Friday, March 21, 2008

వానా వానా వల్లప్ప

వానా వానా వల్లప్ప తప్పట్లు తడిలో పిల్లకాయ పిడుగులు
నానా విధాల గోల చేష్టలు కేరింతలమయాలు మడుగడుగులు
మేనాడిస్తున్న మేళవింపులు మేటి చిరుజల్లుల ఆటపాటలు
నేనా నువ్వాలకు సరిసములు వర్షాకాలాన పిన్నల జలకాటాలు

(వానా - నానా - మేనా - నేనా, అన్న పదాలతో దత్తపది

విషయం - వానజల్లులో తడుస్తున్న పిల్లల అల్లరి గురించి.

No comments: