నాడు - ఈనాడు
చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 24
- 1582 - గ్రెగేరియన్ కేలండర్ మొదలైన రోజు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ 13 తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది.
·
1822 ప్రపంచంలో తొలి శ్రీస్వామి నారాయణ మందిరం అహమ్మదాబాద్ లో ప్రారంభం
·
1881 చైనా, రష్యాలమధ్య అవగాహనా ఒప్పదంపై సంతకాలు
·
1911 ప్రముఖ కవి, కథకుడు, నవలాకారుడు సాహితీ విద్యాప్రవీణ పిలకా గణపతి శాస్త్రి
జననం
·
1920 నాజీ పార్టీ ఆవిష్కరణ
·
1934 ప్రముఖ కర్నాటక శాస్త్రీయ గాత్ర విద్వాంసుడు, పద్మభూషణ్, కళాచార్య పి యస్ నారాయణస్వామి జననం
- 1938 - నైలాన్ దారంతో మొదటిసారిగా టూత్ బ్రష్ ను న్యూజెర్సీ లోని ఆర్లింగ్టన్ లో తయారు చేసారు. మొదటి సార్గిగా నైలాన్ దారాన్ని వ్యాపారానికి ఉపయోగించటం మొదలైన రోజు.
·
1939 భారతీయ చలనచిత్ర నటుడు, దర్శకుడు జోయ్ ముఖర్జీ జననం
- 1942 - వాయిస్ ఆఫ్ అమెరికా (అమెరికా షార్ట్ వేవ్ రేడియో సర్వీసు) ఆవిర్బవించిన రోజు.
- 1944 - సెంట్రల్ ఎక్సైజ్ వ్యవస్థాపక దినోత్సవము. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖ ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది (సి.ఇ.సి.డి).సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అంద్ కస్టమ్స్ (సి.బి.ఇ.సి)
- 1945 - ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ని, రెండవ ప్రపంచ యుద్దం లో జపాన్ ఆక్రమించగా, అమెరికా విడిపించిన్ రోజు
·
1948 భారతీయ చలనచిత్ర నటి, అఖిల భారత అన్నా డియంకె అధినేత్రి జయరాం జయలలిత
జననం
·
1951 సాహితీ విద్యావేత్త, పరిపాలనా దక్షుడు డా. కట్టమంచి రామలింగారెడ్డి
వర్థంతి
- 1952 - ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇ.ఎస్.ఇ.సి) వార్షికోత్సవము. [[ఇ.ఎస్.ఇ.సి. మొదటిసారిగా కాన్పుర్, ఢిల్లీలలో ప్రారంభించారు. ది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్ చట్టం 1948 ఆధారంగా ఇ.ఎస్.ఐ.సి. ఏర్ఫడింది.
·
1971 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కాన్ఫెరెన్స్ అద్యక్షుడు హేమంతకుమార్ బోస్
హత్యానంతరం, పి కె మూకయ్య థెవర్ ని కొత్త అద్యక్షునిగా అత్యవసర సమావేశంలో ఎన్నుకోవడం
జరిగింది.
·
1984 న్యాపతి రాఘవరావు మృతి
·
1989 ‘ది సాటనిక్ వెర్సస్’ రచయిత సల్మాన్
రష్దీ ప్రాణాలకోసం ఆయతుల్లా రుహోల్లాహ ఖొమీనీ $3 మిలియన్ల అమెరికన్ డాలర్లను బహుమతి
ప్రకటించాడు
·
2008 అర్థ శతాబ్దకాలంపాటు క్యూబా దేశపు అధ్యక్షునిగా కొనసాగిన ఫిడెల్ కాష్ట్రో
పదవీ విరమణ
·
2010 ఒకరోజు
అంతర్జాతీయ క్రికెట్ ఆట విధానంలో మొదటిసారిగా 200 పరుగులు (డబుల్ సెంచరీ) తీసిన మొదటి
క్రికెట్ క్రీడాకారుడిగా సచిన్ తెండూల్కర్
·
1980 ప్రముఖ భావకవి, ఆంధ్రా షెల్లీ దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్థంతి
- 1982: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనిమిదవ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య పదవీ విరమణ.
- 1982: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొమ్మిదవ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ ప్రమాణ స్వీకారం
- 1983 - డౌ జోన్స్ ఇండిస్ట్రియల్ ఏవరేజి 1100 మార్క్ ని మొదటిసారిగా దాటింది. ఈ రోజున 24.87 పాయింట్లు పెరిగింది. 1972 లో, 1100 మార్క్ చేరినా, ఈ మార్క్ చివరి వరకు నిలబడలేదు.
No comments:
Post a Comment