
తెలుగు రథం - సాహిత్య, సాంస్కౄతిక, సామాజిక వికాస సంస్థ
మా తెలుగు తల్లి గీతాచార్య - 'శంకరంబాడి సుందరాచార్యా జయంతి (1914 ఆగష్టు 10)
మా తెలుగు తల్లి గీతాచార్య - 'శంకరంబాడి సుందరాచార్యా జయంతి (1914 ఆగష్టు 10)
మా తెలుగు తల్లికీ మల్లెపూదండమా కన్నతల్లికీ మంగళారతులుకడుపులో బంగారు, కనుచూపులో కరుణచిరునవ్వులోసిరులు దొలరించు మా తల్లి. గలగలా గోదారి కదలిపోతుంటేను బిరాబిరా కౄష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి.అమరావతీ నగరి అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నాదాలుతిక్కయ్య కలములో తియ్యందనాలునిత్యమై, నిఖిలమై నిలిచియుండేదాక. రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి,కౄష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుదాం నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాంజై తెలుగుతల్లీ, జై తెలుగుతల్లీ. - శంకరంబాడి సుందరాచార్య.
కాకతీయుల తర్వాత చెల్లాచెదురైన తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో మళ్ళీ ఒకేచోటకు, ఒకే నీడకు చేరుకుని అఖండ జాతిగా అవతరించినది. శుభకరంగా, సుందరంగా, సుఖప్రదంగా నిర్మించుకుంటూ, భవిష్యత్తును అఖండంగా ఊహించుకుంటూ పురోగమిస్తున్నది. అటువంటి ఆంధ్రవైభవాన్ని, పలువురు కవులు, కవయిత్రులు కొనియాడుతూ తమ భావాల్ని వివిధ సాహితీప్రక్రియల ద్వారా అంధ్రప్రదేశ్ లోనే కాదు, విశ్వవ్యాప్తంగా మారుమ్రోగేటట్లు దశదిశలా వ్యాప్తి చేయడం జరుగుతూంది.
తెలుగుతల్లిని - సాధుజన కల్పవల్లి గాను, లలిత సుగుణజాల, తెలుగు బాలగాను వర్ణించారు. అలాగే తెనుగుదనము వంటి తీయదనము లేదు, తెనుగు కవులవంటి ఘనులు లేరు అని కూడ అన్నారు.
'సుందరామయం ఈ తెలుగుతల్లి, ఆయన బిడ్డతెలుగుతల్లిని వర్ణించడం కేవలం మాటల వల్ల సంభవం కాదు. అలోచనలు, భావాలు, అనుభూతులద్వారానే తెలుగుతల్లి సమగ్ర సంపూర్ణ రూపాన్ని ప్రతిష్టించడం సాధ్యం అవుతుంది. అటువంటి తెలుగుతల్లి స్వరూపాన్ని, తనదైన భావాల్ని పొందుపరచి, సరళ సుందర శైలీస్థాయిలో వర్ణించి, తన కవితను చిరస్థాయిగా సుస్మరణీయం చేసుకున్న అర్హత, సాధికారత ఎవరికో కాదు, కేవలం, ఒకే ఒక వ్యక్తికి చెల్లుతుంది. ఆయన సామాన్యుడు, మధ్యతరగతి జీవి మధ్యగతిలో చిందిస్తున్న మందహాసం పుష్కళంగా ప్రకటించిన వ్యక్తి, జీవనోపాధికోసం గావించిన ఉపాధ్యాయవౄత్తి తోపాటు, ప్రవౄత్తిగా దేశభక్తి, సాహిత్యంపై మక్కువ, తెలుగు భాషాసంస్కౄతులపై మహామక్కువ, ప్రేమ, గౌరవాభిమానాలు. ఈ వన్ని కలసి, రూపొందిన వ్యక్తి, వ్యక్తిత్వం - ఆయనే - శంకరంబాడి సుందరాచార్య.
తెలుగుతల్లి విశిష్టతశంకరంబాడి వారు అలవోకగా రచించిన భావోద్వేగపూరిత రచన 'మా తెలుగుతల్లికి మల్లెపూదండా అన్న భావకవితకు ఆంధ్రదేశం నీరాజనం పట్టుతుంది అనిగాని, ఈ కవితను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆస్థానకవితగా ఎన్నుకుంటుందని గాని, సుందరాచార్యులకు ఎన్నడూ కలనైన భావం వచ్చి వుండదు. ఈ దత్తత సమాన స్వీకారం, తెలుగుతల్లికి, తెలుగుతల్లి ముద్దుబిడ్డలకు కూడ సంతోషజనకమైంది. తెలుగు మనసు, తెలుగు హౄదయస్పందన వున్నంతకాలం ఆచార్యులవారి కవిత దర్శనీయమవుతూనేవుంటుంది.
తెలుగుతల్లిని తీర్చిదిద్దిన తెలుగుబిడ్డకరుణ, చిరునవ్వులు, సిరులు దొరలించు బంగారు కడుపు పేగు కలిగిన మా తెలుగు తల్లి కి మల్లెపూదండతోపాటు, మంగళారతుల్ని ప్రసాదించారు. శంకరంబాడి వారు, తన భావకవితలో, గోదారిని గలగలా కదలించారు. బిరబిరా పరుగులెట్టించారు, కౄష్ణవేణమ్మను. మరి సస్యశ్యామలం, సుసంపన్నత, నిత్యకళ్యాణం, పచ్చతోరణం రావలసినదే. బంగారుపంటలు పండినప్పుడు, కర్షక సుక్షేత్రాల్లో ముత్యాలు దొరలవలసినదే. అజరామరమైన లలితకళలైన - శిల్పం, సంగీతం, కవిత్వం వెరసి సోదాహరణంగా - అమరావతినగరాన్ని, త్యాగయ్యగొంతుని, తిక్కన్న కలాన్ని ముప్పేటలల్లారు. బహు అపురూపంగా, నాదభరితంగా, మధురరసాస్వాదనంతో అలరించారు. సంస్కౄతీకళాపర్వాలతో పాటు, ఆచార్యులవారు - భక్తి, శక్తి, యుక్తి, కీర్తిని చతురంగ బలాల్ని అతి చతురతతో రంగరించారు. మరువలేని మాణిక్యాలను - రుద్రమ్మ, మల్లమ్మ, తిమ్మరుసు, రాయలను తనదైన చతురశైలితో రచనను అల్లారు. ఇన్ని సొబగులు పొందిన శంకరంబాడి వారి తెలుగుతల్లి వైభవం రింగురింగుమని మారుమ్రోగుతూనే వుంటుంది. తెలుగుతల్లి ఆటపాటల్ని జరుపుకుంటూనే వుంటారు మన ముద్దు బిడ్డలు. తెలుగుతల్లికీ, తెలుగుతల్లికవితానిర్మాత - శంకరంబాడి సుందరాచార్యులకు, శతసహస్ర వందనాభివందనాల్ని అర్పించుకొంటూనే వుంటాం. వుండాలి.
సుందరాచారి రాజగోపాలాచారి, కమలమ్మ దంపతులకు 1914 ఆగష్టు 10 తిరుపతిలొ జన్మించారు. బాల్యంనుంచే, దేషభక్తి, సాహితీ సంస్కౄతీపరమైన అంషాలపై ష్రద్ధ చూపించేవారు. మదనపల్లెలో ఇంటర్మీడియట్ చదివి స్వతంత్ర భావాలు కలిగినవాడు. ఈ స్వతంత్రభావం ఎక్కడివరకూ వెళ్ళిదంటే, బ్రాహ్మణోత్తమ వంషంలో పుట్టడం, సంధ్యావందనం చేసుకోమని తండ్రి మందలించగా, జంద్యాన్నే తీసివేషారు. అంతేకాదు, తండ్రి మందలింపులకు కోపంతో పంతానికి పోయి, ఇంటినుండి వెళ్ళిపోయాడు. తాను పొందిన అనుభూతులు, భావాలు తన స్నేహితులను ప్రేరణకు గురిచేసేవి. స్థితికి పేదవాడు కాని, ప్రతిభలో మాత్రం పేదకవి కాదు, అయినా ఎవరైనా 'పేదకవీ అని పిలిస్తే, ఆనందంతో కూడిన గర్వం తొణికిసలాడేవి. భుక్తి కొరకు అనేక చిరుద్యోగాలను చేసుకుని ఆత్మాభిమానాన్ని బుజ్జగించుకుంటూ, తిరుపతిలోక్షానాటి ఆంధ్ర పత్రిక లో, ఉపాధ్యాయునిగా, పాఠషాల పర్యవేక్షకునిగా, పత్రిక సహసంపాదకునిగా ఎన్నో వైవిధ్యభరితమైన ఉద్యోగాలు చేసుకున్నాడు. బెంగుళూరులో హెచ్.యం.వి. కంపెనీ పక్షాన నాటకరచనలతో పాటు చలనచిత్ర రంగానికి కూడ రచనావిభాగంలో తనదైన సేవలను అందించారు. రవీంద్రుని విద్యావిధానానికి ప్రేరణను పొందినవారిలో షంకరంబాడి ప్రముఖులు. ఆ ప్రేరణతోనే, ఉపాధ్యాయుడిగా పాఠషాల విద్యార్థులకు విద్యను అభ్యసించేందుకు కౄషి చేషారు. ఆకాషవాణికి కూడ తన రచనలను అందించిన వాటిలో జపమాల రచన ప్రాచుర్యం వహించింది. సుందరాచారిగారు బుర్రకథలకు, తేటగీతి పద్య రామాయణం, సుందర భారతం సుప్రసిద్ధమైన రచనలు. పాఠషాల విద్యార్థులకు 'బుద్ధగీతా తెలుగునేలను పులకాంకితం చేసింది అనే చేప్పాలి. పిల్లలు లేని సుందరాచారి మన తెలుగు బిడ్డలు అనునిత్యం గానం చేసుకునే గీతాన్ని తెలుగుదనం ఉట్టిపడేటట్టు రచించారు. అక్షరపద సిరిసంపదలను స్వంతం చేసుకున్న వీరు నిజ జీవితంలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారు. ఆస్తులను కూడపెట్టుకోలేకపోయినా, తెలుగుప్రజకు మాత్రం తెలుగుతల్లిరూపాన్ని, రాష్ట్రగీతాన్ని ప్రసాదించిన ప్రతిభామూర్తి, మన తెలుగుతేజం షంకరంభాడివారు. శంకరంబాడి సుందరాచార్యులవారు తెలుగుతల్లిని, తెలుగుప్రజలకు 1977, ఏప్రిల్ 8, న భౌతికంగా దూరమయినా, ఆచార్యవ్యక్తిత్వం ఆచంద్రతారార్కమై నిలుస్తుంది. తెలుగువైభవం, తెలుగుదనం, 'మాతెలుగు తల్లీని గానం చేసినప్పుడల్లా, స్మరించినప్పుడల్లా, మనందరి ముందు ఆచార్యులు వారు, తెలుగుతల్లితో పాటు ప్రత్యక్షం అవుతారు. యిది తథ్యం.
మరచిపోలేని ఘట్టాలుఆంధ్రపత్రికదేషోద్ధారక కాషీనాధుని నాగేష్వరరావు పంతులుగారు "నీకు తెలుగు వచ్చా" అని అడిగినప్పుడు, దానికి సమాధానంగా "మీకు తెలుగు రాదా" అని తిరిగి అడగడంతో నెవ్వరపోయిన పంతులుగారితో, నేనిప్పటివరకూ తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రష్నకు సమాధానం ఏలా ఇవ్వాలో తెలియలేదు అన్నాడు. ఆంధ్ర పత్రికలో పనిచేస్తున్నప్పుడు, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసిస్ వచ్చినప్పుడు - నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, చివరకు ఉద్యోగాన్ని సుందరంగా వదులుకున్నాడు.విద్యాషాఖవిద్యాషాఖలో పాఠషాల పర్యవేక్షకుడిగా, నందనూరులో పాఠషాల సంచాలకుడు రావడం - సుందరాచారిని ప్యూనుగా, ప్యూనుని పర్యవేక్షకునిగా పొరబడడం, దానికి కోపగించి, ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేషాడు.
షంకరంబాడి సుందరాచార్య జయంతి సందర్భంగా తెలుగుతల్లి గీతం - మా తెలుగుతల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు అని నిత్య ప్రవచనం చేసుకోవాలని పున:సంకల్పం చేసుకుంటూ, మనందరి తెలుగుకవికి మల్లెపూదండ అని గౌరవిద్దాం. షంకరంబాడి జయంతి సందర్భంగా - తెలుగు రథం - అక్షరాంజలిని, ఘననివాళిని సమర్పించుకుంటోంది.
కొంపెల్ల - అధ్యక్షులు - తెలుగు రథం.
No comments:
Post a Comment