Wednesday, September 10, 2008

మన తెలుగు తేజం - డా. యలవర్తి నాయుడమ్మ

ఎదురులేని శాస్త్రజ్ణత, తిరుగులేని పరిశోధన

సహృదయుడు, ఉదారవాది, నిత్య ఆలోచనాపరుడు, గ్రామీణ పేద ప్రజల అవసరాలపై నిత్యం దృష్టినిపెట్టిన బుద్ధిశీలి, కర్మయోగి, జగద్ప్రసిద్ధివహించిన విజ్ణాని, చర్మ పరిశోధనలో దిట్ట - డా. యలివర్తి నాయుడమ్మ. తెలుగు వెలుగుని దశదిశలా, విశ్వస్థాయిలో ప్రతిభావంతంగా అందజేసిన ఘనుడు డా.నాయుడమ్మ. గుంటూరు జిల్లాకు చెందిన డా.నాయుడమ్మ పారిశ్రామిక రసాయనశాస్త్రం లో పట్టభద్రుడై, మద్రాసులోని చర్మ సాంకేతిక సంస్థలో తన ప్రతిభను అందించినందుకు, ప్రభుత్వం, మరింత ప్రతిభాపాటవాలను అలవరచుకునేందుకు ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లో యమ్.యస్సీ, పి.హెచ్.డి. చదివిని పొందాడు. ఆధ్యయన సమయంలో అనేక తోలు, చర్మ సంబంధిత సంస్థల్లో, కార్మికస్థాయిలోని మెలకువలను ఆకళింపుచేసుకున్నాడు. 1950 తొలేళ్ళలో భారతదేశంలోకి పున:ప్రవేశం చేశాడు. వెంటనే, కేంద్ర తోలు పరిశోధనాసంస్థలో శాస్త్రవేత్తగా బాధ్యతలను తీసుకున్నాడు. కేంద్రం స్థాపన తొలిరోజుల్లో సంస్థాగత, ప్రణాళిక, నిర్వహణాపరమైన సేవలను అందించాడు. 1958-1971 మధ్య పుష్కరకాలంపాటు సంస్థకు అధ్యక్షుడిగా అత్యధ్బుతమైన పనితీరును ప్రదర్శించాడు. 1965లో కె.జి.నాయక్ పురస్కారాన్ని పరిశోధనకు గుర్తింపుగా పొందడం జరిగింది. తోలు, చర్మ పరిశ్రమకు, సంబంధిత పరిశోధనకు డా.నాయుడమ్మ అందించిన సేవలు నభూతో న భవిష్యతి అని చెప్తారు. భారతీయ శాస్త్ర పరిశోధనాసంస్థ కు డైరక్టర్ జనరల్ గాను, భారత ప్రభుత్వం, శాస్త్ర, సాంకేతిక విభాగానికి కార్యదర్శిగాను కార్యభారాన్ని తిరుగులేని విధంగా నడిపాడు. ఈయన హయాంలో దేశవ్యాప్తంగా 40పరిశోధనాకేంద్రాలు, 20,000 మంది పైగా శాస్త్రవేత్తలసిబ్బందితో నిర్వహించిన పనితీరు పలువురి ప్రశంసలను అందుకున్నాయి. అంతర్జాతీయ వరి పరిశోధనాసంస్థకు డైరక్టర్ జనరల్ గాను, ప్రముఖ శాస్త్రవేత్త డా. యమ్.యస్.స్వామీనాధన్ కూడ సహశాస్త్రవేత్తగా కూడ వృత్తిని నిర్వహించాడు. సమగ్ర గ్రామీణాభివృద్ధి పధకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కరీమ్ నగర్ జిల్లాలో అమలుపరచిన కార్యక్రమం తలమానికమని అందరి ప్రశంసల్ని అందుకుంది. స్థానికంగా అందుబాటులోవున్న సహజ వనరుల ఆధారంగా, వాటిని అంతరిక్షమాధ్యమంతో చిత్రీకరించిన ప్రధమ కార్యశీలి డా.నాయుడమ్మ.

ప్రతిభ తెచ్చిపెట్టిన అత్యున్నత పదవులు, గౌరవాలు

1971 లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల సంఘానికి నాయకత్వం వహించి, సంప్రదాయ విజ్ణానాన్ని ఆధునిక శాస్త్ర,సాంకేతిక రంగానికి అన్వయించడం ప్రధాన లక్ష్యంగా కార్యభారం వహించారు. అనేక విదేశీయ, అంతర్జాతీయ సంస్థలకు - ఐక్యరాజ్యసమితి, సంబంధిత సాంకేతిక సంస్థలు, ఆర్ధిక-వ్యవసాయసంస్థ, ఐక్యరాజ్య అభివృద్ధి పధకం/సంస్థ, యునెస్కోలతోపాటు, ఐక్యరాజ్యసమితి పరిధిలోని ౫౦కిపైగా సభ్యదేశాలకు సలహాదారునిగా అందించిన సేవలు, డా.నాయుడమ్మ కీర్తి ఆచంద్రతారార్కం నిలుస్తుంది. అంతర్జాతీయ శాస్త్రీయ సంఘటన ద్వారా సమాజానికి శాస్త్ర, సాంకేతిక పరిశోధనారంగాల నుంచి లభించే లాభ ప్రయోజనాల్ని బేరీజు వేసిన వ్యక్తి. అందేలాభాల్లో, ఆలోచనాత్మక, వస్తుపరమైన లాభాలపై మరింత దృష్టి వహించాడు.

శాస్త్రీయత కు చేదోడువాదోడు పరిపూర్ణ మానవత్వం, వ్యక్తిత్వం

కేవలం సాంకేతికకారుడు, శాస్త్రవేత్త, సలహాదారుడే కాదు, డా. నాయుడమ్మ సుస్ఫష్ఠమైన మానవతావాది, సహనశీలి, నిత్యప్రేమికుడు, మతాలకు, వర్ణాలకు అతీతుడు. ఈ భావాలకు సాక్షాత్కారంగా, ఆయన నివాసంలో ఐదు మతాల విశ్వాసాలని ప్రకటించేలా ఆకృతులను అలంకరించడం ఆయనలోని మానవత విశ్వరూపం దాల్చింది అని చెప్పాలి.

ప్రతిభకు నీరాజనాలు

డా.నాయుడమ్మ ప్రతిభకు తార్కాణంగా, పద్మశ్రీ సత్కారం, రాజలక్ష్మి సంస్థ, మద్రాసు, నుంచి పురస్కారం (1983) పొందిన డా.నాయుడమ్మ సమాజంలో శాస్త్ర, సాంకేతికతను వినియేగించకుండా రసాయనశాస్త్రంపై అవగాహన, ప్రతిభ కొరకురానికొయ్యలు అని భావించిన ఘనుడు. మనిషిలోని ఆలోచన, కుశలత, ప్రతిభ, ఆచరణ, సంకల్పం, లక్ష్యశుద్ధి, లక్ష్యసిద్ధి, లాంటి విషయాలనిబట్టి ఫలితాలు, ప్రభావాలు వస్తాయన్న పాస్కల్ వాదనను సమర్ధిస్తాడు.

డా. స్వామినాధన్ అభిప్రాయం

డా.నాయుడమ్మ సత్య, నిత్య కర్మయోగిగానే సంచరించాడని, భారతీయ సనాతన, సదాచార ధర్మపధాన్ని ఎన్నడూ మరవడం, వీడడం చేయలేదని, వీటిలోంచే మానవుని జీవితంలో ఆనందం, సంతృప్తి లభిస్తాయన్న సిద్ధాంతాన్ని మనసావాచాకర్మణా నమ్మి, ఆచరించిన సత్యవాది, తను నిర్వహించిన వృత్తి, ప్రవృత్తిని జోడించి, ఆకాశహర్మ్యాలకు తీసుకువెళ్ళడంలోను, శాస్త్రీయ, సాంకేతిక రంగాలను అంతర్జాతీయస్థాయికి తనదైన శైలిలో తరలించగలిగిన తెలుగుతేజం, డా.యెలవర్తి నాయుడమ్మ - ఆయనవంటివారిని అన్వేషించడం అనివార్యం అయినా నాయుడమ్మ లంటివారు లభించడం కూడ అసాధరణమైన శోధన అని ప్రముఖ శాస్త్రవేత్త డా. యమ్. యస్. స్వామీనాధన్ అభిప్రాయపడ్డారు.

డా. నందమూరి తారకరామారావు గారు ప్రవచించిన తెలుగువారి, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఆనాడే డా.నాయుడమ్మ అంతర్జాతీయ స్థాయిలో తెలుగుపతాకాన్ని రెపరెపలాడించడం మన తెలుగునేల చేసుకున్న పుణ్యం. 1922 సెప్టెంబరు 10 డా. నాయుడమ్మ జయంతి. ఈ సందర్భంగా ఆ మహానుభావుడిని మనసారా తలచుకోవడం మనందరి విధి, కర్తవ్యం.

4 comments:

పుల్లాయన said...

dhanya vaadaalu. manchi vishayalu telipinanduku.

gaddeswarup said...

There is a 'Nayudamma Foundation for Education and Rural Development' in Nadimpalli village which I visited a few times. They have a complex of school, library, leather technology training, old people's home etc. in the complex. they also have other activities and plans (from their brochure) which I am not familiar with since I live far away. Contact address:
Dr. K. Varaprasad, M.S.
Chairman, NFERD,
Nadimpalli Village-522 259
Cherukupalli Mandal,
Guntur district.
Phone numbers (o8648)78611, 77211, 78696
These are a few years old and I do not know whether they are still operational.

Unknown said...

Many many thanks for the valid information and I will definitely contact.
kbssarma

gaddeswarup said...

Off topic.
వీలైతే కొమరవోలు చంద్రశేఖరం గారిని గురించి కుడా వ్రాయండి. నేను ఒకసారి రచ్చబండ లొ వ్రాశాను:

http://groups.yahoo.com/group/racchabanda/message/10112