Friday, August 1, 2008

నేటి ప్రత్యేకతలు - 1 ఆగష్టు

నాడు ఈనాడు

రోజుకు తప్పక ప్రాధాన్యం ఉండి తీరుతుంది. చరిత్రలో జోచ్చుకుపోయిన అనేక సంఘటనలు, ప్రతిభావంతమైన వ్యక్తుల జీవన ప్రస్థానాలు, సింహావలోకనం, పునఃసమీక్ష చేసుకోకపోతే, మానవ జీవన ప్రస్థానంలో, సమాజంలో పురోగతి దర్శనం అవుతోందా అని అనుమానం రాకపోదు. సాధ్యమైనంత వరకూ ఏ రోజు కా రోజు సంతరించుకున్న ప్రత్యేకతను, విశేషాలను అందజేసే ప్రయత్నం తెలుగురధం సంకల్పిస్తోంది. ప్రతీ విషయం విపులంగా చెప్పడం క్లిష్టతరమని అన్యదా వివరించవలసిన పనిలేకపోయినా, తెలుగురధం అభిమానులు, వీక్షకులు, సదవగాహనతో ఆదరిస్తారని భావిస్తూ - కొంపెల్ల

శర్మ 1 ఆగష్టు


- ఈరోజు నుంచి వారం రోజులపాటు 'తల్లిపాల వారోత్సవాలు' ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. పురుడుపోసుకున్న ప్రతీ శిశువు తల్లిపాలు అందుకుని, సంపూర్ణ ఆరోగ్యానికి దారి తీసేలా వాతావరణం నెలకొనాలని ఆశ.


- ప్రముఖ హిందీ చలన చిత్ర నాయకి - మీనాకుమారి జన్మదినం.

- ప్రముఖ రచయిత్రి 'అన్నా ఫ్రెంక్' - డైరీ రూపాన వచ్చిన రచనలో ఆఖరి అంశం ఈరోజు 1944 న వ్రాసి, రచనను పూర్తిచేసింది. ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రచారం పొందిన రచన అని మాత్రం చెప్పక తప్పదు.

- ప్రముఖ కవి, రచయిత, దేవరకొండ బాల గంగాధర తిలక్ - అమృతం కురిసిన రాత్రి (కవితా సంకలనం - కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారం) నిర్మాత, జయంతి కూడా ఈరోజే. తెలుగురధం ఈ సందర్భంగా ప్రతిభావంతులకు నివాళి సమర్పిస్తూ, ప్రత్యేక కార్యక్రమాల విషయంలో కూడా ఆశించిన ఫలితాలను అందిస్తాయని ఆశిస్తూ -

కొంపెల్ల శర్మ - తెలుగురధం.

1 comment:

Purnima said...

భారత తొలి ప్రధానమంత్రిగారి శ్రీమతి.. కమలా నెహ్రూ గారి జన్మదినం కూడా ఆగష్టు ఒకటో తేదీయే!! ఒక ప్రధానికి భార్య.. మరో ప్రధానికి తల్లి అన్న విశిష్టతే కాకుండా.. ఈవిడ స్వాతంత్ర్య పోరాటంలో తమ వంతు పాత్ర పోషించారు. నెహ్రూ గారు రాసిన "డిస్కవరీ ఆఫ్ ఇండియా"లో చదవచ్చు!!

మంచి ప్రయత్నం. అభినందనలు!!