Sunday, January 11, 2015

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


స్వాతంత్ర్యం ఒక పక్షి లాంటిది. ఎగరగలిగితేనే స్వేచ్ఛ. లేకపొతే బానిసత్వం. - మహాత్మాగాంధి.

మన దేశానికీ స్వాతంత్ర్యం లభించిందో లేక అందిపుచ్చుకున్నామో లేక పోరాడి ఎట్టకేలకు సాధించామో. మొత్తానికి భారతావని స్వాతంత్ర్య దేశం. ఆరు దశాబ్దాల కాలాన్నితెలిసో, తెలియకుండానో గడిపేసాం. సాధించింది ఎంత, యింకా సాధించవలసినది ఎంత అని బేరీజు వేసుకొని, ప్రణాళికలను నిర్మాణం చేసుకుని, ఆచరణకు సత్సంకల్పంతో ముందుకు పయనించ వలసిన తరుణం, సమయం, ఆసన్నమైంది.

మన జాతికీ మరో మహాసంకల్పాన్ని కలిగించి, మన మేధస్సుల్లో జొప్పించడానికి, మరో మహాత్ముడు అవతరించవలసినదే. సరికొత్త నూతన నవాభ్యుదయ భారతావనిని నిర్మాణం చేసుకునే దిశదశల్లో ముందుకు అడుగులు వేసుకుంటూ, దేశఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక అభివృద్ది కొరకు సామూహికంగా, సంయుక్తంగా జాతీయ కార్యాచరణ కోసం, ప్రాంతీయ, మాట, కుల తత్వ ధోరణులతో సంబంధం లేని ప్రణాళికలను అమలు పరుచుకో.

No comments: