Friday, July 4, 2008

మగటిమి మొనగాడు - అల్లూరి సీతారామ రాజు - జయంతి

విప్లవజ్యోతి - అల్లూరి సీతారామ రాజు - జయంతి - ౪ జూలై.



తెలుగుతల్లి బిడ్డ



" సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు. నేను దానిని అంగీకరించను. అయితే రాజు వంటి ధైర్యవంతుని, త్యాగశీలుని, సింపుల్ వ్యక్తీ, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. రాజు తిరుగుబాటుదారు కాదు, ఆయనో హీరో. " - మహాత్మా గాంధి.

రాజు అంటే సామ్రాజ్యాలని పరిపాలించే రాజు కాదు. మాన్య సీమలను గాండ్రించిన మగటిమిగల మొనగాడు, తెల్లదొరల అడలించిన తెలుగుతల్లి బిడ్డడు. ఆయనే విప్లవజ్యోతి అల్లూరి సీతారామ రాజు.

మహోజ్జ్వల శక్తి, యోధుడు అయిన సీతారామ రాజు తెచ్చిన విప్లవం పై ఒక విప్లవమే ఆవిర్భవించింది. అసూయాపరులు అతన్ని, రంప పితూరీ గా వివరించారు. కాని, మరణం తర్వాత, జాతీయ నాయుకునిగా, శివాజీగా, రానా ప్రతాప్, లెనిన్ గా పొగిడారు. వీరస్వర్గాన్ని అలంకరించాడు అన్నారు. ఒక పత్రిక (సత్యాగ్రహి) ఏకంగా జార్జి వాషింగ్టన్ అన్నారు.

ముద్దుపేరు - చిట్టిబాబు, ఫోటోగ్రాఫర్ పనిలో నైపుణ్యం, స్థిరాదాయం లేక పేదరికం వలసకు దారి తీసింది. పినతండ్రి సహాయం వల్ల కుటుంబం నడిచేది. గుర్రపు స్వారీ లో నిపుణుడు. దూరంగా నడిచి వెళ్లి కాడువు, కలరా జబ్బు మొదలైన కారణాల వల్ల కాడువు గాడి తప్పడం కూడా జరిగింది. చదువు సంధ్యలు లేవని అంటే, కోపం, ఇల్లు వదలడం, ప్రధానోపాధ్యుడు కొడితే బడికి స్వస్తి పలికాడు. ఈ ప్రాయమ్లోనే తుని లోని గిరిజనుల జీవన శైలిని గమనించాడు. ఈ దశలో, జ్యోతిష్యం, వాస్తు లపై ప్రావీణ్యం సంపాదించాడు. సంసృతం, ఆయుర్వేదం లో నిష్ణాతుడు అయ్యాడు. చదువు లేకపోయినా, బహుముఖీనంగా ప్రవీణుడు అయ్యాడు.

ఉత్తర భారత యాత్ర కావించిన సన్యాసి దీక్ష

౧౯౧౬, ఏప్రిల్ ౨౬ న ఉత్తర భారత దెస యాత్రని ప్రారంభించి, బెంగాలులో సురేంద్రనాథ్ బెనర్జీ వద్ద ఆతిధ్యం, లక్నో లో కాంగ్రెస్ మహా సభల హాజరు, తీర్థ యాత్రలు పూర్తీ చేసుకుని, బ్రహ్మ కపాలంలో సన్యాస దీక్ష స్వీకరించి, యోగి గా మారి నూతన దర్సనం అయ్యాడు. ౧౯౧౮ లో రెండవ దఫా యాత్ర కావించి, కృష్ణదేవి పేట చేరి, తాండవ నది సమీపాన ఆశ్రమం లో నివాసం చేసుకుంటూ, తపోమునిగా మారాడు. ఆ ప్రదేశానికి శ్రీరామ విజయనగరం అని నామకరణం చేసాడు.

అసలు కథ, కమామీషు

తెల్ల దొరల పరిపాలనలోని దురాగతాలను క్రమేపీ ఎదురాడడం, తిరిగి మన్యం లో కాలిది, విప్లవానికి వేదిక సిద్ధం చేసుకోవడంలో ముఖ్య భూమిక అల్లూరి దే అని చెప్పాలి. విప్లవం ప్రముఖంగా, చింతపల్లి, కృష్ణదేవి పేట, రాజవొమ్మంగి, అడ్డతీగల అల్లూరి విప్లవంతో మమైకం అయి, ప్రజాదరణకు గురయింది. రెండవ దశలో విప్లవం, కొన్ని ఎదురు దెబ్బలను తిన్నా, పాలకులను, శత్రువులను, ముప్పుతిప్పాలను పెట్టాడు.

రూథర్ ఫోర్డ్ కసి

మన్యం కు కలక్టర్ గా వచ్చిన రూథర్ ఫోర్డ్ తన డైన శైలి తో అనుచరుడైన మల్లుదోరను స్వాధీన పరచుకోవడం, ప్రజలను భయభ్రాంతులను కావించడం, మన్యాన్ని దిగ్భంధనం చేయడం, ఆహారం లేకుండా చేయడం, విచక్షణ లేకుండా చిత్రహింసలను కావించడం, చంపడం చేసి ఒక హింసాత్మక వాతావరనాని కల్పించాడు, రూథర్ ఫోర్డ్.

౧౯౨౪, మే ౬-౭ తేదీలు అల్లూరి జీవితానికి కీర్తి పతాక అని చెప్పాలి. ఉదయం స్నానం కోసం ఏటికి వస్తే, అరెస్ట్ చేయడం, బందీ రాజుని విచారణ కూడా లేకుండా కాల్చి చంపడం దారుణంగా జరిగిపోవడం భారత దెస స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రధాన పుటగా మారి పోయింది. తల్లికి కూడా తెలియని మరణ వార్తగా దాచిన కిరాతక పాలక వ్యవస్థకు తార్కాణం.

మే ౭, ౧౯౨౪, అల్ల్లూరి దేహాన్ని దహనం కావించారు. మూడు పదుల వసంతాలు కూడా నిండని అమరవీరుడు - అల్లూరి సీతారామ రాజు - తెలుగువీరుడు, తిరుగులేని వీరుడు అయినాడు.

కొసమేరుపు



౧౯౮౬ లో భారత తపాల శాఖ వారు అల్లూరి దేశభక్తికి నివాళి గా, స్టాంప్ ని విడుదల చేయడం సంతోషించదగ్గ విషయం.

భాగ్యనగారా జంట నగరాల వారధి - టాంక్ బ్యాండ్ వద్ద - "మన్యసీమ గాండ్రించిన మగటిమి గల మొనగాడు, తెల్లదొరల అడలించిన తెలుగుతల్లి బిడ్డడు' అని స్ఫూర్తివంటంగా విగ్రహాన్ని నెలకొల్పారు.

ప్రముఖ నిర్మాత, నటుడు, కృష్ణ, ధైర్య సాహసోపేతంగా నిర్మిచిన 'అల్లూరి సీతారామ రాజు' చిత్రం సహజ జీవన ఇతివృత్తంగా భావించబడి, అనేక బహుమానాలు, మన్ననలను పొందింది.

'విప్లవజ్యోతి అల్లూరి సీతారామా రాజు - డి.కే. ప్రభాకర్ పుస్తకం, 'మల్కనగిరి చరిత్ర', అట్లూరి మురళి - పరిశోధనలు రాజు జీవితానికి మరిన్ని కీర్తి పతాకాలు.

భారత స్వాతంత్ర్య సమరగాదను, సమరయోదుల్ని, ప్రత్యేకంగా, తెలుగు వీరుల్ని, తెలుగుతెజాల్ని స్మరిమ్చుకోవలసి వస్తే, అల్లూరి వారి గునికం లో మొదటి వరుసలో మొదటి లెక్క అనే చెప్పక తప్పాడు.

దీక్ష బూని, తిరుగుబాటు చేసి, దేశమాత సేవకోరి ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు - అల్లూరి సీతారామ రాజు.

అల్లూరి జయంతి సందర్భంగా, తెలుగురధం సనినయ ప్రనామాల్ని సమర్పించుకుంటోంది.

కొంపెల్ల శర్మ - తెలుగురధం.


No comments: