (కళాక్షేత్ర, వ్యవస్థాపకురాలు, ప్రముఖ నాట్యకళాకారిణి - రుక్మిణీదేవి అరండలే) ఆకాశవాణి లో ద్వారం కచేరి విని ప్రభావితమైన సంఘటన - నా జీవితంలో ఒక అమోఘమైన మైలురాయి. (నూకల సత్యనారాయణ, ప్రముఖ సంగీత విద్వాంసులు) వైలన్ విద్వాంసుడిగానే 'నూకలా ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రముఖ గాత్ర సంగీత ప్రతిభావిద్వాంసులుగా నిలిచారన్నది జగద్వితిమే. కర్ణాటక సంగీత సంప్రదాయ ధోరణి లో ఆచరించే ఒక 'ప్రోటకాళ్(సదాచారం) ప్రకారం, సహవాద్య సంగీత కళాకారుడే, గాత్ర సంగీత కళాకారుడి వద్దకు వెళ్ళడం ఆనవాయితీ. అయితే, ద్వారం వారి వద్దకు సుప్రసిద్ధ గాత్ర సంగీత విద్వాంసులు తమంత తామే స్వయంగా వచ్చి పలకరించే విధానాన్ని బట్టి, ద్వారం వారి ప్రతిభ, గౌరవం, మర్యాద, వర్ణనాతీతమైనే చెప్పాలి; కళాకారుడికి సాధనాభ్యాసాలు నిత్యావసరం అన్న సూత్రాన్ని, మనసావాచాకర్మణా, నమ్మి, మనోధర్మ ప్రవౄత్తిని ఆచరించిన కళాకారుల్లో ప్రముఖులు ద్వారం నాయుడుగారు. ఒకసారి విజయవాడ కచేరీకి వచ్చి, 'మహిమ తెలియ తరమా' అన్న కౄతి పల్లవి సరిగ్గా కుదురుట లేదని, అభిప్రాయాలను అల్పస్థాయి కళాకారులను కూడ సంప్రదించడం జరిగేది. (ప్రముఖ సంగీత విశ్లేషకులు - టి.ఆర్.సుబ్రహ్మణ్యం). నాయుడు గారి నిరాడంబరత యింత పేరు ఎలా తెచ్చుకున్నారు అని ద్వారం వారిని అడిగితే, 'ఎట్లా వాయించాలో నాకు తెలియదు; ఏదో వాయించాను; బాగుందో, లేదో, నాకు తెలియదు" అని తరచు ద్వారంవారు సమాధానం చెప్పడం వారి నిరాడంబరతా వ్యక్తిత్వానికి, హౄదయవైశాల్యతకి, మానవతకి నిదర్శనం అని పలువురి భావన. ద్వారం ప్రియరాగాలు ద్వారం నాయుడు గారిని, వారి ప్రియసంగీత రాగాలు ఏమిటని అడిగితే, తరచుగా వచ్చే రాగాలు - కాపీ, బేహాగ్, నళినకాంతి రాగాల్లో సుదీర్ఘమైన 'కరవై'లతో ప్రదర్శించే రాగాలు అని చెప్పడం, భక్తులు దైవప్రార్ధనలో మునిగిపోయి పరిసరాలను మరపించి రాగదేవతను ప్రత్యక్ష దౄశ్యం కలిగించే అనుభవం తరచుగా అయేదిట. 'ఖమాశ్, 'నీలాంబరీ లాంటి రక్తి రాగాలను అందించడంలో అధ్బుత కౌశలత్వం, విశిష్ట సౌందర్య నాదాలుద్భవించేవట. ద్వారం వారు, విజయనగర సంగీత కళాశాల నిర్వాహకత్వంలో అధిక విద్యార్ధులు వైలన్ విభాగంలోనే, గాత్ర సంగీతభాగంలో కన్న, అభ్యసించేందుకు సంసిద్ధత ప్రదర్శించేవారని, అందరూ, ఎప్పూడూ, ఈనాటికీ, అనుకునే మాట. ఆంధ్ర సంగీత జగతి చేసుకున్న పుణ్యం సంగీతకళానిధి గా విశ్వవిఖ్యాతమైన ప్రతిభను తెచ్చుకున్న ద్వారం వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ సంగీతప్రియులు చాలా అదౄష్టవంతులని, దక్షిణ, అఖిల భారత సంగీత కార్యక్రమాల్లో ప్రాతినిథ్యం వహించిన వారిలో ద్వారం వారు ప్రధముల్లో ప్రధములు అని చెప్పాలి. కళాకారుడికి వుత్పన్నమయ్యే ప్రతిభాపాటవాలు విశిష్టమై, విశ్వవ్యాప్తమైతే, తోటి వర్ధమాన కళాకారుల ప్రశంసలు కూడ తప్పక లభిస్తాయి అన్నది ద్వారం వారి విషయంలో నిజం అయి కూర్చుంది. అదే వారికీ, వారి సహకళాకారులకీ సౌభాగ్యం. విశ్వసంగీతజగతి ద్వారాలు తెరుచుకున్నప్పుడల్లా, ద్వారం వెంకటస్వామి నాయుడుగారు, వారితోపాటు, వారి మాంత్రిక వైలన్ వాదనవైభవం లేనిదే ద్వారాలు తెరచుకోవు అన్నదాంట్లో ఆశ్చర్యం, అతిశయోక్తి లేదు. ద్వారం వారి జయంతి, వర్ధంతి నవంబర్ నెలలోనే సాధారణంగా జరగడం యాదౄఛ్ఛికం. నవంబర్ 8 వారి జయంతి అయితే, నవంబర్ 25 న వారు మహాభినిష్క్రమణం చెందారు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి: అన్న నానుడి, బహుశ ద్వారం వారి వాయులీనవాదన సౌరభం విన్న తర్వాత వచ్చినది కావచ్చు. గురజాడ పదానికి ద్వారం స్వరం 'దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా' అన్న దేశభక్తి గీతానికి ప్రముఖ కవి గురజాడ సాహిత్యరచన కావిస్తే, ఆ గీతానికి స్వరరచన చేసింది మన ద్వారం నాయుడు గారే. గురజాడ శత వార్షిక సంఘం, హైదరాబాద్ సంచిక వారు ప్రచురించారు. సింధుభైరవి రాగం - మిశ్రచాపు తాళం (హనుమత్తోడి రాగ జన్యం) లో నడచిన వైనం ఆ నాడు యావద్భారతాన్ని పులకాంకితుల్ని చేసింది. ద్వారం వారికి, సందర్భంగా తెలుగురథం కళానివాళిని వినమ్రంగా సమర్పించుకుంటోంది. కొంపెల్ల శర్మ - తెలుగు రథం.

Saturday, November 7, 2009
ఎంకిపాటల నిర్మాత - నండూరి వెంకట సుబ్బారావు
ఎంకిపాటల నిర్మాత - నండూరి వెంకట సుబ్బారావు (1884 - 1957)
ప్రజల గుండెల్లో పదిలగీతాలు
వా
ప్ర
వ
నం
భా
ఆ
జా
' చేశారు మన నండూరి సుబ్బారావుగారు.
ఎం
నం
ప్ర
దుపావళి సందర్భంగా గుర్తుచేసుకోవలసిన పాట, దీపం లో - ఆరిపేయవే దీపమా, యెలుగులో నీమీద నిలపలేనే మనసు, ఆరిపేయవె దీపమా, అన్నపాటలో, వెలిగున్న దీపం సరసశౄంగారపర్వానికి అడ్డువస్తోంది కనుక ఆరిపేయవె అని మంచి పరోక్షంగా దంపతులమధ్య అన్యోన్యతను తెలిపే పాట. దీప సుందరితోటి సామత్యమా నాకు, దీప సుకుమారి దరిదావు చనగలవా (దీపసుందరి) కూడ వెలుగులమయం. ఎక్కవే కొండ నెక్కవే, నా పక్క నెంకి యెక్కవే, కొండనెక్కవే, అని ముందుగతి పాట మంచి ఊపునిచ్చింది.
నం
నం అలాగే మలిదషలో వ్రాసిన కొత్త పాటల్లో కూడ, యెంకిరాణి, ఎంకి కళ, ఎంకి కల అంటూ నామకరణం చేస్తూ, చక్కని ఔచిత్యాన్ని ప్రదర్షిస్తూ, "ఎంకితనము" అంటారు.
వై
కే
కిడూరి సుబ్బారావు గారి 'ఎంకి పాటలూ - నాటినుంచీ నేటివరకూ, ఎన్నటికీ, ఎప్పటికీ, అక్షరాలున్నంతకాలం, సంగీతస్వరాలు పల్లవిస్తున్నంతకాలం, మనకు ప్రతినిత్యం, మనజీవితాల్లో, దర్శనం అవుతూనేవుంటాయి. ప్రతివారి గుండెలెలోనుంచి సూటిగా వెచ్చగా ప్రవహించే గీతాలు - ఎంకి పాటలు - నండూరి వారి నవగీతాలు,నవ్యగీతాలు.
కొం
ప్రజల గుండెల్లో పదిలగీతాలు
క్షాత్కరించిన కవితను అందుకోవడంలో బంధాలను తెంచిన వ్యక్తి. నియమాలను మహాసాహసంతో త్రోసిపార వేయగలిగిన ధైర్యశాలి. గుండెలలోనుంచి సూటిగా, వెచ్చగా ప్రవహించే గీతాలు ఆయనివి. స్వఛ్ఛమైన భూసారంనుంచి ఉత్తేజమందిన సంస్కారం ఆ మనిషిది. హౄదయంతో భావించి, చూపుతో మాట్లాడి, ఊపిరితో తెనిగించే నిపుణమూర్తి. భావాన, భాషలో అన్నిటా సాహసంతో ఎర్రబావుటా పాతడం, ఆ తిరుగుబాటు కొందరకు 'గాలిదుమారం'గా మారడం ఆయన సాహితీజీవనపర్వంలో ముఖ్యాధ్యాయాలు. ప్రతీవారి గుండెలలోనుంచి సూటిగా వెచ్చగా ప్రవహించే గీతాలను రచించి, భావకవితాగగనవీధుల్లోకి వదలిన వదాన్యుడు - నండూరి సుబ్బారావుగారు.
సావాడుక భాష తొంగిచూస్తున్న కాలం
ాడుక, వేడుక భాషల సమరకాలం అది. సాహితీసంస్థలు కేవలం చెప్పుకోడానికే కాని, భాషాపరమైన సేవలను అందించేందుకు నేడే కాదు, ఆనాడే నత్తనడకలు నడిచాయి అనడానికి నిదర్శనం 'ఆంధ్రసాహిత్య పరిషట్. ఆంధ్ర భాషాసాహిత్యాలను ఆధునిక రీతుల్లో అభివృౠద్ధి చేయడానికి కలసిరాదని తీర్మానించుకుని, ఉత్సాహవంతులు కొంతమంది సాహితీసమితి సంస్థను ప్రారంభించారు. సాహితి అనే పత్రిక (1920) లో ప్రారంభించగా, దేవులపల్లి, విశ్వనాధ, మొక్కపాటి నరసింహశాస్త్రి (బారిష్టర్ పార్వతీశ్వం), నాయని సుబ్బారావు ప్రభౄలతోపాటు, ప్రముఖ కవి నండూరి సుబ్బారావు గారు ఒకరు. గిడుగురామమూర్తివారి భాషావాదాన్ని బలపరిచే సంఘం యిది. కాశీనాధుని నాగేశ్వరరావు గారు 'భారతీ (1924) స్థాపించారు.
వా
గురజాడ వారసుల్లో ప్రముఖులు
్రబంధకవి పూర్వబాణీలనుండి వచ్చిన కవిత్వానికి పయనిస్తున్నప్పుడు శబ్దం పై మక్కువ ఎక్కువ చూపడం సహజమే. భావానికి పట్టం కట్టినా, దాని చుట్టూరావున్న ప్రౌఢిమ పట్టు పరదాలు చుట్టబెట్టే ప్రయత్నంలో, గురజాడ వారసత్వ పరంపరలో భాషాసారళ్యానికి ప్రయత్నించిన వారిలో ప్రముఖులుగా - బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు గార్లను చెప్పుకోవాలి.
ప్ర
భావగీతకవితావాహినిలో నండూరి - ఎంకి
ర్డ్స్ వర్త్ ను గురజాడ ఆదర్శంగా చేసుకుని బహుళ ప్రచారం చేశారు. ఆధునిక కవులు సామాన్య ప్రజల సుఖదు:ఖాలన్నీ ఒక్కలాంటివే అనీ, మానవుల్లో ఎక్కువతక్కువలు లేవనీ, ధనిక బీద తేడాలుండవనీ, ఏ యితివౄత్తాన్నైనా తీసుకుని కవిత్వం చెప్పవచ్చనే భావన వున్న కాలం అది. సర్వసామాన్యులైన పాటల ద్వారా ప్రజల అనురాగాలు, అభిలాషలు, అభిమానాలు, అందచందాలు, భావానుభావాలను భావయుక్తంగా ప్రకటించే ప్రయత్నంలో తనదైన ప్రతిభను ప్రదర్శించి, గురజాడ ఆశయాలలో ఆచరణలోకి తెచ్చిన భావకవితామూర్తి - నండూరి సుబ్బారావు. నండూరి వారు వ్రాసిన 'ఎంకిపాటలూ మరోసౄష్టిని కలిగించాయి. గురజాడ - పున్నమ, విశ్వనాధ - కిన్నెర లాగా నండూరి - ఎంకి పాటలద్వారా కదంతొక్కింది. ఆనాడు గాలి దుమారం రేగినా, ఆ గొడవలు చల్లారి, చక్కని పాటలు మాత్రం నేటికీ నిత్యనూతనంగా అలరిస్తూనేవున్నాయి.
వ
నండూరి వ్యక్తిత్వం
ండూరి వెంకట సుబ్బారావుగారు 9 నవంబర్ 1884 లో జన్మించారు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో చదువుకున్నారు. ఆరోజుల్లోనుంచే కవిత్వం వ్రాయడం మొదలయ్యింది. న్యాయవాదవౄత్తిని చేపట్టారు. న్యాయవాదంతోనే కవితావాదం చేశారు.
నం
నండూరి గొంతునుంచి విన్న శ్రీశ్రీ
ావ కవిత్వ స్వభావ, ప్రభావాల ప్రాభవం వెలిగిపోతున్నకాలంలో వయసుకి తగ్గ వైఖరి, ఆశ్చర్యం లేని స్ఫురణలు, భావకవులను ఆవహించాయి. ప్రముఖ భావకవులు అంతా, 1891-1900 మధ్య కాలంలోనే జన్మించారు. ఆరుద్రగారు 18 మంది ప్రముఖ భావకవులను వివరించారు. సనాతనుల దూషణలు, సమకాలికుల సహౄదయ దీవెనలు వర్షిస్తున్న కాలం. అయితే, వీరందరి భావకవిత్వ సమగ్ర స్వరూప దర్శనం అపురూపంగా పరిగణించబడింది. ముద్దుకౄష్ణ భావకవులపై 'వైతాళికులూ సంకలనాన్ని తీసుకువచ్చారు. మహాకవి శ్రీశ్రీ కూడ కొంపెల్ల జనార్దనరావు ద్వారా మద్రాసులో తొలిసారిగా ఎందరో వాంగ్మయమూర్తులను కలుసుకోవడం జరిగిందని చెప్పినవారిలో నండూరి వారు ప్రముఖులే కాక, మొదటిసారి నండూరి సుబ్బారావు గారి ముఖతా 'ఎంకిపాటలూను వినడం జరిగిందని చెప్పాడు.
భా
నండూరి భావకవితలకు అడవి బాపిరాజుగారి భావనాచిత్రాలు
నాటి విశ్వనాధ కిన్నెరపాటలకి, నండూరి ఎంకిపాటలకి, ప్రముఖ కవి, చిత్రకారుడు, అడవి బాపిరాజుగారు చిత్రాలని వేయడం పాటలకి మరింత సొగసుని కలిగించాయి.
ఆ
జానపద సొగసు గుబాళింపులు
ానపదుల్ పురీజనుల్ సంతసముం బ్రమదం బెలర్పనీదైన శుభోదయంబ హౄదయంబుల గోరుచునున్న వారు - అని ఎర్రన అంటాడు. అటువంటి జానపద పరిమళశోభితమైన భావగీతాలు, నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటలు. అదే తీరులో నడుస్తాయి ఎంకిపాటలు.
జా
ఎంకివొంటీ పిల్ల లేదోయ్!
ఎంకీని సరైన భావంతో ఊహించడం బహు దుర్లభం. సుబ్బారావుగారి భావనతో భావించడం యింకా క్లిష్టతరం. ఎంకి ఆకారం నండూరి వారి భాషలోనే చెప్పాలంటే - మెళ్ళో పూసలపేరు, తల్లో పూవులసేరు, కళ్ళెత్తితే కనకాభిషేకాలు, చెక్కిట చిన్నమచ్చ, వొక్క నవ్వే యేలు వొజ్జిర వొయిడూరాలు, పదమూ పాడిందంటే పాపాలూ పోవాల!, కతలూ సెప్పిందంటే కలకాల ముండాల! రాసోరింటికైన రంగు తెచ్చే పిల్ల అని వర్ణిస్తారు. సరిగ్గా, అలాగే, ఎంకిపాటలు కలకాలం ఉండేలానే రచించి, చిరస్థాయిగా భద్రపరచుకునేలా
' చేశారు మన నండూరి సుబ్బారావుగారు.
నాయకి 'ఎంకీ
ంకి నాయకి మనకు అడుగడుగునా పఠితల్లోకి దూసుకు వస్తుంది. సుబ్బారావుగారు పాటల శీర్షిక గమనిస్తే, ఎంకి పేరుతోనే చాలా పాటలు ఉన్నాయి. అవి, ఎంకితనం, ఎంకితో భద్రాద్రి, ఎంకికళ, ముద్దుల నా యెంకి, ఆ కాలపు నా యెంకి, ఎంకికల, సత్తెకాలపు నా ఎంకి, కటిగ్గుండెల నా ఎంకి, యెంకిపయనం, యెంకిసూపు, యెంకిరాణి, దూరాననాయెంకి, యేటిదరి నా యెంకి, నమిలిమింగిన నా ఎంకి, ఎంకితో తిరుపతి, ఎర్రినాఎంకి, ఎంకి ముచ్చట్లు, గమనిస్తే, ఒక వ్యక్తి సాధారణ మానవజీవితంలో నిత్యం కదలాడే సంగతులు, విషయాలు మనకు ఈ శీర్షికలా స్ఫురిస్తాయి.
ఎం
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ!
ండూరి వారు రచించిన ఎంకిపాటలు 'ముద్దుల నా యెంకీ అన్న పాట 'గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ' అన్న పల్లవితో శ్రీకారం చుట్టడమేకాదు, అదే పేరుతో ఎంకి పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. మద్రాసులో కాలేజీనుండి వస్తూ ట్రాంబండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అలవోకగా స్ఫురించిన సాహిత్యం ఎంకిపాటలకు నాందీప్రస్తావనలు పలకడం జరిగింది. ఈ పాటల్లో విశేషం ఏమిటంటే, కేవలం పాటలను రచించడమే కాక, ప్రతీపాటకు సంప్రదాయంగా సంగీత స్వరబద్ధం చేయడం మరొక విశేషం.
నం
ఎంకి పాటలు
్రతీ కవి హౄదయం వున్న వ్యక్తీ, నండూరిని, ఎంకిపాటలని తలచుకొన్నప్పుడు, నా సొమ్ము నా గుండె నమిలి మింగిన పిల్ల, యెంకివొంటీపిల్ల లేదోయ్ అని నిత్యమంత్రజపం చేయాల్సిందే.
ప్ర
ురూడా! అన్న పాటలో, యెంకి! మన మిద్దరమె యెవ్వరొద్దన్నాడు, కలకాల మీ దినమె నిలుసు మనకన్నాడు, గాలికైనా తాను కవుగిలీనన్నాడు, నను సూసి నవ్వేవు-నాయమా నాముద్దు, మద్దె సెంద్రుడె మనకు పెద్దమనిసన్నాడు, అన్న పదాలలో పొదిగిన శౄంగారరసం యింతకన్న మధురంగా ఎక్కడ కనిపిస్తుందో చెప్పేవాళ్ళకి ఒక సవాలు అనే చెప్పాలి. సత్తెకాలపు నాయెంకి అన్న పాటలో, 'నీతోటే వుంటాను నాయుడు బావా' అన్న పాట, తెలుగుసినీమాలో నీతోటి వుంటాను శేషగిరిబావా' అని పెట్టి పేరుపొందారు. యెర్రి నాయెంకి అన్న పాటలో - యెనక జన్మములోన యెవరమో నంటి, సిగ్గొచ్చి నవ్వింది సిలక నా యెంకీ అన్నపాటలో, సిగ్గొచ్చి నవ్వింది అన్నది మంచి ప్రయోగం. దీ
చెందుపావళి సందర్భంగా గుర్తుచేసుకోవలసిన పాట, దీపం లో - ఆరిపేయవే దీపమా, యెలుగులో నీమీద నిలపలేనే మనసు, ఆరిపేయవె దీపమా, అన్నపాటలో, వెలిగున్న దీపం సరసశౄంగారపర్వానికి అడ్డువస్తోంది కనుక ఆరిపేయవె అని మంచి పరోక్షంగా దంపతులమధ్య అన్యోన్యతను తెలిపే పాట. దీప సుందరితోటి సామత్యమా నాకు, దీప సుకుమారి దరిదావు చనగలవా (దీపసుందరి) కూడ వెలుగులమయం. ఎక్కవే కొండ నెక్కవే, నా పక్క నెంకి యెక్కవే, కొండనెక్కవే, అని ముందుగతి పాట మంచి ఊపునిచ్చింది.
మలిదశగా కొత్తపాటలు
ండూరి వారు ఎంకి పాటలను, మలిదశగా కొత్త పాటలని రచించారు. కోటిగొంతులు కలసి పాటపాడే తీరు, వెలుగు నీడల నడుమ నిలిచి ఆలింతు - అని చీకటి వెలుగులు అన్న పాటతో పున:ప్రారంభం కావించారు. పూలబాసలు తెలుసు యెంకికీ తోటపూల మనసు తెలుసు యెంకికీ, యింతేనటే సంద్రమెంతో యనుకొంటి మనకూ సూరీడుకూ మద్దెనుండేనా!, పూవు నేనైతే నీ వలపునౌదు - పూనిన్నె జగమంత ధ్యానింపజేతు,
నం
ూరి వారు ఎంకిపాటలని - 'ముద్దుల నా ఎంకీ అన్న సరస పరిచయంతోటి శ్రీకారం చుట్టి, ఉత్తమాటలు అన్న పాటతో మొదటిభాగాన్ని రచించారు. రెండవభాగాన్ని, 'వెలుగునీడలూ అని ఎంకిని తత్వధోరణిలోకి దింపి, తన పాటల రచనను తపస్సుగా భావించారో ఏమో, 'తపస్సూ అన్న పాటలో - సాగరుని సల్లాపమాఅ అల చందురుని ఉల్లాసమా సిక తాతలాల విలాసమా, ఆ పగిది బంధించు నీకనుపాప నెయ్యది తాపసీ? అని సుమనోల్లాసంగా, జనరంజకంగా స్వస్తి పలికారు.
నండూ'నండూరీ ఎంకి పాటలు - ఎనలేని అమౄత ఘుటికలు
ిరవై శతాబ్దికాలం తెలుగుసారస్వతంలో నండూరి వారి ఎంకి పాటలను, పండితులకు సైతం రూపింప శక్యము కాని రసస్వరూపాలు, భావనాశక్తి గల ప్రతీవారికీ గోచరించి మూర్తీభవింపజేసే అమౄత ఘుటికలు అని చెప్పబడ్డాయి.
యి
పాటల షీర్షికల్లో 'ఎంకీ మమైకం
ండూరి వారు ఎంకి పాటలకు నిర్థారించిన షీర్షికలు కూడ కడు నూతనత్వంతో దర్షనమిస్తాయి. ముద్దుల నా యెంకి, యెంకి ముచ్చట్లు, యెంకితో తిరపతి, సత్తెకాలపు నాయెంకి, దూరాన నాయెంకి, యేటిదరి నా యెంకి, నమిలి మింగిన నా యెంకి, కటిగ్గుండెల నా యెంకి, యెంకితో బద్రాద్రీ, యెంకిసూపు, యెర్రి నా యెంకి, యెంకి పయనం, ఆ కాలపు నా యెంకి అని మొదటి దషలోని పాటల్లో కనిపిస్తాయి.
నం అలాగే మలిదషలో వ్రాసిన కొత్త పాటల్లో కూడ, యెంకిరాణి, ఎంకి కళ, ఎంకి కల అంటూ నామకరణం చేస్తూ, చక్కని ఔచిత్యాన్ని ప్రదర్షిస్తూ, "ఎంకితనము" అంటారు.
ముద్దుకౄష్ణ ప్రషంస
ైతాళికులు అన్న కవితల సంపుటిని సంకలనం చెసిన ముద్దుకౄష్ణ గారు, నండూరి వారిని పరిచయం చేసిన తీరు మనల్ని పరవషుల్ని చేస్తుంది. "తనకు సాక్షాత్కరించిన కవితను అందుకోడంలో బంధాలను తెంచివేషాడు. నియమాలను తోసిపారవేషాడు. మహా సాహసంతో ఈయన గీతాలు గుండెలలో నుంచి సూటిగా, వెచ్చగా ప్రవహిస్తవి. ఈయన సంస్కారం స్వఛ్ఛమైన భూసారం నుంచి ఉత్తేజమందింది. మహా సున్నితమైన హౄదయంతో భావిస్తాడు. 'చూపుతో మాటాడీ 'ఊపిరితో తెనిగించే' నిపుణుడు. భావంలో, భాషలో, అన్నిటా సాహసంతో ఎర్రబావుటా యెత్తినాడు. ఈ తిరుగుబాటు కొందరికి 'గాలి దుమారా మైంది. కొందరికి నవయుగ ప్రభాతవాయు ప్రసరణమైంది." ఈ మాటలు మాత్రం అక్షరాలా నూటికి నూరుపాళ్ళు సత్యం. ముద్దుకౄష్ణ తన వైతాళికుల సంపుటిలో - నండూరి వారి యెంకి పాటలను - పూలబాసలు, పిలుపు, ముందుగతి, దీపం, సుక్క, నమిలిమింగిన నా యెంకి, కలత నిదుర, ఆ కాలపునా యెంకి, ఆనాటి నావోడు, కలలోన నా యెంకి, కోయిల, పడవ, జంట నా యెంకి అన్న పాటలను ఎన్నుకున్నాడు.
వై
నారాయణ రెడ్డి భావకవిత్వం పై నండూరి వారిపై విష్లేషణ
ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయములు, ప్రయోగములు అన్న సూదీర్ఘ పరిషోధన గ్రంథంలో ఆరవ అధ్యాయంగా భావకవిత్వానికి కేటాయిస్తూ, భావకవిత్వ షాఖలను - ప్రణయ, దేషభక్తి, ప్రకౄతి, సంఘ సంస్కరణ, భక్తి, స్మౄతికావ్యములని విభజించి విషిష్టమైన విష్లేషణను అందించారు. ప్రప్రథమంగా ప్రస్తావించబడ్డ ప్రణయకవిత్వం గురించి వివరిస్తూ -వస్త్వాష్రయరీతి, ఆత్మాష్రయరీతి అని విభజిస్తూ, ఆత్మాష్రయరీతిని - స్వఛ్ఛంద ప్రణయం, పూర్వభాగం, సంయోగదష, ఆశాభంగం-విప్రలంభం, విషాదస్థితి, పలాయనతత్త్వము-నిరాషావాదము, విషాద మాధురి, ఊహా ప్రేయసి సౄష్టి, ప్రేయసీ పూజ్యత, కులపాలికా ప్రణయం, అని కావించిన ప్రస్తావనలు నండూరి యెంకిపాటలకు ఎక్కడో అక్కడ అన్వయం చేసుకోవచ్చునని యెంకి పాటలను చదివిన వారికి అనిపించక మానదు. నారాయణ రెడ్డిగారు శౄంగార నాయకుల ప్రస్తావన తెస్తూ, కవులు-వారి ప్రేయసుల గురించి విష్లేషిస్తూ 'హౄదయేష్వరి, ఊర్వషి(కౄష్ణషాస్త్రి), వత్సల(నాయని), షషికళ(బాపిరాజు), కిన్నెర (విష్వనాథ) తోపాటు, నండూరి వారి ప్రణయ నాయికను ప్రత్యేక ప్రస్తావన చేషారు. మిగతా నాయికలతో పోలిస్తే, యెంకి అడవి మల్లె వంటిది అన్నారు నారాయణరెడ్డిగారు.
ఎంకిపాటలకు ఎంతెంత ఆదరణాభిమానాలు!
ేవలం పదాలతో రచనలు చేసి పాటలుగా పొందిక చేయడమే కాక, ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ పారుపల్లి రామకౄష్ణయ్యగారు ఎంకిపాటలకి స్వరరచనలను కూర్చడం, నండూరివారే స్వీయగళంతో వాటిని పాడడం జరిగిన గతవైభవపరంపరకు స్మౄతిచిహ్నాలు.
కే
ి పాటలను ప్రత్యక్ష పరోక్షాలుగా ఆదరించిన ప్రముఖుల్లో - మంచాల జగన్నాధరావు, కట్టమంచి రామలింగారెడ్డి, వేదం వెంకటరాయశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, గిడుగు రామమూర్తిపంతులు, మల్లంపల్లి సోమసేఖరశర్మ, బూర్గుల రామకౄష్ణరావు, యం.చలపతిరావు, బుచ్చిబాబు, రజని, ఆడవి బాపిరాజు, ద్వారం వెంకటస్వామి నాయుడు, నటరాజ రామకౄష్ణ, విశ్వనాధ సత్యనారాయణ, దేవులపల్లి కౄష్ణశాస్త్రి, గుడిపాటి వెంకటాచలం, శ్రీశ్రీ, శివశంకరస్వామి, జరుక్క్ శాస్త్రి లాంటి సాహితీకళాకారులతోపాటు, ఆకాశవాణి, చిత్రరంగం, సాంస్కౄతీసంస్థలు, గాయనీగాయకులు, ఎందరో మహానుభావులు, అందరూ ఎంకిపాటలకు బ్రహ్మరధం పట్టించారు. న
ఎంకిడూరి సుబ్బారావు గారి 'ఎంకి పాటలూ - నాటినుంచీ నేటివరకూ, ఎన్నటికీ, ఎప్పటికీ, అక్షరాలున్నంతకాలం, సంగీతస్వరాలు పల్లవిస్తున్నంతకాలం, మనకు ప్రతినిత్యం, మనజీవితాల్లో, దర్శనం అవుతూనేవుంటాయి. ప్రతివారి గుండెలెలోనుంచి సూటిగా వెచ్చగా ప్రవహించే గీతాలు - ఎంకి పాటలు - నండూరి వారి నవగీతాలు,నవ్యగీతాలు.
నండూరి సుబ్బారావు గారి జయంతి సందర్భంగా తెలుగురథం సాహితీగీతసంగీతనీరాజనాల్ని వినమ్రంగా సమర్పించుకుంటూ ...
ొంపెల్ల షర్మ - తెలుగురథం.
కొం
Subscribe to:
Posts (Atom)