ప్రత్యేక కధనాలు
ఘన చరితకు సాక్ష్యాలు - ఏప్రిల్ 1
ఘనమైన చరితకు ఘనమైన సాక్ష్యాలు - ఏప్రిల్
1
మన ఘనతలు మన ప్రవర్తనలను బట్టి వుంటాయి. అలాగే, ప్రతీ రోజు ఏదో ఒక ప్రత్యేకతని
సంతరించుకుంటుంది. అలాగే, ప్రతీ నెలకూ కూడ అర్ధం, పరమార్ధం
వెల్లడవుతాయి.
'ఏప్రిల్' సార్ధకత
ఏప్రిల్ నెల మనకు సాధారణంగా ఒకటో తేదీ - 'ఆల్
ఫూల్స్ డే' తో ప్రారంభమై, చారిత్రాత్మక కధనాన్ని వ, ఆ రోజంతా వెధవాయితనానికి
నిదర్శనంగా, ప్రదర్శనంగా దర్శనం అవుతుంది. ప్రతీ వ్యక్తి తాను మాత్రమే తెలివితేటలని
పొందాననీ, అవతలి వారిని సునాయాసంగా తెలివితక్కువగా జమకట్టడం పరిపాటి అయింది.
చారిత్రాత్మకంగా పరిశీలిస్తే, 'ఏప్రిళ్ నెల, లాటిన్ పదం - 'ఎపెరియో నుంచి వచ్చింది.
అంటే, బహిరంగం. ఈ కాలంనుంచే యిటలీలో తొలకరి పూలు వికసించడం జరుగుతుందట. ఒక నెల పేరు
వెనుక యింత కధ, కమామేషు దాగుంది.
ఏప్రిల్ 1 న 'ఆల్ ఫూర్స్ డే' ని జరుపుకోవడం
సంప్రదాయంగా వస్తోంది.
ఈ ప్రత్యేకతతోపాటు, ఈరోజు యింకా చాలావాటికి ప్రసిద్ధం అని
చాలామందికి బహుశ తెలియపోవచ్చు. కనీసం యిప్పుడైనా వాటి గురించి తెలుసుకోవాలి
కదా.
యిదే, ఆప్రిల్ 1 న, ప్రత్యేకతలు యిలా వున్నాయి.
- దూరదర్శన్ ఆవిర్భావం దినం - 1976
భారతదేశపు సకల ప్రజావళికి కనీసస్థాయిలో వినోదాన్ని
జరిపించడం.
- కేంద్ర నేర పరిశోధన సంస్థ - 1963. నేరాలను పట్టుకోవడంలాంటి కార్యక్రమాల్లో తరచు పోల్గొనే, కేంద్ర నేర పరిశోధన సంస్థ (సి.బి.ఐ).
- భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపన -1935
భారతీయ ఆర్ధికవిధానాల్ని రూపొందించడం, దేశపు
ఆర్ధికపరమైన ప్రణాళికలను రూపొందింపజేసి రచించి అనుమోదంతో అమలుపరచే కార్యక్రమాన్ని
నిర్వహించే ప్రముఖ సంస్థ.
- ఆదాయపు పన్ను ప్రవేశపెట్టిన రోజు - 1869
భారతదేశంలో
ఆదాయపు పన్నును ప్రవేశపెట్టడం 1869 లో జరిగినా, విశ్వవ్యాప్తంగా ఈ ఆదాయపు పన్ను
గురించి విశ్లేషణ చేస్తే, ఆదాయపు పన్ను నేపథ్యం యిలా ప్రారంభమైంది.
ప్రభుత్వం తన
కార్యక్రమాల నిర్వహణకు ప్రధానమైన ఆదాయాన్ని పన్నుల రూపంలో ప్రజల నుండి వసూలు
చేస్తుంది. ఆదాయపు పన్ను ముఖ్యమైన పన్నుల్లో మొదటిది. ఈ ఆదాయపు పన్నుని మొదతగా,
1799 లో నెపోలియన్ కాలంలో ప్రాన్సులో ప్రారంభించబడింది. మహారాజు 'నెపోలియణ్
యుద్ధాలకు కావలసిన ఆదాయాన్ని తద్వారా సంపాదించేవాడట. అలా శ్రీకారం చుట్టబడి, ఈ రోజు
మన బడ్జెట్ లో ముఖ్యాతిముఖ్యాంశంగా మారింది.
యిలా యిన్ని ప్రత్యేకతలను
సంతరించుకున్న - ఏప్రిల్ 1 రోజుని కేవలం 'ఆల్ ఫూల్స్ డే' అని వెధవాయల పండగగానే
పరిగణించడం, పైగా సమయాన్ని వౄధా చేయడం, భారతదేశం లాటి అభివౄద్ధి చెందుతున్న దేశపు
ఉత్పాదక వ్యవస్థకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
కాలం వెళ్ళిపోతే, తిరిగిరాదు.
సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీరోజుకు తగినంత సార్ధకతతో అర్ధాన్ని, పరమార్ధాన్ని
పొందాలి.
సర్వేజన: సుఖినో భవంతు:
No comments:
Post a Comment