Monday, March 24, 2008

స్వీయ మానస దర్శనం
జీవితాంతం పోరాడి ఎట్టకేలకు
నీవనుకున్నది సాధించిన రోజు
ఈ ప్రపంచం ఒక్కరోజుకైనా నిన్ను
మకుటం లేని మహారాజును చేసిన రోజు
పొంగి పొరలకుండ అద్దం ముందు
నిలబడి స్వీయదర్శనం చేసుకో.
అద్దంలోని నీవైపు వీక్షిస్తున్న వ్యక్తి
నీతో గావించే మౌన సంభాషణం గమనించుకో.

నీజన్మకి కారణభూతం ఎవ్వరనుకున్నావు?
మాతాపితరులు, సహధర్మచారిణి నిమిత్తమాత్రులు
వీరెవరూ నిర్ణయకారులు కానే కారు
నీకు సమ్మతమైనా కాకున్నా
నీజీవితాన శిరోధార్యపు నిర్ణేత తీర్పులు
ఎవరివో కావు, నీముందు అభివ్యక్తింపచేసే వ్యక్తివే
నీ ముందున్న అద్దంలో కనిపించే అర్ధం కాని వ్యక్తివే.

ఆత్మసాక్షాత్కారం నీ వెనుకనుంచి అదృశ్యంగా
దర్శనీయం చేయించేది నీ ముందున్న అద్దంలోనివాడే

కొందరికి నీతిమంతుడివి
మరి కొందరికి నిజాతీయపరుడివి
యింకొందరికి అధ్బుత ఆశ్చర్యాల అజేయుడివి

ఈవన్నీ అగణితాలు సుమా! తస్మాత్! జాగ్రత్త!
ఎప్పుడో అప్పుడు డామిట్! కధ అడ్డం తిరుగుతుంది?
అద్దంలోని మిత్రుడివి నీవు అనర్హుడివి, అసమర్ధుడివి
అతని కళ్ళలో కళ్ళుంచి కలహంనుంచి జయించలేనివాడివి

నిన్ను మునగచెట్టెక్కించగల ముద్దుల నేస్తం
నీ అంతం సాంతం చవిచూసే అనంతం
క్లిష్టాతిక్లిష్టమైన ప్రమాదభరితం ఛేసినా చేస్తాడు
నీ చిరుజీవితాన్ని అతలాకుతలంగా మారుస్తాడు
నీ చుట్టూ మాయామోహపూరిత వలయాన్ని గిరిగీస్తాడు

చివరకు నీ ముందు చిరునవ్వులు చిందిస్తాడు
అంతిమ పర్వాన్ని శోకాతప్తభాధాగాధలతో ముంచెత్తుతాడు
తస్మాత్ జాగ్రత్త! పారాహుషార్! జాగ్తేరహో! అనుకోవాలి
కధ అడ్డం తిరక్క ఏమవుతుంది, దూరపు కంచికి పోతుంది
నీ అద్దంలోని మనిషి నిన్ను వెధవాయను చేయడం తధ్యం
నీ మనస్సాక్షి చేతిలో ఓటమి, ఆత్మసాక్షి పేరన పరాభవం.

అందుకే - మనవాళ్ళు ఒట్టి వెధవాయలోయి అన్నాడు డి గ్రేట్ గిరీశం.

1 comment:

Bolloju Baba said...

చాలా బాగుంది
బొల్లోజు బాబా