Friday, October 3, 2008

దసరా - శరన్నవరాత్రులు

శరన్నవరాత్రి ఉత్సవాలుబ్రహ్మవిద్యా జగద్ధాత్రీ సర్వేషాం జననీ తధామయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరంసైవ సేవ్యా చ పూజ్యా చ నాన్యద్ధ దేవతాంతరం.
బ్రహ్మవిద్యా స్వరూపిణియు, జగత్తునకు ఆధారభూతమైనదియు, జగన్మాతయునగు దేవి మూడు లోకములందలి చరాచరములందన్నిటను వ్యాపించి యున్నది. ఆమెయే సేవింపదగినదియు పూజింపదగినదియునై యున్నది.
చైతన్యరూపిణిఓం చైతన్యరూపాం తామాద్యాం చ దామహి - బుద్ధిం యాన: ప్రచోదయాత్
చైతన్యరూపయు, ఆద్యయు, విద్యాస్వరూపిణియు అయిన ఏదేవి ప్రేరేంపిచున్నదో ఆ దేవిని ధ్యానించెదము.
ఆ దేవిని ధ్యానించినవారు 'సమౄత్యుం జయతి సపాన్మానం తరతి సోమౄతత్వం చ గఛ్ఛతి, మహతీం శ్రియమశ్స్నుతే' మౄత్యువును జయింతురు. పాపములనుండి విముక్తులగుదురు, దైవత్వమును పొందుదురు, మహాదైశ్వర్యములను ననుభవించెదరు.
విజయ సూచకముగ వచ్చె విజయదశమి
ఆ దేవిని పూజించి ప్రసన్నురాలిని చేసుకొనుటకు మిక్కిలి అనువయిన కాలము శరన్నవరాత్రి. ఆశ్యయుజ శుద్ధపాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులు సరన్నవరాత్రులు.
ఆ దేవిని పూజించి ప్రసన్నురాలిని చేసుకొనుటకు మిక్కిలి అనువయిన కాలము శరన్నవరాత్రి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు. తొమ్మిది రోజులూ పూజ చేయడం మంచిదని విజ్ణుల పరిస్థితి.
వర్షౠతువు గడిచిన అనంతరం వచ్చే శరదౄతువు ప్రకౄతి వైభవానికి ప్రతేక. సర్వలోక మాతయైన దేవిని ఆ సమయమందున ప్రశాంత చిత్తముతోను, నిశ్చల భక్తితోను పూజించిన వాంఛితములను పొందుతురు అన్న విశ్వాసం ప్రశంసనీయం.
ఆశ్వయుజం మొదలైన తర్వాత వచ్చే పాడ్యమి నుంచి దశమి వరకు దసరా ఉత్సవాలంజు దక్షిణాది రాష్ట్రాలలో జరుపుకుంటారు. శరదౄతువులో వచ్చే పండుగ కాబట్టి శరన్నవరాత్రులుగా దీన్ని తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. కడుభక్తితో వైభవంగా దేవీపూజలు చేసి దీన్ని దేవీనవరాత్తులు గా పరిగణిస్తారు.
ఉత్తరగ్రోహణ సమయంలో అర్జునుడు జమ్మిచెట్టుని పూజించి, ఆ చెట్టుపై కట్టి వుంచిన ఆయుధాలన్నింటిని తీసుకుని కౌరవులతో పోరాటానికి నాంది పలికి విజయం సాధించాడని భారతగాధ స్పష్టం చేస్తున్నది. అందుకే దసరా సందర్భంగా 'జమ్మిచెట్టూ ను పూజించడం ఆయుధపూజ చేయడం ఆచారంగా వస్తున్నది.
మహిషాసురడనే భయంకర రాక్షసుణ్ణి దుర్గామాత సంహరించినందుకు ప్రతీకగా కూడ ఈ పండుగను తొమ్మిది రోజులపాటు దీవీపూజలు చేసి ఘనంగా జరుపుకుంటారు. పల్లెలలోపిల్లలు - 'ఆయ్యవారికి చాలు ఈదు వరహాలు - పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు లాంటి పాటలు పాడుతూ అత్యుత్సాహంగా పాల్గొంటారు.
ఆశ్వయుజ శుద్ధ దశమినాడు మనము జరుపుకొను పండుగ విజయదశమి. దీనిని 'దసరా' అనియు 'దషరా' అనియును వ్యవహరించుట గలదు.
'శమీ శమయితే పాపం శమీ శతౄవినాశనీ, అర్జునస్య ధనుర్దారీ రామస్య ప్రియదర్శినీ'
శమీపూజ సీమోల్లంఘనం ఈ పండుగనాడు ముఖ్యం. ఉత్తరదేశాన్న రావణ కుంభకర్ణుల బుట్టబొమ్మలొనర్చి, ఊరేగించి, మైదానమున వానిని నెలకొల్పి వినోదింతురు. దీనిని రామలీల యందురు. పూర్వపు సంస్థానములలో ముఖ్యంగా మైసూరున జరుగు దసరా వేడుకలు, దర్భారులు అందరెరిగీనవే. దశమిని 'విజయదశమి యనుటకు కారణాలు పలువిధాలుగా చెప్పబడినాయి.
నవరాత్రులు - దసరా సంబరాలుదసరా సంబరాలను నవరాత్రులకాలంపాటు జరుపుకోవడం సదాచారం. తొమ్మిదిరోజులూ పూజచేయుట మంచిది.ఆ విధముగ చేయలేని వారికై -
నవరాత్రి వ్రతేశక్తం త్రిరాత్రం చైక రాత్రకం,వ్రతం చరతి యోభక్తస్తస్మై దాస్యామి వాంఛితం - అని గోవిందార్ణవం లో వివరింపబడింది.
మూడురోజులు కాని ఆఖరుకు ఒక్కరోజున కాని పూజచేసినను దేవి వారి కోర్కెలు తీర్చును. త్రిరాత్రవ్రతం చేయువారు సప్తమి (మూలానక్షత్రం), అష్టమి (పూర్వాషాఢ), నవమి (ఉత్తరాషాడ) తిధుల్లో పూజ చేయు పద్ధతి కలదు. ఆ తిధులలో ఆనక్షత్రములు కూడియుండినచో ష్రేష్ఠము. అలా కాకపోతే, తిధికే ప్రాధాన్యత యివ్వబడింది.
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమ:
జయ మాతర్విశాలాక్షి జయ సంగీతమాతౄకేజయ మాతంగి శర్వాణీ జయ సర్వ మనోహరేనమస్తేస్తు మహాదేవి నమో భగవతీశ్వరినమస్తేస్తు జగన్మాత జయశంకర వల్లభే.
నవరాత్రులలో ప్రతి దినమునను ఈ క్రింది శ్లోకములు చదువవలెను : (శివరహస్య)దుర్గాం శివాం శాంతికరీం బ్రహ్మాణీం బ్రాహ్మణ ప్రియంసర్వలోక ప్రణేత్రీం చ ప్రణమామి సదాశివాం.మంగళాం శోభనాం శుద్ధాం నిష్కలాం పరమాం కలాంవిశ్వేశ్వరీం విశ్వమాతాం చండికాం ప్రణమామ్యహాంసర్వదేవమయీం దేవీం సర్వరోగభయాపహాంబ్రహ్మేశ విష్ణునమితాం ప్రణమామి సదా ఉమాంవింధ్యస్థాం వింధ్యనిలయాం దివ్యస్థాన నివాసినీంయోగినీం యోగమాతాం చ చండికాం ప్రణమామ్యహంఈశాన మాతరం దేవీమీశ్వరామీశ్వరప్రియాంప్రణతోస్మి సదా దుర్గాం సంసారార్ణవ తారిణీంయ ఇదం పఠతే స్తోత్రం శౄణుయాద్వాపి యోనర:స ముక్త: సర్వపాపైస్తు మోదయై దుర్గయాసహ.
మంగళోఛ్ఛారణంయశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాంతయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళం
లాభ స్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ:యేషా మిందీవరశ్యామో హౄదయస్థో జరార్దన:
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాంలోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికేశరణ్యే త్ర్యంబికే దేవినారాయణి నమోస్తుతే.
జయ మాతర్విశాలాక్షి జయ సంగీతమాతౄకేజయ మాతంగే శర్వాణీ జయ సర్వ మనోహరేనమస్తేస్తు మహాదేవి నమో భగవతీశ్వరినమస్తేస్తు జగన్మాత జయ శంకర వల్లభే.
శ్రీశ్రీ చండికాధ్యానంయాచణ్డీ మధుకైట భాదిదలనీ, యా మాహిషోన్మూలినీ,యా ధూమ్రేక్షణచణ్డముణ్డమధనీ యా రత్కబీజశనీశక్తి: శుంభనిశుంభదైత్యదలనీ యా సిద్ధిదాత్రీ పరాసా దేవీ నవకోటి మూర్తి సహితా మాం పాతు విశ్వేశ్వరీ.
మహాకాళీధ్యానంఖడ్గం చక్రగదేషుచాపపరిఘాన్ శూలం భుశుణ్డీం శిర:శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావౄతాంయాం హంతుం మధుకైటభౌ జలజభూస్తుష్టాన సుప్తే హరౌనీలాశ్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాళికాం.
ఖడ్గము, చక్రము, గద, ధనుర్బాణములు, ఇనుపకట్ల గుదియ, శూలము, భుశుండి (మానవ) శిరస్సు, శంఖము; వీనిని (పది) హస్తములందు ధరించునదియు, మూడుకన్నులు గలదియు, ఆభరణములతో కప్పివేయబడిన సర్వాంగములు గలదియు, విష్ణుదేవుడు యోగనిద్రలో ఉన్నప్పుడు మధుకైటభాసురలను వధించుటకై బ్రహ్మదేవునిచేత స్తుతింప బడినదియు, ఇంద్రనీలమణివంటి శరీరకాంతి గలదియు, పదిముఖములు, పది పాదములు గలదియు అగు మహాకాళికాదేవిని నేను సేవించుచున్నాను.
మహాలక్ష్మీధ్యానంఓం అక్షస్రక్పరశుం గదేషుకులిశం పద్మం ధను: కుణ్డికాందణ్డం శక్తిమసిం చ చర్మ జలజం ఘణ్టాం సురాభాజనంశూలం పాశసుదర్శనే చ దధతీం హస్తై: ప్రవాళ ప్రభాంసేవే సైరిభమర్దినీమిహ మహోలక్ష్మీం సరోజస్థితాం.
తన (పదునెనిమిది) చేతులలో అక్షమాల, గండ్ర గొడ్డలి, గద, బాణము, వజ్రాయుధము, కమలము, ధనుస్సు, కలశము, దండము, శక్తి, ఖడ్గము,డాలు, శంఖము, ఘంట, మద్యపాత్రము, శూలము, పాశము, సుదర్శన చక్రము ధరించునదియు, ప్రవాళమణి (పగడపు) వర్ణము గలదియు, మహిషాసురుని సంహరించినదియు, తామరపూవుపై కూర్చుండియుండినదియు అగు మహాలక్ష్మీని సేవించుచున్నాను.
మహాసరస్వతీధ్యానంఘణ్టాశూలహలాని శంఖముసలే చక్రం ధను: సాయకంహస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసఛ్ఛీతాంశుతుల్యప్రభాంగౌరీదేహసముద్భవాం త్రిజగతామధారభూతాం మహాంపూర్వామత్ర సరస్వతీమనుభజే సుంభాదిదైత్యార్ధినీం.
తన (యెనిమిది) హస్తకమలములందు ఘంట, శూలము, నాగలి, శంఖము, రోకలి, చక్రము, ధనుస్సు, బాణములు ధరించునదియు, మబ్బుయొక్క అంచున ప్రకాశించుచుండు చంద్రునితో సమమగు కాంతి కలదియు, పార్వతీదేవి శరీరమునుండి ఉద్భవ మందినదియు, ముల్లోకములకు, ఆధారభూతమైనదియు, శుంభుడు మున్నగు దైత్యులను వధించినదియు అగు అపూర్వమైన మహాసరస్వతిని భజించుచున్నాను.
శరన్నవరాత్రి - దేవీపూజ ప్రారంభోత్సవాల సందర్భంగా - భక్తప్రేమికులకు తెలుగురథం దసరా శుభాకాంక్షలను తెలుపుకుంటోంది.
ఓం తత్ సత్ ఓం
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: