Friday, February 15, 2013

నాడు - ఈనాడు,


చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 16


• 1887 న్యూయార్క్ లో దినపత్రికల తొలి సమ్మేళనం
• 1944 భారతీయ చలనచిత్ర పితామహుడు, నిర్మాత దాదా సాహెబ్ ఫాల్కే మృతి
• 1946 బ్రిడ్జిఫోర్ట్ లో తొలి వాణిజ్యు హెలికాఫ్టర్ కు సామర్థ్య పరీక్షల నిర్వహణ
• 1959  ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశానికి ప్రీమియర్ అయ్యాడు.
• 1965 అమెరికాలోని ‘లిబర్టీ’ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు పన్నిన కుట్రని భగ్నం చేసి, భాగస్వామ్యులైన నలుగురు విద్రోహులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
• 1969 ప్రముఖ కవి మీర్జా గాలీబ్ తపాలాబిళ్ళ విడుదల.
• 1978 భారతీయ క్రికెట్ క్రీడాకారుడు వసీం జాఫర్ జననం

• 1985  నార్ల వెంకటేశ్వరరావు మరణం - తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు, రచయిత, ‘సీతజోస్యం’ నాటికకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినా, తిరస్కరించిన వ్యక్తి
• 1997 కర్ణాటక రాజకీయనాయకుడు రామకృష్ణ హెగ్డే  కొత్త రాజకీయ పార్టీ ‘లోక్ శక్తి’ ప్రారంభం
• 2005 : ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలయింది.

No comments: