Monday, March 24, 2008

ఆ నోట ఈ మాట

మధురోహలు

మధురమైన ఊహలు. ఆహా! ఎంత చక్కని మాట. ఆలోచన. జిజ్ఞాస మనిషిలో ప్రకృతి సహజంగా వుండే లక్షణం. దానివల్లనే తెలియని విషయాలని తెలుసుకోవాలని నిరంతరం తపన పడుతుంటాడు మనిషి. అలా అవసరమైన విషయాలెన్నో వివరించి జీవనవికాసానికి సహకరించడానికి కలిగిన ఊహ - మధురోహలు. విశ్వవ్యాప్తంగా మేధావులెందరో వైవిధ్యం నిండిన వెలలేని భావాలను, అనుభవాలను, సూక్తులుగా, సుభాషితాలుగా, మాటల మూటలుగా అందించారు. అటువంటి మంచి మాటలను, మహనీయుల భావాభిరామాలను 'తెలుగురధం' - మధురోహలు - ఆనోట ఈమాట - గా ఆవిష్కరించాలని భావార్ధ సంపదని అలతి అలతిగా అందించాలన్న సత్ప్రయత్నమే - మధురోహలు.



సమాజంలో అధర్మం, అసత్యముల చేత - ధర్మమూ, సత్యము దారుణంగా చెరచబడుతున్నా, దానిని నిరోధించే శక్తి వుండీ ఉపేక్షించిన వారికి తమ ఉపేక్షే చేటుగా పరిణమిస్తుంది.
(మహాభారతం - తిక్కన్న)

No comments: