Wednesday, April 3, 2013

నాడు - ఈనాడు - చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 3

నాడు - ఈనాడు


చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 3
 

·        1680 మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు,చత్రపతి శివాజీ వర్థంతి

·        1715   ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త విలియం వాట్సన్.

·        1862 వాషింగ్టన్ డి సి లో బానిసత్వం రద్దు

·        1897 ప్రముఖ కవి, ‘శివభారతం’ గ్రంథకర్త, గడియారం శేషశాస్త్రి జననం

·        1903 ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయవేత్త కమలాదేవి చటోపాధ్యాయ కర్ణాటకలో జననం

·        1912 విద్యావేత్త రచయిత, వరదరాజన్ తిరుపత్తూర్ లో జననం

·        1914 భారతీయ సేనాధికారి, తొలి ఫీల్డ్ మార్షల్ శాం జంషెడ్జీ మానెక్ షా జననం

·        1954 భారతీయ వైద్యుడు, రాజకీయవేత్త కె కృష్ణస్వామి జననం

·        1955 ‘కొలోనియల్ కజినిస్’ లో భాగస్వామి, ప్రముఖ గాయకుడు హరిహరన్ జననం

·        1956 నాగాలాండ్ ఆందోళనలను అణచివేయడానికి అదనపు బలగాల్ని పంపుతున్నట్లు భారతప్రధాని నెహ్రూ ప్రకటన

·        1962 తెలుగు అభినేత్రి, రాజకీయవేత్త, పార్లమెంటు సభ్యురాలు జయప్రద జననం

·        1964  అజయ్ శర్మ, భారత మాకీ క్రికెట్ క్రీడాకారుడు.

·        1965 ప్రముఖ పాకిస్తాన్ గాయకురాలు నజియా హస్సన్ జననం

·        1973 విశ్వప్రఖ్యాత చిత్రకళాకారుడు పికాసో మరణం

·        1973  భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు నీలేష్ కులకర్ణి.

·        1973 భారతీయ నటుడు, దర్శకుడు, నృత్య కళాకారుడు, కోరియోగ్రాఫర్ ప్రభుదేవా జననం

·        1984  మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ అంతరిక్ష పయనం; (రష్యాకు చెందిన ముగ్గురుతో కలిసి సూయజ్-టి 11 లో అంతరిక్ష నౌకాయానం

·        1988 పంజాబ్ – పాకిస్తాన్ సరిహద్దుల మధ్య కంచె వేసేందుకు అనుమతిచ్చిన ప్రధాని రాజీవగాంధి

·        1994 కర్ణాటక కాంగ్ర్తేసు పార్టీని స్థాపించిన యస్ బంగారప్ప

·        2012 భారతీయ యింపీరియల్ సివిల్ అధికారి, ప్రతిభావంతుడు గోవిందనారాయణ్ మృతి

Tuesday, April 2, 2013

నాడు - ఈనాడు - చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 2


నాడు - ఈనాడు

చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 2
 

·        World Autism Awareness Day

·        అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం

·        999 పోప్ గా తొలిసారి ఫ్రాన్స్ కు చెందిన గెర్బర్ట్ ఎన్నిక

·        1453 కాన్స్టంట్ నోపెల్ ను స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం ప్రారంభించిన మహమ్మద్-2

·        1689 ముస్లిమేతరులపై జిజియా పన్నుని విధించిన ఔరంగజేబు

·        1781 భారతీయ ఆధ్యాత్మిక వేత్త భగవాన్ స్వామి నారాయణ్ జననం

·        1872  అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త సామ్యూల్ F. B. మోర్స్ మరణం

·        1877 ప్రముఖ సోషలిస్ట్ నేత, భారత నౌకాయాన పిత నరోత్తమ్ మురార్జీ గుజరాత్ పోరుబందర్ లో జననం

·        1902 అమెరికా, లాస్ ఆంజిల్స్, కాలిఫోర్నియా లో మొదటి విద్యుత్ మూవీ థియేటర్ ప్రారంభం

  • 1933 భారతీయ మహారాజు, క్రికెట్ క్రీడాకారుడు కె యస్ రంజిత్ సింఘ్జీ మృతి, ఈయన పేరిటే భారత్‌లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు.
  • 1942 రెండవ ప్రపంచయుద్ధం సందర్భంలో భాగంగా ఈస్టిండియా కంపెనీకి చెందిన అండమాన్ నికోబార్ దీవుల్లో వేచియున్న జపాన్ దళాలపై తొలిసారిగా దాడులు  

·        1942 భారతీయ చలనచిత్ర/రంగస్థల నటుడు రోషన్ సేఠ్ (గాంధీ చిత్రంలో జవహర్ లాల్ పాత్రధారి) జననం

·        1969 ప్రముఖ భారతీయ (హిందీ) చలనచిత్ర నటుడు అజయ్ దేవగణ్ జననం

·        1972  చార్లీ చాప్లిన్ అమెరికాకు తిరిగి వచ్చాడు

·        1977 ప్రముఖ కవి, విమర్శకుడు శ్రీపాద గోపాల కృష్ణమూర్తి జననం

·        1981 ఆష్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు మఖేల్ క్లార్క్ జననం

·        1984 అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయుడు రాఖేష్ శర్మ

·        2006 ప్రముఖ కవి, రచయిత విశ్వనాథ పావని శాస్త్రి మృతి (కవిసమ్రాట్, తెలుగులో తొలి జ్ణానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి తనయుడు)
  • 2011 : భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.

 

 




 

Monday, April 1, 2013

ప్రత్యేక కధనాలు - ఘన చరితకు సాక్ష్యాలు - ఏప్రిల్ 1


ప్రత్యేక కధనాలు

ఘన చరితకు సాక్ష్యాలు - ఏప్రిల్ 1


ఘనమైన చరితకు ఘనమైన సాక్ష్యాలు - ఏప్రిల్ 1
మన ఘనతలు మన ప్రవర్తనలను బట్టి వుంటాయి. అలాగే, ప్రతీ రోజు ఏదో ఒక ప్రత్యేకతని సంతరించుకుంటుంది. అలాగే, ప్రతీ నెలకూ కూడ అర్ధం, పరమార్ధం వెల్లడవుతాయి.
'ఏప్రిల్' సార్ధకత
ఏప్రిల్ నెల మనకు సాధారణంగా ఒకటో తేదీ - 'ఆల్ ఫూల్స్ డే' తో ప్రారంభమై, చారిత్రాత్మక కధనాన్ని వ, ఆ రోజంతా వెధవాయితనానికి నిదర్శనంగా, ప్రదర్శనంగా దర్శనం అవుతుంది. ప్రతీ వ్యక్తి తాను మాత్రమే తెలివితేటలని పొందాననీ, అవతలి వారిని సునాయాసంగా తెలివితక్కువగా జమకట్టడం పరిపాటి అయింది. చారిత్రాత్మకంగా పరిశీలిస్తే, 'ఏప్రిళ్ నెల, లాటిన్ పదం - 'ఎపెరియో నుంచి వచ్చింది. అంటే, బహిరంగం. ఈ కాలంనుంచే యిటలీలో తొలకరి పూలు వికసించడం జరుగుతుందట. ఒక నెల పేరు వెనుక యింత కధ, కమామేషు దాగుంది.
ఏప్రిల్ 1 న 'ఆల్ ఫూర్స్ డే' ని జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
ఈ ప్రత్యేకతతోపాటు, ఈరోజు యింకా చాలావాటికి ప్రసిద్ధం అని చాలామందికి బహుశ తెలియపోవచ్చు. కనీసం యిప్పుడైనా వాటి గురించి తెలుసుకోవాలి కదా.
యిదే, ఆప్రిల్ 1 న, ప్రత్యేకతలు యిలా వున్నాయి.
  • దూరదర్శన్ ఆవిర్భావం దినం - 1976
భారతదేశపు సకల ప్రజావళికి కనీసస్థాయిలో వినోదాన్ని జరిపించడం.
  • కేంద్ర నేర పరిశోధన సంస్థ - 1963. నేరాలను పట్టుకోవడంలాంటి కార్యక్రమాల్లో తరచు పోల్గొనే, కేంద్ర నేర పరిశోధన సంస్థ (సి.బి.ఐ).
  • భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపన -1935
భారతీయ ఆర్ధికవిధానాల్ని రూపొందించడం, దేశపు ఆర్ధికపరమైన ప్రణాళికలను రూపొందింపజేసి రచించి అనుమోదంతో అమలుపరచే కార్యక్రమాన్ని నిర్వహించే ప్రముఖ సంస్థ.
  • ఆదాయపు పన్ను ప్రవేశపెట్టిన రోజు - 1869
భారతదేశంలో ఆదాయపు పన్నును ప్రవేశపెట్టడం 1869 లో జరిగినా, విశ్వవ్యాప్తంగా ఈ ఆదాయపు పన్ను గురించి విశ్లేషణ చేస్తే, ఆదాయపు పన్ను నేపథ్యం యిలా ప్రారంభమైంది.
ప్రభుత్వం తన కార్యక్రమాల నిర్వహణకు ప్రధానమైన ఆదాయాన్ని పన్నుల రూపంలో ప్రజల నుండి వసూలు చేస్తుంది. ఆదాయపు పన్ను ముఖ్యమైన పన్నుల్లో మొదటిది. ఈ ఆదాయపు పన్నుని మొదతగా, 1799 లో నెపోలియన్ కాలంలో ప్రాన్సులో ప్రారంభించబడింది. మహారాజు 'నెపోలియణ్ యుద్ధాలకు కావలసిన ఆదాయాన్ని తద్వారా సంపాదించేవాడట. అలా శ్రీకారం చుట్టబడి, ఈ రోజు మన బడ్జెట్ లో ముఖ్యాతిముఖ్యాంశంగా మారింది.
యిలా యిన్ని ప్రత్యేకతలను సంతరించుకున్న - ఏప్రిల్ 1 రోజుని కేవలం 'ఆల్ ఫూల్స్ డే' అని వెధవాయల పండగగానే పరిగణించడం, పైగా సమయాన్ని వౄధా చేయడం, భారతదేశం లాటి అభివౄద్ధి చెందుతున్న దేశపు ఉత్పాదక వ్యవస్థకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
కాలం వెళ్ళిపోతే, తిరిగిరాదు. సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీరోజుకు తగినంత సార్ధకతతో అర్ధాన్ని, పరమార్ధాన్ని పొందాలి.
సర్వేజన: సుఖినో భవంతు:

నాడు - ఈనాడు - చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 1


నాడు - ఈనాడు


చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 1

 
 

చరిత్రలో ఈ రోజు/ ఏప్రిల్ 1

·        1-7 అంధత్వ నివారణ వారోత్సవాలు
·        ‘ఏప్రిల్ ఫూల్స్ డే – మిగిలిన సంవత్సరమంతా మనం ఎలా ప్రవర్తిస్తామో తెలియజేసే రోజు – Mark Twain.
·        1815 జర్మనీ చాన్సలర్ ఒట్టోవాన్ బిస్మార్క్ జననం
·        1839 కలకత్తా వైద్య కళాశాల ప్రారంభం
·        1854 చార్లెస్ డికెన్స్ రచన ‘హార్డ్ టైమ్స్’ సీరియల్ గా ‘హౌస్ హోల్డ్ వర్డ్స్’ పత్రికలో ప్రారంభం
·        1867 బ్రిటిష్ కాలనీగా ‘సింగపూర్’ నగరం
·        1869 భారతదేశంలో ఆదాయపు పన్ను ప్రారంభం
·        1875 ప్రముఖ ఆంగ్ల రచయిత ఎడ్గార్ వాలస్ జననం
·        1878 కలకత్తా మ్యూజియం లోకి ప్రజల అనుమతి
·        1887 బోంబే ఫైర్ బ్రిగేడ్ ప్రారంభం
·        1889 భారతీయ వైద్యుడు, హిందూజాతీయతావాది, రాష్ట్రీయ స్వయంసేవక్ అధినేత కేశవదాస్ బలరాం హెగ్డేవార్ జననం
·        1905 బెర్లిన్-పారిస్ ల మధ్య టెలీఫోన్ సౌకర్యం ప్రారంభం
·        1908 అమెరికా మనస్తత్వవేత్త అబ్రహాం మాస్లో జననం
·        1911 ప్రముఖ తెలుగు కవి ఏటుకూరి వేంకట నరసయ్య జననం
·        1911 భారతీయ అథ్లెట్ క్రీడాకారుడు ఫౌజా సింగ్ జననం
·        1920 నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ (నాజీ)గా పేరు మార్చుకున్న జర్మనీ వర్కర్స్ పార్టీ
·        1924 బీర్ హాల్ ఘటన నేపథ్యంలో అడోల్ఫ్ హిట్లర్ కు ఐదేళ్ళ జైలుశిక్ష విధించిన జర్మనీ కోర్టు
·        1928 కమ్యూనిష్టులపై దాడులను పునఃప్రారంభించిన చైనా నాయకుడు చియాంగ్ కై షేక్
·        1929 యో-యో ఆటవస్తువుని ప్రవేశపెట్టిన అమెరికా జాతీయుడు లారీ మార్క్స్
·        1930 కనీస వివాహ వయస్సును అమ్మాయిలకు 15, అబ్బాయిలకు 18 గా మార్చిన కేంద్రప్రభుత్వం (ప్రస్తుతానికి అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21)
·        1935 భారతీయ కేంద్ర బ్యాంక్ – రిజర్వ్ బ్యాంక్ స్థాపన
·        1936 భారతీయ రాజకీయవేత్త, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోయ్ జననం
·        1936 కళింగ, ఉత్కళ్ గా పేరువహించిన ‘ఒడిస్సా’ రాష్ట్రం భారతదేశంలో ఏర్పాటు – ఒడిస్సా రాష్ట్ర దినోత్సవం
·        1954 కొలరాడోలో అమెరికా వైమానిక దళ శిక్షణా కేంద్రం ఏర్పాటు
·        1963 హోం మంత్రిత్వ శాఖ తీర్మానంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) గా పేరు మార్చుకున్న ఢిల్లీ ప్రత్యేక పోలీసు సంస్థ అధిపతి ఇనస్పెక్టర్ జనరల్ డి పి కొహ్లీ బాధ్యతలను స్వీకరించారు. (31 మే 1968 వరకు ఆ పదవిలో కొనసాగారు)
·        1970 అమెరికాలో బహిరంగంగా పొగతాగడం పై చట్టం
·        1971 బంగ్లాదేష్ విమోచన యుద్ధంలో భాగంగా కేరినీగంజ్ ఉపజిల్లా
లో పాకిస్తాన్ ఆర్మీ జరిపిన దారుణ మారణకాండలో వెయ్యిమంది పైగా మరణం
·        1973 పులుల పరిరక్షణ ప్రణాళికగా ‘ప్రాజెక్ట్ టైగర్’ ని కోర్బెట్ జాతీయ పార్క్ ప్రారంభం
·        1976 వేరుపడిన ఆకాశవాణి, దూరదర్శన్ – (దూరదర్శన్ కార్పొరేషన్ ఆవిర్భావం)
·        1977 ప్రముఖ రచయిత తల్లావఝ్ఝుల శివశంకరశాస్త్రి మృతి
·        1987 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గా ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ (ISI) మార్పు
·        1999 ప్రముఖ తెలుగు కథారచయిత మధురాంతకం రాజారాం మృతి
·        2001 నెదర్లాండ్ దేశంలో తొలిసారిగా ఏక లింగధారుల మధ్య వివాహానికి చట్టబద్ధత
·        2006 స్వతంత్ర పార్టీ అధినేత గౌతు లచ్చన్న మృతి
·        2012 భారతీయ రాజకీయవేత్త యన్ కే పి సాల్వే మృతి