Wednesday, July 30, 2008

హాస్యపు నిత్యజల్లు 'రామలింగయ్య అల్లు'


ఈ బొందిలో ప్రాణాలు వున్నంతవరకూ నటించాలన్నదే నా ధ్యేయం. నటించడంలోనే నాకు కావలసిన విశ్రాంతి లభిస్తుంది.
కాలం మారింది, కుర్రాళ్ళ భావాలకు, నా భావాలకు కుదరదు. అలాంటప్పుడు చిత్ర నిర్మాణంలో చెయ్యి పెట్టకుండా ఉండటమే మంచిది.
నేను మళ్ళీ పుట్టాను! నేనిప్పుడు కుర్రాన్నే!
చారిత్రిక సాహిత్య చరిత్రలో 'వికటకవి' తెనాలి రామలింగడు అందరికి సుపరిచితమే. అలాగే, మన తెలుగు చలన చిత్ర రంగంలో, అర్ధ శతాబ్దపు కాలం పాటు, నభూతో న భవిష్యత్ అన్నా నటన అన్నా పేరుతొ జీవించిన మహా కళాకారుడు. ఆయనే, అల్లు రామలింగయ్య. 'పుట్టిల్లు' చిత్రం ద్వారా రంగప్రవేశం చేసి, తిరుగులేని ప్రస్తానాని స్వయమ్గా నిర్మించుకున్న ప్రతిభావంతుడు. దాదాపు సహస్ర చిత్రాల్లో తన ప్రతిభను ప్రదర్శించి, సంప్రదాయపు సంఖ్యా - వెయ్యి నూట పదహారు చిత్రాలను చవి చూడలేకపోయినకళాకారుడు. పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య, పురస్కారాలను అందిపుచ్చుకున్న ఈ మహా నటరత్నం, గొప్ప ప్రతిభావంతమైన హోమియో వైద్యుడు అవడం చిత్రరంగంలో అనేకమంది స్నేహితులను అందించింది.
కొదుగు అల్లు అరవిందు గొప్ప నిర్మాత, మెగా నటుడు చిరంజీవి అల్లుడు, అల్లు అర్జున్ యువతరంగపు కథానాయకుడు, ప్రముఖ కాలనసిత్ర నిర్మాణ సంస్థ - ఈవన్నీ అల్లు వారి కృషి, సంకల్పం, పట్టుదల, చిత్రరంగంలో సంపాదించుకున్న పెద్దపేరు, పరువు అనే చెప్పాలి.
ఒక ప్రముఖ రచయిత అన్నట్లు - ఊరు పాలకొల్లు, హాస్యాల వీరమల్లు, వెయ్యి వైపే విల్లు, చిత్ర రంగడి కే చెల్లు'
ఆ మహా నతమహామనీషి - అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా తెలుగు రథం ఘన నివాళిని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం

5 comments:

చిన్నమయ్య said...

శర్మ గారూ, బావుంది. అల్లు వారి బయొగ్రఫీని కాస్త విపులీకరించి, వారు పొందిన అవార్డులని, గౌరవాలనీ కొంత తెలియజేస్తే ఇంకా బాగుండేది.

అచ్చు తప్పుల మీద కాస్త శ్రద్ధ వహించాలి. ఇంతకు ముందీమాట ఎవరో అంటే మీరు కోపగించుకున్నారు. అర్ధం చేసుకుంటారనుకుంటాను.

అభినందనలు.

Unknown said...

అయ్యా చిన్నమయ్య గారు, పెద్దమనసుతో వ్రాసిన అభిప్రాయానికి ధన్యవాదాలు. అక్షరాల్లో దొర్లుతున్న తప్పులు నాకు తెలుసున్న విషయమే. కాని, నేను బరహ వాడుతున్నాను. అది లేఖినిలోకి మార్చి, బ్లాగ్ లోకి ఉంచుతున్నాను. ఏది ఏమైనా, తెలుగులో ఒకే ఒక తెలుగు భాషా విధానము వచ్చే దాక, యింతే పరిస్థితి అని నా అభిప్రాయం. నేను యిప్పటికీ, యిదివరకు చెప్పిన మాటే నా అభిప్రాయం. చదువుతోంటే ఎవరైనా, అక్షరదోషముల పైన దౄష్టి పెట్టారు అంటే నాకు నిరాశే కలుగుతుంది. విషయం పై చర్చ జరిగితేనే అనందపడతాను. అది యింతవరకూ ఎవరూ చెయ్యడం లేదు. భాషా పటిమ పై విమర్శించినా నాకు ఆనందం కలుగుతుంది. తెలుగు చదువరుల్లో ఈ మార్పు ఎప్పుడు వస్తుందో అని ఆ తెలుగుభాషామ తల్లిని వినమ్రంగా ప్రార్ధిస్తున్నాను. మీ అభిప్రాయానికి చాలా ధన్యవాదాలు.
కొంపెల్ల శర్మ

Rajendra Devarapalli said...

శర్మ గారూ,విషయంలొ లోపం,భాషా పటిమలో పొరబాటు వస్తేగా నేనూ వెతుకుతున్నా,కానీ మీరు నాకా అవకాశం ఇవ్వట్లేదు మరి :)

Anonymous said...

TRY THIS FOR TELUGU TYPING.
http://www.google.com/transliterate/indic/Telugu

FOR MORE PROFILES AND INFO. TRY THIS
http://earlytollywood.blogspot.com/

Unknown said...

dear krishnarao garu, your transliterate approach appears to be good. let me use it. however, the problem in our language with 56 letters being used by everyone as per ones perception and preference. Even any website also should not be permitted its own font and letter pattern. I donot know when we will succeed in this regard. The socalled collectors like koodali, jalleda, e-telugu site owners should do something in this regard instead of linking to various articles/blogs which are being maintained all of us. They are doing only coureer job that too most unsystematically and in an unorganised manner.
Pl think on this issue further. thanks. kbssarma