Sunday, September 7, 2008

నాడు - ఈనాడు

నాడు - ఈనాడు
సెప్టెంబర్ 7 ప్రత్యేకతలు
సంఘటనలు
1. 1953 - నికిత కృశ్చేవ్ - సోవియట్ రాజ్య కేంద్ర సంఘానికి అధ్యక్షునిగా ఎన్నిక.
2. 1979 - ప్రముఖ టి.వి. ఛానెల్ - యి.యస్.పి.యన్. ప్రారంభం.
3. 1998 - ప్రముఖ యింటర్నెట్ విప్లవానికి దారితీసిన - గూగెల్ ని లారీపేజ్, సెర్గేబిన్, స్టేన్ ఫోర్డ్ విశ్వవిద్యాలపు విద్యార్ధులచే అన్వేషింపబడి, ప్రారంభమైంది.
వర్ధంతి
1. పద్మభూషణ్, బోయి భీమన్న
ప్రముఖ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, బోయి బీమన్న జయంతి. 'గుడిసెలు కాలిపోతున్నాయీ అన్న కవితా సంకలనానికి బహుమానం లభించింది. తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు లో దళిత పాలేరు కుటుంబం లో జన్మించి, పేదరికం, అంటరానితనం వంటి దురాచారాలను అనుభవించ వలసి వచ్చిన భీమన్నకు సామాజిక చైతన్యమే జీవితాశయం. ఆ ఆశయంతోనే, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి వర్యుడు, పద్మభూషణ్. అంబేద్కర్ సుప్రసిద్ధ రచన 'కుల నిర్మూలనా గ్రంధాన్ని తెలుగులోకి సమర్ధవంతంగా తర్జుమా చెసిన కవి ఘనాపాటి, బోయి భీమన్న.
2. రావి నారాయణ రెడ్డి
ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు - రావి నారాయణరెడ్డి. తెలంగాణా పోరాటంలో పాల్గొనడం, ఆంధ్ర మహాసభ కు అధ్యక్షునిగా తిరుగులేని నాయకత్వం, విశాలాంధ్ర కోసం పోరాటంలో పాల్గొనడం, నిజాం ప్రభుత్వం పై జరిపిన సాయుధ పోరాటం చరిత్రలో మిగిలిన ముఖ్యాంశం.

No comments: