కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం. 'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?' కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో? (బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Tuesday, June 23, 2009
తెలుగురధం సంస్థ నిర్వహణలో సంగీత కార్యక్రమాలు
తెలుగు రథం - సాహిత్య, సాంస్కృతిక, సామజిక, వికాస సంస్థ
జూలై నెలలో నిర్వహించే సంగీత కార్యక్రమాలు
తెలుగురధం సంస్థ నిర్వహించే నెలవారీ కార్యక్రమాల్లో భాగంగా ఈ క్రింది కార్యక్రమాలను నిర్వహింప తలబెట్టాం. సంగీత కళా ప్రేమికులందరూ సంగీత సౌరభాన్ని ఆస్వాదించమని - తెలుగురధం సంస్థ అధ్యక్షులు కొంపెల్ల శర్మ ప్రకటిస్తున్నారు.
౩ జూలై2009 శుక్రవారం - భక్తాగ్రేసరుడు, వేదాంతయోగి, స్వామి శ్రీ నారాయణ తీర్థ జయంతి సందర్భంగా - తీర్తులవారు రచించిన శ్రీ కృష్ణ లీలా తరంగిణి లోని ప్రముఖ తరంగాలని, ప్రఖ్యాత గాయని శ్రీమతి ఎర్రమిల్లి రమాప్రభ గారు గానం చేస్తారు. శ్రీ రామ గాన సభ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొణికి సత్యనారాయణ రావు గారు ముఖ్య అతిథి గా నారాయణ తీర్థుల వారి ప్రతిభా వ్యక్తిత్వాన్ని వివారిస్తారు
౬జూలై౨౦౦౯సొమవారం - పద్మభూషణ్, శేవలియార్, సంగీత వాగ్గేయకారులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ జన్మదినం సందర్భంగా, ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ డి వి మోహనకృష్ణ గారిచే బాలమురళి స్వీయ రచనలను గానం చేస్తారు. సంగీత మహామహోపాధ్యాయ, డా. నూకల చిన్న సత్యనారాయణ గారు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. బాలమురళి తో తన చిన్ననాటి అనుభూతులను వివారిస్తారు.
పై కార్యక్రమాలు హైదరాబాద్ లోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గాన సభ - కళా సుబ్బారావు కళా వేదిక లో నిర్వహిస్తారు.
పై కార్యక్రమాల్లో పాల్గొనమని తెలుగురధం సంస్థ నిర్వాహకులు తెలియచేస్తున్నారు.
కొంపెల్ల శర్మ - అధ్యక్షులు - తెలుగురధం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment