జగతి నేడు మహోత్సవమునందు మునిగి యానందమున పొంగిపోవ, అదియె దీపావళి.
విజయ దీపావళి
బలి చక్రవర్తిని బంధించి పాతాళమునకు వామనుడు పంపినది నేడె!రావణుంబరిమార్చి రాముడర్ధాంగితో ననుజన్ము భరతు గాంచినది నేడె!క్రూరుడౌ నరకాసురుని సత్యభామ కౄష్ణుని వెంట జని వధించినది నేడె!విక్రమార్కుడు శత్రు విజయంబు గావించి తన పేర శకము నిల్పినది నేడె!
శ్రీమహావీర జిను డహింసా మహస్సు దెసల బ్రసరింప సిద్ధి పొందినది నేడె!

వచ్చె నిదిగొ సౌవర్ణ శోభాప్రపూర్ణ సర్వజనము దీపావళి పర్వదినము.
(కరుణశ్రీ - విజయ దీపావళి)
(కరుణశ్రీ - విజయ దీపావళి)
ఆంధ్రుల ఆరాధ్య పండుగ దీపావళి గురించి, సూక్ష్మంలో మోక్షంగా ప్రముఖ కవి, కరుణశ్రీ, జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వర్ణించిన తీరు అనూహ్యం. అలతి పదాలతో అనల్పార్ధరచనను కావించడంలో కరుణశ్రీ సిద్ధహస్తులు.
అజ్ణాన తిమిరాన్ని పారద్రోలేది 'దీపం'
అజ్ణాన తిమిరాన్ని పారద్రోలేది 'దీపం'
కామ క్రోధ లోభాలు నరకానికి కారణాలు అయి గీతాచార్యుడు వివరించాడు. ఈ మూడింటినీ జయించాలంటే, అజ్ణానాంధకారాన్ని జయించాలి. ఈ అంధకారాన్ని జయించేందుకు జ్ణానదీపాన్ని వెలిగించాలి. జీవితాలను నరకప్రాయం నుంచి రక్షించేందుకు మనందరకు కావలసినది జ్ణానదీపం ఒక్కటే. ఆ దీపం యిలా ఉండాలి అని పురాణాలు చెప్తున్నాయి.
'వైరాగ్య తైల సంపూర్ణే, భక్తివర్తి సమన్వితే, ప్రబోధపూర్ణ పాత్రేతు, క్షిప్తిదీపం విలోకయేట్. నిండైన ప్రమిద ప్రచోధమైతే, ఆ ప్రమిదను వైరాగ్యమనే నూనెతో నింపి, భక్తి అనే వత్తిని జ్ణానమనే దీపాన్ని వెలిగించాలి. ఇలా భక్తి వైరాగ్యాలతో అజ్ణానాంధకారాన్ని ఎదుర్కొని జ్ణానజ్యోతిని వెలిగించాలనే విశిష్టమైన సందేశాన్ని ఈ దీపావళి మనకు నిత్యం అందిస్తూనేవుంది.
దీపం వెలిగించిన పిదప -
'దీపం జ్యోతి పరబ్రహ్మ: దీపం సర్వ తమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీప నమోస్తుతే''దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన: దీపేన హరతే పాపం, సంధ్యాదీప నమోస్తుతే' దీపాన్ని వెలిగించిన తర్వాత దీపాన్ని స్తుతించడం సంధ్యాసమయంలో దీపాన్ని దర్శించడం, దీపాన్ని నమస్కరించడం మనకు సదాచారం, సత్సంప్రదాయం.
" చుట్టూరా ఆవరించుకుని వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడంకంటె, ప్రయత్నించి ఎంత చిన్నదీపాన్నయినా వెలిగించడం మంచిది "
అన్న సూక్తిని ఊపిరిగా భావిస్తూ, దీపావళి పండుగ శుభసందర్భంగా తెలుగురథం శుభాకాంక్షలను తెలియజేస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments:
Post a Comment