జాతీయ ' బాలిక ' ల దినోత్సవం - 24 జనవరి
తల్లిదండ్రులు ధనస్సులు - ధనస్సులు సారించే బాణాలు పిల్లలు
భారతీయ హైందవసంస్కౄతి నేర్పిన పాఠం - త్రిమూర్తులను గౌరవించి, ఆరాధించాలి. వారు తల్లి, తండ్రి, ఆచార్యుడు. తల్లిదండ్రులు ధనస్సులు. ఆ ధనస్సులు సారించే బాణాలు పిల్లలు. సంఘంలో మనుగడ సాగించే ప్రతివ్యక్తికి ఒక స్థాయిలో గౌరవ ప్రతిపత్తి ఉంటుంది. అది ఆ వ్యక్తి ఆక్రమించిన స్థానాన్నిబట్టి, నిర్వహించే పాత్రనుబట్టి ఉంటుంది. "ప్రపంచంలో పుట్టిన ప్రతి శిశువూ అంతకు ముందు పుట్టిన దానికన్నా గొప్పగా వుంటుంది; బాల్యంలో ఒకానొక ప్రత్యేక క్షణం వుంటుంది; ఆ క్షణం తలుపులు తెరుచుకుని భవిష్యత్తు లోపలికి అడుగు పెడుతుంది" - అని అంటాడు ప్రముఖ రచయిత చార్లెస్ డికెన్స్.
పిల్లలకు ప్రతిపాదిత సంస్కారం
మన భరతభూమి వేదభూమి. వ్యక్తి మనుగడలో, ప్రత్యేకంగా, బాల్యంలో, ఉపనయనం ప్రధానంగా ఎంచబడింది. ఉపనయనం ఆనాడు ఏడవ ఏటనే చేసేవారట. ఉపనయనం జీవితంలో ప్రధానమైన ఘట్టం. వేదకాలంలో ఈ ఉపనయనం బాలురకెంత ప్రధానమైనదో, బాలికలకంత ప్రధానమైనదిగా భావించబడ్డది. ఉపనయనమూ, వేదాధ్యయనమూ, బాలికలకు తగిన వరులను సమకూర్చటంలో విధిగా సహకరించేది. ౠషులచేత వ్రాయబడిన ధర్మశాస్త్ర గ్రంధాలకే స్మౄతులని పేరు. ఆ స్మౄతి కాలంలో కూడ స్త్రీలకు గౌరవ ప్రతిపత్తికి లోపం రాలేదు.
కుమారుడు - కుమార్తె, పుత్రుడు - పుత్రిక మధ్య అంతరాలు
అన్నదమ్ములుగల కుమార్తెకంటే వారు లేని కుమార్తె వలన పితౄవంశానికి అధికలాభం కలుగుతుందని విశ్వసించబడ్డ సంస్కౄతి మన భారతీయ హైందవ సంస్కౄతి. కుమారుడేవిధంగా వంశవర్ధనుడవుచున్నాడో, కుమార్తె కూడ ఆ విధంగానే వంశవర్ధని కాగలదన్న నమ్మకం ఉండేది. అందుకే ఆమెను 'పుత్రికా అన్నపేరు వచ్చింది. అన్నదమ్ములుగల కుమార్తెకు 'పుత్రికా అన్న పదం ఎక్కడా వాడలేదు అని చెప్తారు. అభాత్రుదుహిత తన పుత్రునిద్వారా తన తండ్రిని పున్నామ నరకం నుండి రక్షించుచున్నది. కనుక ఆమెకు పుత్ర ధర్మంగా 'పుత్రికా అన్నపేరు అన్వర్ధమవుతూంది.
ఆడపిల్ల తండ్రి పుణ్యాత్ముడు"అపుత్రోనేక విధినా సుతాం కుర్వీత పుత్రికాం" అని మనుస్మౄతిలో చెప్పబడి ఉన్నదంటారు. పుత్రులు లేనివారు ఈ విధానం చేత కుమార్తెను పుత్రికగా చేసుకొన వలనని దీని తాత్పర్యం. ఇటువంటి పుత్రికల వలనె తండ్రి వంశం వౄద్ధి అయ్యేది. ఈ విధంగా పూర్వం అనేకులు వంశాభివౄద్ధి చేసుకున్నారు. ఆ కాలంలో ఆడపిల్ల కలవాడు పుణ్యాత్ముడనే స్మౄతుల అభిప్రాయం.
కన్యాదాన ఫలితంషోడశదానాలలో గొప్పదానం కన్యాదానమాత్రంచేత తండ్రితోపాటు అతడి పితౄదేవతలు కూడ తరించుతున్నారని -
"నా స్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా" - బ్రహ్మలోక కాంక్షతో విష్ణుస్వరూపుడవగు నీకు కన్యనర్పించుచున్నాను.
"త్వద్దానాన్మోక్ష మా ప్ను యాం" - ఓ కన్యా! నిన్ను దానం చేయుటచేత మోక్షం పొందగలను.
"కన్యా మి మాం ప్రదాస్యామి పిత్రూణాం తారణాయవై" - పితౄదేవతలు తరించుటకై ఈకన్యను దానం చేయుచున్నాను,
సంవర్తస్మౄతిలో కూడ కన్యాదానానికి వచ్చే ఫలం గురించి విపులంగా చెప్పబడిందని అంటారు.
కుమార్తె తన తండ్రికి అతడి వంశానికి ఎంత మహోపకారి కాగలడో ఈ అధారాలని బట్టి స్పష్ఠం అవుతోంది. స్మౄతికారులు స్త్రీ సంతతి కెంత ప్రాశస్త్యం కల్పించి గౌరవించారో సుస్ఫష్ఠమవుతోంది.
కుమార్తె కేవలం తానేకాక తనసంతతిద్వారా కూడ పితౄవంశానికి మహోపకౄతి సలుపుతూంది. దౌహిత్రుని వలన కూడ మాతామహుని వంశం తరించుతుందని, దౌహిత్రుడంటే పితౄదేవతలకెంతో ప్రీతియట. అదండీ అడపిల్ల, ఆడపిల్ల సంతతి వల్ల కూడ మనకు ఫలితం, లాభం యిప్పుడు విశదమయ్యాయి.
మారుతున్న సంతానధోరణులు - తగ్గుతున్న ఆడపిల్లలుప్రాచీనకాలంలో ఎంతమంది పిల్లలుంటే కుటుంబంలో అంత సిరిసంపదలతోపాటు ఉమ్మడి కుటుంబానికి ఒక అర్ధం, పరమార్ధం ఉండేవి. అష్టగర్భసంజాత నుంచి అష్టైశ్వర్యాలు అన్న విశ్వాసం నుంచి క్రమేపీ యుగధర్మమో, ప్రత్యేకంగా కలియుగధర్మమో కాని, 'చిన్నకుంటుంబం చింతలులేని కుటుంబం' నుంచి 'మేమిద్దరం - మాకిద్దరూ, ఒంటికాయ సొంఠికొమ్ములా తోడులేని ఏకైక సంతానం చెలామణి అవుతున్న కాలప్రవాహంలో ఈదులాడుతున్నాం. మరికొంత తీవ్రతర భావనతో, ఒక్కడైనా పక్కాగా పెంచాలి అన్న, అంతకన్న ఎక్కువైతే ముందుముందు పెంచడం జరగని పని అన్న ధోరణి ఎక్కువైన వాతావరణంలో ఉన్నాం. ఆడ,మగ పిల్లలను గణిత లేఖాంక మూల్యాలతో పోల్చుకుని, లాభనష్టాల బేరీజులు వేసుకునే దుస్థితిలో దున్నుకుంటున్నాం. ఫలితంగా, అందాల భరిణ, కుటుంబానికి అందం, ఆనందం, అదౄష్టం, మాయింటి మహాలక్ష్మి, మాయింటి ఆడపడుచు అన్న శుభసర్వమంగళప్రద వచనాలు కరువైతున్న కలికాలపురోజుల్లో కదంతొక్కుతున్నాం. ఫలితంగా, ఆడాపిల్ల బరువు, బాధ్యత అన్న భావనతో, వద్దనుకోవడం, మనచేతిలోలేని పరిస్థితిలో దూషణ భూషణ తిరస్కారాలతో, అవమానింపబడుతూ, కుటుంబంలో, సమాజంలో, ఆడపిల్ల పెరగడం జరుగుతున్నా, ఆమెకు మాత్రం సమాజంలో భాగం అన్న భావం కించిత్తైనా లేని, రాలేని భావంలోకి నెట్టబడుతున్నారు. గర్భసూచనతో, లింగనిర్ధారణ కూడ చేసుకోగలిగే సాంకేతిక పరిజ్ణానం మనపాలిట శాపంగా మారుతోందన్న వాదనలో అతిశయోక్తి లేదు. గర్భవిఛ్చిన్నతకు కూడ సంసిద్ధమవుతున్నారంటే అంతకంటే దారుణపరిస్థితి వేరేముంటుంది? ఈ నేపథ్యంలో మనం అంతర్జాతీయ 'పుత్రికాల దినోత్సవాలను సెప్టెంబర్ 24 న, ఈ సంవత్సరం నుంచి జాతీయ బాలికా దినోత్సవంను 24 జనవరి న జరుపుకుంటున్నాం.
అంతర్జాతీయ దినోత్సవంపిల్లల హక్కుల విషయంలో ఐక్యరాజ్యసమితివారు నాలుగు ప్రాధమిక హక్కులను పొందితీరాలని తీర్మానించారు. అవి - బతకడం, అభివౄద్ధి, పరిరక్షణ, భాగస్వామ్యం - అని స్పష్ఠపరచారు. ఈ ప్రతిపాదనల్ని, వాటిద్వారా ఉత్పన్నమైన అమలుపత్రాలకు అంగీకారం తెలిపిన మాట అందరకూ తెలిసిన విషయామే. ఈ అమలు విధానాలు - మగ, ఆడ పిల్లలకు వర్తిస్తుందికదా! కాని వాస్తవంగా జరుగుతున్న వైనం దారుణం, అమానుషం. మగపిల్లవాడిని మహారాజుగా అందలం ఎక్కిస్తున్నారు. అయితే ఆడపిల్ల విషయంలో యింటిపాలిట శాపంగాను, కుటుంబభారంగాను అధికభాగం భావిస్తున్నారు. ఫలితంగా గర్భదశలో లింగవివక్షతతో విఛ్చిన్నం చేసుకోవడం, లేదా, ప్రసవానంతరం, ఆడపిల్ల అని హతమార్చడం లేదా ఎక్కడో విడచిపెట్టడం< లాంటి దారుణమైన పనులను చేబడుతున్నారు. గ్రహస్థితి అనుకున్నా, ఎలాగో ఆడపిల్లను భరిద్దాం అనుకుంటూ, తల్లిదండ్రులు పరోక్షంగా, అసంకల్పితంగా, ఆరోగ్య, వైద్యవిధానాల్లో - టీకాలు, పోషకాహారం, మాంసకౄత్తులు, అక్షరాస్యత, విద్య, యిలాంటి సదుపాయాలను కల్పించడంలో, మగపిల్లల కన్న ఆడపిల్లలకు చిన్నచూపు చూస్తున్నారు. ఒక్కొక్కసారి, చూపునే తప్పిస్తున్నారు. ఎలాగయినా, పెళ్ళిచేసుకుని ఒక అయ్యతో వెళ్ళిపోతుంది కదా అని చులకన భావం అధికంగా వున్న రోజుల్లో గడుపుతున్నాం. జాతీయ పుత్రికాదినంసరిగ్గా నరభై రెండేళ్ళ క్రితం ఇదే రోజున భారత దేశ తొలి మహిళా ప్రధానిగా యిందిరాగాంధి ప్రమాణస్వీకారం చేసిన మరువలేని సంఘటనని ప్రాతిపాదికా తీసుకుని, యిదే రోజున 'జాతీయ బాలికా దినోత్సవం' గా పరిగణించేందుకు, భారతీయ స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారు, భారత రాష్ట్రపతిగా తొలి మహిళ పదవిలో ఉన్న సంఘటనని కూడ పరిగణనలోకి తీసుకుని ప్రకటించడం హర్షించదగ్గ విషయం. చాలా ఏళ్ళనుంచి యునిసెఫ్ వారు సెప్టెంబర్ 24 న బాలికా దినోత్సవంగాను, మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ అక్టోబర్ 15 న బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ప్రస్తుతం ఆడపిల్లల శాతంఆడశిశుహత్యలు దశాబ్దకాలంగా అధికమయ్యాయి అని గణాంకాలు తెలుపుతున్నాయి. మన దేశ జనాభా గణాంకాల ప్రకారం - ప్రతీ 1000 మంది మగపిల్లలకు - ఆడపిల్లలు - 976 (1960) నుంచి 927 (2001) కు తగ్గాఆరు.
మన రాష్ట్రాల్లో పరిస్థితి కేవలం ఐదు రాష్ట్రాల్లోనే - ఆంధ్రప్రదేశ్(978), ఛత్తీస్ ఘర్ (990), కేరళ (1058), మణిపూర్ (978), తమిళనాడు (986), పుదుచ్చెరి (1001) గా దేశ సరసరి మహిళా జనాభాకు అధికంగా అంచనాలు కనిపిస్తున్నాయి. కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో 1000 మంది మగాళ్ళకు అధికంగానే స్త్రీలు ఉన్నారని నిర్ధారణ అయింది.
అత్యధిక రాష్ట్రాల్లో - అరుణాచలప్రదేశ్ (901), అస్సాం (932), బీహార్ (921), గోవా (960), గుజరాత్ (921), హర్యానా (861), హిమాచలప్రదేశ్ (970), జమ్మూ-కాశ్మీర్ (900), జార్ఖండ్ (941), కర్ణాటక (964), మధ్యప్రదేశ్ (920), మహారాష్ట్ర (922), మేఘాలయ (975), మిజోరాం (938), నాగాలాండ్ (908), ఒరిస్సా (972), పంజాబ్ (874), రాజస్థాన్ (922), సిక్కిం (875), త్రిపుర (950), ఉత్తారాంచల్ (964), ఉత్తరప్రదేశ్ (878), పశ్చిమబెంగాల్ (934), ఢిల్లీ (821), అండమాన్/నికోబార్ (846), ఛంఢీఘర్ (773), దాద్రా/నగర్ హవేలీ (811), డామన్/డియు709), లక్షద్వీపాలు (947), దేశ సరాసరి స్త్రీల జనాభాకన్న అల్పంగానే వుంది. అందుకే, ఈమధ్య పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం, హర్యానా ప్రాంతాల్లోంచి మగవాళ్ళు, కేరళకు వలసవచ్చి, అక్కడ అమ్మాయిలను వివాహమాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని వ్యాసాలు కూడ వచ్చాయి. దర్శనమవుతున్న విచక్షణలు
లింగ విచక్షణ వల్ల, ప్రతి ఆరవ ఆడపిల్ల హత్యకు గురవుతోంది.నాలుగేళ్ళు వయసులోనున్న మగపిల్లల కన్న ఆడపిల్లల్లో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి.5-9 వయసు గల ఆడపిల్లల్లో 53% నిరక్షరాస్యులుగా కనిపిస్తున్నారు.
ప్రముఖ స్వఛ్చందసంస్థ - 'క్రై'( 'సి.ఆర్.వై' - ఛైల్డ్ రిలీఫ్ అండ్ యు ) జరిపిన పరిశోధనలో వెల్లడయిన అసంమజసాలు, జరగకూడనివి, నివారించదగ్గవి - వెరసి, దారుతాతిదారుణాలు.
పిల్లల సహాయక సంస్థ కార్యక్రమాలుఈ పరిస్థితినుంచి అతి త్వరలో, వీలైనంతమటుక్కి, బయటకు పడేయాలన్న తపనతో, 157 సూక్ష్మసంస్థలతో, 16 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు 'క్రై'జరుగుతున్నాయి. భారతదేశంలో అమలుచేస్తున్న ఈ స్వఛ్చంద స్వంస్థ ఆశ, ఆశయాల ప్రకారం - దేశం, రాష్ట్ర పరిధుల్లో ప్రతీ ఆడశిశువు హక్కులు ఉండాలి, ఉంటాయి, పొందాలి. ఈ ఆశయసాధనకు, ప్రతీవ్యక్తి కంకణం కట్టుకుని, ఆశయసిద్ధికై కౄషి సలపాలని, ప్రభుత్వేతర సంస్థలన్నీ కలసికట్టుగా, ప్రభుత్వాలకు చేయూతనివ్వాలన్న విషయాన్ని అందరూ గమనించాలి. ఆ దిశలో అడుగు ముందుకు వేయాలి. అనుకున్న ఫలితాలను త్వరితగతిని సాధించాలి.
సమసమాజంలో హక్కులతోపాటు, విధులను ఆచరించడానికి సమభాగం, సమశాతం ప్రజ అందుబాటులో ఉండాలి. పురుషుడు తన ఆలోచనా సరళిని సంస్కరించుకుని - స్త్రీని కూడా కలుపుకొని ముందుకు సాగిననాడే మానవాళికి నిజమైన అభివౄద్ధి. ఒక్క పురుషుడి అభివౄద్ధి అది ఒక అభివౄద్ధికాదు. ఆ విధంగానే, స్త్రీ తనకు అధికారాలూ - గౌరవమూ చట్టాలద్వారా సంపాదించాలనీ మాతౄస్వామ్యం రావాలనీ ఆందోళనచేసుకుంటూ సంపాదించిన అభివౄద్ధి అసమగ్రమవుతుంది. స్త్రీ పురుషులిద్దరూ, సామరస్యంతో సమిష్టిగా సాధించిన అభివౄద్ధే సర్వతోముఖమైన అభివౄద్ధి. అది భావి తరాలకు అమౄతం కాగలదు. అంతంకాదు ఆరంభం అన్నట్లు - అర్ధనారీశ్వరతత్వమే అర్ధవంతమైంది, సమర్ధవంతమైంది.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతా:యత్రై తాస్తు నపూజ్యంతేసర్వస్త త్రా ఫలా: క్రియా:
ఎక్కడ స్త్రీలు పూజింపబడతోరో అక్కడ దేవతలు క్రీడిస్తారు. ఎక్కడ పూజింపబడరో అక్కడ అన్ని కార్యములు నిష్పలములు - అన్నది భారతీయుల ఆదర్శం.
ఫ్రెంచి రచయిత అయిన లూయిస్ జాకానియట్ భారతదేశాన్ని గురించి వ్రాస్తూ - సంఘంలోనూ, కుటుంబంలోనూ, అత్యున్నతమైన స్థానం స్త్రీలకు కల్పించిన భారతీయుల నాగరికత సంస్కౄతి అతి ప్రాచీనమైంది. హిందూమతంలో వేదాలు కల్పించినట్లు, మరే మతంలోను స్త్రీలకు ఉన్నతస్థానం కల్పింపబడలేదు. వారి నాగరికత, సంస్కౄతి జ్యూస్ నాగరికత, సంస్కౄతులకంటే పురాతనమైందీ అని ముగించాడు.
శుభంభూయాత్. జాతీయ పుత్రికల దినోత్సవం సందర్భంగా (24 జనవరి), భారతదేశంలోని ప్రతీ పుత్రికకు, పుత్రికని కన్న తల్లికీ తెలుగురథం శుభాకాంక్షలను, అభినందనలనీ తెలుపుకుంటోంది.
కొంపెల్లశర్మ - తెలుగురథం.

No comments:
Post a Comment