Monday, June 15, 2015

శ్రీ శ్రీ - అభ్యుదయ కవన యుగకర్త

శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983) - 2 జనవరి జయంతి
శ్రీశ్రీ జీవనప్రస్థానం ... యిదిగో ... యిలా ...
అది 1910 వ సంవత్సరం. ఈ ఏట మువ్వింతలు జరిగాయట. ఒకటి తోకచుక్క పొడవడం; రెండు గురజాడ అప్పారావు గారు ముత్యాలసరాలు రచనచేయడం; యిక మూడవది మహాకవి శ్రీశ్రీగా ముందు ప్రపంచానికి సుపరిచితులైన శ్రీరంగం శ్రీనివాసరావుగారు జన్మించడం. శ్రమైక జీవన సౌందర్యానికి, సమానమైనది లేనేలేదోయ్ అన్న ప్రజాకవి, విప్లవకవి, మహాకవి, మహాప్రస్థానం నుంచి మరోప్రస్థానం వరకు తనదైన శైలిలో ప్రపంచంలో మరోప్రపంచాన్ని సౄష్టించిన, ఈయన జీవనప్రస్థానం యిలా సాగిపోయింది.
1910 జనవరి 2 న విశాఖపట్టణంలో శ్రీ వెంకట రమణయ్య, శ్రీమతి అప్పన్నకొండ లకు జన్మించిన శ్రీశ్రీ, పుట్టిన ఏడాదికే తల్లిని పోగొట్టుకున్నాడు. ఎవియన్ కాలేజీలో లెక్కలమాష్టారుగా తండ్రి పనిచేయడం, అక్కడే శ్రీశ్రీ చదువుకున్నాడు. 1925లో చదువుతోబాటు వెంకటరమణమ్మతో వివాహం, యింటర్మీడియట్ చదువు 1928 లోను, 1928లో మద్రాసు కాలేజీలో, బి.ఎ. జంతుశాస్త్రం లో చేరినా, 63 రోజుల టైఫాయిడ్ జ్వరం వలన, 1931 లోనే పూర్తిచేయడం జరిగింది. చదువుకున్న కాలేజీలోనే డిమాన్సేట్రర్ గా పనిచేస్తూ కప్పలమాస్టారు గా పేరు తెచ్చుకున్నారు. 1938లో మద్రాసులోని ఆంధ్రప్రభలో ఉపసంపాదకునిగాను, 1942లో డిల్లీ ఆకాశవాణిలోనూ, 1943లో లక్నోలో మిలటరీలో లేబరేటర్ అసిస్టెంట్ గానూ ఉద్యోగపర్వాన్ని నిర్వహించారు. 1945లో తండ్రి మరణం జరగ్గా, 1946లో నిజాం నవాబుగారి రిఫార్మ్ సెక్రటేరియట్ లోను, 1946-49లో ఆనందవాణిలో ఉద్యోగాన్ని కొనసాగించారు. 1947లో మద్రాసులో రాయపేటలో మకాం వున్న శ్రీశ్రీకి గుర్రపుపందాల సరదా జోరుగా వుండేది. 1949లో చుట్తాలమ్మాయిని 'లెనినా అన్న పేరుపెట్టుకుని అభిమానపుత్రికగా పెంచుకోవడం జరిగింది. 1950లో నళినికుమార్ తో స్నేహం, 1954లో హెల్సెంకీలో జరిగిన ప్రపంచశాంతి మహాసభకు ప్రతినిధిగాను, రష్యా, పారిస్, లండన్ పర్యటన చేశాడు. 1856లో ఉపద్రష్ట సరోజినితో వివాహం అవగా, కూతురు (1959), కొడుకు (1962) గలగడం, 1967లో రెండవసారి రష్యా ప్రయాణం, 1970లో విశాఖపట్టణంలో షష్టిపూర్తి ఉత్సవాలు జరిగాయి. ఈ దశలో శ్రీశ్రీ చలంగారిని కలుసుకోవడం ప్రముఖ ఘట్టంగా భావించారు. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా శ్రీశ్రీని అరెష్ట్ చేసి, విడుదల చేయడం జరిగింది. 1976లో చైనాయాత్ర జరిపారు. 1979లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డుని, పదివేల నగదు బహుమతిని పొందడం జరగ్గా, 1980లో కాకినాడలో స్పతి పూర్తిసభ నిర్వహించారు. ఈ సమయాన్నే, పురిపండావరితో లండన్ ప్రయాణం జరిగింది. 1981లో శ్రీమతితో అమెరికా ప్రయాణం చేశారు. 1982లో అభిమానుల ఆర్ధికసహాయంతో కోర్టుకేసుని పోరాడారు. సుదీర్ఘ సాహితీజీవనం, నిజజీవనం జరుపుకున్న శ్రీశ్రీ 1983 జూన్ 15 న ఈ భౌతికజగత్తుని వదలి మరోప్రపంచంలోకి వెళ్ళిపోయారు.
శ్రీశ్రీ సాహితీపర్వం ... యుగంగా మారిన వైనం
మానవజాతిని ఉద్ధరించడానికి కొత్తమతాన్ని కనిపెట్టిన ప్రవక్త. ప్రపంచపు సరిహద్దుల్ని వూగించాలని ప్రయత్నించిన అతని హౄదయోద్రేకాన్ని వర్ణించడం అసాధ్యమైన పని. నెత్తురూ, కన్నీళ్ళు కలిపి కొత్త మందును తయారుచేశాడు. హౄదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్నివ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చడం అతనెకే చేతనవును. పద్యాలు చదువుతూంటే, యివి మాటలుకావు, అక్షరాలు కావు - ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు - అతని హౄదయంలోంచి మన హౄదయంలోకి నేరుగా పంపిన ఉత్సాహాలు, నెత్తులుకాలవ అనిపిస్తుంది. ఏ లోకంలో అన్యాయాలు, అధికారాలు, ఏడుపులు, క్షామాలు, యాచకాలు, క్షుద్రకవిత్వాలు, శిక్షణలు, అవినీతిపర్వాల్లాంటివి స్వప్నలోకంలో వీక్షణం చేస్తూనేవున్నాడు. దేవుడు, అధికారాలు, పాతర్లు, సౌఖ్యాలు, నీతులు, స్వర్గం, మర్యాదలు, మూటకట్టుకుని కులికే ఎంతోమందికి అర్ధంకాని బాధ, మరణం, దరిద్రం, అవిశ్వాసం, అశాంతి, యివన్నీ అర్ధంకాక గట్టిగా సౄష్టినే ప్రశ్నించిన యువకుల లక్ష కంఠాల్ని ఏకం చేసి పలికిన ప్రజాపక్షపాతి. ఈ మాటలు, వర్ణనలు, ఈ వ్యాసరచయితవి అనుకునే ప్రమాదం వుంది. ఆ యిబ్బందేమీలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం కు యోగ్యతాపత్రంను అందించిన చలం శ్రీశ్రీ గురించి, ఆయన కవిత్వం గురించి అనుభవించి పలవరించిన అచంచలభావాలు. బాధతో అన్నా బోధవాచకాలు - తెలుగువాడి జాతీయధనం ఓర్వలేనితనం; అసలు సిసలైన తెలుగు వాడికి పొరిగింటి పుల్లకూరే నచ్చుతుంది అన్న నిర్మొహమాటం పడని నిజవాది.
శ్రీశ్రీ రచనాపరంపర
మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంతో మహాయోగం పొందినా, అంతకు ముందుగా ప్రభవ, వారం వారం, సంపంగితోట అన్న రచనలు వ్రాశాడు. ఆయన కలం ఆగని వాడితనంతో, వేడితనంతో, అమ్మ, మీమీ, మరోప్రపంచం, త్రీచీర్స్ ఫర్ మేన్, చరమరాత్రి, మానవుడిపాట్లు, సౌదామిని, గురజాడ, మూడు ఏభైలు, మహాప్రస్థానం తర్వాత అంతటి పేరును తెచ్చిన ఖడ్గసౄష్టి, వ్యూస్ అండ్ రివ్యూస్, అయిదు సంపుటాల శ్రీశ్రీసాహిత్యం, మిన్నేలని, రెక్క విప్పిన రెవల్యూషన్, వ్యాసక్రీడలు, మరోమూడు ఏభైలు, చినయానం, మహాప్రస్థానం తర్వాత మరోమలుపుని తెచ్చిన మరోప్రస్థానం, పాడవోయి భారతీయుడా (శ్రీశ్రీ చిత్రగీతాలు), న్యూ ఫ్రంటీర్స్, అనంతం, ప్ర-జ, రచనలను అందించిన అమరకవి. అనంతం (ఆత్మకధ), ప్ర-జ రచనలను ఆయన మరణం తర్వాత ప్రచురించడం జరిగింది. శ్రీశ్రీ నిజంగానే భారతీయసాహితీకారుల్లో అగ్రగణ్యుడు. అందుకనే, భారతీయ సాహితీనిర్మాతలు అన్న శీర్షికన శ్రీశ్రీ వ్యక్తిత్వంపై సుదీర్ఘవ్యాసాన్ని ప్రముఖ సాహితీవేత్త బూదరాజు రాధకౄష్ణ, కేంద్రసాహిత్య అకాడమీ వారు ఈ రచనకు 2006 లోనే మూడవ ముద్రణనిచ్చారు.
శ్రీశ్రీ గురించి కధనకుతూహలం
శ్రీవాణి తో నూతన వరవడితో ప్రారంభించిన తెలుగు సాహిత్యం శ్రీశ్రీవాణితో మరోమలుపు తిరిగి అక్కడ ఒక యుగంపాటు నిలిచిపోయింది. అదే శ్రీశ్రీ యుగం. అంతకుముందు, విశ్వనాధ సత్యనారాయణ గారు నిర్మాణం చేసుకున్న పధంలో ఒక యుగం నిలచిపోయింది. శ్రీశ్రీ, విశ్వనాధలు జంటకవులు కాకపోయినా, యిద్దరూ చెరొక యుగానికి ప్రాతినిధ్యం వహించడం తెలుగు సాహితీవాణికే గర్వకారణమయినది.
శ్రీశ్రీని నూత్న కవితా భగీరధుడుగా డా. దివాకర్ల వెంకటావధానిగారు కితాబునిచ్చారు. సాహితీమార్క్స్ గా రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు సెలవిచ్చారు. మానవత్వంలోప్రవహించే నది అని డా.నాయని కౄష్ణకుమారి అని అన్నారు. ఆరని విప్లవ జ్Yఓతి, పధ నిర్దేశకుడు, శ్రీశ్రీది మనిషితనం అని, ఆధునిక సాహితీ చరిత్రకు 'గురుజాడలుగా, గురజాడ-చలం-శ్రీశ్రీ ని వర్ణించడం, కవి-మనిషి-వ్యక్తిగా శ్రీశ్రీకి త్రివేణీసంగమసత్కారాలతో వేనోళ్ళ కొనియాడారు. ఒకప్పుడు సాహిత్యం భోగవస్తువు; ఈ నాడది ఉపయోగ వస్తువు కావాలి అని తన నినాదాన్ని ప్రకటించాడు శ్రీశ్రీ. ప్రజలభాషల్ సన్నగా సంగీతం సాహిత్యంలో వినిపించిన కాలాన్ని తానే స్వయంగా నిర్మించుకున్నాడు శ్రీశ్రీ. సాహిత్య జగత్తులో మనిషి మేల్కొన్న తరుణమది. నేను సైతం ప్రపంచాగ్నికి, విశ్వసౄష్టికి, భవనఘోషకు ... అంటూ సొంతగొంతుకతో జయభేరి మ్రోగించిన మొదటిగేయాన్ని విరచించిన విద్వాంసుడు. శ్రీశ్రీ కవితా జీవితం ఒక మహాస్రవంతి; మహాకవిని చేసింది. అభ్యుదాయాంధ్ర కవిత్వయుగకర్త శ్రీశ్రీ, ప్రజాకవి, సమాజ చైతన్యాన్ని మేల్కొల్పి, దానిలోని వేడిరక్తాన్ని ఉడికించి,కవితను ప్రజావాణిగా పలికించి, ప్రపంచ పీడితజన బాధామయగీతాన్ని హృద్గీతగా పొంగించి, జీవితానికీ, సాహిత్యానికీ మంగళ సంవిధానాన్ని సాధించి,పండిత పామరజనరంజకమైన కవితాస్రవంతిని తెలుగునాట క్రొత్తతియందనాలతోపారించి, అభ్యుదయపధాన్ని చూపించిన శ్రీశ్రీ ఆధునికాంధ్ర సాహిత్య రధసారధి. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారన్నట్లు, తిక్కన్న, వేమన్న, గురుజాడలు శ్రీశ్రీలో కొత్తరూపం తాల్చారు. తెలుగువారికి - తెలుగువాణికి ఒక అంతర్జాతీయకవిని సమర్పించారు. అందుకే, నిజంగా నేను, ప్రజల కవిన్నేను, ఎంచేతంటేను, వాళ్ళను చదివేను, చదివించే రాసేను అని తానే చెప్పాడు. ప్రజలను చదివినవాడూ, చదివింది వ్రాసినవాడూ ప్రజాకవి, దానికి మారుపేరు శ్రీశ్రీ అనికూడ అచార్యులు వివరించారు. నా రచనలలో లోకం ప్రతిఫలించి, నా తపస్సు ఫలించి, నా గీతం గుండెలలో మూర్ణిల్లగ, నా జాతి జనులు పాడుకొనే మంత్రంగా మ్రోగించాలి అని తన ప్రణాళికను సుస్పష్టంగా విశదపరచారు. వ్యదారజీవిత యదార్ధదౄశ్యం పునాదిగా ఇక జనించబోయే భావివేదముల జీవనాదముల జగత్తుకంతా చవులిస్తానోయ్ అని ప్రతిజ్ణ చేసిన శ్రీశ్రీ తనవాదాన్ని వేదంగా పేర్కొన్నాడు. విప్లవ కవిత పాడేడప్పుడు కూడ, నా వినుతించే, నా విరుతించే, నా వినిపించే నవీనగీతికి, భావం, భాగ్యం, ప్రాణం,ప్రణవం అని, చివరకు మిగిలేది సర్వనాద మూలబిందువైన ౠతం, అదే ప్రణవం అని ప్రవచనం చెప్పాడు. శ్రీశ్రీ ని సారాంశంగా ఒకే ఒక వాక్యం చెప్పాలంటే, ఆలోచన నా ఉనికికి సూచన అనే చెప్పాలి. ఆలోచన ఉన్నస్థితిలో అసంతౄప్తిని కలిగించి, ప్రశ్నించడం నేర్పుతుంది. ప్రశ్నించడం అన్వేషణకు కారణమౌతుంది. అభ్యుదయానికిప్రేరణ అవుతుంది. ప్రగతికి పునాది అవుతుంది. సరిగ్గా, సమంగా, శ్రీశ్రీ విషయంలే యిదే జరిగింది. శ్రీశ్రీ కి మరణం లేదు. మహాకవి ప్రతినిత్యం మన మనసుల్లో, నిత్యకౄత్యాల్లో, ఆలోచనల్లో, ఎదో రూపాన, మసలుతూనే వుంటాడు. జననమరణాల మధ్య జీవితం ఒక విరామసంకేతం. శ్రీశ్రీ మనకు స్వల్ప విరామం ప్రసాదించాడు. త్వరలో శ్రీశ్రీ మరల అవతారమెత్తుతాడు. లేదా కనీసం మరోశ్రీశ్రీని అవతరింపచేస్తాడు. మరో మహాప్రస్థానాన్ని తప్పక అందిస్తాడు. మనం మాత్రం మరో చలాన్ని సిద్ధం చేసుకోవాలి, యోగ్యతాపత్రం అందించడానికి. యిరువురూ కలసి వస్తారేమో ఎవరికెరుక!?!? నిరీక్షణ కావిద్దాం.
అభ్యుదయ కవితా ప్రయోక్త, సమసమాజ సంస్థాపన ప్రవక్త, మహాప్రస్థానం సౄష్టికర్త, మహాకవి, శ్రీశ్రీ జయంతి సందర్భంగా తెలుగురథం ఘననివాళిని సమర్పించుకుంటూ, శ్రీశ్రీ మహానుభావుకతని పున:స్మరణం చేసుకునే భాగ్యం కలిగినందులకు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Monday, April 13, 2015

భారత రాజ్యాంగ శిల్పి, 'భారతరత్నా సన్మాన గ్రహీత, "డా. భీం రావ్ రాంజీ అంబేద్కర్" జయంతి


(1891 - 1956)













బహుముఖ ప్రజ్ణాశాలి - భీం రావ్ అంబేద్కర్







మహామేధావి, సంఘసంస్కర్త, న్యాయశాస్త్రవేత్త, భారతరాజ్యాంగ శిల్పి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, అని ప్రఖ్యాత వహించిన వ్యక్తి - డా. భీమ్క్ రావ్ రాం జీ అంబేద్కర్ విశ్వవిదితమైన మహామనీషి. సుప్రసిద్ధ రచయిత 'బెవెర్లి నికొలశ్ డా. అంబేద్కర్ ను భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసలను అందజేYఅడం మరువలేని సంఘటన.







అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ!







ఆంధ్రకవితా పితామహుడు 'అల్లసాని పెద్దనా అన్నట్లు, 'అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా అన్న భావనకు సత్యరూపాన్ని కలిగిస్తూ, లోకమాన్య బాలగంగాధర తిలక్, మహర్షి కార్వే వంటి అగ్రనాయకులు జన్మించిన పుణ్యస్థలి, మహారాష్ట్ర లోని 'రత్నగిరీ జిల్లాలో, 'మందన్ గాడ్' పట్టణానికి చేరువైన 'అంబావాడే' గ్రామంలో - రాంజీ సక్ పాల్ - భీమాబాయి పుణ్య దంపతుల్ని పున్నామ నరకం నుంచి రక్షించిన రోజది, 1891 ఏప్రిల్ 14. మెహర్ కులంలో పుట్టిన భీం రావ్ ను తండ్రి చాలా క్రమశిక్షణ తో పెంచగా, బాలభీం రావ్ ప్రతినిత్యం రామాయణం, భారతం, తుకారం, మోరోపంత్ ల భజన గీతాలను గానం చేయడం, కుటుంబం యావత్తు శాకాహారాన్ని సేవించడం, బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకౄషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్.







అవమాన, పరాభవాల్ని తెచ్చిన వర్ణ వ్యవస్థ







అస్పౄశ్యులుగా పరిగణింపబడిన 'మెహర్లా కులంలో జన్మించడం పట్ల, బండివాడు చూపిన ఆగ్రహం, అన్నగారు బండి తోలితే, బండివాడు రాజఠీవితో నడచి రావడం, ఆకలిదప్పులతో అలమటిస్తూ వీధికుళాయి నుంచి మంచినీళ్ళని కూడ తాగనివ్వని అమానుషత్వం, భరించలేని అవమానాలకు గురిచేసింది. అందుకే అంబేద్కర్ కులవ్య్వ్వస్థ పై నిష్చితమైన అభిప్రాయాలని నిర్ధారించుకున్నాడు. కులం పునాదుల మీద దేనినీ - జాతిని గానీ, నీతిని గానీ నిర్మించలేమనీ, అలా నిర్మిస్తే అది పగిలి ముక్కవలడం తప్పదని చెప్పాడు. కులంలోని వ్యక్తి ప్రతిభను కులం గుర్తించకపొవడమే కాక, రాజకీయ దాస్యంతో పోలిస్తే, సాంఘిక దాస్యం హీనమైనదీ, నీచమైనదీ అని నొక్కి వక్కాణించాడు.







బొంబాయి - బరోడా ల మధ్య వాసికెక్కిన వ్యక్తిత్వం







సంస్కౄతాన్ని ఆధ్యయనం చేయాలన్న సంకల్పానికి మాయదారి కులం అడ్డు తగిలింది. అయితే పర్షియన్ భాష చదివాడు. ఎల్ఫిష్టన్ హైస్కూలు లో మెట్రిక్యులేషన్, 16వ ఏటనే వివాహం, బరోడా మహారాజు యిచ్చిన 25 రూ. విద్యార్ధి వేతనం 1912 లో బి.ఏ పరీక్షలో నెగ్గేలా చేసిన పట్టభద్రత్వం బరోడా ఆస్థానంలో ఉద్యోగాన్ని సంపాదించినా, పై చదువులపై పట్టుదల ఉద్యోగాన్ని దూరం చేసింది. చదువు తర్వాత ఖరారుగా దశాబ్దకాలంపాటు ఆస్థానంలో ఉద్యోగం చేయాలన్న నిబంధనతో, 1913 లో రాజప్రోత్సాహంతో కొలంబియా విశ్వవిద్యాలయం లో చేరి, 1915 లో ఎం.ఏ, 1916 లో పి.హెచ్.డి ని సంపాదించాడు. పరిశోధన ఫలితంగా, 'ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రావిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా' అన్న పేరుతో సిద్ధాంత ప్రచురణ చాలా ప్రాచుర్యాన్ని అందించింది. 1917 లో డా. అంబేద్కర్ స్వదేశ ప్రవేశం చేయడమే గాక, 27 ఏళ్ళలో, అస్పౄశ్యుడొకడు అంతగొప్ప పేరు సంపాదించుకోవడం ఆనాటి అగ్రవర్భాలవారికి ఆశ్చ్యర్యానందానుభూతుల్ని కలిగించింది. ఫలితంగా మహారాజావారికి మిలిటరీ కార్యదర్షిగా గుర్తింపు కల్గినా, ఆఫీసులో నౌకర్లు కాగితాలు ఆయన బల్లపై ఎత్తివేసేవారట! కొళాపూర్ మహారాజు సహాయంతో, 'మూక నాయక్' పక్షపత్రికకు సంపాదకత్వం హహించడం.



- బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి, లండన్ నుంచి డి.ఎస్.సి పట్టాలను పొందినా, ఆఫీస్ జవానుల ఆదరాన్ని కూడ పొందలేని దుర్భరస్థితిగతులు.







బాబాసాహెబ్ జీవితంలో 1927 లో జరిగిన ప్రధాన ఘట్టాలు







- మహద్ లో దళిత జాతుల మహాసభ జరగ్గా, మహద్ చెరువులోని నీరు త్రాగుటకు అంతవరకు ప్రవేశం లేని పరిస్థితి నుంచి, అంబేద్కర్ నాయకత్వంలో మహారాష్ట్ర, గుజరాత్ ల నుంచి వచ్చిన వేలాదిమంది చెరువునీరు స్వీకరించడం మహారాష్ట్రలో సంచలనాన్ని కలిగించింది.



- 'బహిష్కౄత భారతీ మరాఠి పక్ష పత్రిక ద్వారా ఆనాడు కులతత్వవాదుల బాధను ప్రకటించాడు.



- చత్రపతి శివాజి త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా అధ్బుతంగా జరగ్గా, అంబేద్కర్ ను సాదరంగా ఆహ్వానించబడడం, ఉత్సవ సంఘాధ్యక్షుడైన పలాయ్తశాస్త్రి తన ప్రసంగం లో, 'పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పౄశ్యతను పాటించడమే' అన్న భావం అందరినీ ఆలోచింపజేసింది.



- 'మనుస్మౄతీ పై తనభావాలను నిష్కర్షగా చెప్పినా, ఆ సంపుటిలో అన్ని భాగాలు నిందనీయాలు కావు అని కూడ చెప్పగలిగిన సుస్ఫష్టభావకుడు అంబేద్కర్.







గాంధీ తో చెప్పిన నిశ్చితాభిప్రాయాలు







1931 లో రెండవ రౌండ్ టేబిల్ సమావేశం సందర్భంగా, అంబేద్కర్ గాంధీని కలుసుకోవడం, జైలులో వున్న గాంధీజీ నిరాహారదీక్ష ప్రారంభించడం, గాంధీజీ తో 'మహాత్ములు వస్తుంటారు, పోతుంటారు, అంటరానివారు మాత్రం అంటరాని వారుగానే వుంటున్నారూ అన్నారు.







'అస్పౄశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కూ







అస్పౄశ్యతా నివారణ కోసం దళిత జాతుల హక్కుల కోసం, 'అస్పౄశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కూ అన్న తిలక్ సంకల్పం మాదిరి నిరంతరం పోరాటం సాగించాడు బాబాసాహెబ్. నిరంతర కౄషి తో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు, ముఖ్యంగా సామాజిక సంస్కరణలకు, ఊపిరిపోసుకుంది.







భారత రాజ్యాంగ శిల్పకారత్వం







భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం, రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగ అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించడం ఆయన శేషజీవితంలో ప్రముఖమైన ఘట్టం. ఈ విషయంపై, ఆనాటి కేంద్రమంత్రి టి.టి.కౄష్ణమాచారి మాట్లాడుతూ, 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన అత్యధిక సభ్యుల్లో అందుబాటులో లేకపోయిన కారణంగా, భారత రాజ్యాంగ రచనా భారమంతా డా. అంబేద్కర్ మోయవలచి వచ్చిందని, రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో ఏలాంటి సందేహం లేదూ అని అమోఘమైన విశ్వాసాన్ని ప్రకటించడం, బాబాసాహెబ్ ప్రతిభాపాటవాల్ని చెప్పకనే చెప్పినాడు.







అన్నీ ప్రత్యేకతలే - అంబేద్కర్ జీవితంలో!







అంబేద్కర్ 56వ ఏటన సారస్వత బ్రాహ్మణ కుటుంబంలోని కుమారి శారదా కబీర్ ను వివాహమాడడం, నాగపూరు లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరిస్తూ, 'బౌద్ధం భారతీయ సంస్కౄతిలో భాగం' అని, ఈ దేశ చరిత్ర సంస్కౄతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. దీనివల్ల, హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు!.







బాబాసాహెబ్ బహురంగ రచనలు







అనేక రచనలను అందించిన అంబేద్కర్ - 'ది ప్రోబ్లెం ఆఫ్ రుపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా', 'ది బుద్ధా అండ్ కార్ల్ మార్క్శ్, 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మా, ప్రముఖ రచనలని చెప్పాలి.







మరువలేని జీవిత మలుపులు







భారతరాజ్యాంగం ఏ మలుపులు తిరిగినా, అది వున్నంతకాలం, బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్మరిస్తూవుండడం వినా వేరే గత్యంతరం లేదు భారతదేశ ప్రజలకు. భారతరాజ్యాంగం లో పొందుపరచబడిన 'భారతీయ షెడ్యూలు కుల జాతుల అభివౄద్ధీఅంశాలపై ప్రత్యేక ప్రేరణ, ప్రోత్సాహం, అంబేద్కర్ దే గణనీయమైంది. 1925 లో బోంబే హైకోర్టు లో న్యాయవాద వౄత్తి, 1926 - 34 మధ్య బోంబే విధాన కౌన్సిల్ కు ప్రకటించబడిన సభ్యత్వం, 1942 - 46 మధ్య వైశ్రాయి నిర్వాహకవర్గ సభ్యుడుగా, 1947 - 51 మధ్య న్యాయశాఖ మంత్రిగా, ప్రముఖ పదవులు. మహోన్నత ఆశయాలని మనసా వాచా కర్మణా ఆచరించిన అంబేద్కర్ ని కొన్ని స్వార్ధపూరిత కూటమితో, కొన్ని రాజకీయపక్షాలు అంబేద్కర్ ఆశయాలకు వక్రభాష్యం చేసి తమ పబ్బాలను గడుపుకోవడం నేటికి జరుగుతున్న దారుణసత్యం. సామాజిక న్యాయం, భారతీయ ప్రజల్లో వర్గీకరింపబడిన వర్ణవ్యవస్థ, ఆయన ఆశయాలకు దర్పణాలుగా ప్రతిబింబించకపోవడం చాలా శోచనీయం, దురదౄష్టకరం అనే చెప్పాలి. అంబేద్కర్ ప్రతిభను, నాలుగు దశాబ్దాలకాలం తర్వాతనే భారతదేశం గుర్తించి, 'భారతరత్నా (1990) సత్కారం అందించడం పట్ల, చివరికైనా న్యాయం జరిగిందనడంలో సందేహం లేదు. 1956 డిసెంబర్ 6 న కన్నుమూశారు.

Tuesday, March 31, 2015

నాడు - ఈనాడు - చరిత్రలో - ఏప్రిల్ l


నాడు - ఈనాడు

చరిత్రలో - ఏప్రిల్ 1:

ఏప్రిల్ 1

మిగిలిన సంవత్సరమంతా మనం ఎలా ప్రవర్తిస్తామో తెలియజేసే రోజు - మార్క్ ట్వైన్

ఏప్రిల్ 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 91వ రోజు (లీపు సంవత్సరము లో 92వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 274 రోజులు మిగిలినవి.

సంఘటనలు

1894: మొదటి భారతీయ బ్యాంక్ 'పంజాబ్ నేషనల్ బ్యాంక్' ప్రారంభం
1914: ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసు లో (చెన్నై). తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ( 9 సెప్టెంబర్ 1908) ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
1935: భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.
1936 : కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒడిషా భారత దేశం లో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది.
1957 - డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్దతిని ప్రవేశ పెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ 1958 న ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్)) లోని ద్రవ్యరాశి (బరువు)ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని , ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.[1]
1960 : TIROS-1 ఉపగ్రహం టెలివిజన్ మొదటి చిత్రాన్ని అంతరాళం నుండి ప్రసారం చేసింది.
1970: బహిరంగంగా ధూమపానం చేయడం అమెరికాలో నిషేధం.
1971 : పులుల సంరక్షన పథకం - కోర్బెట్ట్ నేషనల్ పార్కు నందు పులుల సంరక్షణా పథకాన్ని ప్రారంబించారు.
1976: దూరదర్శన్ ప్రారంభం
2001 : స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెదర్‌లాండ్స్.

జననాలు

1578 : విలియం హార్వే, ఆంగ్ల వైద్యుడు (రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించినవాడు)(d. 1657)
1856 : భారత దేశ ప్రముఖవైద్యుడు అకాసియో గాఅబ్రియెల్ వేగాస్ జననం.(ఈయన బొంబాయి నందు ప్లేగు వ్యాధి వ్యాప్తిని గుర్తించారు).(d. 1933)
1869: ఆదాయపు పన్ను విధానం ప్రవేశం.
1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు డా.హెడ్గెవార్ (డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్)
1911 : భారత అథ్లెట్, ఫాజా సింగ్.
1911 - ఏటుకూరి వెంకట నరసయ్య అధ్యాపకుడు , రచయిత. [మ. 1949]
1911: ఏటుకూరి వెంకట నరసయ్య, క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, మానవతావాదీమ.1949
1933 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు బాపూ నాదకర్ణి జననం.
1936 : తరున్ గొగోయ్, భారత రాజకీయ వేత్త, అసోం ముఖ్యమంత్రి.
1941 : అజిత్ వాడేకర్, భారత క్రికెటర్.
1972: వెంకట్ గోవాడ,రంగస్థలంపై నవ రసాలు కురిపిస్తున్నారు. థియేటర్‌ ఆర్ట్స్‌లో పిజి డిప్లొమో చేశారు.

మరణాలు

1922 : స్విట్జర్లాండ్ కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మానసిక విశ్లేషకుడు హెర్మన్ రోషాక్ మరణం (జ.1884).
1977: ప్రముఖ కవి తల్లావజ్హ్ఝుల శివశంకర శాస్త్రి మరణం
1999: మధురాంతకం రాజారాం, సుమారు 300కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు
2006: ప్రముఖ నాయకుడు గౌతు లచ్చన్న మరణం
2012 : ఎన్.కె.పి.సాల్వే, భారత రాజకీయవేత్త.(b. 1921)

ఇతర విశేషాలు

ఏప్రిల్‌ 1ని ఏప్రిల్ ఫూల్ రోజు అంటుంటారు.

ఇందుకు ఒక వివరణ: పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్‌ లో కూడ సంవత్సరాది మార్చి మధ్యలోనే వచ్చేది. యూరప్‌ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు, వసంత కాలపు ఉత్సవాలు ఓ పది రోజుల పాటు జరిగేవి. ఏప్రిల్‌ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకునేవారు. ఇలా సజావుగా జరిగిపోతూన్న జీవితాలలో ఒక పెనుమార్పు వచ్చి పడింది. అప్పటి ఫ్రాన్సు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక తాఖీదు జారీ చేసేడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టెలివిజన్ లు లేవు. (దండోరా వేయించి ఉంటాడు.) కాని రాజు గారి తాఖీదు అందరికీ అందలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని గభీ మని మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా, దేశపు మూలల్లో ఏప్రిల్‌ 1 న లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకోవటం మానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళికి ఏప్రిల్‌ ఫూల్స్‌ అనేవారు. పాత అలవాట్లు చావవు కదా. అందుకని ఇప్పటికీ కొంటె బహుమానాలు ఇచ్చుకోవటం, ఎగతాళి చేసుకోవటం మిగిలేయి.

పండుగలు మరియు జాతీయ దినాలు

ALL FOOLS DAY - April 1
ACTIVISTS DAY
1-7 PREVENTION OF BLINDNESS WEEK
1936: ఒడిషా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.

(మూల వనరులు : తెలుగు వికీపీడియా & తెలుగురధం సేకరణ)
కొంపెల్ల శర్మ.
 

Monday, March 30, 2015

నాడు - ఈనాడు - మార్చి 31

నాడు - ఈనాడు

మార్చి 31

మార్చి 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 90వ రోజు (లీపు సంవత్సరము లో 91వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 275 రోజులు మిగిలినవి.

వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 31

 సంఘటనలు
  • 1919: 15-9-1915 న ప్రారంభించిన  హైదరాబాదు లో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
  • 1959 : 14 వ దలైలామా,టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.
  • 2011: 31 మార్చి 2011 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 18 మే2012 నాడు చెప్పారు

జననాలు

  • 1865 - ఆనందీబాయి జోషి
  • 1928: కపిలవాయి లింగమూర్తి,పలుగ్రంథాలు, పరిశోధనలు రచించి సాహితీవేత్తగా పేరుపొందాడు [మ.(1928 ]
  • 1933 - నటరాజ రామకృష్ణ, ప్రముఖ నాట్యాచార్యుడు, ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జననం. (మ 7 జూన్ 2011).
  • 1963: ప్రముఖ శాస్త్రవేత్త జాన్ హారిసన్ జననం. సముద్రంలో రేఖాంశాలను కనుగొనడానికి వీలయ్యే 'క్రోనోమీటర్' ను రూపొందించాడు. బ్రిటిష్ బోర్డ్ వారి 'లాంగిట్యూడు' వారి అవార్డ్ ను అందుకున్నాడు.
  • 1987 - కోనేరు హంపి, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.

మరణాలు

  • 1727 : భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ మరణం (జ.1643).
  • 1972 : భారత చలనచిత్ర నటీమణి మీనా కుమారి మరణం  (జననం.1932)
  • 1995 : మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నర్తకి సెలీనా మరణం (జ.1971)
  • 2003: మేకా రంగయ్య అప్పారావు (యం ఆర్ అప్పారావు) మరణం
(మూల వనరులు : తెలుగు వికీపీడియా & తెలుగురధం సేకరణ)

కొంపెల్ల శర్మ  



     

    విహారి విరచిత 'శ్రీ పదచిత్ర రామాయణము' - పద్య కావ్య సమాలోచన సదస్సు కి తెలుగురధం ఆహ్వానిస్తోంది.

    కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్
    ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
    ...
    (వాల్మీకి రామాయణము)
    శ్రీనిడి, మానవాళి సుఖజీవన రేఖకు స్తైర్య కల్పనా
    శ్రీనిడి, మంగళాభ్యుదయ శీల పరంపరకున్ సుబోధన
    శ్రీనిడి, కర్మ భార భావసిద్ధి విశేష మనీష కక్షర
    శ్రీనిడి, సత్య ధర్మ పరిశీలుడు, రాముడు లోక మోముతన్
    (విహారి - శ్రీ పదచిత్ర రామాయణము)



    TELUGURATHAM (తెలుగురధం) - శ్రీ పదచిత్ర రామాయణం (విహారి విరచిత) పై ప్రసంగాలు - 5 ఏప్రిల్, ఆదివారం మా.3 గం. తెలుగు విశ్వవిద్యాలయం. అందరికీ యిదే మా ఆహ్వానం. కొంపెల్ల శర్మ, తెలుగురధం.

    LECTURE PROGRAMME ON VIHARI'S SRI PADA CHITRA RAMAYANAM -

    @ 3 PM, 5 APRIL 2015, SUNDAY,
    @ NTR KALA MANDIRAM,
    SRI POTTI SRIRAMULU TELUGU UNIVERSITY.

    please participate in the said programme on RAMAYANAM -

    being conducted by TELUGURATHAM. kompella sarma (9701731333)

     

    Sunday, March 29, 2015

    నాడు - నేడు


    నాడు - నేడు

    చరిత్రలో - మార్చి 30

    మార్చి 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 89వ రోజు (లీపు సంవత్సరము లో 90వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 276 రోజులు మిగిలినవి.

    సంఘటనలు


    1842 : ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు డా. క్రాఫోర్డ్ లాంగ్ మొదటిసారిగా ఉపయోగించాడు.
    1867 : అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.
    1929: భారత ఇంగ్లండు ల మధ్య విమాన సేవలు మొదలయ్యాయి.
    1992: ప్రముఖ భారతీయ చిత్ర దర్శకుడు సత్యజిత్ రే కు ఆస్కార్ గౌరవ పురస్కారం

    జననాలు

    1908: దేవికారాణిఈమె విశాఖపట్టణంలో జన్మించారు సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత
    1935: తంగిరాల వెంకట సుబ్బారావు, తెలుగు వీరగాథా కవిత్వము" అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించారు
    1967: నగేశ్ కుకునూర్, హైదరాబాద్ బ్లూస్ అనే అంగ్ల చిత్రం తీసినాడు. ఇందులో తెలుగు సంభాషణలు కూడా ఉంటాయి

    మరణాలు

    1953: ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు జమలాపురం కేశవరావు
    1971: సురభి కమలాబాయి,నిర్మించిన తొలి తెలుగు టాకీ చిత్రము భక్తప్రహ్లాద లో లీలావతి పాత్ర ధరించినది.[జ.1907]
    1983 : ప్రముఖ భారతీయ నటుడు నితిన్ జననం.
    2002 : ప్రముఖ సంగీత దర్శకుడు ఆనంద్ బక్షీ (b. 1930)
    2005 : ఒ.వి.విజయన్, భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ (జననం.1930)
    2011: నూతన్ ప్రసాద్, నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెంది తెలుగు సినిమా రంగములో హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు

    పండుగలు మరియు జాతీయ దినాలు

    2006:ఉగాది,తెలుగు సంవత్సరాది.వ్యయ నామ సంవత్సర ప్రారంభం.
    '1933/1991 : NATIONAL DOCTORS DAY

    (మూల వనరులు : తెలుగు వికీపీడియా & తెలుగురధం సేకరణ)

    కొంపెల్ల శర్మ, తెలుగురధం

    Sunday, February 8, 2015


    నాడు - ఈనాడు

    చరిత్రలో - ఫిబ్రవరి 9

    ఫిబ్రవరి 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 40వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 325 రోజులు (లీపు సంవత్సరము లో 326 రోజులు) మిగిలినవి.
    సంఘటనలు
    ప్రసిద్ద గాంధేయవాది, కుష్టువ్యాది పీడుతులపాలిట ఆపద్భాందవుడుగా పిలువబడే మురళిదాస్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే ,మెగసెసె అవార్డు గ్రహీత) దివంగతులయ్యారు.
    1969 - జంబో జెట్ బోయింగ్ 747 మొట్ట మొదటి ప్రయాణము పూర్తి చేసింది
    జననాలు
    1773: అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్.
    1809: చార్లెస్ డార్విన్ జననం
    1910: ప్రముఖ నిజాం విమోచన ఉద్యమకారుడు ఉమ్మెత్తుల కేశవరావు
    1919: ముదిగొండ సిద్ద రాజలింగం,స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
    1922: రావిపూడి వెంకటాద్రి ప్రకాశం జిల్లా నాగండ్ల లో జననం. హేతువాది మాసపత్రిక సంపాదకుడు
    1925: ప్రజాకవి ఆకుల సుబ్రహ్మణ్యం జననం
    1936: అడబాల,రాజీవం, రాతిమనిషి మొదలైన నాటికలు నటుడిగా అడబాలకు పేరు తెచ్చాయి
    1936: ప్రముఖ నాటక రచయిత, దర్శకుడు చింతపెంట సత్యనారాయణ రావు (సి యస్ రావు) జననం
    1939: బండి రాజన్ బాబు, ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు,ఎందరో విద్యార్ధులను నిపుణులైన ఛాయాగ్రాహకులుగా తీర్చిదిద్దాడు
    1975: యార్లగడ్డ సుమంత్ కుమార్ , తెలుగు సినిమా నటుడు. ఇతడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు
    మరణాలు
    1932: దొంతులమ్మ,ఆంధ్ర యోగిని మరియు అవధూత. ఆమె అరవైయేళ్ళ వయసులో కూడా నెత్తిమీద నీళ్ళ కుండల్ని దొంతరులుగా పెట్టుకొని మోస్తూ ఉండేది.
    1996: చిట్టిబాబు (వైణికుడు),ప్రసిద్ధ సంగీతజ్ఞుడు,వీణాపాణిగా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా గుర్తింపబడ్డాడు.
    2008: సంఘసేవకుడు మరళీధర్ దేవదాస్ ఆమ్టే. మరణం
    2012: సుప్రసిద్ధ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి మరణం
    2014: షేక్ అబ్దుల్లా రవూఫ్, నక్సల్‌బరి కేంద్ర కమిటీ నాయకుడు.ఆజన్మ బ్రహ్మచారి
    పండుగలు మరియు జాతీయ దినాలు
    CONDOM AWARENESS WEEK - FEBRUARY 9-14

    (మూల వనరులు: తెలుగు వికీపీడియా & తెలుగురధం సేకరణ)