Friday, February 15, 2013

నాడు – ఈనాడు


నాడు – ఈనాడు

చరిత్రలో ఫిబ్రవరి 15

·         1564   ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర పితామహుడు గెలీలియో గెలీలి జయంతి

·         1869       భారతీయ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ మృతి

·         1879   మహిళల హక్కులు – అమెరికా రాష్ట్రాల సుప్రీమ్ కోర్టులో, కేసులపై మహిళా ‘అటర్నీ’లను వాదించేందుకు అనుమతిస్తూ, దేశ అధ్యక్షుడు రూథర్ ఫోర్డ్ బి హేస్ బిల్లును అమోదించడం జరిగింది.

·         1901    సుప్రసిద్ధ తెలుగు కవి గడియారం వేంకట శేషశాస్త్రి జయంతి

·         1921    బీహారు నివాసి రాధాకృష్ణ చౌదరి – భారతీయ చారిత్రాత్మక మరియు మైథిలి రచయిత జననం

·         1946   ‘ENAIC” సాధారణ ప్రయోజనాలకై మొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటరును ఫిలడెల్ఫియాలోని ‘పెన్నిసిల్వానియా విశ్వవిద్యాలయంలో అంకితం యివ్వబడింది.

·         1948   సుభద్ర కుమారి చౌహాన్ భారతీయ హిందీ కవయిత్రి మృతి

·         1950   సుప్రసిద్ధ తెలుగు కవులుగా తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి మృతి 

·         1957   ప్రపంచంలో పొట్టివాడిగా (వామనమూర్తి) ‘గిన్నీస్ రికార్డ్’ ని సాధించుకున్న గుల్ ముహమ్మద్ జననం – గుల్ మహ్మ్మద్ ని 19 జూలై 1990 రోజున ఢిల్లీలోని రామమనోహర్ లోహియా వైద్యకేంద్రంలో చేసిన పరీక్ష  ప్రకారం 1’10.4” (57 సెంటీమీటర్లు) ఎత్తుగా నిర్థారణ; ఈ రికార్డుని నేపాల్ నివాసి చంద్ర బహదూర్ డంగి 21.5”(54.6 సెంటీమీటర్లు)గా రికార్డుని అధిగమించాడు.

·         1972   తొలిసారిగా ‘సౌండ్ రికార్డు’లకు అమెరికాలో కాపీరైటు చట్టం క్రింద భద్రత యివ్వబడింది.

No comments: