Tuesday, March 25, 2008

జీవితం జీతానికే

జీవితం మూడు అక్షరాలే
ముప్పేటలే, ముప్పుతిప్పలే
తిరిగిరాని ప్రాయం - అయినా అనివార్యం

జీవితంలో కష్టకాయం
నిజాయితీ, సంస్కారం
లక్షణ లక్ష్యం - అయినా అలక్ష్యం

జీవితంలో ప్రేమభావం
ఆత్మగౌరవం, స్నేహశీలత
అవిభాజ్యాలు  కాని అహంభావాలు

జీవితంలో ప్రశాంతత
ఆశాభావం, సత్యనిబద్ధత
కనీస విలువలు - కాని వేల వెలబోతలు

జీవితంలో దురాశ
గర్వభావం, క్రోధతత్వం
నరకానికి తరలింపు - కాని మూర్ఖపుతనాలే

జీవితం ఒక నిత్య పరీవాహం
ఒడ్డున నిలవడం వృధా - అలలతో కలసిపో సదా

జీవితం లో సంపద, కీర్తి
మట్టిపాలు - ప్రతిష్ట చిరంజీవి
వినా నిర్జీవి

జీవితంలో జీవనం, మరణం
మధ్యలో విరామం, విలాపం
వికాసం విషాదం, వినోదం వికారం
విలాసం వివాదం - విహారం విచారం
విన్యాసం విలయం
చివరకు విహంగం వీక్షణం

జీవితం జీవనమే
జీవించడమే, జీవింపజేయడమే

జీవితం ఆధ్యయనం
ఉపాదీకరణం, విరమణ
వ్రుత్తి, ప్రవృత్తి, నివృత్తి
చివరకు తోలుతిత్తి.










No comments: