జగన్మాతకు జయం, దిగ్విజయం. మీ ఇంట సిరిసంపదలు కురవాలి. మీ యింట ఆయురారోగ్యాలు నిలవాలి. జయజయహే మహిషాసుర మర్దని.
అత్యాశ, గర్వం, కోపం, దురాశ, ఆకర్షణ, మొహం, ద్వేషం, అసూయా, స్వార్ధం, క్రూరం - ఈ పది దుర్గునాలకు చిహ్నంగా భావించే పది తలల రావణ సంహారాన్ని విజయదసమిగా జరుపుకుంటారు. అ పది దుర్గుణాలను దరి చేర్చుకోకూడదని ఆ జగన్మాతని, ప్రార్ధిస్తున్నాము. చెడుపై మంచి సాధించిన విజయం. అందుకే దీనిని పది రోజులపాటు చెడుపై జరిపిన పోరాటానికి అంతిమ ఘట్టంగా లభించిన విజయమే విజయదశమి.
శరత్కాల చంద్రకాంతి, నవరాత్రుల కలిమి బలిమి. పరాశక్తి దుర్గాష్టమి, శ్రీ సారద్మహర్నవమి. ముగురమ్మల విజయదశమి, బొమ్మల కొలువుల మిసిమి. జనజీవన ప్రాంగానాన పండుగ పర్వాల మిసిమి. దసరా సరదాలే ఇంటింటా యవ్వనాల లేచేలిమి.
దసరా నవరాత్రి ఉత్సవాలు, విజయదశమి సందర్భంగా - తెలుగురధం అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
No comments:
Post a Comment