నాడు - ఈనాడు
ఆగష్ట్ 3 ప్రత్యేకతల్లో కొన్ని ...
1. హిట్లర్ కు పట్టాభిషేకం
ప్రముఖ రాజకీయ నాయకుడు, జపాన్ దేశపు రూపురేఖల్ని తనదైన శైలిలో మార్చివేసిన ప్రతిభామూర్తి అడోల్ఫ్ హిట్లర్ తన జపాన్ దేశపు అధ్యక్ష పదవిని స్వీకరించిన రోజు (1934).
2. మణిశంకర్
ప్రముఖ చలనచిత్ర దర్శకుడు, పాత్రికేయుడు అయిన మణిశంకర్ (తెలుగు తేజం) పుట్టినరోజు (1957). మణిశంకర్ 16 డిసంబర్, రుద్రాక్ష, టాంగో చార్లీ అన్న చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాక, 'మనిషీ తెలుగు చిత్రానికి నంది పురస్కారం లభించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. అంతేకాక, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు గారికి మాధ్యమిక వ్యక్తిగత సలహాదారునిగా కూడ ప్రతిభావంతంగా కార్యకలాపాలని నిర్వహించారు.
3. ప్రముఖ సంగీత కళాకారుడు - శ్రీపాద పినాకపాణి
'నాదం అందించే నాట్యమే సంగీతం' అనే ప్రముఖ సంగీతకారుడు - శ్రీపాద పినాకపాణి పుట్టినరోజు (1913). పినాకపాణి గారి గురించి అందరూ సంగీతమే ఆయన వౄత్తి, ప్రవౄత్తి అని భావిస్తారు. వౄత్తిరీత్యా వైద్యులు అయిన ఆధ్యాత్మికతన, దైవచింతన వెరసి సంగీతమే అన్న భావం ఆయనిది. ప్రముఖులైన నేదునూరి కౄష్ణమూర్థి, నూకల చిన సత్యనారాయణ, మల్లాది సూరిబాబు - వారి సంతానం మల్లాది సోదరులు లాంటి ప్రశిష్యులు అవడం శ్రీపాదవారి ప్రతిభాపాటవాలని తలమానికాలు అని చెప్పి తీరవలసిందే. ఆరియకుడి రామానుజ అయ్యంగార్, వీణ ధనమ్మాళ్, ప్రముఖ వాయులీన సంగీతకారుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గార్ల ప్రేరణలు బాగా వున్నాయి అని చెప్పుకున్నారు. సంగీత కళానిథి, సంగీత నాటక అకాడమీ (1977), పద్మభూషణ్ బిరుదులు, పురస్కారాలు ఎన్నో అందుకున్న శ్రీపాద పినాకపాణి గారి జన్మదినం నిజంగా నేడు భారతావనికి శుభదినం అనే చెప్పాలి.
1 comment:
కడు ఘోరంబగు అప్పుతచ్చు. హిట్లర్ జర్మనీ వాడు - జపానోడు కాదు.
Post a Comment