Saturday, March 16, 2013

నాడు - ఈనాడు

నాడు - ఈనాడు


చరిత్రలో రోజు/మార్చి 16





·        క్రీ.పూ. 597   జెరుసలెంను ఆక్రమించిన బాబిలోనియా సైన్యం

·        క్రీ.శ. 44        బంధువు ‘టిబెరియస్’ మరణం తర్వాత రోమన్ చక్రవర్తిగా ‘కలిగులా’

·        1190           మతయుద్ధం పేరిట ఇంగ్లాండులోని యార్క్ లో అనేకమంది యూదుల హత్య

·        1527           మేవాడ్ రాజు రాణా సంగ్రామ్ సింగ్ ను ఆగ్రాకి సమీపంలో కణ్వాలో ఓడించిన మొఘల్ చక్రవర్తి బాబర్

·        1557           మేవాడ్ రాజు రాజపుత్ వంశస్థుడైన అమర్ సింగ్ జననం

·        1599           చత్రపతి శివాజీ తండ్రి – షహాజీ రాజే భోంస్లే జననం

·        1860           బ్యాక్టీరియా పై విశేష పరిశోధనలు చేసిన ప్రముఖ శాస్త్రవేత్త W M హాప్కిన్ రష్యా - ఒడెస్సాలో జననం  

·        1872           సుప్రసిద్ధ తెలుగు జంటకవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతిశాస్త్రి జననం

·        1901            ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఆమరణ దీక్షతో సాధించుకున్న పొట్టి శ్రీరాములు జననం

·        1912           ఒప్పందపత్ర వ్యవస్థను నిషేధించడానికి ఘోఖలో చేసిన ప్రయత్నాలకు మద్దతిచ్చిన గాంధీ.

·        1917            ప్రముఖ న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు జననం

·        1928           ప్రముఖ కవి, ఆధ్యాత్మికవేత్త ప్రసార వ్యాఖ్యాత ఉషశ్రీ జననం

·        1935          జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్ - నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త మృతి

·        1939         చెకొస్లోవేకియాను ఆక్రమించిన జర్మనీ

·        1943  ప్రముఖ రచయిత శ్రీపాద కామేశ్వరరావు మృతి

·        1945           స్వాతంత్ర్య సమరయోధుడు గణేష్ దామోదర్ సావార్కర్ (బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా సాయుధపోరాటం చేసిన వీర్ వినాయక్ దామోదర్ సావార్కర్ సోదరుడు) మృతి

·        1958  ఫోర్డ్ ఆటోమొబైల్ కంపెనీ, ప్రారంభం నుంచి ఏడాదికి ఒక మిలియన్ కార్లు తయారీతో, 50వ మిలియను కారు ‘థండర్ బర్డ్’తో 50 మిలియన్ల కార్లను ఉత్పత్తి చేయడం జరిగింది

·        1968  జనరల్ మోటర్స్ కంపెనీ 100వ మిలియను కారు ‘ఓల్డ్స్ మొబైల్ టొరనోడో’ని ఉత్పత్తి చేసింది.

·        1968  భారతీయ ఉపాధ్యాయురాలు, హిందీ నటి అనన్య ఖారే (రట్లం, మధ్యప్రదేశ్) జననం

·        1970           నూతన ఇంగ్లీష్ ‘బైబిల్’ ముద్రణ

·        1993          17 కోట్లమంది ఈపిఎఫ్ ఖాతాదారులకు పించన్ పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం

·        1993          శ్రీరంగం గోపాలరత్నం శాస్త్రీయ మరియు లలిత సంగీత గాయకురాలు మృతి

·        1997         తొలి దఫా భారత్ కు చేరిన మూడు రష్యా తయారీ ఆధునిక యుద్ధ విమానాలు ‘సుఖోయ్-30’

·        2000  హీరోషిమా బాంబుల చర్యకు కారకుడు ‘థామస్ ఫెరిబీ’ మృతి

 

No comments: