కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం. 'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?' కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో? (బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Thursday, January 10, 2008
స్వీయ మానస దర్శనంజీవితాంతం పోరాడి ఎట్టకేలకునీవనుకున్నది సాధించిన రోజుఈ ప్రపంచం ఒక్కరోజుకైనా నిన్నుమకుటం లేని మహారాజును చేసిన రోజుపొంగి పొరలకుండ అద్దం ముందునిలబడి స్వీయదర్శనం చేసుకో।అద్దంలోని నీవైపు వీక్షిస్తున్న వ్యక్తినీతో గావించే మౌన సంభాషణం గమనించుకో।నీజన్మకి కారణభూతం ఎవ్వరనుకున్నావు?మాతాపితరులు, సహధర్మచారిణి నిమిత్తమాత్రులువీరెవరూ నిర్ణయకారులు కానే కారునీకు సమ్మతమైనా కాకున్నానీజీవితాన శిరోధార్యపు నిర్ణేత తీర్పులుఎవరివో కావు, నీముందు అభివ్యక్తింపచేసే వ్యక్తివేనీ ముందున్న అద్దంలో కనిపించే అర్ధం కాని వ్యక్తివే।ఆత్మసాక్షాత్కారం నీ వెనుకనుంచి అదృశ్యంగాదర్శనీయం చేయించేది నీ ముందున్న అద్దంలోనివాడేకొందరికి నీతిమంతుడివిమరి కొందరికి నిజాతీయపరుడివియింకొందరికి అధ్బుత ఆశ్చర్యాల అజేయుడివిఈవన్నీ అగణితాలు సుమా! తస్మాత్! జాగ్రత్త!ఎప్పుడో అప్పుడు డామిట్! కధ అడ్డం తిరుగుతుంది?అద్దంలోని మిత్రుడివి నీవు అనర్హుడివి, అసమర్ధుడివిఅతని కళ్ళలో కళ్ళుంచి కలహంనుంచి జయించలేనివాడివినిన్ను మునగచెట్టెక్కించగల ముద్దుల నేస్తంనీ అంతం సాంతం చవిచూసే అనంతంక్లిష్టాతిక్లిష్టమైన ప్రమాదభరితం ఛేసినా చేస్తాడునీ చిరుజీవితాన్ని అతలాకుతలంగా మారుస్తాడునీ చుట్టూ మాయామోహపూరిత వలయాన్ని గిరిగీస్తాడుచివరకు నీ ముందు చిరునవ్వులు చిందిస్తాడుఅంతిమ పర్వాన్ని శోకాతప్తభాధాగాధలతో ముంచెత్తుతాడుతస్మాత్ జాగ్రత్త! పారాహుషార్! జాగ్తేరహో! అనుకోవాలికధ అడ్డం తిరక్క ఏమవుతుంది, దూరపు కంచికి పోతుందినీ అద్దంలోని మనిషి నిన్ను వెధవాయను చేయడం తధ్యంనీ మనస్సాక్షి చేతిలో ఓటమి, ఆత్మసాక్షి పేరన పరాభవం।అందుకే - మనవాళ్ళు ఒట్టి వెధవాయలోయి అన్నాడు డి గ్రేట్ గిరీశం. -
ఓహో భగవంతుడా!
నన్ను కరుణించు, కటాక్షించు
స్థితిగతుల్ని మార్చలేని స్తబ్ధతలో
కనీసపు నిబ్బరాన్ని ప్రసాదించు.
మార్పు తేగలిగే స్థితుల్లో
మార్పిడికి అవసరమైన ధైర్యాన్నివ్వు.
పై రెంటి నడుమ వుత్పన్నమైన
అంతరాన్వేషణ కొరకు జ్ణానాన్ని అందించు.
మన జీవితాలు
మన గురించి మనమే మననం చేసుకోవాలా?
మనం ఎదో జీవనం చేస్తున్నాం
కానీ ఏమాత్రమూ జీవించటం లేదు
జీవిస్తున్నాం అంటే కదా ఆలోచించాలి
ఆలోచించి ఒక కొలిక్కి వచ్చే లోపునే
జీవిత విన్యాసం నిండుకుంటుంది
అందుకేనేమో జీవితం బుద్బుదప్రాయమన్నారు
జనన మరణాల మధ్య విరామమన్నారు
ఒడ్డున నిలబడి అలలను చూస్తుంటే జీవితమా?
ప్రవాహంలోకి చేరుకుని అలల తాకిడికి తట్టుకోవాలి
అలలను అడ్డుకుని ఎదురు ఈదగలిగితేనే జీవితం
ఎన్నోజీవరాసులు తమదైన జీవితాన్ని గడుపుతున్నాయి
వాటితో పోలిస్తే ఓ మానవుడా! నీవెంత? నీబ్రతుకెంత?
నీవుంటున్న సమాజం కంటే ఆ ప్రాణులుండే సమజం నయం
పశువులైనా గడ్డితిని మనకు మధురమైన పాలిస్తాయి
పక్షి కూడ తన గాయాన్ని మరచి,కరకువానికి కవనమబ్బించింది
ఈవన్నీ జీవితసత్యాలు, నగ్నచిత్రాలు, తెలుసుకో, మసలుకో
నడచుకో, నడతను నేర్చుకో, నవనవలాడే జీవితాన్ని కోల్పోకు
తిరిగిరాని గమ్యానికి నీకు నువ్వు ముహూర్తం నిర్ణయించుకోకు
జీవితపు అర్ధాన్ని, పరమార్ధాన్ని, గ్రహిస్తూ, జీవించడం నేర్చుకో.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment