Saturday, November 14, 2009

బాలల దినోత్సవం - సాహిత్యం, సాంస్కౄతికం

తెలుగు రథం
బాలల దినోత్సవం మన దేషంలో - నవంబర్ 14 నాడు జరుపుకోవడం, అందులోనూ మన తొలి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవం నాడే జరుపుకోవడం మరింత సంతోషించదగ్గ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ రోజు భారత బాలలు యావన్మంది ఉత్సవాల్ని జరుపుకోవడం, తమ ప్రతిభాపాటవాలని ప్రదర్షించి, సత్కారాలను, బహుమతులను, ప్రషంసలను అందుకోవడం కూడ రివాజే. బాలల విద్యావిధానాలను, కుటుంబంలో వారి పాత్ర, ప్రేమాభిమానాల్ని పొందడం, వారివారి స్థాయిల్లో పెద్దలను గౌరవించడం, వారి అభిమానాలకు పాత్రులవడం, తోడి బాలబాలికలతోటి ఉత్సవాన్ని జరుపుకోవడం కూడ పరిపాటే. బాలలకు ప్రత్యేక చలనచిత్రోత్సవాలు, ఆటపాటలు, చదువు, విజ్ౙానాంషాలు, సాహిత్య సాంస్కౄతిక పోటీలు నిర్వహించడం, వారిని ప్రోత్సాహ ప్రోద్బలాల్ని అందించడం కూడ బాలల దినోత్సవంలో ప్రముఖ భాగం గా మారింది.
మన తెలుగు బాలగీతాలు మన పిల్లలకు పసివయసు నుంచి, పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు ఎన్నోరకాలైన గీతాలని, పాటలని, చమత్కారిత పూరిత సాహిత్య సంగీతాంషాల్ని, కథల్ని చెప్పి వారికి మానసికోల్లాసభూతుల్ని చేయడం మనందరి కర్తవ్యంగా ప్రతీ పెద్దవ్యక్తి భావించడం జరుగుతోనేవుంది. మన తెలుగు భాషలో ప్రముఖమైన కొన్ని అంషాల్లో - సూచనప్రాయంగా యివ్వడం జరుగుతోంది. కిన్నెర బాలల సాంస్కౄతికోత్సవాలు - ఆహ్వానపత్రంలోని బాలగీతాలు. చేత వెన్నముద్ద - చెంగల్వపూదండ, బంగారు మొలతాడు - పట్టుదట్టి, సందిట తాయతులు - సరిమువ్వగజ్జెలు, చిన్ని కౄష్ణా నిన్ను - చేరి కొలుతు. గోరంతదీపమ్ము - కొండలకు వెలుగు, గోపాలకౄష్ణమ్మ - గోవులకు వెలుగు, మాడంతదీపమ్ము - మేడలకు వెలుగు, మారాజు అబ్బాయి - మా కళ్ళవెలుగు. జో అచ్యుతానంద -జో జో ముకుందా!, లాలిపరమానంద - లాలి గోవిందా - జో జో. హాయి హాయి హాయి - ఆపదలు గాయి, చిన్నివాండ్రను గాయి - ష్రీవేంకటేష!, ఆడితే ముద్దమ్మ - పాడితే ముద్దు, అందరికి అబ్బాయి - అల్లారు ముద్దు ... తాతగారింటనే - తూముల పెళ్ళిజ్, బూరి ముక్కడిగితే - బుగ్గ పొడిచేరు, గారి ముక్కడిగితే - కసిరికొట్టేరు, అరిసి ముక్కడిగితే - అదిమి తన్నేరు. చందమామ రావే - జాబిల్లి రావే, కొండెక్కిరావే - కోటిపూలు తేవే. ఊ ఊ ఉంగన్నా - ఉగ్గుపాలు ఇందన్న, గంటెడు ఉగ్గు కమ్మన్న - ఉమ్మక కక్కక మింగన్న. పిల్లమ్మ కన్నుల్లు - చీర పువ్వుల్లు, అబ్బాయి కన్నుల్లు - కలవరేకుల్లు, కలువరేకులవంటి - నీకన్నులకును, కాటుకలు పెట్టితే - నీకు అందమ్ము... ఏడవకు ఏడవకు - వెర్రి నాయిన్నా! ఏడిస్తె నీ కళ్ళు - నీలాలు గారూ, నీలాలు గారితే - నే చూడలేను, పాలైన గారవే - బంగా కండ్ల. ఆట మాణిక్యమే - పాటమాణిక్యం, నట్టెంట అమ్మన్న - రత్నమాణిక్యం. ఏనుగు ఏనుగు నల్లన - ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు - ఎంతో చక్కని దేవుడు. చప్పట్లోయ్క్ తాళాలోయ్క్ - దేవుడి గుళ్ళో మేళాలోయ్క్ పప్పూ బెల్లం దేవుడికోయ్క్ - పాలూ, నెయ్యీ పాపాయిలకోయ్క్. ఎండలు కాసే దెందుకురా? మబ్బులు పట్టే టందుకురా? మబ్బులు పట్టేదెందుకురా? వానలు కురిసేటందుకురా! చందమామ బొట్టు - నాసందిటి కేసికట్టు ఊళ్ళో ఉంటే ఒట్టు - నీవు వచ్చిన దారిని బట్టు. కాళ్ళాగజ్జీ - కంకాళమ్మ, వేగూచుక్క - వెలగామొగ్గా మొగ్గాకాదు - మోదుగనీరు, నీరూ గాదు - నిమ్మలవారి... చిట్టిపొట్టి మిరియాలు - చెట్టుక్రింద పోసి, పుట్టుమన్ను తెచ్చి - బొమ్మరిల్లు కట్టి... సీతమ్మ వాకిట - సిరిమల్లె చెట్టు, చిరుమల్లె చెట్టేమొ - చితక పూసింది... చెట్టు కదలాకుండ - కొమ్మ వంచండి, పచ్చి పూలూదోసి - బుట్టదింపండి. బతుకమ్మ - బతుకమ్మ భాగ్యమిచ్చింది, భాగ్యమిచ్చెన చోట నెల్లి బూసింది - నెల్లికీ మారాజు తోటగట్టించె ... ఒప్పులకుప్పా - ఒయ్యారి భామా, సన్నబియ్యం - చాయపప్పు చిన్న మువ్వ - సన్న గాజు, కొబ్బరి కుడక - బెల్లపచ్చు ... చెమ్మా చెక్క - చారెడేసి మొగ్గ, అట్లుపొయ్యంగ - ఆరగించంగ ముత్యాల చెమ్మచెక్క - ముగ్గులెయ్యంగ, రత్నాల చెమ్మచెక్క - రంగులేయంగ. గుడు గుడు గుంచం - గుండేరాగం..., పాములపట్ట - పడగరాగం చిన్నన్న పెండ్లి - చిట్టి రాగం, పెద్దన్న పెండ్లి - పెట్టె రాగం. బుర్రు పిట్ట బుర్రు పిట్ట - తుర్రుమన్నది, తూర్పువారి కాపురమ్ము - చెయ్యనన్నది అత్త తెచ్చిన కొత్తకోక - కట్టనన్నది, మామ తెచ్చిన మల్లెపూలు - ముడవనన్నది. చదువుకో నాయన్న, చదువుకో తండ్రి! చదువుకొంటే నీకు, సౌఖమబ్బేను ... విద్య లేకుంటేను విభవమ్ము రోత ... వినయమ్ము లేకుంటె విద్యతో రోత ... కాని వారీ కోసం కావించు చెలిమి కట్టె విరిచీ పోయిని పెట్టినట్లుండు ... జపతపంబుల కన్న చదువుసాములుకన్న ఉపకారమే మిన్న ఓ కూనలమ్మా! చిట్టి చిలకమ్మా - అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? - పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? - గుటుక్కు మింగావా? గడపలలోకెల్ల నీ గడప మేలు? మహాలక్ష్మి వసియించు మాగడప మేలు వీధులలో కెల్ల నీ వీధి మేలు? విద్వాంసులున్నట్టి - మా వీధి మేలు? బావా బావా పన్నీరు - బావను పట్టుక తన్నేరు వీధి వీధి తిప్పేరు - వీషెడు గంధము పూసేరు. తాతగారింటనే - తూములు పెళ్ళి బూరి ముక్కడిగితే - బుగ్గ పొడిచేరు గారి ముక్కడిగితే - కసిరికొట్టేరు అరిసి ముక్కడిగితే - అదిమి తన్నేరు. బాల భారతి (వెలగా వెంకటప్పయ్య) అనగా అనగా కోతి,కోతికి కలదూ మూతి మూతికి పైనే ముక్కు, ముక్కు ముక్కు టీక్కు ఢీ ఢీ డిడి డిక్కు. తాతయ్య తాతయ్య తాతయ్య తాతయ్య, గాంధి తాతయ్య తాతయ్య నవ్వితే, వెన్నెలలు వెలుగు తాతయ్య పలికితే, ముత్యాలు రాలు తాతయ్య మాటలే, రత్నాల మూట తాతయ్య తాతయ్య, గాంధి తాతయ్య. కోడీ కోడీ కొక్కొరకో కోడీ కోడీ - కొక్కొరకో! తెలివి వచ్చింది కాకీ కాకీ - కావ్ కావ్ అమ్మ లెమ్మంది తెల్ల వారింది, ఆడుకొమ్మంది. పందికొక్కు (న్యాయపతి బలరామదాసు) ఏదీ - ఈ కథ గబగబ చదవండీ? గాదెలోను కందిపప్పు గాదెక్రింద పందికొక్కు! నక్కినక్కి బొక్కుచుండె, కందిపప్పు పందికొక్కు! ముట్టెపెట్టి లొక్కుచుండ, చిట్టిపొట్టి అక్కవచ్చె! నక్కినక్కి యున్న కొక్కు, అక్కరాక అంతజూచె, కందిపప్పు పందికొక్కు, క్రిందవేసి పారిపోయె! నీ కాళ్ళెందాకా? (కూర్పు - అన్నయ్య) నీకాళ్ళేందాకా పోయాయీ! - గోల్కోండదాకా పోయాయి గోలకొండ ఏమిచ్చింది - గుడ్డిగవ్వనూ ఇచ్చింది గుడ్డిగవ్వనేం చేషావూ - గడ్డిమోపులో దాచాను గడ్డిపోచ ఏమిచ్చింది - ఎద్దుబండినీ ఇచ్చింది ఎద్దుబండినేం చేషావూ? - బండివానికీ ఇచ్చాను బండివాడు ఏమిచ్చాడు - పూలదండనూ ఇచ్చాడూ. పూలదండనేం చేషావూ - పాలవెల్లికీ కట్టాను పాలవెల్లి ఏ మిచ్చిందీ - బాలకౄష్ణుని ఇచ్చిందీ. బాలకౄష్ణునేం చేశావూ - గొల్లభామకూ ఇచ్చాను. గొల్లభామ ఏమిచ్చిందీ - వెన్నముద్దనూ ఇచ్చింది. వెన్నముద్దనేం చేషావూ - చిన్న అత్తకూ ఇచ్చాను. చిన్న అత్త ఏమిచ్చిందీ - చక్కని భావను నిచ్చింది. "త" గుణింతము తల్లి దండ్రులమాట - తలదాల్పవలయు తాతసేవలు నీవు - తగ జేయుమయ్య తిమ్మ చేష్టలు చేసి - తిట్లు కాయకుము తీపినెన్నడు బాగ - తినబోకుమయ్య తుంటరి పిల్లలతో - తంటాలు పడకు తూనగ నెన్నడు - తునుమాడకయ్య తెల్లవారగలేచి - కల్లలాడకుము తేమ నేలలపైని - తిరుగంగ బోము తొలుత దేవుని పూజ - సలుపుమోయున్న తోటివారికి బాగ - తోడుపడమన్న తేడు కూడని కూడు - చెడుగు కేయన్న తొందరబాటునూ - పొందబోకన్నా తౄణముగా నామాట - గణనసేయకుము. అ ఆ ఇ ఈ లు అన్నా అన్నా రోవోయీ, ఆలస్యము యింకేలోయీ ఇద్దరమును మరి జట్టుగను, ఈష్వరాలయము కేగుదము ఉత్సవములనూ చూదాము, ఊరేగింపుతో వెడదాము ౠషివలె దండము పెడదాము, ఎప్పుడు రక్షించుము అనుచు ఏకష్టము కలిగించకను, ఐష్వర్యంబుల యిమ్మనుచు ఒప్పుగ మనము ఇద్దరము, ఓ ప్రార్థన చేసుకు వద్దాము. పుట్టినరోజు పుట్టినరోజూ పండుగనాడూ చుట్టాలొచ్చారు కాజాలడ్డూ తాజా గారెలు తెచ్చీ పెట్టారు ఇరుగూపొరుగూ పిల్లా పెద్దా యింటికి వచ్చారు చిందులుతొక్కే చిట్టిబాలకి జేజే లన్నారు! అమ్మాలక్కాలంతా కలసీ హారతులిచ్చారు బాలబాలికలంతాకూడి బంతూలాడారు పాలూ పళ్ళూ పాయసమంతా పంచీ పెట్టారు ముచ్చట గొలిపే ముద్దులబాలకి జేజే లన్నారు. వారాల కథ ఆదివారము నాడు - అబ్బాయి పుట్టె సోమవారము నాడు - చొక్కాలు తొడిగె మంగళవారము నాడు - మాటలూ చెప్పే బుధవారము నాడు - పుస్తకము చదివె లక్ష్మి(గురు)వారము నాడు - లడ్డూలు తినియె షుక్రవారము నాడు - షోకులను చేసే షనివారము నాడు - సభలోకి వెళ్ళే ఇన్ని వారాలలో - ఇన్ని చేషాడు ఎవ్వరీ అబ్బాయి - ఎవ్వరీ పాప. పొట్టిబావ - పండుగ పచ్చడి చిట్టి మరదలా చిట్టి మరదలా ఎక్కడి కెళతావు? గున్న అంటు మావులున్న తోటకెళతాను చిట్టి మరదలా చిట్టి మరదలా ఏమి తెస్తావు? మంచి మంచి మామిడికాయలు ఏరి తెస్తాను చిట్టి మరదలా చిట్టి మరదలా ఏమి చేస్తావు? వస్తూ ఉన్న ఉగాదికి పచ్చడి తెస్తాను ... చిలకమ్మ పెండ్లి (గిడుగు వెంకట సీతాపతి) చిలుకమ్మ పెండ్లియని చెల్లికత్తె లందరును చీర సింగారించి చేరి కూర్చున్నారు ... పందిట పిచ్చుకలు - సందడి చేయగ, కాకులమూకలు - బాకాలూదగ కప్పలు బెక బెక - డప్పులు కొట్టగ, కుక్కురుకోయని కోడికూయగా జుమ్మని తుమ్మెద తంబుర మీటగా, కుహు కుహు కోయని కోయెల పాడగా పిల్లవాయువులు వేణు మోగగా, నెమిలి ఠీవితో నౄత్యము చేయగ! సాలీడిచ్చిన చాపు కట్టుకొని, పెండ్లికుమారుడు బింకము చూపగ సీతకోకల చీరకట్టుకొని - పెండ్లికుమారిత ప్రేమచూపగా మల్లిక మాలతి మాధవీ లతలు, పెండ్లికుమారుని పెండ్లికూతురిని దీవిస్తూ తమ పూవులు రాల్పగ, మైన గోయెంక మంత్రము చదివెను చిలుకమ్మ మొగుడపుడు, చిరునవ్వు నవ్వుతూ చిలుక మెడలో గట్టె, చింతాకు పుస్తె. అఖిల భారత బాలల దినం అదిగో అదిగో వచ్చింది - ఆనందంగా వచ్చింది అఖిల భారత బాలల దినం - అదియే మనకొక పర్వదినం నవంబరు పదునాల్గవ తేది - నెహ్రూ పుట్టిన రోజండి! భారతావనిలో బాలలందరు - బలేహుషారుగ చేస్తారు బాలసంఘాల్లో చేరిన బాలలు - పాఠషాలలకు పోయెడి పిల్లలు ఆనందంగా చేస్తారు ... - ఆడుచు పాడుచు యుంటారు నెహ్రూపటమును చేతిలోపట్టి - చాచా నెహ్రూకు జేజేలంటూ! భారతరత్నకు జేజేలంటూ - జైజై ధ్వనులతో త్రిప్పెదరు ... పెద్దలందరును పిలుచుకువచ్చి - పెద్దగ సభలు జరిపించి పుట్టినరోజు ప్రాముఖ్యతను - ప్రజలకు బాగుగ చెప్పెదరు ... ఆ రోజుననే బాలలందరు - ఆట పాటలు, నౄత్యనాటికలు అన్నియు బాగుగ చేస్తారు! - ఆనందంగా ఉంటారు దేషనాయకుడగు నెహ్రూబాబుని - దీక్షతో అందరు కొలిచెదరు పల్లెపల్లెలా పుట్టినరోజు - బాగుగ అందరు చేసెదరు. బాలల దినోత్సవం సందర్భంగా - అందరూ తెలుగు బాలబాలికలకు అభినందనలతో పాటు షుభాషీస్సులని హౄదయపూర్వకంగా తెలుగురథం తెలియజేస్తోంది. కొంపెల్ల శర్మ - అధ్యక్షులు - తెలుగురథం.

No comments: