పరిపూర్ణ వ్యక్తిత్వం
వ్యక్తి వేరు, వ్యక్తిత్వం వేరు
ఎక్కడో కాని సంగమం చేయవు
వ్యక్తి భౌతికం, వ్యక్తిత్వం అగమ్యగోచరం
దోందూ దోందే!
వ్యక్తిత్వమే లేనప్పుడు
పూర్ణం, పరిపూర్ణం
నిఘంటువు లో నానాపదాలే!
ఆలోచన తో పాటు ఆవేశం
ఆలోచన కన్న ముందే ఆవేశం
తెలుగువాడి తెగులుకి
తెలుగులోనే చెప్పగల నిర్వచనం
ఏమండి వ్యక్తీ గారూ
మీరు వ్యక్తిగానే వున్నారా
అయితే, సరిచుసుకోవాలి
సంగతుల గతులు యిలా ఉండాలి.
'నేను' చాయని పోనివ్వాలి
సహనానికి మారుపేరు మీది కావాలి
వాదాలని మనసారా తలధన్నాలి
గగన శిఖరం సులభం కాదని గ్రహించాలి
ఆకాశానికి నిచ్చెనలు విసరడం మనాలి
అప్రస్తుత ప్రసంగాలు అవధానాల్లోనే పరిమితమవ్వాలి
చేదు, వగరు కూడా ఆహా ఏమి రుచి అని లొట్ట వేయాలి
అతి సర్వత్ర వర్జయేత్ అన్నది ప్రయోగం చేయాలి
బాధ లేని బోధ గురువుగా ప్రభావితం కావాలి
మూర్క్హత్వం, మూసతనం మానుకోవాలి
గిరి గీయని సులభ మార్గాలని ఆచరించాలి
అనుమానం పెనుభూతమని గ్రహించాలి
అనర్ధ, అసమర్ధతలని అసమంజసాలని తెలుసుకోవాలి
దయ, సహనం, వినయం, వివేకం, మానం సంపదలవ్వాలి
వ్యవధి లేదని వ్యవస్థనే అస్తవ్యస్తం చేయడం మానుకోవాలి
వోదిగిపోతూ, ఎదిగిపోవడం ఎరుక చేసుకోవాలి
గమనంలో, ప్రస్థానంలో మీ ముద్రలే ముందుండాలి
కాంతి బీజాల్ని జోప్పిమ్చడంలో నిపుణత చూపాలి
జయాపజయాలని గణాంకాలతో గణనం మానుకోవాలి
విదురనీతుల పేరున అవినీతుల బూతుల్నివిసర్జిమ్చాలి
బలాన్ని చూసి మురిసిపోవక సరిగ్గా అంచనా వేసుకోవాలి
బలహీనతలని మరింత దుర్బలత గా తగ్గించుకోవాలి
అవామ్తరాల్ని అధిగామిమ్చుకోవడం నేర్చుకోవాలి
అవకాశాల్ని అద్భుత దేవతలుగా కొనియాడాలి
వీటిని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు భాగ్యవంతులు
వీటిని దుర్వినియోగం చేసుకున్న వాళ్లు నిర్భాగ్యజీవులు.
అందుకే - జీవులు, నిర్జీవులు, మృతజీవులు
అందుకే - వ్యక్తులు, అవ్యక్తులు, అస్తవ్యస్త వ్యక్తులు
వ్యక్తావ్యక్తతను గ్రహించలేని దురవస్తకు బానిసలు
కృతయుగం నుంచి కలియుగానికి దిగాజారుడుతనాలు
పంకం ఊబిలో దిగిపోయి తేలలేకపోతున్న పద్మశ్రీలు
తెలుగుతనానికి, తెలుగుదనానికి తేడా తెలియనివాళ్లు
తెలుగుప్రజలు, తెగులుతో సతమతమవుతున్న రుజరణ సంకలనాలు
అప్రచురిత ప్రబంధాలు, వెలలేని వెలవెలబోతున్న నిశ్శబ్దపదప్రహేలికలు.

No comments:
Post a Comment